Toilet
-
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
జగిత్యాల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే జిల్లా అధికారులు నిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది. బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు టీసీలు ఇస్తే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
స్కూళ్ల మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి వారం వారి పరిధిలోని స్కూళ్లలో మరుగుదొడ్లను పరిశీలించి, ఆ ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ప్రతి సోమవారం, గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడి మరుగుదొడ్లు, యూరినల్స్ గదుల్లో శుభ్రతకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేసే బాధ్యతను సచివాలయాల ఉద్యోగులకు అప్పగిస్తూ ప్రభుత్వం గత 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధులకు చాలాచోట్ల ఆ ఉద్యోగులు హాజరు కావడం లేదన్న సమాచారంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం కూడా ఈ మేరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో ఈ సమాచారం మరోసారి పంపారు. -
129 మందికి ఒకటే మరుగుదొడ్డి
రాయికల్(జగిత్యాల): ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 129 మంది విద్యార్థులు.. కానీ ఇంతమందికి ఒక్కటే మరుగుదొడ్డి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్‌లోని గడికోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 129 మంది చదువుకుంటున్నారు. వీరిలో బాలికలు 65 మంది, బాలురు 64 మంది ఉన్నారు.అందరికీ కలిపి ఒకే మరుగుదొడ్డి ఉండటంతో.. దానిని 65 మంది బాలికలు రోజూ క్యూలో నిలబడి వినియోగించుకోవలసి వస్తోంది. బాలురు ఆరుబయటే మూత్రవిసర్జన చేస్తున్నారు. పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చుంటున్నారు. తరగతి గదులు కూడా సరిపడా లేవు. ఎమ్మెల్యే సంజయ్‌కుమా ర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించి యుద్ధప్రతిపాదికన మరుగుదొడ్లు, బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీని వాస్ మాట్లాడుతూ.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని స్పష్టం చేశారు. -
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
స్పైస్‌జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్‌జెట్ విమానం టాయిలెట్స్‌లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్‌లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్‌లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్‌జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్‌లు చేతబట్టి బాత్రూమ్లు శుభ్రం చేయడం కనిపిస్తుంది. కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి. గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్ చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్ Shocker from Karnataka | Students found cleaning toilet in a school in Shivamogga pic.twitter.com/iZhe66gNRC — NDTV (@ndtv) December 28, 2023 -
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్‌లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్‌లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
ఫ్లోర్లు ఊడ్చా..టాయ్లెట్లు క్లీన్ చేశా...కానీ: హీరోయిన్
జీవితంలో అనుకున్నది సాధించాలంటే..అనేక కష్టనష్టాల్ని భరించాలి. ఆటుపోట్లను తట్టుకుని రాటు దేలాలి. అపుడు మాత్రమే అందరికంటే మిన్నగా, ఉన్నతంగా నిలుస్తాం. అందులోనూ సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే మరింత కష్టపడాలి. దేశం ఏదేనా.. ప్రాంతం ఏదైనా సినీ హీరోయిన్లకు ఇదే పరిస్థితి...! మహీరా ఖాన్ పాకిస్తాన్లో పాపులర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.'ఖిరాద్'టీవీ సీరియల్‌తో పాటు, ఫవాద్ ఖాన్‌తో నటించిన హమ్ సఫర్తో మరింత పాపులరయ్యారు. 2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్‌తో రెండో వాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతోపాటు మహిరా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పైకి ఎదగడానికి పడిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఒకానొక సమయంలో ఫ్లోర్లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని గతంలో ఒక మ్యాగజైన్ ఇచ్చిన గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం, ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు. నిజానికి చేతిలో ఒక్క డాలర్ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని సోదరుడితో కలిసి సర్దుకున్న వైనాన్ని వివరించారు. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డా సెలబ్రిటీ జీవితంలో కఠినమైన విమర్శలు ఎంత అనివార్యమైన భాగమని పేర్కొన్నారు. తాను కూడా బైపోలార్ డిజార్డర్ అనే 'మానిక్ డిప్రెషన్'తో పోరాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా "రయీస్" చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఇటీవల వెల్లడించారు. దాదాపు ఆరేడు సంవత్సారలు యాంటి డిప్రెసెంట్స్‌తో మేనేజ్చేసినట్టు తెలిపారు. .తన ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు చాలా గొప్ప విషయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ ఆశాభావంతో ముందుకు సాగాలి. తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్ ఒకటుందని అందరికీ తెలియాలనే తానే విషయాలన్నీ షేర్ చేస్తున్నాన్నారు సలీం కరీమ్‌తో మహిరా ఖాన్ రెండో వివాహం ఈ ఏడాదిల అక్టోబర్ 2 మహీరా ఖాన్ , తన చిరకాల మిత్రుడు సలీం కరీంని రెండో వివాహం చేసుకుంది. అయితే అంతకు ముందు 17 ఏళ్ల వయసులో అలీ అక్సారిని పెళ్లాడింది. అజ్లాన్ అనే కుమారుడున్నాడు. అయితే 2015లో కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. అటు అలీ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్‌సఫర్‌లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్‌లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో జతకట్టనుంది. -
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
రోడ్ ట్రిప్‌లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త పేరు బ్రూనో టామ్చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్‌కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్‌కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్ కోసం దిగవలసి వచ్చింది. ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్‌కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు -
మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!
బీరు అంటే మందుబాబులకు ఎంత ఇష్టం చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి బీరుని మూత్రంతోనా..ఛీ యాక్ అంటారేమో! అక్కడ సింగపూర్ జనాలు మాత్రం ఈ బీర్ చాలా రుచిగా ఉందని ఎగబడుతున్నారట. ఇలాంటి బీరు కావాలని అంటున్నారట. వాళ్లకి ఈ బీరు ఎలా తయారవ్వుతుందో తెలయదనుకోకండి. ఆ బీరుని ఉత్పత్తి చేసిన కంపెనీలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయట. పైగా పర్యావరణ హితం కోసంమే ఇదంతా చేస్తున్నారట సింగపూర్ అధికారులు! సింగపూర్ జాతీయ నీటి ఏజెన్సీ సహకారంతో న్యూబ్రూ అనే కంపెనీ మూత్రంతో బీరుని తయారు చేస్తుంది. అంతేగాదు సూపర్ మార్కెట్లో బ్రూవర్క్ట్జ్ అనే బ్రాండ్‌తో ఈ బీరుని విక్రయాలు జరుపుతుంది. జనాలు కూడా ఎగబడి కొంటున్నారట. పైగా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారట కూడా. అయినా కూడా జనాలు కొనడం విశేషం. మొదట్లో వాట్? అని ఆశ్చర్యపోయి.. చిరాకు పడ్డా ఆ తర్వాత ఈ బీరే చాలా టేస్టీగా ఉందని కొట్టుండడం విచిత్రం. ఎందుకిలా అంటే.. నీటి భ్రదతను మెరుగుపరిచేందుకు శుద్ది చేసే కర్మాగారాల సాయంతో ప్రవహించే మరుగునీటిని రీసైకిల్ చేసి తాగే 'నీవాటర్గా' మారుస్తారు. ఈ శుద్ది చేసిన మరుగునీటి వినియోగం, ప్రాముఖ్యతపై సింగపూర్వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సరికొత్త బీరును తయారుచేస్తున్నారట. తొలుత మరుగు నీటిని ప్రాసెస్ చేయాలనే ఆలోచన చాలామంది తిరస్కరించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరులు దారుణంగా క్షీణిస్తున్నాయని సర్వేలు తెలిపాయి. అలాగే ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం 2.7 బిలియన్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే సింగపూర్ అధికారులు ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయల్ వంటి దేశాలు మరుగునీటిని మంచి నీటిగా మార్చి వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయట. త్వరలో ఈ దేశాల సరసన యూఎస్ కూడా చేరనుందట. (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోగల కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్‌లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్-2 ఓటీటీ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగిన రియాలిటీ షో సోమవారం ముగిసింది. ఈ సీజన్లో ఎల్విశ్ యాదవ్ విన్నర్‌గా నిలిచాడు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన ఎల్విశ్ యాదవ్ విన్నర్‌గా నిలవడం విశేషం. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మనం చేసే ఏ పని అయినా సరే అవమానంగా, చిన్నదిగా భావించకూడదని అన్నారు. (ఇది చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా) 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2'లో కంటెస్టెంట్స్‌లో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే సమయంలో ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి. ఈ సందర్భంగా సల్మాన్ ఆమెను ప్రశంసించారు. హౌస్‌లో ఆమె ఉన్నప్పుడు టాయిలెట్లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచడం పట్ల పూజాను కొనియాడారు. ప్రపంచంలోని ఏ పనిని చిన్నదిగా భావించకూడదని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా తాను జైలు, పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రం చేశానని గుర్తు చేసుకున్నారు. 'బిగ్ బాస్' గత సీజన్లలోని కంటెస్టెంట్లకు గుణపాఠం చెప్పేందుకు తానే స్వయంగా హోస్‌లోకి ప్రవేశించి టాయిలెట్లను శుభ్రం చేయాల్సి వచ్చిందని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోని వాష్‌రూమ్స్ సీజన్లో పూజ శుభ్రం చేసినట్లు తానెప్పుడూ చూడలేదన్నారు. కాగా.. కృష్ణజింకలను వేటాడిన కేసుతో పాటు హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడే వరకు సల్మాన్ చాలా రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్ కుమార్) బిగ్ బాస్ OTT 2 గ్రాండ్ ఫినాలే 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2' గ్రాండ్ ఫినాలే ట్రోఫీ కోసం అభిషేక్ మల్హాన్, ఎల్విష్ యాదవ్ పోటీలో నిలవగా చివరికి ఎల్విష్ యాదవ్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ట్రోఫీని గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అతను నిలిచాడు. -
వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్
ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు ఎంతో మంది అవమానించారు 'నేను టాయిలెట్ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) ఆ యాడ్ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ ప్లాన్ న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటన్నారని సమాచారం -
టాయిలెట్ కోసం వందే భారత్ రైలెక్కి.. ఇరుక్కుపోయిన వ్యక్తి..
ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల కాలం నడుస్తోంది. వేగంగా ప్రయాణించగలిగే ప్రత్యేకత కలిగిన ఈ సెమీ హైస్పీడ్ రైలుకీ రోజురోజుకీ వీటికి ప్రజాదరణ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. .అయితే రాళ్లు రువ్వడం, ఆవు, గేదేలు గుద్దుకొని రైలు దెబ్బతినడం వంటి విషయాలతో తరుచూ వందే భారత్ రైలు వివాదాల్లో నిలుస్తుంది. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది.. ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కినందుకు ఏకంగా రూ. 6 వేల మూల్యం చెల్లించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటూ డ్రైఫ్రూట్ బిజినెస్ చేస్తూంటాడు. ఇతనికి హైదరాబాద్‌తో పాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో షాపులున్నాయి. ఈ క్రమంలో జూలై 15న తన భార్య 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి భోపాల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి సొంతూరు సింగరౌలీకి రాత్రి 8.20కు రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాంపై వేచి ఉన్నారు.అయితే ఆ సమయంలో అబ్దుల్‌కు అర్జెంట్‌గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఇండోర్ వెళ్లే వందే భారత్ రైలులోని టాయిలెట్లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన అనంతరం బయటకు రావడంతో.. అప్పటికే రైలు డోర్లు మూసుకుపోయి భోపాల్ స్టేషన్ నుంచి కదిలింది. చదవండి: ఎంత విషాదం.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు దీంతో ఆందోళన చెందిన అబ్దుల్, టీసీలు, కోచ్‌ల్లోని పోలీస్ సిబ్బందిని సంప్రదించి సాయం కోరాడు. అయితే ట్రైన్ డ్రైవర్ మాత్రమే డోర్స్ తెరిచేందుకు వీలు ఉంటుందని చెప్పడంతో అతడు డ్రైవర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. చివరకు టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్ రూ.1020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తర్వాత స్టేషన్ ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి.. భోపాల్‌కు రూ. 750 చెల్లించి బస్సులో వెళ్లాడు. మరోవైపు భోపాల్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న అబ్దుల్ భార్య, కుమారుడు సైతం ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెంది సొంతూరు సింగ్రౌలీ వెళ్లే రైలు ఎక్కకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో వారు బుక్ చేసిన రూ.4,000 విలువైన రిజర్వేషన్ టిక్కెట్లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయి. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ ఖాదిర్ ఈ విధంగా సుమారు రూ.6,000 మూల్యం చెల్లించుకున్నాడు. -
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
ఇవేం టాయిలెట్లు... మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా
హుస్నాబాద్: టాయిలెట్లు కంపుకొడుతున్నాయి.. మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా అని కళాశాల అధ్యాపకులపై హుస్నాబాద్ సివిల్ కోర్టు జూనియర్ జడ్జి శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లోని టాయిలెట్ల నిర్వహణపై శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని కళాశాలల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నింటికి తాళాలు వేసి ఉండటం చూసి విస్మయం వ్యక్తం చేశారు. అధ్యాపకుల టాయిలెట్లు శుభ్రంగా ఉండి, విద్యార్థులవి అధ్వానంగా ఉండటంపై మండిపడ్డారు. కళాశాలకు ఇంకా విద్యార్థులు రావడం లేదని, అందుకే టాయిలెట్లు శుభ్రం చేయలేదని అధ్యాపకులు తెలిపారు. పిల్లలు వస్తేనే టాయిలెట్లు శుభ్రం చేస్తారా అని జడ్జి మందలించారు. కళాశాలలకు విద్యార్థులు వస్తేనే మీకు ఉద్యోగాలు ఉంటాయన్న విషమయం గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ వస్తా, పరిస్థితి ఇలాగే ఉంటే హైకోర్టుకు రిపోర్టును పంపుతానని హెచ్చరించారు. ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ కళాశాలలో.. సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను సిద్దిపేట కోర్టు సీనియర్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. వీటి పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. -
స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. షాకైన టీచర్లు
సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా? పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్‌కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు. పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్సైడర్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు. 11 ఏళ్ల పిల్లలు కూడా.. స్విట్జర్లాండ్‌కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్‌లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు. టీచర్లు ఏమంటున్నారంటే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. -
Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో ఉపయోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ చార్జీలను నేటి నుంచే(జూన్2) వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్లో టాయిలెట్ వాడకానికి 5 రూపాయలు, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. కానీ ఇకపై వాటికి డబ్బులు వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీల్లో కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కానుంది. ఇక ఇటీవలె మెట్రో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఉండగా.. ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అదే విధంగా గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్ సేవర్ ఆఫర్ ధరలను సైతం రూ.100కు పెంచింది. చదవండి: తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్