తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది.
బేతంచర్ల (కర్నూలు) : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రైలు కింద పడి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎన్.సుబ్బయ్య, రాధమ్మ దంపతుల కుమారుడు హేమంత్(14) బేతంచర్లలోని నారాయణ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూ రైలు ద్వారా పాఠశాలకు రాకపోకలు సాగించేవాడు.
ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లిన హేమంత్ తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలిస్తున్న కుటుంబసభ్యులకు గ్రామ శివారులోని రైలు పట్టాలపై అతని మృతదేహం లభించింది. రైల్లో నుంచి జారిపడి మృతిచెందడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.