Published
Mon, Dec 7 2015 4:04 PM
| Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. తాజ్‌మహల్ కూల్చి శివాలయాన్ని నిర్మించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 23వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన తాజ్మహల్ వివాదంలో శివసేనను వెనకేసుకొచ్చారు.
తాజ్మహల్ను కూల్చివేసి, శివాలయం నిర్మించాలని శివసేన భావిస్తే, వారికి తన సహాయాన్ని అందిస్తానన్నారు. అందుకు పారపట్టి తన వంతు సహాయం చేస్తానన్నారు. అటు బీజీపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అదొక ఉగ్రవాద సంస్థ అంటూ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే.