Man Trying To Give His Toilet For Rent In Scotland: ఆఫీస్‌ కోసం టాయిలెట్‌ అద్దెకు ఇవ్వబడును.. వారానికి అద్దె.. - Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ కోసం టాయిలెట్‌ అద్దెకు ఇవ్వబడును.. వారానికి అద్దె..

Published Mon, Aug 23 2021 10:50 AM | Last Updated on Mon, Aug 23 2021 1:23 PM

Man Trying To Give His Toilet For Rent In Scotland - Sakshi

అద్దెకు ఇస్తానన్న టాయిలెట్‌..

గ్లాస్గో : ఖాళీగా పడుందని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ! ఏకంగా టాయిలెట్‌నే అద్దెకు ఇవ్వడానికి చూశాడో వ్యక్తి. అది కూడా ఆఫీసు కోసం. వివరాలు.. స్కాట్‌లాండ్‌, గ్లాస్గోలోని పాట్రిక్‌కు చెందిన ఓ వ్యక్తి గమ్‌ట్రీ అనే ప్రాపర్టీ సైట్‌లో కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న టాయిలెట్‌ను అద్దెకు ఇస్తున్నానని.. వైఫై, రిఫ్రిజిరేటర్‌, టీ కెటిల్‌, బల్ల, కుర్చీ ఇలా కొన్ని రకాల వసతులు అందులో ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించాడు. ఓ వ్యక్తి ఆఫీసు నిర్వహించుకోవటానికి బాగుంటుందని పేర్కొన్నాడు. ఆ టాయిలెట్‌ వాడుకోవటానికి వారానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌లు(5,070 రూపాయలు) చెల్లించాలని తెలిపాడు.

తాను సోమవారం-శుక్రవారం.. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటానని, ఎక్కువ కాలానికి అద్దెకు తీసుకునే వాళ్లకు తాళం చెవులు కూడా ఇస్తానన్నాడు. ఈ ప్రకటనను చదివిన నెటిజన్లు సదరు వ్యక్తిపై సీరియస్‌ అయ్యారు. టాయిలెట్‌ను అద్దెకివ్వటమేంటి.. దానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌ల అద్దేంటని మండిపడ్డారు. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి తన పోస్ట్‌ను డిలేట్‌ చేసేశాడు.

చదవండి : ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో..  ఛీ అది కలిపావేంట్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement