flowers
-
ఇది సుమచరితం..! రెండు దేశాల సంస్కృతుల సమ్మేళ్లనం
పూల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా రాయడానికి ఇంకా ఉంటుంది. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన ఫ్లవర్ ఆర్ట్. ఇకబెనాలో చేస్తున్న సేవకి గాను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ అందుకున్నారు రేఖారెడ్డి. జపాన్ ఫ్లవర్ ఆర్ట్‌ను భారతీయ చేనేతకళతో సమ్మిళితం చేస్తూ తన ‘లూమ్స్ అండ్ బ్లూమ్స్, పెటల్స్ అండ్ ప్యాలెట్, మిశ్రణం’ రచనలను పరిచయం చేశారు రేఖారెడ్డి. పువ్వులు, రంగులు జీవితంలో భాగం. లైఫ్ కలర్ఫుల్గా ఉంచుకోవడం తోపాటు సుమభరితంగానూ ఉండాలి. భారతీయ సంస్కృతి పూలు ఆస్వాదనకు, ఆడంబరానికి, రసమయమైన, విలాసవంతమైన జీవితానికి ప్రతీకలు. అలాగే దైవానికి చేసే నిత్యపూజలో పూలది ప్రధానపాత్ర. మన పూల అలంకరణ ఈ తీరులోనే ఉంటుంది. జపాన్ వాళ్లు మాత్రం తాము అనుసరించే నిరాడంబర జీవనశైలిలో పూలతో ఆధ్యాత్మికపథం నిర్మిస్తారు. బౌద్ధం నుంచి నేర్చుకున్న వైరాగ్యతను పూల అలంకరణ ద్వారా నిత్యధ్యానం చేస్తారు. మనిషి జీవితాన్ని పువ్వుతో పోలుస్తారు. త్రికోణాకారపు అమరికలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపం ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్. ఒక మొగ్గ, ఒక అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలు. మనిషి జీవన చక్రానికి ప్రతీక. ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా ధ్యానం వంటిదే. ఒకరు దేవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఒకరు ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తారు. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో నిమగ్నమైతే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యానం తర్వాత కలిగే అలౌకిక ఆనందం వంటిదే ఇది కూడా. ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం జపాన్ సంస్కృతిలో భాగమైన ఇకబెనాలో భారతీయ సంస్కృతిని మమేకం చేస్తూ పసుపుకుంకుమలతో పరిపూర్ణం చేశారు. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ కాన్సెప్ట్ జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేయడం. ‘మిశ్రణం’లో మన ఆహారంలో ఉన్న పోషకాలు – జపాన్ పూల అలంకరణతో అనుసంధానం చేయడం. పెటల్స్ అండ్ ప్యాలెట్స్లో పూలు– రంగుల మధ్య విడదీయలేని బంధాన్ని వర్ణించారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనమే ఇవన్నీ. స్టేజ్ టాక్‌లో ఆతిథులను సమ్మోహనపరిచిన ఈ ప్రయోగాలే ఆమెను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’కు ఎంపిక చేశాయి. (చదవండి: -
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
పాపం పూల కుండీల దొంగ
-
పుష్పాలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత.ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పామూలే వసేద బ్రహ్మ్ర మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. -
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు
అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్ కీ పైడీ సహా 55 ఘాట్లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.ఇది కూడా చదవండి: ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది? -
పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..!
భారతదేశంలో కనిపించే అరుదైన పుష్పం ఈ నీలకురంజి పుష్పం. ఇది పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. సముద్రమట్టానికి 1300–2400 మీటర్ల ఎత్తులో ఉండే కొండ ప్రాంతాల్లో నీలకురంజి మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు సాధారణంగా 30–60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అరుదుగా 180 మీటర్లకు మించి కూడా ఎదుగుతాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని పడమటి కనుమల ప్రాంతంలో నీలగిరి కొండలు, అన్నామలై కొండలు, పళని కొండలు, బాబా బుడాన్‌గిరి కొండలపై ఈ పూలు కనిపిస్తాయి. ఈ పూలు పూసినప్పుడు కొండలన్నీ నీలాల రాశుల్లా కనిపిస్తాయి. పన్నెండేళ్లకు ఒకసారి పూసే ఈ పూలను తిలకించడానికి పర్యాటకులు తండోపతండాలుగా ఈ కొండ ప్రాంతాలకు చేరుకుంటారు. (చదవండి: బొమ్మలు చెప్పే చరిత్ర..) -
బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి
చేతల్లోనూ, గొంతుల్లోనూ, ఊరువాడల్లోనూ విరాజిల్లుతూ వర్ధిల్లే బతుకమ్మ ఏనాడు పుట్టిందో, ఏనాడు పెరిగిందో నేటికీ తెలంగాణను ఒక్కతాటి మీదుగా నిలుపుతోంది. జాతి వైభవాన్ని చాటుతోంది. శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో (ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు) జరిగే వేడుక బతుకమ్మ. రుతుపవనాల వర్షాలు మంచినీటి చెరువులలోకి పుష్కలంగా నీటిని తెస్తాయి. తెలంగాణ ్ర΄ాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో అత్యధికంగా లభించేవి ‘గునుగు, తంగేడు పూలు.’ ఇక సీతజడ, బంతి, చెమంతి, గోరింట, గుమ్మడి, కట్లపూలు... పూల పేర్లు చెప్పుకుంటూపోవడం కన్నా అవన్నీ ఒక్క చోట చేర్చిన వారి శ్రమ, ఆ పూల అందం ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రకృతి తన సౌందర్యాన్ని ఈ అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. ఈ పూలన్నీ కలిస్తే ఉండే అందం స్త్రీలంతా ఒక్కచోట చేరి ఆట ΄ాటలతో శక్తి స్వరూపిణిని కొలవడంలో, వారి పాటల్లో తెలుస్తుంటుంది.స్వేచ్ఛకు ప్రతీకదసరాకు ముందు వచ్చే ’సద్దుల బతుకమ్మ’ కి ఆడబిడ్డలు అత్తవారింటి నుండి తల్లిగారింటికి తిరిగి వచ్చి, పువ్వుల రంగులను జరుపుకోవడానికి స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున ఇంటి పెద్దతో పాటు బతుకమ్మ ను అందంగా పేర్చడానికి ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుంటారు. పువ్వులు వృత్తాకార వరుసలలో, రంగులలో ఇత్తడి ప్లేట్లో జాగ్రత్తగా వరుస తర్వాత వరుసలో అమర్చుతారు. సాయంత్రం సంప్రదాయ వేష ధారణలో తమ ్ర΄ాంగణంలో అంతా చేరి, బతుకమ్మను ఉంచి, చుట్టుపక్కల మహిళలు పెద్ద వలయంలో గుమికూడుతారు. బతుకమ్మల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టు తిరుగుతూ,పాటలు పాడటం మొదలు పెడతారు. ఐకమత్యం, ప్రేమ, సోదరీమణుల ఆనందానికి బతుకమ్మ ప్రతీక.సామూహిక సందడిబతుకమ్మ పాటలు పాడి, ఆడలు ఆడి, చివరకు వాటిని తలపై ఎత్తుకొని ఊరేగింపుగా పెద్ద నీటి ప్రదేశానికి చేరుకుంటారు. బతుకమ్మలను నెమ్మదిగా ఆ నీటిలో వదులుతారు. చేసిన ప్రసాదాలను పంచుకుని, బతుకమ్మను కీర్తిస్తూపాటలుపాడుతూ తిరిగి వస్తారు. కష్టం, సుఖం చెప్పుకోవడం, తీపిదనాన్ని పంచుకోవడం కూడా ఈ వేడుక మనసును తృప్తి పరుస్తుంది.నీటి స్వచ్ఛతబతుకమ్మ... భూమి, నీళ్లతో మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని చూపుతుంది. కొన్ని చోట్ల బతుకమ్మతో పాటు ’బొడ్డెమ్మ’ (గౌరీ దేవిని మట్టితో తయారు చేస్తారు)ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ చెరువులను బలోపేతం చేయడానికి, మరింత నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప నాణ్యతను కలిగి ఉంటాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న స్త్రీలు ప్రకృతి సౌందర్యాన్ని పండగలా జరుపుకోవడం ద్వారా చెరువులను ఎలా మెరుగుపరచాలో అంతర్లీనంగా వారికి తెలుసు. ఈ పండుగ ప్రకృతి, ప్రజల సామూహిక, మహిళా జనాదరణ పొందిన స్ఫూర్తి. అలాగే ప్రకృతి వనరులను వేడుకగా సంరక్షించడంలో వ్యవసాయదారుల శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. మన దేశంలోబతుకమ్మ వేడుకను దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు ఇప్పటికీ జరుపుకుంటున్నారు ∙బతుకమ్మ పండగ వచ్చిందంటే బెంగళూరు, పుణె వీధుల్లోనూ ఊయ్యాల ఆటపాటల కళ కనపడుతుంది. పూణెలో కూడా బతుకమ్మ పండగ సందడి జోరుగానే ఉంది ∙ముంబైలో డీజీపాటల స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆటలతో సందడి చేస్తుంటారు. భిన్న సంస్కృతుల ముంబై తెలంగాణ సంస్కృతినీ స్వీకరించింది. విదేశాలలోనూ... నేపాల్, అమెరికా, సింగపూర్, కెనడాలో, న్యూజిలాండ్.. మొదలైన దేశాలలో ఉన్న తెలంగాణీయులు బతుకమ్మ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తమ కమ్యూనిటీలో అందరినీ ఒక చోట చేర్చి, సంబరం జరుపుకుంటున్నారు. భావి తరాలకు బతుకమ్మను మరింత వైభవంగా అందిస్తున్నారు. -
12 ఏళ్లకు ఒకసారి కనువిందు చేసే అద్భుత ప్రకృతి దృశ్యం..!
ప్రకృతి అద్భుతాలు మనసుకు ఆహ్లాదంగానూ, విచిత్రంగాను ఉంటాయి. అబ్బా..! ప్రకృతి అందమే అందం మాటల్లో వర్ణించలేం. అలాంటి ఓ అద్భుత దృశ్యం తమిళనాడు, కేరళ వంటి హిల్స్టేషన్స్లోనే చూడగలం. ఈ అద్భుతం 12 ఒకసారి మాత్రమే కనువిందు చేస్తుంది. ప్రపంచమంత నీలిమయంలా చూపించే ఈ కమనీయ ప్రకృతి దృశ్యానికి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దాం..!తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రకృతి ఉత్కంఠభరిత దృశ్యం కనువిందు చేసింది. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసి ఈ నీలకురించి పువ్వులు ఈ ఏడాది వికసించి..ఆ నింగే భూమిపై వాలిందా అన్నంత అందంగా ఉంది. ఈ నీలకురించి పువ్వులు సాముహికంగా పుష్పిస్తాయి. అంతేగాదు ఇవి కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అదికారిణి సుప్రియ సాహు సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకోవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కుట్టన్ అనే తోడా గిరిజనడు నీలకురించి పూల మధ్య గర్వంగా కూర్చొన్నట్లు కనిపిస్తున్న ఫోటో ఒక వైపు మరోవైపు ఆకుల గుండా పుష్పించిన శక్తిమంతమై నీలం పువ్వుల అందమైన చిత్రం తోపాటు ఓ వీడియో కూడా ఉంటుంది. అందులో పైన నీలి ఆకాశం కింద నీలగిరి పువ్వులతో ప్రపంచమే నీలిరంగు పులుముకుందా అన్నంత అందంగా కృష్ణుని నీలాన్ని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంది. ఈ మొక్కలు అంతరించిపోయే రెడ్‌లిస్ట్‌లో ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సి అవసరం ఉందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి సాహు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోనే కాకుండా కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో కూడా నీలకురింజి పూల మొక్కలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని నీలగిరి కొండల్లో చివరిసారిగా 2006న పూశాయి మళ్లీ 2018న పూస్తాయని అనుకున్నారు కానీ అడవిలో వచ్చిన మంటల కారణంగా నీలకురించి కనిపించలేదు. మళ్లీ ఏడాది కనువిందు చేశాయి. భారతదేశంలో ఇలాంటి మొక్కలు మొత్తం 40 రకాలు ఉన్నాయి. ఈ పువ్వులు పరాపరాగ సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్లే 12 ఏళ్లకు గానీ పుష్పించవు. తమిళనాడులోని పలియన్ తెగవారు వీటి వయసును లెక్కిస్తారు. ఆ తెగ వారు నీలకురింజిని పవిత్రంగా భావిస్తారు. అంతేగాదు ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు ద్రవ బంగారంగా భావిస్తారట. అంటే మనం ఈ నీలకురించి పువ్వులను చూడాలంటే మళ్లీ 2036 వరకు ఆగాల్సిందే..!Kuttan a Toda tribesman sits proudly among the blooming Neelakurinji flowers in Nilgiris. Flowers of Neelkurinji bloom once in 12 years cycle. It is said that Nilgiris gets its name due to the magical blue hue imparted by these stunning flowers. Neelakurinji Strobilanthes… pic.twitter.com/ugEgsxBiUk— Supriya Sahu IAS (@supriyasahuias) September 26, 2024 (చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!) -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
ముళ్లు లేని గులాబీలు.. కానీ..?
గులాబీలు అందంగా ఉన్నా, వాటి కొమ్మలకు ముళ్లు ఉంటాయి. ముళ్లు గుచ్చుకోకుండా మొక్క నుంచి గులాబీలు కోయడం కొంత కష్టమే! ఈ కష్టాన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ముందుకొచ్చి, ముళ్లులేని గులాబీలను సృష్టించే ప్రక్రియను కనుగొన్నారు. గులాబీలు సహా వివిధ మొక్కల్లో పూలు, కాయలు కాసే కొమ్మలకు ముళ్లు ఏర్పడటానికి కారణమైన జన్యువును కనుగొన్నారు.ఈ జన్యువుకు వారు ‘లోన్లీ గై’ (ఎల్ఓజీ) అని పేరు పెట్టారు. గులాబీలు సహా ఇరవై జాతుల మొక్కల్లో ముళ్లు ఏర్పడటానికి ఈ జన్యువే కారణమవుతోందని గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో పెరిగే వంకాయలకు ముళ్లు ఉంటాయి. తోటలు, పొలాల్లో పెంచే వంకాయలకు ముళ్లు ఉండవు. అటవీ ప్రాంతాల్లోని వంకాయల నుంచి పొలాలు, తోటల్లో పెంచే వంకాయ జాతులు వేరుపడి వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి.ఈ సుదీర్ఘకాలంలో సంభవించిన జన్యు ఉత్పరివర్తనల వల్ల పొలాలు, తోటల్లో పెంచే వంకాయల్లో ముళ్లు వాటంతట అవే అంతరించిపోయాయి. మరికొన్ని రకాల ముళ్ల మొక్కల్లోనూ వేరుపడిన జాతుల్లో ముళ్లు అంతరించాయి. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి ద్వారా కొన్ని రకాల ఎడారి మొక్కల్లో ముళ్లను మాయం చేయగలిగారు. ఇదే పద్ధతిలో గులాబీలను కూడా ముళ్లు లేకుండా పూయించవచ్చని వారు చెబుతున్నారు. ముళ్లులేని గులాబీల సృష్టి కోసం చేయవలసిన జన్యుమార్పిడి పద్ధతిని వివరిస్తూ వారు సమర్పించిన పరిశోధన వివరాలను ఇటీవల ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. కళకళలాడే పూలచెట్లతో పెరటి తోటలను పెంచుకునేవారికి ఇది శుభవార్తే! -
Independence Day: త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi— Prashant rai (@prashantrai280) August 15, 2024 -
పూలు అమ్ముతూ నెలకు ఏకంగా రూ. 13 లక్షలు..!
మంచి హోదా కలిగిన కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరి కొందరూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆటుపోట్లను ఎదుర్కొంటారు. కొందరూ తగ్గేదేలా అంటూ కష్టపడి మరీ విజయశిఖరాలను చేరుకుంటారు. అయితే అందరూ ఈ సాహసం చేయలేరు. కొందరూ ఈ సాహసం చేసి మరీ విజయతీరాలకు చేరుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె ఏం వ్యాపారం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..29 ఏళ్ల వియన్నా హింట్జ్ అనే యూఎస్ మహిళ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన కార్పొరేట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ పూల వ్యాపారం మొదలు పెట్టింది. ఆమె పూల వ్యాపారం విజయవంతమైన ఏకంగా నెలకు రూ. 13 లక్షలు ఆర్జిస్తోంది. ఆమె సైరాక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. న్యూయార్క్ నగరంలోని ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైస్మెంట్ విభాగంలో పనిచేసేదాన్ని అని తెలిపింది. ఐతే ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదని, ఏదో ఒకటి చేయాలన్నా ఆరాటంతో అసంతృప్తిగా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో స్వంత డిజటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఏదో అసంతృప్తి వెంటాడేది. అప్పుడే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకున్నట్లు వివరించింది. ఆ థెరపిస్ట్ ఇష్టమైన ఉద్యోగాల జాబితాను రూపొందించి వాటిలో తనకు నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేయమని వియన్నాకు సలహ ఇచ్చింది. అప్పుడే వియన్నాకు తన స్నేహితులతోనూ, ప్రజలతో కలిసి పనిచేసే వ్యాపారం ఎంచుకోవాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నదే తడువుగా పాత పికప్ ట్రక్‌ని తెచ్చి అందులో స్వంతంగా పూల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ ట్రక్ పేరు మెయిన్ స్ట్రీట్ ట్రక్. వియన్నా 2023 నుంచి ఈ వ్యాపారం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె వ్యాపారం ఏడాదికి దాదాపు రూ.36 లక్షలు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అంతేగాక రూ. 3 లక్షలకు పైగా లాభాలను ఆర్జించింది. కేవలం గత మే నెలలో సుమారు రూ. 13 లక్షలు సంపాదించినట్లు చెప్పుకొచ్చింది వియన్నా. పువ్వులు కాలానుగుణంగా ఉంటాయి కాబట్టి, ఆయా నెలల్లో ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు ఆర్జించగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని ముఖ్యమైన రోజులు వాలెంటైన్స్ డే, మదర్స్ డే వంటి సెలవుల్లో మాత్రం అమ్మకాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పింది. ఇక తాను ఈ వ్యాపారాన్నే ఎంచుకోవడానికి తన తల్లిదండ్రులే కారణమని అంటోంది. వియన్నా తండ్రి అగ్రిమాపక దళంలో పనిచేస్తారు. అయితే ఆయన ఉద్యోగానికి పికప్ ట్రక్‌లో వెళ్లేవారని, అలాగే తన తల్లికి గార్డెనింగ్ అంటే ఇష్టమని అందువల్లే తాను ఇలా పికప ట్రక్‌లో పూల వ్యాపారం చేయాలని భావించినట్లు తెలిపింది. అంతేగాదు తనకు నచ్చిన పూల వ్యాపారం చేస్తూ..ఈ ట్రక్‌లో తన నాన్నతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ హయిగా వ్యాపారం చేస్తున్నాని చెబుతోంది. నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే ఎన్నో లాభాలు ఆర్జించొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు అని ప్రూవ్ చేసింది వియన్నా. అంతేగాదు తన ట్రక్‌కి తన కంపెనీ పేరు పెట్టాలనుకుంటున్నట్లు కూడా చెబుతోంది. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
పూల మొక్కలకి ఈ ఎరువు ఇవ్వండి : ఇక పువ్వులే పువ్వులు!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణంగా మారింది. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే పెద్దగా పూయవు. సరికదా ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. View this post on Instagram A post shared by Life’s Good Kitchen (@lifesgood_kitchen)ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు. లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది. -
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
ఈ పువ్వులతో మధుమేహానికి చెక్ ! ఎలాగంటే..?
మధుమేహాన్ని అదుపులో ఉంచే పండ్లు, ఆయుర్వేద మూలికలు, ఆకులు గురించి విన్నాం. కానీ పూలతో మధుమేహ్నాని నిర్వహించొచ్చు అనే దాని గురించి విన్నారా..?. ఈ పువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలే చేస్తాయట. ఇదేంటి పువ్వులా అనుకోకండి ఎందుకంటే వీటిని పనీర్ పువ్వు లేదా పనీర్ దోడి అని పిలుస్తారు. మధుమేహానికి సంబధించిన గాయాలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందట. డయాబెటిస్ రోగిల పాలిట దీన్ని వరం అని పిలుస్తారు. ఇంతకీ ఏంటి పనీర్ పువ్వులు..? ఎక్కడ లభిస్తాయి తదితరాలు చూద్దామా..! పనీర్ పువ్వును పనీర్ దోడి అని కూడా అంటారు. ఎందుకిలా అంటారంటే..ఈ మొక్క పండ్లు పాలు గడ్డకట్టే లక్షణాల కారణంగా దీన్ని పనీర్దోడి అంటారు. ఇది మేజిక్ హీలర్గా పనిచస్తుంది. ఇది ఎక్కువగా తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపిస్తుంద. భారతదేశంలో ఎక్కువగా హర్యాన, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం Withania coagulans. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. సంస్కృతంలో ఈ పువ్వు పేరు ఋష్యగంధ. దీనికి పనీర్ బెడ్, ఇండియన్ రెన్నెట్, ఇండియన్ చీజ్ మేకర్ వంటి అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క గుబురుగా ఉండి, ఇది చిన్న పువ్వులను కలిగి ఉంటుంది. ఈ పూలను ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహాన్ని నయం చేస్తుంది.. పనీర్ పువ్వు ఓ మూలికలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది. ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ తయారు చేయడానికి పనిచేస్తుంది. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పనీర్ పువ్వు బీటా కణాలను నయం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అలానే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. టైప్2 మధుమేహాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా తీసుకోవాలి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు 7 నుండి 8 పనీర్ పువ్వులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేయండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా 6 నుంచి 7 రోజులు నిరంతరంగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కావాలంటే పనీర్ పూల పొడిని కూడా వాడుకోవచ్చు. నీరు త్రాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఆహారం తినండి. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంది అనిపించినప్పుడు దీన్ని వినియోగించడం ఆపేయొచ్చు. ఇతర వ్యాధులకు కూడా.. పనీర్ ఫ్లవర్ మధుమేహంతో పాటు అల్జీమర్స్, ఎర్లీ ఫెటీగ్, బ్లడ్ శుద్ధి, ఆస్తమా, నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు.. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, వాపు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేగాకుండా కంటి వాపు, పైల్స్, ఉబ్బసం, పంటి సమస్యలు నుంచి బయటపడటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దుష్ప్రభావాలు.. దీని వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వాటిల్లినిట్లు నిర్థారణ కాలేదు. కానీ ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నారు, వృద్ధులు దీన్ని తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, నిపుణుల సలహల సూచనల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!) -
ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!
కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను కూడా ఆకట్టుకుంది. రాజస్తాన్‌లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్విల్లా మొక్కలతో షెల్టర్‌ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది. Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers. One individual, passionately built a thing of beauty. Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY — anand mahindra (@anandmahindra) March 28, 2024 -
ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..
ఆ గ్రామంలో ఎటు చూసినా రంగు రంగుల పూలు కనువిందు చేస్తాయి. ఏ వీథిలోకి వెళ్లినా పూల పరిమళాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రపంచ పూల రాజధానిగా పేరు పొందిన ఆ గ్రామం నెదర్లాండ్స్‌లో ఆమ్స్టర్డామ్కు చేరువలో హార్లెమ్ సరస్సు తీరంలో ఉంది. ఆల్స్మీర్ అనే ఈ ఊరు నలువైపులా పూలతోటలు, వీథుల్లో పూల దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి పూలు భారీ ఎత్తున దేశ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ గ్రామస్థుల్లో అత్యధికులు పూలరైతులు. గిట్టుబాటు ధర కోసం ప్రతిరోజూ వేలం నిర్వహిస్తుంటారు. ‘రాయల్ ఫ్లోరా హాలండ్ ఫ్లవర్ ఆక్షన్’ కేంద్రంగా ఈ పూల వేలంపాటలు జరుగుతుంటాయి. దేశ విదేశాలకు చెందిన వర్తకులు ఇక్కడి నుంచి పూలను టోకున తీసుకువెళుతుంటారు. గత శతాబ్ది తొలినాళ్లలోనే ఆల్స్మీర్ పూలసాగుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ గ్రామంలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో పూల వేలంశాల ఉంది. ఇక్కడ ముప్పయివేలకు పైగా పూల రకాలు దొరుకుతాయి. ప్రతిరోజూ సగటున 48 లక్షల పూలమొక్కలు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఏటా జరిగే ఫ్లవర్ పరేడ్‌ను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!) -
పూలను పూజల్లోనే కాదు వంటల్లో కూడా వాడేయొచ్చట..!
పూలను సాధారణంగా పూజ కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడుతుంటాం. మగువలలు తలలో అలంకరించుకోవడానికి తప్పనసరిగి వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ పూలను వంట్లో ఉపయోగించొచ్చా అనే విషయం గురించి విన్నారా?. ఔను వాటిని వంటల్లో హ్యాపీగా ఉపయోగించి వండేయొచ్చంటున్నారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ఎలాగో తెలుసా..! వంటల్లో వినియోగించే తినదగిన పువ్వులు సరైన విధంగా ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిల్లో పురుగులు, పాడైనవి లేకుండా మంచిగా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు చల్లనివి తినడానికి వినియోగించడం ముఖ్యం. లేదంటే మనం చేసిన రెసిపీ రుచిలో తేడాలు వచ్చి టేస్ట్ బాగుండదని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వండే ముందే తినదగిన పువ్వులను మంచిగా ఎంపిక చేసుకుని ఉంచుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఇక వాటితో ఎలాంటి రెసీపీలు చేసుకోవచ్చంటే.. ఎరుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు.. ఇలా విభిన్న రంగుల్లో దొరికే కార్నేషన్ పూలను ఇంటి అలంకరణ, వేడుకల్లో వేదిక అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని కేక్ డెకరేషన్ కోసమూ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి పూరేకల్లో ఉండే తియ్యదనం కేక్ రుచిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే ఈ పూరేకల కింది భాగం కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించి పైభాగాన్ని కేక్ డెకరేషన్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే మందార పూరేకలు నోటికి పుల్లటి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో, గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారట! గులాబీ పూరేకల్ని తినేవారు చాలామందే ఉంటారు. అయితే వీటిని ఐస్‌క్రీమ్, ఇతర డిజర్ట్స్పై గార్నిష్ చేయడానికి ఉపయోగించచ్చు. కాస్త పెద్దగా ఉన్న గులాబీ రేకలైతే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. అంతేకాదు.. జెల్లీస్, షుగర్ సిరప్స్ తయారీలోనూ వీటిని వాడచ్చట!.ఆయుర్వేద పరంగా మందార రేకులతో చేసిన టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమ సమస్యతో బాధపడే వాళ్లు ఎర్రటి మందారాన్ని చెరుకురసంతో కలిపి తీసుకుంటే ఇర్రెగ్యులర్ పిరియడ్ సమస్య నుంచి ఉపశమంన పొందగలరని చెబుతున్నారు. ఇంట్లో గార్డెన్లో పెంచుకునే చిట్టి చామంతుల (చామొమైల్ పువ్వులు)తో స్ట్రాంగ్‌గా ఓ టీ పెట్టుకొని తాగితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కూమా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు! డైట్, ఫిట్నెస్ పాటించేవారు ఈ టీని ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు ఆకట్టుకునే రంగులో ఉండే లావెండర్ పూలను కేక్స్, కుకీస్ తయారీలోనూ వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగే బయట మార్కెట్లో ఈ పూలను తేనె, సిరప్స్, వెనిగర్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారట! ఫలితంగా వాటికి అదనపు రుచి, వాసనను జోడించచ్చు. పుల్లటి రుచిలో ఉండే బంతి పూరేకల్ని సలాడ్స్ డ్రస్సింగ్ కోసం, కూరల్లో గార్నిష్ కోసం వాడుకోవచ్చట!. అంతేగాదు కేక్ డెకరేషన్లో కూడా అందంగా కనిపించేలా అలంకరించొచ్చు. ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సివి.. ఈ పూలను ఆహారంలో భాగం చేసుకునే క్రమంలో వాటి రుచిలో తేడా రాకుండా జాగత్త పడేల వినయోగించాలని చెబుతున్నారు చెఫ్‌లు. వాడిపోయినవి కాకుండా.. తాజా పూలు, పూరేకలు తీసుకున్నప్పుడే వాటి రుచి ఇనుమడిస్తుంది. అలాగే రసాయన ఎరువులు వాడకుండా పెంచినవే ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వాడే ముందు వాటిని దుమ్ముధూళి లేకుండా చక్కగా శుభ్రం చేయాలి. కొన్ని పూరేకల కింది భాగం వగరుగానూ, చేదుగానూ ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించి కూరల్లో, ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. వంటకాల్లో, గార్నిష్ కోసం వివిధ రకాల పూలను ఒకేసారి వాడచ్చు. ఫలితంగా వాటి రుచి పెరుగుతుంది. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పూలు కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి వీటిని తీసుకున్నప్పుడు అలర్జీ వంటి సమస్యలేవైనా ఎదురైతే.. వాటికి దూరంగా ఉండడమే మంచిది. అవసరమైతే నిపుణుల సలహాలూ తీసుకుని ఉపయోగించడం మంచింది. (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
పూల కళాతోరణం షర్మిల నిలయం
హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, షర్మిలా అగర్వాల్ ఇంట్లోకి అడుగుపెడితే మ్యూజియంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన రెండు గదుల గోడల నిండా ఆమె వేసిన చిత్రలేఖనాలు, ఆమె సేకరించిన అరుదైన కళారూపాలు ఉన్నాయి. సెంటర్ టేబుళ్లు, కార్నర్ స్టాండుల్లో ఇకేబానా (జపాన్ పుష్పాలంకరణ కళ) ఫ్లవర్ అరేంజ్మెంట్ అలరిస్తుంది. మరోవైపు ర్యాక్‌లలో ఆమె ఆవిష్కరించిన పుస్తకాల ప్రతులు కొలువుదీరి ఉన్నాయి. షర్మిలా అగర్వాల్ స్వయంగా రచయిత్రి, చిత్రకారిణి, ఇకేబానా పుష్పాలంకరణలో నిష్ణాతురాలు. ఈ మూడు కళలూ ఒకరిలో రాశిపోసి ఉండడంతో కావచ్చు ఆమె చిత్రాల్లో... ఆమె కవిత్వంలో కనిపించే భావుకత ద్యోతకమవుతుంది, అలాగే అదే చిత్రాల్లో ఆమె అలంకరించే ఇకేబానా కూడా కనిపిస్తుంది. రచయిత కావడంతో ఇకేబానా పుష్పాలంకరణను అక్షరబద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వెలువరించారామె. గడచిన గురువారం (నాలుగవ తేదీన) ‘ఇకేబానా సులభం’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు ప్రాక్టీస్ వర్క్‌బుక్స్ పోలిన పది పుస్తకాల సెట్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ ‘గురువు పర్యవేక్షణలో నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి ఈ పుస్తకాల సహాయంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇకేబానా పుష్పాలంకరణ కళ ప్రతి తెలుగింటికీ చేరాలనేది నా కల. పుస్తకాన్ని ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవడానికి అనువుగా రూపొందించాను’ అన్నారామె. పువ్వు మాట్లాడుతుంది! ‘‘పూలు మన మనసుకు అద్దం పడతాయి. పుష్పాలంకరణ మన ఇంటికి వచ్చిన అతిథులకు మన మాటగా మౌనంగా స్వాగతం పలుకుతుంది, మనసును ఆహ్లాదపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తాజా పువ్వు కనిపించాలి. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక నా వివరాలకు వస్తే... నేను పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో. రాసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. నా కవితలు స్థానిక హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పెయింటింగ్స్ కూడా ఇష్టంగా వేసేదాన్ని. ఇక చదువు కూడా అదే బాటలో సాగింది. లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు చేశాను. మీనియేచర్ పెయింటింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటాను. పెళ్లి తర్వాత హైదరాబాద్ రావడం నాకు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హైదరాబాద్ నగరం చిత్రకారిణిగా నాకు గుర్తింపునిచ్చింది. సోలో ఎగ్జిబిషన్లు పెట్టాను, వేరే ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. నా స్టూడియోలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రదేశాల ప్రత్యేకతలనూ చూడవచ్చు. హిందీలో చంద్ లమ్హే,, కహా అన్ కహా రాశాను. పెయింటింగ్ గురించి మెళకువలు నేర్పించడానికి ‘ఇన్నర్ రిఫ్లెక్షన్స్’ పేరుతో రచనను సిద్ధం చేస్తున్నాను. ఇకేబానా గురించి చెప్పాలంటే ఇది నిరంతరనం సాధన చేయాల్సిన కళ. ఈ ఆర్ట్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి జపాన్‌కి ఆరుసార్లు వెళ్లాను. గతంలో ‘ఇకేబానిస్ట్స్ అరౌండ్ ద వరల్డ్, ఇకేబానా ఫర్ బిగినర్స్, ఇకేబానా జపానీ పుష్పకళ’ ప్రచురించాను. ‘ఇకేబానా మనదేశానికి వచ్చి అరవై ఏళ్లు దాటింది. ముంబయికి చెందిన నిర్మలా లుక్మాణి 1961లో జపాన్‌కెళ్లి ఒహారా స్కూల్లో డిగ్రీ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోనే విద్యార్థులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు...’ వంటి చారిత్రక వివరాలందించాను. తెలుగు స్నేహితుల సహాయంతో ‘ఇకేబానా సులభం’ పుస్తకంలో... ఇకేబానా కళను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, స్వయంగా క్లాసులకు హాజరు కాలేని వాళ్లకు పూసగుచ్చినట్లు వివరించాను. ఫ్లవర్‌పాట్ కొలతలు, కొమ్మలు, పూల పరిమాణాలతో సహా కచ్చితంగా రేఖాచిత్రాలతో పుస్తకం రాశాను. జపాన్‌లో ఉపయోగించే పూలతో అలంకరణను చూపిస్తూనే మనకు లభించే పూలు, ఆకులతో అలంకరించడం కూడా ఫొటోలతో చూపించాను. ఫ్లవర్‌వాజ్‌లుగా ఉపయోగించే పాత్రలు, పిన్హోల్డర్లు, పూలు... ఎందులోనూ కృత్రిమత్వం ఉండదు. నురుగులాంటి వాటికి నిషేధం. శ్వాసకు హాని కలగరాదు, మట్టిలో కరిగే క్రమంలో నేలకు హాని కలిగించరాదు. ఇది నియమం. చిత్ర వైవిధ్య లేఖనం నేను పుట్టిపెరిగిన ఉత్తరాది జీవనశైలిని నా చిత్రాలు ప్రతిబింబిస్తుంటాయి. అక్కడి జీవనశైలిలో టెర్రస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. ఉష్ణోగ్రతలు గరిష్టం, కనిష్టం రెండూ తీవ్రంగా ఉంటాయి. వేసవిలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు డాబా మీద గడుపుతారు. శీతాకాలంలో మధ్యాహ్నపు ఎండ కోసం డాబా మీద ఉంటారు. దైనందిన జీవితంలో సగభాగం డాబా మీద గడుస్తుంది. కాబట్టి డాబా అన్ని ఏర్పాట్లతో ఉంటుంది. నా చిత్రాలు ఉత్తరాది జీవితాన్ని కళ్లకు కడతాయి. ఇకేబానా పరిణామక్రమం కూడా చిత్రాల్లో మిళితమై ఉంటుంది. ఈ కళ జపాన్ స్కూళ్ల నుంచి మన దేశానికి థియరిటికల్‌గా వచ్చి అరవై ఏళ్లు దాటినప్పటికీ సంపన్న, ఎగువ మధ్యతరగతి దగ్గరే ఆగి పోయింది. సామాన్యులకు చేరాలంటే నేను ఊరూరా స్కూళ్లను పెట్టలేను, కాబట్టి అక్షరం అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తెలుగు నేల నాకు చాలా ఇచ్చింది. తెలుగు నేలకు నేను తిరిగి ఇవ్వడం ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ పుష్పాలంకరణ కళను తెలుగు రాష్ట్రాల్లో కుగ్రామాలకు కూడా చేర్చాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు షర్మిలా అగర్వాల్. ఈ పెయింటింగ్‌ను పరిశీలించండి. ఇందులో అజంతా గుహలున్నాయి. బౌద్ధ భిక్షువులు, రికా (ఇకేబానాలో ఓ శైలి) పుష్పాలంకరణ ఒక భాగంలో కనిపిస్తాయి. మరొక భాగంలో అంతఃపుర స్త్రీలు పుష్పాలంకరణ చేస్తున్నారు, కిందవైపు సామాన్య మహిళలు ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో సంతోషిస్తున్నారు. జపాన్ నుంచి ఈ కళ బౌద్ధ భిక్షువుల ద్వారా ఇండియాకి వచ్చినప్పుడు రాజకుటుంబాల మహిళలకు చేరింది. ఆ తర్వాత సామాన్యులకు పరిచయమైంది. ఇది ప్రాచీన చారిత్రక నేపథ్యం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
ప్రియాంకకు చేదు అనుభవం: పుష్పగుచ్చం ఇచ్చారు.. పూలు మరిచారు!
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది. రాష్ట్రంలో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆమె వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే ఒక నేత ఆమెకు ఇచ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. దీనిని గమనించిన ప్రియాంక గాంధీ ఆ పుష్పగుచ్చంలో పూలు లేవని అక్కడున్న నేతలకు చెప్పారు. దీంతో వారంతా నవ్వుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు. ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? गुलदस्ता घोटाला 😜 गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂 मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94 — राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023 -
అందమైన ఈ పువ్వులతో..హార్ట్ ఎటాక్ ముప్పు !
అందమైన పువ్వుల్ని చూడగానే మన ముఖంలో అనుకోకుండా చిరు నవ్వులు పూస్తాయి. ఒక్కోసారి అలాంటి మొక్కల్ని మన గార్డెన్లో కూడా పెంచుకోవాలని ఉబలాటపడతాం. ఇకపై ఇలాంటి ప్రయత్నాలకు కొంచెం ఆలోచన జోడించాల్సిందే! ఎందుకంటే కొన్ని రకాల పువ్వులు మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతుందని నిపుణులు తాజాగా హెచ్చరి స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైన గార్డెన్ ఫేవరెట్‌గా పేరొందిన ఫాక్స్‌గ్లోవ్ పుష్పాలపై సైంటిస్టులు కీలకహెచ్చరికలు చేశారు. ఇది యూరప్ ఆసియాకు చెందిన తీగ జాతి మొక్క. ఈ మొక్కను "డెడ్ మ్యాన్స్ బెల్స్" లేదా "మంత్రగత్తెల చేతి తొడుగులు" అనే పేరుతో విక్రయిస్తారట. సాధారణ ఫాక్స్ గ్లోవ్ (డిజిటాలిస్ పర్పురియా) మొక్క పువ్వులు పింక్, పర్పుల్, తెలుపు, పసుపు ఇలా పలు రంగుల్లో ఉంటాయి. పెండ్యులస్, ట్రంపెట్ ఆకారలో గుత్తుల గుత్తుల పువ్వులు మంత్రముగ్ధులను చేస్తాయి. అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫాక్స్‌గ్లోవ్ అందమైన పువ్వుల్ని ఇవ్వడమే కాదు, గుండెపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన కార్డియాక్ గ్లైకోసైడ్గా ఉండే డిగోక్సిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాల్ని కూడా కలిగి ఉంటాయి. ఇవి గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తాయని బఫెలో, స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, డాక్టర్ జెన్ వాంగ్ లైవ్ సైన్స్‌తో చెప్పారు. ఆరోగ్యకరమైన గుండె వేలకొద్దీ కార్డియాక్ కణాల ద్వారా రక్తాన్ని శరీరానికి పంపిస్తుంది. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గా పిలిచే గుండె లయకు డిగోక్సిన్తో ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడితే రసాయన సమస్యలు తలెత్తుతాయి. గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ లేదా, మరణానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పొరపాటున మొక్కలోని ఏదైనా భాగాన్ని తీసుకుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. ఫాక్స్‌గ్లోవ్ “చనిపోయినవారిని తిరిగి బతికించగలు. జీవించి ఉన్నవారిని చంపగలదు” అనేది పాత ఆంగ్ల సామెత. ఫాక్స్ గ్లోవ్‌లో అంతటి గొప్ప, ప్రాణాలను రక్షించే ఔషధ ఉపయోగాలు కూడా ఉన్నాయట. ఇదే విషయాన్ని డాక్టర్ వాంగ్ కూడా చెప్పారు. ఫాక్స్గ్లోవ్స్లోని డిగోక్సిన్ తో ప్రాణాంతక ప్రభావాలు ఉన్నప్పటికీ - డిగోక్సిన్ విలువైన గుండె మందులాగా చాలా పాపులర్ అని, ఇతర మందులేవీ పనిచేయనపుడు గుండె వైఫల్య చికిత్సలో ఇది బాగా పనిచేస్తుందని సూచించారు. -
వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు!
ఆధునిక కాలంలో జాబ్ చేసేవారికంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితే మంచి లాభాలు పొందాలనుకునేవారికి ఎండిపోయిన లేదా వాడిపోయిన పూలను ఉపయోగించి బిజినెస్ చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి బిజినెస్ అంటేనే.. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ వాడిపోయిన పూలతో అనగానే కొంత అనుమానం రావొచ్చు. కానీ ఎండిపోయిన పూలతో అగరుబత్తీలు వంటివి తయారు చేసి బాగా సంపాదించవచ్చు. ఇది ఒకరకమైన రీసైక్లింగ్ బిజినెస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పువ్వులు మనిషి నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రతి రోజు గుడికెళ్లాలన్నా, స్త్రీలు అలంకరించుకోవాలన్నా పూలు అవసరం. అయితే దేవాలయాల్లో ఎక్కువ పువ్వులు వినియోగిస్తారు. వీటిని ఒకటి రెండు రోజుల్లో తీసి బయట పడేస్తుంటారు. అలాంటి వాటిని ఉపయోగించి సువాసనలు వెదజల్లె అగరుబత్తీలు తయారు చేయవచ్చు. వాడిపోయిన పూలు.. వాడిపోయిన పూలను వృధాగా చెత్తలో పడేసినా లేదా నీటిలో పడేసినా ఎక్కువ కలుషితం అవుతుంది. కావున అలా వృధాగా పోనీయకుండా వాటిని ఎండబెట్టి, సువాసనల కోసం కొన్ని రసాయనాలు చల్లి అగరుబత్తీలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! నిర్మాలయ సంస్థ.. వాడిపోయిన పూలను ఉపయోగించి భరత్ బన్సాల్ అనే వ్యక్తి సుర్భి అండ్ రాజీవ్‌లతో కలిసి నిర్మాలయ సంస్థను స్థాపించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీరు కేవలం అగరుబత్తీలు మాత్రమే కాకుండా దూపం ఉత్పత్తులను తయారు చేసి దేశం మొత్తం విక్రయిస్తున్నారు. గత ఏడాది వీరు సంవత్సరానికి రూ. 2.6 కోట్లు ఆదాయం పొందారు. 2024 నాటికి రూ. 20 కోట్ల వార్షిక ఆదాయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇదీ చదవండి: పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే.. మన దేశంలో ఇప్పటికే కొంత మంది కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు. మనిషి అనుకోవాలే గానీ ఏదైనా చేయగలడు, ఏదైనా సాదించగలరని ఇప్పటికే చాలామంది రుజువు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nirmalaya (@nirmalaya) -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
అక్కడ పూల దండలను మూర లెక్కన అమ్మితే ఇక అంతే!
పువ్వులు అలంకరణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని దండల రూపంలో ఐతే మూర లెక్కన విడి పువ్వులైతే గ్రాములు, కిలోల లెక్కన తీసుకుంటాం. ఇది సర్వసాధారణం. ఐతే ఇక నుంచి మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ ఇక నుంచి అలా అమ్మకూడదంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్ పాస్ చేసింది. ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది. త్రిసూర్ షాపులలో తనిఖీలు నిర్వహించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి ఏషియానెట్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 111ఈ, పీనల్ ప్రొవిజన్ 29 ప్రకారం పూల దండలను అత్యంత సాధరణ యూనిట్ ఎస్ఐ(ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్)లో కాకుండా మూర లేదా క్యూబిట్లో అమ్మడం నేరం అని, దీని కింద రూ. 2000/- జరిమాన విధిస్తామని కరాకండీగా తేల్చి చెప్పింది. ప్రజలు గనుక మూర లేదా క్యూబిన్ల కింద కోరినట్లయితే వ్యాపారులు 44.5 సెంటీమీటర్ల పూల దండను ఇవ్వాలని లీగల్ మెట్రాలజీ సూచించింది. ఐతే కొలతల్లో చాలా మార్పులు వస్తాయని వ్యాపారులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూల అమ్మకాలు చాల సంత్సరాలుగా జరగుతున్నాయి. నిజానికి సాధారణ ప్రజలకు పూలు మూర లేదా సెంటమీటర్లలో అమ్మడం అనేది అనవసరమైన విషయమని, ఇది పెద్ద సమస్య కాదంటూ ఆ నిబంధనను వ్యాపారులు కొట్టిపారేయడం గమనార్హం. (చదవండి: వామ్మో ఎంత పెద్ద క్యూ లైన్! అంతలా బారులుతీరి జనాలు ఎందుకున్నారంటే.. -
నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!
మునగ పువ్వులుతో చేసే ఫ్లవర్ ఫ్రైకి కావలసినవి : మునగ పువ్వులు – రెండు కప్పులు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అరటీస్పూను ఉల్లిపాయ తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు గుడ్లు – మూడు కరివేపాకు – రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం: ∙మునగ పువ్వులను నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ∙ఇవన్నీ వేగాక మునగపువ్వులు, కరివేపాకు వేసి కలపాలి ∙ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ∙పువ్వులు మగ్గాక గుడ్లసొన వేసి కలపాలి. ∙చక్కగా వేగాక, రుచికి సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ∙చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. నిమ్మరసం చల్లుకుని అన్నం, చపాతీల్లోకి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: మురిపముగా.. మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!) -
జగనన్న కాన్వాయ్‌పై పూల వర్షం
-
టాప్ 10 అత్యంత ఖరీదైన మొక్కలు
-
ఖరీదైన కారులో వెళ్లి పూలకుండీల దొంగతనం.. వీడియో వైరల్..
ఖరీదైన లగ్జరీ కారు. పైగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. వీళ్ల బిల్డప్ చూస్తే చాలా రిచ్ అనుకుంటారు. కానీ వీళ్లు చేసిన పని తెలిస్తే మాత్రం ఇదేం బుద్ధిరా నాయనా అంటారు. ఔను మరి.. వీళ్లు పట్టపగలు కారులో వెళ్లి రోడ్డుపై ఉన్న పూలకుండీలను ఎంచక్కా డిక్కీలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గురుగ్రాంలోని శంకర్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూలకుండీలను ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జీ-20 కార్యక్రమం కోసం శంకర్ చౌక్‌లో ప్రత్యేకంగా ఈ పూలను అలంకరించినట్లు తెలుస్తోంది. రంగురంగుల పుష్పాలు, రకరకాల పూల కుండీలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని చూసిన ఈ ఇద్దరికీ ఏమనిపించిందో ఏమో తెలియదు గానీ.. ఎంచక్కా కారులో వచ్చి పూలకుండీలను దర్జాగా ఎత్తుకెళ్లారు. #G20 के सौंदर्यीकरण के "चिंदी चोर" गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon — Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023 అయితే వీరిద్దరు నిజంగా దొంగలేనా? పూలకుండీలను చోరీ చేశారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వీరిని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కారు నంబర్‌ప్లేట్‌ను కనిపెట్టి పోలీసులకు క్లూ అందించేందుకు తమ వంతు కృషి చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
వాడిన పూలూ 'గుబాళిస్తున్నాయ్'
మహాకవి శ్రీశ్రీ రాసిన ‘వాడిన పూలే వికసించెనే..’ అన్న పాటను నిజం చేస్తున్నారు తుని మండలం టి.తిమ్మాపురం మహిళలు. ‘బంతి.. చామంతి.. మా చేతిన పడితే అగరువత్తి’ అంటూ వారంతా కొత్త పాటను ఆలపిస్తున్నారు. వాడిన పూలను పౌడర్‌గా మార్చి పర్యావరణ హితమైన అగరువత్తులను తయారు చేస్తూ పూల పరిమళాలను వెదజల్లుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వాడిన పూలు పనికి రావనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అవి కూడా విపణి వీధిలో వికసిస్తూ పరిమళాలు విరజిమ్ముతున్నాయి. దేవుడికి అలంకరించిన పుష్పాలు ఆ తరువాత మహిళల చేతుల్లో అగరువత్తులుగా మారిపోతున్నాయి. ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ లాభదాయకమై విజయవంతంగా నడుస్తోంది. ప్రపంచ మార్కెట్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కాకినాడ జిల్లా తుని మండలంలోని టి.తిమ్మాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో 15 కుటుంబాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు అగరువత్తులు, సాంబ్రాణి కడ్డీలు వంటివి తయారు చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన వీటి టర్నోవర్ రూ.కోటిన్నర దాటేసింది. శ్రీసత్యదేవ స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలు అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం నుంచి సేకరిస్తున్న పుష్పాలను నిత్యం తిమ్మాపురం తీసుకెళ్లి ఎండబెట్టి పౌడర్‌గా మారుస్తున్నారు. ఆ పౌడర్‌తో అగరువత్తులు తయారు చేసి 60 గ్రాములు, 120 గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. పూల పౌడర్‌తోనే సాంబ్రాణి కడ్డీలను సైతం తయారు చేస్తున్నారు. 15 లక్షల అగరవత్తుల ప్యాకెట్ల తయారీ అన్నవరం సత్యనారాయణస్వామి అలంకరణకు ఉపయోగించిన పుష్పాలను రోజుకు 60 నుంచి 80 కిలోల వరకు సేకరించి టి.తిమ్మాపురం తరలిస్తున్నారు. వీడిని ఎండబెట్టి పౌడర్ చేసిన అనంతరం తులసి, పారిజాతం, స్వర్ణ, సంపంగి, చందనం పరిమళాలతో అగరవత్తులు, రెండు రకాల సాంబ్రాణి కప్పులు (కడ్డీలు) తయారు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం 15 కుటుంబాలకు చెందిన స్వయంశక్తి సంఘాల మహిళలు రోజుకు ఐదువేల అగరవత్తి ప్యాకెట్లు, డిమాండ్‌ను బట్టి సాంబ్రాణి కడ్డీలను తయారు చేస్తున్నారు. ఇలా ఏడాదికి 15 లక్షల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. 60 గ్రాముల ప్యాకెట్ రూ.50, 120 గ్రాముల ప్యాకెట్ రూ.100, 130 గ్రాములు సాంబ్రాణి కడ్డీల (30) ప్యాకెట్ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఏడాది తిరగకుండానే రూ.1.50 కోట్ల లావాదేవీలు నిర్వహించి పెద్దపెద్ద వ్యాపారులను ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన అగరవత్తులను అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం, లోవ కొత్తూరు తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, వీటికి డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్‌ను విస్తరించేందుకు అమెజాన్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదిరింది. వీటికి డిమాండ్ పెరిగింది మేం సేకరించిన పుష్పాలతో అగరవత్తులు తయారు చేసి దైవసన్నిధిలో భక్తులకు విక్రయించడం సంతృప్తినిస్తోంది. పుష్పాలను పౌడర్ చేయడం, పౌడర్‌ను ముద్దగా కలపడం, కలిపిన ముద్దను అగరవత్తులుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా యంత్రాలు అవసరం. యంత్రాల కొనుగోలుకు రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు పెట్టుబడి అవసరం. ప్రభుత్వం సహకరిస్తే మరికొందరు మహిళలకు ఉపాధి లభిస్తుంది. – పోల్నాటి సూరన్న, శ్రీపవన్ సూర్య ట్రేడర్స్, టి.తిమ్మాపురం విస్తరణకు తోడ్పాటు అందిస్తాం కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్న అగరవత్తుల తయారీ యూనిట్‌కు రుణం మంజూరుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే స్త్రీ నిధిలో రూ.లక్ష రుణం ఇచ్చాం. పీఎంఎఫ్ఎంఈ పథకంలో రూ.10 లక్షల రుణం మంజూరుకు బ్యాంకులతో చర్చిస్తున్నాం. – వై.సత్తిబాబు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతిపథం, తుని మండలం -
ఈ సీజన్ వచ్చిందంటే జపాన్‌లో పండగే.. అక్కడివారంతా కలసి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో ఏటా ప్లమ్ చెట్లు పూత పూసే జనవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు జరుపుకొనే సంబరాలు ఇవి. ఈ సమయంలో జపాన్ ఈశాన్య ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ప్లమ్తోటల్లోని చెట్లు సరికొత్త పూలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ‘అటామీ బయినె ఉమె మత్సురి’ పేరిట జరుపుకొనే ఈ వేడుకల్లో పిల్లా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. షిజువోకా రాష్ట్రంలోని ఇజు ద్వీపకల్పంలో ప్లమ్ పూల సంబరాలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. పూలతో కళకళలాడే ప్లమ్ చెట్ల కిందకు చేరి వనభోజనాలు జరుపుకుంటారు. జపాన్‌లోని అతిపెద్ద ప్లమ్తోట ‘అటామీ బయినె’కు పెద్దసంఖ్యలో జనాలు చేరుకుని, విందు వినోదాలతోను, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడే కాకుండా, కొందరు సంపన్నుల ప్రైవేటు ప్లమ్తోటల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కూడా ఈ సీజన్లో జపాన్‌కు వస్తుంటారు. చదవండి: వారెవ్వా! ఓ వైపు సూర్యోదయం, మరో వైపు నిండుచంద్రుడు.. ఈ ఫొటో కోసం 2వేల సార్లు -
12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే పువ్వులు.. ఎక్కడో తెలుసా?
బనశంకరి(కర్ణాటక): 12 ఏళ్లకు ఒకసారి వికసించే నీల కురింజి పూల సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో చిక్కమగళూరులో పర్యాటకుల సందడి నెలకొంది. గత నెలారంభంలో నీల కురింజి మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. పొరుగునున్న కేరళలోని మున్నార్ తో పాటు చిక్కమగళూరులోని పలు చోట్ల అడవులు, లోయల్లో నీల కురింజి అందాలు అలరిస్తున్నాయి. దీపావళి సెలువులు రావడంతో చంద్రదోణి అడవుల్లో నీల కురింజి వనాలు సందడిగా మారాయి. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం -
అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కొన్ని నియమాలు..
రంగురంగుల పూలు కంటికి హాయినిస్తాయి. పూల అమరిక మనసుకు సాంత్వననిస్తుంది. ఫ్లవర్‌వాజ్ ఇంటి ఆహ్లాదానికి చిరునామా. భూమి... స్వర్గం... మధ్యలో మనిషి... జీవిత తత్వానికి, జీవన సూత్రానికి ప్రతీక పువ్వు. ఈ తాత్వికతకు ప్రతిబింబం ఇకబెనా పూల అమరిక. కళ... పాటలు పాడడం ఒక కళ. నాట్యం చేయడం ఒక కళ. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను... నేల మీదకు తెచ్చి రంగవల్లిక ఆవిష్కరించడం ఓ కళ... అలాగే కాన్వాస్ మీద ఆవిష్కరించడం మరో కళ. అదే పూలు, లతలను వస్త్రం మీద కుట్టడం ఓ కళ. తాజా పూలను కుండీలో అమర్చడమూ ఓ కళ. అన్ని కళలకు ఉన్నట్లే ఈ కళకు కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ కళను సాధన చేయడం ధ్యానంతో సమానం అంటారు ఇకబెనా కళాకారిణి రేఖారెడ్డి. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన పూల అలంకరణ విధానం. జీవితానికి అన్వయిస్తూ సూత్రబద్ధంగా చేసే అమరిక. జపాన్ కళకు భారతీయ సొగసులద్ది విదేశాల్లో భారతీయతకు రాయబారిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న రేఖారెడ్డి. ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి నేపథ్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ప్రకృతికి ఆహ్వానం ‘‘ఇది బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న కళ. బుద్ధుని ప్రతిమ ఎదురుగా ఒక పాత్రలో నీటిని పెట్టి అందులో కొన్ని పూలను సమర్పించడం నుంచి ఆ పూల అమరిక మరికొంత సూత్రబద్ధతను ఇముడ్చుకుంటూ ఎన్నో ఏళ్లకు ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ అనే రూపం సంతరించుకుంది. పూలను చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో జీవించడం అన్నివేళలా సాధ్యం కాదు, కాబట్టి ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించడం అన్నమాట. అలా బౌద్ధ చైత్యాల నుంచి ఈ సంస్కృతి బౌద్ధావలంబకుల ఇళ్లలోకి వచ్చింది. ఈ పూల అలంకరణ ప్రకృతికి, మనిషి జీవితానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ప్రతీక. ఒక త్రికోణాకారంలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపంగా ఉంటుందీ అమరిక. మనిషి జీవన చక్రం ఇమిడి ఉంటుంది. పై నుంచి కిందకు... ఒకటి విచ్చుకోవాల్సిన మొగ్గ, ఒకటి అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు పూలు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలన్నమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ ధ్యానం వంటిదే. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో గడిపితే ధ్యానం తర్వాత కలిగే ప్రశాంతత కలుగుతుంది. ఇక నాకు ఈ ఆర్ట్ మీద ఆసక్తి ఎలా కలిగింది... అంటే ఈ కళ మా ఇంట్లో నేను పుట్టకముందే విచ్చుకుంది. ఆకట్టుకున్న జపాన్ మా నాన్న పిల్లల డాక్టర్. కెనడాకు వెళ్లే ప్రయాణంలో మధ్యలో నాలుగు రోజులు జపాన్‌లో ఉన్నారు. నాన్నతోపాటు అమ్మ కూడా వెళ్లిందప్పుడు. ఆమెకు స్వతహాగా ఇంటిని పూలతో అలంకరించడం ఇష్టం. ఫ్లవర్‌వాజ్‌లో తాజా పూలను అమర్చేది. జపాన్‌లో ఉన్న నాలుగు రోజుల్లో ఇకబెనా ఫ్లవర్ అరేంజ్మెంట్ ఆమెను బాగా ఆకర్షించింది. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మీనా అనంతనారాయణ్ గారి దగ్గర కోర్సు చేసింది అమ్మ. సిటీలో అనేక పోటీల్లో పాల్గొని ప్రైజ్‌లు తెచ్చుకునేది. ఇదంతా చూస్తూ పెరిగినా కూడా నాకు అప్పట్లో పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ అవగాహన మాత్రం ఉండేది. కాలేజ్ పోటీలప్పుడు ఫ్లవర్‌వేజ్‌లో తాజా పూలను చక్కగా అలంకరించి ప్రైజ్‌లు తెచ్చుకోవడం వరకే ఇంటరెస్ట్. నా కెరీర్ ప్లాన్స్ అన్నీ న్యూట్రిషన్లోనే ఉండేవి. ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ హోమ్‌సైన్స్‌లో న్యూట్రిషన్ చేశాను, యూనివర్సిటీ టాపర్‌ని. పీహెచ్డీ చేసి ప్రపంచంలో అనేక దేశాల్లో పిల్లలు పోషకాహారలోపంతో బాధపడడానికి కారణాలను, నివారించడానికి చర్యల మీద పరిశోధనలు చేయాలనుకున్నాను. అలాంటిది హఠాత్తుగా నాన్న పోవడం, నాకు పెళ్లి చేసి తన బాధ్యత పూర్తి చేసుకోవాలని అమ్మ అనుకోవడం... నా న్యూట్రిషన్ కెరీర్ కల కలగానే ఉండిపోయింది. నా పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబంతో గృహిణిగా కొనసాగుతున్న సమయంలో కాలక్షేపం కోసం ఫ్లవర్ అరేంజ్మెంట్ మొదలుపెట్టాను. ఒక్కో డౌట్ అమ్మను అడుగుతూ పూలను అమర్చేదాన్ని. అప్పుడు అమ్మ సూచన మేరకు ఆమె టీచర్ దగ్గరే నేను కూడా ఇకబెనా కోర్సు చేశాను. ఇది ముప్ఫైఐదేళ్ల నాటి సంగతి. ఇందులో ఇంట్రడక్టరీ నుంచి టీచింగ్ వరకు ఉన్న దశలన్నీ పూర్తిచేసి 1995 నుంచి ఇకబెనా టీచింగ్ మొదలు పెట్టాను. ఇన్నేళ్లలో వందలాది మందికి నేర్పించాను. నా స్టూడెంట్స్‌లో చాలామంది టీచర్లయ్యారు. మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు నన్ను చూసి ఓసారి ‘గోల్డ్ మెడలిస్ట్వి. న్యూట్రిషన్ కోసం చాలా సర్వీస్ ఇస్తావని ఊహించాం. ఇలా పూల డెకరేషన్ చేసుకుంటున్నావా’ అని నొచ్చుకున్నారు. మనను నడిపించే ఓ శక్తి మన గమనాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. ఇకబెనా కోసం పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇందులోనే ప్రయోగాలు చేస్తున్నాను. నేను విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయతకు ప్రాతినిధ్యం వహించినట్లే, కాబట్టి మన వస్త్రధారణనే పాటిస్తాను. ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో భారతీయత ప్రతిబింబించేటట్లు మన పసుపు, కుంకుమను థీమ్ ప్రకారం చేరుస్తాను. ఈ ప్రయోగం నాకు గర్వంగా ఉంటోంది కూడా. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ అనే పుస్తకం ద్వారా జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేశాను. అలాగే ‘మిశ్రణం’ పుస్తకంలో మన ఆహారంలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్‌కి– జపాన్ పూల అలంకరణను మమేకం చేశాను. సంస్కృతుల సమ్మేళనంగా నేను చేసిన ఈ ప్రయోగాలే నన్ను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ ఎంపిక చేశాయనుకుంటున్నాను. ఈ పురస్కారాన్ని ఈ నెలలో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ తగా మసాయుకి అందిస్తారు’’ అని తన ఇకబెనా ప్రయాణాన్ని వివరించారు రేఖారెడ్డి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి సమాజ హితం కోసం పాఠాలు ఇంట్లో నేనే చిన్నదాన్ని. అన్న, అక్క ఉన్నత విద్య కోసం హాస్టల్కెళ్లిపోయిన తరవాత నన్ను కూడా హాస్టల్‌కి పంపించడానికి అమ్మానాన్న ఇష్టపడలేదు. అలా ఢిల్లీలోని లేడీ ఇర్విన్ కాలేజ్‌లో సీటు వదులుకున్నాను. న్యూట్రిషన్లో పీహెచ్డీ సీటు వచ్చినా చేయలేకపోయాను. నేను హాబీగా మొదలు పెట్టిన ఇకబెనా కోసం విస్తృతంగా పని చేస్తున్నాను. మనదేశంలో దాదాపుగా పది రాష్ట్రాల్లో, పద్నాలుగు దేశాల్లో వర్క్‌షాప్‌లు, డెమోలలో పాల్గొన్నాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా నా విద్యార్థుల పరిధి ఖండాలు దాటింది. లిథువేనియా స్టూడెంట్స్‌కి కూడా నేర్పించాను. పిల్లల ఆరోగ్యం కోసం పని చేసే రుగుటె ఫౌండేషన్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కోసం ఇకబెనా పాఠాలు చెప్పాను. రష్యా– ఉక్రెయిన్ వార్ రిలీఫ్ ఫండ్ కోసం కూడా ఇకబెనా పాఠాలు చెప్పాను. ఈ జర్నీ నాకు సంతృప్తిగా ఉంది. – రేఖారెడ్డి, ఇకబెనా ఆర్టిస్ట్ -
తిరుమల: అలంకార ప్రియునికి ప్రకృతి సొబగులు
తిరుమల: ఇల వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్నా రు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన వాటితో పాటు దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి ఉత్సవాల్లో పూటకో అలంకరణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. చదవండి: రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సంప్రదాయం. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వేర్వేరుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. బహుసుందరం రంగనాయకుల మండపం శ్రీవారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. ఇందులో భాగంగా ఉద్యానవనశాఖ సిబ్బంది రంగనాయకుల మండపాన్ని విదేశీ ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని ఫలపుష్పాదులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనువిందు చేశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బతుకమ్మ, దసరా, దీపావళి.. పండుగ ఏదైనా పూల సాగుతో సిరులే..
సాక్షి, కరీంనగర్: కొందరు రైతులు సీజనల్ పంటలతోపాటు పూల సాగు చేస్తుంటే మరికొందరు సాధారణ పంటలతో విసిగిపోయి, పూల తోటలపై దృష్టిసారించారు. పండుగలు, శుభకార్యాల నెలలకు అనుగుణంగా రకరకాల పూలతో సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, మల్లన్న పట్నాలు, శివరాత్రి తదితర పర్వదినాల్లో, పెళ్లిళ్లలో పూలకు డిమాండ్ ఉంటుంది. ఆయా పండుగలకు అనుగుణంగా రైతన్నలు బంతి, చామంతి, గడ్డి చామంతి, పట్టుకుచ్చులు, గల్లండ, లిల్లీపూలు సాగు చేస్తూ మంచి దిగుబడులు, ఆదాయం పొందుతున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సందడి ప్రారంభమైన నేపథ్యంలో పూలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న కర్షకులపై ప్రత్యేక కథనం. చింతల్‌పేట్‌లో బంతి, చామంతి పూలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చింతల్‌పేట్‌కు చెందిన రైతు ఇప్ప గంగాధర్ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పరిసరాల నుంచి బంతి, చామంతి, గడ్డి చామంతి మొక్కలను రూ.3 నుంచి రూ.5 చొప్పున వెచ్చించి, తీసుకువస్తున్నాడు. వీటిని ఎకరం 10 గుంటల్లో నాటుతున్నాడు. నాటిన నెల రోజుల నుంచి పూతకు వస్తాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లోనే తెంపి విక్రయిస్తున్నాడు. చీడపీడల నివారణకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పురుగు మందులు ఖర్చవుతుందని, భూసారం పెంచడానికి ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నానని గంగాధర్ తెలిపాడు. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! సాధారణ సీజన్లో బంతి కిలో ధర రూ.50 నుంచి రూ.60, చామంతి, గడ్డి చామంతి కిలో ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఇక బతుకమ్మ, దసరా సీజన్లలో బంతికి కిలో రూ.100, చామంతి రూ.200 వరకు, గడ్డి చామంతి రూ.50 వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్లో పూలన్నీ విక్రయిస్తే రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. కండ్లపల్లిలో లిల్లీపూలు జగిత్యాల మండలంలోని కండ్లపల్లికి చెందిన చందా సుధాకర్ లిల్లీపూలు సాగు చేస్తున్నాడు. వీటి గడ్డలు 20 కిలోలకు రూ.800 వెచ్చించి, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం నుంచి తీసుకువస్తున్నాడు. భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని, పొడి దుక్కి చేస్తాడు. తర్వాత పేడ, కోడి ఎరువు వేస్తాడు. అనంతరం లిల్లీపూల గడ్డలను పొలంలో నాటుతాడు. ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు పూలు పూస్తాయి. నాటిన 3 నెలలకు దిగుబడి వస్తుంది. చదవండి: Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పూలు ఎక్కువగా వస్తాయి. వీటిని జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తున్నాడు. ఏటా రెండుసార్లు తోటకు డీఏపీతోపాటు 3 నెలలకోసారి పొటాష్, యూరియా అందిస్తుంటాడు. ఈ పూలు మార్కెట్లో కిలోకు రూ.100 పలుకుతున్నాయి. నిత్యం 8 నుంచి 10 కిలోలను మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సుధాకర్ తెలిపాడు. ఏడాదికి పంటకు రూ.60 వేల వరకు ఖర్చు పెడితే, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.1.75 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. నాగారం, తెనుగుపల్లెలో పట్టుకుచ్చులు బతుకమ్మ పేర్చాలంటే తంగేడు పూలతోపాటు గుమ్మడి, కట్ల, గోరింట, పట్టుకుచ్చుల(సీతమ్మ జడ) పూలు ఉండాల్సిందే. ముఖ్యంగా పట్టుకుచ్చులు బతుకమ్మకు ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తాయి. ఈ పూలకు పెట్టింది పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని నాగారం, తెనుగుపల్లె గ్రామాలు. గ్రామస్తులు ఏటా బతుకమ్మ సందర్భంగా 10 గుంటల నుంచి ఎకరం వరకు పట్టుకుచ్చులు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పూలను సమీపంలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నాగారానికి చెందిన తాళ్ల శ్రీనివాస్ 20 ఏళ్లుగా ఎకరం భూమిలో పట్టుకుచ్చులు సాగు చేస్తున్నాడు. విత్తనం అలికిననాటి నుంచి పువ్వుకోసే వరకు వరి, పత్తి పంటల్లాగే అన్నిరకాల ఎరువులు వేస్తామని తెలిపాడు. ఈ ఏడాది కొత్త రకం సాగు చేశానని, ఇటీవల కురిసిన వర్షాలకు తోటలో కలుపు తీయలేకపోయామని చెప్పాడు. ఇప్పటివరకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని, వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాలేదన్నాడు. పెట్టుబడి వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. గతేడాది ఇదే పెట్టుబడికి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయం పొందినట్లు పేర్కొన్నాడు. మామిడాలపల్లిలో బంతి, పట్టుకుచ్చులు వరి పంటతో నష్టాలు చూసిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి బంతి, పట్టుకుచ్చుల పూలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది 1.20 ఎకరాల్లో బంతి విత్తనాలు వేయగా పంట చేతికివచ్చే సమయంలో వర్షాలు కురిసి, పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఎకరన్నర భూమిలో బంతి, 20 గుంటల్లో పట్టుకుచ్చుల విత్తనాలు వేశాడు. మొక్కలు ఏపుగా పెరిగి, పూలు విపరీతంగా పూశాయి. వారం రోజుల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ప్రస్తుతం కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకు చేను వద్దే విక్రయిస్తున్నానని తెలిపాడు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయన్నాడు. పూల సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టానని, రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. మొక్కలకు నీటి కోసం మల్చింగ్‌తోపాటు డ్రిప్ ఏర్పాటు చేశానని, దీనివల్ల నీటి తడులకు కూడా ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నాడు. మంగళ్లపల్లిలో బంతి, చామంతి, మల్లె పూలు రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లిలో 190 కుటుంబాలున్నాయి. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. సుమారు 50 కుటుంబాలు బంతి, చామంతి, మల్లె పూలతో ఉపాధి పొందుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పూలు సాగు చేస్తామని రైతు బాదనవేణి బాలరాజు తెలిపాడు. వీటిని సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతోపాటు కరీంనగర్ మార్కెట్‌కు కూడా తరలిస్తామన్నాడు. నిత్యం 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయిస్తామని, శుభకార్యాలు, పండుగల సమయాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. సాధారణ రోజుల్లో కిలోకు రూ.50 నుంచి 70 వరకు, దసరా, బతుకమ్మ, దీపావళి తదితర ప్రత్యేక రోజుల్లో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. పూల సాగుతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పత్తిసాగు పెట్టుబడికి వినియోగిస్తామని చెప్పాడు. పూల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు. తిమ్మాపూర్‌లో బతుకమ్మ కోసమే.. తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలో అనేక మంది రైతులు బతుకమ్మ పండుగ కోసమే సుమారు 50 ఎకరాల్లో సీతజడ(పట్టుకుచ్చులు), 50 ఎకరాల్లో బంతి తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. వ్యాపారులు ఆయా తోటల వద్దకే వెళ్లి, ముందస్తుగా డబ్బులు చెల్లించి, బుక్ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఇకెబానా ఒహారా స్కూల్లో మినీ ఎగ్జిబిషన్.. ప్రత్యేక అతిథులు హాజరు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకెబానా (పూలు అమర్చే జపనీస్ కళ)ను నేర్పించే హైదరాబాద్‌లోని ఒహారా స్కూల్ కూడా ఈ ఏడాది తమ మొదటి ఈవెంట్‌ను దీనికే అంకితం చేసింది. ఈ సందర్భంగా ఓ మినీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. స్కూల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా అగర్వాల్ నేతృత్వంలోని బృందం థీమ్‌ను రూపొందించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. శత్రువులతో పోరాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య ఈ మినీ ఎగ్జిబిషన్‌కు అతిథిగా హాజరయ్యారు. సైన్యంలో వైద్య సేవలందించిన లెఫ్టినెంట్ కల్నల్, పీడియాట్రిషన్ ఉమ రామచంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆర్మీ స్కూల్స్‌లో టీచర్‌గా పనిచేసిన శ్యామల ఖన్నా అతిథిగా వచ్చారు. ఈమె 'కౌ ఇన్ కార్గిల్', 'ది లాహోర్ కనెక్షన్' వంటి పుస్తకాలు కూడా రాశారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..
యాదగిరిగుట్ట: తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్నోలోని సెంటర్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్), సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ కౌన్సిల్(సీఎస్ఐఆర్) సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల యాదాద్రి ఆలయ అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ, యాదగిరిగుట్ట మున్సిపల్ అధికారులు చర్చించారు. యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడలో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి యాదగిరిగుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అగరుబత్తుల తయారీకి ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. యాదగిరిగుట్టలో ప్రస్తుతం శాంపిల్‌గా చేతులతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. తయారీ విధానమిదే.. రోజూ ఆలయంలో వాడిన పూలను మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తారు. ఈ పూలను వేరుచేసి నీడలో ఆరబెడతారు. అనంతరం ఒక్కోరకం పువ్వులను వేర్వేరుగా యంత్రంలో వేసి పౌడర్ తయారు చేస్తారు. పువ్వు పౌడర్, జిగట్ పౌడర్‌ను కలుపుతారు. దాన్ని సన్నని స్టిక్స్‌కు పెట్టి రోల్ చేస్తారు. ఆరబెట్టాక సువాసన వెదజల్లేలా తులసీపత్రాల నూనెను అగరుబత్తులకు అద్దుతారు. కిలోపువ్వుల పౌడర్‌తో 2,500 అగరుబత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఆలయం నుంచి రోజూ 6 నుంచి 8 కిలోల వరకు పూలు వస్తున్నాయి. పట్టణంలో 2,700 మంది మహిళాస్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వీరితో అగరుబత్తులు తయారు చేయించి, వారినే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా వీలు కల్పించనున్నారు. మహిళల ఉపాధికి శిక్షణ వాడిన పూలతో అగరుబత్తుల తయారీకి మహిళాసంఘాల సభ్యులకు మొదటి విడత శిక్షణ పూర్తయింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యత తీసుకుంది. – శ్రవణ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదాద్రి బ్రాండ్ పేరిట అమ్మకాలు పూలతో తయారు చేసిన అగరుబత్తులను భక్తులు స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడతాం. – ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ -
అద్భుతం..అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిలో పూల నందనమా!
అవును మరి.. ఇది అద్భుతమే.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారిగా పేరొందిన అటకామా. చూశారుగా.. నిజంగానే ఎడారా అని అనుమానం కలిగేలా.. పూలతో నందనవనాన్ని తలపిస్తోంది. ఇక్కడ వర్షం అరుదు. ఏడాదికి సగటు వర్షపాతం 15 మిల్లీమీటర్లు.. చాలా ప్రాంతాల్లో అది కూడా పడదు. అయితే, ఎప్పుడూ లేనంతగా కుండపోత వర్షం కురిసినప్పుడు.. ఎడారి మురిసిపోతుంది.. విరులతో ఇలా మెరిసిపోతుంది. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేశారు. 5–7 ఏళ్లకోసారి అటకామాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటుందట. చదవండి: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో తెలుసా? -
గుచ్చదు.. ఈ గులాబీ, లిసియాంతస్ పూలతో లాభాల గుబాళింపు
తాడేపల్లిగూడెం: లిసియాంతస్.. ముళ్లులేని గులాబీ పువ్వు. నీలం.. ఆకుపచ్చ.. పసుపు.. గులాబీ.. తెలుపు.. నీలం.. పికోటీ.. చాంపేన్. ఎన్నెన్నో రంగుల్లో ఉండే ఈ లిసియాంతస్ పువ్వుల్ని చూస్తే కళ్లు ఆనందంతో విప్పారతాయి. చూపు తిప్పనివ్వని సౌందర్యం వాటి సొంతం. ఏక రేకలైనా.. బహురేకలైనా.. ఆ పుష్పాల అందాలు మనసుల్ని దూదిపింజలా మార్చేస్తాయి. స్వప్నలోకంలో విహరింపజేస్తాయి. లిసియాంతస్ పువ్వులు గులాబీ పూలను పోలి ఉంటాయి కానీ.. వీటికి ముళ్లు మాత్రం ఉండవు. రెండు నుంచి మూడు వారాలకు పైగా వాడిపోవు. వీటి సాగు ప్రయోగం మన రాష్ట్రంలో ఫలిస్తే.. కృషీవలులకు లాభాల గుబాళింపేనంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్. ఈ పూల విశేషాలేమిటో.. సాగు ప్రయోగం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా. సమ శీతోష్ణ వాతావరణంలోనూ.. లిసియాంతస్ సాగుకు శీతల వాతావరణం అవసరం. సమశీతోష్ణ వాతావరణంలోనూ లిసియాంతస్ పెరుగుతుందని రుజువు కావడంతో రావడంతో రక్షిత సాగు పద్ధతిలో హైటెక్ పాలీహౌస్, ఫ్యాన్, పాడ్ పాలీహౌస్, కూలింగ్, మిస్ట్ చాంబర్లలో వీటిని పెంచుతున్నారు. తమిళనాడులోని ఊటీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇప్పటికే వీటిని సాగు చేస్తున్నారు. పాలీ హౌస్‌లలో సాగు చేసే ఈ పుష్పాలకు వాణిజ్య విలువలు అధికం. ఎగుమతికి అనుకూలమైనవి. అందుకే.. ఇది మంచి లాభదాయకమైన ఉద్యాన పంట. మన దగ్గరా కొన్ని ప్రాంతాలు అనుకూలమే! గులాబీ మాదిరిగా అంటు పద్ధతిలో కాకుండా విత్తనాలు చల్లి సాగు చేసుకోవచ్చు. వీటి సాగుకు మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక విత్తన కంపెనీ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. గతంలో చింతపల్లి కేంద్రంలో సిమ్లా యాపిల్‌ను ప్రయోగాత్మకంగా పండించారు. లిసియాంతస్ సాగుకు ఈ పరిశోధన స్థానం బాగుంటుందని సకాటా సీడ్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అరుదైన ఆర్కిడ్స్ పూల సాగు కోసం ఈ కేంద్రంలో విశిష్ట రక్షిత సాగు కేంద్రం ఉంది. ఇక్కడే లిసియాంతస్ పువ్వుల సాగుకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో ఉద్యాన వర్సిటీలో ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ పర్యవేక్షణలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్, పాలీహౌస్ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ పూల సాగుపై ఔత్సాహిక రైతులకు రైతులకు అవగాహన కల్పించారు. ప్రేమకు ప్రతీకగా.. ప్రపంచంలోనే అందమైన పువ్వులుగా పేరున్న లిసియాంతస్ పుష్పాలను ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. జెంటియన్ కుటుంబానికి చెందిన ఈ పువ్వును టెక్సాస్ బ్లూబెల్గా కూడా పిలుస్తారు. ఇకో, డబులిని, రోసిత, ఎక్స్కలిబర్, మరయాకి, రోసిత రోసన్నో, వోయేజ్, అబూ రోసిత పేర్లతోనూ లిసియాంతస్ను పిలుస్తున్నారు. బొకేలు, పూల అలంకరణకు అనుకూలమైన ఈ పుష్పాలు పువ్వులు ఏక, బహుళ రేకలతో గులాబీ, కామేలియా ఆకారంలో వైవిధ్యంగా ఉంటాయి. ఆసియా ఖండంలో 50 ఏళ్ల క్రితమే ప్రాచుర్యం పొందిన ఈ పువ్వులు మృదువైన రేకలతో అలరిస్తాయి. ఒకటి లేదా రెండు మూడు జతల నారు మొక్కలను కలిపి నాటుకోవచ్చు. నేల శుద్ధీకరణ, ఆవిరి శుద్ధీకరణ, హాట్ వాటర్ స్టెరిలైజేషన్ పద్ధతిలో నారు తయారీకి సమాయత్తం కావచ్చు. వీటికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు. కాల్షియం నైట్రేట్ ఆధారిత ఎరువులు స్వల్పంగా వాడితే చాలు. త్వరలోనే ప్రయోగాలు అపురూపమైన లిసియాంతస్ పువ్వులను వాడుకలోకి తెచ్చే క్రమంలో వీటి సాగుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకు సంబంధించి సకాటా సీడ్స్ సంస్థతో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. వీటి సాగుకు చింతపల్లి పరిశోధన స్థానం అనుకూలమని సీడ్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వెళ్లి వచ్చిన తర్వాత చెప్పారు. పుష్పాల సైకిల్‌ను పరిశీలించడానికి ప్రయోగం చేయనున్నాం. ఈ ప్రయత్నం విజయవంతమైతే రైతులకు లాభాల పంట అందుబాటులోకి వస్తుంది. –డాక్టర్ తోలేటి జానకిరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్!
ప్రకృతి.. తన వైవిధ్యాలతో మానవమాత్రుల్ని ఎప్పటికప్పుడు అబ్బురపరస్తూనే ఉంటుంది. గమ్మతైన అందాలతో నివ్వెరపరస్తూనే ఉంటుంది. బాతుల్ని పోలిన పువ్వులు.. వినడానికే వింతగా ఉంది కదూ! ఈ చిత్రాలను చూస్తే మీకే అర్థమవుతుంది. కలేనా మేజర్ ఆర్కిడ్ అనే జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చం ఎగురుతున్న బాతుల్లా ఉంటాయి. చూడటానికి ఇవి రెక్కలు విచ్చుకుని పైకి ఎగురబోతున్నట్లే తారసపడతాయి. తూర్పు, దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ పూల తల భాగంపైన తాకితే చాలు.. వెంటనే టచ్ మి నాట్ మొక్కలాగా ముడుచు కుంటాయి. ఊహించని ప్రమాద సూచికగా భావించి, అమాంతం తలను వాల్చుకుని దాక్కున్నట్టుగా అలా ముడుచుకుంటాయన్నమాట. అద్భుతం కదూ! -
టీటీడీ, వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే.. పూర్తి వివరాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార వైభోగం చెప్పనలవి కాదు. స్వామి వారి అలంకారంలో పుష్పాలదే అగ్రస్థానం. తిరుమలేశుని మూల మూర్తికి ఉదయం లేచింది మొదలు రాత్రి పవళింపు సేవ వరకు నిత్యం సాగే పూజాదికాల్లో అనేక రకాల పుష్పాలు వాడతారు. స్వామి సేవకు ఉపయోగించిన పవిత్రమైన పుష్పాలను పూజారుల చేతుల నుంచి అందుకోవడమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది పూజకు ఉపయోగించిన పుష్పాలు స్వామి వారి రూపంలో ఉంటే భక్తుల తన్మయత్వం అంతా ఇంతా కాదు. ఇదే తలంపుతో టీటీడీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తలపెట్టాయి. చదవండి: ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే? గతేడాది జనవరిలో ‘ఎండు పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వామి వారి పుష్పాలతో దేవతా మూర్తులు, పలు రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధన ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లో 350 మందికి డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చారు. ఎండబెట్టిన పూలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో కూడిన చిత్రపటాలు, వివిధ రకాల వస్తువుల తయారీతో జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు. కోవిడ్ కారణంగా భర్త చనిపోయిన వారు, ఉపాధి కోల్పోయిన వారు, టీ బంకుల్లో, ఇళ్లల్లో పనులు చేసుకునే వారు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. దైవత్వం ఉట్టిపడేలా కళారూపాలు ఉద్యాన వర్సిటీతో చేసుకున్న ఒప్పందం మేరకు స్వామివారి సేవలో ఉపయోగించే పూలను టీటీడీ సరఫరా చేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వాటిని ఎండబెట్టి, ఫొటో పేపర్, కాన్వాస్‌లపై దైవత్వం ఉట్టిపడేలా వివిధ రూపాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, పద్మావతి, ఒంటిమెట్టలోని సీతారాములు, శ్రీకృష్ణుడు, వకుళామాత వంటి దేవతామూర్తుల చిత్రపటాలను తీర్చిదిద్దుతున్నారు. డాలర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, లాకెట్లు, పెన్స్టాండ్లు వంటి వాటిని తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నారు. కొందరు రూ.30 వేల వరకు కూడా సంపాదిస్తున్నారు. నెలకు రూ.40 లక్షల ఉత్పత్తుల తయారీ ఇక్కడ తయారైన వస్తువులను తిరుమలతో పాటు టీటీడీకీ అనుబంధంగా ఉన్న స్వామి వారి ఆలయాల వద్ద విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల విలువైన ఉత్పత్తులు తయారవుతుండగా, రూ.60 లక్షల స్థాయికి పెంచుతున్నారు. ఆన్లైన్లో కూడా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారికి అలంకరించే 3 నుంచి 5 అడుగుల నిలువెత్తు పూలదండలను ఎండబెట్టి ఫ్రేమ్ కట్టి భక్తులకు అందించే ఆలోచన చేస్తున్నారు. దీనిని పూర్తిస్థాయి పరిశ్రమగా నిలబెట్టేందుకు ప్రత్యేక భవనం నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈ సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలంటూ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి యూనివర్సిటీకి వినతులు వస్తున్నాయి. ఈ కేంద్రాన్ని పరిశీలించిన ప్రవాసాంధ్రులు కూడా ఆర్డర్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. మరో వైపు ఎండుపూలతో తయారు చేసే వస్తువుల జీవిత కాలం పెంచేందుకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రొ.రాచకుంట నాగరాజు పర్యవేక్షణలో పరిశోధనలు చేస్తున్నారు. ఎండబెట్టిన పూలను వాటి సహజసిద్ధమైన రంగు కోల్పోకుండా పౌడర్ రూపంలో మార్చడం పైనా అధ్యయనం చేస్తున్నారు. కుటుంబానికి లోటులేకుండా ఉంది నా భర్త ఏడాది క్రితం కోవిడ్‌తో చనిపోయారు. ఇద్దరు పిల్లలు, అత్త పోషణ నాపై పడింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇక్కడ శిక్షణ పొంది నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. కుటుంబానికి లోటు లేకుండా ఉంది. –ఎం.శివకుమారి, హరిపురం కాలనీ, తిరుపతి అప్పులన్నీ తీర్చేశా నా భర్త సిమెంట్ పనికి వెళ్తారు. నెలలో 15–20 రోజులే పని. రోజుకు 450 సంపాదించే వారు. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. స్వామి వారి ఫొటో ఫ్రేమ్స్ తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత నెలకు రూ.10–12వేలు సంపాదిస్తున్నా. అప్పులన్నీ తీర్చేశా. –కడపల దివ్యలత, అన్నమయ్య నగర్, తిరుపతి మంచి స్పందన లభిస్తోంది టీటీడీతో కలిసి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎండుపూల ఉత్పత్తుల ప్రాజెక్టుకు మంచి స్పందన లభిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ పొందిన మహిళల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. –డాక్టర్. టి.జానకిరామ్, వైస్‌చాన్సలర్, ఉద్యాన వర్సిటీ -
పుష్ప.. ద ఫైర్!
సాక్షి,కడియం(కాకినాడ): అక్కడి పూలు మదిని దోచుతున్నాయి. సాధారణంగా జూలై చివరి వారం నుంచి డిసెంబరు వరకూ మాత్రమే పువ్వుల రకాలు కనిపిస్తుంటాయి. కడియం నర్సరీల్లో అందుకు భిన్నంగా మండుటెండల్లోనూ పూలు వికసిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీటిని సమ్మర్ సీజనల్స్గా నర్సరీ రైతులు వ్యవహరిస్తుంటారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా పూలనిచ్చే పలు రకాల మొక్కలను వీరు అభివృద్ధి చేస్తున్నారు. మన దేశంలోనే వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర దేశాల నుంచి కూడా వీటిని దిగుమతి చేసుకుని పెంచుతున్నారు. మొక్కల పెంపకంలో భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ రైతులు కుండీల్లో ఎవెన్యూ రకాల మొక్కలు పెరిగేలా మార్పులు తీసుకువస్తున్నారు. దీంతో ఈ రకాలు పుష్పశోభితంగా కనువిందు చేస్తున్నాయి. ప్రాథమిక దశలో వీటిని పాలిహౌస్‌లు, షేడ్నెట్ల కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆ తరువాత ఇతర పూల మొక్కల మాదిరిగానే నేలపై నాటుకోవచ్చంటున్నారు. కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఈ మొక్కలకు తగినంత నీటిని అందిస్తే చాలు. సాధారణంగా వేసవిలో నీడనిచ్చే మొక్కలే ఏపుగా ఎదుగుతాయి. కానీ ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ పూలతో ఏపుగా పెరుగుతుండటం ప్రత్యేకత. ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీ రైతుల వద్ద ఈ మొక్కలు విస్తృతంగా లభిస్తున్నాయి. కొన్ని రకాలకు వేసవి ప్రత్యేకంగానే ఉంటుందని నర్సరీ రైతు తెలిపారు. వేసవిలో కూడా చెట్టు నిండా పువ్వులతో చూడగానే ఆకట్టుకునే అనేక రకాల మొక్కలు ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీల్లో లభిస్తున్నాయన్నారు. ప్రధాన రకాలివీ.. ఏంజిల్వింగ్ బ్రిగ్నోనియా, పింక్పెండా, లెగస్టోమియా ఇండికా, జస్రాంతస్ లిల్లీ, జొకోబినా, యాంజిలోనియా, అగసాంతస్, అమరాంతస్ లిల్లీ, కాక్టస్, రంగూన్ క్రీపర్, టకోమా డ్వార్ఫ్, తబీబియా సలిడా డ్వార్ఫ్ తదితర రకాలు వేసవిలో సైతం ప్రత్యేకంగా పూస్తాయని రైతులు తెలిపారు. -
Photo Feature: విరబూసిన ‘గాంధర’ అందాలు
సాక్షి, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల కురుస్తున్న వర్షాలకు మన్యం కొత్త అందాలను సంతరించుకుంటోంది. చల్లని వాతావరణంలో పచ్చని సోయగాలు కనువిందుచేస్తున్నాయి. వీటికి తోడు శ్వేతవర్ణంలోని గాంధర పూలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఇవి ఏటా ఏప్రిల్ నెలలో విరబూస్తాయి. స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి ఆనుకుని ఉన్న అటవీప్రాంతంలో విరబూసిన ఈ పూలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. గుంటసీమ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహన చోదకులకు ఇవి కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న గాంధర పూల తోట కొమ్మకొమ్మకు కపోతం సాక్షి, పాడేరు: ప్రేమకు, శాంతికి చిహ్నమైన పావురాలు గుంపులు గుంపులుగా ఎగురుతూ పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి పంచాయతీ పెద్దగొందిలో స్థానికులకు కనువిందుచేస్తున్నాయి. గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి తన ఇంటి వద్ద 40 పావురాలు పెంచుకుంటున్నాడు. వీటి కువకువలు, రెక్కల చప్పుళ్లతో ఆ ప్రాంతంలో ఆహ్లాదమైన వాతావరణం నెలకొంది. కపోతాలన్నీ ఓ చెట్టు వద్ద చేరి సందడి చేస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. చెట్టుపై కనువిందు చేస్తున్న పావురాలు -
పుతిన్‌కు ఘోర అవమానం!
ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో పాశ్చాత్య దేశాల దృష్టిలోనే కాదు.. సొంత దేశంలోనూ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆంక్షలు ఇప్పటికే రష్యాకు ఆర్థికంగా ప్రభావితం చేస్తుండగా.. మరోవైపు రష్యన్ సోషల్‌మీడియా పుతిన్‌కు వ్యతిరేకంగానే కూస్తోంది. ఈ క్రమంలో.. పుతిన్‌కు ఘోర అవమానం.. అదీ సొంత గడ్డపైనే జరిగింది. మహిళా దినోత్సవం వేడుకల్ని Russia లో పలు చోట్ల బహిష్కరించారు. సాధారణంగా.. ఉమెన్స్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటాడు పుతిన్. కానీ, ఈసారి ఈ వేడుకల్లో చేదు అనుభవం ఎదురయ్యింది. పుతిన్ లక్ష పువ్వుల పంపకం ఈసారి బెడిసి కొట్టింది. వలంటీర్ల సాయంతో మాస్కో నగరంలో మహిళలకు లక్ష పువ్వుల్ని పంచడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం. మహిళా డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వలంటీర్ల సాయంతో పూలు పంచాలంటూ అధ్యక్ష భవనం నుంచే ఈ ఆదేశాలు వెలువడుతుంటాయి కూడా. అయితే.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చాలామంది పువ్వుల్ని తీసుకోవడానికి నిరాకరించారట. ఈ విషయాన్ని టాస్ న్యూస్ ఏజెన్సీ ప్రముఖంగా ప్రచురించింది. పువ్వులతో పాటు ఫ్లవర్ బొకేలను సైతం తిరస్కరించారట. అంతేకాదు కొన్నిచోట్ల వాటిని చెత్త కుప్పల్లోనే పడేసిన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి అక్కడ. సోషల్ మీడియాలో పుతిన్ యుద్ధకాంక్షను ఛీ కొడుతూ.. ఆ వ్యతిరేకత తారాస్థాయిలో కనిపించింది. దీంతో ఆ పోస్టులు, ఫొటోల్ని తొలగించాలని రష్యన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఉమెన్స్ డే సందర్భంగా.. మహిళా మిలిటరీ, వైద్య సిబ్బందిని ఉద్దేశించి పుతిన్ ప్రసగించిన కార్యక్రమానికి టీఆర్పీ దారుణంగా పడిపోవడం సైతం చర్చనీయాంశంగా మారింది. -
పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!
న్యూయార్క్: చాలామంది ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా వాటిని ఏదో విధంగా వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదే తరహాలో ఒకామె కొన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి పువ్వులను తయారు చేసింది. పైగా వాటిని తన ఇంటి టెర్రస్ పై నుంచి కింద వరకు ఒక సన్న జాజి తీగ లత మాదిరిగా పూలన్ని పరుచుకుంటూ కింద నేలవరకు ఉంటాయి. అది ఎంత ఆకర్షణీయంగా ఉండటమే మనం మన దృష్టిని మరల్చకుండా అలా చూస్తుండేపోయేలా అందంగా ఉంటాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...అమరికాకు చెందిన ఫియోనా అనే 53 ఏళ్ల మహిళ క్రిస్మస్ సందర్భంగా తన ఇంటిని అలంరకరించే నిమిత్తం తన ఇరుగు పొరుగు వారి దగ్గర్నుంచి బాటిల్స్ సేకరిస్తోంది. ఆ తర్వాత ఆమె బాటిల్స్ అడుగు భాగన కత్తిరించి యాక్రిటిక్ పేయింటింగ్‌తో పువ్వుల్లా తయారు చేస్తుంది. చూడటానికి గుండ్రని విత్తన గుళికలతో కూడిన గుల్మకాండ మొక్కలు మాదిరి గసగసాల పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. నిజానికి అవి నిజమైన పూవులు మాదిరిగా ఉంటాయి. ఈ మెరకు ఫియోనా ఈ క్రాఫ్ట్‌ని 2014లో వేవ్ డిస్ ప్లే ప్రేరణతో తయారు చేసినట్టు చెప్పింది.పైగా అవి 12 అడుగులు పొడవుతో తన ఇంటి మొదటి అంతస్థు కిటికి నుండి కింద నేల వరకు పరుచుకుని అందమైన పూల లతలా ఉంటుంది. ఈ విధంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పూలతో తన ఇంటిని మొత్తం అందంగా అలంకరించింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..
సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్‌లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్‌లో నార్త్అంబర్లాండ్లోని ఆన్విక్ కేసిల్‌లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి. అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్అంబర్లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ. ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్బేన్, జెయింట్ హాగ్వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు -
బతుకమ్మ సంబురాలు : ‘‘వేపకాయల బతుకమ్మ' ప్రత్యేకత ఇదే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులు పాటుసాగనున్న ఈ సంబురంలో ఈ రోజు సకినాల పిండితో వేపకాయల నైవేద్యాన్ని ప్రసాదంగా నివేదిస్తారు. మహిళలు ఉత్సాహంగా ఆడిపాడుతూ చల్లగా దీవించుతల్లీ అంటూ గౌరమ్మకు మొక్కుతారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ సంబురాలను ముగించుకున్న మహిళలు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ‘‘వాడవాడంత ఉయ్యాలో.. పూల వనమాయే ఉయ్యాలో’’ అంటూ తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొంటారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. అనంతరం ఆ బతుకమ్మను చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ వేడుకలు 9 రోజులపాటు కొనసాగుతాయి. తెలంగాణ వీధులన్నీ రంగురంగుల పూలతో అందంగా అలంకరించిని బతుకమ్మలతో కళకళలాడుతున్నాయి. అందమైన కన్నెపిల్లలు, చక్కటి ముస్తాబుతో మహిళలతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు 9వ రోజున సద్దులబతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు మాసాలు ప్రజలకు పండుగల నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలొస్తాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా లేదా విజయ దశమి. ముఖ్యంగా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ రెండు పండుగల్లో ఇంటికి వచ్చిన కొత్త పెళ్లికూతుళ్లతో ఆయా కుటుంబాలు కోలాహలంగా ఉంటాయి. మరోవైపు మహిళలు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించడంతో పాటు దసరా సంబరాలకు సిద్ధమవుతున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో దుకాణాల్లో షాపింగులతో కళకళలాడుతున్నాయి. అటు పూల దుకాణాలు, ఇటు వస్త్ర, బంగారు ఆభరణాలు షాపులు కొనుగోలుదారులతో బిజీ బిజీగా ఉన్నాయి. -
ఇదో రకం ట్రెండ్.. ఆవకాయ జాడీతో అదిరిపోయే అలంకరణలు
Trendy House Interior Design: ఇంటి అలంకరణలో ఫ్లవర్ వేజ్‌ల వాడకం తెలిసిందే. అందమైన ఫ్లవర్‌వేజ్‌ల ఎంపిక గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవల ఇంటీరియర్ డెకార్‌లో భాగంగా పాతకాలం నాటి వస్తువుల ప్రాధాన్యత పెరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది పచ్చడి జాడీ. బామ్మల కాలం నుంచి వివిధ రకరాల పచ్చడి జాడీల గురించి మనకు పరిచయమే. పది కేజీల పచ్చడి మొదలుకొని, పావు కేజీ పచ్చడి పట్టేంత జాడీలు ఉండేవి. ఆవకాయ, మాగాయ, ఉసిరి, చింత, గోంగూర.. ఇలా రకరకాల పచ్చళ్లకు రకరకాల పరిమాణాల్లో జాడీలు ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం తగ్గి, చాలా వరకు అటక చేరిపోయాయి. లేదంటే, ఊళ్లోనే వాటిని వదిలేసి వచ్చి ఉంటారు. కానీ, ఇప్పుడు ఇంటి అలంకరణలో ఇవే వైవిధ్యం అయ్యాయి. అందుకే ఎక్కడో మూలన చేరిన జాడీలు ముందు గదిలో దర్జాపోతున్నాయి. ఇత్తడి.. జాడీ పక్క పక్కనే చేరి కొత్తగా కబుర్లు చెప్పుకుంటున్నాయి పాతకాలం నాటి ఇత్తడి వస్తువులు, పచ్చడి జాడీలు. జాడీ పువ్వులను సింగారించుకొని బామ్మల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే ఇత్తడి పాత్రలు ఇంపుగా వింటున్నాయి. ఇంటి డెకార్‌లో వింటేజ్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే అని నిరూపిస్తున్నాయి. చిన్నా పెద్ద.. జాడీ పరిమాణాలు, షేపుల్లో వివిధ రకాల జాడీలను ఎంచుకొని తాజా పువ్వులు లేదా డ్రై పువ్వులను అలంకరిస్తే సంప్రదాయ సొగసు, పండగ కళ నట్టింటికి నడిచివచ్చినట్టే. పచ్చని మొక్కకు జీవం ఎర్రని నోరూరించే పచ్చడికే కాదు పచ్చని మొక్కలకూ జీవం పోస్తుంది జాడీ. ఇండోర్ ప్లాంట్స్‌కు ఇలవేల్పుగా కొత్త రకం కుండీలో ఖుషీగా మారిపోతుంది. మొక్కలకు, పూలకు కుండీలుగా మారి కొత్త కళతో వెలిగిపోతున్నాయి. ఎప్పటికీ కళగా! తాజా పువ్వులు రోజూ అలంకరించలేం అనుకునేవారు ఇప్పటికే ఉన్న కృత్రిమ ఆకులు, పువ్వుల కొమ్మలను జాడీలో పొందిగ్గా అమర్చితే చాలు. సెంటర్ టేబుల్‌కి ఆకర్షణీయత పెంచుతుంది. సైడ్ వాల్ షెల్ఫ్‌లో కళగా మెరిసిపోతుంది. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలిసి ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఆధునికత వైపు పరుగులు తీసి అలసిపోతే ప్రాచీన సంపద అక్కున జేర్చుకుని మనసును సేద తీరుస్తుంది. అందుకు అసలు సిసలైన ఉదాహరణగా పచ్చడి జాడీలు నిలుస్తున్నాయని ‘హోమ్ హార్మనీ, మై హోమ్ వైబ్స్’ క్రియేషన్స్ అలంకరణను ఇలా కళ్లకు కట్టింది. చదవండి: బెదిరించినా సరే మహేశ్ అలా చేయరు : సుధీర్‌బాబు -
పుష్కరానికి ఒక్కసారి...కమనీయ దృశ్యం!
సాక్షి, బెంగళూరు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో అద్భుతమైన కమనీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొడగు జిల్లాలోని మందలపట్టి కొండవద్ద నీలకురింజి పువ్వులు విరగబూశాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పువ్వులు విరగబూయడంతో నెటిజన్లు సందడి నెలకొంది. అద్భుతం.. రెండు కళ్లూ చాలవంటూ పులకించిపోతున్నారు. అరుదైన మొక్కల్లో ఒకటి నీలకురింజి. ఇవి పన్నెండేండ్లు పెరిగి పూలు పూసిన తర్వాత చనిపోతాయట. అలా వాటి విత్తనాలతో మొలకెత్తిన మొక్కలు మళ్లీ పూతకు రావాలంటే పుష్కర కాలం వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా ప్రతీ ఏడాది జూలై-అక్టోబర్ నెలల కాలంలో ఇవి పూస్తాయి. ఇకవీటికి నీలకురింజి అనే పేరు ఎలా వచ్చిందంటే..మలయాళంలో కురింజి అంటే పువ్వు అని, నీల అంటే నీలిరంగు అని అర్థం. ఈ పుష్పాలు నీలం రంగులో ఉండటం వల్ల ‘నీలకురింజి’ అనే పేరు వచ్చిందట. Karnataka | Neelakurinji flowers, which bloom once every 12 years, seen at Mandalapatti hill in Kodagu district. pic.twitter.com/DgpZaYoFQI — ANI (@ANI) August 18, 2021 -
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్; నేలమీద హరివిల్లు
రోజెస్ ఆర్ రెడ్... వయొలెట్స్ ఆర్ బ్లూ... పిల్లలకు రంగులను పరిచయం చేసే ఈ గేయానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాదాపుగా 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై –ఆగస్టు నెలల్లో వెళ్లాలి. జూన్ నుంచి అక్కడక్కడా పూలు కనిపిస్తాయి. కానీ లోయ మొత్తం పూల తివాచీలా కనిపించేది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే. ఇది అద్భుతమైన టెక్కింగ్ జోన్. గోవింద్ ఘాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేం. అందుకే రెండు రోజుల ట్రెకింగ్ ప్లాన్ చేసుకోవాలి. మొదటి రోజు ట్రెక్‌లో హిమాలయాల సౌందర్య వీక్షణంలోనే సాగుతుంది. ఇక్కడ మంచు మెల్లగా మబ్బు తునకలుగా ప్రయాణించదు. తెరలు తెరలుగా గాలి దుమారంలాగ వేగంగా కదులుతుంటుంది. మాట్లాడడానికి నోరు తెరిస్తే నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. సుమఘుమలు రెండవ రోజు ట్రెకింగ్‌లో పూల ఆనవాళ్లు మొదలవుతాయి. ముందుకు వెళ్లే కొద్దీ పుష్పావతి లోయ రంగురంగుల హరివిల్లును తలపిస్తుంది. ఈ లోయను పూర్వకాలంలో పుష్పావతి లోయగా పిలిచేవారు. ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే లెక్క చెప్పడం కష్టమే. కేవలం ఈ లోయలో మాత్రమే ఉండే పూల రకాలు ఐదు వందలకు పైగా ఉన్నట్లు ఇక్కడ రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ చంద్ర ప్రకాశ్ ‘ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్: మిత్స్ అండ్ రియాలిటీ’లో రాశారు. ఇక్కడ పుష్పావతి నది ప్రత్యేక ఆకర్షణ. తిప్రా గ్లేసియర్ కరిగి గౌరీ పర్బత్ మీదుగా జాలువారి నది రూపం సంతరించుకుంటుంది. పుష్పావతిలోయలో ప్రవహిస్తుండడంతో దీనికి పుష్పావతి నది అనే పేరు స్థిరపడిపోయింది. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నేషనల్ పార్కుగా ప్రకటించి పరరక్షిస్తోంది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది. మృగాల్లేవు... మునుల్లేరు! ఇక్కడ హిమాలయ పర్వతాలు 3350 మీటర్ల నుంచి 3650 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఎలుగుబంటి, నక్క, మంచులో తిరిగే చిరుత వంటి కొన్ని అరుదైన జంతువులుంటాయి. కానీ పర్యాటకుల తాకిడితో అవి ట్రెక్కింగ్ జోన్ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. మునులు ఈ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకునే వారని, ఇప్పుడు మునులు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతారు. పర్వత ప్రదేశాల్లో కనిపించే అరుదైన పక్షులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈ టూర్లో పూలతోపాటు ఆకాశంలో ఎగిరే పక్షులను చూడడం మర్చిపోవద్దు. -
పుష్పించే మాస్కులు!
ఇప్పుడంతా ఎటుచూసినా మాస్కులు ధరించిన ముఖాలే కనిపిస్తున్నాయి. ఈ భూమి మీద ఉన్న దాదాపు తొంబై శాతం జనాభా మాస్కు లేకుండా బయటికి రావడం లేదు. ఇంతమంది ఒక్కసారి మాస్కు పెట్టుకోవాలంటే ఎన్ని మాస్కులు కావాలో కదా! అటువంటిది ఒక్కొక్కరి దగ్గర సగటున కనీసం ఐదారు మాస్కులైనా ఉంటాయి. కోట్లలో ఉత్పత్తి అవుతోన్న మాస్కులు కరోనాను అడ్డుకుంటున్నప్పటికీ పర్యావరణానికి మరో కోణంలో ముప్పుగా పరిణమిస్తున్నాయనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ విషయాన్నీ నిశితంగా గమనించిన డచ్ గ్రాఫిక్ డిజైనర్ మరియాన్నే డీ గ్రూట్పోన్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ తలపెట్టని మాస్కులను ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. మరియాన్నేకు వచ్చిన వినూత్న ఐడియాతో వందశాతం మట్టిలో కరిగిపోయే ‘మేరీ బీ బ్లూమ్’ మాస్కులను రూపొందిస్తున్నారు. వీటిని వాడిన తరువాత మట్టిలో పాతితే అందమైన పువ్వులు కూడా పూస్తాయట. నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ నగరానికి చెందిన మరియాన్నే స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్ అయినప్పటికీ రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. కరోనా కాలు పెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా సర్జికల్ మాస్కులు వాడిపారేయడం వల్ల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్న ఆమె మనం రోజూ అన్నం రూపంలో తీసుకునే బియ్యంతో మొదట పేపర్ తయారు చేసి దానిలో డచ్ గడ్డిమైదానంలో పెరిగే వివిధ రకాల పూలమొక్కల విత్తనాలు నింపుతారు. ఈ మాస్కులు సాధారణ మాస్కుల్లాగా వాడిన తరువాత ఎక్కడైనా పారేసినాగానీ, లేదా కాస్త చిన్నపాటి గుంతలో పడేసినా అవి పరిసర ప్రాంతాల్లోని నీటిని పీల్చుకుని మొలకెత్తి పూలు పూస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలకు ఎంతో సాయపడతాయని మరియాన్నే చెప్పింది. ఇలా మాస్కులన్నీ మొలకెత్తితే రంగు రంగుల పూలు పూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయడం వల్ల వంద శాతం ఈ మాస్కులు మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించవు. ఇప్పుడు మనం వాడే మాస్కుల తయారీలో సాధారణంగా మందమైన ఎలాస్టిక్ని తాళ్లు అంటే లేసులుగా ఉపయోగిస్తారు. ఇవి చెవులకు తగిలించడం వల్ల మాస్క్ మాఖానికి పట్టి ఉంటుంది. కానీ మాస్కు వాడి పారేసినప్పుడు ఈ ఎలాస్టిక్ మట్టిలో కలిసిపోదు. ఫలితంగా కాలుష్యానికి దారి తీస్తుంది. అయితే మేరీ బీ బ్లూమ్ మాస్కుల్లో ఎలాస్టిక్ కు బదులుగా గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేసిన తాడును వాడుతున్నాం. ఇది పర్యావరణానికి ఎటువంటి నష్టం చేయదు’’ అని మరియాన్నే వివరించింది. ఇక మాస్క్‌ల మీద ఆయా కంపెనీల పేర్లు ఇంక్‌తో రాసి ఉంటాయి. ఇంక్ స్థానం లో ఆర్గానిక్ గ్లూ వాడి కంపెనీ లోగోను ముద్రించామని మరియాన్నే చెబుతూ... ‘‘ప్రసుతం మేము తయారు చేసిన మాస్కుల్లో కొన్నింటిని మట్టిలో పాతిపెట్టాం.. అవి పూలు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి.. వాటిని చూసేందుకు ఎంతో మంది ఆసక్తితోనూ, ఓర్పుతోనూ వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే మేరీ బీ బ్లూమ్ మాస్క్‌లు కావాలనీ భారీ ఆర్డర్లు వస్తున్నాయని, డిమాండ్‌ను బట్టి మాస్కుల ఉత్పత్తిని పెంచుతామని ఆమె వివరించారు. l -
బతుకు పూలబాటకాదు
గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది. కరోనా దెబ్బతో విలవిల రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు. కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు రెండున్నర ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్ 23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా -
ఎటు చూసినా పూలతోటలే..
ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు.. సరికొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఎటు చూసినా పూలతోటలే కనిపిస్తాయి. రంగు రంగుల పూల సువాసనలు పరిమళిస్తాయి. ఇక్కడి వారికి తరతరాలుగా పూలే ప్రపంచం.. వాటితోనే అనుబంధం.. వారి జీవితాలు పూలతోనే మమేకం. ఆ పూలసాగే వారికి వ్యాపకం.. జీవనోపాధి. ఇక్కడి పూలు రాష్ట్రంలోనే కాదు.. తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లోనూ గుభాళిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లోని రైతులు సాగుచేస్తున్న పూల తోటలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి బ్యూరో: బాపట్ల రూరల్ పరిధిలోని బేతపూడి, వెదుళ్లపల్లె, కొత్తపాలెం, తులసినగరం, బోయినవారిపాలెం, వృక్షనగర్, మహాత్మాజీపురం, వైఎస్సార్‌నగర్, సుబ్బారెడ్డిపాలెం, ఉప్పరపాలెం, మున్నవారిపాలెం, దరువాది కొత్తపాలెం గ్రామాల్లోని ప్రజలకు పూలసాగే ప్రధాన జీవనాధారం. ఇక్కడ ఒక్కో గ్రామంలో సుమారు 500 నుంచి 1,500 కుటుంబాలు దాకా ఉన్నాయి. ఒక్కో కుటుంబం కనిష్టంగా 10 సెంట్ల నుంచి గరిష్టంగా రెండు ఎకరాల్లో పూలను సాగు చేస్తున్నాయి. అన్ని గ్రామాల్లో కలిపి దాదాపు 1,500 నుంచి 2,500 ఎకరాల్లో పూల తోటలు సాగవుతున్నాయి. ఇక్కడి వారంతా తరతరాలుగా పూల సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు బేతపూడి గ్రామంలో 1,600 కుటుంబాలుండగా.. వారిలో దాదాపు 1,550 కుటుంబాలు పూల సాగుమీదే ఆధారపడి జీవిస్తున్నాయంటే.. ఈ ప్రాంతంలో పూలసాగుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక.. ఇచ్చిన ఉచిత విద్యుత్ పుణ్యమాని పూల సాగు ఒక్కసారిగా విస్తృతమైంది. తోటలే కాదు.. ఇళ్ల పరిసరాల్లో ఏ కొంచెం జాగా ఉన్నా పూల మొక్కలే దర్శనమిస్తాయి. ఏ ఏ పూలు సాగు చేస్తారంటే.. ఇక్కడ మల్లె, జాజి, బంతి, గులాబి, నాటు గులాబి, ఐదు రకాల చేమంతులు, కనకాంబరాలు, కాగడాలు, లిల్లీ పూలను సాగుచేస్తున్నారు. వాటితో పాటు.. లైను ఆకు, తులసి ఆకు, మరువం ఆకులనూ విస్తృతంగా పండిస్తున్నారు. ఏ సీజన్లో పూసే పూలను ఆ సీజన్లో సాగుచేస్తారు. ఆ ఉత్పత్తులను వెదుళ్లపల్లిలోని పూల మార్కెట్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, కడప, నెల్లూరుతో పాటు.. హైదరాబాద్, చైన్నె నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి పూల తోటల వల్ల దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఆదాయం భళా అన్ని ఖర్చులూ పోనూ ఒక్కో రైతు రోజుకు కనీసం రూ.500–600 వరకూ సంపాదిస్తున్నాడు. పండుగల సీజన్లో పూలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఆదాయం మరింత పెరుగుతుంది. ధర లేనప్పుడు ఒక్కోసారి కోత కూలి కూడా రాని సందర్భాలున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక ఇళ్ల పరిసరాల్లో జాజి, మల్లె, కనకాంబరాలను సాగుచేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు కనీసం రూ.100 దాకా ఆదాయం వస్తుంది. పండుగల సమయాల్లో రోజుకు రూ.300–400 వరకూ మిగులుతాయని చెబుతున్నారు. ఇదే జీవనాధారం మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పూలతోటల సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఏ సీజన్లో ఏ పూలకు డిమాండ్ ఉంటుందో చూసుకుని దానికి తగ్గట్టుగా పూల తోటలను సాగు చేస్తున్నాం. ప్రస్తుతం బంతిపూలు, కనకాంబరాలు, లైన్‌ఆకు, విరజాజులు, గులాబీ, చేమంతి పూలను సాగుచేస్తున్నాం. తెల్లవారుజామున పూలతోటల్లోకి వెళ్లి పూలను కోసి.. వాడిపోకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి వేరే ప్రాంతాలకు పంపిస్తుంటాం. వ్యాపారులు వెదుళ్లపాల్లి మార్కెట్‌కు వచ్చి పూలను కొనుగోలు చేస్తారు. – కుంచాల సుబ్రమణ్యంరెడ్డి, వెదుళ్లపల్లి కొత్తపాలెం వసతులు కల్పించాలి ఏడాది పొడవునా ఏ సీజన్లో పూసే పూలను ఆ సీజన్లో సాగుచేసి.. వాటిని వెదుళ్లపల్లి మార్కెట్‌కు తరలించి.. అక్కడికి వచ్చే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది మంది మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్లో అటు రైతులు, ఇటు వ్యాపారులు, చిరు వ్యాపారులకు కనీస వసతుల్లేవు. ప్రభుత్వం స్పందించి ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది. – పుట్టా శ్రీనివాసరెడ్డి, బేతపూడి -
అలంకార ప్రియుడికి పుష్పయాగం
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా స్వామివారికి విధిగా నిర్వహిస్తారు. పుష్పాలంకరణలో ఉన్న ఆ శేషాచలవాసుడి నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్లు చాలవు. భక్తులు తన్మయత్వంతో పొంగిపోతారు. తిరుమలలోని ప్రతి పుష్పం పుష్పించి, వికసించి సేవించి తరిస్తోంది. అలాంటి అలంకార ప్రియుడికి సోమవారం మధ్యాహ్నం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఆగమ శాస్త్రోక్తంగా సంప్రదాయ పుష్పలు,పత్రాలతో శాస్త్రోక్తంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అర్చించనున్నారు. సోమవారం ఉదయం వైభవంగా పుష్పయాగం ప్రారంభమైంది. పుష్పాల బుట్టలతో స్వామివారిని అధికారులు ఆలయానికి తీసుకు వచ్చారు. సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి వైభవాన్ని, సేవలను కళ్లారా తిలకించి తరించడం పూర్వజన్మ సుకృతం. ఏటా స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తెలిసీ, తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరతూ శ్రీవారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. గతంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ పుష్పయాగాన్ని నిర్వహించేవారు. అయితే స్వామివారి సేవల్లో జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నందున ఈ ఉత్సవాన్ని కార్తీక మాసానికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారికి కార్తీక శ్రవణా నక్షత్రం రోజున ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి నిత్యారాధన అనంతరం బంగారు తిరుచ్చిలో శ్రీదేవి,భూదేవి సమేతంగా రాచమర్యాదలతో యాగశాలకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికి తొలుత అభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి తులసిమాలలు ధరింపజేస్తారు. అనంతరం సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. విష్ణుగాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హోమం నిర్వహిస్తారు. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాధిపతికి సంబంధించిన హోమం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్ప సమర్పణలో భాగంగా స్వామివారి కంఠం వరకూ వివిధ రకాల పుష్ప సమర్పణ జరుగుతుంది. అర్చకులు అ పుష్పాలను పాద పద్మములకు సరిగా సరిచేస్తారు. అప్పుడు నీరాజనం జరుగుతుంది. ఇదేవిధంగా 20 పర్యాయాలు చేస్తారు. ఆపై హవిర్నవేదనం జరిగుతుంది. తదనంతరం అగ్ని విసర్జనం కూడా జరుపుతారు. స్వామిదేవేరులతో సన్నిధానం చేరుకుంటారు. దీంతో పుష్పయాగం ముగుస్తుంది. పూల బావికే సొంతం శ్రీవారికి అలంకరించిన, వినియోగించిన పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వరు. ప్రతి పుష్పాన్ని ఆలయంలోని బావిలో వేస్తారు. ఆలయంలోని అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూలబావి ఉంది. దీనినే భూతీర్థం అని కూడా అంటారు. ఇందులో వేసిన పూలను తర్వాత స్వామివారి పూతోటకు ఎరువుగా వినియోగిస్తారని టీటీడీ ఉద్యానవన విభాగం తెలుపుతోంది. నిత్యం పుష్పార్చనే తిరుమల శ్రీవారికి ఒకరకంగా నిత్యం పుష్పాభిషేకమే. రోజూ 18 రకాల పుష్పాలతో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి పుష్పార్చన చేస్తారు. ఇందులో చామంతి, సంపంగి, రోజా, నందివర్ధనం, మరువం, దవనం, పన్నీరుఆకు, తులసి, మల్లెలు, కనకాంబరాలు, మొలలు, సెంటుజాజులు, తామర, కలువ, మొగిలిరేకులు తదితర పుష్పాలను సమర్పిస్తారు. కేవలం ఒక్కరోజు స్వామివారి అలంకరణకు 120 కేజీల పుష్పాలు వినియోగిస్తారు. నిత్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవవరకు జరిగే ప్రతి సేవలో 60 కిలోల పుష్పాల వినియోగం ఉంటుంది. వీటితోపాటు ప్రతి గురువారం శ్రీవారికి పూలంగిసేవ నిర్వహిస్తారు. ఈసేవలో 100 నుంచి 120 కేజీల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారి నిత్య సేవలో ప్రశస్తమైన తోమలసేవకు 60 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి పూల హారాలను మార్చుతారు. శ్రీవారి తలనుంచి భుజం వరకు అమర్చే పూలసెట్ను శిఖామణి అంటారు. భుజాల నుంచి పాదాల వరకు అలంకరించే పూలమాలను సాలిగ్రామం అంటారు. వక్షస్థలంలో ఉండే శ్రీదేవి, భూదేవి, కంఠహారం అలంకరణలు అన్నింటినీ కలిపి తోమాలసెట్ అంటారు. ఇలా నిత్యం తిరుమల స్వామి అలంకరణ, ఉత్సవాలు, సేవల్లో అలంకరణకు వందలాది కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఎన్ని పుష్పాలో.. పత్రాలో.. తిరుమల ఆలయంలోని కల్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగే పుష్పయాగంలో 7 నుంచి 10 టన్నుల సంప్రదాయ పుష్పాలను ఉపయోగించనున్నారు. చామంతి, రోజా, సంపంగి, గన్నేరు, నూరు వరహాలు, మల్లెలు, మొల్లలు, సెంటు జాజులు, కనకాంబరాలు, తామరపూలు, కలువపూలు, మాను సంపం గి,నందివర్ధనం, సెంటుజాజులు, మొగిలిపూలు తదితర పుష్పాలు మొగిలిరేకులు, మొరవం, దవనం, మారేడుదళం, పన్నీరుఆకు, కదిరికజ్జాతదితర పత్రాలతో సప్తగిరివాసుడిని వేదోక్తంగా అర్చించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి పుష్పం స్వామి సేవకే.. తిరుమల పుష్పించే ప్రతి పుష్పం స్వామివారికే. ఇది తిరుమల క్షేత్రం సంప్రదాయం. స్వామి సేవలకు అవసరమయ్యే పుష్పాల కోసం 9వ శతాబ్దంలో అనంతాళ్వార్ అనేభక్తుడు ఆలయం వెనుకభాగంలో పూతోటను ఏర్పాటు చేశాడు. తోటలో పుష్పించిన పుష్పాలతో స్వామివారిని పూజించేవారు. ఆయన తదనంతరం ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని పాటించారు. 1996లో టీటీడీలో మీరాశీ వ్యవస్థను రద్దు చేశాక టీటీడీ ఆధీనంలోనే పూతోటను నెలకొల్పారు. శ్రీవారికి అవసరమైన పుష్పాలను సేకరించే బాధ్యతను టీటీడీ ఉద్యానవన శాఖకు అప్పగించింది. సుమారు వంద ఎకరాల్లో ఉద్యానవనశాఖ పూతోటను నిర్వహిస్తోంది. ఇక్కడి పుష్పాలను స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. వీటితోపాటు దాతలు స్వామివారి సేవకోసం పుష్పాలను వితరణగా అందిస్తుంటారు. తమిళనాడులోని సేలం, శ్రీరంగం, కుంభకోణం, చెన్నై, కర్ణాటకలోని కరూర్తోపాటు మనరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి టన్నుల కొద్దీ పుష్పాలు తిరుమలకు చేరుతుంటాయి. -
పూలొద్దు.. పుస్తకాలివ్వండి
అంబర్‌పేట: ‘పూలొద్దు.. పుస్తకాలివ్వండి. పేద విద్యార్థులకు చేయూతనివ్వండి’ అంటూ ఎంపీ కిషన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే వారందరూ పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావడంపై ఎంపీ ఇలా స్పందించారు. వీటికి బదులు నోట్ పుస్తకాలు అందజేస్తే అవి తాను పేద విద్యార్థులకు అందజేస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. కిషన్‌రెడ్డి సూచనల మేరకు పలువురు అభిమానులు నోట్ పుస్తకాలను అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కిషన్‌రెడ్డికి నోట్ పుస్తకాలిచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రేమ్‌నగర్‌కు చెందిన హైమావతి పాఠశాల కరస్పాండెంట్ నిరంజన్, స్వామి దయానంద పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, అజయ్‌కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
మీడియాపై గల్లా జయదేవ్ అనుచరులు దౌర్జన్యం
-
మా వేప చెట్టు పువ్వు
మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది! గుత్తులు గుత్తులుగా తెల్లని పువ్వులు. చిట్టి చిట్టి పువ్వులు. చిన్ని చిన్ని పువ్వులు. తల్లిని గట్టిగా పట్టుకున్న చంటిబిడ్డల్లా కొమ్మల కొంగులను చుట్టేసిన పువ్వులు. పచ్చని ఆకుల పరదాలను దాటుకొని గాలికి అటూ ఇటూ ఊగుతుండే ఆ పువ్వులను చూస్తుంటే ఊయలను పట్టుకొని ఊగే గడుగ్గాయిల్లా అనిపిస్తున్నాయి! అలారం మోగుతున్న శబ్దం వింటూనే ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. అటూ ఇటూ చూసి అది కల అని తెలిశాక కళ్లలో తడి చేరింది. ఎంత అందమైన చెట్టు, ఎంత పొడవాటి చెట్టు, ఎన్ని చిట్టి చిట్టి పువ్వులు... కల కళ్లను వదలడం లేదు. మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది మా వేపచెట్టు. ఉగాది రావడానికి రెండు నెలల ముందునుంచే వాకిలంతా ఎండుటాకులతో కప్పేసేది. రోజూ ఉదయ సాయంత్రాలు శుభ్రం చేసుకోవడానికి పడే మా పాట్లను చూసి గుంభనంగా నవ్వుకునేది. ఆ తర్వాత కొమ్మలకు వచ్చిన కొత్త చివుళ్లు, ఆ వెనకే వచ్చే పూల సొగసును చూపించి అందంగా నవ్వేది. గాలి తాకినప్పుడల్లా వచ్చే పూల చిరు వగరు వాసనతో నాతో దోస్తీ కట్టేది. ఉగాది రోజున పనులన్నీ అయ్యాక ‘ఇంకా ఎంతసేపు పచ్చడికి వేప పూత కావాలిగా. నాలుగు కొమ్మలు తెండి’ అని అమ్మ కేకతో నాన్న తన పంచెను మడిచి కొడవలి మాదిరి వంకీలా ఉండే పొడవాటి కట్టె పట్టుకొని ఇంటి ముందున్న వేపచెట్టు దగ్గరకు వెళ్లేవాడు. ఆ కట్టె సాయంతో వేప కొమ్మలను వంచి మరోచేత్తో అందిన నాలుగు కొమ్మలను విరిచి తీసుకొచ్చేవాడు. నాన్న చేతి నుంచి ఆ కొమ్మలను అందుకున్న అమ్మ ఆకుల మధ్య నుంచి విడిగా చిట్టి చిట్టి పూలున్న సన్నని పొడవాటి పుల్లలను పట్టుకొని పూతనంతా చేటలోకి దూసేది. కొమ్మలను మామిడి తోరణం కట్టిన గుమ్మానికి అటూ, ఇటూ రెండువైపులా గుచ్చి, పువ్వును మాత్రం నేర్పుగా కొద్దిగా నలిపి రేకలను విడదీసేది. ఆ పూల రేకలను గుప్పిట్లోనే పట్టుకొని తీసుకెళ్లి ఉగాది పచ్చడి చేసిన కుండలో వేసేది. మర్రి ఆకు డొప్పల్లో వేసిన ఉగాది పచ్చడి ప్రసాదాన్ని వేప పూలతో సహా మరి మరి అడిగించుకొని తాగేవాళ్లం. ఈ ఉగాదికి ‘వేప పూత తీసుకురండి పచ్చడికి’ అని అమ్మ అంటే నాన్న ఎక్కడిదాక వెళ్లాలో. ఊళ్లో నాలుగు నెలల కిందట ఇంటి ముందు నుంచి కాంక్రీట్ రోడ్డు వేశారట. పెద్ద వాహనాలు వెళ్లడానికి అడ్డంగా ఉందని వేపచెట్టును కొట్టేశారట. అమ్మ విషయం చెప్పగానే ఇంటి మనిషిని కోల్పోయానన్న బాధ గుండెను తాకింది. ఆధునికత ఇస్తున్న కాంక్రీట్ బహుమానం మా వేప పూతను నిర్దాక్షిణ్యంగా సమాధి చేసిందని, నా ఆకాశమంత గర్వం కుప్పకూలిందని మనసు మూగబోయింది. నిర్మలారెడ్డి -
ఏ పూలు తేవాలి నీ పూజకు!
విభూధీశుడికి విరులు కరువయ్యాయి. అరకొర పుష్పాలు, మాలలే దిక్కయ్యాయి. ఏడాదిగా నిత్యకైంకర్యాలు ఆలస్యమవుతున్నాయి. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తనకు వీలున్నప్పుడే కొన్ని పూలను సరఫరాచేసి చేతులు దులుపుకుంటున్నారు. అవికూడా నాసిరకంగా ఉంటున్నాయి. ఆలయానికి చేరేలోపే వాడిపోయి కళావిహీనంగా మారుతున్నాయి. వీటినే స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తున్నారు. నిత్యకైంకర్యాలు అతికష్టంమీద నెట్టుకొస్తున్నారు. ముక్కంటీశునికి ఎదురవుతున్న పూల కష్టాలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి: శైవక్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం 20వేల నుంచి 30 వేల మంది భక్తుల వరకు స్వామి, అమ్మవార్లతో పాటు అనుబంధ ఆలయాల్లోను పూజలు చేసుకుంటుంటారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలు మరో 17 ఉన్నాయి. ప్రధాన ఆలయంలోని పరివార దేవతలతో పాటు అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు నిత్యం వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నాలుగు కాలాల్లో అభిషేకానంతర పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం 5 గం, 6గం, 9గం, సాయంత్రం ఓసారి స్వామి అమ్మవార్లకు అభిషేకానంతర పూజలు చేస్తారు. టెండరుకు పోటీ.. పూజలకు టోపీ ప్రధాన ముక్కంటి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలు సరఫరా చేసేందుకు ప్రతి ఏటా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం టెండర్లు పిలుస్తుంది. అందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టెండర్ని టీడీపీ నాయకుడు శ్రీకాళహస్తీశ్వర ట్రస్టుబోర్డు సభ్యుడు సిద్దులయ్య తన భార్య పేరున దక్కించుకున్నారు. ఈ టెండర్ని కూడా ఇతరులకు ఎవరికీ దక్కకుండా పోటీపడి దక్కించుకున్నారు. టెండరు దక్కించుకునేందుకు పోటీపడ్డ కాంట్రాక్టరు స్వామి, అమ్మవార్లకు పూల మాలలు సరఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అర్చకులు, ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతలు ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా మరో 17 ఆలయాలు ఉన్నాయి. స్వామి, అమ్మవార్లకు రోజుకు 8 మాలలు, పరివార దేవతలకు 20 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు మరో 47 పూల మాలలను సరఫరా చేయాల్సి ఉంది. టెండరు దక్కించుకున్నాక ధరలతో నిమిత్తం లేకుండా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలను సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌ది. అరకొర సరఫరా.. వేళకు రాని పూలు పుష్పమాలలు సరఫరా చేస్తానని టెండరు దక్కించుకున్న టీడీపీ నేత వేళకు అవసరమైనన్ని మాలలు సరఫరా చేయడం లేదు. స్వామి, అమ్మవార్లకు నాలుగు కాలాల్లో అభిషేకానంతరం పూజలు నిర్వహిస్తుండడంతో అరగంటకు ముందే పువ్వులు ఆలయానికి చేరవేయాలి. ప్రధాన ఆలయంలో మొత్తం 28 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాలకు మరో 47 పూలమాలు సరఫరా చేయాల్సి ఉంది. వేకుజామున 5 గంటలకు మొదటి కాల అభిషేక పూజ ప్రారంభిస్తుండడంతో అరగంట ముందే పూలమాలలు అందుబాటులో ఉండాలి. అయితే కాంట్రాక్టరు రకరకాల కారణాలతో ఒకరోజు 5.30 గంటలకు, మరో రోజు 6 గంటల సమయానికి పూల మాలలు సరఫరా చేస్తున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు. దీంతో స్వామి అమ్మవార్ల పూజ ఆలస్యం అవుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరఫరా చేస్తున్న పూల మాలలు కూడా ఒక్కోసారి తక్కువ ఇచ్చి పంపుతున్నట్లు తెలిసింది. వరదరాజస్వామి ఆలయానికి ఆరు మాలలు ఇవ్వాల్సి ఉంటే ఆదివారం కేవలం నాలుగు పూల మాలలు సరఫరా చేశారు. ముత్యాలమ్మగుడికి నాలుగు మాలలు ఇవ్వాల్సి ఉంటే కేవలం రెండే మాలలు ఇచ్చి వెళ్లినట్లు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా శ్రీకాళహస్తీశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలకు తరచూ ఇదే తరహాలో కాంట్రాక్టరు పూలమాలలు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన పువ్వులకు మంగళం గతంలో మంచి సువాసన వెదజల్లే వివిధ రకాల పువ్వులతో మాలలు తయారుచేసేవారు. టీడీపీ నేతలు టెండర్లు దక్కించుకుంది మొదలు నాణ్యమైన పువ్వులు కరవయ్యాయి. ప్రస్తుతం బంతి పూలతో పాటు కాగితాల పూలు, హైబ్రిడ్ పూలతో మాలలు తయారుచేస్తున్నారు. అందులోనూ రబ్బరు ఆకులు అధికంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. మాలకు మూడు భాగాల్లో ఎక్కువగా రబ్బరు ఆకులు అధికంగా పెట్టి మధ్యలో సాదాసీదా పూలతో మాలను తయారుచేసి ఇచ్చేస్తున్నారు. పోటీలు పడి టెండర్లు దక్కించుకుని స్వామి, అమ్మవార్లకు పూలమాలలు సరఫరా చేయకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు, అర్చకులు నోరుమెదపడం లేదని ప్రచారం జరుగుతోంది. పూల మాలలు సరఫరా సరిగా లేదు ఆలయానికి పూలు సరఫరా కాట్రాక్టర్ సరిగా పూలు అందిచడం లేదనేది నిజమే. అయితే ఈ విషమై పలుమార్లు కాట్రాక్టర్కు మెమోలు ఇచ్చాం. బిల్లులో కోత విధించాం. తక్కువకు కోట్ చెయ్యడం వల్లనే అతనికి పూల కాంట్రాక్టు దక్కింది. ఇదేవిధంగా పూలు సరఫరా చెయకుంటే కాట్రాక్టర్పై తప్పక చర్యలు తీసుకుంటాం.– రామస్వామి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం. -
ఆ ఊరే ఓ పూల తోట
ఆ ఊరి పొలిమేరలో అడుగుపెడుతూనే పూల సువాసనలు గుప్పుమంటాయి. చుట్టుపక్కల పూల తోటలు సాగుచేస్తున్నారనుకుంటే పొరపాటే. ఆ గ్రామంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఊరే ఓ పూల వనం అని.కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల ప్రాంతమైన వంద్రికల్ గ్రామం అది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు, వెనుక భాగాల్లోని ఖాళీ ప్రదేశాలు, పెరడులలో అందరూ పూలను సాగు చేస్తారు. ప్రతి ఇంటా పరిమళాలొచ్చే పూలతోబాటు కనకాంబరాలను కూడా సాగు చేస్తారు. కనకాంబర పూల సాగు తమకు ఆనందంతో పాటు జీవనోపాధిని కల్పిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. కనకాంబరాల సాగుతో వంద్రికల్ గ్రామం జిల్లాలోనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రతి ఇంటా కనకాంబరాలు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో వంద్రికల్ గ్రామం ఉంది. నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ప్రాజెక్టుల ముంపు గ్రామాల నుంచి 1963 లో 133 కుటుంబాల వారు ఇక్కడకు వచ్చి గ్రామంగా ఏర్పడ్డారు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వ్యవసాయం, తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2000 సంవత్సరం నుంచి కనకాంబరాల సాగు వైపు దృష్టి సారించారు. మొదట్లో కొంత మంది తమ ఇండ్ల వద్ద కనకాంబరాలను పెంచి ఆదాయం పొందడం మిగతా వారిని ఆలోచింపజేసింది. అప్పటినుంచి ప్రతి ఇంటి పెరడు, ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మొత్తం కనకాంబరాల మొక్కలను పెంచడం, పూలను సేకరించి నిజామాబాద్, కామారెడ్డి మార్కెట్లలో విక్రయించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలసాగు కొనసాగిస్తు ఉపాధి పొందుతున్నారు. పూల సాగుతో జీవనాధారం వంద్రికల్ గ్రామంలో గతంలో కంటే పరిస్థితులు ఇటీవల మెరుగుపడ్డాయి. గ్రామం నుంచి ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో ఉండేవారు మాత్రం వారికి ఇష్టమైన కనకాంబరాల సాగుతో ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు కన కాంబరాల సాగునే జీవనాధారంగా చేసుకున్నాయి. వారంలో రెండుసార్లు పూలను సేకరిస్తారు. కనకాంబరాలను కొనుగోలు చేసే బేరగాళ్లు గ్రామానికే వస్తారు. కొందరు నేరుగా, మరికొందరు దండలు అల్లి విక్రయిస్తారు. గ్రామంలో విక్రయిస్తే మూర దండ రూ.12. నేరుగా కామారెడ్డి మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తే మూర రూ.20 వస్తాయని గ్రామస్తులు తెలిపారు. పూలసాగును జీవనాధారంగా చేసుకున్న కుటుంబాలు నేరుగా కామారెడ్డి, నిజామాబాద్ మార్కెట్లకు వెళ్లి కనకాంబరాలను అమ్ముతారు. వారానికి వంద మూరలు వారానికి రెండుసార్లు పూలను సేకరిస్తాం. వారానికి వంద మూరల పూల దండలను అమ్ముతాను. దగ్గర్లోని కామారెడ్డి మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్ముతాము. మా జీవనాధారం ఇదే. ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పదేళ్ళుగాపెంచుతున్నా మా ఇంటి ఆవరణలో కనకాంబరాలను పది ఏళ్ళుగా పెంచుతున్నాను. ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం లభిస్తుంది. కనకాంబరాలను పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఆనందంతో పాటు ఆదాయమూ దొరుకుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మొక్కల పెంపకం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చీడ పీడలు లేకుండా చూసుకుంటాం. వారానికి రెండుసార్లు పూలను సేకరించి కొంతమంది గ్రామంలోనే అమ్ముతారు. మరికొందరు బేరగాళ్లకు ఇస్తారు. కనకాంబరాలకు మా గ్రామం ప్రత్యేకం. ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేదు మా ఇంటి చుట్టూరా కనకాంబరాల చెట్లు పెంచుతున్నాం. ఈ పూలను అమ్మడం వల్ల ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా ఊళ్లో చాలా కుటుంబాలు పూర్తిగా కనకాంబరాల సాగుమీదనే ఆధారపడుతున్నాయి. -
కల్పవల్లి... ఆండాళ్ తల్లి
వైష్ణవసంప్రదాయంలో 108 దివ్య దేశాలున్నాయి. ఆ క్షేత్రాలలో విష్ణువు నెలకొని ఉంటాడు. వాటిలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడే విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయనకు తులసివనంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికకు పుష్పమాలిక అనే అర్థం వచ్చేట్టు కోదై అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ప్రతిరోజూ విష్ణువుకు సమర్పించే మాలలను సిద్ధం చేస్తుంటే తండ్రికి సహాయం చేసేది కోదై. విష్ణువుకు అలంకరించే మాలలు తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయేది. ఒకసారి స్వామి వారికి మాలసమర్పిస్తుంటే పొడవైన కేశం విష్ణుచిత్తుడి కంటపడింది. విషయం గ్రహించి కూతుర్ని మందలించి మరునాటి మాలలను సిద్ధం చేసి తానే తీసుకుని వెళ్తే అది స్వామి స్వీకరించడు. గోదా అలంకరించుకున్న మాలే సమర్పించమంటాడు. ఇన్నాళ్లు తాను పెంచింది సాక్షాత్తు లక్ష్మీదేవినే అని గ్రహించి ఆమెను ఆండాళ్ తల్లి అని సంబోధిస్తాడు. పవిత్రధనుర్మాసంలో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి తిరుమల నుంచి వేంకటేశ్వర స్వామి, కంచి నుండి వరదరాజస్వామి వస్తుండగా రంగనాథస్వామి గరుడవాహనంపై విచ్చేసి ఆమె చేయందుకుంటాడు. ఇందుకు ప్రతీకగా ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వర సన్నిధి ఉంది.గర్భాలయంలో గోదాదేవి, రంగనాథస్వామితోపాటు గరుత్మంతుడు కూడా ఉంటాడు. గోదాదేవి ఎడమచేతిలో చిలుకను ధరించి, చేతిని వంపుగా కిందికి వదిలి ఉంటే, రంగనాథస్వామి గోపాలకుడిగా చెర్నాకోలు, ముల్లుకర్ర ధరించి ఉంటాడు. గరుత్మంతుడు అంజలి బద్ధుడై వారిని సేవించుకుంటూ దర్శనమిస్తాడు. ఇటువంటి అపురూపమైన గోదాదేవి దర్శనాన్ని చేసుకుని భక్తులంతా తరిస్తారు. అయితే వటపత్రశాయి సన్నిధి దివ్యదేశం అనీ, ఇప్పటి గోదాదేవి ఆలయం పెరియాళ్వార్ గృహమనీ, అదే కాలక్రమంలో ఆలయంగా రూపుదిద్దుకుందని భక్తులు గ్రహించాలి. గోదాదేవి దర్శనం సకలశుభాలకు నెలవు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
నీలగిరులపై కురింజ రాగం
సృష్టిలో అరుదైనవీ, అపురూపమైనవీ కొన్ని ఉంటాయి. సృష్టికే అందాన్నిస్తాయవి. నీలగిరులపై కనిపించే నీలకురింజి పూలు అలాంటి అపురూపాలే!అత్యంత అరుదైన నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. కేరళ, తమిళనాడుల్లో నీలగిరుల పరిసరాల్లో నివసించే గిరిజనులకు ఈ పూలు కొండగుర్తులు.వీటి పూత ఆధారంగానే వారు తమ వయసును చెప్పుకొంటారు. బ్రిటిష్ హయాంలో తొలిసారిగా వీటిని 1838లో తెల్లదొరలు గుర్తించారు.పుష్కరకాలం పాటు మళ్లీ ఇవి కనిపించనే లేదు. తిరిగి 1850లో కనిపించాయి.అలా పన్నెండేళ్లకు ఒకసారి ఇవి పూస్తాయనే సంగతిని గుర్తించారు.ఈ ఏడాది కూడా నీలకురింజి పూలు నీలగిరులపై విరిశాయి. శరదృతువు ప్రారంభంలో కనిపించే పూలు కొద్ది రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి. ఒకసారి రాలిపోయాక మళ్లీ పన్నెండేళ్లకుగాని కనిపించవు. ఈ అరుదైన పూలను కెమెరాలో బంధించడానికి ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ విశాల్‌విజయవాడ నుంచి కేరళలోని నీలగిరుల వరకుబైక్‌యాత్ర చేశారు. ఆయన కెమెరాకు చిక్కిన కొన్ని దృశ్యాలివి. -
దివి నుంచి భువికి దిగిన దేవతావృక్షం
పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాతపుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. పారిజాత పుష్పాలతో పూజ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ పూలనుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు విరేచనకారిగా వాడతారు. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న నిఫా వైరస్‌ను ఈ చెట్టు ఆకులతో నివారించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగానే కదా నంది తిమ్మన రంచిన పారిజాతాపహరణం కథ నడిచింది.శ్రీ కృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కల నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వక్షం వికసిస్తుంది. అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. దీని వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా భావిస్తున్నారు. ఈ వృక్ష కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగకపోవడం ఈ వృక్షం ప్రత్యేకత. -
పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లారని..
తిరువణ్ణామలై: ఓ ప్రైవేట్ పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లిన విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడాన్ని ఖండిస్తూ తల్లిదండ్రులు, హిందూ మున్నని కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శుక్రవారం రాస్తారోకో చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో ఓ ప్రైవేట్ క్రైస్తవ మెట్రిక్ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు ఐదు వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పూలు, బొట్టు పెట్టుకోవద్దని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవికాపురానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం ఉదయం బొట్టు, పూలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లారు. గమనించిన టీచర్ వాటిని తొలగించాలని తెలిపడంతో వారు పూలు, బొట్టును తొలగించారు. దీంతో వారిని పాఠశాల ఆవరణంలో మోకాళ్లపై నిలబెట్టారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. నిబంధనలు పాటించనందుకే దండన.. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రావడంతోనే ఇలా చేశామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ మున్నని కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలూరు డీఎస్పీ చిన్నరాజ్, పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం వద్ద విచారణ చేస్తున్నారు. -
అ‘ధర’గొడుతున్న మల్లెలు
సాక్షి, అమరావతి: సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు పెరిగిన ధరలతో వినియోగదారుల ముక్కుపుటాలను అ‘ధర’గొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వాటి ధర పెరగడంతో కొనడానికి వినియోగదారులు జంకుతున్నారు. పూల కొట్ల వద్ద మూర మల్లెపూలను రూ.30 నుంచి రూ.35కి, పూల మార్కెట్లో కిలో రూ.1000కి అమ్ముతున్నారు. గతంలో మూర రూ.10 నుంచి రూ.20లోపు, కిలో రూ.500 వరకూ ఉండేది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం కొంచెం డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అవేమీ లేకపోయినా మల్లెపూల ధరలు షాక్ కొడుతున్నాయి. మల్లెపూలు ఎక్కువగా సాగయ్యే రాజధానిలో ప్రభుత్వ భూసమీకరణ వల్ల సాగు తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో డిమాండ్‌తోపాటు పూలకు రేటూ పెరిగింది. గతంలో రాష్ట్రంలో 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో మల్లె సాగు జరిగేది. ప్రస్తుతం 7 వేల ఎకరాలకే పరిమితమైంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి మండలంలో నిడమర్రు, కురగల్లు, బేతపూడి మల్లె సాగుకు పెట్టింది పేరు. గతంలో ఈ మూడు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం అది 700 ఎకరాలకు పడిపోయింది. నిడమర్రులోనే గతంలో 1500 ఎకరాల్లో మల్లె తోటలుండేవి. ప్రస్తుతం 500 ఎకరాల్లో కూడా సాగు లేకుండాపోయింది. రాజధానికి భూములు తీసుకోవడంతో మల్లె తోటల స్థానంలో బీడు భూములు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. గతంలో ఎకరానికి వెయ్యి క్వింటాలు మల్లెపూల దిగుబడి వచ్చేదని, కానీ ఇప్పుడు తగ్గిందని చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు గతంలో తోటల్లో రైతులు కిలో మల్లె పూలను రూ.200కి వ్యాపారులకు అమ్మేవారు. వ్యాపారులు పూల కొట్లకు రూ.300 నుంచి రూ.400కి విక్రయించేవారు. మూర ధర రూ.10, రూ.15 ఉండేది. కానీ తోటలు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. గతంలో విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ఇక్కడి నుంచే పూలు పంపేవారు. ప్రస్తుతం విజయవాడకే పూలు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో వడ్లపూడి, చీరాల, మైలవరం, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో మల్లె సాగు జరుగుతున్నా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని పరిధిలో మూడు గ్రామాలతోపాటు పరిసర గ్రామాల్లో పూల సాగు తగ్గిపోవడంతో రైతులు, కూలీలు, ఉపాధి కోల్పోయారు. తోటలన్నీ పోయాయి మల్లె తోటలతో మా ఊరు కళకళలాడేది. అందరికీ పని దొరికేది. రాజధానికి చాలావరకూ భూములు పోవడంతో పనే లేకుండా పోయింది. గతంలో కిలో మల్లెలు రూ.150 నుంచి రూ.200కి అమ్మినప్పుడు బాగా లాభాలు వచ్చేవి. ఇప్పుడు రూ.500కి అమ్ముతున్నా గిట్టుబాటు కావడంలేదు. – భద్రారెడ్డి, మల్లె తోట రైతు, నిడమర్రు పనులు లేక కష్టాలు రోజూ రెండు, మూడు గంటలు పూలు కోసి రూ.80 సంపాదించేవాళ్లం. ఆ తర్వాత వేరే పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు మల్లె తోటల్లో పని లేకుండాపోయింది. అరకొర పనితో ఏమీ ఉపయోగం ఉండడం లేదు. ఇతర పనులు కూడా లేక చాలా కష్టాలు పడుతున్నాం. –సుజాత, కూలీ, నిడమర్రు -
‘పూల’బాట!
చౌటుప్పల్: అతని వృత్తి వైద్యం.. ప్రవృత్తి వ్యవసాయం. అమెరికాలో ఉన్నత స్థానంలో ఓ వైద్యుడు ఇక్కడ సేద్యం వైపు అడుగులు వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. విలాసవంతమైన జీవితం ఉన్నా.. సాధారణ రైతులా వ్యవహరి స్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే హర్షారెడ్డి. నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఎరమాద రామచంద్రారెడ్డి–భారతి దంపతుల కుమారుడే హర్షారెడ్డి. చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగున్నర ఎకరాలు భూమిని హర్షారెడ్డి కొనుగోలు చేశాడు. తన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు 2016లో ప్రభుత్వ సబ్బిడీపై మూడున్నర ఎకరాల్లో మూడు పాలీహౌస్‌లు ఏర్పాటు చేశాడు. పాలీహౌస్లో జర్బెరా పూల సాగు పాలీహౌస్లో హర్షారెడ్డి జర్బెరా పూల సాగును ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని పుణె నుంచి ప్రత్యేకంగా జర్బెరా నారు తెప్పించారు. ఒక్కో మొక్క రూ. 28 నుంచి 30 చొప్పున కొనుగోలు చేశాడు. ఎకరానికి 24 వేల మొక్కలు నాటాడు. ఎకరం సాగులో ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు వేల వరకు పూల దిగుబడి వస్తుంది. మొక్కల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పూల మొక్కలపై హర్షారెడ్డి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. రోజువారీగా మొక్కల సంరక్షణలపై షీట్ తయారు చేస్తారు. పుణేలో ఉన్న హార్టికల్చర్ సాగు నిపుణుడు విజయ్ తురాట్ అవసరాన్ని బట్టి ఇక్కడకు రప్పిస్తారు. సాగుకు అవసరమయ్యే నీటి కోసం ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వారు. వర్షం నీరు ఇందులోకి వచ్చేలా పైప్లైన్లను వేశారు. 15 రోజులు అక్కడ.. 15 రోజులు ఇక్కడ.. హర్షారెడ్డి 15 రోజులపాటు అమెరికాలో ఉంటే మరో 15 రోజులు ఖైతాపురంలో ఉండేలా షెడ్యూల్‌ను తయారు చేసుకున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు పూల సాగుకు సంబంధించిన వ్యవహారాలు చేపట్టలేకపోతున్నానన్న బాధ లేకుండా తన పాలీహౌజ్‌లో పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల పనితీరును తన సెల్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకున్నాడు. పూలు తెంపడం నుంచి ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లే వాహనంలో వేసుకునేంత వరకు పూర్తిగా సీసీ కెమెరాలోనే చూసుకుంటున్నాడు. జర్బెరా పూలకు మంచి డిమాండ్.. ప్రస్తుతం జర్బెరా పూలకుమార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరానికి ప్రతిరోజూ మూడు నుంచి 4 వేల పూల దిగుబడి రానుంది. ఇక్కడి దిగుబడులను హైదరాబాద్‌లోని గుడిమల్కా పురం మార్కెట్‌కు తీసుకెళ్తారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు వచ్చినా అమ్ముతారు. ఒక్క పూవు ఉత్పత్తికి రూ. 1.50 ఖర్చు వస్తుంది. ఇదే పువ్వును విక్రయిస్తే సీజన్లో రూ.2.50 నుంచి రూ.3 వరకు ఆదాయం వస్తుంది. సీజన్ లేని సమయంలో ఒక్కో పువ్వుకు రూ.2.00 తగ్గకుండా ఆదాయం సమకూరుతుంది. ఏడాదిలో సుమారుగా ఐదారు నెలలపాటు మంచి సీజన్ ఉండడంతో ఆ రోజుల్లో మంచి లాభాలు సమకూరనున్నాయి. పూల సేద్యం సంతృప్తినిస్తుంది: హర్షారెడ్డి ప్రముఖ వైద్యుడిగా అమెరికాలో ఉద్యోగంలో ఉన్నా నాకు అంతగా తృప్తి కలుగలేదు. స్థాని కంగా మరేదో చేయాలన్న తపన నిరంతరం ఉండేది. ఆ సమయంలో తన మిత్రుడు పాలీ హౌజ్ నిర్వహణపై సూచన చేయడంతో పూల సాగును ఎంచుకున్నాను. నెలలో 15 రోజులు అక్కడ, మరో 15రోజులు ఇక్కడ ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సాగులో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ఆదాయమే వస్తుం ది. అమెరికాలో ఉన్నా సెల్లో పర్య వేక్షిస్తుంటా. ఇక్కడ అనుభవంతో కూడిన సిబ్బంది ఉండడంతో తనకు కొంత రిస్క్ తగ్గింది. తన వలన మరో 12 మందికి ఉపాది లభిస్తుండడం తనకు సంతోషానిస్తుంది. -
కాసుల సాగు.. కనకాంబరం బాగు!
కనకాబంరం పూల సాగు.. రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవిచూసిన పలువురు రైతులు ప్రస్తుతం లభ్యమవుతున్న అరకొర నీటితో తక్కువ కాలంలో స్వల్ప పెట్టుబడులతో అధిక లాభాలను ఆర్జించే పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పూల సాగు చేపట్టిన రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు. నార్పల: మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటనాయుడు తనకున్న నాలుగు ఎకరాల్లో పంట సాగు కోసం 15 సంవత్సరాల క్రితం అప్పు చేసి నాలుగు బోర్లు వేయించారు. ఇందులో రెండు బోర్లలో నీటి జాడ కనిపించలేదు. మరో రెండు బోర్లలో అరకొరగా నీరు లభ్యమైంది. ఈ నీటితో నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల చొప్పున విడతల వారిగా కనకాంబం సాగు చేపట్టారు. ఆశించిన మేర దిగుబడులు సాధిస్తూ అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. పంట నాటినప్పటి నుంచి మూడేళ్ల పాటు దిగుబడిని ఇస్తోంది. వెంకటనాయుడిని ఆదర్శంగా తీసుకుని మండలంలోని నరసాపురం, రంగాపురం, దుగుమర్రి, కురగానపల్లి, కేశేపల్లి, గొల్లపల్లి, పప్పూరు, నార్పల తదితర గ్రామాల్లో 450 ఎకరాల్లో రైతులు కనకాబంరం సాగు చేపట్టారు. పిల్లలకు ఉన్నత చదువులు వెంకటనాయుడు, కళావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటునే కూతుళ్లకు గొప్ప చదువులు చెప్పించసాగాడు. ఆడపిల్లలకు అంత పెద్ద చదువులు ఎందుకంటూ బంధువులు, గ్రామస్తులు ఎద్దేవా చేస్తున్నా.. వెంకటనాయుడు దంపతులు తలొగ్గలేదు. ప్రధానంగా ఆడపిల్లలకు చదువే ఆధారమంటూ కూతుళ్లను ప్రోత్సహిస్తూ వచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా పెద్ద కుమార్తె సౌందర్య ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులోని హెచ్‌పీ కార్యాలయంలో సాఫ్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. చిన్నమ్మాయి వీణ కూడా బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు రాజ్‌కుమార్ సైతం కర్ణాటకలోని ఉడుపి మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. -
పూలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. పుష్పామూలే వసేద్బహ్మ్ర మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. -
ఏళ్ల కరువు.. నేడు విరబూసింది
న్యూఢిల్లీ: ఏళ్ల కరువు తర్వాత ఆ భూభాగం విరబూసింది. ఎటు చూసిన ప్రకృతి అద్దిన సొబగుతో కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది దక్షిణ కాలిఫోర్నియా. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. దీంతో అక్కడి వ్యాలీలు వివిధ రకాల అడవి పువ్వులతో నవ్వుతున్నాయి. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పూదోటలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాసా మాజీ ఉద్యోగులు అంతరిక్షం నుంచి తీసిన కొన్ని ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వర్షాలకు ముందు.. వర్షాలకు తర్వాత పరిస్ధితులు ఎలా ఉన్నాయన్నది ఫోటోల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ వ్యాలీలకు సందర్శకులు తాకిడి బాగా పెరిగిపోయింది కూడా. Behold! the California "super bloom" seen from space, brought to you by @KQEDscience. See more: https://t.co/X5jXvwY12I pic.twitter.com/bD9ZGAbPBZ — Planet (@planetlabs) April 10, 2017 -
తిరుమల శ్రీవారి పుష్ప వైభవం
-
వైభవంగా శ్రీవారి బ్రహోత్సవాలు
కర్నూలు(న్యూసిటీ) సంకల్‌బాగ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సా్వమివారి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసస్వామి వార్లకు వేదపండితుల అభిషేకం చేసి పట్టువస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. తర్వాత శేషవాహనంపై శ్రీనివాసస్వామి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు జగన్మోహనశర్మ, నగర బ్రాహ్మణ సంఘం అ«ధ్యక్షుడు కె. చంద్రశేఖరశర్మ, ప్రధానకార్యదర్శి సీవీ దుర్గాప్రసాద్, బ్రాహ్మణ వేల్ఫెర్ అసోసియేషన్ జిల్లా కోఆర్టినేటర్ సముద్రాల హానుమంతరావు, గౌరవాధ్యక్షుడు కేవీ సూబ్బారావు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో పుష్ప ప్రదర్శన
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని దక్షిణ ద్వారం హరిహరరాయ గోపురం ఎదుట రుద్రాక్షవనంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి శనివారం పుష్పప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 9 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు పుష్పజాతులు, ఔషధ, అలంకార మొక్కలు, పూలతో తయారు చేసిన శివలింగం, నందీశ్వరుడు, చెక్కబండి తదితరవి భక్తులు, పుష్పప్రియులకు ఆకట్టుకుంటున్నాయి. రావి, మేడి, బిల్వం, కదంబం, నాగలింగం, ఉసిరి తదితర పవిత్ర వృక్షాల ప్రయోజనాలు, వాటికి సంబంధించిన పురాణగాథలను తెలియజేసే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఈ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. -
దేవుడికి సమర్పించాల్సిన... ఆ ఎనిమిది పూలు
మానవీయం ధర్మం అన్న మాటకు పర్యాయపదమే భక్తి. గోనెసంచుల్లో మారేడు దళాలు తీసుకొచ్చి, పూలదండలు మోసుకొచ్చి పూజ చేయడాన్ని భక్తి అనరు. కూర్చొని, ఊరికే స్తోత్రాలు చేసి, పూలు వేసేస్తే - పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్య నిష్ఠతో ధర్మపాలన చేసినవాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసినవాడే ధర్మాన్ని అనుసరిస్తునట్లు! భగవంతుడు విహిత కర్మ చెప్పాడు!! విశుద్ధ కర్మ చెప్పాడు!! ‘‘ఒరేయ్ ! నీకు అయిదు ఇంద్రియాలిచ్చాను. సుఖం అనుభవించు... నేను వద్దనడం లేదు. వీణావాదన వినాలని ఉందా, పాట వినాలని ఉందా? ‘సాంబశివాయని అనరే..’ అని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటారు. విను! భగవంతుడి దగ్గర కూర్చొని నీ కూతురే ‘కంజ దళాయతాక్షీ’ అంటూ కీర్తన చేస్తుంటే మురిసిపో! కానీ, లౌల్యానికి కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దన్నదాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు! విశుద్ధకర్మ విడిచిపెట్టకు! ఇతరుల ద్రవ్యాన్ని కోరవద్దు. నిత్య తృప్తితో ఈశ్వరుడు నీకు ఇచ్చినదేదో అదే పరమానందదాయకం అన్న భావనతో జీవితాన్ని అనుభవించు. అలా బతికినవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు! పరమ భక్తితత్పరుడు అన్నదానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపఃశిల్పం సకలమపి ముద్రా విరచనా...’’ నేను మాట్లాడుతున్నానంటే ఇది నేను మాట్లాడుతున్నది కాదు. మనుష్యుడిగా నాకు జన్మనిచ్చి, పరమేశ్వరుడు 83 లక్షల 99 వేల 999 జీవులకు ఇవ్వని చక్కటి స్వరపేటికను ఇచ్చి, ఇన్ని మాటలు నా చేత పలికించగలుగుతున్నాడు. ఆయన పలకించిన ఆ ఒక మంచి మాటతో ఎంత కష్టంలో ఉన్న వాళ్ళనైనా శాంతి పొందేలా చేయగలుగుతున్నాను. ‘‘అయ్యా. బెంగ పెట్టుకోకండి. ‘భయకృత్ భయనాశనః’ - ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీసేస్తాడు. చింతించకండి’’ అని ఒక్క మంచి మాట అన్నాననుకోండి. అంత కష్టాన్నీ మర్చిపోయి వెళ్ళగలుగుతున్నారు. ‘‘మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు’’. మాట అంత గొప్పది. ‘‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం’’ అన్నారు. ఆ మాటచేత ఏదైనా పొందవచ్చు. శత్రుత్వాన్ని, చివరకు మరణాన్ని కూడా తెచ్చుకోవచ్చు. ‘‘ఈశ్వరా! నాకు ‘మాట’ ప్రసాదించావు. నీవిచ్చిన ‘మాట’ను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టేది కాకుండా నేను చూసుకుంటా’’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మాట్లాడే ముందు జాగ్రత్తపడేవాడెవడో... వాడు పరదేవత పట్ల భక్తితో ఉన్న వాడు. అంతేకానీ నాలుగుపూలు వేసి పూజ చేసి, బయట రావణుడిలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే భక్తుడెలాఅవుతాడు? ‘‘ధార్మికమైతే నేను మాట్లాడతా. కాకపోతే మాట్లాడను’’ అన్నాడనుకోండి. ఇప్పుడది భక్తి. ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘‘సకలమపి ముద్రా విరచనా’’ - నా చేతులు, కాళ్ళు ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది అవయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే! ఇలా ఏది చేస్తున్నా భగవంతుని అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతున్నవాడు నిత్యం భగవంతుడికి ఉత్సవం చేస్తున్నవాడితో సమానం. కేవలం ‘అష్టదళ పాదపద్మారాధన’ టికెట్ కొనుక్కుని ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకున్నవాడు ఆ పద్మారాధన సేవ చేసినవాడు కాడు. ‘అష్టదళ పాదప ద్మారాధన’ ప్రతిరోజూ ప్రతిక్షణం చేసేలా అనుగ్రహించమని వేడుకోవాలి. ఆ పూజెలా ఉండాలి? 8 రకాల పూలతో పూజ. ఏమిటా పూలు? ‘అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియనిగ్రహః, సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తతై ్తవచ సత్యం అష్టవిధం పుష్పమ్ విష్ణోః ప్రీతికరమ్ భవత్’ అన్నారు. అహింస (ప్రేమ), ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, ధ్యానం, సత్యమనే 8 రకాల పుష్పాలతో నీ మనస్సుని ఈశ్వరుని పాదాల వద్ద పెట్టు. భక్తిమార్గంలో పయనించడమంటే అదీ! ఈశ్వరుడు వద్దన్నదాన్ని చేయకుండా ఉండడం- బ్రేకు. చేయమన్నదాన్ని చేయడం -యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం. గమ్యం ఈశ్వరానుగ్రహం. ఇది ఎవడికి సాధ్యపడుతుందో వాడు ఉద్రేకపడడు, ప్రలోభాలకు లొంగడు. రామాయణంలో రాముడు ఒక మాట అంటాడు... ‘ఒకడు మంచివాడా, చెడ్డవాడా అని దేన్నిబట్టి నిర్ణయించాలి’ అని. ‘ఎవడో సంతోషంతో పొగిడాడనో, లేదా అక్కసుకొద్దీ తిట్టాడనో కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి దాన్ని నిర్ణయించాలి.’ చాలామంది రాముడికి సీతమ్మ ఇష్టమనుకుంటారు. కానీ ఆయనకు ఏది ఇష్టమో తెలుసా? తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టమొచ్చినా రాముడు నిత్య తృప్తుడు. నవమి (9వతిథి)నాడు పుట్టాడు. తొమ్మిదిని ఏ అంకెతో హెచ్చవేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుంది. రాముడికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎందుకు సంతోషంగా ఉంటాడో తెలుసా! ‘నా ధర్మం నేను నెరవేర్చా’ అన్న తృప్తి ఒక్కటే అందుకు కారణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ మనుష్యుడిగా పుట్టిన రాముడు ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే ప్రతివాడూ ‘నేనీ రోజు భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ! ఆయన వద్దన్నది చేయలేదు కదూ!’ అని మననం చేసుకోవాలి. ఇక జీవితంలో ఎదురయ్యే ఉత్థాన పతనాలంటారా... ‘ఈశ్వరుడున్నాడు, ధర్మముంది. నా ధర్మానుష్ఠానం నన్ను రక్షిస్తుంది’ అని భావన చేయాలి. ధర్మంతో మనిషి తరిస్తాడు. ధర్మం మనకు నిగ్రహశక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైతికబలాన్నిస్తుంది. అదే భక్తి. అదే మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి హితకారిణి. ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది. పరమ భక్తితత్పరుడు అన్న దానికి గుర్తేమిటి? ‘సౌందర్యలహరి’లో శంకరాచార్యుల వారేమంటారంటే... ‘‘జపో జపః శిల్పం సకలమపి ముద్రా విరచనా.’’ ‘జపో జపః శిల్పం’ అంటే మాటల చేత భక్తి. ‘సకలమపి ముద్రా విరచనా’ - నా చేతులు, కాళ్ళు... ఏది కదిలినా అనవసరంగా ఎవరికీ భయం కలగకూడదు. ‘ఎంతోమంది శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు. నా అదృష్టం. కదులుతున్నాయి. ఇది పరదేవతానుగ్రహం’ అన్నారనుకోండి. అప్పుడు మీ శరీర కదలికలన్నీ భగవత్ సంబంధ ముద్రలే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విజయనగరం ఉత్సవాలలో పుష్ప ప్రదర్శన
-
ప్రాణంతీసిన డెకరేషన్ పూలు
ఆటోడ్రైవర్ల ఘర్షణలో డ్రైవర్ మృతి చిన్న సమస్యకు ప్రాణం కోల్పోయిన వైనం గీసుకొండ : ఆటోలో డెకరేషన్ ఫ్లవర్స్‌ను దొంగిలించిన విషయంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య తగాదా ఘర్షణగా మారి వారిద్దరిలో ఒకరి మృతికి కారణమైన సంఘటన మండలం లోని మచ్చాపూర్ వద్ద ఆది వారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చాపూర్ సమీపంలోని మాన్ సింగ్(స్తూపం)తండాకు చెందిన ఆటోడ్రైవర్ ఆంగోతు హరికృష్ణ(35) సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్ సబ్‌స్టేన్ వద్ద మచ్చాపూర్–పల్లార్గూడ రోడ్డు వద్ద ఆటోను నిలిపి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంతలో అతడి ఆటోలో అమర్చి ఉన్న డెకరేషన్ ప్లాస్టిక్ పువ్వులను ఎవరో ఎత్తుకెళ్లిన విషయాన్ని గమనించాడు. ఎవరో ఆటోడ్రైవర్ పువ్వులను తీసి ఉంటాడనే అనుమానంతో అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఆటోను ఆపాడు. తన ఆటోలోని పువ్వులు అతని ఆటోలు ఉండటాన్ని గమనించిన హరికృష్ణ అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్ అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలో పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న గీసుకొండ ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. హరికృష్ణపై దాడి చేసి కొట్ట చంపిన ఆటో డ్రైవర్ పరారీలో ఉండగా, అతడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బతుకంతా పండుగ కావాలి!
సమకాలీనం పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ ప్రకృతి పూజే! పూలు నవ్వినట్టే స్త్రీలు సంతోషంగా ఉండాలి. బతుకమ్మ పండక్కి పుట్టింటి కి ఆడబిడ్డలొస్తేనే కళ. కొడుకైతేనేం, కూతురై తేనేం అన్న ధ్యాస, ఆడ బిడ్డే ఇంటికి కళ అన్న స్పృహ తగ్గుతోంది. గతంలో ఈ పండుగ నాటికి వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి స్పందిస్తుందేమో! ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాలతో పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. అలాగే మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. పల్లెకు పండుగొచ్చింది. అంతకు ముందే పండుగ కళొచ్చింది. ప్రకృతి చల్లని చూపూ తోడవడంతో తెలంగాణ చెరువులన్నీ నేడు నీటితో నిండి కళకళలాడు తున్నాయి. చెరువంచుల్లో ఏపుగా ఎదిగిన సర్కారు తుమ్మ కొమ్మ కొసలు, తూటి పొద చివర్లు వయ్యారంగా వంగి నీటిని ముద్దాడుతున్నాయి. పల్లెకు ఆనుకొనో... ఆ పక్కో, ఈ పక్కో నెలకొన్న చెరువుల్లో పరుపులా పరుచుకున్న నీరు ఎండకు వెండిలా తళుక్కున మెరుస్తోంది. మొత్తమ్మీద ఊరి వెలుగే వేరుగా ఉంది. ఊరూరా బతుకమ్మల ఆటలు జోరుమీదున్నాయి. రంగుల కల బోతగా బారులుతీరిన మహిళలు పల్లెకాంతికి వర్ణాలద్దుతున్నారు. అంతటా ఆనందం వెల్లివిరుస్తోంది. బతుకు కథలే నేపథ్యంగా అల్లుకున్న బతుకమ్మ పాటలు ఊరుమ్మడి స్వరాలై ఉబికి వస్తున్నాయి. సాయంత్రం ఆట కాగానే రోజువారీ బతుకమ్మలు చెరువుల్ని చేరి, అలల కదలికలపై తేలుతూ సాగు తున్నాయి. ఆఖరునాడు సద్దుల బతుకమ్మ, ఆ పైన దసరా! అదే రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం. పాలనా వికేంద్రీకరణ, దశాబ్దాల కలకు కార్యరూపం. ఇక సందడే సందడి! పండుగంటేనే సంబురం. ఏటా పండుగలొస్తుంటాయ్, పోతుంటాయ్! మనస్ఫూర్తిగా ఆనందం నింపే పండుగలే ప్రత్యేకంగా నిలు స్తాయి. ఈసారి రాష్ట్రమంతా నెలకొన్న వాతావరణమే అలా ఉంది. పాత బంగరు రోజులు గుర్తొస్తున్నాయి. అన్నీ వ్యవసాయాధారిత గ్రామాలయినం దుకేమో... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పండక్కి ముందే కళ వచ్చేసింది. కాలం కలిసివస్తేనే ఏదైనా! ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... ప్రకృతి సహకరించకపోతే, అవేవీ పూర్తి ఫలితాలి వ్వవు. ప్రభుత్వాలు చొరవ తీసుకోకున్నా ప్రగతి శూన్యం. సంవత్సరాల తరబడి వర్షాలు లేక కరవుతో అల్లాడినా క్రమం తప్పకుండా ఏటా పండుగలు వస్తూనే ఉంటాయి! కానీ, పండుగ పండుగలా ఉండదు. ఆనందం అడుగం టుతుంది. అంతా మొక్కుబడి వ్యవహారంలా సాగుతుంది. బలవంతంగా ముఖానికి నవ్వు పులుముకోవడమూ కష్టమౌతుంది. కాస్త ఆలస్యమైనా ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. అంతకు ముందు... సకాలంలో వానలు రాక కొంత, పండిన అరకొర ఖరీఫ్ పంట దెబ్బతిని ఇంకొంత నష్టపోయింది రైతాంగం. ఈ పరిస్థితి వినాయక చవితి పండుగలో కనిపించింది. కానీ, రబీ పంటలకు భరోసా కల్పిస్తూ సమృద్ధిగా కురిసిన వానలు, నిండిన చెరువులు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మిషన్ కాకతీయ పుణ్యమా అని భూగర్భజల మట్టాలూ పెరిగాయి. సదరు ఆనందం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఊరూరా ప్రతిబింబిస్తోంది. దీనికొక శాశ్వతత్వం కావాలి. సమానావకాశా లతో మహిళలకు మంచి రోజులొచ్చి, ఉపాధి దొరికి యువతరం పెడదారి వీడితే గ్రామాల్లో ఆనందం పండుగై కలకాలం నిలుస్తుంది. ప్రకృతికి ప్రతీక బతుకమ్మ వర్షాకాలం మొదలయ్యాక విరివిగా పూసే పూలను పేర్చి చేసే బతుకమ్మల పండుగ నిజానికి ప్రకృతి పూజే! గుమ్మడాకులో అందంగా పేర్చే బతుకమ్మకు నిండుగా నవ్వుతున్నట్టుండే తంగేడు, గునుగు పూలు తప్పనిసరి. నట్టింట మహిళలు కలకాలం నవ్వుతూ ఉంటేనే బతుకు పండుగకు సంబురం! ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరితానుండనొల్లద’న్న పెద్దల మాట అక్షర సత్యం. బతుకమ్మలో పూలు నవ్వినట్టే ఇంటింటా స్త్రీలు సంతోషంగా ఉండాలి. ‘పుష్పలావికల’ని వ్యాసం రాస్తూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి అన్నట్టు ఆడపిల్లలంటేనే పూలు. పెళ్లయిన కొత్తలో అయిదారేళ్ల దాకా అమ్మాయిలు తప్పనిసరిగా బతుకమ్మ పండక్కి పుట్టింటికొస్తారు. అప్పుడా ఇంటి కళే వేరు! పది రోజుల పాటు సందడి సందడిగా ఉంటుంది. తలిదండ్రుల కళ్లల్లో ఆ వెలుగు ప్రతిఫలిస్తుంది. కూతురైతేనేం? కోడలైతేనేం? ఆడపిల్ల ఆడపిల్లే! ఆ స్పృహ మనవాళ్లకి కొరవడుతోంది. కొడుకైతేనేం? కూతురైతేనేం? బిడ్డ బిడ్డే! అన్న ధ్యాసా తగ్గుతోంది. మానవసంబంధాలు మాసిపోయి ఆర్థికబంధా లుగా మారుతున్న ప్రపంచీకరణలో ఆడపిల్లను భారమని భావిస్తున్నారు. భ్రూణ హత్యలతో పుట్టకముందే కడతేరుస్తున్నారు. 1980-90ల తర్వాత పెచ్చుమీరిన ఈ దురాలోచనల ఫలితం, ఈ రోజు యుక్తవయసు యువతీ- యువకుల నిష్పత్తి గగుర్పాటు కలిగిస్తోంది. పెళ్లీడు మగపిల్లలు పది మంది ఉంటే, అదే వయసు ఆడపిల్లలు నలుగురు కూడా లేరు. మనమెటు పయ నిస్తున్నాం? ఒకప్పుడు ఈ నిష్పత్తి భిన్నంగా ఉంటే సంతోషించేవారు! ‘‘ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో..... ఒక్కడే మా యన్న ఉయ్యాలో వచ్చన్నా పోడు ఉయ్యాలో’’అని పాడుకోవడంలోనే ఆ ఆర్తి, ఆప్యాయతలు, అనుబంధం, ఆనందం ప్రస్ఫుటమౌతాయి. ‘‘ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె ఉయ్యాలో!’’ అంటే బతుకమ్మ పండుగ నాటికి సంతృప్త స్థాయిలో వర్షాలు కురిసి, చెరువులు నిండి, ఏర్లు పొంగి పారేవి. మానవ ప్రవర్తనను బట్టే ప్రకృతి ప్రతిస్పందిస్తుందేమో! ఏమైతేనేం ఈ సారి కాలం బాగుంది. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించి అన్ని పల్లెలు, గ్రామసీమల అవకాశాల్ని మెరుగుపరుస్తున్నారు. పురుషులతో పాటు మహిళల అవకాశాల్నీ విస్తృతపరచాలి. ప్రభుత్వ విధానాల్లో, అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత పెంచాలి. జెండర్ బడ్జెట్ స్పృహ ప్రభుత్వ ప్రతిపాదనల్లో ప్రతిబింబించాలి. అప్పుడే, ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగం నువ్వు సగం నేను అని సగర్వంగా చెప్పగలిగే పండుగ! పండుగంటే అదికాదని చెప్పాలె! వరుస కరువులతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైనపుడు తెలుగు పల్లెలు చిన్నబోయాయి. ఊరు వల్లకాడై, ఉపాధి అవకాశాలు ఉట్టెక్కడం వల్ల ముఖ్యంగా నష్టపోయింది గ్రామీణ యువతరం. ఉపాధి వేటలో పలు కుటుంబాలే పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాల వైపు వలసబాట పట్టాయి. చేతి వృత్తుల కుటుంబాలు చెల్లాచెదరయ్యాయి. ఉన్న ఊరి బంధం వీడక, కాస్తోకూస్తో కలిగిన భూమిపై ఆశ చావక కొన్ని కుటుంబాలు గ్రామాల్లోనే మిగిలిపోయాయి. సొంతూళ్లో ఏ ఆదరువూ లేకున్నా... కదిలి వెళ్లే ధైర్యం చాలక, ఉన్నచోటే ఉపాధికి యాతన పడ్డ కుటుంబాలు మరికొన్ని. అలా గ్రామాల్లో మిగిలిపోయిన పేద కుటుంబాల్లో దారిద్య్రం తాండవించింది. ఉపాధిహామీ పథకమైతేనేం, వృద్ధాప్య -వితంతు -వికలాంగుల పెన్షన్ల వల్ల ఆ కుటుంబాలు పదీ పరకా కళ్ల జూశాయి. కొన్ని పేద కుంటుంబాలకు చౌకధరకు బియ్యం, ఇతర నిత్యా వసరాలు లభిం చడంతో కొంత నిలదొక్కుకునే యత్నం చేశాయి. ఆ కుటుంబాల్లోని యువ కుల్లో అత్యధికులు ఎందుకూ కొరగాకుండా పోయారు. విద్యావకాశాలు సరిగా లేక, ఉన్నా వినియోగించుకోలేక మెజారిటీ గ్రామీణ యువత చదు వులు సగంలోనే ఆగిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాల్లేక యువత గాలి తిరుగుళ్లకు అలవాటు పడింది. 15-16 ఏళ్ల నుంచి 40 దాటిన వారి వరకు తాగుళ్లకు అలవాటు పడ్డారు. డబ్బుంటే బీరు, విస్కీలు, లేకుంటే కల్లు, సారా... ఇలా వ్యసనానికి బానిసలయ్యారు. మెజారిటీ యువకులకు చీకటి పడితే చాలు, ఇంకొందరికయితే పగలు-రాత్రి తేడా లేదు. పండుగ లొస్తే ఇక పట్టపగ్గాలుండవు, మద్యంలో మునిగితేలు తారు. దసరా, సంక్రాంతి వంటి పండుగలు వారి విపరీత చేష్టలకు పరాకాష్ట! అసలు పండుగలొచ్చేదే అందుకని కూడా వారు సూత్రీకరిస్తారు. అది పట్ట ణాలు, నగరాల్లోనూ ఉంది. తాగి కన్నుమిన్నుకానని యువకుల వికృత చేష్టలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటివి ఇతరులకెలా ప్రాణాంత కమవుతాయో నగరంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలే నిద ర్శనం. యువత ఈ దుస్థితి నుంచి బయటపడాలి. పండుగ సంబురాలకు అర్థం అది కాదని గ్రహించాలి. ఒకరి ఆనందం... హద్దులు దాటి స్వయంగా తమకే అయినా, ఇతరులకైనా ఆటంకం, ప్రాణాంతకం కావొద్దని తెలుసు కోవాలి. అరకొరగానే అయినా అందుబాటులో ఉన్న అవకాశాల్ని అంది పుచ్చుకొని ఎదగాలి. అలా పండుగ చేయాలి. ప్రభుత్వాల చొరవతోనే కొత్తగాలి యువశక్తిని వినియోగించుకొని పల్లెల్లో పండుగ జేసే కొత్తగాలి వీయాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. జీవనదులు దిగువన ప్రవహిస్తుంటే తెలంగాణ దక్కన్ పీఠభూమిపై ఎగువన ఉన్నందుకు ఇక్కడ చెరువులు, కుంటలే ప్రత్యామ్నాయ జలవనరు. నదులు సమతలంగా పారి, ప్రాజె క్టులు-కాలువల వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. వర్షాలు ఆలస్యంగా కురిసినందువల్ల ఖరీఫ్ పంటలు ఎండిపోయిన ఏపీలోని వెనుక బడిన జల్లాల్లో పరిస్థితి నేడు దయనీయంగా ఉంది. ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి స్తుంటే రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని ఆదుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. ప్రకృతి సహకరించినపుడైనా వ్యూహా త్మకంగా నడుచుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. చెరువులు నిండు కుండల్లా ఉన్న తాజా పరిస్థితిని సానుకూలంగా మలచుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమాభివృద్ధికి పూనుకోవడం ప్రశంసలందుకుం టోంది. ‘‘పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికిబోయిరి.... లారీ లల్లా క్లీనర్లయ్యిర.... పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా... తల్లి దూద్ సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు ఆ బేకరి కేఫ్‌లో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో...’’ అని గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడు తుందో...’ అన్న పాట, విన్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. 48 కోట్ల రూపాయలు వెచ్చించి, 4,532 చెరువుల్లో 35 కోట్ల చేప పిల్లల్ని విడవడం ద్వారా భవిష్యత్ గ్రామీణ ఉపాధి అవకాశాల్ని ప్రభుత్వం మెరుగుపరు స్తోంది. ప్రజల బతుకుల్ని పండుగ చేసే తెలివిడి ప్రభుత్వాలకున్నపుడే ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...’ అన్న పాట సార్థకమవుతుంది. - దిలీప్ రెడ్డి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
వరంగల్‌లో బతుకమ్మ సంబరాలు
-
పూలజాతరకు వేళాయే..
పల్లె సంస్కృతిని, బతుకు గమనాన్ని చాటిచెప్పే పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో తొమ్మిది రోజులపాటు జరుపుకునే వేడుకకు వేళయింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. నేడు ఎంగిలి పూల బతుకమ్మ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ సంస్కృతి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు కష్టాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తూ తమతోపాటు ఇతరులు కూడా చల్లంగా జీవించాలని పరితపిస్తుంటారు. బతుకు.. బతికించు.. అన్నదే తెలంగాణ ప్రజల జీవన వేదం. పల్లెలన్నీ పచ్చదనాన్ని పరుచుకుని ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే సమయంలో జరిగేదే బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల యువతులు, మహిళలు తీరొక్క పూలతో ఓలలాడుతుంటారు. నేడు ఎంగిలి పూల బతుకమ్మ (పెత్రామాస)ను పురస్కరించుకుని పండుగ విశిష్టతపై ప్రత్యేక కథనం. – హన్మకొండ కల్చరల్ తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మ, దసరా పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే లేచి తోటల వద్దకు వెళ్లి పూలు తెచ్చుకుని అందంగా పేర్చుతారు. సాయంత్రం వేళలో ఆలయాల వద్దకు వెళ్లి ఆటపాటలతో సందడిగా గడుపుతుంటారు. చారిత్రక విభాత సంధ్యలో.. నిజాం రాజుల కాలంలో చాలా ఏళ్లు తెలంగాణ ప్రజలు అణచివేతకు గురై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండేవారు. ఈ క్రమంలో వారు ఆలయాలను సందర్శించడం తక్కువగా ఉండేది. అలాంటి చారిత్రక విభాత సంధ్యలో బహిరంగంగా ఆలయాల్లో జరుపుకునే పూజలకు బదులుగా అనేక సంప్రదాయాల రూపంలో వచ్చిన ఎన్నో పండుగలు, ఆచారాలు ఇప్పటికి కనిపిస్తాయి. బతుకమ్మ పండుగ కూడా ఇలాంటి కోవకు చెందినదే. సిల్సిలాగా కొలుపులు.. కాకతీయుల పాలనలో ఓరుగల్లు రాజకీయ కేంద్రంగా వర్ధిల్లింది. రాజ్య సంపదను పెంచేందుకు, ఇక్కడి ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు కాకతీయ రాజులు ప్రతి గ్రామానికి చెరువులను తవ్వించారు. చెరువు కట్టలపై గౌరీ ప్రియుడైన శివుడికి ఆలయాలను కూడా నిర్మిం చారు. వర్షం కురిస్తే చెరువులు నిండి సుభిక్షంగా ఉండే భౌగోళిక స్థితి తో పాటే వర్షాలు లేకపోతే కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం ఇది. అందుకే పండుగలను కూడా ఒకదాని వెంట మరొకటి నిర్వహించుకు నే తీరు కనిపిస్తోంది. కాలం కలిసి రావాలని ప్రకృతి దేవతలకు సిల్సిలాగా కొలుపులు నిర్వహించుకునే తీరు కనబడుతుంది. వర్షాలు రావాలని కప్పతల్లి ఆట ఆడుతారు. వానలు ప్రారంభం కాగానే ఆషాఢమా సంలో కనకదుర్గమ్మ వంటలకు వెళ్తారు. శ్రావణంలో మళ్లీ వంటలకు వెళ్తారు. అలాగే పోచ్చమ్మకు బోనాలు నిర్వహిస్తారు. మైసమ్మ, ఎల్లమ్మ దేవతలకు పూజలు చేస్తారు. పొలాల అమావాన్య జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. తర్వాత భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి బొడ్డెమ్మను తొమ్మిది రోజుల పాటు ప్రతిషి్ఠంచి పెళ్లికాని అమ్మాయిలు ఆటలాడుతూ పూజించి బావుల్లో చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు. తర్వాత పెత్రామాస నుంచి బతుకమ్మ పండుగను జరుపుకోవడం ప్రారంభిస్తారు. కరువులో పుట్టింది బతుకమ్మ.. 19వ శతాబ్దం ప్రారంభంలో అనేక క్షామాలు, కరువులు విలయతాండవం చేసినప్పుడు ప్రజలు తాము చల్లగా బతికేందుకు విభిన్నమైన రీతిలో బతుకమ్మ పండుగను ప్రారంభించినట్లు జానపదుల పరిశోధకుల అభిప్రాయం. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికి ఒక తల్లికి వరుసగా పిల్లలు పుట్టి చనిపోతున్నప్పుడు ఆ ఇంటివారు పుట్టిన పాపను చాటలో పెట్టి పెంట దిబ్బపై కొద్దిసేపు పడుకోబెట్టి పెంటయ్య లేదా పెంటమ్మ అని పేరు పెట్టే సంప్రదాయం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బ్రతుకు + అమ్మ = బతుకమ్మగా పిలిచి ఉంటారని అంటారు. మహిషాసురమర్ధన సమయంలో పార్వతీదేవి మూర్చిల్లి స్త్రీలు ఆందోళనతో బతుకమ్మ అని పాటలు పాడారని మరో అభిప్రాయం ఉంది. ఎంగిలి పూలతో ప్రారంభం.. భాద్రపద బహుళ అమావాస్యను పెత్రామాస అంటారు. ఈ రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు గ్రామంలోని శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, తదితర చోట్ల బతుకమ్మను అడుకుంటారు. తర్వాత రెండో రోజు నుంచి ఒక్కోక్క చోట బతుకమ్మలను ఉంచి ఆడుతారు. ఆరో రోజు అర్రెంగా భావించి బతుకమ్మ ను ఆడరు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. పితృ అమావాస్యగా... తెలంగాణలో ఈ రోజున పితరుల/ పితృ అమావాస్యగా జరుపుకుంటారు. చనిపోయిన తమ ఇంటి పెద్దలకు ఆత్మ శాంతి కలుగాలని బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయమే తలస్నానం చేసి పొడి దుస్తులు కట్టుకుని పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తార్లలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు, వనగాయ, చెమ్మకాయ, బెండకాయ, బుడమకాయ, అనపకాయ, రూపాయి, కుంకుమడబ్బి పెట్టుకుని వస్తారు. బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి అతడితో బొట్టు పెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజు పెద్దల(చనిపోయిన ఇంటి పెద్దలు) పేరిట బియ్యం ఇవ్వడం చేస్తారు. ఈ రోజున వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరారోజు బియ్యం ఇవ్వడం సంప్రదాయం. n పాటకు ప్రాణం.. బతుకమ్మ పుట్టు చరిత్రను తెలియజేసే పాటను మొదట పాడిన తర్వాతనే మహిళలు ఇతర పాటలను పాడుతారు. 200 ఏళ్లకు పూర్వం నుంచే ఈ పాట ప్రచారంలో ఉందని సమాచారం. పూర్వం నుంచి మహిళలు పాడుకుంటున్న ఈ పాటను మొగిలిచర్లలోని భట్టు సరసింహ కవి రాసి పెట్టుకున్నాడు. 50 ఏళ్ల క్రితం తెలుగు జానపద పరిశోధనలో ఆధ్యుడైన జానపద బ్రహ్మ ఆచార్య బిరుదురాజు రామరాజు మొగిలిచర్ల గ్రామంలోని భట్టు నరసింహకవి వారసుల నుంచి ఈ పాటను సేకరించి తన జానపద గేయ సాహిత్య గ్రంథంలో పొందుపరిచారు. అలాగే బతుకమ్మ పం డుగపై మొదటి ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం సమర్పించిన తాటికొండ విష్ణుమూర్తి తన పరిశోధనలో భాగంగా 25 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఈ పాటను సేకరించినప్పుడు యథాథతంగా లభించడం విశేషం. కొద్ది మార్పులతో ఈ పాట అన్ని జిల్లాల్లో వ్యాప్తిలో ఉండటాన్ని బట్టి ఇందులోని కథనే బతుకమ్మకు సంబంధించిన అసలు కథగా భావించాల్సి వస్తుంది. శివుడి వరం.. ధరచోళ రాజైన ధర్మాంగుడు, అతడి భార్య సత్యవతి అనేక నోములు నోచిన ఫలితంగా నూరుమంది సంతానం కలుగుతారు. అయితే వారు శత్రురాజుల్లో జరిగిన యుద్ధాల్లో హతమవుతారు. కుమారులు చనిపోయిన దుఃఖంతో దంపతులు శివుడి కోసం తపస్సు చేస్తారు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు వారు శివుడి ఇల్లాలు అయిన పార్వతీదేవీని తమ పుత్రికగా ప్రసాదించమని కోరుతారు. ఆ విధంగా పార్వతీదేవి వరంతో సాక్షాత్తు శ్రీలక్ష్మీదేవి, సత్యవతి ధర్మాంగదుల పుత్రికగా జన్మిస్తుంది. కశ్యపుడు, అంగీరసుడు, కపిలుడు మొదలైన మునులు ఆ పాపకు ‘బతుకమ్మ’ అని పేరు పెడుతారు. బతుకమ్మ మొదటి రోజు పాడే పాట శ్రీలకీ‡్ష్మ దేవియు చందమామ – సృష్టి బ్రతుకమ్మయ్యే చందమామ పుట్టిన రీతి జెప్పే చందమామ – భట్టు నరసింహకవి చందమామ ధర చోళ దేశమున చందమామ – ధర్మాంగుడను రాజు చందమామ ఆ రాజు భార్యయు చందమామ – అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ – నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యు చందమామ – వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ – తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమును బాసి చందమామ – దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ – వనమందు నివసించే చందమామ కలికి లకీ‡్ష్మని గూర్చి చందమామ – పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ – వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ – పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ – జన్మించే శ్రీలకీ‡్ష్మ చందమామ అంతలో మునులనూ చందమామ – అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ – కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిషు్ఠలూ చందమామ – ఆ కన్నియను జూచి చందమామ బ్రతుకు గనె ఈ తల్లి చందమామ – బతుకమ్మ యనిరంత చందమామ పిలుతురదివర నుంచి చందమామ – ప్రియముగ తలిదండ్రి బ్రతుకమ్మ యనుపేరు చందమామ – ప్రజలంత అందరూ చందమామ తాను ధన్యుడంచు చందమామ – తనబిడ్డతో రాజు చందమామ నిజపట్టణముకేగి చందమామ – నేల పాలించంగ చందమామ శ్రీమహావిష్ణుండు చందమామ – చక్రాంకుడనుపేర చందమామ రాజు వేషంబునా చందమామ – రాజు ఇంటికి వచ్చిచందమామ ఇల్లింటమని వుండి చందమామ – అతివ బతుకమ్మను చందమామ పెండ్లాండ్లి కొడుకులా చందమామ – పెక్కుమందిని గాంచె చందమామ ఆరువేల మంది చందమామ – అతి సుందరాంగులు చందమామ ధర్మాంగుడను రాజు చందమామ – తన భార్య సత్యవతి చందమామ సిరిలేని సిరులతో చందమామ – సంతోషమొందిరి చందమామ జగతిపై బ్రతుకమ్మ చందమామ – శాశ్వతంబుగవెలిసే చందమామ ఇంటికో తంగేడు చెట్టు పర్వతగిరి : తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. తొమ్మిది రోజులపాటు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే బతుకమ్మ పండుగలో అన్ని పూలకంటే ప్రధానమైంది తంగేడు పువ్వు. గంగమ్మకు ఇష్టమైన తంగేడు పువ్వు కొన్నేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువగా లభించడంలేదు. ఈ క్రమంలో పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు కొన్నేళ్ల క్రితం తమ ఇళ్ల ఎదుట తంగేడు చెట్లను పెంచుతున్నారు. దీంతో నాలుగేళ్ల నుంచి మహిళలు పువ్వును కొనుగోలు చేయకుండా ఇంట్లోని చెట్టు పూలనే కోసుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. కొందరు పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. -
దాలియా పూల సోయగం
అందాలకు నెలవైన విశాఖ మన్యానికి దాలియా పూలు మరింత ప్రత్యేకత తీసుకువస్తున్నాయి. ఈ ఏడాది వివిధ రంగుల్లో దాలియా పూలు విరగ్గాస్తున్నాయి. గిరిజన రైతులకు వీటి అమ్మకాల ద్వారా మంచి ఆదాయం సమకూరుతోంది. పంచాయతీ కేంద్రమైన కొట్నాపల్లి గ్రామంలో వైలెట్ రంగులోని దాలియా పూలు రోడ్డు వెంబడి వెళ్లే వారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ పూలను హుకుంపేట, పాడేరు ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మకాలు జరుపుతున్నారు. –హుకుంపేట -
సుందరం.. సుమధురం