rent
-
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
అద్దె భారం.. గురుకులాలకు తాళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. పలు గురుకులాలకు తాళాలు యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.హుజూర్‌నగర్‌లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు. గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. రేగొండ మండలంలోని లింగాల, వరంగల్ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె భవనాల్లో 625 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు. -
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..ఒక విచిత్రమైన ఫేస్బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
మన దగ్గర క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. చిన్నప్పుడు గల్లీల్లో క్రికెట్ ఆడినా.. కాస్త పట్టు చిక్కినవారు, దానిపై మక్కువ ఉన్నవారు, ప్రొఫెషనల్‌గా తీసుకునేవారు మాత్రం విశాలమైన గ్రౌండ్ల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే నగర శివార్లలో అద్దె మైదానాలు వెలిశాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు అటూ ఇటూ భూములున్నవారు ఖాళీగా ఉన్న తమ భూములను క్రికెట్ మైదానాలుగా మార్చేసి అద్దెకు ఇస్తున్నారు. మ్యాచ్‌కు ఇంత అని లేకుంటే రోజుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. అటు క్రీడాకారుల అవసరాన్ని తీర్చుతూనే, ఇటు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇలా నగరంలో, శివార్లలో వందలకొద్దీ గ్రౌండ్లు ఏర్పాటయ్యాయి. అందులో ఒక్క మొయినాబాద్ మండలం పరిధిలోనే 60కిపైగా మైదానాలు ఉండటం గమనార్హం.రోజురోజుకూ విస్తరిస్తున్న విశ్వనగరం హైదరాబాద్‌లో క్రికెట్ అంటే మోజు ఎక్కువ. ఆ ఆటను చూసేవారే కాదు.. ఆడేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. సిటీలో గచ్చిబౌలి, ఉస్మానియా యూనివర్సిటీ, యూసఫ్‌గూడ, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఉన్నా.. అవి క్రీడాకారుల అవసరాలకు సరిపోవడం లేదు. మరోవైపు క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి, వెలికి తీసేందుకు వివిధ సంఘాలు, అసోసియేషన్లు ఏదో ఒక పేరుతో తరచూ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాయి.దీంతో గ్రౌండ్ల కోసం డిమాండ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అటు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా, తామూ కొంత ఆదాయం పొందేలా.. నగర శివార్లలో భూములున్నవారు తమ భూములను క్రీడా మైదానాలు మారుస్తున్నారు. భూములను చదును చేసి, చుట్లూ ఎత్తయిన ప్రహరీలు లేదా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ చెట్లను, మైదానమంతా పచ్చనిగడ్డిని పెంచుతున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క క్రికెట్ అనేగాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి ఇతర పోటీలకు కూడా ఈ గ్రౌండ్లను అద్దెకు ఇస్తున్నారు.శివార్లలో సాగు చేయలేక..సిటీ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం, వానలు సరిగా పడకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయడం లేదు. ఈ ప్రాంతాల్లో కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. సాగు చేసినా.. ఖర్చులు రెట్టింపు అవుతున్న పరిస్థితి. దీనితో ఖాళీగా ఉన్న పొలాలను మైదానాలుగా మారుస్తున్నారు. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నవారు ఓపెన్ స్టేడియాలుగా మారుస్తుండగా.. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న వారు నెట్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని క్రీడా మైదానాల నిర్వాహకులకు లీజుకు ఇస్తున్నారు. ముఖ్యంగా నగరానికి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలం క్రీడా హబ్‌గా మారుతోంది. ఈ ఒక్క మండలంలోనే సుమారు 65 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, శంషాబాద్ మండలంలో ఐదు, హయత్‌నగర్ మండలంలో మూడు మైదానాలు ఏర్పాటయ్యాయి.ఉద్యోగ, వ్యాపార వర్గాలూ..రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు.. సిటీ శివార్లలో భారీగా భూములు కొనుగోలు చేశారు. వారిలో కొందరు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఏర్పాటు చేస్తే.. మరికొందరు భూములను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక క్రీడా మైదానాలుగా మారుస్తున్నారు. కొనుగోలు చేసిన భూములకు రక్షణగా ఉండటంతోపాటు అద్దె ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఆకర్షించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాయి. వారాంతాల్లో వాటిని అద్దెకు కూడా ఇస్తున్నాయి.ఏర్పాట్లను బట్టి అద్దెలు..ఈ గ్రౌండ్లలో వీక్షకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మరుగుదొడ్లు, విద్యుత్, సౌండ్ వ్యవస్థలు, భారీ స్క్రీన్లు, ఎల్ఈడీ లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదుపాయాలను బట్టి, డిమాండ్‌ను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. గ్రౌండ్ల బుకింగ్ కోసం కొందరు నిర్వాహకులు ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పెద్ద గ్రౌండ్లు అయితే ఒక్కో మ్యాచ్‌కు రూ.5000 నుంచి రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నారు. నెట్, ఫెన్సింగ్‌తో ఉండే చిన్న గ్రౌండ్లకు గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు చార్జీ చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగా వసూలు చేస్తున్నారు.క్రికెట్‌పై ఇష్టంతోచిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే క్రికెట్ ఆడేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటా. హైదరాబాద్ నగరంలో క్రికెట్ మైదానాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా పార్కుల్లో ఉన్నా క్రికెట్ ఆడేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ప్రతిరోజు క్రికెట్ ఆడేందుకు సిటీ బయటి ప్రాంతాలకు వెళ్తున్నాను. క్రీడాకారులందరం డబ్బులు పోగేసుకుని మైదానాన్ని అద్దెకు తీసుకుంటాం. - సయ్యద్ అర్షద్, క్రీడాకారుడుఆన్లైన్ ద్వారా అద్దెకు..క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చాలా వరకు క్రీడాకారులు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతుంటారు. సాధారణ రోజుల్లో మ్యాచ్‌కు రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. శని, ఆదివారాల్లో అయితే మ్యాచ్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె వసూలు చేస్తాం. గ్రౌండ్ నిర్వహణకే చాలా వరకు ఖర్చవుతుంది. మౌలిక సదుపాయాలు, డిమాండ్‌ను బట్టి చార్జీలలో మార్పులు ఉంటాయి.– రాజేందర్‌రెడ్డి, క్రికెట్ మైదానం నిర్వాహకుడు, మొయినాబాద్క్రికెట్ గ్రౌండ్లు ఉన్నగ్రామాల వివరాలివీ..గ్రామం గ్రౌండ్లుబాకారం 15అజీజ్‌నగర్ 12ఎనికేపల్లి 12చిలుకూరు 6నజీబ్‌నగర్ 4అమ్డాపూర్ 3నాగిరెడ్డిగూడ 3హిమాయత్‌నగర్ 3కనకమామిడి 3రెడ్డిపల్లి 3తుర్కయాంజాల్ 2కొంగరకలాన్ 2మోత్కుపల్లి 1శ్రీరాంనగర్ 1బొంగుళూరు 1ఇబ్రహీంపట్నం 1నాదర్గుల్ 1 -
మిల్కీ బ్యూటీ బిగ్ డీల్.. ఏకంగా నెలకు రూ.18 లక్షలు!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. గతేడాది రజినీకాంత్ మూవీ జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా.. ముంబయిలో ఖరీదైన ప్రాంతంలో కార్యాలయాన్ని రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా తమన్నా భాటియా ముంబయిలోని ఓ వాణిజ్య కార్యాలయం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలకు దాదాపు రూ. 18 లక్షలు చెల్లించనుంది. ఖరీదైన జుహు తార ప్రాంతంలో ఈ వాణిజ్య కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్ దాదాపు 6,065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. నానావతి కన్స్ట్రక్షన్ నుంచి ఐదేళ్ల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంది. ఈ బిగ్ డీల్ జూన్ 27న జరగ్గా.. దీనికోసం తమన్నా రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అంతే కాదు ఆమెకు చెందిన అపార్ట్మెంట్లను కూడా భారీ మొత్తానికి బ్యాంకులో తనఖా పెట్టినట్లు సమాచారం. అంతే కాకుండా తమన్నా అంధేరీలోని వీర దేశాయ్ రోడ్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లాట్లను ఇండియన్ బ్యాంక్‌లో రూ.7.84 కోట్లకు రుణం కోసం తనఖా పెట్టినట్లు సమాచారం. జూన్ 14న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నటి రూ.4.70 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ఇక సినిమాల విషయానికొస్తే తదుపరి చిత్రం వేదాలో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటిస్తోన్న స్ట్రీ- 2లో ప్రత్యేక పాత్రలో పోషించనుంది. -
అద్దెకు మినీ థియేటర్లు
మణికొండ: ఎవరైనా సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెల్లాల్సిందే. అదే సంపన్నులైతే ఇంట్లోనే హోం థియేటర్లను ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాదీ కలిసి అందులో నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అదే సామాన్యులు, పేదులు అయితే ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలనే చూస్తారు. అలాంటి సామాన్యులకూ తమ ఇంట్లోని హోం థియేటర్లో కూర్చుని సినిమా చూసిన అనుభూతిని కలి ్పంచేందుకు మినీ థియేటర్లు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకొచ్చాయి. వాటిలో సినిమాలు చూడటమే కాదు కుటుంబ సమేతంగా బర్త్‌డేలు, ఇతర సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే అయ్యే ఖర్చుకన్నా తక్కువకే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రం నుంచి నార్సింగి రోడ్డులో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల బింగే క్యాస్టల్ హోం థియేటర్లను ప్రారంభించారు. అందులో ఇద్దరి నుంచి మొదలుకుని ఎనిమిది మంది వరకూ సినిమా చూసే వెసులుబాటును కలి ్పంచారు. అద్దెలు ఇలా... బింగే క్యాస్టల్ ప్రైవేట్ హోం థియేటర్లలో కపుల్స్‌కు రూ.1449లు, ఐదుగురు కలిసి చూసే థియేటర్ రూ.1549లు, పది మంది కలిసి చూసే థియేటర్‌కు రూ.1749లు తీసుకుంటున్నారు. వాటిలో అదనపు వ్యక్తి వస్తే రూ.299 లు వసూలు చేస్తున్నారు. ఓటీటీలో అందుబాటులో ఉన్న నచ్చిన సినిమాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సినిమా చూస్తున్న సమయంలో స్నాక్స్ కావాలన్నా అందిస్తున్నారు. 3 గంటల పాటు సినిమా చూ డటం, అందులో ఉండేందుకు అవకాశం కలి్పస్తున్నారు.సామాన్యులు సైతం హోం థియేటర్లో కూర్చుని, నచి్చన సినిమా చూస్తూ చిన్న, చిన్న పారీ్టలు సెలబ్రేట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన అనుభూతే ఇందులో కలుగుతుంది. వీటిల్లో వారికి ప్రైవసీ ఉంటుంది. కేక్‌లు, స్నాక్స్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. రానున్న రోజుల్లో మరిన్నింటిని పెంచుతాం. – డి.శ్రావణ్ కుమార్, బింగే క్యాస్టల్ థియేటర్స్ యజమాని -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్‌కేక్‌లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్‌లలో కిరాయిలు హాట్‌కేక్‌లా మారాయి.అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్‌లు, మెయింటెనెన్స్‌ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్‌ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
సేనానికి ప్యాకేజీ.. నమ్ముకున్నవారికి నిరాశ..!
వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్‌కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్‌గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్‌కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు. ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్‌ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు. బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్‌ను నిలదీశారు పోతిన మహేశ్.. కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు. పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్‌కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..?
దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు వేలల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు తెలిస్తే అవాక్కవుతారు. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన అన్య ఎట్టింగర్ అనే మహిళ నెలకు రూ.54,000 చొప్పున తన క్వీన్సైజ్ బెడ్‌ను మరో మహిళతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన షేర్ చేసింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు రూ.2.17 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. తాను కాండోలో ఉంటున్నట్లు మాస్టర్ బెడ్రూమ్, క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి మహిళ కోసం వెతుకుతున్నానని అందులో చెప్పింది. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? గతంలో తాను ఫేస్బుక్ కంపెనీలో పరిచయమైన అమ్మాయితో బెడ్రూమ్ని పంచుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వినటానికే ఇది హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anya Ettinger (@aserealty) -
కౌలు చెల్లించాల్సింది సీఆర్డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్ నుంచి సీఆర్డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకే... ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండా ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైందని తెలిపారు. మీరు (జస్టిస్ కృష్ణమోహన్) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్) కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, పిటిషనర్ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' (Bernard Arnault)కి చెందిన లూయిస్ విట్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని ఉబెర్ లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ కోసం మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను లీజుకు తీసుకుంది. దీనికి నెలకు అద్దె రూ. 40.50 లక్షలు కావడం గమనార్హం. సంస్థ 60 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో 114 నెలలకు (9.5 సంవత్సరాలు) రూ. 2.43 కోట్ల లైసెన్స్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ప్రతి 36 నెలల తరువాత రెంట్ 15 శాతం పెరుగుతుంది. ఈ డీల్ 2023 ఫిబ్రవరి నుంచి 2032 డిసెంబర్ వరకు ఉండనుంది. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ 1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్ స్థాపించిన ఈ కంపెనీ 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భారతదేశంలో తన మొదటి షాప్ ప్రారంభించింది. అయితే ఈ రోజు బెంగళూరులోని UB సిటీ, న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, దక్షిణ ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌తో సహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. -
వార్షిక కౌలుపై పిటిషన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలన్న రాజధాని రైతుల అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం ముందు రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ అభ్యర్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంలేదని, దీనిపై తాము సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు మాత్రమే జారీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అప్పీల్ దాఖలు చేయాలని అనుకుంటున్నామని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయనప్పుడు దేనిపై అప్పీల్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్‌తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
Tesla: ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశంలో టెస్లా (Tesla) కంపెనీ ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సంస్థ కోసం టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కోసం పూణే విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్నిఅద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టెస్లా బృందం గత వారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి సంబంధించిన ప్రోత్సాహకాలను, ప్రయోజనాలను గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్.. టెస్లా యూనిట్.. భారతదేశంలో టెస్లా యూనిట్ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. సుమారు 5,580 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్పేస్ కోసం నెలకు అద్దె రూ. 11.65 లక్షల వరకు ఉండనుంది. అద్దె 2023 అక్టోబర్ 01 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ స్పేస్‌ను 5 సంవత్సరాలు లీజుకి తీసుకున్నట్లు, ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 34.95 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ గడువును పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో ఒక సారి బెంగళూరులో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని సంస్థ యోచిస్తోంది. -
గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..
గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు. (చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..) -
6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె!
కొన్నేళ్ల క్రితం వరకు నగరాలు, పట్టణాల్లో సామాన్యుడికి సొంత ఇల్లు అనేది కలగానే ఉండేది. కానీ కోవిడ్ -19తో పరిస్థితులు మారాయి. మహమ్మారి సమయంలో అద్దె ఇంట్లో ఉండే వారి వెతలు ఎలా ఉన్నాయో కొన్ని సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా సొంతిల్లు కొనే పనిలో పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల్లో సులభంగా లభించే ఇంటి రుణాలు సొంతింటి కలను మరింత నిజం చేశాయి. మరి అద్దె ఇంట్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నెలల వ్యవధిలో యజమానులు పెంచుతున్న ఇంటి అద్దెల్ని కట్టుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగళూరులో 23 ఏళ్ల శామ్ సంగ్ ఉద్యోగి అర్ష్ గోయల్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మారతహళ్లి దొడ్డనుకుంది గేటెడ్ కమ్యూనిటీ హాల్స్‌లో 3 బీహెచ్‌కే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అద్దె నెలకు రూ.57,000. బెంగళూరు వంటి మహానగరాల్లో ఏడాదిలో 11 నెలల పాటు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఆ అపార్ట్మెంట్లో చేరిన అర్ష్ గోయల్‌కు 6 నెలల తర్వాత యజమాని పెట్టిన ఖండీషన్కు కంగుతిన్నాడు. అదేంటంటే? అద్దెకు చేరి ఆరు నెలలు పూర్తయింది కాబట్టి.. రెంటును అకస్మాత్తుగా మరో రూ.15,000 పెంచుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణయాన్ని అంగీకరించడం, లేదంటే ఇల్లును ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. అయితే, యజమానికి రెంట్ పెంచడాన్ని గోయల్ జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో బెంగళూరులో అద్దె ఇల్లు వెతుక్కోవడం, ఇంటి యజమానులు పెట్టే కండీషన్లు తలకు మించిన భారంగా మారాయి. దీంతో పెంచిన రెంట్‌ను చెల్లించేందుకు గోయల్ స్నేహితులు అంగీకరించారు. చివరికి చేసేది లేక తానుకూడా అంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సిద్ధమైన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. మళ్లీ కొత్త అపార్టెంట్ను వెతుక్కోవడం సమస్య కాబట్టి భూస్వామికి అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని గోయల్ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. My Landlord in Bangalore increased rent by 15,000 INR within one year whereas as per agreement the increase per year should have been 5%. The only option he gave was either to leave or pay the increased rent. — Arsh Goyal (@arsh_goyal) July 8, 2023 ఇల్లు మారొచ్చుకదా.. ఓ ప్రముఖ మీడియా సంస్థ జరిపిన ఇంటర్వ్యూలో, బ్రోకర్ ద్వారా ఈ ఫ్లాట్‌ను వెతకడానికి నెలరోజుల సమయం పట్టినట్లు గోయల్ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఉంటున్న ఫ్లాట్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ఆఫీస్ దగ్గర, పైగా రోజువారీ ప్రయాణంలో ట్రాఫిక్ బాధల నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారి బాధల్ని దగ్గరుండి చూసినట్లు అర్ష్ చెప్పుకొచ్చాడు. దీంతో అర్ష్ గోయల్ తరహాలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే -
ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు!
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి? కన్న తండ్రిలా సంరక్షిస్తూ.. అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలను పట్టుకునేందుకు.. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. పిల్లల కోసం సౌకర్యాలు ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్‌స్టార్‌కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్‌గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్‌కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్మెంట్ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్మెంట్లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. వందేళ్ల నాటిది! ఈ వన్ బీహెచ్‌కే సాధారణ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్‌కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు. -
అద్దెకు గోదాములు
సాక్షి, అమరావతి: ఆర్థిక పరిపుష్టి సాధించుకునే దిశగా మార్కెటింగ్ శాఖ అడుగులేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకివ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకుంటోంది. రాష్ట్రంలో 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,015 గోదాములు ఉన్నాయి. వీటితో పాటు 3,352 చోట్ల షాపులు, మరో 407 చోట్ల షాపులతో కూడిన గోదాములున్నాయి. ఇప్పటి వరకు కమిటీల పరిధిలో ఉన్న ఈ–చెక్‌పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయడం, వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయడం, గోదాములను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇవ్వడం వంటి కార్యకలాపాల ద్వారా మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరేది. ఇలా ఏటా రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఒకే దేశం– ఒకేమార్కెట్ విధానంతో సెస్ వసూళ్లను నిలిపివేయడంతో దాదాపు ఏడాది పాటు ఆదాయానికి గండి పడింది. 2021–22లో ఈ పన్నుల వసూళ్లను పునరుద్ధరించడంతో కాస్త గాడిలో పడినప్పటికీ ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా మార్కెటింగ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునే వారు. అలాగే బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వ కోసం పౌరసరఫరాల శాఖ, ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తుల నిల్వ కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రాష్ట్ర గోదాముల సంస్థ, మార్క్ఫెడ్లకు అద్దెకిచ్చేవారు. గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కూడా గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వీరికి అద్దెకివ్వడం ద్వారా మార్కెటింగ్ శాఖ అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు అద్దెకు 2,976 షాపులు ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి గోదాములను అద్దెకు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా అద్దెను నిర్ణయించి,konugolu.ap. gov.in ద్వారా టెండర్లు పిలుస్తున్నారు. అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా మార్కెట్ కమిటీలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,976 షాపులు, 367 షాపులతో కూడిన గోదాములు, 614 గోదాములు అద్దెకిచ్చారు. వీటి ద్వారా ఏటా రూ.24 కోట్లకు పైగా అదనపు ఆదాయం మార్కెటింగ్ శాఖ సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీగా ఉన్న షాపులు, గోదాములను కూడా అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇదెక్కడి డిమాండ్ మహాప్రభో.. డబుల్ బెడ్ రూం అద్దె రూ.50వేలు!
దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్‌తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా మారింది. అమాంతం పెరిగిన అద్దె ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్‌ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్ మార్కెట్’కు మంచి డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. -
గూగుల్ ఇంటర్వ్యూలో నెగ్గాడు.. కానీ అక్కడ మాత్రం!
కోవిడ్-19 తర్వాత మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. ఎంతలా అంటే? గూగుల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు..కానీ బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటూ అద్దెకోసం అన్వేషిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాల గురించి ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాకు ఎక్కిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఒప్పుకోవాలి. ఇంటర్వ్యూ పేరుతో వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకదు. అలా అద్దె ఇల్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న రీపు సోనారిక భడోరియా (Ripu Daman Bhadoria) తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. భడోరియా గత ఏడాది అమెరికా సియాటెల్ నుంచి బెంగళూరు వచ్చాడు. అక్కడ తన బడ్జెట్ తగ్గట్లు రెంట్‌కు ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇంటి ఓనర్స్ రకరకాల ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అలా ఓనర్ చేసిన తొలి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్లు బహదోరియా చెప్పుకొచ్చాడు. అప్పుడే బెంగళూరులో అద్దె ఇల్లును సొంతం చేసుకోవడం కంటే గూగుల్ (google) ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా సులభమని భావించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో మరో ఇంటి ఓనర్ చేసిన ఇంటర్వ్యూలో పాస్ అయినట్లు వివరించాడు. బహదోరియా గూగుల్ ఉద్యోగి. తాను గూగుల్ ఉద్యోగినని. సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం వల్లే తనకు అద్దె ఇల్లు దొరికిందని చెప్పాడు. గూగుల్‌లో పనిచేయడం విపత్కర పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఎప్పుడూ ఊహించలేదని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాశారు. ఆ పోస్ట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. విసుగు తెప్పించడంలో బెంగళూరులో ఇంటి ఓనర్స్ అద్దె ఇంటి కోసం వెతికే వారికి తెగ విసుగు తెప్పిస్తుంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్ . 2016 లో అనుకుంటా. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తారా? మీ ఇంటికి మగ స్నేహితులు వస్తారా? అని ప్రశ్నించారు. నేను టీసీఎస్‌లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అద్దె ఇల్లు దొరికింది. వేరే కంపెనీలో ఉన్న నా స్నేహితుడికి ఉండేందుకు 2 నెలలు పాటు అద్దె ఇల్లు దొరకలేదు. అప్పటి నుంచి బెంగళూరుకు దూరంగా ఉంటున్నా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి👉 హీరా గోల్డ్ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్ -
క్రెడిట్‌పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్ మస్క్.. కోర్టులో దావా
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్‌ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అయినా ఆర్థిక కష్టాల్లో సతమతమవుతోంది. ఎంతలా అంటే చివరికి తమ కార్యాలయాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ట్విటర్ 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని తన కార్యాలయాలకు డిసెంబర్ అద్దె 3.36 మిలియన్ డాలర్లు జనవరి అద్దెకు 3.42 మిలియన్ డాలర్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో భవన యజమాని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్ఎల్సీ, కోర్టును ఆశ్రయించింది. కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో దావా వేసింది. కార్యాలయాన్ని అద్దెకు ఇస్తున్న సమయంలో ట్విటర్ నుంచి శ్రీ నైన్ మార్కెట్ 3.6 మిలియన్ డాలర్ల ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ను పూచీకత్తుగా తీసుకుంది. ఇటీవల ట్విటర్ అద్దె చెల్లించకపోవడంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అద్దె బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను సైతం 10 మిలియన్ డాలర్లకు పెంచేలా ఆదేశించాలని కోరింది. ట్విటర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సంస్థలోని సగం మంది సిబ్బందిని తొలగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఇతర కార్యాలయాల్లో అద్దెను నిలపడంతో పాటు జెట్, చార్టర్ వంటి కొన్ని బకాయి బిల్లులను చెల్లించేందుకు కూడా నిరాకరించాడు. మొత్తానికి గత బకాయిలను చెల్లించడానికీ అంగీకరించడం లేదు. చదవండి: ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్!