balasubrahmanyam
-
మా అన్నయ్య నాకు అవకాశాలు ఇప్పించి ఉంటే... ఇప్పుడు నా పరిస్థితి..!
-
స్టేజి మీద పాడాలి అంటే అన్నయ్య కి చాలా టెన్షన్
-
కట్టుకున్న భార్యను సుఖపెట్టలేదు..!
-
సింగర్ రామకృష్ణ కు భయపడ్డాను : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
-
నా కోసం బాలు గారు వెయిట్ చేశారు
-
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్ నూతన సీఈవో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ నూతన (ఆర్టీజీఎస్) సీఈవోగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ కమాండ్ సెంటర్లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీజీఎస్ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’కు సాంకేతిక తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీజీఎస్ను ముందుకు తీసుకెళ్లతామని పేర్కొన్నారు. -
‘రాష్ట్ర అభివృద్ధికి, ఆకాంక్షలకు అద్దం పట్టెలా బడ్జెట్’
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సంక్షేమం వైపు మొగ్గు చూపిందన్నారు. విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని ప్రశంసించారు. పౌరులకు నేరుగా నగదు రూపంలో సాయం అందించే ప్రయత్నం బాగుందన్నారు. అయితే బడ్జెట్లో జలవనరులకు, పట్టణాభివృద్ధికి, మౌలిక వసతులకు ఎక్కువ కేటాయింపులు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఉపాధి, మౌలిక వసతులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై సమతుల్యత లేదన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం విశేషమన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి స్పష్టత లేదు : లక్ష్మణరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విభజన హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ. 259 కోట్లు కేటాయించారు. అయితే దీన్ని కేంద్రం చేపడతుందా.. పీపీపీల కింద చేపడతారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణంపై కూడా స్పష్టత లేదని ఆరోపించారు. జలవనరులకు 22 శాతం కేటాయింపులు తగ్గాయన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : కత్తి నరసింహరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కత్తి నరసింహ రావు. బడ్జెట్ వల్ల 45 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. సీపీఎస్ రద్దుపై నిర్దిష్ట కాల పరిమితిలో రద్దు ప్రస్తావన చేయలేదన్నారు. -
ఎస్పీబీకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం ప్రదానం చేయనున్నట్లు డా. వంశీ రామరాజు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ– ‘‘పురస్కారంతో పాటు బాలూగారికి వంశీ చైర్మన్ డాక్టర్ కొత్త కృష్ణవేణి చేతుల మీదుగా వీణ బçహూకరణ ఉంటుంది. అమెరికాకు చెందిన గాయని శారదచే ‘నేల మీది జాబిలి .. అక్కినేని – బాలు శతగీత లహరి’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సభ ప్రారంభంలో అక్కినేని – బాలు సినీ సంగీత విభావరి ఉంటుంది. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య, సినీ నటి డాక్టర్ జమున, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వనాథ్, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, కేఎం రాధాకృష్ణన్, వీణాపాణి తదితరులు పాల్గొంటారు. 21న శుక్రవారం రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. -
సూపర్ పాపులర్ బాలు
బాలసుబ్రహ్మణ్యం– మరో పేరు షణ్ముఖుడు – అంటే ఆరు ముఖాలు కలిగినవాడు. నటన, డబ్బింగ్, గానం, సంగీతం, నిర్మాత, స్టూడియో (కోదండపాణి) అధినేత... ఇలా ఆయన షణ్ముఖుడు అయ్యాడు. పదహారణాల రుపాయినోటులో పదహారు భాషలున్నట్లే సూపర్ పాపులర్ బాలు గళంలో పదహారు భాషల, 40 వేల పాటలున్నాయి. రేపు ఈ గాన గంధర్వుడి జన్మదినం. ఈ సందర్భంగా సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... సాక్షి తరఫున మీకు ఒక రోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. తల్లిదండ్రుల చల్లని నీడలో మీరు ఎదిగిన విధానం గురించి చెప్పండి? మా తండ్రిగారు నేను ఏం చదవాలని ఎప్పుడూ నిర్దేశించలేదు. ఇంజనీరింగ్ చదువుకోవాలని నేను కన్న కలకు తగినట్టుగా నాకు చదువు చెప్పించారు. అలాగే సంగీతంలో నిష్ణాతుడినవ్వాలని, నాకు ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయని ఆయన ఎన్నడూ అనుకోలేదు. నేను హాయిగా పాడతానని ఆయనకు తెలుసు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ‘ఏదైనా పాట చల్లగా పాడు నాయనా’ అనేవారు. పాటల పోటీలలో బహుమతులొస్తే, సంతోషంగా తల నిమిరేవారు. ఆకాశవాణిలో వచ్చే సంగీత విద్వాంసుల కార్యక్రమాలు వినిపిస్తూ, వారు ఎందుకు ప్రఖ్యాతులయ్యారో చెప్పేవారు. సెలవులలో మా తాత గారి ఇంటికి మద్రాసు వెళ్లినప్పుడు, మహాగాయకుల సంగీత కచేరీలు వినే అవకాశం వచ్చింది. మీ నాన్నగారు రాసిన పాటలకు బాణీలు కట్టాలని అనుకున్నారు కదా..! మా నాన్నగారు అద్భుతంగా హరికథ చెబుతారని అందరూ అనుకునేవారు. మా అమ్మ ‘‘మీ నాన్నగారి హరికథకు వెళ్లను, ఆయన పాత్రలో పరకాయ ప్రవేశంచేసి కంట తడి పెట్టుకుంటే, నేను చూడలేను’’ అనేది. ఆయన చెప్పిన హరికథలన్నీ ఆయన స్వయంగా రాసి, స్వరపరచుకున్నవే. నాన్నగారి జీవిత చరిత్ర పుస్తకంగా రాయించి, విడుదల చేసినప్పుడు కొన్ని పాటలు ముద్రించారు. ఆయన రాసిన పాటలకు బాణీలు కట్టి పాడాలని తాపత్రయం. 1962లో ఆలిండియా రేడియో జాతీయ పోటీలలో నాన్నగారు రాసిన ‘‘పాడవే పల్లకీ...’’ పాటను నాకు తోచిన రీతిలో స్వరబద్ధం చేసి పాడి, రెండవ బహుమతి సంపాదించుకున్నాను. మీకు సాహిత్య అభిలాష ఎలా కలిగింది? సముద్రాల రాఘవాచారి గారితో నాన్నగారికి అనుబంధం ఉంది. నాగయ్యగారితో కూడా అనుబంధం పెరిగింది. ఆయన తీస్తున్న ‘రామదాసు’ సినిమా కోసం నాన్నగారితో హరికథ రాయించి, పాడించి రికార్డు చేశారు. ఆ హరికథతోనే సినిమా మొదలు పెట్టాలనుకున్నారు. కాని ఎందుకో అవ్వలేదు. ఆ రికార్డును పొదువుకోలేకపోయాను. ఘంటసాల వారి పాటలు, బాలమురళి పాడే పద్ధతి గురించి నాన్నగారు చెబుతుండటంతో, ఇవన్నీ జీర్ణించుకుపోయి, భాష పట్ల, అభిమానం, అభినివేశం పెరిగాయి. అవార్డులు అందుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల స్పందన ఏమిటి? అవార్డులందుకున్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషంగానే ఉంటుంది. నాన్నగారు ‘బాగా పాడావా నాయనా! బహుమతి వచ్చిందా! సంతోషం!’ అనేవారు. నాకు బీఈలో అంటే ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పుడు మాత్రం ఆయన పొంగిపోయారు. వాకిట్లో తిన్నె మీద కూర్చుని వచ్చీపోయేవాళ్లతో, మా వాడు అనంతపురంలో బీ....ఈ చదువుతున్నాడు అని ‘ఈ’ అక్షరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. లేకపోతే బీఏ అనుకుంటారని భయం. ఒకానొక జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంలో అమ్మను, నాన్నను మొట్టమొదటిసారి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లాను. ప్రభుత్వం లాంఛనాల ప్రకారం ఇచ్చే జనపథ్ హోటల్లో కాకుండా, మరో పెద్ద హోటల్లో (ఆ రోజుల్లో రోజుకు 20 వేల రూపాయలు అద్దె) సూట్ తీసుకున్నాను. అవార్డు అందుకున్నాక, ‘దేశాధ్యక్షుడి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంద’న్నారు. హోటల్‌కు వచ్చాక, ఒక నిశి రాత్రి, పక్క గదిలో ఉన్న నన్ను నిద్ర లేపి, బాత్రూమ్లోకి తీసుకువెళ్లి, ‘ఇందులో ఏది తిప్పితే నీళ్లు ఎలా వస్తాయో అర్థం కావట్లేదు’ అన్నారు. చూపించాను. ఆయన బెడ్రూమ్లో దిండు కింద వేసుకుని పడుకున్నారు. ‘ఏంటి నాన్నా’ అంటే, ‘ఆ హంసతూలికా తల్పం మీద నిద్ర పట్టట్లేదు, కిందే హాయిగా ఉంది. ఇంతకీ ఈ గదికి అద్దె ఎంత’ అని అడిగారు, విషయం చెప్పాక, ‘మనం ఉపయోగించుకోని ఈ సౌకర్యాలకి అంత పెనాల్టీ కట్టడం అవసరమా నాయనా’ అన్నారు. ఆ సంస్కారం నాకు ఇంకా బాగా గుర్తుంది. జేసుదాసుగారితో కలిసి కచేరీ చేయాలనే ఆలోచన ఉందా? జేసుదాసుగారితో కలసి కచేరీ చేయాలనే ధైర్యం నాకు లేదు, ఆయనకు మాత్రం కోరికగా ఉంది. ఈ మధ్య ఆయన ‘మనిద్దరం కలిసి త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తిరువయ్యారులో కచేరీ చేద్దాం. నాలుగు కీర్తనలు నేర్చుకుని పాడటం కష్టం కాదుగా’ అన్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పలేక ‘సరే’ అన్నాను కాని, తప్పించుకు తిరుగుతున్నాను. వేదిక మీద సంప్రదాయ సంగీత కచేరీ చేయాలంటే, మనోధర్మంతో రాగం తానం పల్లవి, చిట్ట స్వరం వేసి పాడేంత ప్రజ్ఞాపాటవం ఉండాలి. చాలా రోజులుగా సంప్రదాయ సంగీతం నేర్చుకోవాలనే కల ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. పాదపూజ గురించి యాభై సంవత్సరాల నా సినీ సంగీత వృత్తి జీవితం సంపన్నం చేసుకున్న సందర్భంలో ‘ఎస్పీబీ 50’ అనే మకుటంతో మా అబ్బాయి నా చేత ప్రపంచయాత్ర మొదలుపెట్టించాడు. ప్రారంభించడానికి ముందర మా అమ్మ ఆశీస్సులు తీసుకున్నాను. జేసుదాసు ఆశీస్సులు కూడా తీసుకోవాలనిపించింది. ఆయనకు పాద పూజ చేస్తే బాగుంటుందని మా ఆవిడ సూచించింది. జేసుదాసు గారికి ఫోన్ చేసి నా యాత్ర విషయం చెప్పి, ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆహ్వానించి, మీ ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పాను. ఆయన ‘తప్పకుండా వస్తానని తారీఖు నోట్ చేసుకున్నారు. అనుకున్నప్రకారం ఆ రోజు సాయంత్రం విజయ గార్డెన్స్‌లో ప్రెస్ మీట్ నాలుగున్నరకే పెట్టాం. మీడియా అంతా వచ్చారు. జేసుదాసుగారు సతీసమేతంగా విచ్చేశారు. వేదిక మీదకు వెళ్లిన తరవాత నేను ముక్తసరిగా నా మాటలు ప్రారంభించి, ముగించి, ఆయనకు పాదపూజ చేసి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాను. ఆయన విస్తు్తపోయారు. ఆయన మాటిమాటికీ ‘నా తమ్ముడు, నా తమ్ముడు’ అంటుంటే పులకించిపోయాను. ఆయన ఆశీర్బలంతో∙నా యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నా జీవితంలో మరచిపోలేని మధురమైన సంఘటనగా పొదువుకున్నాను, మీ పాటల ప్రయాణం గురించి చెప్పండి. ఒక్కొక్క పాట గురించి చెబుతూంటే ఒక గ్రంథం రాయొచ్చు. మర్యాదరామన్న చిత్రంతో నా చిత్ర ప్రవేశం జరిగింది. కోదండపాణి గారు నాకు అవకాశం ఇచ్చిన సంగతి నేను ఎన్నటికీ మరువలేను. ఆ తరవాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సందర్భంలో నేను పద్మనాభంగారికి చిర ఋణగ్రస్తుడిని. నా జీవితాన్ని మలుపు తిప్పిన పాటలు ఎన్నో ఉన్నాయి. ‘చెల్లెలి కాపురం’ చిత్రంలోని ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ ఒక మైలురాయి కిందే లెక్క. ఘంటసాల మాస్టారు పాడవలసిన పాటను, నా మీద నమ్మకంతో పాడించిన సంగీతదర్శకులకు ఋణపడి ఉంటాను. నేను రికార్డు చేసిన రెండవ పాటే మహదేవన్‌గారికి పాడాను. ఆ విషయం మా గురువుగారికి చెబితే, ఆయన ‘అక్కడ పుహళేంది అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతడు పాడే విధానం, మాడ్యులేషన్‌ని గమనించి, అలాగే పట్టుకో. అప్పుడు పాట బాగా వస్తుంది’ అని చెప్పారు. నా ఎదుగుదలలో శంకరాభరణం సహా పుహళేందిగారి భాగస్వామ్యం ఎంత ఉందో చెప్పడానికి వీల్లేదు. శంకరాభారణంలో పాడలేనని పారిపోయిన సందర్భంలో ఆ పాటలు నేర్పించడానికి తాపత్రయ పడిన ఆయనకు సదా ఋణపడి ఉంటాను. సంగీత దర్శకుల గురించి? సత్యంగారికి నేను పాడిన మొట్టమొదటి పాట, ‘పాల మనసులు’ సినిమాలో ‘ఆపలేని తాపమాయె’. ఇదొక కామెడీ సాంగ్. చలంగారికి పాడాలి. ఈ పాట నేను ఎల్ఆర్ ఈశ్వరి పాడుతున్నాం. సోదరి విజృంభించి పాడేస్తోంది. నా పాట తీరు చూసి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు సత్యం గారు. బయట నిలబడి ఏడుస్తూంటే... అట్లూరి పూర్ణచంద్రరావుగారు నన్ను బుజ్జగించి, సత్యం గారిని సన్నగా మందలించి, ‘చిన్న పిల్లవాడు, జాగ్రత్తగా నేర్పించి పాడించాలి’ అనగానే, ‘పాట తెలియని కొత్తవాళ్లని తీసుకు వచ్చి మా నెత్తినేస్తారు’ అని చిరాకు పడిన సత్యం గారు, ఆ తరవాత ‘మా అబ్బాయి బాలునే పాడాలి’ అనే స్థాయికి తీసుకువచ్చారు. పెండ్యాల, ఎస్. రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, చలపతిరావు... ఆరోజుల్లో ఉన్న దిగ్దంతులు అద్భుతమైన పాటలు ఇచ్చి, నా చేత పాడించారు. నాకు పేరు వచ్చేట్టు చేశారు. వాటి వెనకాల ఉన్న కవుల సహకారం కూడా మరువలేను. మా అన్నయ్య చక్రవర్తి నాకోసం పెద్ద పెద్ద హీరోలతో యుద్ధం చే శాడు. ‘చిన్నా’ అని పిలిచేవాడు. ‘కష్టమైన పాటను మనం కంపోజ్ చేయొచ్చు, బాలు పాడేస్తాడు’ అనే నమ్మకం వాళ్లకు కలగడానికి నాకు శక్తిని కలిగించిన వీళ్లందరికీ నేను ఋణపడి ఉంటాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ గొంతులకు అనుకూలంగా పాడటానికి కారణం? అంతవరకు మిగతా వాళ్లందరికీ పాడుతూ పాడుతూన్న నాకు ఎన్టీఆర్, ఏఎన్నార్లకు పాడటానికి చలపతిరావుగారు మంచి సలహా ఇచ్చారు. ‘నువ్వు ఘంటసాల గారిలానైనా పాడాలి లేదా వాళ్ల వాయిస్‌కి దగ్గరగా పాడగలగాలి’ అన్నారు. ఘంటసాల మాస్టారిలాంటి గాత్రం నాకు లేదు. అందుకని నాలాగ నేను పాడుతూ, వారిని అనుసరిస్తూ (అనుకరణ కాదు) వారికి దగ్గరగా నా గానాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాను. కృతకృత్యుడినయ్యాను. కమెడియన్స్‌కి మాత్రం వాళ్ల గాత్రానికి తగ్గట్టుగా పాడటానికి ప్రయత్నించాను. ఉన్నత శిఖరాలకు చేరడానికి చేసిన ప్రయత్నం నేను ఉన్నత శిఖరానికి చేరాననుకోలేదు. వచ్చిన పాటను బాగా పాడాను. పాటల ఆలంబనతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పైకి వచ్చానని మాత్రం చెప్పగలను. ‘భావయుక్తంగా పాడటం మీతోనే ఆఖరు’ అంటున్నారు! అది ఒక ఉత్ప్రేక్ష మాత్రమే. గొప్పవాళ్లు వస్తూనే ఉంటారు. నేను ఒక నటుడిని కూడా కావడం వల్ల మొదట్లో భావాన్ని కొంచెం ఎక్కువగానే పలికించేవాడిని. నిర్దేశించుకోవడం అనుభవం ద్వారా తెలిసింది. ఐ కెన్ సే దట్ ఐయామ్ ద రేరెస్ట్ సింగర్. నా గాత్ర ధర్మం అలాంటిది. గొప్ప గొప్ప గాయకులు ఎంతో భావయుక్తంగా పాడాలని ప్రయత్నించినా వాళ్ల గొంతులోంచి అది బయటకు రాదు. పాటను కవి చేత పలికించి తెలుసుకునేవాడిని. ఇది అందరూ ఆచరించాలి. ఘంటసాలగారితో మీ పాటల ప్రయాణం ‘ఏకవీర’ చిత్రంలోని ‘ప్రతిరాత్రి వసంతరాత్రి’ తో ప్రారంభించాను యాత్ర. ఆ తరవాత ఐదారు పాటలు పాడాను. చిన్నతనం నుంచి వారి పాటలు వేదిక మీద పాడుతూ పెరిగాను. ఆయనతో కలిసి పాడుతున్నప్పుడు భయానికి లోనయ్యాను. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం, ఉద్వేగానికి లోనయ్యే తత్వం. ఈ పాట సమయంలో ‘దేవుడా నేను తప్పు చేసి ఆయనకు ఇబ్బంది కలిగిం^è కూడదు’ అన్నారు. ఆయనను చూశాక, ఆయన ఆశీర్వాదం పొందాలనుకోవడం అవసరమనిపించింది. ఆయన ఆశీర్వచనాలు నాకు శ్రీరామరక్ష. ఇళయరాజా పాటలు ఇళయరాజా పాటలు రెండు నెలలుగా పాడటం మొదలుపెట్టాను. సంవత్సరకాలం పాటు పాడకపోవడానికి కారణం... నొప్పి, బాధ. అంతకుమించి ఆ విషయాలు చెప్పడం అనవసరం. చట్టపరంగా రాయల్టీకి సంబంధించినవి చేయిస్తూనే ఉన్నాను. ఆయన పంపిన నోటీసుకి తలవొగ్గవలసిన అవసరం లేదు. కాని చురుక్కుమన్న గుండెతో తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం నేను ఆయన పాటలు పాడుతూనే ఉన్నాను. కోటి, శ్రీలేఖలను విమర్శించారనే విషయం మీద మీ స్పందన? అసలు జరిగిన విషయం ఏంటంటే, నేను ఇళయరాజా దగ్గరకు వెళ్లి వీళ్లు చేసిన పాటల గురించి, ‘చూడరా ఆర్కెస్ట్రయిజేషన్ నీకు ఏ మాత్రం తగ్గకుండా చక్కగా చేస్తున్నారు’ అని చెప్పి సంతోషించాను. ఇంతే తప్ప, ఇళయరాజా లాగ కోటి సంగీతం చేస్తున్నాడని ఏనాడూ అనలేదు. అలాగే శ్రీలేఖ పాట బాగోలేదని తిరస్కరించాననడం ఆశ్చర్యంగా ఉంది. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వచ్చీరాని మాటలతో ఆ అమ్మాయి పాడుతుంటే, సంతోషించానే తప్ప, నేను ఆ అమ్మాయి పాటను తిరస్కరించడమేంటి? తరవాతి కాలంలో ఆ అమ్మాయి సంగీత దర్శకురాలిగా, మంచి గాయనిగా ఎదిగింది. బాపు రమణల గురించి.. ‘బంగారు పిచుక’ చిత్రంతో బాపుగారి సినిమాలకు నేను పాడటం మొదలుపెట్టాను. అందులో హీరో వేషం వేయమని అడిగారు. వేషాలు వేయడం మొదలెడితే పాటలు రావేమోనని ‘నాకు నటించడం ఇష్టం లేదు’ అని అబద్ధం చెప్పాను. ‘అందాల రాముడు’ సినిమాలో అన్ని పాటలూ నాతో పాడించాలనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే నా మొట్టమొదటి విదేశీయానం సింగపూర్‌కి వెళ్లవలసి రావడంతో, ఆ సినిమా మిస్ అయ్యాను. ఆ తరవాత బాపురమణల తూర్పు వెళ్లే రైలు, సీతమ్మ పెళ్లి, జాకీ సినిమాలకు సినిమాలకు సంగీతం సమకూర్చాను. హిందీలో చేసిన హమ్‌పాంచ్ (మన వూరి పాండవులు) చిత్రానికి నాచేత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీరికార్డింగు చేయించారు. రమణగారు రాసిన కోతికొమ్మచ్చి ఆడియో బుక్ సింహభాగం నేనే చదివాను. వారు నా బొమ్మ వేసి, ‘బాలు సరస్వతీ నమస్తుభ్యమ్’ అని రాసి ఇచ్చారు. వారిద్దరూ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా తప్పులు నేనే దిద్దుకోవాలి నేను పాడిన పాటలలో తెలియక చేసిన తప్పులను నేనే దిద్దుకుంటాను. పాత పాటలలో నాటి గాయనీగాయకులు తెలియకుండా ఎన్నో తప్పులు దొర్లించారు. దానికి వాళ్లు మాత్రమే బాధ్యులు కారు. ఉచ్చారణ దోషాలున్నప్పుడు, పక్కనే కూర్చున్న కవి సవరించాలి. అప్పట్లో ఆ తప్పులను ఎందుకు సర్దేవారు కాదో నాకు తెలియదు. భాష మీద ఉన్న మక్కువతో పెంపొందించుకున్న జ్ఞానంతో, ఆ పాటలు వింటున్న ప్రతి సారి పంటి కింద రాయిలా తగిలి, ‘అయ్యో’ అనిపించేది. బాధ్యత గల గాయకుడిగా ‘ఈ తప్పును దయచేసి మీరు చేయకండి’ అని చెప్పడం నా బాధ్యత. చివరగా... సినిమా పరిశ్రమ నాకు భుక్తినిచ్చింది, ముక్తినిచ్చింది. అందరి అభిమానాన్ని పొందేలా చేసింది. నాకంటూ ఒక దిశానిర్దేశం చేసింది. నాకంటూ ఒక బాధ్యతను పెంచింది. త్రాసులో ఒక పక్కన సినిమా పరిశ్రమ అయితే, మరోపక్క నా పాటలను వినిపించిన అన్ని భాషలకూ చెందిన సంగీత ప్రియులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నా అభిమానులు, ‘ఇంకా బాలు పాట పాడాలి పాడాలి’ అని కోరుకుంటున్నారంటే అది నేను చేసుకున్న పుణ్యం. నా పాట వల్ల కాని, నా మాట వల్ల కాని, ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను క్షమను అర్థిస్తున్నాను. అందరికీ నేను చిర ఋణగ్రస్తుణ్ని. సాక్షి పేపర్ ద్వారా నన్ను మరొక్కసారి శ్రోతలకు దగ్గర చేస్తున్నందుకు సాక్షివారికి సర్వదా కృజ్ఞుణి. సర్వేజనాః సుఖినోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు, స్వస్తి – సంభాషణ: వైజయంతి పురాణపండ -
'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు
-
ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్
-
ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్
విజయవాడ: ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడటంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం విజయవాడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు సంఘీభావం తెలిపాయి. ఐపీఎస్ అధికారిపై దాడి ఘటనలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు, బుద్దా వెంకన్నలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఐపీఎస్ అధికారిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. దాడికి పాల్పడిన నేతలు ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్ చేపడుతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. -
అమితాబ్ సార్ కు హ్యాట్సాఫ్ : ఎస్పీ బాలు
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మద్ధతు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాక్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌కి ముందు బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారంటూ అమితాబ్ పై పిఆర్ ఉల్లాస్ అనే డాక్యుమెంటరీ దర్శకుడు ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. ఈ కేసు వివాదంపై బాలు గారు తీవ్రంగా మండిపడ్డారు. అమితాబ్ సార్ జాతీయ గీతాన్ని చాలా బాగా ఆలపించారని, తాను చాలా గర్వపడుతున్నాని.. ఆయనకు హ్యాట్సాప్ అంటూ బాలు గారు తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. నిర్ధిష్ట సమయం కచ్చితంగా పాడాలని లేకపోతే చర్యలు తీసుకోవడానికి చట్టాలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. లతా మంగేష్కర్, భీమ్ సేన్ జోషీ, బాలమురళీ గారితో పాటు తాను జనగనమణను ప్రాక్టీస్ చేసేవాడినని అయితే ఏ ఒక్కరూ ఇంత సమయం పాడాలని తనకు ఎప్పుడు చెప్పలేదని జాతీయ అవార్డు గ్రహీత బాలు అన్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నాయని అలాంటి వాటిని అరికట్టేందుకు తోడ్పడాలని సూచించారు. అంతేకానీ, పాపులర్ అయ్యేందుకు ఏదో ఓ విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారేందుకని బాలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. -
'బాలు'కు స్వర కళా సామ్రాట్ బిరుదు
-
టీడీపీ నేతలు పొలం కబ్జా చేశారని....
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తురు మండలం తడుకులో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ఎన్‌హెచ్‌లోని తన 5 ఎకరాల పొలాన్ని టీడీపీ నేతలు కబ్జా చేశారని మనస్తాపం చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలను తాళలేక అతడు పరిగెత్తాడు. దాంతో స్థానికులు అతడిని కాపాడి... తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గానం.. ప్రాణం.. పల్లవి..
-
వయసెరుగని స్వర సుర ఝరి
వయసు పెరిగే కొద్దీ గొంతు మారడం ప్రకృతి సహజం. కానీ, ఆ వయోధర్మాన్ని కూడా ఒడుపుగా మలుచుకొని, అన్ని రకాల పాటలూ పాడడమంటే... కచ్చితంగా విశేషమే. అందులోనూ నలభై ఎనిమిదేళ్ళుగా ఆ అరుదైన విన్యాసాన్ని కొనసాగించడమంటే, అది తిరుగులేని రికార్డు. మరి, ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినీ నేపథ్య గాయకుడు మన తెలుగువాడు కావడం... మన తెలుగు నేల చేసుకున్న మహాదృష్టం. ఆ అదృష్టాన్ని మనకందించిన స్వరఝరి - ఎస్పీబీగా అందరూ పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం కోసం 1966 డిసెంబర్ 15న తొలిపాట రికార్డింగ్ జరిపినప్పటి నుంచి నేటి వరకూ ఆయన ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 16 భాషల్లో పాడారు. అల్లూరి సీతారామరాజుకు పాడిన ఆ గొంతు అల్లు రామలింగయ్యను అనుకరించగలదు. అల్లరి పాటలతో తుంటరి మాటలు పలికిన గళం అన్నమయ్య గొంతుగా ఆర్తినీ పలికించగలదు. శాస్త్రీయతను ధ్వనిస్తూ సినీ సంగీత సరస్వతికి శంకరాభరణాలు తొడిగిన ఆ గళానికేనా ఇన్ని స్వరాలు అని ఆశ్చర్యపోనివారు ఉండరు. ఇక, పాటల సంఖ్య అంటారా? వేలల్లోకి చేరి, లెక్కపెట్టడానికి కూడా వీలు లేని స్థాయికి చేరిపోయింది. పాటలొక్కటే పాడి, గాయకుడిగా మిగిలిపోతే బాలూ అందరిలో ఒకరయ్యేవారు. కానీ, ఆయన పాడడమే కాదు... పాటలకు బాణీలు కట్టారు, పాత్రలకు డబ్బింగ్ చెప్పారు, కెమేరా ముందుకొచ్చి నటిం చారు, మంచి కథలకు నిర్మాతగా మేడ కట్టారు, ప్రతిభావంతులైన నవతరం గాయనీ గాయకులను వెలికితీసి, సానపట్టే పనిని చేపట్టారు. అందుకే, భారతీయ సినీ నేపథ్య గాయకుల్లో బాలూది ఓ ప్రత్యేక చరిత్ర. అంతటి బహుముఖీన ప్రతిభాశాలి కాబట్టే, ఆయన గానానికి అరడజను జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలు, విశ్వవిద్యాలయ గౌరవాలు చెన్నైలోని కామదార్నగర్ నివాసానికి నడిచొచ్చాయి. వెరసి, ఒకప్పటి నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట (ఇప్పుడిది తమిళనాడులో భాగమైంది) గ్రామంలో పుట్టిన ఈ గాన తపస్వి ఇవాళ అందరివాడయ్యాడు. తెలుగువాళ్ళకు ఆయన ‘మా బాలు’.. తమిళులకు ‘నమ్మ ఎస్పీబీ’.. మలయాళీలకు ‘నమ్ముడె ఎస్పీబీ’.. కన్నడిగులకు ‘నమ్మవరు ఎస్పీబీ’.. హిందీ వాళ్ళకు ‘హమారా ఎస్పీబీ’.. ఇన్ని ప్రాంతాల, ఇన్ని కోట్ల మందిని అలరించి, ఎవరికి వారే తమ వాడనుకొనేలా ఎదగడం, పాడిన ప్రతి చోటా ఒదగడం ఒక అరుదైన విన్యాసం. ఎస్పీబీ మాత్రమే చేసిన గళేంద్రజాలం. ఇవాళ్టితో 68 ఏళ్ళు నిండి 69వ ఏట అడుగిడుతున్న ఈ గాన గంధర్వుడికి శ్రీరస్తు, శుభమస్తు. చిరకాలం మరిన్ని మంచి పాటల విందు చేయాలని కోరుతున్న అశేష అభిమానుల ఆశీస్సులు అండగా చిరాయురస్తు! -
నేను క్షేమంగానే ఉన్నాను: బాల సుబ్రమణ్యం
జోహెన్నెస్‌బర్గ్: తాను క్షేమంగానే ఉన్నట్టు ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను అస్వస్థతకు గురయ్యూనన్న వదంతుల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో శనివారం రాత్రి జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఇఫ్సా) అవార్డుల ప్రదానోత్సవంలో బాలు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా.. 15 భాషల్లో ఒక్కో వాక్యం చొప్పున పాడి విన్పించారు. అయితే అవార్డు స్వీకరించిన కొద్దిసేపటికే 67 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురైనట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో బాలు ఈ వివరణ ఇచ్చారు. ఇఫ్సా ఈ ఏడాది నుంచి.. ఉభయ దేశాల్లోని ప్రాంతీయ భాషల్లో నిర్మితమైన ఉత్తమ చిత్రాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు అందజేస్తోంది. మన దేశానికి సంబంధించినంత వరకు పలు ఇతర అవార్డులతో పాటు మోహన్ అగాషె (ఉత్తమ నటుడు- అస్తు), వీణ జమ్కార్ (ఉత్తమ నటి-తాపాల్) అవార్డులు గెలుచుకున్నారు. -
సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం
పుస్తకం : విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం) రచన : శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 188 వెల: 89 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. విషయం : వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడు రచయిత. సిద్ధాంతం అంటేనే ఎన్ని పేజీలు అయినా సరిపోవు. కానీ సింపుల్‌గా ఒక్కొక్క పేజీలో చెప్పడం, చెయ్యి తిరిగినవారికే సాధ్యం. బహుశా జర్నలిజమ్‌లో అపారమైన అనుభవం ఇందుకు ఉపయోగపడి ఉండాలి. గాంధీ సిద్ధాంతం, మోడి, సోక్రటిస్... వీరందరివీ రాయడం గొప్ప విషయం. టీవీలు ఎందుకు చూడకూడదు - ఆసక్తికరంగా ఉంటుంది. జాతకాలు... 120 కోట్లమంది ప్రజలకు 12 రాశులు... అంటే ప్రతి 10 కోట్ల మందికీ ఒకేలా జరగడం సాధ్యమేనా? సచిన్, కాంబ్లీ మధ్య వ్యత్యాసం ఏమిటి? మార్పు సాధించిన అశోకుడు, సాధించలేని ఔరంగజేబు... ఇలా ఎన్నో విషయాలతో ఈ పుస్తక రచన సాగింది. - జగదీష్ హాస్య శృంగార సందేశాత్మకం పేజీలు: 140 వెల: 75 ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు పుస్తకం : మైత్రీవనం (కథలు) రచన : జిల్లేళ్ల బాలాజీ, రాచపూటి రమేష్, పేరూరు బాలసుబ్రమణ్యం విషయం : మిత్ర కథకత్రయం... ఒక్కొక్కరివి ఆరేసి చొప్పున 18 కథలతో ‘మైత్రీవనం’గా సంపుటీకరించి కథా భారతికి కంఠహారంగా సమర్పించారు. బాలాజీ ‘ఏకాంబరం ఎక్స్ట్రా ఏడుపు’ వస్తు వైవిధ్యంతో నవ్వులు పూయిస్తుంది. రమేష్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రహసనాన్ని అధిక్షేపాత్మకంగా ‘ఏడుకొండలు - ఎలక్షన్ డ్యూటీ’లో ఆవిష్కరించాడు. బాలసుబ్రహ్మణ్యం ‘సుబ్బు ఐడియా’లో అమాయకపు ఇల్లాలు అతి తెలివితో భర్త పడే భంగపాట్లు హాస్యస్ఫోరకంగా చిత్రించాడు. బాలాజీ ‘అమ్మ డైరీ’లో రవిచంద్ర తన తల్లి వద్దని ప్రాధేయపడినా పట్టుదలతో మాతృదేశ రక్షణ కోసం మిలటరీలో చేరేందుకు వెళ్లాడు. రవిచంద్ర పాత్రను ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ సిద్ధాంతానికి అక్షర లక్ష్యంగా తీర్చిదిద్దాడు రచయిత. ‘నీడలు-నిజాలు’ కథలో మతోన్మాదాన్ని నిరసిస్తాడు రమేష్. ‘శిశిర స్వప్నం’ కథలో వృద్ధుల దయనీయ స్థితిని వర్ణించాడు సుబ్రమణ్యం. - డా॥పి.వి.సుబ్బారావు పిల్లలు గీసిన వన్నెల చిత్రం! పేజీలు: 54 వెల: 70 పుస్తకం : ఎ పొయెట్ ఇన్ హైదరాబాద్ (కవిత్వం) రచన : ఆశారాజు ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040-24642387 విషయం : లేటెస్ట్ స్టడీ ఒకటి చెబుతుంది: ‘జ్ఞాపకాల్లోకి వెళ్లిన వాళ్లు తాజాగా ఉంటారు. మనసును పరిమళభరితం చేసుకుంటా’రని. పురాతన నగరం హైదరాబాద్‌తో పెన వేసుకున్న బంధాన్ని జ్ఞాపకాల్లో నుంచి తీసుకువస్తున్నాడు ఆశారాజు. యవ్వనానికి ఊదు పొగలేసిన సుల్తాన్ బజారులో నడిచినప్పుడు, లాడ్‌బజార్‌లో మెరిసే గాజుల పూలసవ్వడి విన్నప్పుడు, గోలుకొండెక్కి మబ్బుల సొగసును ముద్దాడినప్పుడు, పంచమహల్ ముషాయిరాలో శ్రోత అయినప్పుడు కవితో పాటు మనమూ ఉంటాం. హైదరాబాద్ సౌందర్యాన్ని మనసు కాన్వాసుపై బొమ్మలేసుకొని ‘ఇది మా హైదరాబాద్’ అని మురిసిపోతాం. నిద్రపోయిన జ్ఞాపకాలను నగరం తట్టిలేపి, ‘ఫిర్సే షురూ కరెంగే జిందగీ’ అనేలా చేస్తుందని చెప్పడానికి ఈ పుస్తకం విశ్వసనీయ సాక్ష్యం. చదువుతున్నంతసేపు రంజాన్ సాయంత్రాల్లో పాతబస్తీ గల్లీ గల్లీ తిరుగుతున్నట్లు ఉంటుంది. - యాకుబ్ పాషా కొత్త పుస్తకాలు మైల (శుద్ధాత్మక నవల) రచన: వరకుమార్ గుండెపంగు పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు, చిలుకూరు మం. నల్గొండ జిల్లా. ఫోన్: 9948541711 శాలువా (కథలు) రచన: పిడుగు పాపిరెడ్డి పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: రచయిత, 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి-523230. ఫోన్: 9490227114 1.గ్రేట్ అలెగ్జాండర్ తమిళ మూలం: ఆత్మారవి తెలుగు: ఎజి.యతిరాజులు పేజీలు: 96; వెల: 50 2. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచన: గురజాడ అప్పారావు బుర్రకథగా అనుసరణ: కమ్మ నరసింహారావు పేజీలు: 32; వెల: 25 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌజ్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107 డయాబెటిస్తో ఆరోగ్యంగా జీవించడం ఎలా? (‘మన ఆహారం’ బుక్‌లెట్‌తో) రచన: డా.టి.ఎం.బషీర్ పేజీలు: 232; వెల: 180 ప్రతులకు: స్పందన హాస్పిటల్, ధర్మవరం-515671. ఫోన్: 9908708880 తాత చెప్పిన కథలు రచన: బి.మధుసూదనరాజు పేజీలు: 60; వెల: 60 ప్రతులకు: జి.రామకృష్ణ, లైబ్రేరియన్, శాఖాగ్రంథాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.