own house
-
అదనపు రుణానికి రూట్.. టాపప్ హోమ్‌లోన్!
సొంతిల్లు.. చాలా మంది జీవిత లక్ష్యాల్లో ఒకటి. రుణంపై సొంతిల్లు సమకూర్చుకునే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలా గృహ రుణం తీసుకున్న తర్వాతి కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం అదనపు రుణం తీసుకునే అవకాశం ఉంటే..? గృహ నవీకరణ లేదా విద్యా సంబంధిత ఫీజుల చెల్లింపు లేదా అనారోగ్యం.. అవసరం ఏదైనా గృహ రుణంపై టాపప్ రుణం సులభంగా లభిస్తుంది. కాకపోతే ఈ విధంగా తీసుకుంటున్న రుణం ఏ అవసరాలకు వినియోగిస్తున్నారనేది ఇంత వరకు బ్యాంక్‌లు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలే ఆర్బీఐ ఈ విషయమై బ్యాంక్‌లను హెచ్చరించింది. కనుక టాపప్ హోమ్‌లోన్‌ను ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనేది రుణ గ్రహీతలు సైతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. చౌకగా లభించే ఈ రుణాన్ని ముఖ్యమైన అవసరాల్లో వినియోగించుకోవడం ద్వారా తగినంత ప్రయోజనం పొందొచ్చు. టాపప్ అంటే... అప్పటికే తీసుకున్న గృహ రుణంపై అదనపు రుణాన్ని తీసుకోవడమే టాపప్ హోమ్‌లోన్ అవుతుంది. దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇంటి విలువ ఎంత? ఇంటికి తీసుకున్న రుణానికి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నారు? అప్పటి వరకు ఎంత మేర చెల్లించారు? తదితర అంశాల ఆధారంగా ఈ రుణానికి అర్హత లభిస్తుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కిందకే వస్తుంది. కనుక బ్యాంక్‌లకు వీటిపై రిస్క్ తక్కువే. అయితే రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే ఈ రుణంపై బ్యాంకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.ఎలా పనిచేస్తాయి? ‘‘గృహ రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తూ.. 18–24 నెలలు గడిచిన తర్వాత టాపప్ లోన్ తీసుకునేందుకు అర్హత లభిస్తుంది’’ అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. వాస్తవంగా జారీ అయిన గృహ రుణం నుంచి అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి పోను మిగిలిన మొత్తం టాపప్‌గా లభిస్తుంది. అంటే అప్పటి వరకు తీర్చిన రుణం మొత్తమే తిరిగి రుణంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.కోటి విలువ చేసే ఇంటి కోసం గరిష్ట పరిమితి మేరకు రూ.80 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. తర్వాత ఐదేళ్లలో రూ.10లక్షలు అసలు తీర్చివేసినట్టయితే.. అప్పుడు తిరిగి రూ.10 లక్షల మేర టాపప్ హోమ్‌లోన్‌కు అర్హత ఉంటుంది. అంతేకాదు ఈ ఐదేళ్లలో పెరిగిన ఇంటి విలువను సైతం బ్యాంక్‌లు పరిగణనలోకి తీసుకుంటాయి. రూ.కోటి విలువ చేసే ఇంటి విలువ ఐదేళ్లలో రూ.1.20 లక్షలకు చేరిందనుకుంటే అప్పుడు రుణ అర్హత రూ.96లక్షలకు పెరుగుతుంది. ఈ రుణ కాల వ్యవధి కూడా, గృహ రుణం కాలానికి మించకుండా ఉంటుంది. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు టాపప్ హోమ్‌లోన్‌ను 15 ఏళ్ల కాలవ్యవధి వరకు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ హోమ్ లోన్స్ హెడ్ రతన్ చౌదరి తెలిపారు. గృహ రుణం కాల వ్యవధి ఇంకా ఏడేళ్లు, అంతకు మించి ఉంటే.. ఇతర రుణాల కంటే తక్కువ ఈఎంఐకే రుణం పొందొచ్చని చౌదరి సూచించారు. సులభతరం టాపప్ హోమ్‌లోన్‌ను చాలా సంస్థలు డిజిటల్‌గా మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా రుణం చేతికి అందుతుంది. అప్పటికే గృహ రుణం కోసం అన్ని పత్రాలు సమరి్పంచి ఉంటారు కనుక.. అదనంగా ఎలాంటి డాక్యుమెంట్ల అవసరం ఏర్పడదు. అన్ని పత్రాలు దగ్గర ఉండడంతో బ్యాంక్‌లు వేగంగా నిర్ణయం తీసుకుంటాయి. రుణ గ్రహీత తాజా క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పకుండా పరిశీలిస్తాయి. చౌక ఆప్షన్ అన్ని రుణాల్లోకి గృహ రుణం చౌక వడ్డీ రేటుకే లభిస్తుంది. గృహ రుణంపై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటే.. టాపప్కి సైతం అమలవుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్‌కార్డుపై రుణం, బంగారంపై రుణం కంటే టాపప్ హోమ్‌లోన్ చౌక అని పైసాబజార్ రతన్ చౌదరి తెలిపారు. ఒకవేళ అప్పటికే క్రెడిట్ కార్డ్‌పై రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుని, అధిక వడ్డీ రేటు చెల్లిస్తుంటే.. అటువంటి వారు సైతం టాపప్ హోమ్‌లోన్ తీసుకుని వాటిని తీర్చివేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. పర్సనల్, క్రెడిట్ కార్డు రుణాలు అన్ సెక్యూర్డ్ కిందకు వస్తాయి. అందుకే వాటిపై వడ్డీ రేటు ఎక్కువ. గృహ రుణం సెక్యూర్డ్ (ఇల్లు తనఖాపై) కనుక వడ్డీ రేటు తక్కువ. అవసరం మేరకే.. సులభంగా, చౌకగా వస్తుందని చెప్పి టాపప్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపించే ముందు, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన చేయడం ఎంతో అవసరం. టాపప్ రుణాలతో వచ్చే పెద్ద సమస్య నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగిపోవడమేనని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (ఆర్ఐఏ), సహజ్ మనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ తెలిపారు. టాపప్ హోమ్ రుణాలు అనుత్పాదక అవసరాలకు వినియోగం అవుతుండడంపై ఆర్బీఐ ఇటీవలే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు దేనికి వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరింది. ముఖ్యంగా ఈ తరహా రుణాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయాయి. లోన్–టు–వేల్యూ రేషియో (ప్రాపర్టీ విలువపై జారీ చేసే రుణం మొత్తం/ఎల్టీవీ), రిస్క్‌లు, రుణ నిధుల వినియోగంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కనుక ఈ తరహా రుణాలు స్పెక్యులేటివ్ అవసరాలకు తీసుకోవడం లేదని బ్యాంక్/ఎన్బీఎఫ్సీని నమ్మించాల్సి రావచ్చు. ఇలా తీసుకున్న నిధులను ట్రేడింగ్‌లో నష్టపోయి, తిరిగి చెల్లింపులు చేయలేకపోతే అప్పుడు రుణం ఇచ్చిన బ్యాంక్ ఇంటిని జప్తు చేస్తుందన్నది మర్చిపోవద్దు. ‘‘టాపప్ హోమ్ లోన్స్ అన్నవి సాధారణంగా గృహ నవీకరణ కోసమే. పిల్లల విద్య లేదా వైద్య వ్యయాలు వంటి ఇతర అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రుణం తీసుకునే సమయంలోనే దీనిపై బ్యాంక్‌లు నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేస్తాయి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అయితే ఈ రుణాన్ని స్పెక్యులేటివ్ అవసరాలకు వినియోగించరాదని సూచించారు. ఇదే విషయం రుణ ఒప్పంద నిబంధనల్లోనూ స్పష్టంగా ఉంటుంది.రుణం రాకపోతే..? చాలా సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సమయంలో (గృహ రుణం బదిలీ) టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నట్టు పైసాబజార్ చౌదరి తెలిపారు. ఇంటి రుణం ఇచి్చన సంస్థ దగ్గర టాపప్ హోమ్ లోన్ పొందలేకపోతే.. లేదా అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నట్టు అయితే.. అప్పుడు మిగిలి ఉన్న గృహ రుణాన్ని (బ్యాలెన్స్) మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ద్వారా టాపప్ హోమ్‌లోన్‌ను పొందొచ్చని చౌదరి సూచించారు. ఇవి గమనించాలి.. → విహార యాత్ర, ఖరీదైన వస్తు కొనుగోళ్ల కోసం టాపప్ హోమ్‌లోన్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. తమ ఆస్తి విలువ పెంచుకునేందుకు వినియోగించుకోవచ్చు. → టాపప్ హోమ్ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధికి (రెండు నుంచి నాలుగేళ్లు) పరిమితం చేసుకోవాలి. దీర్ఘకాలం ఎంపిక చేసుకోవడం వల్ల వడ్డీ భారం పెరిగిపోతుంది. → గృహ రుణం, దానిపై టాపప్‌తో కలిపి అసలు ఇంటి విలువలో 75 శాతం మించకుండా చూసుకోవడం సౌకర్యం. → ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను చాలా సంస్థలు వసూలు చేస్తున్నాయి. → బ్యాంక్‌తో సంప్రదింపులు చేయడం ద్వారా వీలైతే వడ్డీ రేటులో రాయితీ పొందొచ్చు. → టాపప్ హోమ్‌లోన్‌ను ఖరీదైన ఇతర రుణాల చెల్లింపులకు వినియోగించుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..
ఇప్పటికి కూడా చాలా మందికి సొంత ఇంట్లో ఉండాలా? లేక అద్దె ఇంట్లో ఉండాలా? అనే ప్రశ్న, ప్రశ్నగానే ఉంది. కొందరు సొంత ఇల్లు బెస్ట్ అంటే.. మరి కొందరు అద్దె ఇల్లు బెటర్ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు జెరోధా సీఈఓ నితిన్ కామత్ తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు. జర్నలిస్ట్ సోనియా షెనాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జెరోధా సీఈఓ నితిన్ కామత్ 'రెంట్ vs బై' ప్రశ్నకు సమాధానంగా.. సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండటానికే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నితిన్ కామత్ జవాబుతో కొందరు ఏకీభవిస్తే.. మరికొందరు సొంతంగా ఇల్లు ఉంటేనే బాగుంటుందని వాదిస్తున్నారు. నితిన్ కామత్ మాట్లాడుతూ.. తనకు ఉన్న ఇల్లు తన తల్లిదండ్రులదని, భావోద్వేగాల కారణంగా ఎప్పుడూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలని, కాబట్టే కొత్త ఇల్లు కొనేది లేదని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో లక్షల వ్యూవ్స్ పొందింది. దీనిపైనా నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని మాటలు ఎవరూ నమ్మొద్దని, అవన్నీ మూర్ఖపు మాటలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! ఇందులో నిజమెంత? View this post on Instagram A post shared by Sonia Shenoy (@_soniashenoy) -
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
Delhi: చెల్లి మీద కోపం.. సొంత ఇంట్లోనే అక్క దొంగతనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వింత నేరం జరిగింది. సొంత ఇంట్లోనే దొంగతనం చేసి తన తల్లి బంగారు నగలు, నగదు ఎత్తుకుపోయింది ఓ మహిళ.తన కంటే తన చెల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న కారణంతోనే అక్క శ్వేత సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన కమలేశ్ అనే మహిళ తన ఇంట్లో చోరీ జరిగిందని జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలతో పాటు రూ.25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా కమలేశ్ ఇంటి సమీపంలో ఒక మహిళ బురఖా వేసుకుని అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. బురఖా వేసుకున్న మహిళను శ్వేత(31)గా పోలీసులు తేల్చారు. శ్వేత స్వయానా కమలేశ్ కూతురు కావడం గమనార్హం. జనవరి మొదటి వారంలోనే ఇంటి నుంచి బయటికి వెళ్లి వేరుగా ఉంటున్న శ్వేత తల్లిని చూడటానికి వచ్చినపుడు తొలుత బీరువా తాళం చెవులు కాజేసి మరోసారి తల్లి లేనపుడు వచ్చి నగలు, నగదు ఎత్తుకెళ్లింది. తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారన్న కోపంతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు శ్వేత విచారణలో ఒప్పుకుంది. -
TS: రోడ్డు విస్తరణ కోసం ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్లీ సంచలనంగా మారారు. కామారెడ్డి పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటినే త్యాగం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తాతల కాలం నాటి ఆ ఇంట్లోనే నివసించే ఆయన అందులోనే పుట్టి పెరిగారు. అడ్లూర్ రోడ్లో గల తన ఇంటి ముందు ఆర్ అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో చర్చించిన అనంతరం జేసీబీలతో కూల్చివేయించారు. సుమారు వెయ్యిగజాల ఆ ఇంటిస్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముందుగా తన ఇంటిని కూల్చేసి అభివృద్ధికి సహకరించానని, ఇలాగే ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే రోడ్లన్నీ విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! -
సొంత ఇల్లు కొందామనుకుంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా? ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇంట్లోనే కాలం గడపడం మంచిదా? ఈ రోజు ఈ ప్రశ్నలకు జవాబుగా మీ జాతకపరంగా పరిష్కారం చెప్పటం లేదు. ఇది ఏదో ఒక రుణ సంస్థ తరఫున ప్రకటన కాదు. ఫలానా దగ్గరే కొనమని విసిగించడమూ కాదు. ఇప్పుడు చెప్పబోతున్నది ఇల్లు, ఫ్లాటు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే. కేవలం ఆర్థికపరంగా, ఇన్‌కం ట్యాక్స్ చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయంలో సెంటిమెంటు జోలికి వెళ్లకండి. ఎక్కడ కొందామనుకుంటున్నారు? మీకు కానీ మీ కుటుంబసభ్యులకు అనువైన లొకేషన్లో కొనండి. అన్నింటికీ దగ్గరగా ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. వాన, వరద వస్తే ముంపునకు గురి కాకూడదు. మీరే ఉంటారా లేక కేవలం అద్దె.. అంటే ఆదాయం కొసం తీసుకుందామనుకుంటున్నారా అనేది చూసుకోవాలి. కొంత మంది పెన్షన్ లేని వాళ్లు నెలసరి ఆదాయం కోసం ఇళ్లు కొన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వనరుల సంగతేమిటి? మీరు ఇంటికోసం ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇటువంటి విషయాల్లో ఎంత పక్కాగా లెక్కలు వేసినప్పటికీ అదనపు భారం అనివార్యం. టైం కూడా మీ చేతిలో ఉండదు. వ్యవహారం సాఫీగా జరగకపోవచ్చు. మొత్తం ఇన్వెస్టుమెంటు రెడీగా ఉందా? అప్పు అవసరమా? అనవసరమా? అప్పు ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఏ సంస్థా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వదు. మనం కొంత మార్జిన్ మనీ చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు చేసిన ఇన్వెస్టుమెంటుకి, చెల్లించిన మార్జిన్ మనీకి ‘సోర్స్’ ఉండాలి. ‘సోర్స్’ అంటే అప్పు కావచ్చు, మీ సేవింగ్స్ కావచ్చు, పన్ను చెల్లించగా మిగిలిన మొత్తం కావచ్చు, మీ అబ్బాయి అమెరికా నుండి పంపి ఉండవచ్చు, మీకు వీలునామా ద్వారా సంక్రమించిన బ్యాంకు బ్యాలెన్సు కావచ్చు లేదా లాటరీ తలుపు తట్టి ఉండవచ్చు. ‘సోర్స్’కి రాత లు, కోతలు ఉండాలి. అలా ఉండకపోతే ఆ మొ త్తాన్ని మీ ఆదాయంగా భావిస్తారు. క్యాపిటల్ బడ్జె ట్ వేసుకున్నాకా, రెవెన్యూ బడ్జెట్ వేసుకోవాలి. రెవెన్యూ బడ్జెట్ గురించి ఆలోచించారా? అన్నీ సక్రమంగా ఉండి, సకాలంలో ఇల్లు పూర్తి అయ్యిందనుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటే ఇంటి రుణం చెల్లింపుల మీద, రుణం మీద వడ్డీ (పరిమితుల మేరకు) మినహాయింపు లభిస్తుంది. కానీ ప్రతి నెలా వాయిదా (ఈఎంఐ) చెల్లించగలగాలి. మీకు వచ్చే హెచ్ఆర్ఏ పన్నుకి గురి అవుతుంది. ఆర్థికపరంగా బండి సాఫీగా వెళ్లాలి. అద్దెకి ఇచ్చారనుకోండి. వచ్చిన అద్దెను తప్పకుండా ఆదాయంగా చూపించాలి. అవసరం అయితే, పన్ను చెల్లించాలి. స్వంత ఇల్లు/కొత్త ఇల్లు నిర్వహించడానికి బోలెడంత .. లేదా అనుకోని ఖర్చులు అవుతాయి. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, రూ.33 లక్షల వరకు డబ్బు ఆదా
దేశ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి సొంతింటి కలల్ని నిజం చేసేలా 40,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.33,04,918) వరకు డబ్బుల్ని ఆదా చేసుకునే వెసలు బాటు కల్పించింది. దీంతో పాటు విధులు నిర్వహించే వారికి వర్క్ పర్మిట్, ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో నివసిస్తున్నట్లైతే వారికి వీసా ఎలిజిబులిటీ గడువును పొడిగించింది. ఇందుకోసం అర్హులు నివాసానికి సంబంధించిన పత్రాల్ని అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కెనడాలో సొంత ఇల్లు తీసుకోవాలని ఉండి, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆగిపోయిన వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. పన్ను ప్రోత్సాహకాలు పొందడంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. దీంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్ధులు సైతం సొంతింటిని కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. వర్క్ పర్మిట్ హోల్డర్లు, ఇతర దేశాల విద్యార్థులను ఆహ్వానించి వారికి అవకాశాలు కల్పించే విషయంలో తమ నిబద్ధతను చాటి చెప్తుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారు కెనడాలో కొత్త ఇల్లు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ (ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ) అర్హతలు కెనడా ప్రభుత్వం అందించే పథకంతో లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ తప్పని సరి వీటితో పాటు తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తేనే : కెనడాలో గడిచిన ఐదేళ్లలో భార్య లేదా భర్త / భాగస్వామి పేరు మీదు ఇల్లు కొనుగోలు చేయకూడదు. కనీసం 18 సంవత్సరాలు నిండాలి : ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్‌ను ప్రారంభించిన నాటికి అర్హులైన వయస్సు 18 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వయస్సు ఉండాలి. కెనడియన్ నివాసి : కెనడియన్ రెసిడెంట్ (పౌరులు, శాశ్వత నివాసితులు, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం నివాస అవసరాలను తీర్చే కొంతమంది తాత్కాలిక నివాసితులు). వర్క్ పర్మిట్ హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు నివాసితులుగా అర్హత పొందడానికి ట్యాక్స్ ఇయర్ సంవత్సరంలో కనీసం 183 రోజులు దేశంలో నివసించాలి. ఆర్థిక సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న మూడు రకాల ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్లు డిపాజిటరీ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది నగదు, టర్మ్ డిపాజిట్లు లేదా గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్లు (జిఐసి) కలిగి ఉన్న బ్యాంకు ఖాతా. ట్రస్ట్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఈ ఖాతాను ట్రస్టీగా ట్రస్ట్ కంపెనీతో తెరవవచ్చు. నగదు, టర్మ్ డిపాజిట్లు,జీఐసీలు, ప్రభుత్వ .. కార్పొరేట్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నిర్దేశిత స్టాక్ ఎక్ఛేంజ్‌లలో లిస్ట్ అయిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అర్హతను కలిగి ఉంటుంది. ఇన్స్యూర్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది యాన్యుటీ (లైసెన్స్ పొందిన యాన్యుటీ ప్రొవైడర్) ఒప్పందం. కాగా, అర్హత కలిగిన నివాసాలలో సింగిల్-ఫ్యామిలీ గృహాలు, పాక్షికంగా విడిపోయిన గృహాలు, టౌన్ షిప్‌లు, కండోమినియం యూనిట్లు (లేదా కాండోలు), అపార్ట్మెంట్ యూనిట్లు, మొబైల్ గృహాలు ఉన్నాయి. -
సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది. ఇది ఎలా పనిచేస్తుంది..? రివర్స్ మార్ట్గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్‌లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! రుణాన్ని చెల్లించక్కర్లేదు.. వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్‌గా రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్‌ను బ్యాంక్‌లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు. చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు! రెండు రకాల చెల్లింపులు... రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్‌లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? ఎప్పుడైనా చెల్లించొచ్చు.. రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్‌కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్‌కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్బీఐ రివర్స్ మార్ట్గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది. విలువ మదింపు.. రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్‌లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్‌ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్‌లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్‌లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్గేజ్ రుణానికి ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్. సమర్పించాల్సినవి ఇవీ.. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు! ఎందుకు ఆదరణ లేదు..? రివర్స్ మార్ట్గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే. నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది. ► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు. ►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు. ► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్‌గేజ్‌కు అవకాశం లేదు. ►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు. ► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్టీ చార్జీలను చెల్లించాలి. ►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. ► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్‌లు మదింపు వేస్తాయి. ►రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి. చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా..అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. అపార్ట్మెంట్ కట్టాలన్నా లేక ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. ధరలను నియంత్రించేందుకు గాను ఆర్బీఐ రెపోరేట్లు.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినప్పటికీ మిలియనిల్స్ (1980 తర్వాత జన్మించిన వాళ్లు) సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోళ్లు ప్రభావం చూపుతుందా? మిలియనిల్స్ ఏమనుకుంటున్నారు? అన్న అంశంపై ప్రముఖ రియాల్టీ సంస్థ నోబ్రోకర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ - ఎన్సీఆర్ నగరాల నుంచి సుమారు ఇంటి లోన్ తీసుకున్న 2 వేల మంది పాల్గొన్నారు. ♦ ఇక, ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. 2022 అక్టోబర్ - డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో వడ్డీ రేట్లు ఆకాన్నంటుతున్నా.. 42 శాతం హోం లోన్ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ముగిసిన ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2021 సమయంలో ఇళ్ల లోన్ల వృద్ధి 120 శాతం పెరిగింది. ♦ కోవిడ్-19 తెచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ‘మనకీ ఓ సొంతిల్లు’ ఉంటే బాగుండేదన్న ఆలోచన పెరిగింది. కాబట్టే కోవిడ్-19కి ముందు మిలియనిల్స్ 17శాతం ఉంటే ఇప్పుడు అదికాస్త 27కి పెరిగింది. వారిలో ఎక్కువ మంది 25 - 35 మధ్య వయస్కులే ఉండటం గమనార్హం. ♦ 36 ఏళ్ల వయసు దాటిన తర్వాత గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ‘లేట్ మిలీనియల్స్’ నిలుస్తున్నారు. వీళ్లు సైతం ఇల్లు కొనుగోలు చేసే వారి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే హైలెట్ చేసింది. ♦ సొంతింటి కోసం ఎక్కువ మంది కుర్రకారు 10 శాతం డౌన్ పేమెంట్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్(ఎన్బీఐఎఫ్సీ) వంటి సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో పర్సనల్ లోన్ తీసుకొని వాటి ద్వారా డౌన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. ♦ 78 శాతం మంది హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం లేదు.. అలా అని తక్కువగా ఉన్నాయని చెప్పడం లేదని తేలింది ♦ రుణాలపై ఇళ్లను కొనుగోలు చేసేవారు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు.. ఆ భారం వల్ల ఎదుర్కొన్నే కష్ట - నష్టాలను పూర్తిగా అర్ధం చేసుకున్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు 6 నుంచి 8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు. ♦ ‘ఇళ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. మేము ఈ 20 సంవత్సరాల టెన్యూర్ కాలంలో రెపో రేట్ పెంపు, తదుపరి రేటు తగ్గింపు సాధారణంగా సగటున ఉన్నట్లు స్పష్టమవుతుంది’ అని నోబ్రోకర్ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ♦ మిలీనియల్స్ కోసం నిర్వహించిన ప్రత్యేక నోబ్రోకర్ అధ్యయనంలో కొవిడ్‌కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని నో బ్రోకర్ సర్వేలో తేలింది. చదవండి👉 ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
అద్దెకుండాలా.. ఇల్లు కొనాలా .. ఏది లాభం?
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. చివరికి తమ కలల సౌధాన్ని నెరవేర్చుకుంటారు. అయితే గత ఐదేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిపోతున్న అద్దెలు, ఇళ్ల ధరలు.. సొంతింటి కలను దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు.. ప్రాపర్టీలు, రెంట్లు ఆకాశాన్ని తాకుతున్న నగరాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ నివేదించింది. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ‘కేపిటల్ మైండ్’ ఫౌండర్, సీఈవో దీపక్ షెనాయ్ (Deepak Shenoy) ఇంటి కొనుగోలుపై పెట్టే పెట్టుబడిని ‘భయంకరమైన పెట్టుబడి’గా అభివర్ణించారు. ఇల్లు, కారు కొనుగోలు చేయడం మంచిది కాదన్నారు. సొంత ఇల్లు కొనుగోలుతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. సొంతంగా కారు కొనుక్కునే బదులు.. ఓలా, ఊబర్ లాంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చని అన్నారు. కానీ కొనుగోలు, అద్దె ఈ రెండూ ఎప్పటికి పోవు. ఎందుకంటే ఎక్కువ మంది దృష్టిలో ఆ రెండు ఓ విశ్వాసం లాంటివి. అందుకే చాలా మంది ఇల్లు, కార్లకు యజమానులవ్వాలని అనుకుంటారు. ఒక్కోసారి కారు కొన్నట్లు ఇల్లు కొనుగోలు చేయొచ్చా? అని ఆలోచిస్తుంటారు. మరికొందరు పెట్టుబడులతో ఇల్లు కొనుగోలు విషయంలో గందరగోళానికి గురవుతారని ట్వీట్ చేశారు. అయితే గత దశాబ్దంలో ఇళ్ల కొనుగోళ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్ల తరహాలో ఇళ్ల కొనుగోళ్లు ఓ భయంకరమైన పెట్టుబడి. కానీ సొంత ఇల్లు ఉంటే మనకు నచ్చిన విధంగా అందంగా అలంకరించుకోవచ్చు. పాస్‌పోర్ట్‌లో పర్మినెంట్ అడ్రస్ కింద అప్లయి చేసు కోవచ్చు. రెంట్ కట్టే బాధతప్పుతుంది. అద్దె ఇల్లు కోసం మీడియేటర్లతో సంప్రదింపులు జరిపే అవసరం ఉండదనే భావనలో ఉంటారని.. కానీ సొంత ఇల్లు కొనుగోలు చేయడం సమర్ధించే పెట్టుబడి కాదని అన్నారు దీపక్ షెనాయ్. ప్రస్తుతం దీపక్ షెనాయ్ వ్యక్తం చేసిన ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలకు దూరం చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 ఆర్బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా? -
అద్దెకా! ఆ రోజులు పోయాయమ్మా.. రెండేళ్లలో గృహ ప్రవేశమే!
న్యూఢిల్లీ: భారతీయులు దాదాపు 45 శాతం మంది రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్నారు. ఎక్కువ మంది అద్దెకు బదులుగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటున్నరు. ‘వాయిసెస్ ఫ్రమ్ ఇండియా’’ పేరుతో ప్రాపర్టీ కన్సల్టెంట్-సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన ఒక సర్వే ఈ అంశాలను వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా 20,000 మంది ఈ సర్వేలో పాల్గొంటే ఇందులో భారతీయుల సంఖ్య 1,500. వీరిలో జెన్-జెడ్ (18-25 సంవత్సరాలు), లేట్ మిలీనియల్స్ (26-33 సంవత్సరాలు) ఎర్లీ మిలీనియల్స్ (34-41 మధ్య వయస్సులు), జెన్ ఎక్స్ (42-57 సంవత్సరాలు) బేబీ బూమర్స్ (58 దాటినవారు) ఈ సర్వేలో ఉన్నారు. ఇళ్ల కొనుగోళ్ల విషయంలో ‘వడ్డీరేట్ల’ పెరుగుదల పెద్ద అడ్డంకిగా కనిపించడం లేదని ఇండియా మార్టిగేజ్ గ్యారెంటీ కంపెనీ (ఐఎంజీసీ) ఇటీవలే తన తాజా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచినప్పటికీ, రూ.30-50 లక్షలు, రూ.50–75 లక్షల విభాగాల్లో ఇళ్ల రుణ డిమాండ్ పెరిగిందని ఐఎంజీసీ వివరించింది. -
ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా..? దేనివల్ల అధిక ప్రయోజనం
సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాలా..? లేదంటే అద్దె ఇంట్లో ఉంటే ప్రయోనమా? ఈ విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి గణాంకాల సహితంగా తెలుసుకుంటే కానీ, తీరే సందేహం కాదు ఇది. అప్పు తీసుకుని అయినా ఇల్లు సమకూర్చుకోవాలని, అదే లాభదాయకమని కొందరు బలంగా నమ్ముతుంటారు. భూ మి ధర ఎప్పటికైనా పెరిగేదే కదా, దీనితో ఆస్తి విలువ ఇతోధికం అవుతుందని భావిస్తుంటారు. కానీ, గతంలో ఉన్నంతగా భూమి విలువ వృద్ధి ఇక ముందూ ఉంటుందని చెప్పలేం. అలాగే, సొంతిల్లు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉంటుందని కూడా చెప్పలేం. ఇదే నిజమైతే కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు రోజూ అదనపు సమయం, ఇంధనం రూపేణా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కానీ, ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, కలల నిలయం అని ఎక్కువ మంది చెబుతారు. కనుక సొంతింటి కలను రుణం రూపంలో నెరవేర్చుకుంటే లేదా అద్దె ఇంట్లో ఉంటే పన్ను కోణంలో ఉండే లాభ, నష్టాలను తెలుసుకుందాం. సొంతింటి కల.. రుణంపై సొంత ఇంటిని సమకూర్చుకుంటే మంచి పన్ను ఆదా ప్రయోజనాలు ‘ఆదాయపన్ను పాత విధానం’లో ఉన్నాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తంలో అసలు, వడ్డీ రెండు భాగాలు. ఈఎంఐలో భాగంగా చెల్లించే రుణం అసలును సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే, ఇంటి కొనుగోలుకు చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. వడ్డీ విషయానికొస్తే.. కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉండేవారు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ భాగం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల మొత్తంపై పన్ను చెల్లించక్కర్లేదు. అంటే ఆదాయంలో రూ.2 లక్షల మేర గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే.. ఆ ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీతోపాటు ఆ ఇంటికి చెల్లించే మున్సిపల్ ట్యాక్స్, అద్దె ఆదాయంలో 30 శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే సదరు రుణం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో మంజూరై ఉండాలి. ఇంటి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45లక్షలు మించకూడదన్నది షరతు. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రయోజనాలు ఆదాయపన్ను కొత్త విధానంలో లేవు. సెటాఫ్, క్యారీఫార్వార్డ్ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిలో సొంతంగా నివసించే వారు అద్దె రూపంలో ఎలాంటి ఆదాయం లేనట్టయితే.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీని నష్టంగా చట్టం పరిగణిస్తుంది. దీన్ని వేతనం, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం కింద సర్దుబాటు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తం ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఆ నష్టాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో (క్యారీ ఫార్వార్డ్) ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే నోషనల్ రెంట్ అంశం తెరపైకి వస్తుంది. రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగించుకుంటున్నారని అనుకుంటే, మిగిలిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. చట్టం కింద ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. మార్కెట్లో ఉన్న సగటు అద్దె ధరలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలతలు: అద్దె ఇంటితో పోలిస్తే సొంతిల్లు తీసుకోవడం వల్ల ఆస్తి సమకూరుతుంది. ఇంటి రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతికూలతలు: రుణంపై తీసుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు డౌన్ పేమెంట్ కింద తన వంతు వాటా కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఏటా చెల్లించాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు అదనం. ఇంటికి మరమ్మతుల కోసం వెచ్చించాలి. విక్రయించాలంటే వెంటనే అమ్ముడుపోకపోవచ్చు. అంటే లిక్విడిటీ తక్కువ. ప్రాపర్టీ ధర పెరుగుతుందని, గణనీయంగా పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగం లేదా ఆదాయం నిలిచిపోయినా రుణం, దానిపై వడ్డీ చెల్లించాల్సిందే. చిన్న ఇంటికి వెళ్లి అద్దె భారం తగ్గించుకునే అవకాశం ఉండదు. అద్దె ఇంట్లో ఉండే వారికి కంపెనీలు తమ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ని వేతనంలో భాగంగా ఇస్తుంటాయి. ఈ భాగానికి పన్ను ప్రయోజనం ఉంటుంది. స్థూల పన్ను వేతనంలో గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది. కాకపోతే హెచ్ఆర్ఏకి పన్ను మినహాయింపు పొందాలంటే పనిచేస్తున్న కార్యాలయం ప్రాంతంలోనే సొంత ఇల్లు కలిగి ఉండకూడదనేది షరతు. పన్ను ప్రయోజనాలు: అద్దె ఇంట్లో ఉండేవారు, వేతనంలో భాగంగా పొందిన హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే, హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపునకు కొన్ని షరతులు ఉన్నాయి. మూల వేతనం, కరువు భత్యం మొత్తంలో 10 శాతం. లేదంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో నివసించే వారు వేతనంలో 50 శాతం, మిగిలిన పట్టణాల్లో నివసించే వారు 40 శాతాన్ని హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. లేదా అసలు హెచ్ఆర్ఏ రూపంలో తీసుకున్న మొత్తం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తంపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది. అనుకూలతలు: రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే, అద్దె ఇంటి కోసం చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. అద్దె ఇల్లు అయితే పనిచేసే ప్రాంతానికి అతి సమీపంలో లేదా కావాల్సిన చోట ఉండొచ్చు. సొంతిల్లు అయితే అందుబాటు ధర కోసం, పట్టణానికి వెలుపలి ప్రాంతాల్లో కొనుగోలు చేయాల్సి (ఎక్కువ మంది విషయంలో) వస్తుంది. అద్దె ఇ్లలు అయితే కోరుకున్నప్పుడు ఇల్లు మారిపోవడం సులభం. చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ప్రతికూలతలు: అద్దె ఇంట్లో ఉంటే ఆస్తి సమకూరదు. ఏటా అద్దె పెరుగుతూ ఉంటుంది. నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోలేరు. ఇంటి యజమానికి నచ్చకపోయినా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరికి ఎలా ప్రయోజనం..? ఎక్స్ అనే వ్యక్తి స్థూల వార్షిక ఆదాయం రూ.20లక్షలు. నెలవారీగా అద్దె కింద రూ.30వేలు చెల్లిస్తున్నాడు. వై అనే వ్యక్తి వార్షిక ఆదాయం కూడా రూ.20 లక్షలే. కానీ, అతడు సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి రుణంపై ఏటా రూ.3 లక్షలు వడ్డీ కింద, రూ.1.5 లక్షలు అసలు కింద చెల్లిస్తున్నాడు. ఇప్పుడు వీరికి నికర పన్ను భారం (ఆదాయపన్ను పాత విధానం కింద) ఎలా ఉంటుందని చూస్తే.. (పక్క బాక్స్‌లో) -
కరోనా ఎఫెక్ట్.. హాట్‌కేక్‌లా సేల్స్, కోట్లు పెట్టి ఆ ఇళ్లనే కొంటున్న జనం!
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గుచూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తుల కోసం ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. 61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2023–24లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలా మంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. గత 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. అయి తే 2015లోని గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గుచూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధామ్యాలు మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవ నశైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11% మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీ లకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
ప్రపంచ కుబేరుడు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు
-
ఉద్యోగులకు శుభవార్త..రూ.5 లక్షల నుంచి రూ.75లక్షల వరకు రుణాలు!
న్యూఢిల్లీ: ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్(ఐఎంజీసీ)తో తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ చేతులు కలిపింది. తద్వారా ఉద్యోగులు, ఉద్యోగేతరులకు రూ. 5–75 లక్షల మధ్య గృహ రుణాలను ఆఫర్ చేసేందుకు సిద్ధపడుతోంది. ఒప్పందంలో భాగంగా పిరమల్ క్యాపిటల్ జారీ చేసే గృహ రుణాలకు ఐఎంజీసీ గ్యారంటీని కల్పిస్తుంది. దీంతో రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఎదురైనప్పటికీ హామీ లభిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 10–12 శాతం బిజినెస్‌ను సాధించాలని పిరమల్ క్యాపిటల్ భావిస్తోంది. ప్రధానంగా సొంతింటికి ఆసక్తి చూపే ఉద్యోగులు, స్వయం ఉపాధి కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ‘గృహ సేతు హోమ్ లోన్’ పేరుతో ఈ రుణాలను అందించనుంది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరమల్ క్యాపిటల్ దేశవ్యాప్తంగా గల 300 బ్రాంచీలను రుణ పంపిణీకి వినియోగించుకోనుంది. ఈ పథకంలో భాగంగా రూ.5–75 లక్షల మధ్య రుణాలను గరిష్టంగా 25ఏళ్ల కాలపరిమితితో మంజూరు చేయనున్నట్లు పిరమల్ క్యాపిటల్ తెలియజేసింది. కాగా..రుణ భారంతో దివాలాకు చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌ను పిరమల్ క్యాపిటల్ చేజిక్కించుకున్న విషయం విదితమే. -
సొంతింటి కల నెరవేరటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నలబ్ధిదారులు
-
సొంతింటికి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి శోభతో కలిసి సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చారు. కొంత కాలంగా ఈ ఇంటిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చారు. పావుగంట పాటు సీఎం కేసీఆర్ పనులను చూసి పలుచోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు. -
తల్లిదండ్రులను మత్తులోకి పంపించి.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే..
లక్నో: ప్రియుడితో కలిసి తన సొంత ఇంట్లోనే ఓ యువతి దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోసాయిగంజ్‌లో చోటుచేసుకుంది. చోరిలో రూ. 13 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన ఆభరణాలను అపహరించింది. సౌత్ డిప్యూటీ కమిషనర్ ఖ్యాతి గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వ్యాపారవేత్త మనోజ్ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. విలువైన వస్తువులు భద్రపరిచిన లాకర్లన్నీ పగలకొట్టి ఉన్నా, ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లుగా ఆనవాళ్లు లేవని తెలిసుకున్నారు. దీంతో పోలీసులు దర్యాప్తుని ఇంట్లో వాళ్లతో మొదలు పెట్టారు. ఈ క్రమంలో మనోజ్ కుమార్తె చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా విచారించగా నేరాన్ని అంగీకరించింది. తాను, ప్రియుడు వినయ్ యాదవ్, సహాయకుడు శుభం యాదవ్‌తో కలిసి ఈ చోరి చేసినట్లు తెలపడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా మరో నిందితుడు రంజిత్ యాదవ్ ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగతనం జరిగిన రోజు రాత్రి ఖుష్బు తేనీరులో నిద్రమాత్రలిచ్చి కుటుంబ సభ్యులను మత్తులోకి జారుకునేలా చేసింది. అనంతరం ప్రియుడు, అతడి స్నేహితులను ఇంట్లోకి రానిచ్చి పాల్పడినట్లు తెలిపిందని పోలీసులు తెలిపారు. దొంగలించిన సొమ్ము మొత్తం రికవరీ చేసినట్లు చెప్పారు. చదవండి: నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ అని కాల్ రికార్డు చేసి.. -
కాలువ గట్టు నుంచి కలల లోగిళ్లలోకి..
సాక్షి, అమరావతి: ఈమె శీలం జ్యోతి.. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు కాలువగట్టుపై టార్పాలిన్‌ను కప్పిన చిన్న పాకలో పదేళ్లుగా ఉంటోంది. భర్త చనిపోగా కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈమెకు సొంత ఇల్లు అన్నది కలలో కూడా ఊహించలేని విషయం. కానీ.. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ జ్యోతి జీవితంలో వెలుగులు నింపింది. ..ఇలా శీలం జ్యోతే కాదు. బుడమేరు కాలువ గట్టుపై దశాబ్దకాలంగా బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. వారికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అంతేకాదు.. వారికి ఇల్లు కట్టించి కూడా ఇవ్వనున్నారు. లక్ష మందికిపైగా పేదల దుస్థితి ఇదీ.. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చింది. విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని నిరుపేదలు దశాబ్దాలుగా కాలువ గట్లు, ఆటోనగర్‌లోని ఇరుకు సందులు, శివారు ప్రాంతాల్లోని మురికివాడలు, కొండప్రాంతాలు, రోడ్ల పక్కన చిన్నచిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకుని లక్షమందికి పైగా పేదలు ఉంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం అలాంటి లక్షలాది పేదల సొంతింటి ఆశలను నిజం చేసింది. సువిశాలమైన లే అవుట్లలో ఇళ్ల స్థలాలిచ్చింది. అందులో ప్రభుత్వం వారికి బృందావనాన్ని తలపించే రీతిలో ‘వైఎస్సార్–జగనన్న’ కాలనీలు నిర్మించనుంది. రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు, పార్కులు.. ఇలా అన్ని వసతులు సమకూర్చనుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలో వేసిన లే అవుట్ ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. ఓ వైపు కొండలు మరోవైపు తోటలతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అందులో 1,265 ఇళ్ల స్థలాలతో వేసిన లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సమీపంలో వేసిన లే అవుట్ ‘రివర్ వ్యూ’ శోభతో అలరారనుంది. కొండపల్లిలో వేసిన లే అవుట్లు కూడా కార్పొరేట్ కంపెనీలు నిరి్మంచే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి. 2,215.19 ఎకరాల్లో 151 లేఅవుట్లు.. ఈ విధంగా విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పేదల కోసం ఏకంగా 2,215.19 ఎకరాల్లో 151 లే అవుట్లు వేయడం విశేషం. తద్వారా 1,33,470 మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. అప్పుడు ఇంటి కోసం పదేళ్లు తిరిగినా ఇవ్వలేదు మేం బుడమేరు కాలువగట్టుపై చిన్నపాకలో పదేళ్లుగా ఉంటున్నాం. సొంత ఇంటి కోసం పదేళ్లుగా తిరిగాను. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి మా ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాను ఎన్నిసార్లు అడిగినా మాకు ఇల్లు రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కల నెరవేరింది. ఇంతకంటే మాకేం కావాలి. – నాగమణి, ఇబ్రహీంపట్నం మా కుటుంబానికి పండుగరోజు జగనన్న మాకు ఇంటి స్థలం ఇచ్చిన రోజే మాకు పండగ రోజు. అందుకే మాకు స్థలం ఇచ్చిన రోజే అక్కడకు వెళ్లి పూజ చేశాం. నున్నలో సెంటు భూమి రూ.5 లక్షలకు పైగా ఉంది. మేం రూ.లక్ష కూడా పెట్టలేం. అలాంటిది మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి.. ఇల్లు కూడా కట్టించి ఇస్తోంది. – సారేపల్లి కుమారి, నున్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం నోట మాట రావడంలేదు ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన పాకలో ఉంటున్నాం. అడగకుండానే మా ఇంటికి వచ్చి మరీ ఇంటి స్థలం కేటాయించారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఈ సంతోషంతో నోటి నుంచి మాట రావడంలేదు. మాకు ఇంతకన్నా ఏం కావాలి. – మల్లీశ్వరి, నున్న, విజయవాడ రూరల్ మండలం సొంతిల్లు కట్టుకుంటానని అనుకోలేదు రేకుల షెడ్డులోనే సగం జీవితం అయిపోయింది. ఇక ఈ జీవితానికి సొంతింటి యోగం లేదనుకున్నాను. కానీ, జగనన్న నా కల నిజం చేశారు. నాకంటూ ఓ సొంత ఇంటిని ఇస్తున్నారు. ఎందరో పేదలకు మేలు చేసిన సీఎంను ఆ దేవుడు చల్లగా చూడాలి. – పరసా స్వర్ణకుమారి, నున్న గ్రామం విజయవాడ రూరల్ -
అద్దె ఇల్లా.. సొంతిల్లా..?
సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం నేటి రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. వేతన జీవులు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అవకాశం కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. అయితే, కొందరు రుణం అంటే భయంతో వెనుకంజ వేస్తుంటారు. దీనికి బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటుంటారు. కొందరు అయితే అద్దె ఇంటికి చెల్లించేదేదో రుణ ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు మనదైపోతుందన్న అంచనాతో ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటారు. ఇంకొందరు అయితే ఏది లాభం? అనే సంశయంతో ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్యాపిటల్ కోషెంట్ సీఈవో సౌస్తవ్ చక్రవర్తి అభిప్రాయ కోణం ఇలా ఉంది.. ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండడం ప్రతికూల ఆప్షన్ ఏమీ కాదు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను చూద్దాం. ఇంటిని కొనుగోలు చేయడం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ధోరణులను పరిశీలిస్తే.. ప్రాపర్టీ ధరలు ఏటా 8 శాతం చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ఖరీదు రూ.90 లక్షలని అనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రాపర్టీ 8 శాతం ఏటా పెరుగుదల అంచనాల ఆధారంగా రూ.4.19 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.78,104 చొప్పున చెల్లిస్తూ వెళితే కట్టే మొత్తం రూ.1.87 కోట్లు మాత్రమే. లాభ, నష్టాలు అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. దీన్ని కాదనడం లేదు. కానీ, ఆర్థిక కోణంలో నుంచి చూసేట్టు అయితే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల అతిపెద్ద అనుకూలత.. రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను మినహాయింపులు ఉండడం. ప్రతికూలత.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే విక్రయించడంలో ఉండే ఇబ్బంది. ఒకరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతారన్న నమ్మకం తక్కువే. ఇంటి కోసం ఒకే ప్రాంతంలో ఉండి కెరీర్లో ఉన్నత అవకాశాలను నష్టపోలేరు కదా. అద్దె ఇంట్లో ఉండడం... అద్దె ఇంట్లో ఉండే వారు, వేతనంలో మిగిలే మొత్తాన్ని ప్రతీ నెలా లేదా మూడు నెలలకోసారి క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎంచుకున్న కాలానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి మొత్తం బ్యాంకు నుంచి సంబంధిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళుతుంది. ఎన్ఏవీ ధర ఆధారంగా ఫండ్స్ యూనిట్ల కేటాయింపులు చేస్తారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల మార్కెట్లు పెరుగుదల, పతనాల్లోనూ కొనుగోలుతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇప్పుడు పై ఉదాహరణలో ఇంటి రుణంపై ఈఎంఐగా రూ.78,104 చెల్లించాలని చెప్పుకున్నాం కదా.. ఇందులో అద్దె ఇంటికి ప్రతినెలా చెల్లించాల్సిన రూ.25,000ను మినహాయించగా, సిప్ కోసం రూ.53,104 అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా సిప్ రూపంలో 20 ఏళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 12% రాబడి అంచనాతో రూ.5,30,58,751 సమకూరుతుంది. లాభ, నష్టాలు: అద్దె ఇంట్లో ఉండే వారు తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరో చోటకు (అదే పట్టణంలో మరో చోటుకు లేదా వేరే ప్రాంతానికి) మారిపోయే వెసులుబాటుతో ఉంటారు. ఇంటిని విక్రయించాలన్న ఇబ్బంది ఉండనే ఉండదు. పైగా అద్దె ఇంట్లో ఉండే వారికి హెచ్ఆర్ఏ పేరుతో పన్ను మినహాయింపు ఉండనే ఉంది. వేతనం లేని వారికి కూడా కొంత మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే అద్దె ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒక ఇంటి వారు కాలేకపోవచ్చు. ఏంటి కర్తవ్యం..? రెండు ఆప్షన్లలోనూ లాభ, నష్టాలు ఉన్నాయి. రెండింటిలోకి.. అద్దె ఇంట్లో ఉండి, సిప్ ద్వారా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రూ.5.3 కోట్ల నిధిని సమకూర్చుకోగలరు. మరోవైపు రుణంపై ఇంటిని సమకూర్చుకున్నా కానీ.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ రూ.4.19 కోట్లు అవుతుంది. కాకపోతే రూ.కోటి వరకు వడ్డీ రూపేణా ఈ కాలంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఇంటి అద్దెను 20 ఏళ్ల కాలానికి ఫ్లాట్‌గా ప్రతీ నెలా రూ.25,000గానే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంలో ఇంటి అద్దె ఏటేటా పెరుగుతుంది. అయితే, అదే సమయంలో వేతనం పెరుగుతుంటుంది కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్లొచ్చు. అంతిమంగా తమ అవసరాలు, అనుకూలతలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలో అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొందరు రుణ ఈఎంఐ అంటే తప్పనిసరి బాధ్యతగా భావించి వేతనంలో కచ్చితంగా ఆ మొత్తాన్ని పక్కన పెడతారు. అదే అద్దె ఇంట్లో ఉండి, మిగులు మొత్తాన్ని అంతే క్రమశిక్షణగా, బాధ్యతగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వారి అవసరాలు ప్రాధాన్యంగా మారి.. పెట్టుబడులు పక్కకు వెళ్లిపోవచ్చు. ఇదే జరిగితే సొంతిల్లు లేక పోగా, చివరికి మంచి నిధి కూడా ఏర్పాటు చేసుకోలేరు. అందుకే క్రమశిక్షణ, దృష్టి కోణం ఆధారంగానూ నిర్ణయం ఉండాలి. -
భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే..
ముంబై: సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడిందో మహిళ. వివరాల్లోకెళ్తే.. నావీ ముంబైలోని కోపర్ ఖైరానే ప్రాంతంలో భార్యా, భర్తలు నివసిస్తున్నారు. అయితే భర్తకు తెలియకుండా తన జల్సాలకు కొన్నిచోట్ల అప్పులు చేసింది. తిరిగి ఆ సొమ్ము చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయింది. లక్షా పదివేల రూపాయల విలువైన బంగారంతో పాటు, మరో 3 లక్షల రూపాయల నగదును ఇంటి నుంచి దొంగలించింది. కాగా.. జూన్ 15న ఆ మహిళ తనకు ఆరోగ్యం బాగోలేదంటూ భర్తకి చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే మరోసారి ఆస్పత్రికి రమ్మని డాక్టర్లు సూచించడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి సమీపంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద ఆమెను వదిలేసి వచ్చాడు. జూన్ 17న మరోసారి భార్యను తీసుకొని ఆస్పత్రికి వెళ్లిన అతను చికిత్సం అనంతరం ఆమెను బంధువల ఇంటివద్ద ఉంచి ఆ వ్యక్తి పనికి వెళ్లాడు. అయితే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పని ముగించుకొని భార్యను తీసుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించగానే కిటికీలు పగలగొట్టి ఉండటం.. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ‘అమ్మ’మ్మలే హతమార్చారు.. కేసుకు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సీసీటీవీ పుటేజీని పరిశీలించి ఇరుగుపొరుగు వారిని విచారించారు. అయితే పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా.. బాధితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలంపై పోలీసులు లోతుగా విచారణ జరిపారు. విచారణలో ఆమె దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. తన భర్త పనికి వెళ్లిన సమయంలో ఇంట్లోని విలువైన వస్తువులు, నగదును ఆమే ఎత్తుకెళ్లినట్లు అంగీకరించింది. అయితే ఈ ఘటనపై ఆమె భర్త మాట్లాడటానికి నిరాకరించారు. చదవండి: అక్కా.. నాకు బతకాలని లేదు! -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్‌ను ఎన్ ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్‌ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్‌లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్‌గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్‌వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్‌వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్‌చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్‌గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
అమరావతికి జగనే పర్మినెంట్.. బాబు అద్దెదారుడే
‘అమరావతికి చంద్రబాబు టెనెంట్(అద్దెకుండేవారు)... అందుకే ఇక్కడ మరొకరి ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు.. అమరావతికి జగనే పర్మినెంట్.... అందుకే సొంత ఇల్లు కట్టుకున్నారు’ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న కామెంట్ ఇది. అంతేకాదు... ‘చంద్రబాబూ ఇక్కడ ప్యాకప్ చెప్పు...హైదరాబాద్‌లో కట్టుకున్న బంగ్లాలో రెస్టాఫ్ లైఫ్ సెటిలవ్వు’ అని సలహా కూడా ఇస్తున్నారు. ‘బాస్ జగన్ ఈజ్ కమింగ్... బాబూ సైడ్ ప్లీజ్ ’అని టీజ్ చేస్తున్నారు. సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి భయంతో తీవ్ర అసహనంతో ఉన్న చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌పై చేస్తున్న అసత్య ఆరోపణలకు సోషల్ మీడియాలో కౌంటర్లు వెల్లువెత్తున్నాయి. ఇంతవరకూ తన అబద్ధాలను అనుకూల మీడియాలో పదే పదే ప్రచారం చేయించుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడూ అదే కుయుక్తితో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతో క్రియాశీలకంగా సోషల్ మీడియా మాత్రం అతని అసత్య ప్రచారాల బండారాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారాలు ఎంత దిగజారుడు ఆరోపణల వివరాలతో సహా అనేకమంది సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని... ఏపీకి రావడం లేదని చంద్రబాబు ఇటీవల కాలంలో అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. జగన్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో ఉండే పరిపాలిస్తారని కూడా విమర్శించారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, జగన్‌లను సరిపోలుస్తూ టీడీపీ విమర్శలను బలంగా తిప్పికొట్టారు. ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు గత ఐదేళ్లలో అమరావతిలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదన్న విషయాన్ని సూటిగా ప్రశ్నించారు. 2014లో ఏపీకి సీఎం అయ్యాక చంద్రబాబు హైదరాబాద్‌లో విలాసవంతమైన బంగ్లా ఎందుకు కట్టుకున్నారని నిలదీస్తున్నారు. జగన్ అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ప్రశంసించారు. తాను అమరావతికి అద్దెకొచ్చానని, 2019లో హైదరాబాద్‌కు మారి అక్కడే శేష జీవితం గడపాల్సి ఉంటుందని తెలుసు కాబట్టే చంద్రబాబు ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోలేదంటూ సునిశిత విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు తాను అమరావతిలో శాశ్వతంగా ఉండాల్సిందేనని తెలుసు కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని బాబు ఆరోపణల్ని తిప్పికొడుతున్నారు. గత 14 నెలలు రాష్ట్ర ప్రజల మధ్యే జగన్ : జగన్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారన్న చంద్రబాబు విమర్శల్ని కూడా సోషల్ మీడియా తిప్పికొట్టింది. 2014 నుంచి ఏదో విధంగా ప్రజా ఉద్యమాలు, జిల్లాల పర్యటనలతో జగన్ దాదాపుగా పూర్తి సమయం ఏపీలోనే గడిపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాఫురం వరకు పాదయాత్ర నిర్వహించి 14 నెలల పాటు రాష్ట్ర ప్రజలతోనే మమేకమైన తీరు మర్చిపోయావా? చంద్రబాబూ! అని నిలదీస్తున్నారు. అందుకే ఆయనకు అమరావతి నుంచి తట్టా బుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ‘బాస్ ఈజ్ కమింగ్... సైడ్ సైడ్ ప్లీజ్! చంద్రబాబూ’ అంటూ సోషల్ మీడియా ఇప్పుడు ఎలుగెత్తుతుంది. -
అందరూ ఉన్నా అనాథలయ్యారు
మైలార్‌దేవ్‌పల్లి: కుటుంబ సభ్యులు కాదు పొమ్మన్నారు.. తలదాచుకోవడానికి కాసింత స్థలం ఇమ్మంటే బయటకు గెంటేశారు.. వారసత్వంగా వచ్చే ఇల్లు లేదన్నారు. దీంతో అందరూ ఉన్నా ఆ కుటుంబం అనాథగా మిగిలింది. చేసేది లేక చలికి వణుకుతూ రోడ్డుపైనే జీవనం సాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ సర్కిల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఉస్మాన్ అలీ, ఖరీమ్బీ దంపతులకు ఏడుగురు సంతానం. వీరి కుమారుడిలో ఒకరైన సయ్యద్ ఇక్బాల్ అలీ(52) కుక్‌గా పని చేస్తూ ఆర్డర్లు వచ్చిన చోటుకు వెళ్తూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఇక్బాల్ అలీకి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా తండ్రి ఉస్మాన్ అలీకి అంబేడ్కర్‌నగర్‌లో 180 గజాల స్థలంలో ఇల్లు ఉంది. గత కొన్నేళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఇక్బాల్ అలీ గత సంవత్సరం తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు రాజేంద్రనగర్ అంబేడ్కర్ నగర్‌కు వచ్చి పక్కనే ఉన్న ఇంట్లో అద్దెకు దిగాడు. ఇక్బాల్ అద్దెకుంటున్న ఇంటి యజమానులు ఆ ఇంటిని కూల్చి నూతన ఇల్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. దీంతో ఇక్బాల్ అలీ తండ్రి సంపాదించిన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నీకు ప్రవేశం లేదంటూ కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఇంటి ఎదుట ఉన్న స్థలంలో భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పినప్పటికీ అతడికి ఇంట్లోకి ప్రవేశం లేదంటూ గొడవపడుతున్నారు. తన తండ్రి వారసత్వంగా వచ్చిన స్థలంలో 45 గజాలు తనకు వస్తుందని సంబంధిత అధికారులు తన విషయంలో జోక్యం కలిగించుకొని ఇంట్లోకి ప్రవేశం కల్పించాలని ఇక్బాల్ అలీ గోడును వెల్లబోసుకున్నాడు. సొంత ఇల్లు ఉన్నా తనకు ప్రవేశం లేదని, రోడ్డు పక్కన కుటుంబంతో జీవనం సాగిస్తున్నానని, జీహెచ్ఎంసీ వారు అందించే దుప్పట్లతో రాత్రి వేళలో నిద్రిస్తున్నానని ఇక్బాల్ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. -
‘ఇంటి’కి ఇల్లాలితోనే లాభం!
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు! ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ లేకపోయినా.. రెండో దాని గురించి వివరంగా చర్చించాల్సిందే. ఎందుకంటే ఇంటి ఓనర్‌గా, లేక కో–ఓనర్‌గా మహిళ పేరుంటే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి మరి!! బ్యాంక్ వడ్డీ రేట్ల నుంచి మొదలెడితే రుణంలో, వడ్డీలో, పీఎఫ్ కోతలో.. ఆఖరికి స్టాంప్ డ్యూటీ చార్జీల్లోనూ రాయితీలున్నాయ్!! ఆ వివరాలు చూద్దాం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో సొంతిల్లు కొనటానికి రుణం తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, ప్రోత్సాహకాలతోనూ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటి యజమానిగా మహిళ పేరుండాలి. లేకపోతే కో–ఓనర్‌గానైనా ఉండాలన్నది నిబంధన. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరిట కొనుగోలు చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. తొలి ఉద్యోగం త్వరగా.. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే మహిళలు వృత్తి జీవితాన్ని త్వరగా ప్రారంభించాలనేది నిపుణుల సూచన. ఉదాహరణకు.. 22 ఏళ్ల వయసు నుంచి మహిళ వృత్తి జీవితాన్ని ప్రారంభించారనుకుందాం. అప్పుడామె సగటు వార్షిక వేతనం రూ.4.5 లక్షలు. ఇది ఐటీ పరిశ్రమలో సగటు ఉద్యోగి వేతనం. 3–4 నాలుగేళ్ల తర్వాత అంటే 25–26 ఏళ్ల వయస్సులో గృహ రుణాన్ని ఎంచుకుంటే ఉత్తమం. ఎందుకంటే అప్పటికీ సదరు మహిళ వేతనం దాదాపు రూ.6–8 లక్షలుంటుంది. అన్ని బ్యాంక్‌లు నికర వేతనంపై 60 రెట్లు గృహ రుణంగా అందిస్తున్నాయి. అంటే నికర వేతనంరూ.50 వేలు అనుకుంటే.. ఉద్యోగి రూ.30 లక్షల గృహ రుణం వరకూ అర్హులు. అంటే ఈ బడ్జెట్లో అందుబాటు గృహాలను ఎంచుకునే వీలుంటుంది. మూడేళ్లు పీఎఫ్ బాధ్యత ప్రభుత్వానిదే.. ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ చట్టం (ఈపీఎఫ్‌వో)–1952 ప్రకారం.. పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగి వేతనంలో పీఎఫ్ మినహాయింపు కాస్త తక్కువ. అంటే సమాన వేతనం ఉన్న పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగికి కొంచెం ఎక్కువ జీతం చేతికొస్తుంది. తొలిసారి మహిళ ఉద్యోగి ప్రాథమిక వేతనంలో మూడేళ్ల పాటు 12% పీఎఫ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని ఉద్యోగిని పేరిట ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు.. కొత్త ఉద్యోగిని నెల జీతం రూ.15 వేలు అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.1.80 లక్షలు. మొదటి 3 ఏళ్లు 12% ఈపీఎఫ్ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.21,600. మొత్తంగా మూడేళ్లలో ఉద్యోగినికి అదనంగా అందే సొమ్ము రూ.64,800. గృహ రుణంలో రూ.3.5 లక్షలు ఆదా.. గృహ రుణాల్లో మహిళలకు పన్ను ప్రయోజనాలున్నాయి. గృహ రుణంలో, వడ్డీ చెల్లింపుల్లో రెండింట్లోనూ రాయితీలున్నాయి. ఇంటి లోన్‌లో (ప్రిన్సిపల్ ఎమౌంట్) గరిష్టంగా రూ.1.5 లక్షలు, చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3.5 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయన్న మాట. మహిళలకు తనఖా రుణం మీద, నికర అద్దె విలువ మీద కూడా వడ్డీ రాయితీ పొందే వీలుంది. అద్దెకిచ్చేందుకు కాకుండా స్వయంగా తానుండేందుకు లేక ఇల్లు తన పేరు మీదనే ఉంటే గనక మరిన్ని పన్ను రాయితీలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఇంటికి సహ యజమానులుగా ఉండి, భార్యకు ప్రత్యేకంగా ఆదాయ మార్గం ఉంటే గనక.. ఇద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే పన్ను తగ్గింపు ఎంతనేది ప్రాపర్టీలో సహ యజమాని వాటా మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ రేట్లూ తక్కువే.. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు గృహ రుణాల్లో మహిళలకు ప్రత్యేక వడ్డీ రాయితీలను అందిస్తున్నాయి. లోన్ మొత్తం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది కూడా. ఎస్బీఐలో వార్షిక గృహ రుణ వడ్డీ రేటు 8.4–8.95 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.85 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐలో ఇతరులకు వడ్డీ రేటు 8.4–8.85 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.7 శాతంగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇతరులకు 8.4–9.05 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–9.05 శాతంగా ఉంది. స్టాంప్ డ్యూటీలోనూ రాయితీ.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మహిళ పేరిట చేసినా లేక జాయింట్ ఓనర్‌గా ఉన్నా సరే స్టాంప్ డ్యూటీలో రాయితీ పొందవచ్చు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధన ఉండేది. అయితే స్టాంప్‌డ్యూటీని 6 శాతానికి చేర్చినపుడు ఈ నిబంధనను తొలగించినట్లు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జె.వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఢిల్లీలో మహిళలకు స్టాంప్ డ్యూటీ 4 శాతం ఉంటే పురుషులకు 6 శాతం. హర్యానాలో మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6 శాతం. అదే పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం. రాజస్థాన్‌లో మహిళలకు 4 శాతం, పురుషులకు 5 శాతంగా ఉంది. సీఎల్ఎస్ఎస్లో భలే రాయితీలు.. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) పథకం కింద అందుబాటు గృహాలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) రాయితీలను అందుకోవచ్చు. మహిళ గృహ యజమానిగా లేక సహ యజమానిగా ఉండాలనేది నిబంధన. మొదటిసారి గృహం కొనుగోలు చేసే మహిళకు సీఎల్ఎస్ఎస్ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఉదాహరణకు గృహిణి వార్షిక వేతనం రూ.6 లక్షల లోపు ఉంటే.. రూ.6 లక్షల గృహ రుణం మీద 6.5 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. -
సింగరేణి కార్మికుడి సొంతింటి కల సాకారం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుడి సొంతింటి కల సాకారం కానుంది. ఇంటి కోసం తీసుకునే రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపునకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, సర్క్యులర్ కూడా జారీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ రుణాలపై వడ్డీకి సంబంధించి రూ.130 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఉద్యోగం వద్దనుకున్నవారికి ఒకేసారి రూ.25 లక్షలు లేదా నెలకు రూ.25 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సుమారు వందమందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. సింగరేణి ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తామని, దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ జయంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు సెలవు ప్రకటిస్తున్నామని, అన్ని క్యాంటీన్లను ఆధునీకరించి నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తామని, ఐఐటీ, ఐఐఎంలలో ఉన్నతవిద్య చదివే కార్మికుల పిల్లలకు ఫీజులు చెల్లిస్తామని తెలిపారు. కొత్తగా ఆరు భూగర్భ గనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. -
ఓ అభాగ్యుడి ‘శవయాత్ర’
బోయినపల్లి(చొప్పదండి): సొంతిల్లులేదు.. స్వగ్రామంలో ఉపాది లభించలేదు.. కుటుంబ పోషణ, ఇతర అవసరాల కోసం అప్పు చేశాడు.. అది తీర్చేందుకు పొట్టచేత పట్టుకుని సూరత్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై మృత్యువాత పడ్డాడు. కనీసం శవాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే స్తోమత లేకపోవడంతో దాతలు తలాకొంత విరాళాలు వేసుకున్నా రు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మృతదేహాన్ని ఉంచేందుకూ స్థలంలేక రోడ్డుపక్కనే వేసిన ఉదంతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగింది. బోయినపల్లికి చెందిన బొడ్డు లింగేశ్(49) సుతారీ(మేస్త్రీ) పనితోపాటు వ్యవసాయం చేసేవాడు. భార్య కాంతవ్వ, కరణ్, మధు కుమారులు, దివ్య, వైశాలి కూతుళ్లు. లింగేశ్ గతేడాది తనకున్న ఎకరంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడుల కోసం రూ. రెండు లక్షల వరకు అప్పు చేశారు. దిగుబడి రాక అప్పు మీదపడింది. దీంతో సూరత్ వెళ్లి.. సుతారీ పనిలో కుదిరాడు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి ఈనెల 8న అక్కడి ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని తెప్పించడానికి చందాలు.. లింగేశ్ మృతదేహాన్ని స్వగ్రామం తెప్పించేందుకు కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. కొందరు గ్రామస్తులు చందాలు ఇవ్వగా, మరికొందరు అప్పుగా ఇచ్చిన సుమారు రూ.20 వేలను అక్కడి కార్మికులకు పంపించారు. ఈ సొమ్ముతో మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. చదువు మానేసి.. పనులకు.. అప్పుల బాధతో లింగేశ్ సూరత్ వెళ్లగా, ఆయన భార్య కాంతవ్వ మానసిక స్థితి కోల్పోయింది. కుటుంబ భారం పెద్ద కుమారుడు, కుమార్తెపై పడింది. దీంతో చదువు మానేసి వారు కూలీలుగా మారారు. కుమారుడు కరణ్, కూతురు దివ్య గంగాధరలో ఒకేషనల్ ఇంటర్ చదివేవారు. కరణ్ కూలి పనికి, దివ్య వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లింగేశ్ మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. రోడ్డుపైనే శవం.. లింగేశ్కు సొంతిల్లు లేదు. సోదరుల ఇంట్లో ఓ చిన్న గదిలో కుటుంబసభ్యులు తలదాచుకుంటున్నారు. అక్కడ శవం వేస్తే నిలువ నీడ ఉండదు. పైగా ఆయన మృతి చెంది మూడు రోజులు గడిచింది. దీంతో బోయినపల్లి నుంచి కొదురుపాక వెళ్లే డబుల్ లేన్ రోడ్డు మధ్య పెట్రోల్ బంక్ పరిసరాల్లో మృతదేహాన్ని ఉంచారు. అనంతరం చందాలు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇంటివాడైన యంగ్ హీరో..!
వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఓ బిడ్డకు తండ్రైన నాని ఇప్పుడు ఇంటివాడవ్వటం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి చాలా కాలంగా సొంతింటికి మారిపోవాలన్న ఆలోచనలో ఉన్న నాని ఇటీవలో గచ్చిబౌలిలోని ఓ కాస్ట్లీ ఏరియాలో పెద్ద విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న నాని త్వరలోనే గృహప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాని. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కనున్న MCA( మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రాపర్టీ ప్లస్ 4th June 2017
-
35 ఏళ్ల లోపే సొంతిల్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘మంచి చదువు.. ఆపైన ఉద్యోగం.. తర్వాత పెళ్లి, పిల్లలు.. ఆ తర్వాతే సొంతిల్లు’’.. సాధారణంగా ప్రతి మధ్యతరగతిది ఇదే ఫార్ములా! కానీ, ఇది గతం. నేటి యువత దీన్ని ముందు సొంతిల్లు ఆ తర్వాతే ఏదైనా అంటోంది. దేశంలోని మిలీనియల్స్ (35 ఏళ్ల లోపు వయస్సు వాళ్లు) సొంతింటి ఎంపికలో కీలకంగా మారారని పుణెకు చెందిన నిర్మాణ సంస్థ పరాండే స్పేస్ చైర్మన్ అనిల్ పరాండే ‘సాక్షి రియల్టీ’కి ఈ–మెయిల్లో పంపిన కథనంలో తెలిపారు. అందుకే నిర్మాణ సంస్థలు కూడా యువతను.. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని తెలిపారు. ⇒ మిలీనియల్స్ క్యాంపస్ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. ఉద్యోగరీత్యా పలు నగరాల్లో ఉండాల్సిన పరిస్థితి. ఏటేటా పెరుగుతున్న అద్దెలు.. దీంతో అద్దెకుండటం కంటే సొంతిల్లు కొనడమనే భావన పెరుగుతోంది. పైపెచ్చు కెరీర్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేయటం, రకరకాల మనస్తత్వాల సహోద్యోగులతో కలిసి పనిచేయడం వంటివి కూడా వారి ఆలోచనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పోటీ మార్కెట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం కూడా సొంతింటి ఎంపికలో కీలకంగా మారుతోంది. ⇒ ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, బ్యాంకర్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వంటి సంప్రదాయ ఉద్యోగాలకే నేటి యువత పరిమితం కావట్లేదు. సొంత కంపెనీలు, స్టార్టప్స్ పెట్టేసి వారితో పాటూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. అందుకే ముందు నుంచే ఆర్ధిక ప్రణాళికలకు పెద్ద పీట వేస్తున్నారు. ఎంపికలో ప్రాధామ్యాలివే: ప్రాజెక్ట్ ఉండే చోట కనెక్టివిటీ బాగుండాలి. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ప్రాజెక్ట్‌తో పాటూ పర్యావరణం కూడా బాగుంటుంది. ⇒ ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో 2 కార్లుండటం సాధారణం. అందుకే పార్కింగ్‌లో రెండింటికీ చోటివ్వాలి. ⇒ చాలా మంది యువత ఇంటినే ఆఫీసుగా మార్చేస్తున్నారు. అంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అందుకే అపార్ట్మెంట్లో స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై సదుపాయాలుండాలి. ఆధునిక వసతులే కాదు పర్యావరణహితమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలి. ⇒ ప్రాజెక్ట్‌లోనే పాఠశాల, ఆసుపత్రి, షాపింగ్ మాల్స్ లేదా వినోద కేంద్రాలుండే ప్రాజెక్ట్‌లకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. వాక్ టు వర్క్ లేదా సైకిల్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు ఐటీ, తయారీ రంగాలకు చేరువలో ఉండే ప్రాజెక్ట్‌లను కూడా ఎంచుకుంటున్నారు. -
సొంతిల్లు సులక్షణం
⇒ శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్ఆర్ సులక్షణ ⇒ ఆరున్నర ఎకరాల్లో 490 లగ్జరీ ఫ్లాట్లు ⇒ జూన్ నుంచి గృహప్రవేశాలు షురూ భాగ్యనగరంలో సొంతిల్లు కొనాలంటే అందుబాటు ధరల్లో స్థలాలు దొరకవు! పోనీ దొరికినా లేదా ధర తక్కువున్న ప్రాంతాలకు వెళితేనేమో రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండవు!! మరి, సొంతింటి కల తీరేదెలా? ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న ఎల్బీనగర్ ప్రాంతంలో.. మెట్రో రైలుకు కూతవేటు దూరంలో.. విద్య, వైద్యం, వినోదం ఇలా అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంలో అది కూడా అందుబాటు ధరల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది టీఎన్ఆర్ గ్రూప్. శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్ఆర్ సులక్షణ ప్రాజెక్ట్ విశేషాలను సంస్థ సీఎండీ నర్సింహారావు ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. సాక్షి, హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న హస్తినాపురంలో ఆరున్నర ఎకరాల్లో టీఎన్ఆర్ సులక్షణ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజñ క్ట్ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 490 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. 40 శాతం 2 బీహెచ్‌కే, 60 శాతం 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. 1,074–1,754 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 5 బ్లాకుల్లో.. ఒక్కో బ్లాక్ ఏడంతస్తుల్లో ఉంటుంది. ⇒ ఆదిభట్లకు 10 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటూ టీసీఎస్, డీఆర్డీఎల్, మిథానీ, ఆర్సీఐ, ఏరోస్పేస్ వంటి సంస్థల ఉద్యోగులూ కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటికే ఇందులో 70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. జూన్ నుంచి సీ, డీ బ్లాకుల్లో 200 ఫ్లాట్లు కొనుగోలుదారులకు అప్పగిస్తాం. ఇప్పటికే వీటిల్లో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన బ్లాకుల్లోనూ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను 2018 ముగింపు నాటికి పూర్తి చేస్తాం. ⇒ నిర్మాణంలో నాణ్యత అనేది టీఎన్ఆర్ లక్ష్యం. అందుకే కాబోలు 18 ఏళ్లలో 30 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన టీఎన్ఆర్.. 70 శాతం ప్రాజెక్ట్‌లు ఈస్ట్ జోన్ కేంద్రంగా నిర్మించినవే. ఇవి చాలవూ టీఎన్ఆర్ ప్రాజెక్ట్‌ల నాణ్యత విషయంలో కస్టమర్లకు ఎంత నమ్మకమో చెప్పేందుకు. సులక్షణ నిర్మాణం గురించి ‘సాక్షి రియల్టీ’ ప్రత్యక్షంగా పరిశీలిం చింది. భూకంపాలను తట్టుకునే శక్తిగల ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, టీఎన్ఆర్ రెడిమిక్స్ కాంక్రీట్‌తో నిర్మాణం జరుగుతుంది. వెలుపలి గోడలు 8 ఇంచులు, లోపలి గోడలు 4 ఇంచులతో ఉన్నాయి. ప్రధాన ద్వారం టేక్‌వుడ్ ఫ్రేమ్‌తో, లోపలి తలుపులు, కిటికీలు టీఎన్ఆర్ యూపీవీసీతో ఉన్నాయి. లివింగ్, డైనింగ్, కిచెన్, బెడ్ రూముల్లో వెర్టిఫైడ్ టైల్స్, కారిడార్, బాల్కనీల్లో యాంటి స్కిడ్ సెరామిక్ టైల్స్, బాత్ రూముల్లో యాసిడ్ రెసిస్టెన్స్ సెరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్‌ఫాం, స్టీల్ సింక్ వంటివి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటి అన్ని ఉత్పత్తులూ బ్రాండెడ్ కంపెనీలవే వినియోగించారు. ⇒ ఆధునిక వసతులనేవి సామాన్య, మధ్యతరగతి వారు కూడా అనుభవించాలనే ఉద్దేశంతో సులక్షణలో వసతులకు ప్రాధాన్యమిచ్చాం. దీంతో ఈస్ట్ జోన్లో అత్యధిక వసతులందిస్తున్న ప్రాజెక్ట్‌లో ఇది నిలిచింది. ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఆకర్షణ ఓపెన్ ఎయిర్ థియేటరే. అలాగే 2 క్లబ్ హౌజ్‌లు.. ఒక్కోటి మూడంతస్తుల్లో ఉంటాయి కూడా. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ హాల్, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, క్రచ్, ఇన్ఫినిటీ పూల్ వంటి రకరకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. రెండు లెవల్స్ పార్కింగ్, వాటర్ హార్వెస్టింగ్, సౌర వీధి దీపాలతో పాటూ నివాసితులు నిత్యావసరాల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్ట్‌లోనే సూపర్ మార్కెట్, ఐటీఎం, స్పా, కెఫెటేరియా వంటి ఏర్పాట్లూ ఉంటాయి. -
44 కోట్ల మందికి గృహాలు
న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 44 కోట్ల మందికి సొంతిల్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటితోపాటు ఎల్పీజీ, కరెంటు, నీటి కనెక్షన్లు కూడా ఇవ్వాలని భావిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మైదాన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.1.30 లక్షలు, కొండప్రాంతాల్లోని వారికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం నేరుగా బదిలీ చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్జీత్ సిన్హా చెప్పారు. దీంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12 వేలు అదనంగా ఇస్తామన్నారు. సొంతింటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.18 వేలు ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తామని తెలిపారు. తొలుత 33 కోట్ల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీన్నిప్పుడు 44 కోట్లకు పెంచామన్నారు. ఆవాసాలు లేనివారికి ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని, తాత్కాలిక గృహాల్లో నివసించేవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. లబ్ధిదారుల్లో 60% మంది ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చూస్తున్నా రు. నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడేళ్లలోగా జమ అవుతాయని చెప్పారు. -
‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’
‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు • అందుబాటు ఇళ్లకు ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు • ఇప్పటికే 150 ఎకరాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి • మరో వంద ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో.. సాక్షి, హైదరాబాద్: ⇔ సొంతింటి కోసం చెప్పులరిగేలా తిరిగిన శ్రమ.. ఏకంగా స్థిరాస్తి సంస్థనే పెట్టేలా చేసింది. ⇔ పైసా పెట్టుబడి లేకుండా ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్ 20 రోజుల్లోనే హాట్‌కేక్‌లా పూర్తయి.. నెల రోజుల్లోనే కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. ⇔ 2007 జులైలో ప్రారంభమైన ప్రణీత్ గ్రూప్.. ఇప్పటివరకు 16 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకొని 2 వేలకు పైగా హ్యాపీ కుటుంబాలకు నిలయమైందని చెప్పుకొచ్చారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు. అందుబాటు ధరల్లో నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లు కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు తగ్గవని ‘సాక్షి రియల్టీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో చెప్పారాయన. ⇔ మాది కడప జిల్లాలోని చాపాడు గ్రామం. ఆరు గురి సంతానంలో చిన్నవాణ్ని. ఏడు వరకు సొంతూళ్లోనే చదివా. ఆపైన చదువు కోసం పెద్దన్న ప్రోద్బలం, ప్రోత్సాహంతో 1983లో హైదరాబాద్‌కొచ్చా. ఆర్ధికంగా కుటుంబం బలహీనం కావటంతో చిన్నప్పుటి నుంచే కష్టాలు తప్పలేదు. బడిచౌడిలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశా. ఇంజనీరింగ్ చేయాలనేది నా కోరిక. కానీ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిప్లొమాలో చేరాల్సి వచ్చింది. పంజగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. జీతం రూ.500. ఇదే నా తొలి సంపాదన. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ చేస్తున్న స్నేహితుల రూముల్లో ఉండేవాణ్ని. కోచింగ్ తీసుకుంటున్న ఫ్రెండ్స్‌కు ట్యూషన్స్ చెబుతూ నేనూ ఇంజనీరింగ్ రాశా. ఎవరికీ మంచి ర్యాంక్ రాలేదు. నాకు మాత్రం 119 ర్యాంక్ వచ్చింది. ⇔ అయితే నాకొచ్చిన ర్యాంక్‌కు మంచి కాలేజీలోనే సీటొచ్చేది కానీ, నాన్ లోకల్ కావటంతో అనంతపురంలోని జేఎన్టీయూలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఓవైపు ఇష్టం లేదు కానీ, ప్రకాశ్, మురళి ఇద్దరు ఫ్రెండ్స్ రెండో ఏడాది హైదరాబాద్ జేఎన్టీయూకు మార్చుకోవచ్చని సలహా ఇవ్వటంతో నేనూ సరేనని అనంతపురం వెళ్లా. అయితే తొలి ఏడాది టాప్ 5లో ఉన్న విద్యార్థులకు మాత్రమే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముంటుందనడంతో ఫస్ట్ ఇయర్ బాగా చదవా. రెండో ఏడాది మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టా. 78.5 ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఐటీలో పదేళ్లు: ప్రభుత్వ ఉద్యోగమైతే బిందాస్‌గా ఉండొచ్చనే ఉద్దేశంతో బాగా కష్టపడి చదివి ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే 1994లో దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్ జాబ్ కొట్టేశా. వేతనం రూ.5 వేలే అయినా.. పైపైన మాత్రం బాగానే వచ్చేది. కానీ, ఏదో Ðð లితి. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌కు దూరంగా ఏంటిదా అని? అప్పటికే కొంత మంది ఫ్రెండ్స్ ఐటీ ఉద్యోగం పేరిట విదేశాల్లో ఉంటే.. నాకూ అమెరికా వెళ్లాలనిపించింది. ఇంకేముంది సీ ++ కోర్సు కోసం బెంగళూరుకెళ్లా. 2 నెలల్లో ఐటీ జాబ్ వచ్చేసింది. టాటాతో మొదలైన నా ఐటీ ఉద్యోగం టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్ కంపెనీల్లో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశా. భారీ వేతనం, విదేశీ ఆఫర్స్ ఉన్నా సరే ఐటీలో వెలితనిపించేది. నా జీవితం భాగ్యనగరంతోనే ముడిపడి ఉందనిపించింది. అందుకే జాబ్‌కు టాటా చెప్పేశా. 3 నెలల్లో 6 వేల కి.మీ... చదువుకునే రోజుల్లో ఉన్న హైదరాబాద్‌కు ఇప్పుడున్న హైదరాబాద్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో అద్దె లేకుండా కేవలం కరెంట్, నీళ్ల బిల్లు కట్టి ఉండేవాన్ని. కానీ, ఇప్పుడేమో అద్దె కాదు కదా అసలు బతగ్గలనా అనిపించింత అభివృద్ధి చెందింది. అప్పటికే పెళ్లి కావటంతో అద్దెకుండటం కంటే సొంతిల్లు కొనుక్కోవటమే ఉత్తమమనిపించింది. ఇంకేముంది రోజూ పేపర్లలో యాడ్స్ చూసి భార్యతో కలిసి వెళ్లేవాణ్ని. ఎంతలా తిరిగానంటే బైక్ మీద 3 నెలల్లో 6 వేల కి.మీ. తిరిగేశాం. చివరికి నిజాంపేటలో ఇళ్లు ఫైనలైంది. రూ.10 లక్షలు రుణం, మిగిలిన దాంట్లో కొంత మా మామగారు సర్ది.. మొత్తం మీద గృహ ప్రవేశం పూర్తి చేశాం. అయితే ఇదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే.. ఇంటికోసం నేను పడిన శ్రమ, పరిశోధన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చర్చించేవాణ్ని. ఎక్కడ స్థలాలు కొంటే లాభమొస్తుందో చెప్పేవాణ్ని. చాలామంది కొని లబ్ది పొందారు కూడా. దీంతో నాకు తెలియకుండానే 200–300 మంది ఫాలోవర్స్ తయారయ్యారు. ఇదే నా పెట్టుబడిగా మారింది. అదే 2007 జూలైలో ప్రణీత్ గ్రూప్‌కు బీజం వేసింది. నెల రోజుల్లో కోటి సంపాదన.. తొలి ప్రాజెక్ట్ ప్రారంభం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. నిజాంపేటలో నేను కొన్న ఇళ్లు లీగల్ సమస్యల్లో ఉంటే ఆంజనేయులు గారు తీర్చారు. ఆయన స్థలంలోనే అంటే మల్లంపేటలో 3 ఎకరాల్లో 40 డూప్లెక్స్ హోమ్స్‌కు శ్రీకారం చుట్టా. ల్యాండ్ ఓనర్‌కు, నాకు సగం సగం. ఆశ్చర్యకరమైన విషయమేమీటంటే.. నా 20 ఇళ్లు కేవలం 2 వారాల్లో విక్రయించేశా. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నా అలా నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించా. అలా తొలి ఏడాది రూ.3 కోట్లకు చేరిన ప్రణీత్ గ్రూప్ టర్నోవర్ ప్రస్తుతం రూ.160 కోట్లకు చేరింది. ⇔ విల్లా, గేటెడ్ కమ్యూనిటీ అంటే కోట్ల రూపాయలు కావాలనుకుంటారు. కానీ, సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అది కూడా నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు జోరుగా ఉంటాయనడానికి ప్రణీత్ గ్రూపే నిదర్శనం. ఇప్పటివరకు 150 ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం. 2 వేలకు పైగా కుటుంబాలకు ఇంటి తాళాలందించాం. ప్రస్తుతం 100 ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో సుమారు 1,500 కుటుంబాలు రానున్నాయి. మరో 20 ఎకరాల స్థలాలను సమీకరించాం. సీఎస్ఆర్లోనూ ఉత్సాహంగానే.. ప్రస్తుతం ప్రణీత్ గ్రూప్‌లో 250 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఉద్యోగిని గౌరవిస్తాం. కంపెనీ వార్షికోత్సవం వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు కంపెనీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మా కంపెనీ ఇన్వెస్టర్ల కంటే సీరియస్ హోం సీకర్స్కే ప్రాధాన్యమెక్కువ. అందుకే వాళ్లు ఉండేందుకే ఇళ్లు కొంటారు. అందులోనే ఉంటారు కూడా. ఇన్వెస్టర్లను కస్టమర్లుగా చేర్చుకున్న ప్రాజెక్ట్‌లు సక్సెస్ కాలేవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలనూ ఉత్సాహంగా నిర్వహిస్తాం. బీరంగూడ, మల్లంపేటలో గుడి, బడి కట్టించాం. ప్రణీత్ ప్రాజెక్ట్‌లుండే చోట ఆయా పరిసరాల్లో సీఎస్ఆర్ కింద రోడ్లు, మురుగు నీటి శుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొంత నిధితో ఓ ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయాలనే భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. -
ఆర్థిక లక్ష్యాలకు.. సిప్ సిప్ హుర్రే!!
⇔వీలైనంత ముందు నుంచీ పెట్టుబడి బెటర్ ⇔క్రమం తప్పకుండా చేయటం వల్ల లాభాలు ⇔మార్కెట్లు తగ్గినా ఆ మేరకు సిప్ యూనిట్ల పెరుగుదల ⇔కాంపౌండింగ్ మహిమతో చక్కని నిధి సమకూరే చాన్స్ సొంత ఇల్లు సమకూర్చుకోవడం... కారు కొనుక్కోవడం .. బోలెడంత డబ్బుతో చీకూ చింత లేని రిటైర్మెంట్ జీవితం గడపడం.. ఇలా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఆర్థిక లక్ష్యం.. కల ఉంటాయి. జీవితంలో ముందుకెళ్ళాలంటే ఇలాంటి లక్ష్యాలు అవసరం కూడా. అయితే వీటికోసం నిజంగానే సరిగ్గా డబ్బును.. సమయాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆర్థిక లక్ష్యాల సాకారం కోసం కొంచెం కొంచెంగానైనా సరే... ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే అంత మంచిది. ఇందుకు ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ విధానాల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అత్యంత ప్రధానమైనది. మెరుగైన రాబడులు అందుకోవడానికి.. మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో స్మార్ట్‌గా, సింపుల్‌గా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే విధానమిది. వారం వారీ గానీ నెలవారీగానీ లేదా మూణ్నెల్లకోసారి గానీ.. సులభంగా ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కల్పిస్తుందీ సిప్. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పోలిస్తే తక్కువ రిస్కు ఉండే సిప్ విధానం పెట్టుబడులతో పలు ప్రయోజనాలున్నాయి. సిప్ ప్రయోజనాలు చాలా.. మార్కెట్ల హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా యావరేజింగ్ ప్రాతిపదికన ప్రయోజనాలు అందించడం సిప్ విధానంలో ప్రత్యేకత. ఎందుకంటే మార్కెట్ కదలికల బట్టి మ్యూచువల్ ఫండ్ పథకాల విలువలు మారుతుంటాయి. మీరు ప్రతి నెలా ఒకే మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా .. దీనికి తగ్గట్లుగానే యూనిట్లు లభిస్తాయి. ఉదాహరణకు మార్కెట్ అధిక స్థాయిల్లో ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు లభిస్తాయి. అలాగే తక్కువ స్థాయిలో ఉంటే ఎక్కువ యూనిట్లు వస్తాయి. దీనివల్ల మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. సగ టున మీ ఖాతాలో ఒక మోస్తరు స్థాయిలో జమవుతూనే ఉంటాయి. కాంపౌండింగ్ పని చేసేదిలా.. కాంపౌండింగ్ ప్రభావంతో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం మీద వచ్చే రాబడులు కూడా పెట్టుబడిలో భాగంగా మారతాయి. కాబట్టి అవి కూడా రాబడి అందిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలంలో పెద్ద మొత్తం జమవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి మధ్యలో అవాంతరమేదైనా వచ్చి కొంత కాలం ఆపేసినా కూడా మీరు అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన దానిపై రాబడులు రావడం కొనసాగుతూనే ఉంటుంది. చివరిగా చెప్పొచ్చేదేమిటంటే.. ప్రత్యేకంగా ఆర్థిక లక్ష్యమంటూ పెట్టుకోకుండా చేసే పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ సరిగ్గా ఉండదు. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నాక, దేనికి ఎంత అవసరమవుతుందో లెక్కవేసుకోవాలి. పెట్టుబడి లక్ష్యం, మీ రిస్క్ సామర్థ్యాలే ఫండ్ పోర్ట్‌ఫోలియో స్వరూపాన్ని నిర్దేశిస్తాయి. వీటిని బట్టి మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు సాగండి. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు మ్యూచువల్ ఫండ్ సిప్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. వయసు పెరిగాక కాకుండా యుక్త వయసు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే తక్కువ మొత్తం పెట్టుబడితో ఎక్కువ నిధిని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. రాజు, శ్రీనుల ఉదాహరణే తీసుకుంటే.. రాజు ముప్ఫై ఏళ్ల వయస్సు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతను నెలకు కేవలం రూ. 3,000 ఇన్వెస్ట్ చేస్తూ అరవై ఏళ్లప్పుడు రిటైర్మెంట్ నాటికి గణనీయమైన మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. మరోవైపు శ్రీను నలభై ఏళ్లు వచ్చినప్పట్నుంచీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే, నెలకు రూ. 5,000 మొత్తం ఇన్వెస్ట్ చేసినా కూడా అతను రిటైర్మెంట్ నాటికి రాజు సమకూర్చుకోగలిగినంత అందుకోలేకపోవచ్చు. (ఏటా 15 శాతం మేర రాబడులు వస్తాయనే అంచనాలతో). -
2 బీహెచ్‌కే నుంచి 3 వైపు!
♦ కస్టమర్లలో మారుతున్న ధోరణి ♦ 67 శాతం 3 బెడ్ నిర్మాణాలతో హైదరాబాద్ ముందంజ సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను కూడా ఎంపిక చేసి మరీ సాకారం చేసుకుంటున్నారు కొనుగోలుదారులు. అంటే ఒకప్పుడు రెండు పడక గదులు (2 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు.. ఇప్పుడు మూడు పడక గదులు (3 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మళ్లుతున్నారని దానర్థం. దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో క్వికర్‌హోమ్స్ ఓ సర్వే నిర్వహించింది. గతేడాది జనవరి-మార్చి (క్యూ1)తో పోల్చుకుంటే ఈ ఏడాది క్యూ1లో 6 నగరాల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా పెరిగాయని సర్వే పేర్కొంది. - సాక్షి, హైదరాబాద్ గతేడాది జనవరి నుంచి మార్చి మధ్య భాగ్యనగరంలోని మొత్తం నివాస సముదాయాల నిర్మాణంలో 47 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల సంఖ్య.. ఈ ఏడాది క్యూ1 వచ్చేసరికి 67 శాతానికి పెరిగింది. అలాగే ధరలోనూ ఏడాదిలో రూ.9 లక్షలు పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.92.2 లక్షలుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర.. ఈ ఏడాది కోటికి చేరింది. ♦ మిగిలిన 5 ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 20 శాతం 3 బీహెచ్‌కే నిర్మాణాలు పెరిగాయి. ఇందుకు కారణం.. 2015లో ఆఫీసు స్థలం అమ్మకం విక్రయించబటం, ఇతర మెట్రో నగరాలతో చూసుకుంటే ఇక్కడే స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటమే. ♦ సాధారణంగా నగరంలో గతేడాది 1,880 చ.అ.లుగా ఉండే 3 బీహెచ్‌కే విస్తీర్ణం... ఈ ఏడాది 1,990లకు పెరిగింది. ఆయా 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, నార్సిం గి, ముిషీరాబాద్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్నాయి. బెంగళూరు: గతేడాది 42 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు.. ఈ ఏడాది కేవలం 3 శాతం పెరుగుదలతో 45 శాతానికి పెరిగాయి. ♦ గతేడాది 3 బీహెచ్‌కే ధర రూ.86.4 లక్షలుంటే.. ఈ ఏడాది క్యూ1లో అది రూ.79.7 లక్షలకు పడిపోయింది. అంటే రూ.6.7 లక్షలు తగ్గింది. ♦ 3 బీహెచ్‌కే విస్తీర్ణం గతేడాది క్యూ1లో 1,630 చ.అ.లుంటే ఈ ఏడాది 1,530 చ.అ.లకు తగ్గింది. చెన్నై: 34 శాతంగా ఉన్న నిర్మాణాలు కాస్త మెరుగై ఈ ఏడాది క్యూ1లో 36 శాతానికి చేరాయి. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరల్లోనూ రూ.7 లక్షలు పెరిగాయి కూడా. గతేడాది క్యూ1లో రూ.90.4 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.97.2 లక్షలకు పెరిగాయి. ♦ విస్తీర్ణాలను చూస్తే.. గతేడాది 1,390 చ.అ.లున్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,310కి తగ్గింది. అంటే విస్తీర్ణం తగ్గినా.. ధర మాత్రం తగ్గకుండా పెరిగిందన్నమాట. ముంబై: ఆర్థిక రాజధానిలో 2015 తొలి మూడు నెలల్లో 14 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాదిలో 16 శాతానికి చేరాయి. ధర విషయంలో మాత్రం గణనీయంగా పడిపోయింది. ఏడాదిలో రూ.14.5 లక్షలు తక్కువైంది. గతేడాది క్యూలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర రూ.2.48 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది రూ.2.34 కోట్లకు పడిపోయింది. ♦ గతేడాది 1,508 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణం.. ఈ ఏడాది 1,417కు తగ్గింది. ఢిల్లీ-ఎన్సీఆర్: గతేడాది 36 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 48 శాతానికి పెరిగాయి. కానీ, ధర విషయంలో ఏడాదిలో రూ.18 లక్షలు తగ్గాయి. 2015 క్యూ1లో రూ.74 లక్షలున్న 3 బీహెచ్‌కే ధర.. 2016 క్యూ1లో రూ.56 లక్షలకు తగ్గాయి. ఫ్లాట్ విస్తీర్ణాలనూ తగ్గించారు. అంటే గతేడాది 1,750 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే విస్తీర్ణం.. ఈ ఏడాది 1,450 చ.అ. తగ్గాయి. పుణె: గతేడాది మొత్తం నిర్మాణాల్లో 15 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే నిర్మాణాలు.. ఈ ఏడాది 20 శాతానికి పెరిగాయి. అదేవిధంగా గతేడాది రూ.96 లక్షలున్న ధర.. ఈ ఏడాది రూ.1.22 కోట్లకు చేరింది. ♦ ధరతో పాటూ 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణాలూ పెరిగాయి. అంటే గతేడాది 1,530 చ.అ.లుగా ఉన్న విస్తీర్ణం.. ఈ ఏడాది 1,716కు పెరిగాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రియల్టీ జోరు ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ రావటం, రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగవ్వటం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ పారిశ్రామికంగా వృద్ధి చెందటం, కేంద్రం నుంచి స్మార్ట్ సిటీలు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి కారణాలతో దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం మెరుగైందని క్వికర్‌హోమ్స్ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో దేశంలో అత్యధిక నివాస లావాదేవీలు జరిగిన 6 ద్వితీయ శ్రేణి పట్టణాలను ఎంపిక చేసింది. విజయవాడ, లుధియానా, లక్నో, నాగ్‌పూ ర్, అహ్మదాబాద్, చంఢీఘర్లు ఈ జాబితాలో నిలి చాయని నివేదిక పేర్కొంది. అయితే ఆయా పట్టణాల్లో అపార్ట్మెంట్, విల్లాల వ్యాపారం కంటే ఓపెన్ ప్లాట్ల వ్యాపారమే ఎక్కువ శాతం జరిగిందని పేర్కొంది. ♦ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన వ్యాపార కేంద్రంగా నిలిచింది విజయవాడ. కొత్త రాజధాని అమరావతికి దగ్గర్లో ఉండటం, జాతీయ రహదారుల అభివృద్ధి, గన్నవరం విమానాశ్రయం విస్తరణ, లక్ష చ.అ.ల్లో ఐటీ పార్క్‌ల ఏర్పాటు వంటివి బెజవాడ స్థిరాస్తి జోరుకు కారణాలు. మొత్తం స్థిరాస్తి వ్యాపారంలో 54 శాతం అపార్ట్మెంట్ల వ్యాపారం సాగుతుంటే.. 43 శాతం ఓపెన్ ప్లాట్లు, మిగిలిన 3 శాతం విల్లాల వ్యాపారం సాగుతున్నాయి. ♦ పంజాబ్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన లుధియానాలో 66 శాతం అపార్ట్మెంట్ లావాదేవీలు సాగుతుంటే.. 23 శాతం ప్లాట్స్, 10 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది. ♦ లక్నోలో 20 శాతం అపార్ట్మెంట్స్, 70 శాతం ప్లాట్లు, 10 శాతం విల్లాల లావాదేవీలు సాగుతున్నాయి. ♦ ముంబై, పుణే తర్వాత మహారాష్ట్రలో పెద్ద నగరమైన నాగ్‌పూర్‌లో 41 శాతం, 55 శాతం ప్లాట్స్, 4 శాతం విల్లాల వ్యాపారం సాగుతుంది. ♦ గుజరాత్‌లోని పెద్ద నగరం అహ్మదాబాద్. ఇక్కడ 63 శాతం అపార్ట్మెంట్స్, 22 శాతం ప్లాట్స్, 15 శాతం విల్లాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ♦ చండీఘడ్‌లో 63 శాతం అపార్ట్మెంట్లు, 30 శాతం ప్లాట్స్, 8 శాతం విల్లాల వ్యాపారం. -
సొంతింటి పుల్లకూర
జీవన కాలమ్ బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో ఉంటూ బాధ్యతా యుతమైన పాత్రని నిర్వహిస్తున్న డాక్టరు వ్యాకరణం రామారావు చెప్పిన విషయం. వార్త లక్ష్యం వాస్తవాన్ని చెప్పడం. సమీక్ష కాదు. విమర్శ కాదు. విశ్లేషణ అంతకన్నా కాదు. లిచ్చయ్య వచ్చాడు. వార్త. లిచ్చయ్య తొందరగా వచ్చాడు, సమీక్ష. లిచ్చయ్య తొందరపడి వచ్చాడు. విమర్శ. లిచ్చయ్య ఎందుకు తొందరపడ్డాడు? విశ్లేషణ. వార్త చానల్ బాధ్యత. నిజానికి పౌరుడి హక్కు. చానల్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక డాక్యుమెంటరీ వార్త మీద సాధికారికమైన విశ్లేషణ. ఇందులో ‘ఎడిటర్’ పాత్ర ఎంతయినా ఉంది. ఎడిటర్‌నే ప్రత్యేకంగా పేర్కొ నడం, అది విశ్లేషకుడి మొదటి పని కనుక. ఇక్కడ ఎడిటర్ కేవలం సాంకేతిక నిపుణుడు కాదు. విశ్లేషకుడు కనుక. చెప్పే మాట కన్నా, చూపే దృశ్యానికి బలం ఎక్కువ. ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు గొదార్ద్ ఒక మాట అన్నాడు. సినీమా రీలు ఒక సెకనుకి 24 ఫ్రేములు కదులుతుంది. అది 24 ఫ్రేములు కాదట. సెకనుకి 24 సార్లు వాస్తవాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుందట. A film narrates truth 24 times per second. మరి టెలివిజన్‌లో దృశ్యం కదలాలంటే సెకనుకి 26 ఫ్రేములు కదులుతాయి డ్రాయింగ్ రూమ్‌లో. వాస్తవానికి - సినీమా కథకి కాదు, బలం ఎక్కువ. ప్రభావం ఎక్కువ. ఒక ఉదాహరణ. టీవీలో వీరయ్య రెండూ రెండూ కలిపితే నాలుగంటున్నాడు. అది కేవలం ప్రకటన. వీరయ్య అదే మాట అనడాన్ని మరోసారి చూపించారు. అది వాస్తవాన్ని నొక్కి చెప్పడం. మూడోసారి చూపించారు. మరచిపోకండి సుమా-హెచ్చరిక. నాలుగోసారి చూపిం చారు. అది కర పత్రం. అయిదోసారి చూపించారు. అది ఉద్యమం. ఆరో సారి చూపించారు. అది వెకిలితనం. మన దేశంలో చానళ్లు ఆయా సంస్థల జేబులు. వార్త ఏమిటని కాదు. ఏ చానల్ చెప్పింది అన్నదే ముఖ్యం. అవి ఆయా సంస్థల గొంతులు కనుక. అవి వార్తల్ని ప్రసారం చెయ్యవు. వార్తల పట్ల తమ అన్వయాన్ని ప్రసారం చేస్తాయి. తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాయి. ఉద్యమంగా ముందుకు సాగుతాయి. నేనీమధ్య ఇంగ్లండు, జర్మనీ వెళ్లాను. అక్కడెవరూ చానళ్లు ప్రసారం చెయ్యరు. ఒకే ఒక్క ఇంట్లో 24x7 చూశాను. అదేమిటి? ఫలానా చానల్ చాలా హడావుడి చేస్తుంది కదా! మా దేశంలో గొప్ప ప్రచారంలో ఉన్న చానల్ కదా? ఒకాయన నవ్వి, ‘‘అది హడావుడే. వాస్తవానికి వాగుడు ఆయుధం కాదు’’ అన్నారు. అది అన్యా యాన్ని ఎండగట్టడం కాదు. తామనుకున్న న్యాయాన్ని ఎత్తి చూపడం. ‘నిజం’ చెప్పడానికి గొంతు చించుకోనక్కరలేదు. అద్దం చూపిస్తే చాలు. ఆవేశం వాస్తవాన్ని వక్రీకరిస్తుంది. ప్రసార మాధ్యమాలకీ, ప్రజాభిప్రాయానికీ దగ్గర తోవ కావాలి. ఇంగ్లండ్ యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా లేదా అన్న విషయం మీద కొద్దికాలంలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించనుంది ప్రభుత్వం. అందులో పాల్గొన వలసిన ఆవశ్యకతని తప్ప మాధ్యమాలు మన ఎన్నికల లాగా ఊదరగొట్టేయడం లేదు ఎక్కడా. ఇక బ్రిటన్‌లో ప్రసార మాధ్యమం గురించి, వాటి నిష్పక్షపాత వైఖరి, నియతిని గురించి. బ్రిటన్‌లో బీబీసీ ప్రసార సంస్థకి ప్రతీ ఇల్లు సాలీనా 148 పౌండ్లు చెల్లించాలి- విధిగా. ఇది పౌర బాధ్యత. ఒక్క ముసలివారికి మినహా యింపు. ఈ విషయంలో పేదరికం కొలమానం కాదు. మరి టీవీ ఇంట్లో లేకపోతే? లేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ వ్యక్తిదే. ఏమిటి ఈ నిరంకుశత్వం? మాకు స్వేచ్ఛలేదా? బీబీసీకి మేమెందుకు చెల్లించాలి? అని మన దేశంలో వందలమంది కోర్టుకు వెళ్లేవారు. విషయమేమి టంటే బీబీసీ ప్రభుత్వ సంస్థ కాదు. స్వచ్ఛంద సంస్థ. వాస్త వాన్ని వాస్తవంగా చెప్తూ, అవసరమయితే ప్రభుత్వాన్నీ నిలదీయగల (ఆ పని బీబీసీ చేస్తుంది)ఒక స్వచ్ఛంద మాధ్య మాన్ని ప్రజలు నిలుపుకున్నారు- తమ ఖర్చుతో. ఒక బాధ్య తాయుతమైన ‘ప్రజావగాహన’ అనే ఉద్యమంలో ప్రతీ పౌరుడూ వాటాదారుడు- అన్నమాట. బీబీసీలో ఏమైనా లోపాలుంటే? బీబీసీ బాధ్యతల్ని విస్మరిస్తే? బీబీసీ పక్షపాత ధోరణిని అవలంబిస్తే? నిలదీసే కమిషన్ ఒకటుంది. ఇది గత 35 సంవత్సరాలుగా ఇంగ్లం డ్లో ఉంటూ బాధ్యతాయుతమైన పాత్రని నిర్వహిస్తున్న తెలుగు డాక్టరుగారు-వ్యాకరణం రామారావు గారు దాదాపు గర్వంగా చెప్పిన విషయం. మనదేశంలో ఉన్నన్ని చానళ్లు బహుశా మరే దేశంలోనూ లేవేమో! ఏ ఒక్క చానల్కీ సామాజిక బాధ్యత ఉండాలనే నియమం లేదు. నియంత్రించే బలమైన యంత్రాంగం లేదు. నిజానికి వాటి ఉనికికి కారణం ఆయా వర్గాల ప్రాతినిధ్యమే. అలాంటి మాధ్యమాలు ప్రజల్ని ఎలా మభ్యపెడతాయో, వాటి వల్ల ఎన్ని దుష్ఫలితాలు వస్తాయో - రోజూ మన దేశంలో జరిగే సంఘటనలే చెప్తున్నాయి. ఆయా సంఘటనల్ని నేను కావాలనే ఎత్తి చూపడం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ: నేను దినపత్రికలో పని చేసే రోజుల్లో ‘రాయ్‌టర్’ అనే ఒక సామ్రాజ్యవాద దేశపు వార్తా సంస్థ ఆనాటి కాంగో పోరాటాన్ని ‘తిరుగుబాటుదారుల చర్య’గా వర్ణించేది. మేము తప్పనిసరిగా జాతీయవాదుల పోరాటంగా రాసుకునేవాళ్లం. ఒక దేశపు పోరాటానికి ఒక మాధ్యమం ఇవ్వగల ‘రంగు’ అది. మరి కులం మాట? మతం మాట? హిందూత్వం మాట? వర్గ పోరాటం మాట? ఫలానా పార్టీ లక్ష్యాల మాట? మేము మా కళ్లతో చూసే అవినీతి మాట? ప్రతీ సంఘటనకీ ఆయా చానల్ వాటి వాటి అవసరాల్ని బట్టి పులిమే ‘రంగు’- ఇంద్రధనుస్సు లాగ మన కళ్ల ముందు పరుచుకుని - మన ఆలోచనా శక్తిని కబళించివేస్తుంది. సొంతింటి పుల్లకూర రుచి చూస్తున్నవాడిగా పొరు గింటి చక్రపొంగలి గురించి చెప్పాలనే ఈ ప్రయత్నం. - గొల్లపూడి మారుతీరావు -
సొంతింటికి ఇదే సమయం!
♦ నేడు, రేపు సాక్షి మెగా ప్రాపర్టీ షో ♦ మాదాపూర్‌లోని హోటల్ అవాసలో.. ♦ ఉదయం 10 గంటలకు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ‘పొందికగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అని గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ ప్రత్యక్షంగా చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట అందించేందుకు సాక్షి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హోటల్ అవాసలో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకుండే ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొంటాయి. కొన్ని సంస్థలు లక్కీ, బంపర్ డ్రాల పేర్లతో సందర్శకులకు ప్రత్యేక బహుమతులను అందించనున్నాయి కూడా. బంపర్ డ్రా కింద సిరి సంపద ఫామ్ ల్యాండ్స్ సంస్థ ప్రతి రోజూ ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. లక్కీ డ్రా కింద మ్యాక్ ప్రాజెక్ట్స్ బనియన్ ట్రీ రిట్రీట్ సంస్థ ప్రతి రోజూ 3 సర్ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తుంది. ♦ నగరం నలువైపులా విస్తరించి ఉన్న ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే స్థిరాస్తి ప్రదర్శనలో.. సుమారు 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్ల ద్వారా వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నాయి. అవి ప్రస్తుతం ఏయే దశల్లో ఉన్నాయి. ఏయే రాయితీలను అందిస్తున్నాయి వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. ♦ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. దీంతో నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇంతకు మించిన తరుణం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి సొంతింటి కలను నెరవేర్చుకోండి మరి. పాల్గొనే సంస్థలివే మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేటెడ్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్స్, ప్రావిడెంట్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కో-స్పాన్సర్స్: రాంకీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ బిల్డర్స్ సంస్థలు: ఎన్సీసీ అర్బన్, మంజీరా, మహేంద్రా లైఫ్‌స్పేస్, ప్రణీత్ గ్రూప్, జనప్రియ, సాకేత్ ఇంజనీర్స్, అక్యురేట్ డెవలపర్స్, నార్త్ స్టార్ హోమ్స్, ఆక్సాన్ హౌజింగ్ ఇన్ఫ్రా, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, ఏఆర్క్ టెర్మినస్ ఇన్ఫ్రా, గ్రీన్ హోమ్, బటర్‌ఫ్లై సిటీ, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
డిగ్రీ ఉంటేనే ఓటు
సొంత ఇల్లు ఉన్నా ఓకే... 1934 మొదటి కార్పొరేషన్ సభ్యులు 30 మందే.. 1937 అయ్యంగార్ కమిటీతో మార్పులు 1965 అమల్లోకి మున్సిపాలిటీ చట్టం ► ఇప్పుడు 18 ఏళ్లు నిండితే అందరికీ ఓటు హక్కు... మరి 1934లో... గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఆ భాగ్యం... కనీసం సొంత ఇల్లైనా ఉండాలి. ఓటు హక్కు కల్పించినా... ఎక్కువమంది సామాన్యులకు వేసే భాగ్యం దక్కలేదు. ► 1934 లో మొదటి కార్పొరేషన్లో సభ్యులు 30... ఓటర్లు 13 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. మరో 13 మందిని జాగీర్ల ప్రతి నిధులుగా, నలుగురిని ప్రభుత్వ తరఫున నామినేట్ చేసేవారు. మొదట్లో కొత్వాల్ చేతుల్లో నగరం పాలన సాగింది. తర్వాత బ్రిటిష్ ఇండియా విధానాల్ని అమలు చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, మున్సిపాలిటీ ముఖ్య బాధ్యతల్ని హెల్త్ ఆఫీసర్లు, మునిసిపల్ ఇంజినీర్లు పర్యవేక్షించేవారు. కమిషనర్ ఎక్స్అఫీషియో సెక్రటరీగా విధులు నిర్వహించేవారు. మౌలికసదుపాయాలు కావాలంటే ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది ఆస్తిపన్నుగా వసూలు చేస్తున్నారు. 1934కు ముందు కార్పొరేషన్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుండేవారు.వీరందరిని నిజాం ప్రభుత్వమే నామినేట్ చేసేది. ప్రస్తుతం నగర్ కార్పొరేషన్లో సభ్యుల సంఖ్య 150 మందికి చేరింది. 1937లో అయ్యంగార్ కమిటీ... ► దీవాన్ బహదూర్ అరవమడ్ సిఫార్సు మేరకు మెరుగైన మున్సిపాలిటీ పాలనకు విధానాలు సూచించాలని నిజాం 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ‘హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ (ఏ) ఆఫ్ 1941’ ను రూపొందించింది. ► నగరాన్ని రెండుగా విభజించి.... జనాభా 15 వేలకు పైగా ఉంటే సిటీ మున్సిపాలిటీ, 5 నుంచి 15 వేల వరకైతే టౌన్ మున్సిపాలిటీగా వ్యవహరించేవారు. పురపాలనంలో ప్రజాస్వామ్యం ► 1951లో కార్పొరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకొచ్చాయి. కౌన్సిల్ అధికారాల అమలు, పాలన కోసం ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. పూర్తి స్థాయి మునిసిపాలిటీగా మార్చారు. 1965లో ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పురపాలన విభాగాలన్ని ఇందులో చేర్చారు. మొత్తం 391 సెక్షన్లు రూపొందించారు. -
పదిహేనేళ్ల తర్వాత సొంతింటికి..
రామన్నపేట: తప్పిపోయిన ఓ యువకుడు పదిహేనేళ్లకు ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన గౌటి రాజయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు. మూడవ కుమారుడైన గౌటి రాముకు మాటలు సరిగారావు. మిర్యాలగూడలోని బంగారిగడ్డలో తన సోదరి బాలమణి, సోదరుడు వెంకటేశ్వర్లు వద్ద రాము(9), నాలుగో సోదరుడు నర్సింహులు ఆడుకుంటూ ఇతర కాలనీల్లోకి వెళ్లారు. అనంతరం ఇల్లు దొరక్క రాము తప్పిపోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామ శివారులో తిరుగుతున్న రామును అదేగ్రామానికి చెందిన సింగనబోయిన గణేష్ ఇంటికి తీసుకువెళ్లాడు. అదే గ్రామంలో రాము మేనత్త ఉంటుంది. ఆమె పిల్లవాడి పోలికలు, ఆనవాళ్లను కొద్దిరోజులుగా గమనించసాగింది. ఈ విషయాన్ని మిర్యాలగూడలోని రాము సోదరులకు తెలియజేసింది. స్థానిక ఎస్ఐ శీనయ్య, సర్పంచ్ పూస బాలనర్సింహ కుటుంబసభ్యుల వివరాలను పరిశీలించి రామును వాళ్లకు అప్పగించారు. పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన సోదరుడు తమ వద్దకు చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. -
సొంతింటికి దగ్గరిదారి!
పదేళ్ల క్రితం వరకూ షేరు ఆటోలు కూడా సరిగా తిరగని ఆ ప్రాంతంలో.. నేడు లగ్జరీ కార్లు చక్కర్లు కొడుతున్నాయి! గతంలో గజం స్థలం రూ.2 వేలు కూడా పలకని ఆ ప్రాంతంలో.. నేడు రూ.10 వేలు పెట్టినా దొరకని పరిస్థితి!! ఒకప్పుడు విద్యా, వైద్యం, వినోదం.. అన్నింటికీ సిటీలోకి వచ్చే అక్కడి ప్రజలు.. ఇప్పుడు అన్నింటినీ ఒకే చోట పొందేస్తున్నారు!!! .. ఇదివరకది గ్రామం.. కానీ, నేడది గ్రామంలోనే రూపుదిద్దుకున్న మహా నగరం! అభివృద్ధికి, అందుబాటు ధరలకీ కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతమే కిస్మత్పూర్. పేరులోనే కాదు.. ఊరులోనూ అదృష్టాన్ని దాచుకుందీ ప్రాంతం. ► అభివృద్ధికి.. అందుబాటు ధరలకూ కిస్మత్పూర్ సరైన ప్రాంతం ► లగ్జరీ ఫ్లాట్లు.. విల్లా ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ ► ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్‌లకు దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం ► స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన ప్రాంతమంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట, కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాంతం కిస్మత్పూర్. ఎందుకంటే ఈ ప్రాంతం సెక్రటేరియట్, లక్డికపూల్ వంటి సిటీ సెంటర్ ప్రాంతాలకు 15 కి.మీ. దూరంలో, ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయానికి 20 కి.మీ.ల దూరంలో ఉండటం. నేటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండటమేనని గిరిధారి కన్స్ట్రక్షన్స్ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం అటు మెట్రో రైలుకు, ఇటు ఔటర్ రింగ్ రోడ్డులకూ సులువుగా చేరుకునేంత దూరంలో ఉంది. షాద్‌నగర్, కొత్తూరులోని పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులూ కిస్మత్పూర్లోనే ఉంటున్నారు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణించే వీలు.. కూతవేటు దూరంలో ఉన్న ఓఆర్ఆర్ మీదుగా ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్ పార్క్, ఏరో స్పేస్ కంపెనీలకే కాదు.. 40 కి.మీ. దూరంలో పీఅండ్‌జీ, జాన్సన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు, ఫార్మా సిటీ, లాజిస్టిక్ పార్కులకూ సులువుగా చేరుకునే వీలుంది. రూ.30 లక్షల నుంచి ప్రారంభం.. కిస్మత్పూర్లో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటుగా విదేశీ సంస్థల ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రెస్టిజ్, జైన్, మంత్రి, పీబీఈఎల్, వసతి ఆనంది, శాంతాశ్రీరాం, ఆర్వీ నిర్మాణ్, కీర్తి, గిరిధారి, ఎస్ఎంఆర్ వంటి సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి 10 శాతం నిర్మాణాలుండగా.. 9 నెలల్లో పూర్తయ్యేవి 40 శాతం వరకున్నాయి. ధర విషయానికొస్తే చ.అ. ధర రూ.3-4 వేల వరకున్నాయి. రూ. 30-60 లక్షల మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. 300-400 గజాల స్థలాల్లో ఉండే విల్లాలు రూ. 2-3 కోట్ల మధ్య చెబుతున్నారు. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ. 25-40 వేల మధ్య వేతనాలుండే ప్రతి ఉద్యోగికి ఇది అనువైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులకైతే మరీను. అందరు ఐటీ ఉద్యోగులూ గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కిస్మత్పూర్ కావటంతో ఈ వైపు దృష్టి పెడుతున్నారు. కొత్తగా ప్రారంభమైన రేతిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు. 20 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులూ ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు. విద్యా, వైద్యం, వినోదాలు కూడా.. వాస్తు ప్రకారం ఏ నది అయితే దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుందో అక్కడ అభివృద్ధి, ఆయురారోగ్యాలూ ఉంటాయని పండితుల మాట. కిస్మత్‌పూర్‌లోని ఈసా నది అలా ప్రవహిస్తున్నదే మరి. ఇన్నర్, ఔటర్లను అనుసంధానం చేసేందుకు ఈసా నదిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు కూడా. మరో విషయమేంటంటే.. కిస్మత్పూర్, బండ్లగూడ గ్రామాలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ దత్తత తీసుకున్నారు. దీంతో ఇక్కడి రహదారులకు, మౌలిక వసతులకు మహర్దశ పట్టుకుంది. ఈ ప్రాంతంలోకి ఐటీ పార్క్‌ను తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజేంద్రనగర్‌లో ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటుగా. అప్పా జంక్షన్లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆసుపత్రులెన్నో ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఎకో పార్క్, సైన్స్ పార్క్, కిద్వాయి గార్డెన్లతో నిత్యం కిటకిటలాడుతుంది. ఓవైపు నిజాం నిర్మించిన హిమాయత్‌సాగర్, ఇంకోవైపు గోల్కొండ, కుతుబ్‌షాహీ టూం బ్స్.. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిటీకి కలుపుతున్న ఓఆర్ఆర్.. ఇలా అభివృద్ధికి, చరిత్రాత్మక కట్టడాలకు నెలవాలంగా నిలుస్తోంది కిస్మత్పూర్. 600 ఫ్లాట్లు.. 120 విల్లాలు.. కిస్మత్పూర్ అభివృద్ధి, ఇక్కడి గిరాకీని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో ఇక్కడి స్థిరాస్తి ధరలు రెండితలు పెరిగే అవకాశముంది. అందుకే సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కాదు కాస్త ముందు చూపున్న ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్నారైలూ కిస్మత్పూర్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని గిరిధారి సంస్థ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. 4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 43 విల్లాలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విల్లా ఓనిక్స్ క్లబ్ హౌజ్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో ఈస్టా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో 90 ఫ్లాట్లొచ్చాయి. త్వరలో ఈ ప్రాంతంలో 6 ఎకరాల్లో మూడు ప్రాజెక్ట్‌లు కలిపి మొత్తం 600 ఫ్లాట్లు, 12 ఎకరాల్లో దాదాపు 120 విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మించనున్నాం. -
సొంతింటి కోసం దొంగతనం బాట
సాక్షి, హైదరాబాద్: అతడు ఓ సొంతిల్లు కట్టుకోవాలనుకున్నాడు.. ఆ కల ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకున్నాడు.. అందుకోసం పశువులను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు.. ఇంతకీ ఎవరా దొంగ.. ఏంటా కథ..! ఓ లుక్కేద్దాం.. హరియాణాకు చెందిన నవాబ్.. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. బీఫ్ అమ్ముతూ.. జీవనం సాగిస్తున్నాడు. సొంతిల్లు కలను నెరవేర్చుకునేందుకు దొంగతనాల బాట పట్టాడు. అయితే అందరు దొంగల్లా డబ్బు, నగలు దొంగిలించేవాడు కాదు. కేవలం పశువులను దొంగిలించేవాడు. ఇందుకోసం మూడు గ్యాంగ్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారి సాయంతో దొంగిలించిన ఆవులు, ఎద్దులు, దూడలు, బర్రెలను కబేళాలకు, కంపెనీలకు విక్రయించేవాడు. అలా అలా కొన్నాళ్లకు ఇల్లు కొనేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకున్నాడు. మధ్యవర్తికి రూ.5 లక్షలు కూడా చెల్లించాడు. పశువులను తరలించేందుకు వీలుగా ఓ కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు తన గ్యాంగ్ సభ్యులకు రూ.7.45 లక్షలు ఇచ్చాడు. అయితే నవాబ్ సొంతింటి కల నెరవేరకుండానే తన గ్యాంగ్‌తో పాటు పోలీసులకు చిక్కాడు. విచారణలో వెల్లడైన నిజాలు.. విచారణలో భాగంగా తాను చేసిన దొంగతనాల వివరాలు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. దీంతో నవాబ్, తన గ్యాంగ్ సభ్యులపై మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీరికి కింది కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు దొంగతనాన్ని అలవాటుగా చేసుకున్నారని, దీంతో వారికి బెయిల్ ఇస్తే తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో పశువులను దొంగిలించి పేద రైతులను జీవనాధారం లేకుండా చేశారని పేర్కొన్నారు. దొంగిలించిన పశువులను కబేళాలకు విక్రయించడమే కాకుండా, ఆ మాంసాన్ని తిరిగి తన దుకాణంలోనే విక్రయించే వాడని కోర్టుకు నివేదించారు. దాదాపు 187 ఆవులు, ఎద్దులు, దూడలు, గేదెలను దొంగిలించి అమ్మేశారని పేర్కొన్నారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నిందితుల పిటిషన్లు కొట్టేశారు. -
సొంతింటి కోసం ఆవులను టార్గెట్ చేశాడు!
సాక్షి, హైదరాబాద్: అతని పేరు నవాబ్. స్వస్థలం హరియాణ. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి బీఫ్ అమ్మడం ప్రారంభించాడు. అతనికి సొంతిల్లు లేదు. అందుకే ఎలాగైనా సరే ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. మరీ ఇల్లు కొనాలంటే మాటలా.. లక్షల డబ్బు కావాలి. అందుకు సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అమాయకులైన రైతుల ఇళ్లను దోచి తన ఇంటికి ఇటుకలు పేర్చేందుకు పథకం వేశాడు. తన నాయకత్వంలో మరికొందరిని కలుపుకొని మూడు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగాడు. మిగతా దొంగల్లా నగలు, డబ్బు దోచుకోవడం కాకుండా పశుగణంపై మాత్రమే దృష్టి పెట్టాడు. అలా దొంగలించిన ఆవులు, ఎద్దులు, దూడలు, బర్రెలను కబేళాలకు, ఎగుమతుల కంపెనీలకు విక్రయించేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో దాదాపు సొంతిల్లు కొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై మధ్యవర్తికి రూ. 5 లక్షలు కూడా ఇచ్చాడు. దొంగతనం చేసిన పశుగణాన్ని తరలించేందుకు వీలుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు తన గ్యాంగ్ సభ్యులకు రూ.7.45 లక్షలు ఇచ్చాడు. అయితే, చివరిక్షణంలో నవాబ్ పథకం తలకిందులైంది. ఇంకా డబ్బు సంపాదించే వేటలో మరిన్ని పశువులను దొంగిలిస్తూ అతను పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో నవాబ్ గ్యాంగ్ గతంలో చేసిన దొంగతనాల చిట్టా విప్పడంతో మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల పోలీసులు కూడా వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరికి కింది కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీ రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు నేరాలకు పాల్పడటాన్ని అలవాటుగా చేసుకున్నారని, అందువల్ల వారికి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. నవాబ్, అతని గ్యాంగ్ సభ్యులపై వివిధ పోలీస్స్టేషన్లలో 17కు పైగా కేసులున్నాయని తెలిపారు. గ్రామాల్లోకి వెళ్లి పేద రైతులను లక్ష్యంగా చేసుకుని పశువులకు రక్షణ లేని సమయంలో, మేతకు విడిచిపెట్టిన సమయంలో దొంగతనాలకు పాల్పడే వారని ఆయన వివరించారు. గ్రామాల్లో రైతులకు పశు గణమే జీవనాధరమని, దొంగతనాల ద్వారా నవాబ్, అతని ముఠా సభ్యులు రైతులకు జీవనాధారం లేకుండా చేశారని తెలిపారు. దొంగిలించిన పశువులను వేల రూపాయలకు కబేళాలకు విక్రయించడమే కాకుండా, ఆ మాంసాన్ని తిరిగి తన దుకాణంలోనే విక్రయించే వాడని ఆయన కోర్టుకు నివేదించారు. మొత్తం 187 ఆవులు, ఎద్దులు, దూడలు, గేదెలను దొంగిలించి అతడు అమ్మేశాడని తెలిపారు. ఏపీపీ రామిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
66 వేలకే సొంతిల్లు!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు. సామాన్య మధ్యత రగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సాంకేతిక అభివృద్ధి చాలా రకాల సేవలను తక్కువ ధరకు, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నా, ఇంటి నిర్మాణంలో సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది కానీ ఖర్చు విషయంలో మాత్రం తగ్గుదల లేదింత వరకూ. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము.. ఇలా ప్రతీదీ ఖరీదే. ఇలాంటి పరిస్థితుల మధ్య వియత్నాం పరిశోధకులు సరికొత్త గృహ నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ‘ఎస్ హౌస్’ నిర్మాణానికి సంబంధించి తాజాగా నమూనాను ప్రదర్శించారు. కేవలం వెయ్యి డాలర్ల (భారత ద్ర వ్యమానంలో దాదాపు రూ.66 వేలు) ఖర్చుతో పూర్తి నిర్మాణం పూర్తయ్యే ఈ ఇంటి విశే షాలు ఆసక్తికరంగా ఉన్నాయి. - సాక్షి సెంట్రల్‌డెస్క్ ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం.. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే! ఇల్లేమిటి ఉత్పత్తి చేయడం ఏమిటి? అంటే... ఈ ఇంటి విషయంలో అంతే. కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌గటర్... వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. మూడు గంటల్లో నిర్మాణం.. 30 ఏళ్ల జీవితం... పై సరంజామాతో ‘ఎస్ హౌస్’ను అమర్చడానికి మూడు గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ ఇంటిలో దర్జాగా నివ సించవచ్చని హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కుచెదరదని అంటున్నారు. 340 చదరపు అడుగుల ఇల్లు ఫార్ములా ప్రకారం వెయ్యి డాలర్ల వ్యయం తో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు, ఒకటికి మించిన స్థాయిలో ఇళ్లను జాయింట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సిమెంట్, ఇసుక అవసరం లేదు ఈ ఫార్ములాలో పేర్కొన్న సరంజామా తప్ప నిర్మాణంలో అదనంగా ఎలాంటి అవసరాలూ ఉండ వు. అక్రమ రవాణా పాలవుతూ ధర విషయంలో కొండెక్కిన ఇసుక కానీ, సిమెంట్ కానీ, ప్రత్యేకంగా ఇనుము కానీ కొనాల్సిన అవసరం ఉండదు. తుప్పుపట్టదు, చెదలు దరిచేరవు ఈ నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌కు, స్టీల్‌కు చెద, తుప్పు భయాలుండవని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా అవి చెక్కుచెదరవని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొనగలదు.. రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా... టైపూన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతానికి వియత్నాంలో.. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘ఎస్ హౌస్’ ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రొటోటైప్ దశ వరకూ వచ్చింది. అతి త్వరలోనే వియత్నాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని దేశాల్లోని పేదలందరికీ ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి వనరులను సమకూర్చే లక్ష్యం ఉంది రూపకర్తలకు. మరి వారి లక్ష్యం సిద్ధించి... మనదేశంలోని గుడిసెలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశిద్దాం. -
ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి!
స్థిరాస్తి.. దొంగలు ఎత్తుకుపోతారన్న దిగులక్కర్లేదు! హఠాత్తుగా విలువ తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదు!! ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు. ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు.. మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి. కాబట్టి స్థిరాస్తులు కొనేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ సొంతిల్లా? ఇప్పటికే సొంతిల్లు ఉండి.. రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టే వారు అద్దెల ద్వారా ఆదాయం, లేదంటే మంచి ధరొస్తే అధిక రేటుకు అమ్ముకోవడానికి ప్రాధాన్యమిస్తారు. వీటి విలువ వాణిజ్య భవనాల కంటే తక్కువగా ఉండటం, గృహ రుణాలపై పన్ను మినహాయింపు వంటి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఏం చేయాలి? * మార్కెట్లో బిల్డర్‌కు ఎలాంటి పేరుందో ఆరా తీయాలి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఉంది? అన్న విషయాలను బట్టే మీరు కొనబోయే ఇంటి విలువ ఎంత పెరుగుతుందనేది ఆధారపడుతుంది. వీటితో పాటు భవన ప్రణాళిక, అనుమతులు, యాజమాన్య హక్కులనూ పరిశీలించాలి. * ఫ్లాట్/ఇల్లు నివాసానికి సిద్ధంగా ఉన్నవి, లేదంటే నిర్మాణం పూర్తి కావచ్చినవి కొనడం వల్ల రాబడిని త్వరగా అందుకోవచ్చు. ఇలాంటి ఇళ్లను కొంటే.. వెంటనే అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు. * అభివృద్ధికి ఆస్కారం గల ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇంటిని కొంటే రెండిందాల లాభం. ప్రాజెక్టు పూర్తి కాగానే నెలనెలా అద్దె పొందొచ్చు. ఇంటి విలువ వేగంగా పెరుగుతుంది. * దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొంటే నెలవారీ వాయిదాల భారం లేకుండా చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? పేపర్ వర్క్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. సాధ్యమైనంత వరకు మీరు కొనబోయే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి. స్థలం కొంటున్నారా? భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో అందరూ స్థలాలు కొనలేని పరిస్థితి. ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు, వారాంతపు ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం చేయాలి? * మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంలోనే స్థలాలు కొనుగోలు చేయండి. * మీరు కొనబోయే స్థలాన్ని ఎవరైనా లీజుకు తీసుకున్నారా? ఖాళీగా ఉందా? అన్నది చూడాలి. ఆ స్థలం వ్యవసాయ భూమా, వ్యవసాయేతర భూమా? ఆ భూమిపై చెల్లించాల్సిన రుసుములేమైనా ఉన్నాయా వంటివి చూడాలి. ఒకవేళ మీరు రైతుగా భూమిని కొనుగోలు చేస్తుంటే.. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారని నిర్ధారించే పత్రాల్ని చూపించాల్సి ఉంటుంది. ఏం చేయకూడదు? * తక్కువ ధరకు వస్తుందని తొందరపడొద్దు. స్థలానికి రవాణా మార్గం, అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. వాణిజ్య భవనాల్లో.. అద్దెల రూపంలో మంచి ఆదాయం ఆశించే వారికి నివాస భవనాలతో పోలిస్తే వాణిజ్య భవనాలే మేలు. ఏం చేయాలి? * నగరాల్లోని ప్రధాన ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి. * మీరు కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసే ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యాలయాలు ఏర్పాటవుతాయో తెలుసుకోండి. దీన్ని బట్టి మీ స్థలానికి విలువెంత పెరుగుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది. * కొనుగోలు చేయడానికి ముందే లీజ్‌లో ఉన్న షాపులు/కమర్షియల్ స్పేస్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా స్థిరాదాయం లభిస్తుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడి వల్ల క్రమంగా ఆదాయం రావడంతో పాటు ఆస్తి విలువ పెరుగుతుంది. * మరొకరితో కలసి పెట్టుబడి పెట్టాలనుకుంటే... భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోండి. దీని వల్ల ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు, మీ పెట్టుబడికి రక్షణగా ఉంటుంది. ఏం చేయకూడదు? * అభివృద్ధి చెందని ప్రాంతంలో కమర్షియల్ స్పేస్ కొనకపోవడమే ఉత్తమం. * చౌకగా వస్తుందని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు. నిర్మాణ నాణ్యత, కమర్షియల్ స్పేస్ లేఅవుట్‌ను పరిశీలించడం ఎంతో ముఖ్యం. * సొమ్ము చేతిలో లేకపోయినా కొనడం తెలివైన మదుపరుల లక్షణం కాదు. కమర్షియల్ స్పేస్‌పై పెట్టే పెట్టుబడిపై పన్నురాయితీలు ఉండవని గుర్తుంచుకోండి. రుణాలపై వడ్డీ రేట్లు కూడా అధికమేనన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వీటిపై వడ్డీ సుమారుగా 15-16 శాతం వరకు ఉండొచ్చు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
'ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంతిల్లు'
రాజేంద్రనగర్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామని టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, ఎంఏ. హమీద్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్‌లో నిర్మించిన హైద్రాబాద్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (రంగారెడ్డిజిల్లా విభాగం) కార్యాలయాన్ని సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సొంత ఇల్లు అనేది ఉద్యోగి హక్కుగా పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. -
పండుగ వేళ.. పయనమెటు?
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల! కానీ, గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా.. లేక నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా అనేది సమస్య!! బయట చూస్తేనేమో పండుగ వాతావరణం నెలకొంది. కానీ, మూడునాలుగు నెలలుగా మార్కెట్ పరిస్థితులను చూస్తేనేమో వెనుకడుగు వేయాలనిపిస్తోంది. మీరు కూడా ఇదేవిధంగా ఆలోచిస్తున్నారా? సొంతిల్లు కొనాలన్న కోరిక గట్టిగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా? పండుగ సమయంలో కొనుగోలుదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది. వారి సూచనల సమాహారమే ఈ కథనం.. సాక్షి, హైదరాబాద్ : సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించట్లేదు. స్థానిక రాజకీయాంశం, నిర్మాణ సామగ్రి కష్టాలు, కార్మికులు కొరత.. కారణాలేవైనా స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. ఫలితంగా దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతోంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడేళ్ల నుంచి ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. ►గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోశారంటే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే సొమ్మును చెల్లించాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంబించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్ని చేయలేకుండా మిగిలిపోతున్నారు. రెండేళ్లుగా పండుగ వేళల్లో ఇల్లు కొన్నవారు నేటికీ గృహప్రవేశం చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. స్థిర నివాసానికైతే.. స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. పెట్టుబడి కోసమైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. ►వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
అన్నీ ఒకేసారి కుదరవు..!
ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కొక్కటీ సాధించొచ్చు ♦ మొదటి నుంచీ ‘సిప్’ చేయటమే ఉత్తమం ♦ ఇదీ... రవికుమార్‌కు అనిల్రెగో సూచన మీరు ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యాలు బాగున్నాయి. పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకుంటూ మీ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. మీరిచ్చిన సమాచారం ఆధారంగా, మీ లక్ష్యాల్లో ఎప్పటికి ఎంత మొత్తం అవసరమవుతుందో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుత ధరలను బట్టి, మీరు మధ్యస్థాయి రిస్క్ చేయగలరన్న నమ్మకంతో లెక్కించడం జరిగింది. ఇలా చేద్దాం... ప్రస్తుతం మీ ఆదాయాన్ని బట్టి లక్ష్యాలన్నింటికీ ఒకేసారి కేటాయించడం కుదిరే పని కాదు. కాబట్టి మీ ప్రాధాన్యాలను బట్టి లక్ష్యాలను నిర్దేశించుకొని దాని ప్రకారం ఒక్కొక్కటీ నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యాలను పరిశీలిస్తే కారు కొనుక్కోవడం అనేది స్వల్పకాలిక లక్ష్యంగాను, సొంతిల్లు సమకూర్చుకోవడం అనేది మధ్యకాలిక లక్ష్యంగా, పదవీ విరమణ అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా విభజించొచ్చు. ఈ స్వల్పకాలిక లక్ష్యం చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. దీనికంటే ముందు ఆఫీసులో కారు లోన్ ఆప్షన్ ఉందేమో తెలుసుకోండి. దీనివల్ల మీరు ఈఎంఐలో కారులోన్ తీర్చే అవకాశం ఉండటంతో పాటు, ఇది పెర్క్ కిందకు వస్తుంది కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇక మధ్యస్థాయి, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి డెట్, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఇంటిని రుణం మీద కొనుగోలు చేయండి. ఇంటి విలువ రూ.40 లక్షలు అనుకుంటే ఇందులో 20 శాతం డౌన్ పేమెంట్ అంటే రూ.8 లక్షలు సమకూర్చుకోవాలి. దీనికి ఇప్పుడున్న డబ్బుకు అదనంగా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మిగిలిన మొత్తం రూ. 32 లక్షలకు రుణం తీసుకుంటే 20 ఏళ్లపాటు ఈఎంఐ కింద ప్రతి నెలా రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మీ పొదుపుపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం మీరు ప్రతి నెలా రూ. 20,000 పొదుపు చేయగలమన్నారు. ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర సేవింగ్స్ ఖాతాలో ఉన్న రెండు లక్షల్లో రూ.60,000 అత్యవసర నిధి కింద ఉంచి, మిగిలిన మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లోకి మార్చుకోండి. ఈ విధానం అమలు చేయడం ద్వారా త్వరితగతిన మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు. ఇవన్నీ ప్రస్తుత ధరలను బట్టి లెక్కించడం జరిగింది. ప్రస్తుత ఖర్చుల్ని బట్టి నెలకు రూ. 10,000 చొప్పున పెన్షన్ లెక్కించాను. కానీ ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే ఇంకా పెద్ద మొత్తం అవసరమవుతుంది. ఇక ఇంటి నిర్మాణానికి వస్తే ఇంటి విలువలో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నా పేరు రవి కుమార్(30). నెల జీతం రూ.30,000. ఇంకా పెళ్లి కాలేదు కనక కుటుంబ బాధ్యతలేవీ లేవు. ప్రతి నెలా ఖర్చులు రూ.10,000 పోగా మిగిలిన మొత్తం రూ. 20,000 దాచుకోగలను. కానీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి అవగాహనా లేకపోవడంతో ఈ మొత్తం సేవింగ్స్ ఖాతాలోనే ఉంటున్నాయి. ఇలా నా సేవింగ్స్ ఖాతాలో ఇపుడు రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికొస్తే 35 ఏళ్లు వచ్చే నాటికి సొంతిల్లు సమకూర్చుకోవడం... రెండేళ్లలో రూ.10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడంతో పాటు రిటైర్మెంట్కు తగిన నిధిని సమకూర్చుకోవడం. దీనికి ఏం చేయాలి? ఇవి సాధ్యమవుతాయా? - రవి, హైదరాబాద్. -
‘పై అంతస్తు’ వేసేద్దాం!
సాక్షి, హైదరాబాద్ : సొంతిల్లు ఉండగానే సరిపోదు. పిల్లల చదువుల కోసమో లేక అవసరాల కోసమో కారణమేదైనా.. ఇంటిపై అదనపు ఫ్లోర్లు అవసరం ఉంటుంది. డాబాపై మరో ఫ్లోర్ వేసుకుంటే కొంత సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అలా ఫ్లోర్ వేయాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఆ గది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు. అవేంటో చూద్దాంమరి. ముందుగా డాబా ఏ తీరులో నిర్మించారో తెలుసుకోవాలి. దీన్ని బట్టే పై అంతస్తు ఎలా వేయాలన్నది ఆధారపడి ఉంటుంది. భవన నిర్మాణాలు రెండు రకాలు. 1. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేది. దీన్నే ‘లోడ్ బేరింగ్ వాల్ స్ట్రక్చర్’ అంటారు. లోతుగా పునాదుల కోసం గుంతలు తవ్వకుండా రాళ్లతో పునాదులు నిర్మించి ఆపై గోడలు, వాటిపై శ్లాబు నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో భవనం బరువంతా గోడలు, పునాదుల పైనే పడుతుంది. 2. గోతులు తీసి పుటింగులు, పిల్లర్లు వేసి, బీములు నిర్మించి దానిపైన శ్లాబు వేసేది ‘ఫ్రేం స్ట్రక్చర్’. ఇందులో భవనం బరువంతా బీములు, పిల్లర్లు మోస్తాయి. గోడలపై ఎలాంటి భారం పడదు. ప్రస్తుతం ఈ తరహా నిర్మాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కాస్త ఎక్కువగానే ఖర్చవుతున్నప్పటికీ ఇల్లు దృఢంగా ఉంటుంది. లోడ్ బేరింగ్ స్ట్రక్చర్‌పై మేడ.. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులు వేసుకోవాలంటే.. గ్రౌండ్ ఫ్లోర్ గోడలు 14 అంగుళాల మందంతో నిర్మించాలి. ఫస్ట్ ఫ్లోర్ గోడలు మాత్రం 9 అంగుళాల మందంతో నిర్మిస్తే చాలు. అతి జాగ్రత్తకు పోయి ఇక్కడా 14 అంగుళాల గోడలు నిర్మిస్తే వృథా ఖర్చు. పైగా కింది గోడలపై భారం ఎక్కువవుతుంది. పైన గదులు విశాలంగా ఉండాలని చెప్పి 14 అంగుళాల గోడపై చివరి నుంచి 9 అంగుళాల గోడను నిర్మిస్తుంటారు. ఇది తప్పు. 14 అంగుళాల గోడకు కచ్చితంగా మధ్యలో 9 అంగుళాల గోడను నిర్మించాలి. లేకపోతే బరువు సరిగ్గా సర్దుబాటు కాక గోడలు దెబ్బతింటాయి. కిటికీలు, తలుపులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగానే పైనా నిర్మించాలి. ఇలా చేస్తే కింద అంతస్తులోని తలుపులు, కిటికీలపై అదనపు భారం పడకుండా ఇల్లు పటిష్టంగా ఉంటుంది. బాల్కనీ అంచుల్లో గోడలు కట్టాలన్నా శ్లాబు కింద బీములు తప్పనిసరి. పెద్ద పోర్టికో కావాలన్నా శ్లాబుల కింద బీములు ఉండాల్సిందే. వీలైనంత వరకు ఇలాంటి పద్ధతిలో మూడో అంతస్తు నిర్మించకపోవడమే మంచిది. 30 ఏళ్లు దాటిన పాత ఇళ్లపైన మరో అంతస్తు నిర్మించడం సరైన పద్ధతి కాదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పూజ గదిపై మరుగుదొడ్డి రాకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండా కింద ఉన్న పూజగదిపై నడిచే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడమే మంచిది. ఫ్రేమ్ స్ట్రక్చర్డ్ అయితే.. ఇందులో గోడలన్నవి గదుల విభజన కోసమే. ఇవి ఎలాంటి బరువునూ మోయవు. కాబట్టి గోడలు ఎంత మందంతో నిర్మించినా పటిష్టతకు ఢోకా ఉండదు. పైన పిల్లర్లు వేసుకోవడానికి వదిలిన రాడ్లు, ఎండ, వాన ప్రభావానికి లోను కాకుండా డమ్మీ (దిమ్మ) కట్టడం తప్పనిసరి. ఇలా చేయకపోతే రాడ్లు తుప్పుపటి ్టపోతాయి. పిల్లర్లు, బీములతో నిర్మించినప్పుడు ముందుగా శ్లాబు పని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే గోడల నిర్మాణం మొదలుపెట్టాలి. పై ఫ్లోర్లో కింద గోడకు దూరంగా పైన గోడ నిర్మిస్తే తలుపులు, కిటికీలపై నాలుగు అంగుళాల మందంలో పిల్లర్‌లో కలిసే విధంగా లింటెల్ వేసుకోవాలి. ఇలా చేస్తే వీటి పైభాగంలో నిర్మించే గోడ బరువు దర్వాజపై పడకుండా పిల్లర్లకు మళ్లుతుంది. -
సొంతిల్లెక్కడ కొనాలి?
సాక్షి, హైదరాబాద్ : సొంతిల్లు అనేది సామాన్యుల వరకైతే కలే. ఆ కలను నిజం చేసుకోవాలంటే ముందు సవాలక్ష సందేహాలు. గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటి లో తీసుకోవాలా అనే విషయాల్లో తర్జనభర్జన. ఇల్లు కొనాలనే విషయంలో నిపుణుల సూచనలివిగో.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం. మరోసారి నిర్మాణ సామాగ్రి కష్టాలు. ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. ఫలితంగా దాని ప్రభావం నిర్మాణ పనులపై పడుతోంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడేళ్ల నుంచి ఇలాంటి ధోరణి కొందరు బిల్డర్లలో ఎక్కువగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోశారంటే సొంతింట్లోకి అడుగు పెట్టేదెన్నడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాతే సొమ్మును చెల్లించాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంబించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్ని చేయలేకుండా మిగిలిపోతున్నారు. గత రెండేళ్లుగా పం డగ వేళల్లో ఇల్లు కొన్నవారు నేటికీ గృహప్రవేశం చేయకపోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. స్థిర నివాసమా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. పెట్టుబడి కోణమా: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే నిర్ణయానికి రావాలి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
సొంతిల్లు కలేనా!
కష్టతరంగా మారిన పేదోడి గూడు కొత్త సర్కారు వచ్చింది.. రెండు గదుల ఇల్లు కాదు రెండు బెడ్రూంల ఇల్లు ఇస్తానన్నాడు. ఇక నాకు ఇంటి సమస్య తీరినట్టేనని భావించారు బడుగులు.. కానీ, ఇది కేవలం మాటలకే తప్ప చేతలకు కాదని తేలిపోయింది. కనీసం బడ్జెట్లో వీటి గురించి ప్రస్తావించకపోవడంతో సొంతిల్లు చెట్టెక్కినట్టయింది. సాక్షి, మహబూబ్‌నగర్: పేదోడికి కాసింత గూడు కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో గృహ నిర్మాణ రంగానికి అతి తక్కువ కేటాయింపులు చేయడంతో పేదల సొంతింటి కల... కలగానే మిగిలిపోనుంది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఈ ఏడాది దాదాపుగా లేనట్లే అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇక గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి అగాథంలోకి నెట్టినట్టయింది. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ పేరుతో చేస్తున్న కాలయాపన కారణంగా సామాన్యులు నలిగిపోతున్నారు. పైగా ఇంకా ఇప్పటికీ చెల్లింపులు పూర్తికాని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లుల పరిస్థితిపై అయోమయం నెలకొంది. వీటికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 2,78,447 ప్రశ్నార్థకంగా మారాయి. అందులో 1,91,081 ఇళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా ఇళ్ల మంజూరు జరిగి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్ల భవిష్యత్తు కూడా అయోమయంగానే ఉంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ను కూడా ప్రభుత్వం పూర్తిగా నిలిపేయడంతో దాదాపు 87,366 ఇళ్లకు బిల్లులు రాకుండా మధ్యలోనే నిలిచిపోయాయి. వీటిపై కూడా ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌కు ఆదేశించింది. ఇది పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కొందరు అప్పులు చేస్తుంటే... మరికొందరు మధ్యలోనే నిలిపేశారు. సగం ఇళ్లు అంతేసంగతి..! పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నడుం బిగించారు. శ్యాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థికసాయం అందజేయడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే జిల్లాకు మొత్తంగా 5,80,725 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,89,644 ఇళ్లు ఆన్లైన్లో నమోదవగా, 3,02,278 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 87,366 ఇళ్లు వివిధ దశలలో పనులు నిలిచిపోయాయి. అందులో బేసిమెంట్ స్థాయిలో 55,146 (బీఎల్) ఇళ్లు నిలిచిపోయాయి. దర్వాజ స్థాయి (ఎల్ఎల్)లో 7,172 ఉన్నాయి. చెత్తు స్థాయిలో (ఆర్ఎల్) 25,048 ఇళ్లు అర్థంతరంగా నిలిచిపోయాయి. ఇంకా మొదలుపెట్టని 1,91,081 ఇళ్లను రద్దుచేశారు. దీంతో జిల్లాకు మంజూరైన ఇళ్లలో 2,78,447 అంటే దాదాపు 55శాతం ఇళ్లను తిరిగి ప్రభుత్వం లాగేసుకున్నట్లయింది. విచారణ పూర్తయ్యేదెన్నడు...? టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. 3లక్షల ఖర్చుతో నిర్మిస్తామని చెబుతోంది. అయితే అది కూడా సీబీసీఐడీ విచారణ పూర్తయిన తర్వాతనే అని సీఎం స్పష్టం చేశారు. కానీ జిల్లాలో సీఐడీ విచారణ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతంఎంపిక చేసిన అలంపూర్, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో విచారణ సాగింది. ఇప్పటివరకు కేవలం 1,664 ఇళ్లకు సంబంధించి మాత్రమే విచారణ జరిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి విచారణ జరగడానికి ఎంత సమయమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇళ్లకు అనుమతులు, బిల్లుల చెల్లింపు తంతులోని అవకతవకలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకున్న తర్వాతనే కొత్త లబ్ధిదారుల ప్రక్రియ అంటే కనీసం ఏడాదికి పైగా పట్టే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సొంతింటి కల.. తీర్చుకోండిలా
సొంతిల్లు ఉంటే నీడతో పాటు .. ఒక భరోసా కూడా వస్తుంది. హోదాకు ఒక చిహ్నంగా నిలుస్తుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం కావడంతో దీన్ని చాలామంది ఖరీదైన కలగా భావిస్తుంటారు. కాని చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను అనుసరిస్తే సులభంగా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు తెలుసుకోవాల్సినవిషయాలపై ఈ వారం ప్రాఫిట్ కథనం. ప్రస్తుతం అనేకానేక గృహ నిర్మాణ ప్రాజెక్టులతో దేశీ హౌసింగ్ మార్కెట్ కళకళ్లాడుతోంది. వివిధ ఆదాయ వర్గాల వారి కోసం వివిధ సదుపాయాలు గల ఇళ్లు రూపొందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల దృష్టికోణం నుంచి చూస్తే, ఇల్లు కొనుక్కునేందుకు ఇది సరైన తరుణం. సాధారణంగా మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటున్నవారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇంటిని ఎంపిక చేసుకోవడం నుంచి కొనుక్కునే దాకా ముందుకు వెడుతున్న కొద్దీ గందరగోళం పెరుగుతున్నట్లు ఉంటుంది. కొన్ని సార్లు వృథా ప్రయాసగానూ, కష్టసాధ్యంగాను అనిపిస్తుంటుంది. అదే రెండోసారి కొనుక్కుంటున్న వారికయితే అప్పటికే ఇంటి కొనుగోలు విషయంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి.. ఈ గందరగోళం కాస్త తక్కువగా ఉంటుంది. కొనుక్కుంటున్నది మొదటిసారైనా లేదా రెండోసారైనా .. ఒక ప్రణాళిక వేసుకోవడం, ముందుచూపుతోనూ .. నిర్ణయాత్మకంగానూ వ్యవహరించగలగడం చాలా కీలకమైన విషయాలు. ఎందుకంటే.. ఇల్లనేది దీర్ఘకాలికమైన ఆస్తి. అదే సమయంలో ఆ కలను సాకారం చేసుకునేందుకు తీసుకునే గృహ రుణం అనేది దీర్ఘకాలికమైన అప్పు కూడా. అందుకే డీల్‌ని కుదుర్చుకునే ముందు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మీతో పాటు కుటుంబసభ్యుల అవసరాలను కూడా గుర్తించాలి ముందుగా మీకేం కావాలి, మీ కుటుంబ సభ్యుల అవసరాలేమిటి అన్నది గుర్తించాలి. మీరు ఏ వయస్సులో ఇల్లు కొనుక్కునే ప్రయత్నాన్ని ప్రారంభించారన్న దాన్ని బట్టి.. మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారన్న విషయంపై అవగాహన ఉండాలి. ఎన్ని గదులు ఉండాలి, ఏ ప్రాంతంలో తీసుకోవాలి, ఎలాటి సదుపాయాలు ఉండాలి అనుకుంటున్నారో.. ఆలోచించుకోవాలి. ఇలా ప్రాధాన్యతలను రాసుకుంటే షార్ట్‌లిస్ట్ చేసుకోవడం సులభం అవుతుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి విష్ లిస్ట్‌తో పాటు ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటివి లెక్క వేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇల్లు కొనుక్కునేందుకు ఎంత పక్కన పెట్టగలరన్న దానిపై అవగాహన వస్తుంది. ఇంటి కల సాకారం కోసం అవసరమైతే భారీ ఖర్చులు, విలాసవంతమైన టూర్లు వగైరాలు తగ్గించుకోవాల్సి రావొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకోవడానికి ముందే దీర్ఘకాలికమైన ఇతరత్రా రుణాలేమైనా ఉంటే చెల్లించేసే ప్రయత్నం చేయాలి. మీ ఆదాయ, వ్యయాల విధానాన్ని బట్టి ఇల్లు తీసుకునేందుకు గరిష్టంగా మీకు ఎంత రుణం లభిస్తుందో లెక్కవేసుకోవడానికి కావాలంటే బ్యాంకులు సహకారం అందిస్తాయి. డౌన్‌పేమెంటు కోసం దాచిపెట్టండి ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్‌పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు యుక్తవయస్సు నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. దీనివల్ల కలల సౌధాన్ని దక్కించుకోవడం సులభమవుతుంది. హోమ్ లోన్ తీసుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచే ప్రతిపాదిత ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని ప్రతి నెలా తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సొంతింటి కోసం నిధి తయారవుతుంది. రెండోదేమిటంటే.. మీకొచ్చే ఆదాయంలో ప్రతిపాదిత ఈఎంఐలకు కూడా చోటు కల్పించడం సాధ్యపడుతుంది. ఈ మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, అవసరమైతే గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది. -
ఓ ఇంటివారు ఎప్పుడవుతారో?
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన తయారైంది ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చునని ఉన్న ఇంటిని ఊడదీయడంతో ఇప్పుడు నిలువనీడలేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. సొంత ఇల్లును తొందరగా నిర్మిం చుకోవాలన్న వారి ఆశ.. బిల్లులు మంజూరు కాని కారణంగా ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపిం చడం లేదు. ఈ క్రమంలో కొంత మంది అద్దె ఇళ్లలో తలదాచుకోగా, మరి కొంతమంది నిర్మా ణం చేపట్టిన ఇంటి వద్ద చిన్న సైజు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇల్లు మంజూరు చేయడానికి సంవత్సరాల తరబడి తిప్పించిన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడానికి కూడా అదే పరిస్థితిని కల్పిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలంటూ గృహనిర్మాణశాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇల్లు నిర్మించిన వారం రోజుల్లో బిల్లు మంజూరయ్యేది. ఇప్పుడు నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాని దుస్థితి నెలకొంది. బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారుల్లో కొంతమంది లింటల్ లెవెల్లో నిర్మాణం నిలిపివేయగా, మరికొంతమంది శ్లాబు స్థాయి వరకు నిర్మించి ఆపివేశారు. బిల్లు అందిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తామని వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చిన లబ్ధిదారులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పు తీర్చాలని వ్యాపారులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లుల మీద ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు. మొదటి విడత రచ్చబండ కింద జిల్లాకు 18 వేల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 7వేల వరకు నిర్మాణం పూర్తయ్యాయి. రెండోవిడత రచ్చబండ కింద 25వేల ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 5వేల వరకు ఇళ్లు పూర్తయ్యాయి. జీఓ నంబరు 44కింద 52 వేల ఇళ్లు 2013 అక్టోబర్‌లో మంజూరయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో 3వేల మంది నిర్మాణం చేపట్టారు. వారిలో కొంతమంది లింటల్ లెవల్ వరకు ఇళ్ల నిర్మాణం చేయగా, మరి కొంతమంది శ్లాబు లెవెల్ వరకు అప్పులు చేసి నిర్మాణం పూర్తిచేశారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇళ్ల బిల్లుల మంజూరు నిలిచిపోయింది. దీంతో నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం గతంలో ఇల్లు నిర్మించిన వారం రోజుల్లో లబ్ధిదారుడి ఖాతాలో బిల్లు జమ అయింది. గత ఏడాది కాలంగా బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణం చేపట్టిన నెల నుంచి రెండు నెలల వరకు బిల్లు మంజూరు కావడం లేదు. దీంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. బిల్లు మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణం చేపట్టడానికి డబ్బులు లేక లబ్ధిదారులు బిల్లులు వచ్చే వరకు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. బిల్లు వచ్చిన తర్వాత నిర్మాణ సామగ్రి కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టే పరిస్థితి జిల్లాలోని లబ్ధిదారులది. ప్రభుత్వ అలసత్వం కారణంగా నిరుపేద లబ్ధిదారుల సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి. -
సొంతింటికి ఏదీ దారి?
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అయితే గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా? అనే విషయాలపై కొనుగోలుదారుల్లో తర్జనభర్జన ఉంటుంది. కొనుగోలుదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణుల సలహాలివే.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం, మరోసారి నిర్మాణ సామగ్రి కష్టాలు, ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోయకూడదు. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంభించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్నీ చేయలేం. రేటెక్కువైనా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. గుడ్డిగా కొనొద్దు: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఇల్లు కొంటే మొగుడు మొనగాడు అవుతాడని భార్య అనుకుంటుంది. ఉద్యోగిగా ఉన్న తాను బానిస అవుతానని భర్త అనుకుంటాడు. ఎందుకంటే ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో భాగం. ఇపుడు ఒక జీవిత లక్ష్యం. ఇక ఇంటికి పిల్లర్లు వేసేది బిల్డరు కాదు, ఇంటావిడ! ‘ఇప్పటి ఇల్లు’ ఒక మనిషి జీవితకాలపు శ్రమ. తాత్కాలిక ఆవాసం! చిత్రంగా ఉందా? కానీ, అదే నిజం. ఒకప్పుడు తాతలు ఇల్లు కట్టిస్తే మునిమనవడు కూడా అందులో ఏ ఇబ్బందీ లేకుండా నివాసం ఉండేవాడు. ఇపుడు ఒక తరంలో ఇల్లు రెండో తరంలో నివాసానికే కష్టమైపోతోంది. అద్దెకు మించిన మెయింటెనెన్స్ అవసరం అవుతోంది. సొంతింటి ఆనందం కంటే నిర్వహణ బాధే ఎక్కువ. ప్రతి భర్తకూ ఇల్లు కొనమని ఇద్దరు చెబుతారు... ఆ ఇద్దరు ఒకరు భార్య, ఇంకొకరు బ్యాంకు. ఇంట్లో ‘ఇంటి’ పోరు భలే చిత్రంగా మొదలవుతుంది. భార్యకు ఇల్లు సౌకర్యం అయితే, భర్తకు అది లగ్జరీ. ఎక్కడైనా ఇద్దరిదీ ఒకటే స్థాయి గాని ఇక్కడ మాత్రం కాదు. ఒక్కసారి శ్రీమతి గారికి సొంతిల్లు పైన మోజు కలిగితే ఇక అది రాచపుండులా ఎన్నాళ్లకీ మానదు. ఇక ఆమె దశదశలుగా ఇంటిని కొనడానికి భర్తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో... మనకు తెలిసిన వారిలో, చుట్టాల్లో ఎవరెవరు ఇల్లు కొన్నారో భార్యామణి ద్వారా మన చెవులకు వద్దన్నా తాకుతుంటుంది. రెండో దశలో... ఇల్లు కొన్న వాళ్లు ఎంతెంత సుఖంగా ఉన్నారో, ఇల్లు కొనడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పిపోయాయో ఆమె ఒక డైలీ సీరియల్ అంత అందంగా చెబుతూ ఉంటుంది. మూడో దశలో... సొంతిల్లు లేకపోవడం వల్ల ఓనరు పెట్టే ఆంక్షలు, ఇల్లు మారినపుడు వెతకడానికి పోతే నచ్చింది వెంటనే దొరకక, బడ్జెట్లో దొరక్క ఇల్లు మారినపుడల్లా కాస్త లిమిట్ పెంచుకుని ఇంటికోసం ఎక్కువ అద్దెను బాధగా కడుతున్నపుడు ‘చూశావా మనమే ఓ ఫ్లాటు కొనుక్కుని ఉంటే ఎంత బాగుండేది ఊరికే ఇంతింత అద్దె కడుతున్నాం’.. అని ప్రతి నెలా చురకలు, వేధింపులు, మాటల తూటాలు తగులుతూ ఉంటాయి. అపుడు సెగ మొదలవుతుంది. ఆ సెగకు తోడు ప్రతి ఒక్కడు ‘మీరుంటున్న ఇంటిపై మీ పేరు మీద కరెంటు బిల్లు, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు ఉందా?’ అని అడిగినపుడు... ఒరే అవన్నీ ఎలా ఉంటాయిరా అని గట్టిగా అరవాలనిపించిన ఫ్రస్ట్రేషన్లో కూడా భార్య సలహా గుర్తొస్తుంటుంది. ఎందుకంటే సొంతిల్లుంటే ఈ బాధలుండవు కదా అని అనిపిస్తుంది. కానీ, వెంటనే బ్యాంకు వాడు, వాడు కట్టే వడ్డీ లెక్కలు తలచుకుంటే మొత్తం మటాష్! ఇక నాలుగో దశ... పూర్వీకులు ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు... బాగానే ఉంది, భార్య ‘ఇల్లు భర్త లక్షణం’ అంటుంది. ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష. ఎన్నో స్ఫూర్తి కథలు విన్నాక ఇల్లు కొనాలని ఇన్స్పైర్ అయ్యి బ్యాంకుకు వెళితే ఒక విషయం అర్థమవుతుంది. బ్యాంకు వాడు తాకట్టు పెట్టుకునేది ఆ కొన్న ఇంటిని కాదు, మన జీవితాన్ని అని. మనిషన్నాక కష్టాలుండవా? జీవితమన్నాక ఒడుదొడుకులుండవా ? అంటే ఒప్పుకోడు నీవేమైనా చేసుకో ఇల్లు కావాలంటే ఇరవై ఏళ్లు లక్షకు వెయ్యి కట్టమంటాడు. ఊరికి దూ...ర...ం....గా... పోయి ఇంతకాలం దాచుకున్నది ఏమైనా ఉంటే దాన్నంతా పెట్టేసి, మరో పదిహేను లక్షల కోసం బ్యాంకు వాడికి ఇంటి రూపంలో మన జీవితాన్ని తాకట్టు పెడితే 20 ఏళ్ల పాటు నెలనెలా ఠంచనుగా తీసుకుంటూనే ఉంటాడు. ఎంత చమత్కారమంటే... ముందు వడ్డీ అంతా లెక్కకట్టి దాన్ని వసూలు చేసి ఆ తర్వాత అసలు తీసుకుంటాడు. ఇక భార్య, బ్యాంకు హ్యాపీ... ఇల్లు కొననంత వరకు ఇల్లే లగ్జరీ, ఇల్లు కొన్నాక సినిమా కూడా లగ్జరీ అయిపోతుంది. ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష. -
వాయనం: ఫర్నిచర్ కొంటున్నారా?
ఒంటికి వాడే వి కొనేటప్పుడు మన ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తాం కానీ ఇంటికి సంబంధించినవి కొనేటప్పుడు మాత్రం ఇష్టాయిష్టాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలో! సొంత ఇల్లు అయితే ఫర్వాలేదు... ఫర్నిచర్‌ని కదల్చాల్సిన పని ఉండదు. కానీ అద్దె ఇల్లు అయితే మారినప్పుడు కష్టమవుతుంది. అందుకే అద్దె ఇళ్లలో ఉండేవారయితే కాస్త తేలికపాటివి కొనుక్కోవడమే మంచిది. కలపవి కొనేట్లయితే అది ఎలాంటి కలప, ఎంతవరకు మన్నుతుంది వంటివి తెలుసుకోవాలి. ఇనుము తదితర లోహాలతో చేసినవి అయితే... అది ఏ లోహం, తుప్పు పడుతుందా వంటివి చూసుకోవాలి. కాలం గడిచేకొద్దీ వాటిలో ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకోవడం మంచిది. ఫర్నిచర్ మెటీరియల్‌ని బట్టి... వాటిని శుభ్రం చేసే విధానాన్ని అడగడం మర్చిపోకూడదు. ఏ వస్తువు కొన్నా, ఒక్కచోట చూసి కొనేయకుండా, నాలుగైదు చోట్ల రేట్లు వాకబు చేసి కొనుక్కోవడం లాభకరం! ఫర్నిచర్‌ని ఆన్లైన్లో కొనకపోవడం మంచిది. ఎందుకంటే... పొరపాటున ఏదైనా తేడా ఉంటే దాన్ని తిప్పి పంపడం, మళ్లీ మరో సెట్ వచ్చేవరకూ ఎదురు చూడటం... వీటన్నిటికీ బోలెడంత టైమ్ వేస్టవుతుంది. అదేదో షాపుకెళ్లి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారికి పనైపోతుంది. మొక్కజొన్న... ఒలవండిలా! ప్రపంచమే మెచ్చిన పౌష్టికాహారం... మొక్కజొన్న. దీనిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే మొక్కజొన్నని వీలైనంత ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. తినడం మనకూ ఇష్టమే. కానీ దాన్ని ఒలుచుకోవడమే పెద్ద పని. ఈ మధ్య ఒలిచిన గింజలు కూడా దొరుకుతున్నాయి గానీ ప్రతిసారీ అవి అందుబాటులో ఉండాలి కదా! అందుకే ‘కార్న్ స్ట్రిప్పర్’ని కొనుక్కోవడం బెటర్. కంప్యూటర్ మౌస్లా ఉండే ఈ చిన్ని యంత్రం... మొక్కజొన్న గింజల్ని ఇదిగో, ఇంత తేలిగ్గా ఒలిచి పెట్టేస్తుంది మనకి. అసలు ధర 500 రూపాయలు. ఆన్లైన్లో అయితే రెండు మూడొంద ల్లో కూడా వచ్చేస్తోంది! ప్లాస్టిక్ సీసాతో ఫ్లవర్‌వాజ్! ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఫ్లవర్‌వాజులు, ప్లాస్టిక్ పూలు, వాల్ హ్యాంగింగ్స్ అంటూ ఖర్చు పెట్టడం కాస్త తలకు మించిన భారమే. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రిని తయారు చేసుకోవచ్చు కదా! అదేం పెద్ద కష్టం కూడా కాదు. కావాలంటే ప్లాస్టిక్ సీసాతో ఇలా ఫ్లవర్‌వాజ్ చేసి చూడండి... మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీయో! ఖాళీ అయిపోయిన అర లీటరు కూల్‌డ్రింక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత దాన్ని మధ్యకు కట్ చేయాలి. అడుగున కొంతమేర వదిలేసి, మిగిలిన భాగాన్ని పొడవుగా కత్తిరించుకోవాలి (ఫొటో చూడండి). ఇప్పుడు బాటిల్‌ని తిరగేసి, నేలమీద పెట్టి గట్టిగా నొక్కితే, కత్తిరించిన ముక్కలన్నీ వెనక్కి వంగి పువ్వులా అవుతాయి. ఆపైన ఒక్కో ముక్కనీ ఫొటోలో చూపినట్టుగా క్రాస్‌గా సగానికి మడవాలి. అంతే... అందమైన ఫ్లవర్‌వాజ్ రెడీ. ఇందులో మీకు నచ్చిన పూలను అమర్చి టేబుల్ మీద పెడితే సూపర్‌గా ఉంటుంది! -
అందుబాటు గృహాలకు ఇదీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ కల సాకారం కావాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరి సామాన్య, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవటం కష్టమా? పోనీ.. అందుబాటు గృహాలను అందించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందా అంటే అదీ ఉండదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో దాదాపు 2.65 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2020 నాటికి ఇది మూడు కోట్లకు చేరుకునే అవకాశముందని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దం నుంచి పెరిగే జనాభా కారణంగా నగరాల్లో స్థల లభ్యత దారుణంగా తగ్గింది. ఫలి తంగా ఇళ్ల కొరత రోజురోజుకూ పెరుగుతోంది. మంచినీరు, విద్యు త్తు, ఖాళీ స్థలాలూ లేని మురికివాడలు అధికంగా వెలుస్తున్నాయి. ఆర్థిక నియంత్రణ, నగరీకరణ వంటి అంశాల్లో ఎదురయ్యే అవాంతరాలతో.. చౌక గృహాల నిర్మాణం పుంజుకోవట్లేదు. ఒకవైపు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు నిర్మాణ వ్యయమూ పెరిగింది. ఈ రెండింటి ప్రభావం అందుబాటు గృహాల నిర్మాణం మీద పడుతోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికీ ముందుకు రావట్లేదు. శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందించాలని మొదలుపెట్టినవారూ అయిష్టంగానే ధరలు పెంచాల్సిన దుస్థితి నెలకొంది. సామాన్యులకు బ్యాంకు ఖాతాలుండవు. ఒకవేళ ఉన్నా క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించరు. కొందరికేమో పాన్ కార్డులుండవు. చిన్నాచితకా ఉద్యోగాలు చేయడంతో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయరు. దీంతో బ్యాంకులు గృహరుణాల్ని మంజూరు చేయవు. కాబట్టి ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంద ని నిపుణులు సూచిస్తున్నారు. మనకంటే చిన్నదేశాలైన సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటివి ముందంజలో ఉన్నాయి. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాలు అందుబాటు గృహాల్ని నిర్మించడంలో స్పష్టమైన ప్రణాళికల్ని పాటిస్తున్నాయి. అక్కడి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాల్ని రూపొందిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. అదే మన దేశంలో చూస్తే.. ‘ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంస్థలకు స్థలాలున్నాయి. మరి, ఈ సంస్థలేం చేస్తున్నాయంటే.. వేలం ద్వారా ఆయా స్థలాల్ని విక్రయిస్తున్నాయి. మార్కెట్లో కృత్రిమ గిరాకీని సృష్టిస్తున్నాయి. అందుబాటు గృహాల విస్తీర్ణం తక్కువుండేలా చూడటం, క్రాస్ సబ్సిడీలను అందించడం, ప్రోత్సాహకాల్ని ప్రకటించడం, ఇళ్ల సరఫరా, గిరాకీకి అనుగుణంగా రాయితీల్ని ఇవ్వడం వంటి పథకాల్ని ప్రకటించాలి. అప్పుడే నిర్మాణ సంస్థలు ముందుకొస్తాయి. ప్రభుత్వ స్థలాల్లో అందుబాటు గృహాల్ని నిర్మించి నామమాత్రపు ధరకే విక్రయిస్తే సామాన్యులెందరో కొనుగోలు చేస్తారు. కనీసం ఇలాగైనా ఇళ్ల కొరత తీరుతుందని నిపుణులంటున్నారు. -
ముంబైలో సొంత ఇల్లు కలే...
సాక్షి ముంబై: ముంబైలో సొంత ఇల్లు పగటి కలే అంటున్నారు బీఎంసీ అధికారులు. నగరంలోని ఒకటిన్నర కోట్ల జనాభాలో కేవలం తొమ్మిది శాతం కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ.60 వేలు ఉంటుంది. ప్రస్తుతం నగరంలో సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల ధర సుమారు రూ.14 లక్షల వరకు ఉంది. బొటాబొటిగా సర్దుకోవడానికి సరిపోయే సంపాదనతో మహానగరంలో సొంత ఇల్లు కొనుగోలు అనేది సామాన్యులకు సాధ్యమయ్యే పనికాదు. వచ్చే 20 సంవత్సరాల (2014 నుంచి 2034) కాలవ్యవధిలో నగర అభివృద్ధిపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ప్రణాళిక రూపొందించడానికి సేకరించిన వివరాల ద్వారా ఈ కఠిన వాస్తవం వెలుగుచూసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నేడు ప్రపంచంలోని ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. 1991 నుంచి 2001 మధ్య దశాబ్ద కాలంలో జనాభాకు అనుగుణంగా ముంబై నగర విస్తరణ సాగలేదు. దీంతో ఇళ్ల కొరత ఏర్పడిందని విశ్లేషకులంటున్నారు. సామాన్య కుటుంబం వార్షిక ఆదాయం కన్నా ఇండ్ల ధర నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండడంతో కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా సామాన్యులు కొనుగోలు చేయలేరని ఆర్థిక నిపుణులంటున్నారు. నగరంలో 38 శాతం స్థలంలో నివాసాలు ఉన్నాయి. ఐదు శాతం వ్యాపారం, ఎనిమిది శాతం పారిశ్రామిక, 35 శాతం మౌలిక వనరుల వ్యవస్థ, మరో 16 శాతం స్థలాలు ఇతరత్రా కోసం ఉపయోగపడుతోంది. ఇళ్లు కావాలంటే............ సామాన్యులకు సొంత ఇల్లు కల నెరవేరేందుకు ప్రభుత్వం తన పునరాభివృద్ధి ప్రాజెక్టుల నిబంధనల్లో సడలింపు తీసుకురావాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరకు లభించే ఇళ్లు, మౌలిక సదుపాయాలు, వేగవంతమైన రవాణా సేవలు అవసరం. కెనడా, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాల మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఇళ్లను అందించే విధానం అవలంబించాలి. ప్రస్తుతం ముంబైలో 10 లక్షల ఇండ్ల కొరత ఉంది. ప్రైవేట్ సంస్థల అభివృద్ధి ప్రణాళికల వలన మధ్య, అధిక ఆదాయ వర్గాల వార్షిక ఆదాయ పెరగడంతో సంవత్సరానికి 15 వేల మంది ఇండ్లు కొనుగోలు చేస్తున్నారు. ముంబై నగరంలో స్థిరాస్తుల ధరలు చాలీ, మురికివాడల పునరాభివృద్ధి ప్రణాళిక అమలవుతున్న ప్రాంతాల్లో ఇండ్ల ధర రూ.20 నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. మధ్యస్థాయి 1 బీహెచ్‌కె ఇల్లుకు ప్రాంతాన్ని బట్టి రూ.10 నుంచి రూ.85 లక్షల వరకు ఉంది. ఇక రెండు, మూడు పడక గదులతో కూడిన ఇండ్ల ధర రూ.65 లక్షల నుంచి రూ.2.5 కోట్లు ఉందని తెలుస్తోంది. మురికివాడల్లో నివసించే వారి సంఖ్య ముంబై మొత్తం విస్తీర్ణం 458.28 చదరపు కిలోమీటర్లు. పట్టణ ప్రాంతాల్లో 27.88 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. అలాగే పశ్చిమ ఉపనగరాల్లో 42.69 శాతం, తూర్పు ఉపనగరాల్లో 51.99 శాతం మంది నివసిస్తున్నారు.