న్యూఢిల్లీ: దక్షిణాది ప్రజలపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం స్పదించారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన తరుణ్ విజయ్‌పై మండిపడ్డారు. భారతీయులంటే కేవలం బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ మాటల్లో మేము అంటే ఎవరని ప్రశ్నించారు. మేము నల్లవారితో కలిసి ఉంటున్నాం అన్నారని, మేము అంటే ఎవరని చిదంబరం ప్రశ్నించారు. కేవలం బీజేపీ/ఆరెస్సెస్ సభ్యులు మాత్రమే భారతీయులని ఆయన భావిస్తున్నారా? అని నిలదీశారు.
అటు డీఏంకే కూడా తరున్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక పాంచజన్యం మాజీ సంపాదకుడైన విజయ్ తాను అలా అనలేదని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు.
కాగా ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై నోరు పారేసుకున్నారు.దక్షిణాది ప్రజలపై జాత్యహంకార వ్యాఖలు చేశారు. ఇండియా జాతి వివక్ష చూపే దేశం కాదంటూనే...నల్లవారైన దక్షిణ భారతీయులతో ఉత్తరాది వారు కలిసి ఉండటం లేదా... అని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు నల్లగా ఉంటారనీ అయినా వారిని అంగీకరిస్తున్నామంటూ దుమారాన్ని రాజేశారు. నోయిడాలో ఇద్దరు నైజీరియా విద్యార్థులపై జరిగిన దాడి ఘటన గురించి చేపట్టిన చర్చలో మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక‍్తం చేసిన సంగతి తెలిసిందే.
విజయ్‌పై మండిపడ్డ చిదంబరం
Published Sat, Apr 8 2017 2:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement