Tarun Vijay
-
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
హిమాలయాల్లో మంచుమనిషి.. యతి పాదముద్రలు లభ్యం!
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాల్లో తొలిసారిగా మంచుమనిషి ‘యతి’ పాదముద్రలను కనుగొన్నట్టు భారత సైన్యం సోమవారం ట్వీట్ చేసింది. ఈ నెల 9వ తేదీన హిమాలయాల్లోని మాకులా బేస్ క్యాంప్ సమీపంలో భారత ఆర్మీకి చెందిన పర్వతాధిరోహణ బృందం పౌరాణిక మృగంగా భావించే యతి పాదముద్రలు కనుగొన్నదని, యతీ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయని, మాకులా-బరూన్ జాతీయ పార్కు సమీపంలో అత్యంత అరుదుగా ఈ మంచుమనిషి కనిపించేదని ఆర్మీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. భారత ఆర్మీ ప్రకటనపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, యతీని ఆర్మీ మృగంగా ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అభినందనలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. భారత ఆర్మీ పర్వతాధిరోహణ బృందానికి నా సెల్యూట్. కానీ, ఒక భారతీయుడిగా యతిని మృగంగా అభివర్ణించకండి. కావాలంటే మంచుమనిషి అని పేర్కొనండి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యతీ పదం ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు జోకులు వేస్తున్నారు. ‘సర్. యతీని స్నోపర్సన్‌గా పేర్కొనండి. ఎవరికీ తెలుసు. ఆర్మీ కనుగొన్న పాదముద్రలు యతీ భార్యవి కావొచ్చు. లింగభేదాన్ని గుర్తించాల్సిన అవసరముంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. భారతీయ భాషలో రాయండి.. ఆంగ్లంలో రాసి యతీని అవమానించకండి అంటూ మరొకరు సెటైర్ వేశారు. మోడీజీకి ఓటు వేసేందుకు యతీ బయటకు వచ్చినట్టుందని ఒకరు కామెంట్ చేయగా.. ఆ పాదముద్రలు మంచులో మార్నింగ్ వాక్కు వెళ్లిన అమిత్ షావి అయ్యుండవచ్చునని మరొకరు చమత్కరించారు. Congratulations, we are always proud of you. salutes to the #IndianArmy Moutaineering Expedition Team. But please, you are Indian, dont call Yeti as beast. Show respect for them. If you say he is a 'snowman'. — Chowkidar Tarun Vijay (@Tarunvijay) 29 April 2019 -
విజయ్‌పై మండిపడ్డ చిదంబరం
న్యూఢిల్లీ: దక్షిణాది ప్రజలపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం స్పదించారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన తరుణ్ విజయ్‌పై మండిపడ్డారు. భారతీయులంటే కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ సభ్యులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ మాటల్లో మేము అంటే ఎవరని ప్రశ్నించారు. మేము నల్లవారితో కలిసి ఉంటున్నాం అన్నారని, మేము అంటే ఎవరని చిదంబరం ప్రశ్నించారు. కేవలం బీజేపీ/ఆరెస్సెస్ సభ్యులు మాత్రమే భారతీయులని ఆయన భావిస్తున్నారా? అని నిలదీశారు. అటు డీఏంకే కూడా తరున్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. అయితే ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్యం మాజీ సంపాదకుడైన విజయ్ తాను అలా అనలేదని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. కాగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై నోరు పారేసుకున్నారు.దక్షిణాది ప్రజలపై జాత్యహంకార వ్యాఖలు చేశారు. ఇండియా జాతి వివక్ష చూపే దేశం కాదంటూనే...నల్లవారైన దక్షిణ భారతీయులతో ఉత్తరాది వారు కలిసి ఉండటం లేదా... అని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు నల్లగా ఉంటారనీ అయినా వారిని అంగీకరిస్తున్నామంటూ దుమారాన్ని రాజేశారు. నోయిడాలో ఇద్దరు నైజీరియా విద్యార్థులపై జరిగిన దాడి ఘటన గురించి చేపట్టిన చర్చలో మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
దక్షిణ భారతీయులంతా నల్లవారే
తరుణ్ విజయ్ నోటి దురుసు వ్యాఖ్యలు ► బీజేపీ మాజీ ఎంపీ తీరుపై నెటిజన్ల మండిపాటు ► ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్న కాంగ్రెస్, డీఎంకే న్యూఢిల్లీ: భారత్‌లో జాత్యహంకారం లేదంటూనే బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులంతా నల్లవారే అంటూ వివక్షపూరితంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇటీవల నోయిడాలో ఆఫ్రికన్లపై జరిగిన దాడికి సంబంధించి ఓ టీవీ చానెల్ లో జరిగిన చర్చలో తరుణ్ మాట్లాడుతూ.. ‘భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. అదే నిజమైతే దక్షిణ భారతీయులతో ఎలా కలసి ఉంటాం. అక్కడ ఎక్కువ మంది నల్ల రంగులో ఉంటారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు నల్లగా ఉంటారనీ అయినా వారితో ఉంటున్నాం. నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మా చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు’అని ఆయన వ్యాఖ్యానించారు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని కామెంట్లు పెట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. దక్షిణ భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని.. కేవలం భారత్‌లో జాతివివక్ష లేదని, విభిన్న సంస్కృతులు, విభిన్న రంగుల వారు కలిసి ఉంటామని చెప్పడమేనని ట్విట్టర్లో విజయ్ పేర్కొన్నారు. ఒకవేళ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. తరుణ్ వ్యాఖ్యలపై విమర్శలు.. విజయ్ మాటలు తమను షాక్‌కు గురిచేశాయని.. బీజేపీ వివక్షను ఇది ప్రతిబింబించిందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. దక్షిణ భారతీయులంతా నల్లగా ఉండరన్న విషయాన్ని తరుణ్ గుర్తుంచుకోవాలని డీఎంకే నేత ఇలంగోవన్ , నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బు అన్నారు. అయితే తరుణ్ విజయ్‌కు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆయన మాటలను వక్రీకరించారని పేర్కొంది. -
'కేరళ, కర్ణాటక ప్రజలంతా నలుపు కాదు'
చెన్నై: జాతివివక్షపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులోని ప్రజలందరూ నల్లజాతీయులు కాదని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే కరుణానిధి, దివంగత నాయకురాలు జయలలిత తెల్లగా(ఫెయిర్) ఉంటారని చెప్పారు. తాము జాత్యహంకారులం అయితే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రేగాయి. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. 'నేను మాట్లాడిన మాటలు సరిగా అన్వయించలేకపోయాను. దీనికి చాలా బాధపడుతున్నా. నా మాటలు బాధ పెట్టినందుకు క్షమాపణ చెబుతున్నాన'ని తరుణ్ విజయ్ ట్విటర్ లో పేర్కొన్నారు. -
బీజేపీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత దేశంలో జాతివివక్ష లేదంటూ బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. దక్షిణ భారతీయులపై జాత్యహంకార వ్యాఖలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. ఎందుకంటే మేము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మాకే కనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తాం. మాలోనూ, మన చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ భారతీయులు పరస్పరం సంఘర్షించుకుంటారు. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బిహారీలపై దాడులు జరిగాయి. మరాఠీలను బిహార్ లో బెదిరించారు. ఇవన్నీ జాత్యహంకార దాడులు కాద'ని తరుణ్ విజయ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రేగుతున్నాయి. భారత్ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని, దక్షిణాది వారితో తమకు ఎటువంటి సమస్యలు లేవని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
ఉపదేశాలతో అంటరానితనం పోదు
- ఆచరణలో చేసి చూపించాలి - ఆర్ఎస్ఎస్ సహ కార్యవాహక్ కృష్ణగోపాల్ ఉద్ఘాటన సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సమాజంలో అంటరానితనం నివారణ గురించి ఉపదేశాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆచరణలో చేసి చూపించాలి. దళితులు, బలహీనవర్గాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారానే అంటరానితనం నివారణ సాధ్యమవుతుంది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సహకార్యవాహక్ కృష్ణ గోపాల్ ఉద్ఘాటించారు. స్వామి శ్రద్ధానంద జీవిత విశేషాలతో ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్ శాస్త్రి రచించిన ‘అసలు మహాత్మా’ హిందీ అనువాదం ‘అసలీ మహాత్మా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలో జరిగింది. పుస్తకాన్ని ప్రముఖ రచరుుత ప్రొఫెసర్ రాజేంద్ర జిగ్న్యాసు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితోపాటు పలువురు మాజీ ఎంపీలు, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణగోపాల్ ప్రసంగిస్తూ.. వేదాల్లో, పురాణాల్లో అంటరానితనం లేనేలేదని గుర్తు చేశారు. హిందూమతంలోని అంటరానితనాన్ని తొలగించేందుకు, వేదాలను ప్రజల వద్దకు చేర్చేందుకు స్వామిశ్రద్ధానంద విశేష కృషి చేశారని చెప్పారు. ‘‘అంటరానితనం మంచిది కాదని అందరం చెబుతుంటాం. కానీ మన రోడ్లను శుభ్రపర్చే పారిశుధ్య కార్మికులను ఎప్పుడైనా మన ఇంటికి భోజనానికి పిలుస్తామా?’’ అని ప్రశ్నించారు. మార్పు మననుంచే మొదలవాలని.. అప్పుడే సమాజం మారుతుందని, స్వామి శ్రద్ధానంద చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని చెప్పారు. స్వామి శ్రద్ధానంద జీవితంపై శాస్త్రి రాసిన పుస్తకం బాగుందని రాజేంద్ర జిగ్న్యాసు ప్రశంసించారు. హిందూమత పరిరక్షణ, వేద విద్యావ్యాప్తికోసం స్వామి శ్రద్దానంద ఎంతో కృషి చేశారన్నారు. సూఫిజం మూలంగా హిందూమతానికి ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు తరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాల్లో ఈ పుస్తకం ఉండాల్సిన అవసరమెంతరుునా ఉందన్నారు. వివిధ కారణాలవల్ల ఇతర మతాల్లో చేరినవారిని తిరిగి హిందూమతంలోకి ఆహ్వానించేందుకు శుద్ధి ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మా అనే పదానికి నిజమైన అర్హుడు స్వామి శ్రద్ధానంద అని ఎం.వి.ఆర్ శాస్త్రి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ స్వయంగా స్వామి శ్రద్ధానందను మహాత్మా అని సంబోధించారని గుర్తు చేశారు. స్వామి శ్రద్ధానంద దళితుల అభివృద్ధికి చేసిన సేవల గురించి ఎవరికీ తెలియదని, నిజమైన మహాత్ములను వెలుగులోకి తెచ్చేందుకే తాను ఈ పుస్తకం రాశానని చెప్పారు. -
ఇది పరీక్షా కాలం.. మనల్ని మనం రక్షించుకోవాలి
దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేది బీజేపీయే బీజేపీ శ్రేణులకు తరుణ్ విజయ్ పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశానికి ఇప్పుడున్నది అసలు సిసలైన పరీక్షాకాలమని, మనల్ని మనం రక్షించుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ తరుణ్ విజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తర్వాత నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో (‘వై బీజేపీ’ పేరిట) జరిగిన మేథావుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని, మోడీయే ప్రధాని కావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యువత, బీజేపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారనుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు తేదీ అయిన మే 16.. బహుశా కాంగ్రెస్ పాలిట కాళరాత్రి అవుతుందన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా రెండంకెలకే పరిమితం కాబోతోందని చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అనూహ్య విజయాలు సాధించనుందని, దానికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని పార్టీ కోరుకోలేదని, యువత కోరుకుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నితిన్ గడ్కరీ పర్యటన రద్దు: బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ అభివృద్ధి- అవకాశాలపై బీజేపీ లీగల్ సెల్ శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన సదస్సుతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది.