betamcherla
-
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
నచ్చిన యువతితో పెళ్లి చేయలేదని..
బేతంచెర్ల: నచ్చిన యువతితో కుటుంబీకులు పెళ్లి చేయలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వడ్డె సుబ్బరాయుడు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు చిన్న నాగరాజు(22) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం గౌండ పనితో పాటు కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఈ యువకుడికి ఓ పెళ్లి సంబంధం చూశారు. కాని కుటుంబ సభ్యులు ఆ సంబంధం వద్దని చెప్పారు. దీంతో నచ్చిన యువతితో పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన చిన్న నాగరాజు గురువారం అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎన్నిక ఏదైనా తిరుగులేని వైఎస్సార్సీపీ
-
రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహం
బేతంచర్ల (కర్నూలు) : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎన్.సుబ్బయ్య, రాధమ్మ దంపతుల కుమారుడు హేమంత్(14) బేతంచర్లలోని నారాయణ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూ రైలు ద్వారా పాఠశాలకు రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన హేమంత్ తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలిస్తున్న కుటుంబసభ్యులకు గ్రామ శివారులోని రైలు పట్టాలపై అతని మృతదేహం లభించింది. రైల్లో నుంచి జారిపడి మృతిచెందడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా గురు పూర్ణిమ పూజలు
కర్నూలు (బేతంచెర్ల) : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన కర్నూల్ రహదారిలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఐదున్నర గంటలకు ఓంకార ప్రణవం, బాబాకు కాకడ హారతి, సుప్రభాత సేవ, ఆరున్నర గంటలకు బాబాకు అభిషేకం, విష్ణుసహస్రపారాయణము, అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి, ఎనిమిదిన్నర గంటలకు బాబా వారికి రూ.5 నాణెములతో తులభార కార్యక్రమము, 9 గంటలకు సత్యసాయి వ్రతము నిర్వహించారు. పట్టణంలోని ఆయా కాలనీల భక్తులే కాకుండా సిమెంట్ నగర్, బుగ్గానిపల్లె, కొలుములపల్లె, ఆర్ఎస్ రంగాపురం గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో మహిళలు, భక్తాదులు హాజరు కావడంతో ఆలయం సాయినామస్మరణతో మారు మ్రోగింది. బాబా సందర్శనకు వచ్చిన సుమారు 5వేల మంది భక్తులకు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటుచేశారు. -
పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న వృద్ధులు బేతంచెర్ల, న్యూస్‌లైన్: వయస్సు పైబడిన వృద్ధులు.. ఆసరా లేని వికలాంగులు.. తోడు దూరమైన వితంతువులు.. వీరందరికీ నెల నెలా వచ్చే పింఛన్ ఎంతో ఆసరానిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లా.. వీరికీ ఠంచన్‌గా పింఛన్ మొత్తం అందించి పెద్ద కొడుకుగా.. తోబుట్టువులా వారి హృదయాలను చూరగొన్నారు. ఆయన మరణానంతరం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియక.. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛన్ ఇస్తారో లేదో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అతి కష్టం మీద పొద్దున్నే కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా రాలేదని తెలిసి ఎండలో నిట్టూరుస్తూ ఇళ్లకు వె ళ్లిపోతున్నారు. దుడ్లు ఎప్పుడిస్తారోనని ఆశగా అడుగుతున్నారు. ఆ మహానేత జీవించి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కాదంటూ పలువురు పింఛన్‌దారులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవడం కనిపించింది. ఆ వైఎస్ దేవుడు లేకపోయినా.. ఆయన కొడుకు జగన్ అయినా వస్తే సక్రమంగా పింఛన్ దుడ్లు వస్తాయని మరింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.