కొన్నేళ్ల క్రితం వరకు నగరాలు, పట్టణాల్లో సామాన్యుడికి సొంత ఇల్లు అనేది కలగానే ఉండేది. కానీ కోవిడ్ -19తో పరిస్థితులు మారాయి. మహమ్మారి సమయంలో అద్దె ఇంట్లో ఉండే వారి వెతలు ఎలా ఉన్నాయో కొన్ని సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా సొంతిల్లు కొనే పనిలో పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల్లో సులభంగా లభించే ఇంటి రుణాలు సొంతింటి కలను మరింత నిజం చేశాయి.
మరి అద్దె ఇంట్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నెలల వ్యవధిలో యజమానులు పెంచుతున్న ఇంటి అద్దెల్ని కట్టుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగళూరులో 23 ఏళ్ల శామ్ సంగ్ ఉద్యోగి అర్ష్ గోయల్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మారతహళ్లి దొడ్డనుకుంది గేటెడ్ కమ్యూనిటీ హాల్స్‌లో 3 బీహెచ్‌కే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ అద్దె నెలకు రూ.57,000.
బెంగళూరు వంటి మహానగరాల్లో ఏడాదిలో 11 నెలల పాటు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో చేరిన అర్ష్ గోయల్‌కు 6 నెలల తర్వాత యజమాని పెట్టిన ఖండీషన్‌కు కంగుతిన్నాడు. అదేంటంటే? అద్దెకు చేరి ఆరు నెలలు పూర్తయింది కాబట్టి.. రెంటును అకస్మాత్తుగా మరో రూ.15,000 పెంచుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణయాన్ని అంగీకరించడం, లేదంటే ఇల్లును ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు.
అయితే, యజమానికి రెంట్ పెంచడాన్ని గోయల్ జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో బెంగళూరులో అద్దె ఇల్లు వెతుక్కోవడం, ఇంటి యజమానులు పెట్టే కండీషన్లు తలకు మించిన భారంగా మారాయి. దీంతో పెంచిన రెంట్‌ను చెల్లించేందుకు గోయల్ స్నేహితులు అంగీకరించారు. చివరికి చేసేది లేక తానుకూడా అంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సిద్ధమైన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. మళ్లీ కొత్త అపార్టెంట్‌ను వెతుక్కోవడం సమస్య కాబట్టి భూస్వామికి అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని గోయల్ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
My Landlord in Bangalore increased rent by 15,000 INR within one year whereas as per agreement the increase per year should have been 5%.
— Arsh Goyal (@arsh_goyal) July 8, 2023
The only option he gave was either to leave or pay the increased rent.
ఇల్లు మారొచ్చుకదా..
ఓ ప్రముఖ మీడియా సంస్థ జరిపిన ఇంటర్వ్యూలో, బ్రోకర్ ద్వారా ఈ ఫ్లాట్‌ను వెతకడానికి నెలరోజుల సమయం పట్టినట్లు గోయల్ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఉంటున్న ఫ్లాట్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ఆఫీస్ దగ్గర, పైగా రోజువారీ ప్రయాణంలో ట్రాఫిక్ బాధల నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారి బాధల్ని దగ్గరుండి చూసినట్లు అర్ష్ చెప్పుకొచ్చాడు. దీంతో అర్ష్ గోయల్ తరహాలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉 రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే
Comments
Please login to add a commentAdd a comment