‘నిర్మలమ్మ బడ్జెట్‌ ఓ పెద్ద జోక్‌’ | Congress Leaders Reactions On FM Nirmala Sitharaman Union Budget 2025-26, Watch Videos And Other Details Inside | Sakshi
Sakshi News home page

Congress Leaders On Budget: ‘నిర్మలమ్మ బడ్జెట్‌ ఓ పెద్ద జోక్‌’

Feb 1 2025 1:58 PM | Updated on Feb 1 2025 3:38 PM

Congress Leaders Reaction On Union Budget 2025-26

ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్‌కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్‌ కోసమే బడ్జెట్‌ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్ర‍స్తావనే లేదన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్‌ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్‌పూర్‌లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement