Azam Khan
-
‘నా కుమారుడికి అవకాశాలు ఇవ్వలేదు.. నాశనం చేశారు’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్ కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.రాణించని ఆజం ఖాన్కాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆజం ఖాన్‌కు చోటు దక్కింది.ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆజం ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు.. కనీసం సూపర్-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.బాడీ షేమింగ్.. విమర్శలుఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్‌ను బాడీ షేమింగ్ చేశారు చాలా మంది. మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్ ఖాన్ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?‘‘వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లన్నీ నేను చూశాను. వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఆజం ఖాన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్-2022 సమయంలో రమీజ్ రాజా నా కుమారుడు ఆజం ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాడు.సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్ ఖాన్ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్ -
పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. మిడిలార్డర్లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.గ్రూప్-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ ఆజం బృందం సూపర్-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాబర్ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ పాక్ మిడిలార్డర్ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లే లేరు.గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.అందరూ టాపార్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్లు సాధించిన పరుగులు👉ఫఖర్ జమాన్- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).👉ఇఫ్తికార్ అహ్మద్- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).👉ఆజం ఖాన్- అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).👉షాదాబ్ ఖాన్- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి! -
అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ యువ క్రికెటర్ ఆజం ఖాన్‌ను ఉద్దేశించి మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఫిట్‌నెస్‌పై ఏమాత్రం ఆసక్తి లేదని.. ఆజం ఖాన్‌ను మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాడు.లావుగా ఉండటం సమస్య కాదని.. కానీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ లేకపోవడమే అసలైన సమస్య అని ఆజం ఖాన్‌ను హఫీజ్ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ మెయిన్ ఖాన్ కుమారుడైన ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.పూర్తిగా విఫలంకుడిచేతి వాటం కలిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు అడపాదడపా పాక్ జట్టులో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ పూర్తిగా విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 11 పరుగులే చేయడంతో పాటు.. వికెట్ కీపర్‌గానూ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ చేసి పాక్ పరాజయాలకు పరోక్ష కారకుడయ్యాడు. ఫలితంగా ఆజం ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ఆరంభ మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు కల్పించింది. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆజం ఖాన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లలో అతడిని పక్కనపెట్టింది యాజమాన్యం. లావుగా ఉండటం సమస్య కాదుఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్, పాక్ జట్టు మాజీ డైరెక్టర్ హఫీజ్ ఖాన్ ఆజం ఖాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లంతా పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు నడిస్తే.. ఆజం ఖాన్ మాత్రం అందుకోసం 20 నిమిషాల సమయం తీసుకుంటాడు.నిజానికి అతడు అంతర్జాతీయ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం విషాదకరం. సన్నగా.. లేదంటే లావుగా ఉండటం అనేది నా దృష్టిలో అసలు సమస్యే కాదు.అయితే, ఆటకు తగ్గట్లుగా మన శరీరాన్ని మలచుకోవడం ముఖ్యం. నిర్దేశిత ఫిట్నెస్ లెవల్స్ సాధించాల్సి ఉంటుంది. గతంలో మేము అతడికి ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చాం.టాలెంట్ ఉంటే సరిపోదుకానీ ఆజం ఖాన్ ఏమాత్రం మెరుగుపడలేదు. టాలెంట్ ఉంది కాబట్టి జట్టులో అవకాశాలు రావచ్చు. అలాంటపుడు ఫిట్నెస్ కాపాడుకుంటే మంచిది కదా.జట్టులో అతడు తప్ప ఎవరూ ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కారు’’ అంటూ ఆజం ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మహ్మద్ హఫీజ్. ఇదిలా ఉంటే ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కావడం దాదాపుగా ఖరారైపోయింది. కాగా.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన ఆజం ఖాన్.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: T20 WC AFG Vs PNG: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్ -
ఆజం ఖాన్‌పై భారీ ట్రోలింగ్.. పాక్ ఆటగాడి కీలక నిర్ణయం
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కడమే అతడికి ఒక రకంగా శాపంగా మారింది. ప్రతిభ లేకున్నా కేవలం ‘బంధుప్రీతి’ కారణంగా ఆజం ఖాన్‌ను సెలక్ట్ చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అదే విధంగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చెత్త ప్రదర్శన నమోదు చేయడంతో అతడిపై ట్రోలింగ్ తారస్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు’’ అంటూ ఆజం ఖాన్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.మరికొంత మందైతే ఆజం ఖాన్ ఆకారాన్ని గేలి చేస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఫిట్నెస్ లేకున్నా ఇలాంటి వాళ్లను ప్రపంచకప్ జట్టుకు ఎలా ఎంపిక చేస్తారంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శల దాడికి దిగుతున్నారు.ఇలా తనను ఉద్దేశించి.. సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ రావడంతో ఆజం ఖాన్ మానసిక వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన పోస్టులన్నింటీని అతడు డిలీట్ చేసేశాడు. ఇందుకు సంబంధించి తన ఫాలోవర్ల(రెండు లక్షలకు పైగా)కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా ఇన్‌స్టా నుంచి మాయమైపోయాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలం కాగా మెగా టోర్నీకి ముందు తన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఆజం ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే.రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగతా రెండింటిలో ఆతిథ్య ఇంగ్లండ్ పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు.మాజీ కెప్టెన్ కుమారుడురెండో టీ20లో 11 పరుగులు మాత్రమే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా.. వికెట్ కీపర్‌గానూ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ చేసి పరోక్షంగా పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజం ఖాన్.కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు 25 ఏళ్ల ఆజం ఖాన్. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.Azam khan deleted all his Instagram posts after massive criticism 💔 pic.twitter.com/vXG6Cx34Vw— The Einsteins (@theeinsteinss) June 3, 2024 -
అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు: పాక్ ఆటగాడిపై విమర్శలు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్ బృందంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.పూర్తిగా విఫలంఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో డకౌట్ అయ్యాడు.ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్‌వుడ్ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 135.38.అయితే, వరల్డ్‌కప్-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్ఇక ఈ సిరీస్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్‌పై పడింది. వికెట్ కీపర్‌గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆజం ఖాన్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్‌కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజం ఖాన్!!చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుAzam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf— yang goi (@GongR1ght) May 30, 2024Azam Khan is the best example of nepotism in our country. Mediocrity rules here in every department. Shameless people who persisted with him must be charged and sentenced. This is a criminal act not a simple mistake.— Mubasher Lucman (@mubasherlucman) May 30, 2024WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024 -
మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాక్ బ్యాటర్ ఆజమ్ ఖాన్‌కు ఓ భయానక అనుభవం ఎదురైంది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిప్పులు చెరిగే వేగంతో ముఖంపైకి దూసుకొచ్చిన బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్ వికెట్ సమర్పించుకున్నాడు.ఆజమ్ అదృష్టం కొద్ది బంతి గ్లవ్స్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒకవేళ బంతి ఆజమ్ ఖాన్ శరీరం లేదా తలకు తాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆజమ్ ఔటయ్యాక కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. అంతలా రాకాసి బౌన్సర్ అతన్ని బయపెట్టింది. పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. వుడ్ రాకాసి బౌన్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం!?
న్యూజిలాండ్‌తో తొలి టీ20కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర కీపర్-బ్యాటర్ ఆజం ఖాన్ గాయం కారణంగా తొలి టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్తాన్-కివీస్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో బుధవారం నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్న ఆజం మోకాలికి గాయమైంది. మెకాలికి బంతి బలంగా తాకడంతో ఆజం తీవ్రమైన నోప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని తొలి టీ20కు పక్కన పెట్టాలని పాక్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఆజం ఖాన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కాకుల్ ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఆజం ఖాన్ తీవ్రంగా శ్రమించాడు. అతడితో పాటు జట్టు మొత్తం 11-రోజుల ఫిట్నెస్ క్యాంప్‌లో పాల్గోంది. కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు ఐదు టీ20లు ఆడనున్నాయి. అయితే పాక్ పర్యటనకు కివీస్ క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్-2024 సీజన్లో బీజీబీజీగా ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆజంఖాన్ కంచుకోటను అఖిలేష్ కాపాడతారా?
ఉత్తరప్రదేశ్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్‌కు కంచుకోటగా ఉన్న రాంపూర్‌పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం. అఖిలేష్ రామ్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్‌కు, రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు అవకాశం కల్పించారు. -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు
రాంపూర్: 2019 నాటి రెచ్చగొట్టే ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్(74)కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి శోభిత్ బన్సల్ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ మిలక్ కొత్వాలీ ప్రాంతం ఖటనగరియా గ్రామంలో బహిరంగ సభలో చేసిన విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసింది. పలు కేసుల్లో దోషిగా ఉన్న ఆజంఖాన్ 27 నెలల పాటు జైలులో ఉన్నారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు భారీ ఊరట
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్‌వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు. అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది. కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్‌పై రాంపూర్‌లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్‌ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్‌పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది. చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం -
ఆఫ్గన్ ఆటగాడిపై గుడ్లు ఉరిమి చూశాడు.. ఎవరీ క్రికెటర్?
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి టి20 పాకిస్తాన్ గెలిచినప్పటికి తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన ఆఫ్గన్ తొలిసారి పాక్‌పై సిరీస్ విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఆఫ్గన్ విజయంలో సీనియర్ ఆటగాడు మహ్మద్ నబీ కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే మూడో టి20 సందర్భంగా మహ్మద్ నబీని పాకిస్తాన్ క్రికెటర ఒకరు గుడ్డు ఉరిమి చూశాడు. అతని చూపు చూస్తే.. కోపంతో రగిలిపోతూ అవకాశం వస్తే తినేస్తా అన్నట్లుగా ఉంది. మరి ఇంతకీ నబీవైపు కోపంగా చూసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. అజమ్ ఖాన్. సొంత క్రికెటర్ల చేత బాడీ షేమింగ్ అవమానాలు ఎదుర్కొన్నది ఇతనే. అంతేకాదు మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కొడుకు కూడా. జట్టుతో పాటే ఉన్నప్పటికి ఆఫ్గన్‌తో టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయితే రెండో టి20లో మాత్రం రెగ్యులర్ కీపర్ మహ్మద్ హారిస్ స్థానంలో అజమ్ ఖాన్ కొంతసేపు వికెట్ కీపింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో నబీ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా నబీవైపు అజమ్ ఖాన్ కోపంగా చూడడం గమనించిన కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. కాగా అజమ్ ఖాన్ పాకిస్తాన్ తరపున మూడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక సోమవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. pic.twitter.com/knDEtRhZDb — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2023 చదవండి: 'నా దృష్టిలో కోహ్లినే బెటర్.. ఎందుకంటే?' చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే -
Disqualification: చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌కి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్లో ఆయన సభ్యత్వంపై వేటు పడింది. అయితే సూరత్ కోర్టు తాజా తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు 30 రోజుల గడువు ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా మళ్లీ రాహుల్ అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. అలా జైలు శిక్షపడి రాహుల్ గాంధీలా చట్ట సభ సభ్యుత్వాన్ని కోల్పోయిన నేతలు అనేకమంది ఉన్నారు. ఇలా గతంలో తమ సభ్యుత్వాన్ని కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లోక్ సభకు అనర్హుడయ్యాడు. ఐతే చట్టసభ సభ్యులను అనర్హత నుంచి రక్షించే నిబంధనను 2013లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత లోక్‌సభ నుంచి మొదటి అనర్హత అతనిది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. జే జయలలిత: 2014లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడిన మొదటి సీఎంగా నిలిచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. రషీద్ మసూద్: 2013లో, ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు. ఆజం ఖాన్: అక్టోబర్ 2022లో, 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు యుపి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.ఆ తర్వాత ఆయన్నురాష్ట్ర అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించి..ఎన్నికల సంఘం (ఈసీ) రాంపూర్ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అబ్దుల్లా ఆజం ఖాన్: ఫిబ్రవరి 2023లో, ఆజం ఖాన్ కుమారుడు రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి అనర్హుడయ్యాడు, కోర్టు అతనికి రెండు రోజుల శిక్ష విధించిన తర్వాత మొరాదాబాద్‌లోని ఛజ్‌లెట్ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన 15 ఏళ్ల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అదీగాక అంతకుముందు వయసు సంబంధించిన సర్టిఫికేట్ ఫోర్జరీ కేసులో కూడా రాంపూర్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. దీంతో ఫిబ్రవరి 2020లో ఆయనపై మరోసారి అనర్హత వేటు పడింది. అనిల్ కుమార్ సాహ్ని: ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022 అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. విక్రమ్ సింగ్ సైనీ: 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్టోబర్ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు అనర్హుడయ్యారు. సైనీ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రదీప్ చౌదరి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరిపై దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన కారణంగా కులదీప్ సింగ్ సెంగార్ ఫిబ్రవరి 2020లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఉన్నావ్‌లోని బంగార్మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్‌ను గతంలో బీజేపీ బహిష్కరించింది. అనంత్ సింగ్: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో జూలై 2022లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుత వేటు పడింది. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదిలా ఉండగా..వాస్తవానికి సుప్రీం కోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీ చట్టం)లోని సెక్షన్ 8(4)ని కొట్టివేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి మూడు నెలల తర్వాత పార్లమెంట్ సభ్యుత్వం కోల్పోయి అనర్హత వేటు విధించడం జరుగుతుంది. అలాగే మూడు నెలల వ్యవధిలో సదరు వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. ఐతే ఆసక్తికరంగా 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం దోషులుగా ఉన్న చట్టసభ సభ్యులను సభ నుంచి తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీనే తన సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికా సమావేశంలో ఆ ఆర్డినెన్స్‌ను చించివేయడం గమనార్హం. (చదవండి: బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం: ఢిల్లీ సీఎం) -
మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్ ఖాన్, ఆఖర్లో ఫహీమ్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. మహ్మద్ నవాజ్ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్ అక్మల్ (14 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గ్లాడియేటర్స్ ఈ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్ అష్రాఫ్ 2, రయీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్ ఖాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (31 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) హ్యాట్రిక్ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఉమైద్ ఆసిఫ్ 3, మహ్మద్ నవాజ్ 2, నసీం షా, నవీన్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. -
ఆజాం ఖాన్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ గెలిపొందింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. ఇస్లామాబాద్ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 41 బంతుల్లో 72 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫహీమ్ అష్రఫ్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లుకోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాడ్ వసీం సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వసీం 54 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అయితే వసీం అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. కాగా సునామీ ఇన్నింగ్స్ ఆడిన ఆజం ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ ISLU fans to @MAzamKhan45 #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/OH93u9uCzR — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛,͛͛͛ ͛͛͛A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛!͛͛͛ ͛͛͛ Pindi crowd cannot stop cheering! #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/wwpVcDUhv3 — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 -
సూర్య కాదు.. అతడే నాకు స్ఫూర్తి! నిజమే.. నీకు ‘స్కై’తో పోలికేంటి?
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు. తన తండ్రి మొయిన్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్. ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్, టీ20 వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు. సూర్య కాదు.. టిమ్ డేవిడ్.. ఎందుకంటే ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు. తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. నిజమే నీకు సూర్యతో పోలికేంటి? ఇక ఆజం ఖాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆజం ఖాన్ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు. చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్ కొడుకా! పెద్ద ప్రమాదమే! వైరల్
Pakistan Super League, 2023: కడుపున పుట్టిన బిడ్డలు తాము అనుకున్న రంగంలో రాణిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు. అద్భుతమైన ప్రతిభాపాటవాలతో పేరు తెచ్చుకుంటే మురిసిపోతారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్‌కు తన కుమారుడి కారణంగా ఇలాంటి అనుభూతి కలిగింది. తనలాగే బ్యాట్ పట్టి అద్భుత ఇన్నింగ్స్‌తో కొడుకు చెలరేగడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మొయిన్. అయితే, అదే సమయంలో ‘ఎంత పనిజేసినవ్ బిడ్డా’ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కొడుకు ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌ను తనకు అంకిమితమివ్వగానే చప్పట్లతో అతడిని అభినందించిప్పటికీ అతడి విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ఇందుకు కారణమేమిటంటే.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ బ్యాటర్ ఆజం ఖాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ(97 పరుగులు) చేజారినా జట్టుకు విజయం అందించి ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ గా నిలిచాడు. ఈ క్రమంలో మరుపురాని ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చాడు. డగౌట్లో కూర్చున్న తండ్రి మొయిన్ ఖాన్ వైపు చూస్తూ.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అన్నట్లు సైగ చేశాడు. దీంతో మొయిన్ ఖాన్ చప్పట్లతో కొడుకుకు శుభాభినందనలు తెలియజేశాడు. కానీ.. తన జట్టుకు పరాభవం ఎదురుకావడంతో కాస్త నిరాశపడ్డాడు. అవును.. ఆజం ఖాన్ కారణంగా క్వెటా గ్లాడియేటర్స్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలు కావడంతో మొయిన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. తండ్రి కోచ్‌గా ఉన్న జట్టుపై సునామీ ఇన్నింగ్స్‌తో ఆజం ఖాన్ సునామీ ఇన్నింగ్స్‌తో.. తాజా విజయం కారణంగా ఇస్లామాబాద్ యునైటెడ్ పీఎస్ఎల్-2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఆజం ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ క్వెటా జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆజం ఇన్నింగ్స్ చూసిన మెయిన్ ఖాన్ షాక్‌లో ఉండిపోయాడు. కొడుకు ఆటకు మురిసిపోవాలో.. లేదంటే తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు చేరువైన తరుణంలో బాధపడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు. పెద్ద ప్రమాదమే! క్వెటా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో కొడుకు వల్ల మొయిన్ ఖాన్‌కు పెద్ద ప్రమాదమే వచ్చి పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మొయిన్ 1990- 2004 మధ్య కాలంలో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక తన తండ్రి కోచ్‌గా వ్యవహరిస్తున్న జట్టుపై కొడుకు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం బహుశా పీఎస్ఎల్ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! When you make your dad proud 🥹#SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/9sVWHkOByQ — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
అతని ఆట ఇక ముగిసింది: జయప్రద
లక్నో: బీజేపీ నేత, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద.. సమాజ్ వాదీ సీనియర్ ఆజాంఖాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన ఎన్నో పాపాలు చేశారని, చేసిన తప్పులకు ఆయన తప్పక శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఆదివారం మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాజీ నటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీల మధ్య వైవిధ్యాలు, విభేధాలు సహజం. కానీ, అధికారం ఉంది కదా అని మహిళలను అగౌరవపరచడం, పేదలకు అన్యాయం చేయడం సరికాదు. అజాం ఖాన్ ఆయన వారసుడు అబ్దుల్లా ఖాన్ లకు మహిళలను గౌరవించడం ఏమాత్రం తెలియదు. ఆజాం ఖాన్ ఆట ముగిసింది. చేసిన పాపాలకు వాళ్లు అనుభవించకతప్పదు అని జయప్రద పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆమె.. నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ కూడా బీజేపీ వశం అవుతుందని జోస్యం చెప్తున్నారామె. ఇదిలా ఉంటే.. జయప్రద, ఆజాంఖాన్ గతంలో పరస్పర విమర్శలతో వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగగా.. ఆజాం ఖాన్ ‘ఖాకీ అండర్ వేర్‘ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు ఆ టైంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆజాం ఖాన్. అయితే.. 2019 లోక్ సభ ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగం చేసిన కేసులో ఆజాంఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో చట్ట ప్రతినిధుల నిబంధనల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు పడింది. తాజాగా ఇక ఆయన తనయుడు అబ్దుల్లా ఖాన్ కు(ఆజాంఖాన్ కు కూడా) తాజాగా 2008 నాటి కేసులో కోర్టు రెండేళ్ల శిక్ష విధించగా.. ఎమ్మెల్యే పదవిని అనర్హతతో కోల్పోయారాయన. -
సమాజ్‌వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. పదిహేనేళ్ల కిందటి నాటి కేసులో(2008).. సువార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఖాన్‌కు మోరాదాబాద్ కోర్టు రెండేళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన ఫిబ్రవరి 13వ తేదీ నాటి నుంచి అబ్దుల్లాపై అనర్హత వేటు అమలులోకి వస్తుంది అంటూ అసెంబ్లీ సెక్రెటరీ పేరిట ప్రకటన వెలువడింది. అబ్దుల్లా అజాం ఖాన్ ఎవరో కాదు.. ఎస్పీ దిగ్గజనేత, వివాదాస్పద అజాం ఖాన్ తనయుడు. ఏం జరిగిందంటే.. డిసెంబరు 31, 2007న రాంపూర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SEPF) క్యాంపుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. యూపీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే 2008, జనవరి 29వ తేదీన అజాం ఖాన్, అబ్దుల్లా ఖాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని తనిఖీ చేయడం కోసం పోలీసులు ఆపారు. దీనిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు తండ్రీకొడుకులు. అయితే.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వీళ్లిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులోనే మోరాదాబాద్ కోర్టు తాజాగా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. రెండేళ్ల శిక్షలు ఖరారు చేసింది. మరో విశేషం ఏంటంటే.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొవడం అబ్దుల్లా అజాం ఖాన్‌కు ఇది రెండోసారి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గంలో ఎస్పీ తరపున పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. అయితే.. అప్పటికీ ఎమ్మెల్యేగా అర్హత వయసు(25 సంవత్సరాలు) నిండకుండానే నామినేషన్స్ దాఖలు చేశాడు అతను. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. దీంతో.. 2020లో.. అలహాబాద్ హైకోర్టు అతని ఎన్నికను రద్దు చేసింది. అయితే తిరిగి 2022 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నెగ్గాడు అబ్దుల్లా అజాం ఖాన్. చట్ట సభ్యులెవరైనా సరే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష గనుక పడితే.. వాళ్ల సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. -
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్‌కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే ఆసుపత్రికి!
శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వరుస పెట్టి గాయాల బారినపడుతున్నారు. శ్రీలంక చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్తాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే. Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD — Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు -
తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్
మోరాదాబాద్: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలకు మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్, ఆయన కుటుంబం దూరం అయ్యింది. 1977 నుంచి ఈ నియోజకవర్గం ఖాన్ ఇలాకాగా రామ్‌పూర్ విరజిల్లుతోంది. అయితే.. విద్వేషపూరిత ప్రసంగం కేసులో.. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మూడేళ్ల శిక్ష పడింది అజామ్ ఖాన్‌కి. దీంతో.. ఆయన శాసన సభ సభ్యత్వం కోల్పోవడంతో రామ్‌పూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అజామ్ ఖాన్ భార్య తంజీన్ ఫాతిమాగానీ, ఆయన కోడలుగానీ బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ, ఎస్పీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసీమ్ రజా ఖాన్‌కు టికెట్ కేటాయించింది. రజా ఖాన్, అజామ్ ఖాన్‌ను అత్యంత సన్నిహితుడు. గతంలో ఆజామ్ ఖాన్ తన పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిగా రజా ఖాన్ పోటీ చేశారు. అయితే.. బీజేపీ ఘనశ్యామ్ లోథి చేతిలో ఓడిపోయారు. రామ్‌పూర్ నియోజక వర్గానికి 1997 నుంచి 2022 దాకా మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో.. పదిసార్లు ఆయన గెలుపొందారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. గతంలో అజామ్ ఖాన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఆ సమయంలో ఆయన భార్య తంజీన్ ఫాతిమా పోటీ చేసి.. గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సమాజ్‌వాదీ పార్టీ మొండి చేయి చూపించింది. అజామ్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబం న్యాయపరమైన కేసులు ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఆజామ్ ఖాన్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే కుట్రకు పాల్పడిన అభియోగాలపై ఆజామ్ ఖాన్ భార్య, ఆయన తనయుడిపై కేసు నమోదు అయ్యింది కూడా. ఇక బీజేపీ తరపున ఇక్కడ ఆకాశ్ సక్సేనా బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆకాశ్ పోటీ చేసి.. ఆజామ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. -
Azam Khan: ఎస్పీ సీనియర్ నేతకు ఎదురుదెబ్బ
బరేలీ(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్‌కు సెషన్స్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష ప్రసంగానికి సంబంధించిన కేసులో దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ వేసిన పిటిషన్‌ను రామ్‌పూర్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. దీంతో రామ్‌పూర్‌లో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది. 2019నాటి విద్వేష ప్రసంగం కేసులో ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు అక్టోబర్ 27వ తేదీన అజామ్‌ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్షవేసింది. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. రామ్‌పూర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలనీ ఈసీ నిర్ణయించింది. సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్లో పెండింగ్‌లో ఉండేసరికి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను పరిశీలనలోకి తీసుకోవాలని రామ్‌పూర్ సెషన్స్ కోర్టును దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఆయన పిటిషన్‌ను విచారణ చేపట్టిన రామ్‌పూర్ సెషన్స్ కోర్టు.. కొట్టేసింది. ఇదీ చదవండి: మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది -
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్, బిహార్, ఛత్తీస్‌ఘడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 8న కౌంటింగ్ ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..) -
ఆజంఖాన్ ఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా రాంపూర్ సదర్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్! -
సైకిల్ పార్టీ కీలక నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు ఆజాం ఖాన్‌కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్‌పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్.. తొలి పాక్ ఆటగాడిగా!
యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీ పాకిస్తాన్ ఆటగాడు అజం ఖాన్‌తో ఓప్పందం కుదుర్చుకుంది. తద్వారా యూఏఈ టీ20 లీగ్ అడుగుపెట్టిన తొలి పాక్ ఆటగాడిగా అజం ఖాన్ నిలిచాడు. కాగా టోర్నీ కోసం డెసర్ట్ వైపర్స్ తమ విదేశీ ఆటగాళ్ల జాబితాను శనివారం ప్రకటించింది. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా, న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో వంటి స్టార్ ఆటగాళ్లను డెసర్ట్ వైపర్స్ తమ జట్టులోకి చేర్చుకుంది. డెసర్ట్ వైపర్స్ హెడ్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ తమ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా డెసర్ట్ వైపర్స్ నియమించింది. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా డెసర్ట్ వైపర్స్ ఎంపిక చేసింది. కాగా డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీని లాన్సర్ క్యాపిటల్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఎమిరేట్స్,షార్జా వారియర్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి. చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక -
ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్
లక్నో: ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు. చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్లో రగడ -
యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావా!
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. రామ్పూర్లోని తన యూనివర్సిటీని సీల్ చేసిన విషయంలో యోగి ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్నట్లు ప్రకటించారు ఆజాం ఖాన్. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తనకు చెందిన మొహమ్మద్ అలీ జవుహార్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంపై గురువారం యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఫెన్సింగ్ తొలగించకపోవడం వల్ల.. యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోయానని కోర్టుకు తెలిపారు ఆజాంఖాన్. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్‌వలీకర్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసం.. జులై 19లోపు వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్‌ను కోరుతూ.. జులై 22వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మే 27వ తేదీన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన యూనివర్సిటీ స్థలాల జప్తు ఆదేశాలపై స్టే విధించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్‌ను తొలగించకపోవడం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్రమించారు ఆయన. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. 27 నెలలు జైల్లో గడిపిన ఈయన.. మే నెలలో జైలు నుంచి విడుదల అయ్యారు. -
Azam Khan: రెండేళ్ల తర్వాత జైలు నుంచి ఆజాం ఖాన్ విడుదల
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజాం ఖాన్(73) ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల నేపథ్యంలో ఆయన 27 నెలలపాటు జైలులోనే గడిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు విడుదల లభించింది. గురువారం సుప్రీం కోర్టు.. ఆజాం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ ఉదయం యూపీలోని సీతాపూర్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చిన ఆవెంటనే ఆయన తనయుడు.. ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజాంతో పాటు ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) నేత శివ్‌పాల్ సింగ్ యాదవ్, భారీ ఎత్తున మద్దతుదారులు ఆజాంఖాన్‌కు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన.. స్వస్థలం రాంపూర్‌కు వెళ్లిపోయారు. గురువారమే ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. స్థానిక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆ ఆదేశాలను అందుకోవడం, వాటిని సీతాపూర్ జైలు సూపరిండెంట్‌కు పంపడంతో అర్ధరాత్రి అయ్యింది. ఈ క్రమంలో ఈ ఉదయం ఆయన్ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! -
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేటుకుంది. అవినీతి సహా పలు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ఆయనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాయని గురువారం విమర్శించారు. ఈ మేరకు వరుసగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘యూపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషపూరిత, ఉగ్రదాడులకు పాల్పడుతూ సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్‌ను రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచింది. ప్రజల దృష్టిలో ఇది న్యాయం గొంతు నొక్కడం కాకపోతే ఇంకేంటి?’ అని మాయావతి ప్రశ్నించారు. 88 కేసుల్లో బెయిల్ ఆజం ఖాన్ రెండేళ్లుగా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు పెట్టగా 88 కేసుల్లో బెయిల్ లభించింది. శత్రువుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో బుధవారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చివరి కేసులో కూడా బెయిల్ మంజూరయ్యాకే జైలు నుంచి ఆజం ఖాన్ విడుదల కానున్నారు. (క్లిక్: అనూహ్యం.. డీజీపీని తప్పించిన సీఎం యోగి) కూల్చివేతలు కరెక్ట్ కాదు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలను మాయావతి తప్పుబట్టారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో దురుద్దేశపూరితంగా ఆక్రమణల తొలగింపు పేరుతో వలస కార్మికులు, శ్రామిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ వారి జీవనోపాధిని లాగేసుకుంటున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు ఆందోళన కలిగిస్తోంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ‘అవార్డ్ వాపసీ’పై బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
అజంఖాన్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ నాయకుడు ఆజంఖాన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా తనకు మధ్యంతర బెయిలు ఇప్పించాలని ఆజంఖాన్ పలు పిటిషన్లను దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా 32 బెయిల్ పిటిషన్లు వేస్తారా? రాజకీయాలకు కోర్టును తేవొద్దని కటువుగా వ్యాఖ్యానించింది. అయితే బెయిల్‌ను కోరుతూ సంబంధింత కోర్టులో పిటిషన్ వేసుకునే స్వేచ్ఛను ధర్మాసనం ఆజంఖాన్‌కు ఇచ్చింది. వేధింపుల్లో భాగంగా యోగి సర్కారు తనపై ఏకంగా 87 కేసులను బనాయించిందని... వీటిలో 84 కేసుల్లో బెయిల్ మంజూరైందని ఆజంఖాన్ తన న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా కోర్టు దృస్టికి తెచ్చారు. -
ఏకంగా పది సార్లు.. 20 ఏళ్లుగా చెరగని మాజీ సీఎం రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిసారి ఎన్నికల్లో ‘తొలి’సారి ఎమ్మెల్యేలు అధికంగా ఉంటారు. గడిచిన నాలుగు ఎన్నికలు పరిశీలిస్తే 2017లో అత్యధికంగా మూడింట రెండొంతులు అంటే 403 మందికి 239 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాలుగైదు దశాబ్దాల ఎన్నికల్లో తొలి గళం అధికంగా వినిపించింది 2017 నాటి 17వ అసెంబ్లీ ఫలితాల్లోనే. ప్రస్తుత ఎన్నికల్లో అతిపెద్ద మల్లయోధుడు ఆజంఖాన్ రాంపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. పదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆజంఖాన్ యత్నిస్తున్నారు. తొమ్మిదోసారి అడుగుపెట్టే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో సురేశ్‌కుమార్ ఖన్నా(బీజేపీ) షాజహన్‌పూర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రామ్ గోవింద్ చౌదరి కూడా ఎస్పీ తరఫున బల్లియా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ, టీఎంసీ, బీఎస్పీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్యామ సుందర్ శర్మ ఈసారి బీఎస్పీ నుంచి బరిలో దిగనున్నారు. అఖిలేశ్ సర్కారులో మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాద్ యాదవ్ కూడా తొమ్మిదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ మహానా, రాంపాల్ వర్మ, రమాపతి శాస్త్రి, జయ ప్రతాప్‌సింగ్ (బీజేపీ) ఎనిమిదో సారి గెలుపుకోసం యత్నిస్తున్నారు. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఏడోసారి కుండా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఫతే బహదూర్ (బీజేపీ) ఆరుసార్లు గెలిచి కేంపియర్‌గంజ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అజయ్ ప్రతాప్ సింగ్ (బీజేపీ) కర్నల్ గంజ్ నుంచి, నరేంద్రసింగ్ వర్మ (ఎస్పీ) మహమ్మదాబాద్ నుంచి ఇక్బాల్ మహమ్మద్ (ఎస్పీ) సంబల్ నుంచి ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. (క్లిక్: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) 20 ఏళ్లుగా చెరగని రికార్డు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ పదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రికార్డు రెండు దశాబ్దాలుగా చెరగని రికార్డుగా ఉంది. తొలిసారి జనసంఘ్ నుంచి 1967లో ఎన్నికైన కల్యాణ్ సింగ్ 2002లో రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున పదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ గెలిస్తే ఈ రికార్డును సమయం చేసే అవకాశం ఉంది. 1967లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. (చదవండి: యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్ సిద్ధం!) -
ప్రాక్టీస్ చేస్తుండగా తలకు బలమైన గాయం; కీలక మ్యాచ్‌లకు దూరం
గయానా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టుకు షాక్ తగలింది. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు శనివారం పాకిస్తాన్ ఆటగాడు అజమ్‌ఖాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని తలకు బలమైన గాయం తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే అజమ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పీసీబీ తెలిపింది. అజమ్‌కు వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించారని.. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొంది. కాగా 24 గంటల తర్వాత అజమ్ గాయం తీవ్రతపై ఒక అంచనా వస్తుందని పీబీబీ తెలిపింది. కాగా అజమ్ బ్యాటింగ్ సమయంలో హెల్మట్ ధరించినప్పటికి.. బంతి వేగంగా రావడంతో తలకు బలంగా తగిలింది. కాగా విండీస్, పాకిస్తాన్ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షార్పణంతో రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది. -
Azam Khan: పాక్ క్రికెట్ జట్టులోకి భారీ హిట్టర్..
కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టులోకి భారీ హిట్టర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటన నిమిత్తం ఆ దేశ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఆజమ్ ఖాన్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ మ్యాచ్ ఆడినప్పటికీ.. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో భారీ సిక్సర్లతో చెలరేగుతుండంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడంపై పాక్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీకాయంతో అలవోకగా సిక్సర్లు బాదే ఆజమ్ ఖాన్.. ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్)లలో విదేశీ క్రికెటర్ల సహచర్యంలో ఈ భారీ హిట్టర్ రాటుదేలాడు. ఇటీవలి కాలంలో 32 కిలోల బరువు తగ్గిన ఆజమ్ ఖాన్.. ఓ వైపు ఫిట్నెస్ కాపాడుకుంటూనే, తన సహజసిద్ధమైన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే, బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరనుంది. జూలై 8 నుంచి 20 వరకు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అనంతరం విండీస్‌తో అయిదు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు 'నీ చాలెంజ్ ఒప్పుకుంటున్నా.. బైక్ కొనడానికి రెడీగా ఉండు' -
ఆక్సిజన్ సపోర్ట్ మీద అజాం ఖాన్
లక్నో: సమాజ్‌వాది పార్టీ నాయకుడు అజాం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారని లక్నోలోని మెదాంత ఆస్పత్రి శనివారం వెల్లడించింది. సీతాపూర్ జైలులో ఉన్న అజాం ఖాన్‌ను ఈ నెల 9న కరోనా చికిత్స నిమిత్తం లక్నోలోని మెదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు కరోనా చికిత్స కొనసాగుతుంది. అజాం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఖాన్ కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రికుమారులిద్దరికి గత నెల 30న కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆ తర్వాత అజాం ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 9న ఆయనను లక్నో మెదాంత ఆస్పత్రికి తరలించారు. ఆయన కుమారుడిని కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అజాం ఖాన్ మీద 100కు పైగా కేసులు నమోదు కావడంతో గత ఏడాది ఫిబ్రవరిలో అజాం ఖాన్‌ను సీతాపూర్‌లో జైలుకి తీసుకెళ్లారు. అజాం ఖాన్ కుమారుడి మీద కూడా సీతాపూర్ జైలులో పలు కేసులు నమోదయ్యాయి. చదవండి: హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించండి: ఎంపీ -
సిక్సర్లు కొట్టడం ఓకే.. కోహ్లి, విలియమ్సన్‌ను చూసి నేర్చుకో
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. అయితే అతని బరువు అజమ్‌ను ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. ఇంత బరువు ఉంటే కష్టమని.. ఫిట్నెస్ కాపాడుకోలేవని.. జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అజమ్ ఖాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో అతని ఆటను పూర్తిగా చూడలేకపోయాం. అయితే బారీ కాయంగా కనిపిస్తున్నా అజమ్ ఖాన్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా భారీ సిక్సర్లు బాదడం ఇతనికి అలవాటు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అజమ్ ఖాన్‌ను ప్రశంసిస్తూనే అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ''అజమ్ ఖాన్ ఆటతీరు నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. సిక్సర్లు అలవోకగా బాదుతున్న అజమ్‌కు అదే ప్లస్.. అదే మైనస్ కూడా అవుతుంది. అన్ని సార్లు అతని కొట్టే షాట్లు సిక్సర్లుగా మారుతాయన్న నమ్మకం లేదు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం.. కవర్ డ్రైవ్,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది. కానీ పరిమిత ఓవర్లు క్రికెట్లో ఈ అవసరం రాదు. ప్రతీసారి సిక్స్ కొట్టడం కాదు.. స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లు అవసరం ఉండదు. టైమ్.. షాట్ మూమెంట్స్‌ను కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఆ విషయంలో అజమ్ కాస్త వీక్‌గా ఉన్నాడు. దీనికి కోహ్లి, విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లను పరిశీలించాలి.. వారి ఆటతీరు ఎలా ఉందన్నది గమనించాలి. దీనికి తోడు అతను హెవీ వెయిట్ అతనికి మరో మైనస్. ముందు అతని వెయిట్ తగ్గితే సగం ఒత్తిడి తొలిగిపోయినట్లే. ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఎంపికైతే మాత్రం బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదగడం ఖాయం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అజమ్ ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ పాకిస్తాన్ వికెట్ కీపర్‌గా మంచి పేరు సంపాదించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. 1990-2004 వరకు పాక్ జట్టుకు ఆడిన మొయిన్ ఖాన్ 69 టెస్టుల్లో 2741 పరుగులు.. 219 వన్డేల్లో 3266 పరుగులు సాధించాడు. కొంతకాలం పాటు పాక్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన మొయిన్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్ వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్ మాజీ కెప్టెన్ -
గాయాలపాలైన ఎంపీ ఆజంఖాన్ భార్య
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ భార్య, ఎమ్మెల్యే తజీన్ ఫాతిమా గాయాలపాలయ్యారు. బాత్రూంలో జారిపడటంతో ఆమె భుజం ఫ్రాక్చర్ అయ్యిందని సీతాపూర్ జిల్లా జైలు అధికారులు తెలిపారు. కాగా తాజీన్ ఫాతిమా, ఆజంఖాన్, వారి తనయుడు అబ్దుల్లా బర్త్ సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న వారి ముగ్గురిని సీతాపూర్ జైలుకు తరలించారు.(‘సోనియా గాంధీ మీ టిక్కెట్లకు డబ్బు చెల్లించారు’) ఈ నేపథ్యంలో శుక్రవారం ఫాతిమా జైలు స్నానాల గదిలో జారిపడ్డారని డీసీ మిశ్రా తెలిపారు. ‘‘అదుపుతప్పి బాతరూంలో ఆమె కిందపడ్డారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించాం. ఎక్స్ రే తీయగా.. భుజానికి ఫ్యాక్చర్ అయినట్లు తేలింది. అనంతరం తిరిగి ఆమెను జైలుకు తీసుకువచ్చాం. జైలు సిబ్బంది ఫాతిమాను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఫాతిమా ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.(వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు) నన్నో టెర్రరిస్టులా చూస్తున్నారు: ఆజంఖాన్ -
అందరికీ న్యాయం జరగడం ముఖ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేఖ్ యాదవ్ విమర్శించారు. ప్రతి దానికి మతం రంగు పులమడం సరికాదని, చట్టం అందరికీ సమానమేనని అన్నారు. సామరస్యాన్ని కొనసాగించడానికి, అందరికీ న్యాయం జరగడం ముఖ్యమని హితవు పలికారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం మొదలైన సందర్భంగా తమ పార్టీ ఎంపీ ఆజంఖాన్, ఆయన కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేయాలని యూపీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ ఉపాసం ఉండేందుకు వారిని అనుమతించాలని కోరారు. ఆజంఖాన్ ఎంతో అనుభవం ఉన్న నాయకుడని, రాజకీయ కక్షతో ఆయనపై అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించిందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజంఖాన్, ఆయన భార్య తజీన్ తిమా, కుమారుడు అబ్దుల్లా ఆజం ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్నారు. రాంపూర్ బీజేపీ నాయకుడు ఆకాశ్ సస్సేనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై గతేడాది జనవరి 3న పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లా ఆజం రెండు బర్త్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్‌లు, రెండు పాన్‌కార్డులు కలిగివున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ దాదాపు 80 కేసులు ఉన్నాయి. చదవండి: సీఆర్పీఎఫ్ చరిత్రలో తొలిసారిగా.. -
‘నన్నో టెర్రరిస్టులా చూస్తున్నారు’
లక్నో : వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆజంఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తనను ఓ టెర్రరిస్టులా చూస్తున్నారని ఆరోపించారు. ఫోర్జరీ కేసులో అరెస్టయిన ఆజంఖాన్‌ను పోలీసులు సీతాపూర్ జైలు నుంచి తీసుకొచ్చి రాంపూర్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసు వ్యాన్‌లో నుంచి విలేకరులతో మాట్లాడిన ఆజంఖాన్ పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారని చెప్పారు. కాగా, ఈ కేసులో ఆజం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంకు రాంపూర్ కోర్టు ఏడు రోజుల జ్యుడిషల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. కాగా ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ దాదాపు 80 కేసులు నమోదుకావడం గమనార్హం. -
ఎస్పీ నేత ఆజంఖాన్‌కు షాక్
లక్నో : ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ అసెంబ్లీకి ఆయన ఎన్నికను అలహాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. యూపీలోని రాంపూర్ జిల్లా సోర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అబ్దుల్లా ఆజం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ వయసు ధృవీకరణ పత్రాలను సమర్పించాడని పేర్కొంటూ ఆయన ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో అబ్దుల్లా వయసు 25 సంవత్సరాల లోపేనని, నకిలీ పత్రాలతో ఆయన ఎన్నికల బరిలో దిగారని కోర్టు పేర్కొంది. ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. -
ఉల్లి తినడం మానేయండి..
సాక్షి,న్యూఢిల్లీ : ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో వీటిని తినడం మానివేయాలని ఎస్పీ నేత ఆజం ఖాన్ సూచించారు. ఉల్లిపాయలను తినడం మానేయాలి వీటిని తప్పనిసరిగా తినాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. జైన్ సోదరులు ఉల్లి తినరని ప్రజలంతా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అన్నింటినీ మానేస్తే అంతా ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఉల్లి తింటే దుర్వాసన వస్తుందని ఆజం ఖాన్ అన్నారు. ప్రజలకు తినేందుకు బ్రెడ్ లేకుంటే వారిని కేక్ తినేలా చేయండని గతంలో ఒక రాణి అన్నారని గుర్తుచేశారు. ఉల్లిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఉల్లి తినడం మానివేయాలని దేశ ప్రజలకు ఇచ్చిన సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ 100 దాటడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’
లక్నో : తనను అకారణంగా వేధిస్తున్నారని ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ ఎన్నికల ప్రచార సభలో గగ్గోలు పెట్టిన క్రమంలో ఆయన ప్రత్యర్థి, బీజేపీ నేత జయప్రద స్పందించారు. ఆజం ఖాన్ కారణంగా మహిళ కంటతడి పెట్టిన ఫలితమే ఇదని ఆమె మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రతిసభలో ఏడుస్తున్నారు. తనను ఆయన మంచి నటినంటూ ఎద్దేవా చేసేవారు..ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని జయప్రద ఆక్షేపించారు. రాంపూర్‌లో బీజేపీ తరపున ఎంపీగా జయప్రద పోటీచేసిన క్రమంలో ఆమెపై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ తన రాజకీయ కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించారని గతంలో జయప్రద ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్‌ను ఈనెల 5న సిట్ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయని ఆయన వాపోతున్నారు. ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై 80కి పైగా కేసులు నమోదయ్యాయి. -
కోళ్లు, మేకలు చోరీ చేశానట..
లక్నో : ప్రజల కోసం పనిచేయడమే తాను చేసిన నేరమని సీనియర్ ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని కేసులు మోపి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు తనపై కోళ్లు, మేకలు దొంగిలించిన అభియోగాలు మోపారని ఆయన మండిపడ్డారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్ కేంద్ర, యూపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘నాపై హత్యా యత్నం అభియోగాలు మోపారు. ఇప్పుడు కోళ్లు, మేకలు దొంగిలించిన ఆరోపణలు సైతం నాపై ఉన్నా’ యని చెప్పుకొచ్చారు. రాంపూర్ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేయడం వల్లే తాను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ ప్రస్తుతం భూ ఆక్రమణలకు సంబంధించి క్రిమనల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఎదుట ఆయన ఈనెల 5న హాజరయ్యారు. ఆజం ఖాన్‌పై మొత్తం 80 కేసులు నమోదవడం గమనార్హం. కాగా ఆజం ఖాన్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది పార్లమెంట్‌కు ఎన్నికవడంతో రాంపూర్ అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాంపూర్ నుంచి ఆయన భార్య తజీన్ ఫాతిమాను ఎస్పీ బరిలో నిలిపింది. -
22 కిలోల బరువు తగ్గాను : ఆజంఖాన్
రాంపూర్ : తనపై అక్రమంగా నమోదైన క్రిమినల్ కేసుల కారణంగా 22 కిలోల బరువు తగ్గినట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున ఆజంఖాన్ భార్య ఫాతిమా బరిలో నిలిచారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆజంఖాన్ తన ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. తాను ఎదుర్కొంటున్న కేసుల గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తను ప్రజల కోసం, సమాజం కోసం మాత్రమే పనిచేశానని తెలిపారు. ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు తనపై క్రిమినల్ అని ముద్ర వేశారని విమర్శించారు. జీవితంలో చాలా చూశానని చెప్పిన ఆజంఖాన్.. ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదని అన్నారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, పిల్లల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కిలో బరువు పెరగలేదని.. కానీ 22 కిలోలు తగ్గానని వ్యాఖ్యానించారు. కాగా, ఆజంఖాన్‌పై ల్యాండ్ మాఫియాకు సంబంధించి పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆజంఖాన్‌ను 2.30 గంటల పాటు విచారించింది. ఈ కేసుల తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 29కి వాయిదా వేసింది. -
అధ్యక్షుడిని కలవడం కోసం వరుడి వేషంలో..
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ మీద రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్‌కు మద్దతుగా రాంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాంపూర్ ప్రాంతంలో 144 సెక్షన్‌ని విధించారు. అయితే ఆ పార్టీ నాయకుడొకరు ఈ నిషేధాజ్ఞలను వినూత్న రీతిలో ఉల్లంఘించాడు. అఖిలేష్‌ను కలవడం కోసం ఏకంగా పెళ్లి కుమారుడి వేషంలో వచ్చాడు. ఆ వివరాలు.. రాంపూర్‌లో పర్యటిస్తున్న అఖిలేష్‌ను కలవడం కోసం సంభల్‌కు చెందిన ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘యోగి ప్రభుత్వం మా పార్టీ ఎంపీని టార్గెట్ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన మీద దాదాపు 80 కేసులు పెట్టింది. వాటిల్లో బర్రె, మేక దొంగతనం కేసులు కూడా ఉండటం గమనార్హం. ఇవన్ని నిరాధార ఆరోపణలు. ప్రభుత్వం ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఆజం ఖాన్పైనే విశ్వాసం ఉంచుతార’ని పేర్కొన్నాడు. (చదవండి: గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు) ఆజం ఖాన్ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు పేద రైతులనుంచి వ్యవసాయ భూములను కూడా స్వాహా చేశాడంటూ అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న యూపీ ప్రభుత్వం ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించింది. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. -
గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు
లక్నో : సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, హత్యలు, హత్యాచారాలు లాంటి కేసులు నమోదు అవుతుంటాయి. వీటిల్లో ఏదో ఒక కేసు దాదాపు ప్రతి నాయకుడిపై ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా. కానీ ఓ ఎంపీపై వెరైటీగా దొంగతనం కేసు నమోదు అయింది. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఆ ఎంపీ కోట్ల కొద్ది డబ్బులో లేదా తులాల కొద్ది బంగారమో దోపిడీ చేశాడని కేసు నమోదు కాలేదు. కేవలం ఓ గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు పెట్టారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు అయిన ఎంపీ ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్. ఇప్పటికే భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా ఈ విచిత్ర షాక్ తగలింది. ఎంజీ ఆజంఖాన్ రాంపూర్‌కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు ఆజంఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తమ ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. .ఎంపీతో పాటుమరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కాగా ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ 50 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 28 కేసులు అలియాగంజ్ రైతులు పెట్టినవే కావడం గమనార్హం. -
ఆజం ఖాన్‌కు మరో షాక్
రాంపూర్: వివాదాస్పద సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ. భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా మరో షాక్ తగలింది. రాంపూర్‌లోని ఖాన్‌కు చెందిన లగ్జరీ రిసార్ట్ 'హంసఫర్' గోడనుఅధికారులు కూల్చివేశారు. కబ్జా ఆరోపణలతో బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఉత్తరప్రదశ్ నీటిపారుదల శాఖ ఆజం ఖాన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించారని ఆరోపణలతో అధికారులు ఈ చర్య చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పేద రైతులనుంచి వ్యవసాయ భూమిని, ప్రభుత్వ భూములను స్వాహా చేశాడన్న కేసులో అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. మరోవైపు ఆజం ఖాన్ కొనుగోళ్లకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, చెల్లింపు రశీదులు, ఇతర ఒప్పందాల వివరాలను రెవన్యూ శాఖను కోరామని రాంపూర్ ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అనేక వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సి వుందన్నారు. -
క్షమాపణ చెప్పిన ఆజంఖాన్
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్‌ను కోరారు. అందుకే వెంటనే ఖాన్ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఖాన్ పక్కనే ఉన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్‌ను స్పీకర్ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
లోక్‌సభలో ఆజం ఖాన్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, లోక్‌సభ అధ్యక్ష స్ధానంలో కూర్చున్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ సోమవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. రమాదేవి తన సోదరి వంటిదని తాను గతంలోనే పలమార్లు చెప్పానని, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడాలనేది తన అభిమతం కాదని స్పష్టం చేశారు. తాను మాట్లాడే భాష, మేనరిజమ్స్ గురించి పార్లమెంట్లో అందరికీ తెలుసునని, తాను పొరపాటుగా వ్యాఖ్యానిస్తే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కాగా సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యే ముందు ఆజం ఖాన్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. సభాధ్యక్ష స్ధానాన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆజం ఖాన్ క్షమాపణను బీజేపీ ఎంపీ రమాదేవి అంగీకరించలేదు. ఆజం ఖాన్ వైఖరి మహిళలను, దేశాన్ని బాధించిందని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతున్నారని, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడే తన పద్ధతి మార్చుకోవాలని రమాదేవి హెచ్చరించారు. -
తల్లి, కొడుకు కిస్ చేసుకున్నా తప్పేనా?
న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీతో పాటు మహిళ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ మాత్రం ఆజాంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజంఖాన్‌ను సమర్ధించేలా ఆయన పలు ఊదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. అన్నాచెల్లెలు, తల్లికొడుకులు ముద్దు పెట్టుకున్నా అది లైంగిక సంబంధమేనా అని ప్రశ్నించారు. 2015లో జేడీయూను వీడిన జితన్‌రామ్ స్వంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించారు. కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రమాదేవి కూడా ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు మహిళా ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే, మిమి చక్రవర్తి, అనుప్రియా పటేల్‌లు ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మాత్రం ఆజంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని ఆజంఖాన్ స్పష్టం చేశారు. -
ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆజంఖాన్ రెండు సార్లు కుర్చీలో ఉన్న తనను అవమానించారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే వెంటనే ఆయన క్షమాపణ చెప్పలేదన్నారు. (చదవండి : లోక్‌సభలో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై దుమారం) ‘నేను సభలో ఉన్న ప్రతి ఒక్కర్నీ గౌరవంగా చూస్తాను. ఆజంఖాన్ నావైపు చూస్తు మాట్లాడకుండా నేరుగా ఎంపీల వైపు చూస్తూ మాట్లాడుతున్నారు. అందుకే ఆజంను చైర్ వైపు చూసి మాట్లాడాలని ఆదేశించాను. కానీ ఆయన అది పట్టించుకోకుండా సభలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ ఇచ్చేదాన్ని. కానీ, గౌరవప్రదమైన కుర్చీలో కూర్చుని అలా చేయడం తగదు అనిపించింది. ప్రతి ఒకరికీ తల్లి, సోదరి, కుమార్తె, భార్య ఉంటారు.. ఆజం వ్యాఖ్యలు మహిళలను కించపరడమే కాకుండా పురుషుల గౌరవాన్ని కూడా తగ్గించేలా ఉన్నాయి’ అని రమాదేవి అన్నారు. (చదవండి : ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం) బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ సందర్భంగా మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆజం వ్యాఖ్యలను మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా సైతం ఆజం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆజంను ఆదేశించారు. -
‘ఆజం ఖాన్ మానసిక వికలాంగుడు’
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్‌కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. -
ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం
న్యూఢిల్లీ: లోక్‌సభ డెప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఆజం ఖాన్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు లోక్‌సభ ఇస్తుందని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితర మహిళా ఎంపీలతోపాటు బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆజం ఖాన్‌ను ఈ లోక్‌సభ నుంచి పూర్తిగా బహిష్కరించేలా ఆయనను ఐదేళ్లపాటు సస్పెండ్ చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. -
మహిళలపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు
కోల్‌కతా : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఎస్పీ నేత ఆజం ఖాన్ బాటలో నడిచిన పశ్చిమ బెంగాల్ మంత్రి అభాసు పాలయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న మహిళా టీచర్లపై తృణమూల్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి పార్ధ ఛటర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కోల్‌కతాలో ప్రైమరీ టీచర్లతో సమావేశమైన మంత్రి కొందరు టీచర్లు స్త్రీ రోగంతో ఇబ్బందులు పడుతున్నారని, వీరిని చూసి తానూ భయపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇక టీచర్లు ఆందోళనను విరమించాలని మంత్రి కోరారు. గత రెండు వారాలుగా సాల్ట్‌లేక్ ప్రాంతంలో పలువురు టీచర్లు వేతన పెంపు, బదిలీల ఉత్తర్వుల నిలిపివేత వంటి డిమాండ్లతో నిరాహారదీక్షలు చేపట్టారు. మంత్రి వ్యాఖ్యలను పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు లోక్‌సభలో స్పీకర్ స్ధానంలో కూర్చున్న బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ఆజం ఖాన్ వ్యాఖ్యలపై ఆగని దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం కూడా లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించాయి. రమాదేవి బుధవారం సభాధ్యక్ష స్ధానంలో కూర్చుండగా ఆమెను ఉద్దేశించి ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని అన్ని పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ ప్రకటనను ఖండిస్తూ ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా నేతపై అలాంటి వ్యాఖ్యలు చేసిఉండాల్సింది కాదని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర్యాదకరంగా వ్యవహరించి ఆజం ఖాన్ తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. ఇవే వ్యాఖ్యలను ఆయన బయట చేస్తే పోలీసులు అరెస్ట్ చేసేవారని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని..ఈ తరహా భాష ఆమోదం యోగ్యం కాదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆజం ఖాన్ తన వ్యవహారశైలిని మార్చుకోకుంటే ముందు తరాలకు మంచి విలువలు అందించలేమని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఉదంతంపై ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడటం కాదని, ఆజం ఖాన్‌పై తీవ్ర చర్యల కోసం తాము లోక్‌సభ స్పీకర్ వైపు చూస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మహిళా ఎంపీల డిమాండ్లపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా తాను అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన మీదట ఈ అంశంపై తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. అంతకుముందు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆజం ఖాన్‌ను లోక్‌సభ నుంచి డిస్మిస్ చేయాలని, ఆయన ఎన్నడూ మహిళలను గౌరవించరని బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు. -
‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజంఖాన్ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రమాదేవిపై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా ఖండించగా.. ఆ పార్టీ యూపీ నేత ఒకరు మరింత ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆఫ్తాబ్ అద్వానీ అజంఖాన్‌పై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎంపీని అవమాన పరుస్తూ అసభ్యంగా మాట్లాడినందుకు ఆజంఖాన్ తల నరికి పార్లమెంటు తలుపునకు వేలాడదీయాలని ఆఫ్తాబ్ డిమాండ్ చేశారు. ‘‘ఆజంఖాన్ గతంలో కూడా జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మహిళా ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ నిజంగా పిచ్చివాడు. పిచ్చి కుక్కలా అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి నాయకులు దేశానికి హానికరం...అందుకే ఇతన్ని చంపండి’’ అంటూ ఆఫ్తాబ్ వీడియోలో కోరారు. దేశ మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న ఆయనపై ప్రతికారం తీర్చుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఆజంఖాన్ సభ్వత్వాన్ని రద్దు చేయాలని పలువురు బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన ఆయన.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజంఖాన్ తాను అన్‌పార్లమెంటరీ పదాలు ఏమైనా వాడితే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. -
లోక్‌సభలో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ లోక్‌సభలో గురువారం సబాధ్యక్ష స్ధానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ సందర్భంగా మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆజం ఖాన్ క్షమాపణలు చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఖాన్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మంత్రులు కోరారు. మరోవైపు సభాద్యక్ష స్ధానంలోకి తిరిగివచ్చిన స్పీకర్ ఓం బిర్లా ఆజం ఖాన్‌ను మందలించి క్షమాపణ చెప్పాలని సూచించారు. ఎంపీలు సైతం ఆజం ఖాన్ క్షమాపణలు కోరడంతో అఖిలేష్ యాదవ్ తమ ఎంపీని సమర్ధిస్తూ పార్లమెంట్లో బీజేపీ సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని ఆరోపించారు. ఇక క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజం ఖాన్ తాను అన్‌పార్లమెంటరీ పదాలు ఏమైనా వాడితే రాజీనామా చేసేందుకు సిద్ధమనిచెప్పారు. ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్‌లు ఇద్దరూ ఆ తర్వాత లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. -
‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’
లక్నో: తన భర్తను బీజేపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ భార్య రాజ్యసభ సభ్యురాలు తాజిన్ ఫాటిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన భర్తపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆమె అన్నారు. కాగా ల్యాండ్ మాఫీయా కేసులో ఆజంఖాన్ ఉన్నారంటూ యూపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించినందుకు తన భర్తపై కుట్రపన్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక, ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఆజంఖాన్‌పై ల్యాండ్ మాఫీయాలో అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయిన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ లోక్‌సభ పరిధిలో అనేక కేసులు ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఆజంఖాన్ రెవెన్యూ శాఖమంత్రిగా ఉన్న (2012-2017) సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. -
ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: వివాదాస్పద నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి (1947) నుంచి భారతదేశంలో నివశించడానికి తాము (ముస్లింలు) డబ్బులు చెల్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘దేశ విభజన అనంతరం మా పూర్వీకులు చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు తరలివెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు. వారందరికీ ఇక్కడ తగిన శిక్ష పడుతోంది. ఇక్కడ నివశించడానికి మేం డబ్బులు చెల్లిస్తున్నాం’’ అని అన్నారు. అయితే శుక్రవారం బిహార్‌లో మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. సరాన్ జిల్లాలో గేదెను దొంగిలించబోయారన్న కారణంతో జరిగిన ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీనిపై స్పందించి ఆజం ఖాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దాడిలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని ఎస్పీ హర్కిషోర్ తెలిపారు. ఇద్దరుముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. మరోవైపు దొంగిలించే ప్రయత్నం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని మృతుల బంధువులు ఆరోపించారు. దీనిపై బిహార్ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఘటనపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు వ్యతిరేకంగాఉన్నాయంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ల్యాండ్‌మాఫీయాను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలుచేపట్టింది. దీనిలోభాగంగా మాఫియా నేరారోపణలు ఎదుర్కొంటున్న పాల్పడిన అనేక మంది నేతలపై కేసులను నమోదు చేస్తోంది. ఆ జాబితాలో ఆజం ఖాన్ పేరును కూడా చేర్చింది. కేసులో నేరం రుజువైతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఆయనపై గత పదేళ్లలో వివిధ నేరాల్లో 30కిపైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ల్యాండ్ మాఫీయాలో ఎంపీ హస్తం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచ్చలవిడిగా సోగుతోన్న ల్యాండ్ మాఫీయాను అరికట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కీలక చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాఫీయా ముఠా పేర్లను సేకరించి, వాటిని ఓ పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లో గతంలో నమోదయిన కేసు వివరాలను అధికారులు సేకరించి, సీఎం కార్యాలయం పంపుతున్నారు. అయితే వీటిల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, వివాదాస్పద నేత ఆజంఖాన్ పేరు కూడా ఉంది. ఆయనపై ల్యాండ్ మాఫీయా గురించి అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ లోక్‌సభ పరిధిలో అనేక కేసుల ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఆజంఖాన్ రెవెన్యూ శాఖమంత్రిగా ఉన్న (2012-2017) సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ తప్పుడు కేసులని కొట్టిపారేశారు. కాగా వివాదాస్పద నేతగా గుర్తింపు పొందిన ఆజాంఖాన్ ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నంటున్న విషయం తెలిసిందే. -
‘ఖురాన్లో ఏముంటే దానికే మా పార్టీ మద్ధతు’
న్యూఢిల్లీ: ముస్లింల పవిత్ర గ్రంధం ‘ఖురాన్’లో ఏం రాసి ఉందో దానికే మా పార్టీ మద్ధతిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం త్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో ఈ విషయంపై ఆజంఖాన్ ఢిల్లీలో స్పందించారు. ‘ 1500 సంవత్సరాల క్రితమే ఏ మతంలో లేని విధంగా ఇస్లాంలో మహిళలకు సమాన హక్కులు ఇచ్చారు. మహిళలకు సమానత్వం కల్పించిన మతాల్లో ఇస్లాం మతమే మొట్టమొదటిది. ఒక్క ఇస్లాం మతంలోనే మహిళలపై దాడులు, విడాకులు తక్కువగా ఉన్నాయి. మహిళలపై పెట్రోలు పోసి తగలపెట్టడం, చంపడం లాంటివి ఇస్లాంలో లేవ’ని ఆజం ఖాన్ పేర్కొన్నారు. ‘ త్రిపుల్ తలాక్ అనేది మతానికి సంబంధించిన విషయం. ఇది ఎంతమాత్రం రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఇస్లాంలో ఖురాన్ కంటే ఏదీ సుప్రీం నిర్ణయం కాదు. పెళ్లి, విడాకులు, ఇతరత్రా అన్ని విషయాల గురించి ఖురాన్లో స్పష్టంగా సూచనలు ఉన్నాయ’ని ఆజం ఖాన్ చెప్పారు. గత సంవత్సరం ముస్లిం(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) మహిళ బిల్లు-2018 లోక్‌సభలో పాసైనప్పటికీ రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వం రద్దు కావడంతో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ముస్లిం మహిళ బిల్లు-2019ను తీసుకువచ్చింది. -
గాడ్సే లాంటి వాళ్లను తయారుచేయం
రాంపూర్: వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజామ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మదర్సాలు నాథురాం గాడ్సే, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వారిని తయారుచేయబోవని వ్యాఖ్యానించారు. మదర్సాలను ప్రధాన (మెయిన్‌స్ట్రీమ్) విద్యావ్యవస్థతో అనుసంధానం చేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆజామ్ ఖాన్ స్పందించారు. గాంధీని చంపిన నాథురాం గాడ్సే స్వభావం కలిగిన వారిని, మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వ్యక్తిత్వం కలిగిన వారిని మదర్సాలు తయారుచేయడం లేదన్నారు. ముస్లింలకు నాణ్యమైన విద్యను అందించే మదర్సాలకు కేంద్రం నిజంగా సహాయం చేయదలిస్తే వాటిని మెరుగుపరచాలని సూచించారు. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు ఆధ్యాత్మిక విలువలు, విజ్ఞాన అంశాలను మదర్సాలు బోధిస్తున్నాయని తెలిపారు. మదర్సాలకు భవనాలు, ఫర్నిచర్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను అందించే కేంద్రాలుగా మదర్సాలను గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న మదర్సాలను సాధారణ, ప్రధాన విద్యా కేంద్రాలతో కలుపుతామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రకటించారు. మదర్సాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సబ్జెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని ట్విటర్లో నఖ్వీ వెల్లడించారు. మదర్సాలను మెరుగపరిచేందుకు 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘ఒక చేతిలో ఖురాన్ మరో చేతిలో కంప్యూటర్’ ఉండాలి అనే నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’
లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి అజంఖాన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈయన ఈవ్యాఖ్యల చేశారు. కాగా వీవీప్యాట్లు,ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇదివరకే తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈవీఎంలను టాపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తేల్చిచెప్పింది. కాగా తాము ఓడిపోతే దానికి ఈవీంలే కారణమంటూ ఇటీవల బీస్పీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యూపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప్డడారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్‌లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు. -
‘ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆ పార్టీ గుర్తింపు’
లక్నో : బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే ప్రజల్లో మిగిలిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలపై మండి పడ్డారు. గాడ్సే, ఖాకీ నిక్కర్ ఆర్ఎస్ఎస్కు గుర్తింపు తెచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్నాళ్లు ఆర్ఎస్ఎస్ అనగానే ఖాకీ నిక్కరు ఎలా గుర్తుకు వచ్చేదో.. ఇక మీదట గాడ్సే కూడా అలానే గుర్తుకు వస్తాడు. ఖాకీ నిక్కరు, గాడ్సేనే ఆర్ఎస్ఎస్ అస్థిత్వాలు. ఇప్పుడిక నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని గాంధీ పేరుతో గుర్తుంచుకోవాలో.. గాడ్సే పేరుతో గుర్తుంచుకోవాలో అనే నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలి. మానవత్వం కావాలో.. ఖాకీ నిక్కరు కావాలో ఓటర్లే తేల్చుకోవాల’న్నారు. అంతేకాక గాడ్సే మద్దతుదారురాలు అయినందుకు గాను ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
రాజకీయ చవటాయలు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘వెన్ దే గో లో, వియ్ గో హై’ అని మాజీ అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామా 2016లో జాతీయ ప్రజాస్వామిక సమ్మేళనంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన నాటి వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకోవడంతోపాటు సోషల్ మీడియాను విపరీతంగా ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఆమె ప్రసంగం పట్ల ప్రశంసలు కురిపించింది. వైరిపక్షం వారు దిగజారి మాట్లాడితే తాము మాత్రం అంతకంతకు ఉన్నతంగా మాట్లాడుతామన్నది ఆమె వ్యాఖ్యల్లోని భావం. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని చూస్తుంటే ‘మీరు దిగజారి మాట్లాడితే మేం అంతకన్నా దిగజారి మాట్లాడుతాం’ అన్నట్లు ఉంది. ఆమె ఖాకీ కట్ డ్రాయర్ వేసుకుందని బీజేపీ నాయకురాలు జయప్రదను ఉద్దేశించి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ తనకు ఓట్లు వేయని వారిని పక్కన పెడతానని, తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను అందించడంటూ బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు. అదే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వం రిజిస్ట్రీ ప్రకారం హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతస్థులను మినహా దేశానికి వలస వచ్చిన మిగతా వారినందరిని దేశం నుంచి వెళ్లగొడతామని బెదిరించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఆయన మాట్లాడినట్లు స్పష్టం అవుతూనే ఉంది. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. మరి, అందుకు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. ఇక వ్యక్తిగతంగా ఒకరినొకరు దూసుకోవడం మరీ ఎక్కువైంది. ఒకరిని ఉద్దేశించి ‘పప్పూ’ అంటే, మరొకరిని ఉద్దేశించి ‘నామ్‌దార్’ అనడం, ‘స్పీడ్ బ్రేకర్, ఎక్స్‌పయరీ బాబు, బాటిల్ ఆఫ్ పాయిజన్’ తదితర పదాలను వాడుతూ తమ క్రియేటివిటీ పోటీపడి చాటుకుంటున్నారు. తాము పార్టీలకు సారథ్యం వహిస్తున్న రాజకీయ నాయకులమని, తాము ప్రజల దష్టిలో ఆదర్శప్రాయంగా ఉండాలన్న ధ్యాసే వారిలో కనిపించడం లేదు. వారిలో ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఆలోచనకన్నా ప్రత్యర్థులను మరింత బాగా తిట్టాలన్న ధోరణే కనిపిస్తోంది. పార్టీల సిద్ధాంతాలను, ఎన్నికల ప్రణాళికల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన వారు వాటిని పూర్తిగా విస్మరించి తిట్ల దండకం అందుకుంటున్నారు. రేపు అధికారంలోకి వస్తే ప్రజలు ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించిగానీ, ఎన్నికల ప్రణాళికల గురించిగా అడగకూడదన్నది వారి ఉద్దేశమా! ఉన్నతంగా మాట్లాడే సంస్కృతి వారికి లేదా? ఏదయితేనేం, ‘చవటాయను నేనంటే నీకంటే చవటాయను నేను’ అన్నట్లు ఉందని వారికి ఎప్పుడు అర్థం అవుతుందో!? -
గుడియా.. నాచ్నేవాలీ..చాక్లెట్ ఫేస్.. శూర్పణఖ..
ఈ ఎన్నికల సీజన్లో రాంపూర్‌లో సాయంత్రాలు కలర్ఫుల్గా ఉంటాయి (జయప్రద తరచూ పార్టీలు మారడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎస్పీ నేత ఫిరోజ్‌ఖాన్) ప్రియాంక పప్పూకి పప్పి – మహేశ్ శర్మ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మాయావతిని మా కూటమిలో చేర్చుకోవాలంటే ఆమె చాలా పెద్ద జాగానే ఆక్రమిస్తారు. పైపెచ్చు ఆమె పార్టీ గుర్తు ఏనుగు కూడా.. (రెండేళ్ల క్రితం ఎస్పీ, బీఎస్పీ కలయికపై అఖిలేశ్ యాదవ్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు అదే మాయావతితో ఆయన పొత్తు పెట్టుకున్నారు) మాయావతి రోజూ ముఖానికి ఫేషియల్ చేస్తారు. జుట్టుకు రంగు వేసుకొని యువతిలా కనిపించాలని తాపత్రయపడతారు. 60 ఏళ్లు వచ్చినా, ఇంకా ఆమె జుట్టు నల్లగానే ఉండడానికి కారణం అదే. – సురేంద్రనాథ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే ఒక వేశ్య కూడా తనకు చెల్లించిన ప్రతి పైసాకు ప్రతిఫలాన్ని అందించి చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది. కానీ మాయావతి అలా కాదు. ఆమె పార్టీ టికెట్లు ఎవరు డబ్బులెక్కువగా ఇస్తే వారికి ఇస్తారు. ఎవరైనా టికెట్ కోసం కోటి రూపాయలు ఇస్తామంటే.. మరొకరొచ్చి రెండు కోట్లు ఇస్తామంటే వారికే ఇస్తారు. – దయాశంకర్ సింగ్, బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడు ఆకాశంలో సగం. ఓటర్లలో సగం. అయినా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. ఉన్నవాళ్లని గౌరవించే సంస్కృతీ లేదు. మహిళలు రాజకీయాలకి పనికిరారా? రాజకీయాల్లో పోటీ చేసే మహిళలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకునే పురుషుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఉత్తరప్రదేశ్‌లో అలనాటి అందాల నటి జయప్రద లోదుస్తులపై రామ్‌పూర్ నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ వెకిలిగా వ్యాఖ్యానిస్తే ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజమ్ రెండాకులు ఎక్కువే చదివారు. ‘అలీ బజరంగ బలీ మావే. అనార్కలి మాకు అవసరం లేద’న్నారు. ఇలా తండ్రీ కొడుకు జయప్రదను టార్గెట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరాగాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు, జయప్రద నుంచి హేమమాలిని వరకు రాజకీయాల్లోకి వచ్చిన మహిళలందరూ వేధింపులు వెటకారాలు ఎదుర్కొన్న వారే. వాళ్లెంత పవర్ఫుల్ నాయకురాళ్లయినా కావచ్చు. వారికి జనంలో వీరాభిమానులు ఉండచ్చు. కానీ ఎన్నికలు వచ్చే వేళకి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, ఇతర నాయకులకు నోరు పారేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆజం వెకిలితనం.. నిన్నటికి నిన్న జయప్రదను ఉద్దేశించి ఆజంఖాన్ అన్న మాటలు విన్న వాళ్లంతా షాక్‌కు లోనయ్యారు. మరీ ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ నివ్వెరపోయారు. ‘జయప్రదను నేనే రామ్‌పూర్‌కి తీసుకువచ్చా. ఆమె శరీరాన్ని తాకకుండా నేనే అందరినీ అడ్డుకునే వాడిని. దానికి మీరే సాక్ష్యం. ఆమె అసలు రంగు తెలుసుకోవడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ రంగు అండర్వేర్ ధరిస్తుందని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నా’ అని నోరు పారేసుకున్నారు. తాను రాజకీయ రంగానికి పరిచయం చేసిన జయప్రద బీజేపీకి మారి రామ్‌పూర్ నుంచి బరిలోకి దిగడంతో ఆజంఖాన్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆరెస్సెస్ నిక్కర్ రంగుతో జయప్రద లోదుస్తుల్ని పోలిక పెడుతూ ఈ వెకిలి కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ప్రతిస్పం దించినా కనీసం ఆయన క్షమాపణ కూడా కోరడానికి సిద్ధంగా లేరంటేనే తలబిరుసు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆజంఖాన్ గతంలోనూ ఒక ఎన్నికల ర్యాలీలో జయప్రదని ‘నాట్యగత్తె’ అంటూ చులకన చేశారు. జయప్రద సినిమా రంగం నుంచి రావడమే కాదు, ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా లాగి నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాడేశారు ఆజంఖాన్. ఆయన కుమారుడు కూడా ‘అలీ బజరంగ బలీ మావే (హిందూ, ముస్లిం ఓట్లు మావే). అనార్కలి (సినీ రంగం నుంచి వచ్చిన నాట్యగత్తె జయప్రద) అక్కర్లే)దంటూ ఎన్నికల సభలో నినదించారు. ఇందిరమ్మ.. మూగబొమ్మ దేశ తొలి మహిళా ప్రధాని, గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీకి కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎదుర్కోక తప్పలేదు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో గూంగీ గుడియా (మూగ బొమ్మ) అని సోషలిస్టు నేత రామ్ మనోహర్ ఏకంగా ఒక పేరే పెట్టేశారు. ప్రధాని అయ్యే తొలినాళ్లలో ఆమె తక్కువగా మాట్లాడేవారన్న విమర్శలుండేవి. అసలు ఇందిరకు ప్రధాని అయ్యే అర్హత లేదని విపక్షాలు చీటికిమాటికి ఎత్తి చూపుతుండేవి. చూడ్డానికి అందంగా ఉంటుంది.. 2014 ఎన్నికల సమయంలో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్ మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విరుచుకుపడ్డారు. ఆమె చూడ్డానికి అందంగా బొమ్మలా ఉంటుంది తప్ప ఆమెకు ఎవరూ ఓట్లెయ్యరంటూ ప్రచారం చేశారు. అమర్‌సింగ్‌కి బాలీవుడ్‌తో మంచి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయి. హేమమాలినికి మంచి స్నేహితుడిగా కూడా గుర్తింపు ఉంది. ఎన్నికలొచ్చే సరికి స్నేహితులు కూడా శత్రువుల్లా మారి ఇలా మనసును తూట్లు పొడుస్తారా అని బాధపడటం మినహా హేమమాలిని ఏం చేయలేకపోయారు. నుదుటి కుంకుమపైనా కామెంట్లు కొద్ది రోజుల క్రితమే పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జైదీప్ కవాడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్ష్యంగా షాకింగ్ కామెంట్లే చేశారు. ఓ వీడియోను రూపొం దించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘గడ్కరీ పక్కన కూర్చొని స్మృతి ఇరానీ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతుంటారు. కానీ మీకో విషయం తెలియాలి. ఆమె తన భర్తల్ని మార్చినప్పుడల్లా ఆమె నుదుటిపై ఉన్న బొట్టు సైజు పెద్దదవుతూ ఉంటుంది. అలా అని నాతో ఒకరు చెప్పారు’ అంటూ తీవ్రంగా అవమానించారు. చాక్లెట్ ఫేస్ ప్రియాంక.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ బాధ్యతలు చేపట్టగానే ఆమెని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకుడు కైలాష్ విజయవార్గియా కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నాయకులు లేక ఇలాంటి చాక్లెట్ ఫేస్‌లను తెస్తున్నారంటూ ప్రియాంకపై విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ తర్వాత బీజేపీ మద్దుతుదారులు ప్రియాంకపై అసభ్యకరమైన మీమ్‌లు, ట్వీట్లు పెట్టారు. దీంతో బిహార్‌లో కొందరిని అరెస్ట్ చేశారు కూడా. నిండు సభలో చీర లాగారు.. ఎన్నికల సమయంలో ప్రచార హడావుడిలో ఏదో నోరు జారడం కాదు, చట్టసభల సాక్షిగా మహిళల్ని అవమానించిన ఘటనలూ ఉన్నాయి. తమిళులకు జయలలిత అంటే ఎంత ఆరాధ్య దైవమో చెప్పనక్కర్లేదు. డీఎంకే శాసనసభ్యులు ఏకంగా దుశ్శాసన పర్వానికి దిగి.. ఆమె చీరలాగారు. చట్టసభల చరిత్రలో ఇదో చీకటి రోజు. ఇక పార్లమెంటులో మన తెలుగు ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరిని శూర్పణఖ అని ప్రత్యర్థి పార్టీల నేతలు తిట్టిపోసిన విషయమూ తెలిసిందే. మహిళలు బాధితులుగా మారే అవకాశాలు రాజకీయాల్లో చాలా ఎక్కువ. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఈ తరహా ధోరణి మన ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనం చేయడమే కాదు, మహిళా రాజకీయవేత్తల హక్కుల్ని కూడా కాలరాస్తుంది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిని ఖండించడానికి మాటలు సరిపోవు. ఇలాంటి విపరీత ధోరణుల్ని అడ్డుకునే ప్రయత్నం ఎన్నికల సంఘం కూడా చేయకపోవడం శోచనీయం. – బృందా కారత్, సీపీఎం నాయకురాలు తిరగబడుతున్న యువతరం ఎన్నికల వేళ మహిళల్ని టార్గెట్ చేస్తుంటే సీనియర్ లీడర్లు నిస్సహాయతతో పంటి బిగువన భర్తిస్తున్నారు కానీ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారు మాటకి మాట విసురుతున్నారు. బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షైనా ఎన్సీ ‘మహిళల్ని చిన్నచూపు చూస్తే ఏ మాత్రం సహించకూడదు. వారు బయటకి వచ్చి వెంటనే ఫిర్యాదు చెయ్యాలి. సోషల్ మీడియాలో నన్ను అవమానిస్తూ 587 వరకు మెసేజ్‌లు వచ్చాయి. నేను వాళ్ల పాపాన వారే పోతారులే అని ఊరుకోలేదు. పోలీసుస్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్ చేశాను’ అని వెల్లడించారు. చట్టసభల్లోనూ, బయటా, మహిళలు పనిచేసే ప్రతీ చోటా మాటల ద్వారా మానసికంగా గాయం చేసి పైశాచికత్వాన్ని బయట పెట్టుకునే మగ పిశాచాలకు తగిన బుద్ధి చెప్పేలా చట్టాలు ఉండాలి అని షైనా అంటున్నారు. మహిళా సాధికారత గురించి పెద్ద లెక్చర్లు ఇస్తూ, వారి ఓట్లు కొల్లగొట్టడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే పార్టీల నేతలే మహిళలపై నోరు పారేసుకుంటుంటే ఎవరైనా ఏం చెయ్యాలి. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లును కూడా అటకెక్కించేసిన ఈ పార్టీలు మహిళా సాధికారత కోసం ఏమైనా చేస్తారనుకుంటే పొరపాటే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘జయప్రద ఓ అనార్కలి’
లక్నో : జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ నోరు పారేసుకున్నాడు. జయప్రదను అనార్కలిగా అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. తాము అలిని, భజరంగ్ భళిని కోరుకుంటామని అనార్కలిని కాదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అది దేశ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. కాగా అబ్దుల్లా వ్యాఖ్యలపై జయప్రద భగ్గుమన్నారు. తండ్రి ఆజంఖాన్లాగే ఆయన కుమారుడు మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం నుంచి వచ్చినందుకే అబ్దుల్లా బాగా చదువుకున్నా తండ్రిలాగే మాట్లాడుతున్నాడని, వారికి మహిళలను గౌరవించడం తెలియదని దుయ్యబట్టారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన ఖాకీ నిక్కర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, ఈసీ తీవ్రంగా స్పందించాయి. ఆజం ఖాన్ 72 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను అనుమతించరాదని జయప్రద డిమాండ్ చేశారు. -
వెండితెర రాణి.. వివాదాల రాజు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక రాంపూర్ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిరోజూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్‌రే నోరారా పొగిడిన భూలోక సుందరి (ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్) జయప్రద ఇక్కడి నుంచే పోటీ చేయడం రాంపూర్ ప్రత్యేకత. మరో అంశం.. స్త్రీలపై అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల వ్యవస్థనే కించపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ వ్యవహార శైలి కూడా రాంపూర్ నియోజకవర్గానికి మరో రకమైన అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఒకనాటి అన్నాచెల్లెలు బం«ధానికి ప్రతీకగా ఉన్న రాంపూర్.. ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. హోరాహోరీ ఎన్నికల పోరులో తాడోపేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఇటు బీజేపీ, అటు ఎస్పీ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే రాంపూర్ పోరులో మాత్రం పార్టీల కంటే పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో రాంపూర్ నియోజకవర్గంపై రాజకీయ నిపుణులు, విశ్లేషకులు దృష్టి సారించారు. పదకొండు సార్లు ముస్లింలకే పట్టం 1957లో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు, బీజేపీ మూడుసార్లు, ఎస్పీ రెండుసార్లు గెలిచాయి. భారతీయ జనతాదళ్ ఒకసారి (1977)లో గెలిచింది. మొత్తం 11 సార్లు ముస్లిం అభ్యర్థులే ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మహిళలకు సైతం నాలుగు సార్లు పట్టం కట్టారు. ఈసారి కూడా ‘సన్ ఆఫ్ ద సాయిల్’ ఆజంఖాన్‌కు గట్టిపోటీ ఇస్తూ, దక్షిణ భారత చిత్రసీమను ఏలిన ఒకనాటి అందాలతార జయప్రద ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎస్పీ నుంచి ఆజంఖాన్, కాంగ్రెస్ నుంచి సంజయ్ కపూర్ (బిలాస్పూర్ ఎమ్మెల్యే) పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ నాటి మిత్రులూ, నేటి బద్ధ శత్రువులైన జయప్రద – ఆజంఖాన్ మ«ధ్యనే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో కొద్దిలో గెలిచిన బీజేపీ ఈ లోక్‌సభ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో రెండు కాంగ్రెస్, రెండు ఎస్పీ, ఒకటి బీఎస్పీ ప్రాతినిధ్యంలో ఉన్నాయి. జయప్రద గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో జయప్రద బీఎస్పీ టికెట్‌పై రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రత్యర్థి ఆజంఖాన్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ నేపాల్ సింగ్, 2014లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నజీర్ అహ్మద్‌ఖాన్‌పై, 23 వేల స్వల్ప ఆధిక్యతతో గెలవగలిగారు. గత ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎస్పీ, బీఎస్పీ పొత్తుపెట్టుకుని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆజంఖాన్‌ని పోటీకి దింపాయి. వైరం ఎక్కడ మొదలైంది? పదిహేనేళ్ల క్రితం జయప్రదను ముంబై నుంచి రాంపూర్‌కి రప్పించిన వ్యక్తి, సమాజ్‌వాదీ పార్టీకి పరిచయం చేసిన మిత్రుడు ఈ రోజు ఆమెకు బద్ధ శత్రువుగా ఎలా మారిపోయాడన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తనను నాడు పరిచయం చేసిన ఆజంఖాన్‌ను జయప్రద గౌరవంగా అన్నా అని సంబోధించే వారు. ఆయనను గురువుగానూ భావించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉండగా ఆజంఖాన్ – అమర్‌సింగ్ మధ్య తలెత్తిన వైషమ్యాల సందర్భంగా జయప్రద అమర్‌సింగ్ పక్షం వహించడం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. అప్పటి నుంచి ఒకనాటి మిత్రులు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తదనంతర పరిణామాల్లో అమర్‌సింగ్, జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 ఎన్నికల్లో బిజ్నోర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరఫున పోటీ చేసి జయప్రద ఓడిపోయారు. ఆజంఖాన్కిది అలవాటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండటం ఆజంఖాన్ నైజం. అయితే ఈసారి జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల కారణంగా 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆజంఖాన్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే గతంలో సైతం తన చిత్రాలను మార్ఫింగ్ చేశాడంటూ ఆజంఖాన్‌పై జయప్రద ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు సైతం ఆమెపై వ్యక్తిగతంగా చౌకబారు వ్యాఖ్యలు చేయడం మరోమారు ఆజంఖాన్‌ని అభాసుపాలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమెపై ఆజంఖాన్ ‘పదిహేడేళ్లుగా చూసినా మీకర్థం కాని విషయం నాకు 17 రోజుల్లోనే అర్థమైంది. జయప్రద ఖాకీ నిక్కరు ధరించింది’ అంటూ అంతర్లీనంగా ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసింది. పైగా తనపై యాసిడ్ దాడికి ఆజంఖాన్ కుట్ర పన్నాడన్న జయప్రద ఆరోపణలు ఇక్కడి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి. సామాజిక సమీకరణలు పదకొండు సార్లు ముస్లింలకే పట్టంగట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా సగానికి పైగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57 శాతం ఉన్నారు. హిందువులు 45.97 శాతం, సిక్కులు 2.80 శాతంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాంపూర్ అక్షరాస్యత 53.34 శాతం మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ. రాంపూర్ ముఖచిత్రం మొత్తం ఓటర్లు 11,54,544 పురుషులు 6,22,769 స్త్రీలు 5,31,775 పురుషుల అక్షరాస్యత 61.50% మహిళల అక్షరాస్యత 44.44% -
మహిళల ఓట్లు నాకే
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్’ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్‌లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్ సమక్షంలోనే ఆజం ఖాన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్ లాంటిదేనని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్ భార్య డింపుల్ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్‌కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్‌కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. అన్నా అని పిలిచి తప్పు చేశా.. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్ వ్యాఖ్యలతో రాంపూర్ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్ లోక్‌సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్‌సింగ్‌తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్‌లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు మహిళా నేతల గురించి అడ్డమైన చెత్త వాగుడు వాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇంతవరకూ అధికార పార్టీతో సహా ఇతర పార్టీ ముఖ్య నాయకులేవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై స్పందించడమే కాక.. నాయకులు కాస్తా బుర్ర పెట్టి స్పృహలో ఉండి మాట్లాడితే మంచిదంటూ సూచించారు. ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విధంగా మాట్లాడారు. ‘చర్చలో భాగమైనా కాకపోయిన ఓ మహిళ గురించి కామెంట్ చేయడం చాలా ఈజీ. ఓ వర్గానికి చెందిన వారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా సులువు. ఇలాంటివి చూసినప్పుడు కనీస ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. అందుకే అందరికి చెప్పేదొకటే.. మాట పెదాలను దాటకముందే దాని గురించి కాస్తా బుర్ర పెట్టి ఆలోచిస్తే మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడి మన ముందు తరాలకు ఏం సందేశం ఇస్తున్నాం అనే విషయాన్ని మైండ్‌లో ఉంచుకుని మాట్లాడితే మంచిద’ని సూచించారు. ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్.. జయప్రద గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్నప్పటికి.. ఆ పార్టీ నాయకులు ములాయం సింగ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ స్పందించకపోవటం గమనార్హం. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌ని పరామర్శించటం గురించి నిర్మలా సీతారామన్‌ని ప్రశ్నించగా.. ‘నేను విమానాశ్రయానికి తిరిగి వెళ్తున్నాను. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న శశి థరూర్‌ని పరామర్శిస్తే బాగుంటుంది అనిపించిది. అందుకే ఆస్పత్రికి వెళ్లాను. దీని గురించి నా పార్టీకి చెందిన వ్యక్తులతో సహా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రచారంలో భాగంగా శశి థరూర్‌కి ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిదే. -
తండ్రి బాటలో తనయుడు..
సాక్షి, న్యూఢిల్లీ : జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై ఈసీ చర్యలు చేపట్టిన మరుసటి రోజే ఆయన కుమారుడు అబ్ధుల్లా ఆజం ఖాన్ ముస్లిం కార్డు ముందుకు తెచ్చారు. తన మతం కారణంగానే తమ తండ్రిపై ఈసీ చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకునే క్రమంలో ఈసీ ఎలాంటి పద్ధతులూ పాటించలేదని ఆయన ఆక్షేపించారు. తన తండ్రిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయరాదంటూ ఈసీ నిషేధించే ముందు నోటీసులూ జారీ చేయలేదని ఆరోపించారు. ఆయన ముస్లిం అయినందుకే ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారా అంటూ అబ్ధుల్లా ఆజం ఖాన్ నిలదీశారు. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా వారిని అణిచివేయలేరని అన్నారు. కాగా, యూపీలోని రాంపూర్‌లో ఈనెల 15న ఓ ర్యాలీలో ఆజం ఖాన్ మాట్లాడుతూ జయప్రదను ఉద్దేశించి చేసిన ఖాకీ నిక్కర్ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. -
ఆజంఖాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై వేటు వేసింది. 72గంటలు (మూడు రోజులు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఈసీ నిషేధం విధించింది. అదేవిధంగా ముస్లింల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మేనకా గాంధీపైన ఈసీ చర్యలు తీసుకొంది. 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా ఆమెపై నిషేధం విధించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా మూడు రోజులు (72 గంటల పాటు), రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది -
మళ్లీ రెచ్చిపోయిన ఆజం ఖాన్
లక్నో : జయప్రదపై ‘ఖాకీ నిక్కర్’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజం ఖాన్ సోమవారం మీడియా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో రాజ్యసభ ఎంపీ మునావర్ సలీం అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తున్న ఆజం ఖాన్‌ను జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరణ అడగ్గా విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. మీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చానంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చిర్రుబుర్రులాడారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా, ఓ ఎన్నికల ప్రచార సభలో ఆదివారం ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
నేను చస్తే.. నీ కళ్లు చల్లబడతాయా?: జయప్రద
లక్నో : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు.. ఒకప్పటి తన స్నేహితుడు, ప్రస్తుత ప్రత్యర్థి ఆజంఖాన్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, మహిళల రక్షణ కోసం ఆజంఖాన్‌ను ఎన్నికల్లో పోటీచేయనివ్వద్దన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చచ్చిపోతే.. నీవు సంతృప్తి పడతావా?’ అంటూ ఆజంఖాన్ ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నన్ను భయపడితే రాంపూర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నావ్.. కానీ ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ముచ్చటే లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనుమతించకూడదు. ఒక వేళ ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతోంది. మహిళల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఇక 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమె విజయానికి ఆజంఖాన్ కృష్టి చేశారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీని వీడారు. ఇటీవల బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలోకి దిగారు. దీంతో వీరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. (జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య) -
‘ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. భీష్ముడిలా ఉండకండి’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై ట్విటర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యాదవ్ భాయ్.. మీరు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీ దగ్గరల్లోని రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. అయితే మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పోరాపాటు చేయవద్ద’ని పేర్కొన్నారు. అంతేకాకుండా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఒక మహిళ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆజం ఖాన్‌పై సోమవారం రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై జయప్రద కూడా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆజం ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శించారు. ఒకవేళ ఆజం ఖాన్ గెలిస్తే మహిళల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మహిళకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఆజం ఖాన్‌కు నోటీసులు జారీ చేసిన మహిళ కమిషన్ జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఆజాం ఖాన్ గతంలో పలుమార్లు మహిళలపై అసభ్య పదజాలం ఉపయోగించారని అన్నారు. ఆజం ఖాన్ ఈ ఎన్నికల్లో మహిళ నాయకురాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి అని తెలిపారు. అందుకే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి లేఖ రాశామని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని అతని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాన’ని అన్నారు. అయితే ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం ఆమె అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. దీనిపై ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌తో జయ ప్రద సంబంధాలపై చర్చ లేవనెత్తేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు అపకీర్తికరమైనవనీ, ఆయనకు అతి త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు. -
ఆజం ఖాన్‌పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను తను అన్నా అని పిలిస్తే.. అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు జయప్రద. ఆ తర్వాత ఎస్పీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీని వీడారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆజం ఖాన్.. నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను నాట్యగత్తె అన్నావు. నిజమైన సోదరులు ఎవరూ అలా మాట్లాడరు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అన్నారు. పద్మావత్ సినిమా చూసిన తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఖిల్జీ పాత్రను చూస్తే నాకు ఆజం ఖానే గుర్తుకు వచ్చాడు. గత ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సమయంలో అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు’ అని పేర్కొన్నారు. జయప్రద వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్ ఆమెను నాట్యగత్తె అని సంభోదించిన సంగతి తెలిసిందే. -
ఆజంఖాన్ నుంచి విముక్తికే పోటీ
లక్నో: తన ప్రత్యర్థి ఆజంఖాన్ నుంచి రామ్‌పూర్ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద అన్నారు. రామ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. ‘రామ్‌పూర్ ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నాను. ఆజం తాను పాల్పడుతున్న అక్రమాలను చట్టబద్ధం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ నేను ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను’ అని పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆజం తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఆయన ఏదైనా మాట్లాడగలడు. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదు. అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటు. కానీ రామ్‌పూర్ ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఓట్ల ద్వారానే వారు ఆయనకు గట్టి సమాధానం చెప్తారు. 2004లో నేను ముంబై నుంచి పోటీ చేసినప్పుడు ఆయన నా తరపున ఆయన ప్రచారం చేశారు. అప్పుడు ఆయనకు నేనెవరో తెలీదా? ఇప్పుడు నన్ను ‘అమ్రపాలి (నృత్యకారిణి), నాచ్ నే వాలీ’అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు’అని అన్నారు. -
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన జయప్రద
లక్నో : బీజేపీ తరఫున రామ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు సినీ నటి జయప్రద. పుట్టినరోజు సందర్భంగా బుధవారం నామినేషన్ వేశారు జయప్రద. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ మూలాన నేను రామ్‌పూర్‌ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు. తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక ‘దేవున్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మరోసారి ఈ యుద్ధంలో నన్ను గెలిపించు.. జనాలకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుకుంటున్నట్లు’ తెలిపారు. గతంలో జయప్రద రెండు సార్లు 2004, 2009లో రామ్‌పూర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఆజం ఖాన్ మీద చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2004 ఎన్నికల్లో ఆజం ఖాన్ జయప్రద తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న వారు కొద్ది బద్ద శత్రువుల్లా మారారు. -
బీజేపీలోకి జయపద్ర.. ఆజంఖాన్‌పై పోటీ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఆమె సోమవారం బీజేపీలో చేరుతారని, యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమెను కమలం పార్టీ బరిలోకి దింపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ రాంపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన జయప్రద-ఆజం ఖాన్ మధ్య బద్ధ వైరం నెలకొని ఉంది. తనపై యాసిడ్ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం చంద్రబాబునాయుడితో విభేదించి.. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్ నటిగా మంచి పేరు ఉండటంతో 2004లో ఆమెకు రాంపూర్ టికెట్‌ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారి ఎంపీగా గెలుపొందిన ఆమె.. అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్‌సింగ్‌తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్లో అమర్‌సింగ్‌ను తన గాడ్‌ఫాదర్‌గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సన్నిహిత్యంపై పలు విమర్శలు వచ్చినా.. ఆమె పెద్దగా పట్టించుకోరు. -
ఆ ఫోటోలు చూసి చనిపోవాలనుకున్న : జయప్రద
లక్నో : ‘అమర్ సింగ్‌ను నా గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్‌తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు. జయప్రద తొలుత సమాజ్‌వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్‌పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్‌సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్‌సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు. -
‘నేను బీజేపీ ఐటమ్ గర్ల్‌ని’
లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్ గర్ల్‌ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్ హౌస్ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్ మహాసభ సభ్యులు అజామ్ ఖాన్ మీద మంగళవారం (నిన్న) హజ్రత్గని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్‌గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్ మండిపడ్డారు. -
అలాగైతే ఇప్పుడే చస్తా..
లక్నో : సమాజ్‌వాది పార్టీ నేత ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికలశ్ యాత్రను ప్రస్తావించిన ఆజం ఖాన్ మరణించిన తర్వాత అంతటి గౌరవం ఇస్తామంటే తాను ఈ క్షణమే మరణిస్తానని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్పీ నేత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. కాగా వాజ్‌పేయి అస్థికలను వారణాసిలో పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేశారు. బీజేపీ దిగ్గజ నేతకు వేలాది మంది నివాళులు అర్పించారు. దివంగత నేత అస్థికల యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని 100 ప్రధాన నదులలో వాజ్‌పేయి అస్థికలను కలపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మరోవైపు వాజ్‌పేయి మృతిపై రాజకీయంగా లబ్ధిపొందాలనే బీజేపీ హడావిడి చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
భయపడి గోవును వెనక్కి ఇచ్చేశారు!
రామ్‌పూర్ : రోజురోజుకు మూకదాడులు.. హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం నేతలు ఆవులను పెంచుకునేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అజాంఖాన్ భార్య, రాజ్యసభ సభ్యురాలు తంజీమ్ ఫాతిమా తన ఇంట్లో ఆవుపై అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తనకు ఓ సాధువు నుంచి కానుకగా వచ్చిన ఆవును తిరిగిచ్చేశారు. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో ముస్లిం యువకుడు రగ్బర్ ఖాన్‌ను కొట్టి చంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘గోవధ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. మాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇటీవల ఓ సాధువు ఎంతో ప్రేమతో మాకు కానుకగా ఇచ్చిన గోవును గోశాలకే తిరిగి ఇచ్చేస్తున్నాం. మేం ముస్లింలం అయిన కారణంగా ఎవరైనా ఆ గోవును చంపేసి మా కుటుంబంపై నింద మోపుతారన్న భయంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని’ తంజీమ్ ఫాతిమా వివరించారు. గోశాలలకు రూ.25లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఏ హాయాంలోనే మైనార్టీలపై దారుణాలు జరుగుతున్నాయని, ముస్లింలకు రక్షణ కరువైందని విమర్శించారు. గోశాలలకు ముస్లింలు దూరంగా ఉండాలని, ముస్లింలు ఆవులను పెంచుకోవద్దని, పాల వ్యాపారం లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని అజాంఖాన్ పిలుపునిచ్చారు. మనం ఆవులను తాకితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘ఆ వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిది’
రాంపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆవులకు దూరంగా ఉండాల్సిందేనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన మూక హత్యను ఉటంకిస్తూ.. ఎప్పుడైతే గోవధను పూర్తి స్థాయిలో నిషేధిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండదంటూ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్.. భవిష్యత్ తరాల బాగుకోసమైనా మనం(ముస్లింలు) ఆవులు, పాల వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ‘గోమాతగా పిలుచుకునే ఆవులను తాకితే చాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవులతో వ్యాపారం చేసిన వాళ్లని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది కదా. భవిష్యత్ తరాలకు ఈ విషయం గురించి సవివరంగా చెప్పాల్సి ఉంటుందంటూ’ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. కాగా ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాంల పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. -
‘తాజ్‌మహల్‌ను కూల్చేద్దాం రండి’... వైరల్
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకప్పుడు అది శివాలయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు తనకు చెప్పారన్న అజాం ఖాన్.. యోగి ఆ తాజ్‌మహల్‌ను కూల్చి మళ్లీ ఆలయం కట్టాలనుకుంటే తాను అందులో భాగస్వామిని అవుతానని వెల్లడించారు. యోగి తాజ్‌మహల్‌ను కూల్చుతానంటే.. తనతో పాటు మరో 10 నుంచి 20వేల మంది ముస్లింలను పలుగు, పారలతో తీసుకొస్తానని ఎస్పీ నేత తన ట్వీట్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తాజ్ మహల్ కూల్చివేతలో పాలు పంచుకుంటాం. అయితే తాజ్‌మహల్‌పై తొలిదెబ్బ యోగి వేస్తే.. రెండోదెబ్బ కచ్చితంగా నాది అవుతుంది. ప్రపంచ వింత తాజ్‌మహల్ బానిసత్వానికి సంకేతమంటూ’యోగి ఆదిత్యనాథ్‌ను కవ్వించే యత్నం చేశారు అజాం ఖాన్. గతంలో పలువురు బీజేపీ నేతలు అయోద్యలో రామాలయం నిర్మిస్తామని, అదే విధంగా తాజ్‌మహల్‌ను కూల్చేసి గతంలో ఉన్న శివాలయాన్ని అదే స్థానంలో కట్టిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది మార్చిలో హిందూ మహాసభ విడుదల చేసిన క్యాలెండర్లో తాజ్‌మహల్‌ను ‘తేజో మహాలయం శివ మందిరం’అని, కుతుబ్ మినార్ను ‘విష్ణు స్తంభం’అని, కాశీలోని జ్ఞాన్‌వ్యాపి మసీదును ‘విశ్వనాథ ఆలయం’అని ప్రచురించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరిన్ని ముస్లింల కట్టడాలు, నిర్మాణాలను హిందువుల ఆలయాలుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అజాంఖాన్ తాజాగా తాజ్‌మహల్‌పై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
-
‘ఖిల్జీని చూస్తే అజంఖాన్ గుర్తొచ్చాడు’
రాయ్‌పూర్: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్‌ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు. -
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
-
జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు
లక్నో : సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజామ్ ఖాన్ నోరు జారారు. తనను ఖిల్జీగా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఆమెను ఓ డాన్సర్‌గా అభివర్ణించిన ఆయన ఆపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం ఓ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ.. ‘పద్మావత్ చిత్రం వచ్చింది. ఖిల్జీ పాత్ర చెడ్డదని విన్నా. ఖల్జీ రాకముందే పద్మావతి ప్రాణ త్యాగం చేసింది. కానీ, ఇప్పుడు ఓ డాన్సర్ నాపై వ్యాఖ్యలు చేస్తోంది. మరి ఈ డాన్సర్ పాడే పాటను వినుకుంటూ కూర్చుంటే.. రాజకీయాలపై నేనెలా దృష్టిసారిగలను? అంటూ అజామ్ వ్యాఖ్యానించారు. కాగా, ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజామ్ ఖాన్ గుర్తుకువచ్చాడని ఆమె పేర్కొన్న విషయం విదితమే. అజాం వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అభ్యంతరకర వ్యాఖ్యలపై అజామ్ క్షమాపణలు చెప్పాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఖిల్జీని చూస్తే అతనే గుర్తుకొచ్చాడు: నటి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు. తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్‌ను ఖిల్జీతో పోల్చారు. -
చేతిలోన చెయ్యేసి...
-
చేతిలోన చెయ్యేసి...
సాక్షి, లక్నో : వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేస్తారు. విమర్శలు-ప్రతివిమర్శల్లో ఎక్కడా తగ్గరు. వాళ్లిద్దరి వాయిస్‌ను.. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాక దేశమంతా గమనిస్తుంది. అటువంటి ఆ ఇద్దరు.. గురువారం సరదాగా సంభాషిస్తూ, హస్యోక్తులు విసురుకుంటూ.. ప్రాణ స్నేహితుల మాదిరిగా చేతిలోని చెయ్యేసి నడుచుకుంటే శాసనసభకు వచ్చారు. ఈ ఆశ్చర్యకర ఘటనకు యూపీ అసెంబ్లీ వేదికైంది. ఇద్దరూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మరొకరు సమాజ్ వాదీ పార్టీనేత ఆజంఖాన్. ఉత్తర ప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న సీఎం యోగి ఆదిత్యానాథ్, ఎస్పీ నేత ఆజంఖాన్.. ఇద్దరూ ఒకే సమయంలో అసెంబ్లీలో కారిడార్లోకి అడుగు పెట్టారు. ఒకరికొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు. తరువాత వివిధ అంశాలపై నడుస్తూ చర్చించారు. ఇంతలో ఆప్యాంగా ఆజంఖాన్ చేతిని యోగి ఆదిత్యనాథ్ తన చేతిలోకి తీసుకున్నారు. ఆజంఖాన్ కూడా అంతే ఆప్యాయంగా యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. గతంలో నమాజ్, సూర్య సమస్కారాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. దీనిపై ఆజం ఖాన్ స్పందిస్తూ.. అలా అయితే.. సూర్య సమస్కారాలకు బదులు నమాజ్ చేయవచ్చంటూ కూడా వ్యాఖ్యానించారు. -
‘ద్రోహులు నిర్మించిన కట్టడాలను కూలగొట్టండి’
సాక్షి, లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్న పార్లమెంట్ భవనాన్ని, రాష్ట్రపతి భవనాలను కూలగొట్టాలని కోరారు. భారతీయ సాంస్కృతిక సంపదలో తాజ్‌మహల్ భాగం కాదంటూ బీజేపీ నేత సంగీత్ సోం చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. బానిసత్వానికి మారు రూపుగా ఉన్న అన్ని కట్టడాలను ధ్వంసం చేయాలన్నారు. ‘మొగలాయీలు భారతదేశాన్ని ఆక్రమించుకున్నది నిజమే. వారు ఎలా వచ్చారు ? ఎవరు తీసుకువచ్చారు ? అనే విషయాలను నేను ప్రస్తావించదలుచుకోలేదు. అది మరో పెద్ద దుమారానికి దారితీస్తుంది. కొందరికి ఇలాంటి నిజాలు నచ్చవు’ అని ఆయన అన్నారు. ద్రోహులు నిర్మించిన కట్టడాలైన పార్లమెంట్, రాష్ట్రపతి భవనాలను ముందుగా బాద్షా, యంగ్ బాద్షా(ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి)లను కూలగొట్టనివ్వండి. తర్వాత తాజ్‌మహల్ జోలికి వెళ్లండి అని ఆయన కోరారు. -
బానిస కట్టడాలు.. కూల్చేయండి
సాక్షి, లక్నో : ప్రముఖ కట్టడాల జాబితాల నుంచి తాజ్ మహల్ తొలగింపు మాటేమోగానీ తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మరో నేత దానిని కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్క తాజ్ మహలే కాదు.. పార్లమెంట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ వాటిని కూడా వారసత్వ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. వివాదాల పుట్ట అజాం ఖాన్. సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి అయిన అజాం ఖాన్ మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ... మొగలుల కాలంలో నిర్మితమైన కట్టడాలపై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాజ్ మహల్ ఒక్కటే కాదు.. జాతి సంపదలుగా చెప్పుకుంటున్న రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఎర్రకోట, కుతుబ్ మినార్ ఇవన్నీ బానిసత్వానికి ప్రతీకలే. అలాంటప్పుడు వాళ్లు(యూపీ ప్రభుత్వం) వాటిని కూడా ప్రముఖ కట్టడాల జాబితా నుంచి తొలగించి కూల్చేయాల్సిందే అని అజాం ఖాన్ అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆదిత్యానాథ్ ఆరు నెలల పాలన పూర్తి అయిన సందర్భంలో యూపీ ప్రభుత్వం ఓ బుక్లెట్ విడుదల చేయగా.. అందులో పర్యాటక ప్రాంత జాబితా నుంచి తాజ్ మహల్‌ను తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపించగా... ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు మంట పెట్టాయి. వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది' అని సంగీత్ సోమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
భారత సైన్యంపై సంచలన ఆరోపణ
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ వివాదాస్పద నేత అజాం ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సైన్యం తనకు యుద్ధ ట్యాంక్‌ను బహుమతిగా ఇచ్చిందని ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఆర్మీపై ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి సైన్యం గురించి స్పందించారు. మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి ఈ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపకుడిగా, ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఈ యూనివర్సిటీ కోసమే యుద్ధ ట్యాంకర్‌ను ఆర్మీ బహుమతిగా ఇచ్చిందంట. ‘నాకు సైన్యం అంటే గౌరవం లేదని కొందరు విమర్శిస్తున్నారు. కానీ, మా మధ్య ఆయధ సంపత్తితో కూడిన మంచి సంబంధాలు ఉన్నాయి. అధునాతన ఆయుధాల అధ్యయనం కోసం వారిని సంప్రదించగా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా విద్యాలయానికి సైన్యం యుద్ధ ట్యాంకర్‌ను కూడా బహుకరించారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి’ అని అజాం ఖాన్ తెలిపారు. అజాం ప్రకటనపై స్పష్టత కోసం మీడియా లక్నోలో కేంద్ర కమాండో దళాన్ని సంప్రదించగా... అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఆర్మీ రేపిస్టులపై మహిళలు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ... సైన్యం దేశ నైతికతను దెబ్బతీస్తోందంటూ గతంలో అజాం ఖాన్ వ్యాఖ్యలు చేసింది విదితమే. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది కూడా. అయితే తాను మాట్లాడే ప్రతీ మాటను కావాలనే విమర్శలు చేస్తున్నారని.. బీజేపీకి తాను ఓ ఐటెం గర్ల్ అయిపోయానంటూ అజాంఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
‘తాజ్‌ను కూల్చేస్తే మద్దతు ఇస్తా’
లక్నో : వివాదాలతో సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్‌మహల్ పేరును పేర్కొనలేదు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను యోగి ఆదిత్యనాథ్ సర్కారు విస్మరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆజమ్ ఖాన్ స్పందించారు. తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే తాజ్‌మహల్ కూల్చివేయాలని ఆయన చాలా ఏళ్లుగా అంటున్నారు. తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలని గతంలో వ్యాఖ్యానించి దుమారం రేపారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలను కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూల్చివేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్‌మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదని అప్పట్లో అన్నారు. -
ఎస్పీ నేత అజం ఖాన్‌పై కేసులు నమోదు
-
ఎస్పీ నేత అజం ఖాన్‌పై కేసులు నమోదు
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై హజ్రత్ జంగ్, రాంపూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. సైనికుల మనోభావాలను దెబ్బతినే విధంగా అజం ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. కాగా మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు తాను భారత సైన్యాలను కించపరిచేవిధంగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. -
నేను బీజేపీ ఐటెం గర్ల్‌ను..
లక్నో: ‘నేను బీజేపీకి ఐటెం గర్ల్‌గా మారాను. వారికి నేను తప్ప ఇంకా ఎవరు కనిపించడం లేదు మాట్లాడటానికి. అందుకే ఇక్కడ (ఉత్తరప్రదేశ్) ఎన్నికల్లోనూ నా మీద ఫోకస్ చేశారు’ అని వివాదాస్పద ఎస్పీ నేత ఆజంఖాన్ పేర్కొన్నారు. సైన్యాన్ని ఉద్దేశించి తాజాగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆజంఖాన్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ‘నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది. నా కారణంగా ఆర్మీ నైతికత ఎందుకు దెబ్బతింటుంది? ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడే ఆర్మీ నైతికత దెబ్బతిన్నది’ అని అన్నారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని, సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలంటూ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
‘రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోండి’
లక్నో: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి కలకలం రేపారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని సూచించారు. సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలని అన్నారు. పశ్చిమ యూపీలోని రాంపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్ లాంటి సున్నిత రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దురాగతాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్, జార్ఖండ్, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి. ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశం దారి తప్పింది. బ్యాలెట్ బదులుగా బుల్లెట్ విధానాన్ని స్వీకరించింది. పర్యవసానం ఎలా ఉందో మనమంతా చూస్తున్నామ’ని ఆజంఖాన్ అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలని గత నెలలో ఆయన సలహాయిచ్చి వివాదంలో చిక్కుకున్నారు. -
మహిళలకు మాజీ మంత్రి షాకింగ్ సలహా
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో వార్తలు నిలిచారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలు అని ఆయన షాకింగ్ సలహా ఇచ్చారు. తన జిల్లా రాంపూర్‌లో ఇద్దరు అమ్మాయిలను 14మంది ఆకతాయిలు అత్యంత దుర్మార్గంగా లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి సర్కారు వచ్చిన తర్వాత నేరాలు అమాంతం పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఒకవైపు సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా అందుకు భిన్నంగా ఆజంఖాన్ స్పందించారు. 'రాంపూర్‌లో అమ్మాయిలను వేధించిన ఘటనలో ఆశ్చర్యపోవడానికేముంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగిపోయాయి' అని ఆయన అన్నారు. బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత మహిళలు ఇంట్లో ఉండేలా పురుషులు చూసుకోవడమే మంచిది. అమ్మాయిలు కూడా అసభ్య ఘటనలు చోటుచేసుకునే ప్రదేశాలకు వెళ్లకూడదు' అంటూ ఆయన సలహా ఇచ్చారు. 14 ఏళ్ల కూతురిని, తల్లిని గ్యాంగ్‌రేప్ చేసిన బులంద్‌షహర్ ఘటనపై అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ ప్రభుత్వాన్ని బద్నా చేసే రాజకీయ కుట్రతోనే ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొనడం దుమారం రేపింది. -
నేను చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ?
ఎవరికైనా సెక్యూరిటీ తగ్గిస్తే వాళ్లు హత్యలకు గురైన ఘటనలు చాలా ఉన్నాయని.. ఇప్పుడు తనకు సెక్యూరిటీ తగ్గించడం వల్ల రేపు తాను మరణిస్తే అందుకు బాధ్యత ఎవరిదని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మండిపడ్డారు. శనివారం నాడు తనకు బెదిరింపు లేఖలు వచ్చాయని, ఆదివారం నాడు తన సెక్యూరిటీని సమీక్షించి తగ్గించేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రుల్లో ఆజమ్ ఖాన్ ఒకరన్న విషయం తెలిసిందే. తనకు భద్రత తగ్గించడంపై తీవ్రంగా ఆవేదన చెందన ఆయన.. రాంపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆజమ్‌ఖాన్‌కు ఇంతకుముందు వరకు వై ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉండేది. ఇప్పుడు ఆయనకు భద్రత కొంత తగ్గించినా, ఇప్పటికీ ఆయన వెంట సాయుధ గార్డులు ఉంటూనే ఉంటారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, డీజీ (సెక్యూరిటీ)లతో కూడిన రాష్ట్ర భద్రతా కమిటీ నిశితంగా పరిశీలించి, వందమంది వ్యక్తులకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను సమీక్షించింది. ఆజమ్ఖాన్తో పాటు సమాజ్‌వాదీ నేతలు రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ తదితరుల భద్రతను కూడా తగ్గించారు. వంద మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు, సలహాదారులకు కూడా భద్రతను ఇంతకుముందు కంటే కాస్త తగ్గించారు. తాజా సమీక్ష తర్వాత కనీసం 1200 మంది భద్రతా సిబ్బంది తమకు అదనంగా మిగులుతారని, వాళ్లను సంబంధిత జిల్లాల్లో శాంతిభద్రతల విధుల్లో నియమిస్తామని భద్రతా కమిటీ సభ్యులు చెప్పారు. -
రామమందిరం కోసం ట్రక్కు ఇటుకలతో వచ్చి..
అయోధ్య: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం విషయంలో సామరస్యపూర్వకమైన పరిష్కారం తప్పకుండా లభిస్తుందని అనుకుంటుండగా కొంతమంది ముస్లిం కరసేవకులు రామమందిరం నిర్మాణం పేరిట వచ్చి హల్చల్ చేశారు. ముస్లి కరసేవక్ మంచ్(ఎంకేఎం) పేరిట ఒక బ్యానర్ ఓ ట్రక్కుకు కట్టుకొని దాని నిండా ఇటుకలు పేర్చుకొని అయోధ్యలోకి అడుగుపెట్టారు. రామమందిరం నిర్మాణం కోసం అని చెబుతూ జై శ్రీరాం అంటూ నినాదాలతో దారి పొడవునా హోరెత్తించారు. ఎంకేఎం అధ్యక్షుడు ఆజం ఖాన్ దీనిపై స్పందిస్తూ తాము రామమందిర నిర్మాణానికి సహాయం చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. మరికొందరు మాట్లాడుతూ లక్నోలోని ఓ బస్తీ, వివిధ జిల్లాల నుంచి ఆలయం నిర్మాణంకోసం ఇటులతో వచ్చినట్లు చెప్పారు. అయితే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి వెనక్కు పంపించేశారు. అనంతరం ఆ ప్రాంతంలోకి అనుమతించకుండా ఒక రోజంతా తాళం వేశారు. అయితే, తాము తీసుకొచ్చిన ఇటుకలను తీసుకొని భద్రంగా పెట్టాలని స్థానిక విశ్వహిందూ పరిషత్ సభ్యులను కోరినట్లు తెలిసింది. గతంలో కూడా రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా ఆజంఖాన్ లక్నోలో పోస్టర్లు పెట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. -
గోవును తిరిగిచ్చేసిన మాజీ మంత్రి
రాంపూర్: గోవర్థన పీఠం శంకరాచార్య తనకు కానుకగా ఇచ్చిన గోవును సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తిరిగిచ్చేశారు. గోమాతకు ఎవరైనా హాని తలపెడితే తనకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు లేఖ రాశారు. ‘ముస్లింలు నేడు అభద్రతా వాతావరణంలో నివసిస్తున్నారు. నా దగ్గరున్న ఆవుకు గోపరిరక్షులు ఎవరైనా హాని తలపెట్టినా లేదా చంపినా నాకు, ముస్లిం కమ్యునిటీకి చెడ్డపేరు వస్తుంద’ని లేఖలో పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా దేశంలో దుష్ట ప్రచారం మొదలైందని వాపోయారు. ముస్లింల పరిస్థితి బానిసల కన్నా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన గోశాలలో పెంచుకుంటానని అడగంతో 2015లో ఆజంఖాన్ కు గోవును గోవర్థన పీఠం శంకరాచార్య బహుమతిగా ఇచ్చారు. తనకు ఇచ్చిన ఆవును చాలా జాగ్రత్తగా చూసుకున్నానని ఆజంఖాన్ తెలిపారు. భద్రతా కారణాల రీత్యా దాన్ని తిరిగిచ్చేస్తున్నానని చెప్పారు. మాంసం అమ్మకాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని విమర్శించారు. వీవీఐపీలకు మాంసం తినేందుకు అనుమతించిన బీజేపీ సర్కారు సామాన్యులపై అనవసరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. -
దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించండి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కబేళాలను మూసివేయించడాన్ని ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ తప్పుపట్టారు. దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 'కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కబేళాలు నిర్వహించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేశారు? మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు? దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలి. ఇలాంటి అంశాలపై దేశమంతా ఒకే చట్టం ఉండాలి' అని ఆజం ఖాన్ అన్నారు. యూపీలో లైసెన్స్ ఉన్న కబేళాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న కబేళాలలో గోవులను వధించవచ్చని, అనుమతి లేని చోట్ల ఈ పని చేయరాదనేది ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందని అన్నారు. లైసెన్స్ ఉన్న, లైసెన్స్ లేని కబేళాలు అన్న పద్దతికి స్వస్తి చెప్పి, అన్నింటినీ మూసివేయించాలని, ఏ జంతువునూ సంహరించరాదని చెప్పారు. కొన్ని మతాలకు చెందిన వారు కోడి, మేక మాంసం కూడా తినరని పేర్కొన్నారు. గొడ్డు మాంసం తినడం మానేయాలని ముస్లింలకు ఆజం ఖాన్ సూచించారు. -
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
-
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
రాంపూర్: ఇటీవలే జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మాజీ మంత్రి ఆజం ఖాన్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. రాంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆజం ఖాన్.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యం వీడియో కెమెరాలో రికార్డయ్యింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తాను బురద రోడ్డులో వెళ్లి విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆజాం ఖాన్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి తన కారును అనుమతించనందుకు ఆజంఖాన్.. గుప్తాను పరుష పదజాలంతో హెచ్చరించారు. 'ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ ఉండదు. అప్పుడు నీ సంగతి తేలుస్తా. నేను బురద రోడ్డులో నడిచి వచ్చేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా. బదిలీ చేయాలని వేడుకొంటావు. అధికారముందని ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఆజంఖాన్ చిందులు తొక్కారు. ఈ మాటలన్నీ వీడియో కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్పీ సీనియర్ నేత అయిన ఆజం ఖాన్.. అఖిలేష్ యాదవ్ మంత్రి వర్గంలో పనిచేశారు. గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు, చర్యలతో వివాదాస్పదమయ్యారు. -
యూపీ అసెంబ్లీలో 485 స్థానాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మొత్తం 485 స్థానాలు ఉన్నాయట. అదేంటి ఉన్నది 403 స్థానాలే కదా. అదంతే.. వివాదాస్పద మంత్రి ఆజంఖాన్ లెక్కల ప్రకారం యూపీ అసెంబ్లీలో 485 సీట్లు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన ఈ లెక్కలు చెప్పారు. సమాజ్ వాదీ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా చేశారు. తమ పార్టీకి 380 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఎస్పీకి 80 సీట్లు, బీజేపీకి 25 స్థానాలు దక్కుతాయని అంచనా కట్టారు. ఈ అంకెలు అన్నీ కలుపుకుంటే 485. కానీ శాసనసభలో ఉన్నది 403 సీట్లే. మిగతా సీట్లు ఎక్కడున్నాయో ఆజంఖాన్ కే తెలియాలి. ఎన్నికల ఫలితాల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా అలాంటి పరిస్థితి రాదని, తమకు 380 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. కచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని, తనపై నమ్మకం ఉంచాలని అన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికలయ్యాక హాజరవుతా.. సుప్రీంతో ఆజంఖాన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి ఆజం ఖాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనకు అలహాబాద్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఉన్నత న్యాయ స్థానం ఆశ్రయించారు. రాష్ట్రానికి చెందిన జల్ నిఘం సంస్థకు గతంలో ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరించిన ఆజం ఖాన్‌పై అక్రమాల కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోర్టుకు హాజరుకాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆజం ఖాన్ తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ బెంచ్‌కు తన పిటిషన్ ఇస్తూ మార్చి 11నాటికి తన క్లెయింట్(ఆజం ఖాన్) హైకోర్టుకు హాజరవుతారని, ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అనుమతివ్వాలని అందులో కోరారు. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించనుంది. -
మంత్రి హెలికాప్టర్.. అత్యవసర ల్యాండింగ్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆజంఖాన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జహంగీరాబాద్ సమీపంలోని కరండ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య కారణంగా దీన్ని అక్కడ దించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. లక్నో నుంచి బహ్రైచ్ వెళ్లాల్సిన ఈ హెలికాప్టర్లో ఏ రకమైన సాంకేతిక సమస్య వచ్చిందో మాత్రం తెలియలేదు. అయితే ఖాన్ వెళ్తున్న దీన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి రావడంతో ఏమవుతుందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు గ్రామంలోనే అయినా సురక్షితంగా కిందకు దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్లో ఉన్నవాళ్లంతా సురక్షితంగానే ఉన్నారని, అది కిందకు దిగిన తర్వాత ఆజం ఖాన్‌ను రోడ్డు మార్గంలో లక్నో పంపామని పోలీసు సూపరింటెండెంట్ రాజాబాబు తెలిపారు. -
ప్రధాని మోదీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
రాంపూర్: ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్.. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆజం ఖాన్ నేరుగా పేరు ప్రస్తావించకుండా మోదీని రావణుడితో పోల్చారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఆజం ఖాన్ మాట్లాడుతూ.. '130 కోట్ల మంది భారతీయులను పరిపాలిస్తున్న రాజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు లక్నో వెళ్లారు. ఆయన ఓ విషయం మరిచారు. అతిపెద్ద రావణుడు లక్నోలో లేడు, ఢిల్లీలో నివసిస్తున్నారు' అని అన్నారు. ప్రధాని మోదీ సంపన్నుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. మంత్రి ఆజం ఖాన్ గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన మంత్రి
సమాజ్‌వాదీ పార్టీలో అగ్రనాయకుడు, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ తాను చేసిన గ్యాంగ్‌రేప్ వ్యాఖ్యలకు గాను బేషరతుగా క్షమాపణ చెప్పారు. బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఒక రాజకీయ కుట్ర అని ఇంతకుముందు వ్యాఖ్యానించినందుకు బేషరతుగా క్షమాపణ కోరుకుంటున్నట్లు ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఆయన క్షమాపణలను ఆమోదించింది. ఇంతకుముందు ఆయన దాఖలు చేసినవి బేషరతు క్షమాపణలు కాకపోవడంతో.. వాటిని కోర్టు తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఇంతకుముందు ఖాన్ వ్యాఖ్యానించారు. ఆజంఖాన్ ఇంతకుముందు దాఖలు చేసిన క్షమాపణలను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మహిళల ఆత్మగౌరవం విషయంలో రాజీపడేది లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధితురాలైన బాలికను కేంద్రప్రభుత్వ స్కూల్లో చేర్చి సంరక్షించాలని కోర్టు యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. -
మోదీ ప్రధాని కాదు బాద్షా!
లక్నో: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆయన ప్రధానమంత్రిలాగా ఎప్పుడూ ఉండలేదు. బాద్షాలానే వ్యవహరించారు. మరి బాద్షాలు ఇలాగే ఉంటారు' అని ఆజంఖాన్ మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. 'నోట్లు అందరికీ చేరుతున్నా చేరకపోయినా.. ప్రధాని మోదీ సందేశం మాత్రం అందరికీ చేరుతోంది. ఆయన 'మన్‌కీ బాత్'ను సామాన్యులు వింటున్నారు. కానీ వారి మాటను మోదీ వినడం లేదు' అని పేర్కొన్నారు. -
ఆజంఖాన్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: బులంద్‌షెహర్ సామూహిక అత్యాచార ఘటనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన క్షమాపణలు కోరిన సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన క్షమాపణ కోరగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆజంఖాన్ బేషరతుగా క్షమాపణ కోరలేదని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది. సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికను డిగ్రీ వరకు చదివించేందుకు అవసరమైన ఖర్చు భరించేందుకు ఆజంఖాన్ ముందుకు రాగా, బాధితురాలి తిరస్కరించింది. జూలైలో బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆజంఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. -
యూపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. నల్లధనంతో బ్యాంకులకు వచ్చే ముఖాలకు నల్లరంగు పూలమాలని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. ఇలా చేస్తే మరోసారి నల్లధనం పట్టుకురారని చెప్పారు. నల్లకుబేరులు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా జంకుతారని అన్నారు. పాత పెద్ద నోట్ల మార్పిడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబా బ్యాంకుకు వెళ్లి వరుసలో నిలబడడంపై ఆజంఖాన్ స్పందించారు. హీరాబా బ్యాంకుకు వెళుతున్నారని తెలిస్తే ఆమెకు బదులు తానే క్యూలో నిలబడేవాడినని, పెద్దావిడ కష్టపడకుండా చూసేవాడినని అన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న రాయ్ సన్ గ్రామంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో మంగళవారం హీరాబా రూ.4500 నగదు మార్చుకున్నారు. తల్లిని కష్టపెట్టారని ప్రధాని మోదీపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. -
వాళ్లు ఎవరైనా కాల్చిపారేయాల్సిందే!
లక్నో: భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత పోలీసుల చేతిలో హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ ఘటనపై ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ స్పందించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారందరినీ చంపేయాల్సిందేనని, వారు సిమీ ఉగ్రవాదులా? లేక వేరేవారా? అన్నది చూడకూడదని వ్యాఖ్యానించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్ నివాసాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ సందర్శించడంపైనా ఆయన తనదైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ జవాను నివాసాన్ని సందర్శించారని పేర్కొన్నారు. -
ఇలా జరుగుతుందని ముందే తెలుసు: ఆజంఖాన్
లక్నో: నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీలో భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ అనుంగుడు, అఖిలేష్ మంత్రివర్గంలో సీనియర్ అయిన ఆజం ఖాన్.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తాను ముందే ఊహించానన్నారు. ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆజం ఖాన్.. 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటి పరిణామాలు తప్పవు. వాళ్లు మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టినప్పుడే ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించా'అని పరోక్షంగా అమర్ సింగ్ విమర్శించారు. కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవర్ని తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆమేరకు అఖిలేష్ వ్యవహరించారని ఆజం ఖాన్ అన్నారు.(సీఎం సంచలన నిర్ణయం:యూపీలో రాజకీయ కలకలం) అమర్ సింగ్ పునరాగమనంతో సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గతపోరులో ములాయం సింగ్ యాదవ్ ప్రియ సహోదరుడు శివపాల్ యాదవ్ ఒకవైపు ఉండిపోగా, సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరోవైపునకు చేరారు. రెండు వర్గాలకు మధ్య సమన్వయం చేసేందుకు నేతాజీ ములాయం చేసిన ప్రయత్నాలన్ని బెడిసికొట్టడం చివరికి మంత్రుల ఉద్వాసనకు దారితీసింది. -
అజాంఖాన్‌కు సీబీఐ చిక్కులు
లక్నో: బులంద్ షహర్ లైంగిక దాడికి సంబధించి ఉత్తరప్రదేశ్ మంత్రి అజామ్ ఖాన్‌కు నోటీసులు పంపించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన లైంగిక దాడిపట్ల నిర్లక్ష్యంగా స్పందించడమే కాకుండా ఈ లైంగిక దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులను చిన్నచూపు చూడటం తగదని, తక్కువ చేసి మాట్లాడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఎందుకు అధికారంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను తప్పక రక్షించాలి. బాధితుల విశ్వాసాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పోగొట్టుకోకూడదు' అంటూ అజాంఖాన్ వ్యాఖ్యలపై నాడు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సీ నాగప్పన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నేపథ్యంలోనే తాజాగా అజాం ఖాన్ నుంచి వివరణ కోరేందుకు నోటీసులు ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ప్రధానిగా అయ్యే అర్హతలున్నాయ్ కానీ..
బారాబంకి : నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే నేతగా పేరున్న సమాజ్ వాది పార్టీ లీడర్ అజమ్ ఖాన్ మరో సంచలన కామెంట్లు చేశారు. తనకు ప్రధానిగా అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయట. కానీ తాను ముస్లిం కావడమే ప్రధాన సమస్యని వ్యాఖ్యానించారు. తనను ప్రధానిగా చేస్తే దేశాన్ని ఎలా పరిపాలించాలో చూపిస్తానన్నారు. ప్రధానిగా అయ్యే లక్షణాలు విద్యా, అనుభవం, నిజాయితీ, నిర్వహాణలో నైపుణ్యం, అన్నీ తనకున్నాయని పేర్కొన్నారు. తాను ముస్లిం కావడమే లోపం తప్ప మరే ఇతర కారణాలు లేవని హాస్యస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యూరీలో ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అజమ్‌ఖాన్ అభివర్ణించారు. యూరీ ఉగ్రఘాతుకంపై కేంద్రం తీసుకున్న విధానాలేమిటని ప్రశ్నించారు. తనను ప్రధానిగా చేసిన ఏడాదిలోపే కశ్మీర్ సమస్యను ఓ కొలిక్కి తీసుకొస్తానని.. అఖండ భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలను మొరిగే కుక్కలుగా ఖాన్ అభివర్ణించారు. ఆ విమర్శలు తన పనితీరుపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని కొట్టిపారేశారు. సమాజ్‌వాదీ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందంటూ బయటవారు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పిన మాదిరిగా సమాజ్ వాదీ కుటుంబం ఎల్లప్పుడూ సమైక్యంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. కుటుంబం సమైక్యంగా, ధృడంగా ఉన్నప్పుడు, బయట శక్తులు ఏమీ చేయలేవని చెప్పారు. కొడుకు అఖిలేష్ యాదవ్ అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్‌సింగ్‌ను సమాజ్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. ఈ నిర్ణయంతో మరోసారి అఖిలేష్‌కు తండ్రి ములాయం చెక్ పెట్టినట్టైంది. -
మోదీపై వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం!
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సోమవారం సభలో చర్చిస్తుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఆజంఖాన్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'మన దేశ బాద్షా తన తల్లిని వెంట ఉంచుకోరు, కానీ శత్రువు తల్లికి కానుకలు ఇస్తారు. భార్యను వదిలేసిన ఆయన 'బేటీ బచావో' (కూతుళ్లను కాపాడండి) అంటూ పేర్కొనడం విడ్డూరం' అని పేర్కొన్నారు. 2014లో తన ప్రమాణ స్వీకార వేడుకకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమ్మకు మోదీ శాలువను కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత షరీఫ్ తల్లికి చీరను ఓసారి మోదీ పంపించారు. అయితే, ఆజంఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ వెల్‌లోకి ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ మాతాప్రసాద్ పాండే హామీ ఇచ్చినా బీజేపీ సభ్యులు వినకపోవడంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
సీనియర్ మంత్రికి సుప్రీంకోర్టు చివాట్లు!
న్యూఢిల్లీ: బులంద్‌షెహర్ గ్యాంగ్‌రేప్ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌ను సుప్రీంకోర్టు మందలించింది. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల రాజకీయ కుట్ర ఉందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆజంఖాన్‌ను ఆదేశించింది. ఈ గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయ కుట్ర అని, అఖిలేశ్ సర్కారును బద్నాం చేసేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆజంఖాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపంలో ఉండటంతో ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతాయని, కాబట్టి ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుపాలని ఆయన అన్నారు. యూపీలోని బులంద్షహెర్ సమీపంలో బందిపోటు దొంగలు ఓ కుటుంబంపై విరుచుకుపడి.. వారి డబ్బు, నగలను దోచుకున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబంలోని పురుషులను తుపాకీతో బెదిరించి.. మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తీరును తప్పుబడుతూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో కేసు నమోదుచేసింది. -
'అజాంఖాన్‌కు సుప్రీం మొట్టికాయలు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్లో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక మంత్రి స్థాయి వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడం అనుచితం అని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినట్లుందని అభిప్రాయపడింది. అంతేకాదు.. 'మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని' ప్రశ్నిస్తూ మంత్రి అజాం ఖాన్‌కి నోటీసులు పంపించింది. 'న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల నమ్మకం సన్నగిల్లేలా అధికారంలో ఉన్న వ్యక్తులుకానీ, అధికార సంస్థగానీ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారసలు' అని సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో ప్రశ్నించింది. ఈ నెల(ఆగస్టు) తొలివారం బులంద్ షహర్ జాతీయ రహదారి 91పై వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసి అందులోని గృహిణి ఆమె పదమూడేళ్ల కూతురుపై కొంతమంది దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీటిని ఖండించే క్రమంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నేడు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ పై కేసు నమోదు చేయాలని బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ మైనర్ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. జూలై 29న బులంద్‌షహర్ ప్రాంతంలో తల్లీకూతుళ్లపై కామాంధులు సామూహిక అత్యారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసును అలహాబాద్ హైకోర్టు సుమోటో గా స్వీకరించింది. సీబీఐ దర్యాప్తు చేయించాలని శుక్రవారం ఆదేశించింది. -
ఆ మంత్రి పిచ్చోడు..!!
లక్నో: తల్లీకూతుళ్ల మీద అమానుషంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆజంఖాన్‌కు పిచ్చెక్కిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని బాధితురాలి మామ మండిపడ్డారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. ‘ఆజంఖాన్‌కు పిచ్చి పట్టినట్టు కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామం సమీపంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆజంఖాన్ స్పందిస్తూ.. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు. -
ఆ గ్యాంగ్‌రేప్ వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర!
ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు లక్నో: తల్లీకూతుళ్లపై గ్యాంగ్‌రేప్ ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను రాజకీయంగా కుదిపేస్తున్నది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ అమానుష ఘటన చుట్టూ సహజంగానే రాజకీయాలు తిరుగుతున్నాయి. గత శుక్రవారం రాత్రి బులంద్‌షెహర్ గ్రామంలో తల్లీకూతుళ్లపై ఎనిమిది మంది బందిపోట్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేతల బృందం బులంద్‌షెహర్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వచ్చింది. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో అఖిలేశ్ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ఘటనపై యూపీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేశారు. ఈ గ్యాంగ్‌రేప్ ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉంది. ఓట్ల కోసం ప్రజలు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇందుకోసం ముజాఫర్‌నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగి ఉండకూడదు. అధికారం కోసం రాజకీయనేతలు ప్రజల్ని చంపుతారు. అల్లర్లు సృష్టిస్తారు. అమాయకుల్ని బలి తీసుకుంటారు. కాబట్టి ఈ ఘటనలో సత్యం వెలికి తీయాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ వెంటనే తిప్పికొట్టింది. కనీస మానవత్వముంటే ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపాలని కోరారు. -
మరో వివాదంలో మంత్రి అజంఖాన్
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజంఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ అధికారిపై ఆయన చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపూర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ నిర్మాణపు పనుల్లో జాప్యం జరుగుతోందంటూ అజంఖాన్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఇంజనీర్ చెంపమీద కొట్టారు. మరోవైపు అజంఖాన్ చర్యను నిరసిస్తూ ఇంజనీర్లు నిర్మాణపు పనులను నిలిపివేశారు. తక్షణమే మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ నిర్మాణపు పనులను చేపట్టేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ అజంఖాన్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
మంత్రిగారి గేదెలు స్పెషలా?
ఉత్తరప్రదేశ్‌లోని బరియాపూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ పాండేకు చెందిన ఎద్దును ఎవరో దొంగిలించారు. తానెంతో ఇష్టంగా చూసుకునే ఎద్దు కనిపించకపోయేసరికి మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడువారాలైనా ఎలాంటి ప్రయోజనం లేదు. పోలీసుల తీరుపై చిర్రెత్తుకొచ్చిన మనోజ్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. ‘యూపీ సీనియర్ మంత్రి అజంఖాన్ గేదెలు పోతే 24 గంటల్లోగా వెతికితెస్తారు. నా ఎద్దు పోతే 24 రోజులైనా స్పందించరా? ఇదేం న్యాయం’ అంటూ ప్రశ్నిస్తూ పోస్టర్లను ముద్రించి బరియాపూర్‌లో పలుచోట్ల వేశాడు. 2014 ఫిబ్రవరిలో అజంఖాన్‌కు చెందిన ఏడు గేదెలు అపహరణకు గురైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారని ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారట. 24 గంటల్లో వాటిని వెతికిపట్టుకున్నారు. సామాన్యుడికో న్యాయం... మంత్రికో న్యాయమా అని మనోజ్ వేసిన పోస్టర్లు స్థానికుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. అందరూ వీటిని ఆసక్తిగా చదవడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మంత్రిగారి ఫోటోను మార్ఫింగ్ చేసి అవమానించారని మనోజ్‌పై కేసు పెట్టారు. -
'ముందు పెళ్లి చేసుకుని నిరూపించుకో'
లక్నో: బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్ వాది పార్టీ మంత్రి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేత అజాం ఖాన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆధిత్యనాథ్ ఇతరులపై విమర్శలు మాని ముందు పెళ్లి చేసుకోవాలని, తానెంటో నిరూపించుకోవాలని, తండ్రిగా మారాలని అన్నారు. అలా చేయడం వల్ల అతడి తరం పెరుగుతుందని చెప్పారు. 'అతడు(ఆధిత్య నాథ్) తప్పకుండా ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి. అది అతడి తరాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది' అని ఆయన అన్నారు. అలాగే.. తలాక్ వ్యవస్థను తప్పుబడుతూ మరో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు. ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తా ఇలాంటి విషయాల గురించి మాట్లాడేది అని అన్నారు. అయినా.. రేపిస్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి మనిషి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. అలాగే, బాలీవుడ్ నటుడు గోవిందాపై యూపీ గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందన కోరగా.. ఆయనను రామ్ నాయక్ అనొద్దని.. రామ్ నాయక్ గారు అనాలని, ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్ అని మర్చిపోతే ఎలా అని మీడియాతో హితవు పలికారు. -
'రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్‌ను కూల్చాలి'
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. గతంలో తాజ్‌మహల్ కూల్చి శివాలయం నిర్మించాలంటూ వివాదాన్ని సృష్టించిన ఆయన.. తాజాగా మరో వివాదాన్ని రగిలించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు. రాంపూర్‌లోని డిగ్రీ కళాశాలలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలు బానిసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. ఈ వరుసలో ముందు తాజ్‌మహల్, తరువాత రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ నిలుస్తున్నాయన్నారు. అందుకే వాటికి పడగొట్టాలన్నారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదన్నారు. అదొక క్రిమినల్ వేస్ట్ అంటూ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'దావూద్ తో మోదీ భేటీ'పై రగడ
లక్నో: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రధాని మోదీ కలిశారన్న యూపీ మంత్రి అజాం ఖాన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. డాన్ తో ప్రధాని భేటీ నిజమని నిరూపించాలని, లేదంటే ఆజాం ఖాన్ ను వెంటనే మంత్రి పదవినుంచి తొలిగించాలని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను డిమాండ్ చేశారు. మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన పాఠక్.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి ఆజం ఖాన్ ను సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వం వెనకేసుకురావటం విడ్డూరంగా ఉందన్నారు. గతేడాది చివర్లో అకస్మాత్తుగా లాహోర్ (పాకిస్థాన్) వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. నవాజ్ షరీఫ్ నివాసంలోనే మాఫియా డాన్ దావూద్ ను కలుసుకున్నారని మంత్రి ఆజం ఖాన్ రెండు రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ములాయం పుట్టినరోజు వేడుకలకు దావూద్ డబ్బు పంపినట్లు ఆజాం చెప్పిన మాటలను ఉటంకించిన బీజేపీ యూపీ చీఫ్.. పిచ్చివాగుళ్లు కట్టిపెట్టాలని ఘాటుగా హెచ్చరించారు. -
పాక్‌లో దావూద్, మోదీ భేటీ: ఆజంఖాన్
లక్నో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గతేడాది డిసెంబర్ 25న పాకిస్తాన్లో జరిపిన ‘స్టాప్ఓవర్’లో ఆ దేశ ప్రధాని షరీఫ్‌తోపాటు.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంనూ కలిశాడని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. ‘షరీఫ్ ఇంట్లో జరిగిన వ్యక్తిగత భేటీలో ఆయన తల్లి, కూతురు, మోదీతోపాటు దావూద్ కూడా ఉన్నారు. కావాలంటే ఇది అబద్ధమని మోదీని చెప్పమనండి. నా దగ్గర ఆధారాలున్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనవి జాతిని అవమానించే వ్యాఖ్యలని పేర్కొంది. -
'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం, ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ఒకే చోట కలుసుకున్నారని బాంబు పేల్చారు. ఇటీవల మోదీ, నవాజ్ షరీఫ్‌లు కలుసుకున్న సమయంలో దావూద్ కూడా అక్కడే ఉన్నాడని ఆజంఖాన్ ఆరోపించారు. 'దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మోదీని కాదని చెప్పమనండి' అంటూ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. పొరుగు దేశం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన కానుకగా.. ఆయన మనవరాలు మెహరున్నిసా పెళ్లికి అనుకోని అతిథిగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా.. ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పాక్ గడ్డపై గత ఏడాది అడుగుపెట్టిన విషయం తెలిసిందే. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన భారత్‌కు వచ్చారు. -
ప్రధాని కావడానికి నేనే అర్హుడిని: ఆజంఖాన్
ప్రధానమంత్రి కావడానికి తానే అర్హుడినని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ రాజీనామా చేసి, ఎంపీలంతా తనను ఎన్నుకుంటే అది దేశానికి మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు ఆయన తన పేరు ప్రతిపాదిస్తారన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆజంఖాన్ ఉండాలంటూ లక్నోలో పోస్టర్లు వెలుస్తున్న అంశాన్ని విలేకరులు ఆయనవద్ద ప్రస్తావించగా, ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. ములాయంను ప్రధానిగా చేసి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేస్తే రాబయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమంటూ ఇటీవల అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. దాని గురించి ఆజం ఖాన్ వద్ద ప్రస్తావించగా, 'దేశ ప్రధాని కావడానికి అన్నివిధాలా నేనే అర్హుడిని. నేను ప్రధాని కావాలని అనుకుంటున్నా' అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. -
ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. తాజ్‌మహల్ కూల్చి శివాలయాన్ని నిర్మించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 23వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన తాజ్‌మహల్ వివాదంలో శివసేనను వెనకేసుకొచ్చారు. తాజ్‌మహల్‌ను కూల్చివేసి, శివాలయం నిర్మించాలని శివసేన భావిస్తే, వారికి తన సహాయాన్ని అందిస్తానన్నారు. అందుకు పారపట్టి తన వంతు సహాయం చేస్తానన్నారు. అటు బీజీపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అదొక ఉగ్రవాద సంస్థ అంటూ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఎస్ఎస్ వాళ్లు హోమోలు: ఆజంఖాన్
ఉత్తరప్రదేశ్ కేబినెట్లో సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ''ఆర్ఎస్ఎస్ నేతల్లో చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. వాళ్లు హోమో సెక్సువల్స్'' అని వ్యాఖ్యానించారు. స్వలింగ శృంగారంపై 2014 నాటి తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. రాంపూర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులను ఉద్దేశించి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆజంఖాన్‌కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. దీనిపై ఆజంఖాన్ స్థానిక మీడియా ప్రతినిధి ఫసాహత్ అలీఖాన్ షాను మరింత వివరణ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలను అనవసరంగా పెద్దవి చేస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో స్వలింగ శృంగారాన్ని నేరం కాదని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాల్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని మాత్రమే చెప్పారన్నారు. భారత సంస్కృతిలో అలాంటి విషయాలకు తావు లేదని స్పష్టం చేశారు. స్వలింగ శృంగారాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆర్ఎస్ఎస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారంటే, వాళ్లు దాన్ని ప్రోత్సహిస్తున్నట్లేనని, బహుశా అందుకే వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవట్లేదని అన్నారు. -
రేప్ బాధితురాలిపై నోరు పారేసుకున్న మంత్రి
కాన్పూర్: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మరోసారి నోటికి పనిచెప్పారు. అత్యాచార బాధితురాలిపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఆయన 'గంగా కి పుకార్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లాయర్ తో పాటు మంత్రిని కలిసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు బాధితురాలు ప్రయత్నించగా ఆమెపై ఆజంఖాన్ ఒంటికాలిపై లేచారు. పబ్లిసిటీ కోసం పాకులాడొద్దంటూ మండిపడ్డారు. 'నీకు జరిగిన అవమానంతో అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తావా లేదా గౌరవంగా పోరాడతావా' అంటూ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలతో బాధితురాలు అవాక్కయింది. తనకు న్యాయం చేస్తారని వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం ఆమె పోరాడుతోందన్నారు. కాగా, ఆజంఖాన్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ బాజపాయ్ విమర్శించారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఆజంఖాన్ పై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పారిస్ పేలుళ్లపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బరెల్లి: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ పారిస్ పేలుళ్లపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సిరియా, ఇరాక్‌లో అమెరికా చర్యలకు ప్రతిచర్యగానే పారిస్ పేలుళ్లు జరిగాయని, ఈ విషయాన్ని ఆ అగ్రరాజ్యం గుర్తించాలని పేర్కొన్నారు. పారిస్ పేలుళ్లను దురదృష్టకరం అని ఖండించిన ఆజంఖాన్.. మధ్యప్రాచ్యం చమురు బావుల నుంచి అక్రమంగా సంపద దోచుకొని.. ఆ సొమ్మును యూరప్ నగరాల వైభవాలకు వాడుకోరాదని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా, దాని మిత్రరాజ్యాల ఆర్థిర ప్రయోజనాలే ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభానికి మూలకారణమని ఆయన పేర్కొన్నారు. 'ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్‌లోని చమురు బావులను అక్రమంగా దోచుకొని.. ఆ డబ్బుతో పారిస్ వంటి మీ నగరాలను మద్యం, పార్టీలతో వైభవోపేతంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో చమురు సంపద కోసమే అమెరికా, రష్యాలో ప్రస్తుత సంక్షోభాన్ని మరింతగా రాజేస్తున్నాయని మండిపడ్డారు. -
అమెరికా చర్యల వల్లే ప్యారిస్ దాడులు: ఆజంఖాన్
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల గురించి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్‌ల మీద అగ్రరాజ్యాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ప్యారిస్‌లో దాడులు జరిగాయని, ఈ విషయాన్ని అమెరికా లాంటి దేశాలు గుర్తించాలని ఆయన అన్నారు. అయితే, ఉగ్రదాడులు జరగడం మాత్రం దురదృష్టకరమని చెప్పారు. మధ్యప్రాచ్యంలోని చమురు నిల్వలను దోచుకుని సంపాదించిన సొమ్ముతో యూరోపియన్ దేశాల్లో దీపాలు వెలిగించుకోవడం సరికాదని హితవు పలికారు. అమెరికా, దాని మిత్ర దేశాలకు మధ్య ఆసియాలో ఉన్న ఆర్థిక ప్రయోజనాలే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణమని ఆజంఖాన్ విశ్లేషించారు. ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్ దేశాల్లోని చమురు క్షేత్రాలను అక్రమంగా ఆక్రమించుకుని సంపాదించిన సొమ్ముతో ప్యారిస్ నగరంలో జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐఎస్ఐఎస్ అడ్డాలు అనుకున్న ప్రాంతాలపై దాడులు చేయడంతో పాటు, అమాయక ప్రజలను చంపేస్తున్నారని, వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారని, ఇందుకు ఏం సమాధానం చెబుతారని ఆయన అన్నారు. భారతీయుల్లా కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి తప్ప.. అనైతిక మార్గాలకు పాల్పడకూదని అమెరికా, రష్యాలకు ఆయన చెప్పారు. -
అగ్ని.. ఆజ్యం.. ఆజాం
ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్ అంటే వివాదాల పుట్ట. ఆయన పెంచుకునే పశువులు ఒకసారి ఎటో వెళ్లిపోతే పోలీసు సిబ్బందిని నియమించి వెతికించాడు. అవి దొరికాక పోలీసు వారే స్వయంగా తమ వాహనాలలో ఎక్కించి తెచ్చి మరీ గౌరవ మంత్రిగారికి అప్పగించారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ గొడవతో కర్ణాటక మండిపోతోంది. టిప్పు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా చేయడం బీజేపీ తదితర సంస్థలకు ఇష్టం లేదు. సరే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. ఆజాంఖాన్ మోదీని ఓ కోరిక కోరారు. బ్రిటన్ మ్యూజియంలో టిప్పు ఉంగరం ఒకటి ఉందట. దానిని మోదీ వచ్చేటప్పుడు వెంటబెట్టుకు రావాలట. ఎందుకంటే, దాని మీద ‘రామ్’ అన్న అక్షరాలు చెక్కి ఉంటాయట. మోదీ దానిని తెచ్చి తన పార్టీ కార్యకర్తలకు చూపాలని ఆజాం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది గొడవ చల్లార్చడానికా; ఆజ్యం పోయడానికా? సరే, పనిలో పనిగా కోహినూరు వజ్రాన్ని కూడా వెంటబెట్టుకురమ్మని ఆజాం కోరారు. -
'సెల్ఫోన్ల వల్లే బాలికలపై అత్యాచారాలు'
లక్నో: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మొబైల్ ఫోన్ల వల్లే ఢిల్లీలో రెండేళ్ల చిన్నారిపై ఇద్దరు టీనేజ్ బాలురు అత్యాచారం జరిపిన ఘటన చోటుచేసుకున్నదని పేర్కొన్నారు. 'రెండేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన వెనుక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరముంది. ఆ వాస్తవమే మొబైల్ ఫోన్. అందులో ఎలాంటి ఖర్చు లేకుండా చూడగలిగే విషయాలు. గ్రామీణ ప్రాంతాల్లో 14, 15 ఏళ్ల బాలల చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటున్నది. ఈ ఫోన్లలో రెండేళ్ల చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సైతం ఉంటున్నాయి' అని ఆయన ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు. 'మొబైల్ ఫోన్లలోని వీటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? ఎలా శిక్షిస్తున్నాం? ఈ వీడియోలు యావత్ యువతరాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్లు వయస్సులోకి రాకముందే ప్రభావాన్ని చూపుతున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలకు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. 'స్మార్ట్ ఫోన్లు రాకముందు మన దగ్గర అత్యాచారాలు, దుర్మార్గాలు లేనేలేవు కదా' అంటూ చమత్కరించారు. ఢిల్లీలో గత శుక్రవారం రామ్‌లీలా నాటకం కొనసాగుతుండగా.. ఇద్దరు బాలురు రెండేళ్ల బాలికను అపహరించి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధిత చిన్నారి తీవ్రంగా గాయపడింది. -
'వారిద్దరూ నన్ను చంపేందుకు కుట్రపన్నారు'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తనను చంపేందుకు కుట్రపన్నారని ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. అమర్ సింగ్, సంగీత్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, వీరిద్దరూ తనను అంతం చేసేందుకు పథకం రచించారని చెప్పారు. వీరు తాము అనుకున్నది చేయగలరని ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, సోమ్ ఇంతకుముందు ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆజంకు సంబంధముందని ఆరోపించారు. అమర్ సింగ్ కూడా ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపణలు చేశారు. -
'ఆయనను హీరోగా భావిస్తున్నారు'
లక్నో: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆక్షేపించారు. దాద్రి ఉదంతం జాతి మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. దీన్ని ప్రపంచమంతా ఖండించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రకటన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. 'సైతాన్' పదాన్ని ప్రధాని మోదీ చాలా తేలిగ్గా వాడారని, కానీ ఆయన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అనుబంధంగా ఉన్న ఇతర పార్టీలు నరేంద్ర మోదీని 'గోద్రా హీరో'గా భావిస్తున్నాయని ఆజం ఖాన్ అన్నారు. యూపీలోని బిసడ గ్రామంలో గోవు మాంసం నిల్వచేశారనే ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని దుండగులు హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ప్రకటనలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దాద్రి ఘటన దురదృష్టకరమంటూ ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై ఆజం ఖాన్ వ్యాఖ్యలు చేశారు. -
'ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ పొమ్మంటారు'
లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి ఇటీవల జరిగిన దాద్రి ఘటన వరకు భారత్‌లో జరుగుతున్న మార్పులకు ప్రపంచమే సాక్షిగా నిలుస్తున్నదని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ అన్నారు. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 'గత ఆరు దశాబ్దాలుగా ముస్లింలు భారత్‌లోనే నివసిస్తున్నారు. వారు ఏ ఇస్లామిక్ దేశానికీ వెళ్లాలనుకోవడంలేదు. ఎందుకంటే భారత లౌకిక స్వభావంపై వారికి నమ్మకం ఉంది. అయినా ఎంతకాలం మమ్మల్ని పాకిస్థాన్ వెళ్లిపోమ్మని బెదిరిస్తారు' అని ఆయన అన్నారు. యూపీలోని దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి గోవుమంసాన్నితిని.. ఇంట్లో నిల్వ ఉంచాడన్న కారణంగా అతన్ని చంపేసిన ఘటన ఉద్రిక్తతలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆజంఖాన్ ఇటీవల లేఖ రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూస్థాన్‌ను హిందూదేశంగా మార్చాలన్న కొందరు హిందూత్వ శక్తుల ప్రయత్నానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరముందని ఆజంఖాన్ అన్నారు. -
'మీ విమానంలోనే ఉగ్రవాదులను తీసుకురండి'
ఝాన్సీ (యూపీ): వచ్చే సంవత్సరం సార్క్ సదస్సుకు పాకిస్థాన్ కు వెళుతున్న భారత్ ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన విమానంలోనే ఉగ్రవాదులను స్వదేశానికి తీసుకురావాలని ఉత్తర్ ప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్‌కు తీసుకు రావాలన్నారు. ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందుకు హాజరైన అనంతరం ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది సార్క్ సమావేశాలకు మోదీ పాక్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తలదాచుకుంటున్న భారత మోస్టు వాంటెడ్ ఉగ్రవాదులను తిరిగి భారత్ తీసుకురావాలన్నారు. గత వారం నవాజ్ షరీఫ్ సార్క్ సమావేశాలకు మోదీని ఆహ్వానించగా దానికి ఆయన అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసి విమాన సిబ్బందితో పాటూ155 మందిని అఫ్ఘనిస్తాన్‌లోని ఖాందహార్ తరలించారు. అప్పుడు భారత ప్రభుత్వం వారితో చర్చించి.. బందీగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన మౌలానా మసూద్ అజార్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను విడిచిపెట్టి, ప్రత్యేక విమానంలో దేశం నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారుడు జాకీర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వల్డ్ డాన్ దావుద్ ఇబ్రహింలను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో పాకిస్తాన్‌ని కోరుతుంది. -
ఆ మంత్రిగారి గేదెల దొంగ దొరికాడు!
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ (మంత్రి గేదెలు..మంచి పోలీసులు) గేదెల దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2014, జనవరి 31వ తేదీన అజాం ఖాన్ కు చెందిన గేదెల కొట్టాం నుంచి లక్షల రూపాయల విలువైన ఏడు గేదేలను కొంతమంది దుండగులు దొంగింలించారు. దీనిపై అజాం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గేదెల ఆచూకీ కనిపెట్టినా.. ఆ దొంగతనానికి పాల్పడిన నిందితులలో ఒకరైన చునాన్ ను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు పాల్పడింది ఐదుగురుగా తేలింది. వీరిలో ముగ్గురు దొంగతనానికి ప్రణాళిక రచించగా, మరో ఇద్దరు ఆ గేదెలను అక్కడ నుంచి తరలించినట్లు మోరాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ ప్రవాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కాగా మంత్రిగారి ఫాంహౌజ్ నుంచి ఏడు గేదెలు చోరీకి గురైయ్యాయి. అనంతరం మంత్రి ఆదేశాలతో గేదెల దొంగలను కనిపెట్టే పనిలో పడ్డ పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గేదెల చోరీ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ కూడా చేసింది. -
జయప్రదకు అజాం ఖాన్ షాక్
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రదకు పెద్ద షాకే తగిలింది. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఆమె పరిస్థితి తయారైంది. చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో జారిపోయింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జయప్రద పేరు ఖరారు అయినా లాస్ట్ మినిట్‌లో యూపీ మంత్రి అజాం ఖాన్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ..గవర్నర్ కోటా కింద విధాన పరిషత్‌కు తొమ్మిదిమంది సభ్యుల జాబితాను ఖరారు చేశారు. ఆ లిస్ట్‌లో జయప్రద పేరు కూడా ఉంది. అయితే అదృష్టం తలుపు తట్టి వస్తే దురదృష్టం తలుపు తన్ని వచ్చినట్లు.. జయప్రద తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆమెను తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది. జయప్రదను తిరిగి సమాజ్‌వాదీలోకి తీసుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సుముఖంగా ఉన్నా... అజాం ఖాన్ మాత్రం తన మెట్టు దిగలేదు. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేదంటూ భీష్మించటంతో జయప్రదకు ఎదురుగాలి తగలింది. 2009లో లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద అభ్యర్థిత్వాన్ని ఆజాం ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా ఆమెను అప్రదిష్ట పాల్జేసేందుకు పలుమార్లు ఆయన ప్రయత్నించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. అప్పట్లో నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఆ తర్వాత టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. అ తర్వాత జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారు. ఎంపీగా సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఆ తర్వాత జయ గాడ్ ఫాదర్ అమర్ సింగ్ ...సమాజ్‌వాదీ నుంచి విడిపోవటంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొని, ప్రస్తుతం ఆ పార్టీకి ఆమె దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్ఎల్డీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దేశ రాజకీయాల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జయప్రద తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాకుండా అవకాశం ఇస్తే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై పోటీకి సై అంటూ ఫీలర్లు వదిలినా ఆమెను బీజేపీ పట్టించుకోలేదు. దాంతో తిరిగి సమాజ్‌వాదీ చెంతకు చేరాలని జయప్రద డిసైడ్ అయినా.. వెండితెరపై విలన్లా ఆజాం ఖాన్ అడ్డు పడటం అంటే ఇదేనేమో.. -
ఎమ్మెల్యేలకు చీపురుకట్టల బహుమానం
చూడచక్కని ప్యాకింగ్‌లో ఆకర్షణీయమైన గిఫ్ట్ బాక్సులు.. ఒక్కో ఎమ్మెల్యేకి వరుసగా పంచారు. అందులో ఏముందోనని ఆత్రంగా తెరిచి చూసిన ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది! ఒక్కో బాక్సులో ఒక చీపురు కట్ట.. ఒక పెన్ను.. వాటితోపాటు ఓ సుదీర్ఘ లేఖ! ఇవి పంచిపెట్టింది ఎవరోకాదు.. తన చర్యలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్! ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన ఈ చీపుర్ల పంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సమాజానికి పట్టిన జాఢ్యాన్ని వదిలించడానికి చీపురు పనికొస్తుందో, కలం పనికొస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి.. దానికి అనుగుణంగా నేను ఇచ్చిన బహుమతుల్లో ఒకదానిని వాడండి' అంటూ లేఖలో పేర్కొన్నాడు ఆజాంఖాన్. స్వచ్ఛభారత్‌పై తరచూ సెటైర్లు వేసే ఆయన.. ప్రధాని మోదీ.. జనం చేతుల్లో చీపుర్లు పెట్టి ఆయధాల్లాంటి కలాల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. అయితే ఆజంఖాన్ చీపుర్ల పంపకం సమాజ్ వాదీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.