Union Budget
-
అణు విద్యుత్తు ఆశలు... బారెడు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో టెక్నాలజీ రంగంలో పెద్ద ప్రతిపాదనలే చేశారు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ‘అణుశక్తి’ మిషన్, ‘కృత్రిమ మేధ’ మిషన్. వీటితోపాటు ప్రైవేట్ రంగంలో టెక్నాలజీల అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ కేటాయింపులు పెంచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో మౌలిక వసతులను, ఎంబీబీఎస్ సీట్లను గణణీయంగా పెంచుతామని కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ స్వాగతించదగ్గ ఆలోచనలే. కానీ వీటి అమలుకు నిర్దేశించుకున్న కాలావధులు, ఆర్థిక అంశాల విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తమవుతాయి. ఎందు కంటే, ఈ అంశాలేవీ కొత్తవి కావు, నిరుటి బడ్జెట్లో ప్రస్తావించినవే. పేరు మార్చితే కొత్త పథకమా?అణు శక్తి మిషన్ సంగతి చూద్దాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్) అభివృద్ధికి పరిశోధనలు చేపట్టడం ఈ మిషన్ ఉద్దేశం. భారీ అణు విద్యుత్ కేంద్రాల స్థానంలో ఎస్ఎంఆర్లను ఎందుకు ఎంచుకున్నారు అన్నదానికి శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గించుకునేందుకు అన్న సమాధానం వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి చెప్పినట్లు, ‘2047 నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని’ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సుమారు రూ. 20,000 కోట్లతో పూర్తి స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా ఐదు ఎస్ఎంఆర్లు నిర్మిస్తామనీ, 2033 నాటికల్లా వీటితో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామనీ మంత్రి వివరించారు. ఇందుకోసం అణుశక్తి విభాగానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు మాత్రం చేయలేదు. గతేడాది మొత్తమే ఈ ఏడాదీ ఉండనుంది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎస్ఎంఆర్లపై ఆర్థిక శాఖ మంత్రి కేవలం తన ఉద్దేశాన్ని మాత్రమే వ్యక్తం చేశారూ అని!వాస్తవానికి ఎస్ఎంఆర్ల ఆలోచన కొత్తది కాదు. 2024 బడ్జెట్ ప్రసంగంలోనూ అణుశక్తి విస్తృత వినియోగం కోసం ఎస్ఎంఆర్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. భారత్ స్మాల్ రియాక్టర్స్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని నామకరణం కూడా చేశారు. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి ప్రక్రియ మొదలైందని 2024 డిసెంబరులో ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన కూడా చేసింది. ‘వీటి తయారీలో భాగస్వాములవుతామని చాలా దేశాలు ఆసక్తి చూపాయి’ అని కూడా చెప్పింది. ఈ రియాక్ట ర్లను అక్కడికక్కడే విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగల రంగాల్లో ఉపయోగి స్తారని చెప్పారు. అణుశక్తి విభాగం ఎస్ఎంఆర్ల అభివృద్ధి ప్రక్రి యను ఇప్పటికే ప్రారంభించి ఉంటే, వాటికి ఈ ఏడాది బడ్జెట్లోనే నిధుల కేటాయింపు జరిగి ఉండాలి. కానీ 2025 బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఎస్ఎంఆర్కు ముందు జోడించిన భారత్‌ను వదిలేశారు. బీఎస్ఎంఆర్ అని కాకుండా ఎస్ఎంఆర్ అనడం ద్వారా కొత్త అణు రియాక్టర్ల అభివృద్ధికి నాంది పలికినట్లు ధ్వనించారు.ఎస్ఎంఆర్లను 2023లో నీతి ఆయోగ్ ప్రచురించిన ఒక విధాన ప్రకటనలో ప్రతిపాదించారు. సుమారు 220 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల, అది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రెష రైజ్డ్ హెవీ వాటర్ టెక్నాలజీతో పనిచేసే వాటిని చిన్నస్థాయి అణు రియాక్టర్లుగా పరిగణిస్తున్నారు. ఎస్ఎంఆర్ల విషయానికి వస్తే అవి 30 మెగావాట్ల సామర్థ్యం, కొత్త డిజైన్ కలిగినవి. ఫ్యాక్టరీల్లో తయారు చేసుకుని అవసరమైన చోట అమర్చుకోగల వీటి వినియోగం వల్ల ఖర్చులు తగ్గుతాయని అంచనా. చిన్న రియాక్టర్లు కావడం వల్ల తరచూ ఇంధనం మార్చాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత సమయం తరువాత వీటిని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడుకునే వీలుంటుంది. పెద్ద రియాక్టర్లతో పోలిస్తే వీటి భద్రత, పర్యావరణపరమైన అంశాలు, అనుమతులు భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి పెద్దగా ఉండక పోవడం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటం... ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొద్ది సంఖ్యలో మాత్రమే ఎస్ఎంఆర్ల అభివృద్ధి జరుగుతోంది. వ్యయం–కాలయాపనస్వాతంత్య్రం అనంతరమే అణువిద్యుత్తు ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్వశక్తితో ఎంతో పురోభివృద్ధి సాధించింది కూడా. అణ్వాస్త్రాల తయారీకి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చు కునేలా వ్యూహాత్మకంగా అణుశక్తి కార్యక్రమం నడిచింది. అయినా వాణిజ్య స్థాయి అణు విద్యుత్‌లో దేశం వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్‌లో 24 అణు రియాక్టర్లు ఉమ్మడిగా 8,180 మెగవాట్ల సామ ర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇంకో 15,300 మెగావాట్ల సామర్థ్యం కలి గిన మరో 21 అణురియాక్టర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర అణుశక్తి విభాగం సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. 1970లలో దేశంలో రెండే అణువిద్యుత్ ప్లాంట్లు ఉన్న సమయంలో 1990 నాటికల్లా 10,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తామని ప్రక టించింది. 1980లలో 2000 నాటికల్లా సామర్థ్యాన్ని 20 వేల మెగా వాట్లకు పెంచుతామని చెప్పింది. తరువాత గడువును 2020కి మార్చారు. తాజాగా గతేడాది లక్ష్యాన్ని 2047 నాటికి లక్ష మెగావాట్లు అని ప్రకటించింది. రెండంటే రెండు దశాబ్దాల్లో ఎకా యెకిన 92,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించడం అత్యాశే అవుతుంది. అణువిద్యుత్తు ఉత్పత్తికి మూలధన వ్యయం చాలా ఎక్కువ.ఇంధన సరఫరా సమస్యలున్నాయి. పర్యావరణ, భద్రతలకు సంబంధించిన ఖర్చులూ ఎక్కువే. హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలోని గోరఖ్‌పూర్ అణువిద్యుత్ కేంద్రం విషయమే చూద్దాం. 700 మెగా వాట్ల సామర్థ్యమున్న నాలుగు రియాక్టర్లు ఇక్కడ ఏర్పాటవు తున్నాయి. 2013లో ఈ కేంద్రానికి సంబంధించి పర్యావరణ అంచ నాలు నిర్ధారించారు. తొలి దశకు 2014 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. ఆ తరువాతి ఏడాది అణుశక్తి నియంత్రణ బోర్డు నుంచి అనుమతులు లభించాయి. అదే ఏడాది జూన్ లో నిర్మాణం ప్రారంభ మైంది. 2021 నాటికి తొలి యూనిట్ పని ప్రారంభించాల్సి ఉన్న ప్పటికీ 2020 నాటికి కానీ దీంట్లో భద్రతకు సంబంధించిన కాంక్రీట్ పోయడం మొదలుకాలేదు. 2022లో వేసిన లెక్కల ప్రకారం దీని నిర్మాణం 2028కి పూర్తి కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 2032 నాటికి రెండు యూనిట్లు పనిచేయడం ప్రారంభం కావచ్చు. ప్రాజెక్టు ఖర్చు రూ.40 వేల కోట్లు. ఇంధన భద్రతకు అణుశక్తి మేలని అనుకునేవాళ్లు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.బాధ్యత ఎవరిది?నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో లక్ష మెగావాట్ల అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వాములను చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం చట్టాలను సవరిస్తున్నట్లు చెప్పారు. అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగే ప్రమాదాల బాధ్యత విషయంలో ప్రైవేట్ కంపెనీలు తటపటాయిస్తున్నాయి. 2010లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం, ప్రమాదాలకు బాధ్యత ఆ కేంద్రం నిర్వాహకులది అవుతుంది. నష్ట పరిహారం మొత్తం రూ. 1500 కోట్లకు పరిమితం చేశారు. ఒకవేళ ప్రమాదం ప్లాంట్ లోపం కారణంగా జరిగితే (భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మాదిరి) సరఫరా దారు మీద నిర్వాహకులు కోర్టుకు వెళ్లవచ్చు. ఈ అంశాల కారణంగానే అణుశక్తి రంగానికి సంబంధించి విదేశీ కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఏమైనా బాధ్యత అనేది సీరియస్ వ్యవహారం. ప్రభుత్వం నష్ట పరిహారం విషయంలో పునరాలోచన చేయాలి. కేవలం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నంత మాత్రాన అణు విద్యుదుత్పత్తి జరిగిపోదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఐటీ ఊరటే.. గేమ్ ఛేంజర్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ ఊరట ప్రధాన పాత్ర పోషించింది. ఈ నిర్ణయంతో రాజధాని నగరంలో ఏకంగా మూడింట రెండొంతుల దాకా ఉండే ప్రభుత్వోద్యోగులు, వేతన జీవుల్లో అత్యధికులు ఆ పార్టీవైపు మొగ్గారు. మధ్య తరగతి, పూర్వాంచల్ ఓటర్ల మద్దతు దానికి తోడైంది. వీటికి తోడు 2015, 2020ల్లో ఆప్‌కు అండగా నిలిచిన పలు వర్గాల ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గారు. సాధారణంగా కేజ్రీవాల్ పార్టీకి మద్దతుదార్లయిన మహిళలు సైతం ఈసారి బీజేపీకి జైకొట్టారు. వారికి నెలకు రూ.2,500 అందిస్తామన్న హామీ బాగా పేలింది. పంజాబ్‌లో మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామన్న హామీని గెలిచాక నిలబెట్టుకోకపోవడం ఆప్‌కు ప్రతికూలంగా మారింది. ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు అధికం. ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలతో వారు ఉపాధి పొందుతుంటారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఆదాయ పన్ను పూర్తిగా మినహాయిస్తూ ఢిల్లీ పోలింగ్ కేవలం నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. పన్ను భారం తొలగిపోవడం ఆ ఎంతగానో ఊరటనివ్వడంతో వేతన జీవులు ఓటు రూపంలో బీజేపీ పట్ల కృతజ్ఞత చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్ ఓటర్లు మొత్తం ఓటర్లలో ఏకంగా 30 శాతం దాకా ఉంటారు. వారి ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్న బీజేపీ హామీ ఆకట్టుకుంది. దీనికి తోడు యూపీ, బిహార్‌ల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ఢిల్లీలో ఓటర్లుగా చేరి్పస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలు, వారంతా ఫేక్ ఓటర్లన్న విమర్శలు పూర్వాంచల్ ప్రజలకు ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో వారంతా బీజేపీకే ఓటేశారు. పదేళ్ల ఆప్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజల్లో నెలకొన్న భావన కూడా కేజ్రీవాల్‌కు ప్రతికూలంగా మారింది. ఆరెస్సెస్ నిశ్శబ్ద ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బీజేపీ విజయం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్లింది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కావాలంటే బీజేపీని గెలపించాలని సంఘ్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఇంటింటా తిరిగారు. బీజేపీ గెలుపులో సంఘ్ పాత్ర తక్కువేమీ కాదు. చిన్నచిన్న సభలు వందల సంఖ్యలో నిర్వహించారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఢిల్లీ మోడల్ అంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇక ఆప్ ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. రాజకీయ పార్టీల కంటే ముందే సంఘ్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. మురికివాడలు, అనధికారిక కాలనీల్లోకి వేగంగా చొచ్చుకెళ్లారు. అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారం చేసి పేరు ప్రతిష్టలు కోరుకోవడం, నిత్యం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం సంఘ్ కార్యకర్తలకు ఇష్టం ఉండదు. తెరవెనుక నిశ్శబ్దంగా పని చేయడానికే వారు ఆసక్తి చూపుతారు. 8వ వేతన సంఘంతో లబ్ధి సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘంతో వారి వేతనాలు పెరుగనున్నాయి. నిజానికి ఉచిత పథకాలకు బీజేపీ బద్ధ వ్యతిరేకి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బీజేపీని ఆదరించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ఎప్పటిలాగే అమలవుతాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేశారు. యమునా నదిని ఎగువన ఉన్న హరియాణా ప్రభుత్వం కలుషితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. హరియాణా ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హరియాణా ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సగానికి’ భాగమిదేనా?
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో! ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదుజెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్‌ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ల వారీగా డిపార్ట్మెంట్ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు. – మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం! గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.ఇంకొంత కసరత్తుఈ ఏడు జెండర్ బడ్జెట్‌కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది. – మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖనిజాయితీతో కూడిన మద్దతు అవసరంమహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీపెద్దగా మార్పు కనపడలేదు2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. – ప్రియ గజ్దార్, చైర్పర్సన్, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్శ్వేతపత్రం విడుదల చేయాలిస్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి! – ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి – సరస్వతి రమ -
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్‌లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్‌కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
బడ్జెట్లో కేంద్రం వివక్షపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా యుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరుడూ తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశమంటే మట్టి కాదోయ్..’ అంటూ తెలుగు గేయాన్ని గుర్తుచేసి.. తెలుగు ప్రజల ఆకాంక్షలకు, తెలుగు నేల అభివృద్ధికి బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ.. ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సవతి ప్రేమకు నిదర్శనం తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు ఉందని మహేశ్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో బీజేపీ సవతి ప్రేమను అవి తెలియజేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయల పన్నులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం రూ.40 వేల కోట్లు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచి్చందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు తెలంగాణ అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కక్షపూరిత వైఖరికి నిరసనగా రాజకీయాలకతీతంగా తెలంగాణ వాదులు ఏకతాటి పైకి రావాలని మహేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అప్పుడు అడగలేదన్నారు.. ఇప్పుడు అడుగుతున్నా మొండిచెయ్యే బీజేపీ ఎంపీల్లో తెలంగాణ డీఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిధులు అడగడం లేదని పదేళ్లుగా చెప్పుకొచ్చారని, ఇప్పుడు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పెట్టింది స్వార్థపూరిత బడ్జెట్ అని విమర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర కూడా నిరసన తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్రావు, ఎగ్గె మల్లేశం, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్‌కుమార్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, నాగరిగారి ప్రీతం, రియాజ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐల రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్‌రెడ్డి, వెంకటస్వామి, సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు సునీతారావు పాల్గొన్నారు. మోదీ, నిర్మల దిష్టిబోమ్మలు దగ్ధం చేయండి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచి్చంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలంతా పాల్గొనాలని, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల దిష్టి»ొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
Union Budget 2025: కొత్త టెక్నాలజీలకు రాచబాట
కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు.. ⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు కేటాయించారు. ⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు. ⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు. ⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు. -
రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
కేంద్రబడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్‌రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలుమిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలుమిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్ రూ.20,000రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్ రూ.40,000రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్ రూ.3,750మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.63,750.ఇదీ చదవండి: స్టార్టప్‌లకు జోష్రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్సీపీఎఫ్లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్బడ్జెట్లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన ఇదే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.ఆదాయంలో పెరుగుదల -ఆశిష్‌కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్ఎస్ఈబలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్‌ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ బూస్టర్- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓకేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్‌కు సరైన బూస్టర్‌ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్అదనంగా 75 వేల వైద్య సీట్లు- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీకేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు. -
బడ్జెట్లో అన్యాయం.. ఏపీకి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు?: బుగ్గన
సాక్షి, కర్నూలు: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సింహభాగం నిధులను సాధించగలిగిందని, 16 మంది ఎంపీలు ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిల్చారని గుర్తు చేశారు. చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవం ప్రాజెక్టు ఎత్తుపైనా సీఎం రాజీపడుతున్నారని, దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన బుగ్గన ధ్వజమెత్తారు.బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:చంద్రబాబు దారుణ వైఫల్యం:ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆయన ఏ మాత్రం చొరవ చూపలేకపోయారు. ఫలితంగా ఈ బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి దాదాపు మొండిచేయి చూపింది. నిజానికి టీడీపీ మద్దతులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది. అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఏ మాత్రం నిధులు దక్కించుకుందని చూస్తే తీవ్ర నిరాశే కనిపిస్తోంది.నాడు వైఎస్సార్సీపీపై నిందలు:గతంలో కేంద్ర బడ్జెట్ సందర్భాల్లో.. వైయస్సార్సీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పలుసార్లు పెద్ద ఎత్తున విమర్శించారు. అయితే అప్పుడు కేంద్రానికి మా సీట్లతో, మా మద్దతుతో ఏ మాత్రం అవసరం లేని పరిస్థితి ఉంది. కానీ నేడు కేంద్రానికి ఎపీకి చెందిన ఎంపీల మద్దతు చాలా కీలకం. దీన్ని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో టీడీపీ ఉంది. కేవలం 12 మంది ఎంపీలు ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ఎన్నో సాధించగలిగితే, 16 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకెంత సాధించాలి? కానీ ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు.పోలవరం ప్రాజెక్టుకూ నష్టం:పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉంది. అలా నిర్మిస్తేనే పోలవరం ద్వారా 200 టిఎంసీల నీరు లభిస్తుంది. ఈ నీటి వల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు, 600 గ్రామాలకు నీరు అందుతుంది.ఇన్ని ఉపయోగాలు అందాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తోందా? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే పోలవరం ఎత్తు 41.15 అడుగులే అని కేంద్రం ఎలా ఖరారు చేస్తుంది? నాడు 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది. ఈరోజు గొప్పగా రూ.12,500 కోట్లు కేంద్రం ద్వారా వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మా ప్రభుత్వం సాధించినదే. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేస్తాం, తరువాత రెండేళ్లలో నీటి నిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేసుకుంటూ పోయి, ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. అంటే పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం పూర్తి కోసం అంటూ బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్‌కు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కూడా నిధులు కోరలేదు? ఈ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.బీహార్‌కు అత్యధిక ప్రాధాన్యం:టీడీపీ కంటే తక్కువగా 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్న జేడీయూ, తమ రాష్ట్రం బీహార్‌కు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం దక్కించుకుంది. బీహార్‌లో మఖనా బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, పాత పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, మిథులాంచల్కు చెందిన కోషీ కెనాల్ అభివృద్ధి, పాట్నా ఐఐటీ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్‌కు సంబంధించి గత బడ్జెట్లో పూర్వోదయ ప్రాంతంలోని గయలో అమృత్సర్–కోల్కత్తా పారిశ్రామికవాడ, పాట్నా పూర్ణియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్–బగల్పూర్ ఎక్స్‌ప్రెస్ వే, బోద్ గయా–రాజ్ ఘీర్–వైశాలీ–దర్భాంగ, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో రెండు లైన్ల వంతెన సాధించుకున్నారు. అలాగే 2400 మెగావాట్ల పీర్ పాంటీ పవర్ ప్రాజెక్ట్స్‌కు రూ.21,400 కోట్లు సాధించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్ట్స్, బీహార్‌లో శాశ్వతమైన నిర్మాణ పనులకు క్యాపిటల్ వ్యయం కోసం కేంద్రం నుంచి సాయం దక్కించుకున్నారు. టీడీపీ మాదిరిగా జేడీయూ కూడా ఎన్డీఏలో భాగస్వామి. టీడీపీ కంటే ఆ పార్టీకి తక్కువ మంది ఎంపీలు. అయినా బడ్జెట్లో అధిక శాతం నిధులు దక్కించుకుంది.తలసరి ఆదాయంపైనా చంద్రబాబు తప్పుడు లెక్కలు:ఇటీవల నీతి అయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తలసరి ఆదాయంపై చెప్పిన విశ్లేషణను విన్న ఒక ఎన్ఆర్ఐ.. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తి చూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23 నాటికి రూ.2.20 లక్షలు అయ్యింది. అంటే చంద్రబాబు హయాం కంటే వైయస్ జగన్ గారి హయాంలో తలసరి ఆదాయం పెరిగింది.సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా తప్పుడు లెక్కలు చెబితే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా వస్తారా? నీతి అయోగ్ నివేదికను చూస్తే 2014–19 వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన, 2019–24 వైయస్ జగన్ పాలనను పోల్చడం అనేది హేతుబద్దంగా ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం తన పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని, జగన్ గారి పాలనలో ఒక ఏడాదిని ఎంచుకుని వాటిని పోల్చడం చూస్తుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వారు ఇలా కూడా చేస్తారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూ..:వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, విధానాలు చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశీ భాగస్వామ్యంతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అందించాం. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. దాన్ని నాడు టీడీపీతో పాటు, ఎల్లో మీడియా తీవ్రంగా తప్పు పట్టాయి, ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఇప్పుడు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అవే విధానాలు అమలు చేస్తోంది. విద్యార్ధులకు బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెస్తున్నారు. మరి దీన్ని కూటమి పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇది కూడా తప్పేనని ఇప్పుడు విమర్శించగలరా?మెడికల్ కాలేజీలు.. సీట్లు:రాబోయే 5 ఏళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తేవాలన్న నిర్ణయాన్ని కేంద్ర బడ్జెట్లో వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఆవశ్యకత గుర్తించిన నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశారు. వాటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, అన్ని కాలేజీలు పూరై్త ఉంటే, మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రానికి దక్కేవి.అయితే ఆ కాలేజీల నిర్మాణం పూరై్తతే జగన్‌గారికి మంచి పేరొస్తుందని కుట్ర చేసిన చంద్రబాబు, ఇప్పుడు వాటన్నింటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. గత విద్యా సంవత్సరంలో పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతి ఇచ్చిన సీట్లు కూడా వద్దని చెప్పడంతో పాటు, కొత్త కాలేజీలకు అనుమతి కోరుతూ, ఈ ఏడాది జాతీయ వైద్య మండలికి లేఖ రాయొద్దని నిర్ణయించారు. ఆ వి«ధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, సీట్లకు కేంద్రం ఒకవైపు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇవే కాలేజీలను పూర్తి చేసుకుంటూ పోతే కేంద్రం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 10 వేల సీట్లలో నాలుగో భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేవి.ఆదాయపన్నుతో మధ్య తరగతికి ఊరట:మధ్యతరగతి వారికి మేలు చేసేలా పన్ను విధానాలను తీసుకువచ్చారు. ఆదాయపన్నుకు సంబంధించి గత ఏడాది రూ.3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. ఈ ఏడాది రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.12 లక్షల ఆదాయం వరకు రిబేట్ రూపంలో ఆదాయపన్ను నుంచి ఉపశమనం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వేతన జీవులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది.కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూస్తే..:దేశంలో తొలిసారి రూ.50,65,365 కోట్లు కేంద్ర బడ్జెట్ దాటింది. దీనిలో రెవెన్యూ రిసీట్స్ రూ.34,20,409 కోట్లు కాగా, క్యాపిటల్ రిసీట్స్ రూ.16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి, అప్పు రెండూ కలిపితే రూ.50 లక్షల కోట్లు దాటింది. దీనిలో క్యాపిటల్ వ్యయం రూ.11,21,090 కోట్లుగా చూపించారు. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుంటే రూ.15,48,282 కోట్లు. అదే గత ఏడాది రివైజ్డ్ అంచనాలను చూస్తే ఖర్చు రూ.47,16,487 కోట్లుగా ఉంది. మరోవైపు రెవెన్యూ రాబడి రూ.30,00,087 కోట్లుగా చూపించారు. అప్పు మాత్రం దాదాపు రూ.16,28,527 కోట్లు ఉంది. అంటే అప్పులు య«థాతథంగా కొనసాగిస్తున్నారు. వాస్తవాలు చూస్తే కేంద్ర బడ్జెట్లో అప్పులు పెద్దగా పెరగలేదు. ఇది మంచి పరిణామం.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాబడి, ఖర్చులు మాత్రం దాదాపు మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.10.18,000 కోట్లు అయితే, ఈ ఏడాది రూ.11,21,090 కోట్లుగా చూపించారు. అంటే దాదాపు లక్ష కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రాలకు సహయం అందించే దాన్ని కూడా కలుపుకుంటే ఈ బడ్జెట్లో గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది ఆ మొత్తం రూ.15,69,527 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.15,68,000 కోట్లుగా ఉంది. అంటే ద్రవ్యలోటు, స్థూల ఉత్పత్తిని నిష్పత్తిగా చూస్తూ.. గత ఏడాది అది 4.8 ఉంటే ఈ ఏడాది 4.4 గా బడ్జెట్లో ప్రతిపాదించడం మంచి పరిణామం. కోవిడ్ నుంచి ఇది తగ్గుతూ వచ్చింది.బడ్జెట్లో నాలుగు విభాగాలకు ప్రాధాన్యత:కేంద్ర బడ్జెట్ లో నాలుగు భాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఇ, పెట్టుబడి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ పరంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త స్కీం ప్రారంభించబోతున్నారు. 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని అమలు చేయబోతున్నారు. స్వల్పకాలిక రుణాలను రూ.5 లక్షలకు పెంచనున్నారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి క్రెడిట్‌కార్డును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నారు.తొలిసారిగా పరిశ్రమను పెట్టే వారికి దీర్ఘకాలిక అప్పుగా టర్మ్‌లోన్‌ను రూ.2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. గ్యారెంటీ లేకుండా ఇచ్చే అప్పును ఎంఎస్ఎంఈ లకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచారు. స్టార్టప్‌లకు కూడా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. ఇది మంచి నిర్ణయం. ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేసే పరిమితిని కూడా పెంచబోతున్నారు. భారతీయ భాషా పుస్తక్ స్కీం కింద ఇంగ్లిష్ నుంచి వారి స్థానిక భాషల్లో అర్థం చేసుకునే విధంగా ఒక పథకం అమలు చేయబోతున్నారు.దేశంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల కోసం స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రాలకు రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేయడం మంచిది. రాబోయే 10 ఏళ్లలో కొత్తగా 120 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. భారత ట్రేడ్‌నెట్ కింద ఎగుమతిదార్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇంకా36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం సంతోషకరమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. -
డిప్యూటి సీఎం పవనన్ను ఉద్దేశించి రోజా ట్వీట్
-
బడ్జెట్లో వ్యవసాయానికి ఊతం రైతులకు శుభవార్త
-
రక్షణ బడ్జెట్ రూ.6.81 లక్షల కోట్లు.. ఏం చేస్తారో తెలుసా..?
కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి రూ.6,81,210 కోట్లు కేటాయించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా భూభాగంలో సాయుధ దళాలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రక్షణ బడ్జెట్లోని ముఖ్యాంశాలుమూలధన వ్యయం: రూ.1,92,387 కోట్లుమూలధన వ్యయంలో కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్వేర్లలో పెట్టుబడులు పెడుతారు. 2024-25లో మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ.1,59,500 కోట్లుగా ఉన్నాయి.రెవెన్యూ వ్యయం: రూ.4,88,822 కోట్లుఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పింఛన్లు ఉంటాయి. సైనిక పింఛన్లకు రూ.1,60,795 కోట్లు కేటాయించడం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఆధునీకరణపై దృష్టిపెంచిన బడ్జెట్ కేటాయింపులు భారత సాయుధ దళాలలో ఆధునికీకరణ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి. ఆపరేషనల్ సంసిద్ధతను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టనున్నారు. సైనిక స్థావరాలు, శిక్షణ సౌకర్యాలు, లాజిస్టిక్స్‌తో సహా రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, విమానాలు, నౌకాదళ నౌకలను కొనుగోలు చేస్తారు. -
బీహార్ సాధించుకుంది మరి ఏపీకి ఏమైంది ?
-
మౌలిక సదుపాయాలకు కేటాయింపులు.. దేనికి ఖర్చు చేస్తారంటే..
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన వ్యయాన్ని (CAPEX) పెంచడంపై బడ్జెట్లో దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది రూ.11.11 లక్షల కోట్లతో పోలిస్తే 0.9% ఎక్కువ. అయితే, 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కొత్త కేటాయింపులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల్లో పెరుగుదల నమోదు చేశాయి.మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో వేసిన అంచనా పద్దుల ప్రకారం కింది విభాగాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది.ఎందుకోసం ఖర్చు చేస్తారంటే..లాజిస్టిక్స్, ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్డు, రైలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతారు. సమాన అభివృద్ధి, మార్కెట్ల సౌలభ్య కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ప్రపంచం సుస్థిర భవిష్యత్తు దిశగా పయనిస్తున్న తరుణంలో ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ఖర్చు చేస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరిస్తుంది. మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటలైజేషన్ కోసం..సుస్థిర వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్‌పై, ఈ విభాగంలో వినూత్న విధానాల అమలుకు ఖర్చు చేస్తారు. డిజిటల్ వృద్ధికి తోడ్పడటానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, 5జీ నెట్‌వర్క్‌లను పెంచేందుకు కృషి చేస్తారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ బెదిరింపుల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సదుపాయాలను బలోపేతం చేస్తారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు, వైద్య పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. విద్యా నాణ్యతను పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణా కేంద్రాలపై పెట్టుబడి పెడుతారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్‌లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఎంఎస్ఎంఈలపై..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు మూలధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంఎస్ఎంఈలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాలి. -
రూ.50.65 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుమూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లురుణాల రికవరీ రూ.29,000 కోట్లుఇతర వసూళ్లు రూ.47,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లుమొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లుమొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లురెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లుమూలధన ఖాతా రూ.11,21,090 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లురెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లుద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లుప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 20 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుప్రధాన సబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలుఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 22 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 24 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు -
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
బడ్జెట్ రెడీ.. ఊరటనిస్తారా? ఉసూరుమనిపిస్తారా? (చిత్రాలు)
-
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తి ఇస్తుంది
-
బడ్జెట్ పై సామాన్యుల డిమాండ్స్
-
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
నిత్యావసర ధరలపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం
-
బడ్జెట్ గురించి సామాన్యుడు ఎందుకు తెలుసుకోవాలి..?
కేంద్ర బడ్జెట్(Union Budget)ను కేవలం ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, విధాన నిర్ణేతలు మాత్రమే అర్థం చేసుకోవడం కాదు.. ప్రతి సామాన్యుడికి ఇది చాలా అవసరం. భారత ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక ప్రణాళిక, ప్రాధాన్యాలను వివరిస్తారు. ప్రతి ఒక్కరూ వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలో కింద తెలియజేశాం.రోజువారీ జీవితంపై ప్రభావంకేంద్ర బడ్జెట్ పౌరుల దైనందిన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆదాయ పన్ను శ్లాబులు, రేట్లలో మార్పులు, నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు వంటి వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత డబ్బు పొదుపు చేస్తారు లేదా ఖర్చు చేస్తారు అనే దానిపై బడ్జెట్ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఇంధన పన్నుల్లో మార్పులు రవాణా ఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఇది వస్తువులు, సేవల ధరల్లో మార్పులుకు దారితీస్తుంది.ఉద్యోగ, ఆర్థిక అవకాశాలుఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వ ప్రణాళికలను బడ్జెట్ హైలైట్ చేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇతర రంగాల్లో పెట్టుబడులు కొత్త ఉపాధి అవకాశాలకు, ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తాయి. ఈ ప్రణాళికలను అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు కెరీర్ అవకాశాలు, జాబ్ మార్కెట్లో మార్పులకు తమను తాము ఎలా సిద్ధం చేసుకోవచ్చో తెలుసుకునే అవకాశం ఉంటుంది.సామాజిక సేవ, సంక్షేమ పథకాలుఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు వంటి ప్రజా సేవలకు నిధుల కేటాయింపు బడ్జెట్లో కీలకమైన అంశం. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలనుకుంటుందో తెలుసుకోవడం పౌరులకు చాలా ముఖ్యం. వారు ఆశించే సేవల నాణ్యతను, వాటి లభ్యతను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ద్రవ్యోల్బణం, ధరల స్థిరత్వంద్రవ్యోల్బణాన్ని(వస్తు ధరల్లో మార్పులు) నిర్వహించడంలో, ధరల స్థిరత్వాన్ని కాపాడటంలో బడ్జెట్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ద్రవ్యలోటు లక్ష్యాలు, రుణ ప్రణాళికలు వంటి చర్యలు ద్రవ్యోల్బణ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇది జీవన వ్యయాన్ని మారుస్తుంది. ఈ అంశాలను అర్థం చేసుకోవడం పౌరులు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.ఆర్థిక బాధ్యత, పారదర్శకతకేంద్ర బడ్జెట్ ఆర్థిక బాధ్యతను, ప్రభుత్వ వ్యయంలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. బడ్జెట్ గురించి తెలియజేయడం ద్వారా పౌరులు ప్రజాధనాన్ని సమర్థవంతంగా, అనుకున్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవచ్చు. బడ్జెట్‌పై సరైన అవగాహన పెంపొందించుకుంటే బాధ్యతాయుతమైన పాలన కోసం వాదించడానికి అవకాశం లభిస్తుంది.పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్వడ్డీ రేట్లు, పొదుపు పథకాలు, పెట్టుబడి అవకాశాలపై బడ్జెట్ ప్రభావాలను అర్థం చేసుకోవడం ద్వారా పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు, పన్ను మినహాయింపులు లేదా మినహాయింపుల్లో మార్పులు పొదుపుపై ఎలా ప్రభావం చూపుతాయో తెలసుకొని అందుకు అనువుగా ప్లాన్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఏఐకు బానిసలుగా మారొద్దుకేంద్ర బడ్జెట్ విధాన నిర్ణేతలకు, ఆర్థిక విశ్లేషకులకు ఒక పత్రం మాత్రమే కాదు. ఇది ఒక పౌరుడి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే సమగ్ర మార్గదర్శి. బడ్జెట్ సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా సామాన్య ప్రజలు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక అభివృద్ధిలో చురుకుగా పాల్గొనవచ్చు. -
ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?
కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నార్త్ బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది.ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ముద్రించనున్నారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రెస్ ఉంది. కానీ నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను చాలా కాలం ముద్రించలేదు. దీని వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది.బడ్జెట్ ముందే లీక్1950లో కేంద్ర బడ్జెట్ విషయంలో ఊహించని సంఘటన జరిగింది. అప్పట్లో మింటో రోడ్లో ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుండి కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకూ బడ్జెట్ పత్రాలను ఇదే ప్రెస్‌లో ముద్రించేవారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ 1950లో బడ్జెట్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాన్ని ముద్రించే స్థలాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాలు లీక్ అయిన సమయంలో జాన్ మథాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే బడ్జెట్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రణాళికా సంఘానికి నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1980లో బడ్జెట్‌ను ముద్రించే స్థలం మరోసారి మారింది. నార్త్ బ్లాక్‌లోని ప్రస్తుత స్థానానికి మార్చారు.'లాక్-ఇన్' పీరియడ్ అంటే..బడ్జెట్ ముద్రణ ప్రక్రియ అత్యంత పటిష్టంగా, గోప్యంగా జరుగుతుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌పై పని చేస్తున్న అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దీన్నే “లాక్-ఇన్” పీరియడ్ అంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వ్యవధిలో అధికారులు తమ ఫోన్లను ఉపయోగించడానికి కూడా అనుమతించరు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాతే వారు బయలుదేరవచ్చు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు. 1980 నుంచే హల్వా వేడుకబడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది.భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది. -
ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించాలి!
బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల సమాహారం కాదు. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు దర్పణం పట్టే ఒక దిక్సూచి. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రైతులు, వేతన జీవులు, సామాన్యులు, పేదలు, పెట్టుబడి దారులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలు ప్రభావితం అవుతాయి. మోదీ సర్కార్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం ఇస్తూ... రైతులు, మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా 9 అంశాలకు ప్రాధాన్య మిస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరిలో 2025–26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆశాజనకంగా లేని వృద్ధిరేటు, రైతాంగ సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా నిలుస్తున్న నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవాళ్లను అధిగమించడానికి బడ్జెట్లో ఏ ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. 2024– 25 బడ్జెట్లో నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్యత కల అంశాలలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ప్రధానమైనవి. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను నిరుటి బడ్జెట్లో ప్రకటించారు. యువత సులభంగా ఉద్యోగాలను సాధించటానికి ‘ఇంటర్న్ షిప్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘మోడల్ స్కిల్ లోన్ స్కీం’ కింద యువతకు రుణాలు, ‘ముద్ర’ రుణాల పెంపు లాంటి చర్యలు ఉపాధి – ఉద్యోగాల కల్పనకు పెద్దగా దోహదపడలేదనే చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వక పోవడం వలన దేశంలో గడిచిన సంవత్సరంలో నిరుద్యోగితా రేటు ఏడు శాతం నుండి 9.2 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ అంచనా వేసింది. రైతాంగం కూడా బడ్జెట్‌పై పెద్దగానే ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ఆధ్వర్యంలో రైతాంగం ఉద్యమిస్తోంది. కాబట్టి ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయం, ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ కింద రైతుకి పెట్టుబడి సహాయం 6,000 నుండి 10,000 రూపాయలకు పెంపు నిర్ణయాలు ఈ బడ్జెట్లో తీసుకుంటారని రైతాంగం ఆశిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, 80(సి) కింద రాయితీల పరిమితిని పెంచా లని వేతన జీవులు కోరుకుంటున్నారు. ద్రవ్య లోటు అదుపులో ఉన్నదని చెప్తున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ధరలు పెరగటం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పత నాన్ని నియంత్రణ చేసే చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారు. ‘ఆత్మ నిర్భర భారత్’, ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’, ‘వికసిత్ భారత్’ లాంటి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసేలా 2025–26 బడ్జెట్ ఉంటుందని ఆశిద్దాం.డా‘‘ తిరుణహరి శేషు వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 98854 65877 -
ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలిపీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
Union Budget 2025: నిర్మలా మేడం..మా మీద దయ చూపండి
-
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టడానికి ముందు చేపడుతున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో వివిధ పథకాల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వారి సలహాలను కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 3.5-4 శాతం వృద్ధి రేటును సాధించడంపై వర్చువల్ సమావేశంలో చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉన్న గ్రామీణ పేదరిక రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదికను ఆయన స్వాగతించారు. ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ పరిశోధనల ద్వారా హెక్టార్‌కు ప్రస్తుతం నమోదవుతున్న ఉత్పత్తిని పెంచడం, కొత్త విత్తన వంగడాలను తయారు చేయడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఆరు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, నూతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాపీఎం కిసాన్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డీఏపీ ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు(Credit Card), ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎంఏఏఎస్ఏ) సహా కీలక పథకాల్లో పురోగతి ఉందని చౌహాన్ వివరించారు. వ్యవసాయ రంగంలో నిరంతరం పురోగతి నమోదువుతుందని, దాని కోసం అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
వికసిత్ భారత్ ఎలా సాధ్యం అవుతుందంటే..
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చే దిశలో ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆర్థికవేత్తలతో సమావేశం అయ్యారు. 2025–26 బడ్జెట్, ఆర్థిక పురోగతిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2025–26 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో సమరి్పస్తుండడం ఈ సమావేశం నేపథ్యం. కీలక అంశాలపై సూచనలు.. ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను సమీకరించడం వంటి కొన్ని అంశాలు ప్రధాని–ఆర్థికవేత్తల పరస్పర చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రపంచ ఆర్థిక అనిశి్చతులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, యువతలో ఉపాధిని పెంపొందించే వ్యూహాలు వంటి పలు అంశాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వృద్ధిని పెంచడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఆర్థికవేత్తలు సూచనలు, సలహాలు అందించారు. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఎగుమతుల పెంపు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై కూడా ఆర్థికవేత్తలు కీలక సూచనలు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థికమంత్రి సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్సహా సుర్జిత్ భల్లా, డీకే జోషివంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
బడ్జెట్ రోజున ఎక్సేచెంజీలు పనిచేస్తాయ్
ముంబై: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2025–26) గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఆ రోజు శనివారం అయినా కూడా ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇరు ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గతంలో 2020 ఫిబ్రవరి 1న, 2015 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పని చేశాయి. -
మోదీ చక్రవ్యూహంలో దేశం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ముప్పేట దాడి చేశారు. ‘‘దేశమంతటా తీవ్ర భయోత్పాత వాతావరణాన్ని నెలకొల్పారు. దేశంపై ప్రధాని మోదీ పెను సమస్యల చక్రవ్యూహం పన్నారు. అది దేశమంతటినీ సర్వనాశనం చేస్తోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడిన రాహుల్ మోదీపైనా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనపైనా సునిశిత విమర్శలు చేశారు. ఘాటైన పదజాలంతో కూడిన పదునైన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినా, నిబంధనలు అనుమతించబోవంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే వారిస్తున్నా వెనక్కు తగ్గలేదు. బడ్జెట్ కేవలం బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలకు, సర్కారు రాజకీయ గుత్తాధిపత్యానికి కొమ్ము కాసేలా ఉదంటూ విమర్శించారు. ‘‘ఈ మోదీ మార్కు సమస్యల చక్రవ్యూహాన్ని విపక్ష ఇండియా కూటమి ఛేదిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు, దేశవ్యాప్తంగా కులగణనకు సభ ఆమోదం లభించేలా చేసి తీరుతుంది’’ అని ప్రకటించారు. అభిమన్యుడిలా దేశం... నేటి హరియాణాలోని కురుక్షేత్రలో వేల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో ఆరుగురు ఒక్కటై చక్రవ్యూహం పన్ని బాలుడైన అభిమన్యున్ని పొట్టన పెట్టుకున్నారంటూ మహాభారత గాథను రాహుల్ ఉటంకించారు. ‘‘హింస, భయోద్వేగాలతో కూడిన చక్రవ్యూహమది. దాన్ని పద్మవ్యూహమని కూడా అంటారు’’ అంటూ బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ‘‘నేడు 21వ శతాబ్దంలో మన దేశంపై మోదీ ఓ నయా చక్రవ్యూహాన్ని పన్నారు. అభిమన్యునికి పట్టిన గతినే దేశానికి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ యువతను, రైతులను, మహిళలను, చిన్న, మధ్యతరహా వ్యాపారులను సర్వనాశనం చేసేందుకు రాత్రింబవళ్లు ప్రయతి్నస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కేంద్ర స్థానంలో ఉండి చక్యవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్లు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అంబానీ–అదానీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్’’ అని చెప్పుకొచ్చారు. చివరి నలుగురూ సభలో లేనందున వారి పేర్ల ప్రస్తావనను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో అనంతరం ఆరుగురి పేర్లనూ రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ ప్రసంగం పొడవునా అధికార ఎన్డీఏ కూటమి సభ్యులంతా పెద్దపెట్టున నిరసనలకు దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు జోక్యం చేసుకోబోయారు. కానీ రాహుల్ అందుకు అవకాశమివ్వలేదు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్ స్పష్టం చేయడంతో అంబానీ, అదానీలను తన ప్రసంగం పొడవునా ఏ1, ఏ2గా సంబోధించారు. ‘‘ఏ1, ఏ2లను కాపాడేందుకు రిజిజు కూడా ప్రయతి్నస్తున్నారు. మీరిలా చేస్తే మాకే లాభం. వారిద్దరినీ ఇంకెంతగా కాపాడే ప్రయత్నం చేస్తారో చేయండి’’ అంటూ ఎద్దేవా చేశారు. చక్రవ్యూహం... మూడు శక్తులు మోదీ చక్రవ్యూహం వెనక మూడు శక్తులున్నాయని రాహుల్ అన్నారు. ‘‘మొదటిది గుత్తాధిపత్య ధోరణి. దేశ సంపదనంతా ఏ1, ఏ2 (అంబానీ, అదానీ) ఇద్దరికే మాత్రమే దోచిపెట్టే ప్రయత్నం. రెండోది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటి సాయంతో విపక్షాలను అణగదొక్కే కుట్రలు. మూడోది అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న రాజకీయ, అధికారస్వామ్యం. మోదీ చక్రవ్యూహానికి గుండెకాయ వంటి ఈ శక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.మధ్యతరగతికి వెన్నుపోటు కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని దారుణంగా వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆరోపించారు. ‘‘మోదీకి కాస్తో కూస్తో మద్దతుగా నిలిచిన వర్గం మధ్యతరగతి. కొవిడ్ సమయంలో ఆయన మొబైల్ టార్చిలు వేయమంటే వేసింది. పళ్లాలు మోగించండంటే మోగించింది. అలాంటి వర్గంపై బడ్జెట్లో పెను భారం వేశారు. తద్వారా వారి వెన్నులోనూ, ఛాతీలోనూ కత్తులు దింపారు మోదీ’’ అన్నారు. ‘‘ఇదీ మా మంచికే. మధ్యతరగతి ఇక ఇండియా కూటమి వైపు మొగ్గుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘మోదీ చక్రవ్యూహపు దు్రష్పభావాన్ని కేంద్ర బడ్జెట్ బలహీనపరుస్తుందని, యువత, రైతులు, కారి్మకులు, చిరు వ్యాపారులను ఆదుకుంటుందని ఆశించా. కానీ వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తారట! బడ్జెట్లో విత్త మంత్రి పేర్కొన్న ఈ పథకం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 99 శాతం మంది యువతకు అది అందని ద్రాక్షే. నిరుద్యోగ చక్రవ్యూహం, పేపర్ లీకేజీ చక్రవ్యూహం, అగ్నివీర్ చక్రవ్యూహం... ఇలా విద్యార్థులు, యువత, సైన్యంతో పాటు ఏ రంగాన్నీ వదలకుండా సమస్యల సుడిగుండంలో ముంచెత్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు సృష్టించిన అన్ని చక్రవ్యూహాలనూ మేం ఛేదించేస్తాం. దేశవ్యాప్త కులగణనే అందుకు సరైన అస్త్రం’’ అన్నారు. ‘‘దేశ యువత, వెనకబడ్డ వర్గాలు అభిమన్యులని ఈ చక్రవ్యూహ సృష్టికర్తలు అపోహ పడుతున్నారు. కానీ నిజానికి వాళ్లంతా ఆ వ్యూహాన్ని ఛేదించే అర్జునులు’’ అని హెచ్చరించారు. అగి్నవీర్ వంటి సున్నితమైన పథకంపై విమర్శలు సరికావంటూ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వెలిబుచ్చారు.మాది శివుని ఊరేగింపు ఇండియా కూటమిని శివుని పెళ్లి ఊరేగింపుతో రాహుల్ పోల్చారు. ‘‘అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మోదీ చక్రవ్యూహం కేవలం ఆరుగురికే పరిమితం. ఆ చక్రవ్యూహానికి, శివుని ఊరేగింపుకు పోరాటమిది’’ అన్నారు.‘హల్వా’ ఫొటోపై విసుర్లు ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో రాహుల్ ప్రదర్శించిన బడ్జెట్ హల్వా ఫొటో కలకలానికి దారి తీసింది. బడ్జెట్ ముద్రణకు ముందు దాని తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారు చేయడం రివాజు. అలా ఈసారి నిర్మలా సీతారామన్ బృందం బడ్జెట్ హల్వా తయారు చేస్తున్న ఫొటోను చూపిస్తూ, ‘‘ఇందులో కని్పస్తున్న 20 మంది అధికారుల్లో దళితులు, ఆదివాసీలు ఒక్కరు కూడా లేరు. మైనారిటీ, ఓబీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు’’ అంటూ రాహుల్ ఆక్షేపించారు. రాహుల్ ఆ ఫొటోను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ కని్పంచారు. -
బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొబైల్ ఫోన్ల మీద బేసిక్ కష్టం డ్యూటీస్ 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో మొబైల్ ఫోన్ ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ ధరలను 3 నుంచి 4 శాతం తగ్గించింది.ధరలను తగ్గించిన తరువాత ప్రో లేదా ప్రో మాక్స్ మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ. 5100 నుంచి రూ. 6000 మధ్య తగ్గింపు లభిస్తుంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 13, 14, 15 మోడల్స్ మీద రూ. 3000 తగ్గుతుంది. ఇదే సమయంలో ఐఫోన్ ఎస్ఈ మీద రూ. 2300 తగ్గుతుంది.యాపిల్ కంపెనీ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. నిజానికి కొత్త ప్రో మోడల్స్ లాంచ్ అయిన తరువాత పాత మోడల్స్ ఉత్పత్తి నిలిపివేస్తుంది. అప్పటికే ఉన్న మోడల్లను డీలర్ల ద్వారా స్వల్ప డిస్కౌంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు కొత్త ప్రో మోడల్స్ ధరలు తగ్గించలేదు. -
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని, గత ప్రబుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు.‘మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీకి వెళ్లాం. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించాం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని కోరాను. మోదీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది?. రాష్ట్రాలకు పెద్దన్నలగా వ్యవహరించాలని కోరానుఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదు కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు . ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా?పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బిహార్ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ. 7 ఇస్తోంది. గుజరాత్లో మోదీ తన ఎస్టేట్లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. అయిదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్నులుచ చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లే. యూపీ రూ. 3.47 లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ. 6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరించాం. పార్లమెంట్లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి’ అని పేర్కొన్నారు.శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సీఎం ఏమన్నారో ఆయన మాటల్లో..ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు.వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు.తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము.ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు..ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం.తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు...తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి...కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు...ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు.తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే..మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత?దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లుకేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమే.యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే..కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు.ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష..దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం.మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం.ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం.అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం.తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్‌లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్‌రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
ఆటో పరిశ్రమపై కురవని వరాల జల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, డిఫెన్స్ మొదలైన రంగాలకు వేలకోట్లు కేటాయించారు. కాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ముఖ్యమైన ప్రకటనలు లేకపోవడం గమనార్హం.భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా నిలిచింది. ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమను మరింతగా పెంచేందుకు అనేక ప్రకటనలను ఉండొచ్చని నిపుణులు భావించారు. అయితే ఈ బడ్జెట్లో అలాంటి ప్రకటనలేవీ లేదు.బడ్జెట్లో ఫేమ్ 3 సబ్సిడీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. అంతే కాకుండా హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గింపులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దిగుమతి చేసుకునే వాహనాల మీద కూడా ఎటువంటి ట్యాక్స్ తగ్గింపులు వెల్లడికాలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఆటోమొబైల్ రంగం మీద అటువంటి వరాలజల్లు కురిపించలేదు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
Budget 2024: గంటన్నరలోపే బడ్జెట్ స్పీచ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ సమయాన్నిగణనీయంగా తగ్గించుకున్నారు. మంగళవారం(జులై 23) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల తన స్పీచ్‌ను కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఇదే ఆమె అతి చిన్న బడ్జెట్ ప్రసంగం కావడం గమనార్హం. 2020లో ఆమె ఏకంగా రెండు గంటల నలభై నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేశారు. నిర్మల తొలిసారి ఆర్థిక మంత్రి అయిన 2019లోనూ 2 గంటల 17 నిమిషాలు, 2021లో గంట 50 నిమిషాలు, 2022లో గంట 32 నిమిషాలు, 2023లో గంటగ 27 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాలు చేశారు. -
హెల్త్‌కేర్ బడ్జెట్ 2024-25: కేన్సర్ రోగులకు భారీ ఊరట!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో కేన్సర్ రోగులకు భారీ ఊరట కలిగించారు. కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మూడు మందులను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ చర్య రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా అవసరమైన మందుల ధరలను గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు విశ్లేషకులు. అలాగే స్థానిక తయారీని పెంచడానికి మెడికల్ ఎక్స్-రే మెషీన్లలో ఉపయోగించే ఎక్స్-రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్ల ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీలో మార్పులు ప్రతిపాదించారుదీన్ని పారిశ్రామిక పెద్దలు స్వాగతించారు. వాళ్లంతా నిర్మలా సీతారామన్ చర్యను అభినందించారు. దీని కారణంగా రోగ నిర్థారణ సామర్థ్యాలు మెరుగుపడతాయని, దేశీయ వైద్య పరికరాల పరిశ్రమ వృద్ది చెందుతుందని రూబీ హాల్ క్లినిక్ సీఈవో బెహ్రామ్ ఖోడైజీ అన్నారు. అలాగే కస్టమ్స్ డ్యూటీ నుంచి మూడు అదనపు కేన్సర్ చికిత్స ఔషధాలను మినహాయించడం అనేది కేన్సర్ రోగులకు కీలకమైన చికిత్సలను మరింత అందుబాటులోకి ఉండేలా చేస్తుంది. ఈ చర్యలు భారత దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, రోగుల సంరక్షణను మెరుగుపర్చడం కోసం తీసుకున్న వ్యూహంలా ప్రతిబింబిస్తున్నాయని వైద్యుల ఖోడైజీ అన్నారు. ఇది భారత ప్రభుత్వానికి చాలా అవసరం అని చెప్పారు. ఇక ఈ మినహాయింపులో చేర్చబడిన మందులు ప్రధానంగా వెన్నెముక, కండరాల క్షీణత వంటి అరుదైన, తీవ్రమైన వైద్య పరిస్థితుల్లో చికిత్స చేయడానికి ఉపయోగిస్తారని అన్నారు. ఈ చర్య కారణంగా క్లిష్టమైన చికిత్సలు అవసరమయ్యే రోగులపై వ్యయభారం తగ్గుతుంది. ఇక ఈ బడ్జెట్లో వైద్య రంగంలో స్థానిక తయారీ, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే సమాజంలో అన్ని వర్గాలకు తమ స్థోమతలో ఆరోగ్య సంరక్షణ పొందేలా విస్తృత వ్యూహాన్ని పరిగణలోని తీసుకుని మరీ బడ్జెట్‌ని కేటాయించారు సీతారామన్. ఔషధాలు సాధారణంగా 10% ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఆకర్షిస్తాయి. అయితే కొన్ని రకాల ప్రాణాలను రక్షించే మందులు, టీకాలు 5% లేదా నిల్ రాయితీ రేటుని ప్రకటించారు. గతేడాది కేన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడే పీడీ1కి సంబంధించిన ఇమ్యునిథెరపీ ఔషధంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గించడం జరిగింది. ఇదిలా ఉండగా, గణాంకాల ప్రకారం 2023లో 9.3 లక్షల మంది దాక ప్రాణాంతక కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అంచనా. ఆసియాలో అత్యధిక కేన్సర్ మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరూ జీవితంలో ఏదో ఒక సమయంలో కేన్సర్ బారిననపడుతున్నారు. ఇక 2025 నాటికి వార్షిక కేన్సర్ కేసుల సంఖ్య 12.8% పెరుగుతాయని అంచనా.ఎందుకు మినహాయించారంటే..గతేడాది పార్లమెంటరీ ప్యానెల్ కేన్సర్ మందులపై జీఎస్టీని మినహాయించాలని, మందుల ధరలను, రేడియేషన్ థెరపీ వ్యయాన్ని నియంత్రించడానికి కఠినమైన చర్యలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రోగుల సహాయార్థం కేన్సర్‌ని నోటిఫై చేయదగ్గ వ్యాధిగా గుర్తించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. అంతేగాదు ప్యానెల్ సభ్యులు దేశంలో కేన్సర్ చికిత్సకు అవుతున్న అధిక ఖర్చుని హైలైట్ చేయడమే గాక సమగ్ర ధరల నియంత్రణల అవసరాన్ని కూడా నొక్కి చెప్పడంతో ప్రభుత్వం స్పందించి ఇలా వాటిని ప్రాథమిక సుంకంలో మినహాయింపు ఇచ్చింది. ఎలా పొందుతారంటే..కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ లేదా జిల్లా వైద్యాధికారి/సివిల్ సర్జన్ నుంచి రోగులు ధృవీకరణ పత్రాన్ని అందుకుంటే వారికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఇది రోగులకు గణనీయమైన ఖర్చుని ఆదా చేస్తుంది.(చదవండి: దేశ బడ్జెట్‌ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!) -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్‌కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు. -
బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్,బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో వెనుకబడిన జిల్లాలపై కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్‌రెడ్డి,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా’అని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కోరితే ప్రభుత్వం దానిని కేవలం 4 రోజులకు కుదించిందని మండిపడ్డారు. తమ హయాంలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు నిర్వహించి డిమాండ్లపైనా చర్చించేవాళ్లమని గుర్తుచేశారు. -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
ఎక్కడ ఈ నిధులు..? బడ్జెట్ పై KS ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
-
బడ్జెట్ పై YSRCP MPs కామెంట్స్..
-
అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ప్రధానమంత్రినరేంద్ర మోదీ స్పందించారు.యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదమిచ్చే బడ్జెట్ అన్నారు. ముద్ర రుణాలను రూ. 20 లక్షలకు పెంచామని, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తామని చెప్పారు.చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చే బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్ ఇదని తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాం. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్. మౌలిక తయారీ రంగాలను బలోపేతం చేసే బడ్జెట్. బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశాం. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో దోహదం చేస్తుంది. కొత్త ఉద్యోగులకు తొలి జీతం మా ప్రభుత్వమే ఇస్తుంది. ’ అని తెలిపారు. -
దేశ బడ్జెట్‌ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!
గృహిణిగా ప్రతి ఇల్లాలు తన ఇంట్లో చేసే ప్రతి పని కుటుంబ బడ్జెట్‌నే గాక దేశ బడ్జెట్‌ని కూడా మార్చగలదు. వంటింట్లో మండే గ్యాస్ నుంచి తినే ఆహార పదార్థాలు, తాగిపడేసి బాటిల్ దాక ఆమె చేసే ప్రతి పని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడైనా ఆమె అజాగ్రత్తగా వృధా చేసిందా అది కుటుంబ బడ్జెట్‌నే కాదు దేశ ఆర్థికవ్యవస్థపైనే భారం పెంచేస్తుంది. ఓ మహిళగా మనం ఆచరిస్తేనే..మన కుటుంబం దాన్ని ఫాలో అవుతుంది. అదికాస్త దేశ బడ్జెట్‌నే మారుస్తుంది. అదెలాగో చూద్దామా..!ఫుడ్: ఇంట్లో వండిన అన్నం పిల్లలు తినకపోవడం వల్లనో వృధా అయిపోతుందా. ప్రతిరోజూ వండిన అన్నం కూరలు డస్ట్‌బిన్ పాలు చేస్తున్నారా!. ఇలా దేశంలోని లక్షలాది మంది చేస్తే వృధా అవుతున్న ఆహార పదార్థాల విలువ ఏకంగా ఏటా రూ. 92 వేల కోట్లుకి చేరుతుంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా ఎక్కువ. అంతేగాదు గణాంకాల ప్రకారం..దేశంలోని ప్రతి ఒక్కరూ ఏటా కిలోల కొద్ది ఆహార పదార్థాలను మట్టిపాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి దీన్ని పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో తెలుసా..!. అది మన మన దాకా చేర్చడానికి ఎంతమంది, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వస్తుందో తెలుసుకుంటే కచ్చితం వృధా చేసే సాహసం చేయరు. ఈ రోజు నుంచే ఈ వృధాని నివారిద్దాం.వాటర్: నీళ్లే కదా అని తీసి పారేయొద్దు. ప్రభుత్వం ఈ నీటి కోసం ఏటా రూ.69 వేల కోట్లు పైనే ఖర్చు చేస్తోంది. మనం నిర్లక్ష్యంగా కట్టికట్టనట్లుగా ట్యాప్‌ని వదిలేస్తున్నాం. ఇది వ్యర్థ జలంగా మారపోతుంది. ఇలా మన దేశంలో వృధాగా వెళ్తున్న నీరు ఏడున్నర కోట్ల లీటర్లని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి 60 శాతం పైగా నీరు మరుగునీరుగా మారిపోతున్నాయి. వీటిని వాడకంలోకి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. మహిళలు ఇక్కడ కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకునేందుకు ముందుకొస్తారు. అలా కుటుంబంతో సహా మొత్తం దేశంలో అందరిలోనే నెమ్మదిగా మార్పు వస్తుంది.కరెంట్: దేశవ్యాప్తంగా కరెండ్ వృథా ఎంతంటే ..రోజూకి ఐదు కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్ శక్తి తయారీకి అయ్యే ఖర్చు చూస్తే ఏకంగా రూ. 12 కోట్లుపైనే. మరీ ఈ భారం పడేది మనపైనే. అలాగే రేపు విద్యుత్ కొరత తలెత్తితే ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే ఇప్పటి నుంచే ఇంట్లో ప్రతి గదిని చెక్ చేసి మరీ లైట్లు, ఫ్యాన్ల స్విచ్‌లను ఆపేద్దాం.ప్లాస్టిక్ పనిపడదాం: ఇంట్లో ఏ సరకులు తేవాలన్నా క్యారీ బ్యాగ్ తప్పనిసరి. వాటర్ బాటిల్ నుంచి పాల ప్యాకెట్ వరకు ప్రతిదీ ప్లాస్టికే. ఏటా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తగా మారుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత నష్టాన్నీ... కాలుష్యం వల్ల వచ్చే కష్టాన్నీ అన్నింటినీ మనమే భరించాల్సి వస్తోంది. అందువల్ల ఈ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని అలవాటు చేసుకుందాంవంట గ్యాస్: మన వంటింట్లో వెలిగే గ్యాస్ పొయి అంటే మనకు ఎంత నిర్లక్యమో చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఏదో కూర మాడడం లేదా వెలిగించి కట్టడం మర్చిపోవడం వంటివి చేస్తూ అగ్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి కాస్త తెలివితో నాణ్యమైన స్టౌ ఎంచుకుంటే చక్కగా ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చు. మనకు కూడా గ్యాస్‌కి పెట్టే ఖర్చు తగ్గుతుంది కూడా. ముఖ్యంగా బర్నర్లు, పైపులు, రెగ్యులేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా..ఎక్కడైనా లీకేజ్‌లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కోట్లాది రూపాయాలు ఖరీదు చేసే ఇంధనం వృధా కాకుండా నివారించొచ్చు. అందువల్ల ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసే ప్రతి పనిని జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించి.. వృధాకు అడ్డుకట్ట వేస్తే కుటుంబ బడ్జెటే కాదు దేశ బడ్జెట్‌ని అదుపు చెయ్యొచ్చు..లాభాలు పొందొచ్చు.(చదవండి: Union Budget 2024-25: మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్) -
Union budget 2024 : తగ్గేవి, పెరిగేవి ఇవే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అయితే మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్ బాధితులకు భారీ ఊరట లభించనుంది. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తరిగేవి జాబితాను ఒకసారి చూద్దాం!ధరలు పెరిగేవి:ప్లాటినం వస్తువులుబంగారు కడ్డీలుకృత్రిమ ఆభరణాలుసిగరెట్వంటగది చిమ్నీలుకాంపౌండ్ రబ్బరుకాపర్ స్క్రాప్దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలుధరలు తగ్గేవి:కొన్ని రకాల కేన్సర్ మందులుమెడికల్ ఎక్స్-రే యంత్రాలుమొబైల్ ఫోన్లు, ఛార్జర్లుచేపలు, రొయ్యల మేతతోలు వస్తువులుపాదరక్షలువస్త్రాలుబంగారం, వెండి, ప్లాటినం తయారీ ఛార్జీలు -
కేంద్ర బడ్జెట్ 2024-25: ఎవరేమన్నారంటే..
ఢిల్లీ: 2024-25 ఏడాదికి సంబంధించి మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మి శ్రమ స్పందనలు వస్తున్నాయి. బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారో వారి మాటల్లోనే..సామాన్య ప్రజలకు ఏం లేదు: రాహుల్ గాంధీకేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి.. మిత్రపక్షాలకు ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందని మండిపడ్డారు. బడ్జెట్ వల్ల సాధారణ ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. ఇది గత బడ్జెట్ల కాపీ పేస్ట్ మాత్రమేనని చెప్పారు. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పందించారు. లోక్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివినట్లు తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే.. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 30 పేజీలో వివరించిన ఉపాధి సంబంధిత పోత్సాహకం (ఈఎల్ఐ)ను బడ్జెట్లో పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. మేనిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ప్రతి ఒక్క అప్రెంటీస్‌కు అలవెన్స్‌తో కూడిన అప్రెంటీస్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సంతోషం. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఇంకా కొన్ని ఇతర అంశాలను ఆర్థిక మంత్రి కాపీ చేసి ఉంటే బాగుండేది’ అన్నారు. I am glad to know that the Hon'ble FM has read the Congress Manifesto LS 2024 after the election resultsI am happy she has virtually adopted the Employment-linked incentive (ELI) outlined on page 30 of the Congress ManifestoI am also happy that she has introduced the…— P. Chidambaram (@PChidambaram_IN) July 23, 2024 కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల కోసం కాదు.. ప్రభుత్వాన్ని కాపాడుపోవటం కోసమే’అని అన్నారు.#WATCH | Post Union Budget, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "I think this budget should be called 'PM Sarkaar Bachao Yojana' because they have realised if they want to save this Govt for the next 5 years, they would need their alliance partners to be happy. After… pic.twitter.com/PShIvHAqWR— ANI (@ANI) July 23, 20242024-25 బడ్జెట్ ‘పీఎం సర్కార్ బచావో యోజనా’ అని శివసేవ (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది విమర్శలు చేశారు. ఈ బడ్జెట్‌ను గమనిస్తే.. ఐదేళ్ల తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం ప్రవేశపెట్టిందిగా ఉంది. బీజేపీ మిత్రపక్షాల సంతోషం కోసం ఈ బడ్జెట్ రూపొందించారు. కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన..తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యం.రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారుబడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం.తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే.ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారుఅనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాంములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు.ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదుతెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదుమెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదు.తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదుతెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండుస్తున్నా.తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందిఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోందిపార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదుఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు.ఆంధ్రప్రదేశ్‌కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదుసోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు.రాజధాని అమరావతి కోసం, పోలవరంతో, పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారుఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు, సంతోషమే.కానీ ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదుకేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడారు. రైతుల కోసం ఎన్డీయే ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం వాగ్దానాల వల్ల రైతులు ఏం సాధించారు?. ఈ బడ్జెట్లో ఎంఎస్పీ ప్రస్తావన లేదు. కిసాన్ నిధిని పెంచలేదు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలకు మాత్రం బీజేపీ భారీ కేటాయింపులు ప్రకటించింది.#WATCH | Post Budget 2024: Congress leader Pramod Tiwari says, "... They had made big promises for farmers, but what did they get? There was no mention of MSP, and neither was there an increase in Kisan Nidhi... They have handed a 'jhunjhuna' to Bihar and Andhra Pradesh..." pic.twitter.com/gXuKMqj2vJ— ANI (@ANI) July 23, 2024‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘పెహ్లీ నైక్రి పక్కి’అని ప్రతిపాధించిన అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆర్థిక మంత్రి కాపీ చేసి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు’అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు చేశారు. The Finance Minister has taken a leaf out of the INC's Nyay Patra 2024, with its internship program clearly modelled on the INC's proposed Apprenticeship Program that was called Pehli Naukri Pakki. However, in their trademark style, the scheme has been designed to grab… pic.twitter.com/1viGt9rgfg— Jairam Ramesh (@Jairam_Ramesh) July 23, 2024 -
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం సీడీ దేశ్‌ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు. తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్‌ను పరిచయం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్‌ని ఉపయోగించి, పేపర్‌లెస్ ఫార్మాట్లో బడ్జెట్‌ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్‌కేస్‌కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్‌ను ఉపయోగించారు. బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్‌కేస్’ ఫోటోకు పోజులిచ్చారు. ఈసారి బడ్జెట్‌కు బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. -
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget Told him that we will get the same thing that we got for last 10 yearsA Big Zero— KTR (@KTRBRS) July 23, 2024 మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. -
Union Budget 2024-25: బడ్జెట్ మథనంలో అమృతం చిలికేనా!
అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే... ఐటీ ఊరట.. ఈసారైనా...! ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఓటాన్ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది. రియల్టీ డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు (ఆర్ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్ఈఐటీ సంఘం డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే. ఈవీలపై ఏం చేస్తారో...ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది. ఫార్మా కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి. ‘స్వదేశీ’ రక్షణ! అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనత
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సెషన్ 2024 ఆగస్టు 12న ముగుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను అనుసరించి భారీ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి సీతారామన్ తన 7వ బడ్జెట్‌ను జూలై 23న ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్.. ఏడవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.1959 నుంచి 1964 వరకు మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపట్టారు. మొత్తం మీద దేశాయ్ 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా అత్యధికసార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డ్ ఈయన పేరుమీదనే ఉంది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ విషయంలో మాత్రమే ఆ రికార్డును సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.నిజానికి ఇందిరా గాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలా సీతారామన్ ఖ్యాతిగడించారు. భారతదేశంలో ఎక్కువకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మహిళ కూడా సీతారామన్ కావడం గమనార్హం.బ్రీఫ్‌కేస్ విధానానికి మంగళం పాడి.. జాతీయ చిహ్నం కలిగిన బుక్ తరహాలో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయాన్ని, పేపర్‌లెస్ కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం, అత్యల్ప బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులు కూడా సీతారామన్ ఖాతాలోనే ఉన్నాయి. -
ఆర్ధికమంత్రి లేకపోతే బడ్జెట్ ఎవరు సమర్పిస్తారు.. మీకు తెలుసా?
బడ్జెట్ అనేది ఎప్పుడైనా ఆర్ధిక మంత్రులే ప్రవేశపెడతారని అందరూ అనుకుంటారు. ఆర్థిక మంత్రులు అందుబాటులో లేకుంటే?.. ఈ ప్రశ్న బహుశా ఎవరికైనా వచ్చి ఉంటే.. సమాధానం కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రశ్నకు జవాబు ఈ కథనంలో తెలుసుకోండి.బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తే.. లేదా ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేకుంటే.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానమంత్రులు స్వీకరిస్తారు. ముంద్రా కుంభకోణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 1958 ఫిబ్రవరి 22న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రాజీనామాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై పడింది.1958లో ప్రధానమంత్రిగా.. విదేశీ వ్యవహారాలు & అణు ఇంధన శాఖలను నిర్వహిస్తున్న నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించడానికి ఆ సమయంలో బాధ్యత వహించి 1958 ఫిబ్రవరి 28 బడ్జెట్ సమార్పించారు. ఆర్థిక మంత్రి కాకుండా ప్రధానమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే మొదటిసారి.నెహ్రూ తర్వాత.. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో 1967-68 నుంచి 1969-70 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లను, అలాగే 1967-68 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. మాజీ ప్రధాని 1959 నుంచి 1969 వరకు మొత్తం 10 బడ్జెట్లను సమర్పించారు.1970లో దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన పదవీకాలంలో రెండుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె బడ్జెట్లు పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు బ్యాంకుల జాతీయీకరణపై దృష్టి సారించాయి. 1987లో వీపీ సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ గాంధీ 1987-89లో బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు.ఇదీ చదవండి: 'ఇన్కమ్ ట్యాక్స్' ఎలా వచ్చింది.. భారత్ మొదటి బడ్జెట్ గురించి తెలుసా?ఇకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఇది BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత సమర్పిస్తున్న మొదటి బడ్జెట్. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ఆగస్టు 12తో ముగియనుంది. -
ఢిల్లీకి రూ. పది వేల కోట్లు కేటాయించాలి.. ఆప్ మంత్రి డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి కేంద్రానికి రూ. 25,000కోట్లు అందుతోందని ఆమె తెలిపారు. అంతేగాక ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా ఆదాయపు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం రాజధానికి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు.ఈనెల 23న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానిలో రోడ్డు, రవాణా, విద్యుత్ రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించడానికి ఢిల్లీకి మరింత డబ్బు విడుదల చేయాలని అతిషి కోరారు.2001 నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం పన్నుల కింద కేవలం రూ.325 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని ఆమె అన్నారు. అయితే, ఈ చెల్లింపు కూడా గత ఏడాది ఆగిపోయిందని.. ఏడాది కాలంలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని, ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు. -
1950లో బడ్జెట్ లీకయ్యిందా? తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న పార్లమెంట్లో సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది ఒకప్పుడు ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.ఇదీ చదవండి: 1999 తర్వాత బడ్జెట్ టైమ్ ఎందుకు మారిందో తెలుసా?బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్ళందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు. -
రేపు ఆర్థికవేత్తలతో మోదీ సమావేశం.. ఎందుకంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో గురువారం సమావేశమవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా హాజరుకానున్నారు. కాగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ3.0 మొదటి బడ్జెట్. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గత నెలలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, సంస్కరణల వేగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలతో ముందుకు వస్తుందని సూచించారు. ప్రభుత్వం విధానాలు భవిష్యత్తు దృష్టికి బడ్జెట్ సమర్థవంతమైన పత్రంగా ఉంటుందని అన్నారు.నిర్మల సీతారామన్ ఇప్పటికే రాబోయే బడ్జెట్‌పై ఆర్థికవేత్తలు, భారతీయ పరిశ్రమలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపారు. ఇందులో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ.. వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలతో ముందుకు రావడానికి సామాన్యులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. -
2024 యూనియన్ బడ్జెట్: ఉద్యోగ కల్పనపై దృష్టి!
ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఆగష్టు 12 వరకు జరగనున్నాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇటీవలే వెల్లడించారు.త్వరలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో నిర్ణయించిన GDPలో 5.1% ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక విధానానికి సంబంధించిన విస్తారమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందని భారతదేశ ప్రధాన ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా పేర్కొన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వేగంగా వృద్ధి వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఉద్యోగాల కల్పనలో మాత్రమే వెనుకబడింది. రాబోయే దశాబ్దంలో 7% GDP వృద్ధి కూడా ఉద్యోగ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త సమీరన్ చక్రవర్తి ఒక నోట్లో తెలిపారు. 7 శాతం వృద్ధి రేటు 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. నిజానికి కావాల్సిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.ఈ ఏడాది జరిగిన జాతీయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. మిత్రపక్షాల సహాయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది. పోస్ట్ పోల్ సర్వేలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణంగానే బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయిందని వెల్లడించాయి. అంతే కాకుండా ప్రతి పక్షం కూడా దేశంలో నిరుద్యోగ సమస్య గురించి చెబుతూనే ఉంది. కాబట్టి రాబోయే బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అనుగుణంగా ఉండే ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బడ్జెట్ సమావేశాలకు మూహుర్తం ఫిక్స్.. 23న బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో తొలి బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రవేశపెట్టనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.కాగా ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే చెప్పారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి నిర్మలా శ్రీకారం చుట్టారు.. -
ఇది ఎన్నికల బడ్జెట్ కాదు: వైఎస్సార్సీపీ ఎంపీ ప్రశంస
ఢిల్లీ, సాక్షి: ఇండియా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిరనుందని.. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌తో ఖర్చుకు ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్(మధ్యంతర)పై ప్రశంసలు గుప్పించిన ఆయన.. దీర్ఘకాలిక లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టినట్లు అభిప్రాయపడ్డారు. ‘‘ఇది ఎన్నికల బడ్జెట్ కాదు. ఎన్నికల కోసం కాకుండా, లాంగ్ టర్మ్ తో బడ్జెట్ పెట్టారు. పన్నుల విధానాన్ని మార్చలేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వ్యక్తిగత పన్నులు, కార్పొరేట్ పన్నులు మార్చలేదు. రూఫ్ టాప్ సోలార్ తో నెట్ జీరో దిశగా ఈ పథకం తీసుకొచ్చారు. ప్రతి ఇంటి పైకప్పు పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా, దానిపై ఆదాయం పొందేలా పథకం తీసుకురావడం బాగుంది. గ్రీన్ ఎనర్జీ కోసం దేశంలోని ప్రతీ కుటుంబం తమ వంతు భాగస్వామ్యం తీసుకోవాలి.. .. నేషన్ ఫస్ట్, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అనే విజన్ తో వెళ్లారు. దీర్ఘకాలంలో ఆస్తుల సృష్టిపై దృష్టి పెట్టారు. ద్రవ్యోల్బణం , లోటు నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్ల కిందటకి, ఇప్పటి ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయడం మంచిదే. మంచి పాలసీలు రూపొందించారు. అనవసరంగా ప్రభుత్వం జోక్యం లేకుండా చేశారు. అందరిలో నమ్మకాన్ని కల్పించారు .. రెంటల్ హౌసింగ్ స్కీమ్ తో వర్కర్స్ కు శాశ్వత గృహాలు లభ్యమవుతాయి. శ్రామికుల పరిణామాలు పెరుగుతాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా మంచి కసరత్తు చేశారు. వికసిత భారత్ దిశగా అడుగులు వేసేందుకు ఈ బడ్జెట్ కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
లక్షద్వీప్ పై కీలక ప్రకటన: నిర్మలా సీతారామన్
-
Interim Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Live Updates.. ►లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం. యువతీ యువకుల కోసమే ఈ బడ్జెట్. అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది. మౌళిక సదుపాయాల కోసం రూ.11వేల కోట్లు కేటాయించాం. పేదలు, రైతులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగం. కోటి గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. ►లోక్‌సభ రేపటికి వాయిదా. ►లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల. ఇది ప్రజల బడ్జెట్. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. ప్రధాని మోదీ సారధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది. వేతన జీవులకు ఊరట కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదు. ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50వేల నుంచి 75వేలకు పెంపు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారులకు అభినందనలు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనా. ఫిజికల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గింపు. కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు లేవు. ఆదాయపు పన్నుల శ్లాబులు యథాతథం. 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు. ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం. ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. అదే మా మంత్రం. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు. గత పదేళల్లో అందరికీ ఇళ్లు, గ్యాస్, నీళ్లు ఇచ్చాం. అవినీతిని గణనీయంగా తగ్గించాం. శతాబ్ధంలోని అతిపెద్ద సంక్షోభం కోవిడ్‌ను అధిగమించాం. కోవిడ్‌ను అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం. #WATCH | Union Finance Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25. "...The Indian economy has witnessed a profound positive transformation in the last 10 years, The people of India are looking ahead to the future with hope and optimism. With the… pic.twitter.com/yJUnh3WLze — ANI (@ANI) February 1, 2024 మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉంది. పన్ను సంస్కరణలతో గుణాత్మకమైన పురోగతి సాధించాం. ద్రవ్యోల్భణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. పాలనలో పారదర్శకతను పెంచాం. మూలధన వ్యయం రూ.11.1లక్షల కోట్లకు పెంపు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు. స్టార్ట్‌ప్‌ల కోసం రూ.43వేల కోట్ల రుణాలు. టూరిజాన్ని పొత్రహించేందుకు వడ్డీ లేని రుణాలు. దేశంలో కొత్తగా 5 సమీకృత యాక్టివ్ పార్కులు. 30కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం. 9కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించాం. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. రూప్ టాప్ సోలార్ విధానంలో కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఇచ్చాం. పీఎం విశ్వకర్మ యోజన పథకంతో చేతి వృత్తుల వారిని కాపాడుకుంటున్నాం. ఆశావర్కర్లు అందరికీ ఆయుష్మాన్ భారత్. లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్‌కి కార్పస్ ఫండ్. వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేశాం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో విజయం సాధించాం. విషన్ ఫర్ వికసిత్ భారత్... సుసంపన్నమైన భారత్‌ను ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ప్రకృతితో మమేకమై, ఆధునిక మౌలిక సదుపాయాలతో అందరికీ వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించేందుకు అవకాశం కల్పించడం మా లక్ష్యం. అందరి విశ్వాసం చూరగొనడం ద్వారా రానున్న ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించనుంది. ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సువర్ణ సంవత్సరాలుగా మిగలనున్నాయి. పీఎం ఫసల్ కింద నాలుగు కోట్ల మంది రైతులకు బీమా అందించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్భణం, అధిక వడ్డీ. పీఎం ఆవాస్ యోజక కింద మహిళలకు 70వేల గృహాలు అందించాం. యూరప్ ఎకనామిక్ కారిడార్ దేశానికి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. డెమోగ్రఫీ, డెమొక్రసీ, డైవర్శిటీలకు సబ్ కా ప్రయాస్ అంటే అందరి ప్రయత్నాలను జోడించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చగలం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో అవకాశాలకు కొదవలేదని, ఆకాశమే హద్దని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మా ప్రభుత్వానికి సకాలంలో తగినంత ఆర్థిక వనరులు, టెక్నాలజీలు, శిక్షణ ఇవ్వడం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందివ్వడం ప్రాధాన్యమైన అంశం. పంచామృత్ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తాం ఇంధన భద్రత, అందరికీ చౌకగా ఇంధనం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు ఎకనామిక్, లాజిస్టిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నాం. మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెలుస్తున్నాం. 40వేల నార్మల్ బోగీలను వందే భారత్ మోడల్లోకి మారుస్తున్నాం. పోర్టు కనెక్టివిటీ కారిడార్ అభివృద్ధి జరిగింది. పీఎం గతిశక్తి ద్వారా మల్టీమోడల్ కనెక్టివిటీ అభివృద్ధి. మత్య్స రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెండింతలు పెరిగాయి. మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లను అందిస్తాం. 517 ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం కల్పిస్తాం. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించడం, గొడౌన్లు, శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఉంటుంది. వేర్వేరు పంటలకు నానో డీఏపీ వాడకాన్ని దేశంలోని అన్ని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరిస్తాం. నూనెగింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. అధిక దిగుబడులిచ్చే వంగడాల వృద్ధికి పరిశోధనలు చేపడతాం పాడి రైతుల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం ఒకదాన్ని సిద్ధం చేస్తాం. పాల ఉత్పత్తిలో భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కానీ.. పశువులను వృద్ధి చేయడంలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ లోటును అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. మత్స్య సంపదను పెంచేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2013 నాటితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ఇన్‌ల్యాండ్, అక్వాకల్చర్ ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను అక్వాకల్చర్ ఉత్పాదకతకు ప్రస్తుతన్న హెక్టారుకు మూడు టన్నుల నుంచి ఐదు టన్నులకు పెంచేందుకు ఉపయోగించుకుంటాం. సమీకృత ఆక్వాపార్క్‌లు దేశవ్యాప్తంగా ఐదింటిని ఏర్పాటు చేస్తాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడం 55 లక్షల మందికి ఉద్యోగలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నాం టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్. పౌరవిమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ! 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతమున్న ఆసుపత్రుల ద్వారానే మరిన్ని కళాశాలల ఏర్పాటుకు ఈ కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. మాతాశిశు సంక్షేమానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు కార్యక్రమాలను ఒక ఛత్రం కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. టీకాకీరణను మరింత మెరుగుపరిచేందుకు కొత్త న్యూ విన్ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తాం. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధిస్తాం. సామాజిక న్యాయం మా పరిపాలనా విధానంలో ఒక భాగం. చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే. గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజనా 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పించింది. రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం. 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం. ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు. స్టెమ్ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే. ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది ట్రిపుల్ తలాక్ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి. అందరికీ అవకాశాలు లభిస్తాయి వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం. Union Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25 at the Parliament. pic.twitter.com/ooIT0ztsof — ANI (@ANI) February 1, 2024 ►బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget in the House, shortly. pic.twitter.com/wfhk1MdQp7 — ANI (@ANI) February 1, 2024 ►అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా యువత, మహిళలపై ఫోకస్ పెట్టినట్టు కామెంట్స్ #WATCH | On Budget 2024, Amravati MP Navneet Rana says, "We expect the Budget will focus on youth and women." pic.twitter.com/M0nf1HoMLo — ANI (@ANI) February 1, 2024 ►పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కాసేపటి క్రితమే ముగిసిన కేబినెట్ సమావేశం. ►2024 మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్ ట్యాక్స్ పేయర్లు కొత పన్ను విధానాన్ని ఎంచుకొనేలా మార్పులు చేసే అవకాశం ఇన్‌కంటాక్స్ మినహాయింపు పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే చాన్స్ పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులకు వీలు ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచే చాన్స్ విదేశీ ఆదాయంపై ట్యాక్స్ రిటర్నుల సవరణలు మరింత సులభతరం చేసే అవకాశం ఈవీ వాహన లోన్స్‌పై వడ్డీలో రాయితీలు పెంచే అవకాశం ►రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారుల బృందం. Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman along with Ministers of State Dr Bhagwat Kishanrao Karad and Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union… pic.twitter.com/o2UrUCRuaH — ANI (@ANI) February 1, 2024 ►రాష్ట్రపతిభవన్‌కు బయలుదేరిన కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు. #WATCH | Finance Minister Nirmala Sitharaman along with her team before the presentation of the country's interim Budget pic.twitter.com/hohpB7qtZi — ANI (@ANI) February 1, 2024 ►ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దన్న నిర్మల. మరోవైపు.. ఈసారీ బడ్జెట్లో ఊరటలు ఉంటాయని నమ్ముతున్న జనం. ►కేంద్ర మధ్యంతర బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ►కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు. #WATCH | Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance as she is set to present the interim Budget today pic.twitter.com/46Ut7oHdzE — ANI (@ANI) February 1, 2024 ►కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. #WATCH | Delhi | MoS Finance Pankaj Chaudhary arrives at the Ministry of Finance. Finance Minister Nirmala Sitharaman will present the Union Interim Budget today. pic.twitter.com/dW1LEupHKe — ANI (@ANI) February 1, 2024 ►బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. ►లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. -
Budget 2024: ఆమె పద్దు ఆరోసారి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐదు వార్షిక బడ్జెట్లు కాగా ఇప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఐదు బడ్జెట్లను సమర్పించిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమించనున్నారు. ఆయన పదిసార్లు అత్యధిక సార్లు బడ్జెట్లను ప్రవేపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఉంది. మొత్తంగా ఆయన పది బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఏ ఆర్థిక మంత్రికి అయినా గరిష్టంగా ఒక మధ్యంతర బడ్జెట్ సహా వరుసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలోనూ మరో పర్యాయం ఆర్థిక మంత్రిగా కొనసాగితే మరిన్ని బడ్జెట్లు సమర్పించే వీలుంటుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఓట్-ఆన్-అకౌంట్‌గా ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నందున ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ఎటువంటి "అద్భుతమైన ప్రకటన" ఉండదని, ఇది సాధారణ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-అకౌంట్ మాత్రమే అని అన్నారు. -
కేంద్ర బడ్జెట్ గేమ్ చేంజర్
సాక్షి, హైదరాబాద్: విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలకు కేంద్ర బడ్జెట్ 2023–24 మేలు మలుపు (గేమ్ చేంజర్)లాంటిదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభివర్ణించారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి అత్యధిక కేటాయింపులతో రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఈ మూడు రంగాలకు కేటాయింపులపై శుక్రవారం ఆమె రాజ్‌భవన్‌లో ఆయా రంగాల నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించారు. జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తికి అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలతో విద్యా రంగంలో మార్పులు రాబోతున్నాయన్నారు. వ్యవసాయ రంగ అంకుర పరిశ్రమలు, సాంకేతిక వినియోగం, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపుల పెంపుతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్ఐఆర్డీ, ఎన్ఏఆర్ఎం, ఇక్రిశాట్,సెస్, ఇఫ్లూ్ల, ఉర్దూ వర్సిటీల నిపుణులు చర్చలో పాల్గొని కేంద్రబడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్–2023 వేడుకల్లో భాగంగా గవర్నర్ అతిథులకు మినుములతో చేసిన వంటకాలను అందించారు. -
ప్రధాని మోదీకి పూలమాలతో సన్మానం
ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పూమాల, బీజేపీ నేతల చప్పట్ల నడుమ సన్మానం జరిగింది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర బడ్జెట్ 2023 నేపథ్యంతో ప్రధాని మోదీపై అభినందనలు కురిపిస్తూ బీజేపీ ఈ సన్మానం చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మెడలో దండ వేయగా.. అక్కడే ఉన్న బీజేపీ నేతలంతా చప్పట్లతో మోదీకి గౌరవం ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనరంజకమైన బడ్జెట్‌ను రూపొందించారని ఈ సందర్భంగా అంతా కొనియాడారు. #WATCH | Delhi: At BJP Parliamentary Party meeting, BJP national president JP Nadda felicitates Prime Minister Narendra Modi for the #UnionBudget2023 pic.twitter.com/MmzcRyUlwY — ANI (@ANI) February 7, 2023 పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో.. ప్రతీ మంగళవారం బీజేపీ వారాంత సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 31వ తేదీన రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో విపక్షాల ఆందోళన నడుమ సభ సజావుగా జరగడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ప్రవేశపెట్టలేకపోయింది కేంద్రం. -
దయలేని బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో పేదలకు, రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. గత బడ్జెట్లో దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీరాలు పలికింది. ఆ వాగ్దానాల్లో ఎన్ని నెరవేరాయో ఆర్థిక మంత్రి తెలపాల్సి ఉంది. ఇక, ఈసారి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 33 శాతం కోత విధించారు. యువతకు, రైతులకు, నిరుపేదలకు ప్రయోజనాలు కలిగించని క్రూరమైన బడ్జెట్ ఇది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి సంపూర్ణ బడ్జెట్. దీనిపై ప్రజలు చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2023–24 కేంద్ర బడ్జెట్... వంచనాత్మక బడ్జెట్‌గా మారిపోయింది. మన దేశ యువతకు, రైతులకు, కార్మికులకు, మహిళలకు, షెడ్యూల్డ్ తెగలకు, నిరు పేదలకు ఎలాంటి ప్రయోజనాలను కలిగించని, ప్రకటించని క్రూరమైన బడ్జెట్‌గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం తనిఖీ, ఉపాధి కల్పన వంటి చర్యల గురించి ప్రస్తావించడంలో బడ్జెట్ విఫలమైంది. పైగా ఇవి ఇప్పుడు చాలా ప్రధానమైనవి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలపై ఒక కన్ను వేసి ఈ బడ్జెట్‌ని సిద్ధం చేసినట్లు అర్థమౌతోంది. కానీ మధ్యతరగతిపై పడుతున్న ఒత్తిడిని అర్థం చేసుకున్నానని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన రాజకీయ గిమ్మిక్కుగా మారిపోయింది. ఎందుకంటే మధ్యతరగతికి భారంగా పరిణమించిన ధరల పెరుగుదల నుంచి ఉపశమన చర్యలకు సంబంధించి ఎలాంటి తక్షణ, నిర్దిష్ట చర్యలను బడ్జెట్ ప్రకటించలేదు మరి. అత్యవసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా తమ చేతుల్లో కాసింత నగదు ఉండటానికి ఈ బడ్జెట్లో చర్యలు తీసుకుంటారని ధరల పెరుగుదల భారాన్ని మోస్తున్న సాధారణ పౌరులు ఆశలు పెట్టుకున్నారు. ఆలాగే కొన్ని అవసరమైన రాయి తీలు కూడా ప్రకటిస్తారనుకున్నారు. కానీ అసలైన సమస్యను ఎవరూ ముట్టలేదు. ప్రభుత్వం పెద్ద పెద్ద గణాంకాలు వల్లె వేస్తూ, పథకాలకు ఆకర్షణీయమైన పేర్లను పెట్టి ప్రజలను బుజ్జగించడానికి ప్రయ త్నించింది. ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ షట్‌డౌన్ ప్రభావం, ఆరోగ్య, విద్యా ఫలితాలను మెరుగుపర్చడం వంటి సమస్యలపై బడ్జెట్ ఎలాంటి దృష్టీ పెట్టలేకపోయింది. పైగా నూతన పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను రాయితీని ఏడు లక్షల రూపాయలకు పెంచామనీ, పన్ను శ్లాబ్‌లు మార్చామనీ ప్రభుత్వం గొప్పగా చేసిన ప్రకటన కూడా వేతన జీవులకు పిడుగుపాటులా తగిలింది. ఎందుకంటే ఈ రాయితీకి 80–సి కింద ఎలాంటి మినహాయింపూ ఇవ్వలేదు. దీర్ఘకాలంలో వ్యక్తుల సామాజిక భద్రత కోసం అవసరమైన పొదుపులను ఇది నిరుత్సాహపరుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీమా రంగాన్ని చావు దెబ్బ తీస్తుంది. అంతే కాకుండా బీమా ఏజెంట్ల ఉద్యోగాలను దెబ్బ తీస్తుంది. రాజకీయంగా ప్రభావితం చేసే అతి కొద్దిమందికి ప్రత్యక్ష ప్రయోజనాలు ఇస్తూ, అత్యధిక ట్యాక్స్ శ్లా్లబ్ మాత్రం తగ్గించారు. వేగంగా పెరుగుతున్న నిరుద్యో గాన్ని తాజా బడ్జెట్ ప్రస్తావించలేదు. రాష్ట్రాల, దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింపజేసే అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా 33 శాతం కోత విధించారు. ఈ ఒక్క అంశాన్ని చూసినా చాలు ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక మైనదని రుజువవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనలు, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ చేసిన డిమాండ్, కేంద్ర పన్నుల బకాయలు, బొగ్గు రాయల్టీల బదిలీ వంటి అంశాలను గాలికి వదిలేశారు. బొగ్గు రాయల్టీల రేటును ఈ సంవత్సరం అసలు పెంచలేదు. దీన్ని చివరిసారి 2014లో మాత్రమే పెంచారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, జగదల్పూర్, సర్గుజా వంటి ప్రాంతాలు డిమాండ్ చేసిన కొత్త రైళ్లను అసలు ప్రకటించలేదు. 2022 చివరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ సమయంలో హమీ ఇచ్చింది. ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామనీ, 60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ కూడా వాగ్దానం చేసింది. కానీ గత బడ్జెట్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేరాయో ఆర్థిక మంత్రి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ జీడీపీకి వ్యవసాయం 14–15 శాతం మేరకు దోహదం చేస్తోంది. కానీ కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం లేదా రైతులకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పిస్తామనే మాట కూడా తాజా బడ్జెట్లో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆవు పేడను ఉపయో గించుకునేందుకు ఇప్పుడు గోవర్ధన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఛత్తీస్‌గఢ్ నమూనాకు వట్టి అనుకరణ మాత్రమే. రెండు రూపాయ లకు కిలో ఆవు పేడను కొనడం ద్వారా గత రెండేళ్లుగా ‘గోదాన్ న్యాయ్ యోజన’ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ వస్తోంది. దశలవారీగా ఈ పథ కాన్ని అమలు చేయడం ద్వారా ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిలకడైన పురోగతిని రాష్ట్రం ప్రభుత్వం సాధించింది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ రైతులు వానపాము ఎరువును తయారు చేస్తున్నారు. రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించుకున్నారు. పైగా ఈ పథకంతో ముడిపడి ఉన్న మహిళల ఆదాయం కూడా పెరిగింది. కట్టుదప్పిన పశువుల ద్వారా పంటలకు కలుగుతున్న నష్టం సమస్య గురించి తాజా బడ్డెట్ అసలు ప్రస్తావించలేదు. అలాగే సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు చుక్కలనంటు తున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి బడ్జెట్ నిర్దిష్టంగా ఏమీ పేర్కొనలేదు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బయోగ్యాస్, గ్రీన్ గ్రోత్ (మన సంక్షేమానికి అతి కీలకమైన సహజ వనరులు, పర్యావర ణానికి నష్టం కలిగించని అభివృద్ధి)పై దృష్టి పెడతామని బడ్జెట్ పేర్కొంది. కానీ వరి నుంచి ఇథనాల్ ఉత్పత్తికి అనుమతి కోరుతూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వరుసగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇవ్వకుండా ఇప్పటికీ పెండింగులో ఉంచుతోంది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో చిరుధాన్యాల కనీస మద్దతు ధర గురించి అసలు ప్రస్తావించలేదు. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మేము 52 రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాము. భూపేశ్ బఘేల్ వ్యాసకర్త ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి -
కారుణ్య బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. ఆర్థిక ఉత్పాతాలకు లోనయ్యే ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం అనేక చర్య లను ప్రతిపాదించింది. కళాకారులకూ, హస్తకళాకారులకూ నిపుణతలు నేర్పించే పీఎం – వికాస్ వంటి పలు పథకాలను పేర్కొని తీరాలి. ఇవి 2047 నాటికి వికాస్ భారత్ లక్ష్యసాధనకు పునాది వేస్తాయి. 2023–24 కేంద్ర బడ్జెట్ దాని ఆదర్శాలకు సంబంధించి సాహసో పేతమైనదే, కానీ దాని గణన విధానంలో సాంప్రదాయికమైనది. దాని వ్యూహాల్లో ఆశావహమైనది, అయినప్పటికీ అది వాస్తవంలో బలమైన పునాదిని కలిగిఉంది. ఇది ప్రపంచ సూక్ష్మ ఆర్థిక ముఖ చిత్రం చుట్టూ ఉన్న అనిశ్చితత్వాలను విజయవంతంగా సంగ్రహించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమృత్ కాల్ వైపు గమనం సాగిస్తున్నందున దానికి అవసరమైన దృఢత్వాన్ని పెంపొందించి, వృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్ మ్యాప్‌ని అందించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (ప్రతి ఒక్కరితో, అందరి అభి వృద్ధి కోసం) అనే పంక్తులను అనుసరించిన ఈ బడ్జెట్ సకల జనుల బడ్జెట్‌గా ప్రశంసలందుకుంది. సమాజంలోని అన్ని వర్గా లకూ ఇది ఏదో ఒక అవకాశాన్ని ప్రతిపాదించింది. బడ్జెట్ అనే ఈ డాక్యుమెంట్ 2047లో భారత్ ఆకాంక్షిస్తున్న తరహా సమాజం గురించి ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరు స్తోంది. ఇండియా ఎట్ 100 (వందేళ్ల భారత్) సమగ్రత, సంపద్వంతం అనే స్తంభాలపై నిలబడుతుంది. అప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు ప్రత్యేకించి మన యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు దేశంలోని పౌరులందరికీ చెందుతాయి. సమీకృత అభివృద్ధి, చివరి మైలురాయిని కూడా చేరుకోవడం అనే రెండు తొలి ప్రాధాన్యాల ద్వారా ఈ దార్శనికత ప్రతిఫలిస్తుంది. ఆర్థిక ఉత్పాతాలకు సులభంగా లోనయ్యే దుర్బలమైన ఆదివాసీ బృందాలు, మహిళలు, యువత కోసం; సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారసంస్థల సాధికారత కోసం తాజా బడ్జెట్ చర్య లను ప్రతిపాదించింది. సాంకేతికతను, ఆర్థికాన్ని సమ్మిళితం చేయడం ద్వారా వ్యక్తులకు, స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడంపై తాజా బడ్జెట్ గట్టిగా దృష్టి పెట్టింది. మన యువతకు సాధికారత కల్పిస్తూ, అమృత్ పీఢీ (బంగారు తరం) తన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంలో సహాయం చేసేందుకు తగిన విధానాలను అది రూపొందించింది. యువతకు, మహిళలకు, హస్తకళాకారులకు, స్వయం సహాయక బృందాలకు విస్తృతంగా ఉద్యోగాల కల్పన కోసం తగిన నైపుణ్యాల ప్రాధాన్యతపై అది దృష్టి పెట్టింది. సాంప్రదాయిక కళాకారులకు, హస్తకళా కారులకు నిపుణతలు నేర్పించడం కోసం ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ (పీఎమ్–వికాస్) వంటి పథకాలను ప్రత్యేకంగా పేర్కొ నాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తల ద్వారా వ్యవసాయాధారిత అగ్రిస్టార్టప్లను ప్రోత్స హించడానికి అగ్రికల్చర్ ఆక్సిలేటర్ ఫండ్ కల్పన, ‘దేఖో అప్నా దేశ్ ఇనిషి యేటివ్’ కింద పర్యాటక రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాలు, పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించడానికీ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా, అమృత్ పీఢీ కార్యక్రమం ద్వారా యువశక్తికి, ఆధునిక నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పథకం కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అంశాల్లో యువతకు నైపుణ్యాలను కల్పిస్తుంది. అంతేకాకుండా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఉపకార వేతనాలు కూడా అందిస్తోంది. ఇలా రూపొందిన నిపుణ కార్మిక శక్తి నుండి పర్యాటక రంగం ప్రయోజనం పొందుతుంది. ఇక యువ పారిశ్రామికవేత్తలయితే ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ప్రతిపాదిత ‘యూనిటీ మాల్స్’ గుండా మార్కెటింగ్ మద్దతు కూడా పొందుతారు. బాహ్య ఎదురుగాలులను తట్టుకునేందుకుగాను బడ్జెట్ ఆశిస్తున్న శక్తి గుణకాల్లో ఇవి ఓ భాగం. అనిశ్చితమైన బాహ్య వాతావరణం ద్వారా ఎదురయ్యే సవాళ్లను బడ్జెట్ గుర్తించడమే కాదు, వృద్ధి పెంపుదలలో దేశీయ చోదకశక్తులు ఎంత కీలకమో ఎత్తి చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ భారత్ ఆర్థిక ప్రమా దాల నుంచి బయటపడటమే కాకుండా, 2023లో 7 శాతం, 2024 ఆర్థిక సంవత్సరంలో 6.6 లేదా 6.8 శాతం వృద్ధి రేటు అంచనాను నిలబెట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను నడిపించింది. అంతర్జాతీయ ఉపద్రవాల నేపథ్యంలో కూడా, ఇప్పటికీ దృఢంగా ఉంటూ, దూసుకెళుతున్న దేశీయ చోదక శక్తుల ద్వారా ఆర్థిక వృద్ధి సాగుతోంది. కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ విని యోగం పెరగడం కూడా దీనికి తోడయింది. బహుముఖంగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల కాంట్రాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసు లపై వ్యక్తులు ఖర్చుపెట్టడం సాధ్యమైంది. ఇళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం, అధిక స్థాయిలో మూలధన వ్యయం (33 శాతం పెరుగుదలతో 10 లక్షల కోట్లకు పెరిగింది) పెరగడం, కార్పొరేట్ల ఆదాయ, వ్యయ సమాచార నివేదికలు బలపడటం వంటివి వీటిలో కొన్ని. దీనికి అనుగుణంగా వ్యవసాయం, టూరిజం, మౌలిక వ్యవస్థాపన వంటి వాణిజ్యేతర రంగాలపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా పర్యా వరణం, గ్రీన్ ఎకానమీ వంటి క్రాస్ కటింగ్ థీమ్‌లు (ప్రధాన లక్ష్యంపై గురి తప్పకుండానే అనుబంధ అంశా లపై దృష్టి పెట్టడం) కూడా బడ్జెట్ లోకి వచ్చాయి. ప్రభుత్వ విధాన రోడ్ మ్యాప్‌లో సుస్థిరాభివృద్ధికి కేంద్ర స్థానం. అదేవిధంగా ‘పంచామృత్’ (అయిదు ప్రతి జ్ఞలు), ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ అనుకూల జీవన శైలి), నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, (రూ.19,700 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), కాలం చెల్లిన వాహనాల తొలగింపు విధానం, చెత్త నుంచి సంపదను సృష్టించే 500 వందలకు పైగా నూతన ప్లాంట్లను నెలకొల్పే గోవర్ధన్ స్కీమ్ (10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు), తీరప్రాంత నివాసాల రక్షణ కోసం మడ అడవుల పెంపకం, ప్రత్యక్ష ఆదాయ పథకం వంటి వాటి గురించి 2023–24 బడ్జెట్లో నొక్కి చెప్పడమైనది. సొంత చొరవ, కార్యకలాపాల ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యాల సాధన కోసం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గణనీయ స్థాయిలో మార్గదర్శకత్వాన్ని అందజేస్తుంది. స్టేట్ సపోర్ట్ మిషన్ ద్వారా నీతి ఆయోగ్ మరింత నిర్మాణాత్మక, సంస్థాగత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలతో తాను వ్యవహరించే తీరును మరింత మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. మరోవైపున నీతి ఆయోగ్ నేతృత్వంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (ఆకాంక్ష జిల్లాలు) ప్రోగ్రామ్ విజయం గురించి, ఇటీవలే ప్రారంభించిన ఆస్పి రేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లలోని సామర్థ్యం గురించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ పరివర్తనా కార్య క్రమం ద్వారా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌ల లోని(సమితులలోని) పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడానికి పాలనను మెరుగుపర్చ డంపై కూడా దృష్టి పెడుతుంది. ఇవి, మరికొన్ని కార్యకలాపాలు... 2047 నాటికి వికాస్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యసాధన వైపుగా... మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలతో సహకా రాత్మక చర్యకు పునాది వేస్తాయి. సుమన్ బెరీ వ్యాసకర్త నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ -
వాల్తేర్ డివిజన్‌కు రూ.2857.85 కోట్లు కేటాయింపు
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు 2023–24 బడ్జెట్లో రూ. 2857.85 కోట్లు కేటాయించినట్టు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో విజయనగరం–సంబల్ పూర్ (టిట్లాఘర్) మూడోలైన్ (264.60 కిలోమీటర్లు) నిర్మాణానికి 920 కోట్లు, కొత్తవలస–కోరాపుట్ (189.278 కిలోమీటర్లకు) రూ. 410 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. గోపాలపట్నం–విజయనగరం వరకూ ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ, బైపాస్లైన్లు ఏర్పాటుకు రూ. 32.78 కోట్లు, రోడ్డు సేఫ్టీ వర్క్స్, అండర్ బ్రిడ్జిలకు సంబంధించి గుమడ–పార్వతీపురం ఆర్ఓబీకి రూ.60 లక్షలు, పలాస–పూండి లైన్‌కు రూ.2.05 కోట్లు, పొందూరు–సిగడం రోడ్డు ఓవర్ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు, కోమటిపల్లి–గజపతినగరం ఆర్ఓబీ లెవెల్ క్రాసింగ్ రూ. 2లక్షలు, పలాస–పూండి, నౌపడలలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.71 కోట్లు, కోటబొమ్మాళి–తిలారు, పలాస–పూండి,కోట బొమ్మాళి యార్డ్‌లలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.2కోట్లు, కొత్తవలస– కిరండాల్ సబ్వేస్ లెవెల్ క్రాసింగ్లకు రూ.78 లక్షలు, నౌపాడ–కోట బొమ్మాళి ఆర్ఓబీ సబ్‌వేకు రూ.2 కోట్లు, ఉర్లాం–శ్రీకాకుళం ఆర్ఓబీకి రూ.2 కోట్లు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌ల ఆధునికీరణకు సంబంధించి పలాస–విశాఖ–దువ్వాడకు రూ.40 కోట్లు, కోరాపుట్ –సింగపూర్ లైన్‌కు రూ.20.01 కోట్లు, సింగపూర్ –విజయనగరం రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ఆధునికీకరణ, రిపేర్లకు సంబంధించి రూ.15 లక్షలు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు సిగ్నల్ అండ్ టెలికమ్, వర్క్‌షాప్ ప్రొడక్షన్ యూనిట్స్, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, రీమోడలింగ్స్, కొన్ని ప్రత్యేక గుర్తింపు పొందిన పనులకు నిధులు కేటాయించారన్నారు. -
డిజిటల్ సీతారామం.. సూపర్ హిట్!
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు! ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్ అని.. రాముడికి బదులు డిజిటల్ అని మార్చుకోవాలి! కేంద్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం మొదలుపెట్టిన డిజిటలీకరణకు ఈ ఏడాది బడ్జెట్లోనూ మంచి మద్దతు లభించింది. దేశ పురోగతికి కృత్రిమ మేధను వాడుకోవడం మొదలు.. రైతన్న సమస్యలన్నింటికీ ఒక్క చోటే పరిష్కారాలు దక్కేలా చేయడం వరకూ పలు ప్రతిష్టాత్మక డిజిటల్ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం.. వ్యవసాయానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ ఏడాది బడ్జెట్లో ‘వ్యవసాయం’కోసం డిజిటల్ రూపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నాణ్యమైన ఇన్పుట్స్ (విత్తనాలు, ఎరువులు తదితరాలు) రైతులకు లభించేందుకు మాత్రమే కాకుండా... పండిన పంటకు జరిగే నష్టాలను నివారించేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. తగిన సమాచారం అందుబాటులో లేని కారణంగా రుణాలిచ్చేందుకు తటపటాయించే బ్యాంకులు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రైతులకు అవసరమైనంత స్థాయిలో రుణా లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పంటల ఆరోగ్యంపై, ఇన్పుట్ల ఖర్చు, నేల సారం, ధరలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అనేక అంశాల సమాచారం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంకర్లకు అందుతుందని అంచనా. వీటి ద్వారా రైతుల రుణ అర్హతలనూ నిర్ణయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జన్‌ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ల కారణంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేరుగా నగదు రూపంలోనే సాయం అందిస్తున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. రైతులకు ఉపయోగపడే అనేక ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఐటీసీ ‘ఈ–చౌపాల్’ ‘దేహాత్’, ‘ఆర్య’, ‘రేష మండి’, ‘అనిమాల్.ఇన్’, ‘ఆక్వా–కనెక్ట్’’ వంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. కేంద్రం వీటిలోని మేలి అంశాల మేళవింపుగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందించవచ్చు. డిజిటల్ లైబ్రరీ పుస్తకం హస్తభూషణమన్న పాత పాటకు పాతరేసి.. పుస్తకాలను ఇప్పుడు డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రయత్నం మొదలైంది. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో, ప్రాంతాల్లో స్థాయిల్లోనూ యువతీ యువకులకు, బాలబాలికలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పుస్తకాలను ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా అందించనున్నారు. కోవిడ్ కారణంగా చదువుల్లో డిజిటల్ టెక్నాలజీ అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ లైబ్రరీ ఏర్పాటు కానుండటం విశేషం. స్మార్ట్ ఫోన్లు మొదలుకొని, డెస్్కటాప్ల వరకూ అన్నింటి ద్వారా ఈ లైబ్రరీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రాల్లో పంచాయితీల స్థాయి లో భౌతిక గ్రంథాలయాల ఏర్పాటునూ ప్రోత్సహిస్తామని వాటిల్లోనే డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక అంశాల్లో అక్షరాస్యత కల్పించేందుకు, పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ఈ ల్రైబరీలు ఉపయోగపడతాయి.’’అని సీతారామన్ తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమాలను కూడా స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుసంధానిస్తామన్నారు. దేశం కోసం.. దేశంలోనే.. కృత్రిమ మేధ కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు దేశంలో మూడు అత్యున్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు మూడింటిలో వీటి ఏర్పాటు జరుగుతంది. వ్యవసాయం, ఆరోగ్యం, సస్టెయినబుల్ సిటీస్ రంగాల్లో పరిశోధనలు తద్వారా ఆయా రంగాల్లోని సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు తోడ్పాటునందిస్తాయి. ‘‘కృత్రిమ మేధ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు, దేశంలో సమర్థమైన కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి ఏర్పాటయ్యేందుకు’ఈ మూడు కేంద్రాలు ఉపకరిస్తాయి’’అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు వల్ల విద్యార్థులు మరింత ఎక్కువ మంది కృత్రిమ మేధ కోర్సులకు మొగ్గు చూపుతారని, దేశ అభివృద్ధికి మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగూల్‌కు చెందిన ‘ఇండియ రీసెర్చ్ ల్యాబ్ కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌ల సాయంతో ఆరోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా.. ప్రజా ఆరోగ్య రంగం, వన్యప్రాణి సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అనేక అంశాల్లో కృత్రిమ మేధను వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 5జీ కోసం వంద ల్యాబ్‌లు.. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం గత ఏడాది దేశంలో 5జీ సర్వీసులను మొదలుపెట్టింది. వేగవంతమైన నెట్‌వర్క్‌తోపాటు అనేక ఇతర లాభాలు తెచ్చిపెట్టగల ఈ 5జీ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకునేందుకు దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తాజాగా ప్రకటించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ప్రిసిషన్ ఫారి్మంగ్, తెలివైన రవాణా వ్యవస్థలతోపాటు ఆరోగ్య రంగంలో ఉపయోగపడే అప్లికేషన్లను తయారు చేయడం వీటి లక్ష్యం. బ్యాంకులు, వివిధ నియంత్రణ సంస్థలు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ ల్యాబ్ కార్యకలాపాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు 225 ప్రాంతాల్లో ఈ 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 5జీ టెక్నాలజీలపై పరిశోధనలకు గాను ఈ ఏడాది రూ. 5.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.7.74 కోట్లు. టెలి కమ్యూనికేషన్స్, 5జీ టెక్నాలజీల్లో గత ఏడాది డిమాండ్ 33.7 శాతం వరకూ పెరిగింది. 2022–23లోనే ఈ రంగాల్లో 1.3 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉండగా.. ఏటికేడాదీ ఇది పెరుగుతోంది. 5జీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే ల్యాబ్‌ల వల్ల యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ఊపందుకుంటాయి. మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించనున్నాయి. నైపుణ్యాల వృద్ధికి భారీ ఊతం రేపటి తరం కొత్త టెక్నాలజీల్లో దేశ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాది బడ్టెట్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందులో భాగంగా వివిధ రకాల నైపుణ్యాలను అందించనున్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణ పొందిన వారిని, కంపెనీలను ఒకచోటకు చేర్చడమూ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకూ ప్రాధాన్యం లభించనుంది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు నేరుగా ఆన్లైన్ పద్ధతిలో స్టైఫండ్ అందించనున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా కోడింగ్, కృత్రిమ మేధ, మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్ డ్రోన్స్ ఇతర సాఫ్ట్ స్కిల్స్‌ను అందిస్తారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశం మొత్తమ్మీద 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. స్కిల్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 1.0 పేరుతో 2015లో మొదలైన విషయం తెలిసిందే. దాదాపు 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్కిల్ ఇండియాలో భాగంగా పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో వాటిని మరింత ఆధునికీకరించడం కూడా చేస్తున్నాయి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 2017లో, మూడో దఫా 2021లోనూ మొదలయ్యాయి. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ఆర్థిక రంగ సంస్థలకు భారీగా ఉపయోగపడేలా కేంద్రం ఈ ఏడాది నేషనల్ డేటా గవర్నెన్స్ విధానం ఒకదాన్ని తీసుకు రానుంది. ఈ విధానం వల్ల స్టార్టప్ కంపెనీల్లో మరింత అధిక సంఖ్యలో సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయని, విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకూ అందుబాటులో లేని సమాచారం డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా నిర్దిష్ట సంస్థలకు అందుబాటులోకి వస్తుందని, వివిధ సంస్థలు ‘నో యువర్ కస్టమర్’లేదా కేవైసీ కోసం ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవైసీలో భాగంగా అందరూ ఆధార్ వంటి వివరాలు మాత్రమే అడుగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు, బ్యాంకులు తమకు ఎదురయ్యే రిస్క్ ఆధారంగా ఇతర డాక్యుమెంట్లను కూడా కోరవచ్చు లేదా డిజిలాకర్ నుంచి తీసుకోవచ్చు. వ్యక్తులు డిజిలాకర్‌లో ఉంచుకున్న డాక్యుమెంట్లను కూడా అవసరాలకు తగ్గట్టుగా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలకు అందుబాటులోకి తేనున్నారు. డిజిలాకర్‌లో ప్రస్తుతం మనం పలు రకాల డాక్యుమెంట్లను స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఆధార్, పర్మనెంట్ అకౌంట్ నెంబరు (పాన్)లతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతల డాక్యుమెంట్లను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ వీటిని చూడగలిగే అవకాశం కొన్ని సంస్థలకు మాత్రమే ఉండగా.. కొత్త డేటా గవర్నెన్స్ పాలసీ కారణంగా మరిన్ని ఎక్కువ సంస్థలు అవసరాన్ని బట్టి చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. డిజిటల్ కేటాయింపుల తగ్గింపు? ఈ ఏడాది బడ్జెట్లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు మొత్తం రూ.4,785 కోట్లు కేటాయించారు. అయితే ఇది గత ఏడాది కేటాయింపుతో పోలిస్తే 37 శాతం తక్కువ. గత ఏడాది మొత్తం రూ.7603.5 కోట్ల కేటాయింపులు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి జరిగింది. ముందుగా రూ.10,676 కోట్ల కేటాయింపులు జరిగినా సవరణల తరువాత ఈ మొత్తం తగ్గింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ఇండియా కార్యకలాపాలను చేపడుతుందన్న విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు రావడం, జీవితాంతం పనిచేసే ఐడెంటిటీ (ఆధార్, యూపీఐ, పాన్ వంటివి) అందించడం ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగం. అలాగే.. ప్రభుత్వ సేవలను డిజిటల్ టెక్నాలజీల సాయంతో అందివ్వడం, అన్ని భాషల్లోనూ ఈ టెక్నాలజీ ఫలాలు అందుబాటులో ఉండేలా చేయడం కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారు. మౌలికం.. పెట్టుబడితో.. దేశ అభివృద్ధి వేగం పుంజుకునేలా భారీగా పెట్టుబడులు పెడతామని.. రోడ్లు, రైల్వే, విమాన, నౌకా రవాణా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడతామని నిర్మల తెలిపారు. బడ్జెట్లో మూలధన పెట్టుబడులకు కేటాయింపులను 10 లక్షల కోట్లకు (గతం కంటే 33% అదనం) పెంచుతున్నామని, ఇది దేశ జీడీపీలో 3.3% శాతానికి సమానమని పేర్కొన్నారు. -
సాక్షి కార్టూన్ 02-02-2023
-
కేంద్రపన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ. 21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ.–0.18 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్ రూ.681.10 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.285.26 కోట్లు, సరీ్వస్ ట్యాక్స్ రూ.4.31 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, గత బడ్జెట్లో కేంద్రపన్నుల రూ పంలో తెలంగాణకు రూ.17,165.98 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి రానున్న పన్నుల వాటా రూ.4,305 కోట్లు అధికం. రాష్ట్ర సంస్థలకు కేటాయింపులు ఇవే... ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్లు, సింగరేణి కాలరీస్‌కు రూ.1,650 కోట్లు, హైదరాబాద్‌సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ.550 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.392.79 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు రూ.115 కోట్లు, ఇన్‌కాయిస్‌కు రూ.27 కోట్లు, హైదరాబాద్‌సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.39.77 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.19 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల(పెన్షన్లు)కు రూ.653.08 కోట్లు, తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు, హైదరాబాద్‌సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డాక్)కు రూ. 270 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీసహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు మొత్తం రూ.442.17 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ సంస్థకు రూ.30.50 కోట్లు, మణుగూరుసహా కోట(రాజస్తాన్)లోని భారజల ప్లాంట్లకు రూ.1,473.43 కోట్లు, బీబీనగర్, మంగళగిరిసహా దేశంలో 22 కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి రూ.6,835 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. -
బడ్జెట్: వాజ్‌పేయి చొరవ వల్లే.. అది ఇప్పటికీ అమలు
ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది. ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గతంలో కంటే కాస్తలో కాస్త జనాలకు ఊరట ఇచ్చే ప్రయత్నమే చేసింది కేంద్రం. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయం ఇప్పటికీ బడ్జెట్ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంటుంది. అదేంటో తెలుసా?.. ఈయన హయాంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. ఫిబ్రవరి చివరి తేదీన సాయంత్రం వేళలో బడ్జెట్ ప్రవేశపెట్టడం బ్రిటిష్ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ, వాజ్‌పేయి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చేసింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా.. 1999లోనే ఉదయం 11 గంటల ప్రాంతంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మొదలుపెట్టారు. అలాగే ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే మరో సంప్రదాయానికి 2017లో పుల్‌స్టాప్ పడింది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ.. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మొదలుపెట్టారు. స్వాతంత్య్ర భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈ జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. మోదీ 2.0 టీంలో 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారాయన. 1962-69 మధ్య.. ఆయన చేతుల మీద కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి ప్లేస్‌లో పీ చిదంబరరం, ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), మన్మోహన్ సింగ్(6) ఈ జాబితాలో ఉన్నారు. -
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్.. ముగిసిన తొలిరోజు సెషన్..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెషన్ ముగిసింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అమృతకాలంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు రూపాయి రాక.. ►2023-24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు ►మొత్తం టాక్స్‌ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు ►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు ►ఇన్‌కం టాక్స్ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు ►GST ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.9.57లక్షల కోట్లు రూపాయి పోక.. ►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు ►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు ►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు ►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు వేతన జీవులకు ఊరట ►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు ►ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను ►0-3 లక్షల వరకు నిల్ ► 3 - 6 లక్షల వరకు 5% పన్ను ►6 - 9 లక్షల వరకు 10% పన్ను ►9 -12 లక్షల వరకు 15% పన్ను ►12- 15 లక్షల వరకు 20% పన్ను ►రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను ►రూ.9లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు ►రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలు ►2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి ►దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి ►ఎంఎస్ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు ►బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి ►మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీ ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు ►సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు ►ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం ►వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు ►2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం ►గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్‌లో తయారయ్యాయి.. ►భారత్‌లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు ►లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు ►తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ►టీవీ ప్యానల్స్‌పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు: నిర్మల ►రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు ►మరిన్ని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీ ప్యాడ్లు ► నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు ►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు ►లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు ►గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు ►సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు ►తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత ►మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి ►వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు.. ►యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ►రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు ►50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్ధరణ ►ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రాధాన్యత ►నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ ►ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ.10వేల కోట్లు ►మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం ►ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు ►5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్‌ల ఏర్పాటు ►2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం ►త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట ►కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం ►రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు ►పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం ►మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు ►సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.. ►నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం ►వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్‌కార్డ్, డిజీలాక్ ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ ►సమ్మిళిత అభివృద్ధి ►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు ►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు ►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట ►పర్యావరణ అనుకూల అభివృద్ధి ►యువ శక్తి ►పటిష్టమైన ఆర్థిక రంగం ► మిల్లెట్లతో ఆరోగ్య జీవితం.. శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్ హబ్‌గా భారత్‌ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు. ► ఆరోగ్యమే మహాభాగ్యం.. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి ► 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ► భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు. ► పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. ►75 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్ ►కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ►ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ►ప్రపంచ వేదికపై భారత్ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి ►ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ ►ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది. ►11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం ►భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు ►2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగింపు ►మా ప్రాధాన్యత అంశాలు యువతకు ప్రాధాన్యత, అభివృద్ధి-ఉద్యోగాల కల్పన, సుస్థిరత మా లక్ష్యం ►మహిళల ఆర్థిక స్వావలంబన మా ప్రాధాన్యత అంశం ►రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ►వృత్తి కళాకారులకు మరింత చేయూత ►11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం ►గ్రీన్ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత ►జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ►యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీలు ►క్లీన్‌ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు ►చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ►ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత ►చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు ►ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి ►సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్ ►2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక ►50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు ►రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు ►మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ►మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు ►18 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం ►చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ ►ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం ►దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్ కో ఆపరేటివ్ డాటాబేస్ ►సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు ►ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం ►ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ ►740 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన ►ఏకలవ్య స్కూల్స్‌లో 38,800 టీచర్ల నియామకం ►2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►ప్రారంభమైన పార్లమెంట్ ► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్ ద్వారా భారీగా ఊరట ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు జనం. ► బడ్జెట్ 2023కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► బడ్జెట్ 2023-24.. బడ్జెట్‌కు ఆమోదం దృష్ట్యా కేంద్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా తదితరులు ► పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ►రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ►పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి ► కాసేపట్లో పార్టమెంట్‌కు ఆర్థికమంత్రి కేంద్ర పద్దుపై కోటి ఆశలతో జనం.. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి.. గత ఐదేళ్లుగా ఊరట దక్కని వర్గాలు.. ఈసారి బడ్జెట్‌పై అంచనాలు పెంచుకున్నాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. రాష్ట్రపతితో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంట్‌కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి నిర్మల. ► కేంద్ర బడ్జెట్ 2023-24.. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రపతికి బడ్జెట్ సమాచారం ఇస్తారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బడ్జెట్లో నిర్మలమ్మ వరాలు కురిపించేనా!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 2.0 ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటులో సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ధరల పెరుగుదలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజసహా అన్ని వర్గాల డిమాండ్లను ఆమె తీరుస్తారన్న అంచనాలు అధికంగా ఉన్నాయి. ప్రకటించబోయే బడ్జెట్ అనేక లక్ష్యాల సాధనకు ఒక కసరత్తు కాబోతున్నట్లు అంచనా ఉంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి, పన్నుయేతర చర్యల ద్వారా మరిన్ని వనరులను సేకరించడం, అవసరమైన రంగాలకు ప్రోత్సాహకాలు వంటివి బడ్జెట్లో ఆశిస్తున్న ప్రధానాంశాలు. వేతన జీవులు, చిన్న వ్యాపారవేత్తలకు పన్ను రాయితీల ప్రకటన కూడా ఉంటుందని అంచనా. రియల్టీ రంగం ప్రోత్సాహానికి కూడా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
ఆశల పల్లకిలో వేతన జీవులు..పన్నుపోటు తగ్గుతుందా? లేదా?
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా వారం రోజులే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అతిపెద్ద ఆదాయ వనరుల్లో ఒకటైన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్‌పై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఓవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు, మరోవైపు అంచనాలు.. ఈ రెండింటినీ కేంద్రం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది ఆసక్తి కలిగిస్తోంది. పన్ను స్లాబ్ రేట్ల సవరణ 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల స్లాబ్ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం స్వల్ప రేట్లతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. పన్ను చెల్లింపుదారుల అత్యధిక పన్ను రేటును 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే.. రూ.10-12.5 లక్షల నుంచి రూ.10-20 లక్షలకు, 20 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చే స్లాబ్‌ని విస్తరించడంతో పాటు దీనికి అనుబంధంగా ఉండాలని ఆశిస్తున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. అలాగే, గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన రిటర్న్స్‌కు ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతున్నారు. పన్ను మినహాయింపు పరిమితులు మరింత మెరుగైన పన్ను మినహాయింపు పరిమితుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు పన్నుచెల్లింపుదారులు. ఆర్థిక సంస్థల ద్వారా మంజూరైన రుణాలకు సెక్షన్ 80ఈఈబీ కింద మినహాయింపు ఉంది. అయితే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే అది వర్తిస్తోంది. ఈ కాలపరిమితిని 2025 మార్చి 31 వరకు పొడిగించాలంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మినహాయింపు 2020 బడ్జెట్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌లో యాజమాన్య వాటా రూ. 7.5 లక్షలు దాటితే పన్ను వర్తిస్తుంది. అలాగే పీఎఫ్ నిధుల ఉపసంహరణపై కూడా పన్ను విధించబడుతోంది. అయితే.. ఈ పన్నులో మినహాయింపు కోరుతున్నారు పన్ను చెల్లింపుదారులు. ఇక ఇప్పటికే కంట్రిబ్యూషన్ సంవత్సరంలో పన్ను చెల్లించి ఉంటే, సేకరించబడిన పీఎఫ్/ఎన్పీఎస్/ఎస్ఏఎఫ్ బ్యాలెన్స్‌లో ఏదైనా భాగానికి డబుల్ టాక్సేషన్‌ను తొలగించే విధానంపై స్పష్టత ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తులో తలెత్తే అనవసర వ్యాజ్యాల నుంచి పన్ను చెల్లింపుదారులను ఇది కాపాడుతుందని భావిస్తున్నారు. టాక్స్ రిటర్న్స్ సవరణ కోసం కాలపరిమితి అసలు రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి గడువు కాగా.. సవరించిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ డిసెంబర్ 31. అయితే.. తక్కువ వ్యవధి ఉండటంతో లోపాలు సరిచేసుకునేందుకు తగినంత అవకాశం లభించడం లేదంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. సవరించిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కోసం గడువు తేదీని అసెస్మెంట్ సంవత్సరం ముగింపు నుంచి ఒక ఏడాదికి పునరుద్ధరిస్తే సవరింపులకు తగిన సమయం లభిస్తుందని అంటున్నారు. -
మరోసారి కేంద్రం మొండిచెయ్యి
సాక్షి, మేడ్చల్: కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజా కేంద్రబడ్జెట్లో పేదలకు పనికొచ్చేదేదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపిందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నింటినీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తున్నామని, చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించినా, నిరాశే మిగిలిందని కేటీఆర్ దుయ్యబట్టారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహార్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం పర్యటించిన కేటీఆర్ జిల్లామంత్రి మల్లారెడ్డితో కలసి రూ.306.99 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేశారు. ‘సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో సాధించామ’ని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా ఎదగటమే కాకుండా, నాలుగోస్థానంలో రాష్ట్రముందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పథకాలన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తా మన్నారు. ‘మన ఊరు – మన బడి’కింద ప్రభుత్వం రాష్ట్రంలోని 26 వేల పాఠశా లలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలు, ఫర్నీచర్, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తోందని, దీనికిగాను సీఎం కేసీఆర్ రూ.7,289 కోట్లు కేటాయించి సర్కారీ బడులను ప్రైవేట్ బడులకు ధీటుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపెట్టారని పేర్కొ న్నారు. బోడుప్పల్, ఫీర్జాదిగూడతో పాటు ఆయా ప్రాంతాలకు మరో రెండు లక్షల కనెక్షన్లకు నీరందించేలా రూ.1,200 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు చెప్పారు, జవహార్‌నగర్‌లో రూ.240 కోట్లతో ఇంటింటికీ రూపాయి నల్లా కనెక్షన్ అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. డంపింగ్‌యార్డుకు గ్రీన్ క్యాపింగ్ హైదరాబాద్ జనాభాకు సంబంధించిన చెత్తాచెదారమంతా జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకే వస్తోందని, రూ.147 కోట్లతో యార్డుకు గ్రీన్క్యాపింగ్ చేపట్టి మురికినీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. చెత్తతో విద్యుత్తు ఉత్పత్తిని చేసే ప్రక్రియలో భాగంగా జవహా ర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి 24 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి చామ కూర మల్లారెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ హరీష్, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రిప్టో పరిశ్రమ.. బడ్జెట్లో నిర్మలమ్మ కరుణించేనా?
భారత్‌లో క్రిప్టో కరెన్సీ మీద ప్రభుత్వ స్టాండర్డ్ ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంక్షలు, నియంత్రణ తప్పదని, ఆర్బీఐ ప్రత్యేక కరెన్సీల.. ఊహాగానాల నడుమే రోజురోజుకీ ఆదరణ మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు కోట్ల మందికిపైగా క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండగా.. పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు ఎప్పుడో దాటేసిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రేడర్స్‌లో క్రిప్టో కరెన్సీ మీద ఉన్న ఆసక్తి ఏపాటిదో భారత్‌లోని క్రిప్టో పెట్టుబడులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఆసక్తి నుంచే క్రిప్టో యూనికార్న్‌లు పుట్టుకొస్తున్నాయి. 2032 నాటికి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ అస్సెట్స్కి చేరుతుందని అంచనా. కాబట్టే క్రిప్టో ఇన్వెస్టర్లు బడ్జెట్ సెషన్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అసలు కొత్త క్రిప్టో బిల్.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే చర్చకు వస్తుందనే అనుకున్నారంతా. కానీ, తుది మెరుగుల పేరుతో జాప్యం చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఉంటుందో లేదో గ్యారెంటీ లేదుగానీ.. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మాత్రం క్రిప్టో ఇండస్ట్రీ కొన్ని ఆశలు, అంచనాలు మాత్రం పెట్టుకుంది. పన్ను వర్గీకరణ క్రిప్టో ఆదాయాల పన్నుకు సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. అయినప్పటికీ అన్ని క్రిప్టో ప్లేయర్ల దృష్టి ఇప్పుడు పన్నుల అంశాలపై స్పష్టత కోసం వెతుకుతోంది. క్రిప్టోస్‌పై పన్ను విధించడం గురించి, దాని వర్తించే పన్ను రేట్లు, వర్గీకరణ, TDS/TCS, క్రిప్టోల అమ్మకం.. కొనుగోలుపై GST చిక్కులు లాంటి విషయాల్లో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి, క్రిప్టో పరిశ్రమ క్రిప్టో పన్నుల కోసం ఒక నిర్దిష్ట నిబంధనను తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం గతంలో క్రిప్టోకరెన్సీలను వినియోగాన్ని బట్టి వర్గీకరిస్తామని పేర్కొన్న విషయాన్ని క్రిప్టో పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది. ఈ ప్రకటనే ట్యాక్సేషన్ కోణంలో పరిశ్రమకు సాయం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. పన్ను విధానం ద్వారా క్రిప్టో సెక్టార్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉత్సాహం అందుతుందని ఆశిస్తున్నారు. రెగ్యులేషన్స్ క్రిప్టో వృద్ధికి ఆటంకం కలిగించే ముఖ్యమైన అంశం.. నిబంధనలు. రెగ్యులేటరీ బాడీ అనేది క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ప్లేయర్ల పరిధిని మించి ఉండకూడదు. కాబట్టి క్రిప్టో స్పెక్ట్రమ్ ‘పెరుగుతున్న వాటాదారుల సంఖ్య’ను దృష్టిలో ఉంచుకుని ప్రొగెసివ్ రెగ్యులేటర్ గైడ్‌లైన్స్ తీసుకురావాలని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది. SEBI యొక్క పర్యవేక్షణలో, క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైన ట్రేడబుల్ ఆస్తిగా గుర్తించడం ద్వారా కూడా మరింత స్థిరత్వం దక్కనుంది. మరోవైపు పబ్లిక్-లెడ్జర్-ఆధారిత క్రిప్టో-ఆస్తులను.. ట్రేడింగ్ కోసం రిజిస్టర్ చేయమని ప్రోత్సహించడం కూడా గొప్ప పోటీతత్వానికి దారి తీయనుంది. ఈ అంశాల్ని రాబోయే బడ్జెట్లో కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే గనుక.. క్రిప్టో మార్కెట్‌ను ప్రోత్సహించవచ్చు, డిజిటల్ ఇండియా తో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్లవచ్చు. అడాప్షన్ ఈ రోజుల్లో బహుళ లావాదేవీలను సులభంగా వెరిఫై చేయడం కోసం, ట్రేస్ చేయడం కోసం ఉపయోగపడుతోంది బ్లాక్‌చెయిన్. కాబట్టి, బ్లాక్‌చెయిన్‌ను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం పరిపాలనా నమూనాలను రూపొందించగలిగితే అది మంచిదే అవుతుంది. బ్లాక్‌చెయిన్ విధానంలో లావాదేవీలను సురక్షితం చేయడం, ఖర్చులను తగ్గించడం, డాటా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా నగరాల్లో సాంకేతికతను ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుంది. క్రిప్టో విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఇంతకు ముందు బడ్జెట్లు ఆర్థిక సమ్మేళనానికి సంబంధించినవి, అయితే రాబోయే బడ్జెట్ కొత్త సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కీలకంగా వ్యవహరించనుందని నిపుణులు భావిస్తున్నారు. 2022 సంవత్సరం క్రిప్టో పరిశ్రమకు అద్భుతమైన సంవత్సరంగా భావిస్తోంది క్రిప్టో ఇండస్ట్రీ. పన్నులు, నియంత్రణ.. వర్గీకరణపై స్పష్టత, జనాభాలో విశ్వాసాన్ని త్వరగా తీసుకువస్తే క్రిప్టో పరిశ్రమ ఆశించిన మేర దూసుకుపోవడం మాత్రం ఖాయం. -
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
ఆదాయ పన్ను రద్దు చేయండి
కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లను రద్దు చేయడం ఉత్తమం. అది కొన్నాళ్లపాటు!. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుంది. పరిస్థితులు సర్దుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయకపోవడం మంచిదే అని ఓ జాతీయ మీడియా హౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారన్న ప్రశ్నకు.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తా. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తా. పరిస్థితుల సాధారణం అయ్యేదాకా అది కొనసాగిస్తా. ఆపై దాన్ని శాశ్వతంగా కొనసాగించడం గురించి ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. ఇక తన వాదనను సమర్థించుకునే క్రమంలో సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మార్గాలెన్నో.. బీజేపీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నేను ఈ సలహా ఇచ్చా. ఆదాయపు పన్ను ద్వారా సుమారు 4 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాము. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పాను. ఉదాహరణకు.. 2జీ లైసెన్స్‌ల వేలం. మొదటి వేలంలో దాని ద్వారా ఎంత వచ్చిందో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఆదాయ పన్నుల వసూళ్లకి సమానం. పన్నులు పెంచే బదులు.. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందర ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గాడిన పడిందంటే.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారు. అలాగే, రీఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని రూల్ పెడితే.. పొదుపు రేటు పెరుగుతుంది. ఆపై వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోనుల మీద వడ్డీ రేటును తగ్గిస్తే (12 నుంచి 9 శాతానికి) మంచిదని, అది ప్రభుత్వం చేతుల్లో ఉందని, బ్యాంకులు కూడా చేసి తీరతాయని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 6 నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్‌కు ముందుకొస్తారని పేర్కొన్నారు. మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిడి కారణంగా జీడీపీ వాటా పరంగా గృహాల పొదుపు మొత్తం తగ్గిందని, పెట్టుబడులు కూడా తగ్గాయని స్వామి అంటున్నారు. ప్రపంచ మహమ్మారి విధ్వంసానికి ముందు 2019-20 నాలుగో త్రైమాసికంలో చూసిన వృద్ధి స్థాయిని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తిరిగి పొందలేదని సుబ్రమణియన్ స్వామి గుర్తు చేస్తున్నారు. ఆర్థిక అంచనాలు, అధికారిక డేటా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ.. మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌టైంలో సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే గతంలోనూ ఆయన ఇలాంటి సలహాలే ఇచ్చారు కూడా!. క్లిక్ చేయండి: బడ్జెట్ 2022లో మధ్యతరగతి వర్గానికి ఊరట! -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
చేనేతకు ఊరట.. జీ ఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
-
ముగిసిన 46 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
ఉపాధి కల్పనే లక్ష్యంగా.. బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు షురూ!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి బడ్జెట్ కసరత్తు ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి ప్రీ–బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక సర్క్యులర్ ప్రకటించింది. నవంబర్ రెండవ వారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి.కోవిడ్–19 మహమ్మారి తీవ్ర సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న రెండవ వార్షిక బడ్జెట్ ఇది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది నాల్గవ బడ్జెట్. డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, ఎనిమిది శాతం వృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలతో తాజా బడ్జెట్ రూపొందనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 2022 ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చదవండి: పెట్రోల్ విషయంలో సామాన్యులకు మరోసారి నిరాశ! -
రూ.6 లక్షల కోట్లకు చేరిన ఆహారం, ఎరువుల సబ్సిడీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,793.89 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. సవరించిన అంచనాల ప్రకారం రూ.5,95,620.23 కోట్లకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. కోవిడ్, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో అంచనాలు తలకిందులయ్యాయి. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల సబ్సిడీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ సబ్సిడీ బిల్లును రూ.3,36,439.03 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ.1,15,569.68 కోట్ల నుంచి రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.2,42,836 కోట్లుగా అంచనా వేశారు. ఎరువులపై సబ్సిడీ రూ.71,309 కోట్ల నుంచి రూ.1,33,947.3 కోట్లకు చేరగా.. 2021–22లో రూ.79,529.68 కోట్లుగా అంచనా వేశారు. పెట్రోలియం ఉత్పత్తులు(ఎల్పీజీ, కిరోసిన్) మీద సబ్సిడీని రూ.40,915.21 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.39,054.79 కోట్లయ్యింది. 2021–22లో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.14,073.35 కోట్లు కేటాయించారు. -
బడ్జెట్ 2021: చదువు, నైపుణ్యాభివృద్దిపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జాతీయ విద్యా విధానంలో వివరించిన విద్యా సంస్కరణల మేరకు మానవ వనరుల (పాఠశాల, ఉన్నత విద్యా రంగం) రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మానవ వనరుల విభాగంలో మూలధనం పెంచడంలో భాగంగా చదువు, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వెల్లడించారు. సోమవారం ఆమె పార్లమెంట్లో 2021–2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరు ప్రాథామ్యాల ఆధారంగా రూపొందించిన ఈ బడ్జెట్లో మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి ఒకటని చెప్పారు. పాఠశాల విద్యకు రూ.54,873.66 కోట్లు, ఉన్నత విద్యకు రూ.38,350.65 కోట్లు.. మొత్తంగా రూ.93,224.31 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. దేశంలోని తొమ్మిది నగరాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది విద్యా సంస్థల మధ్య సమన్వయం, స్వయం ప్రతిపత్తి, సమష్టి వృద్ధికి దోహద పడుతుందన్నారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొత్త జాతీయ విద్యా విధానం.. ఆఫ్‌లైన్, ఆన్లైన్, హైబ్రిడ్ మోడళ్లలో అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దీనిని అమలు చేయడానికి క్రెడిట్ బదిలీ విధానంతో పాటు, అకడమిక్ బ్యాంక్ ఏర్పాటవుతుందని, ఇందుకు ఉన్నత విద్య క్లస్టర్ తోడ్పాటు అందించి అభ్యాస వాతావరణాన్ని మెరుగు పరచనుందని వివరించారు. మంత్రి ప్రసంగంలో ఇంకా ముఖ్యాంశాలు ఇలా.. పాఠశాల విద్య ⇔ కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 15,000 నమూనా పాఠశాలలు ఏర్పాటు. ఆయా ప్రాంతాల్లోని ఇతర పాఠశాలలకు ఇవి అన్ని విధాలా దిక్సూచిగా నిలిచి మార్గనిర్దేశం చేస్తాయి. విద్యా సమూహాన్ని సృష్టించి, రాబోయే రోజుల్లో దశల వారీగా కొత్త విద్యా విధానాన్ని రూపొందించడంలో సహాయ పడతాయి. ⇔ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేట్ క్రీడాకారులు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 100 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటవుతాయి. సైనిక్ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ సొసైటీ స్థాపించి, నిర్వహిస్తోంది. దేశంలో ప్రస్తుతం 30కి పైగా సైనిక్ పాఠశాలలు ఉన్నాయి. ⇔ స్టాండర్డ్ (ప్రామాణిక) – సెట్టింగ్ (అమరిక), అక్రెడిటేషన్ (గుర్తింపు), రెగ్యులేషన్ (నియంత్రణ), ఫండింగ్ (నిధులు) కోసం నాలుగు వేర్వేరు విభాగాల ఏర్పాటుతో అంబ్రెల్లా స్ట్రక్చర్‌లో భారతదేశ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కోసం చట్టం చేస్తాం. ⇔ అంబ్రెల్లా స్ట్రక్చర్ విధానం వల్ల ఆయా నగరాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయం, వనరుల భాగస్వామ్యం, బోధన అభ్యాసానికి సహకారం, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ⇔ తద్వారా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల మధ్య కూడా సహకారం పెరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని 40 ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు పరస్పరం నేర్చుకోవడం ద్వారా విద్యా విధానం మెరుగవుతుంది. ‘గ్లూ గ్రాంట్’ ద్వారా విద్యా రంగానికి ఊతం లభిస్తుంది. ⇔ లద్దాఖ్‌లోని లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ⇔ ఈ బడ్జెట్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యకు మరింత ఊతం ఇచ్చింది. కొత్తగా దేశంలో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ తరహా స్కూలు నిర్మాణానికి గతంలో రూ.20 కోట్లు ఇస్తుండగా ఈ బడ్జెట్లో రూ.38 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.48 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ⇔ షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కేటాయింపులు పెంచారు. ఈ కేటాయింపులు రానున్న ఐదేళ్ల కాలం ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుదల వల్ల దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.50 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే జగనన్న వసతి దీవెన కింద అన్ని వర్గాల పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని ముఖ్యాంశాలు.. ⇔ బోర్డు పరీక్షలను సులభతరం, కోర్ కాన్సెప్ట్‌లకు తగ్గట్టు పాఠ్యాంశాల తగ్గింపు. 10 + 2 నిర్మాణాన్ని 5 + 3 + 3 + 4 గా మార్చడంతో పాటు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో కనీసం 5వ తరగతి వరకు బోధన. ⇔ కేంద్రీయ విద్యాలయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6,800 కోట్ల బడ్జెట్ కేటాయింపు. గత ఏడాది కేటాయించిన రూ.5,516 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతానికి పైగా ఎక్కువ. ⇔ నవోదయ విద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపును రూ.500 కోట్లు పెంచారు. గతేడాది రూ.3,300 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,800 కోట్లు కేటాయించారు. ⇔ మధ్యాహ్న భోజన పథకంలో రూ.500 కోట్ల పెరుగుదల కనిపించింది. గత ఏడాది రూ.11,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.11,500 కోట్లకు పెంచారు. ⇔ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) కింద ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థుల్లో నైపుణ్య శిక్షణ కోసం రూ.3000 కోట్లు కేటాయింపు. నైపుణ్యం, సాంకేతికత బదిలీ కోసం జపాన్ సహకారంతో శిక్షణ. ⇔ కోవిడ్–19 నేపథ్యంలోనూ 30 లక్షల మందికి పైగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్‌గా శిక్షణ. 2021–22లో 56 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ (నిస్తా) ద్వారా శిక్షణ ఇస్తాం. ⇔ పరీక్షలు, రొటీన్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత తగ్గించి.. విశ్లేషణాత్మక నైపుణ్యం, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా విద్యార్థులను పరీక్షిస్తాం. ⇔ కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి ప్రతి ఏడాది సీబీఎస్సీ బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతున్నారు. ఈ దిశలో సీబీఎస్సీ బోర్డు 2022–23 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా పరీక్షల్లో సంస్కరణలను అమలు చేస్తుంది. ⇔ వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం, దేశ వ్యాప్తంగా భారతీయ సంకేత భాష ఆధారంగా జాతీయ, రాష్ట్ర పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నాం. ⇔ విదేశీ ఉన్నత విద్యా సంస్థలతో మెరుగైన విద్యా సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ద్వంద్వ డిగ్రీలు, ఉమ్మడి డిగ్రీలు ఇతరత్రా అవసరాల కోసం ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ⇔ విద్యా సంస్థలు, ఆస్పత్రులను నడుపుతున్న చిన్న చారిటబుల్ ట్రస్టులపై సమ్మతి భారాన్ని తగ్గించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటి వరకు ఉన్న వార్షిక రసీదు మొత్తం రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నాం. ⇔ విద్యా రంగానికి మొత్తం కేటాయింపులు : రూ.93,224.31 కోట్లు ⇔ గతేడాది మొత్తం కేటాయింపులు : రూ. 99,311.52 కోట్లు రంగంపై పెడుతున్న ఖర్చు జీడీపీ %లో 2014–15 2.8 2015–16 2.8 2016–17 2.8 2017–18 2.8 2018–19 2.8 2019–20 3 2020–21 3.5 పాఠశాల విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో) 2019–20 2020–21 2021–22 కేంద్రీయ విద్యా సంఘటన్ 6,331.40 5,516.50 6,800 నవోదయ విద్యాలయ సమితి 3387.60 3,300 3800 ఎన్సీఈఆర్టీ 276.05 300 500 సమగ్ర శిక్ష అభియాన్ 32,376.52 38,750.50 31,050.16 ఉపాధ్యాయ శిక్షణ, వయోజన విద్య – 110 250 మధ్యాహ్న భోజన పథకం 9,699 11,000 11,500 మదర్సాలు, మైనార్టీ విద్య 70.94 220 – ఉన్నత విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో) 2019–20 2020–21 2021–22 ప్రపంచస్థాయి విద్యా సంస్థలు 224.10 500 1,710 విద్యార్థులకు ఆర్థిక సాయం 2,069.95 2,316 2,482.32 మొత్తం డిజిటల్ ఇండియా ఇ–లెర్నింగ్ 457.58 444.40 645.61 పరిశోధన, ఆవిష్కరణలకు 257.08 307.40 237.40 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 4,435.58 4,693.20 4,693.20 ఏఐసీటీఈ 436 416 416 సెంట్రల్ యూనివర్సిటీలకు గ్రాంట్లు 7,988.84 7643.26 7643.26 సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ – 60.35 60.35 ఏపీ, తెలంగాణ గిరిజన వర్సిటీలు 0.63 53.80 53.80 డీమ్డ్ యూనివర్సిటీలు 418.02 351 351 ఐఐటీలు 6,365.92 7,182 7,536.02 ఐఐటీ హైదరాబాద్ 230 150 150 ఐఐఎమ్ 481.29 476 476 ఎన్ఐటీ 3,486.60 3,885 3,935 ఐఐఎస్ఈఆర్ 791.22 896 946 ఐఐఎస్ 596.48 591.65 621.65 ఐఐఐటీలు 328.33 393.35 393.35 - - - - -
బడ్జెట్లో కొత్త ఆరోగ్య పథకం
న్యూఢిల్లీ : కరోనా పడగ నీడలో ఏడాదిగా బిక్కు బిక్కు మంటూ బతకడంతో ఆరోగ్యానికున్న ప్రాధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆరోగ్య సంరక్షణే మార్గమని నిర్ణయానికొచ్చింది. కరోనాని నిర్మూలనకు ప్రజలందరికీ టీకాలు ఇవ్వడమే మార్గమని భావించి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి 35 వేల కోట్లు కేటాయించింది. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం నివారణ, చికిత్స, సంరక్షణే లక్ష్యాలుగా అడుగులు వేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కాకుండా మరో కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రకటించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పేరిట వస్తున్న ఈ పథకం కోసం 64 వేల కోట్లు కేటాయించింది. ఇన్నాళ్లూ ఆరోగ్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేంద్రం ఇప్పుడు నిధుల్ని ఒకేసారి 137శాతం పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 2020–21 సంవత్సరంలో ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు రూ.94,452 కోట్లు కాగా, 2021–22లో రూ.2 లక్షల 23 వేల 846 కోట్లు బడ్జెట్ అంచనాలున్నట్టు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ నుంచి స్వాస్థ్య భారత్ ఆరోగ్య రంగమంటే రోగాలు, చికిత్స, ఆసుపత్రులు, ల్యాబ్‌లు మాత్రమే కాదు. సంపూర్ణ ప్రజారోగ్యం కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, రక్షిత నీరు, పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే అనారోగ్యమే మన దరి చేరదు. సరిగ్గా ఈ అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని ఆరోగ్య రంగాన్ని మొదటి స్తంభంగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇన్నాళ్లూ అమల్లో ఉన్న సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, పోషణ్ అభియాన్ కార్యక్రమాల్ని కలిపేసి మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దీని కింద 112 జిల్లాల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక జల జీవన్ మిషన్‌కు రూ.50 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.2 లక్షల 87 వేలు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా 2.86 కోట్ల ఇళ్లకు మంచినీటి సౌకర్యం, పట్ణణ ప్రాంతాల్లో 4,378 స్థానిక సంస్థలకు మంచినీటి సరఫరా, 500 అమృత్ నగరాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపడతారు. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాలు అద్దంలా మెరిసిపోవడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ. లక్షా 41వేల 678 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణ, మురికి నీటి నిర్వహణ, నిర్మాణ రంగం, కూల్చివేతల సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటారు. అదే విధంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 42 పట్టణాల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించడం కోసం రూ.2,217 కోట్లు కేటాయించారు. సంక్షోభం పాఠాలతో సంరక్షణ వైపు అడుగులు కేటాయింపులు ఇలా.. కోవిడ్ వ్యాక్సిన్ 35వేల కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 71,268.77కోట్లు ఆత్మనిర్భర్ స్వాస్థ్య యోజన పథకం 64,180 కోట్లు 2,663 కోట్లు ఆరోగ్య రంగంలో పరిశోధనలు 50 వేల కోట్లు జల్ జీవన్ మిషన్‌కు ‘‘కరోనా వంటి విపత్తులు మరిన్ని ఎదురైనా భారత్ ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉందని ఈ సారి ఆరోగ్య రంగ కేటాయింపులు తేటతెల్లం చేస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలుష్య నియంత్రణ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజారోగ్యం మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యంతో పాటుగా ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యంపైన కూడా దృష్టి కేటాయించడం హర్షణీయం. బడ్జెట్లో ఆరోగ్య రంగాన్ని అగ్రభాగంలో నిలపడం వల్ల అభివృద్ధికి కూడా బాటలు పడతాయి – ప్రొఫెసర్ కె.శ్రీకాంత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) స్వాస్థ్య భారత్ బడ్జెట్లో కొత్తగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పథకాన్ని తెచ్చారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రాంతీయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం ఈ పథకం కోసం రూ. 64,180 కోట్లు కేటాయించారు. వచ్చే ఆరేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్‌తో పాటు ఈ కొత్త ఆరోగ్య పథకం అమలవుతుంది. ఈ పథకం ద్వారా ఏమేం చేస్తారంటే... ఆరోగ్య శ్రేయస్సు కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ► గ్రామీణ ప్రాంతాల్లో 17,788, పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ► కొత్తగా నాలుగు ప్రాంతాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ ► ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు, రెండు మొబైల్ ఆస్పత్రులు ►దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్స్, 11 రాష్ట్రాల్లో బ్లాక్ స్థాయిలో 3,382 ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు ►నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), దానికి అనుబంధంగా పనిచేసే అయిదు శాఖల్ని మరింత పటిష్టపరచడం ► ప్రస్తుతం ఉన్న 33 ప్రజారోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటుగా కొత్తగా 17 కేంద్రాల ఏర్పాటు ►ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతం కోసం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ► తొమ్మిది బయో సేఫ్టీ లెవల్ ► ల్యాబొరేటరీల ఏర్పాటు సామాజిక న్యాయం, సాధికారతకు రూ.11,689 సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు బడ్జెట్లో మొత్తం రూ.11,689 కోట్ల కేటాయింపులు జరిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 28.35 శాతం నిధులు పెరిగాయి. వెనుకబడిన తరగతుల వారికి 2020–21 బడ్జెట్లో రూ.8,207.56 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్లో రూ.10,517.62 కోట్లు కేటాయించారు. గత దానితో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. దివ్యాంగుల సాధికారికత కోసం 2020–21లో రూ.900 కోట్లు కేటాయించగా, ఈసారి 1,171.77 కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే 30.19 శాతం ఎక్కువ. జాతీయ కమిషన్లకు రూ.250 కోట్లు.. మూడు జాతీయ కమిషన్లు.. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, సఫాయ్ కరంచారిస్ జాతీయ కమిషన్లకు 2021–22 బడ్జెట్లో మొత్తం రూ.250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించారు. కేంద్ర ఉపకార వేతనాలకు సంబంధించి ఎస్సీ, ఓబీసీ, ఈబీసీలకు నేషనల్ ఫెలోషిప్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఎస్సీలకు, ఓబీసీలకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలకు రూ.377 కోట్లు.. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్స్ డిసేబిలిటీ స్టడీస్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనివర్సల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్‌లకు మొత్తం రూ.377 కోట్లు కేటాయించారు. సామాజిక సేవలకు రూ.1,017 కోట్లు.. సామాజిక సేవల రంగానికి 2020–21 బడ్జెట్లో రూ.784 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్లో రూ.1,017 కోట్లు కేటాయించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం చేపట్టే జాతీయ కార్యక్రమాలకు సంబంధించి గత బడ్జెట్లో రూ.436.89 కోట్లు కేటాయించగా, ఈసారి 709 కోట్లు కేటాయించారు. -
బడ్జెట్: పెరిగిన కొలువులు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం కొలువుల సంఖ్య 34,14,226కు చేరనున్నట్లు సోమవారం బడ్జెట్లో వెల్లడించారు. మార్చి 1, 2019 నాటికి 32,71,113 కేంద్ర ఉద్యోగాలు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి 1,43,113 ఉద్యోగాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, సహకార, రైతు సంక్షేమం శాఖలో మార్చి 1, 2019 నాటికి 3,619 ఉద్యోగాలు ఉండగా ఈ రెండేళ్లలో 2,207 పెరిగి 5,826కు చేరనున్నాయి. అలాగే పౌరవిమానయానంలో 1,058 పెరిగి 1,254 నుంచి 2,312కు, రక్షణ శాఖలో 12,537 పెరిగి 80,463 నుంచి 93,000కు చేరనున్నాయి. అలాగే సాంస్కృతిక శాఖలో 3,638, ఎర్త్ సైన్సెస్‌లో 2,859, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో 2,263, విదేశీ వ్యవహారాల్లో 2,204, వాణిజ్యంలో 2,139, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,452; ఆరోగ్య–కుటుంబ సంక్షేమంలో 4,072, కార్మిక–ఉపాధి కల్పనలో 2,419, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునర్వవస్థీకరణలో 1,456 పెరగనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విభాగాల్లోనూ ఇలాగే పెరిగినట్లు వివరించారు. చదవండి: బడ్జెట్: ఈ విషయాలు మీకు తెలుసా! చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రత న్యూఢిల్లీ: ఈ కామర్స్ వ్యాపార సంస్థల్లో పనిచేసే ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతరుల సమాచారం సేకరించేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులతో సహా మొత్తం శ్రామికశక్తికి తొలిసారి సామాజిక భద్రతను కల్పించడానికి నిబంధనలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ఈ–కామర్స్ సంస్థల్లో పనిచేసే గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు క్రమబద్ధమైన వేతనాలు ఉండవు. దీంతో ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. దేశంలో మొత్తం 50 కోట్లకు పైగా శ్రామిక శక్తి ఉండగా ఇందులో 40 కోట్లు అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులే ఉన్నారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధం, సామాజిక భద్రత, వృత్తి భద్రత, ఆరోగ్యం–పని పరిస్థితులపై తెచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల పేర్కొన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి? -
వృద్ధులకే కాస్త ఊరట
న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆదాయపన్ను (ప్రత్యక్ష పన్ను) రేట్లలో కచ్చితంగా మార్పులు ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. యథాతథ స్థితికే మొగ్గు చూపించారు. ఆదాయపన్ను శ్లాబుల్లోకానీ, రేట్లలో కానీ మార్పుల జోలికి వెళ్లలేదు. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఆదాయం పెంచుకునేందుకు ఆదాయపన్ను రేట్లను పెంచకపోవడమే. రూ.2,50,000 లక్షల వరకు ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ అలానే కొనసాగనుంది. రూ.2,50,000కు పైన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 వరకు ఉన్నా కానీ (మినహాయింపులు పోను) పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. సెక్షన్ 87ఏ కింద రూ.12,500 రాయితీని పొందొచ్చు. దీంతో పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న అనంతరం నికర ఆదాయం రూ.5లక్షల వరకు ఉంటే పన్ను బాధ్యత లేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే ఆదాయపన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 2020 బడ్జెట్లో నూతన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తూ.. పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చిన విధానంలో కొనసాగొచ్చంటూ మంత్రి సీతారామన్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ రెండు విధానాలు ఇక ముందూ కొనసాగనున్నాయి. కాకపోతే ఒక్కసారి నూతన విధానాన్ని ఎంచుకుంటే, మళ్లీ తిరిగి పాత విధానానికి మారేందుకు వీలుండదు. నూతన పన్ను విధానంలో చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పన్నుల రేటు తక్కువగా ఉంటుంది. భవిష్యనిధి చందాపై పన్ను అధిక ఆదాయ వర్గాల భవిష్యనిధి వాటాలపై స్వల్ప పన్నును మంత్రి ప్రతిపాదించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి తరఫున చందా రూ.2.5లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అధిక విలువ కలిగిన డిపాజిటర్లను మంత్రి లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈపీఎఫ్ అని గుర్తు చేస్తూ.. నెలకు రూ.2లక్షల్లోపు ఆర్జించే వారిపై తాజా ప్రతిపాదన ఎటువంటి ప్రభావం చూపించదని మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ పరిమితిగా ఉందని, ఈ మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. రూ.2.5 లక్షలకు మించి చందాదారుల సంఖ్య మొత్తం సభ్యుల్లో ఒక శాతాన్ని మించదని వ్యయాల విభాగం సెక్రటరీ టీవీ సోమనాథన్ తెలిపారు. 75 దాటితే నో ఐటీ రిటర్న్స్ పెన్షన్ ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కలిగిన 75 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారు ఇక మీదట ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ అందుకుం టున్న బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కూడా వస్తుండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 75 ఏళ్లు నిండిన వృద్ధులపై నిబంధనల అమలు భారాన్ని దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. రిటర్నుల దాఖలులో మినహాయింపునిచ్చినా కానీ, పన్ను బాధ్యత మాత్రం కొనసాగుతుంది. అంటే ఆదాయంపై నిబంధనల మేరకు పన్నును సంబంధిత బ్యాంకు మినహా యించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుందని ఆర్థిక శాఖా కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మీడియాకు స్పష్టం చేశారు. పెన్షన్, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకు నుంచి ఉంటేనే ఈ వెసులుబాటు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఆదాయం వస్తూ, మరో బ్యాంకులో ఎఫ్డీలపై వడ్డీ ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్, ఎఫ్డీలపై వడ్డీకాకుండా ఇతర రూపాల్లో ఆదాయం ఉన్నా కానీ రిటర్నుల దాఖలు తప్పనిసరి. సొంతింటి రుణ వడ్డీపై పన్ను మినహాయింపు అందుబాటు ధరల ఇళ్లను రుణంపై కొనుగోలు చేసుకునే వారికి ఈ బడ్జెట్లో ఊరట లభించింది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో అదనంగా కల్పించిన పన్ను మినహాయింపును.. మరో ఏడాది పాటు 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ బడ్జెట్లో నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఇళ్ల కొనుగోలుపైనా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. వాస్తవానికి ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు గతంలో ఉండగా, దీనికి అదనంగా మరో రూ.1.5లక్షలపైనా పన్ను మినహాయింపును సెక్షన్ 80ఈఈఏ కింద 2019 బడ్జెట్లో ప్రకటించారు. మొదటిసారి ఇంటి కొనుగోలు చేసుకునే వారు, అది కూడా రూ.45లక్షల బడ్జెట్ మించని ఇళ్ల కొనుగోలుదారులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే మొత్తం మీద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.3.5 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఇది కాకుండా ఇంటి రుణం అసలుకు చేసే జమలు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద చూపించుకునే అవకాశం ఎలానూ ఉంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఇవే.. సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్80ఈఈ కింద క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సెక్షన్80సీ: ఈ సెక్షన్ కింద స్టాంప్ డ్యూటీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లింపులు చేసిన ఆర్థిక సంవత్సరానికే క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది. -
కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి?
♦ రైతు మద్దతిచ్చారు... బడ్జెట్లో ఢిల్లీ చుట్టూ ఆందోళనలు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపై చట్టంలో హామీ దొరక్కపోయినా... బడ్జెట్లో దొరికింది. కాకుంటే కనీస మద్దతు ధర మరీ కనీసంగా.. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉంది!! సాగు రుణ పరిమితి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచినా ఇవ్వాల్సింది బ్యాంకులు కదా! ‘ఆపరేషన్ గ్రీన్’ 22 ఉత్పత్తులకు విస్తరించటం ఊరటే. చదవండి: బడ్జెట్ 2021: ఈ విషయాలు మీకు తెలుసా! ♦ విద్యార్థి ఆన్లైన్... అర్థమైందా? స్కూలు బ్యాగు మోసి.. క్లాసు మొహం చూసి ఏడాదవుతోంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యాయో లేదో అర్థంకాని పరిస్థితి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైళ్లు లేనివారి గురించి ఆలోచించలేదెవ్వరూ! ఆలోచిస్తే ఈ బడ్జెట్లో మొబైల్ రేట్లు పెంచేస్తారా ఏంటి? మరి ఊహించని సిలబస్‌ను చూసి నష్టపోయిన పిల్లలకు ఈ బడ్జెట్లో ఏమైనా ఒరిగిందా అంటే.. అదీ లేదు. డిజిటల్ విద్య ఊసే లేదు. కాకుంటే మరో 15వేల కొత్త స్కూళ్లు, 100 సైనిక్ స్కూళ్లు తెస్తామన్నారు. ఇక.. ఉన్నత విద్య నియంత్రణకొక కమిషన్, లేహ్‌లో ఓ సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్టీ విద్యార్థుల కోసం 750 ఏకలవ్య స్కూళ్లు ఇలా భవిష్యత్తు బాటలు చాలా ఉన్నాయ్. కానీ కోవిడ్ లాంటి వైరస్లు కోరలు చాస్తే..? తగిన ఆన్లైన్ పాలసీ అవసరమైతే ఉంది!. చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ♦ ఉద్యోగి అయినా... పన్ను మారలేదు పన్ను పోటులో మార్పేమీ లేదు. కాకపోతే కొన్ని చిన్నచిన్న ఊరటలున్నాయ్. రిటర్నులు రీ–ఓపెన్ చేసే కాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే వడ్డీకి టీడీఎస్ ఉండదు. ఇక తక్కువ ధరలో ఇల్లు కొనుక్కున్న వారికి రూ.1.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ ఇచ్చే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. పన్ను వివాద మెకానిజం మరింత సులభం చేశారు. కానీ మధ్య తరగతి ఆశగా చూసే ఆదాయపన్ను శ్లాబుల జోలికి మాత్రం వెSళ్లలేదు. పైగా అగ్రిసెస్సు కారణంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి జేబుకు చిల్లు పడొచ్చనే ∙దిగులు వచ్చి పడింది..! చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు ♦ సీనియర్ సిటిజన్ ఇదేం రకం ఊరటబ్బా? 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు టాక్స్ రిటర్న్స్ వేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు తాజా బడ్జెట్లో కల్పించారు. కానీ కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకే ఈ వెసులుబాటని క్లాజ్ పెట్టారు. ఈ ప్రకటనతో వారికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పని తప్పింది కానీ, పన్ను మాత్రం రూపాయి తగ్గలేదు. బ్యాంకులే పెన్షన్‌లో పన్ను మినహాయించేసుకుంటాయి. మరి దీన్ని ఊరట అనుకోవాలా? అయినా మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. అలాంటప్పుడు 75 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తే ఎందరికి లాభమట? ♦ కార్పొరేట్స్ సూపరో.. సూపర్! కార్పొరేట్ల హ్యాపీ అంతా ఇంతా కాదు. ఆ సంతోషమంతా మార్కెట్లలో చూపించేశారు లెండి. పన్ను పెంచలేదు. పైపెచ్చు డివిడెండ్ మినహాయింపులు, ఇన్ఫ్రా డెట్‌ఫండ్స్ నిధులు సమీకరించుకునే వీలు, ఎన్ఎఫ్ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, గిఫ్ట్ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీకి పన్ను ప్రోత్సాహకాలు, టాక్స్ ఆడిట్ టర్నోవర్ పెంపు, జీఎస్టీ ఫైలింగ్ సరళీకరణ, కస్టమ్స్ డ్యూటీ క్రమబద్ధీకరణ, మొబైల్స్, ఐరన్, టెక్స్టైల్స్, కెమికల్స్, బంగారం, వెండి, పునర్వినియోగ ఇంధన వనరుల రంగాలకు తాయిలాలు లాంటివన్నీ నవ్వులు పూయించేవే. ఇక ప్రయివేటీకరణ అంటూ అమ్మకానికి పెట్టిన ఆస్తులన్నీ కొనేది ఎలాగూ వీరే. అందుకే తాజా బడ్జెట్‌తో మార్కెట్ రయ్యి... మంది. -
వ్యవసాయ రంగానికి రూ. 1,31,531 కోట్లు
రైతు ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా వ్యవసాయానికిచ్చే రుణాల పరిమితిని 10% పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు అయింది. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పలు ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెస్ బంగారం, వెండిలపై 2.5% వరకూ ఉంటే.. మద్యంపై 100% వరకూ ఉంది. ఈ నిధులను మౌలిక సదుపా యాలను అభివృద్ధికి ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ఇచ్చే నిధులను గత ఏడాది (రూ.30వేల కోట్లు) కంటే రూ. పదివేల కోట్లు ఎక్కువ చేయడం, సూక్ష్మ బిందు సేద్యం, మార్కెట్ యార్డుల్లో సదుపాయాలు, అభివృద్ధి నిధుల సాయం అందించడం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీ: తొలిసారి తన డిజిటల్ బడ్జెట్‌ను పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల న్నది దేశం మొదటి సంకల్పమని పేర్కొన్నారు. వ్యవ సాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పశుపోషణ; డెయిరీ, చేపల పెంపకానికి కూడా తగినన్ని నిధులు రుణాల రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతాయని, పండించిన పంటలను కాపాడుకోవడంతోపాటు, సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని ఈ చర్యలన్నింటి కారణంగా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం సెస్ విధించే సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విస్తరణ... వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ స్కీమ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తులు (త్వరగా నశించిపోయేవి)ను చేర్చనున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)లో ఇప్పటికే 1.68 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ–నామ్‌లకు చేరుస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మబిందు సేద్యానికి ప్రస్తుతమిస్తున్న రూ.5000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఫిషరీస్ రంగం అభివృద్ధికి కోచీ, చెన్నై, విశాఖపట్నం, పరదీప్, పెటువాఘాట్లలోని ప్రధాన ఫిషింగ్ హార్బర్లను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వలస కార్మికుల కోసం... దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించే వన్ నేషన్ వన్ రేషన్ పథకం వల్ల 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 86 శాతం మంది లబ్ధిదారులు లాభం పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అసంఘటిత రంగంలోని కార్మికులు మరీ ముఖ్యంగా వలస కార్మికుల సమాచారం సేకరించేందుకు, తద్వారా వారి కోసం పథకాలను రూపొందిం చేందుకు ఒక పోర్టల్‌ను రూపొందించనున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత పథకాలను గిగ్, ప్లాట్ఫార్మ్ కార్మికులకూ వర్తింపచేసేందుకు, ఈఎస్ఐ సేవలు అన్ని వర్గాల కార్మికులకు అందేలా చేసేందుకు కనీస వేతనాల్లో మార్పులు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు తగిన రక్షణతో రాత్రి షిఫ్ట్‌లు పనిచేసేందుకు వీలుగా కూడా చట్టాల్లో మార్పులు తేనున్నట్లు చెప్పారు. స్టాండప్ ఇండియా పథకంలో ఎస్సీఎస్టీ మహిళలకు మార్జిన్ మనీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మద్దతు ధర వితరణ పెరిగింది... పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడుల సేకరణ క్రమేపీ పెరుగుతున్న కారణంగా మద్దతు ధర వితరణ కూడా ఎక్కువైందని, 2013 –14తో పోలిస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి పంటల కోసం రైతులకు ఇచ్చిన మొత్తం పెరిగిందని (బాక్స్ చూడండి) వివరించారు. గోధుమల సేకరణ వల్ల 2020–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా గత ఏడాది ఈ సంఖ్య 35.57 కోట్లేనని వివరించారు. పప్పుధాన్యాల సేకరణ 2013–14 కంటే నలభై రెట్లు పెరిగి 2019–20 నాటికి రూ.10,530 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. సెస్ విధింపు.. సుంకాల తగ్గింపు.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం కొన్ని ఉత్పత్తులపై సెస్ విధించిన ప్రభుత్వం కొన్నింటి సుంకాలను తగ్గించింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌పై సెస్ వసూలు చేయనున్నప్పటికీ సుంకాల తగ్గింపు కారణంగా ఆ ప్రభావం వినియోగదారులపై పడకపోవచ్చు. ఈ రెండు ఉత్పత్తులపై విధించే ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే.. పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల నుంచే బియ్యం సేక రణ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రుణ వితరణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. పెద్ద పెద్ద రైతులు లబ్ధి పొందుతూంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుం టుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తూంటే అసలు రైతుకు సంస్థాగత రుణాల లభ్యత ఉండటం లేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో హెక్టారుకు రూ.30,000 వరకూ సబ్సిడీలు లభిస్తూంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేలకు మించడం లేదు. ఈ అసమానతలను సరిదిద్దగకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించి నప్పటికీ బడ్జెట్లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసు లేనేలేకపోవడం గమనార్హం. జి.వి.రామాంజినేయులు, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, హైదరాబాద్. 5.6%పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది కంటే 5.6 శాతం ఎక్కువ నిధులు లభించగా ఇందులో సగం మొత్తాన్ని ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021–22 సంవత్సరానికి గాను మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సాగునీటి పథకాలకు గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2020–21 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.1,24,519 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా కేటాయింపుల్లో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించు కుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తారు. పీఎం–కిసాన్ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తారు. మద్దతు ధర వితరణ (రూ. కోట్లలో) ఉత్పత్తి 2013–14 2019–20 2020–21 గోధుమలు 33,874 62,802 75,050 బియ్యం 63,928 1,41,930 172,752 పప్పుధాన్యాలు 236 8,285 10,530 పత్తి 90 - 25,974 వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సెస్ దేనిపై ఎంతంటే(శాతాల్లో) శనగపప్పు 50 శాతం ఆపిల్ పండ్లు 35 శాతం కాబూలీ శనగలు 30 శాతం మసూర్‌దాల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 20 శాతం ముడి పామాయిల్ 17.5 శాతం బటానీలు 10 శాతం పత్తి, నిర్దిష్ట ఎరువులు 5 శాతం బంగారం, వెండి కడ్డీలు 2.5 శాతం బొగ్గు,పీట్ లిగ్నైట్ 1.5 శాతం పెట్రోలు రూ.2.5 డీజిల్ రూ.4.0 రైతులతో చర్చలకు సిద్ధం: నిర్మలా న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ఆమె చెప్పారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు బైఠాయించారో మాకు అర్థమయింది. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు రైతులతో చర్చలు జరిపారు. కొత్త సాగు చట్టాలపై అంశాల వారీగా సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇదే విషయం స్పష్టం చేశారు’అని మంత్రి నిర్మల అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు, సందిగ్ధాలను తొలగించుకోవాలని ఆమె రైతులను కోరారు. అనంతరం, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరి మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించారు. -
కారిడార్లు కీలకం
న్యూఢిల్లీ : రహదారులు, ఉపరితల రవాణాకు బడ్జెట్లో రూ.1.18 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైవే కారిడార్ల అభివృద్ధిని ప్రాధాన్యత కింద చేపడతామన్నారు. గతేడాది ఉపరితల రవాణాకు రూ.91,823 కోట్లు కేటాయించగా సవరించిన అనంతరం రూ.1.01 లక్షల కోట్లకు చేరుకుంది. ఈసారి రోడ్లు, ఉపరితల రవాణా శాఖకు రూ.1,18,101 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటాయిస్తున్నామని, ఇప్పటివరకు ఇదే అత్యధికమని చెప్పారు. ప్రాధాన్యత కారిడార్లు, ప్రాజెక్టులు 2021 –22లో చురుగ్గా సాగుతాయని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు ఆచరణాత్మకంగా ఉన్నాయని, దేశంలో దీర్ఘకాలం పాటు మౌలిక వసతులను పటిష్టం చేయడంలో ఈ చర్యలు ఉపకరిస్తాయని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కారిడార్లు, రహదారుల నిర్మాణానికి అధిక నిధులు 7టెక్స్టైల్ పార్కులు.. హైవే కారిడార్లు.. భారతమాల పరియోజన పథకం కింద రూ.3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కి.మీ. రహదారుల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటికే 3,800 కి.మీ. మేర పూర్తయింది. 2022 మార్చి నాటికి మరో 8,500 కి.మీ. నిర్మాణం చేపడతారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 11,000 కి.మీ. నేషనల్ హైవే కారిడార్ల నిర్మాణం పూర్తి కానుంది. ఆర్థిక కారిడార్లు.. తమిళనాడులో 3,500 కి.మీ మేర జాతీయ రహదారుల కోసం రూ.1.03 లక్షల కోట్లు n కేరళలో 1,100 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.65,000 కోట్లు n పశ్చిమ బెంగాల్లో 675 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.25,000 కోట్లు n అసోంలో మూడేళ్లలో 1,300 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.34,000 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.19,000 కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులకు ఇది అదనం. ప్రజా రవాణాకు పెద్దపీట ♦ 27 నగరాల్లో మెట్రో, ఆర్ఆర్టీఎస్ పనులు ♦ ‘మిత్ర’ పథకం కింద 7 టెక్స్టైల్ పార్కులు ♦ దేశంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఫ్లాగ్ షిప్ కారిడార్లు / ఎక్స్‌ప్రెస్ వేస్.. ♦ ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ వే: మిగిలిన 260 కి.మీ పనులు 2021 మార్చి 31లోగా కేటాయింపు. ♦ బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ వే: 278 కి.మీ. మేర నిర్మాణం, 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ కాన్పూర్ – లక్నో ఎక్స్‌ప్రెస్ వే: జాతీయ రహదారి 27కి ప్రత్యామ్నాయంగా 63 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్ వే పనులను 2021––22లో చేపడతారు. ♦ ఢిల్లీ – డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్: 210 కి.మీ పొడవైన ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు 2021––22లో మొదలవుతాయి. ♦ రాయ్‌పూర్ – విశాఖపట్టణం కారిడార్: చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా 464 కి.మీ. పొడవైన కారిడార్ నిర్మాణ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే కేటాయిస్తారు. 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ చెన్నై – సేలం కారిడార్: 277 కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు 2021–22లో మొదలవుతాయి. ♦ అమృత్సర్ – జామ్‌నగర్ : 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ ఢిల్లీ – కాట్రా : 2021–22లో నిర్మాణ పనులు ప్రారంభం. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం ♦ కొత్తగా నిర్మాణం చేపట్టే 4, 6 వరుసల రహదారుల్లో అమలు చేస్తారు. ♦ స్పీడ్ రాడార్లు ♦ వేరియబుల్ మెస్సేజ్ బోర్డులు ♦ జీపీఎస్ ఆధారిత రికవరీ వ్యాన్లు మరిన్ని చోట్ల మెట్రో కూత.. ♦ మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, సిటీ బస్సు సర్వీసులను పెంచడం ద్వారా పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ♦ ప్రజా రవాణాలో బస్సులను ప్రోత్సహించేందుకు కొత్త పథకానికి రూ.18,000 కోట్లు కేటాయించారు. పీపీపీ విధానంలో 20,000కిపైగా బస్సులను నడుపుతారు. ఆటోమొబైల్ పరిశ్రమకు నూతనోత్తేజం కల్పించడం, ఆర్థిక వృద్ధి, యువతకు ఉపాధి లక్ష్యంగా ♦ ప్రస్తుతం 702 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండగా మరో 1,016 కి.మీ మేర మెట్రో, ఆర్ఆర్టీఎస్ నిర్మాణ పనులు 27 నగరాల్లో పురోగతిలో ఉన్నాయి. టైర్ –2 నగరాలు, టైర్ 1 నగరాల బాహ్య ప్రాంతాల్లో మెట్రో అనుభూతిని చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ‘మెట్రో లైట్’ ‘మెట్రో నియో’ పరిజ్ఞానం ఉపకరిస్తుంది. ♦ కోచి మెట్రో రైలు ఫేజ్ –2లో 11.5 కి.మీ. నిర్మాణానికి రూ.1,957.05 కోట్లు ♦ చెన్నై మెట్రో రైలు ఫేజ్ –2లో 118.9 కి.మీ. నిర్మాణానికి రూ.63,246 కోట్లు ♦ బెంగళూరు మెట్రో రైల్వే ప్రాజెక్టు ఫేజ్ 2 ఏ, 2 బీ కింద 58.19 కి.మీ. నిర్మాణానికి రూ.14,788 కోట్లు ♦ నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ –2కి రూ.5,976 కోట్లు ♦ నాసిక్‌లో మెట్రో రైలు కోసం రూ.2,092 కోట్లు ‘పవర్’ఫుల్ లైన్లు 139 గిగావాట్ల సామర్థ్యంతో 1.41 లక్షల సర్క్యూట్ కి.మీ. పరిధిలో ట్రాన్స్మిషన్ లైన్లు, 2.8 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు సదుపాయం గత ఆరేళ్లలో అందుబాటులోకి. డిస్కంల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు విద్యుత్తు వినియోగదారులు తమకు నచ్చిన సంస్థల సేవలను ఎంచుకునేలా చర్యలు. విద్యుత్తు వ్యవస్థలో సంస్కరణలు, నూతన ఇంధన పంపిణీ విధానం కోసం ఐదేళ్లలో రూ.3,05,984 కోట్లు వ్యయం. 2021–22లో జాతీయ హైడ్రోజన్ ఇంధన విధానం అమలు. పోర్టులు, నౌకాయానం, జల రవాణా ♦ మేజర్ పోర్టుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో రూ.2,000 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు 2021–22లో అమలు కానున్నాయి. ♦ భారతీయ షిప్పింగ్ కంపెనీలకు అంతర్జాతీయ టెండర్లలో ఐదేళ్లలో రూ.1,624 కోట్ల మేర రాయితీలు కల్పించనున్నారు. ♦ 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా అదనంగా 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నారు. మరో కోటి మందికి ‘ఉజ్వల’ ఉజ్వల పథకాన్ని విస్తరించడం ద్వారా మరో కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. రానున్న మూడేళ్లలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరిధిలో మరో వంద జిల్లాలను చేరుస్తారు. గ్రామీణాభివృద్ధికి పథకాలకు ఇలా... ⇒2021–22 కేటాయింపు: రూ.1,31,519 కోట్లు (9.5% పెంపు) ⇒2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు (సవరించిన అంచనా: రూ.1,97,377 కోట్లు) ‘ఉపాధి’కి మరింత దన్ను... ⇒2021–22 కేటాయింపు: రూ. 73,000 కోట్లు (19% పెంపు) ⇒2020–21 కేటాయింపు: రూ. 61,500 కోట్లు (సవరించిన అంచనా: రూ. 1,11,500 కోట్లు) ⇒ 2019–20లో సగటు రోజు కూలీ రూ.182 ఉండగా, దీన్ని 2020–21 ఏప్రిల్ 1 నుంచి 10 శాతం పెంపుతో రూ.200కు చేర్చారు. ⇒ మొత్తం 708 జిల్లాలు, 7,092 బ్లాక్‌లు, 2,68,561 గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలవుతోంది. ⇒ 2021 జనవరి 29 నాటికి ఈ పథకం కింద 14.82 కోట్ల జాబ్ కార్డులు జారీ కాగా, ఇందులో చురుకైన జాబ్ కార్డుల సంఖ్య 9.25 కోట్లు. 28.72 కోట్ల మంది కార్మికులు జాబితాలో ఉండగా, 14.4 కోట్ల మంది కార్మికులు చురుగ్గా ఉపాధి పొందుతున్నారు. కొనసాగుతున్న విద్యుత్ వెలుగులు.. (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) ⇒ 2021–22 కేటాయింపు: రూ. 3,600 కోట్లు (20 శాతం తగ్గింపు, కానీ సవరించిన అంచనా ప్రకారం 125 శాతం పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు (సవరించిన అంచనా: రూ.2,000 కోట్లు) ⇒ ఈ పథకానికి నిధులు 2020–21 సవరించిన అంచనా ప్రకారం చూస్తే 125 శాతం ఎగబాకాయి. ⇒ గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తేవడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు. ⇒ 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు. ⇒ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 4,000 కోట్ల (సవరించిన అంచనా) నుంచి రూ. 5,300 కోట్లకు పెంచారు. గ్రామీణ రోడ్లు.. రయ్రయ్! ⇒ 2021–22 కేటాయింపు: రూ. 15,000 కోట్లు (30% తగ్గింపు) (9.5% పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ. 19,500 కోట్లు (సవరించిన అంచనా రూ.13,706 కోట్లు) ⇒ 2000 సంవత్సరంలో పీఎంజీఎస్‌వై పథకం ఆరంభం నుంచి ఇప్పటిదాకా (2021 జనవరి 20 నాటికి) 1,70,034 గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు. ⇒ మొత్తం 7,47,990 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లకు ఆమోదం లభించగా, 6,43,999 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. ⇒ ప్రస్తుత ప్రాజెక్టులను రాష్ట్రాల భాగస్వామ్యంతో పూర్తి చేయాలంటే 2025 నాటికి ఏటా రూ.19,000 కోట్లు అవసరం అవుతాయి. ⇒ 2021–22 కేటాయింపు: రూ. 12,294 కోట్లు (మారలేదు, కానీ సవరించిన అంచనా ప్రకారం 76% పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.12,294 కోట్లు (సవరించిన అంచనా: రూ.7,000 కోట్లు) ⇒ 2019 నాటికి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ⇒ గ్రామీణ ఎస్బీఎం రెండో దశను 2020 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2024–25 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకు రూ.1.4 లక్షల కోట్లను కేటాయించనున్నారు. ⇒ 2020–21లో (డిసెంబర్ 2020 నాటికి) 41.61 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్డు, 70,929 కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం (మరో 31,560 నిర్మాణంలో ఉన్నాయి) జరిగింది. ఠి పట్టణ ప్రాంతాల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు ఐదేళ్ల పాటు ఎస్బీఎం 2.0 (రెండో ఫేజ్) కోసం రూ.1,41,678 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. డిజిటల్ ఇండియాకు జోష్ (భారత్ నెట్) ⇒ 2021–22 కేటాయింపు: రూ. 7,000 కోట్లు (17 శాతం పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు (సవరించిన అంచనా: రూ.5,500 కోట్లు) ⇒ భారత్ నెట్ కింద 2021 జనవరి 15 నాటికి మొత్తం 1.63 లక్షల గ్రామ పంచాయతీలకు 4.87 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు ⇒ ఇందులో 1.51 లక్షల గ్రామ పంచాయతీలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ‘జల్ జీవన్’కు నిధుల వరద... ⇒ 2021–22 కేటాయింపులు: 50,011 కోట్లు (335% పెంపు) ⇒ 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు ⇒ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించారు. ⇒ 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని (హ్యాండ్ పంపులు, కుళాయిలు ఇతరత్రా మార్గాల్లో) అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.3.6 లక్షలకోట్లను వెచ్చించనున్నారు. ⇒ రాష్ట్రాల సమాచారం ప్రకారం 2020–21 ఏడాదిలో (2020 డిసెంబర్ నాటికి) 2.14 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ⇒ ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ పథకం కింద కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు దీనికి రూ.1.87 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తాజా బడ్జెట్లో ప్రకటించింది. సొంతింటి సాకారం దిశగా... ⇒ 2021–22 కేటాయింపులు: రూ. 19,500 కోట్లు (మారలేదు) ⇒ 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు ⇒ 2019 నాటికి గ్రామాల్లో కోటి పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. 2022 నాటికి మరో 1.95 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ⇒ పట్టణాల్లో పీఎంఏవై కోసం ఈ ఏడాది 2020–21లో బడ్జెట్ అంచనాలకు (రూ.8,000 కోట్లు) మూడింతలు (సవరించిన రూ.21,000 కోట్లు) కేటాయింపులు జరపడం విశేషం. ⇒ 1.09 కోట్ల ఇళ్లకు అనుమతులు లభించగా, ఇప్పటిదాకా 70 లక్షల ఇళ్ల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. 41 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. -
బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు..
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ అవసరాల దృష్ట్యా భారీ రక్షణ బడ్జెట్‌పై ఊహాగానాలు కొనసాగాయి. కానీ గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరుగుదలతో రూ.4.78 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. అయితే మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడంతో పాటు, భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దులను రక్షిస్తున్న సాయుధ బలగాలకు కూడా ఎక్కువ కేటాయింపులే లభించాయి. మరోవైపు తూర్పు లడాఖ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మిలటరీ అవసరాల కొనుగోలు కోసం గత బడ్జెట్ మూలధన వ్యయం కింద రూ.20,776 కోట్లు అదనంగానే సాయుధ బలగాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తే మాత్రం 2020–21 బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,13,734 కోట్లు కేటాయించగా సవరించిన మూలధన వ్యయం రూ.1,34,510 కోట్లుగా నమోదయ్యింది. చైనాతో గొడవ నేపథ్యంలో భారత సైన్యం గత కొన్ని నెలల్లో పలు దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు కొనుగోలు చేసింది. రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు. గత ఏడాది మూలధన వ్యయం రూ.1,13,734 కోట్లతో పోల్చుకుంటే ఇది 18.75 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రూ.1.15 లక్షల కోట్లు పెన్షన్లకు కేటాయించారు. గత ఏడాది (రూ.1.33 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2020–21లో సుమారు రూ.18 వేల కోట్ల పెన్షన్ బకాయిలు చెల్లించడమే ఇందుకు కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. పెన్షన్‌ను మినహాయిస్తే జీతాల చెల్లింపులు, ఆస్తుల నిర్వహణ వంటి రెవెన్యూ ఖర్చు రూ.2.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆర్మీకి మూలధన వ్యయం కింద రూ.36,481 కోట్లు, నౌకా దళానికి రూ.33,253 కోట్లు, వైమానిక దళానికి రూ.53,214 కోట్లు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసిన దానికంటే రూ.1,841 కోట్లు తక్కువ) కేటాయించారు. గత ఏడాది ఆర్మీకి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు కేటాయించారు. వైమానిక దళ గత ఏడాది మూలధన వ్యయం రూ.43,281.91 కోట్లు కాగా సవరించిన అంచనా రూ.55,055 కోట్లుగా నమోదయ్యింది. సాయుధ బలగాలకు అదనంగా నిధులు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేటాయింపు పెంచారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆర్థికమంత్రి రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపు రూ.92,848.91 కోట్లతో పోల్చుకుంటే ఇది 7.1 శాతం ఎక్కువ. రాజ్‌నాథ్ కృతజ్ఞతలు రక్షణ బడ్జెట్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కృతజ్ఞతలు తెలి పారు. మూలధన వ్యయంలో దాదాపు 19% పెరుగుదల గత 15 ఏళ్లలో అత్యధికమని పేర్కొన్నారు. కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు తెరిచే ప్రతిపాదనపై రాజ్‌నాథ్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. సంతృప్తికర బడ్జెట్ కరోనా విపత్తు నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రక్షణ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి. మూలధన వ్యయం రూ.22 వేల కోట్లు పెరగడం ఆహ్వానించతగ్గ పరిణామం. సైన్యం ఆధునీకరణ కసరత్తును కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుంది. – డాక్టర్ లక్ష్మణ్ బెహెరా, ప్రముఖ రక్షణ నిపుణుడు -
బడ్జెట్ 2021: పదేళ్ల మెగా ప్రణాళిక
న్యూఢిల్లీ: కరోనా అన్ని రవాణా వ్యవస్థలతో పాటు భారతీయ రైల్వేపైనా పెను ప్రభావం చూపించింది. కొన్ని నెలల పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,10,055 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. ‘రికార్డు’బడ్జెట్‌గా అభివర్ణించినా 2020–21 సవరించిన బడ్జెట్ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే. మరోవైపు 2030 కల్లా భవిష్యత్ అవసరాలకు తగిన (ఫ్యూచర్ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్సీ) ప్రారంభించాలని నిర్ణయించారు. ఈడీఎఫ్‌సీలో భాగంగా 2021–22లో సోన్నగర్–గోమోహ్ సెక్షన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్–డాంకుని సెక్షన్ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్‌ను, భూసావాల్ – ఖరగ్‌పూర్ – డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్‌ను చేపడతారు. ⇔ 2022 జూన్‌కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు ⇔ భవిష్యత్తులో ఖరగ్‌పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్, ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్, భూసావాల్–ఖరగ్‌పూర్–డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్లు ⇔ 2023 కల్లా బ్రాడ్‌గేజ్ రూట్ల 100 శాతం విద్యుదీకరణ ⇔ రైళ్ల ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైలు భద్రత విధానం 2020 అక్టోబర్ 1 నాటికి 41,548 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)గా ఉన్న బ్రాడ్ గేజ్ రూట్ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్ కిలోమీటర్లకు (72%)చేరుకుంటుంది. 2023 కల్లా 100% విద్యుద్దీకరణ పూర్తవుతుంది. పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ వ్యవస్థను అన్ని ప్రధానమైన రూట్లలో ప్రవేశపెడతాం..’అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి మెట్రో రైళ్ల విస్తరణలో భాగంగా చెన్నై మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.63,246 కోట్ల కేంద్ర నిధులు కేటాయించారు. బెంగళూరు మెట్రో రైల్వే ఫేజ్ 2ఏ, 2బీ కోసం రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం 1,957.05 కోట్లు, నాగ్‌పూర్ మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్ మెట్రో కోసం రూ.2,092 కోట్లు ప్రకటించారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసిన రైల్వేని ఆర్థికమంత్రి అభినందించారు. ఇది పూర్తిగా భిన్నమైన, పరివర్తనతో కూడిన బడ్జెట్‌గా రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ అభివర్ణించారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి 20 శాతం అధికం
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020–21 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషం. అలా గే ఎర్త్ సైన్సెస్ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్ఐఆర్) ఉన్నాయి. దే శంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ విభాగాలన్నీ కీలకంగా పనిచేశాయి. 2021–22 బడ్జెట్లో డీఎస్టీకి రూ.6,067.39 కోట్లు, డీబీటీకి రూ.3,502.37 కోట్లు, డీఎస్ఐఆర్కు రూ.5,224.27 కోట్లు కేటాయించారు. 2020–21 బడ్జెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.14,473.66 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని రూ.11,551.86 కోట్లుగా సవరించారు. ఇండియాలో ‘డీప్ ఓషన్ మిషన్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2021-22 రూ.14,793.66 2020-21 రూ.11,551.86 అంతరిక్ష విభాగానికి రూ.13,949 కోట్లు అంతరిక్ష విభాగానికి కేంద్రం రూ.13,949 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది గతేడాది రూ.8,228 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,449 కోట్లు ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’కు కేటాయించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా నలుగురు మానవులను అంతరిక్షంలోకి పంపడానికి రష్యాలోని జెనెరిక్ స్పేస్ ఫ్లయిట్ ఆస్పెక్ట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిసెంబర్ 2021లో మానవరహిత అంతరిక్ష నౌకను పరీక్షిస్తామని వెల్లడించారు. హోం శాఖకు రూ.1,66,547 కోట్లు కేంద్ర హోంశాఖకు 2021–22 బడ్జెట్లో రూ. 1,66,547 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హోం శాఖకు రూ.1,49,387 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.1,66,547 కోట్లకు పెంచారు. ఇం దులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లకు రూ.1,03,802.52 కోట్లు, జనాభా లెక్కలకు రూ.3,768.28 కోట్లు కేటాయించారు. -
ఎన్నికలు: ఆ రాష్ట్రాలపై వరాల జల్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అత్యంత ప్రాముఖ్యత నిచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలలో మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడుల్లో అధికారంలోకి రావడం, అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం దిశగా ఈ కేటాయింపులు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 25 వేల కోట్లను నిర్మల కేటాయించారు. ఈ నిధులతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇది కోల్‌కతా–సిలిగురి హైవే పునరాభివృద్ధి కోసం అంటూ ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా బల్లలు చరుస్తూ స్వాగతించారు. ఉత్తర బెంగాల్‌లోని 54 అసెంబ్లీ సీట్లలో 50 గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఈ కేటాయింపులు చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: మౌలిక ప్రాజెక్టులకు ‘మానిటైజేషన్’ ఊతం కేరళకు భారీగా నిధులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేరళలో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తున్న దిశగా.. ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించారు. రూ. 65 వేల కోట్లను రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తూ ఈ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిధులతో 1,100 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. కొచ్చి మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా 11.5 కిలోమీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 1,957.05 కోట్లను కేటాయించారు. ముంబై, కన్యాకుమారి ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా కేరళలో రూ. 50 వేల కోట్లతో 650 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గత అక్టోబర్‌లో కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. కేరళ అభివృద్ధికి జీవనరేఖగా పేర్కొంటున్న ఈ కారిడార్‌లో కొల్లం, ఎర్నాకులం, కన్నూర్, తలసేరి, కోజికోడ్, కాసర్గాడ్, త్రివేండ్రం వంటి ప్రముఖ పట్టణాలు ఉన్నాయి. చదవండి: కొంచెం ఖేదం.. కొంచెం మోదం తమిళనాడుకు లక్ష కోట్లు.. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడుపై కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. 3,500 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ. 1.03 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో మధురై–కొల్లం ఆర్థిక కారిడార్ నిర్మాణం కూడా ఉంటుంది. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం ఫిషరీస్ హబ్‌తో పాటు వివిధ ఉపయోగాలు ఉండే సముద్ర కలుపు పార్క్‌ను కూడా ఈ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న సముద్ర కలుపు సేద్యంతో తీర ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి’’అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. సముద్ర కలుపు పెంపకం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకంలో భాగంగా రూ. 637 కోట్లు కేటాయించారు. మరోపక్క చెన్నై మెట్రో ప్రాజెక్టుకు రూ. 1,957 కోట్లు ప్రకటించారు. అసోంలో మరోసారి అధికారానికి.. పౌరసత్వ సవరణ చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకిస్తున్న అసోంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఆ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 3,400 కోట్లు కేటాయించారు. నిర్మల మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రూ. 19 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే మూడేళ్లలో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, రోడ్లు, బ్రిడ్జీల అభివృద్ధికి తమ శాఖ రూ.80 వేల కోట్లు కేటాయించిందని గత అక్టోబర్‌లో అసోంలో పర్యటించిన సందర్భంగా నితిన్ గడ్కరీ వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని హైవే నిర్మాణం, ద్వీపంలా ఉండే ప్రాంతం మజూలీ నుంచి జోర్హాట్ జిల్లాను కలిపే బ్రిడ్జి నిర్మాణం ప్రాజెక్టులను ఇప్పటికే ప్రకటించారు. పోచంపల్లి చీరలో మెరిసిన నిర్మల చేనేత వస్త్రాలపై తన మమకారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రదర్శించారు. ఎరుపు, తెలుపు చీరకు పచ్చటి అంచు ఉన్న పోచంపల్లి సిల్క్ చీరలో పార్లమెంట్‌కు హాజరై అందర్నీ ఆకట్టుకున్నారు. పోచంపల్లి ఇక్కత్‌గా పిలిచే ఇలాంటి చీరలను తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో నేస్తారు. ఇలాంటి చీరలను 1970లలో నేసేవారమని పోచంపల్లి.కామ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ చీరలను కాటన్, సిల్క్‌లతో నేస్తారని తెలిపారు. కాగా, బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల ధరించిన చీర కూడా వార్తల్లోకి ఎక్కింది. లాల్పాడ్గా పిలిచే ఈ చీరను పశ్చిమ బెంగాల్లో పూజా కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తారు. సగం తెలుపు, సగం ఎరుపు రంగులు ఉన్న ఇలాంటి చీరలను దుర్గా పూజ, సింధూర్ ఖేలా లాంటి కార్యక్రమాల్లో ధరిస్తారు. -
బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!
చరిత్ర రాల్చిన విషపు చుక్క లాంటి కోవిడ్‌తో... మనుషులే కాదు, వ్యవస్థలూ మంచానపడ్డాయి. కాస్త కోలుకున్నా... పూర్వపు స్థితి వస్తుందో రాదో తెలియని స్థితి. కాకపోతే జనానికిప్పుడు వ్యాక్సిన్ అందుతోంది. ఈ బడ్జెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థక్కూడా తొలిడోసు టీకా ఇచ్చే ప్రయత్నం చేసింది మోదీ ప్రభుత్వం. విద్య, వైద్యం, రోడ్లు, నౌకాశ్రయాలు... ఇలా అన్నింటా మౌలిక సదుపాయాలకు జై కొడుతూ ప్రణాళిక వ్యయాన్ని ఏకంగా రూ.5.54 లక్షల కోట్లకు పెంచింది. ఆరోగ్య, మౌలిక రంగాలపై దృష్టిపెట్టింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ చూపించింది. మరి ఇంత డబ్బెలా వస్తుంది..?? ఒకటి... భారీ అప్పులు తప్పవు. మరి ఆ తరవాత..? ‘సేల్ ః ఇండియా’!!. ఆర్థిక మంత్రి ఆశలన్నీ దీనిపైనే. టోల్ రోడ్లు, రైల్వే లైన్లు, గ్యాస్ పైప్లైన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు, క్రీడా మైదానాలు... వీటన్నిటికీ ‘ఫర్ సేల్’ ట్యాగ్ తగిలించబోతున్నారు. ఇక ప్రభుత్వ కంపెనీలు ఎల్ఐసీ, బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగం సరేసరి. వాటిలో వాటా విక్రయాన్ని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తిచేయాలన్నది ప్రణాళిక. నిజానికి ప్రభుత్వానికి వేరే మార్గం కూడా లేదు. ఇక అన్నిటికన్నా సాహసోపేతమైన చర్య... జవాబుదారీ తనమే లక్ష్యంగా మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ. జాతీయీకరణ జరిగిన 51 ఏళ్ల తరవాత ఓ రెండు బ్యాంకులు మళ్లీ ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి అమ్మకాలు పూర్తయితే... భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సిన్ ఇచ్చినట్లే. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? అది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.!! సిక్స్ ప్యాక్ బడ్జెట్... దేశం కరోనా కల్లోలం నుంచి తేరుకొని వృద్ధి బాటలో పరుగులు పెట్టేందుకు ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ ఆరు రంగాలు ఏమిటంటే... ఆరోగ్యంపై త్రికరణ శుద్ధి.. వ్యాధి నివారణ, చికిత్స, బాగోగులే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పించి బడ్జెట్లో కేటాయింపులు 137 శాతం పెంచారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు రూ.35,000 కోట్లు ప్రతిపాదించారు. పీఎల్ఐ ఆత్మనిర్భర్ భారత్ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు. ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములుఅయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది. వ్యవసాయ భారతం.. వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదక వ్యయంపై కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర. వ్యవసాయ రుణ పరిమితి లక్ష్యం పెంపు. పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలపై ప్రత్యేక దృష్టి. నాణ్యమైన విద్య.. దేశంలో కొత్తగా 100 సైనిక స్కూళ్లు. ఉన్నత విద్యలో నాణ్యతకు కమిషన్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు. ఉపాధిని పెంపొందించేందుకు అప్రెంటిస్‌షిప్ చట్టం. పరిశోధనలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగాలకు వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల కేటాయింపుపై విధివిధానాలు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు. కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన సత్వర న్యాయానికి ట్రిబ్యునళ్లలో సంస్కరణలు. దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించేలా పారదర్శక, సమర్థ పన్నుల విధానం. న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించారు. కరోనా సృష్టించిన విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికను దేశప్రజల ముందుంచారు. దేశ ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే వ్యక్తిగత వ్యాక్సిన్‌తో పాటు, కరోనాతో కుదేలైన రంగాలకు ఊరట కల్పించి, వృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్‌నూ ఈ బడ్జెట్లో పొందుపర్చారు. కరోనా కల్లోలం నుంచి తేరుకుని వృద్ధి దిశలో పరుగులు పెట్టాల్సిన దేశానికి అవసరమైన ముడి సరుకులను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు. 2021– 22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను సోమవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టారు. ఈ దిశగా ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను ఆమె ప్రవేశపెట్టారు. స్వాస్థ భారత్, పెట్టుబడులు– మౌలిక సదుపాయాలు, సమగ్ర సమ్మిళిత పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, సృజనాత్మకత– పరిశోధన–అభివృద్ధి, కనీస ప్రభుత్వం– గరిష్ట పాలన.. స్థూలంగా ఈ ఆరు రంగాలు పునాదులుగా బడ్జెట్‌ను రూపొందించామని నిర్మల తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’సంకల్పంలో భాగంగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మౌలిక వసతుల కల్పన, స్వాస్థ భారత్, సుపరిపాలన, యువతకు ఉపాధి అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి.. అనే ఎనిమిది అంశాలపై ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ బడ్జెట్లో ఆరోగ్యం, మౌలిక వసతులపై కేటాయింపులను భారీగా పెంచారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 49% నుంచి 74 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశీయ తయారీ రంగానికి ఉపకరించేలా ఆటోమొబైల్ విడిభాగాలు, మొబైల్ ఫోన్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్‌ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. అలాగే, యాపిల్స్, పీస్, పప్పు ధాన్యాలు, ఆల్కహాల్, కెమికల్స్, వెండి, పత్తి.. తదితర పలు ఉత్పత్తుల దిగుమతులపై వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి పన్ను(అగ్రి సెస్– అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్)ను విధించారు. అయితే, ఇంపోర్ట్ డ్యూటీని సర్దుబాటు చేయడం ద్వారా ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడకుండా చూస్తారు. భవిష్యనిధి(ప్రావిడెంట్ ఫండ్)కు ఉద్యోగి ఇచ్చే వాటాపై వడ్డీ ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే, అది ఏప్రిల్ 1, 2021 నుంచి పన్ను పరిధిలోకి వస్తుంది. కాగా, సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్‌పై, వడ్డీపై మాత్రమే ఆధారపడిన 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇకపై ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, అందరికీ సొంత ఇల్లు లక్ష్య సాధనలో భాగంగా ప్రకటించిన గృహ రుణ వడ్డీలో రూ. 1.5 లక్షల తగ్గింపు సదుపాయం మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. ఈ పథకం 2022 మార్చి 31 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. మరోవైపు, ఈ బడ్జెట్‌పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. గతమెన్నడూ లేనంత నిరుత్సాహపూరితంగా ఉందని అభివర్ణించింది. తప్పు వ్యాధి నిర్ధారణ, చికిత్స రెండు తప్పుడువేనని పేర్కొంది. మౌలికం కోసం.. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కల్పన కోసం ఈ బడ్జెట్లో ఏకంగా రూ. 5.54 లక్షల కోట్లను ఆర్థికమంత్రి కేటాయించారు. ఇందులో ప్రధానంగా రూ. 1.18 లక్షల కోట్లు రోడ్స్ అండ్ హైవే రంగానికి, రూ. 1.08 కోట్లు రైల్వే రంగానికి కేటాయించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడేందుకు, ఉపాధి కల్పనకు ఈ నిధులు ఉపయోగపడ్తాయని తెలిపారు. ఇందుకు అదనంగా అవసరమైన నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధిస్తామన్నారు. వ్యూహాత్మక రంగంలో లేని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు, కొత్తగా విధించిన అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ రూపుదిద్దుకునేందుకు భారతీయ తయారీ పరిశ్రమలు ప్రపంచ దేశాలకు సరఫరా కేంద్రాలుగా మారాల్సి ఉందని నిర్మల పిలుపునిచ్చారు. ఇందుకు గానూ ఐదేళ్ల కాలపరిమితితో 2020లోనే రూ. 1.97 లక్షల కోట్లను కేటాయించామన్నారు. దేశీయ టెక్స్టైల్స్ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ఏడు ‘మెగా టెక్స్టైల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్క్’లను ఏర్పాటు చేయనున్నామన్నారు. లోక్‌సభలో బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్న నిర్మలా సీతారామన్. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ప్రహ్లాద్ జోషి తదితరులు సాగు సాయం కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో గత రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలు లక్ష్యంగా మరే ఇతర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. వ్యవసాయ రుణాల లక్ష్యంలో ఈ సంవత్సరం 10% పెంపును ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు. పంట నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ప్రతిపాదించిన అగ్రి సెస్ మొత్తాన్ని వినియోగిస్తామని తెలిపారు. 2013–14లో గోధుమ సేకరణ కోసం నాటి ప్రభుత్వం రూ. 33,874 కోట్లు ఖర్చుచేయగా, 2020–21లో తమ ప్రభుత్వం రూ. 75,050 కోట్లు ఖర్చుచేసిందన్నారు. స్వమిత్వ పథకంలో భాగంగా 1.8 లక్షల మంది రైతులు ప్రాపర్టీ పట్టాలు పొందారని ఆర్థిక మంత్రి సీతారామన్ గుర్తుచేశారు. వ్యవసాయ మార్కెట్లకు ఇకపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, మండీల కొనసాగింపుపై రైతుల్లో ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేశారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ–నామ్) విధానం విజయవంతమైందని, ఇప్పటివరకు 1.68 కోట్ల మంది రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారని, రూ. 1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్మల తెలిపారు. త్వరలో మరో వెయ్యి మండీలను ‘ఈ–నామ్’లో చేరుస్తామన్నారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటువఘాట్ ఫిషింగ్ హార్బర్లను ‘ఎకనమిక్ యాక్టివిటీ హబ్స్’గా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. పెట్రోపై ‘అగ్రి సెస్’ తాజా బడ్జెట్లో పలు ఇతర దిగుమతులతో పాటు పెట్రోలు, డీజిల్‌లపై కూడా అగ్రి సెస్‌ను ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ. 2.5ను, లీటరు డీజిల్‌పై రూ. 4ను అగ్రిసెస్‌గా నిర్ణయించారు. అయితే, అంతే మొత్తంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆ భారం వినియోగదారుడిపై పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రక్షణ.. నామమాత్రమే చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, రక్షణ రంగ బడ్జెట్‌ను గత సంవత్సరం కన్నా నామమాత్రంగా 1.4% మాత్రమే పెంచారు. గత సంవత్సరం ఈ మొత్తం రూ. 4.71 లక్షల కోట్లు కాగా, ఈ సంవత్సరం అది రూ. 4.78 లక్షల కోట్లకు పెంచారు. రూ. 1.35 లక్షల కోట్లను ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలు కోసం కేటాయించారు. ‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక వరాలు ప్రకటించింది.పశ్చిమబెంగాల్‌కు రూ. 25 వేల కోట్లు, తమిళనాడుకు రూ. 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ. 65 వేల కోట్లు, అస్సాంకు 19 వేల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలను బడ్జెట్లో పొందుపర్చింది. ద్రవ్యలోటు తగ్గించేందుకు.. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సంవత్సర ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. మునుపెన్నడు లేనంత ఎక్కువగా ప్రభుత్వ ఖర్చు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఎకానమీకి ద్రవ్య విధాన మద్దతు మరో మూడేళ్లు కొనసాగుతుందని, ద్రవ్యలోటు 2025–26 సంవత్సరానికి జీడీపీలో 4.5 శాతానికి తగ్గుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముంది. అలాగే, పలు ఐరన్, స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయా వస్తువుల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది. పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించి.. ఐదేళ్ల కాలానికి గానూ రూ. 2.87 లక్షల కోట్లతో ‘జల జీవన్ మిషన్ –అర్బన్’ను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. అలాగే, ‘పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్’కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించామన్నారు. నగదు సమీకరణ పథకాల అమలు, ఇతర అవసరాల కోసం ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ఏ ప్రభుత్వానికైనా అవసరమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐడీబీఐతో పాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాలను అమ్మాలని నిర్ణయించామన్నారు. మంత్రిత్వ శాఖల వద్ద, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద అదనంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టనున్నట్లు వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు కాగా, 2020–21 సంవత్సరానికి రూ. 2.1 లక్షల కోట్లు. అయితే, కరోనా కారణంగా రూ. 20 వేల కోట్లను కూడా సమీకరించలేకపోయారు. ముఖ్యాంశాలు మహా కవుల మాటలు ప్రసంగం సమయంలో మహాకవులు రవీంద్రనాథ్ టాగోర్, తిరువళ్లువర్ల కవితాపంక్తులను నిర్మలాసీతారామన్ ఉటంకించారు. ‘తూరుపున పూర్తిగా తెలవారకముందే రానున్న వెలుగు రేకలను ఊహిస్తూ గానం చేయడమే విశ్వాసం’అనే రవీంద్రుడి కవితాపాదాన్ని ఆమె ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే గుర్తుచేశారు. అలాగే, ‘రాజు/పాలకుడు సంపదను సృష్టించి, సమీకరించి, అనంతరం ఆ సంపదను పరిరక్షించి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు’అన్న తమిళ మహాకవి తిరువళ్లువర్ రాసిన పంక్తులను కూడా ఆమె చదివారు. ప్రత్యక్ష పన్నుల వివరాలను వెల్లడించేముందు ఆమె ఈ పంక్తులను వినిపించారు. గత సంవత్సరం కూడా ఆమె తిరువళ్లువర్‌ను ఉటంకించారు. అంతకుముందు, యూపీఏ ఆర్థికమంత్రి చిదంబరం కూడా తమిళనాడుకు చెందిన ఆ మహాకవి వ్యాఖ్యలను తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ♦ఇది తొలి కాగిత రహిత, డిజిటల్ బడ్జెట్ ♦ఎరుపు రంగు చీరలో, ఎరుపు రంగు వస్త్రంతో రూపొందిన సంచీ(బాహీ ఖాతా)తో నిర్మల సభకు వచ్చారు. బడ్జెట్‌ను తొలిసారి ట్యాబ్‌లో చూసి చదివారు. స్వాస్థ్య భారత్.. కరోనా వైరస్ విజృంభణతో మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంది. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో, ఆరోగ్య రంగంలో స్వావలంబన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికే పెద్ద పీట వేసింది. కోవిడ్–19 వ్యాక్సిన్‌కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు సహా మొత్తంగా రూ. 2, 23, 846 లక్షల కోట్లను కేటాయించింది. ఇది ఈ రంగానికి గత సంవత్సరంలో కేటాయించిన మొత్తం కన్నా 137% అధికం. ఆత్మ నిర్భర భారత్ పునాదుల్లో ఆరోగ్య భారత్ అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. వ్యాధి నివారణ, చికిత్స, సమగ్ర శ్రేయస్సు అనే మూడు అంశాలను దృఢతరం చేసేలా కేటాయింపులు జరిపామన్నారు. కోవిడ్–19 టీకా కోసం కేటాయించిన రూ. 35 వేల కోట్లు ప్రాథమిక అంచనాయేనని, అవసరమైతే, ఆ మొత్తాన్ని పెంచుతామని వివరించారు. రూ. 64,180 కోట్లతో త్వరలో ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వాస్థ యోజనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అద్భుతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ ప్రకటించిన 48 గంటల్లోపే ప్రధాని మోదీ రూ. 2.76 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్ యోజనను ప్రకటించారని గుర్తు చేశారు. ఆరోగ్యానికి వాయు కాలుష్యం చేసే చేటును దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలను నిషేధించేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని ప్రారంభించనున్నామన్నారు. -
ఏపీకి నిరాశ మిగిల్చిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మిధున్ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి సోమవారం ఇక్కడి విజయ్ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను బడ్జెట్లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఊసే లేదు.. ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గత బడ్జెట్లకు ఏమాత్రం భిన్నంగా లేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున వాటికి వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్ట్‌లను బడ్జెట్లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అలాగే మెట్రో రైల్ విషయానికి వస్తే... కొచ్చి, బెంగుళూరు, చెన్నై, నాగపూర్లలో మెట్రో రైల్ కోసం వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ కావాలని అడుగుతున్నాం. కానీ దాని గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు విషయంలో ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ ఊసే లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం బడ్జెట్లో చేయలేదు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఖరగ్ఫూర్ నుంచి విజయవాడ, నాగపూర్ నుంచి విజయవాడ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరికే ప్రయోజనం ఏమీ ఉండదు. కడప-బెంగుళూరు రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని ఇప్పటికి అనేకమార్లు అడిగాం. ఆ కేటాయింపులపై ప్రస్తావన లేదు. ఉద్యానవన పంటల రవాణా కోసం మరిన్ని కిసాన్ రైళ్లు అడిగాం. దేశం మొత్తంమీద 11.8% పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతాయి. కాబట్టి దేశంలోని వివిధ నగరాలకు వాటిని త్వరితగతిన రవాణా చేసేందుకు ఎక్కువ కిసాన్ రైళ్లు నడపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మొహన్ రెడ్డి కేంద్రాన్ని అడుగుతూ వచ్చారు. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఆసక్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. హోదా విషయాన్ని కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాలపై నెట్టివేస్తూ వచ్చిందని అన్నారు. బడ్జెట్ విషయంలో వైయస్ఆర్సీపీ డిమాండ్స్.. దేశవ్యాప్తంగా నాలుగు వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అందులో ఒక వైరాలజీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ సభ్యులంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. దేశంలో ఏడు టెక్స్టైల్స్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. విస్టాడోమ్ రైల్వే బోగీలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-అరకు మధ్య మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు కేంద్రం చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను త్వరలోనే 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం అనేది చాలా ప్రధానమైన అంశమని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. నదులన్నింటినీ అనుసంధానం చేసిన పిమ్మట టెలీమెట్రీ పరికరాల సాయంతో ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలో ప్రవాహాన్ని అంచనా వేసి ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికగా నదీ జలాలని కేటాయించాలన్నది మా ప్రభుత్వ విధానం. దాన్ని అనుసరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పన్నుల సంస్కరణల విషయానికి వస్తే.. ఒక లక్షరూపాయలకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనేది మా డిమాండ్. దాన్ని కూడా ఈసారి బడ్జెట్లో పరిగణలోకి తీసుకోలేదు. బడ్జెట్లో ఒకే ఒక్క ఆశాజనకమైన అంశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్అభివృద్ధి, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంతే తప్ప ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. కరోనా నేపథ్యంలో అభివృద్ధికాముక బడ్జెట్ కావాలి కానీ సర్వసాధారణ బడ్జెట్ అవసరం లేదు. అప్పు చేసి అయినా డబ్బును చెలామణిలోకి తెస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధి అనేది అప్పుడే సాధ్యమౌతుందని అన్నారు. ఈస్ట్రన్ రైల్వే కారిడార్‌లో ఖరగ్‌పూర్ - విజయవాడ వరకు సరుకు రవాణా కారిడార్ వేశారు. దీంతో మేం సంతృప్తి పడటం లేదని అన్నారు. బడ్జెట్లో విశాఖపట్నంకు ఫిషింగ్ హబ్ కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాంతో పోల్చి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఫిషింగ్ హార్బర్ ఏమాత్రం సరిపోదని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి.. పీఎం కిసాన్- రైతు భరోసా కింద ప్రతి రైతుకు సీఎం శ్రీ జగన్ గారు రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000 మాత్రమే ఇస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000లకు పెంచాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. రాష్ట్రంలో 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత పనులపై జీవిస్తున్నారు. పీఎం కిసాన్ కేటాయింపుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీన్ని రూ.10,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌లో 1350 వ్యాధులు మాత్రమే కవర్ అవుతుంటే.. సీఎం శ్రీ జగన్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీలో 2,434 వ్యాధులు కవర్ అవుతాయి. దీనినిబట్టి ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీలా ఆయుష్మాన్ భారత్ కూడా అన్ని వ్యాధులు కవర్ చేయాలని కోరారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నవరత్నాల కింద 2020-21 రాష్ట్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమం కోసం చేసిన కేటాయింపుల్లో 110% పెరుగుదల కనిపిస్తుంటే కేంద్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం డిసెంబర్ 2020 నాటికి 38.7 మిలియన్లుగా ఉంది. గతేడాదితో (2019) పోల్చి చూస్తే 27.4 మిలియన్లుగా ఉంది. నిరుద్యోగ శాతం 11.3 మిలియన్లు పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించటానికి సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రత్యేకంగా పెట్టుకోవటం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా రాష్ట్రం ముందుకు వచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు. ఈ బడ్జెట్ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్‌లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారాయన. దీనిని కేంద్ర బడ్జెట్ అని పిలిచే బదులు. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ను పరిశీలించి చూస్తే ఇది మిగతా రాష్ట్రాలకు వర్తించదేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు -
అసలు ఇదేం బడ్జెట్: సీఎం ధ్వజం
కోల్‌కతా: ‘‘అసలు ఇదేం బడ్జెట్.. ఇదో నకిలీ బడ్జెట్. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక.. దేశ వ్యతిరేక బడ్జెట్ ఇది. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. సెస్‌లు విధించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. రైతులు నష్టపోతారు. 15 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పుడేం జరిగింది’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా, పీఎస్‌యూలు ప్రైవేటీకరణ చేశారు. దీంతో ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ బడ్జెట్ ఎలా ఉందని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాను అడిగాను. మాటలతో ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేలా ఉందని చెప్పారు’’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరును విమర్శించారు.(చదవండి: బడ్జెట్ 2021: ప్రధాని మోదీ స్పందన) అదే విధంగా, బీజేపీకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం అలవాటు లేదని, కేవలం అబద్ధాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటారంటూ మండిపడ్డారు. కాగా బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి బడ్జెట్లో కేంద్రం భారీగా నిధులు కేటాయించడం విశేషం. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. -
బడ్జెట్ 2021: ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త అవకాశాలు కల్పించేలా బడ్జెట్-2021 రూపకల్పన జరిగిందని, అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని హర్షం వ్యక్తం చేశారు. కాగా విపక్షాల ఆందోళనల నడుమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) ఈ అంశంపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘ఇంతకు ముందెన్నడూ లేని అసాధారణ పరిస్థితులలో కేంద్ర బడ్జెట్ 2021 ప్రవేశపెట్టబడింది. తద్వారా భారత్ ఎంతటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలదో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించాం. రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై దృష్టి సారించాం. ఇకపై అన్నదాతలు సులభంగా రుణాలు పొందగలుగుతారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) సాయంతో ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేసేందుకు బాటలు పడ్డాయి. సామాన్యుడిపై పన్ను భారం వేస్తామని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బడ్జెట్ ఉంది. యువతకు ఉపాధి కల్పన, సరికొత్త అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్: కడుపుబ్బా నవ్వించే మీమ్స్
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ మీద సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆశల పల్లకిలో నుంచి అగాధంలోకి తోసేసారు కదా, మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్ని మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందించారు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుంది అనుకున్న బడ్జెట్.. ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సామాన్యుడి స్పందన ఎలా ఉంటుందో మీమ్స్ రూపంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెటైర్లను చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. మరింకెందుకాలస్యం, బడ్జెట్ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి... (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) I will share my views on today's budget #Budget2021 . Me views rn :- pic.twitter.com/Tbrqxeithf — ULFAT🌸 (@filhaal_to) February 1, 2021 Me explaining budget... #Budget2021 pic.twitter.com/DFA9cYPGS7 — Devendra (@deven_zip) February 1, 2021 Going to office after one year of Work from home. #Budget2021 pic.twitter.com/n9qnMugVJS — Sharpasm (@Sharpasm7) February 1, 2021 Taxpayers to govt before every budget : Please reduce our tax burden Govt:#Budget2021 pic.twitter.com/W6kZX5ttSq — Finance Memes (@Qid_Memez) February 1, 2021 Professionals waiting for #BudgetLikeNeverBefore #Budget2021 pic.twitter.com/SybImcIs0Y — CS Jigar Shah (@FCSJigarShah) January 31, 2021 Indian middle class after #budget2021 #petrolpriceHike pic.twitter.com/h8no8RBseM — sab_moh_maya_hai. (@vaishnavi_j07) February 1, 2021 CA log aaj ke din.. 😊😊😊#Budget2021 #BoloGuruji pic.twitter.com/yHACssrW06 — Akarshan Jaiswal (@Akarshanj_) February 1, 2021 Before Valentine Day After valentine day pic.twitter.com/341I7XjFuk — Heisenberg (@Its_Heisen_berg) February 1, 2021 This #budget2021 is for common middle people Meanwhile middle class people watching budget: pic.twitter.com/a3O0Ag2pBg — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Understanding gains for middle class people in #Budget2021 pic.twitter.com/mwCrhfT40g — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Middle class people to #Budget2021 pic.twitter.com/i3PvCKqbkv — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Every year after Budget . #Budget2021 pic.twitter.com/uBdIblt60y — Economist Hunटरर ♂🥳 (@nickhunterr) February 1, 2021 Common People Vs. Finance Minister during #Budget2021 pic.twitter.com/jEkikCDXEQ — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Tax payer calculating their next year tax liability after seeing #Budget2021 pic.twitter.com/vkNAgBY0tu — Rahul Pandey (@rahulpandey89) February 1, 2021 -
బడ్జెట్ 2021: మందుబాబులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న అంశం సెస్. ఇక మీదట క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల కళ్లు బైర్లు కమ్మెలా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ) ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యవసాయ సెస్‌ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించడం దారుణమన్నారు.(చదవండి: బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం) రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.(చదవండి: ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ) -
ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ సెస్సు విధింపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ చేసింది. ఇప్పుడు సెస్ విధింపుతో ఇంధనం ధర మరింత ఎగబాకనుంది. లీటర్ పెట్రోల్‌పై 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. ఒక్కసారిగా ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఇక ఈ వ్యవసాయ సెస్సు విధుంపుతో.. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం.. అన్ని అంశాలపై ఉంటుంది. ఇక అప్పుడు సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టు లేదు ధరలిట్టా మండిపోతే’ అని పాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. (చదవండి: బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు) ఇక వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) -
సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్..
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడం నిరాశ కలిగించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. (చదవండి: కేంద్ర బడ్జెట్: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట) కేంద్ర బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఉపాధి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు.ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామని ఆయన తెలిపారు.(చదవండి: బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం: విజయసాయిరెడ్డి) ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, రైల్వే జోన్‌కు నిధులు కేటాయించకపోవడం నిరాశ పరిచిందని, ఫిషింగ్ హార్బర్ కేటాయించడం ఒక కంటి తుడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలని, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని... గత ఏడాది కేవలం మూడు మెడికల్ కాలేజీలకు మాత్రమే నిధులు ఇచ్చారని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు కోసం ఎంపీలందరూ కలిసి పోరాడతామన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే అంశాలు బడ్జెట్లో లేవని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాటన్‌పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ అమల్లోకి రానుంది.(చదవండి: ముగిసిన బడ్జెట్ ప్రసంగం: లోక్‌సభ రేపటికి వాయిదా) ధరలు పెరిగేవి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు) చెప్పులు పర్సులు చార్జర్స్(మొబైల్ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు) సింథటిక్ జెమ్‌స్టోన్స్ లెదర్ ఉత్పత్తులు సోలార్ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు) సోలార్ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు) ఆటో విడిభాగాలు స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు) కాటన్(0 నుంచి 10 శాతం) రా సిల్స్, యాన్ సిల్క్(10 నుంచి 15 శాతానికి పెంపు) ఆల్కహాలిక్ బీవెరేజెస్ క్రూడ్ పామాయిల్ క్రూడ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆపిల్స్ బొగ్గు, లిగ్నైట్, పిట్ యూరియా తదితర ఫర్టిలైజర్లు బఠాణీలు కాబూలీ శనగలు బెంగాల్ గ్రాం పప్పులు ధరలు తగ్గేవి ఐరన్ స్టీలు నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్ కాపర్ వస్తువులు ఇన్సూరెన్స్ షూస్ బంగారం, వెండి ధరలు నాప్తా(హైడ్రోకార్బన్ లిక్విడ్ మిక్చర్) -
బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15వేల స్కూళ్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలానే కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.. 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తామన్నారు. స్టార్టప్లకి టాక్స్ హాలీడేని మరో ఏడాది పొడిగించారు. లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కు 3వేల కోట్ల రూపాయలు.. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 5వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మీదట 5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే జరగాలని నిర్మలా సీతారామన్ సూచించారు. -
సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆదాయ పన్ను దాఖలులో మినహాయింపునిచ్చారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది చాలా కీలకమైందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ఆన్‌ఐఆర్‌లకు డబుల్ టాక్సేషన్‌నుంచి ఊరటనిచ్చారు. అయితే ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. దీంతో పాటు మరికొన్ని పన్నుచెల్లింపు ప్రక్రియ చెల్లింపు సరళీకరణ చర్యలను ప్రకటించారు. దీంతోపాటు స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాయింపు మరో ఏడాది పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటే 75 ఏళ్లు, అంతుకు పైబడిన సినీయర్ సిటిజన్లకు టాక్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే ఎన్నారై పెట్టుబడు దారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఎన్నారైలు భారత్‌లో ఉండే గడువును 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. గత బడ్జెట్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించామని పేర్కొన్న ఆమె ఫేస్‌లెస్ ఇన్‌కంట్యాక్స్ అప్పిలైట్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి పన్ను చెల్లింపుదారులు 6.48 కోట్లకు పెరిగారని ఆమె తెలిపారు. -
ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా.. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: దిగి రానున్న వెండి, బంగారం ధరలు) ‘‘ఇన్సూరెన్స్ యాక్ట్-1938కు సవరణలు చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నా. తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుంది. నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి’’ అని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. I propose to amend the Insurance Act 1938 to increase the permissible FDI limit from 49% to 74% in insurance companies and allow foreign ownership & control with safeguards: Finance Minister Nirmala Sitharaman. #Budget2021 pic.twitter.com/c9WHDH4CQ2 — ANI (@ANI) February 1, 2021 బడ్జెట్ బూస్టింగ్ మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్‌తో స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది. -
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రోకి భారీగా నిధులు ఇక బడ్జెట్లో మెట్రోలైట్, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
బడ్జెట్ 2021: 20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈ సారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. ఇక దీనిలో భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు. (చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
కేంద్ర బడ్జెట్: 64,180 కోట్లతో సరికొత్త పథకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి 2021-22 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం బడ్జెట్ యాప్‌ను విడుదల చేసింది. ఇక విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్... కరోనా లాక్డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ‘‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేశాం. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్‌తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. ‘‘100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం’’ అని తెలిపారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ) ఇక గతంలో ఎన్నడూలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. గతేడాది లాక్డౌన్ అమలు చేయాలన్న నిర్ణయం కఠినమైనదేనన్న నిర్మలా సీతారామన్... లాక్డౌన్ విధించకపోతే మరింత ఘోరమైన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
బడ్జెట్ 2021: కోవిడ్ సెస్ పడనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టనున్నారా.. లేదా అనే విషయం మరికొద్దిసేపట్లో తేటతెల్లం కానుంది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని కరోనా కకావికలం చేసింది. ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువయ్యింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషన్. దాదాపు 130 కోట్ల మంది జనాభాకు ఉచితంగా.. లేదా నామ మత్రపు ఖర్చుతో టీకా అందించడం అంటే మాటలు కాదు. మాస్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా సెస్ విధించాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనను కోవిడ్-19 సెస్, సర్చార్జ్గా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రకటన వెలువడనుందని సమాచారం. చాలా తక్కువ మొత్తంలో ఉండనున్న ఈ సెస్.. కేవలం టాక్స్ పేయర్స్‌కు మాత్రమే వర్తించబోతుందని తెలుస్తోంది. ప్రభుత్వం కోవిడ్-19 సెస్‌తో పాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక దీని గురించి మరి కాసేపట్లో తెలుస్తుంది. (చదవండి: బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!) దేశ జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేయడానికి భారీ వ్యయాన్ని కేంద్రం భరించాల్సి వస్తోంది కాబట్టి.. కోవిడ్-19 సెస్‌ని ప్రవేశపెట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 30 కోట్ల మందికి టీకా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ ఇంతకు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా వారికి కూడా తక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ని అందివ్వాలని భావిస్తున్నారు. కోవిడ్ టీకా పంపిణీ, శిక్షణ, లాజిస్టిక్స్ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎదుర్కొనే అధిక ఖర్చులు చూస్తే, అధిక ఆదాయ వ్యక్తుల కోసం కోవిడ్ -19 సెస్ అవకాశం ఉండవచ్చు. -
కేంద్ర బడ్జెట్: దిగిరానున్న వెండి, బంగారం ధరలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం) పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు 11వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం బెంగాల్లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధి ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరకు రవాణా కారిడార్ బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గానికి ఊరట గృహరుణ మినహాయింపులు 2022, మార్చి 31 వరకు కొనసాగింపు స్టార్టప్‌లకు ఇచ్చే తాయిలాలు మరో ఏడాది పొడిగింపు పెరిగేవి.. తగ్గేవి మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్సు పెట్రోల్ లీటర్‌కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు పెరగనున్న మొబైల్ ధరలు అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు 5 % సెస్సు తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి రాగిపై పన్ను మినహాయింపులు పెరగనున్న సోలార్ ఇన్వెటర్ల ధరలు ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు కాటన్‌పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపు దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు పెరగనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు సీనియర్ సిటిజన్లకు ఊరట పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు. 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్‌కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం ఎన్నారైలు భారత్‌లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు ఎన్ఐఆర్లకు డబుల్ టాక్సేషన్‌నుంచి ఊరట పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 15 వేల పాఠశాలలు శక్తివంతం కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు ఎన్జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ రైతుల సంక్షేమం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు మౌలిక రంగానికి భారీగా నిధులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలు బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయింపు ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు జల జీవన్ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ ఆత్మనిర్భర్ యోజన పథకం 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు ఆరోగ్య రంగానికి పెద్దపీట 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం యూనియన్ బడ్జెట్ యాప్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్, బడ్జెట్ యాప్ రిలీజ్ చేసిన కేంద్రం అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం ఆందోళనల నడుమ ప్రసంగం.. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. టీమిండియా అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచునున్నారు. మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారు. చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మేడ్‌ఇన్ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మేడ్‌ఇన్ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్, అనురాగ్ఠాకూర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, అమిత్ షా కూడా పార్లమెంట్‌కు హాజరయ్యారు. బహీ ఖాతాలో ఏం దాచారో.. ఇక వ్యాక్సిన్ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ జరగుతోంది. భారత్ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా బడ్జెట్‌ను లెదర్ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది. -
కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలతో రాష్ట్రం
సాక్షి, అమరావతి: కేంద్రం సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగినన్ని నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలతో ఎదురు చూస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిలకు బడెŠజ్‌ట్‌లో తగినన్ని నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం 100 శాతం రీయింబర్స్మెంట్లను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఊతమందేనా.. రాష్ట్రంలో కొత్తమెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కోరినందున బడ్జెట్లో ఆ కాలేజీలకు నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణతో.. ఆ కార్యకలాపాలకు నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్య, వైద్య సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులను ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా కొంత ఉపశమనం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత ఆర్థిక ఏడాది 15వ ఆర్థిక సంఘం ఒక ఆర్థిక ఏడాదికే సిఫార్సులు చేసింది. ఇప్పుడు కూడా కోవిడ్ నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదికే గతేడాది సిఫార్సులనే మళ్లీ చేస్తుందా లేక కొంత మేర గ్రాంట్లు పెంచుతుందా అనే దానిపై రాష్ట్రానికి నిధులు రావడం ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!
ముంబై: కేంద్ర బడ్జెట్–2021 ప్రభావిత అంశాలు, ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు బడ్జెట్ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం నుండి ఆర్బీఐ ద్రవ్యపాలసీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ అంశాలే ఈ వారం రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కంపెనీల క్యూ3 ఆర్థిక గణాంకాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. ఇక గడిచిన ఆరురోజుల్లో సెన్సెక్స్ 3056 పాయింట్లు, నిప్టీ 1010 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, బడ్జెట్ నేపథ్యంలో అప్రమత్తత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే..., స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..? నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్–2021ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితులు, దిగజారిన ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే విధంగా ఈ బడ్జెట్లో ఉద్దీపన చర్యలుండొచ్చని ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మౌలిక సదుపాయాల వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందా..? లేదా ఆర్థిక విధానాలకు నిధుల కేటాయింపు ద్వారా వృద్ధిని కోరుకుంటుందా..? అనే అంశాలు మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి. మొదటి నిర్ణయంతో మార్కెట్ పరుగు తిరిగి ప్రారంభం అవుతుంది. రెండో ఎంపికతో మార్కెట్లో మరింత కరెక్షన్కు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం సంపన్న వర్గాలపై కొత్త పన్నులను విధించడంతో పాటు కార్పోరేట్ ఆదాయాలపై సెస్సును పెంచుతాయనే అంచనాలు దలాల్ స్ట్రీట్‌ను కలవరపెడుతున్నాయి. మొత్తంగా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. ఫిబ్రవరి 3న ఆర్బీఐ పాలసీ సమావేశం ... బడ్జెట్ ఒకరోజు తర్వాత ఫిబ్రవరి 3న (బుధవారం) ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) వెలువడనున్నాయి. నాలుగుశాతం రెపో రేటును యథాతథంగా కొనసాగించవచ్చన్నది అంచనా. విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు..! గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ జనవరి 29న ముగిసిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారిగా నికర అమ్మకందారులుగా మారారు. ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో చివరి వారంలో ఎఫ్ఐఐలు మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఎస్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు దాదాపు నాలుగునెలల తర్వాత దేశీ ఫండ్లు(డీఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారారు. గడచిన వారంలో డీఐఐలు రూ.3,789 కోట్ల షేర్లను కొన్నారు. తుది అంకానికి క్యూ3 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, దీవిస్ ల్యాబ్, ఎన్టీపీసీలతో సహా ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. జనవరి ఆటో అమ్మక గణాంకాల విడుదల... నేడు బడ్జెట్ కార్యక్రమంతో పాటు ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్యాసింజర్, మధ్య–భారీ వాణిజ్య వాహన, ట్రాక్టర్ విభాగపు అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ద్వి–చక్ర వాహన విభాగపు విక్రయాలు బలహీనంగా ఉండొచ్చని వారంటున్నారు. అంచనాలకు మించి అమ్మకాలు ఉంటే రానున్న రోజుల్లో ఆటో రంగానికి డిమాండ్ ఉంటుందని ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉంది. గణాంకాల ప్రభావం.... నేడు మెర్కిట్ తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు ఇదే జనవరి వాణిజ్యలోటు లాంటి స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే అగ్రరాజ్యం అమెరికా మెర్కిట్ తయారీ గణాంకాలు కూడా ఈరోజే విడుదల అవుతాయి. ఈ బుధవారం మెర్కిట్ సేవల పీఎంఐ గణాంకాలు వెల్లడవుతాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. ఊగిసలాట కొనసాగొచ్చు పలు దేశాల కేంద్ర బ్యాంకుల సరళతర వైఖరితో అంతర్జాతీయంగా లిక్విడిటీ మెండుగా ఉంది. ఈ అధిక లిక్విడిటీ వర్ధమాన దేశాల ఈక్విటీల్లో ప్రవహించడంతో పలు దేశాల స్టాక్‌మార్కెట్లు అధిక వ్యాల్యుయేషన్‌తో ట్రేడ్ అవుతున్నాయి. సూచీలను పరుగులు పెట్టిస్తున్న ఈ లిక్విడిటీ ఆధారిత ర్యాలీ ఆధారంగా మన బెంచ్‌మార్క్ సూచీలు కనీసం 10 నుంచి 15 శాతం దిద్దుబాటు కావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ అస్థిరతను సూచించే వొలటాలటీ ఇండెక్స్ 3 శాతం పెరిగి 25.34 వద్ద స్థిరపడింది. ఇది మార్కెట్లోని అస్థిరతను సూచిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ -
రైతులకిచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రైతులతో చర్చలకు మేం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాం. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సాగు చట్టాల విషయంలో కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాం. ఏడాదిన్నరపాటు సాగు చట్టాల అమలు నిలిపివేతకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది. రైతులతో చర్చిండానికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సిద్ధంగా ఉన్నారు. అన్నదాతలతో మరోసారి చర్చలకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి అభ్యంతరాలను పరిశీలిస్తాం. రానున్న బడ్జెట్లో రైతులకు వరాలు ప్రకటిస్తాం’’ అని మోదీ తెలిపారు. (చదవండి: ‘స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి’) -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారని గురువారం లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. స్టాండింగ్ కమిటీలు వివిధ శాఖలకు కేటాయించాల్సిన గ్రాంట్ల పరిశీలన, నివేదికలను సిద్ధం చేసేందుకు ఉభయ సభలు ఫిబ్రవరి 15వ తేదీన వాయిదాపడి తిరిగి మార్చి 8వ తేదీన సమావేశమవుతాయని తెలిపింది. కోవిడ్–19 నిబంధనల దృష్ట్యా గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా షిఫ్టుల వారీగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యక్రమాలు జరుగుతాయి. లోక్‌సభ కార్యక్రమాలు రోజులో కనీసం ఐదు గంటలపాటు కొనసాగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. గత సమావేశాలు తక్కువ కాలం జరగడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసివేశారు. సభ్యులు ప్రైవేట్ బిల్లులను ఎప్పటిమాదిరిగానే శుక్రవారాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రవేశపెట్టేందుకు కూడా ఈ దఫా అవకాశం ఇస్తున్నారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం -
బడ్జెట్ సమావేశాలు: 74 ఏళ్లలో ఇదే ప్రథమం..
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్‌గా ఉండనుండటం మాత్రం ఖాయం. అవును మరి కోవిడ్ దేశ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్ కేటాయింపులతో బూస్ట్ ఇస్తారా.. లేక మరింత డీలా పడేలా చేస్తారానే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ ఏడాది బడ్జెట్ రూపం, కేటాయింపులు సరికొత్తగా ఉండనుండటం మాత్రం వాస్తవం. ఈ సారి ప్రారంభం కానున్న బడ్జెట్ ప్రక్రియ దాదాపు 70 ఏళ్ల సంప్రదాయనికి ముగింపు పలకనుంది. అవును బడ్జెట్ సమావేశాలు ప్రారంభైన 74 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదు. నవంబర్ 26, 1947 తరువాత మొదటిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీల ప్రింటింగ్‌ని నిలిపివేయనున్నారు. నార్త్ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్ ప్రింటింగ్ కోసం వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక డాక్యుమెంట్లు ముద్రించి, సీల్ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఇక్కడే ఉంటారు. (చదవండి: ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్) అయితే ప్రస్తుతం కోవిడ్-19 భయాలు.. కొత్త స్ట్రెయిన్ కలకలంతో బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రతి ఏటా బడ్జెట్ కాపీ ప్రింటింగ్ సమయంలో నిర్వహించే హల్వా వేడుకకు కూడా ఈ ఏడాది బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ ఏడాది బడ్జెట్ కాపీలను డిజిటల్ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్, ఎకానమిక్ సర్వే డిజిటల్ కాపీలను అందించనున్నారు. కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో పేపర్‌లెస్ బడ్జెట్ సమావేశాలు ఒకటి. రికార్డులను డిజిటలైజ్ చేయాలని పార్లమెంట్ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా మూలంగా అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. -
ఫిబ్రవరి 1 న 2021 కేంద్ర బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసిన కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) మంగళవారం సిఫారసు చేసింది. బడ్జెట్ సెషనల్లో తొలి దశ సమావేశాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు జరపాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2021 ను సమర్పించనున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ మలి దశ సమావేశాలు జరుగుతాయి. అలాగే బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తరువాత ఎన్డీఏ సర్కార్‌కు ఇది తొలిబ బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సన్నాహకాల్లో తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల పెద్దలతో భేటీ అయ్యారు. అలాగే బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ 'హల్వా వేడుక', బడ్జెట్ పేపర్పత్రాలను ముద్రించే ప్రక్రియ ఉంటుంది. దీంతోపాటు ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో రూందించిన ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు విడుదల చేయడం లాంటి కీలక అంశాలు. కాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా రైతుల నిరసనలు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ లాంటి అంశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చర్చకు రానున్నాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా, డైరెక్టుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నామని కేంద్రం ప్రకటించడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. -
ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2021–22) ఈ దఫా ‘ఇంతకు ముందెన్నడూ చూడని’ (నెవ్వర్ బిఫోర్) విధంగా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని, వృద్ధిబాటలోకి దూసుకుపోయే బడ్జెట్‌ను ఈ సారి ప్రవేశపెడుతున్నట్లు ఆమె వివరించారు. మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ తరహా బడ్జెట్, 100 సంవత్సరాల భారత్ ముందెన్నడూ చూసి ఉండదని ఆమె అన్నారు. ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) టెలీమెడిసిన్ నిర్వహణలో నైపుణ్యత పెంపు అంశాలపై పెట్టుబడుల పెంపు ప్రస్తుత కీలక అంశాలని శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె అన్నారు. ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్ రూపకల్పనలో అందరి భాగస్వామ్యం అవసరం అని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ పార్లమెంటులో 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి ఈ రంగాన్ని ప్రస్తావించడం గమనార్హం. మెడికల్ టెక్నాలజీలో అవకాశాలు: ఫార్మా కార్యదర్శి అపర్ణ దేశంలో మెడికల్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్.అపర్ణ తెలిపారు. ఈ రంగం వృద్ధి బాటలో ఉందని, మరింత విస్తరణకు అవకాశం ఉందని అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో మెడికల్ టెక్నాలజీ భవిష్యత్ అన్న అంశంపై శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘భారత్‌లో 4,000 పైచిలుకు హెల్త్‌టెక్ స్టార్టప్స్ ఉన్నాయి. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్ఫూర్తికి ఇది నిదర్శనం. యువతలో ఉన్న స్వాభావిక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగానికి అపూర్వ ఆర్థిక సహాయాన్ని చూశాం. దేశంలో తొలిసారిగా మెడికల్ టెక్నాలజీ రంగానికి వచ్చే అయిదేళ్లపాటు సుమారు రూ.7,500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వైద్య పరికరాల పార్కుల రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఈ ఆర్థిక మద్దతు కొనసాగుతోంది. వైద్య పరికరాలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఉన్నాయి’ అని వివరించారు. -
2021 బడ్జెట్ సంప్రదింపులు ఈ–మెయిల్ ద్వారానే...
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను రూపొందించడానికి ముందు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, తదితర రంగాల్లోని నిపుణులతో ఆర్థిక మంత్రి నార్త్ బ్లాక్‌లో స్వయంగా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకోవడం సాంప్రదాయకంగా వస్తోంది. ఇందుకు వేర్వేరు తేదీల్లో ఆర్థికమంత్రి సమావేశాలూ నిర్వహించేవారు. అయితే కరోనా మహమ్మరి వల్ల ఈ సాంప్రదాయానికి ఈ దఫా ‘విరామం’ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2021 బడ్జెట్ రూపకల్పన విషయంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, నిపుణులు తగిన సలహాలు ఇవ్వడానికి ఇందుకు త్వరలో ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ రూపకల్పన జరుగుతున్నట్లు శుక్రవారం ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ’’ ఏర్పాటు విషయంలో త్వరలో ఒక నిర్దిష్ట ప్రకటన వెలువరిస్తామని కూడా ప్రకటన వివరించింది. 15 నుంచి 30 వరకూ అందుబాటులో 'MyGov.in' పోర్టల్ అలాగే రానున్న బడ్జెట్‌పై వివిధ రంగాల్లో నిపుణులైన ప్రజల నుంచీ సలహాలను తీసుకోడానికి ప్రభుత్వ 'MyGov.in' పోర్టల్‌నూ ఒక వేదికగా వినియోగించుకోనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకూ ఈ పోర్టల్ ప్రజా సూచలనకు అందుబాటులో ఉంటుందని ఆర్థికశాఖ ప్రకటన తెలిపింది. ‘‘సాధరణ ప్రజలు తమతమ వ్యక్తిగత హోదాల్లో 'MyGov.in' పోర్టల్‌లో తమ పేరును నమోదుచేసుకుని 2021–22 బడ్జెట్‌కు సంబంధించి తమ సలహాలను సమర్పించవచ్చు. ఆయా సూచనలు, సలహాలను సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని ప్రకటన వివరించింది. తమకు అందిన సూచనలు, సలహాలపై అధికార వర్గాలు ఏదైనా వివరణ కోరదలిస్తే, సూచలను చేసిన నిర్దిష్ట వ్యక్తులను ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్ (రిజిస్ట్రేషన్ సమయంలో వారు సమర్పించిన) ద్వారా సంప్రదిస్తారని కూడా ఆర్థికశాఖ తెలియజేసింది. కత్తిమీద సామే! యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. బడ్జెట్ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై, నవంబర్ మొదటి వారం వరకూ కొనసాగాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇతర శాఖల కార్యదర్శులతో సంప్రదింపుల తర్వాత వ్యయ విభాగం కార్యదర్శి 2021–22 బడ్జెట్ అంచనాలను ఖరారు చేస్తారు. ఈ దశలోనే కేంద్ర ఆర్థికశాఖ నిపుణుల సలహాలను ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ ద్వారా స్వీకరించనుంది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసే నెలకు ద్రవ్యలోటు 114.8 శాతానికి చేరడం గమనార్హం. 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. అయితే, ద్రవ్యలోటు 2020–21లో రెండంకెలకు పెరిగిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. -
సభలో అర్ధవంతమైన చర్చ జరగాలి
-
అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగానే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నామని, ఈ సమావేశాల్లో బడ్జెట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఉభయ సభల్లో పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నదే తమ అభిమతమన్నారు. ఈ బడ్జెట్లో దళితులు, పేదలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరోవైపు ఆర్థిక సర్వే ప్రతులు పార్లమెంట్‌కు చేరాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో... పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. (పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన) -
బంగారంపై బాదుడు తగ్గేనా..?
న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020–21 కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800–900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ఎందుకింత రేటు..: గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్–నవంబర్ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5% తగ్గడం ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. -
వారు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్న ఒకటే: పొన్నం
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సెలెక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులు కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికకు 15 మంది సభ్యులతో కమిటీ వేశామని అన్నారు. ఎంత మంది పార్టీని వీడినా, ఆఖరికి తాను కూడా వెళ్లినా కాంగ్రెస్ జీవనదిలాంటిదన్నారు. కరీంనగర్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని మంత్రి చెప్పడం అవాస్తవమని అన్నారు. కరీంనగర్లో టీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిపై చర్చకు మంత్రి గంగుల సిద్ధమా అని సవాల్ విసిరారు. లండన్, న్యూయార్క్ లాగా కరీంనగర్‌ను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. (జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం) దేశానికి కాంగ్రెస్ మాత్రమే రక్ష అని, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ టీఆర్ఎస్, బీజేపీ ఆశాంతికి కారణమవుతున్నాదని ఆరోపించారు. కరీంనగర్లో పార్టీకి నష్టం కలగకుండా తొందరలోనే కమిటీ వేయాలని పార్టీని కోరారు. తాను నామినేషన్ వేసినప్పుడు రానోళ్లు ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఎవరున్నా..లేకున్నా పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. వార్డుల విభజనలో అభ్యంతరాలు తీసుకున్నా.. వాటిని పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టికెట్లలో తాను ఎవరికీ సిఫారసు చేయనని స్పష్టం చేశారు. -
కేంద్ర బడ్జెట్ కసరత్తు షురూ, తొలి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన సన్నాహాలను మొదలుపెట్టేశారు. 2020-21 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కసరత్తులో భాగంగా తొలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సార్ట్-అప్, ఫిన్‌టెక్, డిజిటల్ సంస్థల ప్రతినిధులతో ముందస్తు సంప్రదింపులు నిర్వహించారు. ఈ సంప్రదింపులు డిసెంబర్ 23 వరకు సంప్రదింపులు కొనసాగుతాయని సమాచారం. సోమవారం నుండి ప్రారంభమయ్యే ప్రీ బడ్జెట్ సమావేశాల్లో, వినియోగం, వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక సంస్థలు పరిశ్రమ సంస్థలు, రైతు సంస్థలు ఆర్థికవేత్తలతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 19న పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. వ్యాపారం సులభతరం, ప్రైవేటు పెట్టుబడులను ప్రభావితం చేసే నియంత్రణ వాతావరణం, ఎగుమతి పోటీతత్వం, రాష్ట్రాల పాత్ర (చెల్లింపులు ఆలస్యం, కాంట్రాక్ట్ అమలు), ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణ వృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్నులో కొంత ఉపశమనం లభించనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ రెండవసారి కొలువు దీరిన అనంతరం ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రెండోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఒకవైపుభారీగా క్షీణించిన వినియోగ డిమాండ్, జీడీపీ 5శాతం దిగువకు లాంటివి ఆమె ముందున్న సవాళ్లు. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమందగమనం పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. -
సీతమ్మ శీతకన్ను! సిక్కోలుకు మొండిచేయి
సాక్షి, శ్రీకాకుళం : ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్లో దాని గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ప్రధాన హామీ రైల్వే జోన్. దీని గురించే కాదు కొత్త రైళ్లు వేటినీ జిల్లా మీదుగా ప్రకటించలేదు. కనీసం కొన్ని రైళ్లనైనా జిల్లాకు ఉపయోగకరంగా ఉండేలా పొడిగించనూలేదు. పాత ప్రతిపాదనలకూ మోక్షం కలగలేదు. జనరల్ బడ్జెట్లో అభివృద్ధిలో అత్యంత వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక వరాలేవీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. అయితే దేశవ్యాప్తంగా పాడిపరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడానికి బడ్జెట్లో ఫోకస్ చేయడం కాస్త ఊరట. ► చిరు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ప్రోత్సాహకంగా బడ్జెట్లో వడ్డీ రాయితీ ప్రకటించారు. రూ.45 లక్షల వరకూ రుణం తీసుకుంటే రూ.3.50 లక్షల వరకూ రాయితీ వర్తిస్తుంది. గతంలో రూ.2 లక్షల వరకూ ఉంది. ► జిల్లాలో జీడితోటలున్న రైతులకు శుభవార్త. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న జీడిపిక్కలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెరగనుంది. దీంతో స్థానిక రైతులకు, వ్యాపారులకు మేలు జరగనుంది. ► ప్రస్తుతం జిల్లాలో రోజుకు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రో ల్, మరో 1.40 లక్షల లీటర్ల డీజిల్‌ను వాహనదారులు వినియోగిస్తున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి లీటర్‌కు రూపాయి చొప్పున అదనంగా సెస్‌ను కేంద్రం విధించనుంది. ఈ బడ్జెట్‌కు ఇంకా ఆమోదం లభించకముందే చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.2.75 చొప్పున పెంచేశాయి. ► ప్రధానమంత్రి ఆవాస్‌యోజన–గ్రామీణ (పీఎంఏవై–జి) పథ కం కింద 2022 నాటికి అందరికీ సొంతిల్లు కల్పిస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. జిల్లాలో సొంతిల్లు కోసం ప్రస్తుతం 42 వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారందరికీ ఇది శుభవార్తే. ► వెదురు, తేనె, ఖాదీ పరిశ్రమలకు ప్రోత్సాహంగా దేశంలో కొత్తగా వంద క్లస్టర్లు ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్లో ప్రకటించారు. జిల్లాలో పొందూరు వద్ద ఖాదీ క్టస్టర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఈసారైనా మోక్షం కలుగుతుందేమో చూడాలి. ► సహకార రంగంలో పాడిపరిశ్రమకు ఈ బడ్జెట్లో ప్రోత్సాహకా లు ప్రకటించారు. పశుశాలల నిర్మాణంతోపాటు దాణా తయారీ, పాలసేకరణ, పాల ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ► ప్రధానమంత్రి శ్రమయోగి మాంధాన్ పథకం కింద అసంఘటిత కార్మికులకు 60 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో సుమారు 40 వేల మంది అసంఘటిత కార్మికులకు మేలు జరుగుతుంది. ► మహిళా స్వయంశక్తి సంఘాలల్లో (డ్వాక్రా) సభ్యులైన మహిళలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ.5 వేల చొప్పున సహాయం లభిం చనుంది. అలాగే ప్రతి సంఘంలో ఒక్కో మహిళకు రూ.లక్ష వరకూ ముద్రా రుణం లభిస్తుంది. జిల్లాకు ఒరిగిందేమీ లేదు.. వెనుకబడిన, మావోయిస్టుల ప్రభావిత జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.50 కోట్ల నిధులు ప్రకటించారు. కానీ గత ఏడాది జిల్లాకు ఆ నిధులు రాలేదు. ఈ బడ్జెట్లో ఆ ప్యాకేజీ కింద నిధులేవీ పెంచలేదు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించినా పారిశ్రామికరంగంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఎలాంటి పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవు. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగించాలనే డిమాండు అలాగే ఉండిపోయింది. -
హల్వా తయారీతో బడ్జెట్ ముద్రణకు శ్రీకారం
-
‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్!
న్యూఢిల్లీ : సంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తయారీతో 2019 -20 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరంతా ‘బడ్జెట్ హల్వా’ రుచి చూసి బడ్జెట్ పత్రాల ముద్రణ కార్యక్రమాన్ని ఆరంభించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2.0 క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా ఆమె జూలై 5న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ హల్వా తయారీతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు. కాగా హల్వా కార్యక్రమం అనంతరం ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ.. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ-మెయిల్‌తోగానీ మరే ఇతర మాధ్యమాల ద్వారా మాట్లాడే వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అత్యంత గోప్యంగా ముద్రణ ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్ఛ్సేంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
మోదీ బడ్జెట్ సన్నాహక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక, తొలిసారిగా జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ సన్నాహక సమావేశం మోదీ మంగళవారం నిర్వహించారు. ఆర్థిక, ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అధికారులతోనూ మోదీ సమావేశమయ్యారు. ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధే ప్రధాన లక్ష్యాలుగా 100 రోజుల ఎజెండాను రూపొందించడంపై భేటీ ఏర్పాటు చేశారు. వ్యాపార నిర్వహణను సులభంచేయడం, తద్వారా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడానికి అవసరమైన చర్యల గురించి మాట్లాడినట్లు సమాచారం. -
ధన్యవాదాలు;మరిన్ని సూచనలు ఇవ్వండి!!
న్యూఢిల్లీ : బడ్జెట్ విషయంలో అన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనలు తప్పక పరిగణనలోకి తీసుకుంటానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మేధావులు, ఆర్థికవేత్తలు, సామాన్యులు మీడియాలో పంచుకుంటున్న అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు..‘ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విలువైన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, ఔత్సాహికులకు రుణపడి ఉంటాను. వాటిన్నంటినీ నేను చదువుతున్నాను. మీ సూచనలను నా టీమ్‌తో సమన్వయం చేసుకుంటున్నాను. ప్రతీ ఒక్కరి అభిప్రాయం విలువైందే. ధన్యవాదాలు. మరిన్ని సలహాలు, సూచనలు చేయండి’ అని ఆమె ట్వీట్ చేశారు. దేశ తొలి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్ ప్రాధాన్యం సంతరిచుకుంది. కాగా రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు.. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి, వాణిజ్య ప్రాధాన్య హోదా రద్దు చేయడం ఆర్థికవేత్తలను కలవరపెడుతున్నాయి. అంతేకాకుండా ట్రంప్ ఆంక్షల కారణంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంలో మొదటిసారిగా ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తోన్న నిర్మలా సీతారామన్‌కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ విలువైన అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. Grateful for every thought/idea that’s being shared by scholars, economists and enthusiasts through print, electronic, and on social media. I read many of them; also, my team carefully collates them for me. Value every bit. Thanks. Please keep them coming. #Budget2019 — Nirmala Sitharaman (@nsitharaman) June 6, 2019 -
వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలకు ఈసీ షాక్
-
విపక్షాలకు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : వీవీప్యాట్ల లెక్కింపు వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు ప్రక్రియను మార్చేందుకు నిరాకరించిన ఈసీ ముందుగా ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. ముందుగా 5 వీవీప్యాట్లను లెక్కించాలని విపక్షాలు మంగళవారం ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్లపై రాద్ధాంతానికి స్వస్తిపలికి లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని, ఫలితాలను అంగీకరించాలని బీజేపీ కోరింది. విపక్షాలు మాత్రం ఈసీ తీరును తప్పుపడుతున్నాయి. వీవీప్యాట్ల లెక్కింపునకు ఈసీకి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించాయి. ఇక వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న విపక్షాల అప్పీల్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టుపై కాంగ్రెస్ నేత, వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వెనుకబాటుపై బడ్జెట్ పోటు
బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థిక న్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకు, అస్థిత్వ రాజకీ యాలు, తాత్కాలిక ఉపశమనాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విషయాల్లో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ఆర్భాటంగాప్రకటించుకుంది. అయితే ఆచరణలో ఐదేళ్ళ మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదన్నది అక్షర సత్యం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం బీజేపీ ప్రభుత్వ ఆలోచనలో సైతం లేదన్న వాస్తవాన్ని బలోపేతం చేస్తోంది. గత ఐదేళ్ళుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సంగతి అటుంచితే కనీసం వాళ్ళని మనుషులుగా చూడనిపరిస్థితికి అద్దం పడుతోంది. ఐదేళ్ళ బీజేపీ పాలన దేశంలోని దళితుల, ఆదివాసీల బతుకులను శతాబ్దాల అగాధాల్లోకి నెట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి మీద దృష్టిపెడుతున్నది. అందుకోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సాగించే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ప్రారంభించింది. ఆ పథకం ఎంతో మంది అణగారిన వర్గాల వారిని పరిశోధన వైపు తీసుకురాగలిగింది. కానీ బీజీపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. బడ్జెట్లో కేటాయింపులే దానికి ప్రత్యక్షనిదర్శనం. బీసీ విద్యార్థుల కోసం ప్రకటించిన జాతీయ స్కాలర్షిప్లు 2012–2013 సంవత్సరంలో 45 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20 సంవత్సరానికి 30 కోట్లు కేటాయించడం శోచనీయం. ఇందులో దాగి ఉన్న మరో మోసం ఏమిటంటే, 2018–19 సంవ త్సరం బడ్జెట్లో 110 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ బడ్జెట్ సవరణలలో అది 30 కోట్లకు కుదించారు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017–18లో 3414 కోట్లు కేటాయిస్తే, 2019–20 సంవత్సరానికి అది 2926 కోట్లకు పడిపోయింది. ఎస్సీల కోసం ముఖ్యమైన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ కోసం గత రెండేళ్ళుగా కేటాయింపులు లేనేలేవు. ఇక రాష్ట్రాలలో ఆదివాసుల కోసం అమలు చేసే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ గత రెండేళ్లుగా 1350 కోట్లుగా నిలకడగా కొనసాగుతున్నది. బడ్జెట్ మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నా వీరి అభివృద్ధి కోసం కేటాయిం చాల్సిన నిధులు మాత్రం అంతకంతకూ కనుమరుగైపోతున్నాయి. ఆది వాసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కేటాయించే నిధు లను చూస్తే ప్రభుత్వ చేతలకీ, మాటలకీ పొంతన లేని విషయం తేటతెల్లం అవుతుంది. 2017– 18లో కోటి రూపాయలు, 2019–20లో రెండు కోట్లు కేటాయించారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళే స్కాలర్ షిప్‌ల మొత్తం గణనీయంగా తగ్గించేశారు. 2017–18లో 19 కోట్ల 87 లక్షలుంటే, అది 2018–19, 2019–20లలో 10 కోట్లకు కుదించారు. ఇవి బీజేపీ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టే మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఈ అక్టోబర్ 2తో ఇది పరిసమాప్తం కాబోతున్నది. స్వచ్ఛభారత్‌లో చెరగని మచ్చ మాన్యువల్ స్కావెంజింగ్. మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ చర్యను నిర్మూలించే ఉద్దేశంతో 15 ఏళ్ళ క్రితమే ఒక చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం సమర్థవం తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ దారుణమైన పనిలో 58 వేల మంది ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ లెక్కలు కాకి లెక్కలన్న విషయాన్ని సఫాయికర్మచారీ ఆందోళన్ నాయకుడు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు. మాన్యువల్ స్కావెంజర్స్ సంఖ్య ఒక లక్షకుపైనే ఉంటుం దని బెజవాడ విల్సన్ ప్రకటించారు. అయితే ఈ అత్యంత అమానవీయ పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావాలని చట్టం నిర్దేశిస్తున్నది. ప్రతి కార్మికుడికీ ఒకేసారి 40 వేల రూపాయలు ఇచ్చి ఆ పనిని మాన్పించేందుకు సహకరించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే ఈ సంవత్సరాంతంలోగా వీరికి పునరావాసం కల్పించాలి. అందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 232 కోట్లు అవసరమవుతాయి. సఫాయికర్మచారీ ఆందోళన్ అంచనాను తీసుకుంటే 480 కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేంద్రం దీనికి కేవలం 30 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమౌతుంది. 2017–18లో ఈ కార్యక్రమానికి కేటాయింపులే లేకపోవడం మరో విచిత్రమైన విషయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాల్లో ప్రణాళికా సంఘం రద్దు ఒకటి. దీనివల్ల బడ్జెట్లో మార్పులు జరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ అనే విధానానికే స్వస్తి పలి కారు. దీంతో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన సబ్‌ప్లాన్ విధానం ప్రమాదంలో పడిపోయింది. అయితే కేంద్రంలో మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏవో లెక్కలు చూపిస్తున్నారు. సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పథకం కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్నదని తేలిపోయింది. 1974 నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్, 1979–80 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులో ఉంది, 2006 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్‌గా మార్చారు. ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు కేటాయించాలనేది సబ్‌ప్లాన్ సారాంశం. ఎస్సీ, ఎస్టీల వాడలు, పల్లెలు, గూడేలు, తండాలు అభి వృద్ధితో పాటు, వ్యక్తిగత అభివృద్ధి కూడా దీని ఉద్దేశం. కానీ కనీసం కాగితాలవరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్‌ప్లాన్ 16 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 8.4 శాతం, 2018–19లో 8.8 శాతం, 2019–20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఇవి ఏవీ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయవు. రక్షణ రంగం, శాస్త్రసాంకేతిక రంగాలు, పరిశోధనా విభాగాలు, ఇంకా ఇతర రంగాలు ఏవీ కూడా ఎస్సీల అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఉపయోగపడవు. ట్రైబల్ సబ్‌ప్లాన్ ప్రకారం ఆదివాసులకు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 2017–18లో 5.6 శాతం, 2018–19లో 5.8 శాతం, 2019–20లో 6.1 శాతం కేటాయింపులు చూపించి చేతులు దులుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధా నాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీల పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఒకరకంగా శతృవైఖరినే అవలంబిస్తూ వస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తూండటం ప్రజలకు తెలియంది కాదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ అనుసరిస్తోన్న రాజకీయవిధానం ఇందుకు నిదర్శనం. రాజ్యాంగం అందించిన హక్కుల ద్వారా చదువుకొని, విద్యావంతులవుతున్న దళితుల పట్ల హిందూ సమాజంలోని కులాలకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దానికి ముస్లింల పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం దీనికి జతచేస్తున్నది. దళితులు, ముస్లింలమీద గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు దీనికి నిదర్శనం. ఈ దృక్పథమే బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ప్రభావం చూపుతున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావనలేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించే ఎకనామిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా తొలగించారు. వీటన్నింటికీ పరాకాష్టగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అగ్రకులాల పేదలను ఆదుకునే పేరుతో తీసుకొచ్చిన పదిశాతం రిజర్వేషన్లు. ప్రభుత్వాల దగ్గర నిధులు లేకకాదు. వాళ్ళు అనుకుంటే వేల కోట్లను రాత్రికి రాత్రే తమ కులాల వాళ్ళకు పంపిణీ చేయగలరు. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు. చివరకు బాగా ముడుపులు అందే రక్షణ రంగం కావచ్చు. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా బయటపెట్టింది. ఇది కేవలం దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ మౌనమెందుకు?: గూడూరు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా దానిపై స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేవలం టీఆర్ఎస్ నేతలు స్పందించి సాదాసీదా ప్రకటనలు చేశారని, ముఖ్యమంత్రిగా కేంద్ర బడ్జెట్‌పై స్పందించాల్సి ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించకపోగా ప్రజల దృష్టిని ఇతర అంశాల వైపు మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనూ రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో పాటు చాలా కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు నీతి ఆయోగ్ తిరస్కరించింది’అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మౌనమే ఆయన బీజేపీ, మోదీ మద్దతుదారుడని తెలిసిపోయిందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో సంవత్సరాల వారీగా బయటపెట్టాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. -
చర్చ లేకుండానే ఆర్థిక బిల్లులు ఆమోదమా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌కున్న ప్రాధాన్యత గురించి విడమర్చి విఫులంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వాణిని ప్రతిధ్వనించేందుకు, కార్యనిర్వాహక విధుల్లో ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని కాళ్ల బొటన వేళ్లపై నిలబట్టేందుకు పార్లమెంట్ వేదిక ఉపయోగపడుతుంది. ప్రతి అంశంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరిపి సముచిత నిర్ణయం తీసుకునేందుకు దోహద పడుతుంది. ఇంతటి ప్రాధాన్యంగల పార్లమెంట్ సమావేశాలు వరుసగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. వివిధ డిమాండ్లపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తుండగా, సందట్లో సడేమియా లాంటి ఎలాంటి చర్చ లేకుండానే పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదిస్తూ పోతోంది. దీంతో బుధవారం నాడు లోక్‌సభ కీలకమైన బడ్జెట్, ఆర్థిక బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా కేవలం 30 నిమిషాల కాల వ్యవధిలో ఆమోదించింది. సాధారణ రోజుల్లో ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదించడానికి కొన్ని వారాలు పడుతుంది. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి. వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు గొడవ చేయడం వల్ల పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తమ డిమాండ్లపై ముందుగా చర్చ జరిపితే ఆ తర్వాత ఇతర డిమాండ్లపై చర్చ జరిపే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. లోక్‌సభలో గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్న దృష్యాలను చూస్తుంటే చర్చ పట్ల ప్రభుత్వానికిగానీ, ప్రతిపక్షానికిగానీ చిత్తశుద్ధి మాటను పక్కన పెడితే కనీస ఆసక్తి కూడా లేదని స్పష్టం అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై తీవ్రమైన చర్చకు అవకాశమే ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ ‘కావేరి జలాల నిర్వహణ బోర్డు’ ఏర్పాటుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. గతేడాది పన్నులతో సంబంధంలేని పలు చట్టాల సవరణకు ఆర్థిక బిల్లు ప్రతిపాదించడం, వాటిలోని కొన్ని అంశాలపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుండడం తెల్సిందే. ఈసారి అలా కాకుండా కీలకమైన ఆర్థిక అంశాలకే పరిమితమైన ఆర్థిక బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ఆమోందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఈ బిల్లులో చివరి క్షణంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 20 సవరణలను ప్రతిపాదించారు. వాటిల్లో విదేశీ నిధుల నియంత్రణ కింద రాజకీయ విరాళాలను క్రమబద్ధీకరించడం లాంటి కీలకమైన సవరణలు ఉన్నాయి. ఎన్నికల విరాళాల్లో పారదర్శకతను దెబ్బతీసే సవరణలు కూడా ఇందులో ఉండవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సవరణలు ఉన్నాయనడంలో కూడా సందేహం లేదు. అలాంటప్పుడు చర్చకు ఆస్కారం ఇవ్వక పోవడం ఏ మేరకు సమంజసం? బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీలను కూడా విస్మయానికి గురిచేశాయి. పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగేలా ప్రతిపక్షాలను ఒప్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అఖిల భారత అన్నా డీఎంకే నాయకుడు ఎం. తంబిదురై విమర్శించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
రైతు బడ్జెట్... అబ్రకదబ్ర
విశ్లేషణ ఒకవైపు రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నా.. రైతుల ఆదాయాలు దిగజారిపోతున్నాయి. ప్రత్యామ్నాయం ఉంటే 69% మంది రైతులు వ్యవసాయం నుంచి బయటకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ‘‘ముసుగుల్ని తొలగిస్తేనే గానీ వాస్తవాలు బయటపడవన్నది ఓ నానుడి’’. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ యేడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌కు ‘రైతు బడ్జెట్’ అనే ముసుగు తగిలించారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జైట్లీ బడ్జెట్ రైతులకు మేలు చేసేదే అయితే సంతోషమే! రైతాంగాన్ని మభ్యపెట్టేది అయితే మాత్రం.. అది ఆత్మవంచనే అవుతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఏ మేరకు ఉంటుందో... ఆ చందంగానే జైట్లీ బడ్జెట్లో రైతు సంక్షేమం ఉందని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిట్టూర్చుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కంటే ఒకరోజు ముందుగా విడుదలైన ఆర్థిక సర్వే దేశ వ్యవసాయరంగ స్థితిగతుల్ని ఎత్తిచూపింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ, ఇప్పటికీ అది మెజారిటీ ప్రజల జీవనాధారంగానే కొనసాగుతున్నదని, భారత ఆర్థిక వ్యవస్థకు అదొక చోదకశక్తి అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కొన్ని జాతీయ పత్రికలు సైతం వ్యవసాయ బడ్జెట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. నిధుల కేటాయింపులను, కనీస మద్దతు ధరలను ఖర్చులపై 50% (డా. స్వామినాథన్ సిఫార్సు మేరకు) పెంచి ఇస్తామంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాలు, ఆఖరుకు మీడియాతో సహా భ్రమల్లో మునిగిపోయారు. కేటాయింపుల పరంగా చూస్తే.. దాదాపు పాతిక లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించి ఇచ్చింది రూ. 68,836 కోట్లు. ఈ అంకెలు ఘనంగా మేడిపండును తలపించేటట్లున్నాయి. ఉదాహరణకు పంటల బీమా పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయింపులు చేశారు. రెండేళ్ల క్రితం 2016–17 బడ్జెట్లో ఇదే పథకానికి రూ. 5,500 కోట్లు కేటాయించారు. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా 30% సాగు విస్తీర్ణానికి బీమా చేయించాలన్నది అప్పటి లక్ష్యం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 22%, తెలంగాణలో 10% విస్తీర్ణానికే రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. దేశం మొత్తంమీద 30% విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టారని ఇందుకోసం చివరికి రూ. 13,240 కోట్లు ఇచ్చినట్లు సవరించిన 2016–17 బడ్జెట్ లెక్కల్లో చూపించారు. 30% విస్తీర్ణానికి బీమా చేయిస్తేనే కేంద్రానికి రూ. 13,240 కోట్లు అవసరం అయినప్పుడు బీమా పరిధిలోకి ఈ ఏడాది 50% సాగు విస్తీర్ణాన్ని తేవాలని పెట్టుకున్న లక్ష్యానికి రూ. 13,000 కోట్లు ఏవిధంగా సరిపోతాయి? కనీసం 22,000 కోట్లు పైనే కావాలి గదా! ఇటువంటి విచిత్రాలు జైట్లీ బడ్జెట్లో చాలానే కనిపిస్తాయి. కౌలుదారులకు బ్యాంకుల రుణ వితరణ ఈ సారి కూడా ఎండమావిగానే మిగిలిపోనుంది. దేశంలో కౌలుదారీ వ్యవసాయం గణణీయంగా పెరిగిన విషయం తెలిసికూడా వరుస ప్రభుత్వాలు కౌలుదారులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి. గుర్తింపుకార్డులు లేవనే నెపంతో బ్యాంకులు వారికి రుణాలివ్వడం లేదు. కౌలు దారులకు గుర్తింపు కార్డులిచ్చే ప్రక్రియ నత్తనడక కంటే హీనంగా తయారైంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, రెట్టింపు చేయడానికి ఏకైక మార్గం.. డా.ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి కనీస మద్దతు ధర ఇవ్వడమే! అయితే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే.. ఉత్పత్తి వ్యయంపై 50% కలిపి ఇవ్వడం సాధ్యపడదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే.. తాజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పంట ఉత్పత్తి ఖర్చుపై 50% కలిపి ఇస్తామంటూ ప్రకటన చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయిన మాట నిజం. ఎంఎస్పీ నిర్ధారణకు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఎంతమాత్రం అంగీకారం కాదు. సమగ్రమైన ఉత్పత్తి ఖర్చు డా.స్వామినాథన్ అంచనావేసిన సి2 కాకుండా, కొన్ని ఖర్చులను మినహాయించి ఏ2+ఎఫ్‌ఎల్‌ను ప్రాతిపదికన తీసుకోవడం రైతాంగాన్ని మోసగించడమే. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నిర్ణయిస్తున్న మద్ధతుధరలు.. ఏ2 పద్ధతి ప్రకారం కూడా ఉండడంలేదు. ఉదాహరణకు, వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి సీఏసీపీకి పంపిన నివేదికలో ఏ2 ప్రాతిపదికనే ధాన్యం ఉత్పత్తి ధర క్వింటాల్‌కు రూ. 2,022గా ఉంది. కానీ, ప్రస్తుతం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు కేవలం రూ. 1,590గా ఉంది. అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ధరల సరాసరి క్వింటాల్‌కు రూ. 1,100గా నిర్ణయించి.. ఆ మేరకు మద్దతు ధరను కేంద్రం నిర్ణయిస్తున్నది. దాని ప్రకారమే మద్దతు ధరలు ఒకటిన్నర రెట్లు ఉన్నాయని ఆర్థికమంత్రి జైట్లీ చెప్పుకుంటున్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుకు భరోసా లభించిందని, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వ్యవసాయరంగానికి ఊతమిచ్చేదిలా ఉందంటూ చేస్తున్న శాస్త్రీయత లేని ప్రకటనలు మోసపూరితమైనవి. ఇవే విధానాలు కొనసాగితే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఎన్డీఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వ్యాసకర్త ఏపీ శాసనమండలి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రతిపక్ష నాయకులు ‘ 9989024579 -
టీడీపీపై ధ్వజమెత్తిన సోము వీర్రాజు
-
‘బీజేపీని రోడ్డుకీడుస్తున్న చంద్రబాబు’
సాక్షి, రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల సాధనలో భాగంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళనను ఉధృతం చేస్తుండగా అధికారంలోని మిత్ర పక్షాలు టీడీపీ, బీజేపీలలో వణుకు మొదలైంది. దీంతో కేంద్ర తమకు ఇవ్వాల్సిన నిధుల్లో మోసం చేసిందని ఓవైపు టీడీపీ చెబుతోంటే.. మేం లెక్క ప్రకారం ఇస్తున్నా టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ తమకు మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని రోడ్డుపైకి ఈడుస్తుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడును మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇదివరకే 85 శాతం వరకు వచ్చాయన్నారు. మిగిలిన నిధులు ఏపీకి ఇవ్వడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. కానీ కేంద్రం అందిస్తున్న సాయంపై సీఎం చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం చేసిన అభివృద్ధిని నిరూపించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, టీడీపీ చర్చకు వస్తుందా అని సవాల్ విసిరారు. మీడియా పక్షపాతాన్ని వదిలి, వాస్తవాలు చూపించాలని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబును ప్రశ్నించని మీడియా, కేవలం బీజేపీ నేతల్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. సుజనాచౌదరి, గంటా శ్రీనివాస్‌లు ప్రకటిస్తున్న అభివ్ర్రద్ధి కార్యక్రమాలు కేంద్రం చేసినవి కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. -
బీజేపీ కీలక భేటీ ప్రారంభం
సాక్షి, విజయవాడ : విభజన హామీలపై ప్రజల ఆందోళన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపీ విస్తృతస్తాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ సీనియర్ నేతలు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చడం లేదని, రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వడం లేదని భాగస్వామ్య పక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కోవడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీ లక్ష్యం చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వాలని కమల దళం నేతలు భావిస్తున్నారు. -
అసలు విషయం వదిలేసి..అన్నీ మాట్లాడారు
-
ఢిల్లీలో భజన... లీకుల్లో గర్జన
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో భజన చేస్తూ...లీకుల్లో మాత్రం గర్జనలు చేయడం తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్న చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఏ కోశానా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం, బీజేపీ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాలను తూర్పారబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే సమస్యలకు పరిష్కారమని వైఎస్సార్సీపీ భావిస్తుండగా.. టీడీపీ మాత్రం తమ స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఢిల్లీలో భజన చేస్తూ, రాష్ట్రంలో మాత్రం బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు హైడ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులైనా సీఎం కన్పించడం లేదని, మరోవైపు ఆయన పార్టీ కార్యాలయం లీకుల మీద లీకులిస్తోందని ధర్మాన ఎద్దేవా చేశారు.