TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే | MLA Katepalli Venkataramana Reddy Demolished His Own House For Road Extension | Sakshi
Sakshi News home page

TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే

Published Sun, Jan 28 2024 1:10 PM | Last Updated on Sun, Jan 28 2024 1:18 PM

Mla Katipalli Venkataramana Reddy Demolished His Own House For Road Extension - Sakshi

కామారెడ్డి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ, ప్రస్తు­త సీఎంలను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్లీ సంచలనంగా మారారు. కామారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తర­ణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటినే త్యాగం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

తాతల కాలం నాటి ఆ ఇంట్లోనే నివసించే ఆయన అందులోనే పుట్టి పెరిగారు. అడ్లూర్‌ రోడ్‌లో గల తన ఇంటి ముందు ఆర్‌ అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులతో చర్చించిన అనంతరం జేసీబీలతో కూల్చివేయించారు. సుమారు వెయ్యిగజాల ఆ ఇంటిస్థలాన్ని మున్సిపల్‌ అధికారులకు అప్పగించారు.

పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముందుగా తన ఇంటిని కూల్చేసి అభివృద్ధికి సహకరించానని, ఇలాగే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం త్వరలోనే రోడ్లన్నీ విస్తరించనున్నట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: TS: క్యాబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement