న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి బడ్జెట్ కసరత్తు ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి ప్రీ–బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక సర్క్యులర్ ప్రకటించింది.
నవంబర్ రెండవ వారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి.కోవిడ్–19 మహమ్మారి తీవ్ర సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న రెండవ వార్షిక బడ్జెట్ ఇది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది నాల్గవ బడ్జెట్.
డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, ఎనిమిది శాతం వృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలతో తాజా బడ్జెట్ రూపొందనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 2022 ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment