![Samajwadi Party Leader Azam Khan Critical On Oxygen Support - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/29/azam%20khan.jpg.webp?itok=XCwdBh6n)
లక్నో: సమాజ్‌వాది పార్టీ నాయకుడు అజాం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారని లక్నోలోని మెదాంత ఆస్పత్రి శనివారం వెల్లడించింది. సీతాపూర్ జైలులో ఉన్న అజాం ఖాన్‌ను ఈ నెల 9న కరోనా చికిత్స నిమిత్తం లక్నోలోని మెదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు కరోనా చికిత్స కొనసాగుతుంది. అజాం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఖాన్ కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తండ్రికుమారులిద్దరికి గత నెల 30న కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆ తర్వాత అజాం ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 9న ఆయనను లక్నో మెదాంత ఆస్పత్రికి తరలించారు. ఆయన కుమారుడిని కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అజాం ఖాన్ మీద 100కు పైగా కేసులు నమోదు కావడంతో గత ఏడాది ఫిబ్రవరిలో అజాం ఖాన్‌ను సీతాపూర్‌లో జైలుకి తీసుకెళ్లారు. అజాం ఖాన్ కుమారుడి మీద కూడా సీతాపూర్ జైలులో పలు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment