ముంబై: కరోనా వైరస్‌కు మహారాష్ట్ర హట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో శివసేన ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుందని శివసేన మండిపడుతుంది. ఈ క్రమంలో పార్టీ అధకార పత్రిక సామ్నాలో బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై విమర్శల వర్షం కురిపించింది. రెండు రోజుల క్రితం పాటల్ కరోనా మహమ్మారి కట్టడి కోసం శివసేన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శించారు. కేరళ మోడల్‌ను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాటిల్ వ్యాఖ్యలపై సామ్నా మండిపడింది.(పాపం పసివాళ్లు!)
‘పాటిల్ కేరళ మోడల్‌ను సరిగా అర్థం చేసుకోలేదనుకుంటాను. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా కట్టడి కోసం కేంద్రం సూచించే విధానాలను అమలు చేయరు. అంతేకాక ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం వల్ల కాలం వృధా తప్ప పెద్దగా ఫలితం ఉండదని ఆయన భావిస్తారు’ అని తెలిపింది. కరోనా కట్టడి కోసం కేరళ సొంత మార్గదర్శకాలను రూపొందించుకుందని.. అందువల్లే అక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కరోనా కట్టడి కోసం ప్రతిపక్షాలు ఏవైనా సూచనలు చేయాలనుకుంటే.. ముఖ్యమంత్రితో చర్చిస్తే బాగుంటుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించింది.(చిన్ని తండ్రీ నిన్ను చూడక...)
Comments
Please login to add a commentAdd a comment