సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. చివరికి తమ కలల సౌధాన్ని నెరవేర్చుకుంటారు. అయితే గత ఐదేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిపోతున్న అద్దెలు, ఇళ్ల ధరలు.. సొంతింటి కలను దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు.. ప్రాపర్టీలు, రెంట్లు ఆకాశాన్ని తాకుతున్న నగరాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ నివేదించింది.
ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ‘కేపిటల్ మైండ్’ ఫౌండర్, సీఈవో దీపక్ షెనాయ్ (Deepak Shenoy) ఇంటి కొనుగోలుపై పెట్టే పెట్టుబడిని ‘భయంకరమైన పెట్టుబడి’గా అభివర్ణించారు. ఇల్లు, కారు కొనుగోలు చేయడం మంచిది కాదన్నారు. సొంత ఇల్లు కొనుగోలుతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. సొంతంగా కారు కొనుక్కునే బదులు.. ఓలా, ఊబర్ లాంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చని అన్నారు.
కానీ కొనుగోలు, అద్దె ఈ రెండూ ఎప్పటికి పోవు. ఎందుకంటే ఎక్కువ మంది దృష్టిలో ఆ రెండు ఓ విశ్వాసం లాంటివి. అందుకే చాలా మంది ఇల్లు, కార్లకు యజమానులవ్వాలని అనుకుంటారు. ఒక్కోసారి కారు కొన్నట్లు ఇల్లు కొనుగోలు చేయొచ్చా? అని ఆలోచిస్తుంటారు. మరికొందరు పెట్టుబడులతో ఇల్లు కొనుగోలు విషయంలో గందరగోళానికి గురవుతారని ట్వీట్ చేశారు. అయితే గత దశాబ్దంలో ఇళ్ల కొనుగోళ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్ల తరహాలో ఇళ్ల కొనుగోళ్లు ఓ భయంకరమైన పెట్టుబడి. కానీ సొంత ఇల్లు ఉంటే మనకు నచ్చిన విధంగా అందంగా అలంకరించుకోవచ్చు. పాస్‌పోర్ట్‌లో పర్మినెంట్ అడ్రస్ కింద అప్లయి చేసు కోవచ్చు. రెంట్ కట్టే బాధతప్పుతుంది. అద్దె ఇల్లు కోసం మీడియేటర్లతో సంప్రదింపులు జరిపే అవసరం ఉండదనే భావనలో ఉంటారని.. కానీ సొంత ఇల్లు కొనుగోలు చేయడం సమర్ధించే పెట్టుబడి కాదని అన్నారు దీపక్ షెనాయ్.
ప్రస్తుతం దీపక్ షెనాయ్ వ్యక్తం చేసిన ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలకు దూరం చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి👉 ఆర్‌బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా?
Comments
Please login to add a commentAdd a comment