Pinarayi Vijayan
-
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్య
తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్‌కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. -
రేపు వయనాడ్‌కు ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటించనున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాదిమంది చనిపోవడం తెల్సిందే. బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని విజయన్ వివరించారు. ఈ దుర్ఘటనలో బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని సీఎం విజయన్ చెప్పారు. తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించిందన్నారు. ఈ కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి, నివేదిక ఇస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటనకు రానుండటం గమనార్హం. -
వయనాడ్ విపత్తుపై పొలిటికల్ వార్.. అమిత్ షాకు కేరళ సీఎం కౌంటర్
కేరళలో సంభవించిన ప్రకృతి వైపరిత్యంపై రాజకీయ రగడ రాజుకుంది. వయనాడ్‌లో వరద విలయంతో కొండచరియలు విరిగిపడి దాదాపు 200 మందికిపైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం నెలకొంది. విపత్తు గురించి తాము ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు తాజాగా కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. తమకు ఎలాంటి అలర్ట్‌ను జారీ చేయలేదంటూ తెలిపారు.బుధవారం తిరువనంతపురంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ. వాతావరణ మార్పులకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాలని సూచించారు. ‘మనం ఇప్పుడు చూస్తున్న విపరీతమైన వర్షాలు గతంలో కురిసేవా? వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలు మనకు అవసరం. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఇతరులపై నిందలు మోపడానికి ప్రయత్నించకండి. మీ బాధ్యతల నుంచి తప్పించుకోకండి. ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదు’ అని తెలిపారు.‘వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసింది. విషాదం సంభవించే ముందు ఆ ప్రాంతంలో ఒక్కసారి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. కొండచరియలు విరిగిపడిన తర్వాత మాత్రమే ఉదయం 6 గంటలకు వారు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జులై 29న కేంద్ర వాతావరణశాఖ జూలై 30, 31 తేదీలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. కానీ అప్పటికే భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి’ అని సీఎం పేర్కొన్నారు.అయితే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని అమిత్‌షా రాజ్యసభలో పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జులై 26న మరోసారి హెచ్చరించామని తెలిపారు. జూలై 23న కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున తొమ్మిది ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపినట్లు చెప్రారు. కానీ సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.కాగా.. భారీ వర్షాలతో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వయనాడ్ లో మరణ మృదంగం
-
వయనాడ్: ఊళ్లను ఊడ్చేసిన కొండచరియలు.. 70 మంది మృతి
తిరువంతనపురం: కేరళ వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం.. పెను విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. మెప్పాడి రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సుమారు 1,200 శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ మధ్యాహ్నాం ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 400 మందిని రక్షించి.. రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ముందక్కై నుంచి ఎయిర్లిఫ్ట్ముందక్కై గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత క్యాంప్‌లకు తరలించనున్నట్లు ఎమ్మెల్యే సిద్ధిఖీ తెలిపారు. ‘‘ఎంత మంది ఆచూకీ లేకుండా పోయారు, ఎంత మంది చనిపోయారు అనేదానిపై ఇప్పుడే పూర్తి సమాచారం అందడం కష్టం. చాలా చోట్లకు కనెక్టివిటీ తెగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అన్నారాయన. యుద్ధ ప్రతిపాదికన వంతెనలుకేరళ విలయం ధాటికి వయనాడ్‌లో వంతెనలు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకూ విఘాతం ఏర్పడుతోంది. దీంతో.. యుద్ధ ప్రతిపాదికన వంతెనలు పునరుద్ధరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. వాతావరణం అనుకూలించట్లేదని ఆమె చెప్పారు. వయనాడ్‌కు రాహుల్ గాంధీకాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్‌కు వెళ్లనున్నారు. కొండ చరియలు ప్రాంతాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచే ఆయన రెండుసార్లు ఎంపీగా నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం.. ఎక్స్ వేదికగా ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా.I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad. My heartfelt condolences go out to the bereaved families who have lost their loved ones. I hope those still trapped are brought to safety soon.I have spoken to the Kerala Chief Minister and the Wayanad…— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024 కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు బలమైన గాలులు తోడవ్వడం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడడం, చెట్లు కూలిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసర్‌గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నాలుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. అయితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక.. మెప్పాడి రీజియన్‌లోని మందకై ప్రాంతంలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 2గం. సమయంలో ఒకసారి, 4గం. సమయంలో మరోసారి, ఆపై అరగంటకు మరోసారి చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు చలియార్‌నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. బురద నీరు, బండరాళ్లు, కూలిన చెట్లు చుట్టుముట్టేయడంతో జనం చిక్కుకుపోయారు. ఘటన సమాచారం అందుకోగా.. ఎన్డీఆర్ఎఫ్, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, అలాగే సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకున్నాయి. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలిగాయి. దీంతో ఉదయం నుంచి సహాయక చర్యల్ని ఉధృతం చేశారు. మట్టి దిబ్బల కింద వందలాది మంది(1200 మంది అని ఒక అంచనా) చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వంతెనలు తెగిపోవడం, భారీ వర్షం పడుతుండడంతో సహయక చర్యలు కొనసాతున్నాయి. Hundreds Feared Trapped Following Massive Landslides in Kerala's #Wayanad#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/8yJIKixPP9— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Kerala's Wayanad Devastated by Landslides; Hundreds Feared Trapped#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/cR67TWKzFi— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Major Landslide in Wayanad. Many fear dead. One portion of Chooral hills and the township near Mepadi has collapsed. Very similar to the Puthumala landslide that occured in 2019. pic.twitter.com/nSfvuzlddq— Viju B (@floodandfury) July 29, 2024 ఎటు చూసినా విధ్వంసమే..మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు పదిహేనుకు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ముందక్కై, అట్టమల, నూల్పూజ, చురల్మల గ్రామాలు ఊడ్చిపెట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. గతంలో.. 2018లో సంభవించిన విపత్తులో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.రంగంలోకి హెలికాఫ్టర్లుసహాయక బృందాలు మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వాళ్లను వెలికి తీసి.. చికిత్స కోసం మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఇంకా చాలా మంది మట్టి చరియల కింద చిక్కుకున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఈ ప్రమాదంలో ప్రభావితం అయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే విపత్తుపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని రెవెన్యూ మంత్రి కె.రాజన్ అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎయిర్‌పోర్స్ మిగ్ 17 హెలికాఫ్టర్లు రంగంలోకి దించినట్లు తెలిపారాయన. BREAKING: 7 bodies found, hundreds feared trapped as two landslides hit Kerala’s Wayanad last night and early this morning…!#Wayanad #WayanadLandSlide pic.twitter.com/hTBGy52x0u— நெல்லை செல்வின் (@selvinnellai87) July 30, 2024 Landslide visuals are coming in from #Wayanad #keralarains pic.twitter.com/a5Y9APcvst— MasRainman (@MasRainman) July 30, 2024 తక్షణ చర్యలకు ఆదేశంఘటన గురించి తెలియగానే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రుల బృందాన్ని మెప్పాడికి వెళ్లాలని ఆదేశించారు. తక్షణ బృందాలతో సహా ఏజెన్సీలు అన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, ఆ సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో 9656938689, 8086010833 నెంబర్లతో కంట్రోల్ రూపం ఏర్పాటు చేసినట్లు, వైద్య బృందాలను అక్కడికి పంపించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. విపత్తుపై ఆరావయనాడ్ భారీ ప్రకృతి విపత్తుపై ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము తన సందేశం తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ.. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున అన్నివిధాలుగా సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి సురేష్ గోపితోనూ ప్రధాని మాట్లాడారు. ఇంకోవైపు.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ మాట్లాడి బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని కోరినట్లు సమాచారం. వయనాడ్ కలెక్టర్, అధికారులతో ఫోన్లో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలని కోరారు.ఇక వయనాడ్ విపత్తు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రధాని కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు, అలాగే.. గాయపడ్డ వాళ్లకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎక్స్ ఖాతాలో పీఎంవో ట్వీట్ చేసింది. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది. Pained by the loss of lives in massive landslides in Wayanad, Kerala. My condolences to the bereaved families. I pray for the speedy recovery of the injured and for the success of rescue operations.— President of India (@rashtrapatibhvn) July 30, 2024The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. https://t.co/1RSsknTtvo— PMO India (@PMOIndia) July 30, 2024ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్ కే. వాసుకి అనే ఐఏఎస్ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించటంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.‘ఐఏఎస్ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించిన కేరళ సీఎం పినరయ విజయన్ రాజ్యాంగ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. సీఎం పినరయి విజయన్ కేరళను ప్రత్యేక దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా?’ అని కేరళ బీజేపీ యూనిట్ చీఫ్ కే.సురేంద్రన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.The appointment of an IAS officer as 'Foreign Secretary' in Kerala by CM Pinarayi Vijayan is a blatant overreach and a violation of the Union list of our Constitution. The LDF government has no mandate in foreign affairs. This unconstitutional move sets a dangerous precedent. Is…— K Surendran (@surendranbjp) July 20, 2024 లేబర్ అండ్ స్కిల్స్ సెక్రటరీ కే. వాసుకికి విదేవి వ్యవహారాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతల్లో భాగంగా విదేశీ వ్యవహారాలక సంబంధించిన అంశాలను సమన్వయం చేయనున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఎంబసీ, మిషషన్లతో అనుసంధానం చేయటంలో కొత్త నియమించిన విదేశంగా సెక్రటరీ వాసుకికి సహాయం చేయాలని ఢిల్లీలోని కేరళ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కేరళ ప్రభుత్వం చేసిన ఈ నియామకంపై మాజ కెబినెట్ సెక్రటరీ కే. ఎం. చంద్రశేఖర్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ సంబంధాలు కేంద్రం చేతిలో ఉంటాయి. దేశంలోని ఏ రాష్ట్రం విదేశాలకు సంబంధించిన సమాచారం, పనులు కావాలన్నా కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కంటే మించి ఎలాంటి అదనపు పనులను చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి’ అని చంద్రశేఖర్ అన్నారు. -
సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం .. ‘కేరళ’ రాష్ట్రం పేరును మారుస్తూ తీర్మానం
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మారుస్తూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. అందుకు అధికార ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.ఈ తీర్మానాన్నిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. కేంద్రం అనుమతి ఇస్తే త్వరలో కేరళ కాస్త.. కేరళంగా మారనుంది. అందుకు త్వరలో విధివిధానాలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కేరళ ప్రభుత్వం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు.తాజాగా, మరోసారి రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదనను సీఎం విజయన్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు.రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని, దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళ’ పేరును ‘కేరళం’ మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.అంతేకాదు భారత రాజ్యంగంలో ఆర్టికల్ 3 కింద కేరళ పేరును కేరళంగా మార్చాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు పలికిందని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే.. సీఎం విజయన్‌పై కాంగ్రెస్ ఆగ్రహం
తిరువనంతపురం : ప్రభుత్వ వైఫల్యాను కప్పిపుచ్చుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేవని, తమ పాలనా వైఫల్యాలు, నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీపై దాడికి విమర్శలు చేస్తున్నారని పరవూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశన్ ఆరోపించారు. గత 30 రోజులకు పైగా విజయన్ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మినహాయించి కాంగ్రెస్, రాహుల్ గాంధీలను విమర్శించడం అందుకు నిదర్శనమని అన్నారు. కేరళ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే కేరళలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (K-FON) రూ.1,500 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు గడిచినా నేటికీ పూర్తి చేయకపోవడం దుర్వినియోగం, అవినీతికి నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా కేఫోన్ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సతీశన్ డిమాండ్ చేశారు. డిప్లమాటిక్ బ్యాగ్‌ల కేసు, కరువనూరు సహకార బ్యాంకు కుంభకోణంతో సహా పలు ఆర్థిక కుంభకోణాల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నందునే సీఎం విజయన్, అధికార పార్టీ సీపీఐ(ఎం) బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ కేసుల్లో చర్యలు తీసుకుంటుందనే భయం సీఎం పినరయి విజయన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. త్రిసూర్, తిరువనంతపురం వంటి కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో వామపక్షాల ఓట్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ దీన్ని సద్వినియోగం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేరళ సీఎం తీవ్ర విమర్శలు
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. మత, హిందుత్వ రాజకీయాలను ఎదుర్కొవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలైమైందన్నారు. సీఎం పినరయి శనివారం అలప్పుజలో మాట్లాడారు. ‘సీపీఐ(ఎం) మేనిఫెస్టోలో దేశంలో విభజన సృష్టించే సీఏఏను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం దానికి సంబంధించి ప్రస్తావన లేదు. సీఏఏ విషయంలో కాంగ్రెస్ మౌనం వహించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) వంటి కఠినమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఐ(ఎం) హామీ ఇచ్చింది’ అని సీఎం విజయన్ తెలిపారు. సీఏఏ చట్టంపై కాంగ్రెస్ పార్టీ కనీసం బహిరంగ విమర్శలు కూడా చేయలేదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా సింఘ్ పరివార్ విధానాలకు దగ్గరగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం వల్ల భవిష్యత్తులో దేశ ప్రజలకు ఏ ఉపయోగం ఉండదని అన్నారు. బీజేపీ తీసుకువచ్చిన పలు చట్టాలను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, వాటికే ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. మొత్తం 20 స్థానాలు ఉన్న కేరళలో రెండు దఫాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగి.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
‘దూరదర్శన్‌లో వివాదాల చిత్రం ప్రసారమా?’
తిరువనంతపురం: భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రసారం చేయాలని డీడీ నేషనల్ నిర్ణయించడమే అందుకు కారణం. పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ ఛానెల్లో ప్రసారం చేయడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల వేళ ఈ చర్య మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారయన. బీజేపీ, ఆరెస్సెస్‌లకు ప్రచార యంత్రంగా మారొద్దంటూ డీడీ నేషనల్‌కు హితవు పలికారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. The decision by @DDNational to broadcast the film 'Kerala Story', which incites polarisation, is highly condemnable. The national news broadcaster should not become a propaganda machine of the BJP-RSS combine and withdraw from screening a film that only seeks to exacerbate… — Pinarayi Vijayan (@pinarayivijayan) April 4, 2024 ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించేలా దూరదర్శన్ ఏర్పాట్లు చేసుకుంది. మరోవైపు సీపీఐ(ఎం) కూడా డీడీ చర్యను తప్పుబట్టింది. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్న కేరళలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ సినిమా విడుదల సమయంలో కేరళలో నిరసనలు జరిగాయి. సెన్సార్ బోర్డు సైతం పది సీన్లకు కత్తెర విధించింది. అలాంటి చిత్రాన్ని జాతీయ ఛానెల్లో ప్రదర్శించాలని నిర్ణయించడం ముమ్మాటికీ రెచ్చ గొట్టే చర్య అని ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కిందటి ఏడాది ఈ చిత్రం విడుదలకాగా.. ఆ సమయంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో ప్రదర్శించకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అనధికార నిషేధంపై బీజేపీ కోర్టులను ఆశ్రయించింది. ఇక కోర్టు మాత్రం చిత్ర విడుదలను అడ్డుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు కళ్లు మూసుకుని ఉండదు కదా అని ఆ సమయంలో చిత్ర రిలీజ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. -
కేరళ సీఎం విజయన్ కూతురిపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేశాయి. వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రూ.1.72 కోట్ల చెల్లింపులు కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపింది. ఐటీ అధికారుల సోదాలతో వెలుగులోకి అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు (Interim Board) సీఎంఆర్ఎల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదావీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్ఎఫ్ఐఓ వాణి విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణకు వ్యతికేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్ పిటిషన్‌ను కొట్టి వేసింది. తాజాగా ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు అవాస్తవం ఇదే అంశంపై ఈ ఏడాది జనవరి అసెంబ్లీ సమావేశాల్లో కేరళ సీఎం పనిరయి విజయన్ స్పందించారు. తన భార్య పదవీ విరమణ నిధులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. -
ఆ నినాదాలను త్యజించే దమ్ము సంఘ్ పరివార్‌కు ఉందా?
మలప్పురం(కేరళ): స్వాతంత్రోద్యమ వేళ దేశాన్ని ఒకతాటి మీదకు తెచి్చన జాతీయస్థాయి నినాదాలు పురుడుపోసుకోవడంలో ముస్లింల పాత్ర కూడా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సంఘ్ పరివార్ శ్రేణుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించే రెండు నినాదాలను వాస్తవానికి ముస్లింలు తొలిసారిగా ఎలుగెత్తి చాటారని విజయన్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలో నాలుగురోజులుగా జరుగుతున్న ర్యాలీలో విజయన్ పాల్గొని ప్రసంగించారు. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలోనే ఈ సభ జరగడం గమనార్హం. ‘‘ముస్లిం పాలకులు, సాంస్కృతిక సారథులు, ముస్లింలు ఉన్నతాధికారులు ఎందరో దేశ చరిత్ర, స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకున్నారు. వీటిపై ఏమాత్రం అవగాహన లేని సంఘ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి భారత్ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లుచేస్తున్నారు. వాస్తవానికి భారత్ మాతాకీ జై, జైహింద్ అని నినదించింది ముస్లింలని సంఘ్ పరివార్‌కు తెలీదనుకుంటా. తెలిస్తే ఆ నినాదాలను ఇవ్వడం సంఘ్ పరివార్ మానుకుంటుందా? అజీముల్లా ఖాన్ భారత్ మాతాకీ జై అంటే, అబిద్ హసన్ అనే భారత దూత ‘జై హింద్’ అని నినదించారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తనయుడు దారా షికోహ్ సంస్కృతంలో ఉన్న 50 ఉపనిషత్తులను పర్షియన్లోకి తర్జుమాచేశారు. అలా భారతీయ రచనలు విశ్వవ్యాప్తమయ్యేలా తన వంతు కృషిచేశారు. ఇవేం తెలియని సంఘ్ నేతలు భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు పంపేయాలని మొండిపట్టు పడుతుంటారు. సీఏఏతో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని మోదీ సర్కార్ కుట్ర పన్నింది. వీటిని కేరళ పౌరులు సహించరు’’ అన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేయంపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆసక్తి లేదని ఆరోపించారు. హిట్లర్ నియంతృత్వ పోకడల నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పురుడుపోసుకున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశ అంతర్గత శత్రువులని ఆర్ఆర్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ గతంలో ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారని విజయన్ గుర్తుచేశారు. -
‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పిందని సీఎం పినరయి గుర్తుచేశారు. ఆదే మాటపై తమ ప్రభుత్వం కట్డుబడి ఉంటుందని తెలిపారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. చదవండి: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు -
కేరళ ప్రభుత్వంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ ప్రభుత్వం.. అధికార సీపీఐ(ఎం) అనుంబంధ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI), ఉగ్రవాద నిరోధక చట్టం(UAPA) కింద కేంద్ర హోంశాఖ నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) మధ్య సంబంధాలు కొనిసాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేరళ ప్రభుత్వం పగలు ఎస్ఎఫ్ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పీఎఫ్ఐ కోసం పని చేస్తుందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ-పీఎఫ్ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేరళ ప్రజల నుంచి కూడా ఈ విషయాన్ని తాను విన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఖచ్చితమైన పేర్లును చెప్పలేనని.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలోని పలు కీలక అంశాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వంతో గవర్నర్‌కు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ‘క్రేంద దర్యాప్తు సంస్థలకు అన్ని విషయాలు తెలుసు. అరెస్ట్ చేసినవారిలో సుమారు సగం మంది పీఎఫ్ఐకి చెందినవారు ఉన్నారు. ఇది కేరళలో కొత్తకాదు. గతంలో కూడా దీనికి సంబంధించిన పలు ఆరోపణలు.. కేరళ అసెంబ్లీ కూడా చర్చకు వచ్చాయి. కేరళలో పీఎఫ్ఐని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’ అని గవర్నర్ అన్నారు. గత నెలలో కొల్లం జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శింస్తూ గవర్నర్‌కు నిరసన తెలిపారు. దీంతో గవర్నర్ తన కాన్వాయ్ దిగి రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్ కూర్చోని ఎస్ఎఫ్ఐ నిరసనకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రభుత్వం కార్యక్రమల్లో కూడా కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ కనీసం పలకిరించుకోకుండా వార్తల్లో నిలుస్తున్నారు. -
ఢిల్లీలో కేరళ ప్రభుత్వం ఆందోళన
-
కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్‌భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన క్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారంతా నేరస్థులు అని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనకాల ముఖ్యమంత్రి పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు. తనను అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులంతా నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసకు దిగాలని సూచించినట్లు ఆరోపించారు. అయితే గవర్నర్ ఆరీఫ్.. పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినెట్ చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు. చదవండి: మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం -
కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, చానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగింది. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవి చేస్తున్నాను. అయ్యప్పస్వామి మండల దీక్షలో ఉన్న భక్తులకు శబరిమల యాత్ర సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించడం, వారి యాత్ర భక్తిప్రద్రంగా, శుభప్రదంగా జరిగేలా చూడడం అత్యంత అవసరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం భక్తులకు సౌకర్యార్థం అందించేందుకు సిద్ధంగా ఉంది. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
కొచ్చి యూనివర్సిటీ తొక్కిసలాటకు కారణమిదే..
కొచ్చి: ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం వల్లే కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. 50 మంది దాకా గాయపడ్డారు.సింగర్ నిఖితాగాంధీ కన్సర్ట్ సందర్భంగా విద్యార్థులు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో గుమిగూడినపుడు ఘటన జరిగింది. ‘ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే గేట్ ఉంది. పాసులు ఉన్న వాళ్లను ఆ ఒక్క గేటు నుంచే బ్యాచుల వారిగా లోపలికి నిర్వాహకులు లోపలికి పంపారు. లోపలికి వెళ్లేందుకు పాసులు లేని యూనివర్సిటీకి సంబంధం లేని యువకులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలోనే వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడున్న మెట్ల మీది నుంచి కొందరు కిందపడ్డారు. పడిపోయిన వారి మీద నుంచి విద్యార్థులు పరుగులు తీయడంతో నలుగురు చనిపోయారు’ అని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థులను అతుల్ తంబి, అన్ రుఫ్తా, సరా థామస్, అల్విన్‌గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 30 మంది త్వరగా కోలుకుంటున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గాయపడ్డవారి చికిత్సను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా ఆరోగ్య మంత్రిని ఆదేశించారు. ఇదీచదవండి..నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు: మంత్రి కౌంటర్ ట్వీట్
కేరళ వరుస పేలుళ్ల నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం (అక్టోబర్ 31న) కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఈ ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్షన్ 153 (ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. పాలస్తీనాకు సీపీఎంతో మద్దతుతో కలమసేరి పేలుళ్లను ముడిపెట్టి, ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది. విచ్ఛిన్నకర, అతివాద శక్తులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ కేరళ చీఫ్ కె సురేంద్రన్ ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వారిని కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బీజేపీ నేత ఆరోపించారు. కేసుతో బెదిరించాలని చూస్తున్నారు అటు తనపై నమోదైన కేసుపై రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ ద్వారా స్పందించారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఏకమై తనపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. హమాస్‌పై వారి వైఖరిని బహిర్గతం చేసినందుకే ఈ కేసుతో బెదిరించాలని చూస్తున్నారన్నారు. SDPI, PFI,హమాస్ వంటి విషపూరిత రాడికల్ హింసాత్మక సంస్థలకు నిర్లజ్జగా మద్దతిస్తున్నాయనీ, వీరి బుజ్జగింపుల కారణంగా కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి కేరళ వరకు తీవ్రవాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక మంది అమాయక ప్రజలు, భద్రతా దళాలు బలయ్యారంటూ ట్వీట్ చేశారు. So the two INDI alliance partners @RahulGandhi and @PinarayiVijayan have jointly filed a "case" against me Two of biggest appeasers in Indian politics who shamelessly appease poisonous radical violent organizations like SDPI, PFI and Hamas, whose politics have caused… pic.twitter.com/rTOLCULeDT — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 31, 2023 కాగా ఆదివారం నాటి వరుస పేలుళ్లపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ద్వారా కేరళ సీఏంపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ జిహాద్ కోసం బహిరంగ పిలుపులిస్తున్నటెర్రరిస్ట్ హమాస్ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారని ట్వీట్ చేశారు. దీంతో కేరళ సీఎం, కేంద్ర మంత్రి మధ్య మాటల యుద్ధం జరిగింది. పచ్చి అబద్దాల కోరు, తీవ్రమైన విషం చిమ్ముతున్నాడంటూ ముఖ్యమంత్రి రాజీవ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అనే తేడా లేకుండా చట్టాన్ని వ్యతిరేకంగా, విద్వేషంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చెప్పారు. -
జేడీఎస్ అధినేత దేవెగౌడ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి ఆగ్రహం
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాగా కేరళలో పినరయి విజయన్ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్ కేరళ యూనిట్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు. కేరళ యూనిట్ కూడా సమ్మతించింది ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్‌కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు. కుమారస్వామిని సీఎం చేసేందుకే.. ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్ ఖండించారు. జేడీఎస్ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం జోక్యం చేసుకోం కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు(ఎల్డీఎఫ్) జెడీఎస్ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. కేరళలో వామపక్ష పార్టీతోనే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే కె కృష్ణన్‌కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.