రిలయన్స్ జియో తన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాల కోసం తక్కువ ధర ప్లాన్ ఆశించేవారికి ఇది సరిపోతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలకు అనుగుణంగా తన వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించి, సవరించిన జియో అదే క్రమంలో ఈ చవక ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఇదివరకే రూ. 479 ప్లాన్‌తో కలిపి దీన్ని తీసుకువచ్చిన జియో ట్రాయ్ అభ్యంతరాలతో వెనక్కితీసుకుంది. ఇప్పుడు మళ్లీ ప్లాన్‌ను "చవక ప్యాక్‌లు" కేటగిరీ కిందకు తీసుకువచ్చింది. ఈ ప్లాన్ అత్యంత చవకైన రీఛార్జ్ ఎంపిక రూ. 199 ప్లాన్. ఇది 18 రోజుల చెల్లుబాటు, 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది.
జియో ఇటీవలే రూ. 1,958, రూ. 458 ప్రీపెయిడ్ వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. ఇవి వరుసగా 365 రోజులు, 84 రోజుల చెల్లుబాటును అందిస్తాయి. అయితే కంపెనీ వాటి ధరలను రూ. 1,748, రూ. 448లకు తగ్గించింది. కానీ ఖరీదైన ప్లాన్ చెల్లుబాటు వ్యవధిని 336 రోజులకు కుదించింది.
రూ.189 ప్లాన్ ప్రయోజనాలు
• 28 రోజుల వ్యాలిడిటీ
• అపరిమిత వాయిస్ కాల్స్
• 300 ఉచిత SMS
• 2GB హై-స్పీడ్ డేటా
• జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కి యాక్సెస్
Comments
Please login to add a commentAdd a comment