bulding collapsed
-
వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది
-
వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది
తిరువనంతపురం: భారీ వర్షాలు కేరళను అతలాకుతులం చేస్తోన్న సంగతి తెలిసిందే. వరుణుడి ప్రకోపానికి దేవభూమి విలవిల్లాడుతుంది. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు తెలిసింది. వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో వరదల ధాటికి నేలమట్టమయిన ఓ రెండంతస్తుల బిల్డింగ్ వీడియో అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుపుతుంది. కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నది ఒడ్డున ఉన్న ఓ రెండంతస్తుల భవనం నెమ్మదిగా వరదలో కొట్టుకుపోయింది. అదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఆ బిల్డింగ్‌లో ఎవరు నివసించడం లేదు. ఇంటి ముందు నిల్చున్న జనాలు కొందరు ఈ సంఘటన వీడియో తీశారు. (చదవండి: ఆగని వర్ష బీభత్సం) ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొట్టాయం జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి.. రాష్ట్రంలో వర్ష ప్రభావం గురించి చర్చించారు. చదవండి: సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ -
కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. పలువురికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: నంద్‌నగరిలోని ఓ రెండంతస్తుల భవనం కుప్ప కూలింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని డీఎఫ్ఎస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. -
రాధిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా, నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై వెనువెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డిని ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్‌లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
నా జీవితంలో మర్చిపోలేని ఘటన..
ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలి 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రాయ్‌గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ నదీమ్ బతికి బయటపడ్డాడు. తాజాగా మరో మహిళ క్షేమంగా బయటపడింది. వివరాలు.. మెహరున్నీసా అబ్దుల్ హమీద్ కాజీ(60) అనే మహిళ శిధిలాల కింద చిక్కుకుపోయింది. దాదాపు 26 గంటల తర్వాత మంగళవారం రాత్రి ఆమెను సహాయక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. కాంక్రీటు, ఉక్కు శిధిలాల కింద 26 గంటల పాటు బిక్కుబిక్కుమని గడిపింది మెహరున్నీసా. ఒక చిన్న రంధ్రం ద్వారా ఆమె తాను అక్కడ చిక్కుకున్నట్లు సహాయక సిబ్బందికి తెలియజేసింది. దాంతో వారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. (చదవండి: నా రెండు చేతులూ పోయాయనుకున్నా..) అయితే అన్ని గంటల పాటు శిధిలాల కింద ఉండటం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బది పడటంతో సహాయక సిబ్బంది వెంటనే మెహరున్నీసాకు పోర్టబుల్ ఆక్సిజన్ మాస్క్ అమర్చారు. ఆమె బట్టలు, ముఖం, జుట్టు దుమ్ముకొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన తన జీవితంలో మర్చిపోలేనిదని.. పునర్జన్మ పొందినట్లు అనిపిస్తుంది అన్నారు మెహరున్నీసా. ప్రస్తుతం అధికారులు భవనం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా భవనంలో నివసించే ముస్తఫావ్ చాపేకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘2013 నుంచి నేను ఇక్కడ నివసిస్తున్నాను. భవన నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదు. మేము వచ్చిన దగ్గర నుంచి ప్లాస్టర్లు ఊడిపోవడం జరుగుతూనే ఉంది. దీని గురించి బిల్డర్‌ని అడిగితే.. కట్టడం వరకే నా బాధ్యత. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నాడు’ అని తెలిపాడు. చాపేకర్ బిల్డింగ్ కూలడానికి కొద్ది సేపటి ముందే బయకటకు పరుగెత్తాడు. అయితే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఏదో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మంగళవారం మధ్యప్రదేశ్‌లో రెండంతస్థుల భవనం కుప్పకూలింది. -
ఎలుక చంపింది..సిగరెట్ కాపాడింది..!
చిలకలగూడ : చిలకలగూడ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పురాతన భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనలో ఎలుకల మందు పెట్టబోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా, సిగరెట్ కోసం వెళ్లి మరొకరు ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూలిపోయిన భవనంలో కొనసాగుతున్న అక్బర్ చికెన్ షాపులో భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌వాజిద్ (29) చిలకలగూడకు చెందిన రెహమాన్ పని చేసేవారు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి షాపును శుభ్రం చేశారు. యజమాని అదేశాల మేరకు వాజిద్ ఎలుకల మందు పెట్టేందుకు లోపలకు వెళ్లగా,అక్బర్ దుకాణం ఎదుట నిల్చున్నాడు. రహమాన్ సిగరెట్ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న అక్బర్, వాజిద్ మృతిచెందగా, సిగరెట్ కోసం వెళ్లిన రెహమాన్ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా అంతకు కొన్ని నిమిషాల ముందే అదే రహదారిలో పలహారంబండి ఊరేగింపు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.