చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది.
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్‌లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment