విక్టోరియా రాణి కంటే నా గేదెలే గొప్పవి: ఆజమ్
విక్టోరియా రాణి కంటే నా గేదెలే గొప్పవి: ఆజమ్
Published Wed, Feb 5 2014 1:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
లక్నో: గేదేల అపహరణ సంఘటన ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజమ్ ఖాన్ ను గందరగోళంలో పడేసింది. గేదెల అపహరణ సంఘటనపై మీడియా కవరేజి మరింత ఇబ్బందిని సృష్టిస్తోంది. ఓ దశలో సహనం కోల్పోయిన మంత్రి తన గేదేలు బ్రిటన్ రాణి విక్టోరియా కంటే గొప్ప అని వ్యాఖ్యలు చేశారు. నా గేదేలు నాకు అదృష్టం అని భావిస్తాను అని మీడియాకు తెలిపారు.
ఏ చానెల్ చూసినా.. గేదేలతోపాటు తలపై పేడ మోస్తున్నట్టు ప్రసారమవుతున్నాయి అని ఆజమ్ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. ఫిబ్రవరి 1 తేదిన తన ఫామ్ హౌజ్ నుంచి గేదేలు కనిపించకుండా పోవడంతో డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్, ఇతర పోలీసు అధికారులకు వెతికే కార్యక్రమాన్ని అప్పగించడం వివాదస్పదంగా మారింది.
రెండు రోజుల తర్వాత గేదేల ఆచూకీ లభ్యమైనా.. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ సబ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
Advertisement
Advertisement