సాక్షి, విశాఖపట్నం : విహార యాత్రకు వెళుతున్న ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగిన సంఘటన విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. గురువారం అనంతగిరి మండలంలోని తైడా సమీపంలో మైదాన ప్రాంతం నుంచి అరకు అందాలను చూడడానికి వెళుతున్న ఓ టూరిస్టు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందులోని వారు అప్రమత్తంగా ఉండటంతో క్షేమంగా బయటపడగలిగారు. ఈ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్‌తో ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment