న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా.. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.(చదవండి: లైవ్ అప్‌డేట్స్: దిగి రానున్న వెండి, బంగారం ధరలు)
‘‘ఇన్సూరెన్స్ యాక్ట్-1938కు సవరణలు చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నా. తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుంది. నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి’’ అని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
I propose to amend the Insurance Act 1938 to increase the permissible FDI limit from 49% to 74% in insurance companies and allow foreign ownership & control with safeguards: Finance Minister Nirmala Sitharaman. #Budget2021 pic.twitter.com/c9WHDH4CQ2
— ANI (@ANI) February 1, 2021
బడ్జెట్ బూస్టింగ్
మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్‌తో స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment