తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.
ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi
— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024
కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్‌కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.
శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment