న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్‌బీఐ, బ్యాంకింగ్ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి.
ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment