సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం | Funday Book Review of the week | Sakshi
Sakshi News home page

సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం

Published Sun, Dec 8 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం

సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం

 పుస్తకం    :    విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం)
 రచన    :    శ్రీనివాస్ మిర్తిపాటి
 పేజీలు: 188 వెల: 89
 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ.

 
 విషయం    :  
 వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడు రచయిత. సిద్ధాంతం అంటేనే ఎన్ని పేజీలు అయినా సరిపోవు. కానీ సింపుల్‌గా ఒక్కొక్క పేజీలో చెప్పడం, చెయ్యి తిరిగినవారికే సాధ్యం. బహుశా జర్నలిజమ్‌లో అపారమైన అనుభవం ఇందుకు ఉపయోగపడి ఉండాలి.
 
  గాంధీ సిద్ధాంతం, మోడి, సోక్రటిస్... వీరందరివీ రాయడం గొప్ప విషయం. టీవీలు ఎందుకు చూడకూడదు - ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు... 120 కోట్లమంది ప్రజలకు 12 రాశులు... అంటే ప్రతి 10 కోట్ల మందికీ ఒకేలా జరగడం సాధ్యమేనా? సచిన్, కాంబ్లీ మధ్య వ్యత్యాసం ఏమిటి? మార్పు సాధించిన అశోకుడు, సాధించలేని ఔరంగజేబు... ఇలా ఎన్నో విషయాలతో ఈ పుస్తక రచన సాగింది.
 - జగదీష్
 
 హాస్య శృంగార సందేశాత్మకం

 పేజీలు: 140 వెల: 75
 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
 పుస్తకం    :    మైత్రీవనం (కథలు)
 రచన    :    జిల్లేళ్ల బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం
 విషయం    :    మిత్ర కథకత్రయం... ఒక్కొక్కరివి ఆరేసి చొప్పున 18 కథలతో ‘మైత్రీవనం’గా సంపుటీకరించి కథా భారతికి కంఠహారంగా సమర్పించారు.
 
 బాలాజీ ‘ఏకాంబరం ఎక్స్‌ట్రా ఏడుపు’ వస్తు వైవిధ్యంతో నవ్వులు పూయిస్తుంది. రమేష్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రహసనాన్ని అధిక్షేపాత్మకంగా ‘ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ’లో ఆవిష్కరించాడు. బాలసుబ్రహ్మణ్యం ‘సుబ్బు ఐడియా’లో అమాయకపు ఇల్లాలు అతి తెలివితో భర్త పడే భంగపాట్లు హాస్యస్ఫోరకంగా చిత్రించాడు. బాలాజీ ‘అమ్మ డైరీ’లో రవిచంద్ర తన తల్లి వద్దని ప్రాధేయపడినా పట్టుదలతో మాతృదేశ రక్షణ కోసం మిలటరీలో చేరేందుకు వెళ్లాడు. రవిచంద్ర పాత్రను ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ సిద్ధాంతానికి అక్షర లక్ష్యంగా తీర్చిదిద్దాడు రచయిత. ‘నీడలు-నిజాలు’ కథలో మతోన్మాదాన్ని నిరసిస్తాడు రమేష్. ‘శిశిర స్వప్నం’ కథలో వృద్ధుల దయనీయ స్థితిని వర్ణించాడు సుబ్రమణ్యం.
 - డా॥పి.వి.సుబ్బారావు
 
 పిల్లలు గీసిన వన్నెల చిత్రం!
 పేజీలు: 54
  వెల: 70
 పుస్తకం    :    ఎ పొయెట్ ఇన్ హైదరాబాద్ (కవిత్వం)
 రచన    :    ఆశారాజు
 ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24642387
 
 విషయం    :    లేటెస్ట్ స్టడీ ఒకటి చెబుతుంది: ‘జ్ఞాపకాల్లోకి వెళ్లిన వాళ్లు తాజాగా ఉంటారు. మనసును పరిమళభరితం చేసుకుంటా’రని.  పురాతన నగరం హైదరాబాద్‌తో పెన వేసుకున్న బంధాన్ని జ్ఞాపకాల్లో నుంచి తీసుకువస్తున్నాడు ఆశారాజు.
 యవ్వనానికి ఊదు పొగలేసిన సుల్తాన్ బజారులో నడిచినప్పుడు, లాడ్‌బజార్‌లో మెరిసే గాజుల పూలసవ్వడి  విన్నప్పుడు, గోలుకొండెక్కి  మబ్బుల సొగసును ముద్దాడినప్పుడు, పంచమహల్ ముషాయిరాలో శ్రోత అయినప్పుడు కవితో పాటు మనమూ ఉంటాం. హైదరాబాద్ సౌందర్యాన్ని మనసు కాన్వాసుపై బొమ్మలేసుకొని ‘ఇది మా హైదరాబాద్’ అని మురిసిపోతాం. నిద్రపోయిన జ్ఞాపకాలను  నగరం తట్టిలేపి, ‘ఫిర్‌సే షురూ కరెంగే జిందగీ’ అనేలా చేస్తుందని చెప్పడానికి ఈ పుస్తకం విశ్వసనీయ సాక్ష్యం. చదువుతున్నంతసేపు రంజాన్ సాయంత్రాల్లో పాతబస్తీ గల్లీ గల్లీ తిరుగుతున్నట్లు ఉంటుంది.
 - యాకుబ్ పాషా
 
 కొత్త పుస్తకాలు
 మైల (శుద్ధాత్మక నవల)
 రచన: వరకుమార్ గుండెపంగు
 పేజీలు: 168; వెల: 100
 ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు, చిలుకూరు మం. నల్గొండ జిల్లా. ఫోన్: 9948541711
 
 శాలువా (కథలు)
 రచన: పిడుగు పాపిరెడ్డి
 పేజీలు: 152; వెల: 100
 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230.
 ఫోన్: 9490227114
 
 1.గ్రేట్ అలెగ్జాండర్
 తమిళ మూలం: ఆత్మారవి
 తెలుగు: ఎజి.యతిరాజులు
 పేజీలు: 96; వెల: 50
 2. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
 రచన: గురజాడ అప్పారావు
 బుర్రకథగా అనుసరణ: కమ్మ నరసింహారావు
 పేజీలు: 32; వెల: 25
 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌజ్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107
 
 డయాబెటిస్‌తో ఆరోగ్యంగా జీవించడం ఎలా? (‘మన ఆహారం’ బుక్‌లెట్‌తో)
 రచన: డా.టి.ఎం.బషీర్
 పేజీలు: 232; వెల: 180
 ప్రతులకు: స్పందన హాస్పిటల్, ధర్మవరం-515671.
 ఫోన్: 9908708880
 
 తాత చెప్పిన కథలు
 రచన: బి.మధుసూదనరాజు
 పేజీలు: 60; వెల: 60
 ప్రతులకు: జి.రామకృష్ణ, లైబ్రేరియన్, శాఖాగ్రంథాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement