చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు.
దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
Comments
Please login to add a commentAdd a comment