flods
-
వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు రాజకీయాలే చేస్తారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా టీడీపీ జెండాలే కనిపించాయని విమర్శించారు. తమ నాయకుడు.. సీఎం జగన్ చిత్తూరు పర్యటన నేపథ్యంలో తాము.. ఎక్కడా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు.. ప్రచారం కోసం మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. వరదలలో నష్టపోయిన బాధితులను తమ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది
-
వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది
తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతులం చేస్తోన్న సంగతి తెలిసిందే. వరుణుడి ప్రకోపానికి దేవభూమి విలవిల్లాడుతుంది. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు తెలిసింది. వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో వరదల ధాటికి నేలమట్టమయిన ఓ రెండంతస్తుల బిల్డింగ్ వీడియో అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుపుతుంది. కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నది ఒడ్డున ఉన్న ఓ రెండంతస్తుల భవనం నెమ్మదిగా వరదలో కొట్టుకుపోయింది. అదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఆ బిల్డింగ్‌లో ఎవరు నివసించడం లేదు. ఇంటి ముందు నిల్చున్న జనాలు కొందరు ఈ సంఘటన వీడియో తీశారు. (చదవండి: ఆగని వర్ష బీభత్సం) ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొట్టాయం జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి.. రాష్ట్రంలో వర్ష ప్రభావం గురించి చర్చించారు. చదవండి: సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ -
ఉప్పొంగుతున్న వరద
-
మంజీరమ్మకు మళ్లీ వరదలు
జలదిగ్బంధంలో దుర్గమ్మతల్లి పొంగిపొర్లుతున్న ఘనపురం పాపన్నపేట: మంజీరమ్మకు మళ్లీ వరద పోటెత్తింది. సింగూర్ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో శనివారం సాయంత్రానికి పాపన్నపేట మండలం ఏడుపాయల్లోని ఘనపురం ఆనకట్ట వరదనీటితో పొంగి పొర్లింది. పరవళ్లు తొక్కుతున్న మంజీర దిగువన ఉన్న దుర్గమ్మ తల్లిని దిగ్బంధించింది. దీంతో అమ్మవారి ఆలయానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయానికి శుక్రవారం దారి ఏర్పడింది. వరదల ఫలితంగా సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఈఓ వెంకట కిషన్‌రావు తెలిపారు. ఆలయం చుట్టూ ఉన్న గ్రిల్లింగ్, హుండీలు, ఫ్యాన్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అమ్మవారి ఆలయం ముందు వంతెన కూడా కుప్ప కూలింది. శనివారం ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా తిరిగి వరద నీరు చుట్టేసింది. ఎల్లాపూర్ వంతెనకు దాదాపు సమాంతరంగా మంజీర ప్రవాహం కొనసాగుతుంది. వంతెన మునిగే అవకాశాలు తక్కువేనని ఇరిగేషన్ ఈఈ ఏసయ్య తెలిపారు. పాపన్నపేట మండలంలో నది వైపు వెళ్లొద్దని ఆయన సూచించారు. రాజగోపురం చుట్టూ ఫెన్సింగ్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏడుపాయలకు భక్తులు వస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెదక్ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వరదనీటి వద్దకు ఎవరు వెళ్లకుండా రాజగోపురం వద్ద భారీ ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. -
సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో
శాంతినగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఓమోస్తరు వర్షాలకు రాజోలి సమీపంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీకి వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం సాయంత్రం సుంకేసుల జలాశయం వద్ద 1850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.19 టీఎంసీల స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ భద్రత దృష్ట్యా ఎగువనుండి వస్తున్న వరదనీటిని ఎప్పటికప్పుడు కేసీ కెనాల్‌ద్వారా కర్నూలు ప్రజల తాగునీటి అవసరాలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జేఈ పేర్కొన్నారు. -
వరదల్లో చిక్కుకున్న 60 మంది కూలీలు
దొరవారిసత్రం: నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలంగి నది, పాల కాలువ పొంగిపొర్లుతోంది. దొరవారిసత్రం మండలం వెదురుపట్టు దగ్గర పొలాల్లో 60 మంది కూలీలు చిక్కుకుపోయారు. కూలీలు పొలాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన వారిగా గుర్తించారు. కూలీ పనుల నిమిత్తం వారు అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.