
షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది.
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులోని ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.
పట్టాలపై కారు నిలిపోవడాన్ని గూడ్స్ రైలు లోకో పైలట్ గమనించి వెంటనే వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన కుటుంబంగా సమాచారం. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..