railway track
-
Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం
-
పసికందును పట్టాలపై పడేసిండ్రు
-
పట్టాలపై పబ్జీ..రైలు ఢీకొని యువకులు మృతి
పాట్నా:సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం.. కానీ బీహార్‌లో ఏకంగా రైలు పట్టాలపైనే కూర్చొని ముగ్గురు యువకులు పబ్జీ ఆడారు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మరీ గేమ్ ఆడారు. ఇంకేముంది పట్టాలపై దూసుకువస్తున్న రైలు శబ్దాన్ని ఆ యువకులు వినలేకపోయారు.వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి వెళ్లింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులను ఫర్కాన్ ఆలం,సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టంనకు తరలించామని దర్యాప్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భీకర ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.ఇదీ చదవండి: స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసింది -
మకోడి–సిర్పూర్ రైల్వే ట్రాక్‌పై పెద్దపులి
కాజీపేట రూరల్/ సిర్పూర్ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్ కాగజ్‌నగర్–మకోడి రైల్వే స్టేషన్ల మధ్య అన్నూర్ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్మన్లు చూశారు. ట్రాక్ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్ దట్టమైన ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్ పులి ఆనవాళ్లు ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్ బెంగాల్ టైగర్‌గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు. ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్ లైన్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్ లైన్లో (ఎస్1) సంచరించింది. -
పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే మృతి
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షోర్నూర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై చెత్త శుభ్రం చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా వచ్చిన కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఘటనాస్థలంలో దొరికాయి. మరో మృతదేహం పక్కనే ఉన్న నదిలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ట్రాక్‌పై వస్తున్న రైలును కార్మికులు గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: వేడివేడి కిచిడీ పడి భక్తులకు తీవ్ర గాయాలు -
రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్.. తప్పిన పెను ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదానికి కుట్రపన్నిన వైనం వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్ లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ డిటోనేటర్ పడివుంది.పండుగల సమయంలో ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డిటోనేటర్‌ను ఈ వ్యక్తి అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్‌పై డిటోనేటర్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో కనిపించింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్ -
రూర్కీలో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు. ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజయ్ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలుఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్ స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్ దిగువ భాగంలోని రబ్బర్ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు. -
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
-
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
యూపీలో మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్-కాన్పూర్ రైల్వే లైన్లో కాస్గంజ్ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
తెలంగాణకు రైల్వే కేటాయింపులు రూ.5,336 కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తాజా కేంద్రబడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,336 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. 2009–14 మ«ధ్య కాలంలో ఉమ్మడిరాష్ట్ర వార్షిక సగటు కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమేనని.. ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు ఆరురెట్లు ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనుల మొత్తం అంచనావ్యయం రూ.32,946 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వేట్రాక్ పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా పూర్తయిందని చెప్పారు. 2009–2014 మధ్య కాలంలో రాష్ట్రంలో సంవత్సరానికి సగటున కేవలం 17 కి.మీ.మేర మాత్రమే కొత్త ట్రాక్ వేయగా, గత పదేళ్లలో సగటున సంవత్సరానికి 65 కి.మీ. చొప్పున నూతన ట్రాక్ వేసినట్టు వెల్లడించారు. పదేళ్లలో 437 ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్‌స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వేట్రాక్ ఏర్పాటు చేసే ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా ఏర్పాటు చేసే కవచ్‌కు సంబంధించి 4.0 వెర్షన్‌కు ఆమోదం లభించిందని, దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. – వర్చువల్ పద్ధతిలో సికింద్రాబాద్ నుంచి దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ, నగర ప్రజారవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి మిగిలిన పనులను రైల్వేశాఖ సొంత నిధులతో పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, దీనికి రాష్ట్ర నిధుల కోసం ఎదురుచూడమని తేల్చిచెప్పారు. బీబీనగర్–గుంటూరు డబ్లింగ్ పనులు మొదలయ్యాయని, జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. -
రైలు పట్టాలపై ఈత కొడుతున్న చేపలు
-
లోకో పైలట్ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు
గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా 2020 జూన్ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి. -
మిస్ యూ అమ్మా
మిర్యాలగూడఅర్బన్: వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన తన్నీరు వెంకటమ్మ మూడవ కుమారుడు తన్నీరు సాయికిరణ్(22) పట్టణంలోని ఓ ప్రైవేట్ సంస్థలో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ బాలికను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతుండగా, బాలిక తరపువారు గతంలో కేసులు పెట్టగా, పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగిందని సీఐ నాగార్జున తెలిపారు.ఈ నెల 28న రాత్రి సీతారాంపురంలోని ఆ బాలిక ఇంటికి వెళ్లడంతో గొడవ జరిగింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు బుధవారం ఉదయం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం పట్టణంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్న సాయికిరణ్.. తన చావుకు సోమగాని శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ కారణమని, వారిద్దరూ స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకుని వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. అనంతరం రైలు పట్టాల వద్ద నిలబడి ఫొటో తీసుకొని మిస్ యూ అమ్మా అని స్టేటస్ పెట్టుకొని.. వేగంగా వస్తున్న జన్మభూమి రైలుకు ఎదురుగా పరుగెత్తడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో రైల్వే ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.వేధింపులతోనే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు మృతికి సోమగాని శ్రీనివాస్, కజ్జం శ్రీనివాస్ అలియాస్ మీసాల శ్రీనివాస్ కారణమని, ఎమ్మెల్యే అండ చూసుకొని తన కుమారుడిపై వేధింపులకు పాల్పడ్డారని సాయికిరణ్ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
ఆధునికంగా రైల్వే ట్రాక్
వేటపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మార్గదర్శకంగా నిలుస్తోంది. పెరుగుతున్న రైళ్ల వేగాన్ని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్‌లను ఆధునీకరిస్తోంది. తాజాగా విజయవాడ డివిజన్లోని వేటపాలెం వద్ద వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్(డబ్ల్యూసీఎంసీ) క్రాసింగ్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత రద్దీగా ఉండే విజయవాడ–గూడూరు సెక్షన్ పరిధిలోని బాపట్ల జిల్లా వేటపాలెం డౌన్‌లైన్‌లో మంగళవారం రైల్వే అధికారులు విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో మొదటి సారిగా ఉపయోగించారు. భారతీయ రైల్వేలో ఇది రెండవది. రైళ్లలో పెరిగిన వేగం, హెవీ యాక్సిల్ లోడ్‌ను అధిగమించేందుకు డబ్ల్యూసీఎంసీ క్రాసింగ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రైలు ఒక లైను నుంచి మరో లైను దాటే జంక్షన్ల వద్ద ట్రాక్‌లో ఉపయోగించే కీలక భాగమే డబ్యూసీఎంసీ. ఇప్పటి వరకు రెండు బ్లాక్ సెక్షన్ల మధ్య లాంగ్ వెల్డ్ రైల్స్(ఎల్డబ్ల్యూఆర్) ఉండేవి. జాయింట్ ఫ్రీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల యార్డ్‌లలో టర్న్ అవుట్ల వెనుక ఫిష్ ప్లేట్ జాయింట్‌తో వేరు చేసేవారు. ఇప్పుడు డబ్యూసీఎంసీ అందుబాటులోకి రావడం వల్ల 130 కి.మీ వేగంతో నడిచే రైళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధికారులు చెప్పారు. ప్రయాణికులు సురక్షితంగా, కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. డబ్యూసీఎంసీ క్రాసింగ్ ఏర్పాటు విజయవాడ డివిజన్లో చారిత్రాక మైలురాయిగా నిలుస్తుందన్నారు. డివిజన్ సీనియర్ డీఈఎన్ వరుణ్‌బాబు, ఇతర అధికారులను ఆయన అభినందించారు. -
యూట్యూబర్ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు
యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో రొటీన్‌గా మారి పోయింది. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పటాకులు కాల్చిన వీడియో నెటిజనులకు ఆగ్రహం తెప్పింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్ నిర్భయంగా పటాకులు స్నేక్ క్రాకర్స్ కాల్చుతున్న వీడియో ట్విటర్లో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ ఆగ్రహం పెల్లుబుకింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది. ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా? పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం. అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్ అనేవి అత్యధిక మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని 2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. YouTuber bursting crackers on Railway Tracks!! Such acts may lead to serious accidents in form of fire, Please take necessary action against such miscreants. Location: 227/32 Near Dantra Station on Phulera-Ajmer Section.@NWRailways @rpfnwraii @RpfNwr @DrmAjmer @GMNWRailway pic.twitter.com/mjdNmX9TzQ — Trains of India 🇮🇳 (@trainwalebhaiya) November 7, 2023 -
రైల్వే ట్రాక్‌పై బస్సు బోల్తా
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో బస్సు అదుపుతప్పి రైలు పట్టాలపై బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగులు మృతి చెందారు. దాదాపు 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హరిద్వార్ నుంచి ఉదయ్‌పూర్ వైపు 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది. 'ప్రమాదానికి గురైన వెంటనే 24 మందిని ఆస్పత్రికి తరలించాం. నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.' అని జిల్లా అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్ కాస్వా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు.. ట్రాక్‌పై నుంచి బోల్తా కొట్టిన బస్సును తొలగించారు. ప్రమాదంపై సీఎం అశోక్ గహ్లోత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య -
20 గంటల్లోనే రైల్వేట్రాక్ రెడీ!
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే సహాయక చర్యలతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కేవలం 20 గంటల వ్యవధిలోనే రెండు ట్రాక్‌లలో రైళ్ల రాకపోకల్ని అధికారులు ప్రారంభించారు. వేలాది మంది రైల్వే సిబ్బంది, కార్మికుల సాయంతో అర్థరాత్రి మొదలుకుని.. సోమవారం రాత్రి వరకూ పనుల్ని నిర్వహించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) సౌరభ్ ప్రసాద్ ఘటనా స్థలికి 45 నిమిషాల్లోనే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, ఏపీ పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రుల్ని వెలికితీసి ఆస్పత్రులకు తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరోవైపు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. అర్థరాత్రి 2.30 గంటలకల్లా.. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ పూర్తి చేశారు. ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగానే.. మరోవైపు నుంచి వాల్తేరు అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డీఆర్ఎం, సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ బృందాలు, ఏజెన్సీల సమన్వయ కృషితో రెస్టొరేషన్ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. దెబ్బతిన్న కోచ్‌లను తొలగించడంతో పాటు, పక్కనే ఉన్న ట్రాక్‌లలో ఉన్న గూడ్స్ ట్యాంకర్లను వేరు చేసే ప్రక్రియను తెల్లవారు జామునకల్లా పూర్తి చేశారు. భారీ క్రేన్లు.. వెయ్యి మంది కార్మికులు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, సీనియర్ అధికారుల బృంద పర్యవేక్షణలో ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జోరుగా సాగాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎప్పటికప్పుడు చర్యల్ని సమీక్షించారు. రైల్వే బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెయిన్‌లైన్ పునరుద్ధరణ పనులపై దృష్టిసారించారు. 1000 మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్వైజర్లు ఇందులో భాగస్వాములయ్యారు. రెండు 140 టన్నుల హెవీ డ్యూటీ క్రేన్లు, 15 ఎక్స్కవేటర్లు మిషన్ మోడ్ల ద్వారా ట్రాక్‌లను పునరుద్ధరించారు. కేవలం 19 గంటల వ్యవదిలోనే అప్ అండ్ డౌన్ ట్రాక్లని పునరుద్ధరించారు. మొదటిగా డౌన్‌లైన్‌లో మధ్యాహ్నం 2.42 గంటలకు గూడ్స్‌రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం 2.55 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద స్థలిని క్రాస్ చేసింది. మరికొన్ని మరమ్మతులు నిర్వహించి డౌన్‌లైన్‌లో రెండో ట్రైన్‌గా పూరీ–తిరుపతి–బిలాస్పూర్ రైలును అనుమతించారు. కాగా, ప్రమాదం జరిగిన మధ్యలైన్ ట్రాక్‌లోనే విశాఖపట్నం రాయగడ రైలు లోకో.. కూరుకుపోయింది. ట్రాక్‌లో లోతుగా కూరుకున్న ఇంజిన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఏఆర్టీ మెషీన్ తెచ్చి.. జాకీ మాదిరిగా వినియోగించారు. సోమవారం రాత్రి 11 గంటల వరకూ మూడో లైన్ పనులు కొనసాగాయి. తెగిపడిన హెచ్‌టీ లైన్ల విద్యుత్ పునరుద్ధరణ పనులూ పూర్తిచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాద ఘటన విషయం తెలియడంతో ఆదివారం రాత్రి నుంచే ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జాబితాతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు వారి గురించి సమాచారం అందిస్తున్నారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు.. విజయవాడ: 0866–2576924 అనకాపల్లి: 08924–221698 తుని: 08854–252172 సామర్లకోట: 0884–2327010 కాకినాడ టౌన్: 0884–2374227 రాజమండ్రి: 0883–2420541 నిడదవోలు: 0881–3223325 ఏలూరు: 0881–2232267 భీమవరం టౌన్: 0881–6230098 తెనాలి: 0864–4227600 ఒంగోలు: 0859–2280308 నెల్లూరు: 0861–2342028 గూడూరు: 9494178434 -
కేకే లైన్లో విరిగి పడిన కొండ చరియలు
విశాఖపట్నం: కొత్తవలస–కిరండూల్(కేకే) లైన్ మనబార్–జరాటి స్టేషన్ పరిధిలో రైల్వేట్రాక్‌పై ఆదివారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. గమ్యం కుదించిన రైళ్లు ►రూర్కెలా–జగదల్పూర్(18107) ఎక్స్‌ప్రెస్ ఆదివారం కోరాపుట్ వరకే నడిచింది. జగదల్పూర్–రూర్కెలా (18108) ఎక్స్‌ప్రెస్ సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరుతుంది. ►భువనేశ్వర్–జగదల్పూర్ (18447) హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం కోరాపుట్ వరకే నడిచింది. జగదల్పూర్–భువనేశ్వర్(18448) సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరుతుంది. ► ఆదివారం రాత్రి బయలుదేరిన విశాఖపట్నం–కిరండూల్(18514) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వరకే నడిచింది. కిరండూల్–విశాఖపట్నం(18513)ఎక్స్‌ప్రెస్ సోమవారం కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► సోమవారం ఉదయం బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకే నడుస్తుంది. కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ సోమవారం అరకు నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ►హౌరా–జగదల్పూర్(18005) సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాయగడ వరకే నడిచింది. జగదల్పూర్–హౌరా(18006) ఎక్స్‌ప్రెస్ సోమవారం రాయగడ నుంచి హౌరా బయలుదేరుతుంది. -
భద్రాద్రి రామయ్య భక్తులకు.. రైల్వేశాఖ తీపి కబురు!
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య భక్తులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. రామయ్య చెంతకు రైలు సౌకర్యం కల్పించే భద్రాచలం – మల్కన్‌గిరి (ఒడిశా) మార్గం నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుమార్గం నిర్మాణానికి ఫైనల్ లోకేషన్ సర్వేను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గును మరింత వేగంగా వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే లక్ష్యంతో డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వై లైన్‌కు రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గానికి కూడా ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణాలో డోర్నకల్ – భద్రాచలంరోడ్ బ్రాంచ్‌లైన్ మరింత కీలకంగా మారుతుంది. కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ఐరన్ ఓర్ గనులకు కేంద్రమైన కిరోండల్ వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఫైనల్ లొకేషన్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్తగూడెం – కిరోండల్ మధ్య దూరం కేవలం 180 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం కిరోండల్‌కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీ. దీంతో దగ్గరి దారిగా కొత్తగూడెం నుంచి కిరండోల్‌కు రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014 – 15 సంవత్సర బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. సర్వే కోసం కేవలం రూ.10 లక్షలు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ప్రాథమిక సర్వేను 2018 బడ్జెట్లో మంజూరు చేసింది. తాజాగా ఫైనల్ సర్వే రిపోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. భద్రాలచం – మల్కన్‌గిరి రైల్వేలైన్ తెలంగాణ – ఆంధ్రా మీదుగా ఒడిశాకు వెళ్తుండగా కొత్తగూడెం – కిరోండల్ మార్గం తెలంగాణ మీదుగా నేరుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లేలా నిర్మించే అవకాశం ఉంది. ప్రాథమిక సర్వేకు ఏడాది.. దట్టమైన ఏజెన్సీ ప్రాంతాలైన తెలంగాణలోని భద్రాచలం (పాండురంగాపురం రైల్వేస్టేషన్) నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. ఈ రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించేందుకు ప్రాథమిక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3 కోట్లు కేటాయించింది. ఏడాది పాటు జరిగిన ప్రాథమిక సర్వే రిపోర్ట్ 2022 జూన్‌లో వచ్చింది. ఇందులో ఒడిశాలోని మల్కన్‌గిరిలో బయలుదేరితే.. బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురంలో స్టేషన్లు నిర్మించాలని సర్వేలో పేర్కొన్నారు. ఈ రైలు మార్గం దారిలో గోదావరి, శబరితో పాటు చిన్నా పెద్దా కలిపి 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,592 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ లైన్‌కు సంబంధించి ప్రాథమిక రిపోర్టు వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఈ రైల్వేలైన్ నిర్మాణంపై ఉలుకూపలుకు లేదు. దీంతో భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం రైల్వేలైన్ల తరహాలో ఇది కూడా సర్వేలకే పరిమితం అవుతుందనే భావన జిల్లా వాసుల్లో ఏర్పడింది. ఫైనల్ లొకేషన్ సర్వే.. దేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఫలానా రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) చేపడుతుంది. ఈ సర్వేలో మరింత స్పష్టంగా వివరాలు సేకరిస్తుంది. అందులో రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి, నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్‌ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి, నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలు సేకరించి రిపోర్ట్ తయారు చేస్తారు. దీని ఆధారంగా మొత్తం పనిని పలు బిట్లుగా విభజించి నిధులు మంజూరు చేస్తారు. రెండేళ్లలో పనులు.. రైల్వే లైన్ నిర్మించే మార్గంలో ఉండే భౌగోళిక అననుకూలతలను బట్టి ఫైనల్ లొకేషన్ సర్వేకు ఎంత సమయం పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏడాదిలోగానే రైల్వేశాఖ ఫైనల్ సర్వేను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఫైల్ రైల్వే బోర్డుకు చేరుతుంది. అక్కడ ఆర్థిక పరమైన మదింపు తర్వాత నిధులు కేటాయిస్తారు. ప్రస్తుత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశాకు చెందినవారు కావడంతో మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో పురోగతి వేగంగా సాగుతోంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో రెండేళ్లలో ఈ రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే భద్రాచలం నుంచి దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా జిల్లా వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం మరింత విస్తృతం కానుంది. -
చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత..
ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్‌ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్‌ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో..
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులోని ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. పట్టాలపై కారు నిలిపోవడాన్ని గూడ్స్ రైలు లోకో పైలట్ గమనించి వెంటనే వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన కుటుంబంగా సమాచారం. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు.. -
Kazipet Railway Station Floods Video: ఖాజీపేట రైల్వే ట్రాక్‌పై వరద నీరు
-
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
పట్టాలపై బుడ్డోడి తింగరిపని
-
కలకలం రేపుతున్న వీడియో.. రైలు పట్టాలపై రాళ్లు పెట్టి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రైలు పట్టాలపై ఒక బాలుడు రాళ్లు పెట్టిన వీడియో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు రైలు పట్టాలపై రాళ్లను వరుసగా పేర్చాడు. కొందరు ఆ బాలుడిని పట్టుకుని రాళ్లు ఎవరు పెట్టమన్నారని అడుగుతున్నారు. అయితే తనకు ఎవరూ ఇలా చేయమని చెప్పలేదని పోలీసులకు అప్పగించవద్దని ఏడుస్తూ వేడుకోవడం, తరువాత ఆ బాలుడిని వదిలేయడం రికార్డయ్యాయి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ తెలీడం లేదు. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు ట్యాగ్ చేసి ఇది చాలా సీరియస్ విషయమని, దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓ బాలుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఓ వ్యక్తి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ⚠️ Shocking: Another #TrainAccident Averted. An underage boy was caught sabotaging the railway Track this time in #Karnataka. We have tens of thousands of Kms of railway tracks and forget adults now even kids are being used for sabotaging and causing deaths. This is a serious… pic.twitter.com/URe9zW4NgG — Arun Pudur (@arunpudur) June 5, 2023 చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే... -
ఒడిశా రైలు ప్రమాదం: రాత్రింబవళ్లు అక్కడే..
కొరాపుట్: బాలేశ్వర్ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్ సరి్టఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకే.. అంత వేగంగా.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదవండి: తగ్గిన జీడి.. పెరిగిన కోడి -
ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందే భారత్ రైలు ట్రయిల్ రన్
-
అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే ఇంట్లో ప్రత్యక్షం
తిరువళ్లూరు: తల్లి మృతి చెందిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే ఆమె ప్రాణంతో ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్(56)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సేలై కండ్రిగలోని చిన్న కుమారుడు శరవణన్ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సొక్కమ్మాల్‌కు, ఎదురింటి మహిళకు ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో సొక్కమ్మాల్ స్వల్పంగా గాయపడడంతో అలిగి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు వెళ్లిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించినట్లు తెలిసింది. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్‌పై అదే కలర్ దుస్తులతో వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని రీతితో కనిపించింది. మృతదేహాంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దినపత్రికల్లో రావడంతో మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్ ఈ రైల్వే పోలీసుల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు. చైన్నెలో ఉన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్ లిప్ట్ చేయలేదు. మే 28వ తేదీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా సొక్కమ్మాల్ సోమవారం ఉదయం శరవణన్ ఇంటి వద్దకు రావడంతో కలకలం రేపింది. సొక్కమ్మాల్ ప్రాణంతో వచ్చారన్న విషయం తెలియడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతి చెందిన మహిళ తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, ప్రస్తుతం తన తల్లి ప్రాణంతో ఇంటికి వచ్చిందని సమాచారం అందించాడు. దీంతో రైల్వే పోలీసులు శరవణన్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ సొక్కమ్మాల్ కాదని నిర్ధారించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ అంబిక, ఆర్ఐ గణేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్(66)గా గుర్తించారు. -
బోగీలను వదిలి రైలింజన్ పరుగులు!
శివమొగ్గ(బెంగళూరు): బోగీలను వదిలి రైలింజిన్ పరుగులు తీసిన ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్‌క్రాసింగ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. తాళగుప్ప–బెంగళూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 7.05 గంటలకు భద్రావతికి బయల్దేరింది. భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే ఇంజిన్, బోగీలకు మధ్య లింక్ ఊడిపోయింది. ఇంజిన్ పరుగులు తీస్తుండగా బోగీలు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భీతిల్లారు. ఇంజిన్ వెనుక బోగీలు లేని విషయాన్ని గమనించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. భద్రావతి, శివమొగ్గ నుంచి సిబ్బంది వచ్చి ఇంజిన్‌ను వెనక్కు తీసుకొచ్చి బోగీలతో కలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి -
Hyderabad: ప్రాణం తీసిన ‘రీల్స్’ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పైకి వచ్చి..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. సనత్‌నగర్‌లో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా యువకుడిని వెనుక నుంచి ట్రైన్ ఢీకొట్టింది. మృతుడు మహ్మద్ సర్ఫరాజ్.. రహ్మత్ నగర్ శ్రీరామ్‌నగర్ చెందినవాడిగా గుర్తించారు. మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్నిగాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. మృతుడి ఫోన్‌ను స్పాట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్నేహితులు సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చి రైలు ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే విద్యార్థి మృతిచెందగా, మరో ఇరువురు విద్యార్థులు రైలు రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. -
రైలులో తోటి ప్యాసింజర్‌కు నిప్పు.. ముగ్గురి మృతి!
కోజికోడ్: కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదిలే రైలులో తన తోటి ప్రయాణికుడికి నిప్పటించగా.. బోగీలోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో.. పట్టాలపై పడి మరో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఏడాది చిన్నారి ఉండడం గమనార్హం. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. అలప్పుజ్జా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘోరం జరిగింది. రైలు కోరాపుళ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. గుర్తు తెలియని ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్‌కు నిప్పటించాడు. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు చెయిన్ లాగి.. సహాయం కోసం రైల్వేసిబ్బందికి ఫోన్ చేశారు. ఈ గ్యాప్‌లో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోగా.. గాయపడిన వాళ్లను ఆంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆపై రైలు కన్నూర్‌కి చేరుకోగా, ఓ మహిళ, చిన్నారి కనిపించకుండా పోయారనే ఫిర్యాదు అందింది. దీంతో.. వాళ్ల కోసం గాలింపు చేపట్టగా.. ఎళథూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాల మీద సదరు మహిళ, ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి. మంటల్ని చూసి భయంతో రైలు నుంచి దూకేయడమో లేదంటే ప్రమాదవశాత్తూ వాళ్లకు కిందపడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ, ఆ చిన్నారికి బంధువని తేలింది. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. దారుణానికి తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. -
హైదరాబాద్: నగరవాసులకు అలర్ట్.. 48 గంటలు నీళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆదివారం జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ –1 లో మెయిన్ పైపులైన్ తరలింపు నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇదీ పరిస్థితి.. దక్షిణ మధ్య రైల్వే శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపులైన్ ఉంది. రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం అక్కడ ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్‌కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్ష¯న్ పనుల చేపడుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాస్తవంగా పనుల పూర్తికి 66 గంటలు సమయం పడుతుందని ముందుగా భావించినప్పటిఈ వాటిని 48 గంటల్లో పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి అంతరాయం కలిగే ప్రాంతాలివే.. నగర శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, డిఫెన్స్ కాలనీ. నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్ మెయిన్–3 లైన్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్/శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు. పాక్షికంగా .. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్‌బీ, మలేసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు. లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్ బాచుపల్లి. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎం తదితర ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలని, అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకుని, నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు -
ఘట్ కేసర్ వద్ద పూర్తయిన రైల్వే ట్రాక్ పనులు
-
అనాథ శవాలకు ఆత్మ బంధువులు
సాక్షి, నెల్లూరు/బారకాసు: నెల్లూరు నగర పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన తల.. కాళ్లు, చేతులు వేర్వేరుగా పడి ఉన్నాయి. చుట్టూ ఈగలు ముసురుతుండగా.. ఆ శవం దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు సైతం ముక్కుమూసుకుని నిలబడగా.. పెద్దోడు, చిన్నోడు అనే వ్యక్తులు చకచకా వచ్చి శరీర భాగాలను సేకరించారు. వాటన్నిటినీ ఓ దుప్పట్లో కట్టుకుని వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఛిద్రమైన శవ భాగాలను శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. కట్టె కాలుతుండగా ఎగిసిపడే చితి మంటలు.. వారి ఔదార్యానికి సలాం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వేలాది మృతదేహాలకు పెద్దోడు, చిన్నోడు అసామాన్య సేవలందిస్తున్నారు. రైలు బోగీలకు మంటలంటుకున్న వేళ 2011లో నెల్లూరు రైల్వేస్టేషన్లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు అగ్నికీలల్లో చిక్కుకుని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఆ సమయంలో చిన్నోడు, పెద్దో డు కృషి అంతా ఇంతా కాదు. వీరిద్దరి సహకారంతోనే మంటల్లో కాలిపోయిన వారి మృతదే హాలను బోగీల్లోంచి వెలికితీసి రక్త సంబంధీకు లకు అప్పగించారు. కరోనా విజృంభించిన సమ యంలోనూ పెద్దోడు, చిన్నోడు ప్రాణాలకు తెగించి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. ఇదీ పెద్దోడు కథ.. విశాఖపట్టణానికి చెందిన బత్తిన గురుమూర్తి (పెద్దోడు) 30 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా సొంతూరిని వదిలేసి నెల్లూరు చేరుకున్నాడు. ప్రధాన రైల్వేస్టేషన్లో ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకుని కడుపు నింపుకునేందుకు చేతనైన పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఓ రోజు రాత్రి రైలు పట్టాలపై శవం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. అర్ధరాత్రి వేళ శవాన్ని ఎవరు తీస్తారని ఎదురుచూస్తున్న సమయంలో వారికి గురుమూర్తి కనిపించాడు. అతడిని నిద్రలేపిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చేందుకు రావాలని కోరారు. పెద్దోడు కాదనకుండా శవం ఉన్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం భాగాలను ఓ సంచిలో వేసుకుని చెక్కబండిపై నెట్టుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. దీంతో పోలీసులు గురుమూర్తికి రూ.300 ఇచ్చారు. ఆ నగదుతో 4 రోజులపాటు కడుపునింపుకున్న పెద్దోడు మరోసారి కూడా అదే తరహాలో అనాథ మృతదేహాన్ని తరలించాడు. ఇలా మొదలైన ఆయన జీవన ప్రయాణం 30 ఏళ్లుగా అనాథ శవాలకు ఆత్మబంధువుగా.. పోలీసులకు సహాయకారిగా మారాడు. నెల్లూరు నగర పరిసరాల్లో ఎక్కడ ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా కారణాలతో ఎవరైనా మృతి చెందితే పోలీసుల నుంచి ఫోన్‌కాల్ వచ్చేది పెద్దోడికే. చిన్నోడు ఎవరంటే.. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన సురేష్‌కుమార్ (చిన్నోడు) కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేశాడు. ప్రధాన రైల్వేస్టేషన్ ఎదుట ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకున్నాడు. యాచిస్తూ కడుపు నింపుకునే సురేష్‌కు గురుమూర్తితో స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి ఎక్కడ మృతదేహం ఉన్నా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఇద్దరూ కలసి వెళ్తున్నారు. అలా చేయడంలోనే తృప్తి అది మంచో చెడో మాకు తెలియదు. శవాలు కనిపిస్తే సాయం చేయాలనిపిస్తుంది. పోలీసులిచ్చే డబ్బు కోసం కాదు. మాకు అందులోనే తృప్తి ఉంటోంది కాబట్టే ఆ పనికి ఒప్పుకుని చేస్తున్నాం. – గురుమూర్తి (పెద్దోడు) అప్పుడప్పుడూ బాధేస్తుంది ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు సైతం పీక్కు తింటుంటాయి. కుళ్లి పోయిన శవాలనూ చూస్తుంటాం. ఇలాంటప్పుడు మాకు బాధ కలుగుతుంది. – సురేష్‌కుమార్ (చిన్నోడు) -
Viral Video: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
పాట్నా: బిహార్ గయా జిల్లాలో ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకుంది. టన్‌కుప్ప రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాటి మరో ప్లాట్‌ఫైంకి వెళ్తుండగా గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆమె చాకచక్యంగా పట్టాలపైనే పడుకుంది. రైలు ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో మహిళకు స్వల్పగాయాలై క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో ఓ ప్లాట్‌ఫాంపై గూడ్స్ రైలు, మరో ప్లాట్‌ఫాంపై ఆమె వెళ్లాల్సిన ప్యాసెంజర్ రైలు ఉన్నాయి. దీంతో ప్యాసెంజర్ రైలు ఎక్కేందుకు ఆమె పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే గూడ్స్ రైలు కదలడంతో ఏం చేయాలో తెలియక పట్టాలపైనే పడుకుంది. ఫలితంగా తన ప్రాణాలు కాపాడుకుంది. #Watch: Woman Falls Under Moving Train In Bihar#Bihar #railwaytrack #Gaya #Train #RailwayStation #injury #Accident #viral #Trending #news #LatestNews #IndianJourno pic.twitter.com/vxmvkvLKnY — Indian Journo (@indianjournoapp) February 11, 2023 రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలపై నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుటోవర్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. కానీ కొంతమంది ప్యాసెంజర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. పట్టాలపైనుంచే అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతుంటారు. చదవండి: నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్ -
పెరిగిన సామర్థ్యం.. విజయవాడ–విశాఖపట్నం మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు
సాక్షి, అమరావతి: విజయవాడ–విశాఖపట్నం మధ్య ఇక గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి విశాఖపట్నం శివారులోని దువ్వాడ వరకు రైల్వేట్రాక్‌ను ఆధునికీకరించి సామర్థ్యాన్ని పెంచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణి విభాగాల పరిధిలో ట్రాక్ సామర్థ్యాన్ని 130 కిలోమీటర్ల వేగానికి పెంచే ప్రక్రియ పూర్తయింది. స్వర్ణ వికర్ణి విభాగం పరిధిలోని బల్హార్ష–కాజీపేట–గూడూరు మధ్య రైల్వేట్రాక్ సామర్థ్యాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో పెంచారు. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి పరిధిలోని విజయవాడ–దువ్వాడ ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. దీన్లో భాగంగా తగినంత బరువైన పట్టాలు వేయడంతోపాటు 260 మీటర్ల పొడవుగల వెల్టెడ్ రైలు ప్యానళ్లు ఏర్పాటు చేశారు. ట్రాక్ మార్గంలో వంపులు, ఎత్తుపల్లాలను సరిచేశారు. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్షన్ పంపిణీ పరికరాలను మెరుగుపరిచారు. గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రైళ్ల లోకోమోటివ్, కోచ్‌లను అందుబాటులోకి తెచ్చారు. చదవండి: Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా.. -
వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?
గౌరిబిదనూరు: ఈ నెల 9వ తేదీన కర్నాటకలో తాలూకాలోని తొండేబావి రైల్వే స్టేషను సమీపంలో రైలు పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించడం కలకలానికి కారణమైంది. ఇది ఆత్మహత్య, లేక ప్రమాదమా, మృతులు ఎవరు అనేది మిస్టరీగా మారింది. బుధవారం ఆ మిస్టరీ వీడింది. మృతులు తొండేబావి రైల్వేస్టేషను దగ్గరే నివాసముంటున్న మైలారప్ప (50), భార్య పుష్పలత (45), వీరి కుమార్తె మమత (25)గా పోలీసులు గుర్తించారు. మైలారప్ప చిన్నకారు రైతు. మమతకు ఇటీవల భర్త కుటుంబ కలహాలతో విడాకులు ఇవ్వడంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి కాపురం చెడిపోవడం వారు తట్టుకోలేకపోయారు. దీంతో ముగ్గురూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరో కూతురి ఫిర్యాదుతో.. మైలారప్ప మరో కుమార్తె దాక్షాయణి ద్యావరహళ్లిలో ఉంటుంది. మూడురోజుల నుంచి ఫోను చేసినా స్విచాఫ్ అని వస్తోంది. కంగారు పడిన ఆమె మంగళవారం రాత్రి తొండేబావిలోని ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటికే మృతదేహాలకు అంత్యక్రియలు చేసి వారి దుస్తులను భద్రపరిచారు. ఫోటోలను, దుస్తులను చూపించగా దాక్షాయణి తన తల్లిదండ్రులు, సోదరివి అని గుర్తుపట్టి విలపించింది. -
రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలను కాపాడిన ట్రాక్‌మన్.. ఆ విషయం చెప్పకపోయుంటే!
పిఠాపురం: వరుసగా ఆడపిల్లలనే కన్నావని అత్తవారు వేధించడంతో ఓ వివాహిత తన పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇద్దరు బిడ్డలతో కలిసి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ట్రాక్‌మన్ అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే స్టేషన్ సమీపాన ఆదివారం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పోతులూరుకు చెందిన శివకు, చేబ్రోలుకు చెందిన వెంకటలక్ష్మిలకు భవ్యశ్రీ, పార్థు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమై 11 ఏళ్లు అయినా మగ పిల్లవాడు పుట్టలేదని వెంకటలక్ష్మిని భర్త, అత్త కాసులమ్మ వేధించేవారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. గత శుక్రవారం అదనపు కట్నం తేవాలని బాధితురాలిపై దాడి చేయగా పెద్దలు వెళ్లి తగువు తీర్చారు. తన మీదకు పెద్దలను తీసుకువస్తావా అంటూ కోపోద్రిక్తుడైన భర్త శివ ఆమెను కొట్టాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, దుర్గాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కూతురే కాపాడింది... అదే సమయంలో విశాఖ– విజయవాడ సూపర్‌ఫాస్ట్ రైలు వస్తోంది. ట్రాక్‌మన్ పిమిడి వెంకటేశ్వరరావు ట్రాక్‌ను పరిశీలిస్తూ 655వ మైలు రాయి వద్ద తిరుగుతున్నాడు. వెంకటలక్ష్మి తన బిడ్డలతో కలిసి రైల్వే ట్రాక్‌పై వెళ్లడాన్ని గమనించి వారిని అడ్డుకున్నాడు. తనకు తెలిసిన వారు కొంత దూరంలో ఉన్నారని, దగ్గర దారి కావడంతో ఇలా వెళుతున్నానని వెంకటలక్ష్మి ట్రాక్మన్కు చెప్పింది. ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని, అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని వెంకటలక్ష్మి కుమార్తె భవ్యశ్రీ అతడికి చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్‌పై నుంచి బయటకు తోసేసి వారి ప్రాణాలను కాపాడాడు. అప్పటికే ట్రైన్ అతి సమీపంలోకి రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల మధ్య వివాదం
యలమంచిలి(అనకాపల్లి జిల్లా): అధిక రద్దీ కారణంగా ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదంతో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటల సేపు నిలిచిపోయింది. రిజర్వేషన్ బోగీల్లో అన్రిజర్వ్డ్ టికెట్లతో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడంతో ఇరువర్గాల మధ్య గొడవ ఏర్పడింది. ఇది కాస్త పెద్దదికావడంతో శనివారం యలమంచిలి మండలం రేగుపాలెం రైల్వేస్టేషన్ వద్ద దన్బాద్–అలెప్పి (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ రైలును యలమంచిలి దాటిన తర్వాత వెనుక వస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (12889) కోసం రేగుపాలెం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిలిపివేశారు. ఇదే సమయంలో రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికులు, అన్‌రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికుల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత పెద్దదైంది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పైకి వచ్చిరైలు ఇంజిన్‌కి ఎదురుగా ఆందోళనకు దిగారు. రైలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దాదాపు 500 మంది ప్రయాణికులు ట్రాక్‌పై ఇంజిన్‌కు ఎదురుగా ఉండిపోవడంతో దాదాపు రెండు గంటల సేపు అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకొన్న తుని రైల్వే ఎస్ఐ షేక్ అబ్దుల్ మారూఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు నచ్చజెప్పారు. రైల్వే ట్రాక్ నుంచి వారిని పక్కకు తొలగించారు. అనంతరం 12.05 నిమిషాల సమయంలో రేగుపాలెం స్టేషన్ నుంచి రైలును ముందుకు పంపించారు. అన్నవరం రైల్వే స్టేషన్ వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారు. -
రైల్వే ట్రాక్ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు..!
జైపూర్: ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ట్రాక్ దెబ్బతిన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పుర్ జిల్లా కెవ్డాలో ఉన్న ఓడ రైల్వే బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పేలుడు సంఘటన కలకలం సృష్టించిన క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్వీట్ చేశారు. ఓడ రైల్వే వంతెనపై పేలుడుతో రైల్వే ట్రాక్ పాడవటం ఆందోళనకర విషయమని, సీనియర్ అధికారులు స్పాట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. వంతెన పునఃనిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్ 31నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? -
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్
రైలు ప్రమాద ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. రైలు కిందపడి నిత్యం వందలాది మంది ప్రాణాలు విడుస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. దీనికి చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భాగల్పూర్ స్టేషన్లో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్‌కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి అలాగే పడుకొని ఉండిపోయాడు. ట్రైన్ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన భయంతో వణికిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు. రైలు పూర్తిగా వెళ్లిన తర్వాత అదృష్టం బాగుండి క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి గాయాలు అవ్వకుండా తృటిలో ప్రాణాలతో బయపడ్డాడు. రైలు వెళ్లగానే లేచి తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మరికొందరు తమ సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు పాటించని సదరు వ్యక్తిని అరెస్ఠ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. શોર્ટકટના ચક્કરમાં આ ભાઈને ધોળાદીવસે તારા દેખાઈ ગયા, ઉપરથી જતી રહી આખેઆખી ટ્રેન#bihar #train #viralreel #trishulnews pic.twitter.com/sCOF8c9sfQ — Trishul News (@TrishulNews) November 11, 2022 -
యాదాద్రి: విడిపోయి బతకడం ఇష్టం లేకనే?
సాక్షి, యాదాద్రి జిల్లా: జిల్లాలో ఓ ప్రేమ జంట బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. బహూపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ జంట. మృతుల్ని బస్వాపూర్‌కి చెందిన గణేష్, నలందగా గుర్తించారు పోలీసులు. నలందకి వివాహం జరిగింది. అయితే.. గణేష్‌తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం!. -
పట్టాలపై నిలబడి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. చివరికి!
సాక్షి, చెన్నై: మద్యం మత్తులో ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలును అడ్డగించాడు. ఈ విషయం గుర్తించిన లొకోపైలెట్ రైలును ఆపి వేశాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి చెన్నైకి వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం యథావిధిగా బెంగుళూరు నుంచి బయలు దేరింది. రైలు ఉదయం 10.45 గంటల సమయంలో తిరుపత్తూరు జిల్లా వాని యంబాడి రైల్యేస్టేషన్‌లో నిలిచేందుకు తక్కువ వేగంతో వస్తుంది. రైలు న్యూటౌన్ రైల్యే గేటు వద్దకు రాగానే సుమారు 35 ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై నిలబడి ఉన్నాడు. వీటిని గమనించిన రైలు ఇంజిన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, రైలు ను నిలిపి వేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రైలు పట్టాలపైకి వెళ్లి, యువకుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యు వకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
వైరల్ వీడియో: రైలు పట్టాలపై బైక్.. దూసుకెళ్లిన ట్రైన్
-
సల్మాన్ ఖాన్ లుక్‌లో అర్ధ నగ్నంగా రైల్వే ట్రాక్ పై హల్చల్
ఇటీవలకాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపిచ్చి వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. సందేశాత్మకంగా లేకపోయినా పర్వాలేదు గానీ ఇబ్బంది పెట్టేవిగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉండకూడదు. సోషల్ మాధ్యమాల్లో పెట్టే వీడియోలుకు కూడా కొన్నినిబంధనలు ఉంటాయి. చాలామంది వాటిని విస్మరించి అసభ్యకరంగా వీడియోలు షూట్ చేసి జైలు పాలవ్వుతున్నారు. అచ్చం అలానే చేసి ఇక్కడోక వ్యక్తి కూడా జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...లక్నోకి చెందిన అజమ్ అన్సారీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకని ఒక అసభ్యకరమైన వీడియో చేశాడు. అతను సల్మాన్‌ఖాన్ మాదిరి అర్ధ నగ్నంగా రెడీ అయ్యి రైల్వే ట్రాక్‌పై ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో అతను రైల్వే ట్రాక్ పై పడుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. పైగా ఈ వీడియోని సల్మాన్ చిత్రం తేరే నామ్లో హిట్ పాట తేరే నామ్ హమ్మే కియా హై అనే పాటతో రూపొందించాడు. దీంతో లక్నో రైల్వే పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే నిందితుడు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలానే ఘంటాఘర్ వద్ద వీడియో తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!) -
షాకింగ్ వీడియో: భార్యను ట్రైన్ కింద తోసేసి పిల్లలతో పరార్!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. వీడియోలో.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్‌పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్‌లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. shocking video has emerged of a woman sleeping on the platform at Vasai railway station being pushed down by her husband. @saamTVnews @SaamanaOnline @ANI @AmhiDombivlikar @zee24taasnews @ pic.twitter.com/q0OrFTlePg — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 22, 2022 ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
గుడ్‌న్యూస్:హైదరాబాద్-బెంగళూరు మధ్య హైస్పీడ్ ట్రైన్.. జర్నీ 2.5 గంటలే!
బెంగళూరు: దేశంలో ఐటీ హాబ్‌లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే, రోడ్డు, రైలు మార్గంలో చేరుకోవాలంటే సుమారు 10 గంటలపైనే సమయం పడుతుంది. అయితే, కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది కదా? ఆ కల త్వరలోనే నిజం కాబోతోంది. దక్షిణాది ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది భారతీయ రైల్వే. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రానుంది. ఇండియా ఇన్‌ఫ్రాహబ్ నివేదిక ప్రకారం.. సెమీ హైస్పీడ్ ట్రాక్‌ను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు దూసుకెళ్లేలా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గనుంది. కొత్త ట్రాక్‌ను బెంగళూరులోని యెలహంకా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు సుమారు 503 కిలోమీటర్లు నిర్మించనున్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన రూట్‌ను ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ట్రైన్ హైస్పీడ్‌తో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రైలులో ప్రయాణించేందుకు సుమారు 10 నుంచి 11 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై రాజ్యసభలో ఇటీవలే ప్రకటించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇదీ చదవండి: గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 50మందికి గాయాలు! -
ట్రైన్ వస్తున్నా లెక్క చేయక మూగ జీవికి ప్రాణ భిక్ష!
ముంబై: రైలు పట్టాలపై ఉన్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్ల వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది. ముంబై మేరీ జాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రాణాలకు తెగించిన నిఖిల్ లోఖండేను అభినందించారు నెటిజన్లు. 4.88 లక్షల వ్యూస్, 31వేల లైకులు వచ్చాయి. వీడియోలో.. రైల్వే ట్రాక్‌పై ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ వెళ్తోంది ఓ శునకం. ఎదురుగా ట్రైన్ వస్తోంది. కుక్కను గమనించిన నిఖిల్ లోఖండే.. ట్రైన్‌కు వ్యతిరేంకంగా పరుగెత్తాడు. ట్రైన్ నెమ్మదిగా వస్తున్న క్రమంలో నిలిపేయాలని సైగ చేశాడు. కుక్కను ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వారికి అందించాడు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని నల్లాసపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు నెటిజన్లు తెలిపారు. శునకాన్ని కాపాడిన అఖిల్‌పై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Mumbai Meri Jaan (@mumbai7merijaan) ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
రాథోడ్ సాబ్.. నీ కొడుక్కి ధైర్యం ఎక్కువే!
భోపాల్: రైలు పట్టాలపై బీటెక్ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్ రాథోడ్(20).. రాయ్‌సెన్ ఒబయ్‌దుల్లాగంజ్ పట్టణంలో హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరిని కలుస్తానని చెప్పి హాస్టల్ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్ నుంచి ఓ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన నిషాంక్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు నిషాంక్. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. Dead body of Nishank Rathore, an engineering student, found on railway track in Bhopal, Madhya Pradesh. A WhatsApp message of "Sar Tan Se Juda" was sent from his mobile to his father & his friends. A story of "Sar Tan Se Juda" was uploaded from his Instagram account. pic.twitter.com/CZOowSw6dr — Anshul Saxena (@AskAnshul) July 25, 2022 అయితే నిషాంక్ తండ్రి ఉమా శంకర్ రాథోడ్.. తన కొడుకు ఫోన్ నుంచి తన ఫోన్‌కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. ‘.. తల వేరు చేయబడింది’ అంటూ ఉంది ఆ సందేశంలో. అంతేకాదు.. ‘రాథోడ్ సార్.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి’ అంటూ ఆ సంభాషణ నడిచింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు. Guztakh-e-Nabi ki Ek hi Saja, Sar Tan se Juda అనే మాటల్ని.. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒంటరిగా కనిపించాడని, అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తిని చంపేసింది -
ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?
విజయనగరం క్రైమ్: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? నాకు ఇప్పటివర కూ తెలియదు. ఈ జనాల మధ్యలో బతకలేను మరి. బై ఫ్రెండ్స్’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి, రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన అందించిన వివరాలిలా ఉన్నాయి. దుప్పాడ గ్రామానికి చెందిన తాళ్లపూడి త్రినాథ్ (24) వీటీ అగ్రహారంలో ప్రియా సిమెంట్స్‌లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఊర్లో యువకులంతా కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో కొన్ని మెసెజ్‌ల విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల త్రినాథ్ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. కొంతమందితో వచ్చిన తగాదాల కారణంగా వన్‌టౌన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో మరింత మనస్తాపం చెందిన త్రినాథ్.. ఆదివారం ఉదయం 8.50 గంటలకు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి బై ఫ్రెండ్స్ అంటూ మెసెజ్ చేసి, 9 గంటలకు అలకానంద కాలనీకి చేరుకుని, రైల్వేట్రాక్ పక్కన బైక్ పార్క్‌చేశాడు. అదే సమయంలో వస్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తల్లి గౌరమ్మ, తండ్రి అప్పారావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపారు. -
రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది ఓ మహిళ. ట్రైన్ వచ్చేది గమనించక.. తన సామగ్రితో పట్టాలు దాటి మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ట్రైన్ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో.. స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj — Awanish Sharan (@AwanishSharan) July 19, 2022 ఇలాంటి సాహసాలకు పాల్పొడొద్దని, అది అంత మంచిది కాదని ప్రజలకు సూచించారు ఐఏఎస్ అధికారి. నెటిజన్లు సైతం ఆ మహిళ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివితక్కువ ప్రయాణికులు అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నారు. సొంత జీవితాన్ని ప్రమాదంలో పడేసే ఆత్రుత ఎందుకు? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు. మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ వీడియో రెండు లక్షలకు పైగా మంది చూశారు. అయితే.. ఇది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! -
స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్నేహితుడి పెళ్లి రిసెప్షన్లో సంతోషంగా గడిపారు. మద్యం సేవిస్తూ మరింతగా సంబరం చేసుకునే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. తూత్తుకూడి మూడవమై లు పశుంపొన్ నగర్‌కు చెందిన కె. మారిముత్తు (20), తిరువీక నగర్‌కు చెందిన ఎస్.మారిముత్తు (23), తిరునెల్వేలి జిల్లా పనకుడికి చెందిన ఎస్. జెపసింగ్ (23) స్నేహితులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈనెల 9వ తేదీ (గురువారం)న తమ స్నేహితుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై రాత్రి 10 గంటలకు తూత్తుకూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలుపట్టాలపై కూర్చుని మద్యం తాగారు. మత్తు ఎక్కువ కావడంతో ఒళ్లు తెలియని స్థితిలో పట్టాలపై తలపెట్టి పడుకుండిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో తూత్తుకూడి కొత్త హార్బర్లో లోడు ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్ వైపు బయలుదేరిన గూడ్సురైలు..పట్టాలపై తలపెట్టుకుని నిద్రిస్తున్న యువకులపై నుంచి వెళ్లింది. దీంతో ఎస్. మారిముత్తు, కె.మారిముత్తు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలకు గురైన జపసింగ్ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్ యూ అంటూ సహోద్యోగి వచ్చి.. చివరకు.. -
పట్టాలపై పసికందు
కొత్తవలస రూరల్: అప్పుడే పుట్టిన పసికందును రైలు పట్టాల పక్కన విడిచి వెళ్లిన సంఘటనతో కొత్తవలస ప్రజలు హతాశులయ్యారు. కొత్తవలస–విశాఖ రహదారిలో గల కరెంట్ ఆఫీస్ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్ద ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ పసికందును బ్యాగ్‌లో ఉంచి పడవేశారు. అక్కడే పండ్ల వ్యపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లి అనే వ్యక్తి బ్యాగ్‌లో ఉన్న శిశువును గుర్తించి, స్థానిక పరమేశ్వరి అస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. పొలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్ పీఓ బి.ఉర్మిళ, సూపర్వైజర్ సునీత ఆస్పత్రికి వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకుని విజయనగరంలోని ఘోషాఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, శిశుగృహకు అప్పగించారు. పసికందును వదిలి వేయడం అమానుషం అప్పుడే పట్టిన పసికందును రైల్వే ట్రాక్‌పై వదిలివేయడం అమానుషమని, సభ్యసమాజం తల దించుకునే చర్య అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస రైల్వే ట్రాక్ పక్కన వదిలిపెట్టిన పసికందును ఘోషా ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచిన సమాచారం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి పసికందును చూసి డాక్టర్‌ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద పట్టుబడతాననే భయంతో పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఒక యువకుడు రైలుకింద పడి మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా బసవనపుర గ్రామం వద్ద చోటుచేసుకుంది. బెంగళూరు సుంకదకట్టె నివాసి దిలీప్ (28) మృతి చెందిన వ్యక్తి. గురువారం రాత్రి దిలీప్, మరో ఆరుగురు యువకులు కారులో బెంగళూరు నుంచి మైసూరుకు మద్యం తాగుతూ బయలుదేరారు. బవనపుర వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం తాగుతున్నందుకు అరెస్టు చేస్తారనే భయంతో కారు దిగిన దిలీప్ రోడ్డు పక్కన రైలు పట్టాలపైకి పరుగెత్తాడు. అదే సమయంలో రైలు రావడంతో రైలు కింద పడి మృతి చెందాడు. పోలీసులు ఐదుగురు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారయ్యాడు. రామనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: భర్తతో దూరం.. వీఆర్వోతో మహిళకు పరిచయం.. ‘నేను మోసపోయానమ్మా’ -
Viral Video: రైల్వే ట్రాక్ దాటేక్రమంలో.. చావు తప్పింది.. బైక్ పీస్పీస్ అయింది
Biker narrowly escapes speeding train: రోడ్డు, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాహనాలు అతి వేగంగా వస్తున్న సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న, తొందర పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రైల్వే గేట్ వద్ద సిగ్నల్స్ వేసి ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. వివరాలు.. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తుండటం, సిగ్నల్ వేయడంతో గేట్మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా ఆవేశపడి రైలు వచ్చేలోగా గేటును దాటుకొని వెళ్లాలనుకున్నాడు. చదవండి: ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది! Smithereens 2022... bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA — Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022 ఇంతలోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకురావడం గమనించిన ఆ వ్యక్తి.. బైక్‌ను అక్కడ వదిలేసి వెనక్కి వచ్చాడు. రెప్పపాటు క్షణంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ బైక్‌ను బలంగా ఢీకొంటూ ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయితే బైకర్ మాత్రం చావు నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ క్లోజ్ చేసి ఉన్నా.. ఎందుకు ట్రాక్ మీదికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ మండిపడుతున్నారు. చదవండి: మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు! -
ఏందయ్యా సామీ! కాస్త చూసుకుని నడువు!!
న్యూఢిల్లీ: ఇంతవరకు మనం రైలులోంచి జారిపడటం వంటి రకరకాల ప్రమాదాలను చూశాం. ఇటీవలే ఒక వ్యక్తి ఏకంగా కదులుతున్న రైలు ముందు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని తోసేసి వెళ్లిపోయిన ఘటనలు గురించి విన్నాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఢిల్లీలోని షాహదారా మెట్రో స్టేషన్లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలోని ఒక వ్యక్తి ఫోన్ చూస్తు నడుస్తూ మెట్రో ట్రాక్ పై పడిపోయాడు. ఈ ఘటన శుక్రవారం షాహదారా మెట్రోస్టేషన్లో చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ సిబ్బందికి చెందిన కానిస్టేబుల్ రోథాష్ చంద్ర వేగంగా స్పందించి మెట్రో ట్రాక్‌పైకి దిగి సదరు యువకుడిని మెట్రోరైలు రాకమునుపే ఫ్లాట్ఫాంపైకి ఎక్కించి కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh — CISF (@CISFHQrs) February 5, 2022 -
అక్కడ ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. కస్టమర్‌కి చేరేది కష్టమే! ఎందుకో తెలుసా?
లాస్ ఏంజెల్స్.. టీవీ, సినీ రంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నగరం. ప్రత్యేకించి ఇక్కడుండే హాలీవుడ్ సైన్ గురించి చెప్పనక్కర్లేదు కదా. అలాంటి నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కూడా!. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై చోరీలతో అమెజాన్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు, రైల్వే ఆపరేట్లు విపరీతంగా నష్టపోతున్నారు. లాస్ ఏంజెల్స్ కౌంటీ రైల్వే ప్యాసింజర్లతో ఉండే బిజీ రూట్. దీంతో గూడ్స్‌తో వెళ్లే రైళ్లను ఈ మార్గంలో చాలాసేపు నిలిపేస్తారు. ఇదే అదనుగా నేరస్థులు చెలరేగిపోతున్నారు. కంటెయినర్లను బద్ధలు కొట్టి.. అందులోని పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లిపోతున్నారు. రమారమీ 2021లో ఇలా పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా వాటిల్లిన నష్టం 5 మిలియన డాలర్ల( సుమారు 37 కోట్ల రూపాయలకు) అంచనా వేసింది ఈ రూట్లో రైళ్లు నడిపించే యూనియన్ ఫసిఫిక్. తాజాగా శుక్రవారం ఓ భారీ చోరీ చోటు చేసుకోగా.. పోస్టల్ శాఖ పార్శిల్స్‌తో పాటు అమెజాన్, ఫెడ్ఎక్స్, టార్గెట్, యూపీఎస్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల పార్శిల్స్ సైతం చోరీకి గురైనట్లు బయటపడింది. అంతేకాదు చోరీ తర్వాత ఆ బాక్స్‌లను పట్టాలపైనే పడేసి.. వాటిలో చాలావరకు డబ్బాలను కాల్చి పడేశారు కూడా. కొత్తేం కాదు.. లాస్ ఏంజెల్స్ రైల్వే రూట్లో దొంగతనాలు ఈమధ్య కాలంలో జరుగుతున్నవేం కాదు. 2020 సెప్టెంబర్ నుంచి లాస్ ఏంజెల్స్ కౌంటీలో దొంగతనాల శాతం 160 మేర పెరిగిందని యూనియన్ ఫసిఫిక్ (రైల్వే ఆపరేటర్) చెబుతోంది. కరోనా టైం నుంచి ఈ నేరస్థులు చెలరేగిపోతున్నారు. పార్శిల్స్‌ను మోసుకెళ్లడం కష్టమవుతుందనే ఉద్దేశంతో వాటిని అక్కడే చించేసి.. కేవలం అందులోని వాటిని తీసుకెళ్తున్నారు. తక్కువ ధరలకే బయట అమ్మేసుకుంటున్నారు. కొవిడ్-19 టెస్ట్ కిట్స్, ఫర్నీఛర్, మందులు.. చోరీకి గురవుతున్న వాటిలో ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా క్రిస్మస్, న్యూఇయర్ టైంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సీజన్లో సగటున రోజుకి 90కి పైగా కంటెయినర్లను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ పసిఫిక్ ఆ రైల్వే రూట్లో భద్రత కట్టుదిట్టం చేసింది. డ్రోన్ పర్యవేక్షణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని ట్రాక్‌ల వెంట కాపలా కోసం నియమించుకుంది. ఈ క్రమంలో వంద మంది నేరగాళ్లను అదుపులోకి సైతం తీసుకున్నట్లు యూనియన్ పసిఫిక్ చెప్తోంది. అంతేకాదు కాలిఫోర్నియా అటార్నీకి సైతం ఇలాంటి నేరాల్లో శిక్ష తక్కువ విధించడంపై సమీక్ష చేయాలంటూ కోరింది యూనియన్ పసిఫిక్ రైల్వే. చదవండి: ఒమిక్రాన్ అలర్ట్.. ఉద్యోగులకు వార్నింగ్! -
Yesvantpur Express: ఆ రైలు ధర్మవరం వరకే
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా యలహంక (బెంగళూరు)కు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ధర్మవరం వరకు కుదించారు. బెంగళూరు – పెనుగొండ మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 17603 నంబరు రైలు ఈనెల 12, 13, 14 తేదీల్లో కాచిగూడ నుంచి కర్నూలు, డోన్ మీదుగా ధర్మవరం వరకు మాత్రమే వెళ్తుంది. అలాగే యలహంక నుంచి కాచిగూడ వెళ్లే 17604 నంబరు రైలు 13, 14, 14 తేదీల్లో ధర్మవరం నుంచి వెనుదిరిగి వెళ్తుంది. భువనేశ్వర్ రైలు రద్దు భువనేశ్వర్ – బెంగళూరు – భువనేశ్వర్ మధ్య నంద్యాల, డోన్ మీదుగా రాకపోకలు సాగించే 18463, 18464 రైళ్లు ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో బెంగళూరు – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్య రద్దు చేశారు. మచిలీపట్నం – యశ్వంత్‌పూర్ – మచిలీపట్నం మధ్య కర్నూలు మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 13, 14వ తేదీల్లో ధర్మవరం– యశ్వంత్‌పూర్ మధ్య రద్దు చేశారు. కోర్బా – యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12న కర్నూలు, డోన్, గుత్తి, రేణిగుంట, జోలార్‌పెట్టాయి, బంగారపేట్, కృష్ణరాజపురం మీదుగా దారి మళ్లించారు. రాజ్‌కోట్ – కోయంబత్తూర్‌కు మంత్రాలయం రోడ్, ఆదోని మీదుగా వెళ్లే 16613 ఎక్స్‌ప్రెస్ రైలును గుత్తి, రేణిగుంట, జోలార్పట్టాయి, తిరపత్తూర్, సేలమ్ మీదుగా మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలపై వెళ్తుండగా..
సాక్షి, మర్పల్లి(వికారాబాద్): గూడ్స్‌రైలు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్లాపూర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొత్లాపూర్‌కు చెందిన శానికే రాజిరెడ్డి కుమారుడు వసంత్‌రెడ్డి (16) మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద నూర్పిడి చేసి కుప్పగా పోసిన మొక్కజొన్నలపై కప్పి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీసేందుకు బైక్‌పై వెళ్లాడు. పొలం రైలు పట్టాల పక్కన ఉంది. వసంత్‌రెడ్డి పట్టాల పక్కన తన బైక్‌ను ఆపి చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బీదర్ నుంచి మర్పల్లి మీదుగా వికారాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో వసంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. -
సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు నవంబర్ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!) ఎఫ్ఐఆర్లో ఏం ఉంది అంటే.. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23 తేదీన యలహంక, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించాము. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నాం. యలహంక రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం.. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలంలో చాకు, కత్తి, బ్లెడ్‌ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించాము’’ అని తెలిపారు. ‘‘మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము. తన మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు. ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చేవాడు. ఈ నెల 8 తేదీన బెంగళూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు’’ అని తెలిపారు. (చదవండి: ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి) ఇక నవంబర్ 23 తేదీన ఏకే రావు మృతి గురించి తెలిసిన తర్వాత ఆయన భార్య బెంగళూర్‌లో ఉన్న కుమారుడుకి ఫోన్ చేసింది. యశ్వంత్‌పూర్ రైల్వే పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రైల్వే ట్రాక్‌పై మీ భర్త మృతదేహం ఉంది అని పోలీసులు చెప్పారు.. అని కుమారుడుకి సమాచారం ఇచ్చింది. ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావును వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు’’ అని తెలిపారు. ‘‘ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని ఏకే రావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో302, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం. హత్య, ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో -
రైలు ఢీకొట్టడంతో రెండు ముక్కలైన వ్యాన్.. పుట్టినరోజునే పునర్జన్మ
ఫొటో చూడగానే సీన్ అర్థమైపోతోంది కదూ! రైలు ఢీకొట్టడంతో అమెజాన్ డెలివరీ వ్యాన్ రెండు ముక్కలైంది. మరి ఇందులో ఉన్నవారి పరిస్థితేంటి? బతికి బట్టకట్టే అవకాశం కొంచెం కూడా లేదనే అనిపిస్తోంది కదా?. కానీ, ఈ వ్యాన్ డ్రైవర్ అలెగ్జాండర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు వ్యాన్ రెండు ముక్కలైనా.. అతడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అమెరికాలోని విస్కాన్సిన్లో ఈ ప్రమాదం జరిగింది. చదవండి: కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ.. ‘‘రెడ్‌లైట్ లేకపోవడంతో మామూలుగా వెళ్లిపోయాను. ట్రాక్‌పైకి వెళ్లేసరికి ఒక్కసారిగా రైలు శబ్దం. వెంటనే తేరుకుని వేగం పెంచాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వ్యాన్ రెండు ముక్కలైంది. నేను మాత్రం బతికే ఉన్నాను. అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యమే’’అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు. అన్నట్టు.. ఆ రోజునే అతడు 33వ ఏట అడుగుపెట్టాడు. చదవండి: ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..! -
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన డీజిల్ ఇంజన్
Bomb Blast On Rail Tracks: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్లో శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. పేలుడు వల్ల రైలు ట్రాక్‌లో కొంత భాగం దెబ్బతిన్నది. ధన్‌బాద్ డివిజన్లోని గర్వా రోడ్ , బర్కానా సెక్షన్ మధ్య ఈ "బాంబు పేలుడు" జరిగింది అని రైల్వే శాఖ తెలిపింది. (చదవండి: టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్‌ని కారులోనే బంధించి ) ‘‘ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా అసాధారణంగా ఉండటమే కాక దుండగులు కావాలనే రైలు పట్టాల మీద పేలుడుకు పాల్పడటంతో ధన్‌బాద్ డివిజన్లో డీజిల్ లోకో పట్టాలు తప్పింది" అని రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఘటన వెనక నక్సల్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరు గాయపడలేదు.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. చదవండి: ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్‌లో కలకలం -
రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
మెదక్: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్‌లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది. అలుముకున్న విషాదం శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. -
గాయాలతో మొసలి.. 25 నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్
ముంబై: మొసలి పట్టాలపైకి రావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన వడోదర-ముంబై రైల్వే లైన్ మధ్య చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై గాయంతో బాధపడుతున్న మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మొసలిని పక్కకు తీసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మిగతా రైళ్లు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వన్యప్రాణుల కార్యకర్త హేమంత్ వద్వాన వచ్చి మొసలికి సపర్యలు చేసి పట్టాలపై నుంచి తొలగించాడు. ‘నాకు 3.15 నిమిషాలకు కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పట్టాలపై మొసలి ఉందని ఫోన్ చేశారు. మొసలి వలన రైలు ఆగడం ఆశ్చర్యమేసింది. స్టేషన్ నుంచి మేం మొసలి ఉన్న దగ్గరకు వెళ్లడానికి ఐదు నిమిషాలు పట్టింది.’ అని హేమంత్ తెలిపారు. ‘మొసలి తీవ్ర గాయాలతో బాధపడుతోంది. ఆలస్యంగా వెళ్లి ఉంటే మొసలి చనిపోయి ఉండేది’ అని మరో వన్యప్రాణి కార్యకర్త నేహ పటేల్ వివరించారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ‘పట్టాలపై నుంచి మొసలిని తొలగించిన అనంతరం కిసాన్ రైలులో తరలించాం. అనంతరం అటవీ శాఖ అధికారులకు మొసలిని అప్పగించాం’ అని కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంతోశ్ శర్మ తెలిపారు. వన్యప్రాణి కార్యకర్తలంతా అగ్నివీర్ ప్రాణీణ్ ఫౌండేషన్ సభ్యులు. వారు ఇలా వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ఈ ఫౌండేషన్ సభ్యులు కాపాడుతారు. -
దారి తప్పిన సం‘బంధం’: అన్నలాంటి వ్యక్తితో మహిళ...
బంగారం లాంటి భర్త... ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చక్కని సంసారం... సుఖసంతోషాల జీవితం కానీ ఆమె దారి తప్పింది... అన్నలాంటి వాడికి దగ్గరయింది. ప్రేమను పంచే భార్య...అనురాగానికి ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబం...చింతలేని సంసారం కానీ సోదరి జీవితంలోకి ‘అక్రమ’ంగా ప్రవేశించాడు. తప్పని తెలిసీ వారిద్దరూ తప్పటడుగు వేశారు సమాజానికి భయపడి...ముఖం చూపలేక వెళ్లిపోయారు రైలు పట్టాలపై జీవితాలను ముగించేశారు వారి పిల్లలకు జీవితానికి సరిపడు శోకాన్ని మిగిల్చారు ఒక్క తప్పుడు నిర్ణయం..ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో..ఎంతమందిని క్షోభ పెడుతుందో తెలియజెప్పే ఈ సంఘటన గురువారం గుంతకల్లులో చోటుచేసుకుంది. గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్ సర్కిల్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివారెడ్డి తనకు సోదరిలాంటి రాజ్యలక్ష్మీతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈక్రమంలో వారం కిందట వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో కుటుంబీకులకు ముఖం చూపించడం ఇష్టంలేక వారిద్దరూ మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. భార్య కనిపించడం లేదని రాజ్యలక్ష్మి భర్త నారాయణస్వామి గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసిన శివారెడ్డి... తానిక ఇంటికి రాలేనని... ఇవే తన చివరి మాటలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్ కూడా పనిచేయలేదు. తీరా గురువారం రాజ్యలక్ష్మి, శివారెడ్డి మృతదేహాలు హనుమాన్ సర్కిల్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమై కనిపించాయి. స్థానికుల సమాచారంతో జీఆర్పీ సీఐ నగేశ్‌బాబు, ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు విషయం చేరవేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోలీసులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రాజ్యలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం కాగా, శివారెడ్డికి కూతురు, కొడుకు ఉన్నారు. -
అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డ రైలు పట్టాలపై..
సాక్షి, విజయనగరం/ఒడిశా: అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసిబిడ్డ రైలు పట్టాలపై అచేతనంగా పడి ఉన్నాడు. ఏ తల్లి కన్నబిడ్డో... ఆ తల్లిదండ్రులకు ఏం కష్టం వచ్చిందోగాని ఇలా పట్టాలపై పడేశారు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహం ఆదివారం లభ్యమైంది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కంట కాపల్లి – కొత్త వలస రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల మగ పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. బిడ్డ శరీరంపై లేత నీలిరంగు టీషర్ట్ ధరించి ఉంది. గుర్తు తెలియని రైల్లోంచి జారి పడిపోయిందా? లేక ఎవరైనా తెచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్ఐ రవివర్మ తెలిపారు. పసికందు ఆచూకీ తెలిసిన వారు విజయనగరం రైల్వే జీఆర్పీ పోలీసుల నుగానీ 9490617089, 9666555214 నంబర్లకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని పసికందు మృతదేహం -
అక్కా! అమ్మా,నాన్నను బాగా చూసుకో
సాక్షి,చిత్తూరు (కురబలకోట): అక్కా! అమ్మా..నాన్నను బాగా చూసుకో..–ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తి తన సోదరికి పంపిన సందేశం. రైల్వే పోలీసుల కథనం..మదనపల్లెలోని బయ్యారెడ్డి కాలనీకి చెందిన చిన్న వెంకట్రమణ కుమారుడు ఆర్.సుభాష్(27) డెహ్రాడూన్‌లోని సోలార్ ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అతని తల్లి లక్ష్మీదేవి (53) బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాధి ముదిరిందని అక్కడి డాక్టర్లు చెప్పారు. బుధవారం మళ్లీ బెంగళూరుకు తల్లిని తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ నుంచి సుభాష్ విమానంలో సోమవారం రాత్రి బెంగళూరు చేరారు. మదనపల్లె బస్టాండు చేరుకుని రాత్రి కడప బస్సు ఎక్కాడు. గుర్రంకొండకు టికెట్ తీసుకుని మార్గమధ్యంలోని కురబలకోట రైల్వేగేటు వద్ద దిగేశాడు. మంగళవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో తన అక్క శాంభవికి ఫోన్ చేశాడు. తాను కురబలకోట రైల్వేస్టేషన్ వద్ద ఉన్నానని అమ్మా..నాన్నను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఉదయం చూస్తే రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై శవమై కన్పించాడు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. సంఘటన స్థలంలో లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడిని గుర్తించారు.రైలు ఇతనిపై వెళ్లడంతో తల మొండెం వేరైంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, తల్లికి కాన్సర్ నయం కాదన్న మనోవేదనతో ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డెహ్రాడూన్‌లో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
ఆత్మహత్యాయత్నం: కాళ్లు పోయాయి.. ప్రాణాలు మిగిలాయి
సాక్షి, గుంటూరు (తాడేపల్లి రూరల్): నిండా ఇరవై ఏళ్లు కూడా పూర్తికాని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. పట్టాలపై ఉన్న యువకుడిని గుర్తించిన లోకో పైలట్లు షడన్ బ్రేక్ వేసి రైలు ఆపారు. అయినప్పటికీ యువకుడి రెండు కాళ్లూ తెగిపోయాయి. గాయపడిన యువకుడిని లోకోపైలట్లు అదే ట్రైన్లో విజయవాడ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.... ట్రైన్ నెం. 7222 (లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్) సోమవారం గుంటూరు వైపు నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్‌కు వస్తున్న సమయంలో కృష్ణాకెనాల్ జంక్షన్‌కు అరకిలోమీటరు దూరంలో ఓ యువకుడు రైలు పట్టాలమీద పడుకున్నాడు. దూరం నుంచి గమనించిన లోకోపైలట్లు హనుమంతరావు, రఘురామరాజు ట్రైన్ షడన్ బ్రేక్ అప్లయ్ చేశారు. సైరన్ కొడుతున్నప్పటికీ అతను ట్రాక్ పైనుంచి లేవలేదు. ట్రైన్ ముందు భాగంలోని సేఫ్టీ గ్రిల్ యువకుడ్ని పక్కకు నెట్టేసింది. యువకుడు పట్టాల పక్కకు రాగా, రెండుకాళ్లూ చక్రాల కిందపడి తెగిపోయాయి. వెంటనే లోకో పైలట్లు ట్రైన్ ఆపి యువకుడ్ని ఇంజన్ వెనుక పెట్టెలో ఎక్కించుకుని విజయవాడ తీసుకువెళ్లారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడ స్టేషన్లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన కాళ్లను కలిపేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు కాళ్లూ తొలగించారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు నులకపేటకు చెందిన పృధ్విగా తెలిసింది. -
రైలు పట్టాల పక్కన తీవ్రగాయాలతో బాలిక.. పడేశారా?
సాక్షి, పెద్దపల్లి: పొద్దున్నే పొలం పనులకు వెళ్తున్న రైతులకు రైలుపట్టాల పక్కన ఐదేళ్ల బాలిక ఏడుపు వినిపించింది. అటుగా వెళ్లిన గమనించగా. తీవ్రగాయాలతో రెండుకాళ్లు విరిగి అచేతనస్థితిలో పడి ఉంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న గొల్లపల్లి గ్రామశివారులో శుక్రవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైతులు రైల్వే గేట్మెన్ షామిమ్ సాయంతో పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా.. బాలికకు రెండుకాళ్లు మూడుచోట్ల విరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని ప్రథమ చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పడిందా.. పడేశారా? అయితే ఈ ఘటనపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక దివ్యాంగురా లని వైద్యులు తెలపగా.. రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడిందా..? లేదా ఎవరైనా తోసే శారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. రా మగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి ఘ టన స్థలాన్ని పరిశీలించారు. బల్లార్ష– కాజీపేట వైపు ఉదయాన్నే వెళ్లిన రైళ్లలోని ప్రయాణికులకు సమాచారం ఇచ్చేలా పోలీసులకు తెలిపారు. సాయంత్రం వరకు కూడా బాలికకోసం ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. -
Playing Chicken: పందెంకాసి రైలుకు అడ్డంగా నిలబడింది..
లండన్ : పందెం సరదా ఓ బాలిక ప్రాణం మీదకు తెచ్చింది. చావు తప్పినా.. చేసిన తప్పుకు పోలీసు కేసులు ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్షేర్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేంబ్రిడ్జ్షేర్కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక కొద్దిరోజుల క్రితం తన మిత్రులతో ప్లేయింగ్ చికెన్ పందెం కాసింది. ఈ పందెం ప్రకారం ఆమె రైల్వే ట్రాక్ మీద.. ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలబడాలి. రైలు చాలా దగ్గరకు వచ్చేంతవరకు ఎవరైతే పక్కకు తప్పుకోకుండా నిలబడతారో వారు విజయం సాధించినట్లు. బాలిక కూడా అలానే నిలబడింది. ఇది గమనించిన ఓ మహిళ బాలికను రక్షించటానికి ప్రయత్నించింది. అయితే, సదరు మహిళను కొట్టి అక్కడినుంచి పంపేసింది. తను రైలుకు అడ్డంగా నిలబడిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా డ్రోన్ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆ లోపే బాలిక రైలునుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బాలికను అరెస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘణ, దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా...
రాయ్‌పూర్: కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. మహాసముంద్–బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట కెనాల్ వంతెనపై రైలు పట్టాలపై పడి ఉన్న ఆరు మృతదేహాలను గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బెంచా గ్రామానికి చెందిన కేజవ్ రామ్ సాహు పొరుగూరు ముధెనాలోని రైస్ మిల్లులో కార్మికుడు పనిచేస్తున్నాడు. బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన కేజవ్‌రామ్ ఇంటి ఖర్చుల విషయమై భార్య ఉమా సాహు(45)తో గొడవపడ్డాడు. రాత్రి భోజనం తర్వాత అతడు నిద్రపోయాడు. భర్తతో జరిగిన తగవుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉమా సాహు, కుమార్తెలు అన్నపూర్ణ(18), యశోద(16), భూమిక(14), కుంకుం(12), తులసి(10)లను వెంట తీసుకుని అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రైల్వే వంతెనపైకి వెళ్లింది. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి వారంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. కనిపించకుండాపోయిన తన భర్య, కూతుళ్ల కోసం బుధవారం రాత్రే వెదికాననీ, ఉదయానికల్లా వారు తిరిగి వస్తారని భావించినట్లు కేజవ్ సాహు పోలీసులకు తెలిపాడు. కాగా, ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం భూపేశ్ బఘేల్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికీ జీవించే హక్కుంది -
పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో
సాక్షి, ముంబై: ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. అయితే శరవేంగా అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో రెప్పపాటు కాలంలో ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన వైనం పలువురి ప్రశంసంలందుకుంటోంది. సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 -
పట్టాలపై చిన్నారి..సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి
-
ఫేస్బుక్ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని..
సాక్షి, ఒంగోలు: తొమ్మిది నెలల క్రితం ఇద్దరు యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లక ముందే కులాంతర వివాహానికి అంగీకరించరేమో అనే ఆందోళన మొదలైంది. ఇరవయ్యేళ్లు కూడా నిండని ఆ యువ జంట రైలు పట్టాలపై నలిగి తనువు చాలించింది. నాలుగు రోజుల కిందట ఒంగోలు శివారు పెళ్లూరు సమీపంలో ఇదే తీరులో జరిగిన ఘటన మరువక ముందే అక్కడికి సమీపంలో మంగళవారం మరో జంట దేహాలు పట్టాలపై ఛిద్రమయ్యాయి. ఎన్నో ఆశలతో బిడ్డలను చదివిస్తున్న రెండు నిరుపేద కుంటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఒంగోలు శివారు కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొడుకు స్మార్ట్ ఫోన్ కావాలని గోల చేస్తుండటంతో మూడు నెలల కిందట సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో కొనిచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఫోన్‌తో సమయం గడుపుతున్న అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్బుక్లో పరిచయం అయింది. వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగినేని ఇందు కుటుంబం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నాగినేని పుల్లయ్య ఏడాది కిందట మరణించడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి సొమ్ము, తల్లికి వచ్చే పింఛనే ఆ కటుంబానికి జీవనాధారం. కొద్ది రోజుల కిందట ఓ యువతి తన కుమారుడికి తరచూ ఫోన్ చేస్తుండటం గమనించిన సుజాత కంగారు పడింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో విష్ణువర్దన్‌రెడ్డి ఆ ఫోన్‌ను కాస్తా పగలగొట్టాడు. కానీ స్నేహితుడి మొబైల్ నుంచి ఇందుతో టచ్‌లో ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్లి పెరుగు పాకెట్ తెస్తానని వెళ్లిన ఇందు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక వెదుకుతున్నారు. హాల్ టికెట్ ఆధారంగా గుర్తింపు.. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోలు బంకు వెనుక రైల్వే ట్రాక్‌పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మొండెం నుంచి తల వేరు అయిన స్థితిలో యువతి, పూర్తిగా ఛిద్రమైన యువకుడి మృతదేహంతో ఆ ప్రదేశం భీతావహంగా కనిపించింది. ఘటనా స్థలానికి సమీపంలో లభించిన హాల్ టికెట్ ఆధారంగా యువకుడు రైజ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిగా గుర్తించిన పోలీసులు కాలేజికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుడు కొప్పోలుకు చెందిన భవనం విష్ణువర్దన్‌రెడ్డి (19)గా నిర్ధారించారు. అతడి స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం మృతురాలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు(18) అని, వీరిద్దరికీ 9 నెలల కిందట ఫేస్బుక్లో పరిచయం అయినట్టు వెల్లడైంది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందు ఎక్కడి వెళ్లిందో తెలియక వెతుకుతూనే ఉన్నామని విష్ణువర్దన్‌రెడ్డితో ప్రేమలో ఉందనే విషయం తమకు తెలియదని ఆమె బంధువులు తెలిపారు. కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తూ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు టెన్త్ క్లాస్ విద్యార్థి దారుణం
సాక్షి, తాడిపత్రి: సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో తల్లి మందలించిందని ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాడిపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. తాడిపత్రిలోని ఆర్ఆర్ నగర్‌కు చెందిన తలారి సుబ్బరాయుడు, లక్ష్మి దంపతుల కుమారుడు తలారి శ్రీనివాసులు(17) పుట్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. కుమారుడు ఇటీవల ఎక్కువుగా సెల్‌ఫోన్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసులు సోమవారం ఉదయం పుట్లూరు రోడ్డు రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’
కోల్‌కతా: బిడ్డల కోసం తల్లి ఎంత సాహసానికైనా తెగిస్తుంది. వారు ప్రమాదంలో ఉన్నారంటే.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరి బిడ్డలను కాపాడుకుంటుంది. అందుకే దేవతలు సైతం అమ్మ ప్రేమను అనుభవించడం కోసం మానవ జన్మ ఎత్తుతారని అంటుంటారు. మనుషుల్లోనే కాక జంతువుల్లో కూడా అమ్మప్రేమ కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. బిడ్డ ప్రాణాలు కాపాడబోయి తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రసుత్తం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. బెంగాల్ అటవీ ప్రాంతంలో ‘గంగ’ అనే ఏనుగు ఉండేది. కొద్ది రోజుల క్రితం అది తన మందతో కలిసి సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. దీనిలో తన బిడ్డ కూడా ఉంది. గ్రామస్తులు తమ పొలాల్లోకి వచ్చిన ఏనుగుల మందను తరిమాడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఏనుగుల మందకు ఓ రైల్వే క్రాస్ లైన్ అడ్డు వచ్చింది. గంగ, దానితో పాటు వచ్చిన ఏనుగులు అన్ని రైల్వే లైన్‌ను దాటాయి. కానీ గంగ బిడ్డ మాత్రం పట్టాలపై చిక్కుకుపోయింది. ఎలా దాటాలో అర్థం కాక అలానే నిల్చుంది. ఇంతలో దూరంగా రైలు వస్తోన్న శబ్దం వినిపించింది. దాంతో బిడ్డను కాపాడ్డం కోసం గంగ పట్టాల మీదకు వెళ్లింది. బిడ్డను పట్టాలపై నుంచి బయటకు పంపింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన రైలు గంగను ఢీకొట్టింది. దాంతో అది అక్కడికక్కడే చనిపోయింది. This is Ganga elephant, photographed by Avijan Saha in North Bengal. Chased from fields, her herd encountered a railway line. They crossed on time, except her little calf. She died protecting him from the incoming train. We say we will die for our families. Elephants actually do. https://t.co/Op7YFyPqHv pic.twitter.com/izEFOvsi6z — Neha Sinha (@nehaa_sinha) March 11, 2021 ఈ క్రమంలో నేహా సిన్హా గంగ దాని బిడ్డ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘‘కుటుంబం కోసం ప్రాణాలిస్తాం అని మనం చెప్తాం. కానీ ఏనుగుల చేసి చూపుతాయి. ఇక గంగ, దాని బిడ్డను కొద్ది రోజుల క్రితం అవిజాన్ సాహా అనే ఉత్తర బెంగాల్ వ్యక్తి ఫోటో తీశాడు. అదే ఇది. బిడ్డ కోసం తన ప్రాణాలు కోల్పోయింది గంగ’’ అంటూ ఫోటో ట్వీట్ చేసింది. ఇది చూసిన వారంతా.. ‘‘మా గుండె పగిలిపోయింది.. కన్నీరాగడం లేదు.. ఈ ఘటన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి ‘నాకు సిగ్గేస్తుంది.. ఫోటోలు తీయొద్దని చెప్పు’ -
చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా?!
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూడటమే తప్ప రైల్వే ట్రాక్ ఇన్స్పెక్షన్ ఇంజినీర్ అవుతాననుకోలేదంటుంది కశిష్ శర్మ. రైల్వే లైన్స్, ట్రాక్స్ నిర్మాణంలో సాంకేతికతకు సంబంధించి రోజూ పది గంటల పాటు ఆన్సైట్లో ఉండి పరీక్షించే ఏకైక మహిళా తనిఖీ ఇంజినీర్ కశిష్. పది మంది మగవారు చేసే పని తానొక్కదాన్నే పూర్తిచేయగలను అనే ధీమాను వ్యక్తం చేస్తోన్న ఈ పట్టాలమ్మాయిని పరిచయం చేసుకుందాం... రైల్వే ట్రాక్స్ తనిఖీ చేసే ఇన్స్పెక్షన్ ఇంజినీర్ కశిష్ది రాజస్థాన్‌లోని అజ్మీర్. ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ (డబ్లు్యడిఎఫ్సి–వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీయిట్ కారిడార్) కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తోంది. జాబ్‌లో చేరి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. సైట్ వద్ద సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కిలోమీటర్ల దూరం నడుస్తుంది కశిష్. మూడు పదుల వయసున్న కశిష్ ఫీల్డ్‌లో పట్టిన చెమటలను తుడుచుకోవడం కంటే ఎక్సెల్ షీట్లను తయారు చేసే డెస్క్ ఉద్యోగానికి బాగా సరిపోతుంది. కానీ, ‘నేనెందుకు ఈ పని చేయలేను అనే పంతంతో ఎంచుకున్న ఉద్యోగం అది. ‘నిజానికి ఇది నా స్వభావానికి విరుద్ధమైన జాబ్. కానీ, ఒక అమ్మాయి మగవారు చేసే పని చేయలేదు అంటే మాత్రం ఊరుకోలేకపోయాను. సవాల్‌గా తీసుకున్నాను. చేసి చూపిస్తున్నాను’ అంటోంది కశిష్. ఈ జాబ్ గురించి మరింత వివరంగా మాట్లాడుతూ... ‘ఉద్యోగంలో చేరిన మొదట్లో సైట్‌కు పంపాలా వద్దా అనే విషయంపై ఆఫీసులో ప్రతి వారం చర్చలు జరిగేవి. ప్రతి వారం నేను బలంగా చెప్పేదాన్ని ‘నేను సైట్లో చేయగలను’ అని. ఈ రంగంలో నాకు అవకాశం ఇవ్వమని మా సీనియర్లను ఒప్పించాను. మొదటి అడుగు వేసే ముందు నేను పని చేసే బృందంతో మాట్లాడాను. సైట్లో ఉన్నంతసేపు ఒక మహిళగా చూడద్దు, నిపుణురాలిని మాత్రమే చూడాలని చెప్పాను. ఇప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరికి నా సామర్థ్యం ఏమిటో తెలుసు. 10 – 15 మంది మగవాళ్లు చేసే పనిని ఒక్కదాన్ని నిర్వహించగలను. అలా చేసినప్పుడు నువ్వు మా ‘కొడుకు’వి అని చెప్తారు. అదే బాధనిపిస్తుంది. చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా?! ఈ వృత్తిలో అమ్మాయిని చూసినప్పుడు దానిని జీర్ణించుకోవడం కష్టం. ముఖ్యంగా ఆమె కింద పని చేయాల్సిన వారికి మరీనూ. ఇది వారి తప్పు కాదు, ఎందుకంటే గతంలో అమ్మాయిలెవ్వరూ ఈ రంగంలో లేరు. వాళ్లు ఆడవారి నుంచి సూచనలు తీసుకోలేదు. ఇది మన సంస్కృతిలో అలా ఇమిడిపోయింది. కొంతకాలం ఇబ్బంది పడ్డారు. కానీ, నేను వారి మనస్తత్వాన్ని మార్చగలను అని నమ్మాను. సాధించాను. ఇంటర్వ్యూలో నన్ను అడిగారు.. ‘ఆన్సైట్లో కొన్ని గంటల పాటు ఉండటం వల్ల చర్మం నల్లబడుతుంది. వరుడు దొరకడు, పెళ్లి అవడం కష్టం’ అని. ‘చర్మం రంగు ఆధారంగా నన్ను వివాహం చేసుకున్న వారితో కలిసి ఉండటానికి ఎంతమాత్రం నాకు ఆసక్తి లేదు’ అని చెప్పడంతో ఈ ఉద్యోగం నన్ను వరించింది. హక్కులు.. గౌరవం తప్పనిసరి సైట్‌లోని కార్మికుల పిల్లల భవిష్యత్తును మెరుగుపర్చడానికి ఏం చేయాలా ఆలోచించాను. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వారికి చదువు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను నా హక్కులను, నా గౌరవాన్ని కాపాడుకుంటూ నా విధిని నిర్వర్తిస్తున్నాను. నేను ఎప్పుడూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపేదాన్ని. ఇస్రో పరీక్షకు అప్లై చేసుకున్నాను. అయితే, దానికి ముందే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అందుకు నా తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంది. సైట్లో వాష్‌రూమ్ కోసం నిజానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వాష్‌రూమ్‌లు సైట్లో ఉండాలనేది తప్పనిసరి నిబంధన. కాని కాంట్రాక్టర్ దీనిని ఏర్పాటు చేయడు. ఎందుకంటే ఇది మగ వాళ్లు పనిచేసే చోటు. నాకు వాష్‌రూమ్ అవసరమనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారికి 6 నెలలు పట్టింది. నన్ను వెనక్కి వెళ్లిపొమ్మన్న జనాలే ఉన్నారు అక్కడ. మొత్తానికి సాధించాను. కొంతమంది మద్దతు కోసం నేను చాలా పోరాడాల్సి వచ్చింది. మొదట అందరూ నన్నో గ్రహాంతరవాసిలా చూసారు. కొన్ని రోజుల పాటు నేను ఒంటరిగానే పని చేశాను. నా కింది వారు కూడా నన్ను తప్పించడానికి ప్రయత్నించారు. కానీ, నేను బలంగా నిలబడ్డాను. మద్దతు కోసం సోషల్ మీడియాలో పేజీని ప్రారంభించాను. ఈ పేజీని ప్రారంభించిన తరువాత, పాతిక మంది యువతులు రైల్వేలో ఈ జాబ్‌లోకి రావడానికి అర్హత ఏంటని నన్ను అడగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మహిళలు చేయలేరనే విభాగంలోకి ఎక్కువ మంది మహిళలు రావాలి. సమాజం మనలో నింపే భయాన్ని అడ్డుకోవాలి’ అని వివరిస్తుంది కశిష్. -
బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్
సాక్షి, ముంబై: హర్యానాలోని రోహ్తక్లో ఒక అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటేందుకు తొందరపడిన ఒక మహిళ అంతే చాకచక్యంగా ప్రాణాలను కాపాడుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. పట్టాలపై రైలు నిలిచి ఉండగా, దానికిందినుంచి పట్టాలను దాటేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ఇంతలో సిగ్నల్ లభించడంతో రైలు అకస్మాత్తుగా కదలడం ప్రారంభించింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన మహిళ బుర్ర శరవేగంగా పనిచేసింది. అనూహ్యంగా కదిలే రైలు కింద చిక్కుకుపోయిన ఆమె కదలకుండా రైల్వే ట్రాక్‌పై అలాగే పడుకుని ప్రాణాలను దక్కించుకుంది. కీలక సమయంలో గందరగోళానికి గురి కాకుండా సమయస్ఫూర్తిగా ప్రవర్తించిన వైనం ప్రశంసంలందుకుంటోంది. అయితే ఇలాంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని రైల్వేఅధికారులు కోరుతున్నారు. సంయమనం పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. -
ఇంటికి వస్తున్నానని చెప్పి అంతలోనే దారుణం..
దుబ్బాక టౌన్: ‘అమ్మా నేను ఇంటికొస్తున్నా.. బాధపడకు.. హైదరాబాద్‌లో దోస్తుల వద్దకు వెళ్లా.. ఈ రోజు వస్తున్నా’ అని తల్లికి ఫోన్ చేసి చెప్పిన కాసేపటికే ఓ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు విగతజీవిగా మారిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన శ్రీరాం రవిశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడు నవకాంత్ ఈ నెల 3న ఇంట్లో ఎవరికీ చెప్ప కుండా వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెతికి నా అతని ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో 5 రో జుల తర్వాత ఆదివారం అతను తల్లికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నా ఏం ఆందోళన చెందొద్దంటూ చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాయంత్రానికే అతను కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా రైల్వే పోలీసులు నవకాంత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంటికొస్తున్నా అని చెప్పిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ‘అయ్యో ఎంత పని చేస్తివి కొడుకా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి: చిత్తూరు యువకుడి విషాదాంతం ) -
ట్రాక్‌పై జల్సా.. ట్రైన్ రావడంతో
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరు టౌన్లో విషాదం నెలకొంది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తంగెళ్లముడికి చెందిన సిద్దూ(23), కొత్తపేటకు చెందిన భరత్(25), పవన్‌లు ఏలూరు బస్టాండ్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పైకి చేరుకొని గతరాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురూ రైలు వస్తున్న సంగతి మరచి ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో వారిపై నుంచి ట్రైన్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భరత్, సిద్దూలు మరణించగా.. పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
ట్రూ లవ్.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు
బెర్లిన్ : ప్రేమ అనేది మనుషులకు మాత్రమే కాదు జంతువులు, పక్షులకు కూడా ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తాజాగా దీన్ని నిజం చేసే సంఘటన ఒకటి జర్మనీలో చోటు చేసుకుది. ఆ వివరాలు.. రెండు హంసలు హై స్పీడ్ రైల్వే లైన్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఒక హంస ఒవర్‌హెడ్ పవర్ కేబుల్‌లో చిక్కుకుని మరణించింది. దాంతో మిగిలిన హంస రైల్వే ట్రాక్ మీదనే ఉండి చనిపోయిన భాగస్వామి శరీరాన్ని చూస్తూ.. బాధపడసాగింది. అధికారులు హంసను అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసినప్పటికి అది కదలలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలా చనిపోయిన హంసను చూస్తూ.. బాధపడుతూ.. సంతాప సూచకంగా అక్కడే ఉండిపోయింది. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు హంసను అలాగే ఉండనిచ్చారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి చనిపోయని హంస మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించడంతో జంట హంస కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ 50 నిమిషాల పాటు ట్రాక్‌పై రాకపోకలు సాగకపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ సంఘటనతో జంతువులు, పక్షులు కూడా ప్రేమ వంటి భావోద్వేగాలను కలిగి ఉండటమే కాక సున్నితంగా ఉంటాయని మరోసారి రుజువయ్యింది. అవి మనకంటే అధికంగా నొప్పిని అనుభూతి చెందుతాయిని నిరూపితమయ్యింది. అంతేకాక మనుషులు జంతువుల, పక్షులు వంటి మూగజీవుల పట్ల మరింత కరుణతో వ్యవహరించాలిన ఈ సంఘటన గుర్తు చేసింది. -
రెండేళ్ల బాలుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా!
-
రెండేళ్ల బాలుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా!
చండీగఢ్ : చావు అంచుల వరకు వెళ్లిన ఓ బాలుడు తిరిగి ప్రాణాలతో బయట పడ్డాడు. రైల్వే పట్టాలపై ఉన్న రెండేళ్ల బాలుడిపై రైలు వెళ్లినప్పటికీ దెబ్బలు తగలకుండా క్షేమంగా బతికాడు. ఈ అద్భుత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఫరీదాబాద్ సమీపంలోని బల్లాబ్గర్ రైల్వే స్టేషన్ ట్రాక్‌పై ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. ఆట మధ్యలో పెద్దవాడు రెండేళ్ల పిల్లవాడైన తమ్ముడిని ట్రాక్ మీదకు నెట్టి వేయడంతో అతడు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో ట్రాక్‌పై గూడ్స్ రైలు వేగంగా వస్తోంది. (25న షట్డౌన్కు రైతు సంఘాల పిలుపు) అయితే ట్రాక్‌పై పిల్లవాడిని గమనించిన రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేశాడు. కాగా అప్పటికే బాలుడి మీదగా ఇంజిన్ వెళ్లింది. ఇంతలో ఏం జరిగిందోనని భయంతో డ్రైవర్ అతని సహాయకుడు రైలు దిగి వచ్చి చూడగా అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి షాక్ గురయ్యారు. ఇంజన్ కింద చిక్కుకున్న పిల్లవాడుఎలాంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతన్ని డ్రైవర్ బయటకు తీసి తన తల్లికి అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు డ్రైవర్ సమయస్పూర్తిని ప్రశంసిస్తున్నారు. అంతేగాక స్థానిక డివిజనల్ రైల్వే మేనేజర్ లోకో పైలట్లకు రివార్డ్ ప్రకటించినట్లు రైల్వే అధికారి తెలిపారు. (బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి; అనేక మంది..) -
కుంగిపోయిన రైల్వే ట్రాక్.. తప్పిన పెను ప్రమాదం
-
కుంగిపోయిన రైల్వే ట్రాక్.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఫలక్నామా రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలో కురుస్తున్న వర్షాల ధాటికి ట్రాక్ కింద భూమి కుంగిపోయింది. దీంతో ఎనిమిది అడుగుల మేర గుంత పడింది. దీన్ని గమనించిన రైల్వే హోంగార్డు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో చోటుచేసుకుంది. అయితే ట్రాక్ కుంగిపోవడంతో అదే ట్రాక్‌పై వెళ్లాల్సిన గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. కరోనా కారణంగా ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు తిరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ఘటనపై విచారణ రైల్వే శాఖ అధికారులు చేపట్టారు. -
వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..!
సాక్షి, కామారెడ్డి: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం మాసాయిపేట బంగారమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరి మధురానగర్ కాలనీలో నివాసముండే సంగరాజు వెంకటయ్య కుమారుడు రవికుమార్ (30), లాలగూడా ప్రాతంలో ఉండే సంతోష (29)కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే.. సంతోషకు 9 సంవత్సరాల క్రితం శంకర్ యాదవ్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు కుమారులు ఉన్నారు. రవికుమార్‌కు సైతం వేరే మహిళతో వివాహం జరిగింది. కాగా.. వీరిమధ్య నడుస్తున్న అక్రమ సంబంధం విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో బైక్‌పై మాసాయిపేటకు వచ్చిన జంట.. రోడ్ పక్కన బైక్ నిలిపి రైలు పట్టాలపై పడుకోగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొనడంతో వారు మృతి చెందారు. కామారెడ్డి రైల్వే ఎస్సై తవు నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించారు. చదవండి: అక్క భర్తతో చనువు.. గర్భవతిగా మారి చివరకు..! -
వలస కార్మికులకు తప్పిన ఘోర ప్రమాదం
కోల్‌కతా: మహారాష్ట్రలో 14 మంది వలస కార్మికులను పొట్టన పెట్టుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే వీరిలాగే మరో 24 మంది వలస కార్మికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతూ ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘటన శనివారం పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు వలస వచ్చిన కూలీలు తమ స్వస్థలమైన జార్ఖండ్‌లోని సహిబ్‌గంజ్‌కు బయలు దేరారు. (మమత సర్కారు కీలక నిర్ణయం) అలా పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వీరు నల్హతి రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును గమనించలేదు. అయితే వీరిని గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వినియోగించి రైలును ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అక్కడి అధికారులు కార్మికులను సహాయ శిబిరాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎవరూ పట్టాలపై నడవద్దని కోరారు. (కూలీలను చిదిమేసిన రైలు) -
బావ పరిహాసం.. మరదలు మనస్తాపం
ముషీరాబాద్: బావ పరిహాసం ఆడటంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, గుర్తూర్ గ్రామానికి చెందిన శిరీషకు వరంగల్ రూరల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, ల్యాబర్తి గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. శిరీష బీటెక్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా, వినయ్‌కుమార్ చిక్కడపల్లి మోర్ సూపర్ మార్కెట్లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఇద్దరూ గాంధీనగర్‌లోని సాయిరాం అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరి ఇంట్లోనే ఈ నెల 14న వినయ్‌కుమార్ మేనకోడలు పెళ్లిచూపుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్ సోదరుడు శిరీషను ఉద్ధేశించి ‘ పెళ్లికాకముందు శిరీష ముఖం నల్లగా ఉండేదని, పెళ్లైన తరువాత తెల్లగా అయ్యిందని ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నావా’ అనడంతో అందరూ నవ్వారు. దీంతో ఆమె మనస్తాపానికిలోనైంది. ఇదే విషయంపై భర్తతో గొడవపడిన శిరీష మధ్యాహ్నం పుట్టింటికి వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లింది. వినయ్ ఆమెను వారించేందుకు గోల్కొండ క్రాస్‌రోడ్స్ వరకు వెళ్లి బతిమాలినా వినకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చాడు. అనంతరం శిరీష పుట్టింటికి వెళ్లకుండా తెలిసినవారి వద్ద రూ.100 తీసుకొని సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి వరంగల్ వెళ్లే రైలు ఎక్కింది. ఘట్కేసర్, బీబీనగర్ స్టేషన్ల మధ్య ఔషాపూర్ గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. అయితే శిరీష పుట్టింటికి చేరుకోలేదని తెలియడంతో ఆమె భర్త వినయ్ ఈ నెల 15న ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో భాగంగా మిస్సింగ్‌పై అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు గుర్తుతెలియని యువతి మృతదేహం విషయమై సమాచారం అందించడంతో ముషీరాబాద్ పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో భౌతికకాయాన్ని పరిశీలించారు. అనంతరం బంధువులకు సమచారం అందించడంతో వారు మృతురాలు శిరీషగా గుర్తించారు. కాగా అదనపు కట్నం కోసం వినయ్ కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని, అందులో భాగంగానే తక్కువ చేసి మాట్లాడటంతో మనస్తాపానికిలోనై శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే ట్రాకుపై నాలుగు మృతదేహాలు
-
హిందూపురం రైలు పట్టాలపై మృతదేహాలు..
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. హిందూపురం-బెంగుళూరు వెళ్లే రైలు మార్గంలో పట్టాలపై మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరు గోళాపురంకు చెందిన ఆదినారాయణగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ముకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపి రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ముగ్గురి మృతదేహాలు రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో పడి ఉన్నాయి. ఇదే రైలు మార్గంలో హిందూపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సూపర్ ఫాస్ట్ క్షణాల్లో పైకి దూసుకురావడంతో..
రామగుండం: ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతోపాటు మరికొంత మంది కార్మికులు రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దుర్గయ్యకు ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. -
పల్నాడులో కలకలం!
సాక్షి, గుంటూరు: జిల్లాలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ, బ్లాస్టింగ్ల కోసం అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు వినియోగించడంతో పాటు వాటిని సాధారణ ప్రజలకు విక్రయించడం వంటి వాటికి పాల్పడ్డారు. క్వారీల్లో బ్లాస్టింగ్లు సైతం అనుభవం లేని కార్మికులతో చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పలు ఘటనల్లో సుమారుగా 20 మందికి పైగా మృతి చెందినా మైనింగ్ మాఫియా మాత్రం ధనార్జనే ధ్యేయంగా అక్రమ బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ రెచ్చిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టీడీపీ మైనింగ్ మాఫియా వాసనలు మాత్రం పోవడం లేదు. మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గుండ్లకమ్మ, ప్రకాశం జిల్లా కురిచేడు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై డిటోనెటర్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ వెంబడి బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏఎన్ఎస్(యాంటీ నక్స్‌ల్స్ స్క్వాడ్), ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వు) బలగాలు డిటోనేటర్లు లభ్యమైన ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ నెల పదో తేదీన గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ పరిధిలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్ రైల్వే విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు పట్టాల లింక్‌లను సుత్తెతో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చి నిప్పురవ్వలు ఎగిసిపడి స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కొంత దూరంలో రెండు డిటోనేటర్లు కిరణ్ కంటపడ్డాయి. వాటిని జీఆర్పీ పోలీసులకు అందించి జరిగిన విషయాన్ని కిరణ్ తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రమాదం గతేడాది నవంబర్ 18న పల్నాడు ప్రాంతంలోని కోనంకి గ్రామంలో మైనింగ్ క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్లు పేలి ఓర్సు విష్ణు, కందులూరి తిరపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. తిరపతిరావుకు కళ్లు, రెండు చేతులు పోయాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ తరహాలో తరచూ పల్నాడు ప్రాంతంలో ఏదో ఒక మూలన పేలుడు పదార్థాలు లభ్యమవుతుండటం పరిపాటిగా మారింది. ఈ పేలుడు పదార్థాల సరఫరా, నిల్వల్లో పిడుగురాళ్ల, దాచేపల్లి లైమ్ స్టోన్ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ మైనింగ్ మాఫియా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేపడుతున్న సీబీసీఐడీ మిల్లర్లు, లారీ యజమానులు, డ్రైవర్లు, కూలీలను విచారించిందే తప్ప పేలుడు పదార్థాల సరఫరా, నిల్వ తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టలేదు. దీంతో నేటికీ గురజాల నియోజకవర్గానికి చెందిన మైనింగ్ మాఫియా సభ్యులు తెలంగాణా నుంచి పేలుడు పదార్థాలు తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ పరిధిలో లభ్యమైన డిటోనేటర్లు సైతం చుట్టుపక్కల మైనింగ్‌కు పాల్పడే వారికి సంబంధించినవే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో ప్రమాద ఘంటికలు నల్లమల అటవీ ప్రాంతం ఉన్న పల్నాడు ప్రాంతం నిన్నమొన్నటి వరకు మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటం, గతంలో వీరికి పేలుడు సామగ్రిని మైనింగ్ నిర్వహించే వారే సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. రాజధాని జిల్లాలో తరచూ పేలుడు సామగ్రి పట్టుబడుతుండటం రాజధాని భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ పేలుడు సామగ్రి అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే పెను విధ్వంసం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పల్నాడు సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న పేలుడు సామగ్రిపై దర్యాప్తు జరిపి చర్యలు చేపట్టకపోతే భద్రతకు పెను ప్రమాదం తప్పదని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు. -
'ఆగస్టు 15 నుంచి ట్రయల్ రన్'
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : బ్రాంచ్ రైల్వే లైన్లో డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి ట్రాక్‌పై ట్రయల్ రన్ నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం పి.శ్రీనివాస్ చెప్పారు. మోటూరు నుంచి ఆకివీడు వరకూ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకివీడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూలై 15 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా డబ్లింగ్, విద్యుద్ధీకరణ, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకూ ఆకివీడు స్టేషన్ పరిధిలో కొన్ని లైన్ల లింకులను కలుపుతామన్నారు. దీంతో మోటూరు–ఆకివీడు మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కొత్తలైన్‌పై ప్రయోగాత్మకంగా గూడ్స్ రైళ్ళను నడుపుతామని చెప్పారు. బ్రాంచి రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల అభివృద్ధికి ఆర్వీఎన్ఎల్ సంస్థ నిధులు విడుదల చేస్తుందన్నారు. గత బడ్జెట్లోనే ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కేటాయించిందని వెల్లడించారు. 2022కు బ్రాంచ్ లైన్ల డబ్లింగ్ పూర్తి 2022 నాటికి విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని పూర్తి చేస్తామని డీఆర్ఎం చెప్పారు. ఈ ప్రాంతంలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదనపు లైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్లు తదితర వాటిని నిర్మిస్తామన్నారు. డ్రెయిన్ నిర్మాణానికి ఆదేశం ఆకివీడులో రైల్వే కొలిమిలలో ముంపు నివారణకు పక్కా డ్రెయిన్లు నిర్మించాలని సంబంధిత ఏఈని డీఆర్ఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా కొలిమిలున్నాయని, వర్షం నీటితో ఇవి ముంపునకు గురై దోమలు, ఈగలు, పందుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు డీఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన స్పందించి వర్షం ముంపు నీటిని బయటకు మళ్లించేందుకు పక్కా డ్రెయిన్ నిర్మించాలని సూచించారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీఓఎం వి.ఆంజనేయులు, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్లానింగ్ మేనేజర్ మున్నా కుమార్, వరుణ్ బాబు, స్టేషన్ మాస్టర్ వి.మాణిక్యం ఉన్నారు. -
ప్రేమకథ విషాదాంతం
సాక్షి, అనంతపురం సెంట్రల్: అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్‌బాబు (30) ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపం చెంది ప్రేయసితో కలిసి కానిస్టేబుల్ వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వేట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన శాంతయ్య, కాంతమ్మ దంపతులకు మొత్తం నలుగురు సంతానం కాగా ముగ్గురు పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరు ఆర్మీ ఉద్యోగి. నాల్గవ కుమారుడైన రమేష్‌బాబు. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో అడుగుపెట్టాడు. మొట్టమొదటి పోస్టింగ్ వన్‌టౌన్ స్టేషన్‌కు కేటాయించారు. దాదాపు ఆరేళ్లుగా ఒకే పోలీసుస్టేసన్‌లో పనిచేస్తున్నారంటే విధి నిర్వహణలో ఆయన నిజాయితీ అర్థం చేసుకోవచ్చు. బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌గా మంచి సేవలందించాడు. స్టేషన్ పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా నిమిషాల్లో బ్లూకోల్ట్ సిబ్బంది స్థానంలో వెళ్లేవాడు. రమేష్‌బాబు పనితీరుకు గుర్తింపుగా పలుమార్లు ఉత్తమ పోలీసు అవార్డును ఎస్పీ అశోక్‌కుమార్‌చేతుల మీదుగా అందుకున్నారు. ఎంతో చలాకీగా పనిచేసే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. ఏనాడు కుటుంబసమస్యలను బయటకు చెప్పుకునే వాడు కాదు. జూన్ 5, 6 తేదీల్లో వివాహం కావాల్సి ఉంది. స్వగ్రామంలోనే శామ్యూల్, రాజమ్మ దంపతుల కుమార్తె సవితను రమేష్‌బాబు ప్రేమించాడు. అయితే వీరి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలపకపోవడం... పెద్దలు నిశ్చయించిన మరొక యువతితో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన రమేష్‌బాబు తన ప్రేయసితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. -
ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేష్.. అదే జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి రమేష్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రమేష్‌కు బలవంతంగా వేరే అమ్మాయితో వివాహం కుదుర్చారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్, ప్రియురాలితో కలిసి సోమవారం అర్థరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
కలిసి జీవించలేక..
సాక్షి, తాడిపత్రి అర్బన్: ఆమె పెళ్లయిన తర్వాత ప్రేమలో పడింది. అయితే కలిసి జీవించడానికి సమాజం ఒప్పుకోదని భావించి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నాలుగవ రోడ్డుకు చెందిన అఫ్రీన్(21)కు తాడిపత్రి మండలం మిట్టమీద కొట్టాలపల్లికి చెందిన హాజీవలితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఇదే కొట్టాలపల్లిలో నివాసం ఉంటున్న మంగలి నరసింహుడితో ఆమెకు చనువు ఏర్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మండల పరిధిలోని దర్గా ఉరుసులో పాల్గొనేందుకు హాజీవలి తన భార్య అఫ్రీన్‌తో కలసి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అఫ్రీన్ ప్రియుడు నరసింహుడితో కలసి దర్గా నుంచి తాడిపత్రికి వచ్చి స్త్రీశక్తి భవన్ వెనుక వైపున ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇద్దరిని బలితీసుకున్న పబ్జీ గేమ్
సాక్షి, ముంబై: ఆన్లైన్ వీడియో గేమ్ పబ్జీ పిచ్చి మహారాష్ట్రలో ఇద్దరు యువకులను బలితీసుకుంది. హింగోలి ప్రాంతంలో నాగేశ్ గోరే (22), స్వన్నిల్ అన్నపూర్ణ (24) అనే ఇద్దరు ఈ ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొంది. శనివారం సాయంత్రం ఖటకాళీ బైపాస్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వీరిద్దరూ మోటర్ సైకిల్‌పై వచ్చారు. ట్రాక్ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడసాగారు. ఆటలో నిమగ్నమైన వీరు అజ్మీర్–హైదరాబాద్ రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదు. రైలు డ్రైవర్ హార్న్ కొట్టినా పట్టించుకోలేదు. దీంతో వేగంగా దూసుకొచ్చిన రైలు ఇద్దరినీ ఢీ కొంది. అక్కడికక్కడే వారు మరణించారు. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడని...
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎన్నం సంపత్(24) మృతి అనుమానాస్పదంగా మారింది. డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడడం, ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోతున్నానని స్నేహితులకు ఎస్ఎంఎస్ చేసి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోం ది. మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్కలపేటకు చెందిన ఎల్కరి గణేష్ చెల్లి మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. శనివారం గణేష్ చెల్లిని చూసేందుకు అదే గ్రామానికి చెందిన స్నేహితులు ఎన్నం సంపత్, కూన సంతోష్, ఎల్కరి పురుషోత్తంతో కలిసి ఆటోలో వచ్చారు. ఆసుపత్రిలో గణేష్ చెల్లిని చూసిన తర్వాత నలుగురు కలిసి ఐబీ చౌరస్తాలో మద్యం తాగారు. అనంతరం సంపత్ ఇంటికి వెళ్లేందుకు చెన్నూర్ బస్ ఎక్కాడు. మిగతా స్నేహితులు పురుషోత్తం, సంతోష్‌లు గణేష్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సంపత్ కొద్దిక్షణాల్లోనే బస్సు దిగి బస్టాండ్ వద్ద తన స్నేహితులు ఉన్నారని గణేష్ వద్ద నుంచి ఆటో తీసుకుని వెళ్లాడు. ఐబీ నుంచి బస్టాండ్ వైపు వస్తూ ఆటోను అడ్డదిడ్డంగా నడిపాడు. దీంతో స్థానికులు గుర్తించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సంపత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. సంపత్ మద్యం తాగినట్లు 200 శాతం నిర్దారణ కావడంతో పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సంపత్ ఈ విషయాన్ని గణేష్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఈ క్రమంలోనే మరికొంత మంది స్నేహితులకు తాను చనిపోతున్నానని ఎస్ఎంఎస్ చేసి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రైలు పట్టాలపై శవంగా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సంపత్ కొద్ది గంటల అనంతరం రైలు పట్టాలపై శవంగా కనిపించాడు. చనిపోతున్నానని ఎస్ఎంఎస్ చేయడంతో ఆందోళనకు గురైన గణేష్ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. సంపత్ వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకుని, రేపు రమ్మని పంపివేసినట్లు పోలీసులు సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సంపత్ ఆదివారం ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఏ క్యాబీన్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబంలో విషాదచాయలు.. సంపత్ మృతితో ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ముల్కలపేటకు చెందిన ఎన్నం లింగయ్య– సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇందులో రెండో కుమారుడు సంపత్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులతో మంచిర్యాల వచ్చి అనుమానాస్పదంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కేసులో అసలు నిజాలు పోలీసులు దర్యాప్తు చేసి బయట పెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్నేహితులు ఏమైనట్లు.? సంపత్తో పాటు వచ్చిన స్నేహితులు సంతోష్, పురుషోత్తం పరారీలో ఉండడం, తాను చనిపోతున్నానని చెప్పినా గణేష్ పట్టించుకోకపోవడంతో మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడడంతో మనస్థాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా పురుషోత్తం, సంతోష్, సంపత్ మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు కలిసి మద్యం సేవించిన అనంతరం సంతోష్, పురుషోత్తం ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. మరోవైపు సంపత్ ఒక్కడే రైలు పట్టాల వైపు ఎందుకు వెళ్లాడు అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం తేలనుంది. -
పట్టాల మధ్యలో యువతి..
సాక్షి, జమ్మికుంటరూరల్: తీవ్రగాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఓ గుర్తు తెలియని యువతిని గమనించిన రైలు గార్డు సమయస్పూర్తితో వ్యవహరించి రైల్వే అధికారులకు అప్పగించిన సంఘటన ఆదివారం జమ్మికుంట పట్టణంలో జరిగింది. పట్టణ సమీపంలోని మడిపల్లి రైల్వే గేటు వద్ద తీవ్రగాయాలతో ఓ యువతి పట్టాల మధ్య పడి ఉంది. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్ష వైపు వెళ్తున్న గూడ్స్ రైలు గార్డు సదరు యువతిని గమనించి, డ్రైవర్‌కు సమాచారం అందించటంతో యువతిని రైల్వేస్టేషన్ రైల్వే అప్పగించారు. దీంతో అధికారులు 108కు సమాచారం అందించి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
1.5 కి.మీ భుజాలపై మోసి.. ప్రాణాలు కాపాడాడు
-
మొనతేలిన కంకరరాళ్లపై పరుగుపెడుతూ..
హోషంగాబాద్ : పోలీసులంటేనే కఠినాత్ములనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ వారు కూడా మనుషులే... వారికి మానవత్వం ఉందని నిరూపించుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా పగ్ధల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ బిల్లోరే అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ రైలు కింద నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన ఓ ప్రయాణికుడిని దాదాపు రెండు కిలోమీటర్ల మేర భుజంపై మోసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందించాడు. ఓవైపు భుజంపై బరువు, మరోవైపు మొనతేలిన కంకరరాళ్లపై పరుగుతీస్తూ ప్రయాణికుడికి సకాలంలో వైద్యం అందించాడు. దీంతో కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన అజిత్ (35) రైలులో ముంబైకి వెళుతుండగా ప్రమాదవశాత్తూ రైలు నుంచి కిందపడిపోయాడు. ప్రయాణికులు హెల్ప్‌లైన్ నంబర్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కొండ ప్రాంతం కావడంతో అంబులెన్స్ అక్కడకు చేరుకోలేకపోయింది. దీంతో కానిస్టేబుల్ పూనమ్ బిల్లోరే పట్టాలపై పడివున్న అజిత్‌ను భుజాలపైకి ఎత్తుకుని 1.5 కిలోమీటర్ల దూరంలో పగ్ధల్ రైల్వేస్టేషన్‌కు తీసుకు వచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. మరోవైపు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. -
వైద్యురాలి అనుమానాస్పద మృతి
బరంపురం: పట్టణ శివారు పంచమా రైల్వే గేట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. దీనిపై బరంపురం జీఆర్పీ పోలీసులకు సమా చారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్ సమీపంలో ఉన్న ఆధారాల ప్రకారం మృతి చెందిన యువతి కటక్ ఎస్డీబీ మెడికల్ కళా శాలలో వైద్యురాలిగా పని చేస్తున్న కుముదిని గా గుర్తించినట్లు తెలిపారు. యువతి వద్ద ఉన్న రైల్వే టికెట్ ఆధారంగా కటక్ నుంచి బరంపురం వస్తున్నట్లు గుర్తించామన్నారు. అయితే... మృతికి గత కారణాలు తెలియలేద ని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని జీఆర్పీ పోలీసులు వివరించారు. -
ఆమె ఎవరోతెలిసింది..!
కుత్బుల్లాపూర్: దేవరయాంజాల్ రైల్వే ట్రాక్ సమీపంలో దారుణ హత్యకు గురైన మహిళ ఆచూకీ ఎట్టకేలకు కనుగొన్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గురువారం రాత్రి ఈ హత్య జరగ్గా.. హతురాలిని గుర్తించాలని పోలీసులు స్థానికులను కోరగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. దీంతో సీఐ మహేశ్ ఆయా ప్రాంతాల్లో పది బృందాలతో ఆరా తీయగా హతురాలు జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉండే ఉప్పలూరి దుర్గ (30) గా తేలింది. ఈమెతో పాటు కుమారుడు, తల్లి ఉంటున్నారు. గురువారం సాయంత్రమే ఓ వ్యక్తితో దేవరయాంజాల్ సమీపానికి దుర్గ వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. వచ్చిన వ్యక్తితో మద్యం తాగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి చంపారా.. లేదా ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అన్న విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితమే భర్తతో విడాకులు.. దుర్గకు శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం కాగా మూడేళ్ల క్రితం గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందా.?, దుర్గ తాగుడుకు బానిసైందని, ఎవరైనా ఈమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా.. అన్న కోణంలో సైతం విచారణ వేగవంతం చేశారు. -
మహిళ దారుణ హత్య
తోపుడు బండి ఇస్తున్నారు.. వెళ్లి తీసుకువద్దామని అత్తకు చిన్న అల్లుడు ఫోన్ చేసి పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత అత్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రాత్రి అయినా జాడ లేకపోవడంతో ఆమె కుటుంబీకులు కంగారు పడ్డారు. తెల్లారేసరికి నైనవరం ఫ్లై ఓవర్ దిగువన రైల్వే ట్రాక్ వద్ద శవమై కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు రంగంలోకి దిగారు. వివరాలివీ.. చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ) : వించిపేట ఫోర్‌మెన్ బంగ్లా ప్రాంతానికి చెందిన షేక్ కరీమ, ఇస్మాయిల్ భార్యాభర్తలు. కరీమ (47) వంట చేస్తుండగా, ఇస్మాయిల్ తాపీ పనికి వెళ్తుంటాడు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, చిన్న కుమార్తె భర్త టిప్పుసుల్తాన్. కొద్ది కాలంగా టిప్పుకి కరీమకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరీమ తోపుడు బండి పెట్టుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. స్థానిక ప్రజా ప్రతినిధి వద్ద తోపుడు బండి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో టిప్పుసుల్తాన్ అత్త కరీమకు ఫోన్ చేసి తోపుడు బండ్లు ఇస్తున్నారు. తారాపేట వెళ్లాలని చెప్పాడు. దీంతో ఇంట్లో ఉన్న ఆధార్ కార్డు, ఇతర జిరాక్స్ కాపీలను కవరులో పెట్టుకుని బయలుదేరింది. అయితే ఏం జరిగిందో గానీ కొద్దిసేపటి తర్వాత కరీమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇంట్లో వారు కంగారుపడ్డారు. రాత్రి అయినా కరీమ ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారి ఇంట విచారించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం!.. బుధవారం ఉదయం నైనవరం ఫ్లై ఓవర్ దిగువన రైల్వే ట్రాక్‌కు పక్కగా కంకర రాళ్ల వద్ద ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన ట్రాక్‌మ్యాన్ వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అటు కొత్తపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఎండీ. ఉమర్, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ ముఖంపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సమాచారం అందుకున్న ఏడీసీపీ నవాబ్‌జాన్, వెస్ట్ ఏసీపీ సుధాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో మహిళ మృతదేహాన్ని చూసిన ఓ యువకుడు కరీమ కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు జాగిలం రైల్వే ట్రాక్ వెంబడి కొంత దూరం వెళ్లి మళ్లీ మృతదేహం వద్దకు చేరుకుంది. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. కుటుంబీకుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కరీమ చిన్న అల్లుడు టిప్పు సుల్తాన్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తల్లి లేకుండా ఉండలేనని ..
సాక్షి, నల్లగొండ క్రైం : ‘అమ్మ లేకుండా నేను జీవించలెను..అమ్మే నా ప్రాణం..మరికొద్ది గంటల్లో తల్లి మృతి చెందుతుందని మనస్తాపం చెందిన కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాజిపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి అలియాస్ ఇద్దమ్మ (65) పక్షవాతంతో మంచాన పడింది. నోటి మాట రావడంలేదు. మరణానికి దగ్గరలో ఉం ది. కొద్దిగంటల్లో ప్రాణం పోతుందని భావించిన కుమారుడు ప్రకాశ్ (30) తల్లి లేని జీవితం ఊహించలేనని ..అమ్మలేకుండా తాను బతకనని నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలోని 61కి.మీ వద్ద రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లి .. కుమారుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తల్లి ఇద్దమ్మకు చెప్పారు. దీంతో ఆమె మంచంలోనే ప్రాణం విడిచింది. అమ్మలేకుండా బతకలేనని.. ప్రకాశ్ ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచూ తన అమ్మ అనారోగ్యంపై చర్చించేవాడని స్నేహితులు తెలిపా రు. అమ్మలేకుండా బతకలేనని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోజువారీగా శనివారం ఉదయం ఇంటి పనుల డబ్బుల తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. రైలుపట్టాలపై ప్రకాశ్ మృతిచెందడాన్ని గమనించిన సమీప రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇద్దమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దమ్మకు కుమారుడు,కుమార్తె కుమార్తెకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల క్రితం ఆమె భర్త చెట్టుపై నుంచి మరణించాడు. ఆ ఇంటికి ప్రకాశ్ ఒక్కడే ఆధారం. ఇప్పుడు తల్లితోపాటు అతనూ మృతిచెందడంతో ఒక్కదాన్ని చేసి వెళ్లిపోయారా అంటూ సోదరి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. -
రెలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్–కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ల మధ్య గల క్రాస్‌లైన్‌లో ట్రైయిన్ వాషింగ్ సైడ్ వద్ద శుక్రవారం ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాజీపేట జీఆర్పీ ఎస్ఐ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట విష్ణుపురికి చెందిన సుమారు 32 ఏళ్ల వయస్సు గల వన్నాల రాజు హన్మకొండలోని ఒక హోటల్లో వేటర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా రాజు మద్యానికి అలవాటుపడి తరచుగా ఇంట్లో గొడవ పడుతుండేవాడు. 20 రోజుల క్రితం గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నాకి పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య ఓటు వేయడానికి వెళ్లగా రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీ ఎం ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
వైరల్ : భూమ్మీద నూకలుండటం అంటే ఇదే..!
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్.. మరి అదృష్టం బాగుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. వెంట్రుకవాసిలో మృత్యువుని తప్పించుకున్న ఓ సైక్లిస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైల్వే లైన్ల వద్ద భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతుంది ఈ సంఘటన. నెదర్లాండ్‌లో జరిగింది ఈ సంఘటన. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో తెలుపుతూ ఓ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ సైకిలిస్టు రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఓ వైపు నుంచి రైలు వస్తుందని అక్కడే ఆగాడు. అది వెళ్లిపోయాక ట్రాక్ దాటుతున్నాడు. అదే సమయంలో మరో ట్రాక్ పైనుంచి దూసుకొస్తున్న రైలును ఆ సైక్టిస్ట్ చూసుకోలేదు. దీంతో సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్లాడు. రైలు చాలా సమీపంలోకి వచ్చేంతవరకూ సదరు సైక్లిస్ట్ దాన్ని గమనించలేదు. చూసిన వెంటనే అప్రమత్తం కావడంతో కేవలం అర సెకన్ వ్యవధిలో మృత్యువుని తప్పించుకోగలిగాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది చూశారు. వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తి అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు. -
కేరళ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: చెన్నై, సెంట్రల్ రైల్వేస్టేషన్లో కేరళ ప్రేమజంట మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది. కేరళ రాష్ట్రం, ఎర్నాకుళం జిల్లా కూట్టుమడం ప్రాంతానికి అభిజిత్ (19) ఎర్నాకుళంలోగల కళాశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో చదువుతుండగా ఎర్నాకుళం జిల్లా నెల్లికుళికి చెందిన రూష్ణాపూసల్ (19)తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపినట్లు సమాచారం. దీంతో ఇరువురూ గత వారం ఇంటి నుంచి పరారయ్యారు. చెన్నై చేరుకున్న ఇరువురూ బసచేసేందుకు వీలులేక చెన్నై రైల్వేస్టేషన్లో గడిపారు. తాము తెచ్చుకున్న నగదు ఖాళీ కావడంతో ఆహారం లేకుండా అవస్థలు పడ్డారు. మంగళవారం రాత్రి చెన్నై సబర్బన్ రైల్వేస్టేషన్ 16 నంబర్ ప్లాట్‌ఫాంపై క్రిమిసంహారక మందు తాగి స్పృహ తప్పారు. అక్కడ రాత్రి గస్తీ తిరుగుతున్న ఆర్పీఎఫ్ పోలీసులు గమనించి ఇద్దరిని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ గటనపై సెంట్రల్ రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పట్టాల మధ్య పడుకున్నాడు.. పైనుంచి రైలు వెళ్లింది
సాక్షి, అనంతపురం : అనంతపురం రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. అటువైపు ఉన్న ఫాట్‌ఫామ్‌పైకి వెళ్లేందుకు.. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి వెళ్లేందుకు ఓ ప్రయాణీకుడు ప్రయత్నించాడు. ఇంతలో గూడ్స్ రైలు కదలడంతో.. పట్టాలపైనే ఉండిపోయాడు. గూడ్స్ రైలు వెళ్లిపోయిన తర్వాత అమ్మయ్య అంటూ పట్టాలపైనుంచి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాడు. దాంతో గూడ్స్ రైలు వెళ్లేదాకా ఊపిరి బిగబట్టి చూసిన మిగతా ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది.. ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. -
బుల్లెట్ రైలు పక్కన పట్టాలపై కూర్చోండి!
టోక్యో: జపాన్‌కు చెందిన బుల్లెట్ రైలు కంపెనీ షింకన్సేన్ వినూత్నమైన శిక్షణ విధానాన్ని అమలుచేస్తోంది. బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే.. అవి వెళుతున్న మార్గంలోని టన్నెల్స్‌లో పట్టాల పక్కన ఉద్యోగుల్ని కూర్చోబెడుతోంది. రైళ్ల నిర్వహణ, భద్రత విభాగంలో పనిచేస్తున్న 190 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రస్తుతం ఈ తరహా శిక్షణ ఇస్తోంది. వేగంగా వెళ్లే బుల్లెట్ రైలు పక్కనే తమను కూర్చోబెట్టడంపై పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంపెనీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో షింకన్సేన్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘మా నిర్వహణ సిబ్బందికి వారి విధుల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా భద్రతాపరమైన అంశాలకు మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శిక్షణపై కంపెనీ వెనక్కు తగ్గబోదు. 2015లో ఓ ప్రమాదం కారణంగా బుల్లెట్ రైలు బయటిభాగం ఊడిపోవడంతో వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఈ శిక్షణను ప్రారంభించింద’ని తెలిపారు. షింకన్సేన్ సంస్థ తయారుచేసిన రైళ్ల కారణంగా గత 50 ఏళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ప్రస్తుతం భారత్‌లోని ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఈ కంపెనీయే చేపడుతోంది. -
బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు
-
ప్రమాదాలా.. ఆత్మహత్యలా?
మదనాపురం (కొత్తకోట) : మండలంలోని కొన్నూర్ రైల్వేస్టేషన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గత కొంతకాలంగా రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని చాలామంది గ్రామస్తులు చనిపోతున్నారు. రైలు కిందపడి చనిపోయేవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. చాలా వరకు చనిపోవాలనుకున్న వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అయితే మరికొందరు ప్రమాదవశాత్తే చనిపోతున్నారని రైల్వేట్రాకు గ్రామ మధ్యలో ఉండడమే దీని ప్రధాన కారణమని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఏటా పదుల సంఖ్యలో మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డులో ట్రాకు.. ప్రధానంగా గ్రామం నడిబొడ్డున రైల్వేట్రాకు ఉండడంతో గ్రామంలో రాకపోకలు సాగించే గ్రామస్తులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బీసీకాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకురావాలంటే రైల్వే ట్రాకు దాటాల్సిందే. ఈ క్రమం లో చిన్నపిల్లలు, వృద్దులు, యువకులు, ప్రతిఒక్కరూ ట్రాకు దాటి వెళ్తారు. ఈ ట్రాకు దాటే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలకు గురికాక తప్పదు. గత కొన్నేళ్ల తరబడి రైలు ప్రమాదాలకు గ్రామస్తులు గురై చనిపోతున్నారు. ఏడాదిలో కనీసం పదిమంది చనిపోతుంటారు. అలాగే గొర్రెలు, మేకలు, పశువులు రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కాంపౌండ్‌కు నోచని స్టేషన్ రైల్వేస్టేషన్ పరిధి ఉన్నంత వరకు ప్లాట్‌ఫాం గుండా కాంపౌండ్ వాలు నిర్మాణం చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అడ్డగోలుగా ట్రాకు దాటకుండా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామస్తులకు నడక వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భర్త పెట్టే టార్చర్ భరించలేక...
సాక్షి, ముంబై: భర్త పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన చంటి బిడ్డతోసహా రైల్వే ట్రాక్ మీదకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. డ్రైవర్ అప్రమత్తం అయ్యేలోపే ఘోరం జరిగిపోయి ఆ తల్లీకూతుళ్లు నలిగిపోయారు. థానే జిల్లా భాయందర్ రైల్వే స్టేషన్లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగో ఫ్లాట్ ఫామ్‌పై తన కూతురిని ఎత్తుకుని ఆ మహిళ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. రైలు దగ్గరికి రాగానే ఒక్కవేటున దూకేసింది. అది గమనించిన డ్రైవర్ బ్రేకులు వేయగా.. అప్పటికే ఆ తల్లీకూతుళ్లు రైలు చక్రాల కింద పడి నలిగిపోయారు. ఆనవాళ్ల ఆధారంగా మృతులను రేణుకా పింటూ(24), ఆరోహి(2)గా నవఘడ్ పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజీల్లో ఆ షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. భర్త వేధింపులు తాళలేకనే ఆమె బిడ్డతో సహా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుల్లెట్ బండి కొనటానికి డబ్బులు తేవాలంటూ ఆమెను భర్త ఏడాదిగా హింసిస్తున్నాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని రేణుకా తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుతో రేణుకా భర్త రాహుల్ పింటూ సింగ్ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. -
పైన రైలు.. కింద రైమ్‌లు
ఫుట్‌పాత్‌ల మీద సంతలు! సంతల్లో బడి! బడిలో పంచాయతీలు! పంచాయతీల్లో ప్రాథమిక ఆసుపత్రులు! ఇదీ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా! అద్భుతమైన, నమ్మశక్యం కాని భారతదేశం. వ్యంగ్యంగానే అనిపించి ఉండొచ్చు మీకిది. అయితే రాజేష్ శర్మ లాంటి వాళ్లు నిజంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా అనిపించేలా చేస్తున్నారు. రాజేష్ శర్మ ఢిల్లీలో ఉంటాడు. ఆ మహానగరంలోని వలస జనాభాకు మెట్రో బ్రిడ్జీల కింది ప్రదేశాలు కూడా నివాసాలే. అలా మెట్రో పిల్లర్స్ కింద వీధుల్లో ఉంటున్న పిల్లలను అప్పుడప్పుడూ పలకరిస్తూ వాళ్లకు చాక్లెట్లో, బట్టలో కొనిస్తూ ఉండేవాడు రాజేష్. అతనెప్పుడు వెళ్లినా ఆ పిల్లలంతా చదువూసంధ్య లేక ఆడుకుంటూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కనిపించేవారు. ఆ పిల్లల కోసం ఏదో తెస్తున్నాడు. ‘అయితే అది కరెక్ట్ కాదేమో! ఆ పిల్లల జీవితాలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలి. అది కరెక్ట్’ అనుకున్నాడు. ఒకరోజు వెళ్లి వాళ్ల రోజూవారీ కార్యక్రమాల గురించి ఆరా తీశాడు ఆ పిల్లల దగ్గరే. చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. తల్లిదండ్రులకు పని ఉన్న రోజు వాళ్లకు తిండి దొరుకుతుంది.. లేదంటే పస్తులే. అవసరమనుకుంటే ఆ పిల్లలూ చిన్నాచితకా పనులకు వెళ్లి చిల్లర తేవాల్సిందే. అది తెలిసి ఆయనకు బాధ కలిగించింది. ఆ పిల్లలకు చదువు లేదు. చదువు చెబితే జీవితం చక్కబడుతుంది అనిపించింది. ఆ పిల్లల్లో పెద్దగా ఆసక్తి కనపడలేదు. అయినా తెల్లవారి నుంచే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఊడ్చుకుని.. తుడ్చుకుని ఉద్యోగం అయిపోగానే సాయంత్రం సరాసరి ఆ పిల్లలుండే మెట్రో రైల్వే బ్రిడ్జికిందికి వచ్చాడు రాజేశ్. అతను రాగానే పిల్లలందరూ మూగారు.. చాక్లెట్లు, బట్టలకోసం. ఇచ్చాడు. తీసుకొని వెళ్లిపోయారు. అయినా అతను అక్కడే ఉండి.. ఓ చోటు చూసి.. దాన్ని ఊడ్చి, తుడిచి శుభ్రం చేశాడు. రైమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలంతా తమాషా చూస్తున్నట్టుగా నవ్వసాగారు. గేలి చేశారు. పట్టించుకోకుండా ఓ గంట అలాగే ఇంగ్లిష్, హిందీ పద్యాలు చెప్పి వెళ్లిపోయాడు. రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. వారం రోజులకు ఆ పిల్లల్లో ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చి బుద్ధిగా కూర్చుని ఆయన చెప్పేది వినడం మొదలుపెట్టారు. తెల్లవారికి ఇంకొంతమంది పిల్లలు చేరారు. రాజేష్‌లో ఉత్సాహం పెరిగింది. ఇంకో వారం గడిచేసరికి ఆ బ్రిడ్జి కిందున్న పిల్లలంతా చేరారు. పుస్తకాలు, నోట్‌బుక్స్ తెచ్చాడు. పెన్సిళ్లు, పెన్నులు, పలకలు, బలపాలూ ఇచ్చాడు. సీరియస్‌గానే చదువు సాగింది. రైల్వే బోర్డ్.. బ్లాక్ బోర్డ్ రాజేష్ చేస్తున్న పని ఢిల్లీ మెట్రో రైల్వే సిబ్బంది దృష్టికీ వచ్చింది. ముచ్చట పడి.. ఆ బ్రిడ్జి కింద బ్లాక్‌బోర్డ్‌ను అమర్చింది. ఆ సహాయంతో రాజేష్ తన ఇతర స్నేహితులనూ కలుపుకొని లెక్కలు, సైన్స్‌కూడా బోధిస్తున్నాడిప్పుడు. అంతేకాదు.. ఢిల్లీలోని యువతకూ సందేశమిచ్చాడు.. తమ ఖాళీ సమయాల్లో తమకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని మెట్రో బ్రిడ్జీల కింద వీధి బాలలకు చదువు చెప్పాలని. మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇది ఓ ఉద్యమంలా మొదలైంది. ‘‘నా ఈ చిన్న ప్రయత్నం ఇంత మంచి కార్యక్రమంగా మారుతుందని కలలలో కూడా ఊహించలేదు. మెట్రో వాళ్లు ఆబ్జెక్షన్ చెప్తారేమోనని చాలా కాలం భయంభయంగానే.. క్లాసులు చెప్పా. కాని బ్లాక్‌బోర్డ్ పెట్టి వాళ్లు నన్ను ప్రోత్సహించారు. థ్యాంక్స్ టు ఢిల్లీ మెట్రో’’ అంటూ కృతజ్ఞతలు చెప్తాడు రాజేష్ శర్మ. ఆయన్నుంచి మనం నేర్చుకోవలసింది నేర్చుకుంటే, మనం నేర్పవలసింది నేర్పుతాం. – శరాది -
రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
మంచిర్యాలక్రైం: కాజీపేట బల్లార్షాల మధ్య రైల్వేలైన్ల మరమ్మతు కారణంగా మంగళవారం, బుధవారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారం ప్రయాణికులకు తెలియకపోవడంతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మంగళవారం వచ్చిన వారంతా ఇబ్బందులుపడ్డారు. రైళ్ల రద్దు దృష్ట్యా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, వరంగల్ ప్రయాణికులకోసం అదనపు బస్సులు నడపకపోవడంపై జనం మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్, కాజిపేట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వేస్టేషన్ వరకు వచ్చి నానాతంటాలుపడ్డారు. నాగ్‌పూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్లోనే హోటళ్ల నుంచి భోజనం తెప్పించుకొని వేచి ఉండాల్సి వచ్చింది. రద్దయిన రైళ్లు... కాజిపేట్, బల్లార్షాల మధ్య చేపట్టిన రైల్వేలైన్ల మరమ్మతులో భాగంగా మంగళ, బుధవారం రెండురోజులపాటు కాజీపేట నుంచి బల్లార్షాలమధ్య నడిచే రామగిరి ప్యాసింజర్‌ను రద్దుచేశారు. భద్రాచలంరోడ్డు, బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్‌ను, భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య నడుపుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట వరకే నడుపుతున్నారు. కాజీపేట నుంచి నాగ్‌పూర్ మధ్య నడిచే అజ్నీ నాగ్‌పూర్ ప్యాసింజర్‌ను రామగుండం వరకే నడిపిస్తున్నారు. మంచిర్యాల నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రెండురోజులపాటు ఇంటర్సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, నాగ్‌పూర్ అజ్నీ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఒకేఒక్క రైలు... కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఒకేఒక్క కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులందరూ సాయంత్రం వర కు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో పడిగాపులు కా యాల్సి వచ్చింది. నాగ్‌పూర్ వైపు, హైదరాబాద్ వైపు వెళ్లే మిగతా రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి అనుకూలమైన రైళ్లు ప్రధానంగా రద్దుకావడంతో జిల్లాలో జన్నారం, కోటపెల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ప్రయాణికులతో రైలు నిండింది. అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా.. రైళ్లు రద్దు కావడంతో అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా. వరంగల్‌లో మా అన్నయ్యది పెళ్లి ఉంది. మా అమ్మనాన్నలు అందరూ వెళ్లారు. నేను తమ్ముడు ఇద్దరం ఈ రోజు ఇంటర్సిటీకి వెల్దామని ఆగినం. నీల్వాయి నుంచి సుమారు 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. రైళ్లు రద్దు అయ్యాయని చె ప్పారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సరిపడా డబ్బు లేదు. – రవళి, నీల్వాయి -
బైక్ డ్రెయినేజీలో.. శవం రైలు పట్టాల పక్కన
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. యువకుడి బైక్ డ్రెయినేజీలో, యువకుడి రక్తం రైలు పట్టాల పక్కన కంకరపై, మృతదేహం రైలు ట్రాక్‌కు సమీపంలో పడి ఉండటంపై అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆ యువకుడు రైలు ఢీకొని చనిపోయాడని సివిల్ పోలీసులు, డ్రెయినేజీలో పడ్డాకే యువకుడు చనిపోయాడని, కేసు మాది కాదంటే మాది కాదని సివిల్, రైల్వే పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రైల్వే ఎస్ఐ ప్రణయ్‌కుమార్ యువకుడు రైలు ఢీకొని చనిపోలేదని మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు. నాల్గొటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాల్గోటౌన్ ఎస్ఐ–2 చాందయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నగరంలోని ముబారక్‌నగర్ తారక్‌నగర్‌కు చెందిన గురువప్పా వంశీధర్(23) శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. శనివారం తెల్లవారుజామున మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు. బైక్ ఎల్మమ్మగుట్ట సోని ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే రోడ్డు పక్కనున్న పెద్ద డ్రెయినేజీలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న వంశీధర్ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. వంశీధర్‌తో ఉన్న స్నేహితుడు వెళ్లిపోయాడు. అనంతరం గంట తర్వాత స్థానికులు అక్కడ చూడగా వంశీధర్ రైల్వే ట్రాక్‌కు సమీపంలో మృతిచెంది ఉండటంతో అవాక్కయ్యారు. ఈ విషయంపై స్థానికులు నాల్గోటౌన్ పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. యువకుడు ముబారక్‌నగర్ తారక్‌నగర్‌కు చెందిన వాడుగా గుర్తించారు. దాంతో పోలీసులు తారక్‌నగర్‌కు వెళ్లి వంశీధర్ ఫొటోను చూపిస్తే అక్కడివారు గుర్తించి వంశీధర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వంశీధర్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గోటౌన్ ఎస్ఐ తెలిపారు. -
పుట్టెడు దుఃఖం
విశాఖ క్రైం: పనికి వెళ్లి తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లికి కుమారుడు శవమై కనిపించి పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చాడు. పుట్టిన రోజు నాడే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిన కొడుకుని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. నక్కపల్లి మండలంలో రైలు పట్టాలపై శుక్రవారం అనుమానాస్పదంగా మృతిచెందిన తాపీమేస్త్రి సదాశివం(34)ను కారులో అక్కయ్యపాలేనికి తీసుకురావడం కలకలం రేపింది. పోలీసులు, బంధువులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. అక్కయ్యపాలెం 80 అడుగుల రహదార గవర తాటిచెట్లపాలెంలో మారగలో సదాశివం(34) ఉంటున్నాడు. తాపీమేస్త్రి పని చేస్తుంటాడు. ఇతని భార్య మోహన్లత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో భార్య దూరంగా ఉంటున్నాడు. ఇద్దరు కొడుకులు అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే చనిపోయారు. దీంతో అప్పటి నుంచి సదాశివం తల్లి నూకరత్నం వద్ద ఉంటున్నాడు. స్థానికంగా తోటి పనివాళ్లతో కలిసి దూరప్రాంతాలకు పనికి వెళ్తుంటాడు. ఇదే మాదిరిగా గత బుధవారం నక్కపల్లి నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న బోదిపాలెం ప్రాంతానికి పనికి వెళ్లాడు. అక్కడ పనికి తీసుకువెళ్లిన కాంట్రాక్ట్‌ర్‌ను మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే చనిపోతానని బెదిరించాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తోటి వారు పని చేస్తుండగా.. ఇక్కడికి కాస్త దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాడు. ఇలా రెండు, మూడు సార్లు వెళ్లిరావడాన్ని తోటి పని వారు గమనిస్తున్నారు. అటుగా రైలు వస్తున్న సమయంలో తల ముందు పెట్టడంతో ఢీకొని వెళ్లిపోయింది. దీంతో అక్కడక్కడే మృతి చెందాడు. విషయం పోలీసులకు తెలిస్తే కేసు అవుతుందని భయపడి తోటి పనివారు ఇంటికి తరలించాలనే కంగారులో మృతదేహన్ని సంచిలో కట్టి అక్కడ నుంచి అద్దె కారులో నగరానికి ఇంటికి తీసుకువచ్చారు. కారులో మృతదేహాన్ని దించడాన్ని స్థానికులు గమనించారు. మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించ్చేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఏమైందని ఆరా తీసి తీసుకోవడానికి నిరాకరించారు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బం ది అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని తీసుకు వచ్చిన నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నక్కపల్లి పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి పట్టా లపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు
-
భార్యను దారుణంగా హత్యచేసి రైల్వేట్రాక్‌పై పడేసిన భర్త
-
రైళ్లకు కొత్త పట్టాలు.!
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో తొలిసారిగా భారతీయ రైల్వే భారీ కసరత్తు మొదలుపెట్టింది. రైల్వే ట్రాక్‌ను సమూలంగా మార్చే పనిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో మన దేశంలోనూ రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా దశలవారీగా 65,000 కి.మీ. (ఇందులో దక్షిణ మధ్య రైల్వే 6,200 కి.మీ.) ట్రాక్‌ను పూర్తిగా మార్చనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.800 కోట్లతో 300 కి.మీ. మేర ట్రాక్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుదిరితే లక్ష్యాన్ని మించి పనులు చేపట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం కొత్త ట్రాక్ కనిపించనుంది. కేవలం పట్టాలు మాత్రమే కాకుండా.. వాటి దిగువన ఉండే స్లీపర్లను కూడా కొత్తవి ఏర్పాటు చేస్తారు. గతంలోని ఇనుము, చెక్క స్లీపర్లను తొలగించి కాంక్రీట్ స్లీపర్లు బిగిస్తున్నారు. వాటితోపాటు క్లాంప్స్, క్లిప్స్, స్విచ్చెస్ వంటివన్నీ కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల లూప్లైన్లు, యార్డుల్లోని మెరుగైన పట్టాలను తొలగించి వేరే చోట ఏర్పాటు చేస్తున్నారు. 20–30 కి.మీ. పెరగనున్న రైళ్ల వేగం ఇటీవల రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన హమ్‌సఫర్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఇప్పటికిదే భారత రైల్వేలో అత్యధిక వేగం. ఇంతకుముందు ప్రవేశపెట్టిన శతాబ్ది, దురంతో, రాజధానిలాంటి ప్రీమియం కేటగిరీ రైళ్ల గరిష్ట వేగం కూడా 160 కి.మీ. అయినా.. వాస్తవానికి అవి 140 కి.మీ. మించి పరుగుపెట్టడం లేదు. ట్రాక్ సరిగా లేకపోవటమే అందుకు కారణం. ప్యాసింజర్ రైళ్ల వేగం సామర్థ్యం 120 కి.మీ. కానీ వాస్తవ సగటు వేగం 60 కి.మీ. మాత్రమే. ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 130 కి.మీ. ప్రయాణించాల్సి ఉన్నా వేగం 75 కి.మీ. దాటడం లేదు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 150 కి.మీ. వరకు పరుగుపెట్టే అవకాశం ఉన్నా.. 80 కి.మీ. మించటం లేదు. ఇప్పుడు కొత్త ట్రాక్ వేస్తే ఇవి గరిష్ట వేగాన్ని అందుకోనున్నాయి. అదనంగా గంటకు 20–30 కి.మీ. పెంచబోతున్నారు. అంటే తొలిసారిగా మన దేశంలో రైళ్లు గంటకు 190 కి.మీ. వరకు పరుగుపెడతాయన్నమాట! తగ్గనున్న ప్రమాదాలు పట్టాలు అవసాన దశకు చేరుకోవటంతో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి పట్టా విరిగి రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. కొత్త పట్టాల ఏర్పాటుతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం 250 మీటర్ల పొడవున్న పట్టాలను ఏర్పాటు చేసి వెల్డింగ్ ద్వారా వాటిని జోడిస్తున్నారు. ఎండాకాలంలో పట్టాల వ్యాకోచం వల్ల అతుకులు ఊడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కిలోమీటరున్నర నుంచి రెండు కిలోమీటర్ల పొడవుండే పట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అత్యాధునిక పరిజ్ఞానంతో జోడిస్తున్నారు. దీంతో వ్యాకోచించే సమయంలో ఏర్పడుతున్న సమస్యలు ఇక కనిపించవు. ప్రస్తుతం ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వేగాన్ని తట్టుకుని ప్రయాణిస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక బోగీపై మరోటి ఎక్కకుండా ఉంటాయి. అదనపు రైళ్లకు అవకాశం రైళ్ల వేగం పెరగటంతో అవి తొందరగా గమ్యస్థానం చేరుకుంటాయి. ఫలితంగా అదనంగా మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు అవకాశం కలుగుతుంది. తొందరగా గమ్యం చేరుకున్నాక, తదుపరి ప్రయాణం వరకు రైలు ఖాళీగా ఉండే సమయం పెరుగుతుంది కాబట్టి సమీప స్టేషన్లకు కొత్త సర్వీస్ రూపంలో నడుపుతారు. భారీ సరుకు రవాణా వ్యాగన్లు ప్రస్తుతం సరుకు రవాణా మందకొడిగా సాగుతోంది. గూడ్సు రైళ్ల గరిష్ట వేగం కేవలం గంటకు 70 కి.మీ. 56 టన్నుల సరుకును మాత్రమే ఒక్కో వ్యాగన్లో లోడ్ చేస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణతో మరిన్ని టన్నుల బరువు మోసే వ్యాగన్లను అందుబాటులోకి తెస్తారు. ఆ రైళ్ల వేగాన్ని కూడా కనీసం 20 కి.మీ. మేర పెంచుతారు. పట్టాల వెంట డ్రెయిన్ల నిర్మాణం వర్షాలు పడ్డప్పుడు వాన నీటితో పట్టాలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టాల మధ్య నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు పట్టాలను మార్చే పనిలో భాగంగా ట్రాక్ వెంట వాననీటి కాలువలను కూడా నిర్మిస్తున్నారు. నిధులు ఇలా.. ప్రతి రైల్వే బడ్జెట్లో పాత ప్రాజెక్టులకు కొద్దికొద్దిగా నిధులు కేటాయించే విధానం ఉండేది. గత రెండు బడ్జెట్ల నుంచి మోదీ ప్రభుత్వం దాన్ని సమూలంగా మార్చివేసింది. కొన్ని పాతకాలం పెండింగ్ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. వీలైనన్ని నిధులు ఒకచోట చేర్చి వాటిని ట్రాక్ పునరుద్ధరణకు వినియోగించాలని నిర్ణయించింది. నిధులు వేరే పనులకు మళ్లకుండా ప్రత్యేకంగా ‘రాష్ట్రీయ రైల్ సురక్షా కోష్’పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.73,065 కోట్లు కేటాయించింది. ఇందులోంచి దక్షిణ మధ్య రైల్వేకు రూ.800 కోట్లను కేటాయించింది. -
రైల్వే ట్రాక్‌పై తల లేని మొండెం
కాశీబుగ్గ : పలాస మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. పలాస రైల్వేస్టేషన్‌కు కూత వేటుదూరంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహం వద్ద మృతుడు తల లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. పరిసర ప్రాంతాలలో రైల్వే జీఆర్పీ సిబ్బంది వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇతడు రైలు నుంచి జారిపడ్డాడ, ఆత్మహత్య చేసుకున్నాడ, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది అంతుపట్టడం లేదు. మృతుడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, చామన్‌ఛాయ రంగు కలిగి, 5.2 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే పరిశోధన అధికారి కె.కోధండరావు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పలాస రైల్వే స్టేషన్‌ను సంప్రదించాలని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు జీఆర్పీ రైల్వే స్టేషన్ 08945 241013 నంబరుకు సంప్రదించాలన్నారు. నౌపడ ఆర్ఎస్ వద్ద... టెక్కలి రూరల్ : మండలంలోని నౌపడ ఆర్ఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ హెచ్‌సీ కోదండరావు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం వేకువజామున రైల్వేట్రాక్ పక్కన ఒక మృతదేహం పడివుందనే సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 ఉంటుందని, అతనిచేతికి గోల్డ్ ఉంగరం, గీతల తెలుపురంగు షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇతడి తల పూర్తిగా నుజ్జు అవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండిఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంతవరకు మృతదేహానికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఇంజిన్ లేకుండా రైలు10 కి.మీ...
-
రైలు కిందపడి విద్యార్థిని ఆత్మహత్య
గంపలగూడెం(తిరువూరు): మండలంలోని తునికిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇక్కడ సమీపంలోని తెలంగాణా రాష్ట్రం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం... గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన బుర్రి ధనలక్ష్మి(19)మధిరలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. మద్యానికి బానిసైన తండ్రి నర్సింహారావు గురువారం రాత్రి మద్యం తాగి కుమార్తెతో ఘర్షణకు దిగాడు. ఉదయాన్నే పరీక్షరాసేందుకు మధిరకు బయలుదేరి వెళ్లింది. మనస్తాపంతో ఉన్న ఆమె మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష అయినప్పటికీ ముందుగానే మధిరకు చేరుకుని ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న పుష్పుల్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు
హైదరాబాద్ : ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా అతి సమీపంలోకి రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రెండు రైళ్లు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ రెండు రైళ్లు దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందని, ప్రతి 400 మీటర్ల దూరంలో డ్రైవర్లు రైలును ఆపుకునే వీలుందని తెలిపారు. ఒకే ట్రాక్‌పైన ఎంఎంటీఎస్ రెండు రైళ్లు పద్ధతి ప్రకారమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని అధికారులు వివరణ ఇచ్చారు. -
ప్రేమజంట బలవన్మరణం
రామన్నపేట (నకిరేకల్): ప్రేమను పెద్దలు ఒప్పు కోకపోవడంతో కలసి ఉండలేమని భావించిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్కి చెందిన చిరబోయిన గణేశ్(22), అదేగ్రామానికి చెందిన పూజిత(16) ప్రేమించుకున్నారు. పూజిత 10వ తరగతి చదువుతుండగా, గణేశ్ ఇంటర్ పూర్తిచేసి లారీ డ్రైవర్ అయిన తండ్రి అయిలయ్యకి సహాయంగా ఉంటున్నాడు. గత దసరా పండుగకు కొద్దిరోజుల ముం దు గణేశ్, పూజిత ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలిసింది. కులాలు వేరుకావడంతో ఇరువురి తల్లితండ్రులు, కులపెద్దలు మందలించారు. ఈ క్రమంలో శుక్రవారం స్కూలుకు వెళ్తానని పూజిత, లారీ వద్దకు వెళ్తానని గణేశ్ బయటకు వెళ్లారు. పూజిత స్కూల్‌కు వెళ్లలేదని సాయంత్రం తెలియడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా ఆచూ కీ తెలియకపోవడంతో కూతురును కిడ్నాప్ చేశారని తండ్రి బొంత శంకరయ్య అదే రోజు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని సాయిబాబాగుడి సమీపంలో వీరున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించి వారు అక్కడే బైక్‌తోపాటు బ్యాగును వదిలివెళ్లారు. ఆ రోజు రాత్రం తా వెతికినా దొరకలేదు. తమకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న గణేశ్, పూజిత రామన్నపేట శివారులోని జేపీగార్డెన్స్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్ మీద శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ విషయం గమనించిన అమరావతి ఎక్స్‌ప్రెస్ గార్డ్ స్థానిక స్టేషన్‌మాస్టర్‌కు సమాచారమందించారు. -
ఎంతపని చేశావు తల్లి !
ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదుగాని చావే శరణ్యమనుకుంది. ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. నవ మాసాలుమోసి.. కనిపెంచిన మూడేళ్ల కుమార్తెతో సహా వేగంగా వస్తున్న రైలుకి ఎదురెళ్లి.. దానికిందపడిపోయింది... క్షణాల్లో తల్లీపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జంక్షన్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు సమీపంలో తాండ్రాసి మెట్టవద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన పేకాన ఇందుమతి (30), ఆమె కుమార్తె ధనలక్ష్మి (03) చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమదాలవలస/సరుబుజ్జిలి: సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన పేకాన లక్ష్మణరావుకు 2011లో పాలకొండ మండలం బొడ్డవలసకు చెందిన ఇందుమతి (30)తో వివాహమైంది. వీరికి 5 సంవత్సరాల బాబు రాజు, కుమార్తె ధన లక్ష్మి(3) ఉన్నారు. లక్ష్మణరావు పుట్టుకతోనే మూగవాడు. అయినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలపెట్టేవాడుకాదు. మండల కేంద్రానికి సమీపంలో బార్బర్ షాపు నిర్వహిస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చెవాడు. అయితే ఇటీవల ఈ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైనట్టు స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం కూడా లక్ష్మణరావు, ఇందుమతి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఇందుమతి తన మూడేళ్ల కూతురు ధనలకిŠష్మ్ని తీసుకొని ఆమదాలవలస వచ్చేసింది. నిత్యం జరిగే గొడవలతో ఈ జీవితం ఎందుకు అనుకుందో ఏంగాని చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. నవమాసాలు మోసి.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం జంక్షన్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు సమీపంలో తాండ్రాసి మెట్టవద్ద భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కింద పాపతోసహా పడిపోయి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే రైల్వే హెచ్‌సీ చిరంజీవిరావు సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి ప్రాణం దక్కింది గురువారం ఉదయం ధనలక్ష్మి, భర్త లక్ష్మణరావు మధ్య గొడవ జరిగింది. తరువాత లక్ష్మణరావు మంగళవాయిద్యాలు వృత్తిపై వేరక ప్రాంతానికి వెళ్లిపోయాడు. బాబు రాజును స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలకు పంపించేశారు. అయితే మనస్తాపంతో ఉన్న ధనలక్ష్మి తన వద్ద ఉన్న పాప ధనలక్ష్మిని తీసుకొని బాబు చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్లింది. బాబును వెంటపంపించమని స్కూల్ సిబ్బందిని అడిగినప్పటికీ వారు పంపించలేదు. దీంతో కూతురుని తీసుకొని వెళ్లి ఇందుమతి రైలుకింద పడి చనిపోయింది. పాఠశాల సిబ్బంది బాబును కూడా పంపించి ఉంటే బతికి ఉండేవాడుకాదని స్థానికులు చెబుతున్నారు. కాగా రాజు కూడా తండ్రిలాగే పుట్టుకుతోనే మూగవాడు. -
జారి పడ్డారా..? హతమార్చి పడేశారా..?
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కలకలం రేగింది. నడికుడి జంక్షన్‌లోని రైల్వేట్రాక్ పై బుధవారం మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ట్రాక్‌పై మూడు కిలోమీటర్ల పరిధిలో మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. నడికూడి రైల్వేస్టేషన్, కేశానుపల్లి, గోగులపాడు సమీపంలో ఈ మూడు గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసులు నడికుడి జంక్షన్లో ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్లో నుంచి జారి పడ్డారా? లేక హతమార్చి పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
చైనీయులకు తిరుగులేదన్నారు ఇందుకే..!
లొంగ్యాన్, చైనా : అతికొద్ది సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయగల సత్తా తమ సొంతమని చైనీయులు ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. కేవలం తొమ్మిది గంటల్లో కొత్త రైల్వే స్టేషన్‌కు హై స్పీడ్ రైలు ట్రాక్(గంటకు 200 కి.మీ వేగం)ను నిర్మించి రికార్డు సృష్టించారు. రైల్వే ట్రాక్ నిర్మాణంలో 1,500 మంది వర్కర్లు పాల్గొన్నారు. వీరికి అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడు రైళ్లను వినియోగించారు. దక్షిణ చైనాలోని ఫుజియన్ ప్రావిన్సులో గల లొంగ్యాన్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు హైస్పీడ్ సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. స్టేషన్‌కు హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ కావడంతో కేవలం తొమ్మిది గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. కొత్తగా నిర్మించిన ‘నాన్‌లాంగ్ రైల్వే లైను’ను మరో మూడు లైన్లకు అనుసంధానించడంతో టాస్క్ పూర్తైంది. అంతేకాకుండా స్టేషన్‌కు రైళ్ల సమాచారాన్ని చేరవేసే ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టంను సైతం అమర్చారు. 2018 చివర కల్లా 246 కిలోమీటర్ల మేర నాన్‌లాంగ్ రైల్వే లైనును విస్తరించాలని చైనా యోచిస్తోంది. ఇది పూర్తైతే ఈశాన్య చైనా నుంచి సెంట్రల్ చైనాకు ప్రయాణం సులభతరమవుతుంది. -
గూడ్స్ రైలు ఢీ.. ముగ్గురి మృతి
కామారెడ్డి : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఈద్గా వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొని ముగ్గురు చనిపోయారు. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలవ్వ, ఆమె మనువడు సవేంద్ర (4), కామారెడ్డి జిల్లా బీక్నూర్‌కు చెందిన నవ్య(19)లు గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల కావడంతో బాలవ్వ మనువడిని సొంత ఊరికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవ్య కామారెడ్డిలో వశిష్ట కాలేజిలో బీకాం చివరి సంవత్సరం చదువుతుంది. -
గేటు పడింది
ఐదేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రొద్దుటూరు–కంభం రైలుమార్గం కథ కంచికి చేరేటట్లు కనిపిస్తోంది. కడప, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ఈ రైల్వేలైన్ ఏర్ప డితే రెండుజిల్లాల మధ్య ఆర్థికవ్యా పార రంగాల పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. గుంటూరు–గుంతకల్ మార్గంలో ఉన్న కంభం రైల్వేస్టేషన్‌కు, ఎర్రగుంట్ల–నం ద్యాల మార్గంలో ఉన్న ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ల మధ్య లైను వస్తుందనే ఆశలు అడియాశలుగామారాయి. రాజంపేట: రెండో ముంబయిగా ప్రసిద్ధి పొందిన ప్రొద్దుటూరు నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం ప్రాంతాలను కలిపే రైల్వేలైన్ కలగానే మిగిలిపోనుంది. ఐదేళ్ల కిందట ఇది తెరపైకి వచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. రైల్వేమంత్రిత్వశాఖ కేవలం సర్వేకు నిధులు కేటాయిస్తోంది.ఇప్పుడు (2017–2018లో) ప్రణాళిక సంఘం ఆమోదించలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహనరెడ్డి ఇటీవల లోక్‌సభలో ప్రశ్నించిన నేపథ్యంలో ప్రొద్దుటూరు–కంభం రైల్వేలైన ప్రణాళికసంఘం ఆమోదించలేదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. దీంతో ఈ మార్గంపై నీలినీడలు అలుముకున్నాయి. తప్పని ఎదురుచూపులు: యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైలుమార్గం, ఎన్డీ ఉన్న సమయంలో మరో రైలుమార్గం ఇలా బడ్జెట్లో ప్రకటించడం తప్ప మరొకటి కనిపించడంలేదు. జిల్లాలో రెండు కొత్త లైన్ల పరిస్థితి ఎటూ తేలడంలేదు. సర్వేలు చేయిస్తున్నామని రైల్వేమంత్రిత్వశాఖ చెప్పుకుంటోంది.బడ్జెట్లో కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. కొత్త రైలుమార్గం ఎప్పుడు వస్తుందో అని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సర్వేతోసరి.. కొత్త రైలుమార్గంగా కంభం–ప్రొద్దుటూరులైన్ను తీసుకొచ్చారు. ప్రధాని మోదీ బడ్జెట్లో సర్వే కోసం నిధులు ప్రకటించారు.ఇందుకోసం ఆర్వీఎన్ఎల్ గతంలో టెండర్లను కూడా పిలిచింది. 2013–2014 రైల్వే బడ్జెట్లో కంభం–ప్రొద్దుటూరు కొత్త రైల్వే లైన్ కోసం రూ.10లక్షలు కేటాయించారు. అంచనా వ్యయం రూ.829కోట్లు కాగా దూరం 142కిలోమీటర్లు ఉందని రైల్వే వర్గాల సమాచారం.2016లో రైల్వే బడ్జెట్లో రూ.కోటి వ్యయం చేశారు. ఈవిధంగా ఈ మార్గం సర్వే దశలోనే ఉంది. 2017–18లో ఈ లైను గురించి ఊసేఎత్తలేదు. ఇప్పటికే కంభం పరిసర ప్రాంతాల్లో సర్వే చేసి వదిలేశారు. గతంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కొత్త రైలుమార్గాల గురించి రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. -
అన్నా.. అమ్మను తిట్టకురా..
రైల్వేగేట్: అన్నా.. అమ్మ ను తిట్టకురా.. అమ్మ ఏం దాసుకోలేదురా..ఆస్తి మొత్తం నువ్వే తీసుకో.. నువ్వు కూడా జాగ్రత్త.. నేను చనిపోతున్నాను..అమ్మకు చెప్పకు..’ అని డెత్‌నోట్ రాసి ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన జంగం పూర్ణచందర్(25) హన్మకొండలోని ఓ ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదివి ఫెయిలయ్యాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్ సెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నా డు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చిన పూర్ణచందర్ రాత్రి తల్లి లక్ష్మికి చెప్పి బయటికి వెళ్లాడు. గురువారం ఉదయం హంటర్‌రోడ్డు మినీబ్రిడ్జి సమీ పంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ తెలిపారు. డెత్ నోట్ రాసుకుని పూర్ణచందర్ ఆత్మహత్య చేçసుకున్న ట్లు సీఐ చెప్పారు. పూర్ణచందర్ ఆత్మ హత్యతో తల్లి లక్ష్మి రోదనలు మిన్నంటా యి. డబ్బుల విషయమై మృతుడి అన్న వెంకటేష్ మందలించడంతోనే పూర్ణచందర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యలు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రైలు పట్టాలపై మూడు మృతదేహాలు
ఏలూరు అర్బన్/తేలప్రోలు(గన్నవరం): కృష్ణా జిల్లా తేలప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై బుధవారం మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒక మహిళతో పాటు ఓ యువతి, మరో బాలిక ఉన్నారు. వీరు రైలు నుంచి జారిపడి మరణించారా లేక ఎవరైనా హత్య చేసి శవాలను పట్టాలపై పడేశారా అనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మూడు మృతదేహాలు పడి ఉన్నాయని బుధవారం ఉదయం ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఏలూరు రైల్వే సీఐ గంగాధర్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల చేతిపై ఉన్న పచ్చబొట్లు ఆధారంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా భావిస్తున్నారు. రైల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వీరంతా జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల ఆచూకీకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని సీఐ గంగాధర్ తెలిపారు. -
రైళ్లకు అంతరాయం కలిగించిన ట్రక్
-
పల్లవి శరీరంపై గాయాలున్నాయి
సాక్షి, ముంబై : గత రాత్రి రైలు పట్టాలపై దొరికిన యువతి మృత దేహాన్ని ఎట్టకేలకు దక్షిణ ముంబై పోలీసులు గుర్తించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు నీలేశ్ వికమ్‌సే కూతురు పల్లవిగా తేల్చారు. 20 ఏళ్ల పల్లవి ఫోర్ట్ లోని ఓ లా సంస్థలో ఇంటర్న్‌షిఫ్ చేస్తోంది. అయితే ఈ నెల 4 నుంచి ఆమె కనిపించకుండా పోయిందంటూ కుటుంబ సభ్యులు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పరేల్-కర్రీ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై యువతి మృతదేహం పడి ఉందని ఓ ఆంగతకుడు పరేల్ స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించాడు. దీంతో ఆయన పోలీసులకు విషయం తెలియజేయగా.. యువతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం చనిపోయింది పల్లవేనని పోలీసులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎప్పటిలాగే తన పనికి వెళ్లిన పల్లవి ఈ నెల 4న సాయంత్రం ఆరుగంటలకు సీఎస్ఎంటీ స్టేషన్లో రైలు ఎక్కిందని డీసీపీ సమాధాన్ పవార్ తెలిపారు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు. తొలుత తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు సందేశం పెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే, తలతోపాటు శరీరంపై తీవ్ర గాయాలుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎలా చనిపోయిందన్న అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పవార్ తెలిపారు. మరోవైపు కాల్ చేసి సమాచారం అందించిన అగంతకుడిని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. -
విషాదం: సెల్ఫీ మోజులో నిండు ప్రాణాలు..
సాక్షి, కర్ణాటక: రోజురోజుకు యువతి, యువకుల్లో సెల్ఫీ మోజు పెరిగిపోతోంది. సెల్ఫీ మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటానికి ఏమాత్రం వెనుకకాడటం లేదు. సెల్ఫీల మోజులో పడి యువత జీవితం విలువను మర్చిపోతున్నారు. అదే ఇప్పుడు కన్నవారికి కడుపుకోత మిగిలిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిడాడీలో మంగళవారం ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో ముగ్గురి యువకులు మరణించారు. రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ దిగుతున్న ముగ్గురు యువకులు అటుగా వస్తున్న రైలును కూడా పట్టించుకోకపోవడంతో పండండి జీవితాలను గాలిలో కలుపుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారి మృతదేహాలు రైల్వే ట్రాక్‌పై గుర్తుపట్టలేని స్థితిలో పడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం జయనగర్‌లోని నేషనల్ కాలేజీ విద్యార్థి విశ్వాస్ చెరువులో మునిగిపోయాడు. ఆ సమయంలో తన స్నేహితులందరూ కలిసి సెల్ఫీ దిగే మోజులో పడిపోయిన ఘటన తెలిసిందే.. -
వైరల్ వీడియో: కళ్లు తిరిగి పట్టాలపై పడ్డాడు ఆపై...
సాక్షి : తన తోటి ప్రయాణికులు సమయ స్ఫూర్తితో వ్యవహరించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఆస్ట్రేలియాలోని విన్యార్డ్ రైల్వే స్టేషన్లో సోమవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 2 గంటల సమయంలో రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి కళ్లు తిరిగి పట్టాలపై పడిపోయాడు. వెనకాలే ఉన్న వృద్ధుడు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. సరిగ్గా పట్టాల మధ్యలో పడి అతను స్పృహ కోల్పోయాడు. ఇంతలో దూరం నుంచి రైలు కూత వినిపించింది. పక్కనే ఉన్న ప్రయాణికులంతా అతన్ని కాపాడాలంటూ అరిచారు. అది గమనించిన ఓ అధికారి రెండు చేతులెత్తి రైలును ఆపాల్సిందిగా సైగ చేశారు. రైలు ఆగిందో లేదో స్పష్టత లేదుగానీ.. ప్రయాణికుల్లో అరుగురు పట్టాల మీదకు దూకి అతన్ని కాపాడేశారు. తలకు చిన్నగాయంతో అతను బయటపడటం విశేషం. స్టేషన్‌లోని సీసీపుటేజీ వీడియోలో ఘటన అంతా నిక్షిప్తం కాగా, ఆ వీడియో బయటకు రావటంతో వైరల్ అవుతోంది. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా అతన్ని కాపాడిన ప్రయాణికులను పలువురు అభినందిస్తున్నారు. -
కళ్లు తిరిగి పట్టాలపై పడ్డాడు ఆపై...
-
విరిగిన రైలు పట్టా.. రాకపోకలకు అంతరాయం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం ఉదయం రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయాన్ని రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయం గమనించిన రైల్వే అధికారులు పలు రైళ్లను నిలిపివేసి, మరమ్మతులు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని నేషనల్పార్కు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 55 సంవత్సరాల వయస్సు, తెలచొక్క, తెల్ల పంచె ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి(కృష్ణగిరి) : వెల్దుర్తి, మాదార్‌పురం గ్రామాల మధ్య రైల్వేట్రాక్ పక్కన గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు డోన్ రైల్వే ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోందన్నారు. దాదాపు వారం రోజుల కిందట సంఘటన జరిగి ఉండవచ్చని, మృతదేహం గుర్తు పట్టడానికి వీలు లేనంతగా తయారైందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని కర్నూలు హెచ్‌సీలు నాగలక్ష్మి, కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలుకు చెందిన వైద్య విద్యార్థి ఒకరు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎన్ఆర్పేటకు చెందిన రామకృష్ణ ఫార్మాసిటికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జయసాయికృష్ణ(20) అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్థానిక కార్బైడ్ ఫ్యాక్టరీ వద్ద రైలుపట్టాలపై అతను శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. సాయంత్రం అతని మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. సెలవులు ముగియడంతో ఆదివారం అనంతపురం బస్సెక్కించి çకళాశాలకు తల్లిదండ్రులు పంపించారు. అయితే సోమవారం ఉదయం అతను శవమై కనిపించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఫెయిలవుతానేమోనన్న ఆందోళన సైతం తమతో వ్యక్తం చేసేవాడని, తామే ధైర్యం చెప్పి పంపించామని, తీరా తమ కుమారుడు శవమై కనిపించాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని శవం లభ్యం
నంద్యాలవిద్య: నంద్యాల మండల పరిధిలోని నందిపల్లె–నంద్యాల మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఆకుపచ్చ షర్టు, కాకి ప్యాంట్ ధరించి ఉనా్నడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 8522923203కు సంప్రదించాలని కోరారు. -
రైలు పట్టాలపైనే మందుపార్టీ
- మద్యం మత్తులో యువకుల దుస్సాహసం - దూసుకెళ్లిన రైలు - ఇద్దరు దుర్మరణం నంద్యాల: ఆటోలు తోలుతూ జీవనం సాగిస్తున్న ఓ ఇద్దరు యువకులు ఏకంగా రైలు పట్టాలపైనే మందుపార్టీ పెట్టుకుని మత్తులో రైలు కింద పడి చనిపోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఎన్జీఓ కాలనీకి చెందిన దూదేకుల హుసేన్(22), ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్‌రహీం(21) స్నేహితులు. వీరికి ఇంకా పెళ్లి కాలేదు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు స్నేహితులు అక్రమ్, భూపాల్ కలిసి పొన్నాపురం కాలనీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో తప్పతాగారు. తర్వాత హుసేన్, షేక్‌రహీం తూలుతూ రైల్వే ట్రాక్‌పై వెళ్లి మద్యం సేవించడం ప్రారంభించారు. అక్రమ్, భూపాల్ వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో రైలు దూసుకెళ్లిపోవడంతో హుసేన్, రహీం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైల్వే అధికారులు ఆదివారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు. -
మిస్టరీ వీడిన రజినీకుమార్ హత్య కేసు
– కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు – ఆరుగురు కిరాయి హంతకుల అరెస్టు – పరారీలో సూత్రధారులు కర్నూలు : నగరానికి చెందిన గుడ్‌షప్పర్డ్ పాఠశాల మాజీ యజమాని మోడీ రజినీకుమార్ (48) హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కుటుంబ తగాదాలే హత్యకు దారి తీశాయని పోలీసులు విచారణలో తేల్చారు. గతనెల 17 సాయంత్రం పెద్దటేకూరు సమీపంలో రైల్వే ట్రాక్‌పై రజినీకుమార్ మృతదేహం బయటపడింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు బుధవారపేటకు చెందిన కొప్పుల శివప్రసాద్, వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన రాముడు, సాయికృష్ణ, ఖాదర్‌బాషా, మిన్నెల్ల హుసేన్, నితీష్ తదితరులను తాలుకా పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆదివారం సాయంత్రం స్థానిక తాలుకా పోలీస్ స్టేషన్లో విలేకరులతో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్నూలులోని ఆదర్శ విద్యాసంస్థల అధినేత తిమ్మయ్య కూతురును రజినీకుమార్ వివాహం చేసుకున్నాడు. కర్నూలులోనే ఉంటూ కొంతకాలం విద్యాసంస్థల నిర్వహణ చూసుకునే వారు. వారి మధ్య విభేదాలు తలెత్తి, భార్యను కూడా వదిలేసి కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీరాములు, ఎన్కౌంటర్ పత్రికా విలేకరి మద్దిలేటియాదవ్లు అదేకాలనీకి చెందిన వెంకట్రాముడుతో కలసి రజనీకుమార్ హత్య చేయించేందుకు కిరాయి హంతకులతో ఒప్పందం(రూ.3 లక్షలు) కుదుర్చుకున్నారు. హత్యజరిగిందిలా.. వెంకట్రాముడికి అల్లుడైన శివప్రసాద్, తన మిత్రులతో కలిసి గతనెల 17న రజినీకుమార్‌ను గోరంట్ల తిరునాళ్లకు వస్తే పార్టీ ఇస్తామని కోడుమూరు పిలిపించారు. రాత్రి 9 గంటల సమయంలో కోడుమూరు, కర్నూలు రహదారిలోని మోడల్ స్కూలుకు వెళ్లే దారిలోకి తీసుకెళ్లి వెంకట్రాముడు రజినీకుమార్ గొంతుపట్టుకొని బీరు బాటిల్‌తో పొడవగా, శివప్రసాద్, సాయికృష్ణలు పిడిబాకులతో పొడిచారు. ఖాదర్‌బాషా రాయితో, నితీష్ కట్టెతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. రజినీకుమార్ మృతదేహాన్ని ఆయన కారు (ఏపీ 21 ఏపీ 9779) వెనుకసీటులో వేసుకొని పెద్దటేకూరు సమీపంలోని రైలు పట్టాలపై పడవేశారు. మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్, సెల్‌ఫోను దొంగలించి, కారులో కర్నూలు చేరుకొని సస్య హోటల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. మొదట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం ఉళిందకొండ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ వెంకటేశ్వరరావు విచారణ ముమ్మరం చేయగా, ముద్దాయిలు కోడుమూరు వీఆర్ఓ వెంకట్రాముడు వద్ద లొంగిపోయి హత్య వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి చైన్, సెల్‌ఫోన్‌తో పాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సూత్రధారి అయిన శ్రీరాములు, ఎన్కౌంటర్ విలేకరి మద్దిలేటి యాదవ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
ఇతడు – అతడు
రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది. అయినా నిన్నటి జ్ఞాపకంలానే భయపెడుతోంది. డిగ్రీ చేసిన తరువాత జాబ్ చేయడానికి రెక్కలు కట్టుకొని బాంబేలో వాలిపోయాను. జాబ్ కంటే బాంబేలో ఉండాలనే కోరికే నన్ను ఈ పని చేయించింది. ఎలాగో కష్టపడి, చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోయాను. ఒక స్లమ్ ఏరియాలో చిన్న రూమ్ తీసుకొని ఉండేవాడిని. సంవత్సరం గిర్రుమని తిరిగింది. ఒకరోజు...అర్ధరాత్రి తరువాత తలుపు చప్పుడు కావడంతో ‘ఎవరు?’ అంటూనే తలుపు తీశాను. ఎదురుగా అపరిచితుడు. కానీ... ఎక్కడో చూశాను. ‘‘గుర్తు పట్టలేదా... మీ అన్నయ్య ఫ్రెండ్ కిషన్‌ని’’ అన్నాడు. వెంటనే ‘సారీ బ్రదర్’ అంటూ రూమ్‌లోకి తీసుకువచ్చాను. బాంబేలో ఏదో పని ఉండి వచ్చానని, రెండు రోజులు ఉండిపోతానని చెప్పాడు. నా అడ్రస్ అన్నయ్య ఇచ్చినట్లున్నాడు. కొద్దిసేపటి తరువాత నిద్రపోయాం. ఒక గంట తరువాత నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కన చూస్తే కిషన్ లేడు! గొళ్లెం వేసే ఉంది. మరో టైంలో అయితే... దీని గురించి లోతుగా ఆలోచించేవాడినేమో... కళ్లు మండుతుండడంతో మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాను. తెల్లారి లేచి చూస్తే నా పక్కనే ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు కిషన్. ‘‘అన్నా...రాత్రి ఎటైనా వెళ్లావా?’’ అని అడిగాను. ‘‘నేనెటు వెళతాను తమ్ముడూ...నువ్వు కలగని ఉంటావు’’ అని చిన్నగా నవ్వాడు. అవును. కలగని ఉంటాను! ఎన్నడూ లేనిది కాలనీలో ఆరోజు అలజడి మొదలైంది. రాత్రి ఏవో వింత శబ్దాలు వినిపించాయని, ఇంటిపై కప్పు మీద ఎవరో ఎగిరి దూకుతున్న శబ్దాలు వినిపించాయని...ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇవి విని నేను, కిషన్ చిన్నగా నవ్వుకున్నాం. ఈలోపు మా రూమ్ ఓనర్ తుపానులా దూసుకొచ్చాడు... ‘‘నీకెన్నిసార్లు చెప్పాను, ఫ్రెండ్స్‌ను రానివ్వొద్దని. మొన్ననే ఒకడు వచ్చి వారం రోజులు ఉండిపోయాడు. అసలే నీళ్లు దొరక్క చస్తుంటే...’’ అతనలా తిడుతూనే ఉన్నాడు. ‘‘సారీ తమ్ముడూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు’’ అంటూ అప్పటికప్పుడు రూమ్ నుంచి వెళ్లిపోయాడు కిషన్. ఇది జరిగిన వారానికి మా బంధువు ఒకరు చనిపోతే సొంతూరికి వెళ్లాను. నేను ఊరెళ్లక సంవత్సరం దాటింది. అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఒక చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటు న్నాం. ఏదో విషయం మాట్లాడుతూ మా అన్నయ్య ‘‘చచ్చి ఎక్కడున్నాడోగానీ ఆ కిషన్‌గాడు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు’’ అన్నాడు. ‘‘పాపం కిషన్ చనిపోయాడా? ఎలా? వారం రోజుల క్రితమే నా రూమ్‌కు వచ్చాడు’’ అన్నాను. ‘‘వాడు చనిపోయి సంవత్సరం కావొస్తుంది. వారం రోజుల క్రితం నీ రూమ్‌కు ఎలా వస్తాడు?’’ ఆశ్చర్యంగా అడిగాడు అన్నయ్య. గట్టిగా వాదిస్తే నాకు పిచ్చిపట్టింది అనుకుంటారని ‘‘ఇతను కాదు...రమేశ్ అనుకుంటా నీ ఫ్రెండ్ ఒకరు వచ్చారు’’ అని మాట మార్చాను. బాంబేలో కొంత కాలం ఉన్న కిషన్, డిప్రెషన్‌తో బాధ పడుతూ రైలుకింద తలపెట్టి చనిపోయాడట. ఆ రైల్వేట్రాక్ మా రూమ్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది.ఆరోజు రూమ్ ఓనర్ వచ్చి తిట్టకపోయి ఉంటే కిషన్ వెళ్లి ఉండేవాడు కాదు. ఆ తరువాత ఏం జరిగి ఉండేది? నా కాళ్లు సన్నగా వణకడం మొదలైంది! – అలోక్ కుమార్, నారాయణ్‌పూర్, బిహార్