కిలో @1000
హొసూరు: వినాయకచవితిని పురస్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. తమిళనాడులోని హొసూరు పూలమార్కెట్‌లో మంగళవారం నుంచే పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో కనకాంబరాలు రూ. వెయ్యికి అమ్ముడు పోతున్నాయి. చేమంతులు రూ. 150, మల్లెలు రూ. 250 నుంచి రూ. 300, రోజాలు రూ. 160 నుంచి రూ. 180, బంతిపూలు రూ. 30 చొప్పున విక్రయాలు సాగించారు. బుధ, గురువారాల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశముంది. పూల ధర అనూహ్యంగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.