గాంధీనగర్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం ఉదయం ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. రైలు పట్టాలపై గేదెల మంద అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అత్యాధునిక రైలు ఆరు రోజులకే ప్రమాదానికి గురికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఈ ఘటనపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. గేదెల యజమానులపై అభియోగాలు మోపింది. వారి నిర్లక్ష‍్యం కారణంగానే గేదెలు పట్టాలపైకి వచ్చాయని, యజమానుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వారిని ఇంకా గుర్తించలేకపోయినట్లు చెప్పారు.
వందే భారత్ హైస్పీడు రైలును ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న ప్రారంభించారు. ఇది గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గురువారం గేదెలను ఢీకొట్టినప్పుడు ఈ రైలు గంటకు 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఘటనలో రైలు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణం ఆలస్యం కాలేదు. గాంధీ నగర్‌కు అనుకున్న సమయానికే చేరింది. తిరిగి ముంబైకి కూడా సకాలంతో వెళ్లింది. అనంతరం రైలు ముందుభాగానికి అధికారులు మరమ్మతులు నిర్వహించారు.
చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment