rates
-
మీకు ఆ అలవాట్లు ఉంటే జేబుకు చిల్లే.. నిర్మలమ్మ చేతిలో ట్యాక్స్ అస్త్రం
-
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. -
బీసీ బాలుల వసతిగృహంలో 13 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
-
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మరింత రాబడి!
ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు వివిధ కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూలై 24 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు తర్వాత, బ్యాంక్ ఎఫ్డీ గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతంగా ఉన్నాయి.పెరిగిన ఎఫ్డీ రేట్లు ఇవే..2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల కాలవ్యవధి డిపాజిట్‌పై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు అంటే 7.15% నుంచి 7.35% వరకు పెంచింది. అలాగే 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల కాలవ్యవధిపై నా 20 బేసిస్ పాయింట్లు 7.20% నుంచి 7.40% కి పెంచింది. రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ రేట్లుటెన్యూర్ సాధారణ పౌరులకు సీనియర్ సిటిజన్లకు 7-14 రోజులు 3.00% 3.50%15-29 రోజులు 3.00% 3.50%30-45 రోజులు 3.50% 4.00%46-60 రోజులు 4.50% 5.00%61 - 89 రోజులు 4.50% 5.00%90 రోజులు < = 6 నెలలు 4.50% 5.00%6 నెలలు 1 రోజు < = 9 నెలలు 5.75% 6.25%9 నెలల 1 రోజు నుంచి < 1 సంవత్సరం వరకు 6.00% 6.50%1 సంవత్సరం నుండి <15 నెలల వరకు 6.60% 7.10%15 నెలల నుండి <18 నెలల వరకు 7.10% 7.60%18 నెలల నుండి <21 నెలల వరకు 7.25% 7.75%21 నెలలు - 2 సంవత్సరాలు 7.00% 7.50%2 సంవత్సరాల 1 రోజు నుండి < 2 ఏళ్ల 11 నెలల వరకు 7.00% 7.50%2 ఏళ్ల 11 నెలలు - 35 నెలలు 7.35% 7.85%2 ఏళ్ల 11 నెలల 1 రోజు < = 3 సంవత్సరాలు 7.00% 7.50%3 ఏళ్ల 1 రోజు నుండి < 4 ఏళ్ల 7 నెలల వరకు 7.00% 7.50%4 ఏళ్ల 7 నెలలు - 55 నెలలు 7.40% 7.90%4 ఏళ్ల 7 నెలలు 1 రోజు < = 5 సంవత్సరాలు 7.00% 7.50%5 ఏళ్ల 1 రోజు - 10 ఏళ్లు 7.00% 7.50% -
ఎన్నికల తంతు ముగియగానే పాక్‌లో ధరల మోత!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ద్రవ్యోల్బణం దడ పుట్టించడం మొదలుపెట్టింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల వెన్ను విరిగింది. పాక్‌లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆదివారం కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తున్నదని ఆందోళనకారులు వాపోయారు. ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని కరాచీలో దాబా నిర్వహిస్తున్న ఇర్ఫాన్ వాపోయారు. రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని, గ్యాస్ బిల్లులు కట్టలేకపోతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారని, ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ కూలీగా పనిచేస్తున్న అబిద్ మాట్లాడుతూ ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నాం. రోజంతా కష్టపడితే కేవలం 900 పాకిస్తాన్ రూపాయలు సంపాదిస్తాను. దీంతో ఇంటి అద్దె నెలకు రూ. 7,500(పీకేఆర్) ఎలా చెల్లించాలని’ అబిద్ ప్రశ్నించారు. ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించకపోవడంతో, ఇప్పటికి కనీసం మూడు ఇళ్లు మార్చానని, వంట గ్యాస్ కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నానని అబిద్ వాపోయారు. -
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్‌కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్‌పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
Fixed Deposits: శుభవార్త.. వడ్డీ రేట్లు పెరిగాయ్..
స్థిరమైన ఆదాయంతోపాటు భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి ఉన్న వారికి శుభవార్త. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వద్ద చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. మెరుగైన వడ్డీ రేటు కోసం చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. పలు బ్యాంకులు వివిధ కాల వ్యవధులు, డిపాజిట్ మొత్తాన్ని బట్టి 8 శాతం వరకూ వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. కీలకమైన రెపో రేటును 6.5 వద్దే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ రానున్న నెలల్లోనూ అలాగే ఉంచుతుందన్న అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఆయా బ్యాంకులు తమ వెబ్సైట్లలో ప్రకటించిన ఎఫ్డీ రేట్లు ఇక్కడ అందిస్తున్నాం.. వివిధ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే.. డిసెంబర్లో ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచిన మొదటి బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1 నుంచి తమ ఎఫ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్లు, ఆపైన, రూ. 10 కోట్ల లోపు డిపాజిట్ చేసే దేశీయ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లను సవరించింది. ఏడు నుంచి 14 రోజుల వ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు వ్యవధిపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవి డిసెంబరు 13 నుంచి అమలులోకి వస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రూ. 5 కోట్లకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఏడు నుంచి 14 రోజుల కాలవ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు గరిష్టంగా 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. డిసెంబర్ 13 నుంచి మారిన రేట్ల ప్రకారం.. రూ. 100 కోట్ల నుండి రూ. 500 కోట్లకు మించిన ఎఫ్డీలపై వడ్డీ ఇప్పుడు 7.35 శాతం నుండి 7.30 శాతానికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 11 నుంచి రూ. 2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 85 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్ల కోసం కూడా ఎఫ్డీ రేట్లు వివిధ కాల వ్యవధులకు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 23 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు 7.80 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ కస్టమర్లకు 23 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ కూడా తన డిపాజిట్ రేట్లను సవరించింది. రెసిడెంట్ , నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు వర్తించే 500 రోజుల కాలవ్యవధికి 7.50 శాతం రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డీసీబీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం.. 25 నెలల నుండి 26 నెలల కాలవ్యవధితో సాధారణ డిపాజిట్లపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం అత్యధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. -
వెజ్ ప్లేట్ రూ.30.3 .. నాన్ వెజ్ రూ.61.2
హోటల్లో ఫుడ్ ఆరగిస్తే.. వేలకు వేలు బిల్లు కడుతుంటాం. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా వందల్లోనే మొదలవుతుంది. మరి మన ఇంట్లోనే వండుకుంటే.. ఎంత ఖర్చవుతుంది? నిజానికి బాగా తక్కువే. అందులోనూ సీజన్‌ను బట్టి, కూరగాయలు, చికెన్, మటన్, ఇతర మాంసాహార ధరలను బట్టి ఖర్చు మారిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత క్రిసిల్ సంస్థ.. వంటల్లో వాడే సరుకుల ధరల ఆధారంగా.. ఇంట్లో వండుకునే ఒక్కో ప్లేట్ ఆహారానికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలు వేసింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో నెలనెలా సరుకుల ధరలను పరిశీలించి.. సగటు థాలీ (ప్లేట్ భోజనం) ఖర్చు ఎంతెంత అన్న లెక్కలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. టమాటాలు, ఉల్లి ధరలే కీలకం: క్రిసిల్ సంస్థ వివిధ రకాల మాంసంతోపాటు వంటల్లో వాడే పప్పులు, కూరగాయలు, నూనెలు, మసాలాల ఖర్చునూ కలిపి భోజనం తయారీకి అయ్యే ఖర్చును లెక్కించింది. వంట చేసేందుకు అయ్యే గ్యాస్ ఖర్చునూ కలిపింది. అయితే ప్రధానంగా ఇటీవలి కాలంలో టమాటా, ఉల్లి ధరలు బాగా పెరిగిపోవడం, తర్వాత తగ్గడం నేపథ్యంలో సగటు థాలీ ఖర్చులోనూ హెచ్చుతగ్గులు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని నలుమూలలా ఉన్న రాష్ట్రాల నుంచి ధరల వివరాలు తీసుకుని, సగటు ధరలతో ఈ అంచనాలు వేసినట్టు తెలిపింది. ఎలాగైతేనేం హోటల్లో ఫుడ్డు తినేకంటే ఇంట్లో వండుకుంటే బాగా డబ్బులు మిగులుతాయనీ నివేదిక చెప్పినట్టే మరి! -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది. ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే! -
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్‌లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్‌లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్‌పూర్‌లోని హోటల్ లీలా ప్యాలెస్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్‌కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్‌లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్‌సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్‌పూర్‌లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
భారీగా తగ్గిన డైమండ్ ధరలు!
గతేడాది నవరాత్రి-దసరా కాలంతో పోలిస్తే ఈసారి పాలిష్ చేసిన వజ్రాల ధరలు గణనీయంగా 35 శాతం తగ్గాయి. కొన్ని కేటగిరీలకు చెందిన వజ్రాల ధరలు 2004లో ఉన్న ధరలతో సమానమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్, చైనాలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంతోపాటు ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు పెరుగుతున్న ఆదరణ వల్ల ధరలు క్షీణిస్తున్నట్లు సమాచారం. పాలిష్ చేసే వజ్రాల్లో ప్రపంచంలోనే 90 శాతం భారత్‌లోనే తయారవుతాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీలు దేశీయ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించాలని చూస్తున్నాయి. డైమండ్ ధరలు తగ్గడం వల్ల దేశంలోని స్టోర్‌ల్లో దసరా సందర్భంగా 20 శాతం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో ముడి వజ్రాల ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని, దాంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మూడు నెలలుగా పాలిష్ చేసిన వజ్రాల కొనుగోలుదారుగా ఉన్న యూఎస్‌లో డిమాండ్ తగ్గడంతో కూడా వజ్రాలు సరసంగా లభిస్తున్నాయి. -
పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? వెజ్, నాన్ వెజ్ ధరలు ఎంత?
నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇక్కడే పార్లమెంట్ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడల్లా అక్కడి క్యాంటీన్ గురించిన ప్రస్తావన వస్తుంది. పార్లమెంటు క్యాంటీన్లో అతి చౌక ధరలకు లభించే ఆహార పదార్థాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంటుంది. పార్లమెంటు క్యాంటీన్లో ఏ ఆహారం ఎంత ధరకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2021వ సంవత్సరంలో పార్లమెంట్ క్యాంటీన్ రేట్ లిస్ట్‌లో మార్పులు చేశారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లను సవరించింది. దీంతో పలు ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. ఉదాహరణకు గతంలో చపాతీ రేటు రూ.2 ఉండగా, తర్వాత దానిని రూ.3కి పెంచారు. అలాగే చికెన్, మటన్ వంటకాల రేట్లు కూడా పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి. ఆలూ బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోశ రూ.30, లెమన్ రైస్ రూ.30, మటన్ బిర్యానీ రూ.150, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఖీర్ రూ.30, ఉప్మా రూ.25, సూప్ రూ.25, సమోసా రూ.10, కచోరీ రూ. 15, పనీర్ పకోడా రూ. 50కు దొరుకుతుంది. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్ఆర్ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్) ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) -
టెలికాంకు మంచి భవిష్యత్?
-
బంగారం -వెండి ధరలు
-
బంగారం -వెండి ధరలు
-
2024లో తగ్గనున్న వడ్డీ రేట్లు! నిపుణుల అంచనా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నాము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. ఇదీ చదవండి: ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్.. ఎంతకు చేరాయంటే.. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యే యంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లేషించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
వెండి బంగారం ధరలు...
-
Gold rate: భారీగా పెరిగిన బంగారం ధరలు
జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ ప్రభావంతో మదుపర్లు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఇటీవలే తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తోపాటు సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత, అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ నివేదిక చెబుతుంది. ఇక తాజాగా మార్చి 13న ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 970 పెరిగి రూ. 56,550కి చేరింది. విదేశీ మార్కెట్లలో బంగారం ఔన్స్‌కు 1,875 డాలర్లు, వెండి 20.75 వద్ద ట్రేడ్ జరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ ఎకమిక్ డేటా పాజిటివ్‌గా రావడం, డాలర్లో పతనం, 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద అమెరికా బ్యాంక్ వైఫల్యం కారణంగా బంగారం ధరలు ఐదు వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలిస్తున్నారు. ఈ కారణం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ నవనీత్ దమానీ చెప్పారు. -
బంగారం ధర మళ్లీ పెరిగింది.. ఈ రోజు ఎంతంటే?
దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధరలు మాత్రం హెచ్చు తగ్గులు కనిపించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరింది ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది చెన్నైలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఫిబ్రవరి 28న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,070.. ఇవ్వాళ సైతం అదే ధర కొనసాగుతుంది. కోల్‌కతాలో అదే 10 గ్రాముల బంగారం రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.56,170 నుంచి రూ.56,340కి చేరింది హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,120 నుంచి రూ.56,290కి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేజీల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 66,800లతో స్థిరంగా ఉంది. ముంబైలో సైతం వెండి ధరల్లో మర్పు చోటు చేసుకోలేదు. అక్కడ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.66,800గా ఉంది చెన్నైల్లో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి చేరింది కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ.66,800తో స్థిరంగా ఉంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.69,000 నుంచి రూ.69,200కి పెరిగింది. అహ్మదాబాద్‌లో సైతం స్థిరంగా రూ.66,800తో కొనసాగుతుంది. హైదరాబాద్‌లో రూ.69000 గా ఉన్న వెండి ధర రూ.69,200కి చేరింది. -
మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్త రాణిస్తున్నాడు. ఇప్పటికే తన పేరుతో ఏషియన్ మూవీ థియేటర్‌ను రన్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో టై అప్ అయిన నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక మహేశ్ రెస్టారెంట్ కావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా అక్కడి వెళ్లి విందును ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. అయితే రెస్టారెంట్ మెను, రేట్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తిని సంతరించుకుంది. ఈ క్రమంలో ఏఎన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ మెను కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మెను కార్డులో ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు అన్ని అక్కడ అవలెబుల్లో ఉన్నాయి. ఇడ్లీ నుంచి సాయంత్రం పునుగుల, మిర్చిబజ్జీ ఇలా చాలా రకరకాల స్నాక్ ఐటెంస్ అందుబాటులో ఉన్నాయి. మరి వాటి రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక ప్లేట్ ఇడ్లీ రూ. 90 నుంచి ముదలై రూ. 120 వరకు ఉన్నాయి. ఇక పూరీ ప్లేట్ రూ. 170 కాగా దోశ రూ. 120 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 250 వరకు ఉంది. ఇక సాయంత్రం స్నాక్స్ వచ్చేసి రూ. 125గా ఉన్నాయి. ఏ స్నాక్స్ అయినా అక్కడ రూ. 125గా ఉన్నాయి. అయితే బిర్యానీ మాత్రం రూ. 450 నుంచి ఉన్నట్లు సమాచారం. ఇక స్టాటర్స్, సూప్స్ కూడా రూ. 300పైనే ఉన్నాయి. ప్రస్తుతం మహేశ్ ఏఎన్ రెస్టారెంట్ మెను నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. చదవండి: ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్ థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
గ్యాస్ రేట్ల సమీక్షకు పారిఖ్ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా రెండు సార్లు .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్ కమిటీ ఏర్పాటైంది. -
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
-
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు జక్కన్న కృతజ్ఞతలు..
Rajamouli Thanks To YS Jagan And KCR: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దర్శక ధీరుడు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం (మార్చి 8) తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. తాజాగా జక్కన్న కూడా ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వ్యక్తపరిచారు. Thanks to the CM of AP @ysjagan garu and @perni_nani garu for aiding the Telugu Film fraternity through the revised ticket pricing in the new G.O. Hope this helps towards the revival of cinemas. — rajamouli ss (@ssrajamouli) March 9, 2022 ఈ పోస్ట్‌లో 'కొత్త జీవోతో టికెట్ల ధరలు సవరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీం జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.' అంటూ రాసుకొచ్చారు జక్కన్న. అలాగే తెలంగాణ ముఖమంత్రి చంద్రశేఖర్ రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. 'పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.' అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. A big thanks to the CM KCR garu and the Telangana govt for permitting 5 shows a day for big films. Also, thanks to @YadavTalasani garu for your continuous support to us. This is a big help to the film fraternity. @TelanganaCMO — rajamouli ss (@ssrajamouli) March 9, 2022 -
ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..
-
ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..
సాక్షి, అమరావతి: సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సోమవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, ఆర్జీవీ తాను చెప్పాల్సింది చెప్పారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మాది కాదని.. నిబంధనలు అందరికీ ఒక్కటేనని పేర్ని నాని స్పష్టం చేశారు. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటైందన్నారు. కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామని.. అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. -
వస్త్ర పరిశ్రమకు ఊరట
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్టైల్స్) జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడంతో అత్యవసరంగా జీఎస్టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్‌కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్‌టైల్స్‌పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్‌పై 18 శాతం, మానవ తయారీ యార్న్‌పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్‌పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం. డిమాండ్ల వల్లే.. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు.. టెక్స్‌టైల్స్‌పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు. -
Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్లపాటు నిరాటంకంగా అందించేందుకే కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దీర్ఘకాలం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు పూర్తి భరోసానిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధర కంటే తక్కువకే కొంటున్నందున ఏడాదికి రూ.2,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇవాక్యులేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం మరో రూ.2,260 కోట్లు కూడా ఆదా అవుతాయని వెల్లడించారు. సెకీతో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరమని అంశాలవారీగా వివరించారు... యూనిట్‌కు రూ.1.87 ఆదా.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అందించే విద్యుత్‌ను యూనిట్ సగటున రూ.4.36 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తోంది. సెకీతో ఒప్పందం వల్ల ఈ విద్యుత్ యూనిట్ రూ.2.49కే వస్తుంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో కనీస బిడ్ యూనిట్‌కు రూ.2.49కు కోట్ చేశారు. తద్వారా యూనిట్‌కు దాదాపు రూ.1.87 ఆదా అవుతుంది. ఆ ప్రకారం ఏడాదికి రూ.2,400 కోట్ల వరకూ ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు. మనకు మరింత చౌకగా.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారమే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49 చొప్పున ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ లోనే సెకీ నుంచి యూనిట్ రూ.2.61చొప్పున సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే సెకీ సంస్థ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ప్రస్తుతం సెకీ ప్రతిపాదించిందే అతి తక్కువ ధర. అలాగే ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర చట్టాల ప్రకారమే.. డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర విద్యుత్ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) కు ప్రతిపాదిస్తుంది. ఈఆర్సీ ఆమోదించిన తరువాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్ ఆఫ్ లా ప్రకారం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తాయి. కేంద్ర విద్యుత్ చట్టంలో దీన్నొక నిబంధనంగా నోటిఫై చేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని టెండర్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి అవకాశం లేదు. లైన్ల ఖర్చుండదు.. ఇతర అవసరాలకు భూములు సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఇవాక్యులేషన్ లైన్ల ఖర్చు భారం ఉండదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2,260 కోట్లు ఖర్చు పెట్టి ఇవాక్యులేషన్ లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. సెకీతో ఒప్పందంతో ఆమేరకు భారీగా ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే అది ఒకసారికే పరిమితమవుతుంది. కానీ కేంద్ర గ్రిడ్‌కు ఛార్జీలు 25 ఏళ్లపాటు కట్టాల్సి ఉంటుంది. దాంతో రాష్ట్రం చాలా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. మరోవైపు సెకీ విద్యుత్ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టుల కోసం ఈ భూమి ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కంటే రాజస్థాన్‌లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడు. మన రాష్ట్రంలో కంటే అక్కడ గంటన్నర సేపు అధికంగా సూర్యరశ్మి ఉండటంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా ఉండే పీక్ అవర్స్‌లో సెకీ విద్యుత్ బాగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సే్చజీ నుంచి కొనుగోలు చేస్తే పీక్ అవర్‌లో కరెంట్ ధరలు అధికంగా ఉంటాయి. ఐదేళ్లలో అస్తవ్యస్థం గత సర్కారు హయాంలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడంతో 2014– 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసింది. కొనుగోలు నష్టాలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు గుదిబండల్లా మారాయి. చౌక విద్యుత్తు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వకుండా దీర్ఘకాలిక ఒప్పందాలపై గత సర్కారు మొగ్గు చూపడంతో డిస్కమ్‌లు నష్టాల భారంతో దివాళా స్థితికి చేరుకున్నాయి. నోట్: ‘సెకీ’ 2017 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో ధరలు, గత సర్కారు కొన్న ధరల్లో వ్యత్యాసం వివరాలు ఇవీ. చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్ -
కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
రొమ్ము కేన్సర్ ఔషధ ధరలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్స కు ఉపయోగించే ‘ట్రాస్టూజుమాబ్’ ఔషధ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఏకంగా 65 శాతం తగ్గుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గురువారం తెలిపింది. ప్రస్తుతం వీటి ధర ఒక కోర్సుకు రూ.14.20 లక్షలుగా ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలకు దాన్ని తయారు చేసే అవకాశం కల్పించడంతో దాని ధర తగ్గనుంది. 65 శాతం ధర తగ్గితే ఆ ఔషధం రూ.4.97 లక్షలకే లభించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రులే ఈ ఔషధాన్ని రోగులకు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, ఆరోగ్యశ్రీ రోగులకు ఈ ఔషధాన్ని వాడట్లేదు. ధర తగ్గడం వల్ల ఆరోగ్యశ్రీ రోగులకు కూడా దీన్ని ఇచ్చే అవకాశముందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
మొబైల్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సర్వీస్ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్క్యులేటర్ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్ రీచార్జ్ కండీషన్ (ఎఫ్ఆర్సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్ కామెంట్స్ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్ నిర్ణయించింది. కాగా, చార్జీలు పెంచాలని టెల్కోలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై జోక్యం చేసుకోరాదని ట్రాయ్ భావిస్తున్నట్లు సమాచారం. టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ భేటీ.. వచ్చే ఏడాది (2020) దేశీ టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్–ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. -
రెనో క్విడ్ ధరల పెంపు
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తన ‘క్విడ్’ మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మోడల్ కార్ల ధరలు 3% పెరగనున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న క్విడ్ ధరల శ్రేణి ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉన్నది. మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి రూ.25,000 మేర పెంచుతూ గతవారంలోనే నిర్ణయం తీసుకుంది. -
మసకబారుతోన్న ‘పసిడి’.. భారీగా తగ్గిన ధర
సాక్షి, అమరావతి : ప్రతి ఏడాది శ్రావణ మాసంలో బంగారం అమ్మకాలు గణనీయంగా ఊపందుకునేవనీ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని బంగారు ఆభరణాల తయారీదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా.. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన విధంగా దేశంలో ధరలు తగ్గకపోయినా గడచిన ఆరు నెలల్లో విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.2,325 వరకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన రూ.32,825 గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర ఆగస్టు 20 నాటికి రూ.30,500 తగ్గింది. ఇదే సమయంలో ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.29,250 నుంచి రూ.1,140 తగ్గి రూ.28,110 చేరుకుంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ 11న 159 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ధర గత నాలుగు నెలల్లో పతనమవుతూ రూ.1,188 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2016–17 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 161 టన్నులుగా ఉన్న ఆభరణాల అమ్మకాలు.. ఈ ఏడాది ఇదే కాలానికి 148 టన్నులకు పడిపోయినట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా ఇంకా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటం, అధిక పన్నులు, రూపాయి విలువ పతనంతో ఇక్కడి ధరలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన రీతిలో తగ్గకపోవడంతో వినియోగదారులు కొనుగోళ్లు జరపడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 30 శాతం పడిపోయిన అమ్మకాలు: గతంలో వెయ్యి రూపాయలు తగ్గితే చాలు కొనుగోళ్లు పెరిగేవని, కానీ ధరలు దిగివస్తున్నా అమ్మకాలు ఆ స్థాయిలో పెరగడం లేదని బులియన్ వ్యాపారులు వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 30 శాతం క్షీణించినట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది శ్రావణ మాస సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 250 నుంచి 270 కిలోల వరకు ఆభరణాల అమ్మకాలు జరిగాయని.. కానీ ఈ ఏడాది 200 కిలోలు మించి జరిగే అవకాశం కనిపించడం లేదని ఏపీ గోల్డ్, డైమండ్ జ్యూయలెరీ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూశెట్టి రామ్మోహనరావు తెలిపారు. జీఎస్టీ, భారీ నగదు లావాదేవీలపై నిఘా వల్ల అమ్మకాలు తగ్గుతున్నాయా, లేక ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిందో అంచనాకు అందడం లేదన్నారు. ఈ సారి వరలక్ష్మీ పూజకు కేవలం కాసులు, రూపులు, కమ్మీలు వంటి వాటితో సరిపెడుతున్నారని తెలిపారు. ఈసారి వర్షాలు సకాలంలో రావడం కూడా బంగారం అమ్మకాలు తగ్గడానికి ఒక కారణంగా చెపుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల పొలం పనులు మొదలు కావడంతో అందరూ పెట్టుబడుల కోసం నిధుల వేటలో ఉండటం అమ్మకాలు తగ్గడానికి కారణంగా నరసరావుపేటకు చెందిన జ్యూవెలరీ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ రంగంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో చిన్న సంస్థల్లో అమ్మకాలు తగ్గిపోయాయని, ఇప్పుడు వారంలో రెండు రోజులకు మించి అమ్మకాలు ఉండటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విజయవాడకు చెందిన ఓ బులియన్ వ్యాపారి వాపోయారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ఏడాది అమ్మకాలపై పెదవి విరుస్తున్నాయి. భారీ వర్షాలు ఈసారి దక్షిణాదిలో ఆభరణాల అమ్మకాలను దెబ్బతీశాయంటున్నారు. ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉండటంతో కనీసం దీపావళి సమయానికైనా అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావంతో బంగారం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. -
ఈ ఏడాది పసిడి కాంతులుండవా?
ముంబై: బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గుతుందా? అవును.. తగ్గచ్చంటోంది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా. ప్రస్తుత ఏడాది బంగారు ఆభరణాల డిమాండ్ 2– 4 శాతం మేర పడిపోవచ్చని అంచనా వేసింది. అధిక ధరలు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. అయితే విలువ పరంగా చూస్తే.. బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 5–7 శాతం పెరగొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘గోల్డ్ జువెలరీ డిమాండ్ 2018లో 2–4 శాతంమేర పడిపోవచ్చు. గత మూడు నెలలుగా బంగారు ఆభరణాల ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అలాగే పవిత్రమైన రోజుల సంఖ్య తక్కువగా ఉంది. మరొకవైపు రత్నాభరణాల రంగంపై ఈ మధ్య కాలంలో పర్యవేక్షణ ఎక్కువయింది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీకుమార్ తెలిపారు. క్రెడిట్ లభ్యత కష్టతరంగా మారడంతో జువెలరీ రిటైలర్లకు మూలధన ఇబ్బందులు ఎదురుకావొచ్చని అభిప్రాయపడ్డారు. భారత్ మార్కెట్‌కు మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన సామాజిక ఆర్థికపరమైన అంశాల కారణంగా పరిశ్రమ ఆదాయం 7–8 శాతంమేర పెరగొచ్చని అంచనా వేశారు. కాగా బంగారు ఆభరణాల డిమాండ్ 2017లో పరిమాణం పరంగా 12 శాతం, విలువ పరంగా 9 శాతం పెరిగింది. -
రైలు ప్రయాణికులకు తీపికబురు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లో నడిచే శతాబ్ది ప్రీమియం రైళ్లలో చార్జీలను త్వరలో తగ్గించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ ప్రస్తుతం పనిచేస్తోందన్నారు. ఎక్కువ రద్దీలేని మార్గాల్లో నడుస్తున్న 25 శతాబ్ది రైళ్లలో చార్జీల్ని తగ్గించే అవకాశమున్నట్లు గుర్తించారు. గతేడాది ఢిల్లీ–అజ్మీర్, చెన్నై–మైసూరుల మధ్య చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. బస్సులకు సమానంగా చార్జీలు తగ్గించడంతో ఈ మార్గాల్లో రైల్వే ఆదాయం 17 శాతం, ప్రయాణికుల బుకింగ్స్ 63 శాతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ చార్జీలు తగ్గించడంతోపాటు రైలు సర్వీసుల లే ఓవర్ టైం తగ్గించి 100 కొత్త రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 25 నూతన రైళ్లు ప్రారంభించగా, ఈ ఏడాదిలోపు మరో 75 రైళ్లు ప్రారంభం కానున్నాయి. వేగంగా ప్రయణించే 45 శతాబ్ది రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
సుక్కకు ధరల కిక్కు
♦ బేసిక్ కేసు ధరపై 10 శాతం ♦ పెంపునకు సర్కారు అంగీకారం! ♦ ధరలు పెంచకుంటే ఉత్పత్తులు నిలిపేస్తామన్న డిస్టిలరీల హెచ్చరికల వల్లే.. ♦ సీఎం కేసీఆర్ పరిశీలనలో బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతిపాదనలు ♦ కేటగిరీని బట్టి క్వార్టర్‌కు రూ. 6 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో మందుబాబులకు ధరల కిక్కు తగలనుంది. బ్రాండ్‌నుబట్టి క్వార్టర్‌కు రూ. 6 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం ఉంది. బేసిక్ కేసు ధరపై 10% పెంపునకు సర్కారు అంగీకరిం చింది! పెంచిన ధరల్లో పన్నులను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకుంది. ధరలు పెంచకపోతే తమ ఉత్పత్తులు నిలిపేస్తామంటూ కంపెనీలు హెచ్చరించిన నేపథ్యంలో మద్యం ధరల పెంపుపై తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈ నెల రెండో వారం నాటికి ధరల పెంపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2012 నుంచి పాత ఒప్పందమే... రాష్ట్రానికి వివిధ బ్రాండ్లకు చెందిన దాదాపు 100 కంపెనీలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమైన మద్యం సరఫరా కోసం ప్రభుత్వం ఏటా మద్యం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటోంది. సాధారణంగా మే నుంచి జూన్ వరకు కాంట్రాక్టు గడువు ఉంటుంది. అవసరాన్నిబట్టి టీఎస్‌బీసీఎల్ మరో ఏడాది దాన్ని పొడిగించవచ్చు. కానీ వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఐదేళ్లుగా టెండర్లు పిలవట్లేదు. 2011లో కుదిరిన ఒప్పందం 2012 జూన్‌తోనే ముగిసినా పాత ఒప్పందాన్నే ప్రభుత్వం రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చాక యాజమాన్యాల డిమాండ్ సాధ్యాసాధ్యాలపై ముగ్గురు సభ్యులతో ధరల నిర్ణాయక కమిటీని ఏర్పాటు చేసింది. ధరల పెంపుపై చర్చించిన ఈ కమిటీ... కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. తాజాగా అదే నివేదిక ఆధారంగా బేసిక్ కేసు ధరపై 10 శాతం ధరలు పెంచాలని టీఎస్‌బీసీఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మొలాసిస్ కొరత కూడా కారణమే... రాష్ట్రంలో చక్కర పరిశ్రమలు లేకపోవడం, నిజాం షుగర్స్ కూడా మూతపడటంతో చెరకు మొలాసిస్ కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో గ్రెయిన్ ఆధారిత (నూకలు, బియ్యం, మొక్కజొన్న) ఈఎన్ఏ నుంచి (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) లిక్కర్ తయారు చేసే విధానాన్ని సర్కారు అమల్లోకి తెచ్చింది. ఇది ఖర్చుతో కూడిన పని అని డిస్టిలరీ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతోపాటు ముడి సరుకుల ధరలు, బాటిల్ ధర, కార్మికుల జీతభత్యాలు పెరిగిన నేపధ్యంలో ఉత్పతి వ్యయం భారిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం ధరలు పెంచలేదంటున్నాయి. డిస్టిలరీ యాజమాన్యల నుంచి టీఎస్‌బీసీఎల్... చీప్ లిక్కర్ పెట్టెకు (48 క్వార్టర్లు లేదా 12 ఫుల్ బాటిల్స్) రూ. 445 చొప్పున కొనుగోలు చేస్తోంది. మీడియం లిక్కర్‌ను పెట్టెకు రూ. 585 చొప్పున, ప్రీమియం మద్యాన్ని పెట్టెకు రూ. 1,300 నుంచి రూ. 2,200 వరకు చెల్లిస్తోంది. అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కావట్లేదని, నష్టాలతో కంపెనీలు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం నేపథ్యంలో మద్యం కేటగిరీనిబట్టి ప్రస్తుతం టీస్బీసీఎల్ ఇస్తున్న బేసిక్ ధరపై కనీసం 15 శాతం అదనపు ధర చెల్లించాలని పట్టుబడుతున్నాయి. 2010లో అప్పటి రోశయ్య ప్రభుత్వం ధరలను స్వల్పంగా పెంచాక మళ్లీ ఇప్పటివరకు ధరలు పెంచలేదని గుర్తుచేస్తున్నాయి. -
చవితికి ధరల విఘ్నం
రెట్టింపైన పండ్లు, పూల ధర భక్తులకు భారం వర్షంతో వ్యాపారుల ఆందోళన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తెలుగు గడ్డపై విఘ్నాధిపతికి పూజలు చేయనివారెవరూ ఉండరు. ఇదే అదనుగా వ్యాపారులు పూలు, పండ్ల ధరలను రెట్టింపు చేసి విక్రయించారు. దీంతో వినాయక చవితి పూజలకు సిద్ధమౌతున్న ప్రజలు బెంబేలెత్తిపోయారు. సాధారణంగా వినాయక చవితికి ఇంటిలో పూజ చేసేందుకు స్వామి ప్రతిమ, పాలవెల్లి, గొడుగు, పండ్లు, పూలు అవసరం. వీటి ధరలు సాధారణ రోజులకు మించి చవితి సందర్భంగా పెంచేయడం వ్యాపారులు ఏటా చేసే పనే. ఐతే ఈ ఏడాది ఆ ధరలను రెట్టింపు చేసి విక్రయించారు. ఇది ప్రజలకు భారంగా పరిణమించింది. హతాశులయ్యారు రెండు రోజుల ముందు వరకూ అందుబాటులోనే ఉన్న వివిధ రకాల పండ్ల ధరలు బుధవారం కాస్త పెరగగా, గురువారం మరింతగా పెరిగాయి. పూజ కోసం వాటిని కొనుగోలు చేయడానికి మార్కెట్లోకి వచ్చిన ప్రజలు వాటి ధరలు విని హతాశులయ్యారు. ధరలు ఇలా.. పండ్ల రకం మంగళవారం గురువారం యాపిల్ (1) రూ. 30 రూ.50 దానిమ్మ (1) రూ. 8 నుంచి రూ.10 రూ. 15 నుంచి రూ. 20 ద్రాక్ష పావుకిలో రూ. 50 రూ. 70 బత్తాయి డజను రూ. 80 రూ.120 నుంచి రూ.150 జామ (2) రూ.10 రూ. 15 మొక్కజొన్న పొత్తు రూ. 5 రూ.8 పువ్వులు (పావుకేజీ) మల్లెలు రూ.200 రూ.400 కనకాంబరాలు రూ.350 రూ.500 చామంతి రూ.120 రూ.150 బంతి రూ.80 రూ.120 పత్రి, పాలవెల్లి ధరలు ప్రియం చవితిలో ముఖ్యపాత్ర పోషించే పత్రి, పాలవెల్లి వంటి వాటి ధరలు కూడా మరింత ప్రియంగా మారాయి. వినాయకుని మందిరం ఏర్పాటు చేసి అలంకరించే వెదురు పాలవెల్లి రూ.20, చెక్క పాలవెలి రూ.30 చొప్పున విక్రయించారు. గొడుగు రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.20 వరకూ అమ్మారు. పాలవెల్లికి అంలకరించే వెలగకాయ, మారేడు కాయ, నారింజ, సీతాఫలం వంటి కాయల ధరలూ భక్తులకు చుక్కల్ని చూపించాయి. దీంతో వినాయక చవితి పండుగకు కేవలం అలంకరణలకే దాదాపు రూ.1000 ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అకాల వర్షం చవితి పండుగ సామగ్రి విక్రయించి ఆదాయం సమకూర్చుకుందామనుకున్న వ్యాపారులకు గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆందోళన కలిగించింది. వాతావరణ శాఖ 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించిందనే వార్త వారిని మరింత కంగారుపెట్టింది. సాయంత్రం 5 గంటల నుంచి తగ్గుముఖం పట్టడంతో వారికి కొంత ఊరట కలిగింది. అప్పటికే ప్రజలు గొడుగులు, రెయిన్కోట్లు, జర్కిన్లు వేసుకుని మార్కెట్లోకి రావడంతో వ్యాపారుల్లో ఆనందం వ్యక్తమైంది. -
ఇసుక మస్కా!
ఇసుక ధరల నిర్ణయంలో ఇసుక అక్రమాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని గ్రహించిన సర్కారు.. ఆత్మరక్షణలో పడింది. ఉచిత ఇసుక ఇస్తున్నా.. రవాణా, కూలీల పేరుతో దోపిడీ జరుగుతుందని గుర్తించి కొత్త ధరలు నిర్ణయించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే సమావేశమైన జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ కొత్త ధరల్లోనూ తిరకాసుపెట్టింది. రవాణాచార్జీలను భారీగా పెంచింది. ఫలితంగా వినియోగదారునిపై భారం పడనుంది. అదే సమయంలో కూలీల రేట్లలో కోత విధించింది. ఈ ధరలూ లోపభూయిష్టంగా ఉన్నాయనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొవ్వూరు/ఏలూరు మెట్రో : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇన్నాళ్లూ అధికారపార్టీ నేతలే గోదావరిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగించినా పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అప్రతిష్టను తొలగించుకునేందుకు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ ఇటీవలే ఇసుక లోడింగ్, రవాణాల ధరలను నిర్ణయించింది. ఈ ధరల కంటే అధికంగా వసూలు చేసినా.. ఇసుకను నిల్వ చేసినా.. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని మండల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకూ ఇలా.. ప్రభుత్వం ఇసుక ఉచితమంటూ ప్రకటించినా.. కొందరు ఇష్టానుసారంగా రీచ్‌ల్లో వ్యాపారం చేస్తున్నారు. అధికారపార్టీ నేతలే రూ.కోట్లు కొల్లగొట్టారు. నాయకులు వారి అనుచరులు ఇసుక రీచ్‌లను కబ్జా చేశారు. ట్రాక్టర్ లోడుకు రూ.500ల నుంచి 800ల వరకు చెల్లించాలంటూ అనధికార ధరలను నిర్ణయించారు. కొన్ని చోట్ల అక్రమ వసూళ్లకు దిగారు. నదీగర్భాలను ఇష్టారీతిన తవ్వేశారు. గూటాల, పోలవరం, నర్సాపురం, కొవ్వూరు, కుకునూరు, నిడదవోలు, వాడపల్లి, తాళ్ళపూడి, విజయరాయి, పెదవేగి ఇసుక ర్యాంపుల్లో టీడీపీ నేతలు తవ్వకాలకు బరి తెగించారు. ఒకానొక దశలో వారి ఆగడాలకు అడ్డువెళ్లేందుకు అధికారులూ వెనుకడుగు వేశారు. . కనీసం ప్రభుత్వ పనులకూ ఇసుక లభించని దుస్థితి కూడా నెలకొందంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన సర్కారు అప్రమత్తమైంది. కొత్త ధరలివీ.. ప్రభుత్వ పథకాలకు వెయ్యి క్యూబిక్‌మీటర్ల ఇసుక అవసరమైనప్పుడు మండల స్థాయిలో ఉన్న కమిటీకి (తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ) సంబంధిత శాఖ ఇంజినీరు దరఖాస్తు చేస్తే తేదీ, సమయం, ఎంత మేర తీసుకోవచ్చు, ఏ రీచ్‌కి వెళ్లాలి అనే వివరాలతో అనుమతి పత్రం ఇస్తారు. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఇసుక తీసుకెళ్లవచ్చు. సామాన్యులైతే రీచ్‌కి రానుపోను వాహనాల రవాణా చార్జీ మొదటి 5 కిలోమీటర్లు రూ. 400, తరువాత 10 కిలోమీటర్లు దాటిన ప్రతి ఒక కిలోమీటరుకు రూ.28 చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ట్రాక్టర్ లోడింగ్ చేసిన దానికి రూ.300ల చొప్పున చెల్లించాలి. రానుపోను 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రీచ్ నుంచి ఎవరైనా ఇసుక తీసుకువచ్చి ఇస్తే వినియోగదారుడు రూ.900లు చెల్లించాలి. దీనికి పడవ, కూలీల ఖర్చులు అదనం అంతకుమించి నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లు, ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైతే నేరుగా జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఏ రీచ్‌లోనైనా ట్రాక్టర్‌తో తప్ప ఇతర పెద్ద వాహనాలతో రవాణా చేయడానికి వీల్లేదు. రీచ్‌లలో ఇలా.. పడవల ద్వారా ఇసుక సేకరించే ర్యాంపుల్లో పడవలు, కూలీల నిమిత్తం యూనిట్‌కి రూ.800, పడవల ద్వారా నిడదవోలు వరకు తరలిస్తే యూనిట్‌కు రూ.1,000, ఓపెన్ రీచ్‌ల్లో మనుషుల ద్వారా రూ.500 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో మాత్రం ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు.యూనిట్ ఇసుక రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయాలు చేస్తున్నారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నిర్వాహకులు అఫిడవిట్ ఇవ్వాలి ధరలతోపాటు కొన్ని నిబంధనలూ విధించారు. ర్యాంపులో నిర్వాహకులు అఫిడవిట్ ఇవ్వాలని జిల్లా కమిటీ ఆదేశించింది. ఈ విషయాన్ని శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. నిబంధలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా కమిటీ సూచన మేరకు స్ధానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, కానిస్టేబుల్ పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసి ర్యాంపులపై నిఘా ఉంచాలని చెప్పారు. రోజువారీగా ఎంత ఇసుక తవ్వుతున్నారు? ఎవరికి ఎంత విక్రయిస్తున్నారు? వారి ఆధార్ నంబర్లతో సహా నమోదు చేయాలని నిబంధన విధించినట్టు వెల్లడించారు. దీనిలోభాగంగా ఓ కమిటీ ఏర్పాటు చేసుకునే వరకూ శుక్రవారం నుంచి మండలంలోని ర్యాంపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కొక్కటిగా మూతపడిన ర్యాంపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, అనుమతు లేవన్న కారణంతో ఇరవై రోజుల క్రితం వాడపల్లి ర్యాంపును మూసివే శారు. వారం క్రితం అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తున్నారని ఔరంగాబాద్ ర్యాంపుని మూసివేశారు. వారం క్రితం తాడిపూడి ర్యాంపులో ఇసుక నిల్వ చేసే ప్రాంతంలో వరద నీరు చేరడంతో తవ్వకాలు తాత్కలికంగా నిలిచిపోయాయి. జిల్లాలో అధికారిక ర్యాంపులు పది ఉన్నాయి. వీటిలో తాడిపూడి, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్ ర్యాంపుల్లో మాత్రమే పడవల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. తాడిపూడి, ఔరంగబాద్ ర్యాంపులు గతంలోనే మూతపడగా ప్రక్కిలంక కొవ్వూరు ర్యాంపుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి తాత్క లికంగా మూతపడ్డాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పుడు ఉన్న ర్యాంపులు మూసివేయడంతో ఇసుక కష్టాలు మళ్లీ మొదటివచ్చే అవకాశాలున్నాయి. పడవల నిర్వాహకులు గగ్గోలు ప్రస్తుతం పడవల ద్వారా ఇసుక సేకరణకు కార్మికులకు యూనిట్‌కి రూ.700, లోడింగ్ నిమిత్తం రూ.60 చెల్లిస్తున్నారు.ఇసుక సేకరణ æకు పడవకు ఆయిల్ ఖర్చు రూ.50 చొప్పున ఖర్చువుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈలెక్కన రూ.810 అవుతుంటే రూ.800 ధర నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తున్నారు. లేదంటే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఓపెన్ ర్యాంపుల్లో పొక్లెయినర్ల సాయంతో నదిలో రోడ్లు వేసి తవ్వకాలు సాగించిన పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝళిపించడం విమర్శలకు తావిస్తోంది. అవసరమైతే కార్మికులకు ఇచ్చే వేతనంలో రూ.100 తగ్గించుకుంటే గిట్టుబాటు అవుతుందని ఆర్డీవో శ్రీనివాసరావు పడవల నిర్వహకులకు సూచించడం కోసమెరుపు. రవాణా మోత వాస్తవం ఐదు యూనిట్ల ఇసుక కొవ్వూరు నుంచి ఏలూరుకు సరఫరా చేయడానికి కిరాయి రూ.8వేల నుంచి రూ.8,500 తీసుకుంటున్నారు. జిల్లా కమిటీ మాత్రం యూనిట్‌కి రూ.2,100 చొప్పున ధర నిర్ణయించింది. అంటే ఐదు యూనిట్లకు రూ.10,500 చెల్లించాల్సి వస్తుంది. కొవ్వూరు నుంచి జంగారెడ్డిగూడెం 54 కిలోమీటర్లు వస్తుంది. గరిష్టంగా కిరాయి రూ.5,500 నుంచి రూ.6వేలు లోపు కిరాయి తీసుకుంటున్నారు. అటువంటిది జిల్లా కమిటీ మాత్రం కిరాయి యూనిట్ ఇసుక రవాణాకు రూ.1,700 నిర్ణయించారు.అంటే ఐదు యూనిట్లకు రూ.8,500 అవుతుంది. అంటే లబ్ధిదారుడిపై సుమారు రూ.2వేలు కిరాయి భారం పడుతుంది. సుమారు 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరానికి ఇదే కిరాయి నిర్ణయించారు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న నల్లజర్లకు యూనిట్ రవాణాకు రూ.1,000 చొప్పున నిర్ణయించారు. అంటే మూడు చోట్ల ఎక్కడికి వెళ్లినా అదే కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. ఐదుయూనిట్లకు రూ.5 వేలు కిరాయి నిర్ణయిస్తే లారీ కిరాయి మాత్రం రూ.3,500 నుంచి రూ.4వేలు తీసుకుంటున్నారు. రెండు యూనిట్ల లారీలకు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన కిరాయి కిలోమీటరుకు రూ.65లు, ఐదు యూనిట్ల లారీకి రూ.120 చొప్పున నిర్ణయించింది.ఈలెక్కన చూసినా జిల్లా కమిటీ నిర్ణయించిన ప్రస్తుతం మార్కెట్లో తీసుకుంటున్న కిరాయిల కంటే అ«ధికంగానే ఉంది. కిరాయిలు బాదుడు అధికారికం కానుండడంతో ఇసుక ధర లబ్ధిదారులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. -
మళ్లీ ఘాటెక్కుతున్న ఉల్లి ధర
-
భూముల విలువకు రెక్కలు
- ఆగస్టు 1వ తేదీ నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు - ఆదేశాలిచ్చిన సర్కారు - కసరత్తులో రిజిస్ట్రేషన్ అధికారులు - 10 నుంచి 25 శాతం వరకు పెరుగుదల - గ్రామాల్లో 25 శాతం వరకు పెంపు ? భూములు, భవనాల విలువలకు త్వరలో రెక్కలు రానున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పెంపుదల ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఆ దిశగా ఇప్పటికే జిల్లా రిజిస్ట్రేషన్ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత విలువపై 10 నుంచి 25 శాతం వరకు భూముల విలువ పెరగనున్నట్టు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం వరకు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. పట్టణ భూములు విలువ పెంచిన సర్కారు తాజాగా పల్లెలపై కన్నేసింది. ఉదాహరణకు మండపేటలో భూముల పెంపుదలను పరిశీలిద్దాం. సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్‌లోని ఓ రోడ్డులో గజం విలువ రూ.11,000ల వరకూ పెంచగా...అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ.4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంఘం పుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ.11,000లకు పెంపుదల చేశారు. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. - మండపేట జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా కాకినాడ, రాజమహేంద్రరం, అమలాపురం ప్రధాన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు దాదాపు వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 2.1 కోట్లు ఆదాయం వస్తోంది. గత ఏడాది భూముల విలువ పెంపులో అనాలోచిత నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాల్జేశాయి. చాలాచోట్ల ప్రధాన రహదారిని ఆనుకుని భూములు, భవనాల విలువతో సమానంగా వాటి వెనుక ఉన్న వాటి విలువను పెంచేశారు. ఉదాహరణకు మండపేటలో సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్‌లోని ఒక రోడ్డులో గజం విలువ రూ.11,000లు వరకు పెంచగా, అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ. 4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసిన సంఘంపుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ. 11,000లకు పెంపుదల చేయడం గమనార్హం. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. విలువలేని చోట ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచేయ్యడంపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ధ్వజమెత్తారు. లేని విలువను పెంచి చూపడంతో రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో పేద వర్గాల వారు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో పలువురు బాధితులు అప్పట్లో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు సైతం చేశారు. అయిన వాటిపై ఏ విధమైన స్పందన లేకపోయింది. తాజాగా మరోమారు భూముల విలువ పెంచేందుకు కసరత్తు చేస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణంపై మరింత భారం... గత ఏడాది పట్టణ ప్రాంతాల్లో అధికంగా భూముల విలువ పెంచగా ఈసారి గ్రామీణ ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతానికి పైగాను, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర భూముల విలువ పెంపుదలకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఏఏ ఏరియాల్లో ఎంత పెరిగేదీ రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జిల్లా మొత్తంగా 25 శాతం వరకు భూముల విలువ పెరగవచ్చునని తెలుస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ... పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగానికి తాజాగా రిజిస్ట్రేషన్ విలువ పెంపు నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద నోట్లు రద్దు ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రసుతం రోజుకు 60 శాతం మేర మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా భూముల విలువ పెంపుదల చేయనుండటం విమర్శలకు తావిస్తోంది. లేని విలువను చూపించి రిజిస్ట్రేషన్ల చార్జీల రూపంలో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. పెంపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. -
హైదరా‘బాదుడే’
- రవాణా శాఖ దాడులతో నిలిచిన ఏసీ స్లీపర్ బస్సులు - ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఆర్టీసీ - ఇదే అదనుగా రేట్లు పెంచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ అమలాపురం : అధికార టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పెట్టిన చిచ్చు హైదరాబాద్ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తన ట్రావెల్స్ సంస్థను మూసివేస్తూ ఇంటి గుట్టును నాని రట్టు చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా అరుణాచల్‌ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను రవాణా అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో కూడా పలు ఏసీ స్లీపర్ బస్సులు నిలిచిపోయాయి. ఉన్న బస్సులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో సర్వీసులను పెంచాల్సిన ఆర్టీసీ నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ల రేటు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి రోజూ సుమారు 170కి పైగా బస్సులు హైదరాబాద్ వెళుతున్నాయని అంచనా. వీటిలో 30 వరకూ ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఇతర రాష్ట్రాల పర్మిట్లతో తిరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు చేశారు. దీంతో రవాణా అధికారులు దాడులు చేయడంతో ఈ బస్సులన్నీ నిలిచిపోయాయి. ఒక్కో బస్సులో 25 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బస్సులు నిలిచిపోవడంతో ప్రతి రోజూ 750 మంది వరకు ఇతర ఏసీ సెమీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. నిజానికి ఈ సమయంలో ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపితే ఆదాయం పెరగడంతోపాటు, నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సంస్థ రెగ్యులర్ సర్వీసులు తిప్పుతోందే తప్ప డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను పెంచలేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టిక్కెట్టు రేట్లను అనూహ్యంగా పెంచేశాయి. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు గతంలో ఏసీ సెమీ స్లీపర్ బస్సు టిక్కెట్టు ధర రూ.800 వరకూ ఉండగా, ప్రస్తుతం దీనిని రూ.1,100కు పెంచారు. ఆదివారం రాత్రయితే ఏకంగా రూ.1,200 వరకూ వసూలు చేశారు. ఇక నాన్ ఏసీ బస్సు టిక్కెట్టు ధర గతంలో రూ.500ల నుంచి రూ.600 వరకూ ఉండగా, దీనిని ఇప్పుడు రూ.900కు పెంచారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి గతంలో ఉన్న టిక్కెట్టు రేటుకన్నా రూ.300, అంతకు మించి పెంచేశారు. చార్జీల పెంపుతో హైదరాబాద్ బస్సు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉన్న ఏసీ స్లీపర్ బస్సులు యథావిధిగా తిరిగే అవకాశముంది. కానీ, వారు సహితం టిక్కెట్టు ధరను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకూ ఉన్న స్లీపర్ టిక్కెట్ ధర ఇప్పుడు రూ.1,780 పలకడం గమనార్హం. ప్రైవేటు బస్సుల యజమానులు ఇష్టానుసారం చార్జీలు పెంచేసినా రవాణా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ తరహాలో ధరలు పెంచడం, సీజన్లో గంటగంటకూ టిక్కెట్టు ధరలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ దందాపై రవాణా అధికారులు ఇప్పటికైనా స్పందించాలని, ఆర్టీసీ కూడా తన సర్వీసులను పెంచాలని వారు కోరుతున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
-
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.30లక్షలపైన ఉన్న లోన్లపై 10బేసిస్ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం పక్రటించింది. మే 9వ తేదీనుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని తెలిపింది. దీని ప్రకారం రూ.30లక్షల లోపు రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు 8.6 శాతం నుంచి 8.35శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద రుణం తీసుకునే ఖాతాదారులు కనీసం రూ. 2.67లక్షల దాకా సబ్బిడీ పొందవచ్చునని తెలిపింది. ఈ పథకం కింద మధ్య ఆదాయ వర్గాల వారు మొదటి సారి గృహ రుణ రుణగ్రహీతలు ఈ తగ్గింపును పొందవచ్చని తెలిపింది. తమ రేట్లు తగ్గింపుతో గృహ కొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు సొంతం చేసుకోవాలనుకునే మిలియన్ల మంది కల నెరవేరుతుందని నేషనల్ బ్యాంకింగ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు. మరోవైపు ఈప్రభావం మార్కెట్లో షేర్ ధరపై చూపించింది. ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్బిఐ అనంతరం రూ.294కి పతనమైంది. మళ్లీ కోలుకొని దాదాపు 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
వచ్చే 18నెలలూ వడ్డీరేట్లు యథాతథం!
న్యూఢిల్లీ : వడ్డీరేట్లపై ఆశలు పెంచుకుంటున్న మార్కెట్ వర్గాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిరాశపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పడికప్పుటి ద్వైపాక్షిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటులో ఎటువంటి మార్పు చేపట్టలేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసాగించనుందట. వచ్చే ఏడాది వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 35 మందికి పైగా ఆర్థికవేత్తలపై ఏప్రిల్ 10-19 మధ్య జరిపిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. 2018 నాలుగో త్రైమాసికం వరకు ఆర్బీఐ రెపోరేటును 6.25 శాతంగానే ఉంచనున్నట్టు తెలిసింది. అంతేకాక రివర్స్ రెపో రేటు 6.00 శాతంగా ఉండనున్నట్టు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అనేది రిజర్వు బ్యాంకు అతిపెద్ద ఆందోళనకరమైన అంశంగా మారిందని, ప్రస్తుతం సులభతరమైన ద్రవ్యవిధానాన్ని ఇది హరిస్తుందని క్రిసిల్కు చెందిన ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి చెప్పారు. గత నెల వార్షిక వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పెరిగిందని, 2016 అక్టోబర్ నుంచి ఈ నెలలోనే చాలా వేగవంతంగా పెరిగిందని పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5 శాతానికి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో వడ్డీరేట్ల కోత అంచనాలను వారు తగ్గిస్తున్నారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని పేర్కొంటున్నారు. -
ఆరంభం ఆశాజనకం
► ఆశాజనకంగా తొలిరోజు పొగాకు వేలం ధరలు ► మున్ముందు ఈ ధరలు కొనసాగించడంపైనే అనుమానం ► 38 మంది వ్యాపారులకు గాను వేలంలో పాల్గొన్నది తొమ్మిది మందే ► వ్యాపారులంతా వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలి ► పొగాకు రైతు నాయకుల డిమాండ్ ఒంగోలు టూటౌన్: జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 12 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు తొలిరోజు జరిగాయి. వెల్లంపల్లి వేలం కేంద్రంలో కిలోకి రూ.160కు వేలం మొదలైంది. తొలిరోజు కావడంతో తొమ్మిది బేళ్లే వచ్చాయి. దీంతో పాటు వెల్లంపల్లి –1,2 కేంద్రాలను కలిపి ఒకే వేలం కేంద్రాన్ని చేశారు. కొండపి వేలం కేంద్రంలో అత్యధిక ధర కిలోకు రూ.162 లభించింది. ఒంగోలు వేలం కేంద్రం–2 లో ధర కిలోకి రూ.161 వచ్చింది. పొదిలి–1 వేలం కేంద్రానికి 9 బేళ్లు రాగా తొమ్మిదీ కొనుగోలు చేశారు. అత్యధిక ధర రూ.160 రాగా అత్యల్ప ధర రూ.158 పలికింది. అదేవిధంగా కందుకూరు–2 వేలం కేంద్రంలో కూడా అత్యధిక ధర కిలోకి రూ.160 రాగా అత్యల్ప ధర రూ.159 వచ్చింది. అదే విధంగా టంగుటూరు–1, టంగుటూరు–2 వేలం కేంద్రాలలో ఇవే ధరలు పలికాయి. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలలో కూడా అత్యధిక ధర గ్రేడ్–1 రకానికి రూ.160 రాగా అత్యల్ప ధర రూ.157 వచ్చింది. మొత్తం చూసుకుంటే తొలిరోజు వేలం కేంద్రాల్లో వచ్చిన ధరలు రైతులకు కొంత ఊరట కలిగించాయి. అయితే ఈ ధరలు మున్ముందు కొనసాగుతాయా లేదా అన్న సందేహాన్ని అటు రైతులు, ఇటు రైతు సంఘాల నాయకులు వెలిబుచ్చుతున్నారు. వేలం కేంద్రాల్లో పాల్గొనే వ్యాపారులు మొత్తం 38 మంది ఉండగా..వీరంతా బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారే. ప్రస్తుతం వీరిలో తొలి రోజు కేవలం తొమ్మిదిమందే వేలం కేంద్రాలలో పాల్గొనటంపై రైతులు కొంత నిరాశ వెలిబుచ్చారు. వేలం కేంద్రాల్లో పోటీ రావాలంటే వ్యాపారులందరూ పాల్గొనాలి. పోటీతత్వం పెరగాలి. ఇలా జరిగితేనే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కనుక ఈ పరిస్థితుల్లో వ్యాపారులందరూ వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినా«థ్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంట సాగు చేశారు. మొత్తం జిల్లాలో 82 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతివ్వగా కేవలం 50 మిలియన్ ఉత్పత్తి మాత్రమే వచ్చిందని అంచనా. దాదాపు 30 మిలియన్ కిలోల నుంచి 35 మిలియన్ వరకు ఉత్పత్తి తగ్గింది. వర్షాలు లేకపోవడం, పొగమల్లె తెగుళ్ల వలన రైతులు ఖర్చు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క కిలో పొగాకు ఉత్పత్తికి దాదాపు రూ.135 ఖర్చు చేశారు. ఇలా గత రెండేళ్లలోనూ పొగాకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. అయినా బ్యాంక్ కు సుమారుగా రూ. 2 లక్షలకుపైగా నష్టపోయారు. ఈ ఏడాది ఎకరానికి అదనంగా రూ.15 వేలకుపైగా ఖర్చు పెట్టి పంటను కాపాడుకున్నారు. పంట ఉత్పత్తి తగ్గింది. ఈ పరిస్థితుల్లో రైతులకు మంచి ధరలు ఇస్తేనే గట్టెక్కుతారు. కనుక వేలం కేంద్రాలలో పొగాకు వ్యాపారులందరూ పాల్గొనేలా బోర్డు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వేలంలో పోటీ పెరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
వామ్మో గ్యాస్ ధర
– కొండెక్కి కూర్చున్న గ్యాస్ ధరలు – ఫిబ్రవరిలో రూ.700, ఈ నెల రూ.790.50 – వచ్చే నెలలో ఎంతో...? – అంతర్జాతీయ మార్కెట్ అధారంగా మార్పులు – ప్రతి నెలా వడ్డింపులు చేస్తున్న కంపెనీలు – వ్యాపార గ్యాస్ ధర కూడా పెంపు – బెంబేలెత్తుతున్న వినియోగదారులు ఇలా బండ పెరుగుదల... - జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. - మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. - వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలా... గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. - ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. అదే జాడలో ధరలూ... - ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. - ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. - కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. - పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. సాక్షి, రాజమహేంద్రవరం: వంట గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. వినియోగదారులు గ్యాస్ పోయ్యి వెలిగించకుండానే సెగ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ధరలను నిర్ణయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అంతర్జాతీయ మర్కెట్ ఆధారంగా ధరల్లో ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతం ఏడాది నుంచి అమలు చేస్తున్నాయి. జనవరిలో ఇంటి గ్యాస్ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. ఇక మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్ సిలిండర్ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు. సబ్సిడీలో కోత... నగదు బదిలీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, వస్తువులపై ఇస్తున్న సబ్సిడీని ఖాతాదారులకు నేరుగా ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్యాస్ ధర సబ్సిడీ కూడా వారి ఖాతాల్లో జమయ్యేలా గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలతో ఆధార్, మొబైల్ నంబర్లను అనుసంధానం చేసింది. ఖాతాదారుడు తన మొబైల్ నంబర్ నుంచి సంబంధింత గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన సెల్ నంబర్‌కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఇస్తున్నారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీలు అవకతవకలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావించింది. వినియోగదారుడు గ్యాస్ ధరను ముందు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ఏడాది గ్యాస్ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. సబ్సిడీ వదులుకున్న వారు నామమాత్రమే... జిల్లాలో 13,10,669 గ్యాస్ కనెక్షన్లున్నాయి. పేద, ధనిక, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, యజమాని, కార్మికుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గ్యాస్ సబ్సిడీ వర్తిస్తోంది. ధనవంతులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో మన జిల్లాలో ఉన్న 13,10,669 మంది వినియోగదారుల్లో కేవలం 6000 మంది మాత్రమే సబ్సిడీ వదులుకున్నారు. సాధారణ గ్యాస్ కనెక్షన్లతోపాటు జిల్లాలో 6,056 వ్యాపార కనెక్షన్లున్నాయి. హెచ్‌పీ, భారత్, ఇండేన్ కంపెనీలు జిల్లాలో 71 ఏజెన్సీలను ఏర్పాటు చేసి వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి. బెంబేలెత్తుతున్న వ్యాపారులు... గ్యాస్ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులతోపాటు, వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. ఈ సిలిండర్ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. కేవలం రెండు నెలల్లో గ్యాస్ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు: 13,10,669 సబ్సిడీ వదులుకున్నవారు: 6000 వ్యాపార కనెక్షన్లు: 6,056 జిల్లాలో ఏజెన్సీలు: 71 అంతర్జాతీయ మర్కెట్‌కు అనుగుణంగా మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరల లాగానే అంతర్జాతీయ మర్కెట్ ధరల ఆధారంగా ప్రతి నెలా గ్యాస్ ధరలు మారుతుంటాయి. ప్రతి నెలా ఇది తప్పనిసరి. ఒక నెల ధర పెరిగితే మరో నెల తగ్గొచ్చు. పెరిగిన ధరకు అనుగుణంగా వినియోగదారులకు సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ధర పెరిగితే సబ్సిడీ మొత్తం తగ్గుతుంది. గ్యాస్ ధర తగ్గితే సబ్సిడీ మొత్తం పెరుగుతుంది. – వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి. -
బ్యాంకు స్టాక్స్ ఢమాల్
ముంబై : వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకు స్టాక్స్ ఢమాల్ మన్నాయి. రిజర్వు బ్యాంకు పాలసీ ప్రకటనాంతరం బ్యాంకు స్టాక్స్‌లో విపరీతంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.68 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా 2.58 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.19 శాతం, ఎస్బీఐ 1.62 శాతం, కొటక్ మహింద్రా బ్యాంకు 1.55 శాతం నష్టపోయాయి. ఈ నష్టాలతో బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంకు ఇండెక్స్ 0.55 శాతం డౌన్ అయి, 23,186.39 వద్ద ట్రేడైంది. పాలసీ ప్రకటనాంతరం బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 180 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్లు ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా రిజర్వు బ్యాంకు ఇప్పటికి రెండు సార్లు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ మార్కెట్లు మాత్రం వడ్డీరేట్లలో 0.25 పాయింట్లు కోత విధిస్తుందని ఆశ పడ్డారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం వెలువరించింది. -
బీఎస్ఎన్ఎల్ లోకల్ కాల్ రేట్ల పెంపు
చంఢీఘర్: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ, బీఎస్ఎన్ఎల్, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే లోకల్ కాల్ పల్స్‌ను తగ్గించింది. అంతేకాకుండా లోకల్ కాల్స్ చార్జీను 20 శాతం పెంచింది. ఒక బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి మరో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్‌కు చేసే లోకల్ కాల్ పల్స్‌ను మూడు నిమిషాల నుంచి రెండు నిమిషాలకు తగ్గించామని బీఎస్ఎన్ఎల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. లోకల్ కాల్ చార్జీని రూ. 1 నుంచి రూ.1.20కు పెంచామని పేర్కొన్నారు.ఈ మార్పులు ఈ ఏడాది జనవరి బిల్లులో కనిపిస్తాయని వివరించారు. -
ఎక్కడ ఫెడ్ రేట్లు అక్కడే కానీ..
పెట్టుబడిదారులు ఎంతో నిశితంగా పరిశీలించిన ఫెడ్ రిజర్వు రేట్ల ప్రకటన వెలువడింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. కానీ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే డిసెంబర్లో వడ్డీరేట్లను పెంచుతామనే సంకేతాలను ఫెడరల్ రిజర్వు వెలువరిచింది. బుధవారంతో ముగిసిన రెండు రోజుల ఫెడ్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది. అమెరికా ఎన్నికలు ఇంకా వారమైనా గడువు లేనిపక్షంలో, ఈ సమయంలో వడ్డీరేట్లను ఆ దేశ రిజర్వుబ్యాంకు మార్పులు చేయదని మార్కెట్ విశ్లేషకులు ముందస్తుగానే అంచనావేశారు. వారి అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడ్ రిజర్వు తెలిపింది. ఇప్పటికే అమెరికా ఎన్నికల ప్రకంపనాలతో ప్రపంచమార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ రేట్లను పెంచితే మరింత మార్కెట్లు క్షీణించే అవకాశాలుండేవని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే అమెరికా ఆర్థికవ్యవస్థ లాభపడిందని, ఉద్యోగాల వృద్ధి మాత్రం అలా స్థిరంగా ఉండిపోయిందని అమెరికా సెంట్రల్ బ్యాంకు రేట్ సెట్టింగ్ కమిటీ తెలిపింది. వారు నిర్దేశించిన ద్రవ్యోల్బణం 2 శాతం టార్గెట్ సాధించే దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పయనిస్తుందనే దానికి సంకేతంగా మరింత ఆశావాదం కావాలని పాలసీమేకర్స్ వ్యక్తంచేశారు. దీనికోసం మరికొన్ని రోజులు వేచిచూస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మిడ్ డిసెంబర్లో జరిగే పాలసీ మీటింగ్‌లో రేట్లపెంపు ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటనతో అమెరికా మార్కెట్లు కిందకి దిగజారాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 52.32 పాయింట్లు, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 11.29 పాయింట్లు, నాస్డాక్ కాంపొజిట్ 40.60 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున్న ఆ దేశ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. -
మహిళలకు ఎస్బీఐ శుభవార్త!
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పండుగల పథకంకింద మహిళా రుణగ్రహీతలకు చౌకగా రుణాలను అందించేందుకు నిర్ణయించినట్లు మీడియా రిపోర్టు చేసింది. ఈ వార్తల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తగ్గింపు రుణ రేట్లను ప్రకటించింది. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గత ఆరేళ్లలోనే కనిష్టరేటని మార్కెట్ల ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే ఫెస్టివ్ సీజన్ లో అమలు చేస్తున్న ఈ వడ్డీరేట్లు నవంబర్, డిసెంబర్లలో మంజూరు చేసే రుణాలకు వర్తించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. అంతేకాదు బిజీ సెషన్ సందర్భంగా ఇతర రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను 9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును రూడా మాఫీ చేస్తోంది. కాగా ఆర్ బీఐ సూచనల మేరకు గత వారమే తగ్గింపు రేట్లను ప్రకటించిన బ్యాంకు మరోసారి రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు కింద గృహ రుణాల వార్షిక ఎంసీఎల్ఆర్ 8.90 శాతంగా ఉంది. -
మళ్లీ పేలిన పెట్రోబాంబు
పెట్రోలుపై రూ.1.34, yీ జిల్‌పై రూ.2.37 పెంచిన కేంద్రం పన్నుపోటుతో అదనంగా బాదేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై నెలకు రూ.7.75 కోట్లు పైగా భారం నెలన్నరలో మూడుసార్లు వడ్డన సాక్షి, రాజమహేంద్రవరం : పెట్రో ధరల బాంబు మరోమారు పేలింది. లీటర్ పెట్రోలుపై రూ.1.34, డీజిల్‌పై రూ.2.37 చొప్పున పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 63 పైసలు, డీజిల్‌పై 53 పైసల మేర పన్ను విధించింది. ఫలితంగా శనివారం వరకూ రూ.69.78గా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఆదివారం రూ.71.72కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.58.78 నుంచి రూ.61.68కు పెరిగింది. 45 రోజుల్లో భారం మోపారిలా.. గడచిన 45 రోజుల వ్యవధిలో పెట్రో ధరలను మూడుసార్లు పెంచారు. తాజా వడ్డనతో కలిపి ఈ నెలన్నర వ్యవధిలో పెట్రోలుపై రూ.4.86, డీజిల్‌పై రూ.4.84 మేర వినియోగదారులపై భారం పడింది. గత నెల ఒకటో తేదీన పెట్రోలుపై రూ.3.38, డీజిల్‌పై రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. ఈ నెల 4వ తేదీన డీలర్ల కమీషన్ పెంచే పేరుతో పెట్రోలుపై 14 పైసలు, డీజిల్‌పై 10 పైసల చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. దీనికి తాజా పెంపు తోడైంది. రోజుకు రూ.26 లక్షల బాదుడు తాజా పెరుగుదలతో జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.26 లక్షల భారం పడుతోంది. జిల్లాలో 251 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ సుమారు 5 లక్షల లీటర్ల పెట్రోలు, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్ పెట్రోలుపై రూ.1.34 పెంచడంతో రూ.6.90 లక్షలు, లీటర్ డీజిల్‌పై రూ.2.37 పెంచడంతో రూ.18.96 లక్షల చొప్పున రోజుకు దాదాపు రూ.25.86 లక్షల మేర వినియోగదారులపై అదనపు భారం పడింది. ఈ లెక్కన జిల్లాపై నెలకు రూ.7.75 కోట్ల భారం పడుతోంది. డీజిల్‌కన్నా విమాన ఇంధనం ధర తక్కువ పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించే పెట్రోల్, డీజిల్ ధరల కన్నా ధనికుల ప్రయాణ సాధనమైన విమాన ఇంధనం ధర తక్కువగా ఉండడం గమనార్హం. విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కన్నా డీజిల్ ధర సుమారు రూ.8 పైగా ఎక్కువగా ఉంది. విశేషం. లీటర్ ఏటీఎఫ్ ధర రూ.46.82 కాగా, డీజిల్ ధర రూ.54.98 కావడం గమనార్హం. ఏటీఎఫ్ ధరకన్నా పెట్రోల్ ధర దాదాపు 50 శాతం అధికంగా ఉంది. పేదల జేబుకు చిల్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. ద్విచక్రవాహనదారుల నెలవారీ పెట్రోలు ఖర్చు తక్కువలో తక్కువ రూ.200 పెరగనుంది. పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలకు అనుగుణంగా ఆటోవాలాలు కూడా చార్జీలు పెంచే పరిస్థితి నెలకొంది. ఆటో చార్జీలు పెంచితే తిరిగి ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది. ఒకవేళ పెరిగిన ధరలను ఆటోవాలాలే భరిస్తే ఆ మేరకు నష్టపోవాల్సి వస్తుంది. మరోపక్క పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు కూడా పెరగనున్నాయి. ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటన్నింటి ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. రోజుకు రూ.30 కోల్పోతున్నాను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నిత్యావసరాల ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. రోజుకు 18 గంటలు ఆటో నడుపుతూంటే మూడు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు డీజిల్ ధర పెరగడం వల్ల రోజుకు రూ.30 వరకూ నష్టపోవాల్సి వస్తుంది. డీజిల్ ధరల పెంపు మేరకు చార్జీలు పెంచలేని పరిస్థితి. – దూనబోయిన శ్రీనివాస్, ఆటోవాలా, రాజమహేంద్రవరం మధ్యతరగతివారికి ఇబ్బందులే.. పెట్రో ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈమధ్య కాలంలో తరచూ పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు తప్పవు. ధరల పెంపు నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఉంది. – దంగేటి నాగేశ్వరరావు, దంగేరు, కె.గంగవరం మండలం -
బండెక్కితే బాదుడే
–మరోసారి పెరిగిన పెట్రో ధరలు –పెట్రోల్‌పై రూ.1.34, డీజిల్‌పై రూ.2.37 పెంపు –15 నెలల్లో 15 సార్లు పెంపు –గగ్గోలు పెడుతున్న వాహనదారులు తణుకు : పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 15 నెలల కాలంలో ఏకంగా 15 సార్లు డీజిల్ ధర, 12 సార్లు పెట్రోలు ధర పెంచింది. ఈ పరిస్థితుల్లో వాహనదారులపై భారీగానే భారం పడుతోంది. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లీటరు పెట్రోలుపై రూ. 1.34, లీటరు డీజిల్‌పై రూ. 2.37 పెంచిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. పెరుగుదల ఇలా.. 2015 ఏప్రిల్ 16న పెట్రోల్‌పై రూ. 0.87 కేంద్రం పెంచింది. మే 1న డీజిల్‌పై రూ. 2.47, పెట్రోలుపై రూ. 4.20 పెరిగింది. అదే నెల 16న లీటరు డీజిల్‌పై రూ. రూ. 2.94, పెట్రోలుపై రూ. 3.41, జూన్ 16న పెట్రోలుపై రూ. 0.70, అక్టోబరు 1న డీజిల్‌పై రూ. 0.53, నవంబరు 1న డీజిల్‌పై రూ.1.03, 16న డీజిల్‌పై రూ.0.92, పెట్రోలుపై రూ.0.32, డిసెంబర్ 1న డీజిల్‌పై రూ. 0.24, పెట్రోల్‌పై రూ.0.61 పెంచారు. 2016 జనవరి 1న లీటర్ డీజిల్‌పై రూ.1.11, పెట్రోలుపై రూ.0.66, ఫిబ్రవరి 1న లీటర్ డీజిల్‌పై రూ. 0.07, 18న రూ. 0.29, మార్చి 1న లీటరు డీజిల్‌పై రూ. 1.58, 17న రూ. 1.97, పెట్రోలుపై రూ. 3.16, ఏప్రిల్‌లో డీజిల్‌పై లీటరుకు రూ. 4.10, పెట్రోలుపై రూ. 3 చొప్పున కేంద్రం పెంచింది. మే 1న లీటర్ పెట్రోలుపై రూ.1.06, డీజిల్‌పై 2.94, 17న పెట్రోలుపై రూ.0.83, డీజిల్‌పై రూ.1.26 పెంచారు. తాజాగా డీజిల్‌పై రూ. 2.37, పెట్రోల్‌పై రూ. 1.34 పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రూ.4 కోట్లు భారం 2015 ఏప్రిల్ నుంచి 2016 ఏప్రిల్ వరకు వరకు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో వాహనదారులపై సుమారు రూ.4 కోట్లు భారం మోస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో వినియోగదారులపై సుమారు రూ.50 లక్షలు అదనపు భారం పడుతోంది. జిల్లాలో 80 పైగా పెట్రోలు బంకులు ఉండగా రోజుకు 10 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు, 7 లక్షల పెట్రోలు అమ్మకాలు జరుగుతుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పుడు కూడా పది పైసలు.. ఇరవై పైసలు మాత్రమే తగ్గించి, పెరిగినప్పుడు మాత్రం రూపాయి, రెండు రూపాయల మేర వడ్డించడాన్ని వినియోగదారులు తప్పుబడుతున్నారు. -
దసరా పేరుతో భక్తుల దోపీడీకి రంగం సిద్ధం
-
వ్రతాల రేట్లు పెంచకండి
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు. మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు. కుర్చీలో కూర్చుని వ్రతమా? అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు. -
వ్రతాల రేట్లు పెంచకండి
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు. మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు. కుర్చీలో కూర్చుని వ్రతమా? అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు. -
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం
సూర్యాపేట : ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన lమాట్లాడుతూ రెండు సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాసరావు, సృజన, భట్టు శివాజీ, బొమ్మగాని శ్రీనివాస్, పుట్టపాక శ్రీనివాస్, కోటయ్య, సిరపంగి నాగరాజు, కొండల్, లతీఫ్, రాంరెడ్డి, అంతయ్య, దోరెపల్లి శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో ధరలు ఉండాలి
కోదాడ: వ్యవసాయ రంగంలో అధునిక పరికరాల వాడకం ఎక్కువగా ఉన్నపుడే రైతులు అధిక దిగుబడులు సా«ధిస్తారని కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీ కె. శశిధర్‌రెడ్డి అన్నారు. యంత్రాల ధరలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. కోదాడలో వీఎంసీ జాన్‌ఢీర్ ట్రాక్టర్ షోరూంలో కొత్త సీరిస్ ట్రాక్టర్‌ను ఆయన ప్రాంభించారు. కొత్త ట్రాక్టర్ ధర తక్కువ ఉండడం వల్ల రైతులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సురేష్‌కుమార్, కోదాడ డివిజన్ మేనేజర్ రామారావు, రాయపూడి వెంకటనారాయణ, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, లంకెల నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీరేట్లు మళ్లీ యథాతథమే..!
బెంగళూరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆగస్టు 9న నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను మార్చదని రాయిటర్స్ పోల్‌లో తేలింది. ఎక్కడ రేట్లు అక్కడే ఉంచుతుందని రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది. ఒకవేళ ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, రుతుపవనాల కాలం అనంతరం రేట్ల కోత ఉంటుందని వెల్లడైనట్టు రాయిటర్స్ పేర్కొంది. మొత్తం 43 మంది ఆర్థికవేత్తలపై రాయిటర్స్ ఈ సర్వే నిర్వహించింది. గత పాలసీ సమీక్షలో ఉంచిన 6.50 శాతం రేటును ఈ సారి కూడా అలాగే ఉంచుతారని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రాజన్ నిర్వహించబోయే తుది సమీక్ష ఇదేకానుండటం గమనార్హం. సెప్టెంబర్ 4న ఆయన పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే 43 మంది ఆర్థిక వేత్తలో ఐదుగురు మాత్రం 25 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందని వెల్లడించారు. నగదు నిల్వల నిష్పత్తిని 4.00 శాతంగానే ఉంచుతారని తెలిపారు. జూన్ నెలలో వినియోగదారుల ధరలు 5.77 శాతానికి ఎగిశాయి. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ 5 శాతం టార్గెట్ కంటే ఈ ధరలు ఎక్కువగా ఉండటంతో రేట్లలో కోతకు విఘాతం ఏర్పడుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జీతాల పెంపు, రుతుపవనాలు ద్రవ్యోల్బణం ఏమేరకు ప్రభావం చూపుతాయో స్పష్టమైన అభిప్రాయం వచ్చేంతవరకు ఆర్బీఐ స్టేటస్ క్వోను ఇలాగే కొనసాగిస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థికవేత్త దీపాన్విత దత్తా తెలిపారు. రాజన్ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టబోయే ఆర్బీఐ గవర్నర్ పేరును ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. భవిష్యత్ రేటు నిర్ణయాలను మానిటరీ పాలసీ కమిటీనే నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించేందుకు మానిటరీ పాలసీ కమిటీని నియమించబోతున్నట్టు తెలిసిందే. -
ఎరువుల ధరలు తగ్గింపు
పెగడపల్లి: ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించినట్లు ఏవో కరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.971 నుంచి రూ. 918, ఎంవోపీ రూ.840 నుంచి రూ.578, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, ఇఫ్కో కంపెనీకి చెందిన 20ః20 ధర రూ.918 నుంచి రూ.866, డీఏపీ రూ.1244 నుంచి రూ.1155, స్పిక్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి రూ.845, డీఏపీ 1195 నుంచి రూ. 1140, ఐపీఎల్ కంపెనీకి చెందిన 20ః20 ధర రూ. 890 నుంచి 819, ఎంవోపీ రూ. 840 నుంచి రూ. 578, డీఏపీ రూ. 1195 నుంచి 1155, ఆర్సీఎఫ్ డీఏపీ ధర రూ.1106గా ఉందని ఆమె వివరించారు. -
అవే కూరగాయాలు
దిగిరామంటున్న ధరలు వరదలకు నీటమునిగిన కూరగాయల పంటలు వేసవిలో మండడం మొదలైన కూరగాయల రేట్లు నేటికీ ఆదిశలోనే కొనసాగుతున్నాయి. కొన్నింటి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ మిగిలినవాటి రేట్లు పెరగడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరదలు మన ప్రాంతంలోని కూరగాయల పంటలను దెబ్బతీయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అమలాపురం : వేసవి ఆరంభంలో చుక్కలనంటిన కూరగాయల ధరలు ఇప్పటికీ దిగి రావడం లేదు. వేసవి ఎండలకు మన ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో టమాటా, బీన్స్ గింజలు, చిక్కుడు కాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల నుంచి ఇతర ప్రాంతాల్లో పంట కాలం పూర్తి కావస్తుండడంతో క్యాప్సికమ్, బంగాళాదుంప వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరల తగ్గుతాయనుకుంటున్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. క్యాప్సికమ్ ధర కేజీ రూ.80 వరకు ఉంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.90. బీట్రూట్, క్యారెట్ ధరలు రూ.40 ఉండగా, అల్లం ధర రూ.60 వరకు ఉంది. బీన్స్కాయల ధర రూ.60, బంగాళాదుంప రూ.24 నుంచి రూ.26 వరకు ఉంది. టమాటా ధర గత నెలకన్నా తక్కువ అనిపిస్తున్నా ఇప్పటికీ కేజీ రూ.32 వరకు ఉండడం విశేషం. ఇవన్నీ దిగుమతి చేసుకొనేవే. బంగాళాదుంప కోల్‌కతా నుంచి, మిగిలిన కాయగూరలు బెంగళూరు, చిత్తూరుల నుంచి దిగుమతి అవుతున్నాయి. అక్కడ పంట కాలం పూర్తి కావస్తుండడం, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొంత పంట దెబ్బతినడం, ఎగుమతులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే వీటి ధరలు స్వల్పంగా తగ్గినా సాధారణ స్థాయికి వీటి వచ్చే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ముంచిన వరదలు గోదావరికి వచ్చిన వరదలు కూరగాయ రైతులను ఎక్కువగా నష్టపరిచాయి. ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతుంటాయి. చిక్కుడు, గోరుచిక్కుడు, ఆనప, దొండ, బీర, పొట్ల, కాకరకాయ వంటి పందిరి కూరగాయలు, బెండ, టమాట, వంగ వంటి కాయగూరలతోపాటు తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు ఎక్కువ. ముఖ్యంగా ఆలమూరు, పి.గన్నవరం, అయినవిల్లిలో విస్తృతంగా వీటిని సాగు చేస్తుంటారు. గోదావరి వరదల ప్రభావం ఈ మండలాలపైనే ఎక్కువగా ఉంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 2,928 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ ప్రభావంతో స్థానికంగా పండే ఈ రకం కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. -
ఐడియా మరో బంపర్ ఆఫర్...
న్యూఢిల్లీః ఐడియా నెట్వర్క్ వినియోగదారులకు వారంలోనే వరుసగా రెండోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న 4జి, 3జి మొబైట్ ఇంటర్నెట్ ప్యాక్ ధరలపై 67 శాతం తగ్గింపును ప్రకటించింది. తన పోటీదారులు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తో పోల్చితే భారీగా తగ్గింపును ఐడియా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 1జిబి కన్నా తక్కువ ప్యాక్స్ పై ధరలో 45 శాతం తగ్గింపు విధిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ... తాజాగా అత్యధికంగా ఇంటర్నెట్ వాడే 2జిబి నుంచి 10 జిబి ప్యాక్స్ కలిగిన వినియోగదారులకు 67 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఐడియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్ 3జి, 4జి కస్టమర్లకోసం భారతి ఎయిర్ టెల్ 67 శాతం ధరలు తగ్గించడంతో.. ఐడియా ఒకే వారంలో రెండోసారి ధరల తగ్గింపును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐడియా 10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను 349 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుత 67 శాతం భారీ తగ్గింపులతో ఐడియా కస్టమర్లు ఇంతకు ముందు 3జి డేటా ధరలకు దగ్గరగా 5జిబి 4జి, 3జి డేటా ప్యాక్ లకు 649 రూపాయలకే పొందే అవకాశం లభిస్తోంది. ఈ నూతన టారిఫ్ ను ప్రీ పెయిడ్ వినియోగదారులు 4జి, 3జి ప్రొవైడర్లద్వారా వెంటనే పొందవచ్చని ఐడియా వెల్లడించింది. రిలయన్స్ జియో అతి తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్యాక్స్ ను అందిస్తుండటంతో మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు ధరలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
రూ. 31 వేల చేరువలో పసిడి
ముంబై: అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన బులియన్ మార్కెట్ కు తీపి కబురు అందించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటనతో సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి మెరుపులు మెరిపిస్తోంది. బుధవారం నష్టాల్లోకదలాడిన పుత్తడి ధరలు ఫెడ్ ప్రకటనలతో పరుగులు పెడుతూ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దాదాపు 500 రూ. కు పైగా లాభపడింది. ప్రస్తుతం 526 రూపాయల లాభంతో 30,970 దగ్గర ట్రేడవుతూ 31 వేల మార్క్ కు చేరువలో ఉంది. అటు డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ బలహీనపడి నేల చూపులు చూస్తూ వుండడంతో రూపాయి క్రమేపీ బలపడుతోంది. కాగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్టు తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.అయితే వడ్డీ రేట్ల పెంపు ఎపుడు ఉంటుందున్నది పేర్కొనలేదు. -
ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు..
-
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
ఇలా అయితే రేట్లు పెంచేస్తాం..
కాల్ డ్రాప్ పెనాల్టీలపై ట్రాయ్‌కు టెల్కోల లేఖ న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ అయితే మొబైల్ ఆపరేటర్లు కస్టమర్లకు పరిహారం చెల్లించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలకు వ్యతిరేకంగా టెల్కోలు గళమెత్తాయి. కాల్స్‌కి అంతరాయాలే ఉండని నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం సాధ్యంకాదని స్పష్టం చేశాయి. బలవంతంగా జరిమానాలు కట్టిస్తే.. తాము మొబైల్ టారిఫ్‌లు పెంచేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. టెలికం కంపెనీల సమాఖ్యలు సీవోఏఐ, ఏయూఎస్‌పీఐ ఈ మేరకు ట్రాయ్‌కు సంయుక్తంగా లేఖ రాశాయి. పెనాల్టీల విధానం వల్ల కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం కాకపోగా.. పరిహారం లభిస్తుందనే ఆశతో కస్టమర్లు కావాలనే కాల్స్‌కి అంతరాయాలూ కలిగేలా వ్యవహరించే అవకాశం ఉందని అవి పేర్కొన్నాయి. దీనివల్ల కాల్ డ్రాప్స్ ఇంకా పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. యూజరుకు కట్టిన పరిహారాలను రాబట్టుకునేందుకు ఆపరేటర్లు టారిఫ్‌లను పెంచాల్సి వస్తుందని, అంతిమంగా కస్టమర్లు టెలికం సర్వీసులు పొందాలంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని టెల్కోలు పేర్కొన్నాయి. జరిమానాల విధానం.. అపరిమిత దుర్వినియోగానికి తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని తెలిపాయి. సగటున యూజర్ నుంచి తమకు వచ్చే ఆదాయమే రూ. 125 కాగా, పరిహారం కింద నెలకు రూ. 90 కట్టాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది పరిశ్రమను కలవరపరుస్తోందని టెలికం సంస్థలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి కాల్ డ్రాప్ అయిన పక్షంలో కస్టమర్లకు టెల్కోలు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజుకు గరిష్టంగా మూడు కాల్స్‌కు, పెనాల్టీని రూ. 3కి పరిమితి విధించింది. -
కిలో @1000
హొసూరు: వినాయకచవితిని పురస్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. తమిళనాడులోని హొసూరు పూలమార్కెట్లో మంగళవారం నుంచే పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో కనకాంబరాలు రూ. వెయ్యికి అమ్ముడు పోతున్నాయి. చేమంతులు రూ. 150, మల్లెలు రూ. 250 నుంచి రూ. 300, రోజాలు రూ. 160 నుంచి రూ. 180, బంతిపూలు రూ. 30 చొప్పున విక్రయాలు సాగించారు. బుధ, గురువారాల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశముంది. పూల ధర అనూహ్యంగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా
విశాఖ: రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఉల్లి ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని, నిత్యవసర సరుకుల ధరలను పేదప్రజలకు అందుబాటులోకి తేవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని లేకపోతే రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన త్రాసు పలువురిని ఆకర్షించింది. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే.. జేబు నిండా ఉల్లిపాయలు కూడా రావడం లేదనే ఉద్దేశంతో ఈ త్రాసును ఏర్పాటు చేశారు. -
మెరుపు తగ్గిన పసిడి
-
చిన్నబోయిన 'మల్లె'
కర్నూలు: 'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' అన్నట్టుగా తయారైంది గుబాళించే మల్లె పూల పరిస్థితి. మార్కెట్లో మల్లెపూల ధర రోజు రోజుకూ పతనం అవుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 400 మంది రైతులు.. 500 ఎకరాల్లో మల్లెతోటలను సాగు చేస్తున్నారు. కిలో పూలు తెంచినందుకు రూ. 40 కూలిగా ఇవ్వాల్సి వస్తుంటే.. మార్కెట్లో కిలో ధర రూ. 20 పలుకుతోంది. దీంతో ఆర్థిక భారాన్ని భరించలేక పూలను తోటల్లోనే తెంచకుండా వదిలేస్తున్నారు. కూలీల ఖర్చులను భరించి కొంత మంది పూలను కోయించి హైదరాబాద్ తరలించినా అక్కడ కూడా ధర వెక్కిరిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.8 ప్రకారం కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. -
భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు
- ఆగస్టు 1 నుంచీ కొత్త ధరల అమలుకు సర్కారు నిర్ణయం - జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల కసరత్తు - వచ్చే నెల 20 నుంచి వెబ్సైట్లో పెంపు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేం దుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. జిల్లాల వారీగా చార్జీల పెంపు ప్రతిపాదనలను రూపొందించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారులు(ఆర్డీవో)/ జాయింట్ కలెక్టర్ల(జేసీ) అధ్యక్షతన సబ్ రిజిస్ట్రార్లతో కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం సమీక్షించాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమిం చుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013 ఏప్రిల్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మార్కెట్ విలువ ప్రకారమే మార్కెట్ ధరలను బట్టే భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రతిపాదించాలని సబ్రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా ఆదేశించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను(10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సూచించింది. ధరలు పెరిగిన, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మాట్లో పేర్కొనాలని ఆదేశించింది. హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున, ఆయా ప్రాం తాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు నామమాత్రంగా ఉండవచ్చని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సంబంధించి ఆర్డీవో/జేసీల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. వచ్చే నెల 20 నుంచి వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. వీటిపై వారం రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ధరలు అమల్లోకి వస్తాయి. -
మళ్లీ పెట్రో మోత
నెల్లూరు(రెవెన్యూ): అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటర్ రూ 3.18, డీజల్‌పై లీటర్ రూ 3.09 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్నులు అదనం. పాత ధర రూ.66.48 కాగా పెరిగిన ధరతో రూ.70.43 అవుతుంది. డీజిల్ పాతధర రూ.55.12 పెరిగిన ధరతో 58.61 అవుతుంది. పెరిగిన ధరలు శనివారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. గత నెలలో పెట్రోల్, డీజల్‌పై వ్యాట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలరోజులు గడవక ముందే మళ్లీ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో జిల్లావాసులపై నెలకు రూ.13 కోట్ల వరకు అదనపుభారం పడనుంది. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 300లకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 4 లక్షల లీటర్ల పెట్రోల్, 9 లక్షల లీటర్ల డీజల్‌ను వినియోగిస్తారు. పెట్రోల్‌పై వినియోగదారులకు రోజుకు రూ. 12.72 లక్షల అదనపు భారం పడనుంది. అంటే నెలకు రూ.4 కోట్లపైనే.. అలాగే రోజుకు 9 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. వినియోగదారులకు డీజల్‌పై రోజుకు రూ.28 లక్షల అదనపు భారం పడునుంది. నెలకు సుమారు రూ.9 కోట్లకు పైగా అవుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిత్యావసర ధరలతోపాటు బస్సు, ఆటో చార్జీలు పెరిగే అవకాశం ఉంది. -
బాదేశారు..
నెల్లూరు(రెవెన్యూ): బాబు సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు పెంచి వినియోగదారులపై పెనుభారం మోపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను(వ్యాట్) మోత మోగించింది. పెట్రోల్‌పై రూ 4.04, డీజల్‌పై రూ 4.01 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా వినియోగదారులపై నెలకు రూ.16 కోట్ల భారం పడుతుంది. అలాగే సంవత్సరానికి రూ.192 కోట్ల భారం పడుతుంది. పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. డీజల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల జిల్లాలో ప్రత్యక్షంగా 30 లక్షల మంది ప్రజలపై భారం పడనుంది. జిల్లాలో ప్రతినిత్యం 3 లక్షల లీటర్ల పెట్రోల్, 10 లక్షల లీటర్ల డీజల్ వినియోగిస్తారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల వల్ల రెవెన్యూ మొత్తం తమిళనాడు తదితర పక్క రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నాయకులంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వచ్చే ఇబ్బందులపై ప్రెస్‌నోట్ విడుదల చేస్తామని నాయకులు తెలిపారు. రైతులపైనా భారం.. జిల్లాలో రాబోయే మూడు నెలలు వరికోతలు అధికంగా ఉంటాయి. జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా వరిపంట సాగు చేస్తున్నారు. 80 శాతం మంది రైతులు యంత్రాల సహాయంతో కోతలు సాగిస్తారు. డీజల్ ధరలు పెరగడంతో కోత ధరలు పెరిగే అవకాశం ఉంది. -
సామాన్యుడి కి ధరాఘాతం
సాక్షి, కడప : రాష్ట్ర విభజన దెబ్బ నుంచి జనం కోలుకోనేలేదు.. ఇంతలోనే సామాన్యుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రైతులు కరువుతో అల్లాడుతున్నారు.. ధరలు ఆకాశంలో... ఉద్యోగులకు జీతాలు ఎక్కడివక్కడే... ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు సైతం నిలిపివేసింది... ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా చంద్రబాబు సర్కార్ సామాన్యుడిపై మరో రెండు పిడుగులు కురిపించింది. ఖజానా నింపుకోవడమే తన మొదటి ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒకపక్క పెట్రోలు, డీజిల్‌పై టీడీపీ సర్కాల్ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మోత మోగించడంతో వాహనదారులపై భారీ వడ్డన పడింది. 100 యూనిట్లు వినియోగం దాటితే విద్యుత్తు ఛార్జీ అబ్బా...అనేలా సర్కారు వారి దెబ్బ తగలనుంది. రానున్న ఏప్రిల్ నాటి నుంచి పెంచిన ధరలు అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ మోత మోగిన నేపధ్యంలో నిత్యావసర సరుకుల ధరలతోపాటు ఆర్టీసీ ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.2 కోట్ల మేర అదనపు భారం పడనుందని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెబుతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 100 యూనిట్లు దాటితే ఓంకారమే! ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్షాక్ను మిగిల్చింది. ఒక్కో వినియోగదారుడి బిల్లుపై సుమారు రూ.5.6 శాతం పెంచేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 100 యూనిట్లు పైబడి వాడితే గతంలో యూనిట్‌కు రూ. 3.60 ఉంటే ప్రస్తుతం మారిన టారిఫ్ ప్రకారం రూ. 3.82 భారం పడనుంది. ఇది 150లోపు యూనిట్లకే. ఇక తర్వాత పెరిగే కొద్దీ భారం కూడా భారీగా పెరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎనిమిది నెలల పాలనలోనే జనం జేబుకు చిల్లులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారుల పట్ల కనికరం చూపించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 100 యూనిట్లు దాటిన వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. జిల్లాపై రూ. 3 కోట్ల అదనపు భారం జిల్లాలో గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి 8,94,445 సర్వీసులు ఉన్నాయి. వీటిపై పెంచిన విద్యుత్ ఛార్జీల లెక్క ప్రకారం దాదాపు రూ. 2 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇది చాలదన్నట్లు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో ప్రభుత్వం మరోమారు వాహనదారులపై భారం వేసింది. జిల్లాలో రోజుకు 1.50 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల మేర డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ. 4 వడ్డన పడిన నేపధ్యంలో దాదాపు రూ. కోటి మేర వాహనదారులపై అదనపు భారం పడనుంది. ఇలా ప్రతిసారి అటు కేంద్రమో, ఇటు రాష్ట్రమో దెబ్బమీద దెబ్బ కొడుతూ సామాన్యుడిని కోలుకోనీయకుండా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై చాలాసార్లు కేవలం రూ.1-2 వరకు మాత్రమే తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెంచే సమయంలో ఏకంగా రూ. 4 పెంచుతూ నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పైగా దీని ప్రభావం నిత్యావసర సరుకులతోపాటు ఆర్టీసీ ఛార్జీలపై కూడా పడనుంది. చంద్రబాబు నిజ స్వరూపం ఇదే! కాకులను కొట్టడం...గద్దలకు వేయడం.. బడా పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం...పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం చంద్రబాబుకు అలవాటే! దొంగగా విద్యుత్‌ను వాడుకుంటున్న వారితోపాటు పారిశ్రామికవేత్తలు ఎగరగొట్టిన డబ్బులు వెలికితీస్తే ప్రజలపై విద్యుత్ భారం పడదు. అసలు, కొసరు పెరుతో ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా టీడీపీ సర్కార్ ముందుకు పోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్, క్రూడాయిల్ ధరలు తగ్గాయి. ఇక్కడ సరుకు రవాణా, బస్సు ఛార్జీలపై తగ్గుదల ప్రభావం లేదు. - జి.ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు ప్రస్తుతం కరువుతో విలవిల్లాడుతున్నారు. ఒకవైపు విభజన జరిగి, మరోవైపు కరువుతో వర్షాలు పడక అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరెంటు ఛార్జీలు పెంచి చంద్రబాబు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది చేస్తాం...ఇది చేస్తామని మోసాలతో అధికారంలోకి వచ్చిన బాబు ఏమి చేయలేకపోయారు. చివరకు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి వాటికి పంగనామాలు పెట్టిన ఘనుడు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వస్తూనే రైతు కోసం తొమ్మిది గంటల కరెంటు, ఉచిత విద్యుత్ అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజలపై భారం మోపాలని చూడటం చాలా భాదాకరం. ఇలా చేస్తే మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు. ప్రజా ఉద్యమం చెలరేగకముందే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. - ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్ సీపీజిల్లా కన్వీనర్ -
పింఛన్ల పంపిణీలో చేతివాటం
ఓజిలి: సామాజిక పింఛన్ మొత్తాన్ని ఐదు రెట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పంపిణీపై పర్యవేక్షణను గాలికొదిలేసింది. ఈ క్రమంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదరిస్తూ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తంలో కోతపెడుతున్నారు. రూ.200 నుంచి రూ.300 వరకు అక్రమంగా వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఓజిలి మండలంలో కొత్తగా 348 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. డిసెంబర్లో వారికి రెండు నెలలకు సంబంధించిన మొత్తాన్ని అందజేశారు. వెంకటరెడ్డిపాళెం పంచాయతీ రాజుపాళెంలో ఇటీవల పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీపతి సుబ్బమ్మ, బల్లి లక్ష్మయ్య, తిరుమలశెట్టి శంకరమ్మ తదితరుల నుంచి పంచాయతీ కార్యదర్శి జనార్దన్ కొంత మొత్తం వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే రద్దయిన పింఛన్లను మళ్లీ పునరుద్ధరించిన నేపథ్యంలో కొంత నగదు చెల్లించాల్సిదేనని స్పష్టం చేశారని లబ్ధిదారులు వాపోయారు. సగుటూరు ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన శనగా బుజ్జమ్మ, శనగా రమణమ్మ, తూపిలి మణెయ్య, వీర్లగునపాడుకు చెందిన జడపల్లి పుల్లయ్యకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి తాము జీవనం సాగిస్తున్నామని, ఇలా కోత పెడితే తాము ఎలా బతకాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.200 పింఛన్ ఇచ్చే సమయంలోనూ అధికారులు ఇలాగే వ్యవహరించే వారని, ఇప్పుడు కూడా వారి తీరు మారలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెండు నెలలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై విచారణ జరపాలని కోరుతున్నారు. రూ.300 తీసుకున్నారు వితంతు పింఛన్ కింద రెండు నెలలకు గాను నాకు రూ.2 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని నాకు ఇచ్చినందుకు రూ.300 ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి జనార్దన్ చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే కొంత పింఛన్‌కు ఇవ్వాల్సిందేనన్నారు. చిల్లర మార్చుకుని వచ్చి రూ.300 ఇచ్చా. శ్రీపతి సుబ్బమ్మ, రాజుపాళెం ఇవ్వాల్సిందేనన్నారు నాకు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. అక్టోబర్‌లో సాంకేతిక లోపమని నిలిపేశారు. అధికారులకు విన్నవిస్తే పునరుద్ధరించారు. రెండు నెలలకు గాను రూ.2 వేలు మంజూరైతే రూ.300 అడిగి మరీ తీసుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. బల్లి లక్ష్మయ్య, రాజుపాళెం రూ.వెయ్యి లాక్కున్నారు నాకు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ మంజూ రైంది. స్థానిక పాఠశాలలో పంచాయతీ కార్యదర్శి 2 వేలు ఇచ్చారు. బయటకు రాగానే వెయ్యి రూపాయలు తీసేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. శనగా బుజ్జమ్మ, సగుటూరు నగదు తిరిగి ఇప్పించాలి మా పంచాయతీ కార్యదర్శి నాకు రూ.2 వేలు ఇచ్చి మళ్లీ రూ.వెయ్యి వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే కొత్త పింఛన్ మంజూరు చేసినందుకని చెప్పారు. అధికారులు విచారించి ఆ నగదు నాకు ఇప్పించాలి. తూపిలి మణెయ్య, సగుటూరు ఫిర్యాదు చేస్తే విచారిస్తా పింఛన్ల పంపిణీ విషయంలో అక్రమాలు జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటా. విజయేంద్రకుమార్, ఎంపీడీఓ, ఓజిలి -
ధరలిలా ఉంటే.. టొమాటోను కొనేదెలా?!
-
దోపిడీతోనే షురూ..
జమ్మికుంట, న్యూస్‌లైన్ : అనుకున్నట్లే అయింది. సీజన్ మార్కెట్ దోపిడీతోనే షురూ అయింది. పత్తిని, మార్కెట్‌ను నమ్ముకున్న రైతులను వ్యాపారులు నిండా ముంచారు. తొలిరోజే జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులను చిత్తు చేశారు. తేమ పేరుతో ధర తగ్గించి రైతులను అడ్డగోలుగా దోచుకున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వివిధ గ్రామాల రైతులు ఉదయం తొమ్మిది గంటలకే 12 వేల బస్తాల పత్తి తీసుకువచ్చారు. 10 గంటల ప్రాంతంలో కొందరు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చారు. నాణ్యత ప్రకారం నాలుగు రకాల ధరలు నిర్ణయించారు. నాణ్యత పత్తికి క్వింటాల్‌కు రూ.4,500 నిర్ణయించి, మిగతా పత్తికి రూ.3,500 నుంచి రూ.4,300 వరకు ఏబీసీడీ గ్రేడ్లుగా నిర్ణయించారు. 10 గంటలకే ధరలు పూర్తయి తూకాలు మొదలుకావాలని మంగళవారం జరిగిన మార్కెట్ సమావేశంలో నిర్ణయించుకోగా మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా తూకాలు మొదలు కాలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రైతుల్లో అయోమయం నెలకొంది. వారు ఆందోళనకు సిద్ధమవుతుండగా టౌన్ సీఐ దాసరి భూమయ్య మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులు ఆయనకు మొరపెట్టుకోగా వ్యాపారులకు ఫోన్ చేసి మార్కెట్‌కు రప్పించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కొనుగోలు చేయాలని సూచించారు. అదే సమయంలో ఆర్డీవో చంద్రశేఖర్ మార్కెట్‌కు చేరుకునిచైర్మన్ చాంబర్లో వ్యాపారులతో రహస్యంగా చర్చలు జరిపారు. కొనుగోళ్లు జరిపించాలని సూచించారు. మొదట నిస్సహాయత వ్యక్తం చేసిన వ్యాపారులు తర్వాత ఒప్పుకుని కొనుగోలు ప్రారంభించారు. దోపిడీ జరిగిందిలా.. తేమ పరికరాలు లేకుండా వ్యాపారులు చేతులతోనే పత్తి చూసి గ్రేడింగ్ నిర్ణయించారు. 12 వేల బస్తాల్లో 45 బస్తాలకు కూడా రూ.4,500 ధర చెల్లించలేదని రైతులు ఆరోపించారు. అధికంగా క్వింటాల్‌కు రూ.3,400 నుంచి రూ.3,700 వరకే చెల్లించారని రైతులు వాపోయారు. మార్కెట్‌ను నమ్ముకుని వస్తే నిండా ముంచారని, క్వింటాల్ పత్తికి రూ.800 నుంచి రూ.1500 వరకు నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం తెచ్చిన నష్టం ఓ వైపు వ్యాపారులు, అధికారుల చర్చలు సాగుతుండగానే మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం అందుకుంది. అధికారులు టార్పాలిన్లు అందించకపోవడంతో ఓపెన్‌యార్డులో ఉన్న 2వేల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. అసలే ధర తక్కువ పెడుతున్నారనుకుం టే తడిసిన బస్తాలకు తూకంలో కిలో, రెండు కిలోల వరకు కోత పెట్టారని రైతులు వాపోయారు. అటు ధరల్లో ఇటు తూకంలో తమనే ముంచుతున్నారని ఆవేదన చెందారు.