
తిరువనంతపురం: దుబాయ్‌కు విమానాలను పునరుద్ధరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వల్ల స్వదేశాలకు పంపించిన వారిని తిరిగి ఈ నెల 22 నుంచి దుబాయ్ అనుమతిస్తున్నదని ఆయన లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌తో పాటు గల్ఫ్ దేశాలకు తిరిగి వెళ్లి పనిలో చేరేందుకు చాలా మంది కేరళ వాసులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు పౌర విమాన మంత్రిత్వ శాఖకు ఆదేశాలని జారీ చేయాలని విజయన్ సూచించారు. మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న కేరళీయులను రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలంటూ విపక్ష నేత రమేశ్‌తో పాటు ఇతర నేతలు ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment