Railway protection force
-
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్‌కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
ఆర్పీఎఫ్లో ఉద్యోగాలకు ఫేక్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబు ల్ ఉద్యోగాల పేర కేటుగాళ్లు నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. మామూలు మాటలు చెబితే అభ్యర్థులు నమ్మరన్న ఉద్దేశంతో, ఫేక్ నోటిఫికేషన్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వీరి వలలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైల్వే కార్యాలయాలకు అభ్యర్థులు వచ్చి, దరఖాస్తులు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటాయో వాకబు చేయటం ప్రారంభించారు. దీంతో గుట్టు రట్టయింది. దరఖాస్తు ఆప్షన్ రాకపోవడంతో.. రైల్వేలో ఉద్యోగాల పేర మోసగాళ్లు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తరచూ వెలు గు చూస్తున్నాయి. వీరితో స్టడీ సెంటర్ల నిర్వాహకు లు కొందరు చేతులు కలుపుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూ లు చేస్తుంటే, వారికి పరీక్ష కోసం శిక్షణ పేరుతో స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందా నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో తాజా గా 19,800 ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందంటూ ఆర్పీఎఫ్ పేరుతో ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. కొన్ని పత్రికల్లో కూడా ఈ ప్రకటన ప్రచురితమైంది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేల మందిలో ఆశలు రేకెత్తాయి. దీంతో కేటుగాళ్లు ఉద్యోగాలిప్పిస్తామంటూ దందా ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేసే ఆప్షన్ వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రైల్వే కార్యాలయాలకు వెళ్లి వాకబు చేయటం ప్రారంభించటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఎలాంటి రిక్రూట్‌మెంటూ లేదు తామెలాంటి రిక్రూట్మెంట్ ప్రస్తుతం చేపట్టడం లేదని, అది నకిలీ ప్రకటన అంటూ అధికారులు వెల్లడించారు. సాధారణంగా రైల్వే ఉద్యోగాల భర్తీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ద్వారా జరుగుతుంది. కానీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలు వీటి ద్వారా కాకుండా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం రైల్వే బోర్డు అలాంటి కమిటీ ఏదీ ఏర్పాటు చేయలేదు. కానీ ఏకంగా 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలకు తెరతీయటం రైల్వేలో దుమారం రేపుతోంది. దీని వెనుక ఉన్నవారి కోసం రైల్వే పోలీసులు వేట ప్రారంభించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు రైల్వేలో ఎలాంటి ఉద్యోగ భర్తీ కసరత్తు మొదలైనా ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ, రైల్వే బోర్డు ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఇవన్నీ రైల్వే అ«దీకృత వెబ్సైట్ల ద్వారా మాత్రమే వెల్లడవుతాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ నోటిఫికేషన్ల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. కేటుగాళ్లు వాటిని సృష్టించి మోసగించే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. – దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ -
‘వందేభారత్’ రైలుకు వరుస ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ముంబై: గుజరాత్– మహారాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్ సెమీ స్పీడు రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఎవరైనా రైల్వేట్రాక్ వెంబడి పశువులను వదిలితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబై–గాంధీదీనగర్ రైల్వే మార్గం వెంబడి ఉన్న చుట్టుపక్క గ్రామాల సర్పంచ్‌లను రైల్వే భద్రతా విభాగం అధికారులు కలసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌రైలుకు పశువులు అడ్డం వచ్చి ఆగిపోయిన వరుస ఘటనలు జరిగిన గ్రామాల పెద్దలకు నోటీసులు జారీ చేశారు. రైల్వే ట్రాక్ వెంబడి పశువులను నిర్లక్ష్యంగా వదలొద్దని, సంబంధిత పశు యజమానులతో మాట్లాడే బాధ్యతలను గ్రామ సర్పంచ్‌లకు అప్పగించారు. రైల్వే ట్రాక్‌లపై ఎవరైనా పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సెపె్టంబరు 30న గాం«దీనగర్– ముంబై మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పశువులు ఢీకొట్టడంతో ఆటంకం ఏర్పడిన ఘటనలు తరచూ జరిగాయి. గత శనివారం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టి వందేభారత్ రైలు ఆగిపోయింది. అంతకుముందు అక్టోబర్ 6, 7 తేదీల్లో కూడా ఇవే ఘటనలు జరగడంతో రైలు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైల్వే భద్రతా విభాగం దృష్టి సారించింది. ఎక్కువమొత్తంలో పశువులు ఉన్న యజమానులతో ఆయా గ్రామాల పెద్దలు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. అయినప్పటికీ పశువులను రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యంగా వదులుతూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రొవిజన్స్ ఆఫ్ రైల్వే యాక్టు 1989, సెక్షన్ 154, ప్రకారం ఒక ఏడాదిపాటు జైలుశిక్ష, జరిమాన, లేదా రెండింటిని అ మలు చేయవచ్చని, సెక్షన్ 147 ప్రకారం ఆర్నెల్ల పా టు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా, లేదా రెండూ అమలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు
గాంధీనగర్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం ఉదయం ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. రైలు పట్టాలపై గేదెల మంద అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అత్యాధునిక రైలు ఆరు రోజులకే ప్రమాదానికి గురికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. గేదెల యజమానులపై అభియోగాలు మోపింది. వారి నిర్లక్ష్యం కారణంగానే గేదెలు పట్టాలపైకి వచ్చాయని, యజమానుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వారిని ఇంకా గుర్తించలేకపోయినట్లు చెప్పారు. వందే భారత్ హైస్పీడు రైలును ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న ప్రారంభించారు. ఇది గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గురువారం గేదెలను ఢీకొట్టినప్పుడు ఈ రైలు గంటకు 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఘటనలో రైలు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణం ఆలస్యం కాలేదు. గాంధీ నగర్‌కు అనుకున్న సమయానికే చేరింది. తిరిగి ముంబైకి కూడా సకాలంతో వెళ్లింది. అనంతరం రైలు ముందుభాగానికి అధికారులు మరమ్మతులు నిర్వహించారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చోటు చేసుకున్న రోజు జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాల కాల్పులపై స్పష్టత వచ్చింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సాంకేతిక అంశాలు పరిశీలించిన నేపథ్యంలో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ రికోచెట్ కారణంగానే పిల్లెట్లుగా మారిన బుల్లెట్లు ఆందోళన కారులపైకి దూసుకువెళ్లినట్లు తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించారు. ఆందోళనకారులను చెదరగొట్టాలనే.. విధ్వంసానికి దిగిన ఆందోళనకారులతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వారిని చెదరగొట్టాలని భావించారు. దీనికోసం గాల్లోకి కాల్పులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్లో ఇంజిన్లకు విద్యుత్ సరఫరా చేసే 220 కేవీ విద్యుత్ తీగలు ప్రతి ప్లాట్‌ఫాంపైనా ఉంటాయి. అలాంటప్పుడు తుపాకులు పైకెత్తి, నేరుగా గాల్లోకి కాల్పులు జరిపితే బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగే ప్రమాదం ఉంది. అదే జరిగి ఆ తీగలు కింద ఉన్న ఆందోళనకారులు, అధికారులుపై పడితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్పీఎఫ్ బలగాలు నేరుగా పైకెత్తి కాకుండా తుపాకులను కాస్త వాలుగా ఉంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కోసం ఆర్పీఎఫ్ బలగాలు వినియోగించిన తుపాకులు ఇన్సాస్ రైఫిళ్లు. వీటిలో 5.56 క్యాలిబర్ తూటాలను వాడతారు. ఇది కనిష్టంగా 400 మీటర్ల దూరం దూసుకుపోతుంది. దీన్నే ఆ తుపాకీ రేంజ్‌గా పిలుస్తారు. లెడ్తో తయారైన ఈ తూటాకు కాపర్ జాకెట్ (పై పొర) ఉంది. మ్యాగ్జైన్లో ఉండే తూటా తుపాకీ కాగ్ అయినప్పుడు ఛాంబర్లోకి చేరుతుంది. అక్కడ ఫైర్ అయ్యాక బ్యారెల్‌గా పిలిచే ముందు భాగం నుంచి అతి వేగంగా దూసుకువస్తుంది. ఈ బ్యారెల్ లోపలి భాగం రింగులతో కూడి ఉండటంతో బుల్లెట్ తన చుట్టూ తాను తిరుగుతూ.. వేగాన్ని పెంచుకుంటూ బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తూటా ఎదురుగా గోడ ఉంటే తగిలి కిందపడుతుంది. సాంకేతిక పరిభాషలో ‘రికోచెట్’.. అదే చెక్క, ఫ్లైవుడ్ వంటి ఉంటే వాటిలోకి దూసుకుపోతుంది. గాజు, అద్దాలు ఉంటే వాటినీ ఛిద్రం చేస్తూ తన ‘దారి’లో ముందుకు వెళ్లిపోతుంది. గన్‌పౌడర్, బ్యారెల్‌లోని రింగుల ద్వారా వచ్చిన వేగం తగ్గే వరకు ఇలా వెళ్తూనే ఉంటుంది. రైల్వేస్టేషన్లో ఇనుప స్తంభాలు, ఉక్కుతో తయారైన రైలు ఇంజిన్లు, పెట్టెలు ఉంటాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వెళ్తే తూటా ఇలాంటి లోహాలతో చేసిన వస్తువులు, ప్రత్యేకంగా పటిష్టంగా నిర్మించిన గోడలకు తాకితే పరిస్థితి మారుతుంది. ఆ ధాటికి తన తన దిశను మార్చుకుంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో రికోచెట్ అంటారు. వేగంగా ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డు తగిలిన గట్టి వస్తువు కారణంగా దాని దిశను మార్చుకుని, ఒక్కోసారి ఫైర్ చేసిన దిశలోకి మారి దూసుకు వచ్చేస్తుంది. ముక్కలై.. పిల్లెట్లుగా.. వాటిని తాకిన ప్రభావంతో కొన్నిసార్లు లెడ్ బుల్లెట్ ముక్కలై పిల్లెట్లుగానూ మారిపోతుంది. ఇవి దాదాపు తూటా అంత వేగంగానూ దూసుకుపోతాయి. వీటి కారణంగానే రైల్వేస్టేషన్లో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పిల్లెట్ దూసుకువచ్చి శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేయడంతోనే రాకేశ్ కన్నుమూశాడని అధికారులు తేల్చారు. గదులు వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రికోచెట్ నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికోచెట్ అయిన తూటా ఏ దిశలో వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తూటా పేలేది ఇలా... ఇన్సాస్ రైఫిల్ కింది భాగంలో ఉండే మ్యాగ్జైన్లో తూటాలు ఉంటాయి. సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో మ్యాగ్జైన్లో ఉండే తూటా ఛాంబర్లోకి వెళిపోతుంది. ఇన్సాస్ మ్యాగ్జైన్ కెపాసిటీ 20 రౌండ్లు (తూటాలు) కాగా.. స్ప్రింగ్ మూమెంట్ కోసం 18 లేదా 19 మాత్రమే పెడుతుంటారు. చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కితే తుపాకీ వెనుక ఉండే హ్యామర్... ఫైరింగ్ పిన్ను ప్రేరేపిస్తుంది. దీంతో తూటా పేలి ముందు ఉండే బ్యారెల్ నుంచి దూసుకుపోతుంది. ఈ బుల్లెట్ బలమైన లోహం, వస్తువులను తాకినప్పుడు పిల్లెట్లుగా మారడం, రికోచెట్ కావడం జరుగుతుంది. (చదవండి: ‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్) -
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
శభాష్ పోలీస్: క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగేది!
ముంబై: కదులుతున్న రైలును ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ దివ్యాంగుడిని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడారు. మహారాష్ట్రలోని పనవేలు రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటన జరిగింది. దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ట్రైన్ లోపల ఉన్న వ్యక్తి అతడిని లోపలకు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు దివ్యాంగుడు కావడంతో రైలు ఎక్కలేక పట్టుతప్పాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎష్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దివ్యాంగుడిని పక్కకు లాగి పడేశారు. దీంతో అతను ప్రాణాలు దక్కాయి. కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ దివ్యాంగుడిపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
50 శాతం ఉద్యోగాలు మహిళలకే
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఖాళీగా ఉన్న 9,000 పోస్టుల్లో మహిళలకు సగం అంటే 4,500 పోస్టులు దక్కనున్నాయి. ‘ప్రస్తుతం ఆర్పీఎఫ్లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఖాళీల్లో ఎక్కువగా మహిళలను నియమించాలని మోదీ నిర్ణయించారు’ అని గోయల్ బదులిచ్చారు. బిహార్ ప్రభుWత్వం మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటివరకైతే అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు..’ అని మంత్రి చెప్పారు. ఇక రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వంటి ప్రీమియం రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. -
చెన్నైలో చోరీచేసి రైలులో పరార్
సాక్షి,విజయవాడ: చెన్నైలోని ఒక బంగారం వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హంసరాజ్ సింగ్ (27), హరీంద్రసింగ్ (26) చెన్నైలో చోరీ చేసి రైలులో విజయవాడ వైపు పారిపోతున్నారని చెన్నై జాయింట్ కమిషనర్ నుంచి రైల్వే సీనియర్ డీఎస్పీ ఎస్‌ఆర్‌గాంధీకి మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దొంగల ఫోన్‌ను ట్రాకింగ్ చేయడం ద్వారా చెన్నై నుంచి వచ్చే మూడు రైళ్లలో దొంగలు వచ్చే అవకాశం ఉందని భావించారు. గూడూరులోని రైల్వే పోలీసులు తనిఖీలు చేసి 2 రైళ్లలో దొంగలు లేరని నిర్ధరించుకున్నారు. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12651)లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. రంగంలోకి విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై బయలుదేరితే విజయవాడ వరకు ఆగదు. విజయవాడలో దొంగలు తప్పించుకునే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి రైలు తెనాలిలో కొన్ని క్షణాలు ఆపించి రైల్వే ఆర్పీఎఫ్ స్పెషల్ టీమ్‌ను రైలులోకి ఎక్కించారు. వీరు మూడు బృందాలుగా విడిపోయి ప్రతిబోగీని తనిఖీ చేశారు. చివరికి దొంగలను గుర్తించి రైలు విజయవాడకు చేరగానే అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 13.5 కేజీల బంగారం, 67 కేజీల వెండి, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద రికవరీల్లో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. -
15–20 నిమిషాల ముందుగానే రైల్వేస్టేషన్‌లోకి
న్యూఢిల్లీ: విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రయాణికులు రైలు బయలుదేరేందుకు 15–20 నిమిషాల ముందుగా స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైల్వేస్టేషన్ల ప్రవేశమార్గాలను మూసివేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లలో దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 202 రైల్వే స్టేషన్లలో ఈ ఏకీకృత భద్రతా వ్యవస్థ(ఐఎస్ఎస్)ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులు ఓసారి లోపలకు వచ్చాక ఎన్ని రైల్వేస్టేషన్లలో ప్రవేశమార్గాలను మూసివేయగలమో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో కొన్నిచోట్ల గోడలు నిర్మించడం, మరికొన్ని చోట్ల ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏకీకృత భద్రతా వ్యవస్థలో భాగంగా ఈ 202 రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, యాక్సస్ కంట్రోల్, బ్యాగేజీ–ప్రయాణికుల స్క్రీనింగ్ వ్యవస్థ, బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పరికరాలను అమరుస్తామని కుమార్ తెలిపారు. సాధారణంగా విమాన ప్రయాణికులు కొన్ని గంటల ముందుగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారనీ, కానీ తాజా విధానంలో రైల్వే ప్రయాణికులు కేవలం 15–20 నిమిషాల ముందు స్టేషన్‌కు వస్తే సరిపోతుందని వెల్లడించారు. స్టేషన్లోకి వచ్చే ప్రయాణికుల్లో కొందరిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికుల్ని స్టేషన్ ప్రాంగణం బయటే తనిఖీ చేసి లోపలకు అనుమతిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.385.06 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. -
ఆర్పీఎఫ్కు అత్యాధునిక పరికరాలు
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఆధునీకరణలో భాగంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులకు బాడీ కెమెరాలు, డ్రోన్లు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్ వంటి అత్యాధునిక పరికరాలు అందించేందుకు అంగీకరించింది. అలాగే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసే అధికారాన్ని రైల్వే డివిజినల్, జోనల్ అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం డ్రోన్ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్లు, డ్రాగన్ సెర్చ్లైట్లు, ఫైరింగ్ సిమ్యులేటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థలు, కాల్ డేటా రికార్డర్, నైట్ విజన్ వంటి పరికరాలను డివిజినల్, జోనల్ అధికారులు కొనుగోలు చేయవచ్చు. -
రైల్వేలో ఆన్లైన్ టికెట్ మోసాలకు చెక్!
న్యూఢిల్లీ: రైల్వేలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్లైన్ టికెట్ల మోసాలను అరికట్టేందుకు ఆ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైల్వే చట్టం– 1989కు సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తికి ప్రస్తుతం గరిష్టంగా విధిస్తున్న రూ. 10 వేల జరిమానాను రూ.2 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతిపాదించిన ఈ సవరణలను రైల్వే బోర్డు ఆమోదించాల్సి ఉందన్నారు. -
రెప్పపాటులో తప్పిన ప్రాణహాని
-
తమ అభిమాన హీరోని కలవాలని కొందరు..
తమ అభిమాన కథానాయకుడిని కలవాలని కొందరు.. అసాధ్యమని తెలియక హీరోలు కావాలని ఇంకొందరు.. అమ్మానాన్న మందలించారని మరికొందరు.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టి వీధిన పడుతున్నారు.. తిరిగి ఇంటికెళ్లలేక రోడ్డుమీదే బతికేస్తున్నారు.. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల చేతికి చిక్కి.. యాచక వృత్తిలోకి బలవంతంగా దించేవారికి దొరికి.. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు! సాక్షి, ముంబై: వీధిబాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2017లో ఒక్క ముంబై నగరంలోనే పోలీసులు దాదాపు 700 మంది వీధిబాలలను కాపాడారు. ఇంకా పోలీసులకు చిక్కకుండా రోడ్లపై తిరుగుతున్నవారు మరెందరో ఉన్నారు. వీరంతా అనాథలు కారని, రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవారేనని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మానాన్న మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్లాలలో తెలియక రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే బతుకున్న 706 మంది చిన్నారులను 2017లో గుర్తించి, తిరిగి ఇంటికి పంపడమో, వసతి గృహాల్లో చేర్చడమో చేశారు. ముంబై శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలోనే 528 మందిని గుర్తించగా వారిలో 360 మంది బాలలు, 168 మంది బాలికలు ఉన్నారు. ఇక ముంబైలోని రైల్వే స్టేషన్లలో 178 మందిని గుర్తించగా వారిలో 115 బాలలు, 63 మంది బాలికలున్నారు. వీరంతా 13 నుంచి 18 ఏళ్లలోపు వయసు వారే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారట. సమాచారం అందిస్తే సరి.. పిల్లలెవరైనా తప్పిపోతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ వంటి వివరాల ఆధారంగా కూడా తల్లిదండ్రులను గుర్తిస్తున్నామని, అయితే చాలామంది పిల్లలు తిరిగి ఇంటికెళ్లేందుకు భయపడుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తిరిగి ఇంటికి పంపుతున్నామని చెబుతున్నారు. దొరకనివారి పరిస్థితి... రైల్వే పోలీసులు గుర్తించిన పిల్లలు ఎలాగోలా తల్లిదండ్రుల వద్దకు చేరడమో.. ఇష్టంలేనివారిని వసతిగృహాల్లో చేర్చడమో జరుగుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటి? దీనిపై ఆర్పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అనుప్‌కుమార్ మాట్లాడుతూ... చాలామంది పిల్లలపై మాదకద్రవ్యాల ముఠాలు, యాచకవృత్తిలోకి పిల్లల్ని దింపే ముఠాలు నిఘాపెట్టాయి. రైళ్లలో నుంచి ఒంటరిగా దిగే పిల్లలకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్లి బలవంతంగా బాలకార్మికులుగా, యాచకులుగా, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిగా మార్చేస్తున్నారు. -
ఆర్పీఎఫ్ ఎస్సై ఇంట్లో చోరీ
శుభకార్యానికి వెళ్లిన ఓ ఆర్పీఫ్ ఎస్సై ఇంటి తాళాలు పగులకొట్టి 7 తులాలు బంగారు ఆభరణాలు, రూ. 28 వేలు చోరీ చేశారు. మేడిపల్లి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ సాయిభవానీ నగర్లో నివసించే పోలిశెట్టి రాజేందర్(55) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఎస్సై పని చేస్తున్నారు. ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికెళ్లి చూడగా బీరువాలో ఉంచిన నాలుగు తులాల నల్లపూసల దండ, మూడు తులాల ఐదు జతలు చెవి కమ్మలతోపాటు రూ. 28 వేలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిన విషయాన్ని మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడ సెల్ఫీ తీసుకుంటే అంతే...
అహ్మదాబాద్ః రైల్వే ట్రాక్ ల పైనా, నడిచే ట్రైన్ల ముందు సెల్ఫీలు తీసుకునే పిచ్చికి.. రైల్వే శాఖ అడ్డుకట్ట వేసింది. విచక్షణను కోల్పోయి, ప్రాణాలతో చెలగాటమాడే సెల్ఫీల క్రేజ్ ను ఒదిలించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఒళ్ళూ పై తెలీకుండా సెల్ఫీలు తీసుకునే వారిపై రైల్వే యాక్ట్ 1989 లోని మూడు సెక్షన్లను అమలు చేసేందుకు సిద్ధమైంది. సెల్ఫీలు తీసుకునేవారిపై అహ్మదాబాద్ రైల్వే అధికారులు కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటే ఐదేళ్ళ జైలు శిక్ష విధించేలా అహ్మదాబాద్ డివిజన్ రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకొంది. ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముంబై తర్వాత ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకుంటూ పట్టుబడితే రైల్వే యాక్ట్ 1989 ప్రకారం శిక్షను అమలు చేసే అవకాశం ఉందని రైల్వే పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రయాణీకులు తీసుకునే సెల్ఫీల్లో కేవలం రైల్వే ట్రాక్ లు కనిపిస్తే 147, ట్రాక్ తో పాటు ట్రైన్ కూడా ఉంటే 145, 147 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే కదులుతున్న రైల్లోనూ, కదులుతున్నరైలు, గూడ్స్ బ్యాగ్రౌండ్ లో ఉండేలా సెల్ఫీ తీసుకున్నా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) చట్టాల ప్రకారం నేరంగానే పరిగణిస్తారు. కదులుతున్న ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకుంటుండగా పట్టుబడ్డ వారిపై 153 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారని, వారికి సుమారు 5 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవల సెల్ఫీలవల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతుండటంతో రైల్వే అధికారులు ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో.. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ఫీల విషయంలో జనం జర జాగ్రత్తగా ఉండాల్సిందే. -
ప్రయాణికుల భద్రతకు ఆర్పీఎఫ్ భరోసా
ద.మ.రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సంజయ్ సాంకృత్యాయన్ సాక్షి, హైదరాబాద్ : ‘ప్రయాణికులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ప్రతిక్షణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యం’ అని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రతాధికారి సంజయ్ సాంకృత్యాయన్ అన్నారు. ప్రయాణికుల భద్రతపై 182 టోల్ ఫ్రీ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయవచ్చని చెప్పారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం జీఆర్పీ పోలీసులతో కలసి రైల్వే భద్రతాదళం పటిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకొనేవిధంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక తనిఖీలు, నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఇక్కడ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ డీఐజీ ఈశ్వర్రావు, ఎంఎస్ సునిల్, సుమతి శాండిల్య తదితర ఉన్నతాధికారులతో కలసి మాట్లాడారు. సెక్యూరిటీ హెల్ప్‌లైన్(టోల్‌ఫ్రీ) నంబర్ 182కు ఈ ఏడాది 530 ఫిర్యాదులు అందగా ఆర్పీఎఫ్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుందన్నారు. ఇంట్లోంచి పారిపోయిన, తప్పిపోయిన 293 మంది చిన్నపిల్లలను ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆర్పీఎఫ్ రక్షించిందని చెప్పారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘రిస్తా’ మొబైల్ యాప్ ద్వారా 800 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. నిర్భయనిధి నుంచి మంజూరైన రూ.50 కోట్లతో 78 రైల్వేస్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి విశాఖపట్నం: పిస్తోలు చెక్ చేసే ప్రయత్నంలో మిస్‌ఫైర్ కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ రైల్వే డివిజనల్ కార్యాలయం వెనుక భాగాన ఆయుధాలను భద్రపరిచే గదిలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే డీజిల్ లోకోషెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్) హేమంత్‌కుమార్ ఆదివారం ఉదయం అరకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్లాల్సిన బృందంలోని వారికి కేటాయించిన 9 ఎమ్ఎమ్ పిస్తోలును అక్కడి సిబ్బంది అందజేశారు. ఇలా కానిస్టేబుల్ కె.సి.ప్రధాని తన పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న హెచ్.సి. ధర్మాన ముసలయ్య (48) ఛాతీలోకి బుల్లెట్ దిగబడి, ముందుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావు ఛాతీ వెనుక భాగాన దిగబడింది. వీరిని పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా ముసలయ్య మృతి చెందాడు. మల్లికార్జునరావుకు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘సీఎస్టీ’కి కమాండో భద్రత
- 6 నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న - సెంట్రల్ రైల్వే - ‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యంలోనే.. - త్వరలో డాగ్స్ కెన్నల్ల నిర్మాణం సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఉగ్రదాడులు జరగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మరో ఆరు నెలల్లో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కమాండోలను ఏర్పాటు చేయటం వల్ల టెర్మినస్ భద్రతా వలయంలో ఉంటుందని సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అశోక్ భోర తెలిపారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్కు ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ఉండగా.. మరో 60 మంది సిబ్బంది అదనంగా చేరనున్నారు. వారిని కొత్తగా ఇటీవల ఫోర్స్‌లో చేరినృబందంతో కలిపి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఇందుకు అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతారు. వీరికి తోడుగా డాగ్ స్క్వాడ్ల కోసం సెంట్రల్ రైల్వే కొత్తగా కెన్నల్లను నిర్మించనుంది. పన్వేల్, కసారా, లోనావాలాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మిస్తుంది. నగర శివార్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ రైల్వే కమిషనర్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం కార్నక్ బందర్, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ), మాటుంగ, కల్యాణ్‌లలో 29 స్నిఫర్ డాగ్స్‌కు గాను 37 కెన్నీస్లు ఉన్నాయని చెప్పారు. కొత్త డాగ్స్ షెల్టర్లు అందుబాటులోకి రాగానే మరిన్నింటిని సమకూర్చే ప్రయత్నం చేస్తామని వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్ నిఘాను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. కుర్లా స్టేషన్లో ఇంటిగ్రెటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్)లో భాగంగా దాదాపు వంద కెమెరాలను అమర్చనున్నామని చెప్పారు. అనంతరం ఎల్టీటీ, కల్యాణ్‌లలో కూడా హై-ఎన్డ్ కెమెరాలను అమర్చుతామన్నారు. సీఎస్టీ, థానేలో ఐఎస్ఎస్ లో భాగంగా కెమెరాలను అమర్చారని, ఈ నెలాఖరుకు దాదర్‌లో కంట్రోల్ రూం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కొవడానికి సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని, సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు తగినంత సిబ్బంది ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
'రైల్వే శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి'
వరంగల్: రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా ఆర్పీఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని సంఘ్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైళ్ల మార్గాలను, రైళ్లను పెంచుతోంది కానీ ఆర్పీఎఫ్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. అంతేకాకుండా ఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా అదనపు పనికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన రైల్వే సీఐ
ఏలూరు (వన్ టౌన్) : ఏలూరులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీఐ కె.జోజి తినుబండారాల విక్రేత నుంచి రూ.6 వేల లంచం తీసుకుంటూ సీబీఐ వలలో చిక్కారు. విశాఖపట్నంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం-ఏలూరు మధ్య రైళ్లలో తిరుగుతూ తినుబండారాలు అమ్ముకునే వారికి ఓ వ్యక్తి వాటిని సరఫరా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి అతనికి తగిన అనుమతులు లేకపోవడంతో ఏలూరులో రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీఐగా పనిచేస్తున్న కె.జోజి నెలకు రూ.6 వేల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గత నెలలకు సంబంధించి కూడా అదే మొత్తంలో ఇవ్వాలని కోరాడు. అంత ఇచ్చుకోలేనని సదరు వ్యాపారి చెప్పడంతో గత నెలలు, ప్రస్తుత నెలకు సంబంధించి రూ.6 వేలు ఇవ్వాలని అడిగాడు. దీంతో బాధితుడు సీబీఐ అవినీతి విభాగం అధికారులను ఆశ్రరుుంచాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి ఫిర్యాదు దారునుంచి రూ.6 వేల లంచం తీసుకుంటున్న సీఐ కె.జోజిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీఐ కార్యాలయూన్ని, అనంతరం అతని ఇంటిని తనిఖీ చేసి వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జోజిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, ఈనెల 27 వరకు అతడికి రిమాండ్ విధించారని సీబీఐలోని ఏసీబీ విభాగం ఎస్పీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారెవరైనా లంచం అడిగితే 1800 425 00100 నంబర్‌కు ఫోన్ చేయూలని, లేదంటే ఈమెరుుల్ ఐడీ జిౌఛ్చఛిఠిటజుఞఃఛిఛజీ.జౌఠి.జీ కి ఫిర్యాదు చేయూలని ఆయన సూచించారు. -
ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్పీఎఫ్ దాడులు
హైదరాబాద్ సిటీ: ఎంఎంటీఎస్ రైళ్లలో పోకిరీలు, అక్రమ ప్రయాణికుల బెడద మళ్లీ మొదటికొచ్చింది. బుధవారం నగరంలోని వివిధ మార్గాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిర్వహించిన దాడుల్లో ఏకంగా 134 మంది పట్టుబడ్డారు. వీరిలో అనేక మంది మహిళలు, వికలాంగుల బోగీల్లో ప్రయాణిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. మరి కొందరు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ అరెస్టయ్యారు. నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి రూట్లలో ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించింది.అనంతరం పట్టుబడిన వారందరి పైన కేసులు నమోదు చేసి సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూ.30 వేల వరకు జరిమానా విధించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.అలాగే స్టేషన్లలో, రైళ్లలో పరిసరాల అపరిశుభ్రతకు పాల్పడుతూ పట్టుబడిన మరో 22 మంది ప్రయాణికుల పై కోర్టు ఆదేశాల మేరకు రూ.6550 జరిమానా విధించారు. -
రైళ్లలో మహిళా పటాలం
న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం త్వరలో మహిళా పోలీసులు రంగంలోకి దిగనున్నారు. రైల్వే రక్షక దళం మహిళా బెటాలియన్(పటాలం)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. వేధింపులపై మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల కార్యకలాపాలను గమనించేందుకు రైళ్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరోవైపు, రైళ్లలో ప్రయాణికులకు కనీస వసతులు కూడా లేవని ఆ శాఖ అంగీకరించింది. దూర ప్రాంత రైళ్లు కొన్నింటిలో నాణ్యతలేమి ఆహారం సరఫరాపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, బొద్దింకలు, లైట్లు వెలగకపోవడం, ఆహారం తదితర వసతులకు సంబంధించి 2012 ఏప్రిల్ నుంచి 2014 అక్టోబర్ మధ్య 5,670 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమాచారం కుప్లంగా.. - ఉద్యోగుల భవిష్యనిధి లావాదేవీల్లో ఆధార్ నెంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలేదని కార్మిక మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు. ళీఉపాధీ హామీ కూలీలకు నిధుల చెల్లింపుల్లో పోస్టాఫీసుల్లో దళారుల పాత్ర తమ దృష్టికి వచ్చిందదని, దీని నివారించేందుకు ఏపీ, తెలంగాణ, జార్ఖండ్‌లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిపాదించామని కేంద్రం పేర్కొంది. - దేశంలో 24 శాతం గృహాలు సురక్షితం కాని మంచినీటితో కాలం వెళ్లదీస్తున్నాయని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు.