సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు.
ఆర్‌పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు
Comments
Please login to add a commentAdd a comment