demolished
-
తాజ్‌మహల్, చార్మినార్‌నూ కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు. ‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.భాగవత్ మాటా బీజేపీ వినదా?‘‘2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు. -
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్‌పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద, ఐకానిక్ స్టేడియం రెప్పపాటులో నేలమట్టం
మలేషియా నగరంలోని ఐకానిక్ షా ఆలం స్టేడియం చరిత్రలో కలిసి పోయింది. 80వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఈకూల్చివేతకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఒకప్పుడు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న ఈ స్టేడియం 30 ఏళ్ల నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు. దీని స్థానంలో 45వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త, ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తోంది.Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE— Manytops Stadiums (@Manytops) September 19, 2024 ఈ స్టేడియం నిర్మాణం 1990 జనవరి 1న ప్రారంభం కాగా అధికారికంగా 1994, జూలై 16, ప్రారంభించారు. ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియంగా ఉండేది. -
చిత్రపురిపై బుల్డోజర్
-
మణికొండ చిత్రపురి కాలనీలో ఉద్రిక్తత
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
టీడీపీ శ్రేణుల అరాచకాలు..వైఎస్సార్సీపీ అభిమాని ధాబా కూల్చివేత
సాక్షి,తిరుపతి : టీడీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైకుంఠ పురం వద్ద అనంత గుర్రప్ప గారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత మేడసాని ప్రవీణ్ కుమార్‌కు చెందిన మేడసాని ధాబాను టీడీపీ శ్రేణులు కూల్చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి,హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారు. ధాబా కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాబా విధ్వసంపై వైఎస్సార్సీపీ నేతలు ప్రవీణ్‌ను పరామర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల విధ్వంసంపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హామీ ఇచ్చారు. కాగా, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలతో టీడీపీ శ్రేణులు జేసీబీతో కూల్చేసిన ధాబాను చంద్రగరి సీఐ రామయ్య పరిశీలించారు. ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పుంగనూరులో అర్ధరాత్రి విధ్వంసం
-
పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మల్కంపేట్ ప్రాంతంలో మైనర్ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్’ అనే పేరుతో ఓ రిసార్ట్ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.The administration in Maharashtra's Satara district on June 9 demolished illegal structures in a resort in Mahabaleshwar owned by the family of the 17-year-old boy allegedly involved in the Pune Porsche crash, an official said.https://t.co/l9Hdui9pH1— The Hindu (@the_hindu) June 8, 2024 ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ను అధికారులు సీల్ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్ వద్దకు బుల్డోజర్ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.మే 19 తెల్లవారుజామున మైనర్ బాలుడు మద్యం మత్తులో వేగంగా పోర్షేకారు నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్! -
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్‌తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్‌లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్‌టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్లీ సంచలనంగా మారారు. కామారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటినే త్యాగం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తాతల కాలం నాటి ఆ ఇంట్లోనే నివసించే ఆయన అందులోనే పుట్టి పెరిగారు. అడ్లూర్ రోడ్లో గల తన ఇంటి ముందు ఆర్ అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో చర్చించిన అనంతరం జేసీబీలతో కూల్చివేయించారు. సుమారు వెయ్యిగజాల ఆ ఇంటిస్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముందుగా తన ఇంటిని కూల్చేసి అభివృద్ధికి సహకరించానని, ఇలాగే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే రోడ్లన్నీ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! -
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
Odisha Tragedy: ఆ స్కూలును కూల్చేస్తున్నారు
బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన బాహాగానా హైస్కూలును కూల్చివేసినట్లు తెలిపారు ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర. శవాలను ఉంచిన చోటకు తిరిగి రావడానికి విద్యార్థులు జంకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. పిల్లలు భయపడుతున్నారు.. బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను వారి బంధువులు వచ్చి తీసుకుని వెళ్లేంత వరకు బాహాగానా హైస్కూల్లోనే ఉంచారు. ఇక్కడి నుండి మృతదేహాలను తరలించిన తర్వాత స్కూలు గదులన్నిటినీ శుభ్రం చేసి శానిటైజ్ చేశాము. అయినా కూడా పిల్లల తలిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడానికి ఇష్టపడటం లేదు. దీంతో స్కూలుని కూల్చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించి పవిత్రం చేసిన తర్వాత స్కూలును పునః ప్రారంభిస్తామని అన్నారు రాజారామ్ మోహాపాత్ర. కలెక్టర్ ఆదేశాలు.. అంతకు ముందు బాలాసోర్ జిల్లా కలెక్టర్ భావుసాహెబ్ షిండే పాఠశాలను సందర్శించి స్కూలు మేనేజింగ్ కమిటీ నిర్ణయిస్తే స్కూలును కూల్చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే పాఠశాల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుని స్కూలు కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సహాయాక చర్యల్లో భాగంగా మృతదేహాలను వెలికితీసిన వెంటనే వాటిని దగ్గర్లో ఉన్న బాహాగానా హైస్కూలుకు తరలించారు. మృతుల బంధువులు వచ్చి మృతదేహాలను గుర్తించేంత వరకు రోజులపాటు మృతదేహాలను అక్కడే ఉంచడంతో నేలంతా రక్తపు మరకలు అంటుకుని ఉంది. ఎంత కడిగినా కూడా పిల్లల మనస్సులో నుంచి భయాన్ని తొలగించలేమన్నది తల్లిదండ్రుల వాదన. Odisha Train Tragedy: Authorities Begin Demolition Of #Bahanaga Bazar High School.#Odisha #BalasoreTrainAccident #odishatraintragedy #balasore #BahanagaHighSchooldemolitionpic.twitter.com/gaOjgpeEnq — Priyathosh Agnihamsa (@priyathosh6447) June 9, 2023 ఇది కూడా చదవండి: శవాలు కుళ్ళిపోతున్నాయి... ఎన్నాళ్లిలా? -
ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. శివసేన కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే ఈ కార్యాలయన్ని తొలగించినట్లు కల్యాణ్ డాంబివిల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటస్థలానికి కేటాయించిన స్థలంలో శివసేన కార్యాలయం ఉందని, అందుకే కూల్చివేశామని చెప్పారు. ఈ ఆఫీస్‌తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. ఉద్ధవ్ శివసేన వర్గం మాత్రం రాజకీయ ప్రతీకారంతోనే తమ కార్యాలయాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా ఈ కార్యాలయం ఉందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నించారు. చదవండి: సౌరాష్ట్ర ఎవరికి సై? -
నేలమట్టమైన నోయిడా ట్విన్ టవర్స్
-
మాజీ మంత్రి అయ్యన్న కుటుంబం అక్రమ నిర్మాణం గుర్తించాం : ఎమ్మార్వో జయ
-
40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్ టవర్స్ మాయం..!
Supertech Twin Towers Demolition: నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా తాజాగా కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను నోయిడా అధికారులు వెల్లడించారు. 9 సెకన్లలో మాయం..! సుమారు 4 టన్నుల మందు గుండు సహాయంతో కేవలం 9 సెకన్లలో ట్విన్ టవర్స్‌ను నేలమట్టం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కోర్టులో పేర్కొన్న విధంగా కూల్చివేత పనులు జరుగుతాయని తెలిపారు. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ట్విన్ టవర్స్‌ను కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా కూల్చివేత సమయంలో టవర్స్‌కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తున్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు . అంతేకాకుండా సైట్‌కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ఒక గంట పాటు మూపివేయబడుతుందని పేర్కొన్నారు. ఎడిఫైస్ నేతృత్వంలో..! ట్విన్ టవర్స్ అపెక్స్, సెయాన్ భవనాలను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ కూల్చివేయనుంది. కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కంపెనీ 2019లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్‌ను కూల్చివేసింది. కాగా కూల్చివేతకు అయ్యే ఖర్చులను పూర్తిగా మొత్తం బిల్డర్ భరించాలని కోర్టు ఆదేశించింది. కుమ్మక్కు..! ట్విన్ టవర్స్ నిర్మాణంలో అధికారులు కూడా కుమ్మకునట్లు తెలుస్తోంది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు ఆదేశించింది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చదవండి: ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి -
వైరల్: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి!
పెన్సిల్వేనియా: ఈ మధ్యన పెద్ద పెద్ద టవర్లను టెక్నాలజీ సాయంతో సెకన్ల వ్యవధిలోనే కూలగొట్టడం పరిపాటిగా మారిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. విషయంలోకి వెళితే.. మన దగ్గర చూడకపోయినా.. విదేశాల్లోని వ్యవసాయక్షేత్రాల్లో సిలోస్ టవర్లను విరివిగా వాడుతున్నారు. ఈ సిలోస్‌లో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, దాన్యం నిల్వ, కెమికల్స్‌ను స్టోరేజ్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయక్షేత్రంలో సిలోస్ పాడైనదశకు చేరుకోవడంతో దానిని కూలగొట్టి కొత్తది కట్టాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగానే సిలోస్‌ను కూలగొట్టాలంటే చాలా టైం పడుతుంది. అయితే కొత్త టెక్నాలజీ సాయంతో వికర్ణ దిశలో టవర్‌ను సెకన్ల వ్యవధిలో నేలమట్టం చేశారు. సిలోస్ టవర్ నేలమట్టం అయ్యే వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత పద్దతిగా అంటే.. అది కూలేటప్పుడు ఒక్క ఇటుక కూడా కదల్లేదు. అదే సమయంలో పక్కనే ఉన్న మిగతా సిలోస్ టవర్లు ఒక్క ఇంచు కదలేకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెక్నాలజీకి ఫిదా అవుతున్నారు. చదవండి: వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు -
‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ..
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకున్న భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన దురాక్రమణలపై ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమిత భూములు ఎవరి చేతుల్లో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు బదులు గోడౌన్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న వాటిపైనా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఆక్రమణల్ని తొలగించారే తప్ప.. ఉద్దేశపూర్వక, కక్షపూరిత వ్యవహారాలేమీ లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ నేతల భూదందాల బాగోతం రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా దురాక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వారి చెర నుంచి విడిపించేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో అధికారులు సర్వేచేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా.. విశాఖ అర్బన్, రూరల్ పరిధిలో రూ.1,800 కోట్ల విలువైన వందల ఎకరాలు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న అక్రమ నిర్మాణంపైనా చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవి ఇవీ.. 2020 నవంబర్‌లో విశాఖ రూరల్ మండలం విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లోని సుమారు రూ.256 కోట్లు విలువైన 64 ఎకరాలు.. గీతం డీమ్డ్ యూనివర్సిటీ చెరలో ఉన్న రూ.1,100 కోట్లు విలువైన సుమారు 40 ఎకరాలు.. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కి చెందిన రూ.300 కోట్లు విలువైన సుమారు 60 ఎకరాల్ని.. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి భార్య పేరిట ఆక్రమించిన రుషికొండలోని సర్వే నం.21లోని సుమారు రూ.2.50 కోట్లు విలువైన 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని.. కొమ్మాదిలోని సర్వే నం.66/2లో ఉన్న సుమారు రూ.98 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సాగర్‌నగర్ సమీపంలో మంత్రి బొత్స సమీప బంధువులకు చెందిన స్థలాన్ని 2020 డిసెంబర్లో స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాజకీయాలకు అతీతంగా.. పార్టీలతో పనిలేకుండా.. ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ.. అక్షరానికి వక్రభాష్యం చెబుతూ అధికారులు తీసుకున్న చర్యల్ని తప్పుబడుతూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి.. ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అమలుచేసిన నిర్ణయాలకు పొంతనలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. మింది పారిశ్రామిక ప్రాంతంలో ఏపీఐఐసీ కేటాయించిన స్థలాల్లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఏటీఆర్ పేరుతో 8 గోడౌన్లు నిర్మించారు. 2007లో 24,249.66 చ.మీకు ప్లాన్ తీసుకున్నారు. దీనికి తోడు 16,534.05 చ.మీటర్ల మేర ఆక్రమించేసి అనధికారికంగా గోడౌన్లు నిర్మించారు. కాగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో అనధికార నిర్మాణాన్ని గుర్తించిన ఐలా అధికారులు షెడ్ యజమానికి 2020 డిసెంబర్ 15న నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న కన్ఫర్మేషన్ నోటీసులు జారీచేశారు. అయినా స్పందించకపోవడంతో ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాల్ని తొలగించే ప్రక్రియని చేపట్టారు. అనధికారికంగా నిర్మించిన షెడ్ నం.5లో ఆమోద పబ్లికేషన్‌కు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు మరో నాలుగు కంపెనీలు అనధికారికంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ షెడ్ నెం.5ను ఉషా ట్యూబ్స్ అండ్ పైప్స్ ప్రై.లిమిటెడ్ పేరుతో స్టీల్ పైపులు, ట్యూబులు నిల్వచేసే గోడౌన్‌గా తీసుకున్నారు. అయితే, ఇందులో ఆమోదా పబ్లికేషన్స్‌తోపాటు హోంటౌన్ ఫర్నిచర్, రాఘవ వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్, హైవ్లూప్ లాజిస్టిక్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన గోడౌన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీలని బుధవారం కూల్చివేశారు. ఐలా నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ని నిర్మించడమే ఒక అక్రమమైతే.. అందులో ప్రింటింగ్ సెక్షన్ ఏర్పాటుచేయడం కూడా మరో అక్రమమని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖకు సంబంధించిన నిబంధనల్ని పాటించకుండా, వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నట్లు ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) అధికారులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకున్నారు తప్ప.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిదనడం పూర్తి సత్యదూరమని చెబుతున్నారు. ఆక్రమణలు వెలుగుచూసింది ఇలా.. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్లో కురిసిన వర్షాలకు షెడ్ నెం.5కు సంబంధించిన ప్రహరీ డ్రెయిన్‌లో కూలిపోయింది. దీంతో అక్కడ మురుగునీరు స్తంభించిపోవడంతో స్థానికుల ఫిర్యాదు చేశారు. ఐలా అధికారులు పరిశీలించగా ఆక్రమణల బాగోతం వెలుగుచూసింది. ఆ తర్వాత నోటీసులు జారీచేశారు. అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం.. అనధికార నిర్మాణం చేపట్టడమే కాకుండా అందులో నిబంధనలకు విరుద్ధంగా సంస్థల్ని నడిపిస్తున్నారంటూ రెండుసార్లు నోటీసులు జారీచేశాం. అయినా గోడౌన్ యజమాని స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్ నం.5 కూల్చివేత ప్రక్రియ చేపట్టాం. అయితే, కోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చారు. మేం అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. ఆక్రమించి నిర్మించిన 5వ నంబర్ షెడ్లోనే ఆమోద పబ్లికేషన్స్ ప్రింటింగ్ ప్రెస్ నడుస్తోంది. అందుకే చర్యలు తీసుకున్నాం. – డా. ఎ.శామ్యూల్, ఐలా కమిషనర్ రాజకీయ ప్రమేయం లేకుండా.. విశాఖ భూ ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం ఏడాదిన్నర కాలంగా చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ విభాగం నిర్వహిస్తున్న సర్వేలో ఆక్రమిత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు సుమారూ 300 ఎకరాల వరకూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ డ్రైవ్ వెనుక రాజకీయ ప్రమేయం ఏమాత్రం లేదు. ఆక్రమణల వెనుక ఎవరున్నా వాటిని విడిచిపెట్టడంలేదు. ఆక్రమణలున్నట్లు గుర్తించి ఆమోద పబ్లికేషన్స్ షెడ్స్‌ని తొలగించామే తప్ప.. దీని వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవు. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖ జిల్లా -
జెంబో టవర్ : క్షణాల్లో నేలమట్టం
వాషింగ్టన్: అమెరికా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టు అధారిటీ సంచలన వీడియోను షేర్ చేసింది. యూటా రాష్ట్రంలో సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉన్న 84 అడుగుల డెల్టా టవర్‌ను కూల్చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లకు వాటి గేట్లకు దారి చూపేందుకు దీన్ని 1989లో నిర్మించారు. ఈ టవర్ కూల్చివేత రెండవ దశలో ఈ టవర్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలం కొన్ని సెకన్లలోనే ఈ టవర్ కుప్పకూలిన వీడియోను అక్కడి అధికారులు ట్విటర్లో షేర్ చేశారు. అంతే లక్షల లైక్స్, వేలాది వ్యూస్‌తో ఇది నెటింట్లో హల్ చల్ చేస్తోంది. డెల్టా టవర్ కూల్చివేయడంలో ఇదొక ప్రధాన మైలురాయి అని సాల్ట్ లేక్ విమానాశ్రయ ప్రతినిధి నాన్సీ వోల్మర్ చెప్పారు.గత సెప్టెంబర్‌లో కొత్త విమానాశ్రయం ప్రారంభమయ్యేవరకు డెల్టా టవర్ కార్యకలాపాలు కొనసాగాయన్నారు. అయితే ఇందులో కొన్ని సదుపాయాలను ఆ తరువాత కూడా కొనసాగించాలని అనుకున్నా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ గేట్లు అవసరం లేదని తాము భావించినట్టు ఆమె వెల్లడించారు. -
పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని పురాతన ఆలయం, మసీదు కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలిపోయాయని ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేతల న్యాయవాది కోర్టు తెలిపారు. పొరపాటున జరిగిందా? ఉద్దేశపూర్వకంగా కూల్చారా? అనే దానిపై పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏజీ హోం క్వారంటైన్లో ఉన్నందున రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కూల్చీవేతలపై విచారణ జరపాలని పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత
సాక్షి, గుంటూరు, కృష్ణా : తాడేపల్లి మండల పరిధిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నదీ తీరప్రాంతంలో కరకట్ట లోపల నీటి ప్రవాహానికి అడ్డంగా ఏర్పాటుచేసిన ఓ కట్టడాన్ని సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 29 అక్రమ కట్టడాలను గుర్తించి అనేకసార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో పాతూరు కోటేశ్వరరావు కృష్ణానది లోపలికి చొచ్చుకెళ్లేలా నిర్మించిన కట్టడాన్ని అధికారులు తొలగించారు. -
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం
భారీ గెడ్డ పక్కన కనీసం చిన్న పాటి నిర్మాణం కూడా చేపట్టకూడదు.. కానీ అడ్డగోలుగా భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు.. స్థలం 300 గజాలే.. అందులో భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతులు జీ ప్లస్ 2కే.. కానీ జీ ప్లస్ 4.. అంటే అదనంగా రెండంతస్తులు కట్టేశారు. అంతేనా.. ఏ చిన్నపాటి నిర్మాణమైనా రోడ్డు నుంచి కనీసం పది అడుగులు వదిలి కట్టుకోవాలి.. కానీ ఇక్కడ మెయిన్‌రోడ్డుకు ఆనుకునే నిర్మాణం చేసేశారు.. ఇన్ని ‘కానీ’లు ఉన్నాయంటేనే అర్థమై ఉంటుంది.. అప్పటి టీడీపీ పాలనలో అనకాపల్లి ఎమ్మెల్యేగా వెలగబెట్టిన పీలాగోవింద్ అడ్డగోలు నిర్వాకం ఇదని.. ఇంత అక్రమంగా అన్యాయంగా కట్టేసింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. విశాఖ నగర నడిబొడ్డున ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులో.. ఈ అడ్డగోలు భాగోతాన్ని నిర్మాణ సమయంలోనే.. అంటే 2017 జనవరిలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటి అధికారులు ‘కాణీ’లకు కక్కుర్తి పడ్డారో.. ‘పచ్చ’పాతానికి తలొంచారో గానీ.. నిర్మాణాన్ని నిలువరించలేకపోయారు. సాక్షి వరుస కథనాలతో ఎట్టకేలకు నిర్మాణ పనుల దూకుడుకు బ్రేక్ పడింది కానీ మొత్తంగా అక్రమాలను అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పాలన మారింది.. నిబంధనలకు విరుద్ధంగా తప్పుచేసిన వాళ్లు ఎవరైనా.. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే శనివారం తెల్లవారుజాము నుంచి ఈ అక్రమ కట్టడాన్ని కూ ల్చే పని మొదలుపెట్టారు. అయితే పీలా స్టే తెచ్చుకోవడంతో సాయంత్రం నిలిపి వేశారు. సీతంపేట(విశాఖ ఉత్తర): నిబంధనలు పాటించకుండా.., జీవీఎంసీ నుంచి కనీస అనుమతులు తీసుకోకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ నగరంలోని సీతంపేట మెయిన్రోడ్లో అడ్డగోలుగా నిర్మించిన బహుళ అంతస్థుల భవంతిని జీవీఎంసీ యంత్రాంగం ఎట్టకేలకు కూల్చివేసింది. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నన్ను ఎవరు ప్రశ్నిస్తారు.. నిబంధనలు నేనెందుకు పాటించాలి.. నేను అక్రమంగా ఇల్లు కడితే ఆపే దమ్ము ఎవరికి ఉందంటూ’’ అధికార మదంతో తనే దగ్గరుండి అక్రమాల భవంతిని నిర్మిచాండు పీలా. సర్వే నంబరు 32/3లో పీలా గోవిందు భార్య విజయలక్ష్మికి 280 గజాల స్థలం ఉన్నట్టు వారి వద్ద డాక్యుమెంట్ ఉందని సమాచారం. కానీ టౌన్‌ప్లానింగ్ నుంచి కనీస అనుమతులు కూడా లేకుండా గెడ్డ స్థలాన్ని, వంద అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి 340 గజాల స్థలంలో జీ ప్లస్ 4 తరహాలో భవంతిని 2016 సంవత్సరంలో నిర్మించాడు. సెల్లార్‌ను సైతం విడిచిపెట్టకుండా కమర్షియల్ షాపులు నిర్మించేశారు. పీలా అనధికార కట్టడంపై 2017 జనవరి 6న ‘నిబంధనలు గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పీలా సమాధానం ఇవ్వలేదు. తన అక్రమ భవంతిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పటి జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ అక్రమంగా నిర్మిస్తున్న భవంతి పనులను మధ్యలో ఆపివేయించారు. నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కే కేటాయించాలని, షాపులు నిర్మించరాదని ఆదేశించారు. అలాగే 5వ అంతస్థులో నిర్మించిన పెంట్‌హౌస్‌ను, సెల్లార్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేయించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే అక్రమ భవంతి సగంలోనే ఆగిపోయింది. సాక్షి కథనం ప్రజాప్రతినిధి అక్రమాన్ని అడ్డుకోగలిగింది. కూల్చివేతకు కమిషనర్ ఆదేశం... ప్రస్తుతం అధికారం మారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ, అనధికార నిర్మాణాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన కూల్చివేతకు ఆదేశించారు. గురుద్వారా కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లే రహదారి మాస్టర్ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్‌గా ఉంది. ఆ రహదారిని అక్రమించి నిర్మాణం చేపట్టడం, అలాగే పక్కనే ఉన్న గెడ్డ స్థలాన్ని (బఫర్‌జోన్) అక్రమించి నిర్మాణం చేపట్టడం వంటి కారణాలతో బీపీఎస్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో పీలా గోవిందు తన భార్య విజయలక్ష్మి పేరుతో నిర్మించిన భవనం పూర్తిగా అనధికార నిర్మాణంగా నిర్ధారించి కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ సృజన టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది శనివారం ఉదయం 4 గంటల నుంచే బిల్డింగ్ తొలగింపు చేపట్టారు. తొలగింపు సందర్భంగా అల్లర్లు జరగకుండా సీతంపేట మెయిన్‌రోడ్‌ను ఒకవైపు బ్లాక్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో కోర్టు నుంచి పీలా గోవిందు స్టే తీసుకురావడంతో సాయంత్రం 4 గంటల తర్వాత కూల్చివేత నిలిపివేశారు.