shashi tharoor
-
హిందూయిజాన్ని గూండాగిరీగా మార్చేశారు
జైపూర్: హిందూయిజాన్ని కొందరు నేడు బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగాన్ స్థాయికి దిగజార్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. తమ ఫుట్‌బాల్ టీంకు మద్దతివ్వని వారిపై దాడులకు పాల్పడే సంస్కృతినే బ్రిటిష్ ఫుట్‌బాల్ హులిగా నిజంగా పిలుస్తుంటారు. శశి థరూర్ ఆదివారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడారు. ‘ఇటీవల కొందరు మా టీంకు మద్దతివ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని కొడతాం. జై శ్రీరాం అనట్లేదు కాబట్టి, కొరడాతో దండిస్తాం’అంటున్నారన్నారు. ‘ఇది కాదు హిందూయిజం. హిందూయిజానికి దీనితో అస్సలు సంబంధమే లేదు’అని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ హిందువు ఆచరించాల్సిన నాలుగు పురుషార్థాలున్నాయని వివరించారు. హిందూయిజం పేరుతో కొందరు తమది మాత్రమే ఉత్తమ మార్గమని ప్రచారం చేసుకుంటూ బ్రిటిష్ ఫుట్‌బాల్ హూలిగాన్ స్థాయికి దిగజార్చుతున్నారన్నారు. -
‘నిర్మలమ్మ బడ్జెట్ ఓ పెద్ద జోక్’
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్‌కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావనే లేదన్నారు.కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.#WATCH | On #UnionBudget2025, Congress MP Shashi Tharoor says, "I think frankly the applause you heard from the BGP benches was for the middle-class tax cut. We look at the details and that may be a good thing. So if you have a salary you may be paying less tax. But the important… pic.twitter.com/vbOJHyMMMy— ANI (@ANI) February 1, 2025కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.The FM spoke of 4 engines: Agriculture, MSMEs, Investment, and Exports. So many engines that the Budget has been completely derailed.— Jairam Ramesh (@Jairam_Ramesh) February 1, 2025కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్‌పూర్‌లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. #WATCH | #UnionBudget2025 | Congress MP Kumari Selja says, "Farmers didn't get MSP. They talked about nuclear but our nuclear power plant in Haryana's Gorakhpur (Gorakhpur Haryana Anu Vidyut Pariyojana) has been there for a long and both are happening there. Many such issues are… pic.twitter.com/fanSTExEzs— ANI (@ANI) February 1, 2025 -
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
‘వారానికి 40 గంటలే పని ఉండాలి!’
పని భారం.. తీవ్ర ఒత్తిడితో ఓ యువ ఉద్యోగిణి ప్రాణం కోల్పోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు.పని ఒత్తిడితో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణించిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. పని ప్రదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగొద్దని సూచించిన ఆయన.. పనివేళలపై పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు. ఈ క్రమంలో వారానికి 40 గంటల పని దినాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారాయన.Had a deeply emotional and heartrending conversation with Shri Sibi Joseph, the father of young Anna Sebastian, who passed away after a cardiac arrest, following four months of deeply stressful seven-day weeks of 14 hours a day at Ernst&Young. He suggested, and I agreed, that I…— Shashi Tharoor (@ShashiTharoor) September 20, 2024 నాలుగు నెలలు.. ఏడు రోజులు.. రోజుకి 14 గంటల చొప్పున పని చేయడంతోనే ఆమె ఒత్తిడికి గురైంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నా. అందుకే వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలి. ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పని చేయాలి. ఈ దిశగా చట్టం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తా.. అని తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం కూడా ఉంచారు. అంతేకాదు ఇదే అంశంపై అన్నా తండ్రి సిబి జోసెఫ్‌తోనూ తాను మాట్లాడినట్లు థరూర్ తెలిపారు.కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) నాలుగు నెలలుగా పూణే ఈవై కార్యాయలంలో పని చేస్తూ.. జులై నెలలో కన్నుమూసింది. అయితే పని ఒత్తిడి వల్లే అన్నా మరణించిందని ఆమె తల్లి అనిత ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక.. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక శాఖ విచారణ చేపట్టింది. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాజీవ్ మెమానీ స్పందించారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము అక్కడ లేకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నాను. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని సంస్థ మెమానీ పేర్కొన్నారు. తెరపైకి నారాయణమూర్తి కామెంట్స్పని ఒత్తిడితో ఈవై ఉద్యోగిణి మరణించడం చర్చనీయాశంగా మారిన వేళ.. పనిగంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలన్నా.. భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాల్సిందేనని అన్నారాయన. ‘‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే మన యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ‘ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతా’ అనే అనే ప్రతిజ్ఞ చేయాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. ఆ సమయంలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.వారానికి 100 గంటలైనా పని చేయాలంటూ ఎలోన్ మస్క్ లాంటి బిలియనీర్లు పిలుపు ఇస్తుంటారు. కానీ, ఓవర్ వర్క్ వల్ల గుండె, మెదడు ఇతర కీలకమైన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. చివరకు.. మరణానికి కూడా దారి తీయొచ్చు. మొన్నీమధ్య చైనాలోనూ ఓ పెయింటర్ ఇలా గొడ్డు చాకిరీ చేసే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఆరా తీస్తే.. వరుసగా 104 రోజులు పని చేసిన ఆ కిందిస్థాయి ఉద్యోగి.. ఒకే ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని తేలింది. ఇదీ చదవండి: కోటి జీతం.. అయినా ఈవై ఉద్యోగం వద్దనుకున్నాడు!! -
కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్య
తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్‌కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. -
షేక్ హసీనాకు ఆశ్రయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసిందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఆమె విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. పొరుగుదేశమైన బంగ్లాలో అధికార మార్పు భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశం కాదన్నారు.కాగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా గత వారం తన పదవికి రాజీనామా చేసి.. ఉన్పళంగా దేశం వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని తాజా పరిణామాలు, బంగ్లాలో మద్యంతర ప్రభుత్వ ఏర్పాటుతో భార్త్తో సంబంధాలపై ప్రభావం, భారత్‌లో షేక్ హసీనా ఆశ్రయం వంటి అంశాలపై శశిథరూర్ స్పందించారు.బంగ్లాదేశ్‌తో భారత్‌కు సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం నిబద్దతతో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘మనం ఎలప్పుడూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉన్నాం. అక్కడి ప్రజలకు అండగా ఉన్నాం. 971 యుద్ధం సమయంలో వారితోనే ఉన్నాం.. వారి కష్టసుఖాల్లోనూ వెంటే ఉన్నాం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారత్‌తో స్నేహపూర్వకంగానే ఉన్నారు.. రాబోయే కాలంలోనూ ఇరు దేశాల బంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంతో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. చాలా గౌరవనీయమైన వ్యక్తిహసీనాకు మనం సాయం చేయకపోతే.. అది భారత్‌కు అవమానం. మన స్నేహితుడితో మనం చెడుగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడరు. హసీనా భారత్‌కు స్నేహితురాలు. ఆమెకు కూడా భారత్ స్నేహితురాలే. మీ మిత్రులు సమస్యల్లో ఉంటే ఎప్పుడూ సాయం చేయడానికి వెనుకాడకూడదు. కచ్చితంగా వారిని సురక్షితంగా ఉంచేలా చూడాలి. ఇప్పుడు భారత్ కూడా చేసింది అదే. ఒక భారతీయుడిగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఒక భారతీయుడిగా మనం ప్రపంచం కోసం నిలబడే విషయంలో కొన్ని ప్రమాణాలున్నాయి. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి రక్షణ కల్పించి ప్రభుత్వం సరైన పనే చేసింది’. అని థరూర్ పేర్కొన్నారు. -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
బ్రిటన్ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు
దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు చాన్స్లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను. గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్‌కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్‌కి చెందినవారు 2.7 శాతం మాత్రమే. హౌస్ ఆఫ్ కామన్స్‌తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్‌సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్ఛార్జిగా మాత్రమే!ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్లో బీజేపీ 1998 నుండి లోక్‌సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది. మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది. బ్రిటన్‌లో అయితే రిషీ సునాక్ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. అప్పుడు కూడా శశిథరూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్ కారులో 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్ చేసి, తరలించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమై పోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్ మాత్రమే ఆ పని చేయగలిగింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది! కానీ మనదేశంలో కాదు’
ఢిల్లీ: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యం అయింది. కానీ, అది భారత్‌లో కాదు. మరో దేశంలో సాధ్యం అయిందని ‘ఎక్స్’ వేదికగా సెటైర్లు వేశారు.Finally “ab ki baar 400 paar” happened — but in another country! pic.twitter.com/17CpIp9QRl— Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2024 ‘మొత్తానికి బీజేపీ చేసిన ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదం సాధ్యం అయింది. కానీ, అది మరో దేశంలో!’ అని శశీ థరూర్ సెటైర్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది.ఇక.. బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.చదవండి: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య -
Delhi Rains: నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ఢిల్లీ-ఎన్సీఆర్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు హస్తినాను స్తంభింపజేశాయి.చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకొంది. మరో వారం రోజులపాటు ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.అయితే సాధారణ పౌరులతో పాటు రాజకీయ నేతలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపపథ్యంలో ఢిల్లీలో ఉన్న పలువురు ఎంపీల నివాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలిచిపోయింది.కాగా తన ఇల్లంతా వర్షపు నీటితో నిండిపోయినట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. ఇంట్లో అడుగు ఎత్తు నీరు చేరిపోయిందని. ప్రతి గదిలో కార్పెట్లు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయని చెప్పారు. చుట్టుపక్కలా ఉన్న కాలువలు అన్నీ మూసుకుపోయాయని, నీరు వెళ్లడానికి స్థలం లేదని అన్నారు. అంతేగాక కరెంట్ షాక్ వస్తుందనే ఉద్ధేశంతో ఉదయం 6 గంటల నుంచి అధికారులు విద్యుత్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. అయితే, రోడ్లపై నుంచి నీటిని తొలగిస్తున్నారని, తాను సకాలంలో పార్లమెంటుకు చేరుకోగలిగానని థరూర్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.This is the corner just outside my home in Lutyens’ Delhi. Woke up to find my entire home under a foot of water — every room. Carpets and furniture, indeed anything on the ground, ruined. Apparently the storm water drains in the neighbourhood are all clogged so the water had no… pic.twitter.com/mublEqiGqG— Shashi Tharoor (@ShashiTharoor) June 28, 2024మరోవైపు భారీ వర్షాలతో లోధి ఎస్టేట్ ప్రాంతంలోని తన బంగ్లా వెలుపల రహదారి జలమయం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటిముంందు ఉన్న నీటిలో నుంచి కారు వద్దకు సిబ్బంది తనను సిబ్బంది ఎత్తుకొని తీసుకువచ్చారు. తన బంగ్లా మొత్తం జలమయమైందని ఎంపీ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఫ్లోరింగ్ పూర్తి చేశాం.. లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.#WATCH | Delhi: SP MP Ram Gopal Yadav being helped by members of his staff and others to his car as the area around his residence is completely inundated.Visuals from Lodhi Estate area. pic.twitter.com/ytWE7MGbfY— ANI (@ANI) June 28, 2024 ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేసిన ఆప్ నేత నివాసం వెలుపల తీవ్ర వరదలు పోటెత్తిన దృశ్యాలు దర్శనిస్తున్నాయి. -
ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు, కానీ: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించి జూన్ 26కు 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ అంశం తాజాగా లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. ముందుగా దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం, స్పీకర్ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు. కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెంగోల్‌ను భర్తీ చేయడం, నీట్ పేపర్ లీక్‌లు వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే ఎమర్జెన్సీపై మోదీ, రాష్ట్రపతి, స్పీకర్ చేసిన వ్యాఖ్యలను థరూర్ తప్పుబట్టారు. 49 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనను ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చి, చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ పరిధిలోనే ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన దాడి, రాజ్యాంగంపై దాడి అని రాష్ట్రపతి అనడం చట్టపరంగా సరికాదు' అని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదని మండిపడ్డారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలుపొందారు. -
లోక్ సభ ఎన్నికల ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాహల్ గాంధీ: శశిథరూర్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా రాహుల్ గాంధీ నిలిచారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమి పుంజుకోవటంలో రాహుల్ గాంధీ శ్రమకు క్రెడిట్ ఇవ్వాలని అన్నారు. రాహుల్ గాంధి మాత్రమే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఉండేందుకు అర్హుడని వ్యాఖ్యానించారు.‘‘ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచేలా కష్టపడి రాహుల్ గాంధీ.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. రాహుల్, మల్లికార్జున ఖర్గే ఇద్దరూ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ఖర్గే రాజ్యసభలో పక్షనేతగా పార్టీని ముందుండి నడిపించారు. ఖర్గే లాగా లోక్‌సభలో పార్టీని ముందుండి నడిపించటంలో రాహుల్ గాంధీ సామర్థమైన వ్యక్తి. ఈ అభిప్రాయాన్ని నేను ఏ వేదికపైన అయినా చెప్పగలను. .. ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమర్థంగా నడిపించటం కచ్చితంగా మోదీ, అమిత్ షాలకు ఒక సవాల్. వారి పాలన విధానాలు మార్చుకోవడానికి ఇది ఒక పరీక్ష లాంటింది. ప్రభుత్వానికి, పత్రిపక్షానికి రెండింటికి సామరస్యపూర్వకంగా ఉంటుందని ఆశిస్తున్నా. చాలా సమస్యలు ఉన్న భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వానికి మద్దతు నిలుపుకోవటం సాధ్యం కాదు. మోదీ మూడోసారి చేపట్టే ప్రభుత్వం నమ్మకం కోల్పోయేలా ఉండనుంది’’ అని శశిథరూర్ అన్నారు. -
కాంగ్రెస్ విజయంపై శశిథరూర్ వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల యుద్ధం తుది దశకు చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ వెనుకంజలో ఉన్నారు. తొలి ట్రెండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ముందున్నారు. ఈ నేపధ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఓటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎలాంటి వాదనలకు, చర్చలకు తావులేదు. విజయంపై నమ్మకంతో ఉన్నాం. ఏప్రిల్ 26 నుండి మా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఓటర్లు ఓటు వేశాక, ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాక, ఎటువంటి వాదనలకు లేదా చర్చలకు ఆస్కారం ఉండదు. ఇక క్రాస్ ఓటింగ్ విషయానికొస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లాభం కలగలేదు. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగలేదు. ఈసారి క్రాస్ ఓటింగ్ జరగాలని మేము ఆశించ లేదు. అయితే మేము గెలుస్తున్నామనే నమ్మకంతో ఉన్నాం’ అని శశిధరూర్ మీడియాతో అన్నారు. తిరువనంతపురంను గతంలో త్రివేండ్రం అని పిలిచేవారు. ఇది కేరళ రాజధాని. రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. తిరువనంతపురం కేరళలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరొందింది. ఈ నగరం దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించింది. ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్ 2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. #WATCH | On exit polls, Congress MP & candidate from Kerala's Thiruvananthapuram, Shashi Tharoor says, "...Expectations were set on 26th April because once people have cast their votes and the boxes are sealed in the strong room then there is no further room for any argument or… pic.twitter.com/12jFp6Yiwm— ANI (@ANI) June 4, 2024 -
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్
ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్ అన్నారు.While I am in Dharamshala for campaigning purposes, I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and…— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2024 బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నేత శశిథరూర్ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు. -
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
Shashi Tharoor: 400.. జోక్, 300.. అసాధ్యం, 200.. ఒక సవాలే
న్యూఢిల్లీ: ఈసారి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ జోక్‌గా అభివరి్ణంచారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కేరళలో బీజేపీ బోణీపై.. ‘‘ దేశవ్యాప్తంగా 400 చోట్ల గెలుస్తానని బీజేపీ నిజంగా జోక్ చేస్తోంది. 300 సీట్లు అసాధ్యమనుకోండి. కనీసం 200 నియోజకవర్గాలను గెల్చుకోవడం కూడా ఆ పారీ్టకి పెద్ద సవాలే. దిగువసభలో అధికారపార్టీ మెజారిటీ కోల్పోతుందనేది దాదాపు ఖరారైంది. కేరళలో ఈసారి కూడా బీజేపీ బోణీ కొట్టబోదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. 2019నాటితో పోలిస్తే ఈసారి దక్షిణాదిన కమలం కమిలిపోవడం ఖాయం’’ కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిపై.. ‘‘రెండు దశల్లో పోలింగ్ ముగిసిన 190 స్థానాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమికి అద్భుతమైన స్పందన వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు చూపిన ఎమోషన్స్, ఉత్సాహం ఈ సారి ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సానుకూల పవనాలను బాగా నమ్ముతున్నారు. ఈసారి ఊహించిన దానికంటే ఎంతో ముందున్నాం’’ విపక్షాల విక్టరీ స్థానాలపై.. ఈసారి విపక్షాల కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సరదాగా ‘‘ క్రికెట్‌కు వీరాభిమానిని అయినాసరే ఎంత స్కోర్ కొడతారనేది ఊహించలేను. కానీ గెలుపును ఊహిస్తా. బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగొచ్చు. ఇంకొన్ని రాష్ట్రాల్లో మా కూటమి సత్తా చాటొచ్చు. హరియాణాలో గతంలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదు. కానీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఈసారి మాకు అక్కడ 5–7 సీట్లు రావచ్చు. కర్ణాటకలో ఒక్కటే గెలిచాం. ఈసారి 10–17 గెలుస్తామంటున్నారు. కొందరైతే 20 మావే అంటున్నారు’’ తెలంగాణలో బీజేపీ గెలుపుపై.. ‘ తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవడం కష్టమే. బీజేపీ, కాంగ్రెస్ వీళ్లలో ఎవరు జనాన్ని ఆకట్టుకున్నారనేది తేలాల్సి ఉంది. ఇంకా 353 స్థానాల్లో పోలింగ్ మిగిలే ఉంది. ఈ లెక్కన ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముందుంది. నాదో ప్రశ్న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఒక యువకుడు 2014లో బీజేపీకి ఓటేశాడు. అదే యువకుడు పదేళ్ల తర్వాత కూడా అదే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 2014లో బీజేపీ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టేందుకు కృషిచేశామని చెప్పింది. అయినా ఎకానమీలో మార్పు తేలేకపోయింది. 2019లో పుల్వామా దాడులు బాలాకోట్ ఘటనతో దేశ జాతీయభద్రత ప్రశ్నార్థకమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం బీజేపీకి చేతకాదు. ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదు. అధిక ధరల వల్ల నచ్చినవి కొనలేకపోయారు. చైనాతో సరిహద్దు విషయంలోనూ బీజేపీ విఫలమైంది. సరిహద్దుల వెంట 65 పెట్రోలింగ్(గస్తీ) పాయింట్లలో 26 పాయింట్లను భారత్ కోల్పోయింది. ఛాతి విరిచి చెప్పుకునేంతగా మోదీ ఏం చేశారు?’’ -
400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం: బీజేపీపై ఎంపీ శశిథరూర్ సెటైర్లు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామంటూ బీజేపీ చెప్పడం ఒక జోక్ అని అన్నారు. కాషాయ పార్టీకి 300 సీట్లు రావడం ఆసాధ్యమని, కనీసం 200 స్థానాల్లో గెలవడం కూడా సవాలేనని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికే తన ఓటమిని అంగీకరించిందన్నారు.ఈ మేరకు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని చెప్పారు. మొత్తంగా దక్షిణ భారత్‌లో 2019 ఫలితాల కంటే దారుణంగా ఫెయిల్ అవుతుందని చెప్పారు.కాగా గత నెల 26న పోలింగ్ జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో శశిథరూర్ తిరువనంతపురం స్థానం నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ నుంచి పీ రవీంద్రన్ పోటీ పడుతున్నారు. తిరువనంతపరంలో తన గెలుపు చాలా సులువగా ఉంటుందని ఆయన చెప్పారు.ఇక గత మూడుసార్లు ఆయన తిరువనంతపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈసారి కూడా గెలిస్తే నాలుగో సారి వరుసగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పటి వరకు 190 స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయని, వాటిల్లో ఎక్కువ శాతం తమకే అనుకూల ఫలితాలు వెలుబడే ఛాన్సు ఉన్నట్లు చెప్పారు. -
శశి థరూర్ కీలక వ్యాఖ్యలు.. రాజీవ్ చంద్రశేఖర్ ఘాటు సమాధానం
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు 'శశి థరూర్' తనమీద చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. ఒక ఎంపీ ఎంత చేయగలడో, చేయలేడో అర్థం కావడం లేదని, అతనికి 'అవగాహన లేదు' అని రాజీవ్ చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపైన రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పని చేయని వ్యక్తి నుంచి తనకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. నేను ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నప్పుడు.. కొన్ని సమస్యలు నా దృష్టికి వస్తాయి. వాటిని నేను తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరశాల నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై స్థానికులతో ముచ్చటించారు. చాలా మంది ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇది (పరశాల) ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం, చాలా మంది ప్రజలు సాంప్రదాయ వ్యవసాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎటువంటి పురోగతిని చూడలేదు. ఉద్యోగాలు, అభివృద్ధి లేకుండా విసిగిపోయారు. అధిక నిరుద్యోగిత రేటు గురించి యువత ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. #WATCH | When asked about Congress MP and candidate against him in Thiruvananthapuram, Shashi Tharoor's statement "he has no understanding how much an MP can do and cannot do", Union Minister Rajeev Chandrasekhar says, "That is fine. I don't want any certificates from a person… pic.twitter.com/cZ3o0aijdd — ANI (@ANI) April 23, 2024 -
బస్తీ మే సవాల్.. శశి థరూర్ వర్సెస్ కేంద్ర మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్‌ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్‌ను స్వీకరించారు శశి థరూర్. ‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్‌ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్‌పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
శశి థరూర్‌కు రూ. 55 కోట్ల ఆస్తులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ సీటును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తనకు రూ.55 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.49 కోట్లు కాగా, రూ.6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4.32 కోట్ల ఆదాయం వచి్చనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండు కార్లు ఉన్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రూ.23 కోట్ల ఆస్తులు, 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.35 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు థరూర్ వెల్లడించారు. -
శశి థరూర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..
తిరువనంతపురం: లోక్‌సభ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నామినేషన్స్ ప్రక్రియలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ 'శశి థరూర్' మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. శశి థరూర్ నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో తన వద్ద రూ. 49 కోట్లకుపైగా స్థిరాస్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. 19 బ్యాంకు ఖాతాల మొత్తాలలో డిపాజిట్లు, వివిధ బాండ్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. అతని అఫిడవిట్ ప్రకారం.. చరాస్తులలో రూ. 32 లక్షల విలువైన 534 గ్రాముల బంగారం, రూ. 36,000 నగదు ఉన్నట్లు వెల్లడించారు. పాలక్కాడ్‌లోని 2.51 ఎకరాల వ్యవసాయ భూమి, రాష్ట్ర రాజధానిలో రూ. 52 లక్షల విలువైన నివాసం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఒక మారుతి సియాజ్ కారు, రెండు మారుతి ఎక్స్ఎల్6 కార్లు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇలా మొత్తం మీద శశి థరూర్ తన నామినేషన్ పత్రాల్లో రూ. 55 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. 2014లో శశి థరూర్ ఆస్తులు విలువ రూ. 23 కోట్లు కాగా.. 2019లో ఆస్తులు రూ. 35 కోట్ల కంటే ఎక్కువని తెలిసింది. ఇప్పుడు తాజాగా ఈయన ఆస్తులు రూ. 55 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ?..శశి థరూర్ సమాధానమిదే
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలన్ని ప్రచారంపై దృష్టి సారించాయి. ముచ్చటగా మూడోసారి ఆధిక్యం సాధించి కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తోంది. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు ఆయన్ను అడిగిన ప్రశ్నకు థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది. అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరి మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ వైవిధ్యం, బహుళత్వం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటాం. Yet again a journalist has asked me to identify an individual who is the alternative to Mr Modi. The question is irrelevant in the Parliamentary system. We are not electing an individual (as In a presidential system), but a party, or coalition of parties, that represents a set… — Shashi Tharoor (@ShashiTharoor) April 3, 2024 ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం మోదీకి ప్రత్యామ్నాయం అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల సమూహం. వారు తమ అహాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలపై వాటిపై పోరాడతారు. అందులో నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలన్నది తర్వాతి విషయం. మన ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యం’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. The beloved leader of Thiruvananthapuram @ShashiTharoor filed his nomination today. He is going to win with record margin to be on the forefront of restoring democracy and safeguarding the constitution.#TharoorForTVM #UDF #VoteForCongress pic.twitter.com/YTRyT2hZ4g — Congress Kerala (@INCKerala) April 3, 2024 కాగా కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శశిథరూర్.. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇరకరడ బీఊసీ పేం,ఇచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. సీపీఐ నుంచి పన్నియన్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. -
‘సీఏఏ’పై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఏఏ చట్టం రాజ్యాంగం పరంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద తప్పు. పౌరసత్వం చట్టంలో మతాల ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. చట్టం పరిధిలో నుంచి ఒక మతాన్ని తప్పించకుండా ఉండి ఉంటే మేం సీఏఏను ఆహ్వానించి ఉండే వాళ్లం’ అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా, సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోమవారం (మార్చ్11) కేంద్ర ప్రభుత్వం రూల్స్ నోటిఫై చేసింది. ఇదీ చదవండి.. సీఏఏపై దళపతి విజయ్ ఏమన్నారంటే.. -
‘చాలా భయంకరం, ఇలా మీరు చేయకండి’: ఇటలీలో కేరళ వైద్యుడి చేదు అనుభవం
కేరళకు చెందిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన వైద్యుడికి చెందిన ఇటలీలో పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు , కొంత నగదున్న తన వాలెట్‌ను జేబు దొంగలు కొట్టేశారు. దీంతో దేశం కాని దేశంలో ఇబ్బందులు పడ్డారు. చివరికి కాంగ్రెస్ ఎంజీ శశిథరూర్ జోక్యంతో అత్యవరసర పాస్‌పోర్ట్‌ల జారీలో భారత కాన్సులేట్ సహాయం చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఈ ఘటన మార్చి 5న ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు ఇటలీలోని మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన డయాబెటిక్ రీసెర్చ్ చేస్తున్న జోతిదేవ్ కేశవదేవ్, అతని భార్య సునీతతో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లారు. ఫ్లోరెన్స్‌కు రైలులో వెళ్లేందుకు మిలన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు కొద్దిగా ఆలస్యమైంది. ఇంతలో రైలు రావడంతో లగేజీతో ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగెత్తుతున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కేటుగాడు (ఆఫ్రికన్-అమెరికన్) వీరి బ్యాగును కొట్టేశాడు. 10 నిమిషాల తర్వాత సునీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు నగదుతో ఉన్న పర్సు పోయిందని గ్రహించారు. దీంతో షాక్ తిన్న దంపతులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు తరువాత భారత కాన్సులేట్‌ను సంప్రదించమని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ని సంప్రదించారు. ఆయన వేగంగా స్పందించి, ఇటలీలోని భారత కాన్సులేట్‌కు సమాచారం అందించారు. ఫలితంగా ఇటలీలోని భారత కాన్సులేట్ జనరల్ అతుల్ చవాన్ జోతిదేవ్ దంపతులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచి వెంటనే ఇద్దరికీ అత్యవసర పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు గంటలోపే తమకు రెండు అత్యవసర పాస్‌పోర్ట్‌లను అందించారు. దేశం కాని దేశంలో పాస్‌పోర్ట్, వాలెట్ పోగొట్టుకోవడం ఎంత భయంకరమైందో వివరిస్తూ జోతిదేవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు విదేశాలకు వెళ్లినపుడు, డబ్బులు, ముఖ్యంగా పాస్‌పోర్ట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత్తగా ఉండటం వల్ల తమకెదురైన ఈ అనుభవం నుంచి తోటి పర్యాటకులు నేర్చుకోవలసిన పాఠం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం సుఖాంతం కావడంపై శశి థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. Glad it all worked out in the end @jothydev ! So pleased our consulate did what was needed so well. @MEAIndia https://t.co/2pTt4DFd4u — Shashi Tharoor (@ShashiTharoor) March 11, 2024 -
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ పురస్కారం
కాంగ్రెస్ ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ లభించింది. ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్.. శశి థరూర్‌ను సత్కరించారు. ఆగస్టు 2022లో థరూర్‌కు ఈ అవార్డును అందజేస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం అందించినందుకు ఫ్రాన్స్‌కు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసినందుకు, అంతర్జాతీయ శాంతి, సహకారంలో చేసిన కృషికి గుర్తింపుగా థరూర్‌కు ఈ గౌరవం లభించిందని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో అధికారులు.. శశి థరూర్ ప్రతిభ, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా, భారతదేశంలో రాజకీయ నేతగా, రచయితగా థరూర్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో థరూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా థరూర్ పనిచేశారు. థరూర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించారు. థరూర్ ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. కమ్యూనికేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. -
‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్’.. ఎంపీ శశి థరూర్ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమన్ని మర్చిపోయిందని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలకు శశి థరూర్ తప్పుపట్టారు. ‘ఎన్డీయే అంటే.. నో డేటా అవైలబుల్. గత పదేళ్లలో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ధనవంతులకు ఖర్చు చేస్తే.. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారని కేంద్రం అనుకుంటుంది. .. ఆర్థిక వ్యవస్థలో అందరూ భాగస్వాములు కావాలి. కానీ, కేంద్రం అలా చేయకుండా కేవలం మూల ధన వ్యయంపైనే దృష్టి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థ, పేదవారిపై ఈ బడ్జెట్ ఏ ప్రభావం చూపదు. ఈ విషయాన్ని లోక్‌సభ గ్రహించాలి’ అని శశిథరూర్ అన్నారు. -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
ఎంపీగా శశి థరూర్ పోటీ ఇదే చివరిదా!
తిరువనంతపురు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, ఎంపీ శశి థరూర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్ సభ స్థానంలో యువత అవకాశం కల్పిస్తానని అన్నారు. దీంతో ఆయన రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలే చివరివి కానున్నాయా అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండలేరని అన్నారు. ఒకానొక సమయం వస్తుందని అప్పుడు తప్పకుండా వైదొలగి యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇదే తన ఆలోచనని తెలిపారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్లో 2024 పార్లమెంట్ ఎన్నికలు తన చివరి ఎన్నికలని శశి థరూర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గురువారం మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికలు నా చివరి ఎన్నికలని అనలేదు’ అని 67 ఏళ్ల శశి థరూర్ స్పష్టం చేశారు. ఆయిన మళ్లీ తిరువనంతపురం లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. శశి థరూర్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తిరువనంతపురంలో ఎంపీగా గెలుపొందారు. సమీప అభ్యర్థి రామచంద్ర నాయర్(సీపీఐ)పై 95వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శశి థరూర్ గెలుపొందారు. చదవండి: హఫీజ్ సయీద్‌ను అప్పగించండి -
‘దేవాలయాలు.. ప్రభుత్వ విధి కాదు’ కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
అయోధ్యలో జనవరి 22న ఘనంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వేల మంది ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేని తెలిపారు. మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అన్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల నుంచి పక్కదారి పడతాయని తెలిపారు. Was interrogated by the waiting press, wanting to know if I would be going to Ayodhya on January 22. I told them I hadn’t been invited but I saw religion as a personal attribute and not one for political (mis)use. I also pointed out that by making such a major news story of the… pic.twitter.com/LQpybKbT3t — Shashi Tharoor (@ShashiTharoor) December 27, 2023 దేవాలయాలను పర్యవేక్షించడం ప్రభుత్వం విధి కాదని అన్నారు. నిరుద్యోగం, ధర పెరుగదల, ప్రజల సంక్షేమం, దేశ భద్రత మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని తెలిపారు. అయితే మీడియా రామ మందిర ప్రారంభోత్సవం మీద దృష్టి పెట్టడంతో.. దేశంల్లో ఉన్న పలు సమస్యలు పక్కదారి పడతాయని ‘బీజేపీ’ పేరు ఎత్తకుండానే ‘ఎక్స్’ ట్వీటర్ వేదికగా శశి థరూర్ విమర్శలు గుప్పించడం గమనార్హం. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’ -
సస్పెన్షన్ల వేళ.. నితిన్ గడ్కరీని కలిసిన శశిథరూర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసుపై ఉభయ సభల్లో గత రెండు మూడు రోజులుగా గందరగోళం నెలకొంటోంది. దుండగుల చొరబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని విపక్షాలు పట్టుబడటంతో సభకు ఈ రోజు కూడా అంతరాయం జరిగింది. నేడు లోక్‌సభలో 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేరళలోని జాతీయ రహదారి-65ను పూర్తి చేసినందుకు గాను నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. 1/2 Took the opportunity, amid the LokSabha disruption, to thank @nitin_gadkari for his excellent cooperation in completing work on the NH66 from Kazhakuttam to Karode (which will one day offer a 4-lane link from Thiruvananthapuram to Kanyakumari).I initiated this project pic.twitter.com/UBETf7gM4o — Shashi Tharoor (@ShashiTharoor) December 19, 2023 'కాళకుటం నుంచి కరోడ్ వరకు ఎన్‌హెచ్-65ను పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్వవాదాలు. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్ల రహదారికి భవిష్యత్‌లో ఇది అనుసంధానం అవుతుంది. ఈ రహదారి అభివృద్ధి పనులను నేనే ప్రారంభించాను. ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్ లైన్లు, మెరుగైన అనుసంధానం కోసం నియోజక వర్గం ప్రజల అభ్యర్థనల మేరకు కేంద్ర మంత్రిని కలిశాను. సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.' అని శశిథరూర్ ట్వీట్ చేశారు. మంగళవారం సస్పెన్షన్ అయిన ఎంపీల్లో శశిథరూర్ కూడా ఒకరు. ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు -
శశిథరూర్లాగా ఇంగ్లీష్ గిట్ల మాట్లాడాలే...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరుదైన, పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు అనేది తెలిసిన విషయమే. అతడి ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన జే అనే టీచర్ ‘శశి థరూర్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఈజ్ బ్యూటీఫుల్’ అనడమే కాదు అతడిలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడాలంటే అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జే పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. శశి థరూర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియోలను ప్లే చేస్తూ.... ‘చూడండి ఈ పదాన్ని ఎలా పలికాడో. ఆ పదాన్ని ఎలా స్ట్రెస్ చేశాడో’ అంటూ చెబుతూ పోతాడు జే. -
ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ అలర్ట్.. మీ ఫోన్ హ్యాక్ అవుతుందంటూ వార్నింగ్
న్యూఢిల్లీ: పలువురు లోక్‌సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసెజ్ అందుకున్న వారిలో త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభత్వం తన ఫోన్, ఈ-మెయిల్‌ను హ్యక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తన ఫోన్‌కు వచ్చిన హెచ్చరిక మెసెజ్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో చేశారు. ‘ప్రభుత్వం నా ఫోన్, ఈ-ఇమెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి టెక్స్ట్, ఈ మెయిల్ వచ్చింది. మీ భయం నన్ను మీపై జాలిపడేలా చేస్తుంది’ అంటూ అదానీ, పీఎంవో, హోమంమంత్రి కార్యాలయాలను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేశారు. So not just me but also @MahuaMoitra has received this warning from Apple. Will @HMOIndia investigate? https://t.co/aS01YQpRpB — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 31, 2023 అదే విధంగా శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ, తను, మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసెజ్ అందినట్లు మహువా పేర్కొన్నారు. ఆమెకు అందిన ఈ మెసెజ్‌లో ‘హెచ్చరిక:మీ యాపిల్ ఐడీతో అనుసంధానించిన ఐఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఐఫోన్‌ను టార్గెట్ సేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఉంది. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫోన్, ఈ-మెయిల్ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్లో పీఎంవోను ట్యాగ్ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్లో పంచుకున్నారు. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 Received an Apple Threat Notification last night that attackers may be targeting my phone ḳhuub parda hai ki chilman se lage baiThe haiñ saaf chhupte bhī nahīñ sāmne aate bhī nahīñ pic.twitter.com/u2PDYcqNj6 — Asaduddin Owaisi (@asadowaisi) October 31, 2023 -
కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్!
ప్రస్తుతం ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. 'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టెల్లో దాండియా నృత్యం' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Attention Gujarati sisters! This Navaratri, check out dandiya Kerala style! pic.twitter.com/tjNcmNd7oN — Shashi Tharoor (@ShashiTharoor) October 16, 2023 -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్‌పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
యోగాకు మొదట ప్రాచుర్యం కల్పించింది ఆయనే..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా మన ప్రస్తుత ప్రభుత్వం తోపాటు అందుకు మొదట పునాది వేసిన మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కూడా గుర్తు చేసుకోవాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగాకు మొట్టమొదట ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని గుర్తు చేసి ఆయన యోగా చేస్తున్న ఫోటోను జతచేసి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. " యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న తాపత్రయంతో యోగాను జాతీయ విధానాల్లో చేర్చిన నెహ్రూ గారికి కృతఙ్ఞతలు. మన శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడే ఈ ప్రాచీన విద్యను అందరం ఆచరిద్దాం." అని ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి కొనసాగింపుగా శశి థరూర్ రాస్తూ.. "భారత ప్రభుత్వం తోపాటు యోగాకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు దక్కాలి. యోగా మనలోని అంతర్గత శక్తిని ఉత్తేజింప చేస్తుందని దశాబ్దాలుగా నేను వాదిస్తూనే ఉన్నాను. ఐక్యరాజ్యసమితి ద్వారా యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం గొప్ప విషయం." అని రాశారు. Indeed! We should also acknowledge all those who revived & popularised yoga, including our government, @PMOIndia & @MEAIndia, for internationalising #InternationalYogaDay through the @UN. As I have argued for decades, yoga is a vital part of our soft power across the world &… https://t.co/WYZvcecl0Q — Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2023 ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో -
ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్
కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు. ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి) -
ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక
ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం చల్లారడం లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ పేరే మార్మోగుతోంది. అంతలా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మే 5న విడుదల కానున్న ఈ సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. రిలీజ్ డేడ్ సమీపిస్తన్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వాన్నికి ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన్నట్లు తెలిపాయి. అన్ని థియేటర్లలో పీఎస్-2(పొన్నియన్ సెల్వన్) నడుతస్తోందని, ప్రభుత్వంతోపాటు ధియేటర్ యాజమానులు ది కేరళ స్టోరీని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. బ్యాన్ కోరుకోవడం లేదు.. కానీ సినిమా మేకర్స్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం విమర్శలు గుప్పించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు. తాను సినిమాను బ్యాన్ చేయాలని కోరుకోవడం లేదంటూనే.. భావప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారదని మండిపడ్డారు. వాస్తవికతను తప్పుగా చూపించారని, దీనిపై గొంతెత్తి నినాదించే హక్కు కేరళ ప్రజలకు ఉందని ఉందని తెలిపారు. మరోవైపు ది కేరళ స్టోరీ చిత్రానికి బీజేపీ మద్దతిస్తోంది. Let me stress, I am not calling for a ban on the film. Freedom of expression does not cease to be valuable just because it can be misused. But Keralites have every right to say loud & clear that this is a misrepresentation of our reality. https://t.co/sEIG91mjSP — Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2023 కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది. -
అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్షపడి, అనర్హత వేటు పడగానే ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. ఈ మేరకు శశి థరూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఒకరంగా ఇది అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా భావించే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండటమే చూశాం మనం. కానీ నేడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాయి ఆయా పార్టీలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్‌లోని మమతా బెనర్జీ, హైదరాబాద్‌లో చంద్రశేఖర్ తోసహా అందరూ రాహుల్‌కి మద్దతుగా నిలిచారు. గతంలో కాంగ్రెస్‌తో ఈ పార్టీలన్నీ ఏవిధంగానూ సంబంధం కలిగి లేవు. బీజేపీ చర్య అనాలోచిత పరిణామాల చట్టల పరిధిలో తొలిస్థానంలో ఉంది. ఆయా పార్టీ ముఖ్యమంత్రులందరూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే ఈ చర్యను ఖండించారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. అంతేగాదు కాంగ్రెస్‌తో మాకు విభేదాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం అనేది సరి కాదని అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అదీగాక పారపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ఇద్దరూ వెనకబడినవారు కానందున రాహుల్‌పై వచ్చిన అభియోగాలు అర్థరహితమైనవి. వారంతా తమ అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి విలాసవంతంగా జీవిస్తున్నారు. వారిని వెనుకబడిన తరగతుల వారుగా చెబుతూ..ఓబీసీలపై దాడి అని వ్యాఖ్యనించి చెబుతున్న వారి ఇంగితజ్ఞానం విస్మయానికి గురి చేస్తోంది. అని ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు థరూర్ కూడా రాహుల్‌పై కోర్టు విధించిన శిక్ష పట్ల అభ్యంతరం చెబుతూ..ఈ కేసు బలహీనంగా ఉంది. మాకు మంచి న్యాయవాదులు ఉన్నారు. ఫిర్యాదుదారుడికి బలహీనమైన కేసు ఇది అని అన్నారు. అలాగే కేసు పెట్టిన నాల్గవ మోదీ..పూర్ణేశ్ మోదీ తనను ఏ రకంగా టార్గెట్ చేశారని నిరూపించగలడు అని శశి థరూర్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు ఆది నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో మోదీని లక్ష్యంగా చేసుకున్నందున ఫిర్యాదుదారునిగా ప్రధాని మోదీ ఉండాలి కానీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కాదని ఆయన వాదించారు. (చదవండి: ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్) -
Ind Vs Aus: పాపం గిల్ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి?
India Vs Australia: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నేపథ్యంలో కేఎల్ రాహుల్ స్థానం గురించి చర్చ జరుగుతున్న వేళ సంజూ శాంసన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేరళ బ్యాటర్‌కు అవకాశాలు లభించకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తన గళం వినిపించారు. సంజూకు అండగా నిలబడ్డారు. జర్నలిస్టు శేఖర్ గుప్తా ట్వీట్‌కు బదులిస్తూ సంజూకు జరుగుతున్న అన్యాయం మాటేమిటి అని ప్రశ్నించారు. కాగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లోనూ అతడి ఆట తీరు మారలేదు. దీంతో మూడో టెస్టులో రాహుల్‌ను తప్పించి ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు ఉధృతమయ్యాయి. బీసీసీఐ కూడా అందుకు తగినట్లే ముందు సాగుతున్నట్లు కనిపిస్తోంది. గిల్ ఎందుకు ఎదురుచూడాలి? ఈ నేపథ్యంలో శేఖర్ గుప్తా.. ‘‘రాగద్వేషాలు, భావోద్వేగాలకు అతీతంగా ఉన్నంత కాలం భారత క్రికెట్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2017 నుంచి 49 టెస్టుల్లో టాపార్డార్‌లో ఆడి కేవలం సగటు 25 కలిగి ఉన్న కేఎల్ రాహుల్ స్థానం గనుక ఇంకా పదిలంగా ఉంటే.. ఈ అభిప్రాయం మారిపోయే అవకాశం ఉంటుంది. గిల్ ఎందుకు ఎదురుచూడాలి. ప్రతిభ ఉన్న వాళ్ల మాటేమిటి?’’ అని ట్వీట్ చేశాడు. మరి సంజూ సంగతేంటి? ఇందుకు స్పందించిన శశి థరూర్.. ‘‘మరి సంజూ శాంసన్ సంగతేంటి? వన్డేల్లో 76 సగటుతో ఉన్నాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జట్టులో అతడిని పరిగణనలోకే తీసుకోలేదు. విఫలమవుతున్న ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే వాళ్ల కోసం ప్రతిభ ఉన్న ఆటగాళ్లను బలిచేయడం సరికాదు కదా!’’ అని బదులిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు దూరం కాగా హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ నా భాగస్వామి తల్లి కాబోతుంది: స్టార్ మహిళా క్రికెటర్ And what about @IamSanjuSamson ? Averaging 76 in ODIs and yet again omitted from the ODI squad against Australia. It’s all very well to give non-performers a long rope but surely not at the expense of talented performers? https://t.co/tg56JJMTue — Shashi Tharoor (@ShashiTharoor) February 21, 2023 -
అందుకేనా!.. ముషారఫ్ రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంది: బీజేపీ
పాక్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ మృతికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముషారఫ్ శాంతి కోసం శత్రువుగా మారిన నిజమైన శక్తి అని ఆయన అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా శశిథరూర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బాలాకోట్ దాడులను అనుమానించి సొంత ఆర్మీ చీఫ్‌ని గూండాగా పిలిచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది ఫైర్ అయ్యారు. పైగా ముషారఫ్‌పై తెగ అభిమానం కురిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ముషారఫ్ ఒకప్పుడు భారతదేశానికి నిష్కళంకమైన శత్రువు కానీ 2002 నుంచి 2007 మధ్య శాంతికి నిజమైన శక్తిగా మారాడని శశిథరూర్ ట్విట్టర్లో అన్నారు. ఆ రోజుల్లో తాను యూఎన్‌లో ఉండగా ఏటా అతన్ని కలుసుకునేవాడినని చెప్పారు. అతను వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వ్యవహరించేవాడని పేర్కొన్నారు. దీంతో షెహజాద్ ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్లను ప్రశంసించే ముషారఫ్ రాహుల్ గాంధీని కూడా ప్రసంసించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధానికి కారకుడు, ఉగ్రవాదానికి మద్దతుదారుడు అయిన ముషారఫ్‌ని ప్రశంసించడానికి బహుశా అదేనా కారణం అంటూ విరుచుకుపడ్డారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను షెహజాద్ ప్రస్తావించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. అంతేగాదు నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ లేదా పాకిస్తాన్ కోసమో కాదు. నిజంగా శాంతి కావాలంటే మోదీ సాబ్ వద్దు అని అన్నారు. అలాగే తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీకి వెళ్లినప్పుడూ.. రాహుల్ గాంధీ తన కొడుకుని టీ తాగడానికి ఆహ్వానించారని చెప్పారు. అలాగే మన్మోహన్ సింగ్ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించారని అన్నారు. తాను భారత్‌తో క్రికెట్‌ని ప్రోత్సహించేవాడినని, దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచే వాటిని తాను ప్రోత్సహిస్తానని ముషారఫ్ చెప్పుకొచ్చారు. కాగా అమిలోయిడోసిస్తో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్ ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. “Pervez Musharraf, Former Pakistani President, Dies of Rare Disease”: once an implacable foe of India, he became a real force for peace 2002-2007. I met him annually in those days at the @un &found him smart, engaging & clear in his strategic thinking. RIP https://t.co/1Pvqp8cvjE — Shashi Tharoor (@ShashiTharoor) February 5, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
‘బీజేపీ 50 సీట్లు కోల్పోవడం ఖాయం!’
తిరువనంతపురం: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంటోంది. పోటాపోటీ విమర్శనాస్త్రలు సంధించుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష బీజేపీ-కాంగ్రెస్‌లు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి .. 2019 తరహా మ్యాజిక్ ఏమాత్రం పని చేయదని జోస్యం చెప్పారాయన. అంతేకాదు.. లోక్‌సభ తరపున బీజేపీ 50 సీట్ల దాకా కోల్పోవడం ఖాయమంటూ శుక్రవారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరై థరూర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ సీట్లు కోల్పోతుంది. అలాగే.. కేంద్రంలో కూడా అధికారం కోల్పోయే అవకాశాలను కొట్టిపారేయలేం కూడా. అందుకు 2019 ఎన్నికలే ఓ నిదర్శనం.. 2019 ఏడాదిని ఓసారి పరిశీలిస్తే.. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పుల్వామా దాడులు, బాలకోట్ స్ట్రైక్.. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీకి బాగా కలిసొచ్చాయి. కానీ, మళ్లీ అది పునరావృతం కాకపోవచ్చని ఈ తిరువనంతపురం ఎంపీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ యాభై స్థానాల్లో బీజేపీ ఓడితే.. మిగతా పార్టీలన్నీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు అవుతుంది. అలాంటప్పుడు అవతలి పార్టీ నుంచి ఎంపీలను లాక్కుని అధికార ఏర్పాటు చేయడం లేదంటే ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకోవడం లాంటి ప్రయత్నాలను బీజేపీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పలేం అంటూ థరూర్ కామెంట్లు చేశారు. -
శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. ఆ కేసులో కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్‌కు క్లీన్చిట్ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ.. పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్‌కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఇదీ కేసు.. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. శశిథరూర్‌కు ఘోర అవమానం!
గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న వేళ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో శశిథరూర్ పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది. తాజాగా.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తయారుచేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీనియర్ నేత శశిథరూర్‌కు స్థానం కల్పించలేదు. దీంతో, శశిథరూర్‌కు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురైంది. అయితే, గుజరాత్లో ప్రచారం చేసేందుకు శశిథరూర్‌ను కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఆహ్వానించింది. కాగా, క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతో ప్రచారం నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అయితే, లిస్ట్‌లో పలు రాష్ట్రాల లీడర్లకు స్థానం కల్పించి శశిథరూర్‌కు చోటు కల్పించకపోవటంతో కాంగ్రెస్‌లో ముసలం మరోసారి బహిర్గతమైందని పలువురు పొలికటల్ లీడర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును తయారు చేసింది. లిస్టులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, సచిన్ పైలట్, కన్హయ్య కుమార్, అశోక్ చవాన్, తదితరులకు చోటు కల్పించింది. Congress releases a list of star campaigners for #GujaratElections. Party chief Malliakrjun Kharge, UPA chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi, general secy Priyanka Gandhi Vadra, CMs Ashok Gehlot-Bhupesh Baghel, Sachin Pilot, Jignesh Mevani, Kanhaiya Kumar to campaign. pic.twitter.com/wXr3NAGdcS — ANI (@ANI) November 15, 2022 -
వాళ్లూ అదే అంటున్నార్సార్! మీకు వెయ్యి ఓట్లెలా వచ్చాయని..!
వాళ్లూ అదే అంటున్నార్సార్! మీకు వెయ్యి ఓట్లెలా వచ్చాయని..! -
శశి థరూర్‌కు షాక్.. ‘ఓటింగ్ అక్రమాల’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసుదన్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్ తరఫు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్ పోలింగ్ ఏజెంట్. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయటం, పోలింగ్ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
కాంగ్రెస్‌లో ఖర్గే హవా!
అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష పదవికి ‘నిజమైన’ ఎన్నిక జరగటం ఇది ఆరోసారి. హైకమాండ్ సంస్కృతి, దాని అండదండలతో రాష్ట్రాల్లో వేళ్లూను కున్న ముఠాలు కాంగ్రెస్‌కు పెను భారమై అది అవసాన దశకు చేరువవుతున్న వేళ ఈ ఎన్నికలు జరిగాయి. గతంలో ‘బయటి వ్యక్తులు’ పార్టీ అధ్యక్షులైన సందర్భాలున్నా అవి అధికారంలో ఉండగా జరిగినవే. విపక్షంలో ఉంటూ, గాంధీ కుటుంబసభ్యులు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొం టున్నా ‘బయటి వ్యక్తి’ అధ్యక్షుడు కావటం ఇదే తొలిసారి. పార్టీ సారథ్యం కుమారుడు రాహుల్ చేతుల్లోనే ఉండాలని అధినేత సోనియాగాంధీ తాపత్రయపడ్డారు.కొద్దికాలం అధ్యక్ష పీఠంపై ఉన్న రాహుల్ తీరా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పొందాక అందుకు నైతికబాధ్యత వహించి తప్పుకున్నారు. ఆ తర్వాత చాన్నాళ్లపాటు ఆయన్ను బతిమాలటం, బుజ్జగించటం చేశారు. కానీ అవి ఫలించకపోవటంతో విధిలేక కేవలం ఆర్నెల్లపాటు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చూస్తానని సోనియా ప్రకటించారు. అది జరిగి కూడా మూడేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లకు ఎన్నికలు నిర్వహించటం, సుదీర్ఘ అనుభవం, స్వతంత్ర భావాలు ఉన్న దళిత నాయకుడు ఖర్గే అధ్యక్షుడు కావటం మెచ్చదగ్గ పరిణామం. అయితే ఆయనను గాంధీ కుటుంబసభ్యులు స్వతంత్రంగా పని చేయనిస్తారా, వెనకనుంచి శాసించే విధానాలకు స్వస్తిపలుకుతారా అన్నది మున్ముందు గానీ తెలి యదు. సమస్యలు తలెత్తినప్పుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారన్న అభిప్రాయం కలగక పోతే మొత్తం వ్యవహారం మొదటికొస్తుంది. ఆయన కీలుబొమ్మ అధ్యక్షుడిగా మిగిలిపోతారు. అధ్యక్ష ఎన్నికలు ఏ పరిస్థితుల్లో జరిగాయో, వాటి తీరుతెన్నులేమిటో అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ పదవికి గాంధీ కుటుంబ వీరవిధేయుడిగా ముద్రపడిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను అనుకున్నారు. సీఎం పదవినుంచి వైదొలగటం తప్పనిసరని తేలాక ఆయన చిన్న సైజు తిరుగుబాటు ప్రకటించటం పార్టీని సంక్షోభంలో పడేసింది. ఆ తర్వాతే ఖర్గే పేరు తెరపైకొచ్చింది. ఈ ఎన్నికల్లో ‘అధికారిక అభ్యర్థి’ ఎవరూ లేరని రాహుల్ ఒకటికి రెండుసార్లు చెప్పినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అనధికార అధికారిక అభ్యర్థి ఖర్గేయేనని కాంగ్రెస్ శ్రేణులకు లోపాయి కారీగా సందేశం వెళ్లిపోయింది. అందుకే ఆయనపై పోటీపడిన శశిథరూర్‌కు ఎక్కడా పెద్దగా ఆదరణ దొరకలేదు. ఆఖరికి ఉత్తరకుమారులుగా, జీ–23 నేతలుగా ముద్రపడినవారు సైతం ఆయన వెనక లేరు. తమలో ఒకరు పోటీచేస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వారిలో అత్యధికులు మౌనంగా ఉన్నారు. మిగిలినవారు ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి తమ వీర విధేయత చాటుకున్నారు. థరూర్‌కు ద్వితీయశ్రేణి నేతల్లో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. ‘అనుభవానికి’ పట్టం కట్టాలంటూ కొందరు నేతలు ప్రకటించి, పోటీనుంచి తప్పుకోమని పరోక్షంగా థరూర్‌కు సూచించారు. ఇవన్నీ గుర్తించబట్టే ఈ ఎన్నికల్లో తనకు సమానావకాశం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. పార్టీలో ఇకపై మీ పాత్రేమిటన్న ప్రశ్నకు జవాబుగా ఆ సంగతిని ఖర్గే, సోనియా నిర్ణయిస్తారని ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే రాహుల్‌గాంధీ నోరుజారటం గమనిస్తే థరూర్ ఆరోపణలో వాస్తవముందని తేలుతుంది. అనుభవాన్ని మించిన గురువు లేరని నానుడి. దీర్ఘకాలం అధికారానికి దూరమైనా కాంగ్రెస్ దీన్ని గుర్తించలేకపోయింది. ఎన్నడూలేని విధంగా అత్యంత బలహీన స్థితిలో పడ్డామని తెలిసినా సోనియా, రాహుల్ పాత పద్ధతులకు స్వస్తి చెప్పలేకపోయారు. పదవులపై వ్యామోహం లేదంటూనే తెరచాటుగా పావులు కదిపే విధానాలు వదులుకోలేదు. జవాబుదారీతనం లేకుండా పెత్తనం చెలా యించటం, బెడిసికొట్టిన పక్షంలో సంబంధం లేనట్టు ఉండిపోవటం రాహుల్ ఇన్నాళ్లుగా చేసిన పని. దాని పర్యవసానంగానే పార్టీ అస్తవ్యస్థమైంది. వయసురీత్యా ఖర్గే వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ వయసులో చురుగ్గా తిరిగి పార్టీని పరుగెత్తించటం ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్న ఉండనే ఉంది. కాంగ్రెస్ సీనియర్లలో సగం మంది, అనుబంధ సంస్థల నాయకగణంలో 70 శాతంమంది పనికి మాలిన సరుకని ఏడేళ్లక్రితం అప్పట్లో పార్టీ నేత సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. ఏ పదవికైనా గాంధీ కుటుంబానికి విధేయతే గీటురాయిగా మారడంవల్ల వచ్చిపడిన ఉపద్రవమిది. ఖర్గే ముందు సంస్థాగతంగా చాలా సవాళ్లున్నాయి. పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలి. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ తదితరాలను పునరుద్ధరించాలి. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో ముఠా పోరు ముదిరింది. స్వరాష్ట్రమైన కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ వర్గాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. విపక్షంలో ఉన్న తెలంగాణ, కేరళ, పంజాబ్ తదితరచోట్ల కుమ్ములాటలు ఆగటం లేదు. ఇవన్నీ రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ గాలి తీస్తున్నాయి. వీటన్నిటిపైనా గాంధీ కుటుంబ ప్రమేయంలేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. ఇక బీజేపీ దూకుడు సరేసరి. ఏం చేసైనా ఎన్నికల్లో నెగ్గాలని చూడటం, ఓడినపక్షంలో ఫిరాయింపుల పాచిక వాడటం దాని నైజం. సంక్షోభ సమయాల్లో ప్రద ర్శించే చాకచక్యతే నాయకత్వ పటిమను నిగ్గుతేలుస్తుంది. ఖర్గే దాన్ని ఏ మేరకు చూపగలరో వేచిచూడాల్సి ఉంది. -
‘నియంతృత్వ శక్తులపైనే పోరాటం’.. బీజేపీ లక్ష్యంగా ఖర్గే విమర్శలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో గాంధీయేతర తొలి అధ్యక్షుడిగా నిలిచారు. పార్టీ ప్రెసిడెంట్‌గా తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఖర్గే.. పార్టీలో అంతర్గతంగా నిర్వహించే ఎన్నికలు పార్టీని బలోపేతం చేస్తాయన్నారు. కార్యకర్తల అంచనాలకు తగ్గట్లుగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. ‘ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎన్నికలు నిర్వహించటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. శశి థరూర్‌కు నా కృతజ్ఞతలు, అలాగే నా శుభాకాంక్షలు. నాపై పోటీ చేశారు. నన్ను కలిసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. శశి థరూర్‌తో కలిసి పని చేస్తాం. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. సోనియా గాంధీకి నా కృతజ్ఞతలు. ఆమె జీవితం మొత్తం పార్టీకోసమే వెచ్చించారు. ఆమె నాయకత్వంలో పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.’అని పేర్కొన్నారు ఖర్గే. మరోవైపు.. బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు ఖర్గే. మతాల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడతామన్నారు. ‘పార్టీలో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఏమీ ఉండదు. అందరం కలిసి పని చేస్తాం. మేమంతా కలిసి కట్టుగా మతతత్వ వేషధారణలో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్న నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతాం.’అని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన ఖర్గే.. అక్టోబర్ 26న బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. మల్లికార్జున ఖర్గే ఘన విజయం -
అయితే మీరు ఓడిపోతున్నారని ముందే తెలిసిందన్నమాట! మీరు కలిసి పనిచేస్తానన్న ఆయన మీతో కలవాలి కదా?!
అయితే మీరు ఓడిపోతున్నారని ముందే తెలిసిందన్నమాట! మీరు కలిసి పనిచేస్తానన్న ఆయన మీతో కలవాలి కదా?! -
ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా 96 శాతం ఓటింగ్ నమోదైంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్‌లోని పోలింగ్ బూత్‌లో 100 శాతం ఓటింగ్ నమోదు కాగా.. చండీగఢ్‌లోనూ 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐఐసి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 238 ఓట్లకు గాను 228 మంది పీసీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి ఓటు వేయలేదు. ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేశారు. హర్కర వేణుగోపాల్ ల్లక్షద్వీప్లో ఓటేయగా.. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెంగళూరులో ఓటేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో.. స్వాతంత్ర అనంతరం ఆరవసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా ఈ 22 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్టీ శ్రేణుల్లో. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు నిలిచిన సంగతి తెలిసిందే. ► కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరో గంటలో ఓటింగ్ ముగియనుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఓటేశారు. ► బహిరంగంగా, ప్రజాస్వామయుతంగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీ సభ్యులందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ► శశిథరూర్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నిక పోలింగ్ సమయంలో తన ప్రత్యర్ధి శశి థరూర్ గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ మేం మిత్రులం. శత్రువులు కాదు. రాజ్యాంగం ప్రకారం ఐక్య సభలో పోరాడుతున్నాం.. మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను థరూర్‌తో ఫోన్లో మాట్లాడను’ అని తెలిపారు. ► కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్ భవన్లో ఓటేశారు. Maharashtra Congress chief Nana Patole casts his vote to elect the next party president at the Maharashtra Pradesh Congress Committee office in Tilak Bhavan, Mumbai pic.twitter.com/LdzkGEUGOV — ANI (@ANI) October 17, 2022 ► ఓటేసిన రాహుల్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. బళ్లారిలో క్యాంప్సైట్లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఓటు వేశారు. #WATCH | Congress MP Rahul Gandhi casts his vote to elect the next party president at Bharat Jodo Yatra campsite in Ballari, Karnataka (Source: AICC) pic.twitter.com/9Jit8vIpVo — ANI (@ANI) October 17, 2022 ► ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్. Chhattisgarh CM Bhupesh Baghel cast his vote to elect the new party president, at the AICC office in Raipur pic.twitter.com/hWosfBAwmf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 17, 2022 ► ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | Former Prime Minister Dr Manmohan Singh casts his vote to choose the new Congress president pic.twitter.com/ETSvSdHKbk — ANI (@ANI) October 17, 2022 ► ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన ఆమె.. ‘నేను కూడా ఈ క్షణం కోసమే చాలాకాలంగా ఎదురు చూస్తున్నా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆమె తన తనయ ప్రియాంక గాంధీ వాద్రాతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | "I have been waiting for a long time for this thing," says Congress interim president Sonia Gandhi on the party's presidential election pic.twitter.com/9giL5DeOEX — ANI (@ANI) October 17, 2022 #WATCH | Congress interim president Sonia Gandhi & party leader Priyanka Gandhi Vadra cast their vote to elect the new party president, at the AICC office in Delhi pic.twitter.com/aErRUpRVv0 — ANI (@ANI) October 17, 2022 ► తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ► ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేశ్, ఇతర నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. Congress presidential elections | Congress MPs P Chidambaram, Jairam Ramesh and other party leaders cast their votes at the AICC office in Delhi. pic.twitter.com/IUMhCjKdst — ANI (@ANI) October 17, 2022 ► ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఫోన్లో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నట్లు ప్రకటించారు. I believe the revival of Congress has begun: Congress presidential candidate Shashi Tharoor Today I spoke to Mr Kharge and said whatever has happened, we remain colleagues and friends, Tharoor adds. pic.twitter.com/4gv1zR5W99 — ANI (@ANI) October 17, 2022 ► తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఎంపీ శశిథరూర్. ► భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు.. ఓటింగ్‌లో పాల్గొనడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగనకల్లు దగ్గర మీటింగ్ రూంలనే పోలింగ్ బూత్‌లుగా మార్చేశారు. రాహుల్ గాంధీ సహా జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ► ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లను సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం(19 అక్టోబర్) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. కౌంటింగ్‌లో చెల్లని ఓట్లను పక్కన పెడతారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. ► కాంగ్రెస్‌లో సోనియా గాంధీ కుటుంబ జోక్యంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో.. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తటస్థంగా ఉండాలని భావించింది. అందుకే ఇద్దరిలో ఎవరికీ బహిరంగంగా తమ మద్దతును ప్రకటించలేదు. అయితే.. ► మల్లికార్జున ఖర్గేకు కొందరు పీసీసీ చీఫ్‌లు మద్దతు ప్రకటించడం, పార్టీ బేరర్ పదవుల్లో ఉన్న కొందరు ఓటేయాలని పిలుపు ఇవ్వడం పట్ల శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార సంఘానికి కొందరి తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. ► సుదీర్ఘ రాజకీయ అనుభవం, సీనియర్ల అండ, దళిత మార్క్, పైగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం.. మల్లికార్జున ఖర్గేకు కలిసొచ్చే అంశం. ► కాంగ్రెస్ యువజన వర్గాల మద్దతుతో బరిలోకి దిగారు శశిథరూర్. ► సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో.. 9వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు.. ఎక్కడికక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ల మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీలోని 9 వేల మందికి పైగా పీసీసీ ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అ«ధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి మాత్రమే. ఖర్గే ఎన్నిక లాంఛనమే! కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకున్నా గాంధీ కుటుంబం అండదండలతో ఖర్గే బరిలో దిగారు. జీ 23 అసమ్మతి నాయకులతో పాటు ఇతర సీనియర్లూ మద్దతు ప్రకటించడంతో ఆయన గెలుపు లాంఛనంగా కన్పిస్తోంది. అయితే పార్టీలో బ్లాక్ అధ్యక్షుడి నుంచి స్వయంకృషితో ఎదిగిన దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గే (80), అపారమైన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవంతో కొత్త ఆలోచనలు చేసే నాయర్ కమ్యూనిటీకి చెందిన శశిథరూర్ ( 66) మధ్య రసవత్తర పోటీ సాగుతుందని కొందరు యువ నాయకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అనుభవానికి ప్రాధాన్యతనివ్వాలని సంస్థాగతంగా పార్టీ గురించి ప్రతీ అంశం తెలిసిన వారినే గెలిపించాలని ఖర్గే ప్రచారం చేశారు. పార్టీలో మార్పు కోరుకునే వారు, వికేంద్రీకరణకు మద్దతునిచ్చేవారు తనను బలపరచాలంటూ థరూర్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధుల్ని కలుసుకున్న సమయంలో ఖర్గేకి అండగా సీనియర్ నాయకులు నిలబడితే, యువ నాయకులందరూ థరూర్‌కి స్వాగతం పలికిన దృశ్యాలు కనిపించాయి. ఇరువురు నేతలూ తాము గాంధీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనే స్పష్టం చేస్తూ వచ్చారు. గాం«ధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే వారిచ్చే సూచనలు, సలహాలు తాను తప్పక పాటిస్తానని చెబితే గాంధీ కుటుంబ సభుల్ని దూరంగా ఉంచి పార్టీ అధ్యక్షులెవరూ పని చేయలేరని పార్టీ రక్తంలో వారి డీఎన్ఏ ఉందని థరూర్ వ్యాఖ్యానించడం విశేషం. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేక రాహుల్‌గాంధీ పోటీకి దిగడానికి నిరాకరించడంతో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోనియా, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ బళ్లారిలోని ఓటేయనున్నారు. -
‘‘థరూర్‌జీ! పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు’’
అక్టోబర్ 19 పెద్ద విశేషమేం కాదు. అక్టోబర్ 17న జరిగేవి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలే కనుక 19న జరిగే కౌంటింగ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ విజయం సాధిస్తుందా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తుందా అనే ఉత్కంఠ ఏమీ ఉండదు. నేనో, థరూరో ఎవరో ఒకరం గెలుస్తాం. మాలో ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లే కానీ, మాలో ఒకరు ఓడిపోయి, ఒకరు గెలిచినట్లు కాదు. ఈ నిజాన్ని అంగీకరించడానికి శశి థరూర్ ఎందుకు సిద్ధంగా లేరో మరి?! కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా కదా ఆయన ఈ ఎన్నికల్ని మనసా వాచా కర్మణా చూడాలి! థరూర్ గానీ, నేను గానీ ఇప్పుడు ఆలోచించవలసింది హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; తర్వాత జరిగే పది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి; ఆ తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం గురించి. ఏడాదిలో ఇన్ని ఎన్నికల్ని పెట్టుకుని, ఏడాదికోసారి జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలే తన సర్వస్వంగా థరూర్ భావించడం ఏమిటి?! ‘‘ఈ పోటీ న్యాయంగా జరగడం లేదు. అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది’’ అని ఆయన అంటున్నారు! ‘‘థరూర్‌జీ! మీరు అనుకుంటున్నట్లుగా పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు..’’ అన్నాను.. రెండు రోజుల క్రితం ఫోన్ చేసి. నిజానికి ఆ మాట చెప్పడానికి నేను ఆయనకు ఫోన్ చేయలేదు. సోనియాజీ పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్‌పర్సన్‌గా థరూర్‌ని ఎంపిక చేశారని తెలిసి చేశాను. చేసి, ‘‘కంగ్రాట్స్ థరూర్‌జీ..’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ ఖర్గేజీ! మరి నేను కూడా ఇప్పుడే మీకు కంగ్రాట్స్ చెప్పేయమంటారా, అక్టోబర్ 19 వరకు ఆగమంటారా?’’ అని నవ్వుతూ అడిగారు థరూర్. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. సోనియాజీ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆల్రెడీ నేను గెలిచేసినట్లేనని!! ‘‘అప్పుడు కూడా నేనే మీకు కంగ్రాట్స్ చెబుతాను థరూర్‌జీ. ‘మీ’ ప్రయత్నం వల్లనే కదా, పార్టీకి అసలంటూ ఎన్నికలు జరుగుతున్నాయి..’’ అన్నాను. ‘మీ’ అనడంలో నా ఉద్దేశం ‘జి–23’ అని. పార్టీలో ఎన్నికలకు ఒత్తిడి తెస్తూ రెండేళ్ల క్రితం సోనియాజీకి లేఖ రాసిన గ్రూప్ అది. జి–23 అనే మాటకు పెద్దగా నవ్వారు థరూర్. ‘‘ఖర్గేజీ! మీకొకటి తెలుసా? ఆ గ్రూపులో ఉన్నవారెవరూ ఇప్పుడు నాతో లేరు. మీ వైపు వచ్చేశారు. ఆ గ్రూపులో నేను ఉన్నందుకు కూడా ఇప్పుడు నాతో ఎవ్వరూ లేరు. వాళ్లూ మీ వైపే ఉన్నారు. నేనొస్తున్నానని తెలిసి దేశవ్యాప్తంగా పీసీసీ ప్రెసిడెంట్లు పొలాల్లోకి, పక్క ఊళ్లలోకి, లేని పోని సంతాపాల పనుల్లోకి పరుగులు తీస్తున్నారు! మొన్న తెలంగాణలో చూశారు కదా! అక్కడి ప్రెసిడెంట్ మీకు ఒకలా, నాకు ఒకలా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు షాక్ ట్రీట్మెంట్. మీకు స్వీట్ ట్రీట్మెంట్..’’ అన్నారు నవ్వు ఆపకుండా థరూర్. ‘‘థరూర్‌జీ! మీపై నిజంగా వ్యతిరేకత ఉంటే సోనియాజీ మీకు పార్లమెంటరీ ప్యానెల్ పోస్ట్ ఇచ్చేవారా?! సోనియాజీనే స్వయంగా మీకు పోస్ట్ ఇచ్చాక కూడా పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఉంటారా?!’’ అన్నాను. ఆ మాటకు మళ్లీ పెద్దగా నవ్వి.. ‘‘ఖర్గేజీ.. వ్యతిరేకత లేకపోవడం మద్దతు అవుతుందా, మద్దతు ఇవ్వక పోవడం వ్యతిరేకత అవుతుంది కానీ..’’ అన్నారు థరూర్. రేపే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక. ‘‘ఖర్గేజీ వస్తే మారేదేమీ ఉండదు. నేనొస్తే నాతో పాటు మార్పును తెస్తాను’’ అని థరూర్ చెబుతున్నారు. చూడాలి.. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిధులు మార్పు కోసం ఓటేస్తారో, ఏదీ మారకుండా ఉండటం కోసమే ఓటేస్తారో -మాధవ్ శింగరాజు -
కాంగ్రెస్ నేతలు బీజేపీవైపు ఆకర్షితులవుతున్నారు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. కాగా, సోమవారం.. అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శశిథరూర్ మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రణాళికను తెలిపారు. తాను గనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఎక్కువ మంది అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తన వద్ద ప్లాన్స్ ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌తో పాటు హైకమాండ్ కల్చర్ అనేది లేకుండా చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నిలిచిన మల్లికార్జున ఖర్గేపై కూడా శశథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున్ ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. తామేమీ శత్రువులం కాదన్నారు. నాకు మద్దతిచ్చిన వ్యక్తులు తిరుగుబాటుదారులు కాదు, గాంధీలకు వ్యతిరేకం కాదు.. ఇది తప్పుడు భావన. గాంధీలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉంటారు, మేం కూడా ఉంటాం.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సంతోషమే. గెలుస్తామనే స్ఫూర్తితోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ విజయం. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ కోసం పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు.. పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. -
ముందు మీ పార్టీలో ఎన్నికలు పెట్టుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ప్రహసనమంటూ బీజేపీ పేర్కొనడంపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు ముందుగా కాషాయ పార్టీ ఎన్నికలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘మా అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగల సత్తా మాకుంది. మా పార్టీ ఎన్నికల్లో మీ జోక్యం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఒక ప్రహసనమే అని తేలింది. పోటీ సమఉజ్జీల మధ్య జరగడం లేదు. థరూర్‌కు సరైన వివరాలతో కూడిన డెలిగేట్ల జాబితాను కూడా ఇవ్వలేదు’ అంటూ అంతకుముందు బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు. ‘పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నారు. గాంధీ కుటుంబానికి మరో ఎంఎంఎస్ 2.0 వెర్షన్ రానుంది’ అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌నుద్దేశించి పరోక్షంగా అందులో పేర్కొన్నారు. -
గెహ్లాట్‌పై చర్యలకు శశిథరూర్ డిమాండ్
భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్ తన ట్విటర్లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్ సదరు వీడియో సందేశంలో కోరారు. ఈ పరిణామంపై గురువారం భోపాల్(మధ్యప్రదేశ్) పార్టీ కార్యాలయంలో శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్గానీ, ముఖ్యమంత్రిగానీ, పీసీసీ చీఫ్‌లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. मैं उम्मीद करता हूं जो भी डेलीगेट हैं वो भारी बहुमत से श्री मल्लिकार्जुन खड़गे को कामयाब करेंगे।कामयाब होने के बाद में वो हम सबका मार्गदर्शन करेंगे व कांग्रेस मजबूत होकर प्रतिपक्ष के रूप में उभर कर सामने आएगी।यह मेरी सोच है, मेरी शुभकामनाएं है खड़गे साहब भारी मतों से कामयाब हों। pic.twitter.com/OQ4Nk8zFKa — Ashok Gehlot (@ashokgehlot51) October 13, 2022 అలాంటిది గెహ్లాట్ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్ పేర్కొన్నారు. చాలా చోట్లా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు! -
ఆయన గెలిస్తే నిజంగానే మార్పులు చేస్తారేమో!
ఆయన గెలిస్తే నిజంగానే మార్పులు చేస్తారేమోనని భయంగా ఉంది మేడం! -
రసాయనాలు, ఎరువుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా థరూర్
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ సూచించిందని సమాచారం. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో మలికార్జున ఖర్గేపై శశిథరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడం గమనార్హం. థరూర్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్‌కు చోటు కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో రసాయనాలు, ఎరువులతోపాటు వాణిజ్యం, పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. -
‘నేను అధ్యక్షునిగా నెగ్గితే సీడబ్ల్యూసీకి ఎన్నికలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైతే పార్టీని సంస్కరణల బాట పట్టిస్తానని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రకటించారు. ‘పార్టీ నియమావళిలోని ప్రతి నిబంధననూ అమలుచేస్తా. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహిస్తా. పాతికేళ్లకుపైగా చేష్టలుడిగిన పార్లమెంటరీ బోర్డ్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తా. నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తా. పార్టీకి క్షేత్రస్థాయిలో మూలస్తంభాలైన పధాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడతా. ఉదయ్‌పూర్ తీర్మానాలను అమల్లోకి తెస్తా’ అని బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సంస్కరణవాదిని. పార్టీని నడిపే విధానంలో వైవిధ్యం చూపిస్తా. 2024లో బీజేపీని ఢీకొట్టి ఓడించేలా కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తా’ అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ -
శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే తన ప్రత్యర్థి శశిథరూర్‌పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా. ఆయనతో తనను పోల్చవద్దని ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే బుధవారం మాట్లాడుతూ.. తాను బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి సొంతంగా ఎదిగినట్లు తెలిపారు. ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా అని ప్రశ్నించారు. దయచేసి థరూర్‌తో తనను పోల్చవద్దని అని కోరారు. ఆ దిశగా పనిచేస్తా శశిథరూర్ తన మేనిఫెస్టోతో ముందుకు వెళ్లవచ్చని.. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే తన ఎజెండా అని తెలిపారు. ఆ దిశగానే పనిచేస్తానని పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో ఉన్న మూడు నిర్ణయాలను (ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఎన్నికల నిర్వహణ, జాతీయ స్థాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ) అమలు చేసే విధంగా ముందుకు సాగుతానని వెల్లడించారు. చదవండి:నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో కాపాడిన స్థానికులు యువ నాయకత్వం అవసరమా? సీనియర్ నేతలు, నిపుణులందరిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఖర్గే చెప్పారు. పార్టీని ప్రస్తుత సంక్షోభం, క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమా అని ప్రశ్నించగా.. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిగా ఎవరేంటనేది తనకు అన్నీ తెలుసని అన్నారు. అవసరమైనప్పుడు వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఖర్గేకే మద్దతు! ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ తలపడనున్నారు. గాంధీ కుటుంబీకుల మద్దతు ఉండటంతో ఈ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాక పార్టీలోని సీనియర్లు అందరూ సైతం ఖర్గేకు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి ఖర్గేకు ఓటు వేయాలని చెబుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించవచ్చని మంగళవారం శశిథరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 9,000 మంది కాంగ్రెస్ డెలిగేట్లు ఓటు వేయనున్నారు. 19న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
సంకట స్థితిలో కాంగ్రెస్ నేతలు?
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. సోనియా గాంధీ కుటుంబం స్పష్టంగా ఒక మాట చెప్పింది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరి పక్షాన నిలవబోమని. అలాగే చీఫ్ ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్ట్రీ సైతం పార్టీ తరపున అధికారిక అభ్యర్థి లేరనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు చాలావా.. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండడం లేదని చెప్పడానికి అని థరూర్ ఆదివారం వ్యాఖ్యానించారు. అయితే థరూర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. సోనియా కుటుంబం ఈ అధ్యక్ష ఎన్నికల్లో తటస్థంగా ఉంటుండడంతో.. ఎవరికి తమ మద్దతు ఇవ్వాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు నేతలు. ప్రత్యేకించి సీనియర్లపై ఒత్తిడి నెలకొందని పార్టీ శ్రేణులు పైకి చెప్పేస్తున్నాయి. మరోవైపు సీనియర్లు తనకెవరూ మద్దతు ఇవ్వబోరంటూ గతంలో శశిథరూర్ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కీలక నేతలు మాత్రం అధిష్టానం ఆదేశానుసారం లేదంటే అధిష్టానాన్ని అనుసరించాలని చూశాయి. ఇప్పుడు తటస్థ స్థితితో డైలామాలో పడిపోయారంతా. ఇక అధ్యక్ష బరిలో దిగిన మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే.. ఈ ఎన్నికలు పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే.. నిజమైన పోటీ మాత్రం బీజేపీతోనేనని పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏపార్టీ నిర్మించిన ప్రజాస్వామ్యిక వ్యవస్థలను బలహీనం చేసుకుంటూ.. కుప్పకూలుస్తూ పోతున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లతో రాజకీయ, ప్రజాస్వామ్యిక, సామాజిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. అందుకే మా నిజమైన పోరాటం వాటితోనే అని ఖర్గే జమ్ములో తెలిపారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. దాదాపు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకున్నారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఉద్దేశం అదే! -
అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.!
కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు. సోనియా, రాహుల్ మాటలు నమ్మిన శశిథరూర్ కూడా రంగంలోకి దిగారు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఏకగ్రీవం అయితేనే బాగుంటుందనే వాదన వినిపించారు. హైకమాండ్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గేనే.. ఏకగ్రీవం అయితేనే మేలని శశిథరూర్‌కు చెప్పినట్లు తెలిపారు. అలా అనుకుప్పుడు ఎవరైనా పోటీ చేయవచ్చని ప్రకటనలు ఎందుకిచ్చినట్లు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏకాకి! ఏఐసీసీ అధ్యక్ష్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ హైదరాబాద్ వస్తే ఆయనను పట్టించుకున్న దిక్కే లేదు. హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థి ఖర్గేకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున తెలంగాణ పీసీసీ దాదాపుగా థరూర్‌కు సహాయ నిరాకరణ చేసింది. హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ హోటల్ కే పరిమితం అయ్యారు. శశిథరూర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు రిసీవ్ చేసుకోగా.. రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఎవరు రాకపోవడం చర్చకు దారితీసింది. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి రాష్ట్రానికి వస్తే ఆయనను రిసీవ్ చేసుకోకుండా టీపీసీసీ సహాయనిరాకరణ చేసింది. మాకు చెప్పలేదు మరీ.! టీపీసీసీ ఇలా వ్యవహరించడానికి శశిథరూర్ ప్రధాన కారణమని పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నప్పుడు శశిథరూర్ కనీస సమాచారం ఇవ్వలేదని వీహెచ్ లాంటి నేతలు విమర్శిస్తున్నారు. ముందుగా సమాచారం ఇస్తే గాంధీ భవన్ లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేవాళ్ళమని ఓటర్ జాబితా ఇచ్చి ప్రచారానికి సహాకరించేవాళ్ళమని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆయనది ఒంటరి దారే.! ఇప్పటికే సీఏల్పీ నేత భట్టి విక్రమార్క తన మద్దతు ఖర్గేకేనని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా వీహెచ్ చేసిన వాఖ్యలు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఓట్లు మొత్తం గంప గుత్తగా ఖర్గేకు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధ్యక్షుడు అయ్యే శశిథరూర్ వచ్చినా టీ కాంగ్రెస్ నేతలు ఎవరు పట్టించుకోలేదు. తాను మాత్రం నేతలను వ్యక్తిగతంగా కలుస్తా అని చెప్పినా అది వర్కవుట్ కాలేదు. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసినా ఇతర కార్యక్రమాలలో ఉన్నందున కలవలేకపోతున్నా అని శశిథరూర్ కి సమాధానం ఇచ్చారట. దీంతో ఎవరిని కలవకుండానే మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని విమానం ఎక్కేసారు శశిథరూర్. గతంలో థరూర్ చాలా సార్లు హైదరాబాద్ వచ్చినా పీసీసీ నేతలకు సమాచారం ఇవ్వకుండానే తన కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయేవారట. పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తన అభ్యర్దిత్వాన్ని బలపరచాలని పీసీసీ డెలిగెట్స్ కు శశిథరూర్ విజ్ఞప్తి చేసారు. పీసీసీ లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, కొత్త వారికి నాయకత్వ భాధ్యతలతో పాటు మరికొన్ని అంశాలను శశిథరూర్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కోన్నారు. శశిథరూర్ ముందస్తు సమాచారం ఇవ్వకపోయినా.. టీ పీసీసీ ఎందుకు చొరవ తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. -
Bharat Jodo Yatra: ఖర్గే, థరూర్ ప్రజాదరణ ఉన్న నాయకులు
తురువెకెరే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్.. ఇద్దరూ ప్రజల్లో మంచి ఆదరణ, హోదా ఉన్న నాయకులేనని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌తో ఆడించడం ఖాయమంటూ విమర్శలు చేయడం దారుణమని, అది వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు జనాన్ని కుంగదీస్తున్నాయని వాపోయారు. అందుకే భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబం చెప్పినట్టల్లా ఆడాల్సిందేనంటూ కొందరు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు గల కారణాలను 2019లోనే తన రాజీనామా లేఖలో తెలియజేశానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం మన దేశ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించేలా ఉందన్నారు. విద్యను కేంద్రీకృతం చేయడం కాదు, వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, భాషలను ప్రతిబింబించే విద్యా విధానం కావాలన్నారు. దేశంలో విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేవారిపై పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. అధికారం కోసం కాదు తుమకూరు: భారత్ జోడో పాదయాత్ర 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాదని రాహుల్ చెప్పారు. మతం పేరుతో దేశాన్ని చీల్చడానికి బీజేపీ సాగిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆ పార్టీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక కులం, ఒక మతం కోసం పని చేయలేదని, దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని రాహుల్ చెప్పారు. తనను పనికిరానివాడు అని చిత్రీకరించడానికి బీజేపీ నాయకులు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. శనివారం రాహుల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచారు. పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. -
చివరి రోజు ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై థరూర్ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్ కోసం ఆలోచించండి’ - శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్ 8న థరూర్ ఈ వీడియో పోస్ట్ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. Surprised to get calls saying that “sources in Delhi” claim that I have withdrawn! I am on this race till the finish. #ThinkTomorrowThinkTharoor pic.twitter.com/zF3HZ8LtH5 — Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2022 ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
రాహుల్ గాంధీ అందుకు నో చెప్పారు: శశిథరూర్
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తనను తప్పుకోవాలని రాహుల్ గాంధీ సూచించినట్లు వస్తున్న కథనాలను తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. అయితే.. కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఈ విషయమై రాహుల్ గాంధీని సంప్రదించినట్లు తెలిసిందని, ఆ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని థరూర్ వివరించారు. ‘‘థరూర్ ఆ పోస్టుకు సరితూగడు. ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా విజ్ఞప్తి చేయండి’’ అని రాహుల్ గాంధీని కొందరు సీనియర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కేరళలో ప్రస్తుతం పోల్ క్యాంపెయిన్‌లో ఉన్న థరూర్.. మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీతో సంభాషణ సందర్భంగా నాకు ఈ విషయం తెలిసింది. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన్ని(రాహుల్) కొందరు సీనియర్లు కోరారట. కానీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్ భావిస్తున్నట్లు చెప్పారట. పైగా పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్లుగా చెబుతున్నానంటూ ఆయన నాకు గుర్తు చేశారు. ఎన్నికల నుండి తప్పుకోవడం ద్వారా తన ఈ ప్రయత్నంలో ఇప్పటివరకు తనకు మద్దతు ఇచ్చిన వారికి ద్రోహం చేయబోనని కూడా థరూర్ చెప్పారు. ‘‘తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. ఈక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకరన్.. మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. తద్వారా తన మద్దతును చెప్పకనే చెప్పారాయన. ఈ పరిణామంపై థరూర్ స్పందించారు. ‘‘సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదు. ఇప్పుడు జరుగుతుందని కూడా అనుకోను. కానీ, అదే సమయంలో ప్రతీ ఒక్కరి మద్దతును తాను కోరుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఎవరినీ తగ్గించి మాట్లాడబోనని కూడా థరూర్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా.. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే సీనియర్ నేతగా, ‘దళిత’ మార్క్‌తో బరిలో దిగనున్నారు మల్లికార్జున ఖర్గే. -
ఇద్దరిని అధ్యక్షులుగా నియమించుకుందాం మేడం! పార్టీ పరిస్థితి చూస్తుంటే...
ఇద్దరిని అధ్యక్షులుగా నియమించుకుందాం మేడం! పార్టీ పరిస్థితి చూస్తుంటే ఓ పదిమంది ఉన్నా పరవాలేదనిపిస్తుంది!! -
‘శశిథరూర్‌కు అంత సీన్లేదు.. మల్లికార్జున ఖర్గేనే గెలుస్తారు’
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్ నిలిచారు. దీంతో, పోటీలో ఎవరు విజయం సాధిస్తారన్నదనిపై చర్చ నడుస్తోంది. ఇక, కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అశోక్ గెహ్లాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గెహ్లాట్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గెహ్లాట్.. కాంగ్రెస్ పార్టీని మల్లికార్జున ఖర్గే బలోపేతం చేస్తారని అన్నారు. తన మద్దతు ఖర్గేకే అని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం, అధ్యక్ష బరిలో ఉన్న శశిథరూర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. శశిథరూర్ ఉన్నత వర్గానికి చెందిన నేత అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, ఖర్గేను మాత్రం ప్రశంసించారు. మలికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన నేత అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉందన్నారు. ఈ విషయంలో థరూర్‌ను ఖర్గేతో పోల్చలేమని కుండబద్దలుకొట్టారు. కాబట్టి.. పోటీ ఏకపక్షంగా ఖర్గేకే మద్దతు ఉంటుందని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. 'Shashi Tharoor is from elite class': Ashok Gehlot backs Kharge for Congress chief post https://t.co/esbySnoVyH — Sunder Barange (@sunder_barange) October 2, 2022 -
Congress president polls: ఇక ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ద్విముఖ పోరు తప్పదని తేలిపోయింది. మూడో అభ్యర్థి, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో చివరకు బరిలో ఇద్దరే మిగిలారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పరస్పరం పోటీ పడబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్లను పరిశీలించామని, మొత్తం 20 పత్రాలు వచ్చాయని, సంతకాలు రిపీట్ కావడం, సరిపోలకపోవడం వంటి కారణాలతో 4 పత్రాలను తిరస్కరించామని చెప్పారు. నామినేషన్లలో భాగంగా ఖర్గే 14 పత్రాలు, థరూర్ 5 పత్రాలు, త్రిపాఠి ఒక పత్రం సమర్పించారు. త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించామని, ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, మరొకరి సంతకం రిపీట్ అయ్యిందని తెలిపారు. పోటీలో ఖర్గే, థరూర్ మిగిలారని మిస్త్రీ వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులు గడువు ఉందని, అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఈ నెల 8న పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన మరో మూడు పత్రాలు ఎవరు సమర్పించారన్న సంగతి మిస్త్రీ బయటపెట్టలేదు. ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనకు కట్టుబడి ప్రతిపక్ష నేత పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, ప్రమోద్ తివారీ పోటీ పడుతున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబం తటస్థమే: థరూర్ నాగ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం తటస్థంగా వ్యవహరిస్తుందని శశి థరూర్ తెలిపారు. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరంటూ గాంధీ కుటుంబం తనతో చెప్పిందని అన్నారు. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న థరూర్ శనివారం ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకం చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరగాలని, పార్టీ బలోపేతం కావాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం మొత్తం పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని విన్నవించారు. గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గే పట్ల మొగ్గుచూపుతోందా? అని ప్రశ్నించగా.. అలాంటి అనుమానాలు తనకు లేవని థరూర్ బదులిచ్చారు. -
మల్లికార్జున ఖర్గే ,శశి థరూర్ మధ్యే ఫైనల్ ఫైట్
-
సోనియా ఆశీస్సులతో.. కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు చివరి క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్థానంలోకి సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడు, దక్షిణాది దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వచ్చిచేరారు. సోనియా ఆశీస్సులతో ఆయన అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఖర్గేతోపాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేశారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పోటీలో చివరకు ముగ్గురు మిగిలారు. అభ్యర్థిగా మల్లికార్గున ఖర్గే పేరును అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పూనియా, ఏకే ఆంటోనీ, పవన్‌కుమార్ బన్సల్, ముకుల్ వాస్నిక్‌తోపాటు జి–23 గ్రూప్‌లోని ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ప్రతిపాదించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఖర్గే వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కనిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన విజయం ఖాయమేనని స్పష్టమవుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడానికి దిగ్విజయ్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ పత్రాలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేయబోతున్నానని గురువారం ప్రకటించారు. ఇంతలోనే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చేసింది. దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో దిగ్విజయ్ వెనక్కి తగ్గారు. తాను పోటీ చేయడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. నామినేషన్లకు గడువు శుక్రవారం ముగిసింది. అక్టోబర్ 17న జరుగనున్న ఎన్నికలో ఓటు వేయడానికి 9,100 మందికిపైగా ప్రతినిధులను అర్హులుగా గు ర్తించారు. అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఖర్గేకు సీనియర్ల మద్దతు: గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్లంతా కలిసి నిర్ణయించారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. తన మద్దతు ఖర్గేకే ఉంటుందని తెలిపారు. పోటీలో ఎవరు నిలిచినప్పటికీ ఎన్నిక పూర్తయ్యాక అసలు విజేత కాంగ్రెస్సేనని అన్నారు. పార్టీలో మార్పు కోసమే నా పోరాటం: ఖర్గే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పు కోసం తాను పోరాడుతానని, నేతలు, కార్యకర్తలంతా మద్దతివ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ డెలిగేట్లను కోరారు. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి తనను ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాల్యం నుంచే కాంగ్రెస్‌తో తనకు అనుబంధం ఉందని, పార్టీ ఆదర్శాలను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లికార్గున ఖర్గే అని సీనియర్ నేత ప్రమోద్ తివారీ కొనియాడారు. మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: థరూర్ కాంగ్రెస్‌కు ఖర్గే ‘భీష్మ పితామహుడు’ అని శశి థరూర్ ప్రశంసించారు. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఖర్గే, తాను ప్రత్యర్థులం, శత్రువులం కాదని.. తమ మధ్య స్నేహపూర్వక పోటీ జరగబోతోందని చెప్పారు. ఖర్గే పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తనకు ఒక విజన్ ఉందని ఉద్ఘాటించారు. ఖర్గే ‘యథాతథ స్థితి కొనసాగింపు నాయకుడేనని’ అన్నారు. పార్టీలో యథాతథ స్థితి కొనసాగాలనుకుంటే ఖర్గేకు, మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని థరూర్ పిలుపునిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు. 12 రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం ప్రత్యక్షం గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని అన్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు బెంగళూరు: సోలిల్లాదా సర్దార(ఓటమి తెలియని నాయకుడు)గా స్వరాష్ట్రం కర్ణాటకలో పేరుగాంచిన మల్లికార్జున ఖర్గే(80) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే కర్ణాటక నుంచి ఎస్.నిజలింగప్ప తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడైన రెండో నేతగా రికార్డుకెక్కుతారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత పార్టీ అధ్యక్షుడైన రెండో దళిత నాయకుడిగా మరో రికార్డు సృష్టిస్తారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారిగా గుల్బర్గా నుంచి లోక్‌సభకు పోటీ చేసి, విజయం సాధించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ భారీ మెజార్టీతో గెలిచారు. 2014 నుంచి 2019 దాకా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా ఓటమి చవిచూశారు. 2020 జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎగువసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రిగా సేవలందించారు. ఖర్గేకు కర్ణాటక సీఎం అయ్యే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన 1942 జూలై 21న బీదర్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీఏ, న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేశారు. -
మ్యానిఫెస్టో తెచ్చిన తంటా... వివాదంలో శశి థరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఒక మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఇది ఇప్పుడు ఆయనకు లేనిపోని ఇబ్బందులోకి నెట్టింది. ఈ మేరకు ఆయన తన మ్యానిఫెస్టో బుక్‌లెట్‌లో 'థింక్ టుమారో, థింక్ థరూర్' అనే ట్యాగ్ లైన్‌తో భారతదేశం అంతటా ఉన్న కాంగ్రెస్ యూనిట్లు సూచించే చుక్కల నెట్‌వర్క్‌తో కూడిన మ్యాప్‌ను ఉపయోగించారు. ఐతే ఈ మ్యాప్ భారతదేశ అధికారిక మ్యాప్‌కి భిన్నంగా ఉంటుంది. అందులో జమ్ము కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలు లేని భారత్ మ్యాప్‌గా రూపొందించారు. దీంతో ఈ మ్యానిఫెస్టో కాస్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఇది వికేంద్రికరణ, విభజన అంటూ ఫైర్ అయ్యారు. గత మూడేళ్లలో ఆయన ఇలాంటి వివాదాస్పద వివాదంలో చిక్కుకోవడం ఇది రెండోసారి. డిసెంబర్ 2019లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేసి ఇలానే వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నాయకుడు సంబిత్ వంటి నేతలు విమర్శలు లేవనెత్తడంతో వెంటనే ఆ ట్విట్ని తొలగించారు. I have just submitted my nomination papers as a candidate for the presidential election of @incindia. It is a privilege to serve the only party in India with an open democratic process to choose its leader. Greatly appreciate Soniaji’s guidance&vision.#ThinkTomorrowThinkTharoor pic.twitter.com/4HM4Xq3XIO — Shashi Tharoor (@ShashiTharoor) September 30, 2022 (చదవండి: కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్‌లో గాంధీల స్థానంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటాన్ని సోనియా గాంధీ స్వాగతించారని, తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు థరూర్ చెప్పారు. తాను సోనియా గాంధీ ఆమోదం కోసం ఆమెను కలవలేదని, అయికే.. వారి అధికారిక వైఖరి ఏంటని తెలుసుకునేందుకే భేటీ అయినట్లు చెప్పారు. ‘మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మేము ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో పనులు చేస్తాం, మాకు వదిలివేయండి, సరైన వ్యక్తిని కనుగొంటాము అని ఆమె చెప్పలేదు. దానికి విరుద్ధంగా.. ఎన్నికలు పార్టీకి మంచిదని నమ్ముతానన్నారు. నీవు పోటీ చాయాలనుకుంటే.. స్వాగతిస్తా అన్నారు. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని చెప్పారు. ఈ పోటీ కేవలం సహచరుల మధ్య జరుగుతోన్న పోరు మాత్రమే. నాకు 14 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని రకాలుగా పోటీకి అర్హుడినే. నా అభ్యర్థిత్వంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ’ అని తెలిపారు శశి థరూర్. పార్ట చీఫ్ కోసం పోటీ పడుతోన్న ఏ అభ్యర్థి అయినా.. గాంధీ కుటుంబీకుల చేతిలో కీలుబొమ్మగా మారతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్‌లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు. వారు క్రీయాశీలకంగా వ్యవహరించొద్దని భావిస్తే.. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు.’ అని పేర్కొన్నారు థరూర్. మరోవైపు.. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్‌గానే కనిపిస్తారని తెలిపారు. అలాగే.. తాను జీ-23 తరఫున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవటం లేదని స్పష్టం చేశారు. నాకు కేవలం 23 మంది కాదు, 9,100 మంది మద్దతు కావాలంటూ తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ -
‘మా మధ్య ఫ్రెండ్లీ పోటీనే’.. డిగ్గీ రాజాతో పోరుపై థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పోటీపై ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు శశి థరూర్. ‘ఇది ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ కాదు.. సహచరుల మధ్య జరిగే స్నేహపూర్వక పోటీ’ అని పేర్కొన్నారు. శశిథరూర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. శశి థరూర్ వ్యాఖ్యాలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీ మతత్వత శక్తులకు వ్యతిరేకంగా జరుగుతోందని, తాము ఇరువురు గాంధీయన్, నెహ్రూవియన్ భావజాలాలను నమ్ముతామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. ఇరువురు నేతలు తమ నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను శశిథరూర్.. వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్ సింగ్ గురువారం తీసుకున్నారు. Received a visit from @digvijaya_28 this afternoon. I welcome his candidacy for the Presidency of our Party. We both agreed that ours is not a battle between rivals but a friendly contest among colleagues. All we both want is that whoever prevails, @incIndia will win!✋🇮🇳 pic.twitter.com/Df6QdzZoRH — Shashi Tharoor (@ShashiTharoor) September 29, 2022 I agree @ShashiTharoor we are fighting the Communal Forces in India. Both believe in the Gandhian Nehruvian Ideology and shall fight them relentlessly come what may. Best wishes. @INCIndia @RahulGandhi @priyankagandhi @Jairam_Ramesh https://t.co/5KHn6P8Yug — digvijaya singh (@digvijaya_28) September 29, 2022 ఇదీ చదవండి: Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్ -
‘నాకున్న ఫాలోయింగ్ మీకు తెలియట్లేదు.. ఆరోజు అందరూ షాకవుతారు’
కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని టెన్షన్‌కు గురిచేస్తోంది. హస్తం పార్టీ చీఫ్ రేసులో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, వీరిలో ఎవరికి మెజార్టీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ చీఫ్ రేసులో ఉన్న శశిథరూర్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు ఉంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నేను నామినేషన్ దాఖలు చేసే నాకు ఉన్న ఫాలోయింగ్ మీరే చూస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మెజార్టీ నేతలు నేను పోటీ చేయాలని ఇప్పటికే కోరారు. ఈ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను ప్రజలకు సైతం కలుస్తాను అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కేరళలో ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని శశిథరూర్ కలిశారు. ఈ విషయంపై శశిథరూర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ పాలక్కడ్‌లోని పట్టంబిలో భారత్ జోడో యాత్రలో ఉన్నారు. పాలక్కడ్ నా సొంత జిల్లా.. రాహుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏ వ్యక్తి అయినా.. జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే.. ఆ అభ్యర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాలి. కాగా.. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8న చివరి తేదీ, అక్టోబర్ 17న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడికానున్నాయి. ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేతను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం ఇది నాలుగోసారి. దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఓటింగ్ జరుగుతోంది. చివరిసారిగా 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి, జితేంద్ర ప్రసాద్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సోనియా విజయం సాధించారు. You will see the support I enjoy when I submit my nomination paper, says Shashi Tharoor https://t.co/ukiyaBMvkb — World Opinion (@WorldOpinionInd) September 26, 2022 -
బతికించడానికి థరూర్ అనే కొత్త డాక్టర్ వస్తున్నారట!
బతికించడానికి థరూర్ అనే కొత్త డాక్టర్ వస్తున్నారట! -
30న శశి థరూర్ నామినేషన్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ఎంపీ శశి థరూర్ సెప్టెంబర్ 30న నామినేషన్ వేసే అవకాశముంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను థరూర్ ప్రతినిధి స్వీకరించారు. ఆయన దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా సంతకాలు సేకరిస్తారని సమాచారం. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో థరూర్ తలపడనున్నారు. పోటీలో అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తా..కానీ: అశోక్ గహ్లోత్
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా అధ్యక్ష పదవికి ఎన్నిక హడావిడీ అంతా రాజస్థాన్ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపించినప్పటి నుంచి రాష్ట్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఒకవేళ గహ్లోత్ పోటీ చేస్తే రాజస్థాన్ సీఎంగా కొనసాగుతారా? లేదా తదుపరి సీఎం ఎవరవుతారనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏమవుతుందో ఎదురుచుద్దాం! ఈ క్రమంలో తాజాగా తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం ప్రకటించారు. అయితే రాష్ట్రానికి దూరంగా ఉండనని, రాజస్థాన్ కోసం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పదవికి నేను నామినేషన్ దాఖలు చేస్తాను. ఆ తరువాత ఇతర ప్రక్రియ అమలులో ఉంటుంది. అలాగే ఎన్నిక కూడా జరగవచ్చు. ఇదంతా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ఎవరిమీద ప్రత్యేకంగా కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. రాజస్థాన్‌లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రాజస్థాన్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇదంతా దీనిపై ఆధారపడి ఉంటుంది' అని అశోక్ గహ్లోత్’ అన్నారు. రాజస్థాన్ నెక్ట్స్ సీఎం ఎవరూ? ఇదిలా ఉండగా అశోక్ గహ్లోత్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీఎం పోస్టుకు గతంలో తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ముందు వరుసలో ఉన్నారు. కానీ సచిన్ సీఎం అవ్వడం గహ్లోత్‌కు నచ్చడం లేదు. దీంతో సీఎం పదవికి అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పేరును ఇప్పటికే ఆయన సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. పోటీలో పలువురు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ మేరకు బుధవారమే ఆయన సోనియా గాంధీని కలిశారు. అంతేగాక దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఏడు రాష్ట్రాల యూనిట్లు తీర్మానాలు చేశాయి. అయితే రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు(గురువారం) వెలువడింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అధక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. . -
పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, శనివారం(సెప్టెంబర్ 24) నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనుండగా.. 19న కౌంటింగ్ ఉండనుంది. ఇదిలా ఉండగా.. అధ్యక్ష బరిలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ రేసులో నేను కూడా ఉన్నానంటూ చివరి నిమిషంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సైతం ఫ్రేమ్‌లోని వచ్చారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో గురువారం దిగ్విజయ్ సింగ్.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. कांग्रेस अध्यक्ष चुनाव के लिए अधिसूचना जारी ... सेंट्रल इलेक्शन ऑथोरिटी हेड मदुसूदन मिस्त्री के AICC ऑफिस में अधिसूचना की कॉपी चिपकाई गयी . pic.twitter.com/z6BemDvQFO — रंजीता झा डडवाल Ranjeeta Jha Dadwal (@ranjeetadadwal) September 22, 2022 -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ నిర్ణయించుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని ఆమె ముందుంచారు. ‘మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు’ అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా సరే.. తాను వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని చెప్పారంటున్నారు. భేటీ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు థరూర్ నిరాకరించారు. ‘‘పోటీ చేయాలనుకునే నేతలందరికీ స్వాగతం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ. అందులో పాల్గొనేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా అన్నారు. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్ ప్రకటించడం తెలిసిందే. పార్టీలో అంతర్గత సంస్కరణల దిశగా ఆయన కొంతకాలంగా గట్టిగా గళం వినిపస్తున్నారు. వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యవసరమైన పలు విప్లవాత్మక మార్పులకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శ్రీకారం చుడుతుందని మలయాళ దినపత్రిక మాతృభూమికి రాసిన వ్యాసంలో థరూర్ అభిప్రాయపడ్డారు. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని అధ్యక్ష అభ్యర్థులు ప్రమాణం చేయాలంటూ పలువురు యువ నేతలు, కార్యకర్తల చేసిన విజ్ఞాపనను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘దీనిపై 650 మందికి పైగా సంతకం చేశారు. ఈ విజ్ఞాపనను స్వాగతిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళించాలంటూ లేఖ రాసి జీ–23గా పేరుపడ్డ కాంగ్రెస్ అసంతృప్త నేతల్లో థరూర్ కూడా ఉన్నారు. రాజస్తాన్ పగ్గాలు పైలట్‌కు? మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పటికే ఖాయమైంది. దేవీ నవరాత్రులు మొదలయ్యాక సెపె్టంబర్ 26న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు 30వ తేదీ తుది గడువు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు వెల్లడవుతాయి. గెహ్లాట్ నెగ్గి పార్టీ పగ్గాలు చేపడితే సచిన్ పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ ఆరు పీసీసీ కమిటీలు తీర్మానం చేశాయి. ఇదీ చదవండి: నగదు విరాళాలు రూ.2,000 మించొద్దు -
కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దన్న పోకడలు పోతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ‘మేము ఇచ్చేవాళ్లం.. మీరు అందుకొనే వాళ్లు’అనే రీతిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఏ రకమైన కార్యక్రమాలు కావాలో వాటిని ఎలా నిర్వహించాలో కేంద్రం ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి ఎంతమాత్రం సరికాదన్నారు. దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోయిందా? అనే అంశంపై ‘సౌత్‌ఫస్ట్’ సంస్థ శనివారం హైదరాబాద్‌లో దక్షిణ్ డైలాగ్స్–2022 పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఏపీ, తమిళనాడు ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పళనివేల్ త్యాగరాజన్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తదితరులు పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలంతా కేంద్రం తీరును ఎండగట్టారు. గతంతో పోలిస్తే దేశంలో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోందని.. ఇటీవలి కాలంలో క్షీణత మరింత వేగం పుంజుకుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాలు మొదలుకొని స్థానిక సంస్థలు, ఇతర వ్యవస్థల విధులు బాధ్యతలు, పార్లమెంటులో ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మాతో చర్చించకుండానే వేర్వేరు పేర్లతో విలీన ఉత్సవాలు.. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉత్సవాల విషయంలోనూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణతో కనీసం చర్చించకుండా వేర్వే రు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు. ‘74 ఏళ్ల కిందట నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను భారత దేశంలో కలిపేందుకు ఈ గడ్డపైకి వస్తే.. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను, వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించి లొంగదీసుకొనేందుకు, వారి సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దేందుకు వచ్చారు. కానీ ఇది ఎంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. అందుకే నేను తరచూ చెబుతుంటా.. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలి తప్ప విభజన రాజకీయాలు కాదు’ అని వ్యాఖ్యానించారు. దక్షిణాదికి తక్కువ నిధులెందుకు? దేశ ప్రజలంతా అభివృద్ధి సాధించాలని తాము కోరుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు అభ్యంతరంకూడా లేదన్నారు. కానీ రాష్ట్రాల పన్నుల వాటాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తూ మానవాభివృద్ధి సూచీల్లో ఉన్నతస్థానంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రా ల మధ్య పన్నుల వాటాలను ఎక్కడికక్కడ విభజించే ప్రత్యేక వ్యవస్థ ఎందుకు లేదన్నారు. ఈ అంశాలపై అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ ప్రయత్నిస్తామని చెప్పారు. రాజకీయంగానూ దెబ్బతినే ప్రమాదం: శశిథరూర్ కేంద్రం పోకడల వల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2021 లెక్కల ప్రకారం 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు రావొ చ్చని ఆయన హెచ్చరించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2026లో పార్లమెంటరీ స్థానాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది ప్రాతి నిధ్యం తగ్గే పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టు సమస్యను అధిగమించాల్సి ఉంటుందన్నారు. ప్రతి రాష్ట్రానికి తనదైన అవసరాలు ఉంటాయని.. వాటిని తీర్చుకొనేందుకు చేసే ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోందని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఆరోపించారు. సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ఏకం కావాలి రాజ్యాంగం నిర్వచించిన, హామీ ఇచ్చిన సమాఖ్యవాదాన్ని కాపాడుకొనేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని పలువురు వక్తలు సూచించారు. శనివారం హైదరాబాద్‌లో సౌత్‌ఫస్ట్ సంస్థ దక్షిణ్ డైలాగ్స్ పేరుతో సమాఖ్యవాదం–న్యాయవ్యవస్థ పాత్రపై ఏకాభిప్రాయం పెంపొందించడం’అనే అంశంపై మరో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి మోహన్ గోపాల్ పాల్గొన్నారు. అమెరికాలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకుండా వాటిని కలపడం సాధ్యం కాదని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు. కానీ మన దేశంలో ఒక రాష్ట్ర ఏకాభిప్రాయం తీసుకోకుండానే పార్లమెంటు చేసిన చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఆ రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి ఉందని పరోక్షంగా తెలంగాణ విభజనను ప్రస్తావించారు. ఒవైసీ మాట్లాడుతూ బీజేపీ మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఒవైసీ స్పందిస్తూ తాను రిజర్వేషన్ లేకుండా జీవించగలనని, కానీ అన్యాయంతో జీవించలేనన్నారు. రిజర్వేషన్లు అన్ని పార్టీలకు రాజకీయ సాధనంగా మారాయన్నారు. -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూధన్ మిస్త్రీకి లేఖ రాయడం పొలిటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీలు శశిథరూర్, మనీష్ తివారీ, కార్తి చిదంబరం, ప్రద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖలీక్‌లు లేఖను రాశారు. సదరు లేఖలో పార్టీ అధ్యక్ష ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన అంశంపై తప్పుడు సమాచారం వెళ్లడం దురదృష్టకరమని ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని రిలీజ్ చేయాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇక, సొంత పార్టీ నేతలే ఇలా లేఖ రాయడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది. Questions on fairness in election of Congress President these 5 MPs including Shashi Tharoor expressed concern written letter - India Hindi News - कांग्रेस अध्यक्ष के चुनाव में निष्पक्षता पर सवाल, शशि थरूर समेत इन 5 सांसदों ने जताई चिंता; लिखी चिट्ठी https://t.co/GwirzlVAJW — Sandeep Choudhury (@Sandeep71121431) September 10, 2022 -
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్!
న్యూఢిల్లీ: ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పోటీలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా మలయాళ దినపత్రిక మాతృభూమిలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ థరూర్ ఓ ఆర్టికల్ రాశారు. అందులో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికతో పాటు పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికను నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శశిథరూర్ ఆలోచన ఇలా ఉంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన మాత్రం మరోలా ఉంది. అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను బరిలోకి దింపాలని సోనియా గాంధీ యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్‌గాంధీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా తమ విధేయుడు అశోక్ గెహ్లాట్‌కు పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. అయితే దీనిపై అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల సెంటిమెంట్లను అర్థం చేసుకుని రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే నెల 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. చదవండి: (ఏం రాహుల్.. ఏం మాట్లాడుతున్నావ్.!)