కేంద్ర బడ్జెట్‌ 2024-25: ఎవరేమన్నారంటే.. | union budget 2024: parties and leaders political reactions | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ 2024-25: ఎవరేమన్నారంటే..

Published Tue, Jul 23 2024 1:27 PM | Last Updated on Tue, Jul 23 2024 3:24 PM

union budget 2024: parties and leaders political reactions

ఢిల్లీ:  2024-25 ఏడాదికి సంబంధించి మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మి శ్రమ స్పందనలు  వస్తున్నాయి. బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారో వారి మాటల్లోనే..

సామాన్య ప్రజలకు ఏం లేదు: రాహుల్‌ గాంధీ
కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి.. మిత్రపక్షాలకు ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందని మండిపడ్డారు. బడ్జెట్‌ వల్ల సాధారణ ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ఇది గత బడ్జెట్‌ల కాపీ పేస్ట్‌ మాత్రమేనని చెప్పారు.  

మాజీ ఆర్థిక మంత్రి పి. చి​దంబరం స్పందించారు. లోక్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆర్థిక​ మంత్రి నిర్మలా సీతారామన్‌ చదివినట్లు తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే.. 

‘కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలోని 30 పేజీలో  వివరించిన ఉపాధి సంబంధిత పోత్సాహకం (ఈఎల్‌ఐ)ను బడ్జెట్‌లో పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. మేనిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ప్రతి ఒక్క అప్రెంటీస్‌కు అలవెన్స్‌తో కూడిన అప్రెంటీస్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సంతోషం. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఇంకా కొన్ని ఇతర అంశాలను ఆర్థిక మంత్రి కాపీ చేసి ఉంటే బాగుండేది’ అన్నారు. 
 

 

కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘కేంద్రం ప్రవేశపెట్టిన  బడ్జెట్‌ ప్రజల కోసం కాదు.. ప్రభుత్వాన్ని కాపాడుపోవటం కోసమే’అని అన్నారు.

2024-25 బడ్జెట్ ‘పీఎం సర్కార్‌ బచావో యోజనా’ అని శివసేవ (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది విమర్శలు చేశారు. ఈ బడ్జెట్‌ను గమనిస్తే.. ఐదేళ్ల తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ప్రవేశపెట్టిందిగా ఉంది. బీజేపీ మిత్రపక్షాల సంతోషం కోసం ఈ బడ్జెట్‌ రూపొందించారు.

 

కేంద్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన..

  • తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యం.
  • రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు
  • బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం.
  • తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే.
  • ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు
  • అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం
  • ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు.
  • రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు.
  • ఐఐఎం సహా నేషనల్  ఇన్ స్టిట్యూట్స్  వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు
  • తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు
  • మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదు.
  • తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు
  • తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండుస్తున్నా.
  • తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి
  • 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు,  బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.  
  • స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది
  • ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోంది
  • పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు
  • ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు
  • 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు.
  • ఆంధ్రప్రదేశ్‌కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు
  • సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన,  వారు బాగుండాలని కోరుకుంటున్నాం. 
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన  ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు.
  • రాజధాని అమరావతి కోసం, పోలవరంతో, పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు
  • ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు.
  • ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు, సంతోషమే.
  • కానీ ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ మాట్లాడారు. రైతుల కోసం ఎన్డీయే ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం వాగ్దానాల వల్ల  రైతులు ఏం సాధించారు?. ఈ బడ్జెట్‌లో ఎంఎస్‌పీ ప్రస్తావన లేదు. కిసాన్‌ నిధిని పెంచలేదు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలకు మాత్రం బీజేపీ భారీ కేటాయింపులు ప్రకటించింది.


‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ‘పెహ్లీ నైక్రి పక్కి’అని ప్రతిపాధించిన   అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను  ఆర్థిక మంత్రి కాపీ చేసి కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు’అని కాంగ్రెస్‌ నేత జైరాం  రమేష్‌ విమర్శలు  చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement