Finance Ministry
-
విశాఖ స్టీల్‌ప్లాంట్: కేంద్రం ట్విస్ట్.. చంద్రబాటు నాటకాలు బట్టబయలు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం ఉత్తమాటేనని తేల్చేసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాటకాలు.. మోసాలు బట్టబయలు అయ్యాయివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఇప్పటిదాకా లభించలేదు. కానీ, అది జరగనివ్వబోమంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే మరోవైపు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడం చూస్తున్నదే. ఈ తరుణంలో.. పబ్లిక్ గ్రీవెన్స్‌కు కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బదులిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కార్పొరేట్ సంస్థ అయిన RINL ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.కేంద్రం తాజా ప్రకటనపై పోరాట సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలన్నదే మా మొదటి, ప్రధాన డిమాండ్. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ను కాపాడాలి.:::అయోధ్య రామ్, పోరాట కమిటీ కన్వీనర్ -
సంతృప్తికర సమాధానాలిస్తేనే.. పోలవరానికి నిధులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడిగిన సాంకేతిక ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సాంకేతిక సమస్యల వల్లే నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం తెలిపిన తర్వాతే నిధుల మంజూరు సాధ్యమవుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని, సేవా రంగంలో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని చెప్పారు. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని తెలిపారు. తొమ్మిది కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, కొత్తగా పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. సుంకాలపై అమెరికా ప్రభావం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లి సుంకాల పెంపుపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నివసించానని, అక్కడ నీటి కష్టాలు అనుభవించానని ఆమె తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికే మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించేవని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ సమీపంలో ఫార్మా రంగం అభివృద్ధికి బల్క్ డ్రగ్ పరిశ్రమలను విస్తృతం చేసినట్లు తెలిపారు. పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి వివిధ వ్యాపార వర్గాలు, పారిశ్రామిక, ఐటీ సంఘాల ప్రతినిధులతో గురువారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ ముఖాముఖి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)ల కోసం ‘కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్’ను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత ముంబయిలో జరిగిందని, రెండో చర్చ విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు... ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ మదింపులపై ఆధారపడకుండా, అంతర్గత మదింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాయన్నారు. అధికారిక అకౌంటింగ్ వ్యవస్థ లేని ఎంఎస్ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. విశాఖలో వివిధ వర్గాల ప్రజలను కలసి బడ్జెట్‌పై వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
ఏపీలోనే అతి తక్కువ జీఎస్టీ వృద్ధి
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ జీఎస్టీ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో తమిళనాడు 8.2%, కేరళ 7.8%, కర్నాటక 10.4%, తెలంగాణ 5.6%, మరో సరిహద్దు రాష్ట్రం ఒడిశా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏపీ కేవలం 4 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన ఏడాది ఫిబ్రవరిలో రూ.3,678 కోట్లుగా ఉన్న ఏపీ జీఎస్టీ వసూళ్లు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.3,817 కోట్లకు చేరాయి. అంటే.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ నాలుగు శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు (సీజీఎస్టీ, ఐజీఎస్టీ కాకుండా) 10 శాతం వృద్ధితో రూ.1,28,760 కోట్ల నుంచి రూ.1,41,945 కోట్లకు చేరాయి. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.40,791 కోట్లకు చేరుకుంది. గతేడాది 11 నెలలతో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
సందడిగా ‘బడ్జెట్ హల్వా’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆర్థిక శాఖ కార్యాలయం ‘నార్త్‌బ్లాక్’లో శుక్రవారం బడ్జెట్ ముందరి సంప్రదాయ ‘హల్వా’ కార్యక్రమం సందడిగా సాగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ అక్కడి ఏర్పాట్లను ఒక్కసారి పరిశీలించారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ముద్రించనున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు. -
నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2025-26(Budget 2025-26) తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నేడు సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుకలు పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాలుపంచుకున్న అధికారులు పాల్గొంటారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణానికే పరిమితం అవుతారు.ఎలా జరుపుకుంటారు..?భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.ఎవరు పాల్గొంటారు..?కేంద్రమంత్రి ఈ ఏడాది వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో ఉన్న అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు1980 నుంచే హల్వా వేడుకబడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది. -
బ్యాంక్‌నెట్ పోర్టల్ ప్రారంభం
న్యూఢిల్లీ: బ్యాంక్‌లు స్వా«దీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను ఇక మీదట బ్యాంక్‌నెట్ పోర్టల్ పైనే వేలానికి పెట్టనున్నారు. ఇందుకు వీలుగా నవీకరించిన బ్యాంక్‌నెట్ (బీఏఏఎన్కేఎన్ఈటీ) పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) చేపట్టే ఆస్తుల వేలం సమాచారం ఈ పోర్టల్‌పై ఉంటుందని.. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు భిన్న రకాల ఆస్తులను గుర్తించొచ్చని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఫ్లాట్లు, ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య ప్రాపరీ్టలు, ఇండ్రస్టియల్ ల్యాండ్, బిల్డింగ్లు, షాప్‌లు, వాహనాలు, ప్లాంట్, మెషినరీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వేలం సమాచారం పోర్టల్‌పై అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ వివరాలన్నీ ఒకే చోట లభించడంతో, విలువైన ఆస్తులను గుర్తించి, వేలంలో పాల్గొనడానికి వీలుంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలను వసూలు చేసుకోవడంలో ఈ ప్లాట్‌ఫామ్ గణనీయంగా సాయపడుతుందని నాగరాజు తెలిపారు. కొత్త పోర్టల్‌లోకి ఇప్పటికే 1,22,500 ప్రాపరీ్టలను లిస్ట్ చేసినట్టు చెప్పారు. -
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
ఇక బీమాలో 100% ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచడంతో పాటు పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించే దిశగా బీమా చట్టం 1938 నిబంధనలను సవరించేలా కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రజలందరికీ బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార ప్రక్రియలను క్రమబదీ్ధకరించేందుకు ఇవి దోహదపడతాయని ఆర్థిక సేవల విభాగం తెలిపింది. ప్రతిపాదనల ప్రకారం బీమాలో ఎఫ్‌డీఐల పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నారు. అలాగే, కాంపోజిట్ లైసెన్సు జారీ కోసం నిర్దిష్ట నిబంధనను చేర్చనున్నారు. ప్రతిపాదిత సవరణలపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 10లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతం 25 జీవిత బీమా కంపెనీలు, 34 సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. మరిన్ని సంస్థలు రావడం వల్ల బీమా విస్తృతికి, అలాగే మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనకు దోహదపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
పీఎస్‌బీలపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది. -
‘మహిళా సమ్మాన్ సేవింగ్స్’లో ఏపీ సత్తా
సాక్షి, అమరావతి: మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం ఇది. పోస్టాఫీసులతో పాటు నిర్దేశించిన బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖతాలుండగా.. ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహిళా సేవింగ్ సర్టిఫికెట్ అనేది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. స్థిరంగా రెండేళ్ల పాటు మహిళలు, బాలికల పేర్న గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అయినందున దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని ఆడపిల్ల లేదా మహిళల పేర్న మాత్రమే చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాతా తెరిచినప్పటి నుంచి కనీసం మూడు నెలల తర్వాత ఒక మహిళ లేదా ఆడపిల్ల సంరక్షకుడు రెండో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. అంటే ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఖాతాదారుడికి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది. ప్రయోజనాలు.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో రూ.2,00,000 పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5 శాతం వడ్డీ పొందుతారు. మొదటి సంవత్సరంలో, అసలు మొత్తంపై రూ.15,000 వడ్డీని పొందుతారు. రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీని పొందుతారు. -
బ్యాంక్ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని! ఎప్పటినుంచంటే
వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది. ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్మెంట్ ప్రకారం,ఆర్బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్‌బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. -
మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
న్యూఢిల్లీ: భారత్ వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థికశాఖ 2024 జనవరి సమీక్షా నివేదిక పేర్కొంది. నిరంతర సంస్కరణల నేపథ్యంలో 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పది సంవత్సరాల క్రితం భారత్ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 1.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వివరించింది. ఈ అంకెలు ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరి (2023–24 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం) దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. మహమ్మారి సవాళ్లు, తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశం ఈ ఘనత సాధించిందని పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశ’గా మారాలనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని వివరించింది. సంస్కరణల ప్రయాణం కొనసాగడంతో ఈ లక్ష్యం నెరవేరుతుందన్న భరోసాను వెలిబుచి్చంది. సమగ్ర సంస్కరణలతో జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిలలో పాలనాపరమైన మార్పులు తీసుకువచ్చినప్పుడు దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం సంపూర్ణంగా ఉంటుందని నివేదిక వివరించింది. దేశీయ డిమాండ్ పటిష్టతతో ఎకానమీ గత మూడేళ్లలో 7 శాతం వృద్ధిని సాధించిందని, 2024–25లో కూడా 7 శాతం స్థాయికి వృద్ధి చేరే అవకాశం ఉందని నివేదిక అంచనావేసింది. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. మౌలిక రంగం అద్భుతం కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేనట్లు అపూర్వమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2014–15లో ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడి 5.6 లక్షల కోట్లు ఉంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిమాణం 18.6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఎకానమీ... లుకింగ్ లైక్ ఏ వావ్ వైరల్ మీమ్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్... భారత ఆర్థిక వ్యవస్థ శక్తిని, ఎకానమీ ప్రస్తుత చెక్కుచెదరని స్వభావాన్ని ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచంలోని అగ్ర దేశాలు నిరాశావాదంలో మునిగిపోయినప్పటికీ, భారతదేశం తిరుగులేని ఆశావాదంతో ముందుకు సాగుతోంది. ఈ విజయానికి కారణం ప్రభుత్వమే. – కార్పొరేట్ దిగ్గజం కుమార మంగళం బిర్లా -
29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
సాధారణ బీమా మరింత విస్తరించాలి
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది. సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు. బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. -
ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్‌లైన్ పొడిగిస్తారా?
Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆర్బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది. అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్‌లైన్ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్‌లైన్ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై కేంద్రం నుంచి ఆర్బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే రెండు వేల రూపాయలనోట్లను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్‌ని కలిగి ఉండటం మంచిది. ఈ వారంలో బ్యాంకుల సెలవులు ♦ బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి. ♦ గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు. ♦ శుక్రవారం,శనివారం అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో శుక్రవారం కూడా సెలవు. మరోవైపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది. -
అక్రమ ధనార్జన నిరోధక నిబంధనలు మరింత పటిష్టం!
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన నిరోధక నియమ నిబంధనలను ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా భాగస్వామ్య సంస్థల్లో ‘లాభదాయక యజమానుల’ నిర్వచనం కింద గతంలో 15 శాతంగా ఉన్న వాటాను (ఒక సంస్థలో) తాజాగా 10 శాతానికి తగ్గించింది. ఇది లాభదాయకమైన యజమానులను కఠినమైన పర్యవేక్షణలోకి తీసుకువస్తుంది. బినామీ, షెల్ కంపెనీల కార్యకలాపాల నిరోధానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, లాభదాయకమైన యజమానిని ‘‘ఇతర మార్గాల ద్వారా నియంత్రించే’’ వ్యక్తిగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ‘‘నియంత్రణ’’ అనేది నిర్వహణ లేదా విధాన నిర్ణయాన్ని నియంత్రించే హక్కును సంబంధించినదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే ’ప్రిన్సిపల్ ఆఫీసర్’ స్థాయిని.. మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తికి కూడా కల్పిస్తూ అక్రమ ధనార్జన నిరోధక చట్టం, 2005 నిబంధనలను (మెయిటినెన్స్ ఆఫ్ రికార్డ్స్) కఠినతరం చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ విషయంలో రిపోర్టింగ్ సంస్థ, ఖాతా ఆధారిత సంబంధాన్ని ప్రారంభించే సమయంలో లేదా పేర్కొన్న లావాదేవీలను నిర్వహిస్తున్నప్పుడు ధర్మకర్తలు తమ స్థితిని వెల్లడించేలా చూసుకోవాలని కూడా సవరణ పేర్కొంది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నవంబర్‌లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవలి నెలల్లో వివిధ మనీలాండరింగ్ నిరోధక నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. -
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్
దేశీయంగా క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది. అలాగే డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులకు చెక్ పెట్టేలా లెవీనీ కూడా పెంచింది. ముడి చమురు అమ్మకంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ.6,700కి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇది సెప్టెంబర్ 2 నుండి అమలుల్లోఉంటుందని తెలిపింది. క్రూడ్ పెట్రోలియంపై సాడ్ టన్నుకు రూ.7100 నుంచి రూ.6700కి తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆగస్టు 14న జరిగిన సమీక్షలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ.7,100గా విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. ( డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లెవీ పెంపు మరోవైపు డీజిల్ ఎగుమతిపై SAED లేదా సుంకం లీటరుకు రూ.5.50 నుండి రూ.6కి పెంచింది. జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్‌పై సుంకం లీటరుకు రూ.2 నుంచి రూ.4కు రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలియం ఎగుమతులపై సుంకం ఏమీఉండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఉత్పత్తి కంపెనీలు భారీ లాభాల నేపథంయలో జూలై 1, 2022 నుండి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు అమ్మకాలపై కేంద్రం మొదట విండ్‌ఫాల్ పన్నులను విధించింది. అంతేకాకుండా, దేశీయ మార్కెట్‌కు బదులుగా, ప్రైవేట్ రిఫైనర్లు మెరుగైన అంతర్జాతీయ ధరల మధ్య విదేశాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నందున పెట్రోల్, డీజిల్ ,జెట్ ఇంధనాల ఎగుమతులపై అదనపు సుంకంవిధించిన సంగతి తెలిసిందే. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) -
ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం
న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్ సీజన్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు. -
Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్లు, ఇమెయిల్‌లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) -
వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది. ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం. -
స్థూల ఆర్థిక నిర్వహణ భేష్: కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది. -
స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి పొందండి... ‘ఇదేం బాలేదు’
న్యూఢిల్లీ: కొన్ని బీమా బ్రోకింగ్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడంపై పౌర సేవా సంస్థ ‘ప్రహర్’ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో పాలసీలను విక్రయించే కొన్ని నూతన తరం బీమా బ్రోకింగ్ కంపెనీలు.. కేవలం కొన్నేళ్ల పాటు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి మొత్తాన్ని పొందొచ్చంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో వివరించింది. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) గత ఆర్థిక ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పనితీరును పాలసీదారులకు వెల్లడించరాదని బీమా రంగ ప్రకటనల చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నట్టు గుర్తు చేసింది. అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా సంబంధిత బీమా బ్రోకింగ్ సంస్థలను ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ, బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)ను కోరింది. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) లేదంటే అలాంటి ప్రకటనలు బీమా పాలసీలను వక్రమార్గంలో విక్రయించడానికి దారితీస్తాయని, పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీబజార్, ఇన్సూర్‌దేఖో మార్గదర్శకాలను ఉల్లంఘంచినట్టు ప్రహర్ తన లేఖలో ప్రస్తావించింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. నియంత్రణ సంస్థలు ఏవైనా లోపాలను గుర్తిస్తే, వాటి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రకటించాయి. -
నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!
దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్‌ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. జూన్ నెలలో గ్రాస్ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. 👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth 👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception 👉… pic.twitter.com/Q17qM9mTEX — Ministry of Finance (@FinMinIndia) July 1, 2023 -
టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్ఆర్ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్) ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) -
గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023 స్కీమ్ ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బాలికలు, మహిళల ఆర్థిక భద్రత లక్ష్యంగా 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకం పోస్టాఫీసుల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!) ఈ పథకం కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని కలిగి ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీని కలుపుకుంటే 7.7శాతం వడ్డీ వరకూ ప్రయోజనం లభిస్తుంది. కనిష్టంగా రూ. 1,000 గరిష్టంగా రూ.2,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. (హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం) కాగా శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసంచదవండి: సాక్షిబిజినెస్ -
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 45 శాతం పెన్షన్? ఆర్థిక శాఖ వివరణ
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద వారు ఉద్యోగ విరమణకు మందు చివరిగా అందుకున్న వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఒక కమిటీ చర్చిస్తోందని, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఎన్పీఎస్ కింద ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ ఖచ్చితమైన శాతం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ‘గత బడ్జెట్ సెషన్లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ప్రస్తుతం చర్చల స్థితిలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదు’ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారి చివరి వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ వచ్చేలా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించాలని భావిస్తోందంటూ రాయిటర్స్ కథనం వెలువరించింది. This is in reference to a news report carried in various news papers, purporting to give details of certain specific percentage of pension being proposed by the Government for the employees under National Pension System #NPS. This news report is false. The Committee, set up… — Ministry of Finance (@FinMinIndia) June 22, 2023 ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
ఈ-అప్పీళ్ల పథకం నోటిఫై
న్యూఢిల్లీ: ఈ-అప్పీల్స్ పథకాన్ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. దీంతో అప్పీళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం వీలు పడుతుంది. ‘ఈ–అప్పీల్స్ స్కీమ్, 2023’ కింద ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ (అప్పీల్స్) తన ముందు దాఖలైన అప్పీళ్లను ప్రాసెస్ చేయనున్నారు. దీని కింద బాధిత మదింపుదారులు JCIT (అప్పీల్స్) JCIT కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న అసెస్సింగ్ అధికారి ఆమోదించే ముందు కొన్ని ఆర్డర్లను అప్పీల్ చేయవచ్చు. "జాయింట్ కమీషనర్ (అప్పీల్స్) ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా దాని ముందు దాఖలు చేసిన లేదా కేటాయించిన లేదా బదిలీ చేయబడిన అప్పీళ్లను పరిష్కరించాలి" అని నోటిఫికేషన్ పేర్కొంది. JCIT (A)కి ఇన్కమ్ టాక్స్ అథారిటీ, మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ లేదా కన్సల్టెంట్లు బోర్డు ద్వారా అవసరమని భావించే విధంగా అప్పీళ్లను పరిష్కరించడంలో సహాయపడతారు.అప్పీళ్ల కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పన్ను చెల్లింపుదారుల వివరణ సైతం విననున్నారు. ఇదీ చదవండి: CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా? Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ డిఫరెంట్ లుక్స్‌లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు -
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా..
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణను సంతరింపజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ప్రతిబింబించేలానూ ఈ నాణేం ఉండనుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాణేనికి ఒక వైపు నాలుగు సింహాల అశోక స్థూపం.. క్రింద సత్యమేవ జయతే అని ఉండనుంది. అలాగే.. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం చేర్చారు. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ బొమ్మతో పాటు ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ అని, దిగువన ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంటాయి. 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉండబోయే నాణేం.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్‌తో తయారు చేశారు. Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai — ANI (@ANI) May 26, 2023 -
గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు..
వంట కోసం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్‌కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
జీఎస్టీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు ఆగస్టు 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ -ఇన్‌వాయిస్‌ని రూపొందించడం తప్పనిసరి. ప్రస్తుతం రూ.10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఈ -ఇన్వాయిస్ నిబంధన అమలులో ఉంది. ఇదీ చదవండి: సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా? కేంద్ర ఆర్థిక శాఖ మే 10 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ -ఇన్వాయిస్ నమోదు పరిమితిని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు B2B లావాదేవీలకు సంబంధించి ఈ -ఇన్వాయిస్లను సమర్పించాలి. ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! జీఎస్టీ చట్టం ప్రకారం.. 2020 అక్టోబర్ 1 నుంచి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B లావాదేవీల సంబంధించి ఈ -ఇన్వాయిసింగ్ సమర్పించడం తప్పనిసరిగా ఉండేది. ఆ తర్వాత 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థలకూ ఇది అమలలోకి వచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఈ -ఇన్వాయిస్లను సమర్పిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన రూ. 20 కోట్ల టర్నోవర్ కు, 2022 అక్టోబర్ 1 నుంచి రూ. 10 కోట్ల టర్నోవర్ కు తగ్గింది. -
బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు!
కేంద్ర ప్రభుత్వం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేసేలా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వలు వెలువరించనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయి. కేంద్ర ఆర్ధిక శాఖ అమలు చేస్తున్న ఐదు రోజుల పనిదినాల్ని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ( ఐబీఏ), యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (యూఎఫ్బీఈఎస్) అంగీకరించినట్లు సమాచారం. అయితే అందుకు బదులుగా ఉద్యోగులు రోజుకు 40 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా పనిచేసేందుకు సైతం బ్యాంక్ యూనియన్లు అంగీకరించాయి. దీంతో ఐబీఏ అంగీకరించిన ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఈ మేరకు వేజ్ బోర్డు సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. బ్యాంకు ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు! -
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
ఆ పథకాలపై ఫోకస్.. పీఎస్‌యూ బ్యాంకులతో ఆర్థిక శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఏప్రిల్ 13న సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన ముద్రా యోజన, జన సురక్షా తదితర పథకాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పాయి. (జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి పథకాలపై చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాల పరిధిలో సంతృప్త స్థాయికి చేరుకునే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మూడు నెలల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్! -
అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) -
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా.. ఆరేళ్ళలో ఏపీకి రూ.లక్షా 88 వేల కోట్లు..
న్యూఢిల్లీ, మార్చి 28: జీఎస్టీతో సహా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద గత 6 సంవత్సరాల్లో (2017 నుంచి 2023 మార్చి 10 వరకు) రూ.1,88,053.83 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వాటా కింద విడుదల చేస్తున్న పన్నుల ఆదాయం గత 5 ఏళ్ళుగా తగ్గుతూ వస్తోందా? అంటూ రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర వసూలు చేసిన పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2017-18లో రూ.29,001.25 కోట్లు, 2018-19లో రూ.32,787.03 కోట్లు, 2019-20లో రూ.28,242.39 కోట్లు, 2020-21లో రూ.24,460.59 కోట్లు, 2021-22 లో రూ.35,385.83 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి రూ.38,176.74 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలోని 29 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వాటా కింద గడిచిన ఆరేళ్ళలో రూ.45,11,442.86 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 2017-18లో రూ.6,73,005.29 కోట్లు, 2018-19లోరూ.7,61,454.15 కోట్లు, 2019-20లో రూ.6,50,677.05 కోట్లు, 2020-21లో రూ.5,94,996.76 కోట్లు, 2021-22 లో రూ.8,82,903.79 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి రూ.9,48,405.82 కోట్లు ఆయా రాష్ట్రాల వాటా కింద విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం పన్నుల ద్వారా వసూలు చేసిన నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా కింద నెలవారీ ప్రాతిపదికన పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నికర ఆదాయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ద్వారా నిర్ధారించి, ధృవీకరిస్తారని కూడా మంత్రి పేర్కొన్నారు. చదవండి: బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై విచారణ జరపాలి -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
పాన్ - ఆధార్ లింక్ చేశారా? లేదంటే వెంటనే చేయండి’ అంటూ కేంద్రం మార్చి 31,2023 వరకు గడువు విధించింది. తాజాగా ఆ గడువును జూన్ 30,2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions. (1/2) pic.twitter.com/EE9VEamJKh — Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023 ఈ సందర్భంగా పాన్ - ఆధార్ లింక్ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్ 30, 2023 లోపు పాన్ -ఆధార్ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్ కార్డ్ పని చేయదని స్పష్టం చేసింది. ♦ అంతేకాదు పాన్ కార్డ్ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి. ♦ పాన్ కార్డ్ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు. ♦ చట్టం ప్రకారం.. టీడీఎస్, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం /సేకరించడం జరుగుతుంది. కాగా, ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేసింది. పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2023 అని ట్వీట్ చేసింది. ‘ఐటీ చట్టం, 1961 ప్రకారం, పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్ కార్డ్‌కు లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే 1.4.2023 నుండి పాన్ కార్డ్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. తాజాగా అనుసంధానానికి గడువు పొడిగింపుతో వినియోగదారులు ఊరట లభించినట్లైంది. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! -
అత్యవసర రుణ హామీ పథకంపై కేంద్రం ఆర్ధిక శాఖ రివ్యూ!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు, టాప్–4 ప్రైవేటు రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ బ్యాంకుల అధినేతలకు కబురు పంపింది. కరోనా సమయంలో అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. లాక్డౌన్లతో దెబ్బతిన్న వ్యాపార సంస్థలకు రుణ సాయం ద్వారా ఆదుకోవడం ఈ పథకం ఉద్దేశ్యం. దీని పురోగతిని సమావేశంలో సమీక్షించనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, కరోనా వల్ల ప్రభావితమైన రంగాలకు రుణ హామీ పథకం (ఎల్జీఎస్సీఏఎస్)ను సైతం సమీక్షించనున్నట్టు తెలిపాయి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషితోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల సీఈవోలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాక్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈసీఎల్జీఎస్ కింద హామీ లేని రూ.4.5 కోట్ల వరకు రుణాలను బ్యాంకులు మంజూరు చేయవచ్చు. -
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..!
ప్రభుత్వానికి ఆరు ప్రయోజనాలు.. ప్రజలకు అరవై నష్టాలు..! -
తెలంగాణ భారీ అప్పులపై కేంద్రం ప్రకటన
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పూర్తి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన నాటికి అప్పు రూ. రూ. 75,577 కోట్లు. 2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయి. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు.. రూ. 4,33,817.6 కోట్లు ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది కేంద్రం. సంవత్సరాల వారీగా తెలంగాణ అప్పులు 2014-15లో రూ. 8,121 కోట్లు 2015-16లో రూ. 15,515 కోట్లు 2016-17లో రూ. 30,319 కోట్లు 2017-18లో రూ. 22,658 కోట్లు 2018-19లో రూ. 23,091 కోట్లు 2019-20లో రూ. 30,577 కోట్లు 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు ఇవి కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లు వివరాల్లో పేర్కొంది కేంద్రం. దాదాపు 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,30,365.60 కోట్లు. రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా.. రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్న కేంద్రం. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా.. రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని నాబార్డ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
పీఎం ముద్రా లోన్ కింద లక్ష రూపాయల రుణమా? నిజమా?
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా వచ్చిన తరువాత అబద్దాలు, తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ విస్తరణ బాగా పెరిగింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను ఫ్యాక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా ముద్రా లోన్ స్కీం కింద లక్ష రూపాయల రుణం వస్తోందంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీని ప్రకారం లోన్ అగ్రిమెంట్ ఫీజులో రూ. 1,750కి బదులుగా రూ. 1,00,000 రుణం అందింస్తోంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చినదని, ఎన్ఆర్ఐ ఫండింగ్ స్కీమ్ కింద వడ్డీ రేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాక్షిక చెల్లింపులకు ఎటువంటి రుసుము ఉండదంటూ ఒక నకిలీ లేఖ వైరల్ అయింది. An approval letter claims to grant a loan of ₹1,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on payment of ₹1,750 as loan agreement charges #PIBFactCheck ◾️This letter is #Fake. ◾️@FinMinIndia has not issued this letter. Read more: 🔗https://t.co/cQ5DW69qkT pic.twitter.com/jKXEKbYupe — PIB Fact Check (@PIBFactCheck) January 30, 2023 అయితే ఈ లేఖను ఫ్యాక్ట్ చెక్ చేసి, పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి సాయాన్ని దేన్నీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకీలీదంటూ ట్వీట్ చేసింది. -
6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ తయారీ అంత సులువు కాదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలల ముందు నుంచే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఎన్నో ప్రక్రియలు దశలు దాటి చివరికి పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ క్రమంలో బడ్జెట్ అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తారు? దీని వెనుక జరిగే పూర్తి వివరాలను తెలుసుకుందాం. నీతి ఆయోగ్, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) బడ్జెట్ విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే ఏప్రిల్ 1న పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. 1) అన్ని మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ల జారీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలకు వచ్చే ఏడాది అంచనాలను సిద్ధం చేయాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్‌లో మంత్రిత్వ శాఖలు తమ డిమాండ్లను సమర్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. మంత్రిత్వ శాఖలు తమ అంచనాలను అందించడమే కాకుండా, గత సంవత్సరంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను కూడా అందిస్తాయి. 2) అందుకున్న ప్రతిపాదనలపై సంప్రదింపులు అభ్యర్థనలు స్వీకరించిన తర్వాత, దానిని ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. మంత్రిత్వ శాఖలు, వ్యయ శాఖ మధ్య విస్తృతమైన సంప్రదింపులు జరుగుతాయి. ఆపై ఆమోదం పొందిన తర్వాత, డేటా ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు 3) ఆదాయాల కేటాయింపు ఆర్థిక మంత్రిత్వ శాఖ, అన్ని సిఫార్సులను పరిశీలించిన తర్వాత, వివిధ శాఖలకు వారి భవిష్యత్తు ఖర్చుల కోసం ఆదాయాన్ని కేటాయిస్తుంది. నిధుల కేటాయింపుపై ఏదైన సమస్య తలెత్తితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం లేదా ప్రధానమంత్రిని సంప్రదిస్తుంది. మరోవైపు.. వ్యవసాయ నిపుణులు, చిన్న తరహా పరిశ్రమల ప్రొప్రైటర్స్, విదేశీ సంస్థాగత మదురులతోనూ ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చలు చేపడుతుంది. 4) ప్రీ-బడ్జెట్ సమావేశాలు అందిన ప్రతిపాదనలు డిమాండ్ల గురించి తెలుసుకోవడానికి ఆర్థిక మంత్రి వివిధ శాఖల నిపుణులతో ప్రీ-బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు ఉంటారు. బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు పూర్తయిన తర్వాత, ఆర్థిక మంత్రి అన్ని డిమాండ్లపై తుది పిలుపునిస్తారు. ఖరారు చేసే ముందు ప్రధానితో కూడా చర్చిస్తారు. 5) బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్.. ప్రతి సంవత్సరం, బడ్జెట్‌ను సమర్పించడానికి కొన్ని రోజుల ముందు హల్వా వేడుకను నిర్వహించే వార్షిక సంప్రదాయాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ వేడుక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆచారంలో భాగంగా, 'హల్వా'ను పెద్ద 'కడాయ్' లో తయారు చేస్తారు. ఈ స్వీటును ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మొత్తం సిబ్బందికి వడ్డిస్తారు. ఈ ఈవెంట్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..బడ్జెట్ రూపకల్పనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పెద్ద సంఖ్యలో అధికారులు, సహాయక సిబ్బందికి ఈ వంటకాన్ని వడ్డిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారందరు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పని చేస్తారు. 6)బడ్జెట్ సమర్పణ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్ తయారీకి చివరి దశ. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగంతో పాటు హాల్లోని సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఆ తరువాత బడ్జెట్‌ను ఉభయ సభల ముందు ఉంచుతారు. పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
ప్రైవేటు బ్యాంకర్లతో కేంద్ర పథకాలపై సమీక్ష
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి సంబంధించిన పథకాలు, సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకింగ్ సాధించిన పురోగతిని ఆర్థికశాఖ మంగళవారం సమీక్షించింది. ఈ మేరకు ప్రైవేటు బ్యాంకర్లతో సీనియర్ ఆర్థికశాఖ అధికారులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ సేవల కార్యదర్శి (డీఎఫ్ఎస్) డాక్టర్ వివేక్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం సేవానిధి వంటి పథకాల పురోగతి సమీక్షలో ప్రధాన అంశంగా ఉందని డీఎఫ్ఎస్ ఒక ట్వీట్లో పేర్కొంది. ఇదే అంశంపై గత వారం జోషి ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
పథకాల టార్గెట్లు సాధించండి..బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సామాజిక భద్రత పథకాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), ఆర్థిక సంస్థల చీఫ్‌లతో ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) తదితర పథకాలను సమీక్షించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ఉద్దేశించిన స్కీములపై ప్రజల్లో అవగాన పెంచేందుకు బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు నిర్వహించే అంశంపైనా చర్చ జరిగినట్లు పేర్కొంది. -
కేంద్ర రుణ భారం రూ.147 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థికశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ఈ పరిమాణం 145.72 లక్షల కోట్లు. అంటే మొదటి త్రైమాసికం నుంచి రెండవ త్రైమాసికానికి ప్రభుత్వ రుణ భారం ఒక శాతం పెరిగిందన్నమాట. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మొత్తం రుణ భారంలో సెప్టెంబర్ ముగిసే నాటికి పబ్లిక్ డెట్ (క్లుప్తంగా ప్రభుత్వం తన లోటును తీర్చడానికి అంతర్గత, బాహ్య వనరుల నుండి తీసుకున్న రుణ మొత్తం) వాటా 89.1 శాతం. జూన్ 30 నాటికి ఈ విలువ 88.3 శాతం. దీని పరిధిలోకి వచ్చే డేటెడ్ సెక్యూరిటీల్లో (బాండ్లు) 29.6 శాతం మేర ఐదు సంవత్సరాలకన్నా తక్కువ కాలపరిమితిలో మెచ్యూర్ అవడానికి సంబంధించినది. ►డేటెడ్ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం రెండవ త్రైమాసికంలో సమీకరించాల్సిన నోటిఫై మొత్తం రూ.4,22,000కోట్లుకాగా, సమీకరించింది రూ.4,06,000 కోట్లు. రీపేమెంట్లు రూ.92,371.15 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కమర్షియల్ బ్యాంకుల వెయిటేజ్ సెప్టెంబర్ 38.3 శాతం ఉంటే, జూన్ త్రైమాసికానికి ఈ రేటు 38.04 శాతంగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. ►2021 సెప్టెబర్ 24 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల పరిమాణం 638.64 బిలియన్ డాలర్లు అయితే, 2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ విలువ 532.66 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► 2022 జూలై 1 నుంచి 2022 సప్టెంబర్ 30 మధ్య డాలర్ మారకంలో రూపాయి విలువ 3.11 శాతం క్షీణించింది. జూలై 1న రూపాయి విలువ 79.09 ఉంటే, సెప్టెంబర్ 30 నాటికి 81.55కు పడింది. -
అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. (క్లిక్ చేయండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!) -
చమురు కంపెనీలకు భారీ షాక్!, బాబోయ్..ఈ నష్టాలు భరించలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి. -
CrossBorderTrade: డాలర్‌తో పనిలేకుండా రూపాయితో!
న్యూఢిల్లీ: సీమాంతర వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు రూపాయి మారకంలో నిర్వహించే మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యూఎస్ డాలర్‌కు బదులుగా రూపాయిలో సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహించే మార్గాలను చర్చించేందుకు డిసెంబరు నెల 5న బ్యాంకుల చీఫ్‌లతో చర్చించనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్) ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆరు అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల సీఈవోలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర భాగస్వాములు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలిపాయి. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. (ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని) కంపెనీల కొనుగోళ్ల నిబంధనల సమీక్ష సెబీ అత్యున్నత స్థాయి కమిటీ కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయడానికి, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా సెబీ ఓ అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. న్యాయస్థానాల గత తీర్పుల కోణంలో ప్రస్తుత నిబంధనలను సమీక్షించనున్నారు. 20 మంది సభ్యుల కమిటీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ షివాక్స్ జల్ వాజిఫ్‌దార్ నేతృత్వం వహించనున్నారు. సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, న్యాయ సేవల సంస్థల సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. గణనీయ మొత్తంలో షేర్ల కొనుగోలు లేదా కంపెనీల కొనుగోలు విషయంలో నిబంధనలపై తమ సూచనలు అందించనున్నారు. చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! -
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.54 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ స్థూల ప్రత్యక్ష పన్ను (వ్యక్తిగత, కార్పొరేట్) వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి రూ.10.54 లక్షల కోట్లుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 31 శాతం ఎగసినట్లు పేర్కొంది. ఇక ఇందులో రిఫండ్స్ విలువ రూ.1.83 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం బడ్టెట్ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఇది 61.31 శాతం. స్థూల పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగితే, వ్యక్తిగత పన్ను వసూళ్లు 40.64 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు: బీఓఏ సెక్యూరిటీస్ కాగా చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) సెక్యూరిటీస్ వెలువరించింది. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
ఐడీబీఐ వివరాలకు మరింత గడువు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రాసెస్‌కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్‌కు అక్టోబర్ 28వరకూ గడువు ప్రకటించింది. అయితే దీపమ్ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్ బిడ్స్‌కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు బీఎస్ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది. చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే? -
అలెర్ట్.. సంస్థలకు ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ పొడిగింపు
ట్యాక్స్ పేయర్స్‌కు ముఖ్య గమనిక. కేంద్ర ఆర్ధిక శాఖ 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి గాను సంస్థల ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన గడువును నవంబర్ 7కు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), ఆదాయం,కార్పొరేట్ పన్ను విషయాలలో అపెక్స్ బాడీ గత నెలలో ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును పొడిగించినందున ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీని కూడా పొడిగించినట్లు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ‘సీబీడీటీ అసెస్మెంట్ ఇయర్ 2022-23 చట్టంలోని సెక్షన్ 139 సబ్-సెక్షన్ (1) కింద సంస్థలు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే గడువు తేదీని అక్టోబర్ 31, 2022.. నవంబర్ 7, 2022 వరకు పొడిగించింది’ అని సీబీడీటీ పేర్కొంది. -
పన్నులపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
దేశంలో పెరిగిపోతున్న చెక్ బౌన్స్ కేసులు, కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు దేశంలో భారీగా పెరిగిపోతుండడంపై దీనిని కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం, చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి. వీటిలో ప్రధానమైనవి చూస్తే... ► చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి అకౌంట్లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్ అమౌంట్ డెబిట్ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి. ► అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి. ► చెక్ బౌన్స్‌ను రుణ డిఫాల్ట్‌గా పరిగణించడం, నేరస్తుని స్కోర్‌ను అవసరమైనమేర డౌన్‌గ్రేడ్ చేయడం కోసం ఈ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా చర్యలు, బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా తగ్గించవచ్చన్నది నిపుణుల సూచన. దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక
ట్యాక్స్ పేయర్స్‌కు అలెర్ట్. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) సభ్యత్వం పొందేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఆగస్టు నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం..అక్టోబర్1, 2022 నుండి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏపీవై పథకంలో చేరేందుకు అనర్హులని పేర్కొంది. ఒకవేళ అక్టోబర్ 1, 2022 న లేదా ఆ తర్వాత ధరఖాస్తు చేసుకుంటే లబ్ధి దారుల ఖాతాను మూసివేయడంతో పాటు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. అటల్ పెన్షన్ యోజన పథకంలో సభ్యత్వం ఎలా పొందాలి? ►18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు (తక్కువ, ఎగువ పరిమితులతో సహా) ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయొచ్చు. అలాగే, ఏపీవై ఖాతాలో జీవిత భాగస్వామి వివరాలు, నామినేషన్‌ను అందించడం తప్పనిసరి. ► మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. ► ఖాతా నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలైన వాటితో సహా అవసరమైన వివరాలను అందించండి. నమోదు కోసం, ఆధార్ ప్రాథమికంగా మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కేవైసీ). ► ఏపీవై ఖాతా తెరిచిన తర్వాత..అందులో తగినంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవింగ్ అకౌంట్లో అవసరమైన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. -
స్థూల పరిస్థితులపై నిరంతరం నిఘా పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో .. నిలకడైన వృద్ధి, సుస్థిరతను సాధించేందుకు స్థూల ఆర్థిక పరిస్థితులపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. రాబోయే శీతాకాలంలో ఇంధన భద్రతపై సంపన్న దేశాలు మరింతగా దృష్టి పెడుతుండటంతో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకూ ఇంధన అవసరాల నిర్వహణలో సమయోచితంగా వ్యవహరిస్తున్న భారత్ సామర్థ్యాలకు ఇది పరీక్షగా మారవచ్చని పేర్కొంది. ఇంధన అవసరాలకు సంబంధించి భారత్ 85 శాతం పైగా ముడిచమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటున్నందున రేటు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం మరింతగా ఎగిసే ముప్పు ఉంది. వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం ఎగియడం వంటి సమస్యలతో చాలా మటుకు దేశాలు సతమతమవుతుండగా .. భారత్‌లో మాత్రం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, వృద్ధి కూడా భారీ స్థాయిలోనే నమోదు చేయగలుగుతోందని రివ్యూ వివరించింది. భారత్ తన వృద్ధి లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే వివేకవంతమైన ద్రవ్య విధానం, విశ్వసనీయమైన పరపతి విధానాలు కీలకమని పేర్కొంది. ప్రభుత్వ విధానానికి పునాది రాళ్ల వంటి ఈ రెండింటినీ సరిగ్గా నిర్వహించుకోగలిగితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి రుణాలపై వడ్డీల భారం తగ్గగలదని, పెట్టుబడులకు తోడ్పాటు లభించగలదని రివ్యూ వివరించింది. ’అమృత కాలం’ (ఇప్పటి నుంచి 2047 వరకూ)లో మేడిన్ ఇండియా నినాదాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు, నిలకడగా ఆర్థిక వృద్ధి సాధించేందుకు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో గట్టి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పుంజుకుంటోన్న ఎకానమీ.. 2019–20 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వృద్ధి గణాంకాలు దాదాపు నాలుగు శాతం అధికంగా నమోదయ్యాయని రివ్యూ వివరించింది. కోవిడ్ మహమ్మారి అనంతరం ఎకానమీ వృద్ధి పటిష్టంగా కోలుకోవడాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. 2022–23లో వృద్ధికి సర్వీసుల రంగం సారథ్యం వహించగలదని వివరించింది. ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటం వల్ల ప్రైవేట్ వినియోగం భారీగా పుంజుకోవడమనేది రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధి సాధించేందుకు తోడ్పడగలదని రివ్యూ తెలిపింది. ప్రైవేట్ వినియోగం, సామర్థ్యాల వినియోగం పెరగడంతో పెట్టుబడులు పెట్టడం కూడా ఊపందుకుంటోందని వివరించింది. గత దశాబ్దకాలంలోనే అత్యధికంగా 2022–23 తొలి త్రైమాసికంలో పెట్టుబడుల రేటు పెరిగిందని తెలిపింది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, మరింత పెరగనున్న ఆహార ధరలు?
ఆహారం,ఇంధన ధరల పెరుగుదలతో రిటైల్ వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ఈ ఏడాది ఆగస్టులో ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరిగింది.దీంతో రానున్న రోజుల్లో ఆహారంతో పాటు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ ఉత్పత్తుల్ని నిలకడగా ఉంచేందుకు, ధరల పెరుగుదలను అరికట్టడానికి గోధుమ పిండి, బియ్యం, మైదా మొదలైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రభుత్వం నిషేధించింది. దీని ప్రభావం రాబోయే వారాల్లో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. -
రూపీ వర్తకానికి మొగ్గు చూపండి
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను రూపీ మారకంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపాలని వాణిజ్య మండళ్ల ప్రతినిధులు, బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. సీమాంతర చెల్లింపులు రూపీలో జరిగేలా చూసేందుకు విదేశాల్లోని భాగస్వామ్య బ్యాంకులతో కలసి ప్రత్యేక రూపీ వాస్ట్రో ఖాతాలు ఆఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్ మారకంలో కొనసాగుతుండడం గమనార్హం. దీని కారణంగా ఎక్కువ అస్థిరతలు నెలకొనడంతో తాజా సూచన చేయడం గమనార్హం. వాణిజ్య సంఘాలు, వాటి విదేశీ భాగస్వామ్య సంస్థలు రూపీ మారకంలో లావాదేవీలకు వీలుగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. వాణిజ్య మండళ్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూపీ మారకంలో వాణిజ్యానికి శ్రీలంక, అర్జెంటీనా, జింబాబ్వే సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వాణిజ్య సంస్థలు రూపీలో మారకానికి ఆసక్తితో ఉన్నందున.. రూపీ మారకంలో ఎగుమతులు, దిగుమతులకు వీలు కల్పించేందుకు బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి మన దేశం చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రూపాయి మారకంలోనే ఆ దేశం నుంచి అధిక శాతం దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
అక్టోబర్ 10 నుంచి బడ్జెట్ కసరత్తు.. ముందున్న కీలక సవాళ్లు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వశాఖ అక్టోబర్ 10 వ తేదీ నుంచి 2023–24 బడ్జెట్ రూపకల్పన కసరత్తును ప్రారంభించనుంది. అధిక ద్రవ్యోల్బణం, డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, 8 శాతం వృద్ధి బాటన ఎకానమీని నిలపడం వంటి కీలక సవాళ్లు ప్రస్తుతం కేంద్రం ముందు ఉన్నాయి. ఇది మోదీ 2.0 ప్రభుత్వం ఐదవ బడ్జెట్ మాత్రమే కాదు ఏప్రిల్-మే 2024లో సార్వత్రిక ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి పూర్తి బడ్జెట్. అయితే ఇప్పటి వరకు జీఎస్టీ బాదుడుతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా కాస్త ఉపశమనం లభిస్తుందో లేదో చూడాలి. చదవండి: iPhone14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్లు, ఏమైంది? -
రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ
న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్బీఐ, బ్యాంకింగ్ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి. ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్ అవుతోంది. -
రైల్వే ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్!
ఉద్యోగులకు రైల్వే శాఖ భారీ షాక్ ఇవ్వనుంది. విపరీంగా పెరిగిపోతున్న ఖర్చులపై ఆందోళన చెందుతున్న రైల్వే బోర్డు..ఉద్యోగులకు చెల్లించే భత్యాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ వీకే త్రిపాఠీ ఆధ్వర్యంలో రైల్వే బోర్డ్ ఏడు జోన్లలో రివ్వ్యూ నిర్వహించింది. మీటింగ్‌లో ఈ ఏడు జోన్లకు సంబంధించి ఓవర్ టైం చేస్తున్న రైల్వే ఉద్యోగులకు చెల్లించే అలవెన్స్‌లు, నైట్ డ్యూటీ, ట్రావెల్, ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చుల్ని వీకే త్రిపాఠి ఆరా తీసినట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా గతేడాది కంటే ఈ ఏడాది సాధారణ పని ఖర్చులు ( Ordinary Working Expenses) సగటున 26శాతం పెరిగాయని పీటీఐకి తెలిపారు. ముఖ్యంగా నార్తీస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (37.9 శాతం), నార్తన్ రైల్వే (35.3 శాతం), దక్షిణ మధ్య రైల్వే (34.8 శాతం), సౌత్ వెస్ట్ రైల్వే (33.1 శాతం), నార్త్ వెస్ట్ రైల్వే (29 శాతం), పశ్చిమ రైల్వే (28 శాతం) , ఉత్తర మధ్య రైల్వే (27.3 శాతం) ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఖర్చులు కొనసాగితే 2022-2023లో రైల్వే బడ్జెట్ మొత్తం పని ఖర్చులు రూ.2.32లక్షల కోట్లు ఉండొచ్చని రైల్వే బోర్డు అంచనా వేసింది. ప్రస్తుతం ఆడిట్ కంప్లీట్ కాలేదు కాబట్టి అంచనా మాత్రమే చెప్పినట్లు పీటీఐ అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం తెలిపింది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లుగానే వ్యయ నియంత్రణ, నిర్వహణపై రైల్వే బోర్డు మార్గదర్శకాలను జారీ చేసినటు తెలుస్తోంది. అంతేకాదు రైల్వే బోర్డు వారి ఖర్చులను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జోన్లకు సూచించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జనరల్ మేనేజర్లను కోరినట్లు వర్గాలు తెలిపాయి. ఓటీ (ఓవర్‌టైమ్), ఎన్డీఏ (నైట్ డ్యూటీ అలవెన్స్), కేఎంఏ (కిలోమీటరేజీ అలవెన్స్) వంటి నియంత్రిత వ్యయాలను చాలా నిశితంగా పరిశీలించాలని రైల్వే బోర్డు జనరల్ మేనేజర్లకు సూచించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదనంగా, తూర్పు రైల్వే (ఈఆర్ ), దక్షిణ రైల్వే (ఎస్ఆర్), నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్ఈఆర్), ఉత్తర రైల్వే (ఎన్ఆర్ ) వంటి జోన్లు రైళ్లను నడిపే రన్నింగ్ సిబ్బందికి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ అయితే కిలోమీటరు భత్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రైల్వే (ఎస్ఈసీఆర్), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నైట్ డ్యూటీ అలవెన్సుపై తమ వ్యయాన్ని తగ్గించాలని కోరింది. -
పండుగల సీజన్లో రుణ వృద్ధిపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై ఆర్థిక శాఖ కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. బ్యాంకింగ్ సేవల విస్తృతి సహా ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయాలు అందించడంపై ఈ సమావేశం దృష్టి సారించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల కథనం ప్రకారం, మొండిబకాయిలు మరింత తగ్గాల్సిన ఆవశ్యకతపై సైతం సమావేశం చర్చించింది. పండుగల సీజన్ నేపథ్యంలో రుణ వృద్ధిపై దృష్టి పెట్టాలని మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది. బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంసహా కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టాండ్‌అప్ ఇండియా, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనసహా వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై సమావేశంలో సమగ్ర సమీక్ష జరిగిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలకు రుణాలు ఇవ్వడానికి సంబంధించి బ్యాంకుల పనితీరును కార్యదర్శి సమీక్షించారు. మున్ముందూ లాభాల బాటలోనే... మొండిబకాయిలు తగ్గడంసహా జూన్ నెల్లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించిన బ్యాంకింగ్ మున్ముందు కాలంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు దాదాపు 7 శాతం మేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020-21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. బ్యాం 2020-21లో పట్టాలపైకి... బ్యాంకింగ్‌కు 2020-21 చక్కటి యూ టర్న్ వంటిది. 2015-16 నుంచి 2019-20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదు చేసుకుంది. 2017-18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు, 2015-16లో రూ.17,993 కోట్లు, 2016-17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
జులై నెలలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో సరికొత్త రికార్డ్‌లు నమోదవుతున్నాయి. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జులై నెలలో 28శాతం పెరిగి దేశం మొత్తం మీద రూ.1.49లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చిలో వసూలు చేసిన జీఎస్టీ కంటే జులై నెలలో కలెక్ట్ చేసిన జీఎస్టీ 3 శాతం పెరిగింది. దీంతో గత 5 నెలల నుంచి ప్రతి నెల రూ.1.4కోట్లుకు పైగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్పా ఎక్కడా తగ్గడం లేదని ఆర్ధిక శాఖ పేర్కొంది. ఇక వసూలైన జీఎస్టీ కలెక్షన్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.25,751, స్టేట్ జీఎస్టీ రూ.32,807 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.79,518కోట్లు, సెస్ రూ.10,920కోట్లు నమోదైంది. -
కోర్టుల్లో ఉద్యోగాలు 1,406
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను పర్మినెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా, మరో 16ను సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. కాగా, మొత్తం 38 కోర్టులకు 1,098 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్ మరో జీవో జారీ చేసింది. ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కేడర్ కోర్టుల్లో 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులు మంజూరయ్యాయి. మరో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టుల్లో 308 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మరో 308 పోస్టులు.. రాష్ట్రంలోని 14 అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిల కోర్టుల్లో 14 కేటగిరీల్లో 308 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్టులను ఔట్ సోర్సింగ్‌లో తీసుకోనుండగా.. మిగతా 11 కేటగిరీల్లో రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నారు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) పోస్టులు 14, హెడ్ క్లర్క్ 14, ట్రాన్స్‌లేటర్ 14, యూడీబీసీ 14, పర్సనల్ అసిస్టెంట్ 14, జూనియర్ అసిస్టెంట్ 42, టైపిస్ట్ 14, ఫీల్డ్ అసిస్టెంట్ 28, ఎగ్జామినర్ 14, కాపీయిస్ట్ 14, ప్రాసెస్ సర్వర్ 28, డ్రైవర్ 14, రికార్డు అసిస్టెంట్ 14, ఆఫీస్ సబార్డినేట్ 70 పోస్టులున్నాయి. -
ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ
వంట నూనె మొదలు పెట్రోలు, గోలీ మందులు మొదటు ఏసీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. కానీ ఆర్థిక శాఖ సూత్రీకరణ మరో రకంగా ఉంది.. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు, పేదల కంటే ధనవంతులే ఎక్కువగా నష్టపోతున్నారంటూ చిత్రమైన లెక్కలను ప్రజల ముందుకు తెచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, రిటైల్ కన్సుమర్ ఇండెక్స్ తదితర అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ 2022 మే 12న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పనితీరు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాలను వివరిస్తూ.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, పెరిగిన ధరల ప్రభావం పేదలు, సామాన్యుల కంటే ధనవంతులపైనే అధికంగా ఉందంటూ విశ్లేషణ చేసింది. ఇందు కోసం 2011-12 నేషనల్ శాంపిల్ సర్వే ఆధారంగా వివిధ కేటగిరీల వారీగా కుటుంబాలు చేస్తున ఖర్చుల వివరాలను ప్రమాణికంగా తీసుకుని వివరణ ఇచ్చింది. దీనిపై మనీ కంట్రోల్ ప్రచురించిన కథనం ఆధారంగా.. మూడు కేటగిరీలు మూడు రకాల ఖర్చులు కేంద్ర ఆర్థిక శాఖ విశ్లేషణ ప్రకారం... దేశంలో వినియోగదారులను మూడు కేటగిరీలుగా పేర్కొంది. అందులో పై స్థాయిలో ఉండే ధనవంతులు 20 శాతం, మధ్య తరగతి 60 శాతం, పేదలు 20 శాతంగా తీసుకున్నట్టు తెలిపింది. ఈ కేటగిరీల వారు చేస్తున్న ఖర్చులను కూడా మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంది. అవి ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్ (రవాణా ఖర్చులతో కలిపి), ఫుడ్, ఫ్యూయల్ మినహాయించి ఇతర వస్తువులుగా పేర్కొంది. వారిపైనే అధికం పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు చెందిన కుటుంబాలు జీవించేందుకు మూడు కేటగిరీలకు పెడుతున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ వీరిపై గడిచిన రెండేళ్లుగా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ విశ్లేషణాత్మ వివరణ తయారు చేసింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా పేదలు, మధ్య తరగతి కంటే ధనవంతులపైనే ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది! పేదలపై భారం పడలేదు! ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 20 శాతం ఉన్న పేదవారిపై ద్రవ్యోల్బణ ప్రభావం పరిశీలించగా 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో అది 5.2 శాతానికి పడిపోయింది. ఇదే కేటగిరిలో పట్టణ ప్రాంత పేదలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గి వారికి ఉపశనం కలిగించింది. మధ్య తరగతి సేఫ్! ఇక సమాజంలో 60 శాతంగా ఉన్న మధ్య తరగతి విషయానికి వస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.8 శాతం నుంచి 5.7 శాతానికి దిగి వచ్చింది. పట్టణ ధనికులపైనే! ద్రవ్యోల్బణం కారణంగా 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని ఆర్థిక శాఖ ఇలా వివరించింది... 2021 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి చేరుకుంది. అంటే గ్రామీణ ప్రాంత సంపన్నులపై 0.1 శాతం అధికంగా ద్రవ్యోల్బణం ప్రభావం చూపించింది. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే 5.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. మొత్తంగా సమాజంలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందిన సంపన్నులపై అత్యధికంగా 1.1 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం చూపింది. సమాజంలోని వివిధ ఆదాయ వర్గాల వారిపై ధరల పెరుగుదల ప్రభావాలను సునిశితంగా గమనిస్తే పేదలు, మధ్య తరగతి కంటే సంపన్నులపైనే ఎక్కువ ప్రభావం చూపిందంటూ ఆర్థిక శాఖ సూత్రీకరించింది. ఆర్బీఐ ఇలా అంతకు ముందు ఆర్థిక శాఖ విశ్లేషణలకు విరుద్ధంగా 2022 మే 4న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ ఫలితాలను విశ్లేషించింది. రెపోరేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ద్రవ్యోల్బణం పేదలపై అధిక ప్రభావం చూపిందని, వారి కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ కొనుగోలు శక్తిని ప్రధానంగా పరిశీలనలోకి తీసుకోగా ఆర్థిక శాఖ కొనుగోలు వల్ల జరుగుతున్న వ్యయాలను ప్రధానంగా చేసుకుని విశ్లేషణ చేపట్టడం విశేషం. ఆర్థిక శాఖ అంచనాలు సూత్రీకరణలు ఎలా ఉన్నా పెరుగుతున్న ధరలు మాత్రం సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.... చదవండి: ధరదడ.. పరిశ్రమకు కరోనా సెగ -
ఏపీలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరుగుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 ఏప్రిల్‌లో రూ.3,345 కోట్లు వసూలవ్వగా.. 2022 ఏప్రిల్‌లో రూ.4,067 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో గతేడాది ఏప్రిల్‌లో రూ.4,262 కోట్లు వసూలు కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 16 శాతం పెరుగుదలతో రూ.4,955 కోట్లు వచ్చాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యాయని వివరించింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..!
న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి మూలధన సమీకరణ ద్వారా బ్యాలెన్స్ షీట్లను పటిష్టంగా ఉంచుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ఆర్థికశాఖ నిర్దేశించింది. మెరుగైన మూలధనం బ్యాంకులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పాదక రంగాలలో క్రెడిట్ వృద్ధిని పెంచడానికి దోహదపడతాయని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పీఎస్‌బీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన మంథన్ 2022 (బ్యాంకింగ్‌పై మేథోమదనం) సమావేశంలో సంజయ్ మల్హోత్రా ఈ మేరకు ప్రసంగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతతో సహా అన్ని కొలమానాలపై మెరుగైన పనితీరును కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమలో తాము సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలని అన్వేషించాలని కోరారు. అలాగే కార్యకలాపాలకు సంబంధించి పెద్ద బ్యాంకులు తమ ఉత్తమ పద్ధతులను చిన్న రుణదాతలతో పంచుకోవాలని, మరింత నైపుణ్యం అవసరమైన రంగాలలో వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. బ్యాంకులు దీర్ఘకాలిక లాభదాయకత, వినియోగదారు ప్రయోజనాలే పరిరక్షణగా తగిన విధానాల దిశలో వ్యూహాలను అన్వేషించాలని మల్హోత్రా సూచించారు. ఆరు గ్రూపుల ఏర్పాటు వినియోగ సేవలు, డిజిటలైజేషన్, హెచ్ఆర్ ప్రోత్సాహకాలు, పాలనాతీరు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో పరస్పర సహకారం సహా కీలకమైన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడానికి మంథన్ 2022లో ఆరు గ్రూపులు ఏర్పాటయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కాగా, పీఎస్బీ మంథన్ తొలి సమావేశం 2014లో జరిగింది. కరోనాకు ముందు 2019లో చివరిసారిగా ఈ సమావేశం జరిగింది. సంస్కరణలకు ప్రాధాన్యత బ్యాంకింగ్ పటిష్టత, వ్యవస్థలో తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించడం, ఈఏఎస్‌ఈ (ఎన్‌హెన్డ్స్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్స్‌లెన్స్) దిశలో పురోగతి లక్ష్యంగా మంథన్ 2022 జరగడం హర్షణీయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల అగ్ర నాయకత్వంతో ఆలోచనాత్మకంగా దీనిని నిర్వహించడం సానుకూలాంశం. – అతుల్ కుమార్ గోయల్, ఐబీఏ చైర్మన్ సవాళ్లను తట్టుకోగలగాలి.. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు, నూతన చొరవలకు, అత్యుత్తమ ప్రమాణాల అన్వేషణకు మంథన్ దోహదపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని సముపార్జించాలి. మూలధనం సమీకరణ ద్వారా రుణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! కొత్త నిబంధనలను ప్రకటించిన ఆర్బీఐ..! -
ప్రాజెక్టులకు ‘ఎల్వోసీ’ ఇవ్వకండి, ఆర్ధిక శాఖకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: ఆర్థికాంశాల నిర్వహణలో పారదర్శకతను మెరుగుపర్చుకునే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ తరఫున ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎంపిక చేసిన సంస్థలకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’లు (ఎల్వోసీ) జారీ చేయొద్దంటూ ప్రభుత్వంలోని ఇతర శాఖలు, విభాగాలకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన అధికారాలను తక్షణం ఉపసంహరిస్తూ మెమోరాండం జారీ చేసింది. ప్రభుత్వ హామీతో, ప్రాజెక్టులకు అవసరమైన నిధులను వేగవంతంగా సమకూర్చుకునేందుకు కాంట్రాక్టరుకు ఎల్వోసీలు ఉపయోగపడతాయి. రైల్వే వంటి మౌలిక సదుపాయాల కల్పన శాఖలకు వీటిని జారీ చేసే అధికారాలు ఇచ్చారు. అయితే, ఈ ఎల్వోసీలు దుర్వినియోగమవుతున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక క్రమశిక్షణ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలన్నింటినీ బడ్జెట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. -
తెలంగాణలో 30,453 ప్రభుత్వ ఉద్యోగాలు.. శాఖల వారీగా పోస్టుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్ రిక్రూట్మెంట్) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ నెల 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. వీటిని అత్యంత త్వరితంగా భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ఆయన ఇచ్చిన హామీ కార్యరూపంలోకి వచ్చింది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ బుధవారం జీవోలు జారీ చేసింది. ఇతర ఖాళీలపైనా త్వరలోనే హరీశ్, ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించ నున్నారు. వీలైనంత వేగంగా వీటికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. తొలిసారిగా గ్రూప్–1...: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుం డటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు, రవాణా శాఖలో 212 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోస్టర్ ఫిక్స్ అయ్యాక..: వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతివ్వడం, నియామక సంస్థలను కూడా ఖరారు చేయడంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రోస్టర్ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20 డీఎస్పీ– 91 జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్–2 జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6 మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35) ఎంపీడీవో(121) డీపీవో(5) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48) డిప్యూటీ కలెక్టర్(42) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26) జిల్లా రిజిస్ట్రార్(5) జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3) ఆర్టీవో(4) జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) మొత్తం 503 జైళ్ల శాఖ: డిప్యూటీ జైలర్ (8), వార్డర్ (136), వార్డర్ ఉమెన్ (10) మొత్తం 154 పోలీసు శాఖ: కానిస్టేబుల్ సివిల్ (4965), ఆర్మడ్ రిజర్వ్(4423), టీఎస్ఎస్పీ(5704), కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262), డ్రైవర్లు పిటీవో(100), మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100), సబ్ ఇన్స్పెక్టర్ సివిల్(415), ఎస్ఐ ఏఆర్(69), ఎస్ఐ టీఎస్ఎస్పీ(23), ఎస్ఐ ఐటీ అండ్ సీ(23), ఎస్ఐ పీటీవో(3), ఎస్ఐ ఎస్ఏఅర్ సీపీఎల్(5) ఏఎస్ఐ(ఎఫ్‌బీబీ–8), సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్ఎస్ఎల్–14), సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్ఎస్ఎల్–32), ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్ఎస్ఎల్–17), ల్యాబ్ అటెండెంట్(1), ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్(390), ఎస్ఐ ఎస్పీఎఫ్(12) మొత్తం: 16,587 డీజీపీ ఆఫీస్: హెచ్ఓ (59), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(125), జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఎస్పీ(43), సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2), డీజీ ఎస్పీఎఫ్ (2) మొత్తం: 231 రవాణా శాఖ: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సెక్టర్స్(113), జూనియర్ అసిస్టెంట్ హెడ్ ఆఫీస్(10), జూనియర్ అసిస్టెంట్ ఎల్సీ(26), మొత్తం: 149 వైద్యారోగ్య శాఖ: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520), వైద్య విద్య హెచ్ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183), స్టాఫ్ నర్స్ 3823, ట్యూటర్ 357, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751), ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7) ఎంఎస్‌జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81) తెలంగాణ వైద్య విధాన పరిషత్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్టీ(33), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సి విల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38), మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్ఎం(265), స్టాఫ్ నర్స్(757) మొత్తం: 10,028 ఆయుష్ విభాగం హెచ్ఓడీ: ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్ఎమ్–26), జూనియర్ అసిస్టెంట్ లోకల్(14), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3), ల్యాబ్ అసిస్టెంట్(18), ల్యాబ్ టెక్నీషీయన్ (26), లెక్చరర్ ఆయుర్వేద(29), లెక్చరర్ హోమియో(4), లెక్చరర్ యునాని(12), లైబ్రెరీయన్ (4), మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54), మెడికల్ ఆఫీసర్ హోమియో(33), మెడికల్ ఆఫీసర్ యునానీ(88), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9), ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136), ఫార్మాసిస్ట్ హోమియో(54), ఫార్మాసిస్ట్ యునానీ(118), స్టాఫ్ నర్స్(61) మొత్తం: 689 డీఎంఈ హెచ్ఓడీ: అనస్తీషీయా టెక్నినీషియన్ (93), ఆడియో వీడియో టెక్నినీషియన్ (32), ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18), బయోమెడికల్ ఇంజనీర్(14), బయోమెడికల్ టెక్నీషీయన్ (11), కార్డియోలజీ టెక్నిషీయపన్ (12), సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6), డార్క్ రూమ్ అసిస్టెంట్(36), డెంటల్ హైజెనీస్ట్(3), డెంటల్ టెక్నీషీయన్ (53), ఈసీజీ టెక్నిషీయన్ (4), ఈఈజీ టెక్నీషీయన్ (5), జూనియర్ అసిస్టెంట్ లోకల్(172), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161), ఫీజియోథెరెపిస్ట్(33), రేడియోగ్రాఫర్(55), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19), ఆప్టోమెటరిస్ట్(20), స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15) మొత్తం: 1118 డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2), డార్క్‌రూమ్ అసిస్టెంట్(30), జూనియర్ అసిస్టెంట్ లోకల్(42), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119), ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160) మొత్తం: 357 డ్రగ్స్ కంట్రోలర్: డ్రగ్స్ ఇన్స్పెక్టర్(18), జూనియర్ అనాలిస్ట్(9), జూనియర్ అసిస్టెంట్ లోకల్94), జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2) మొత్తం: 33 ఐపీఎమ్(హెచ్ఓడీ): ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24), జూనియర్ అనలిస్ట్ స్టేట్(9), జూనియర్ అనలిస్ట్ జోనల్(2), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5), లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6), లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6), శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3) మొత్తం: 56 ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3, బయోమెడికల్ ఇంజనీర్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1, డెంటల్ టెక్నిషీయన్ –1, ఈసీజీ టెక్నీషీయన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5, ల్యాబ్ అసిస్టెంట్–8, ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5), లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1, మెడికల్ ఫిజిసిస్ట్–5, మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3, ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2), రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2), రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషీయన్ –2, రేడియో గ్రాఫర్ ఆర్టీ టెక్నీషీయన్ –5, రేడియోగ్రాఫర్స్–6, సోషల్ వర్కర్–6, మొత్తం: 68 నిమ్స్: జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20, టీఎస్ఎంఎస్ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11), జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1, మొత్తం: 13 వైద్య విధాన పరిషత్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36), జూనియర్ అసిస్టెంట్ లోకల్(63), ల్యాబ్ టెక్నీషీయన్ (47), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119), రేడియోగ్రాఫర్(36) మొత్తం: 301 కాలోజీ యూనివర్సీటీ: అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1, అసిస్టెంట్ లైబ్రేరియన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, లైబ్రేరియన్ –1, ప్రోగ్రామర్–1, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1 మొత్తం: 7 మొత్తం: 2662 ఉద్యోగాల భర్తీలో కొత్త రోస్టర్ నూతన జోనల్ విధానంతో మారిన రోస్టర్ పట్టిక క్రమసంఖ్య ఒకటి నుంచి మొదలు కానున్న నియామకాల ప్రక్రియ బ్యాక్లాగ్ పోస్టులు కొత్త జిల్లాలకు సమాన ప్రాతిపదికన కేటాయింపు ఉద్యోగ నియామకాలపై సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక అడుగు పడింది. మొత్తంగా 80 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసింది. అయితే ఈ నియామకాలను ఏవిధంగా చేపడతారనే సందిగ్ధానికి రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఆగస్టు–2018 నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. కానీ అప్పటినుంచి కొత్తగా ఉద్యోగ నియామకాలేవీ జరగలేదు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఉద్యోగఖాళీల భర్తీపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కొత్త ఉద్యోగ నియామకాలకు నూతన రోస్టర్ ప్రాతిపదిక కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీతో ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ప్రభుత్వం వీటిని బుధవారం విడుదల చేసింది. రోస్టర్దే కీలక పాత్ర.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్ల అమలులో రోస్టర్దే (రిజర్వేషన్ల క్రమ పట్టిక) కీలక పాత్ర. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లతో పట్టికను తయారు చేసింది. ఇందులో క్రమ సంఖ్య ఒకటి నుంచి వంద వరకు ప్రాధాన్యత క్రమంలో రిజర్వేషన్ల కూర్పు చేసి ఉంచింది. జనరల్, జనరల్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్, ఎస్టీ, ఎస్టీ ఉమెన్, బీసీ, బీసీ ఉమెన్, డిజేబుల్, డిజేబుల్ ఉమెన్ కేటగిరీలను ఒక్కో క్రమ సంఖ్య వద్ద ఫిక్స్ చేశారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సైతం అమల్లోకి రానుండడంతో ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల వద్ద ఫిక్స్ చేస్తారు. సాధారణంగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడితే.. ఖాళీల భర్తీ పూర్తయ్యే నాటికి ఉన్న రోస్టర్‌ను తదుపరి నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా భావిస్తారు. కానీ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ కొనసాగింపునకు బదులుగా.. రోస్టర్ పాయింట్లను ఒకటో క్రమ సంఖ్య నుంచి కొనసాగించాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా స్పష్టం చేసింది. సమంగా క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగులు ఖాళీ ఉద్యోగాలను జనాభా ప్రాతిపదికన సమానంగా నూతన జిల్లాలకు కేటాయించారు. ఈ క్రమంలో రిజర్వేషన్లను సైతం సమ ప్రాతిపదికను అవలంభిస్తూ కేటాయింపులు జరిపారు. ఇక కొన్నిచోట్ల బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో వాటిని క్యారీ ఫార్వర్డ్ కేటగిరీలోకి మార్చారు. తాజాగా ఈ ఉద్యోగాలను కూడా నూతన జిల్లా యూనిట్ల ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో కూడా రోస్టర్‌ను పాటించాలి. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించే విషయంలో రోస్టర్ పాయింట్లకు విఘాతం కలగకుండా శాఖాపరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ బాధ్యతల్ని పూర్తిగా నెరవేర్చాలని జీఏడీ స్పష్టం చేసింది. -
వేగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. వీటితోపాటు ఇతర నిబంధనలను సైతం మార్పు చేసే యోచనలో ఉంది. ఉద్యోగులకు వీఆర్ఎస్ : కాగా ఏయే పీఎస్‌బీలను ప్రైవేటీకరించేది ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ రెండు బ్యాంకుల్లో వాటా విక్రయానికి వీలుగా 20 శాతం విదేశీ పెట్టుబడుల పరిమితిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా ఈ రెండు బ్యాంకుల ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని సైతం ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ముసాయిదా కేబినెట్ నోట్‌పై అంతర్మంత్రిత్వ చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. బ్యాంకుల ప్రైవేటైజేషన్ సంబంధ సూచనలను పరిగణణలోకి తీసుకుని తుది ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా? -
తెలంగాణలో ‘కాంట్రాక్టు’ కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు తేల్చే కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల పదో తేదీన అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితిపై నిర్దేశిత పద్ధతిలో నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించి ఉన్నతాధికారులకు పంపింది. 14 అంశాలతో నమూనా.. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మొత్తం 14 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంది. దీంతో పాటు విభాగాధిపతులు సమర్పించేందుకు 9 రకాల అంశాలతో మరో ఫార్మాట్‌ను తయారు చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన నమూనాలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, అపాయింట్మెంట్ తేదీ, అపాయింట్మెంట్ తీరు (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్), ప్రస్తుత నెలవారీ వేతనం, క్రమబద్ధీకరిస్తే ఇవ్వాల్సిన హోదా, శాఖలో ఖాళీల వివరాలు, ఉద్యోగ కేడర్, క్రమబద్ధీకరించే హోదాకు కావాల్సిన విద్యార్హతలు, ఉద్యోగి నియామకం నాటి అర్హతలు, ప్రస్తుత అర్హతలు, ఉద్యోగి సామాజిక వర్గం, స్థానికత, క్రమబద్ధీకరించే పోస్టు రోస్టర్ పాయింట్స్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఉద్యోగి పనితీరు, రిమార్క్స్ సమర్పించాలి. వీటన్నిటినీ హెచ్ఓడీ (విభాగాధిపతి) ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల నుంచి వివరాలు స్వీకరించిన తర్వాత సదరు విభాగాధిపతి నిర్ణీత ఫార్మాట్లో 9 రకాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, నియామకం అయ్యే నాటికి విద్యార్హతలు, మొదటి అపాయింట్మెంట్ ఇచ్చిన శాఖ, నియమించిన పోస్టు, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి ఉన్న సర్వీసు, రిమార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి వ్యక్తిగతంగా ఇచ్చే వివరాల ఆధారంగా హెచ్ఓడీ ఆర్థిక శాఖకు వివరాలు సమర్పిస్తారు. క్ష్రేత్రస్థాయిలో ఉన్న వారెందరు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు పెద్దగా జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాలే ఎక్కువ. వీటిలో అత్యధికంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారే ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 11,103 మంది ఉన్నట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారెందరనే కోణంలో వివరాలను ఆర్థిక శాఖ రాబడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఉద్యోగ నియామకాల్లో పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు రాజీనామా చేసి కొత్తగా కొలువులు పొందారు. అంతేకాకుండా వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసినవారున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించడం, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాలను వదిలేసిన వారు, దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలతో, ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. దీంతో హెచ్ఓడీల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఈ లెక్కలు తేల్చేందుకు ఆర్థికశాఖ సిద్ధమైంది. -
ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం సమీక్ష
-
ఈ పాపం బాబు సర్కారుదే
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకులకు గత చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణం. మూడు సంవత్సరాల పాటు పరిమితులకు మించి.. వచ్చే ప్రభుత్వంలో చేయాల్సిన అప్పులను కూడా అదనంగా చేసి, చేటు చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సిన 39 వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్లింది. దీనికి తోడు బడ్జెట్ బయట ఏకంగా 58 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దిగిపోయింది. ఒక పక్క ఆర్థిక మందగమనం, రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర రాబడులు తగ్గిపోయాయి. అయినా కేంద్రం విధించిన పరిమితుల మేరకు వ్యవహరిస్తూ ఏ పథకాన్ని నిలుపుదల చేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వస్తోంది. ఈ వాస్తవాలను మరచి అప్పులు ఎక్కువ చేశారని చంద్రబాబు మాట్లాడుతుండటం చూస్తుంటే.. దొంగే దొంగ దొంగ.. అని అరవడంలా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా మూడు ఆర్థిక సంవత్సరాలు కేంద్రం అనుమతించిన దానికి మించి అదనంగా అప్పులు చేయడమే కాకుండా, తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో అదనంగా చేసిన అప్పులను మినహాయించుకోవాలని కేంద్రానికి తెలిపారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోంది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘ఈనాడు’ రాతలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు అదనంగా అప్పులు చేయడంతో పాటు తర్వాత సంవత్సరాల్లోని అప్పుల్లో ఆ మేరకు కోతలు విధించాలని చెప్పడంతోనే ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి మేరకు కేంద్రం అనుమతించిన అప్పులకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అప్పడు అదనపు అప్పులు కనిపించలేదా? ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల్లో కోత విధించిన విషయం ‘ఈనాడు’కు కనిపించడం లేదా? కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించకుండా అప్పు పుట్టేదెలా అంటూ ఎలా రాస్తారు?’ అని ఆర్థికశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మూడు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి అనుమతించిన అప్పుల కన్నా అధికంగా రూ.16,418.99 కోట్ల అప్పులు చేసింది. పర్యవసానంగా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో పక్క గత ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అప్పులు చేసి వెళ్లి పోవడంతో ఇప్పుడు ఆ అప్పులను తీర్చడంతో పాటు పెండింగ్ పెట్టిన బిల్లులను సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంపై పడింది. దీనికి తోడు కోవిడ్‌తో ఆదాయం తగ్గడంతో రాష్ట్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందని, వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటి ప్రభుత్వమే అత్యధికంగా అప్పులు చేసిందంటూ ఒక పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరో వైపు ఎల్లో మీడియా ప్రచారం చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ శాఖ అప్పును రూ.31,647.64 కోట్ల నుంచి 2018–19 నాటికి ఏకంగా రూ.62,463 కోట్లకు పెంచేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలు 2014–15లో రూ.4,817 కోట్లు ఉంటే 2018–19 నాటికి రూ.20,121.97 కోట్లకు పెంచేసింది. -
పెండింగ్.. పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయాలను తక్షణమే ఆమోదించేలా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ఖర్చులో అధికభాగం భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి రావటం, ముంపు ప్రాంతాల కుటుంబాలకు ప్యాకేజీలు విస్తరించాల్సిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్నారు. సవరించిన అంచనాలకు కేంద్ర సంస్థలే ఆమోదం తెలిపినప్పటికీ ఆ మేరకు నిధుల విడుదలకు కేంద్రం తిరస్కరించడం ప్రాజెక్టు పనులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రధాని దృష్టికి తెచ్చారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా ఆమోదించి నిధులివ్వాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అనంతరం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో గంటకుపైగా సమావేశమయ్యారు. ఏపీలో రెవెన్యూ లోటు, పెండింగ్ నిధులు, విద్యుత్ బకాయిలు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై చర్చించి వినతిపత్రాలు అందజేశారు. ఆ వివరాలివీ.. విభజన పర్యవసనాలతో ఆర్ధిక ప్రగతికి దెబ్బ.. రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఏపీకి కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం. భౌగోళికంగా తెలంగాణ కంటే పెద్దదైన ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను తీర్చి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల రాజధానిని, మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేస్తే చాలావరకు ఊరట లభిస్తుంది. కానీ ఇప్పటికీ చాలా హామీలు నెరవేరలేదు. ఇరిగేషన్‌కే నిధులనడం సరికాదు.. 2013 భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 ఏప్రిల్ 1 అంచనాల మేరకు పోలవరానికి నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. విభజన చట్టం సెక్షన్ 90 స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం. ఏ ప్రాజెక్టులోనైనా రెండు రకాల అంశాలుంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు ఇరిగేషన్లో అంతర్భాగం. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ప్రాజెక్టు ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. రూ.2,100 కోట్ల పోలవరం పెండింగ్ బిల్లులనూ మంజూరు చేయండి. ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్ తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు.. విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో విద్యుత్‌ను అందించింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. సంపన్న రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారులు అధికం జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థికంగా ఎదిగిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పీడీఎస్ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నా. కోవిడ్‌తో సంక్లిష్ట పరిస్థితులు.. 2019–20 ఆర్థిక మందగమనం ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.34,833 కోట్లు రావాల్సి ఉండగా రూ.28,242 కోట్లు మాత్రమే వచ్చాయి. 2020–21లో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కోవిడ్ మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. కేంద్ర పన్నుల్లో రూ.7,780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య పరిరక్షణకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.వేల కోట్లలో ఉంటుంది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల చేతికి నేరుగా డబ్బులు అందచేసి (డీబీటీ) సంక్షోభ సమయంలో ఆదుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ ææనిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా అమలు చేశాం. ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు 2020–2021లో దేశ జీడీపీలో 11 శాతం మేర కేంద్రం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. గత సర్కారు హయాంలోనే అధికంగా అప్పులు 2021–22 ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా నిర్ధారించగా కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. గత సర్కారు హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండా రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తీసుకుంటున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నాం. గత సర్కారు హయాంలో అధికంగా అప్పులు చేశారనే కారణంతో ఇప్పుడు కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన తరుణంలో ఇలాంటి పరిమితులు సరికాదు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించాలి. – భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్‌ను రెన్యువల్ చేయాలి. కడప స్టీల్ ప్లాంట్... వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలి. వేలం ప్రక్రియ వల్ల తక్కువ ఖర్చుకు గనులు దొరికే అవకాశాలు సన్నగిల్లుతాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించాం. ఎస్సార్ స్టీల్స్ కాంపిటేటివ్ బిడ్డర్‌గా ఎంపికైంది. రుణం మంజూరుకు ఎస్బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తైతే రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది. -
డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.29 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద 2021 డిసెంబరు నెలలో రూ, 1,29,780 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పన్ను ఎగవేతల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ శనివారం పేర్కొంది. సీజీఎస్టీ కింద రూ. 22,578 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ. 28,658 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 69,155 కోట్లు, సెస్ కింద రూ.9,389 కోట్లు వసూలైనట్లు వివరించింది. కిందటి ఏడాదితో పోలిస్తే డిసెంబరు పన్ను ఆదాయంలో 13 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2021లో వరుసగా ఆరో నెల కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటడం గమనార్హం. అయితే నవంబరులో రూ. 1.31 లక్షల కోట్లు వసూలు కాగా... డిసెంబరులో ఇది రెండు వేల కోట్లు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 1.15 లక్షల కోట్లు వసూలు కాగా... మూడో త్రైమాసికంలో నెలవారీ సగటు బాగా పెరిగి రూ.1.30 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు 2020 డిసెంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 6% వృద్ధితో తెలంగాణలో రూ.3,760 కోట్లు, –2% తగ్గుదలతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,532 కోట్లు వసూళ్లయ్యాయి. చదవండి: గడువు(డిసెంబర్ 31)లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది? -
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ► 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు. ► అలాగే, సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు. ► సీపీఎస్ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరెవరికి వర్తిస్తుందంటే.. పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..!
భారత రుణభారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31, 2022)నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణం 62 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఆర్థిక లోటు, రుణభారాలపై నజర్..! సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, దేశ రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మెరుగైన సమ్మతి ద్వారా పన్ను రాబడిని పెంచడం, ఆస్తుల మానటైజేషన్ ద్వారా వనరుల సమీకరణ, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపరచడం మొదలైనవి ఆర్థిక లోటు, రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన చర్యలని చౌదరి చెప్పారు. పుంజుకున్న ఆదాయాలు..! 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం... ప్రభుత్వం ఆశించిన దానికంటే బలంగా ఆదాయం పుంజుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.6 శాతం ఆర్థిక లోటు ఉంటుందని తెలిపినట్లు పంకజ్ చౌదరీ అన్నారు. అంచనాలకు మించి..! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఎఫ్వై22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధి చెందుతుందని పంకజ్ అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా ఐఎమ్ఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ అప్డేట్ గురించి ప్రస్తావించారు. భారత్ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందనే విషయాలను చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. చదవండి: ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే.. -
దివాళీ స్పెషల్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
దివాళీ సందర్భంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 సంవత్సరానికి ఖాతాదారులకు 8.5శాతం వడ్డీని అందిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. తద్వరా 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లకు లబ్ధి చేకూరనుంది. వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది ఈపీఎఫ్ఓ బోర్డ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు ఈపీఎఫ్ఓ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నట్లు, వారికి తక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ సభ్యుడు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఆర్ధిక మాంద్యం ఉన్నప్పటికీ 2020-21 సంవత్సరానికి వడ్డీ రేట్లను కొనసాగించడంపై కేంద్రప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. ఈపీఎఫ్‌లో ఏదైనా సమస్య ఆన్లైన్లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? ►మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి ►ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి. ►ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి. ►పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ►ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి. ►యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ►ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) ►ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి. ►ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి. ►గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు. ►ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ►దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది. చదవండి: తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే! -
భారత్ విదేశీ రుణ భారం 570 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. నాన్ సావరిన్ డెట్‌లో వాణిజ్య రుణాలు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది. -
ఉపాధి కల్పనే లక్ష్యంగా.. బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు షురూ!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి బడ్జెట్ కసరత్తు ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి ప్రీ–బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక సర్క్యులర్ ప్రకటించింది. నవంబర్ రెండవ వారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి.కోవిడ్–19 మహమ్మారి తీవ్ర సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న రెండవ వార్షిక బడ్జెట్ ఇది. మోదీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇది నాల్గవ బడ్జెట్. డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, ఎనిమిది శాతం వృద్ధి వంటి ప్రధాన లక్ష్యాలతో తాజా బడ్జెట్ రూపొందనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 2022 ఫిబ్రవరి 1న పార్లమెంటులో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చదవండి: పెట్రోల్ విషయంలో సామాన్యులకు మరోసారి నిరాశ! -
మూలధన వ్యయంలో.. ఏపీ అత్యుత్తమ ప్రగతి
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూల ధన వ్యయంలో అత్యుత్తమ ప్రగతి సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. నిర్ధారించిన లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని తెలిపింది. ఏపీ సహా 11 రాష్ట్రాలు.. ఈ ఘనత సాధించినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రూ.15,721 కోట్ల మేర అదనపు రుణం సమకూర్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అనుమతి మంజూరు చేసింది. ఇందులో ఏపీకి రూ.2,655 కోట్ల రుణానికి అనుమతి లభించింది. ఈ అదనపు రుణం ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 0.25 శాతానికి సమానంగా చేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సహాయపడతాయని తెలిపింది. ఈ మూల ధన వ్యయం భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు మరింత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాలు అలాగే, రాష్ట్రాలు అదనంగా 0.50 శాతం మేర రుణ సేకరణకు అనుమతి పొందాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రతి రాష్ట్రానికి మూల ధన వ్యయం లక్ష్యాలను నిర్ధారించింది. ఇందులో భాగంగా.. మొదటి త్రైమాసికంలో 15 శాతం, రెండో త్రైమాసికంలో 45 శాతం, మూడో త్రైమాసికంలో 70 శాతం, నాలుగో త్రైమాసికం చివరి నాటికి నూరు శాతం సాధించాల్సి ఉంటుంది. మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని సాధించినందున ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,655 కోట్ల మేర అదనపు రుణ పరిమితిని మంజూరు చేసింది. ఇక రాష్ట్రాల మూలధన వ్యయ లక్ష్యాలపై తదుపరి సమీక్ష ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహిస్తామని.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్రాలు సాధించిన మూలధన వ్యయాలను అంచనా వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మూల ధన వ్యయంతో ముడిపడిన ప్రోత్సాహక అదనపు రుణాన్ని లక్ష్లా్యలను సాధించిన రాష్ట్రాలకు తదుపరి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించింది. అప్పులపై విపక్షాలు, ఎల్లో మీడియాది దుష్ప్రచారమే అప్పులపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒట్టి బూటకమని కేంద్రం చేసిన ఈ ప్రకటన రుజువు చేసింది. మరింత ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతివ్వడంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవంలేదని స్పష్టమవుతోంది. కేంద్ర నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు రూఢీ అయినట్లయింది. -
ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి. ‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది. -
రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్ మొత్తం రూ.3,398గా ఉంది. అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్‌ధన్ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు. చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ -
రుణానికి బ్యాంకు గ్యారంటీగా బీమా బాండ్లు!
ముంబై: బ్యాంకు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా ఇన్సూరెన్స్ బాండ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ సందర్భంగా సోమనాథన్ ఈ ప్రకటన చేశారు. బ్యాంకుల వద్ద రుణ సాయాన్ని పొం దేందుకు పలు సందర్భాల్లో బ్యాంకు గ్యారంటీలు నమర్పించాల్సి వస్తుంది. ఈ గ్యారంటీ కింద బీమా బాండ్లను అనుమతిస్తే.. రుణాలు పొందడం మరింత సులభం కానుంది. చదవండి : 'నిధి' కంపెనీల పట్ల జాగ్రత్త, హెచ్చరించిన ప్రభుత్వం -
ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. కేంద్రం సీరియస్
Glitches in New I-T Portal: న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష ‘కొత్త ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించి 2.5 నెలలు అయిపోతున్నప్పటికీ పోర్టల్‌లో సమస్యలను ఇంకా ఎందుకు పరిష్కరించలేదనే అంశంపై ఆగస్టు 23న (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆగస్టు 21 నుంచి ఏకంగా పోర్టల్ అందుబాటులోనే లేదు‘ అని ఆదాయ పన్ను శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. మరోవైపు, నిర్వహణ పనుల కోసం ట్యాక్స్ పోర్టల్ అందుబాటులో ఉండదని ట్విటర్లో శనివారం ఇన్ఫోసిస్ ట్వీట్ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్డేట్ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్ చేసింది. అప్పుడు జీఎస్టీ, ఇప్పుడు ఐటీ.. అటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఅండ్‌బీ) కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది. మొదటిది జీఎస్టీ పోర్టల్ కాగా ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదు. దీనితో కంపెనీకి సామర్థ్యాలైనా లేకపోవచ్చు లేదా పనిని సజావుగా పూర్తి చేసి ఇచ్చే ఉద్దేశమైనా లేకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది‘ అని ఐటీ శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఐఅండ్‌బీ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్విటర్లో వ్యాఖ్యానించారు. చదవండి: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వివరాలు ఇలా.. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. జూన్ వరకూ రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రా జెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభు త్వం ప్రారంభించింది. అయితే, అప్పట్నుంచీ వెబ్సైటును సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఏపీ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంపుదల చేశారు. ఈ పెంపుతో 38.776 శాతానికి పింఛన్‌దారుల డీఏ పెరగనుంది. -
స్విస్ బ్యాంకుల్లో బ్లాక్‌మనీపై స్పందించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత బ్లాక్ మనీ అంశం పార్లమెంట్లో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందనే ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్. పాలా. ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపమని విన్సెంట్ పార్లమెంట్లో లేవనెత్తారు. అంతేకాకుండా బ్లాక్‌మనీ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని అడిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్‌మనీకి సంబంధించి అధికారికంగా అంచనా లేదని తెలియజేశారు. అయితే, విదేశాలలో నిల్వ చేసిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ‘‘ది బ్లాక్ మనీ ఇంపోసిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015’’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాలలో బ్లాక్‌మనీ జమచేసిన వారి కేసులపై సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. బ్లాక్‌మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు ఛైర్మన్, వైస్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు వ్యవహరిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత్ కలిసి పనిచేస్తోంది. బ్లాక్ మనీ యాక్ట్ కింద ఇప్పటివరకు 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 10 (3) / 10 (4) ప్రకారం, 2021 మే 31 వరకు 166 కేసులలో అసెస్మెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఇందులో రూ .8,216 కోట్లు రికవరీ చేశామని కేంద్రం తెలిపింది. -
ఏపీకి రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ బకాయిలపై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా 2020–21కి సంబంధించి రూ.1.10 లక్షల కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1.59 లక్షల కోట్లను రాష్ట్రాలకు అందించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈనెల 15న రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇంకా ఏపీకి 2020–21కి రూ.2,493 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,559 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణకు 2020–21కి గాను రూ.2,515 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,558 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి బ్రేక్, ఎగ్జామ్ తెలుగులో?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్ క్యాడర్ టెస్ట్ నిర్వహించేందుకు ఐబీపీఎస్ ఇటీవల ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ కేడర్‌కు స్థానిక/ప్రాంతీయ భాషల్లో టెస్ట్ నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కమిటీ తన సిఫార్సులను 15 రోజుల్లో ఇస్తుంది. ఈ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నాం’ అని వెల్లడించింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు పెట్టాలన్న డిమాండ్ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) ఉద్యోగాల భర్తీకి ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ 2019 జూలైలో పార్లమెంటులో స్పష్టం చేసింది. చదవండి: మీరేం పెద్దమనుషులయ్యా, 35వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు -
పెట్రో భారం : త్వరలోనే శుభవార్త?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించనుందా? తాజా అంచనాలు ఈ ఆశాలనే రేకెత్తిస్తున్నాయి. పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోందట. (పెట్రోలుకు తోడు మరో షాక్ ) పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్ గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో చెప్పలేను, కానీ, పన్ను భారంపై కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు టాటా మోటార్స్‌కు భారీ షాక్ -
బడ్జెట్ హల్వా బడ్జెట్ కూర్పు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ కూర్పు కార్యక్రమం సంప్రదాయ హల్వా వేడుకతో శనివారం ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ పత్రాల కూర్పులో పాల్గొంటారు. గతంలో ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లోకి వెళ్లి, బడ్జెట్ముద్రణలో పాలుపంచుకునేవారు. ఈసారి కోవిడ్ దృష్ట్యా బడ్జెట్ ప్రతుల ముద్రణను రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యులకు ఈ దఫా డిజిటల్ రూపంలో బడ్జెట్ వివరాలను అందజేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. ‘కేంద్ర బడ్జెట్‌ను మొట్టమొదటిసారిగా పేపర్‌లెస్ రూపంలో ఇస్తున్నాం. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతాం’అని ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ కఢాయిలో తయారు చేసిన హల్వాను బడ్జెట్ తయారీలో పాల్గొనే సిబ్బందికి పంచారు. నిర్మల బడ్జెట్ పత్రాలను చూసేందుకు రూపొందించిన మోబైల్ యాప్‌ను ప్రారంభించారు. బడ్జెట్æ పోర్టల్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి వివరాలను చూడవచ్చు. -
కేంద్ర బడ్జెట్ : కీలక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రక్రియకు కీలకమైన హల్వా వేడుకతో ఆర్థికమంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నార్త్ బ్లాక్‌లో నిర్వహించిన హల్వా వేడుకకు నిర్మలా సీతారామన్‌తోపాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరైనారు. (బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే) యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రతులను పేపర్‌లెస్‌గా అందిస్తున్న క్రమంలో యూనియన్ బడ్జెట్ సమాచారాన్ని సులభంగా శీఘ్రంగా అందించేందుకు వీలుగా “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్” ను ఆర్థికమంత్రి లాంచ్ చేశారు. డౌన్లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ అవుట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయాల పట్టిక, ఇతర లింక్స్ యాక్సెస్ మొదలైన వాటితో కూడిన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో దీన్ని రూపొందించారు. ఇది ఇంగ్లీష్ , హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో 'హల్వా వేడుక' నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్వా వేడుక తరువాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన ఉద్యోగులను నార్త్ బ్లాక్ నేలమాళిగలో సుమారు 10 రోజులు లాక్ చేస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021-22 యూనియన్ బడ్జెట్ ప్రతులను ఈ సారి ముద్రించడం లేదు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ప్రతులను డిజిటల్ ఫార్మాట్లోనే సభ్యులకు అందించనున్నారు. అలాగే జనవరి 29న పార్లమెంట్‌కు సమర్పించే ఆర్థిక సర్వే ప్రతులను కూడా ప్రింట్ చేయడం లేదు. కాగా ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సమాచారం ప్రకారనం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. జనవరి 29 నుంచి ఫ్రిబవరి 15 వరకు తొలి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలుంటాయి..పార్లమెంట్ సమావేశాలకు ముందుగా సభ్యులంతా ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగాలపై ఆర్థికశాఖ కాకిలెక్కలు
తెలంగాణ ఉద్యమం పుట్టింది ఉద్యోగాల కోసం. 1,200 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డది తెలంగాణ వొస్తే ఉద్యోగాలొస్తాయని. తెలంగాణ వొచ్చి ఏడేండ్లు కావస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు లోనై మళ్లీ ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు (నాగులు, రవీంద్ర నాయక్). ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న పిదప ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. అప్పుడే ఉద్యమం సఫలీకృత మైనట్లు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియా మకాల గురించి కొనసాగింది. నియామకాలకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరించింది అన్నది ప్రశ్న. ప్రభుత్వ ఆర్థికశాఖ ఇచ్చిన ఉద్యోగ వివరాలను చూద్దాం. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అనుమతించిన 1,50,326 పోస్టు లకుగానూ 1,32,898 పోస్టులను నోటిఫై చేయగా అందులో 1,26,641 భర్తీ అయ్యాయనీ, మిగిలింది కేవలం 23,685 ఖాళీలు మాత్రమేననీ పేర్కొన్నారు. భర్తీ చేసినవాటిల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,594; పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుద్వారా 31,972; విద్యుత్ సంస్థల్లోని ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,972; పంచాయతీరాజ్ శాఖలో 10,763 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా; శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొంది. పోలీస్ శాఖలోని నియామకాల్లో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న హోం గార్డులు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి, అవిపోగా కొత్తగా ఉద్యోగాలు లభించింది ఎంతమందికో ఆర్థికశాఖ వివరిస్తే బాగుం డేది. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం కొత్త నియామకాల కిందకి రాదు. పంచాయతీ రాజ్‌లో శాఖాపరమైన పదోన్నతులద్వారా 11,278 పోస్టులను భర్తీచేసినట్లు చెప్తున్నరు. శాఖాపరమైన పదో న్నతులలో కిందిస్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీచేస్తేనే ఆ పోస్టులు భర్తీ అయినట్లు. కేవలం ఉద్యోగ ప్రకటనలిచ్చి తద్వారా భర్తీచేసిన నియామకాలే లెక్కలోకి వస్తాయన్న విషయం ఆర్థికశాఖకు తెలువదనుకోవాలా? పాఠశాల విద్యలో 8,463 పోస్టులు భర్తీచేసినట్లు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలోని 1,061 ఖాళీల భర్తీకి అనుమతులి చ్చినా ఇప్పటి వరకు ఒక్కపోసు ్టకూడా భర్తీ చేయలేదని తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడు టీచర్స్‌తో పాటు, హెడ్మాస్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, బోధనేతర సిబ్బం దితో కలిపి 25,000 ఖాళీలున్నట్లు లోగడ విద్యాశాఖమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. ఇందులో భర్తీ చేసింది. 8,463. చేయవలసింది 16,537. ఆర్థికశాఖ మాత్రం విద్యాశాఖలో 10వేల ఉద్యోగాల వరకే ఉంటాయంటున్నది. అదేం లెక్కో. యూనివర్సిటీలలో భర్తీ చేయమని 1,061 పోస్టులకు అనుమతులిచ్చినా ఒక్కపోస్టుకూడా భర్తీ చేయలేదంటున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ సకాలంలో బ్లాక్ గ్రాంటు, జీతాలు, పెన్షన్లు, బకాయిలివ్వని ఆర్థికశాఖ యూనివర్సిటీలపై నిందమోపడం అన్యాయం. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలకు రెండున్నర సంవత్సరాలనుండి వైస్ చాన్స్లర్లు, పాలకమండళ్లు లేవు. అలాంటప్పుడు నియామకాల ప్రక్రియ ఎలా చేపడతారో ఆర్థికశాఖనే వివరించాలి. ఒక్క యూనివర్సిటీలలోనే కాదు ఖాళీలున్నది, డిగ్రీ కాలేజీల్లో 2,730 లెక్చరర్ పోస్టులుంటే ప్రస్తుతమున్నది 1,419. ఖాళీలు 1,311. జూనియర్ కళాశాలల్లో మంజూరు అయిన పోస్టులు 5,278. ఇందులో పనిజేస్తున్న వారు 836. ఖాళీలు 4,442. మొత్తంగా ఉన్నత విద్యలోని బోధన, బోధనేతర ఉద్యోగాలన్నీ కలిపి ఉన్నవి 14,006. ఇందులో పనిచేస్తుంది మాత్రం 3,685. ఖాళీలు 10,321. యూనివర్సీటీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కళాశాలలు నడుస్తున్నది పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే అన్నది నగ్నసత్యం. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు కావస్తున్నా ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. అటెండర్, డ్రైవర్, వాచ్‌మన్, స్వీపర్, స్కావెంజర్ లాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగులు 24 లక్షల 54 వేలు. ఇందులో సాంకేతిక విద్యకు సంబంధించినవారు 5,30,128. మిగతావాళ్లు పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదోతరగతి వాళ్లు. దేశంలో నిరుద్యోగిత పోస్టు గ్రాడ్యుయేట్లలో 21.6 శాతంగా ఉంటే మనరాష్ట్రంలో మాత్రం అది ఏకంగా 33.9 శాతం. 2013– 14 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడే ముందు వీరిలో నిరుద్యోగిత 7.3 శాతం. నాలుగురెట్లకు పైగా పెరిగిందన్న మాట. దీనికి కారకులు ఎవరు? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు తోడు తాజాగా నిరు ద్యోగుల ఆత్మహత్యలు మొదలైన ఈ తరుణంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఉద్యోగాల భర్తీకై చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. ఎన్. రాంచందర్ రావు వ్యాసకర్త ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
ఫిబ్రవరి 1 న 2021 కేంద్ర బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసిన కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) మంగళవారం సిఫారసు చేసింది. బడ్జెట్ సెషనల్లో తొలి దశ సమావేశాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు జరపాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2021 ను సమర్పించనున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ మలి దశ సమావేశాలు జరుగుతాయి. అలాగే బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తరువాత ఎన్డీఏ సర్కార్‌కు ఇది తొలిబ బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సన్నాహకాల్లో తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల పెద్దలతో భేటీ అయ్యారు. అలాగే బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ 'హల్వా వేడుక', బడ్జెట్ పేపర్పత్రాలను ముద్రించే ప్రక్రియ ఉంటుంది. దీంతోపాటు ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో రూందించిన ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు విడుదల చేయడం లాంటి కీలక అంశాలు. కాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా రైతుల నిరసనలు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ లాంటి అంశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చర్చకు రానున్నాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా, డైరెక్టుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నామని కేంద్రం ప్రకటించడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. -
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు 2020 డిసెంబరు మాసంలో దుమ్మురేపాయి. కరోనా, లాక్డౌన్ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్న అంచనాల మధ్య జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించడం గమనార్హం. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లతో జీఎస్టీ ఆదాయం ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. జీఎస్టీ వసూళ్ళు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది మూడోసారి. గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారని ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. ఆర్థికమంత్రిత్వ శాఖ అందించినసమాచారం ప్రకారం డిసెంబరులో జీఎస్టీ ఆదాయం రూ. 15 1,15,174 కోట్లుగా నమోదైంది. ఇందులో సీజీఎస్‌టి 21,365 కోట్ల రూపాయలు, ఎస్‌జీఎస్‌టీరూ. 27,804 కోట్లు, ఐజీఎస్టీ రూ. 57,426 కోట్లు (దిగుమతిపై వసూలు చేసిన, 27,050 కోట్లు) సెస్, 8,579 కోట్లు (వస్తువుల దిగుమతులపై సేకరించిన 1 971 కోట్లతో సహా). నవంబరునెలకు సంబంధించి 2020 డిసెంబర్ 31 వరకు దాఖలు చేసిన జిఎస్టిఆర్-3 బీ రిటర్నులు మొత్తం 87 లక్షలుగా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. దేశీయ లావాదేవీలపై వచ్చిన ఆదాయాల కంటే వస్తువుల దిగుమతి వల్ల వచ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువగా ఉంది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా కోలుకోవడం, జీఎస్టీ ఎగవేతదారులపై కఠిన చర్యల వల్ల ఈ భారీ వసూళ్లు సాధ్యమైనట్లు వెల్లడించింది. -
పెరిగిన గ్రామీణ నిరుద్యోగం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పంటల కోతల సీజన్ ఊపందుకుంటున్నా గ్రామీణ నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో 5.86 శాతమున్న ఉపాధి లేమి, నిరుద్యోగం అక్టోబర్ నెలాఖరుకు 6.9 శాతానికి పెరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో పనిదినాలు తగ్గడమూ నిరుద్యోగం పెరుగుదలకు కారణం కావొచ్చని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. నరేగా కింద సెప్టెంబర్‌లో 26.5 కోట్ల పనిదినాలు కల్పించగా... అక్టోబర్‌లో 17.3 కోట్ల పనిదినాలకు తగ్గిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ‘ప్రస్తుతం పంట కోతలు మొదలైనందున అది కొంతమేర లేబర్ మార్కెట్‌ను ఆకర్షించే అవకాశమున్నా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సీజన్ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. తమ వృత్తి నైపుణ్యాలు, చేయగలిగే పనికి తగ్గట్టు పనులు దొరక కపోవడమూ నిరుద్యోగం పెరగడానికి కారణం కావొచ్చు’ అని ఆర్థికవేత్తలు అనూప్ మిత్ర, కేఆర్ శ్యాంసుందర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో నిరుద్యోగ శాతం (గ్రామీణ, పట్టణాల్లో కలిపి) సెప్టెంబర్‌లో 6.67 నుంచి అక్టోబర్‌లో 6.98కి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పట్టణాల్లో నిరుద్యోగ శాతం సెప్టెంబర్‌లో 8.45 నుంచి అక్టోబర్‌లో 7.15కి తగ్గింది. -
పోలవరానికి రూ.2,234.288 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,234.288 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు నిధులను బహిరంగ మార్కెట్ ద్వారా సమీకరించి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది ఆదేశాలు జారీ చేశారు. పీపీఏ నిర్ధారించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగానికి తెలియజేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేటప్పుడు పీపీఏ నిర్ధారించిన వ్యయాన్ని ఆధారంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారిస్తేనే.. రూ.2,234.288 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు గత నెల 12న త్రివేది లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడంలో జరుగుతున్న ఆలస్యం పోలవరం పనులపై పడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పీపీఏ కూడా బలపరిచింది. దాంతో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులకు విఘాతం కలగకుండా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ క్రమంలో గత నెల 12న జారీ చేసిన షరతును ఉపసంహరించుకుంది. -
రెండో విడత జీఎస్టీ పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా రెండవ దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడదుల చేసింది. మరో 6 వేల కోట్ల రూపాయలనుకేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 4.42 శాతం వడ్డీ రేటుతో అరువు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హరియానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్‌లకు ఈ మొత్తాన్ని పంపించినట్లు ఆర్థిక శాఖ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. (లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు) ప్రత్యేక విండో కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన 12,000 కోట్ల రూపాయల రుణాల్లో భాగంగా తాజా చెల్లింపులు చేయనుంది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు 6000 కోట్ల రూపాయలను రెండవ సారి విడుదల చేయనుంది. మరోవైపు రూ.1.05 లక్షల కోట్ల వద్ద అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిని తాకాయి.చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు.ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. Ministry of Finance, under its, “Special Window to States for meeting the GST Compensation Cess shortfall,” will be releasing an amount of ₹6000 cr as second tranche to 16 States and 3 Union Territories today. (1/4) Read more ➡️ https://t.co/IkTkXLiYO3@nsitharamanoffc — Ministry of Finance (@FinMinIndia) November 2, 2020 -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
పద్దు.. పొడిచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ ఏడాది రాబడులు రాని కార ణంగా బడ్జెట్‌ను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో శాఖల వారీగా అంచనాలు, రాబడులు,ఖర్చులు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చు పద్దులపై అంచనాలను సవరిం చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులు, రాబోయే 6 నెలల అంచనాలను విశ్లేషి స్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. 2020–21 బడ్జెట్ ప్రతిపాదనల్లో 15–20% రాబడి రాకపోవచ్చన్న అంచనాలతో శాఖల వారీ సవరణ ప్రతిపాదనలను రూపొం దించే పనిలో పడ్డారు. ఈ మేరకు త్వరలోనే అన్ని శాఖలకు నోట్ పంపి ఆయా శాఖల కచ్చిత ప్రతి పాదనలకు అనుగుణంగా సవరించిన అంచనాల బడ్జెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.1.30 లక్షల కోట్ల వరకు.. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,76,393 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదించిన దానికి కొంచెం అటుఇటుగా రాబడులు, ఖర్చులు ఉంటాయి. ఇంతకుముందు మూడేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే 2019–20లో 96 శాతం, 2018–19లో 75 శాతం, 2017–18లో 79 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఈసారి కరోనా ప్రభావంతో ఇది మరికొంత తగ్గి 75 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల్లో వచ్చిన రూ.63,970 కోట్లకు తోడు మరో 70 వేల కోట్లు కలిపి రూ.1.30 లక్షల కోట్లు రావచ్చని భావిస్తోంది. ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం, రూ.20 వేల కోట్ల వరకు రుణాలు, మరో రూ.5 వేల కోట్లకు పైగా ఇతర ఆదాయం కలిపి ఆ మేరకు సమకూరుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటు గత మూడేళ్ల రాబడులు పరిశీలించినా చివరి ఆరు నెలల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటలేదు. ఖర్చులు కూడా ఆ మేరకు.. ఆదాయ పరిస్థితి అలా ఉంటే.. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వరకు అనివార్య చెల్లింపులు జరపాల్సి ఉంది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.25 వేల కోట్లు, అప్పుల వడ్డీ లేకుండా రూ.7 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.14 వేల కోట్లు, పింఛన్లకు రూ.8 వేల కోట్లు, సబ్సిడీల కింద రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. ఇందులో సబ్సిడీ ఖర్చులు తగ్గించుకున్నా రూ.3 వేల నుంచి 4 వేల కోట్లే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేతిలో పెద్దగా నిధులు మిగిలే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లోనే బడ్జెట్ అంచనాలను సవరించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకోవాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇందులో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే రూ.10–15 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశముంది. ఇక ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేయలేదు. కొంతమేరకు పన్నులు పెంచడం, భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడం ద్వారా నిధుల వెసులుబాటు కలగనుంది. మరి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది.. రాబడులు పెంచుకునే దిశలో ముందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా..? వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుని ప్రభుత్వ శాఖల అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశలో బడ్జెట్ అంచనాలను సవరిస్తారా అన్నది భవిష్యత్ అవసరాలను తేల్చనున్నాయి. -
ఊరట : మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఐదు నెలల కిందట ఆత్మనిర్భర్ పేరుతో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్‌ను ప్రేరేపించేందుకు ప్రభుత్వం మరో ప్యాకేజ్‌ను ప్రకటించాలని ఆయా రంగాల నుంచి ఎదురైన విజ్ఞాపనలతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు సాగిస్తోంది. ఉద్దీపన చర్యల కోసం ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వ శాఖలు, రంగాల నుంచి పలు సూచనలు, ప్రతిపాదనలు అందాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. మరో ఉద్దీపన ప్యాకేజ్ వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యాక్రమంలో సంకేతాలు పంపారు. జీడీపీ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని మదింపు చేస్తోందని, మరో ఉద్దీపన ప్యాకేజ్‌కు అవకాశాలు మిగిలే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 10.3 శాతం పతనమవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక వృద్ధికి ఊతమిస్తూ, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చదవండి : రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్ -
మరో ఉద్దీపనకు చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు. వ్యయాలపై సీపీఎస్ఈలకు నిర్మలాసీతారామన్ సూచన ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి. తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు. -
ఉపశమనం ఇంతటితో సరి
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ జైన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్ 5న న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్ జైన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్స్టాల్మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది. -
సంస్కరణలతో దీర్ఘకాలంలో స్థిరవృద్ధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి సాయపడతాయని.. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘విధానపరమైన వాతావరణానికితోడు భాగస్వాములు అందరూ కలసి తీసుకున్న చర్యలు.. అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలియజేసింది. కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉండడం అన్నది స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని.. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీన్ని అధిగమించేలా చేస్తాయంటూ వివరించింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశంలో కరోనా కేసులు గరిష్టాలకు చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా తెరవడం అన్నవి దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది. -
ఊరట : త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించేందుకు కసరత్తు చేపడుతోంది. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతితో పాటు చిన్న వ్యాపారులను ఆదుకోవడంపై ఈసారి ప్రభుత్వం దృష్టిసారించింది. రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలోనే ఆశించవచ్చని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణియన్ ఇటీవల పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సంకేతాలను ఆయన ప్రకటన స్పష్టం చేసింది. లాక్డౌన్ ముగియడంతో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు, సేవలు అందుబాటులోకి రావడంతో తాజా ప్యాకేజ్‌తో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అత్యున్నత భేటీలను నిర్వహించడం కూడా రాబోయే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ఆశలు పెంచుతోంది. మరోవైపు ఇటీవల వెల్లడైన జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ నిస్తేజాన్ని వెల్లడించడంతో తదుపరి ప్యాకేజ్‌ను ప్రకటించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ 23.9 శాతం తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కోవిడ్-19తో అత్యధిక ప్రభావానికి గురైన దేశంగా భారత్ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన క్వార్టర్లలోనూ ఇవే సవాళ్లు ఎదురవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. చదవండి : చిన్న సంస్థలకు పెట్టుబడుల ఊతం పండుగల సీజన్ రాబోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిమాండ్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తదుపరి చర్యలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వ అధికారులు తరచూ కార్పొరేట్ నేతలతో సమావేశమవుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నారు. డిమాండ్ విపరీతంగా పడిపోయిన క్రమంలో డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి విస్పష్టంగా సూచిస్తున్నాయి. చిరు వ్యాపారులు, మధ్యతరగతికి ఊరట తాజా ప్యాకేజ్‌లో చిన్న వ్యాపారాలను కాపాడటం, మధ్యతరగతికి మేలు చేసే చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్యాకేజ్ పరిమాణం, ఏ సమయంలో ప్రకటించాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. మధ్యతరగతి వర్గంతో పాటు చిన్నవ్యాపారాలకు ఊతమివ్వాలని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. రాబోయే ఉద్దీపన ప్యాకేజ్ ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని రీతిలో సమస్యలను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యక్షంగా ఆర్థిక ఊతమిచ్చే చర్యలు తక్షణం చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు కోరుతున్నారు. -
యూపీఎస్సీ ద్వారా యథావిధిగా నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం చేసింది. కొత్త పోస్టుల బ్యాన్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటి సర్క్యులర్‌లో ‘మంత్రిత్వ శాఖలు / విభాగాలు, అటాచ్డ్ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, చట్టబద్దమైన సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో ఖర్చుల శాఖ ఆమోదంతో మినహా కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం’ అని పేర్కొన్నది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) CLARIFICATION: There is no restriction or ban on filling up of posts in Govt of India . Normal recruitments through govt agencies like Staff Selection Commission, UPSC, Rlwy Recruitment Board, etc will continue as usual without any curbs. (1/2) pic.twitter.com/paQfrNzVo5 — Ministry of Finance (@FinMinIndia) September 5, 2020 దానిలో ‘భారత ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి పరిమితి, నిషేధం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామకాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ‘సెప్టెంబర్ 04 నాటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సర్క్యులర్ పోస్టుల సృష్టి కోసం అంతర్గత విధానంతో వ్యవహరిస్తుందని, నియామకాలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు.. తగ్గించదు’ అని పేర్కొన్నది. దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోయాయని, యువతరానికి ఉపాధి కల్పనలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలను అమ్మి, కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారనీ, అయితే పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఫలితాలను ప్రకటించడం లేదని రాహుల్ ఆరోపించారు. -
ఆగస్ట్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆగస్ట్‌లో జీఎస్టీ వసూళ్లు తగ్గడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆగస్ట్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ 86,449 కోట్లుగా నమోదయ్యాయి. జులై జీఎస్టీ వసూళ్లతో (87,422 కోట్ల రూపాయలు) పోలిస్తే ఆగస్ట్ వసూళ్లు స్వల్పంగా పడిపోవడం గమనార్హం. గడిచిన ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ మొత్తంలో ఆగస్ట్ వసూళ్లు 88 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2019 ఆగస్ట్‌లో 98,202 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో వసూలైన జీఎస్టీలో కేంద్ర జీఎస్టీ 15,906 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా 21,064 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ 42,264 కోట్లు, సెస్ కింద 7215 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడిన నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇంకా చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాలని తెలంగాణ సహా పలు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. చదవండి : జీఎస్టీ బకాయిలు కేంద్రం చెల్లించాల్సిందే -
403.5 మిలియన్ ఖాతాలు.. 1.30 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలని, ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ద్వారా ఇప్పటి వరకు 403.5 మిలియన్ ఖాతాలు తెరచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ అకౌంట్లలో ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాగా సంక్షేమ పథకాల లబ్దిదారులు, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రసంగంలో భాగంగా 2014లో ఈ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. (చదవండి: ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్ధులు బాధ్యులా?) ఈ క్రమంలో ఆగష్టు 28న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటితో ఈ కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తైన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘బ్యాంకు అకౌంట్లు లేని వాళ్లకు ఖాతాలు తెరిచే లక్ష్యంతో.. ఇదే రోజు, ఆరు సంవత్సరాల క్రితం ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించాము. ఇదొక గేమ్‌ఛేంజర్ వంటిది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చింది. ఎంతో మందికి భద్రతతో కూడిన భవిష్యత్తును అందించింది. ఈ పథకంలో ఎక్కువ మంది లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ( చదవండి: స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!) బీమా సౌకర్యం పీఎంజేడీవై ఖాతాదారులందరికీ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాల కింద ఇన్పూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ బ్యాంకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, రూపే డెబిట్ కార్డు వినియోగాన్ని పెంచడం, మైక్రో క్రెడిట్ కార్డు, మైక్రో ఇన్వెస్ట్మెంట్ సౌకర్యం కల్పించడం తదితర కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది. మహిళా ఖాతాదారులు 55.2 శాతం ఇక ఆగష్టు 19న విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, పీఎండీజేడీవై అకౌంట్లలో 63.6 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా, 55. 2 శాతం ఖాతాలు మహిళలవే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో సంక్షేమ పథకాల ఫలాలను అందించడం సులభతరమైందని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా జన్ ధన్ ఖాతా అనేది జీరో అకౌంట్. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. కార్పొరేషన్ బ్యాంకులతో పాటు.. పోస్టాఫీస్‌లో కూడా ఈ అకౌంట్‌ను తెరవచ్చు. ఇందుకోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, నివాస పత్రం, రెండు ఫోటోలు ఉంటే చాలు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు ఈ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగనట్లయితే ఇది పనిచేయకుండా పోతుంది. ఇక అకౌంట్ నిర్వహణకు సంబంధించిన వివరాలకై ‘‘జన్ ధన్ దర్శక్ యాప్’’అనే మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సమీపంలోని బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, బ్యాంకు మిత్రలు, పోస్ట్ ఆఫీసు వివరాలు తెలుసుకోవచ్చు. Thanks to the Pradhan Mantri Jan Dhan Yojana, the future of several families has become secure. A high proportion of beneficiaries are from rural areas and are women. I also applaud all those who have worked tirelessly to make PM-JDY a success. #6YearsOfJanDhanYojana pic.twitter.com/XqvCxop7AS — Narendra Modi (@narendramodi) August 28, 2020 -
‘జీఎస్టీలో రాష్ట్రాల వాటా చెల్లింపుపై మెలిక’
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో జీఎస్టీ వ్యవస్ధ అమల్లోకి వచ్చిన అనంతరం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ వాటాపై తొలిసారిగా కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన వాటాపై చావుకబురు చల్లగా వినిపించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా జీఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటాను చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని అంగీకరించింది. 2019 ఆగస్ట్ నుంచి అంటే లాక్‌డౌన్‌కు ముందే జీఎస్టీ వసూళ్లలో సగమే సమకూరుతున్న పరిస్ధితి. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం, లేదా పన్ను పరిధిలోకి మినహాయించిన వస్తుసేవలను తీసుకురావడంతో దీన్ని భర్తీ చేయాలని భావించారు. ఇక జీఎస్టీ చట్టంలో పేర్కొన్న తరహాలో రెవెన్యూ షేర్ కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం చెల్లించే పరిస్ధితిలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు. పాండే ప్రకటనపై పార్లమెంటరీ కమిటీలోని విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ ఎదుట పాండే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. చదవండి : శానిటైజర్లపై 18శాతం జీఎస్టీ ఎందుకంటే..? కమిటీ తొలి భేటీకి హాజరైన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులు ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటనపై మండిపడుతున్నారు. కొద్దినెలలుగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయడం లేదని ఈ సమావేశంలో విపక్ష సభ్యులు ప్రస్తావించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ పరిస్ధితుల్లో జీఎస్టీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి పాండే చేసిన ప్రకటనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శానిటైజర్లపై 18శాతం జీఎస్టీ ఎందుకంటే..?
న్యూఢిల్లీ: శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్ ద్రావకాలు, డెట్టాల్ మాదిరే ఇన్ఫెక్షన్ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. శానిటైజర్లలో వినియోగించే పలు రకాల రసాయనాలు, ప్యాకింగ్ సామగ్రిపైనా జీఎస్టీ 18 శాతం అమల్లో ఉందంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శానిటైజర్లపై జీఎస్టీని తగ్గించినట్టయితే అది విలోమ సుంకాల విధానానికి (తుది ఉత్పత్తిపై జీఎస్టీ కంటే దాని తయారిలో వినియోగించే సరుకులపై అధిక జీఎస్టీ ఉండడం) దారితీస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకునే హ్యాండ్ శానిటైజర్లు చౌకగా మారతాయి. దీంతో దేశీయ తయారీ దారులకు ప్రతికూలంగా మారుతుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. -
మెరుగైన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా లాక్డౌన్లకు సడలింపులు ఇవ్వడంతో జూన్‌లో జీఎస్టీ వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు 90,917 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర వాటా 18,980 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా 23,970 కోట్ల రూపాయలు. ఇక ఉమ్మడి జీఎస్టీ (ఐజీఎస్టీ) 40,302 కోట్ల రూపాయలు. జీఎస్టీ స్ధూల రాబడిలో 7665 కోట్లు సెస్ కాగా వస్తువుల దిగుమతిపై 607 కోట్ల పన్ను రాబడి సమకూరింది. ఇక ఐజీఎస్టీలో 13,325 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, 11,117 కోట్ల రూపాయలు ఎస్జీఎస్టీగా ప్రభుత్వం క్లియర్ చేసింది. సెటిల్మెంట్ అనంతరం జూన్ మాసంలో కేంద్ర ప్రభుత్వం 32,305 కోట్ల రూపాయల రాబడిని, రాష్ట్రాలు 35,087 కోట్ల రూపాయల రాబడిని ఆర్జించాయి. గత ఏడాది ఇదే నెలలో ప్రభుత్వం ఆర్జించిన జీఎస్టీ రాబడిలో దాదాపు 91 శాతం తాజాగా వసూలవడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 ప్రభావంతో పాటు జీఎస్టీ రిటన్‌ల దాఖలు, పన్ను చెల్లింపులపై ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో జీఎస్టీ వసూళ్లు దెబ్బతిన్నా క్రమంగా వసూళ్లు ఊపందుకోవడం ఊరట ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 32,294 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలుకాగా, మేలో 62,009 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవడం విశేషం. చదవండి : ఇకపై పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలే! -
కోవిడ్-19 ఎఫెక్ట్ : ఖర్చుల్లో భారీ కోత..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఖర్చును తగ్గించే పనిలో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు ఉండవని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. నూతన పథకాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదనలూ పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకూ సమాచారం చేరవేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్‌తో పాటు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అమలుకే ఖర్చును పరిమితం చేస్తామని, ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తితో ప్రభుత్వ ఆర్థిక వనరులకు అసాధారణ డిమాండ్ నెలకొన్న క్రమంలో మారుతున్న ప్రాధాన్యాతలకు అనుగుణంగా వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన నోట్ పేర్కొంది. బడ్జెట్లో ప్రకటించిన కొత్త పథకాలు కూడా మార్చి 31 వరకూ నిలిచిపోతాయని తెలిపింది. ఈ నూతన నిబంధనలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలన్నా దానికి వ్యయ విభాగం అనుమతి అవసరమని ఈ నోట్ వెల్లడించింది. చదవండి : అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు -
అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వేతనాల్లో కోత : ఆర్థిక శాఖ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు కోత విధిస్తారనే వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తోసిపుచ్చింది. ఈ ప్రచారం నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఏ క్యాటగిరీకి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాల్లో కోత విధించే ఎలాంటి ప్రతిపాదననూ పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ దిశగా ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని పేర్కొంది. కాగా పెన్షన్ల జారీలోనూ ఎలాంటి కోత విధించడం లేదని, అత్యవసర సమయాల్లో వేతనాలు, పెన్షన్లను తగ్గించే ప్రసక్తి లేదని గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లలో 20 శాతం కోత విధిస్తారనే ప్రచారం సాగిందని ఇది పూర్తి అవాస్తవమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వదంతులను నమ్మరాదని సూచించింది. చదవండి : కోతల్లేవ్..ఫుల్ జీతం -
కోవిడ్-19 : సం‘పన్ను’లపై ప్రకంపనలు
న్యూఢిల్లీ : ప్రస్తుత సంక్షోభ సమయంలో అత్యంత సంపన్నులపై పన్ను విధించాలనే ప్రతిపాదనకే ప్రకంపనలు రేగుతున్నాయి. సంపన్నులపై పన్నుపోటు సూచనే ప్రభుత్వంలో ఉలికిపాటు కలిగిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే సూచనలను పరిశీలించడం, అమలు చేయతగినవి ఉంటే వాటిపై కసరత్తు జరపడం సాధారణంగా జరిగేదే. మరి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కకావికలమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యంత సంపన్నులపై వెల్త్ ట్యాక్స్‌తో పాటు కోవిడ్ -19 సెస్‌ను విదించాలన్న 50 మంది యువ ఐఆర్ఎస్ అధికారుల ప్యానెల్ సమర్పించిన విధాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సంసన్నులపై ఆదాయ పన్ను రేట్లను పెంచాలన్న ప్రతిపాదనకూ సాధ్యాసాధ్యాలను ప్రజల ముందుంచకుండానే ఆర్థిక మంత్రిత్వ శాఖ విముఖత చూపింది. ఈ నివేదిక కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉద్దేశాలను ప్రతిబింబించదని ఆదాయ పన్ను శాఖ ప్రకటన స్పష్టం చేసింది. ఐఆర్ఎస్ అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలతో ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా అనుమతి కోరలేదని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 మహమ్మారి ప్రబావాన్ని ఎదుర్కొనేందుకు ఫోర్స్ పేరిట రూపొందించిన విధాన పత్రంలో ఈ సూచనలు పొందురిచామని ఐఆర్ఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కి సమర్పించామని వారు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారులు తమ నివేదికను ట్విటర్లో పొందుపరిచారు. చదవండి : బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు పన్నుపోటుపై కలవరపాటు.. ఏడాదికి రూ కోటికి పైగా ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను రేటును 40 శాతానికి పెంచాలని, రూ 5 కోట్లు పైబడిన వార్షికాదాయంపై వెల్త్ ట్యాక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నివేదికలో పేర్కొంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ పది లక్షలు పైబడిన వారిపై 4 శాతం మేర కోవిడ్-19 సెస్‌ను విధించాలని నివేదికలో సూచించారు. కోవిడ్-19 సెస్ ద్వారా రూ 18,000 కోట్ల పన్ను రాబడి ఆర్జించవచ్చని నివేదిక వివరించింది. వీటితో పాటు పలు సూచనలను నివేదికలో ప్రస్తావించారు. సంక్లిష్ట సమయంలో దేశ విశాల ప్రయోజనాలను కాపాడటం సూపర్ రిచ్ బాధ్యతని ఐఆర్ఎస్ అధికారులు రూపొందించిన విధాన పత్రం స్పష్టం చేసింది. కీలక ప్రాజెక్టులపై వ్యయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 5 నుంచి 10 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రబుత్వం గుర్తించి సంన్నులపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన రాబడిని నిర్ధిష్ట ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వెచ్చించాలని నివేదిక కోరింది. దేశంలో 1985 వరకూ అమల్లో ఉన్న వారసత్వ పన్నును కూడా తిరిగి ప్రవేశపెట్టాలని ఈ విధాన పత్రం సూచించింది. మరోవైపు నివేదికలో ఉన్న అంశాలపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. దేశంలో ఆదాయ పన్నురేట్లు మరింత పెంచితే వినియోగం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా ప్రతిపాదనలు అమలు చేస్తే మిలియనీర్లు దేశం విడిచివెళ్లడం ఖాయమని కొందరు చెప్పుకురాగా, మరికొందరు నెటిజన్లు మాత్రం సంక్షోభ సమయంలో సూపర్ రిచ్ బాధ్యత తీసుకోవాల్సిందేనని అబిప్రాయపడ్డారు నివేదికపై నిప్పులు నివేదికలో లేవనెత్తిన అంశాలపై కీలక చర్చకు తెరలేపాల్సిన తరుణంలో ఐఆర్ఎస్ అధికారులు తమ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది క్రమశిక్షణారాహిత్యమే కాకుండా బాధ్యతారాహిత్యమని పేర్కొంటోంది. ఐఆర్ఎస్ అధికారుల ప్రవర్తనపై వారిని వివరణ కోరాలని సీబీడీటీ చీఫ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది . ఇక సూపర్ రిచ్‌పై పన్ను ప్రతిపాదనకే ఇంతటి వివాదం చెలరేగిన నేపథ్యంలో వారిపై ఎలాంటి పన్ను భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనేందుకు ఇది సంకేతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపత్కాలంలో పేదలు, ఆపన్నులను ఆదుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు వచ్చే నిర్మాణాత్మక సూచనలను కేంద్రం పరిశీలించి అర్హమైన సూచనల అమలుకు పూనుకోవాల్సి ఉంది. -
మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81శాతం మంది మహిళలున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 4 సంవత్సరాల కాలంలో రూ .16,712 కోట్ల విలువైన రుణాలు అందిచినట్టు తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చిన ఆరు పథకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధానమంత్రి జన-ధన్ యోజన (పీఎంజేడీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జెజెబీ), ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన (పీఎంఎస్బీవై) పథకాల ద్వారా మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకాలు తోడ్పడ్డాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. గత ఆరు సంవత్సరాల్లో, మంత్రిత్వ శాఖ మహిళల సాధికారత కోసం ప్రత్యేక నిబంధనలు కలిగిన వివిధ పథకాలను ప్రారంభించామని వెల్లడించింది.2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది. అలాగే ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద మొత్తం రుణగ్రహీతలలో 70 శాతం మహిళలు. కార్పొరేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు రూ .10 లక్షల వరకు రుణాలు అందించే లక్ష్యంతో పీఎంఎంవై 2015 ఏప్రిల్ 8 న ప్రారంభించింది. ఈరుణాలను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బిలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్‌బిఎఫ్‌సిలు అందిస్తాయి -
బ్యాంకింగ్ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ నెల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్‌ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది. -
ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి-సీఎం జగన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై చర్చించినట్టు తెలిసింది. సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్, బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్ జగన్ వారి దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కలిశారు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్‌కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
ఆదాయ పన్ను అధికారులపై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయ పన్ను(ఐటీ) శాఖలో అవినీతి అధికారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ల స్థాయిలో ఉన్న 12 మంది అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని 56 నిబంధనను అనుసరించి నిర్బంధంగా పదవీ విరమణ చేయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారుల్లో కొందరిపై అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు, అక్రమాస్తులు కూడగట్టిన ఆరోపణలున్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని సమాచారం. -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్‌బీఎఫ్‌సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
పడిపోయిన దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి నెల ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) డేటా 0.1 శాతంగా నమోదైంది. మే 10 న ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాల ప్రకారం దాదాపు 21 నెలల కనిష్టానికి చేరింది. ఫిబ్రవరిలో 0.1 శాతం వద్ద 20 నెలల కనిష్ట స్థాయికి చేరి ఐఐపీ డేటా తాజాగా నెగిటివ్ జోన్లో దిగజారింది మొత్తం ఇండెక్స్‌లో మూడు వంతులకు పైగా ఉత్పత్తి చేసే ఉత్పాదక ఉత్పాదకత, 0.4 శాతానికి పడిపోయింది, అయితే ఫిబ్రవరిలో చూసిన 1.2 శాతం మొఎంఎం వృద్ధితో పోలిస్తే వినియోగదారుల వృద్ధి 5.1 శాతం తగ్గింది. ప్రైవేటు రంగ పెట్టుబడుల కార్యకలాపాలను అంచనా వేసే ప్రాసిక్యూట్ కాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 8.7 శాతం పడిపోయింది. ఫిబ్రవరిలో చూసిన 4.3 శాతం వృద్ధిరేటుతో పోల్చుకుంటే వినియోగదారుల నిర్ణేతర రంగం 0.3 శాతం వృద్ధిని సాధించింది. ఫిబ్రవరితో పోలిస్తే విద్యుత్ రంగం 2.2 శాతం, మైనింగ్ రంగం వృద్ధి 0.8 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ప్రైవేటు వినియోగం తగ్గుముఖం పట్టడం, స్థిరమైన పెట్టుబడులు పెరగడం, ఎగుమతులు తగ్గడం లాంటివి 2018-19 ఆర్థిక సంవత్సరంలో మందగింపుపై ప్రభావం చూపాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధిలో మెరుగుదల, పరిశ్రమలో వృద్ధిని కొనసాగించడం సవాలుగా మారిందని తెలిపింది. పరిశ్రమల పరంగా, ఉత్పాదక రంగంలో గత ఏడాదితో పోలిస్తే మార్చి నెలలో 23 పరిశ్రమల్లో 12 సంస్థ తికూల వృద్ధిని సాధించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి గత నెలలో భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటును( 2019-20 నాటికి) 7.3 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఖజానాలో డేంజర్ ‘బిల్స్’
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పెదబాబు, చినబాబు నిమగ్నమయ్యారు. అధికారాంతమున ఖజానాను దోచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్ ముందు వరకూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించుకున్నాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ చెల్లించాల్సిందేనంటూ ఆర్థిక శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవో) సాగునీటి వ్యవహారాలను పర్యవేక్షించే సాయిప్రసాద్ ద్వారా ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. పోలింగ్ ముందు రోజు దాకా ప్రభుత్వ నిధులను రాజకీయ అవసరాలు, స్వీయ లబ్ధి కోసం యథేచ్ఛగా వాడుకున్న చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పోలింగ్ ముందు వరకూ ఉద్యోగుల వేతనాలు, వివిధ సంక్షేమ రంగాలకు ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. చంద్రబాబు చెప్పిన బిల్లులకే నిధులను చెల్లించారు. ఉద్యోగుల వేతనాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, కుటుంబ సంక్షేమం తదితర రంగాలకు చెందిన బిల్లులు పెద్ద ఎత్తున పెడింగ్‌లోనే ఉండిపోయాయి. ఈ బిల్లుల కోసం లబ్ధిదారులు ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ప్రాధాన్యతా రంగాల వారీగా చెల్లించాలి వేతనాలు చెల్లింపులు జరగలేదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యతా క్రమంలో జరగడం లేదని, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే చెల్లింపులు చేస్తున్నారనే ఫిర్యాదులు సీఎస్‌కు అందాయి. దీంతో సీఎస్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు తక్షణమే అందజేయాలని, ప్రాధాన్యతా రంగాల ప్రకారం బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును ఆఖరి ప్రాధాన్యతగా సీఎస్ నిర్ధారించారు. ఇక్కడే చంద్రబాబు అహం దెబ్బతింది. అందుకే సీఎస్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు. బిల్లుల చెల్లింపులో చంద్రబాబు ప్రాధాన్యతలకు, ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కమీషన్లు ముట్టజెప్పిన వారికే బిల్లులు ఎన్నికల ముందు కమీషన్లు కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చి నీరు–చెట్టు కింద రూ.2,104 కోట్ల బిల్లులు చెల్లింపజేశారు. ఆ నిధులన్నీ అధికార టీడీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. అలాగే ఎన్నికల ముందు హడావిడిగా గోదావరి–పెన్నా ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్‌కు రూ.491 కోట్లు ఇప్పించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి పనులకు సంబంధించి కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.419 కోట్లు ఇప్పించారు. నీరు–చెట్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించి, కమీషన్లు కాజేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా మార్చి నెలాఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నీరు–చెట్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు చెందిన రూ.9,804.27 కోట్ల బిల్లులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తెచ్చారు. మిగతా రంగాలకు చెందిన బిల్లులను ఆర్థిక సంవత్సరం మారిందని తిరస్కరించినప్పటికీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి పెండింగ్ బిల్లులుగా తీసుకొచ్చారు. పెదబాబుతో చినబాబు పోటీ కమీషన్లు కాజేసే విషయంలో చంద్రబాబుతో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీపడుతున్నారు. పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ పంచాయతీరాజ్ శాఖపై ఒత్తిడి పెంచేశారు. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటును ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీసీఏపీ అనే ఏజెన్సీలకు అప్పగించారు. ఆ ఏజెన్సీల నుంచి లోకేశ్ మనుషులు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. సంబంధిత బిల్లులను వచ్చే నెల 5వ తేదీలోగా చెల్లించేయాలని పంచాయతీరాజ్ శాఖను లోకేశ్ ఆదేశించారు. అయితే, నిధుల్లేక పంచాయతీలు ఇప్పటికే సతమతం అవుతున్నాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చెందిన రూ.768 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి ఉన్నప్పటికీ గ్రామీణ మంచినీటి సరఫరాకు చెందిన రూ.206.97 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మహిళా సంక్షేమానికి చెందిన రూ.132.93 కోట్లు, సాంఘిక సంక్షేమానికి చెందిన రూ.260.90 కోట్లు, గిరిజన సంక్షేమానికి చెందిన రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. -
పోలింగ్‌కు రెండ్రోజుల ముందు.. రూ.5,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అధికారం చివరి రోజుల్లో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో సీఎం చంద్రబాబు ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఓట్ల పథకాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు కాజేసేందుకు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో అత్యధిక వడ్డీలకు భారీ అప్పులు చేశారు. హద్దు లేకుండా అప్పుల మేళా కొనసాగిందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాదంతా చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లతోనే ప్రభుత్వం నెట్టుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పులూ పుట్టని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు దిగజార్చారని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అప్పుడూ బాబు ఇదే తీరు... ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే తరహాలో ఖజానాను ఖాళీ చేసి భారీ రెవెన్యూ, ఆర్థిక లోటులోకి నెట్టేశారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మేర బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.32,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని, తమ లెక్కల ప్రకారమే ఎంత మేర అప్పులను అనుమతించాలో నిర్ధారిస్తామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. నాలుగు నెలలకు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించినందున ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులకు అనుమతించింది. ఎన్నికల ముందు భారీగా అప్పు మరోవైపు కొత్త ఆర్థిక ఏడాదిలో సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్లో భారీ అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అయింది. అయితే ఆర్బీఐ ఏప్రిల్ 2వ తేదీన సెక్యూరిటీల విక్రయాన్ని రద్దు చేసింది. అనంతరం 9వ తేదీన సెక్యూరిటీల విక్రయానికి అనుమతించింది. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్లో రూ.5,000 కోట్ల అప్పు చేసింది. 8.18 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఒక్క నెలలోనే రూ.5,000 కోట్ల అప్పు చేయడంతో ఇక మూడు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా ఇక రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఓపెన్ మార్కెట్ రుణాలు కష్టమే! 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ఈ ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం లోపల అప్పులు చేశారా? అంతకు మించి అప్పులు చేశారా? అనే లెక్కలను కేంద్ర ఆర్థికశాఖ సేకరించనుంది. మూడు శాతానికి మించి అప్పులు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులో ఆ మేరకు కోత విధించనుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ ఆర్థిక ఏడాదిలో ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరిలో అదనంగా తీసుకున్న రూ.6 వేల కోట్ల అప్పులను ఈ ఆర్థిక ఏడాదిలో తగ్గించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు కచ్చితంగా అప్పులు పుట్టని స్థితిలోకి రాష్ట్రాన్ని గెంటేశారని స్పష్టమవుతోంది. అధిక వడ్డీలకు అప్పులపై సీఎస్ ఆరా ఇష్టానుసారంగా అధిక వడ్డీలకు అప్పులు తేవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. 8 శాతం లోపలే వడ్డీ ఉండాలని తొలుత జీవోలు జారీ చేసి ఆ తరువాత అంతకన్నా ఎక్కువ వడ్డీతో అప్పులకు ఎలా అనుమతించారని ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ప్రశ్నించారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ఏకంగా 9 శాతానికిపైగా వడ్డీలతో అప్పులు చేసేందుకు అనుమతివ్వడం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపైనా సీఎస్ ఆరా తీశారు. నియమ నిబంధనలను తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కేబినెట్ ద్వారా ఆమోదించుకోవడంతో ఏమి చేయలేకపోయామని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు చేయాలని ఆర్థిక శాఖ ప్రయత్నించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుకు అనుమతించలేదు. -
సీఎం, సీఎంవో కనుసన్నల్లో...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా సీఎం చంద్రబాబు, ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. సీఎం, ఆయన కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లో నగదు లావాదేవీల్ని నిర్వహిస్తోంది. ఓట్లు రాల్చని బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టేయాలని, కేవలం ఓట్లు రాల్చే పథకాలకోసం నిధులను అందుబాటులో ఉంచాలని స్వయంగా సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ మేరకు రెగ్యులర్ బిల్లులను పెండింగ్‌లో పెట్టాలన్న ఆయన ఆదేశాల్ని ఆర్థిక శాఖ తూచా తప్పక పాటిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రకాలకు చెందిన రూ.25,600 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టేసింది. అదే సమయంలో సీఎంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు సూచించిన వాటికే బిల్లులు చెల్లిస్తోంది. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఒకఉన్నతాధికారి ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కమీషన్లు సైతం కాజేస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఓట్లు రాల్చే పథకాలకు ఇచ్చేందుకు వీలుగా అప్పులు తీసుకోవాలని, ఎక్కువ వడ్డీకైనా వెనుకాడవద్దని సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ఆర్థికశాఖ ప్రభుత్వరంగ సంస్థలన్నింటికీ 9 శాతానికిపైగా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ రహస్య జీవోను జారీ చేసింది. అంతా పెండింగ్.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా ఆర్థికశాఖ పెండింగ్‌లో పెట్టేసింది. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించేసింది. కేంద్రం తనవాటా కింద నిధులను విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర వాటాను జమ చేసి ఆయ శాఖలకు విడుదల చేయాల్సిన రాష్ట్ర సర్కారు కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ.మూడు వేల కోట్లను ఇతర వినియోగానికి మళ్లించింది. - ఇటీవల పెద్దఎత్తున వివిధ రంగాల ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేశారు. అలా టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడానికి వీలుగా మిగతా రంగాలకు చెందిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టేశారు. కోటి రూపాయల బిల్లుకోసం మాజీ ఎమ్మెల్యే నెలరోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా బిల్లును పాస్ చేయకపోవడం దీనికి నిదర్శనం. మరోవైపు మున్సిపాలిటీల్లో రూ.50 లక్షల విలువగల చిన్న చిన్న పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకూ బిల్లులు నిలుపుదల చేశారు. ఆ కాంట్రాక్టర్లు సైతం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు. - గ్రంథాలయ సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం లాగేసుకుంది. ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థల పీడా ఖాతాల్లో ఉన్న రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు గల నిధులను వెనక్కు తీసేసుకుంది. దీంతో గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు 1,000 మందికి వేతనాలు డిసెంబర్ నుంచి రావట్లేదు. అలాగే పదవీ విరమణ చేసిన 1,500 మందికి పెన్షన్ రావట్లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కోన దేవదాస్ మంగళవారం సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శిని కలసి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న 283 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాల్ని 2016 నుంచి ఇవ్వకుండా నిలుపుదల చేశారు. - ఎన్టీఆర్ వైద్యసేవలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 1,600 మందికి సైతం జనవరి నుంచి వేతనాలివ్వకుండా నిలుపుదల చేశారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడేసి నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. - సంక్షేమ గురుకులాల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే ఔట్సోర్సింగ్ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. వారికి ఆరు నెలలనుంచి వేతనాల్ని నిలుపుదల చేశారు. ఇక విద్యాశాఖకు చెందిన ఆహార, రేషన్ బిల్లుల్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఔట్‌సోర్సింగ్‌లో వివిధ ప్రభుత్వశాఖలకు వాహనాలను నడుపుతున్న స్వయం ఉపాధి వారికీ చెల్లింపులు ఆపేశారు. - సీఎం సహాయనిధి నుంచి పేదలు, మధ్యతరగతి రోగులకు వైద్యంకోసం మంజూరు చేసే నిధులనూ పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సీఎం లేదా ఆయన కార్యాలయ అధికారులు చెప్పే బిల్లులకే ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతోంది. ఇలా చేయడం వల్ల అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ ఏముంటుందని, ఆయా రంగాలకు కేటాయించిన నిధులను ఇతర రంగాలకివ్వడం అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ను అపహాస్యం చేయడమేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఔట్సోర్సింగ్ వారికి తక్షణం వేతనాలివ్వాలి.. అసలే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలివ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఇతర అవసరాలకు నిధులివ్వడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్ర సమాఖ్య తప్పుపట్టింది. సమాఖ్య ప్రతినిధులు వెంకటరామిరెడ్డి, అర్వాపాల్ మాట్లాడుతూ తక్షణం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయాలకు చెందిన నిధుల్ని వారి ఖాతాల్లోంచి ప్రభుత్వం లాగేసుకోవడం దారుణమన్నారు. వారి ఖాతాలకు తిరిగి వారి నిధులను ప్రభుత్వం తక్షణం జమ చేయాలని డిమాండ్ చేశారు. -
ఈఎస్ఐలో అమ్మకానికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో భారీ అవినీతికి తెరలేచింది. ఈఎస్ఐలో ఉన్న ఖాళీ పోస్టులను అమ్మి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ఓ కాంట్రాక్టర్‌తో కలిసి మంత్రి ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా మొత్తం 1,152 పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేకాకుండా వారితో అడ్వాన్సు రూపేణా మంత్రి భారీ మొత్తం తీసుకున్నట్టు సమాచారం. నాలుగున్నరేళ్లు ఒక్క పోస్టునూ భర్తీ చేయకుండా మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా జేబులు నింపుకునేందుకు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్లీ కుదరదని తెలుసుకున్న నేతలు ఆదరాబాదరా కేబినెట్ పెట్టామని చెప్పి ఆర్థిక శాఖ అభ్యంతరాలను కూడా కాదని నేడో రేపో జీవో ఇప్పించుకోబోతున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈనెల 8వ తేదీన (శుక్రవారం) కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం పొందామని బయటకి చెప్పారు. అయితే ఆ సమావేశంలో ఎలాంటి ఆమోదం పొందలేదు. ఈనెల 9, 10 (శనివారం, ఆదివారం) తేదీల్లో సదరు మంత్రి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఆర్థిక శాఖ తిరస్కరించిన ఫైలును కాకుండా మరో ఫైలును సృష్టించి తెరచాటు మంతనాలు చేశారు. కేబినెట్ ఆమోదం పొందినట్టు నకిలీ రిజల్యూషన్ నెంబర్ సృష్టించారు. మొత్తం పోస్టులను ఔట్సోర్సింగ్ కింద నియమించుకునేలా ఆమోదం పొందిన అనంతరం ఈ ఫైలు కార్మిక శాఖకు వెళ్లింది. నేడో రేపో ఈ పోస్టులను నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే జాస్తి వీరాంజనేయులు అనే కాంట్రాక్టర్‌కే ఈ నియామక బాధ్యతలు అప్పజెబుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మంత్రికి అత్యంత సన్నిహితుడైన ఆ కాంట్రాక్టర్ ప్లాన్ ప్రకారమే ఈ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా జాస్తి వీరాంజనేయులు ఈఎస్ఐ కి చెందిన 78 డిస్పెన్సరీలతో పాటు ప్రాంతీయ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నారని, తాజాగా నియామకాలకు సంబంధించి కూడా రంగంలోకి దిగారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో చిన్న కేడర్ పోస్టులను ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, వైద్యుల పోస్టుకు రూ.5లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వసూలుకు సిద్ధమయ్యారు. ఇలా సుమారు రూ.23.04 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆర్థిక శాఖ తీవ్రంగా వ్యతిరేకించినా... కార్మికరాజ్యబీమా సంస్థ పోస్టుల నియామకంపై ఆర్థిక శాఖకు కొన్ని నెలల క్రితం ప్రతిపాదనలు పంపించారు. ఇందులో 130 మంది వైద్యులు, 400 మంది పారామెడికల్ సిబ్బంది, 622 మంది స్వీపర్లు/అటెండర్లుకు ప్రతిపాదన పంపిస్తే ఆర్థిక శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. వాస్తవానికి కార్మికులకు నిధులు చెల్లించడంతో రాష్ట్రం 1/8వంతు మాత్రమే భరిస్తుందని, మిగతా నిధులు అంటే 7/8 వంతు కేంద్రం భరిస్తుందని, కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోందని, దీనికి ఆమోదం తెలుపలేమని చెప్పింది. పైగా సెక్యూరిటీ, స్వీపర్లు, శానిటేషన్ సిబ్బందిని ఎప్పుడూ ప్రభుత్వం నియమించదని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేస్తుందని, కానీ ఇక్కడ ప్రభుత్వమే సిబ్బంది నియామకం చేస్తుందని ఫైలులో పేర్కొన్నారని ఆర్థిక శాఖ ఆక్షేపించింది. ఆ ఫైలును వ్యతిరేకించడంతో నెలన్నర తర్వాత మళ్లీ ఫైలును మార్చి పెట్టారు. అప్పుడు కూడా ఆర్థిక శాఖ తిరస్కరించింది. దీంతో మంత్రితో పాటు ఆ శాఖ అధికారులు అడ్డదారిలో అనుమతులు తెచ్చుకున్నారు. నియామకాలు ఎలా చేస్తారో నాకు తెలియదు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పనిచేయడానికి 1,100 పైగా పోస్టులకు ప్రతిపాదన పంపిన విషయం నిజమే. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి నడుచుకుంటాం. పోస్టులన్నీ ఔట్సోర్సింగ్ కిందే నియమించే విషయం మాత్రమే తనకు తెలుసు. మిగతా విషయాలు నాకు తెలియవు. –డా.విజయకుమార్, డైరెక్టర్, ఈఎస్ఐ -
మరో రూ. 27,380 కోట్లు ఇవ్వండి..
న్యూఢిల్లీ: రిస్కులు, రిజర్వుల పేరిట గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తన వద్ద అట్టే పెట్టుకున్న రూ. 27,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్‌ను(ఆర్బీఐ) కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. 2016–17లో ఆర్బీఐ రూ. 13,190 కోట్లు, 2017–18లో రూ. 14,190 కోట్లు రిస్కులు, రిజర్వుల కింద ఆర్బీఐ పక్కన పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిధులను ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్రం కోరినట్లు వివరించాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం మొండిబాకీలు, అసెట్స్ తరుగుదల మొదలైన వాటన్నింటికి కేటాయింపులు పోగా మిగిలే లాభాలను కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. జూలై–జూన్ ఆర్థిక సంవత్సర విధానాన్ని పాటించే ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కేంద్రానికి రూ. 40,000 కోట్లు బదలాయించింది. ఈసారి ఆర్బీఐ నుంచి రూ. 28,000 కోట్ల మేర మధ్యంతర డివిడెండ్ కూడా రాగలదని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఇటీవలే పేర్కొన్నారు. దీనికి ఆర్బీఐ బోర్డు ఆమోదముద్ర వేస్తే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 68,000 కోట్ల మేర మిగులు నిధులను కేంద్రానికి బదలాయించినట్లవుతుంది. -
బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ
-
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూష్ గోయల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దాంతో కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన గోయల్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పియూష్ గోయల్ రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా ఉండగా, ఇప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. గతేడాది జైట్లీ మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్నప్పడు కూడా ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా వంద రోజులపాటు గోయల్ ఉన్నారు. ఈసారి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సరిగ్గా 9 రోజుల ముందు ఆర్థిక శాఖ బాధ్యతలు గోయల్‌కు దక్కడం గమనార్హం. జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టే వరకు గోయల్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారనీ, జైట్లీ మంత్రిగా కొనసాగనున్నప్పటికీ ఆయనకు ఏ శాఖలూ ఉండవని రాష్ట్రపతి భవన్ నుంచి బుధవారం విడుదలైన ఒక ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. -
పీయూష్ గోయల్‌కు అదనపు బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతుండటంతో ఆ శాఖ తాత్కాలిక బాధ్యతలను గోయల్ చూసుకోనున్నారు. పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. జైట్లీ తిరిగి బాధ్యతల్లో చేరే వరకు గోయల్ ఈ బాధ్యతలను చేపట్టనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంగతి తెలిసిందే. -
బడ్జెట్ కార్యక్రమాలు షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించిన కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఆర్థికశాఖ కార్యాలయంలో సోమవారం హల్వా వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఈ ప్రీ బడ్జెట్ వేడుకను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి మధ్యంతర బడ్జెట్ కాగితాల ముద్రణ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పొన్ రాధకృష్ణన్, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్ గార్గ్ పాల్గొన్నారు. హల్వా వేడుక ప్రతి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే. బడ్జెట్ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. 1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించే వారు. కానీ అక్కడ అవి లీక్ కావడంతో దానిని మింట్ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్‌బ్లాక్‌లోని బేస్మెంట్కు మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది. బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వశాఖలోని కంప్యూటర్లలో ఈమెయిల్ సౌకర్యాన్ని బ్లాక్ చేస్తారు. బడ్జెట్‌కు కొన్ని రోజుల మందు పీఐబీ అధికారులను అక్కడికి అనుమతిస్తారు. వారు బడ్జెట్ తర్వాత చేయాల్సిన పత్రికా ప్రకటనలను పరిశీలిస్తారు. మరోవైపు ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అరుణ్‌జైట్లీ అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి
న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రానికి 75%కి పైగా వాటా ఉండటం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25% ఉండాలి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఇప్పటికే క్యూఐపీ ద్వారా రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53% నుంచి తగ్గుతుంది. సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
సైనికుల డిమాండ్‌కు మొండిచేయి
సాక్షి,న్యూఢిల్లీ : సాయుధ దళాలు దీర్ఘకాలంగా కోరుతున్న సైనిక సేవల వేతనం (ఎంఎస్పీ)పెంపు డిమాండ్‌ను కేంద్రంతోసిపుచ్చింది. సైన్యంలో జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీఓ) సహా 1.12 లక్షల సైనిక సిబ్బందికి ఎంఎస్పీ పెంచాలని సైనికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కాగా తమ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంపై ఆర్మీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరతాయని అధికారులు చెబుతున్నారు. అయితే సైనిక సేవల వేతనం నెలకు రూ 5,500 నుంచి రూ 10,000కు పెంచితే ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 610 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జేసీఓలు, జవాన్లకు నెలకు రూ 5,200ను ఎంఎస్పీగా ఏడవ వేతన సంఘం ఖరారు చేయగా, లెఫ్టినెంట్ , బ్రిగేడియర్ ర్యాంకుల మధ్య అధికారులకు రూ 15,500 ఎంఎస్పీని నిర్ణయించింది. జేసీఓలు తాము గెజిటెడ్ అధికారులమని (గ్రూప్ బీ), సైనిక దళాల్లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా అధిక ఎంఎస్పీ నిర్ణయించాలని ఎంతోకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిద దళాధిపతుల దృష్టికి తీసుకువెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
ఆర్బీఐ సొమ్ము కోరలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ మిగులు నిల్వల నుంచి రూ 3.6 లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలను కేంద్రం శుక్రవారం తోసిపుచ్చింది. ఆర్బీఐ నిల్వల నుంచి సొమ్మును తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని సాగుతున్న ప్రచారం నిరాధారమని, ఇవి కేవలం ఊహాగానాలేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆర్బీఐ నిల్వలను బదిలిచేయాలన్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆర్బీఐ కోసం తగిన ఆర్థిక మూలధన కార్యాచరణ కసరత్తు కేవలం ప్రతిపాదన దశలో ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్రవ్య లోటును 5.1 శాతం నుంచి విజయవంతంగా నియంత్రిస్తూ వస్తోందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గిస్తామన్నారు. కాగా ఆర్బీఐ వద్దనున్న రూ 9.59 లక్షల కోట్ల నుంచి రూ 3.6 లక్షల కోట్లను బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనే ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభనకు కేంద్రబిందువని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవస్ధలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలతో విరుచకుపడింది. -
జీఎస్టీ రిటర్నుల గడువు 25 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో 2017 జూలై–2018 మార్చి కాలానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందాలనుకునే వ్యాపార సంస్థలు ఈ నెల 25 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి గడువు ఈ నెల 20వరకే ఉండటం పట్ల వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) పేర్కొంది. ‘‘ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీఆర్–3బి దాఖలు గడువును అక్టోబర్ 25వరకు పొడిగింపు ఇవ్వడం జరిగింది’ అని సీబీఐసీ తెలిపింది. గడిచిన నెలకు సంబంధించి జీఎస్టీఆర్–3బిని మరుసటి నెల 20వరకు దాఖలు చేయాలన్నది నిబంధన. ఇక జీఎస్టీలోకి ఇటీవలే వచ్చి చేరిన వారు, 2017 జూలై–2018 మార్చి కాలానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31వరకు లేదా వార్షిక రిటర్నులు దాఖలు చేసే వరకు... వీటిలో ఏది ముందు అయితే అంతవరకు గడువు ఉంటుందని సీబీఐసీ తెలిపింది. -
ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం..!
న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్క సారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేచ్ఛ ఉంటుందని, ఇక ఓఎన్జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ భారాన్ని భరించాలని కేంద్రం అడగబోదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు ఎగియడంతో కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో రూ. 1.50 ఎక్సయిజ్ సుంకాల తగ్గింపు రూపంలో ఉండగా, మిగతా రూ.1 భారాన్ని భరించాలంటూ చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దీంతో గురువారం ఆయిల్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్ 19 శాతం, బీపీసీఎల్ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో చివరికి హెచ్‌పీసీఎల్ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి. -
తిరిగి బాధ్యతల్లోకి జైట్లీ!
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్‌జైట్లీ తిరిగి గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటపాటు నిర్వహించిన సమావేశంలో వ్యయ కార్యదర్శి ఏఎన్ ఝా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 రోజుల తర్వాత... కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ఏప్రిల్ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నిర్వహించారు. పోర్ట్‌ఫోలియో లేనప్పటికీ క్యాబినెట్ మంత్రిగానే ఆయన కొనసాగినందువల్ల, ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పని ఉండదు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు సిబ్బందితో జైట్లీ వైట్ టాటా సఫారీలో నార్త్‌బ్లాక్‌కు చేరుకున్నారు. సీనియర్ సహచరులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్నింగ్
సాక్షి, ముంబై : రూ 50 కోట్లకు మించిన మొండి బకాయిల ఖాతాల్లో అక్రమాలపై తనిఖీ చేయాలని లేనిపక్షంలో నేరపూరిత కుట్ర అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిధులను దారిమళ్లించారనే ఆరోపణలతో భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను తీవ్ర నేరాల విచారణా కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు బ్యాంకర్లను హెచ్చరించింది. ఆయా ఖాతాల్లో దర్యాప్తు సంస్థలు అక్రమాలను వెలికితీస్తే వీటిని సకాలంలో గుర్తించడంలో విఫలమైన బ్యాంకర్లపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 120 బీ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిఫాల్ట్ ఖాతాల్లో నిధుల దారిమళ్లింపును దర్యాప్తు ఏజెన్సీలు గుర్తిస్తే ఆయా బ్యాంక్‌లపై చర్యలు తప్పవని స్పష్టం చేశాయి. కాగా నిధుల దారి మళ్లింపు సహా అక్రమాలకు పాల్పడి దివాలా చట్ట ప్రక్రియలో ఉన్న దాదాపు పన్నెండు కంపెనీలపై బ్యాంకులు, దర్యాప్తు సంస్ధలు దృష్టిసారించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 8 లక్షల కోట్లకు పైగా రుణ బకాయిలు, మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. పీఎన్బీలో రూ 14,000 కోట్ల స్కామ్, నీరవ్ మోదీ వ్యవహారం సహా పలు స్కాంలతో బ్యాంకింగ్ రంగం కుదేలైన క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్రమత్తం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. -
పన్ను రిటర్నులు : వేతన జీవులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : వేతన జీవులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ తుది గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘ఈ విషయాన్ని పరిశీలించిన మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును 2018 జూలై 31 నుంచి 2018 ఆగస్టు 31కు పొడిగించడం జరిగింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కాగ, గత అసెస్మెంట్ ఇయర్ చివరి వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ 2018-19 అసెస్మెంట్ ఇయర్లో జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234ఎఫ్ ను జత చేర్చారు. దీంతో సెక్షన్ 139(1)లో నిర్దేశించిన తుది గడువుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటోంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరపు పన్ను రిటర్నులను 2018 జూలై 31 తర్వాత, 2018 డిసెంబర్ 31కు ముందు దాఖలు చేస్తే పన్ను చెల్లింపుదారులు కేవలం 5000 రూపాయల జరిమానా మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒకవేళ 2019 జనవరి 1 తర్వాత దాఖలు చేస్తే, ఈ జరిమానా రూ.10వేలకు పెరుగుతుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే, ఈ జరిమానా మొత్తం వెయ్యి రూపాయలను మించదని చెబుతున్నారు. -
ఆ వాటాలు... ప్రత్యేక ఫండ్‌లోకి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల అమలుకు కేంద్రం కసరత్తు చే స్తోంది. ఇందులో భాగంగా పది ప్రభుత్వ రంగ సంస్థల్లోని షేర్లను స్పెషల్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు (ఎస్‌ఎన్‌ఐఎఫ్) బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ రూపొందిస్తున్న ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంస్థల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ కనీసం 25 శాతం ఉండాలన్న సెబీ నిబంధన అమలుకు వాస్తవానికి 2017 ఆగస్టు 21తో గడువు ముగిసింది. అయితే, సెబీ దీన్ని ఆ తర్వాత మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ డెడ్‌లైన్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థల్లో వాటాల విక్రయం సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆ షేర్లను బదలాయించాలని భావిస్తోంది. లిస్టులోని కంపెనీలవే .. సెబీ నిబంధనల ప్రకారం కేంద్రం తన వాటాలను 75 శాతానికి తగ్గించుకోవాల్సిన పది కంపెనీల్లో కోల్ ఇండియా, ఎంఎంటీసీ మొదలైనవి ఉన్నాయి. ఐటీడీసీ, ఎంఆర్‌పీఎల్, హిందుస్తాన్ కాపర్, ఎన్ఎల్సీ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్), ఎస్‌జేవీఎన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ), కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐవోఎస్‌ఎల్), మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఏఎంకే నిర్ణయాధికారం .. ఆర్థిక శాఖ రూపొందిస్తున్న నోట్ ప్రకారం చూస్తే.. ఏయే సంస్థల్లో వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించాలనే దానిపై డిజిన్వెస్ట్‌మెంట్ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి కోల్ ఇండియాలో 78.32 శాతం, ఎన్ఎల్సీలో 84.04 శాతం వాటాలు ఉన్నాయి. వీటిల్లో వాటాల విక్రయం కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే రోడ్‌షోలు నిర్వహిస్తోంది. ఇది కుదరని పక్షంలో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆయా వాటాల బదలాయింపుపై ఏఎం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో సెబీ నిర్దేశించిన పది శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల అమలు కోసం 2013లో అప్పటి ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఏర్పాటు చేసింది. అప్పట్లో ఖాయిలాపడిన ఆరు సంస్థలు.. ఫ్యాక్ట్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్ మాన్యుఫాక్చరింగ్, హెచ్ఎంటీ, స్కూటర్స్ ఇండియా, ఆండ్రూ యూల్ అండ్ కంపెనీ, ఐటీఐల్లో 10 శాతం వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించింది. తాజాగా కొత్త నిబంధనలకు డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో మరికొన్ని సంస్థల్లో మరిన్ని వాటాలను దీనికి బదలాయించాలని యోచిస్తోంది. స్వతంత్ర ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ నిర్వహణలో ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఉంటుంది. ఇందులోకి బదిలీ అయిన షేర్లను అయిదేళ్ల వ్యవధిలోగా విక్రయించాల్సి ఉంటుంది. తద్వారా వచ్చిన నిధులను సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వినియోగిస్తుంది. -
పీయూష్ గోయల్ (ఆర్థికమంత్రి) రాయని డైరీ
‘అన్నీ ఒక పెట్టు. ఇదొక్కటీ ఒక పెట్టు’ అని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు అరుణ్ జైట్లీ నా చేతిలో చెయ్యేసి ధైర్యం చెప్పడం నాకింకా గుర్తుంది. నెల క్రితం ఆర్థిక శాఖ అప్పగింతలప్పుడు ఆయన నాతో ఆ మాట అన్నారు. ఎవరైనా ధైర్యం చెప్పడానికి భుజం మీద చెయ్యేస్తారు. జైట్లీ నా చేతిమీద చెయ్యి వేశారు! తర్వాత అనిపించింది, ఆయన నాకు ధైర్యం చెప్పలేదు, తనకు ధైర్యం చెప్పుకున్నారని. సుబ్రహ్మణ్యస్వామికి భయపడి ఆర్థిక శాఖను మధ్యలోనే వదిలేస్తానేమోనని ఆయన భయం.ఆపరేషన్ థియేటర్లోకి వెళుతున్న వాళ్లతో ఎవరైనా ధైర్యంగానే మాట్లాడాలి. నేనూ ధైర్యంగానే మాట్లాడాను. ‘ఆర్థిక శాఖను వదిలేయను జైట్లీజీ. మీరు తిరిగొచ్చేవరకు చేతిలోనే ఉంచుకుంటాను’ అన్నాను.. ఆయన చేతిలోంచి నా చేతిని తీసేసుకుంటూ. డాక్టర్లు లోపలికి తీసుకెళుతుంటే, మళ్లీ నన్ను దగ్గరికి పిలిపించుకున్నారు జైట్లీ. వెళ్లాను. నాతో ఏం చెప్పకుండా డాక్టర్ల వైపు చూశారు. నన్ను దగ్గరకు రమ్మన్నారంటే, వాళ్లను దూరంగా వెళ్లమంటున్నారని డాక్టర్లు అర్థం చేసుకుని పక్కకు వెళ్లిపోయారు. ‘‘చెప్పండి జైట్లీజీ’’ అన్నాను. ‘‘ఎయిమ్స్ డాక్టర్లలో మార్పు కనిపిస్తోంది గోయల్. పేషెంట్లని నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోగలుగుతున్నారు’’ అన్నారు జైట్లీ నవ్వుతూ. నేనూ నవ్వేందుకు ట్రై చేసి, ‘‘చెప్పండి జైట్లీజీ.. ఎందుకో నన్ను దగ్గరకు రమ్మన్నారు..’’ అన్నాను. అప్పటికే నేను ఆర్థిక శాఖను డీల్ చేయబోయే టెన్షన్లో ఉన్నాను. ‘‘ఎవరైనా చేతిలో చెయ్యి వేసినప్పుడు, వేసినవాళ్లే తీసేవరకు మనం ఆగాలి గోయల్. ముందే మనం మన చేతిని తీసేసుకోకూడదు’’ అన్నారు జైట్లీ. ‘‘అయ్యో.. జైట్లీజీ, అది నేను తప్పనుకోలేదు’’ అన్నాను. ‘‘పర్లేదు గోయల్. పిల్లవాడివి కదా!’’ అన్నారు.. మరికాస్త దగ్గరగా రమ్మన్నట్లు సైగ చేస్తూ. వెళ్లాను. ‘‘చేతిని వదిలించుకో. కానీ చేతిలో ఉన్నదాన్ని వదులుకోకు’’ అన్నారు జైట్లీ. ఆపరేషన్ అయ్యాక కూడా జైట్లీ తన శాఖను తను తీసుకోవడం లేదు. కనిపించి నప్పుడు మాత్రం నవ్వి, ‘బాగున్నావా?’ అని అడుగుతున్నారు. ఇంటి బయట అరుపులు వినిపిస్తు న్నాయి!! బాల్కనీలోకి వెళ్లి చూశాను. రాహుల్, ఏచూరి, స్వామి! చేతుల్లో కాగితా లున్నాయి. వాటిని ఊపుతూ అరుస్తున్నారు. ‘మోదీ బయటికి రా’ అని రాహుల్, ఏచూరి అరుస్తున్నారు. ‘అథియా బయటికి రా’ అని స్వామి అరుస్తున్నాడు. స్విస్ బ్యాంకులో మన వాళ్ల డబ్బు ఎందుకంత పెరిగిందో చెప్పాలట! డిమాండ్ చేస్తున్నారు. రాహుల్, ఏచూరి డిమాండ్ చెయ్యడంలో అర్థముంది. స్వామి ఎందుకు డిమాండ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆయన మా పార్టీ మనిషి. అథియా మా ఫైనాన్స్ సెక్రెటరీ. అయినా డిమాండ్ చేస్తున్నాడు! జైట్లీ అన్నది నిజమే. అన్నీ ఒక పెట్టు, ఆర్థిక శాఖ ఒక పెట్టు. మాధవ్ శింగరాజు -
'28 శాతం జీఎస్టీని తొలగించండి'
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారుగా గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేసిన అరవింద్ సుబ్రమణియన్ ఓ పెద్ద డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) రూపాన్ని సులభతరం చేసేందుకు అత్యధిక శ్లాబు అయిన 28 శాతాన్ని తొలగించాలని అరవింద్ సుబ్రమణియన్ డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని ఉత్పత్తులు, సర్వీసులపై ఒకే విధమైన సెస్ రేటును కొనసాగించాలని కూడా కోరారు. ‘28 శాతం రేటును తొలగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సెస్‌లు ఉండాలి. కానీ సెస్‌ల రేట్లన్నీ ఒకే విధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు జీరోగా, 3 శాతంగా(బంగారంపై), 5 శాతంగా, 12 శాతంగా, 18 శాతంగా, 28 శాతంగా ఉన్నాయి. వీటిని హేతుబద్ధం చేయాల్సినవసరం ఉంది. తొలుత 28 శాతం రేటును తొలగించాలి’ అని సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గత వారం క్రితమే సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో తనకు మనవడు/మనవరాలు పుట్టబోతున్నారని, ఈ క్రమంలోనే తాను కుటుంబంతా సమయం కేటాయించడానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఏడాది వ్యవధిలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారు వైదొలగడం ఇది రెండో సారి. -
పెన్షన్ పరిమితి నెలకు రూ.10 వేలకు పెంపు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక లాంచ్ చేసిన పథకం అటల్ పెన్షన్ యోజన. 60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీనిని 2015-16 బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఈ పథకం కింద ఇక నుంచి నెలకు 10 వేల రూపాయలు పొందవచ్చు. ఈ పరిమితిని 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద నెలకు 5000 రూపాయల వరకే ప్రభుత్వం ఆఫర్ చేసేది. అనధికారిక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పెన్షన్ స్కీమ్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం కనుక అమల్లోకి వస్తే, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, గడువు అనంతరం నెలకు 10వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు. అటల్ పెన్షన్ యోజన కింద అందించే పెన్షన్ విలువ పెరగాల్సి ఉందని ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ మాద్నెష్ కుమార్ మిశ్రా చెప్పారు. పెన్షన్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నెలకు పెన్షన్‌ను రూ.10వేల వరకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద నెలకు అందించే పెన్షన్ ఐదు శ్లాబుల్లో ఉంది. ఈ విషయంపై మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, 60 ఏళ్ల తర్వాత అందించే రూ.5000 పెన్షన్, వచ్చే 20-30 ఏళ్లకు సరిపోదని పేర్కొన్నట్టు మిశ్రా చెప్పారు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. మూడు రకాల పద్ధతుల్లో ఏపీవైకి చెల్లించవచ్చు. ఒకటి నెలవారీ, రెండు త్రైమాసికం, మూడు అర్థ సంవత్సరంలో ఈ పెట్టుబడులు పెట్టవచ్చు. పెన్షన్ పెంపుతో పాటు మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పెన్షన్ రెగ్యులేటరీ, ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపింది. ఏపీవైకి ఆటో ఎన్రోల్మెంట్, ఈ స్కీమ్‌లో ప్రవేశానికి గరిష్ట వయసును 50 ఏళ్ల వరకు పెంచడం. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 40 ఏళ్లే గరిష్ట వయసుగా ఉంది. మరో 10 ఏళ్ల పెంపుతో సబ్‌స్క్రైబర్ బేస్‌ను మరింత పెంచవచ్చని పెన్షన్ రెగ్యులరీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్ పథకానికి 1.02 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2017-18లో కొత్తగా 50 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు.