పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.
ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.
బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.
సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.
– బేతంచెర్ల
Comments
Please login to add a commentAdd a comment