Chamanthi
-
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
ఒక నీటì చుక్క పాఠం
‘ఆ నీటిని నువ్వు అక్కడవున్న చామంతి చెట్టుకు పోసివుండొచ్చుకదా?’ మళ్లీ అన్నాడు గురువు. తను చేసిన తప్పేమిటో తెలిసివచ్చి సిగ్గుపడ్డాడు శిష్యుడు. అదొక బౌద్ధాశ్రమం. ఒక జెన్ మాస్టర్ స్నానం చేయడానికి వేడినీటిని తొట్టిలోకి వంపుకున్నాడు. ఆ వేడినీటిలో కలపడానికి కొన్ని చన్నీళ్లు తెమ్మని శిష్యుడిని పురమాయించాడు. శిష్యుడు బావి నుంచి చేదుకుని ఒక కుండలో నీళ్లు తెచ్చాడు. వాటిని వేడినీటి తొట్టిలో పోస్తూ, చేతితో వేడిని అంచనా వేస్తూ, గోరువెచ్చగా అయ్యేదాకా పోశాడు. అలా పోయగా అడుగున కొన్నినీళ్లు మిగిలిపోయినై. వెంటనే వాటిని నేలమీద పారబోశాడు. అది గమనించిన, జెన్ మాస్టర్‌కు ఆగ్రహం వచ్చింది. ‘ఆ నీటిని అలా అనాలోచితంగా ఎందుకు పారబోశావు?’ అడిగాడు గురువు. దానికి శిష్యుడి నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. ‘ఆ నీటిని నువ్వు అక్కడవున్న చామంతి చెట్టుకు పోసివుండొచ్చుకదా?’ మళ్లీ అన్నాడు గురువు.తను చేసిన తప్పేమిటో తెలిసివచ్చి సిగ్గుపడ్డాడు శిష్యుడు. ‘గురువర్యా! మీరు చెప్పిన ఈ పాఠాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. అలా గుర్తుంచుకునేలా ఈ రోజునుంచీ నా పేరును ‘తెకుసుయి’గా మార్చుకుంటున్నాను’ అని స్థిరంగా జవాబిచ్చాడు. తెకుసుయి అంటే ఒక నీటిచుక్క.గురువు సంతృప్తిగా స్నానం చేయడానికి తొట్టిలోకి దిగాడు.ఒక విలువైన పాఠం నేర్చుకోవడానికి ఒక జీవితం మొత్తాన్ని అంకితం చేస్తేనేమి! -
ఎవరీ అమ్మాయి?
కృష్ణ, అపేంద్ర, ఆషా, దివ్య, జిషాంక్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘చామంతి’. జె.మోహన్‌కాంత్ దర్శకుడు. టి.చలపతి నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను టి.ప్రసన్నకుమార్, సాయి వెంకట్ చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చక్కని ప్రేమకథతో కూడిన అచ్చతెనుగు సినిమా అని, పద్మనావ్.వి ఇచ్చిన నాలుగు శ్రావ్యమైన బాణీలను పద్దెనిమిది మంది సింగర్స్‌తో పాడించామని దర్శకుడు చెప్పారు. తమ తొలి ప్రయత్నం సఫలం అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.