
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన)
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్‌ఆర్‌ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్)
ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!)
Comments
Please login to add a commentAdd a comment