తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతులం చేస్తోన్న సంగతి తెలిసిందే. వరుణుడి ప్రకోపానికి దేవభూమి విలవిల్లాడుతుంది. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు తెలిసింది. వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో వరదల ధాటికి నేలమట్టమయిన ఓ రెండంతస్తుల బిల్డింగ్ వీడియో అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుపుతుంది.
కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నది ఒడ్డున ఉన్న ఓ రెండంతస్తుల భవనం నెమ్మదిగా వరదలో కొట్టుకుపోయింది. అదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఆ బిల్డింగ్‌లో ఎవరు నివసించడం లేదు. ఇంటి ముందు నిల్చున్న జనాలు కొందరు ఈ సంఘటన వీడియో తీశారు.
(చదవండి: ఆగని వర్ష బీభత్సం)
ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొట్టాయం జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి.. రాష్ట్రంలో వర్ష ప్రభావం గురించి చర్చించారు.
చదవండి: సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment