buffaloes
-
అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!
దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..? బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..) -
నూతన ఒరవడి.. పశువిజ్ఞాన బడి
కడప అగ్రికల్చర్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతోపాటు పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్బీకేల పరిధిలో సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలను అందిస్తోంది.ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉండే గ్రామీణ ప్రాంత పశువులకు సైతం మెరుగైన వైద్యసేవందించాలనే లక్ష్యంతో సంచార పశు వైద్య శాలలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరింత భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం ‘పశువిజ్ఞాన బడి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తూ తద్వారా వేలాదిమంది రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. జిల్లాలో జూన్ నెల నుంచి... జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి పశువిజ్ఞాన బడులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 414 రైతుభరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 17 ప్రాంతీయ పశువైద్యశాలలు, 79 పశువైద్యశాలలు, 78 గ్రామీణ పశువైద్యశాలలు పరిధిలో పనిచేసే పశువైద్యులు, సహాయ సంచాలకులు జూన్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి 721 పశు విజ్ఞాన బడులను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పశువిజ్ఞాన బడులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, డివిజన్ డిప్యూటీ డైరెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఏ అంశాలపై అవగాహన కల్పిస్తారంటే.. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి పశుగ్రాసాన్ని, పశుధాణాను వాడుకోవాలి. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు ఎంతమేర పచ్చిమేత అవసరం, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు. పాడి పశువులకు దాణామృతం, సమీకృత దాణా ఎలా ఇవ్వాలో కూడా అవగాహన కల్పిస్తారు. పాడి పశువుల్లో ఏడాదికి ఒక ఈత ఉండాలి. ఆప్పుడే పాడి పరిశ్రమలో రాణించే అవకాశం ఉంటుంది. ఈనిన దూడ కూడా ఆరోగ్యంగా వస్తుంది. పాడిపశువులకు సంబంధించి దూడల మరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన సంరక్షణ పద్ధతుల గురించి తెలియచేస్తారు. కొన్ని ఆవులు, పశువులు యెదకు రాకుండా, చూలు కట్టకుండా ఉంటాయి. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేస్తారు శాస్త్రీయంగా గొర్రెలు, మేకలు పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టాలో కూడా అవగాహన కల్పిస్తారు. రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లాలోని అన్ని మండలాల రైతు భరోసా కేంద్రాల పరిధిలో పశు విజ్ఞానబడి కార్యక్రమాన్ని పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్థిస్థాయిలో వారు అవగాహన కల్పిçస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పశు సంరక్షక్ యాప్‌లో వారం వారం పొటోలు, హాజరైన రైతుల పేర్లు, వారి ఫోన్ నంబర్లను ఆప్‌లోడ్ చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. – శారదమ్మ, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి. -
వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు
గాంధీనగర్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలు ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం ఉదయం ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. రైలు పట్టాలపై గేదెల మంద అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. రైలు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అత్యాధునిక రైలు ఆరు రోజులకే ప్రమాదానికి గురికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై గుజరాత్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసింది. గేదెల యజమానులపై అభియోగాలు మోపింది. వారి నిర్లక్ష్యం కారణంగానే గేదెలు పట్టాలపైకి వచ్చాయని, యజమానుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వారిని ఇంకా గుర్తించలేకపోయినట్లు చెప్పారు. వందే భారత్ హైస్పీడు రైలును ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న ప్రారంభించారు. ఇది గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. గురువారం గేదెలను ఢీకొట్టినప్పుడు ఈ రైలు గంటకు 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఘటనలో రైలు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణం ఆలస్యం కాలేదు. గాంధీ నగర్‌కు అనుకున్న సమయానికే చేరింది. తిరిగి ముంబైకి కూడా సకాలంతో వెళ్లింది. అనంతరం రైలు ముందుభాగానికి అధికారులు మరమ్మతులు నిర్వహించారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
పశువులపై విష ప్రయోగం
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): రాజకీయ కక్షలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవల్లి–1 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల (వైఎస్సార్ సీపీ)కు చెందిన పశువులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనలో ఓ గేదె దూడ మృతి చెందగా, మరో మూడు గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలో ఆదివారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన దూసరి నిర్మల, జోజి దంపతులు పాడి పశువులను పెంచుకుంటూ కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయంగా వారిద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని వారిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇటీవల నిర్మల దంపతులు కౌలుకు సాగు చేసిన 16 ఎకరాల వరి కుప్పలను ప్రత్యర్థులు దహనం చేశారు. కాగా, శనివారం అర్ధరాత్రి నిర్మల ఇంటి ప్రాంగణంలోని గేదెలపై విషప్రయోగం జరగగా.. సంఘటనాస్థలంలోని ఆనవాళ్లును బట్టి చూస్తే దోసకాయ, వంకాయలలో గుళికల మందు కలిపి గేదెలకు పెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలంలో పడి ఉన్న గుళికలు కలిపి పెట్టిన కూరగాయలు ఆదివారం తెల్లవారుజామున నిర్మల యథావిధిగా పశువులకు మేత వేసేందుకు వెళ్లినపుడు పశువులన్నీ అపస్మారక స్థితిలో కనిపించాయి. స్థానికులు వీరవల్లి ప్రభుత్వ వైద్యశాల, సంచార పశువైద్యశాల సిబ్బందికి సమాచారం అందించటంతో వారు హుటాహుటిన పశువులకు వైద్యం అందించారు. దీంతో గేదెలకు ప్రాణాపాయం తప్పినట్లేనని పశు వైద్యులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరవల్లి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు. గతంలో వరి కుప్పలు దహనం చేసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక వేరేఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేలు కంబళలో ఒలింపిక్స్ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. గత శనివారం నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడు. గతేడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్ వీటిని అధిగమించాడు. ఉసేన్ బోల్ట్ కటే వేగంగా.. ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్ శెట్టి కూడా బోల్ట్ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు విశ్వనాథ్ కూడా పాత రికార్డులన్నీ సవరించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలగా ఎలా సాధించేశారనే కుతూహలం అందరిలోనూ మొదలైంది. కరావళి సంప్రదాయమే.. కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ. కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. 100 మీటర్లు అంత కంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు. దున్నపోతులను అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. క్రీడ ఒక్కటే.. ఎన్నెన్నో పోటీలు.. కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగినవే. వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తారు. చరిత్ర ఏం చెబుతుందంటే.. కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున (రతి) పాటిస్తారు. దీంతో పాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. పోటీలు.. విభాగాలు.. కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. ► నెగిలు: చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఓ రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలి ని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తి స్తారు. ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. ► హగ్గ: ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురద నీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. ► అడ్డా హాలేజ్: ఈ విభాగం కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ►కేన్ హాలేజ్: ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా, ఉత్కంఠగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. చదవండి: మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు ఆమె కోసం ఇల్లమ్మి.. ఆటోలోనే తిండి, నిద్ర -
సింహం సింగిల్‌గా వస్తుంది.. ఆ వస్తే.. వస్తే ఏంటట..
ఓ సినిమాలో డైలాగ్..పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది అని..ఈ సింహం దాన్ని బాగా నమ్మేసినట్లు ఉంది..సింగిల్‌గానే వెళ్లింది..అప్పుడు ఏం జరిగిందంటే.. మొన్నీమధ్యే..కెన్యాలోని లేక్ నకురు నేషనల్ పార్కులోఊసుపోని సింహం ఒకటి ఊరి మీదకు బయల్దేరిందిఇలా ఇంటి మలుపు తిరిగిందో లేదో..అడవి గేదెల గుంపు ఒకటి ఎదురైంది.. అసలే సింహం.. ఆపై కామన్సెన్స్ తక్కువ..పైగా.. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలియదు..దాంతో ఏయ్ అన్నట్లు చూసింది..అవి పోపోవోయ్ అన్నాయి..ఇది గుర్రుమంది.. అంతే.. వాటికి కాలింది.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదుగానీ..ఒక్కసారిగా మీదకు ఉరికాయి.. సింహానికి తత్వం బోధపడింది..కస్సుమన్నది కాస్త.. కాలికి పనిచెప్పింది.. చేసేదిలేక ఇలా చెట్టెక్కి కూర్చుంది.. సింహం కళ్లలో భయం చూశాక.. గేదెల ఈగో శాటిస్ఫై అయినట్లుంది..దీంతో పోనీలే అని దాన్ని వదిలేసి.. వార్నింగులు గట్రా ఇచ్చేసి..ఇంటి దారి పట్టాయి.(ఈ చిత్రాలను ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ నీలోత్పల్ బారువా క్లిక్‌మనిపించారు.) -
మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం. -
సబ్సిడీ బర్రెల పథకానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి పశువుల పథకానికి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు తమ వాటా సొమ్ము చెల్లించిన రైతులు తప్ప కొత్త వారి నుంచి ఎలాంటి డీడీలు తీసుకోకూడదని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అనేకచోట్ల బర్రెలు, ఆవులు కొనకుండానే కొన్నట్లు చూపుతుండటం, అధికారుల అవినీతి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఎన్నికల సమయంలో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు కారణంగా భావిస్తున్నారు. రైతులకు ఇదే విషయాన్ని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అటు కొత్తగా డీడీలు చెల్లించాలనుకున్న రైతులు, ఇటు ఇప్పటికే డీడీలు చెల్లించి పాడి పశువులు పొందని వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 52,491 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించగా అందులో 32,175 మందికి పాడి పశువులను సరఫరా చేశారు. మిగిలిన రైతులు కూడా చాలామంది డీడీలు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు వద్దనీ ఎన్నికల తర్వాత ఇవ్వండని పశు సంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆగస్టులో గేదెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పాడి గేదెల పంపిణీ విధివిధానాలపై వివిధ జిల్లాల పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి తలసాని, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విజయడెయిరీ, ముల్కనూర్, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మందికి సబ్సిడీపై పాడిగేదెలు, ఆవులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గేదెల కొనుగోలుపై లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించా రు. పంపిణీ చేసే గేదెలకు ఒక్కో దానికి యూనిట్ ధరలో 3 ఏళ్ల పాటు బీమా, 300 కిలోల దాణా ఇస్తామన్నారు. అంతేకాకుండా అదనంగా రూ.5 వేలు చెల్లిస్తామన్నారు. 31 నుంచి చేప పిల్లల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 31న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని వెల్లడించారు. చేప పిల్లల విడుదల ఏర్పాట్లపై సోమ వారం సచివాలయంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, ఇతర మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఘన్పూర్ చెరువులలో తాను స్పీకర్‌తో కలసి చేపపిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి చందులాల్‌తో కలసి ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. చేపపిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విడుదల కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అధికారులకు సూచించారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీపై వాహనాలను ఆగస్టు నెలాఖరు నాటికి అందించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభు త్వం అన్ని విధాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయపర్చుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పాడి గేదెల పంపిణీకి రూ.800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు త్వరలో రూ.800 కోట్లతో 50% సబ్సిడీపై పాడిగేదెలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయ డెయిరీతోపాటు నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు, కరీంనగర్ డెయిరీలకు పాలుపోసే 2.17 లక్షల మందికి పాడిగేదెలను పంపిణీ చేస్తామని, ఇప్పటికే సీఎం ఈ ఫైల్‌పై సంతకం చేశారని ప్రకటించారు. రైతులకు లీటరు పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకానికి ఏడాదికి రూ. 100 కోట్లు అందిస్తున్నామని, రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపునకు రూ.50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలు.. ఈ ఏడాది 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా 22 కోట్లు, గతేడాది 51 కోట్ల చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేశామని పేర్కొన్నారు. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకంతో సత్ఫలితాలు ఇచ్చిందని, ఈ ఏడాది మరిన్ని రిజర్వాయర్లలో రొయ్యల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు, బ్లూ రెవల్యూషన్ కింద హేచరీల ఏర్పాటుకు ముందు కొచ్చే వారికి రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 మొబైల్ ఫిష్ ఔట్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పశువైద్యశాలల్లో మరమ్మతులు రాష్ట్రంలోని వివిధ పశువైద్యశాలల్లో సరైన వసతులు లేవని, మరమ్మతులు, విద్యుత్, పెయింటింగ్, ప్రహరీల పనులను పంచాయతీ రాజ్, పశుసంవర్థకశాఖ అధికారులు కలసి గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించే విధంగా త్వరలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. -
163 పాడిగేదెలకు పునర్జీవనం
సిరిసిల్ల : అదో మారుమూల పల్లె. జిల్లా సరిహద్దులోని అటవీ గ్రామం. వ్యవసాయ ఆధారమైన ఆ పల్లెకు పాడి పరిశ్రమ ఓ ఉపాధిమార్గం. వ్యవసాయ అనుబంధంగా పాలతో ఆ పల్లె ప్రజలు జీవనం సాగిస్తారు. అలాంటి ఊరిలో 178 బర్రెలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి.. 15 బర్రెలు మరణించాయి. కళ్ల ముందే గేదెలు చనిపోతుండడంతో రైతుల గుండెలు అవిసిపోయాయి. కన్నీరు మున్నీరుగా విలపించారు. మహిళా రైతులు గుండెలు బాదుకుంటూ.. రోధిస్తున్నారు. ఆ గ్రామస్తులు సెల్ఫోన్లో బర్రెల ఫొటోలు కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, పశువైద్యులకు పంపించారు. అంతే జిల్లా నలుమూలన ఉన్న పశువుల డాక్టర్లు మరిమడ్ల బాట పట్టారు. ఉన్న పళంగా అందుబాటులో ఉన్న మందులను, ప్రైవేటుగా అత్యవసరమైన మందులను కొనుగోలు చేసి మూడు అంబులెన్స్‌లు మరిమడ్ల చేరాయి. ఐదుగంటల పాటు శ్రమించారు. 163 బర్రెలను బతింకించారు. వంద మంది రైతులకు దీర్ఘకాలిక మేలు చేశారు. పాడికి ప్రాణం పోశారు. ఏం జరిగిందంటే.. మరిమడ్లలో గేదెలను ఒకరిద్దరు కాపరులు కాస్తుంటారు. బర్రెలన్నీ ఎప్పటిలాగే సమీప అడవుల్లోకి మేతకు వెళ్లాయి. పక్కనే లూటీ అయిన పొలాలున్నాయి. ఎర్రజొన్న పంటను కోశారు. పక్షంరోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు జొన్న కొయ్యలు(మోడులు) చిగురించాయి. చిగురించిన లేత జొన్న ఆకులను బర్రెలు మేశాయి. ఎక్కువగా లేత ఆకులు తినడంతో నాము వచ్చింది. దీంతో బర్రెలన్నీ సొమ్మ సిల్లాయి. అందులో 13 మరణించాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో పశువైద్యులు చేరుకుని వైద్యం చేశారు. చికిత్స పొందుతుండగానే మరో రెండు బర్రెలు మరణించాయి. ఎనిమిది కొన ఊపిరితో ఉండగా.. సెలైన్లు ఎక్కించి బతికించారు. జేసీ పర్యవేక్షణలో వైద్య సేవలు.. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా పర్యవేక్షణలో మరిమడ్లలో పశువైద్య శిబిరం సాగింది. యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది కదిలివెళ్లారు. ఐదురుగు డాక్టర్లు అంజిరెడ్డి, ప్రశాంత్, కార్తీక, సాయిమాధవి, చందన, 14 మంది పారామెడికల్ సిబ్బంది, 1962 అంబులెన్స్ సిబ్బంది, మరోవైపు కరీంనగర్ డెయిరీ డాక్టర్లు, సిబ్బంది, మందులతో అక్కడికి చేరుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై జేసీ యాస్మిన్‌బాషా సిరిసిల్ల నుంచి ఫోన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. మొత్తంగా జిల్లా పశువైద్యుల సమష్టి కృషితో 163 బర్రెలకు ఊపిరి పోశారు. పశువైద్యుల సేవలను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు శుక్రవారం అభినందించారు. వైద్యులు సకాలంలో రాకుంటే మరిన్ని చనిపోయేవని గ్రామస్తులు ఎమ్మెల్యేకు చెప్పడం కొసమెరుపు. అందరూ టీం వర్క్ చేశారు మా డాక్టర్లు అందరూ మరిమడ్లలో టీం వర్క్ చేశారు. ఎవరికి వారు బర్రెలను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. లేత జొన్న ఎక్కువగా మేయడంతో గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. రైతులు ఇంకా ముందుగా గుర్తిస్తే నష్టం జరిగేది కాదు. మేమంతా బాధ్యతగా ఎవరికి వారు పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. – డాక్టర్ కె .కొమురయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ -
మూగ’శోకం
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామ సమీపంలోని రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో పది గేదెలు దుర్మరణం చెందాయి. మృతి చెందిన వాటిలో చూడి గేదె కూడా ఒకటి ఉంది. బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో గల రైల్వేట్రాక్‌పై నుంచి 12 గేదెలు వెళ్తుండగా అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ట్రాక్‌పై నడుస్తున్న గేదెలను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో పది గేదెలు సంఘటనాస్థలంలోనే మరణించగా..మరో రెండు గేదెలు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాయి. మరణించిన గేదెలలో ఒకటి చూలుతో ఉంది. చూడి గేదె పొట్టపై నుంచి రైలుచక్రం వెళ్లడంతో పొట్టలో ఉన్న పిల్ల బయటకు వచ్చి దూరంగా పడి మణించింది. దాని పేగులు చిన్నాభిన్నమై చిందరవందరగా పడ్డాయి. హృదయ విదారకమైన ఈ సంఘటన సమాచారం తెలిసిన ఉమ్మిరి గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి వచ్చి చూసి విషయాన్ని రైల్వేపోలీసు అధికారులకు తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గేదెల యజమానులు మూగ జీవుల కళేబరాలను చూసి కంటికీమింటికీ ఏకధారగా విలపిస్తున్నారు. -
‘పాల’కూట విషం
పాడి రైతులు తమ గేదెలుఈనగానే దానికి జన్మించిన దూడకుముందుగా పాలు విడుస్తారు. ఆదూడ తాగగా.. మిగిలిన పాలనుమాత్రమే పితికి వాడుకుంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణం వల్ల దూడ చనిపోతే దాని చర్మాన్ని తీసి,అందులో గడ్డి దూర్చి తల్లి పొదుగువద్ద ఉంచుతారు. తన పొదుగు వద్దదూడే వచ్చి నిలబడిందని భ్రమించిగేదె పాలు విడుస్తుంది. ఇది 30 ఏళ్లక్రితం నాటి మాట. ఇప్పుడు పరిస్థితిమారిపోయింది. మందులురావడంతో కొందరు పాడి రైతుల్లోనిర్లక్ష్యం పెరిగింది. కర్నూలు (హాస్పిటల్) : గేదెను మచ్చిక చేసుకోవడం మాని, త్వరగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ వేస్తున్నారు. వీటి పాలు తాగిన వారు వ్యాధుల బారిన పడుతున్నారు. గేదెలు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను నిషేధించింది. అయినా జిల్లాలో వ్యాపారులు వీటిని దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు రైతులు త్వరగా పాలు పితకాలన్న ఆత్రుతతో గేదెలకు ఈ ఇంజెక్షన్లు వేస్తున్నారు. గతంలో దూడ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే.. అదీ పశువైద్యాధికారి సూచన మేరకు మాత్రమే గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అయితే.. ఇరవై ఏళ్ల నుంచి వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. జిల్లాలో 4,11,000 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 15 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. పాడి గేదెలు ఎక్కువగా ఉన్న కొందరు రైతులు, డెయిరీ కేంద్రాలు నిర్వహించే ప్రాంతాల్లో ఆక్సిటోసిన్ వినియోగం అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల, డోన్, బేతంచర్ల, ఓర్వకల్లు, బనగానపల్లి, చాగలమర్రి, ఆళ్లగడ్డ, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, శ్రీశైలం, దేవనకొండ, నందికొట్కూరు, రుద్రవరం, అవుకు, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో కొందరు పాడి రైతులు వీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాలు తాగినవారు జీర్ణకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైతులను చైతన్యపరిచి ఇంజెక్షన్ల వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. నిషేధించినా ఆగని విక్రయాలు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్‌ను మనుషులకు, పశువులకు వేర్వేరుగా వాడతారు. గర్భిణులు సుఖప్రసవం అయ్యేందుకు గాను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని నిపుణుల సలహా మేరకు వాడుతుంటారు. దీనివల్ల ప్రసవ ద్వారంలోని కండరాలు వదులుగా మారి బిడ్డ బయటకు రావడానికి సులభమవుతుంది. అలాగే గేదెలకు సేపు కోసం, పాల దిగుబడి పెంచేందుకు, ఎక్కువ కాలం పాలు ఇచ్చేందుకు వీటిని వేస్తున్నారు.ఈ ఇంజెక్షన్ వేసిన కొన్ని సెకన్లకే పొదుగులోని కండరాల్లో కదలిక వచ్చి గేదె పాలు విడుస్తుంది. సాధార ణంగా ఈత తర్వాత గేదె ఆరు నెలల పాటు పాలిస్తుంది. అదే ఈ ఇంజెక్షన్ నిరంతరం వాడటం వల్ల ఆరు నెలల తర్వాత కూడా పాలు పితుక్కునే అవకాశం ఉంది. దూడను వదిలేస్తే అది ఎక్కువగా పాలు తాగుతుందని భయపడి కొందరు రైతులు ఇంజెక్షన్లపై ఆధారపడుతున్నారు. దీనిని వాడటం వల్ల అటు గేదెలకు, ఇటు మనుషులకు వ్యాధులు వస్తాయని భావించి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే నిషేధించింది. అయినా జిల్లాలోని వ్యాపారులు దొడ్డిదారిన వీటిని తెచ్చి విక్రయిస్తున్నారు. గేదెలు అధికంగా ఉండే ప్రాంతాల్లోని కిరాణాదుకాణాలు, దాణా విక్రయ అంగళ్లు, మెడికల్‌షాపుల్లో వీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. పాతికేళ్ల క్రితం గేదెకు ఒక యాంపిల్ వేస్తే పాలు విడిచేది. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు యాంపిల్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గేదెల పునరుత్పత్తి దెబ్బతింటుంది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదె పాలు తాగడం వల్ల మనుషులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందువల్లే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మెడికల్ స్టోర్లలో అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇంజెక్షన్ వాడటం వల్ల గేదె ఆ తర్వాత ఎదకు రాదు. గర్భం దాల్చకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. లాభం కంటే నష్టమే ఎక్కువ. – డాక్టర్ అచ్చెన్న, పశువైద్యాధికారి, డోన్ -
దాచేస్తే దాగేదా..!
గో మాఫియా రూటు మార్చింది. పోలీసులు పట్టుకుని గోశాలకు అప్పగించిన పశువులు మళ్లీ దారి మళ్లాయి. ఒక ప్రజాప్రతినిధి వద్ద పీఏగా వ్యవహరిస్తున్న వ్యక్తితోపాటు ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగప్రవేశం చేసి వాటిని సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనతో ఇప్పటివరకూ బ్రోకర్లతో మాట్లాడి పశువులను దారి మళ్లించి కబేళాలకు చేరేలా చూసే గో మాఫియా రూటు మార్చినట్టు, గోప్యంగా తమ పని కానిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏజెన్సీలోని బుట్టాయగూడెం స్టేషన్ పరిధిలో ఈ నెల 11న అక్రమంగా రెండు డీసీఎం వ్యాన్లలో తెలంగాణకు రవాణా అవుతున్న 39 గేదెలను పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గేదెలను నల్లజర్ల సమీపంలోని ఆవపాడు గోశాలకు తరలించారు. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ! : స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వారి అనుచరగణం రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం. ఆయన పీఏగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి, బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగంలోకి దిగి గోశాల నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి.. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడేనికి చెందిన రైతుల పేరుతో ఆధార్ కార్డులు సమర్పించి వాటిని పెంచుకుంటామంటూ చెప్పి దారి మళ్లించినట్టు తెలుస్తోంది. 39 గేదెలు, దూడలను అప్పగించగా.. అందులో కేవలం ఆరు మాత్రమే గోశాలలో ప్రస్తుతం ఉన్నాయి. మిగిలిన వాటిని ప్రజాప్రతినిధి అనుచరులు తీసుకువెళ్లిపోయినట్టు సమాచారం. ఈ గేదెలన్నీ పాలిచ్చేవి కావడంతో వీటిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒట్టిపోయినట్టు చూపించి..! తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ పశువుల డాక్టర్లను గో మాఫియా మభ్యపెట్టి అవి ఒట్టిపోయిన గేదెలుగా నిర్ధారింపజేసి అందుకు అవసరమైన పత్రాలను సృష్టించి రవాణా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఘటనలో పోలీసులు గోశాలకు తరలించిన గేదెలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియరాలేదు. పాడిగేదెలు కావడంతో అమ్మేసుకు న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని గోప్యంగా సర్దుబాటు చేసేందుకు మరో ఎమ్మెల్యేతో కలిసి యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రూటు మార్చిన పశు మాఫియా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లకు అక్రమంగా పశువులను తరలిస్తున్న వైనంపై ఇటీవల ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో పశు మాఫియాకు అండదండలు అందించిన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సర్దుకునే యత్నంలో కొద్ది కాలం తాత్కాలికంగా రవాణాను నిలిపివేశారు. మళ్లీ రెండు నెలలుగా పశు మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మార్గాల ద్వారా పశువులను కబేళాకు తరలిస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి రోడ్డు మార్గాన కొవ్వూరుకు వచ్చిన అక్రమ పశువుల రవాణా వాహనాలు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించేవి. ‘సాక్షి’ కథనాల తర్వాత మాఫియా రూటు మార్చింది. కొవ్వూరుకు చేరిన పశువుల వాహనాలను తాళ్లపూడి, దొండపూడి, కన్నాపురం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తోంది. ఈ దారిలో తరలిస్తుండగానే పోలీసులు ఈ రెండు డీసీఎం వ్యాన్లను పట్టుకున్నారు. నోరుమెదపని పోలీసులు ఈ వ్యవహారంపై పోలీసులు నోరుమెదపడం లేదు. అక్రమంగా తరలిపోతున్న పశువులను పట్టుకుని గోశాలకు అప్పగించడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. అయితే గోశాలలపై పూర్తి దృష్టి పెట్టకపోతే అక్రమ పశురవాణాను అడ్డుకున్నా.. ఫలితం ఉండదని గుర్తించాలి. -
బర్రెల్ని పంపిణీ చేసిన సీఎం సతీమణి
నాగ్‌పూర్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పేదలకు బర్రెల్ని పంపిణీచేసి ఆదర్శంగా నిలిచారు అమృతా ఫడ్నవిస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణిగానే కాక బ్యాంకర్, సింగర్, సోషల్ వర్కర్‌గా బహుముఖ ప్రజ్ఞతో నిత్యం వార్తల్లో నిలిచే ఆమె మరోసారి తనదైన శైలిని కనబర్చారు. ‘శ్రీమంతుడు’ తరహాలో నాగ్‌పూర్ జిల్లాలోని కవ్దాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్న అమృత ఫడ్నవిస్.. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం గ్రామంలో పర్యటించారు. భర్తలను కోల్పోయిన పలువురు పేద మహిళలకు బర్రెలను పంచారు. అనంతరం నీటిశుద్ధీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వం సైతం బర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సీఎం సతీమణి పంచిన బర్రెలు ప్రభుత్వ పథకంలో భాగంగానా లేక వ్యక్తిగతంగానా అనేది తెలియాల్సిఉంది. #GandhiJayanti wishes!Gave buffaloes to widows & poor women & inauguratd drinking water plant at my adopted village Kawdas @Dev_Fadnavis 🙏🙏 pic.twitter.com/vrvGRGFIQ1 — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) 2 October 2017 -
సీఎం ఆస్తుల్లో పది ఆవులు, ఐదు దూడలు!
పట్నా: సాధారణంగా ఆవులు, గేదెల వంటి పశు పోషణ అనగానే బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తొస్తారు. కానీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చరాస్తుల్లోనూ 10 ఆవులు, 5 దూడలు ఉన్నాయి. నితీశ్, ఆయన మంత్రివర్గ సహచరులు డిసెంబర్ 31న తమ ఆస్తులను ప్రకటించారు. అందులో నితీశ్ తన వద్దనున్న ఆవులు, దూడల విలువను రూ. 1.45 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. సీఎం నితీశ్ వద్ద రూ. 56.49 లక్షల విలువ కలిగిన స్థిర, చరాస్తులున్నాయి. వాటిలో ఢిల్లీలోని రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 16.49 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. వాటిలో ఒక ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఒక హ్యుందయ్ గ్రాండ్ ఐ10 కార్లున్నాయి. అలాగే, ఆయన పేరుపై రూ. 3.79 లక్షల వాహన రుణం కూడా ఉంది. కాగా, నితీశ్ కుమారుడు నిశాంత్ వద్ద నితీశ్ కన్నా నాలుగు రెట్లు అధికంగా విలువ కలిగిన స్థిర, చరాస్తులుండటం విశేషం. ఆయన పేరుపై రూ. 2.36 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. -
విషం కలిపిన నీరు తాగి గేదెలు మృతి
ఆత్మకూర్(ఎస్) : ఆకతాయిల పనో, గిట్టనివారి పనోగాని నీటిలో విషం కలపడంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని కోటపహడ్ ఆవాసం తెట్టెకుంటతండాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భానోత్ లింగ్యా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు పశువులు నీళ్లు తాగే తొట్టెలో పురుగుల మందు కలిపారు. ఇది గమనించని లింగ్యా ఉదయం 8 గంటల సమయంలో కోడెకు నీళ్లు తాగించడంతో కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో విషపు ముట్టిందనుకొని చికిత్సనిమిత్తం కోడెను గ్రామానికి తీసుకురాగా అప్పటికే చనిపోయింది. అనంతరం కోడెను బొందపెట్టేందుకు గుంతతీసుకుంటూ ఉండడంతో ఇంట్లో వాళ్లు మేకకు, గేదెలకు నీళ్లు తాపడంతో అవికూడా వెంటనే సొమ్మసిల్లి పడిపోయాయి. దాంతో వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించడంతో చికిత్స అందిస్తుండగానే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో 2 గేదెలు, 1 కోడె, 1 మేక మృత్యువాత పడ్డాయి. విషం కలిపిన నీరు తాగడంతోనే మృత్యువాత పడ్డాయని అసిస్టెంట్ పశువైద్యాధికారి సైదులు తెలిపారు. వాటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ఈ విషయమై పలువురిపై అనుమానితులుగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు
సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్‌లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్‌లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు. ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు. -
నాన్‌వెజ్ మిల్క్!
మాంస వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలే గ్రాసం.. నగర శివారు ప్రాంతాల్లో గేదెలకు హోటల్ వ్యర్థాలు * పాడైన, మిగిలిపోయిన పదార్థాలన్నీ డ్రమ్ముల కొద్దీ చేరవేత * గడ్డి, తవుడుకు బదులు నానా చెత్తనంతా పెడుతున్న రైతులు * ‘డస్ట్‌బిన్’లుగా మారిపోతున్న గేదెల పొట్టలు * అనారోగ్యం పాలవుతున్న మూగజీవాలు * వాటి పాలు తాగిన పిల్లలకూ అనారోగ్య సమస్యలు * గడ్డి దొరక్కే హోటల్ వ్యర్థాలు పెడుతున్నామంటున్న రైతులు * మార్కెట్లోకి వచ్చి చేరుతున్న లక్షల లీటర్ల పాలు సాక్షి ప్రతినిధి: గేదెలకు మేతగా ఏమిస్తారు? ఏముంది..? పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా, తవుడు.. వగైరా అంటారా? అయితే మీరు సాంబారులో కాలేసినట్టే! పాడైపోయిన కూరలు, కుళ్లిపోయిన కూరగాయలు, కంపుకొట్టే మాంస వ్యర్థాలు, సాంబారు.. ఒక్కటేమిటీ హోటళ్లలో మిగిలిపోయే నానా చెత్తాచెదారమంతా గేదెలకు పెడుతున్నారు!! హోటళ్లలో మిగిలిపోయే ఈ వ్యర్థాలన్నీ నేరుగా మూగజీవాల పొట్టలోకి వెళ్తున్నాయి. డ్రమ్ముల కొద్దీ నిల్వ చేసిన ఈ పాడైపోయిన ఆహార పదార్థాలను ఏజెంట్లు హోటళ్ల నుంచి కొనుగోలు చేసి రైతులకు అమ్ముతున్నారు. ఆకలితో ఉన్న గేదెలకు ఈ మురిగిపోయిన వంటకాలే మహాప్రసాదమవుతున్నాయి. దీంతో తవుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డితో నిండాల్సిన గేదెల పొట్టలు కాస్త ‘డస్ట్‌బిన్’ లుగా మారిపోతున్నాయి! హైదరాబాద్ శివారుల్లోని వందల సంఖ్యలో రైతులు కొన్ని వేల గేదెలకు ఇలాంటి తిండే ఇస్తూ లక్షల లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. లక్షలు ఏజెంట్లకు.. శిక్షలు పశువులకి హైదరాబాద్ నగరంలోని దాదాపు వందకు పైగా హోటళ్లలోని చెత్తాచెదారం రోజూ నగరం, నగరం చుట్టపక్కల పాడి రైతులకు చేరుతోంది. మల్కాజిగిరి, కూకట్పల్లి, బోయిన్పల్లి, కీసర, తూప్రాన్, యాప్రాల్ ప్రాంతాల్లోని రైతులకు ప్రతి రోజు క్రమం తప్పకుండా తరలిపోతుంది. హోటళ్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు పాడైపోయిన కూరగాయలు, మాంసం శుభ్రం చేసే సమయంలో వచ్చే చెత్త, భోజనాల తర్వాత పళ్లాల్లో మిగిలిపోయిన వాటిని డ్రమ్ముల్లో నిల్వ చేస్తున్నారు. ఈ చెత్తనంతా ఏజెంట్లకు అమ్ముతున్నారు. హోటళ్ల నుంచి ఈ చెత్తతో వ్యాపారం చేస్తున్న దళారీలు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి పరిసరాల్లోని హోటల్ వేస్ట్‌ని తరలించే శివ అనే దళారీ రోజూ పది డ్రమ్ముల వ్యర్థాలను రైతులకు అమ్ముతున్నాడు. ఒక్కో డ్రమ్ము ధర రూ.500. ఈ లెక్కన నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు. యాప్రాల్ ప్రాంతంలో అంజిరెడ్డి అనే దళారీ రోజుకు 25 డ్రమ్ముల వ్యర్థాలను అమ్ముతున్నాడు. ఇతడికి సొంతంగా రెండు వ్యాన్లు, ఇద్దరు కూలీలు ఉన్నారు. ఆ ప్రాంతంలోని 14 మంది రైతులకు హోటల్ వ్యర్థాలను అమ్ముతున్నాడు. వారి నుంచి నెలకోసారి బిల్లు తీసుకుంటున్నాడు. కడుపు నిండా జబ్బులే... తొలుత ఈ వ్యర్థాల వాసన గిట్టని గేదెలకు వాటిని అలవాటు చేసేందుకు మొదట్లో కొద్దిగా కొబ్బరి పిండి, తవుడు కలిపి ఇస్తున్నారు. పాడైపోయిన పదార్థాలు, మురిగిపోయిన మాంసాహారం తినడం వల్ల గేదెలకు కడుపు ఉబ్బరంతోపాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నిల్వ ఆహారం ఏజెంట్ తీసుకొచ్చిన రోజే కాకుండా.. రెండో రోజు కూడా అందిస్తున్నారు. దీంతో ఆ ఆహారం మరింత కుళ్లి దుర్వాసన వస్తుంది. వాటిని తిని గేదె అస్వస్థతకు గురైతే రైతుల దగ్గర మందులు కూడా ఎప్పుడూ నిల్వ ఉండడం గమనార్హం. యాప్రాల్ సమీపంలో ఒక గ్రామానికి చెందిన పాడి రైతు మాట్లాడుతూ.. ‘‘నెలొచ్చేసరికి డాక్టరుకు రూ.15 వేలు అవుతోంది. ఎనకటి లెక్క పశువులకు రెండు పూటలా గడ్డి ఏసే పరిస్థితి లేదు. ఎండుగడ్డి కట్ట రూ.100 అయింది. అగో చూస్తున్నరు కదా ఆ గడ్డి కుప్ప ఎంతుంది..? ట్రాక్టరు కూడా లేదు. కానీ రూ.30 వేలు. ఆ గడ్డి మా బర్రెలకు పది రోజులు కూడా రాదు. ఇగో ఈ హోటల్ ఫుడ్డే మాకు దిక్కు. రోజూ రెండు డ్రమ్ములు కొంటం. దాంతోనే వాటి కడుపు నింపుతున్నం. బాగానే ఉంది కానీ.. వాటికి రోగాలు ఎక్కువైతున్నయి. ఈ ఫుడ్ల కారం, మసాలా, కక్క, ముక్క.. అన్నీ ఉంటయి కదా! వాటికి తొందరగ అరగవు. అందుకే ఊకే కడుపు ఉబ్బడం, గ్యాస్ పట్టడం వంటివి వస్తాయి. వారం వారం డాక్టర్ని తోల్కొచ్చి సూదులిప్పిస్తం. వచ్చినప్పుడల్లా మందులకు కాకుండా అన్ని బర్రెలను చూసినందుకు ఫీజే వెయ్యి రూపాయలు తీసుకుంటడు’’ అని వివరించారు. గడ్డి లేకే పెడుతున్నం ఈ హోటల్ ఫుడ్డు లేకపోతే ఎప్పుడో పాడి వ్యాపారానికి దణ్ణం పెట్టేవాళ్లం అని తూప్రాన్ పరిసరాల్లోని పాడి రైతులు పేర్కొన్నారు. పచ్చిగడ్డి చూడ్డానికి కూడా కనిపించడం లేదు.. ఎండుగడ్డి కొనే స్థోమత లేదు అని వారు చెబుతున్నారు. ‘‘అరె బర్రెలకు తాపనీకి నీళ్లే దొరకతలేవు. వెయ్యి, పదిహేనొందలు పెట్టి ట్యాంకరు కొనుక్కుంటున్నం. ఇక మా బర్రెలకు పచ్చిగడ్డి ఎట్లుంటదో కూడా తెల్వదు. వానాకాలం ధర తగ్గినప్పుడు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి కొంటం. చానా వరకు మేం బర్రెలను ఆంధ్రాకు వెళ్లి తెచ్చుకుంటం. వాటికి రాగానే ఈ ఫుడ్ పెడితే ముట్టవు. కొన్ని రోజులు ఒక పూట గడ్డి, ఒక పూట ఈ సాంబారు పెడతం. అలవాటు కావడానికి ఇందులో కొంత కొబ్బరిపిండి వంటివి కలుపుతం. తర్వాత మెల్లగా గడ్డి బంజేసి మొత్తానికి ఇదే పెడ్తం’’ అని వారి ఆయన వివరించాడు. వ్యర్థాలను ఎలా తీసుకెళ్తున్నారు? ఈ హోటల్ వ్యర్థాలను తరలించడానికి ఏజెంట్లకు అనుమతి ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం వింటే అవాక్కవ్వాల్సిందే. పందులకు మేతగా వేసేందుకని అనుమతి తీసుకున్న ప్రబుద్ధులు.. వాటిని పాడి రైతులకు చేరవేస్తున్నారు. పదేళ్ల క్రితమే ఈ ఆహారాన్ని పాడి పశువులకు రుచి చూపించారు. మొదట్లో సాంబారు, ఇడ్లీలు మాత్రమే తెచ్చేవారు. క్రమంగా మిగిలిన పదార్థాలన్నీ కలపడం మొదలుపెట్టారు. అప్పటికే గడ్డిని పక్కన పెట్టడంతో రైతులు ఈ ఆహారాన్ని వద్దనలేకపోయారు. దీనికి తోడు పశుగ్రాసం కరువవడం.. తక్కువ ధరకు దొరకడంతో కుళ్లిన ఆహారాన్నే పశువులకు అలవాటు చేశారు. ముక్కు మూసుకొని పెడతాం.. ‘‘ఈ ఫుడ్ మస్తు కంపులేస్తది. ఆ పది నిమిషాలు ముక్కు మూసుకుని నీళ్లు కలిపి బర్రెలకు పెడతాం. రోజూ రెండు పూటలా అవి బాగా ఆకలిగా న్నప్పుడు పెడతం. ఏం జేస్తయి సచ్చినట్టు తాగుతయి. మాకు 10 నిమిషాలళ్ల పనైపోతుంది. గడ్డి కోసుడు, ఏసుడు ఏముండదు’’ - కీసర ప్రాంతంలో ఓ పాడిరైతు వద్ద పనిచేసే కూలీ. లేత గోధుమ రంగులో పాలు హోటల్ వ్యర్థాలు తిన్న పశువులు ఇచ్చే పాలు తాగిన పసి పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఈ పాలు తెల్లగా కాకుండా లేత గోధుమ రంగులో ఉంటాయి. వాటిని మరిగించినపుడు మీగడపై నూనె వంటి పదార్థం తెట్టులా పేరుకుటుంది. పాల వాసన కూడా మామూలువాటిలా ఉండదు. శివారులోని నాగారంలో ఒక కాలనీవాసులు ఈ పాలనే కొనుక్కుంటున్నారు. అక్కడ ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘ఈ పాలు పిల్లలకు అరగవు. నెలల పిల్లలైతే ముట్టను కూడ ముట్టరు. అదే గడ్డి తినే బర్రెల పాలు మంచిగ తాగుతరు. అందుకే మా బాబు కోసం పావు లీటరు ప్యాకెట్ పాలు కొంటం. మా కోసం ఈ సాంబారు పాలే తీసుకుంటం’’ అని వివరించింది. ఇది క్షమించరాని నేరం.. పులి గడ్డి తినదన్నది ఎంత సత్యమో.. గేదెలు మాంసం తినవన్నదీ అంతే వాస్తవం. డబ్బుల కోసం మిగిలిపోయిన చికెన్ బిర్యానీలను సైతం పశువుల నోట్లో కూరడం క్షమించరాని నేరం. మొదట్లో సాంబారు అనేవారు. ఇప్పుడంతా డ్రై ఫుడ్డే సరఫరా చేస్తున్నారు. పశువులకు పొద్దున్నుంచి గడ్డి, నీరు పెట్టకుండా ఈ ఫుడ్‌లో నీళ్లు కలిపి వాటి ముందు పెడతారు. ఇది తిన్నప్పుడు గేదెలు నరకం అనుభవిస్తాయి. కడుపు మంట, ఉబ్బరం వంటి జబ్బులతో ఇబ్బంది పడతాయి. వాటి ఆయుఃప్రమాణం కూడా తగ్గిపోతుంది’’ - మురళీధర్‌రెడ్డి, వెటర్నరీ డాక్టర్ ఆ పాలు పిల్లలకు, గర్భిణిలకు ప్రమాదం.. ఈ మధ్య కాలంలో ‘మా బాబుకి పాలు పడడం లేదు’ అంటూ చాలామంది తల్లిదండ్రులు మా వద్దకు వస్తున్నారు. పాలు అరగడం లేదని, తాగగానే వాంతులు చేసుకుంటున్నారని, విరేచనాలు పట్టుకున్నాయని చెబుతున్నారు. కారణం.. పిల్లల ఆరోగ్యం కాదు.. పాలు స్వచ్ఛంగా లేకపోవడం. ఆహారంలో పాలది ముఖ్య పాత్ర. పసి పిల్లలకు కాల్షియం కేవలం పాల ద్వారానే వస్తుంది. గేదెలకు కుళ్లిపోయిన ఆహారం పెట్టడంతో దాని ప్రభావం పాలపైనా ఉంటుంది. గేదెల జీర్ణశక్తి దెబ్బడనంతోపాటు ఆ పాలు తాగిన పిల్లల జీర్ణక్రియపైనా ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు ఇలాంటి పాలను పిల్లలకు వాడకపోవడం ఉత్తమం. ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణిలు తీసుకోకూడదు. - సుజాత స్టీఫెన్, న్యూట్రీషియనిస్ట్, హైదరాబాద్ -
ఎమ్మెల్యే గేదెలు ఎత్తుకెళ్లి లక్షకు అమ్మి..
రాయ్ బరేలీ: ఏకంగా ఓ దొంగ ఎమ్మెల్యే గేదెలను ఎత్తుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేసుకున్నాడు. ఆ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని మూడు నెలల తర్వాత అరెస్టు చేశారు. ఆ దొంగ మూడు నెలలకిందట మొత్తం తొమ్మిది గేదెలను దొంగిలించాడని అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పుడు చిక్కాడని పోలీసులు తెలిపారు. గత జూన్ 22 అర్ధరాత్రి సమయంలో ధర్మపాల్ సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన గేదెలను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో ఆ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతానికి చెందిన మొత్తం అధికార యంత్రాంగం కదిలింది. ఎట్టకేలకు మూడు నెలలపాటు దొంగ కోసం గాలింపులు చేపట్టి సిరౌలి అనే ప్రాంతంలో అక్రం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రాంపూర్ జిల్లాలో మొత్తం గేదెలను మాంసం విక్రయదారులకు రూ.లక్షకు అమ్మేసినట్లు చెప్పారు. -
పశువులు పస్తులేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితు కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. వర్షాల్లేక పచ్చిగడ్డి, వరి సాగు లేక ఎండుగడ్డి దొరకడం గగనంగా మారింది. వచ్చే వేసవిలో మూగజీవాలకు మేత దొరకడం కష్టం కానుంది. జిల్లాలో గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి 10లక్షలకు పైగా ఉన్నాయి. ఎక్కువగా పత్తి, సోయాబీన్, ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. ధాన్యం దిగుబడి అనంతరం ఎండుగడ్డి పశువులకు మేతగా ఉపయోగపడేది. కానీ తగ్గిన వర్షాల కారణంగా జిల్లాలో 60వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా.. 20వేల ఎక్టార్లకు పడిపోయింది. దీంతో ఎండాకాలంలో ఎండుగడ్డి దొరకలేని పరిస్థితి ఏర్పడనుంది. గడ్డి విత్తనాలు పశుసంవర్ధక శాఖ పంపిణీ చేసినా కరెంటు కోతల కారణంగా సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. నీటి సదుపాయం ఉన్న కొంతమంది రైతులు విత్తనాలు తీసుకెళ్లినా తీవ్రమైన కరెంటు కోతల కారణంగా విత్తుకున్నా గడ్డిని వృథాగా వదిలేశారు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఏటా జనవరి మాసం పూర్తయ్యే సరికి పశువులకు మేత కరువు ఉండేది కాదు. ప్రస్తుతం నవంబర్లోనే కనుచూపు మేరలో పచ్చగడ్డి కనిపించడం లేదు. వాణిజ్య పంటల సాగుకే ప్రాధన్యం.. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా కురవడంతో వరి, జొన్న, మొక్కజొన్న సాగుకు ఎక్కువగా నీటి అవసరం ఉన్నందునా వర్షాలు లేక ఎక్కువగా వేసుకోలేదు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. తగ్గిన వర్షాల కారణంగా పత్తి, సోయా, కంది పంటలు వేసుకున్నారు. ఈ పంటల దిగుబడి అనంతరం ఎండుగడ్డిగా కూడా పశువులకు ఉపయోగకరంగా ఉండదు. అరకొరగా గడ్డి విత్తనాలు రైతులు పశువుల పెంపకానికి 75 శాతం రాయితీపై మేలు రకపు గడ్డి విత్తనాలు అందజేస్తున్నారు. గడ్డి విత్తనాల పెంపకంపై అవగహన కల్పించి పశు సంతతిని కాపాడుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని మండలాల్లో పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. తూర్పు ప్రాంతాంలో విత్తన పంపిణీ ఊసే లేకుండా పోయింది. అవగాహన కరువు.. ప్రభుత్వ పథకాలపై పాడి రైతులుకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. పశుగ్రాసం కోసం రబీలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు గడ్డి విత్తనాలు రాయితీపై అందించాలి. దీనిపై గ్రామాల వారీగా ప్రచారం చేయకపోవడంతో రైతులు పశుగ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నా అవి ఎవరికి చేరుతున్నాయో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పశుసంపద అభివృద్ధి దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గడ్డి విత్తనాల పంపిణీపై అంతగా అవగాహన ఉండడం లేదు. మార్చి తర్వాతే కష్టాలు.. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంటలు చేతికొస్తాయి. ఈ దశలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఉండవు. మార్చి తర్వాత సమస్య మొదలయ్యేది. కానీ ఈ ఏడాది డిసెంబర్‌కు ముందే పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండుగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్, మే,జూన్ వరకు పశుగ్రాసం దొరకక మూగజీవులు అల్లాడాల్సిందే. మేకలు, గొర్రెలు పెంపకందారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటిని మేపేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలను కాపాడుకునే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పాడి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సైతం వంద శాత ం రాయితీపై గడ్డివిత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో నీటితొట్టెలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. -
బీ(ధీ)మా లేక బిక్కుబిక్కు!
ప్రమాదంలో పశువులు మృత్యువాతపడితే రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన బీమా పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. గడువు ముగిసి నెలరోజులు గడిచినా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంపై పశుపోషకులు, అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగి జీవాలు మరణిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవులు, గేదెలు, గొర్ల కోసం బీమా పథకం ప్రవేశపెట్టింది. మూగజీవాలు మృతి చెందితే ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం గత సంవత్సరం న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అక్టోబర్ 18 నుంచి నవంబర్ వరకు ప్రీమియం కట్టుకునేం దుకు గడువు విధించారు. దీంతో జిల్లా వ్యాప్తం గా 4,626 మంది రైతులు బీమా డబ్బులు చెల్లించగా, సిద్దిపేట డివిజన్లో 1,650 మూగజీవాలకు రైతులు ఇన్సూరెన్స్ చేయించారు. రైతు ఒక్కో గేదెకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు రూ.10 నుంచి రూ.30 వేల వ రకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిం చారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న పశువులను వెటర్నరీ వైద్యులు పరీక్షించిన అనంతరం సర్టిఫైడ్ చేసిన తర్వాత పశువులకు పోగులు వేసి వాటిని ఫొటోలను బీమా కంపెనీ వారికి అందజేస్తారు. ఒక్క గేదె లేదా ఆవుకు ప్రీమియం కట్టుకుంటే రూ.50 వేలు, రెండు కంటే ఎక్కువ పశువులకు బీమా కట్టి అవి చనిపోతే రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ఇదే కాకుం డా పశువులకు బీమా చేయించిన ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి కూడా బీమా వర్తించేది. దీంతో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందేది. పట్టించుకోని ప్రభుత్వం... బీమా గడువు అక్టోబర్ నెలతో ముగిసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధివిధానాలు ప్రకటించలేదు. జిల్లా వ్యాప్తంగా అందరు రైతులు తమ పశువులకు సంవత్సరం వరకే బీమా చేయించి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల బీమా ముగిసిన 15 రోజుల వరకు గ్రేస్ పీరి యడ్ ఉంటుంది. ఇది కూడా ముగి యడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సీజన ల్ వ్యాధులు ప్రబలడంతో పాటు చాల చోట్ల ఎన్నో మూగజీవాలు ప్రమాదవశా త్తు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యం లో అక్టోబర్ మాసంలోనే ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకటించకపోవడంతో రైతులకు నష్టం జరిగే అవకాశముంది. అధికారులు స్పందించి ఇన్సూరెన్స్ మార్గదర్శకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
‘మమ్మల్నీ బతకనీయండి!’
సంతనూతలపాడు, (ఫొటోలు- ఎం.ప్రసాద్): గ్రామసీమల్లో పాడి ఉన్న కుటుంబాలకు ప్రత్యేక గౌరవం. ఆ ఇంట సిరులు పండుతాయని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. వ్యవసాయం కలిసిరాకున్నా రెండు మూడు గేదెలు పెంచుతూ వచ్చే ఆదాయంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేవి. వేకువనే లేచి వాటికి దాణా కలిపి.. పాలు పితికి, తర్వాత మైదానాల్లోకి తోలుకుపోయి పచ్చగ్రాసం మేత గా వేసేవారు. అక్కడే చెరువుల్లో దించి శుభ్రంగా తోమి తిరిగి సాయంత్రం పాలు సేకరిస్తూ.. వాటిని కంటికి రెప్పలా కాపాడేవారు. పల్లెల్లో పచ్చని బైళ్లున్నంతకాలం.. వర్షాలు సమృద్ధిగా కురిసినంతకాలం పాల సేకరణతో జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యాయి. కరువు కోరలు చాచింది. ఎండు గడ్డికీ దిక్కులేదు. దాణా ధరలు అందనంత ఎత్తుకు పెరిగాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గేదెలకు కనీసం తాగు నీరు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి వాతావరణంలో పశుపోషకులు తల్లడిల్లిపోక ఏం చేయగలరు? ఇల్లు గడవడమే గగనమైతే.. ఇక గేదెలను ఎలా పోషించగలరు? సరైన ఆహారం లేకుంటే గేదెలు పాలివ్వవు.. అలాంటప్పుడు వాటిని మేపి ఉపయోగం ఏంటి? అందుకే వాటిని సంతలో తెగనమ్ముకుంటున్నారు. -
పశువులు భద్రం
లక్సెట్టిపేట : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు సీజనల్‌గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సులభమని లక్సెట్టిపే పశు వైద్యాధికారి వీరయ్య వివరించారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పసక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధులు.. నివారణ.. గొంతు వాపు వ్యాధి : ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు వస్తాయి. నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. ఇతర పశువుల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి. గాలి కుంటు వ్యాధి : ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారడం జరుగుతుంది. నివారణ : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. దీనితో గాలికుంటు వ్యాధులను నివారించవచ్చు. గొర్రెలలో నీలినాలుక వ్యాధి : గ్రామాల్లో చాలామంది గొర్రెలను మేపుతూ వాటిపైనే జీవనోపాధి పొందుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చాలా ముఖ్యమైన వ్యాధి నీలినాలుక వ్యాధి. దీనినె మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి దోమకాటు వలన వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె మేత వేయడం మానేస్తాయి. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. నాలుక వాచి నీలి రంగుగా మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి. నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి. -
పాల దిగుబడి పెరగాలంటే...
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా) : పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరిగడ్డితో పాటు సమీకృత దాణానూ ఇవ్వాలి. అప్పుడే దేశవాళీ గేదెల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి.సత్యప్రసాద్. ఆ వివరాలు... దాణా ఎలా ఉండాలి? పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి. ఎంత ఇవ్వాలి? సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి. తాజాగా ఉండాలి పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యం గా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దానిని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరుశనగ, సోయా పిండ్లు బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్ అనే విష పదార్థం చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరి చి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది. పత్తి పిండిని మరీ ఎక్కువగా... అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్ ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్ అందుతుంది. ఇలా చేయండి 100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ/తెలగ/పత్తి/కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు/శనగపొట్టు/కందిపొట్టు/కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దృష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకృత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.