Jubilee Hills One Drive In Food Court Cell Phone At Toilet Update - Sakshi
Sakshi News home page

Jubilee Hills One Drive In Food Court: వెలుగులోకి సంచలన విషయాలు

Published Thu, Sep 23 2021 11:19 AM | Last Updated on Thu, Sep 23 2021 3:38 PM

Jubilee Hills One Drive In Food Court Cell Phone At Toilet Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో తన సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  నిందితుడు హౌజ్ కీపర్ బెనర్జీనే స్పై క్యామ్‌ పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్పై క్యామ్‌లో ఐదు గంటల డేటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 
(చదవండి: జూబ్లీహిల్స్‌: ఫుడ్‌కోర్ట్‌ టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి.. వీడియోలు రికార్డింగ్‌)

ఇక ఈ వ్యవహారంలో వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వన్ డ్రైవ్ ఇన్‌లో సీసీ కెమెరా బ్యాక్ అప్ లేకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలో తనిఖీలు చేశారు. సీక్రెట్ కెమెరాల్లో 20 మంది అమ్మాయిల నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెనర్జీ పై నిర్భయ కేసు నమోదు చేశారు.

చదవండి: అమెజాన్‌లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement